current shock
-
తల్లి, కుమారుడిని బలితీసుకున్న ఎర్త్ వైర్!
సామర్లకోట : విద్యుదాఘాతంలో 24 గంటల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురానికి చెందిన చిట్టుమాని పద్మ(43) ఇంటికి సంబంధించి ఎర్త్ వైర్‌ను కొళాయి పక్కన గల చెట్టుకు చుట్టేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇంటి ఎర్త్‌వైర్ తెగిపోవడంతో అలా చేయాల్సి వచ్చిoది. అయితే శనివారం పద్మ కొళాయి దగ్గర దుస్తులు ఉతికి గోడపై వాటిని ఆరబెడుతూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అయితే బంధువులు, స్థానికులు గుండెపోటుతో మృతి చెందిందని భావించారు. కాగా, ఆదివారం ఉదయం మృతురాలి కుమారుడు చిట్టుమాని విశ్వేస్(23) టిఫిన్ చేశాక ఖాళీ ప్లేట్‌ను కొళాయి పక్కన పెట్టి చేతులు శుభ్రం చేసుకొంటున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు అతనిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విద్యుదాఘాతం కారణంగా తల్లీకొడుకులు మృతి చెందారని స్థానికులు నిర్ధారణకొచి్చ.. విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. వెంటనే ట్రాన్స్‌కో సిబ్బంది అక్కడకు చేరుకుని వైర్లను తొలగించారు. -
కడపలో విషాదం.. స్కూలు పిల్లలకు కరెంట్ షాక్
సాక్షి,కడపజిల్లా: కడప నగరంలో బుధవారం(ఆగస్టు21) మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. తెగిపడి రోడ్డుపై పడ్డ కరెంటు తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి గాయాలయ్యాయి.తన్వీర్(11), ఆదాం(10)లు సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తుండగా నగరంలోని అగాడీ వీధిలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్‌శాఖ అధికారుల నిర్లకక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. -
క్రికెట్ మైదానంలో విషాదం.. విద్యుదాఘాతానికి గురై బాలుడి మృతి
దేశ రాజధాని ఢిల్లీలో విద్యుదాఘాతానికి గురై 13 ఏళ్ల బాలుడి మృతి చెందాడు. రన్హోలా ప్రాంతంలోని కోట్లా విహార్ ఫేజ్-2లో క్రికెట్ ఆడుతున్న బాలుడు కరెంటు సరఫరా అవుతున్న ఇనుప స్తంభాన్ని తాకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. #WATCH | Delhi: Visuals from a Cricket ground in outer Delhi's Ranhola area where a 13-year-old boy died due to electrocution yesterday. https://t.co/fl8WsQ0Eom pic.twitter.com/sKWiCfiMWH— ANI (@ANI) August 11, 2024బాలుడికి కరెంట్ షాక్ తగిలిందన్న విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్లు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.విద్యుదాఘాతానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సకాలంలో తమ కుమారుడిని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది. -
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
విషాదం.. రోడ్డుపై వరద, కరెంట్ షాక్‌కు గురై యువకుడి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని విషాదం చోటుచేసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నధమవుతున్న ఓ విద్యార్ధి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు. మృతుడిని నీలేష్ రాజ్‌గా గుర్తించారు. పటేల్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.వివరాలు.. నీలేష్ రాజ్ అనే యువకుడు పటేల్ నగర్ హాస్టల్లో ఉంటూ సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలవడంతో అటువైపు వెళ్తున్న నీలేష్ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. రోడ్డు పక్కనున్న ఇనుప గేటు గుండా కరెంట్ పాస్ అవ్వడంతో విద్యుదాఘాతానికి గురైనట్లు తెలిపారు. నీలేష్‌ను వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గేట్‌కు కరెంట్ ఎలా పాస్ అయ్యిందో తెలుసుకునేందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు మండిపడుతున్నారు. -
Hyderabad: సనత్‌నగర్‌లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లోని జెక్ కాలనీలో ఉన్న ఆకృతి రెసిడెన్సీలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరు విద్యుత్ షాక్‌గురై మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. వీరంతా బాత్రూమ్లో విగత జీవులై పడి ఉండటాన్ని గుర్తించారు. -
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి
కొత్తగూడ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎదుళ్లపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జినుకల రాజు(24) నాటు వేయడానికి తన పొలం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో నీరు పారించడానికి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మోటార్ వద్ద షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు సింహద్రి, నాగమల్లు గుండెలవిసేలా రోదించారు. -
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్‌చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్‌ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్‌మార్టమ్‌లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్‌స్టా్రగామ్‌లో పోస్ట్ చేసి డిలీట్‌చేసిన మెసేజ్‌లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే విద్యుత్ షాక్‌కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు. -
TS: కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి.. సీఎం రేవంత్ విచారం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఏ. ప్రవీణ్ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కూంబింగ్ డ్యూటీలో ఉన్నాడు. నస్తుర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో, ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, స్థానికులు వన్యప్రాణులను వేటాడేందుకు, వాటి నుంచి రక్షణ కోసం అక్కడ కరెంట్ తీగలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అది గమనించకుండా ఈ తీగలను తాకి ప్రవీణ్ మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఓబులవారిపల్లె : మండలంలోని కొర్లకుంట చెరువు సమీపంలో విద్యుత్ షాక్‌తో తుపాకుల సుబ్రమణ్యం (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు రైల్వేకోడూరు మండలం, బొజ్జవారిపల్లి పంచాయతీ, బంగ్లామిట్ట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం శుక్రవారం రాత్రి తన బావమరిది ఎం.శివతో కలిసి కొర్లకుంట చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. దారిలో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తీగలు తీయడంతో తీగలు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గాయపడిన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. రైల్వేకోడూరు పరిసర ప్రాంతాలలో సుబ్రమణ్యం ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. కన్న తల్లిని హతమార్చిన కూతురు వాల్మీకిపురం : కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిని హతమార్చిన సంఘటన వాల్మీకిపురం పట్టణం కొత్త ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకొంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహళ్ నివాసి యర్రక్క (43) స్థానికంగా నివాసం ఉంటూ కూలిపనులు చేసుకునేది. కుటుంబ కలహాలతో ఆదివారం కూతురు నందిని, అల్లుడు శివరాంలు ఐరన్ రాడ్, కట్టెలతో కొట్టి యర్రక్కను హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ నాగేశ్వర రావు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రుణం చెల్లించలేదని ఆత్మహత్యాయత్నం మదనపల్లె : తాను ఇప్పించిన రుణం చెల్లించకపోవడంతో పాటు, తనపై దాడి చేయడంతో మనస్థాపం చెంది, వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మదనపల్లె లో జరిగింది. పట్టణంలోని ఎగువ కురవంకకు చెందిన తిరుపాల్ నాయక్ భార్య తిరుపాలమ్మ (42), స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉన్న స్వరూపారాణి పట్టణంలో హోటల్ నిర్వహిస్తోంది. దీంతో వ్యాపార అవసరాల కోసం తిరుపాలమ్మను నగదు రుణంగా కావాలని కోరింది. ఆమె సుమారు పది లక్షల రూపాయల వరకు స్వరూప రాణికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని అప్పుగా ఇచ్చింది. అయితే స్వరూపారాణి తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో, తిరుపాలమ్మ ఆమెను అప్పు చెల్లించాల్సిందిగా నిలదీసింది. స్వరూప రాణి అప్పు చెల్లించకపోగా దాడికి పాల్పడింది. దీంతో మనస్థాపం చెందిన తిరుపాలమ్మ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
'సలార్' రిలీజ్: ప్రభాస్ వీరాభిమాని మృతితో..
శ్రీసత్యసాయి, సాక్షి: సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దగ్గరలోని హాస్పిల్‌కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద న్యాయం చేయాలంటూ, మృతిచెందిన బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఇవి కూడా చదవండి: కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా.. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
అయిజ: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మప్ప, గోవిందమ్మ దంపతులు పట్టణంలోని రజక వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వారు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పెద్ద కుమారుడు యుగేంధర్ (32) ఆదివారం నిర్మాణ దశలో ఉన్న గోడలకు నీళ్లు చల్లేందుకు వెళ్లాడు. అక్కడ వి ద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీటి సంపులో పడి చిన్నారి.. జడ్చర్ల: ఇంటి ఆవరణలోని నీటి సంపులో చిన్నారి పడి మృతి చెందిన ఘటన ఆదివారం స్థానిక కావేరమ్మపేటలో చోటు చేసుకుంది. కావేరమ్మపేటకు చెందిన గండు వినోద్, పుష్పమాల కూతురు రియాన్సిక(2) ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడింది. కొద్దిసేపటి తర్వాత తమ కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు నీటి సంపులోకి తొంగి చూడగా చిన్నారి కనిపించడంతో బయటకు తీసి చూడ గా అప్పటికే మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. అచ్చంపేట రూరల్: అమ్రాబాద్ మండలం ఈదులబావికి చెందిన మోటమోని రాజు (55) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. ఈనెల 10న అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడ్డాడు. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ నాగర్‌కర్నూల్ క్రైం: ఆర్టీసీ బస్సులో మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారుగొలుసు చోరీకి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా.. బిజినేపల్లి మండలం పోలేపల్లికి చెందిన అలివేలమ్మ ఆర్టీసీ బస్సులో నాగర్‌కర్నూల్‌కు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో నుంచి 3తులాల బంగారు గొలుసును లాక్కెల్లారు. అలివేలమ్మ జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత గొలుసును చూసుకోగా లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు వెల్దండ: వెల్దండ మండలం కొట్రగేట్ వద్ద శని వారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన కారు డ్రైవర్ రుక్మాకర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కొరివి రాకేష్ బైక్‌పై వస్తుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రాకేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించాడని యువకుడిపై దాడి మహమ్మదాబాద్: యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న నెపంతో యువకుడిని చితకబాధిన వారిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే మండలంలోని కప్లాపూర్ చెందిన మీర్జాపురం శేఖర్ కుటుంబీకులు అందరూ మహారాష్ట్రలో పూణెలో నివాసం ఉంటున్నారు. శేఖర్ గ్రామంలో ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా దయాదులతో ఇంటి స్థలం విషయంలో అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి. ఇదే క్రమంలో పథకం ప్రకారం యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ తిరుపతయ్య, ఆయన కుమారులు మురళీ, గణేష్, అంజిలయ్య, కృష్ణ, విగ్నేష్ కలిసి శేఖర్‌ను చితకబాదారు. దీంతో బాధితుడి తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు ఆదివారం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బావపై బామ్మర్దుల దాడి ఉండవెల్లి: సొంత బావను బామ్మర్దులు దాడి చేసిన ఘటనలో ఆదివారం ముగ్గురిపై కేసు నమోదైంది. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొంకూరుకు చెందిన బోయ తిరుమలేష్, స్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల వారిద్దరికి మనస్పార్థాలు రావడంతో స్రవంతి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో పెద్దమనుషుల వదద పంచాయితీ చేశారు. కాగా తిరుమలేష్ పొలానికి వెళ్లే క్రమంలో స్రవంతి తమ్ముడు నరేష్ దూషించి తిరుమలేష్‌పై దాడి చేశాడు. తిరుమలేష్ విషయం తండ్రి పెద్ద అయ్యన్నకు చెప్పగా, వారిద్దరు కలిసి పోలీస్‌స్టేషన్ వెళ్తుండగా బామ్మర్దులు దేవేందర్, నరేష్, అత్త గోపాలమ్మ వారిపై దాడి చేశారు. కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. -
కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన కారు.. ఒక వ్యక్తి మరణం
అడ్డాకుల: కర్నూల్ జిల్లాకు చెందిన రామయ్య(80) తన సోదరుడు, మరో డ్రైవర్‌తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. శాఖాపూర్ దాటిన తర్వాత పాత రోడ్డు సమీపంలో కారుకు అడ్డుగా కుక్క వచ్చింది. దీంతో దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ కారును పక్కకు తిప్పగా.. కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అందులోని రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. రామయ్యను ఎల్అండ్టీ అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందారని అక్కడి వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మాధవరెడ్డి తెలియజేశారు. విద్యుదాఘాతంతో రైతు.. మహబూబ్‌నగర్ రూరల్: మండల పరిధిలోని మనికొండలో పెండెం చంద్రశేఖర్(49) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో స్విచ్ బోర్డు వద్ద ఆన్ఆఫ్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు సర్పంచ్ గంగాపురి తెలియజేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకొని పేద కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మద్యం దుకాణం సీజ్ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని న్యూబాలాజీ మద్యం దుకాణాన్ని ఆదివారం రాత్రి ఎన్నికల వ్యయ పరిశీలకుడు, ఐఆర్ఎస్ అధికారి కుందన్‌యాదవ్ తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయించినట్లు గుర్తించారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఈఎస్ సైదులు, సీఐ వీరారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ మద్యం దుకాణంలో స్టాక్ పరిశీలించి సీజ్ చేశారు. సదరు దుకాణాదారుడి లైసెన్స్ రద్దు చేశారు. దుకాణంలో రూ.8లక్షల విలువగల స్టాక్ ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల కిందట జహంగీర్ అనే వ్యక్తి రూ.2లక్షల విలువగల మద్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. భారీగా మద్యం పట్టివేత చిన్నంబావి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని దగడపల్లిలో రూ.4లక్షల విలువగల 47 కాటన్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు. దగడపల్లికి చెందిన వెంకట్రావు ఇంట్లో 29 కాటన్లు, కుమ్మరి రమేష్ ఇంట్లో 3 కాటన్లు, కుమ్మరి శంకరయ్య ఇంట్లో 17 కాటన్ల మద్యం నిల్వ చేయగా, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ కళ్యాణ్, స్పెషల్ పార్టీ పోలీస్ రవినాయక్, వీపనగండ్ల ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. -
షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.!
