![Bulls Died Of Electric Shock Due To Squirrel In Kurnool District - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/19/Squirrel.jpg.webp?itok=pSFoP1mM)
ప్రతికాత్మక చిత్రం
ప్యాపిలి(కర్నూలు జిల్లా): కరెంట్ స్తంభంపై ఒక ఉడుత తీగలను తాకడంతో అవి తెగి కింద పడి విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి చెందగా ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..రాయలచెరువు గ్రామానికి చెందిన చౌడప్ప, లలితల కుమారుడు జగదీశ్ (10) ఎడ్ల బండిపై పొలానికి బయలుదేరాడు. పొలానికి వెళ్లే దారిలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడి ఉండటాన్ని గమనించకుండా బండిని వెళ్లనిచ్చాడు.
చదవండి: పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత..
విద్యుత్ తీగ ఎద్దులకు తగలగానే అవి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. బండిపై ఉన్న జగదీశ్ సైతం షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బండి వెనుక వస్తున్న బాలుడి పెద్దనాన్న మద్దయ్య గమనించి బాలుడిని కాపాడాడు. తీవ్రంగా గాయపడిన జగదీశ్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరెంట్ స్తంభంపై ఒక ఉడుత తీగలను తాకడంతో ప్రమాదవశాత్తు తెగి కింద పడినట్లు ట్రాన్స్‌కో ఏఈ వినయ్ కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment