విద్యుదాఘాతంతో కాడెద్దుల మృతి
– ఇద్దరికి గాయాలు
– రూ.1.80లక్షల నష్టం
గోరంట్ల : విద్యుదాఘాతంతో కాడెద్దులు మతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకొంది. బాధితులు, స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు పట్టణంలోని పులేరు రోడ్డులో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి గహా నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణ సామగ్రిని నిల్వ చేసుకునేందుకు ఓ బంకు(ఐరన్‌షీట్) నాగరాజు అనే ఎద్దుల బండిని కిరాయికి తీసుకున్నారు.
బంకును తరలించే క్రమంలో కూరగాయల సంత సమీపంలో 11 కేవీ విద్యుత్ వైర్లు బంకుకు తగిలి విద్యుత్ ప్రవహించడంతో బండి యజమాని చాకలి నాగరాజు, విశ్వేశ్వరరెడ్డిలు ఒక్కసారిగా కిందికి దూకేశారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బండిని లాగుతున్న ఎద్దుల మాత్రం విద్యుత్ షాక్‌తో విలవిలలాడుతూ అక్కడిక్కడే మతి చెందాయి. ఎద్దులను చాకలి నాగరాజు రూ. 1.80 వేల ఖరీదుతో కొనుగోలు చేశాడని, వ్యవసాయ పనుల ఉన్నప్పుడు వ్యవసాయం తర్వాత బాడుగలకు వెళ్లుతూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబసభ్యులు విలపించిన తీరు అందరిని కలిచి వేసింది. రెవెన్యూ, విద్యుత్, పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘటనస్థలాన్ని పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారి డాక్టర్.కిషోర్ మతి చెందిన ఎద్దులకు పోస్టుమార్టం నిర్వహించారు.