Gorantla Butchaiah Chowdary
-
బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీలో అందరి కళ్లూ కేబినెట్ కూర్పుపైనే ఉన్నాయి. మంత్రివర్గం ఎలా ఉండబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటారా, సామాజిక సమతూకాల మాటేమిటి, కూటమిలో క్రియాశీలకమైన జనసేనకు లభించే ప్రాతినిధ్యం ఎంతవరకూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చ అంతా ఈ అంశాలపైనే జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు గెలుపొందడంతో మంత్రివర్గంపై ఆశలు పెంచుకున్న వారి జాబితా చాంతాడులా మారుతోంది. పార్టీ సీనియర్లు ఈసారి కేబినెట్లో బెర్త్ ఖాయం చేసుకోవాలని లాబీయింగ్ చేయడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గంలో బెర్త్ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్లంతా రేసులో ఉన్నారు. పార్టీలో నంబర్ టుగా పేర్కొనే యనమల రామకృష్ణుడు సహా నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎన్నికయ్యారు. మండలి నుంచి మంత్రివర్గంలోకి యనమలకు బెర్త్ దక్కితే సరేసరి లేదంటే కుమార్తె దివ్య రేసులో ఉండటం ఖాయమంటున్నారు. గత చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చేసిన పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారు. వివాదరహితుడనే పేరున్న చినరాజప్ప రెండో సారి ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మెట్ట ప్రాంత రాజకీయాల్లో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ ఈసారి బెర్త్ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రి అనిపించుకోవాలనే ఆత్రం ఎవరికి మాత్రం ఉండదని నెహ్రూ సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కాకినాడ జిల్లా అద్యక్షుడు నవీన్ ఇప్పటికే లోకేష్‌ను కలిసి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?రాజమహేంద్రవరం రూరల్ నుంచి గెలుపొందిన సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరు కూడా కేబినెట్ రేసులో ప్రచారంలోకొచ్చింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో అందరి కంటే సీనియర్ అయిన తనకు బెర్త్ ఖాయమనే ధీమాతో బుచ్చయ్యచౌదరి ఉన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలోనే పౌర సరఫరాలు వంటి కీలక శాఖలు చేసిన తమ నేతకు ఈసారి మంత్రివర్గంలో చోటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నామని అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. బుచ్చయ్యకు పోటీగా సిటీ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఆదిరెడ్డి వాసు కూడా రేసులో ఉన్నారు. ఆది నుంచీ సిటీ సీటు విషయంలో గోరంట్ల...ఆదిరెడ్డి వర్గాల మధ్య వైషమ్యాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో వాసు కోటరీ లోకేష్ ద్వారా బెర్త్ కోసం పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, చిన్న మావ అయిన అచ్చెన్నాయుడుతో చంద్రబాబుకు సిఫార్సు చేయించుకుంటున్నారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, ఎస్సీ, బీసీ కోటాలో అమలాపురం అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ నుంచి వనమాడి కొండబాబు అమాత్య పదవి కోసం పావులు కదుపుతున్నారు.యనమల హవా నడుస్తుందా?మంత్రివర్గం కూర్పులో సామాజికవర్గాల సమతూకమే ప్రామాణికంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మూడు బెర్త్‌లు ఖాయం కావచ్చనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. అదే నిజమైతే సీనియర్ల మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుందని నేతలు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఆది నుంచి యనమల, జ్యోతుల వర్గాలకు పొసగని పరిస్థితి. ఆది నుంచీ జ్యోతుల మంత్రి పదవికి మోకాలడ్డుతున్నది యనమల వర్గమేనని ఆయన సన్నిహితులు పేర్కొంటుంటారు. ఈసారి ఏమి జరుగుతుందో చూడాలంటున్నారు. గతంలో మాదిరి కేబినెట్ కూర్పులో యనమల హవా నడుస్తుందా లేదా మారిన సమీకరణలు ఎవరికి ప్లస్ అవుతాయో వేచి చూడాల్సిందేనంటున్నారు.కాపుల నుంచే పోటీ ఎక్కువప్రధానంగా కాపు సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తోంది. ఇటు టీడీపీ, అటు జనసేనలో ఈ సామాజికవర్గం నుంచి అమాత్య పదవిని ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేన అధ్యక్షుడు పవన్ పోటీ చేసిన పిఠాపురం సహా రాజోలు, పి.గన్నవరం, నిడదవోలు, కాకినాడ రూరల్, రాజానగరం స్థానాల్లో కాపు సామాజిక వర్గీయులు గెలుపొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యంగా నిడదవోలు నుంచి గెలుపొందిన కందుల దుర్గేష్‌కు చాన్స్ లభించవచ్చునంటున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్‌పై పవన్‌కు ఉన్న గుడ్‌లుక్స్ కేబినెట్లో చోటుకు సానుకూల అంశంగా మారుతుందంటున్నారు. పవన్‌కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అంటూ జరుగుతోన్న ప్రచారమే నిజమైతే ఉమ్మడి జిల్లాలో కాపు సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం లభించడం కష్టమేనంటున్నారు. ఉమ్మడి తూర్పున జనసేనలో ఎస్సీల నుంచి పవన్ ప్రతిపాదించాలనుకుంటే రాజోలులో గెలుపొందిన దేవ వరప్రసాద్ పేరు మొదటి వరుసలో ఉంటుందంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపొందిన ఏకై క రాజోలు చీకటిలో చిరుదీపంగా నిలిచిందంటూ పవన్ ఆ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. అందునా రిటైర్డ్ ఐఏఎస్‌గా, పార్టీ జనవాణి కార్యక్రమ కోఆర్డినేటర్‌గా వరప్రసాదరావు వైపే పవన్ మొగ్గు చూపుతారంటున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌గా చంద్రబాబు హయాంలో పనిచేయడంతో వరప్రసాదరావుకు అటు టీడీపీ నుంచి కూడా సానుకూలం అవుతుందంటున్నారు. టీడీపీలో ఎస్సీ సామాజికవర్గం నుంచి అమలాపురంలో గెలుపొందిన ఆనందరావు పేరు తెరమీదకు వచ్చింది. కానీ కాకినాడ జిల్లాకు పొరుగున ఉన్న పాయకరావుపేట నుంచి గెలిచిన అదే సామాజికవర్గానికి చెందిన వంగలపూడి అనితకు అవకాశం దక్కవచ్చునంటున్నారు. -
చెప్పుతో కొడతా!
రాజమహేంద్రవరం రూరల్: ‘జోడిచ్చుకుని కొడతా’నంటూ ఓ మహిళపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాలమ్మ గుడి వీధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ డివిజన్లో తన పెద్ద కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ శ్రేణులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వీధిలో ప్రచారం చేస్తున్న సమయంలో పిల్లల నాగమణి అనే మహిళ ‘ఎన్నికలప్పుడే మీకు ప్రజలు గుర్తొస్తారా?’ అని మహిళ నిలదీసింది. ‘ఓయ్ అమ్మాయ్.. ఆగు’ అంటూ గోరంట్ల ఆమెను అడ్డుకోబోయారు.అయినా.. నాగమణి నిలదీయడం ఆపకపోవడంతో నిగ్రహం కోల్పోయిన గోరంట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ‘జోడిచ్చుకుని కొడతాను’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలసి బుచ్చయ్య వెనుతిరిగారు.ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్పదేళ్లుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరినీ తాను తిరిగే గ్రామం లేదా డివిజన్‌కు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేకపోగా.. ప్రచారంలో మహిళలు నిలదీస్తుండటంతో గోరంట్ల ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అడుగడుగునా నిలదీతలేఅంతకు ముందు కూడా ఓ ఇంటివద్ద నలుగురు వ్యక్తులు.. ‘ఎన్నికల సమయంలోనే తమరికి ప్రజలు గుర్తొస్తారా’ అంటూ గోరంట్లను నిలదీశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పట్టించుకోలేనప్పుడు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోరంట్ల.. తమకు ఓట్లు వెయ్యవద్దని నోరు పారేసుకున్నారు. అలాంటప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అక్కడి వారు అడగడంతో గోరంట్ల, ఆయన అనుచరుడు కురుకూరి కిషోర్ ప్రజలపై దౌర్జన్యానికి దిగారు. వారిని స్థానిక నేతలు, టీడీపీ నాయకులు పక్కకు తీసుకుని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గోరంట్ల కుమార్తె శిరీష 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అక్కడి మహిళలు నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. -
గోరంట్లను వెంటాడుతున్న భయం.. కారణం అదేనట..!
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్ధి విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆఖరు నిమిషం వరకూ రాజమండ్రి రూరల్ స్థానానికి పోటీ పడిన దుర్గేష్‌ను పవన్ కళ్యాణ్- చంద్రబాబు నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన అయిష్టంగా అక్కడకు వెళ్లేందుకు ఒప్పుకున్నారు. తనకు రూట్ క్లియర్ అయిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల భావిస్తున్నా, ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఎంతమేర సహకరిస్తారోనని టీడీపీ నేతలను ఓటమి భయం పట్టి పీడిస్తుంది. తీవ్రంగా పోటీపడి, సామదాన భేధ దండోపాయాలు ఉపయోగించి మరీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య దక్కించుకున్నారు. అధికారికంగా పేరు వెల్లడించకపోయినా, దాదాపుగా రాజమండ్రి రూరల్ స్థానం ఆయనకు ఖరారైనట్టే. అయితే జనసేన అభ్యర్ధి దుర్గేష్‌తో పోటీ పడి మరీ ఈ స్థానాన్ని దక్కించుకున్న గోరంట్లకు ఇంకా స్థిమితంగా లేరట. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆయన కాపు సామాజికవర్గం హవా అత్యధికంగా ఉన్న రాజమండ్రి రూరల్ స్థానం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాపుసామాజికవర్గానికి చెందిన దుర్గేష్ స్వతంత్ర్య అభ్యర్ధిగా, ఆకుల వీర్రాజు వైఎస్ ఆర్ అభ్యర్ధిగా పోటీ పడ్డారు. దీంతో చాలావరకూ కాపు ఓట్లు చీలిపోయాయి. దుర్గేష్ 46 వేల ఓట్లు సాధించుకోగలిగారు. ఆకుల వీర్రాజు రెండో స్థానంలో నిలిచారు. విజయం బుచ్చయ్యకు దక్కింది. ఈసారి టీడీపీ-జనసేన పొత్తులో రాజమండ్రి రూరల్ స్థానానికి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని అందరూ ఊహించారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు భరోసా ఇచ్చారు కనుక రూరల్ స్థానం తనదేనని దుర్గేష్ భావించారు. అయితే అనూహ్యంగా ఆయనను నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో అయిష్టంగా ఊ కొట్టారు. అయితే జనసేన క్యాడర్ మాత్రం దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ స్థానం నుంచే పోటీ కి దింపాలని పలు ఆందోళనలు నిర్వహించింది. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ వీటిని లక్ష్యపెట్టలేదు. దీంతో పదోసారి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు బుచ్చయ్య చౌదరి సిద్దపడుతున్నారు. అయితే ఈసారి తమ నాయకుడు బరిలో ఉంటారని భావించిన జనసేన క్యాడర్ బుచ్చయ్యకు ఎంతమేర సహకరిస్తారన్న విషయంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య ఈసారి తమ అభ్యర్ధికి అవకాశం ఇస్తారని జనసేన కార్యకర్తలు భావించారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన దుర్గేష్ కు అవకాశం కల్పిస్తే గెలిపించుకోవాలని భావించారు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో బుచ్చయ్యకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పొత్తు లేకపోయినా, జనసేన-టీడీపీ నాయకులు కలిసే పనిచేశారు.అయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు పదేళ్లపాటు రూరల్ లో శాసనసభ్యుడిగా కొనసాగిన బుచ్చయ్యచౌదిరి పై టీడీపీ క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో తమకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని స్థానికులకు కూడా బుచ్చయ్య అభ్యర్ధిత్వంపై గుర్రుగా ఉన్నారు. అవకాశం వస్తే కచ్చితంగా ఓడించాలనే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు, నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా వచ్చిన మంత్రి వేణుగోపాలకృష్ణ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పాత, కొత్త నాయకులను కలుపుకుంటూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోను పర్యటిస్తున్నారు. మంత్రి వేణు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తరువాత నాయకులు, కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహం కలుగుతోంది. ఎక్కడిక్కడ అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ, వారి బాగోగులు తెలుసుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో విజయం సాధించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలో చేరబోతున్నా: ముద్రగడ -
Rajamahendravaram: సీటు తనకే దక్కేలా ఎమ్మెల్యే గోరంట్ల వ్యూహం
సాక్షి, రాజమహేంద్రవరం/నిడదవోలు: టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై విభేదాల అగ్గి రగిలింది. పొత్తు ధర్మం, విలువలు పాటించకుండా చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అన్నట్లు సీట్లు కేటాయించడం, జాబితా రూపొందించడంపై ఇరు పార్టీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా నిడదవోలు నిడదవోలు నుంచి తాను పోటీ చేస్తున్నట్టు జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. దీనికి అధినేత పవన్ కల్యాణ్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెబుతూ, ఇప్పటికే నిడదవోలులోని కొంతమంది జనసేన నాయకులతో దుర్గేష్ మాట్లాడారని, వారికి ఆయన వర్గీయులు సైతం ఫోన్ చేసి, నియోజకవర్గ సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. ఈ పరిణామంపై ఇప్పటికే ఆ టికె ట్ ఆశిస్తున్న అక్కడి టీడీపీ నేతలు చంద్రబాబుపై కస్సుమంటున్నారు. తమను కాదని స్థానికేతరులకు నిడదవోలు టికెట్ ఇస్తే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాకు సైతం సిద్ధమని అల్టిమేటం జారీ చేస్తున్నా రు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని టీడీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇంటి వద్దకు ఆదివారం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనకు అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిడదవోలులో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో బూరుగుపల్లి టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావు నిడదవోలు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన సర్వేలో సైతం ఆయనకు అనుకూలంగా వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. చంద్రబాబు సైతం భరోసా ఇవ్వడంతో ఆయన లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. ఈ తరుణంలో కందుల దుర్గేష్‌కు ఈ సీటు కేటాయిస్తారన్న సమాచారం అందడంతో శేషారావు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. టికెట్ దక్కకుంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో సైతం ఉన్నట్లు చెబుతున్నారు. కుందులది మరో దారి నిడదవోలు స్థానం జనసేనకు కేటాయించారని టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉంటే.. టీడీపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కుందుల సత్యనారాయణ విచిత్ర ప్రకటన చేశారు. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. శేషారావు, సత్యనారాయణ మధ్య ఇప్పటికే వర్గ విభేదాలు నడుస్తున్నాయి. టీడీపీ కార్యక్రమాలు సైతం వారు వేర్వేరుగా చేస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో సైతం ఎవరికి వారే అన్న చందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేతిచమురు కూడా బాగానే వదిలించుకున్నారు. తాను కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చానని, తనకు కాకుండా టికెట్ ఇతరులకు ఎలా ఇస్తారని కుందుల సత్యనారాయణ తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత దుర్గేష్ పోటీ చేస్తే, ఆయనకు సహకరించేందుకు టీడీపీకి చెందిన కమ్మ సామాజికవర్గ నాయకులు ఆసక్తి చూపడం లేదు. భగ్గుమన్న జనసేన నేతలు దుర్గేష్‌కు రాజమహేంద్రవరం రూరల్ కేటాయించకపోవడంతో జనసేన నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఈ నెల 20న రాజమహేంద్రవరం వచ్చిన జన సేన అధినేత పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశంలో ఈ సీటుపై దుర్గేష్‌కు భరోసా ఇచ్చారని, ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ మార్పు చేయడం ఏమిటని దుర్గేష్ అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన పార్టీ గుర్తు ఉన్న స్టిక్కర్లు చించివేశారు. జెండా పీకేసి నిరసన తెలిపారు. దుర్గేష్‌కు రాజమహేంద్రవరం రూరల్ కేటాయించాలని డిమాండ్ చేశారు. చక్రం తిప్పిన గోరంట్ల రాజమహేంద్రవరం రూరల్ సీటును తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చక్రం తిప్పారు. ఈ సీటు చేజారిపోయిందనుకున్న సమయంలో చంద్రబాబుతో పెద్ద ఎత్తున వాదనకు దిగి మరీ సాధించుకున్నారని అంటున్నారు. ఈ విషయమై పవన్ కల్యాణ్ సైతం రంగంలోకి దిగారు. దుర్గేష్‌ను శనివారం రాత్రి మంగళగిరికి పిలిపించారు. రూరల్ ఆశలు వదిలేసి, నిడదవోలు నుంచి పోటీ చేయాలని ఆయనకు పవన్ సూచించారు. చేసేది లేక దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. -
రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన వర్సెస్ టీడీపీ
-
రాజమండ్రిలో సైకిల్, గ్లాసు రచ్చ రచ్చ
రాజమండ్రిలో టీడీపీ-జనసేనల మధ్య రాజకీయం మరింత వేడెక్కిందనడం కంటే రచ్చకెక్కిందనడమే ఇక్కడ సరిపోతుంది. ప్రధానంగా సైకిల్ పార్టీ, గ్లాసు పార్టీలు ఇక్కడ సీటుపై ఒకరిపై ఒకరు కారాలు-మిర్యాలు నూరుకుంటూ సీటు మాదే అంటే మాది అంటూ.ప్రకటనలు చేసేస్తున్నారు. ఇందుకు కారణం రాజమండ్రి రూరల్ సీటు జనసేనదేనంటూ పవన్ కళ్యాణ్ తేల్చేయడమే.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్.. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించగా.. తాజాగా రాజమండ్రి రూరల్ కూడా జనసేనకేనని తేల్చేశారు. దానిలో భాగంగానే కందుల దుర్గేష్ జనసేన రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగుబోతున్నానంటూ ప్రకటించి తెలుగుదేశం శ్రేణులకు షాకిచ్చారు. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్టానంతో చర్చించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తానని కూడా పవన్ తెలిపినట్లు దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్ నాదే పవన్ ఇచ్చిన హామీతో రాజమండ్రి రూరల్ టికెట్ నాదేనంటూ ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి టికెట్ తనదేనంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. తనకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసారని, ఇక్కడ నుంచి జనసేన తరఫున తాను బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా కందుల దర్గేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను సీనియర్ని.. ఈ టికెట్ నాదే తాను జిల్లాలో సీనియర్ నాయకుడినని, జిల్లాలో పార్టీ వ్యవస్థాపకుడినని, టికెట్ తనదే అంటున్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ‘ఇందులో ఎలాంటి వివాదం లేదు. పార్టీ టికెట్ నాకే. జనసేనకు మరో నియోజకవర్గం కేటాయిస్తాం. సర్దుబాటు వాళ్లిష్టం’ అంటూ గోరంట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న గోరంట్ల తన సీటుకే ఎసరు పడుతుందా అనే డైలమాలో పడ్డారు. టీడీపీ నేతల్లో అసంతృప్తి రాజానగరం టికెట్ జనసేన ప్రకటించడంతో ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేతలు.. రాజమండ్రి రూరల్‌లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం మాత్రం.. పవన్ కళ్యాణ్ టికెట్లు ప్రకటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజమండ్రి రూరల్ ,రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గం సీట్లు కోల్పోయేనట్లేనని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పవన్ టికెట్లను ఇచ్చుకుపోతూ ఉంటే చంద్రబాబు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇది చంద్రబాబు ఇచ్చిన హామీతోనే పవన్ ఇలా చేస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ-జనసేనల మధ్య రసవత్తర రాజకీయమే నడుస్తోంది. -
ఇంతకీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు ఉన్నట్టా? లేనట్టా?
టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యకు ఇప్పుడు పోటీ చేయడానికి సీటే లేకుండా పోయిందా? రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ సీట్లలో ఏదీ బుచ్చయ్యకు ఖాయం కాలేదా? ఈ రెండు సీట్లు ఎవరికి కేటాయించబోతున్నారు? సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని టీడీపీ అధ్యక్షుడు ఎందుకు పట్టించుకోవడంలేదు? ఇంతకీ బుచ్చయ్యకు సీటు ఉన్నట్టా? లేనట్టా? తెలుగుదేశం పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి పోటీ చేసే స్థానం కోసం వెత్తుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా బుచ్చయ్య సిటింగ్ సీటు రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించాలని జనసేన నిర్ణయించుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన దుర్గేష్ ఓటమి పాలైనా, 40 వేలకు పైగా ఓట్లు సంపాదించుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపు సామాజికవర్గం కూడా దుర్గేష్ కు మద్దతుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే వ్యవహారం టీడీపీలో కలకలానికి కారణమవుతోంది. రాజమండ్రి రూరల్ తరపున తానే పోటీ చేస్తానని ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటున్న బుచ్చయ్య చౌదిరికి చంద్రబాబు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేదు. బుచ్చయ్య చౌదిరికి అడ్డాలాంటి కాతేరులో చంద్రబాబు సభ నిర్వహించినా, బుచ్చయ్య పేరును ప్రకటించలేదు. తర్వాత కూడా బుచ్చయ్యకు చంద్రబాబు నుంచి పోటీకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. దీంతో పోటీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న బుచ్చయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన నేత కందుల దుర్గేష్ కు కేటాయించినందున..రాజమండ్రి సిటీలో పోటీ చేసేందుకు బుచ్చయ్య సిద్ధపడుతున్నట్టు సమాచారం. అయితే రాజమండ్రి సిటీలో పోటీ చేయడానికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఎప్పుడో ఫిక్సయ్యారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం తనదేనంటూ ఆదిరెడ్డి వాసు గతంలో సభపెట్టి మరీ ప్రకటించారు. ఇపుడు బుచ్చయ్య దృష్టి మళ్ళీ సిటీ నియోజకవర్గంపై పడటంతో ఆదిరెడ్డి వర్గంలో అలజడి రేగుతోంది. ఇప్పటికే ఆదిరెడ్డి, బుచ్చయ్య వర్గాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తాజా పరిణామాలతో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాజానగరం నుండి కూడా బుచ్చయ్య పోటే చేసే అవకాశం లేకుండా పోయింది. రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటు రాజమండ్రి రూరల్ స్థానం కోల్పోయి, రాజానగరం దక్కక ఏం చేయాలో తెలియక బుచ్చయ్య వర్గం అయోమయంలో కూరుకుపోయింది. తన స్వంత నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడి సభ ఏర్పాటు చేసినా, తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించుకోలేని స్థితి బుచ్చయ్య ఎదుర్కొన్నారు. గతంలో మండపేటలో సభ ఏర్పాటు చేసినపుడు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేవేగుళ్ల జోగేశ్వరరావు అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన చంద్రబాబు కాతేరు బహిరంగసభలో తన పేరు కూడా ప్రకటిస్తారని బుచ్చ్యయ్య ఎదురు చూశారు. అయితే చంద్రబాబు పొరపాటున కూడా బుచ్చయ్య పేరును ప్రకటించకపోవడంతో తమకు ఎక్కడి స్థానం దక్కుతుందో, అసలు పోటీ చేసే అవకాశం లభిస్తుందో లేదో తెలియక బుచ్చయ్య వర్గం మథనపడుతోంది. రాజమండ్రి రూరల్ నుండి వరుసగా రెండు సార్లు విజయం సాధించినా, సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించినా, బుచ్చయ్యకు మాత్రం ఊరట లభించడం లేదు. త్యాగాలకు సిద్ధపడాలంటూ చంద్రబాబు ఇస్తున్న పిలుపునకు అర్ధం ఏమిటో, అది తమకే వర్తిస్తుందేమోనని బుచ్చయ్య అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ చదవండి: టీడీపీ చంద్రబాబు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. -
సీనియర్ నేతకు పొగ పెడుతున్న బాబు.. ఆ నియోజకవర్గం ఎంటీ?
గోదావరి జిల్లాల్లో అదొక కీలకమైన నియోజకవర్గం. పచ్చ పార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటినుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు చంద్రబాబు. జనసేన, టీడీపీల్లో ఎవరు పోటీ చేసినా ఈసారి అక్కడ గెలిచేది ఫ్యాన్ పార్టీయే. అయితే టీడీపీ, జనసేన సీటు ఆశిస్తున్న ఇద్దరూ పోటీ చేసేది మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది. ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ, జనసేన అభ్యర్ధులు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన పార్టీలు అసలీ స్థానానికి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తారోనని రెండుపార్టీల క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఇరువురు అభ్యర్ధులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెపుతున్నా, తామే అభ్యర్ధులమంటూ క్యాడర్‌కు బహిరంగంగానే చెపుతున్నారు. అయితే రాజమండ్రిలో టీడీపీ తరపున ఆరుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు పొగ పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదిరి టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్. తనకు ఏ మాత్రం అన్యాయం జరిగిందని భావించినా, వెంటనే తీవ్ర స్థాయిలో పార్టీని, అధినేతను విమర్శిస్తూ అలిగి కావాల్సినంది సాధించుకోవడం ఆయనకు అలవాటు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటం బుచ్చయ్య చౌదిరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. ఓవైపు తానే అభ్యర్ధిని చెపుతున్నా, కచ్చితంగా ఈస్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడుపడటంలేదు. రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ ఎప్పటినుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి పదిరోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీచేస్తానంటూ చెపుతున్నారు. టిక్కెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటుంటుందని, దీనికోసం ఎంతటివారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చయ్య చౌదిరికి సంకేతాలిస్తున్నారు. అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇపుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటిరోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి, తాను రాజమండ్రి రూరల్ స్థానం నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా బుచ్చయ్యకు టిక్కెట్ రాదని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయనే అభ్యర్ధంటూ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయడానికైనా సిద్ధమని చెపుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా జలక్ ఇస్తున్నారు బుచ్చయ్య. సింహం బయటకు వచ్చేవరకేనంటున్న బుచ్చయ్య చౌదిరికి ఈసారి చంద్రబాబు నిజంగానే టిక్కెట్ ఇస్తారో లేక పక్కన పెట్టేస్తారో చూడాలి. చదవండి: ‘మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’ -
నాకు టిక్కెట్ ఉండదనడానికి దుర్గేష్ ఎవరు?
రాజమహేంద్రవరం రూరల్: సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించిందని.. ఇప్పుడు ఉండదని చెప్పడానికి జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ఎవరని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. నగరంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా విభేదాలేవీ లేవని, జనసేన తమకు కేవలం మిత్రపక్షమేనని, టీడీపీ బలమైన పార్టీ అని అన్నారు. టీడీపీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా అసెంబ్లీకి తాను పోటీ చేయటం ఖాయమని, ఎంపీగా మాత్రం పోటీ చేయనని చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకు త్యాగానికి సిద్ధమని గోరంట్ల అన్నారు. -
టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటుకు ఎసరు
-
ప్యాకేజీ స్టార్‌తో పొత్తు.. నన్ను పక్కన పెడతారా?
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన సమన్వయ భేటీలో తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవమానం జరిగిందా..? కీలక సమావేశంలో స్థానం కల్పించకపోవడం వెనుక వేరే మతలబు ఉందా? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా జూనియర్లను అందలం ఎక్కించి ఆయన గుర్తింపును హరిస్తున్నారా? రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇదీ సంగతి.. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నుంచి 14 మంది సభ్యులతో కూడిన కమిటీ సుమారు 3 గంటల పాటు భేటీ అయింది. కమిటీలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ అయిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చోటు లభించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే చేదు అనుభవమే ఎదురైంది. తన కంటే పార్టీలో జూనియర్లు నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య, చివరకు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వలస నేత పితాని సత్యనారాయణకు కూడా కమిటీలో స్థానం కల్పించడంతో బుచ్చయ్య అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్లు సమాచారం. సీనియర్ నేతకు తగిన గౌరవం, గుర్తింపు దక్కకపోవడంతో టీడీపీపై వీరి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. 25 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి పార్టీ బలోపేతం, ఉమ్మడి వ్యూహాలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా పనికిరారా? అని ప్రశ్నిస్తున్నారు. పొత్తు సెగ తగిలిందా? టీడీపీ, జనసేన పొత్తు సెగ మొట్టమొదటిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు తగిలిందన్న భావన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. పొత్తు కుదిరితే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానం జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఆది నుంచీ సాగుతోంది. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ రూరల్ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అధినేత పవన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, ఆరు నూరైనా రూరల్ స్థానం తనకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జనసేన అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వక తప్పని పరిస్థితి. సీనియర్ నేత బుచ్చయ్యకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఈ ప్రచారానికి ఇది మరింత బలం చేకూరుస్తోంది. ఇదే జరిగితే బుచ్చయ్యకు భంగపాటు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ములాఖత్‌లోనూ శృంగభంగమే సెంట్రల్ జైల్లో ఉన్న బాబుతో ములాఖత్‌లోనూ బుచ్చయ్యకు అవమానమే ఎదురైంది. పార్టీ అధినేతను జైలులో కలిసే అవకాశం ఒక్కసారి కూడా దక్కలేదు. తెలంగాణ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు బాబు కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ములాఖత్ అవుతున్నారు. స్థానికంగా ఉన్న, సీనియర్ నేతను ఒక్కసారి కూడా పిలవకపోవడంతో పార్టీ బుచ్చయ్యకు ఎంత ప్రాధాన్యంఇస్తోందో తేటతెల్లమవుతోందని ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. ఆది నుంచీ ఆధిపత్య పోరే.. బుచ్చయ్య, ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య ఆది నుంచీ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా సిటీపైనే ఉండేది. పార్టీలో సీనియరైనా తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాలలో వెళ్లగక్కిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆదిరెడ్డి వర్గం సైతం ఆయనకు దీటుగా జవాబు ఇస్తూనే సిటీలో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గానికే పరిమితం చంద్రబాబు అరెస్టయి సెంట్రల్ జైలుకు వచ్చిన నాటి నుంచీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి టీడీపీలో కొంత ప్రాధాన్యత పెరిగినట్లు ఆపార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జైలు జీవితం నేపథ్యంలో బాబు కుటుంబం రాజమహేంద్రవరంలోనే బస చేస్తోంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు ఇక్కడి నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటన్నింటీకీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు సారథ్యం వహిస్తున్నారు. లోకేష్ క్యాంప్ కార్యాలయం వద్ద కూడా ఈయన తన ముద్ర చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామం బుచ్చయ్యకు మరింత భంగపాటుకు గురయ్యేలా చేస్తోంది. రూరల్ అసెంబ్లీ స్థానం లేకపోతే సిటీ టికెట్ ఆశిద్దామంటే అప్పారావు కుటుంబం ఏకు మేకు అయిందన్న చందంగా మారింది పరిస్థితి. చేసేది లేక బుచ్చయ్య చౌదరి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టే కార్యక్రమాల్లో సింహభాగం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. -
మాసివ్ హార్ట్ఎటాక్తోనే కుప్పకూలిన తారకరత్న!
సాక్షి, చిత్తూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఏస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందుతుండగా.. బెంగళూరు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం కుప్పంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మొదలు సందర్భంగా.. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్లు వేయలేదు. యాంజియోగ్రామ్ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్ వేస్తారా?.. ఇతర ట్రీట్మెంట్లు అందిస్తారా? అనేది వేచిచూడాలి. తారకరత్నకు భారీగా గుండెపోటు వచ్చిందని, అయితే ఆస్పత్రిలో వైద్యులు 40 నిమిషాలపాటు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారాయన. బాలకృష్ణ రాకతో ఆయన రికవరీ కావడం ఆశ్చర్యంగా ఉందని, బాలకృష్ణే దగ్గరుండి చూసుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తారకరత్నకు ప్రాణాపాయం తప్పిందని భావనలో ఉన్నామని బుచ్చయ్యచౌదరి చెప్పారు. అవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని, తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇక పరిస్థితిపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ లెఫ్ట్ సైడ్ వచ్చిందని తెలిపారు. ఎడమ వైపు 90 శాతం బ్లాక్ అయ్యింది. అయితే మిగతా రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పరిస్థితి మెరుగవుతోందని, వైద్యులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయినప్పటికీ బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి పాజిటివ్‌గానే ఉందని, దేవుడి దయతో పాటు కుటుంబం సభ్యుల ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో.. ఆయన మండిపడ్డారు. అంతకు ముందు.. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తారకరత్నను గ్రీన్‌ఛానల్ ద్వారా కుప్పం ఈపీఎస్ ఆస్పత్రి నుంచి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. -
ఏం ఖర్మో.. లీడర్లని మారుస్తున్నా.. అక్కడ పార్టీ తలరాత మారడంలే!
అసలే పార్టీ పాతాళం వైపు చూస్తోంది. ఈ సీటు గెలుస్తామని ఏ జిల్లాలోనూ చెప్పేంత ధీమా కనిపించడంలేదు. కానీ పార్టీలో గ్రూపులు, కుమ్ములాటలు షరా మామూలే. ఏ నియోజకవర్గంలో చూసినా పచ్చ పార్టీలో తన్నులాటలు కామన్‌గా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనే తమ్ముళ్ళు తన్నుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో గొడవలకు కారణమేంటో చదవండి.. అనుకూలం x వ్యతిరేకం గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం పార్టీ అంపశయ్యపైకి చేరింది. వంగల పూడి అనిత, కొత్తపల్లి జవహర్ అంటూ... నియోజకవర్గంలో నేతల్ని మారుస్తున్నా పార్టీ రాత మారడంలేదని అక్కడి కేడర్ ఆందోళన చెందుతోంది. మంత్రిగా ఉన్న కాలంలో జవహర్ రాజేసిన గ్రూపుల కుంపటి సెగలు నేటికీ చల్లార లేదు. మొన్న అమరావతి రైతుల యాత్ర సన్నాహక సమావేశంలో కుమ్ములాడుకున్న జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు.. మరోసారి చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాయి. నియోజకవర్గ నాయకులు బాబు పర్యటన ఏర్పాట్ల పై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం సజావుగా సాగుతున్న సమయంలో మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ సమావేశానికి వచ్చారు. జవహర్ ను చూసిన వ్యతిరేకవర్గం కేడర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్‌కు పని ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు దింపుడు కళ్లెం ఆశలు చంద్రబాబు హయాంలో జవహర్ మంత్రిగా పనిచేసినపుడు ఒక వర్గాన్ని దూరంగా పెట్టారు. తనవర్గం వారిని వారిపై రెచ్చగొట్టారు. అప్పటినుంచి కొందరు నేతలు, కార్యకర్తలు జవహర్ వ్యతిరేక వర్గంగా నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జవహర్‌కు కొవ్వూరు టిక్కెట్ రాకుండా చంద్రబాబు దగ్గర చక్రం తిప్పారు వ్యతిరేక వర్గం నాయకులు. తనవారి మాట కాదనలేక.. అప్పట్లో కొత్తపల్లి జవహర్‌ను చంద్రబాబు నాయుడు తిరువూరు స్థానానికి పంపించారు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసి అక్కడ అక్కడ గ్రూప్ తగాదాల్లో కూరుకుపోయిన వంగలపూడి అనితను కొవ్వూరు నుండి పోటీ చేయించారు. ఘోర పరాజయం పాలైన వంగలపూడి అనిత ఎన్నికల అనంతరం కొవ్వూరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో తిరిగి కొవ్వూరు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పలుమార్లు జవహర్ ప్రయత్నించినా వ్యతిరేకవర్గం అడ్డుపడడంతో ఆయన ఆశలు అడియాశలే అవుతున్నాయి. చదవండి: (టికెట్‌కి వెల కడతారా?.. మా కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తారా?) గోరంట్లకు జవహర్ సెగ ప్రస్తుతం రాజమండ్రి జిల్లా ఇన్ఛార్జిగా జవహర్ కొనసాగుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటనకు ఇన్చార్జిగా నియమితులైన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ రావడంతో ఒక్కసారిగా.. జవహర్ గోబ్యాక్ అంటూ పై నినాదాలు మొదలయ్యాయి. దీంతో జవహర్ అనుకూల వర్గం వారు వ్యతిరేకవర్గం వారితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య గంట సేపు వాగ్వాదం జరిగింది. ఘర్షణను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. నాయకులు, కార్యకర్తలతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్న సమయంలో సైతం గొడవ కంటిన్యూ అవుతుండటంతో బుచ్చయ్య చౌదరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. ఎన్నికకు ఏడాదిన్నర ముందే ఇలా ఉంటే.. తీరా అసలు సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న బెంగ ఇద్దరు బాబులకు పట్టుకుందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం తెలుగు తమ్ముళ్ల తన్నులాటకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో లిటరరీ క్లబ్ కళ్యాణ మండపం ఇందుకు వేదికయ్యింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమక్షంలో ద్విసభ్య కమిటీ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను వేదికపైకి ఆహ్వానించాలని కమిటీ సభ్యులకు బుచ్చయ్య చౌదరి సూచించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు జవహర్ గోబ్యాక్ అంటూ నినాదాలు ప్రారంభించారు. అదే సమయంలో జవహర్ వర్గీయులు గొంతెత్తారు. అరుపులతో సమావేశం రసాభాసగా మారింది. ఇరు పక్షాల మద్ధతుదారులు వేదికను చుట్టుముట్టి పరస్పరం నెట్టుకున్నారు. దీంతో మైక్ బాక్సులు, సోఫా సెట్లు కిందపడి పోయాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బుచ్చయ్య చౌదరి, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఇరుపక్షాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో రహస్యంగా గదిలో చర్చించారు. కాగా, ఇటీవల నిర్వహించిన అమరావతి పాదయాత్రలోనూ ఇరు పక్షాల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. చర్చల అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నాయకులంతా విభేదాలను పక్కన పెట్టి చంద్రబాబు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. దీంతో జవహర్, ఆయన వర్గీయులు జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బుచ్చయ్య చౌదరిని ప్రశ్నించారు. దళితులంటే చిన్నచూపా అంటూ ఆయన వర్గీయులు కేకలు వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందుకేనా వేదికపై పిలవలేదంటూ నిలదీశారు. జవహర్ వర్గీయులు ఆగ్రహంతో సభ ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిని వెంట బెట్టుకుని జవహర్, ఆయన వర్గీయులు బుచ్చయ్య చౌదరి బయటికి వెళ్లిపోయారు. ప్రాంగణంలో బుచ్చయ్య చౌదరి కారుకు అడ్డంగా టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సమావేశంలో జరిగిన విషయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. -
గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!
