bulls died
-
Current Shock: ఎంతపని చేశావ్.. ఉడతా..
ప్యాపిలి(కర్నూలు జిల్లా): కరెంట్ స్తంభంపై ఒక ఉడుత తీగలను తాకడంతో అవి తెగి కింద పడి విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి చెందగా ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..రాయలచెరువు గ్రామానికి చెందిన చౌడప్ప, లలితల కుమారుడు జగదీశ్ (10) ఎడ్ల బండిపై పొలానికి బయలుదేరాడు. పొలానికి వెళ్లే దారిలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడి ఉండటాన్ని గమనించకుండా బండిని వెళ్లనిచ్చాడు. చదవండి: పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత.. విద్యుత్ తీగ ఎద్దులకు తగలగానే అవి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. బండిపై ఉన్న జగదీశ్ సైతం షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బండి వెనుక వస్తున్న బాలుడి పెద్దనాన్న మద్దయ్య గమనించి బాలుడిని కాపాడాడు. తీవ్రంగా గాయపడిన జగదీశ్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరెంట్ స్తంభంపై ఒక ఉడుత తీగలను తాకడంతో ప్రమాదవశాత్తు తెగి కింద పడినట్లు ట్రాన్స్‌కో ఏఈ వినయ్ కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. -
కరెంట్ షాక్‌తో కాడెడ్లు మృతి
శివ్వంపేట: విద్యుత్‌షాక్‌కు గురై కాడెడ్లు మృతిచెందిన సంఘటన మండలంలోని చెండి పొలాల వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అంతిరెడ్డి నర్సారెడ్డికి చెందిన కాడెడ్లు బుధవారం మేతకు వెళ్లి రాత్రికి తిరిగి రాలేదు. అడవి పందుల బారి నుంచి పంట రక్షించుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ విద్యుత్ వైరు ఏర్పాటు చేశాడు. అటుగా వెళ్లిన కాడెడ్లు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. గురువారం ఉదయం విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన కాడెడ్లను రైతులు గుర్తించి నర్సారెడ్డికి సమాచారం అందించారు. కాడెడ్ల విలువ రూ. లక్ష ఉంటుందని బాధిత రైతు బోరున విలపించాడు. కాడెడ్లను నమ్ముకొని వ్యవసాయం సాగుచేస్తున్న తాను ఉపాధి కోల్పోయానని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
విద్యుదాఘాతంతో కాడెద్దుల మృతి
– ఇద్దరికి గాయాలు – రూ.1.80లక్షల నష్టం గోరంట్ల : విద్యుదాఘాతంతో కాడెద్దులు మతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకొంది. బాధితులు, స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు పట్టణంలోని పులేరు రోడ్డులో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి గహా నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణ సామగ్రిని నిల్వ చేసుకునేందుకు ఓ బంకు(ఐరన్షీట్) నాగరాజు అనే ఎద్దుల బండిని కిరాయికి తీసుకున్నారు. బంకును తరలించే క్రమంలో కూరగాయల సంత సమీపంలో 11 కేవీ విద్యుత్ వైర్లు బంకుకు తగిలి విద్యుత్ ప్రవహించడంతో బండి యజమాని చాకలి నాగరాజు, విశ్వేశ్వరరెడ్డిలు ఒక్కసారిగా కిందికి దూకేశారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బండిని లాగుతున్న ఎద్దుల మాత్రం విద్యుత్ షాక్‌తో విలవిలలాడుతూ అక్కడిక్కడే మతి చెందాయి. ఎద్దులను చాకలి నాగరాజు రూ. 1.80 వేల ఖరీదుతో కొనుగోలు చేశాడని, వ్యవసాయ పనుల ఉన్నప్పుడు వ్యవసాయం తర్వాత బాడుగలకు వెళ్లుతూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబసభ్యులు విలపించిన తీరు అందరిని కలిచి వేసింది. రెవెన్యూ, విద్యుత్, పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘటనస్థలాన్ని పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారి డాక్టర్.కిషోర్ మతి చెందిన ఎద్దులకు పోస్టుమార్టం నిర్వహించారు.