గోపాల్పేట: దేవుడి మొక్కు తీర్చుకునేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై ముగ్గురు గాయాలపాలైన ఘటన ఏదుల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దదగడకు చెందిన ఓ కుటుంబం ఏదుల సమీపంలోని కథాల్‌సాయన్న దేవుడికి తమకు మొక్కుకున్నారు. గురువారం కుటుంబ సభ్యులు పెద్దదగడ నుంచి ఏదుల కథాల్‌సాయన్న గుడి వద్దకు డీసీఎంలో సుమారు 15మంది వచ్చారు. డీసీఎంలో వచ్చిన వారు కొంత దూరంలోనే దిగారు. వృద్ధులు గుడి దగ్గరకు వెళ్లి అక్కడ దిగేందుకు డీసీఎంలోనే కూర్చున్నారు. గుడి సమీపంలోకి వెళ్లిన తర్వాత డ్రైవర్ డీసీఎంను నిలిపేందుకు వెళ్తుండగా, 11 కేవీ వైర్లు కిందకు వేలాడుతూ ఉండటంతో డీసీఎంకు తగిలాయి. అలాగే ముందుకు వెళ్లడంతో కరెంటు పోల్ విరిగిపోయి వైర్లు తెగి నేలకు తగిలాయి. దీంతో డీసీఎం అంతా షాక్ రావడంతో అందులో ఉన్న వృద్ధులు ఈశ్వరమ్మ, వెంకటమ్మ, చంద్రమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ తప్పించుకున్నాడు. వెంటనే కరెంట్ బంద్ చేయించి వారిని వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైర్లు వేలాడటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇది చదవండి: బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...! -
అడవి పందుల కోసమని ఏర్పాటు చేస్తే.. చివరికి ఇలా..!
మహబూబ్‌నగర్: అడవి పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి షాక్‌తో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని రుక్కన్నపల్లి శివారులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రుక్కన్నపల్లితండాకు చెందిన రాములునాయక్(37) రుక్కన్నపల్లి, కోతులకుంట తండాల శివారులో ఐదున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తుండటంతో కొన్నిరోజుల నుంచి చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేసి రాములు అత్తగారి ఇంటి నుంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. గురువారం రాత్రి అతనికి తోడుగా సోళీపురం గ్రామానికి చెందిన జాలికాడి నర్సింహులు(45)ను పిలుచుకున్నాడు. ఇద్దరూ కలిసి పొలం దగ్గరకు వెళ్లారు. ఇదే సమయంలో ప్రతిరోజు మాదిరిగానే రాములునాయక్ భార్య శారద ఇంటి దగ్గర కరెంట్ ఆన్ చేయడానికి తన భర్తను అడిగేందుకు ఫోన్లో చేసింది. అయితే అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ప్రతిరోజు లాగే గురువారం సైతం కరెంట్ ఆన్ చేసింది. ఈ విషయం తెలియని రాములునాయక్, జాలికాడి నర్సింహులు ఇద్దరూ వరి చేను దగ్గరకు వెళ్లగా.. కరెంట్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. తర్వాత అటుగా వెళ్లిన ఇతర పొలాల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులతోపాటు రెండు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర గంట ముందు వరకు కళ్ల మందు ఉన్న వ్యక్తులు అంతలోనే విగతజీవులుగా మారడంతో బోరుమని విలపించారు. రాములు నాయక్‌కు భార్యతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. నర్సింహకు భార్య బొజ్జమ్మతోపాటు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: గోండు వీరుడు కుమురంభీం వర్ధంతి కార్యక్రమం నిర్మల్ జిల్లాలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడలో ఆదివారం భీం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జెండా గద్దె వద్ద భీం చిత్రపటాన్ని పెట్టి జెండా ఎగురవేసేందుకు ఇనుప పైపు అమరుస్తుండగా అది సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగకు తగిలింది. విద్యుత్ సరఫరా కావడంతో పైపును పట్టుకున్న మోహన్, భీంరావు, వెంకట్రావు షాక్‌కు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు బాధితులను విద్యుత్ సరఫరా నిలిపివేయించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పెంద్రం మోహన్(25) మార్గమధ్యలో మరణించాడు. ఆత్రం భీంరావు(26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో బాధితుడు వెడ్మ వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్రం భీంరావుకు భార్య గంగామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంద్రం మోహన్ బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇద్దరు యువకుల మృతితో చిన్నబెల్లాల్ గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్ది భుక్యా జాన్సన్‌నాయక్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి.. -