సాక్షి, రాజమహేంద్రవరం: ఇది మల్లెల వేళయని...వెన్నెల మాసమని...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ..విందులు చేసింది...సుఖదుఃఖాలు సినిమాలో దేవులపల్లి రాసిన పాట ఇది.. టీడీపీలో యువ నాయకుడొకరు ఇదే పల్లవి అందుకున్నారు. దీనిపై రాజకీయంగా రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఫలితంగా చాలా కాలంగా పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ సీట్‌గా పేరున్న రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే పోరు మొదలైనట్టుగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఈ విషయంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొరుగున అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రతి ఎన్నికల సందర్భంలో సిటీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూ ఉంటుంది. ఇది పార్టీలో సహజ పరిణామంగానే చెప్పుకుంటారు. అటువంటిది సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ నాయకుడు వాసు బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటి నుంచే టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయంటున్నారు. చదవండి: (Atmakur Byelection: బీజేపీ బేజార్.. అభ్యర్థి ఎంపికే మైనస్) ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్‌లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీలో పరిణామాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఈ ప్రకటనతో కనిపిస్తోంది. గోరంట్ల రూరల్‌కు వెళ్లిపోయినా సిటీపైనే ఆయన దృష్టి ఉంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉంటారు. ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి హైడ్రామా సృష్టించారు. చివరకు పార్టీ పదవులు తమ వారికి సాధించుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. చదవండి: (జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది) టీడీపీలో అంతర్యుద్ధం సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్ తనయుడు రవిరామ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే గోరంట్ల వైరి పక్షమైన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి నుంచి చాపకింద నీరులా సాగుతోన్న ఈ రెండు వర్గాల అంతర్గత పోరు వాసు తాజా ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటన వెనుక వ్యూహం వాసు ప్రకటన వెనుక రాజకీయ దూరాలోచన ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఆదిరెడ్డి కుటుంబం నుంచి పోటీకి పెడతారని ఇటీవల ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిని గోరంట్ల వర్గం భుజానకెత్తుకుని చేస్తోందని ఆదిరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సిటీ కోసం ఆరాటపడుతోన్న గోరంట్ల వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే వాసు తాజా ప్రకటన అంతరార్థమని తెలుస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ నుంచే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లే ప్రసక్తే లేదని వాసు తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని ఉండగా ఆమెను కాదని భర్త వాసు పోటీ చేస్తాననడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె పనితీరు సమర్థవంతంగా లేదనా, లేక రాజకీయాల్లో రాణించలేక పోతున్నారనా.. వీటిలో ఏ కారణంతో వాసు పోటీకి సై అంటున్నారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెను బలపరిచాను, వచ్చే సారి ఆమె నన్ను బలపరుస్తుంది అని వాసు మీడియా వద్ద ముక్తాయించడం గమనార్హం. దీనిపై గోరంట్ల వర్గం ఏ రకమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుందో వేచి చూడాల్సిందే. -
బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. చురుగ్గా లేని సీనియర్ నేతలు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్‌కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. -
బుచ్చిరాజ్యంలో.. ఆదిపత్య పోరు
వందల ఏళ్ల చరిత్ర కలిగి.. రాజరాజనరేంద్రుడు ఏలిన పురాతన రాజమహేంద్రవరం నగరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సామంతులు ‘ఎత్తుల’ కత్తులు దూస్తున్నారు. ఒక సామంతుడు ‘బుచ్చి’రాజు. మరొకరు ‘ఆది’రాజు. రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరికపు వాసనలు వారిని వీడటం లేదు. బుచ్చిరాజును సైన్యంతో సహా పదేళ్ల క్రితమే పొరుగు రాజ్యానికి ఆదిరాజు తరిమేశారు. అప్పటి నుంచీ కోల్పోయిన రాజ్యంలో పట్టు సాధించాలనే ఆరాటంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా అలక పాన్పు ఎక్కేస్తున్నారు బుచ్చిరాజు. వందిమాగధులతో రకరకాల తంత్రాలు పన్నుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో రాజకీయ మాయోపాయాలు పన్ని, ఆదిరాజును ఇరుకున పెట్టి, రాజ్యంలో పట్టు సాధించాలన్నది ఆయన వ్యూహం. సాక్షి,రాజమహేంద్రవరం: ఉత్తరాంధ్ర పరగణాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆజానుబాహుడైన ఓ నాయుడికి స్వయానా బంధువైన ఆదిరాజు ఏమైనా తక్కువ తిన్నారా? బుచ్చిరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన రాజ్యంలో వేలు పెడితే యుద్ధం తప్పదని వేగుల ద్వారా బుచ్చిరాజుకు సందేశం పంపించారు. అలనాడు దుర్యోధనుడు చెప్పినట్టు ‘‘సూది మొన మోపినంత స్థలం కూడా వదులుకోన’’ని స్పష్టంగా చెప్పాడు. విషయం ఆ నోటా ఈ నోటా రాజ్యం నలుమూలలా పాకడంతో సామంతులు, ఆంతరంగికుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. భటుల ద్వారా ఇది తెలుసుకున్న బుచ్చిరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అలాగని వందిమాగధులతో యుద్ధానికి సై అని సాహసించడం లేదు. తన రాజ్యంలోని సైనిక సంపత్తి, మంత్రాంగం సరిపోదనే కారణంతో.. అలకబూని.. రాజప్రసాదం తలుపులు తెరవకుండా మూడు రోజులుగా అంతఃపురానికే పరిమితమైపోయారు. ఈ తరహా రాజకీయ తంత్రం బుచ్చిరాజుకు కొత్తేమీ కాదు. రాజమహేంద్రవర రాజ్యాన్ని కోల్పోయిన గాయం ఇంకా మానకున్నా.. ‘చంద్ర’వంశ రాజదర్బార్‌లో కనీస మర్యాద కూడా దక్కడం లేదని ఏడు పదుల వయస్సులో ఉన్న ఈ సామంతరాజు కుమిలిపోతున్నారు. గతంలో కూడా ఇలానే కనీసం వయస్సుకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ అంతఃపురంలో ఏకాంతంగా అంతర్మధనం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆంతరంగికులు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా అవమాన భారంతో రగిలిపోతున్న బుచ్చిరాజు కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన ఎత్తులు ఆదిరాజు రాజకీయ తంత్రం ముందు చిత్తవుతున్నాయి. భవిష్యత్‌లో రాజమహేంద్రవరంలోని 52 పరగణాలకు జరిగే పోరు కోసమే సామంతుల మధ్య ఇంతటి రాజ్యకాంక్ష నెలకొందనే చర్చ రాజదర్బారులో నడుస్తోంది. బుచ్చిరాజు రాజ్యంలోకి వచ్చే తొమ్మిది పరగణాలతో పాటు, మిగిలిన 43 పరగణాల్లో తన సుబేదారులకే పట్టు ఎక్కువ ఉండటంతో.. వారిని యుద్ధరంగంలోకి దింపాలనేది బుచ్చిరాజు వ్యూహం. అయినప్పటికీ ఆదిరాజు సిక్కో లు రాజుల బంధుత్వం దన్నుతో ధీమాగా ఉన్నారని ఆ రాజప్రసాదంలోని భటులు చెప్పుకొంటున్నారు. సామంతుల మధ్య సంధి కోసం ‘చంద్ర’వంశ రాజు పంపించిన దూతలు బుచ్చిరాజు అంతఃపురంలో గంటన్నర చర్చించినా చివరకు తలలు పట్టుకుని వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. పైకి మాత్రం సామంతుల మధ్య యుద్ధ వాతావరణం లేదని, బుచ్చిరాజుకు అసలు అసంతృప్తే లేదని చెప్పారు. ‘చంద్ర’వంశ సామంతులు నిమ్మకాయల చినరాజు, బెజవాడలో ‘గద్దె’నెక్కిన రామ్మోహనరాజు, రాజమహేంద్రవరం రాజ్యంలో గోదావరి అవతల ఒడ్డున ప్రజలకు చుక్కలు చూపించిన హర్రర్రాజు, అనపర్తి రెడ్డి రాజు వంటి దూతల సంధి విఫలమైంది. అసలు సామంతుల మధ్య చిచ్చు పెట్టిందే ‘చంద్ర’వంశ రాజు. సంధి కోసం వెళ్లిన దూతలు మధ్యలో అంతఃపురం బయట చెప్పుకొన్న మాటలను రహస్యంగా విన్న రాజభటులు బుచ్చిరాజు చెవిన వేశారు. నాడు పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామ రాజ్యాన్నే కూల్చేసి, సింహాసనం అధిíÙ్ఠంచి, ఇన్నేళ్లవుతున్నా.. తన వ్యతిరేక కూటమితో చేతులు కలిపిన బుచ్చిరాజును ఒకప్పటి ‘చంద్ర’వంశ రాజు ఇప్పటికీ వదిలిపెట్టలేదని వేగుల ద్వారా వచ్చిన సమాచారం. అందుకే ఈ సంధి యత్నాలు ‘చంద్ర’వంశ అంతఃపురం సాక్షిగా రక్తి కట్టిస్తున్న ఎత్తుగడగా కనిపిస్తున్నాయి. చక్రవర్తిగా బుచ్చిరాజు చలామణీ అయ్యే రోజుల్లో అతడికి ఆదిరాజు సామంతుడు కావడమే విచిత్రం. సామంతుల మ«ధ్య చిచ్చు చివరకు ఏ తీరానికి చేరుతుందోనని ఇరుగు, పొరుగు రాజ్యాల్లోని నాయకులు, ప్రజలు కోటగోడలెక్కి మరీ ఆసక్తిగా చూస్తున్నారు. -
అధిష్టానంపై ‘గోరంట్ల’ తీవ్ర అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గోరంట్ల రాజీనా మా చేస్తున్నట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ సమాచారంపై మీడియా వద్ద స్పందించేం దుకు గోరంట్ల తొలుత నిరాకరించారు. సీని యర్ అయిన తనను పార్టీ అధిష్టానం అవ మానానికి గురిచేస్తోందనే ఆవేదనతో రాజమ హేంద్రవరంలో ఇంటికే పరిమిత మయ్యారు. విషయం తెలుసుకుని ఆ పార్టీ మరో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడి సర్దుబా టు చేస్తామని, గోరంట్ల రాజీనామా ప్రస్తావన రాలేదని, అసంతృప్తి మాత్రమేనని చిన రాజప్ప, జవహర్ ప్రకటించారు. అయినా.. అలక వీడని గోరంట్ల పార్టీలో తాను ఒంటరినని, చంద్రబాబును మాత్రం కలిసేది లేదని, నాయకులే కలుస్తారని స్పష్టంచేశారు. పార్టీ పదవులు, పీఏసీ చైర్మన్లో ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో చంద్రబాబుపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామాకు సిద్ధపడుతు న్నట్లు సమాచారం. దీనిపై గోరంట్ల స్పందిస్తూ.. రాజీనామా విషయంపై వారం, పది రోజుల్లో స్పష్టతనిస్తానని చెప్పారు. -
టీడీపీలో ‘గోరంట్ల’ కలకలం: చంద్రబాబును కలవనని ప్రకటన
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం కలకలం రేపింది. పార్టీలోని అంతర్గత వర్గ విభేదాలు ఆయన ప్రకటనతో ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయి. ఆయన త్వరలో టీడీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు గురువారం గుప్పుమన్నాయి. పార్టీలో సీనియర్ అయిన బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను చంద్రబాబును కలవను. నేను ఒంటరివాడిని. చంద్రబాబును నా వద్దకు వచ్చిన నాయకులు వెళ్లి కలుస్తారు. పార్టీ మనుగడ కోసమే ఇదంతా చేస్తున్నా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగా మీకే చెబుతా. పార్టీ నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యం’ అని తెలిపారు. ఇటీవల తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై విచారం వ్యక్తం చేశారు. చదవండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం -
టీడీపీ నాయకత్వంపై బుచ్చయ్య చౌదరి అసంతృప్తి
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీలో అంతర్గత వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేనే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం పై విచారం వ్యక్తం చేశారు. కాగా, గత మార్చి నెలలో పార్టీ నాయకత్వ మార్పుపై బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మరొకసారి టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో టీడీపీ నేతలు సతమతమవుతున్నారు.ఒకవైపు పలు ఎన్నికల్లో టీడీపీ చవిచూసిన ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏం చేయాల్లో తెలియని డైలమాలో ఉన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: వరుసగా ఎదురవుతున్న ఘోర పరాజయాల నేపథ్యంలో టీడీపీ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏంచేయాల్లో తెలియక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. పార్టీ బలహీనపడిన నేపథ్యంలో కొంతకాలంగా టీడీపీలో నాయకత్వ మార్పుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. తాజాగా పార్టీ నాయకత్వ మారుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందంటూ ఆయన చేసిన కీలక వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ పీఏ అరెస్ట్
తూర్పు గోదావరి: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు బుధవారం శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే ఘటనలో పోలీసులు మొదట టీడీపీ నేత బాబుఖాన్ చౌదరిని అరెస్టు చేశారు. కానీ ఈ అంశంలో బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవ్వగా అప్పటినుంచి అతను పరారీలో ఉన్నాడు. తాజాగా పరారీలో ఉన్న సందీప్ శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు సందీప్‌కు రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఆ పోస్టు పెట్టించింది నేనే: గోరంట్ల
సాక్షి, రాజమహేంద్రవరం : వెంకటగిరిలో వినాయక విగ్రహానికి మలినం పూసిన ఘటనపై మత విద్వేషాలకు తావు లేకుండా చూడాలని చెప్పి, తన పీఏతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టించానని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. అయితే దాన్ని నేరంగా భావించి అతడిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐ, ఎస్పీలకు ఫోన్ చేసి, నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గోర్లంట పీఏ చిటికన సందీప్‌ను పోలీసులు మంగళవారం శ్రీశైలంలో అరెస్ట్ చేశారు. బొమ్మూరు స్టేషన్‌కు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు చదవండి: శ్రీరాం.. నీ బండారం బయటపెడతా! -
పార్లమెంట్లో గళమెత్తిన గోరంట్ల మాధవ్
సాక్షి, అనంతపురం: ‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా...అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న కరువు, రైతుల దుస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంగ్లిషులో ప్రసంగించారు. తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు ఎంతో గౌరవింపబడుతున్న ఈ దేశంలో తీవ్ర కరువుతో పూటగడవక కొందరు వ్యభిచార గృహాలకు తరలిపోతుండగా...మరికొందరు ఉపాధి కోసం కుటుంబాలను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు..?. ఢిల్లీకి కూత వేటు దూరంలోనే వ్యభిచార గృహాలు నడుస్తున్నాయన్నారు. మరోవైపు బడికి వెళ్లాల్సిన పసి పిల్లలు రోడ్లుపై తిరుగుతూ కనిపిస్తున్నారన్నారు. నిర్బంధ ఉచిత విద్య చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. లేదంటే పిల్లలు భవిష్యత్తులో జాతికి బరువుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు, టెర్రరిస్టులుగా మారితే ఆరోజు వారిని అదుపు చేసేందుకు రూ.వంద ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అదే నేడు రూ.10 ఖర్చు చేసి బడిలో చేర్పిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. -
గోరంట్ల బుచ్చయ్య వర్సెస్ సోము వీర్రాజు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏం మాట్లాడుతున్నవాంటే ఏం మాట్లాడుతున్నావని వాదించుకున్నారు. వైఎస్ఆర్ హయాంలో మంజూరైన ఇళ్లను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పూర్తి చేయలేదని సోము వీర్రాజు అనగానే బుచ్చయ్య చౌదరి ఆవేశంతో ఊగిపోయారు. మిగిలిన సభ్యులు, మంత్రులు వీరిని శాంతింపజేశారు. -
అర్హులందరికీ నవరత్నాలు
సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, అర్హులందరికీ నవరత్నాలను అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. శనివారం ఆయన జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాక్షి, అనంతపురం అర్బన్: ‘జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి. సుపరిపాలన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత సంక్షేమ పాలన అందించే దిశగా ముందుకెళుతోంది. ‘నవరత్నాల’ ఫలాలు అర్హులైన ప్రతి పేదవానికి అందాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేసి ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిద్దాం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధ్యక్షతన తొలిసారిగా జిల్లా అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, కరువుతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఈ నేపథ్యంలో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా రైతులకు రూ.1,007 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఈ క్రమంలోనే రైతులను ఆదుకునేందుకు 2014 నుంచి వారికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.2,000 కోట్లు ఇచ్చేందుకు తొలి కేబినెట్లోనే ఆమోదం తెలిపారన్నారు. ఇందులో జిల్లా రైతులకు రూ.1,007 కోట్లు అందనుందని తెలిపారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మఒడి ద్వారా రూ.15 వేలు, రైతు భరోసా ద్వారా పేద రైతులకు పెట్టుబడికి ఏటా రూ.12,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పకృతి వైపరిత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో పకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ప్రతి పేదవానికి ఇల్లు, వృద్ధులకు దశలవారీగా పింఛన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్ అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, నిత్యావసరాలను ఇంటికే చేర్చడం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి), సీపీఎస్ రద్దు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనం, రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లాంటి కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్నారని గుర్తు చేశారు. తాగునీరు, వ్యవసాయం, విత్తన పంపిణీ, ఉద్యన పంటలు, తదితర అంశాలపై సమీక్షించారు.సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్, ఎమ్మెలేలు వై.వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉరవకొండలో నీటి ఎద్దడి ఉరవకొండ పట్టణంలో తొమ్మిది రోజులుగా నీటి సరఫరా లేదు. నిర్వహణ లోపం కారణంగా ఈ సమస్య వచ్చింది. వారంలోగా సమస్య పరిష్కరించాలి. పంటల బీమాలో మార్పు తేవాలి. వాతావరణ బీమా వల్ల రైతుకు ప్రయోజనం కలగడం లేదు. గ్రామం యూనిట్‌గా బీమా వర్తించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి. – పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే ఎస్కేయూలో నీటి ఎద్దడి పరిష్కరించాలి శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలి. నగర పాలక సంస్థలో ఉపాధ్యాయులకు సంబంధించి రూ.36 లక్షలు దుర్వినియోగమయ్యాయి. విచారణ చేసి వారి ఖాతాల్లో జమ చేయాలి. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు కొన్ని పాఠశాల్లో నీటి సమస్య ఉంది. అలాంటి చోట ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. – కత్తినరసింహారెడ్డి, ఎమ్మెల్సీ రిజర్వాయర్‌తో శాశ్వత పరిష్కారం నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జీడిపల్లి, పీఏబీఆర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఆత్మకూరు మండల కేంద్రానికి నీటిని ఇవ్వవచ్చు. పీఏబీఆర్ పైన్లైన్ ద్వారా కక్కలపల్లి, నారాయణపురం, రాజీవ్‌కాలనీ, ఇలా మరికొన్ని పంచాయతీలకు నీటిని ఇవ్వడం ద్వారా ఎద్దడి నివారించవచ్చు. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు జరగాలి. ప్రత్యేకంగా బెంగుళూరు, తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలను ఒక చోటకు చేర్చి సదస్సు నిర్వహించాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఆ దిశగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. బుక్కపట్నం, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ ఉండేలా చూడాలి. ఇందుకు స్లూయిజ్ గేట్లు ఏర్పాటు చేయాలి. – దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే జేసీ నాగిరెడ్డి పథకం పూర్తి చేయాలి తాడిపత్రిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. పెన్నా, చిత్రావతిలో ఇసుక తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇసుకు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా జేసీ నాగిరెడ్డి పథకాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే తాగునీటి ఎద్దడి అధికం మా నియోజకర్గలోని 120 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీరు ఇవ్వకుండా తుమ్మలూరుకు తీసుకెళ్లడం ఏమిటి. శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలి. రోడ్డు విస్తరణలో భాగంగా బాలికల పాఠశాల కూల్చేశారు. – డాక్టర్ తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే నీటి సమస్య తీవ్రంగా ఉంది మా నియోజకవర్గం పరిధిలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. సత్యసాయి పైప్‌లైన్–2 ద్వారా నీటిని అందించాలి. సీపీడబ్లూ స్కీమ్ ద్వారా ట్యాంక్‌లు నింపాలి. నీటి ఎద్దడి అధికంగా ఉన్న గ్రామాల్లో తక్షణం నీరు సరఫరా చేయాలి. తీవ్ర వర్షాభావంతో మామిడి చెట్లు ఎండిపోతున్నాయి. – డాక్టర్ సిద్ధారెడ్డి, కదిరి ఎమ్మెల్యే శాశ్వత చర్యలు చేపట్టాలి జిల్లావ్యాప్తంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలి. శింగనమల చెరువు చాలా పెద్దది. పైనున్న వారు నీటిని తమ ప్రాంతాలకు మళ్లిస్తుండడంతో ఈ చెరువుకు నీరు రావడం లేదు. ఈసారి తప్పకుండా చెరువు నింపాలి. బీసీ హాస్టల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. – శమంతకమణి, ఎమ్మెల్సీ -
‘ఓటమిపై టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి’
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ పార్టీ! ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ కొంప ముంచిందా..? నేల విడిచి సాము చేశామా..? అనే విషయాలను విశ్లేషించుకోవాలని తెలిపారు. తాను గతంలోనే పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశానన్నారు. కానీ అప్పుడు తన మాటలు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులాల ప్రస్తావన వచ్చిందని, ఇదేమన్నా దెబ్బ తీసిందా..? అనే అంశంపైనా విశ్లేషిస్తామన్నారు. పార్టీ బాగు కోసం సూచనలు చేస్తామన్నారు. చంద్రబాబునాయుడే టీడీఎల్పీ నేతగా ఉండాలని కోరారు. చంద్రబాబు ముందుంటేనే తమకు ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబును ఇంటికొచ్చి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై ఆలోచిస్తామన్నారు. -
గోరంట్ల మాధవ్‌కు అక్కడ కూడా ఫ్యాన్స్!
దొడ్డబళ్లాపురం : సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా అఖండ విజయం సాధించిన గోరంట్ల మాధవ్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ నీరాజనాలు పడుతున్నారు. గెలిచినా ఎటువంటి భేషజాలకు పోకుండా ఆచితూచి ఆయన చెబుతున్న మాటలు కూడా చాలామందికి నచ్చుతున్నాయి. ఇప్పటికే గోరంట్ల మాధవ్ గురించి కన్నడ పత్రికలు, మీడియా కూడా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఆయన గెలుపు ఒక ఎత్తయితే.. గెలిచిన తరువాత పై అధికారులకు సెల్యూట్ చేసిన ఫోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గెలుపంటే ఇదీ...గొప్ప వ్యక్తి...గొప్పవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు’ అంటూ ప్రశంసిస్తున్నారు. -
అది తప్పు.. సెల్యూట్ నేనే చేశా: గోరంట్ల మాధవ్
సాక్షి, అమరావతి : పోలీస్ ఉన్నతాధికారులు తనకు సెల్యూట్ చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. తానే తన ఉన్నతాధికారులకు సెల్యూట్ చేశానన్నారు. శనివారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యతను ఉంచారు. మన దరిద్రం పోవాలంటే ప్రత్యేక హోదా రావాలని, ఎంపీలంతా ఏకతాటిపై ఉండి పోరాడాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టమెంటరీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. మిగతా పార్టీల ఎంపీలను కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు. నియోజకవర్గాలకు వెళ్లి ప్రజా సమస్యలను అధ్యయనం చేయమని ఆదేశించారు. మా ఎంపీలమంతా ప్రత్యేక హోదానే ఎజెండాగా ముందుకుసాగుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్.. సార్ నేనిక్కడ కూలీకి వెళ్లాను.. అలాంటి నన్ను ఎంపీనీ చేశారు అంటూ కన్నీటి పర్యంతమవుతూ వైఎస్ జగన్‌కు కృతజ్ఙతలు తెలుపుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంట్‌కు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది’ అని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. పోలీస్ శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తన పదవికి రాజీనామా చేసి హిందూపురం లోక్‌సభ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలిచిన ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు సెల్యూట్ చేశారని ఓ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఆ ఫొటోలో ఉన్నతాధికారులకు తానే మొదట సెల్యూట్ చేసినట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు. -
వైఎస్ జగన్ వేవ్ వల్లే మేమంతా గెలిచాం
-
టీడీపీ కంచుకోట బద్దలు!