డ్రైవర్‌ను సస్పెన్షన్ చేసిన ఆర్టీసీ అధికారులు.. దీనితో డ్రైవర్ తీవ్రనిర్ణయం..
గోపాల్పేట: ఉరేసుకుని ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. తాడిపర్తికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్ (52) కొన్నేళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. నాలుగు నెలల కిందట ఆర్టీసీ అధికారులు చంద్రశేఖర్‌గౌడ్‌ను సస్పెన్షన్ చేశారు. అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సభ్యులు అతడిపై కోపంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com విద్యుదాఘాతంతో ‘భగీరథ’ లైన్‌మేన్ మృతి గోపాల్పేట: విద్యుదాఘాతంతో మిషన్ భగీరథ పథకం లైన్‌మేన్ మృతి చెందిన ఘటన గోపాల్పేట మండలం తాడిపర్తిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపర్తిలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ అయింది. పైప్‌లైన్‌కు మరమ్మతు చేసేందుకుగాను కాశీంనగర్‌కు చెందిన వాటర్‌మేన్ సతీష్ (45) వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష చిన్నచింతకుంట: పోక్సో కేసులో నిందితుడికి మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పోగుల రాజుపై 2018లో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి
నందిపేట్ (ఆర్మూర్): తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్‌ని తెరిచే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జరిగింది. నవీపేట మండల కేంద్రానికి చెందిన గూడూర్ రాజశేఖర్ భార్య, కూతురు రిషిత (4)తో కలిసి నందిపేటలో ఉండే అత్తగారింటికి ఆదివారం వచ్చాడు. సోమవారం ఉదయం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తూ.. నందిపేటలోని ఎన్ మార్ట్ షాపింగ్ మాల్‌లోకి సరుకులు కొనేందుకు వెళ్లారు. రాజశేఖర్ వస్తువులు తీసుకుంటుండగా పక్కనే ఐస్‌క్రీంలు ఉన్న ఫ్రిడ్జ్‌ని తెరిచేందుకు రిషిత ప్రయత్నించింది. ఫ్రిడ్జ్‌కి కరెంట్ సరఫరా కావడంతో చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది. ఫ్రిడ్జికి అలాగే అంటుకుని కొన్ని సెకన్లపాటు వేలాడింది. గమనించిన తండ్రి పాపను తీసుకుని స్థానిక ఆస్పత్రికి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప మృతి చెందింది. చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..: షాపింగ్‌మాల్ యజమానుల నిర్లక్ష్యం వల్లే రిషిత మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో మాల్ ఎదురుగా రోడ్డుపై నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. వీరికి స్థానికులు మద్దతు తెలుపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాహుల్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, మాల్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తూ.. కరెంట్ షాక్‌తో విద్యుత్ ఆపరేటర్ మృతి
సాక్షి, సూర్యాపేట, నడిగూడెం: ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ ఆపరేటర్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్ (40) మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సుధాకర్ గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తెల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రత్నవరం రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని అతన్ని తీసుకెళ్లారు. ఆ ట్రాన్స్ఫార్మర్ మునగాల మండలం ఆకుపాముల విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉందనుకొని అక్కడి నుంచి సుధాకర్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియకపోవడంతో సుధాకర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం
సాక్షి, పల్నాడు జిల్లా: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, వీధుల్లో, వ్యాపార సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల నిమజ్జనం మహోత్సవంలో పలు అపశ్రుతి, అనుకోని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కరెంట్ షాక్ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన నరసరావుపేటలో చోటుచేసుకుంది. సోమవారం వినాయకుడి ఊరేగింపు చూసేందుకు 13 ఏళ్ల బాలుడు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగిలి బాలుడు కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చదవండి: తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వేడుకగా చక్రస్నానం -
కరిరాజుకు కరెంట్ కాటు
కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీని నుంచి మేతకోసం అడవిని దాటి పంట పొలాల్లోకి వచ్చే ఏనుగులకు కరెంట్ పెద్ద శత్రువులా మారింది. ఇప్పటి వరకు కరెంట్ షాక్‌లతో 14 ఏనుగులు మృతిచెందగా.. తాజాగా బైరెడ్డిపల్లె మండలం నల్లగుట్లపల్లె వద్ద మరో ఆడ ఏనుగు కరెంటుకు బలైంది. వంటిపై దురద తీర్చుకోవడానికి కరెంటు స్థంభాలను రుద్దడం, తొండంతో విరగ్గొడుతుండడంతో తీగలు పైన పడుతున్నాయి. మరికొన్ని చోట్ల రైతుల పొలాల వద్ద తక్కువ ఎత్తులోని 12కేవీ కరెంటు వైర్లు తగిలి మృతిచెందుతున్నాయి. చిత్తూరు: కౌండిన్య అభయారణ్యంలో కరెంటుకు ఏనుగులు బలి అవుతున్నాయి. ఇప్పటి పలు ఘటనల్లో 20 ఏనుగులు మృతిచెందగా, ఇందులో 15 ఏనుగులు కరెంట్ తీగలు తగిలి చనిపోవడం బాధాకరం. అభయారణ్యంలో మొత్తం వందకుపైగా ఏనుగులున్నాయి. ఇవి గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ముసలిమొడుగు, జగమర్ల, మొగిలిఘాట్, నెల్లిపట్ల, వెంగంవారిపల్లి, తోటకనుమ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. మదపుటేనుగులు ఒంటరిగానే సంచరిస్తున్నాయి. కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగులు బయటికి రాకుండా అటవీశాఖ నిర్మించిన ఎలిఫెంట్ ట్రెంచీలు, సోలార్‌ఫెన్సింగ్ పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. తెలివైన జంతువుగా పేరున్న గజరాజులు ట్రెంచీలను పూడ్చి, బండలను వాటిల్లోకి దొర్లించి, సోలార్ ఫెన్సింగ్‌ను విరగ్గొట్టి అడవి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏనుగుల సమస్యకు శాశ్వతచర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో కౌండిన్యాలో ఏనుగుల జాడ కనుమరుగైయ్యే అకాకాశం ఉంది. బలమైన ఫెన్సింగ్ నిర్మాణంతోనే కట్టడి కౌండిన్యా అడవిలో 66 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్‌ను గతంలో నిర్మించారు. ఇందులో కొన్ని చోట్ల సోలార్ ఫెన్సింగ్‌కు అమర్చిన డీసీ బ్యాటరీలు పనిచేయక విద్యుత్ ప్రసరించడం లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్‌లో మరీ తేలిగ్గా ఉన్న పైపులున్నచోట వీటిని ఏనుగులు తొక్కి నాశనం చేస్తున్నాయి. సోలార్ ఫెన్సింగ్తోబాటు కౌండిన్య అటవీప్రాంతంలో 12 చోట్ల 74 కిలోమీటర్లమేర ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్ పనులను గతంలో చేపట్టారు. అయితే ట్రెంచికి మధ్యలో రాతి బండల కారణంగా అక్కడక్కడ గ్యాప్‌లున్నాయి. ట్రెంచి వెడల్పు మూడు మీటర్లుగానే ఉంది. ఏనుగులు కొన్ని చోట్ల గుంతలు ఉన్న గుట్టల గుండా, లేదా గుంతల్లోకి మట్టిని నింపి వెలుపలికి వస్తున్నాయి. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా పాత రైలు పట్టాలకు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసినట్టు ఇక్కడా చేపట్టాలి. స్థానిక అడవిలో కొంతమేర ఇప్పటికే నిర్మించిన కర్ణాటక టైప్ వేలాడే ఫెన్సింగ్నైనా పూర్తిస్థాయిలో చేపట్టాలి. అడవికి ఆనుకుని ఉన్న బఫర్‌జోన్‌లో ముళ్లుకలిగిన కలిమిచెట్లు, గారచెట్లు, నిమ్మచెట్టు లాంటివి పెంచితే ముళ్లకు బయపడి ఏనుగులు రాకుండా ఉంటాయని రైతులు సూచిస్తున్నారు. అయితే కౌండిన్య అభయారణ్యం మూడు రాష్ట్రాల పరిధిల్లో ఉండడంతో మూడు రాష్ట్రాలు కలసి ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేస్తేనే సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. సీఎం దృష్టికి తీసుకెళ్లా.. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏనుగుల సమస్య ఉంది. గతంలో నిర్మించిన సోలార్ ఫెన్సింగ్ నాఽశిరకంగా ఉండడంతోనే ఏనుగులు సులభంగా అడవిలోంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇందుకోసం పటిష్టమైన సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. సీఎం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. – వెంకటేగౌడ, ఎమ్మెల్యే, పలమనేరు కొత్త ఫెన్సింగ్‌కు ప్రతిపాదనలు పంపాం పాత, కొత్త సోలార్ ఫెన్సింగ్‌ల మధ్య నున్న గ్యాప్‌లతో పాటు పాత సోలార్ దెబ్బతిన్న చోట్ల మరమత్తులకు ఇప్పటికే రూ.28 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులందితే ఫెన్సింగ్ పనులు ప్రారంభిస్తాం. అడవిలోంచి బయటకొచ్చిన ఏనుగులు ఇలా కరెంట్షాక్లకు గురై మృతి చెందుతుండడం మా శాఖకు చాలా బాధగా ఉంది. – శివన్న, ఎఫ్ఆర్వో, పలమనేరు -
వీడియో: కూకట్‌పల్లిలో విషాదం.. కరెంట్ షాక్‌తో మహిళ మృతి
-
HYD: స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్‌తో మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోర్ స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్‌తో వివాహిత గంగా భవాని(33) అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్లో గంగాభవాని(33) పని మనిషిగా పనిచేస్తోంది. అయితే, గంగా భవాని అపార్ట్మెంట్లో బోర్వెల్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్‌తో మృతిచెందింది. కరెంట్ షాక్ తగిలిన వెంటనే ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె నేలపై పడి ఉండటాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా, ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్లోనే ఆమె భర్త వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు 11 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి మరియు 9 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి ఉన్నారు. వీరు ఏపీవాసులుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి -
కాటేసిన కరెంట్ తీగ!
సంగారెడ్డి: పంట చూసేందుకు వెళ్లిన కౌలు రైతు విద్యుత్ షాక్ గురై మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (35) తనకున్న 2 ఎకరాలతోపాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కౌలు భూమి చుట్టూ ఫెన్సింగ్ వైరు ఏర్పాటైంది. కరెంట్ స్తంభం నుంచి వైరు తెగిపడి ఫెన్సింగ్‌పై పడింది. పంట పరిశీలనకు ఒక వైపు నుంచి వెళ్లి మరో వైపు నుంచి తిరిగొస్తుండగా ఫెన్సింగ్ వైర్ తగిలి షాక్‌తో అక్కడికక్కడ మరణించాడు. అతడికి భార్య నాగమణి, ఇద్దరు పిల్లలున్నారు. నాగమణి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వ్యవసాయ పొలాల వద్ద వెళాడుతున్న విద్యుత్ వైర్లు సరిచేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. సంఘటనా స్థలం వద్దకొచ్చిన లైన్మెన్, ఇద్దరు సిబ్బందిని గేరావ్ చేశారు. ఉన్నతాధికారులు పరిహారం ప్రకటించేంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదని భీష్మించారు. పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పి శాంతింపజేశారు.