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. ఆ పార్టీకి ఎదురులేని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విజయకేతనం ఎగురవేశాడు. ఏకంగా 1.38 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించాడు. గురువారం స్థానిక ఎస్కేయూ క్యాంపస్‌లో కౌంటింగ్ ప్రక్రియ సాగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తూనే మరోవైపు ఈవీఎంలను లెక్కించారు. మొత్తం 25 రౌండ్లు సాగిన కౌంటింగ్ తొలిరౌండ్ నుంచే గోరంట్ల మాధవ్ తన సమీప అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై స్పష్టమైన మెజార్టీ కనబరిచాడు. నిమ్మల కిష్టప్ప ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. తొలిరౌండులో 9184 ఓట్ల ఆధిక్యంతో గోరంట్ల మాధవ్ బోణీ చేశాడు. అప్పటి నుంచి తిరిగిచూడలేదు. మొత్తం 25 రౌండ్లు కౌంటింగ్ జరగగా టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 17వ రౌండులో 1090 ఓట్లు, 24వ రౌండులో 225 ఓట్లు ఆధిక్యత సాధించాడు. తక్కిన 23 రౌండ్లు వైఎస్సార్సీపీ ఆధిక్యత చాటింది. మొత్తం 13,23,991 ఈవీఎం ఓట్లు పోలయ్యాయి. వీటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి 6,98,422 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థికి 5,60,113 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేటీ శ్రీధర్ 26,934 ఓట్లు సాధించాడు. ఇక నాల్గోస్థానంలో ‘నోటా’కు 17,320 ఓట్లు వచ్చాయి. అలాగే భారతీయ జనతాపార్టీ అభ్యర్థి మిట్టా పార్థసారథి 13,485 ఓట్లు సాధించాడు. ఇతరులు 7717 ఓట్లు దక్కించుకున్నారు. గోరంట్ల మాధవ్ రౌండు రౌండుకు మెజార్టీ పెరుగుతుండడంతో పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం ఆవరణలోనే ఆయన్ను హత్తుకుని గంతులేశారు. మెజార్టీపై చర్చ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ సాధిచిన మెజార్టీపై నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల ప్రజల్లో విపరీతమైన చర్చ జరిగింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రమంతా వైఎస్సార్ గాలి వీచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ హిందూపురం ఎంపీగా బరిలో నిలిచిన కర్నల్ నిజాముద్దీన్ కేవలం 1840 ఓట్లతో గట్టెక్కాడు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీ తరపున ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన గోరంట్ల మాధవ్ ఏకంగా 1,38,309 ఓట్లు మెజార్టీ సాధించడం చర్చనీయాంశమైంది. సామాన్యుడిని బరిలో దింపి.. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎవరూ ఊహించిన విధంగా వైఎస్సార్సీపీ సామాన్యుడైన మాధవ్‌ను బరిలో దింపింది. పోలీసుశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. కురుబ కులానికి చెందిన మాధవ్‌ను పోటీలో పెట్టడంతో అధికార పార్టీ నాయకులు హేళన చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకుడైన నిమ్మల కిష్టప్ప విజయం నల్లేరుమీద నడకే అని అధికార పార్టీ భావించింది. అయితే వారి అంచనాలు పటాపంచలు చేస్తూ మాధవ్ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. -
‘అతి సామాన్య’ విజయం..!
సాక్షి, అమరావతి: నాయకులకు జనం కష్టసుఖాలు తెలిసుండాలనేది వైఎస్సార్సీపీ అభిమతం. ఈ నేపథ్యమున్న ఏ నాయకుడికైనా ప్రజలు బ్రహ్మరథం పడతారన్న పార్టీ అధినేత నమ్మకం అక్షరాల రుజువైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అతి సామాన్యులు రాజకీయ దిగ్గజాలను ఢీ కొట్టారు. అంగ, అర్థ బలం ఉన్నవారిని సైతం అతి సామాన్య అభ్యర్థులు మట్టి కరిపించారు. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన తలారి రంగయ్య ఓ ప్రభుత్వోద్యోగి. డీఆర్డీఏలో పీడీగా పనిచేశారు. బీసీలకు పెద్దపీట వేయాలన్న వైఎస్ జగన్ ఆశయంతో ఉత్తేజితుడై ఎన్నికల్లోకొచ్చారు. టీడీపీ నేత జేసీ తనయుడు పవన్‌ను ఓడించారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నందిగం సురేష్ ఓ సాధారణ కార్యకర్త. టీడీపీ సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రిని ఈ ఎన్నికల్లో ఓడించారు. అరకు ఎంపీగా పోటీ చేసిన గొడ్డేటి మాధవి ఓ సాధారణ గిరిజన మహిళ. ప్రత్యర్థిగా బరిలో ఉన్న కిశోర్ చంద్రదేవ్ రాజవంశీకుడు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. అయినా మాధవి ప్రజాభిమానం పొందింది. హిందూపురం ఎంపీగా వైఎస్సార్సీపీ తరఫున నిలిచిన గోరంట్ల మాధవ్ పోలీసు ఉద్యోగి. ప్రజాసేవ ద్వారానే ఫ్యాక్షన్ మూలాలు పెకిలించాలని భావించిన మాధవ్.. హిందూపురంలో ప్రత్యర్థి నిమ్మల కిష్టప్పను మట్టి కరిపించారు. చిత్తూరు పార్లమెంట్ స్థానం వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన రెడ్డప్ప సైతం ఓ సాధారణ కార్యకర్తే. ఆయన ఎన్ శివప్రసాద్‌పై గెలుపొందారు. ఎచ్చెర్లలో సాధారణ కార్యకర్త గొర్లె కిరణ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావును ఓడించారు. పలాసలో ఓ సాధారణ వైద్యుడు అప్పలరాజు అధికార పార్టీ అభ్యర్థిని చిత్తు చేశారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో టీడీపీ కంచుకోటను రాజకీయాలకే కొత్త అయిన వైసీపీ అభ్యర్థి కలిదిండి శ్రీనివాస్ బద్దలు కొట్టారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కోళ్ల అప్పలనాయుడు ఏడుసార్లు, ఆయన కోడలు లలితకుమారి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ చరిత్రను శ్రీనివాస్ తిరగరాశారు. వైఎస్సార్సీపీలో సామాన్య నేతలైన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అభ్యర్థి ముప్పిడి వెంకట్రావ్, కృష్ణా జిల్లా పామర్రు అభ్యర్థి కైలే అనిల్‌కుమార్ ఘనమైన విజయం సాధించారు. కర్నూల్ జిల్లా నందికొట్కూర్‌లో మాజీ పోలీసు ఉద్యోగి ఆర్థర్ అధికార పార్టీని మట్టి కరిపించారు. ఇక రాజకీయ అనుభవం లేని అబ్బయ్య చౌదరి దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌పై గెలుపొందారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని గోరంట్లలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్తిపంపకాల విషయంలో గొడవపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి ఆస్తి పంపకంలో గొడవపడిన గోరంట్లకు చెందిన రామకృష్ణమ్మ, ఆమె కుమారుడు వేణుగోపాల్, సోదరులు మోహన్, సోమశేఖర్ మంగళవారం రాత్రి ఊరి చివర గల స్మశానం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం అటువైపుగా వెళ్లిన గ్రామస్తులు వారిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వీరిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మోహన్, సోమశేఖర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రామకృష్ణమ్మ, వేణుగోపాల్ ల పరిస్థితి విషమంగా ఉందనీ, మరో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరులో టీడీపీ నేత తనయుడి నిర్వాకం
సాక్షి, గుంటూరు: వారిద్దరూ బంధువులే. సాఫ్ట్వేర్ వ్యాపారాల్లో భాగస్వాములు కావడంతో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. అయితే వ్యాపార లావాదేవీల్లో తేడా రావడంతో పార్టనర్ కుటుంబ సభ్యులను సైతం కిడ్నాప్ చేయడానికి కూడా వెనకాడలేదు. గుంటూరుకు చెందిన ఓ టీడీపీ నేత తనయుడి నిర్వాకం ఇదీ. సమయానికి పోలీసులు రావడంతో బాధితులు సురక్షితంగా చెర నుంచి బయటపడ్డారు. వారం రోజులుగా నిర్బంధించి చిత్రహింసలు.. ఒంగోలుకు చెందిన తోట నిలయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. గుంటూరులోని గోరంట్లకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు యర్రంశెట్టి వేణుగోపాల్ కుమారుడు విజయ్‌తో కలిసి సాఫ్ట్వేర్ సంబంధిత వ్యాపారాలు చేస్తుంటాడు. నిలయ్, విజయ్ కుటుంబాలు బంధువులు కావడంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది. ఓ యూనివర్సిటీ పరిధిలో సాఫ్ట్వేర్ సంబంధిత ప్రాజెక్టులున్నట్లు ఒంగోలుకు చెందిన ఆర్ఎంపీ నాగేశ్వరరావు చెప్పటంతో ముగ్గురూ కలసి పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ ప్రాజెక్టులు బోగస్ అని తేలటంతో విజయ్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నిలయ్‌ని ఒత్తిడి చేశాడు. తాను కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేశానన్న నిలయ్ నెల రోజులపాటు అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో అతడి కోసం గాలించిన విజయ్ ఒంగోలులో ఉన్న నిలయ్‌తోపాటు భార్య అలేఖ్య, అత్త మామలను బలవంతంగా తరలించి గుంటూరు శివారులోని ఒక ఇంట్లో గత నెల 29వ తేదీ నుంచి నిర్బంధించాడు. వారం రోజులుగా గదిలో ఉంచి చిత్ర హింసలకు గురిచేశాడు. పసిగట్టిన స్థానికులు 100కి సమాచారం అందించటంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి బాధితులను కాపాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిండుగర్భిణి అని చూడకుండా వేధించారని అలేఖ్య పేర్కొంది. నిందితులు యర్రంశెట్టి వేణుగోపాల్, విజయ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. -
మీ కుమ్ములాటలే కొంపముంచుతున్నాయ్
సాక్షి, అమరావతి: పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు, కుమ్ములాటలే టీడీపీ కొంప ముంచుతున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేతల్లో అనైక్యతతోపాటు పోల్ మేనేజ్మెంట్లో వెనుకబడి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కూడగట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఇక్కడ మైకులు పట్టుకుని ఏవేవో మాట్లాడుతున్నారని శనివారం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధి నేతలతో నిర్వహించిన ఎన్నికల సమీక్ష సమావేశంలో మండిపడ్డారు. ‘అధికారంలోకి రావాల్సిన మనం మీ అహం, మీ తీరుతో ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. మీరంతా సమష్టిగా వ్యవహరించకుండా ఇక్కడకు వచ్చి మైకుల్లో ప్రసంగాలు ఇస్తే ప్రయోజనమేంటి? పార్టీలో మీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక, మీరు చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చా. మీరంతా కలిసి పనిచేస్తే ఈరోజు ఇలా గెలుపుపై ఆలోచించాల్సిన అవసరం వచ్చేది కాదు’అని పార్టీ నేతలతో చంద్రబాబు పేర్కొన్నారు. గోరంట్ల, ఆదిరెడ్డిపై ఆగ్రహం ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. బూత్ స్థాయిలో ఓట్లు వేయించలేని వారు రాష్ట్ర స్థాయి నేతలుగా చలామణి అయిపోతే ఎలా? అని నిలదీశారు. ఇలాంటి నాయకులను పెట్టుకుని నేనేం చేయాలి? అని ప్రశ్నించారు. -
గోరంట్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
-
రాజకీయాల్లో అరుదైన నేత వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం:‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో అత్యంత అరుదైన వ్యక్తి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింమైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉన్న నేత అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. జగనన్నలో ఓ అంబేడ్కర్, జ్యోతిరావ్‌పూలే, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి తదితర మహానుభావుల్లో ఉండే వ్యక్తిత్వాన్ని చూశానన్నారు. ఆయన చేసే ప్రజాసేవను స్ఫూర్తిగా తీసుకొని వైఎస్సార్సీపీని రాజకీయ వేదికగా ఎంచుకున్నానన్నారు. తనకు ఎంపీగా అవకాశమిస్తే పార్లమెంట్లో అట్టడుగు వర్గాల సమస్యలపై గళం విప్పుతానని అంటున్న గోరంట్ల మాధవ్ .. ‘సాక్షి’తో మరిన్ని విశేషాలు పం చుకున్నాడు. ఆయన మాటాల్లోనే... తాను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చా.. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడుతూ పెరిగా.. ఆ కసితోనే చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించా.. ఎస్ఐ, సీఐగా పనిచేసినంత కాలం బాధితుల పక్షాన నిలిచానని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్లో చేసిన సేవే ఇప్పుడు జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలు అక్కున చేర్చుకుంటున్నారు. మరింత సేవ చేయాలనే... ఉద్యోగిగా ప్రజాసేవ చేసేందుకు పరిధి చాలా తక్కువ ఉంటుంది. అదే రాజకీయంలోకొస్తే సేవలు విస్త్రతం చేయొచ్చు. ఎంపీగా అవకాశం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ఆలోచన విధానాన్ని రేపు పార్లమెంటులో ఆవిష్కరిస్తా. ఈ అవకాశం పోలీసుశాఖలో ఉంటే వస్తుందా?. యావత్తు దేశంలోని బీసీ, ఎస్సీ,ఎస్టీల ప్రతినిధిగా మాట్లాడొచ్చు. అందుకోసమే పోలీసు నుంచి రాజకీయాల్లోకొచ్చా. పూర్తిగా ప్రజల్లో మమేకమై ఉంటా. వందశాతం బాధితుల పక్షాన నిలబడే వ్యక్తిని. పక్కా నిజాయతీగా నిలిచే తత్వం. ఎన్నికలల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా బరిలో నిలబడ్డా. కష్టంగాని, నష్టంగాని నమ్మిన వ్యక్తికి అండగా నిలిచే వ్యక్తిని. ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తిని. బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు నామినేటెట్ పోస్టులు, పనుల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టబద్ధత చేస్తామని జగనన్న చెప్పడం చూస్తే దేశంలోనే బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో ఆ విధంగా ఆలోచించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిలో ఎంతో గొప్ప వ్యక్తిత్వముంది. జిల్లాలో జగన్మోహన్రెడ్డి సైని కుడిగా పని చేస్తానని చేరినరోజే చెప్పా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదరించి అక్కున చేర్చుకుని పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి వారికి ఎం పీగా పోటీ చేసే అవకాశం కల్పించడం నిజంగా అదృçష్టమే. జిల్లాలో బీసీలంతా జగన్‌కు రుణపడి ఉంటాం. రెండు సీట్లు గెలిచి అధినేతకు కానుకగా ఇస్తాం. -
ఫ్యాక్షన్‌ను రూపుమాపుతాం
సాక్షి, ఆత్మకూరు: పదేళ్ల పరిటాల కుటుంబ నియంత పాలనతో రాప్తాడు నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. దాడులు, గొడవలు సృష్టించే వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్సార్సీపీకి ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గంలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి అభివృద్ధికి బాట వేస్తాం’ అని వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం వేపచెర్ల, వేపచెర్ల ఎగువ తండా, దిగువ తండా గ్రామాల్లో బుధవారం వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోరంట్ల మాధవ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ – నీవా పిల్లకాలువల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. పరిటాల పాలనలో రాప్తాడు నియోజకవర్గం ఎటుంటి అభివృద్ధికీ నోచుకోలేదని, ప్రజలు పనులు లేక వలసలు వెళ్లారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి గ్రామాల్లో ఫ్యాక్షనిజం లేకుండా చే స్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 2.50 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేసి ఉచిత బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 8 చిన్న రిజర్వాయర్లను ఏర్పాటు చేసి పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందేలా చూస్తామని తెలియచేశారు. పీఏబీఆర్ కాలువ ద్వారా ప్రతి ఇంటికీ తాగు నీటిని అందజేస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమన్నారు. నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీల ద్రోహి చంద్రబాబు బీసీల ద్రోహి చంద్రబాబునాయుడు అని వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విమర్శించారు. బీసీల అభ్యున్నతికి జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బీసీ డిక్లరేషన్‌తో బీసీలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాప్తాడు నియోజకవర్గం సాగునీటితో సçస్యశ్యామలం కావాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
గోరంట్ల మాధవ్ నివాసంలో విషాదం
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ హిందుపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయనకు పితృ వియోగం కలిగింది. గోరంట్ల మాధవ్ తండ్రి కురుబ మాధవస్వామి(85) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కర్నూలు జిల్లా పి.రుద్రవరంలో మాధవస్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు మాధవ్ తండ్రి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. కాగా తీవ్ర ఉత్కంఠ నడుమ గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా, దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
పేరుకు సిక్.. రాజకీయ కిక్కు!
సాక్షి, అనంతపురం సెంట్రల్: తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆమోదించండి అని సీఐ గోరంట్ల మాధవ్ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. ఆమోదించకుండా ముప్పుతిప్పలు పెట్టారు. న్యాయపోరాటం చేయడంతో చివరకు వీఆర్ఎస్ను ఆమోదించారు. కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వలనే పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే అధికారపార్టీతో అంటకాగితే పోలీసు ఉన్నతాధికారుల తీరు మరోలా ఉంటుందనేందుకు ఈ కానిస్టేబులే నిదర్శనం. కానిస్టేబుల్ నరసింహమూర్తి. ఈ పేరు వింటే పోలీసుశాఖలో ఎవరైనా గుర్తుపడుతారు. ప్రస్తుతం అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్లో పోస్టింగ్ ఉంది. ఏనాడూ ఆయన మాత్రం స్టేషన్ మెట్లెక్కడు. నాలుగేళ్లుగా ఖాకీ వదిలి (అనధికారికంగా) ఖద్దరు తొడుక్కున్నాడు. అధికార టీడీపీతో అంటకాగుతుండడంతో అధికారులకు తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా డిపార్ట్మెంట్కు దూరంగా.. అధికారపార్టీకి దగ్గరగా ఉంటున్నాడు. కొద్దిరోజులు రావడం.. మళ్లీ సిక్లో వెళ్లిపోవడం జరుగుతోంది. ఓ వైపు ఉద్యోగం కాపాడుకుంటూనే మరో వైపు రాజకీయాల్లో రాణిస్తున్నాడు. అంతేకాదండోయ్ ఇటీవల హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందేందుకు కూడా అర్హత సాధించాడు. ఇటీవల శిక్షణ తీసుకొని వచ్చి మళ్లీ సిక్లో వెళ్లిపోయాడు. తాజాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే రహస్యంగా కాదు. బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడం గమనార్హం. తాజాగా గురువారం పుట్టపర్తిలో సీఎం చంద్రబాబునాయుడును కలవడం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అదనపు ఎస్పీ చౌడేశ్వరిని వివరణ కోరగా సిక్లో ఉన్న ఉద్యోగులు రాజకీయపార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. -
గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం
-
గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం
సాక్షి, అనంతపురం: హిందూపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మాధవ్ నామినేషన్‌ను మంగళవారం ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. సోమవారం హిందూపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీలను కూడా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన భార్య సునీతతో కూడా నామినేషన్ దాఖలు చేయించారు. ఈ రోజు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు మాధవ్ నామినేషన్‌ను ఆమోదించినట్టు ప్రకటించారు. అలాగే అనంతపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్‌కు కూడా ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. -
బీసీలంటే బాబుకు పడదంతే..!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు బీసీలకు బద్ధ వ్యతిరేకని మరోసారి రుజువైంది. అంతేకాదు బీసీలను ప్రతిపక్ష పార్టీ ప్రోత్సహించినా సహించరని స్పష్టమయ్యింది. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ ఉదంతం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ పెట్టుకున్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) దరఖాస్తును, ఆ దరఖాస్తును ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా మొండికేయడం, చంద్రబాబుకు బీసీలంటే ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. మాధవ్ వారం పది రోజులుగా ఎక్కిన గడప ఎక్కకుండా తిరుగుతున్నా చంద్రబాబు మనసు కరగలేదు. పైగా ట్రిబ్యునల్ తీర్పుతో విభేదిస్తూ హైకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ బాబుకు చుక్కెదురయ్యింది. ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తనకు అనుంగు శిష్యుని మాదిరి వ్యవహరించిన ఏపీ ఎన్జీవోల సంఘం నేత అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఆఘమేఘాల మీద కేసులన్నింటినీ పరిష్కరించిన చంద్రబాబు.. గోరంట్ల మాధవ్‌ను ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. వాస్తవానికి మాధవ్ చాలా కాలం కిందటే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఆయన వీఆర్ఎస్ను ఆమోదించకుండా కర్నూలు డీఐజీ నాగేంద్ర కుమార్ తొక్కిపట్టి తప్పించుకుతిరగడం అంతా సీఎం ఆదేశాల మేరకే జరుగుతోందనే విమర్శలు వచ్చాయి. వీఆర్ఎస్ను ఆమోదింపజేసుకోవడానికి ఓ బీసీ అభ్యర్థి పడిన కష్టం చూస్తుంటే ఆ వర్గాల పట్ల చంద్రబాబు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తారో మరోసారి రుజువైందని బీసీ సంఘాలు పేర్కొన్నాయి. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అంతే చంద్రబాబు ఎప్పుడూ బీసీ వర్గాల వ్యతిరేకేనని పలువురు బీసీ సంక్షేమ సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. గతంలో బాబు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. హైకోర్టు జడ్జీలుగా ఇద్దరు బీసీ న్యాయవాదులను కొలీజియం సిఫారసు చేస్తే వారు ఆ పదవికి అర్హులు కాదంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. బడుగు, బలహీనవర్గాల కోసమే తమ పార్టీ పుట్టిందని, తమకు ఆ వర్గాలే వెన్నెముక అంటూ చంద్రబాబు ఉత్తుత్తి కబుర్లు చెబుతారని, కానీ ఆయన మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుందని బీసీ నేతలు చెబుతున్నారు. తమకు న్యాయం చేయమని అడగడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులను ’ఏయ్, నోర్మూయ్, తాట తీస్తా’ అంటూ అహంకార పూరితంగా బెదిరించారని గుర్తుచేశారు. కాపుల్ని బీసీలలో, బోయల్ని ఎస్టీలలో, రజకుల్ని ఎస్సీలలో చేరుస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శిస్తున్నారు. -
న్యాయమే గెలిచింది
సాక్షి, అనంతపురం సెంట్రల్: ధర్మం నిలిచింది...టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా న్యాయం గెలిచింది. కోర్టు మొట్టికాయలతో మేల్కొన్న కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్ర కుమార్ సీఐ గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్(స్వచ్ఛంద పదవీ విరమణ) ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా గోరంట్ల మాదవ్ బరిలో నిలిచేందుకు మార్గం సుగమమైంది. అడుగడుగునా అడ్డంకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన సీఐ గోరంట్లమాధవ్ కొన్ని నెలల క్రితమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వీఆర్ఎస్ ప్రకటించిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలోకి చేరారు. ఈ క్రమంలోనే వై?ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గోరంట్ల మాధవ్‌ను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో జిల్లాలోని టీడీపీ నాయకుల్లో కలవరం మొదలైంది. సీఐగా ఉంటూ విధి నిర్వహణలోనే అధికారపార్టీ నేతల ఆగడాలను ఎదురించిన వ్యక్తి.. రాజకీయాల్లో పోటీకి వస్తే తమకు పరాభవం తప్పదని కుట్రలు, కుయుక్తులకు తెరలేపారు. ముఖ్యంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, మంత్రి పరిటాల సునీతలు పథకం ప్రకారం మాధవ్ వీఆర్ఎస్ ఆమోదించకుండా ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వీఆర్ఎస్ ఆమోదించాలని మాధవ్... జిల్లా ఎస్పీ, డీఐజీ, డీజీపీలకు ధరఖాస్తులు చేసుకున్నా... పెండింగ్‌లో పెట్టారు. దీంతో గోరంట్ల మాధవ్ మాత్రం న్యాయపోరాటానికి దిగారు. తన వీఆర్ఎస్ ఎందుకు ఆమోదించకుండా అడ్డుపడుతున్నారని ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో సీఐ గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాల్సి వచ్చింది. సీఐ మాధవ్ విషయంలో సీఎం చంద్రబాబు, జిల్లా టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు.. నీచ రాజకీయాలు మానుకో: మాధవ్ వీఆర్ఎస్లో వెళ్లనీయకుండా అడ్డుపడిన సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన వైఎస్సార్ సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. న్యాయంగా పోరాడాలి, ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలే తప్ప.. నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన తనకు వైఎస్సార్సీపీ ఎంపీ టికెట్ ఇస్తే... ప్రజాక్షేత్రంలో పోటీ ఎదుర్కోలేని టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారన్నారు. రెండు దశాబ్దాలుగా పోలీసు శాఖలో తాను పనిచేసినా...కేవలం ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కూడా తనను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన వ్యవహారంలో ఇలా వ్యవహరించరన్నారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమాన్ని కోరుకునే వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలపాలని కోరారు. -
గోరంట్లకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే వీఆర్ఎస్ కింద తనను రిలీవ్ చేయాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్ 28న తాను పెట్టుకున్న దరఖాస్తుపై ఎటువంటి నిర్ణయం వెలువరించకుండా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ గోరంట్ల మాధవ్ ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఏపీఏటీ విచారణ జరుపుతుండగానే, మాధవ్ వీఆర్ఎస్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. దీనిని సవాలు చేస్తూ మాధవ్ ట్రిబ్యునల్‌లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ గోవిందరాజులు వెంటనే మాధవ్‌ను రిలీవ్ చేయాలని కర్నూలు డీఐజీని ఆదేశించారు. మాధవ్ పెట్టుకున్న వీఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. వెంటనే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కర్నూలు డీఐజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ సీతారామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయడం ఇప్పుడు సాధ్యం కాదంది. అయితే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తు ఆమోదం, నామినేషన్ దాఖలుకు వీలుగా సర్వీసు నుంచి అతన్ని రిలీవ్ చేయడం.. ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా, మాధవ్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వీఆర్ఎస్ను ఆమోదించిన డీఐజీ ట్రిబ్యునల్ చెప్పినా పట్టించుకోని పోలీసు బాసులు హైకోర్టు తాజా తీర్పుతో ఆగమేఘాలపై స్పందించారు. ఎట్టకేలకు డీఐజీ కాంతిరాణ తాతా మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించారు. ఎంపీగా గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తా: మాధవ్ హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించిన జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని గోరంట్ల మాధవ్ అన్నారు. సోమవారం ఆయన హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం మాధవ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీ స్థానాన్ని జగన్‌కు కానుకగా ఇస్తానని చెప్పారు. -
‘చంద్రబాబు మోసాలపై బీసీలు అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన నామినేషన్ అడ్డుకోవాలని కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. టీడీపీ నేతలు తన వీఆర్ఎస్ ఆమోదానికి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. వెనుకబడిన వర్గాల రాజకీయ ఎదుగుదలను సీఎం చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సామాన్యుడైన తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ వల్లే బీసీల అభ్యున్నతి సాధ్యమని అన్నారు. చంద్రబాబు మోసాలపై బీసీలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, రాజకీయాల్లోకి చేరే ఉద్దేశంతో మాధవ్ వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నారు. మాధవ్ వైఎస్సార్సీపీలో చేరడంతో ఆయన వీఆర్ఎస్ ఆమోదం పొందకుండా ఏపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్ కూడా పేర్కొంది. కానీ ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులుగా గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవిత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్ధిగా గోరంట్ల నామినేషన్
-
హైకోర్టులో టీడీపీకి షాక్.. గోరంట్లకు ఊరట
-
టీడీపీకి చెంపపెట్టు.. గోరంట్లకు ఊరట
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టేపిటిషన్‌ను నిరాకరించిన హైకోర్టు గోరంట్ల నామినేషన్‌కు అనుమతి ఇచ్చింది. రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే గోరంట్ల వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీనిపై ట్రిబ్యునల్ తీర్పును వెలువరిస్తూ తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్ఎస్ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ట్రిబ్యునల్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టేపిటిషన్ వేసింది. కానీ హైకోర్టు ఆ పిటిషన్‌ను నిరాకరిస్తూ ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది. దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయింది. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులుగా గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవిత ఈ రోజు (సోమవారం) నామినేషన్ దాఖలు చేశారు. (గోరంట్ల మాధవ్‌కు లైన్‌క్లియర్) -
నా నామినేషన్ తిరస్కరిస్తే నా భార్య పోటిలో..
అనంతపురం: ‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లీడర్ కాదు... మేనేజర్. ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కొనే ధైర్యంలేక వీఆర్ఎస్ను ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని వెఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2018 డిసెంబరు 18న నేను రాజీనామా చేశా. 2019 జనవరి 9 నుంచి వీఆర్ఎస్లో వెళ్లిపోతానని, తన రాజీనామా ఆమోదించాలంటూ అందులో స్పష్టంగా చెప్పా. రాజీనామా లేఖ జిల్లా ఎస్పీ నుంచి కర్నూలు డీఐజీ అక్కడి నుంచి డీజీపీకి వెళ్లింది. వెంటనే రిలీవ్ చేయాలంటూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటిలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరావు ఒత్తిళ్ల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా కర్నూలు డీఐజీ తొక్కి పెడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. తనకు చేస్తున్న అన్యాయంపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించా. పరిశీలించిన ట్రిబ్యునల్ వెంటనే వీఆర్ఎస్ను ఆమోదించి నామినేషన్ దాఖలు చేసేందుకు అడ్డంకులు లేకుండా చూడాలంటూ డీఐజీకి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి డీఐజీ అందుబాటులో లేరు. దీనిపై మళ్లీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశా. స్పందించిన ఆయన ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గోరంట్ల మాధవ్‌ను రిలీవ్ చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు. అయినా ఇప్పటిదాకా ఆయన స్పందించలేదు. ప్రభుత్వం నాపట్ల కక్ష సాధిస్తోంది. ఇన్నిరోజులూ చంద్రబాబు బీసీల ముసుగు వేసుకుని మభ్యపెడుతూ వచ్చారు. వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ టిక్కెట్ నాకు ఇచ్చిన తర్వాత టీడీపీకి ఓటమి తప్పదని వివిధ సర్వేల్లో తేలడంతో నన్ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం. బీసీల పక్షపాతినని, బీసీ నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తామరి చెప్పుకొనే చంద్రబాబు ముసుగు ఈ రోజు తొలగిపోయింది. అసలు రంగు బయపడింది. ఓటమికి చేరువలో ఉన్న చంద్రబాబుకు భయం పట్టుకుంది. వందశాతం ఓడిపోతామనే విషయం ఆయనకూ తెలుసు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేక సమస్యలు సృష్టిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు గమనించాలి’ అన్నారు. నేడు నామినేషన్ దాఖలు తన వద్ద ఉన్న ఉత్తర్వులతో సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్నానని, తన భార్య కూడా నామినేషన్ దాఖలు చేస్తోందని గోరంట్ల మాధవ్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల తన నామినేషన్ తిరస్కరణకు గురైతే తన భార్య పోటీలో ఉంటారని చెప్పారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. -
చంద్రబాబు తాచుపాముకంటే ప్రమాదకరం: గోరంట్ల
-
అందుకే నా భార్యతో నామినేషన్ వేయిస్తా : గోరంట్ల
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హిందూపురం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మూడు నెలల కిందట పోలీసు ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చినా ఆమోదించడంలేదని మండిపడ్డారు. ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్ రావు, కర్నూలు డీఐజీ చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నారన్నారు. హిందూపురంలో గెలుస్తానని భావించే తనపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రేపు(సోమవారం) హిందూపురం లోక్‌సభ స్థానానికి తాను, తన భార్య ఇద్దరం కలిసి నామినేషన్ వేస్తామని చెప్పారు. తన నామినేషన్ ఆమోందిచకపోతే తన భార్య పోటీ చేస్తుందని పేర్కొన్నారు. సంబంధిత కథనాలు పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల మాధవ్ రిలీవ్‌పై డీజీపీకి ఈసీ లేఖ -
మాధవ్ రిలీవ్‌పై డీజీపీకి ఈసీ లేఖ
సాక్షి, అమరావతి/అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించి వెంటనే రిలీవ్ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం డీజీపీకి లేఖ రాశారు. రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో వీఆర్ఎస్ను ఆమోదించడంలేదని మూడు రోజుల కిందట గోరంట్ల మాధవ్ ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ట్రిబ్యునల్.. గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను వెంటనే ఆమోదించి నామినేషన్‌కు అడ్డంకులు లేకుండా రిలీవ్ చేయాలంటూ కర్నూలు డీఐజీని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ, రెండ్రోజుల నుంచి కర్నూలు డీఐజీ నాగేంద్రకుమార్ అందుబాటులో ఉండడంలేదు. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గోరంట్ల మాధవ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయ కుట్రతోనే తన వీఆర్ఎస్ ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, లేని కేసులు ఉన్నట్లు చూపించి పెండింగ్ పెట్టారని.. దీనిపై ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని మాధవ్ ఎన్నికల అధికారికి వివరించారు. దీనిపై స్పందించిన ద్వివేది.. మాధవ్‌ను వెంటనే రిలీవ్‌చేసి నామినేషన్ దాఖలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని డీజీపీ ఠాగూర్‌కు లేఖ రాశారు. (ఖాకీలే శత్రువులు !) సీఎం ఒత్తిడి మేరకే ఆ ఇద్దరి కుట్ర కాగా, తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అడ్డదారుల్లో ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. తన వీఆర్ఎస్ ఆమోదం విషయంలో స్వయానా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఒత్తిడి మేరకే ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అధికారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డీజీపీని కలుస్తానన్నారు. -
ఖాకీలే శత్రువులు !
సాక్షి, అనంతపురం : ‘గోరంట్ల మాధవ్.. ఇతను ఓ ప్రత్యేక పోలీసు.. ఎస్ఐగా ఉన్నపుడు ‘శివమణి’.. సీఐగా అయ్యాక ‘గబ్బర్‌సింగ్’... ‘అనంత’ వాసులు పెట్టిన ముద్దు పేర్లు ఇవి. సినిమా పేర్లలాగే ఇతని విధినిర్వహణ కూడా సినిమాటిక్‌గా ఉంటుంది. సర్కిల్‌తో పనిలేదు. వ్యక్తులస్థాయితో అసలు సంబంధం లేదు. మాధవ్ మనసుకు ఏది మంచి అనిపిస్తే అదే మంచి. చెడు అనిపిస్తే అదే చెడు. ఇదే అతనికి తెలిసిన ‘లా అండ్ ఆర్డర్’. మాధవ్ తీరు నచ్చి అతనికి అభిమానులుగా మారినవారూ కోకొల్లలు. శైలితో విభేదించి ధ్వేషించే వారూ ఉన్నారు. ఇవన్నీ తెలిసినా ‘నేనేరా పోలీస్’ అంటూ ‘మోనార్క్‌లా, ‘మొండిఘటం’లా డ్యూటీ చేశారాయన. ఇదే అతనికి స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. మరోవైపు ఇదే అతని కెరీర్లో మైనస్ కూడా అయింది. ధర్మవరంలో ఎస్ఐగా తనదైన శైలిలో డ్యూటీ చేశారు. అతనికి తొలి గుర్తింపు వచ్చింది అక్కడే. అప్పట్లో అక్కడ భరించలేక చిత్తూరుకు బదిలీ చేయించారు కొందరు రాజకీయనేతలు. ఆ తర్వాత మళ్లీ గుత్తి ఎస్ఐగా వచ్చారు. ఇక్కడా అదే తీరు. ఉన్నతస్థాయి లీడర్లపై కూడా చేయిచేసుకుని రచ్చ చేశారు. అక్కడా బదిలీ తప్పలేదు. ఆపై పరిగి ఎస్ఐగా బెల్ట్‌షాపులపై బీభత్సం చేసి షాపులను మూయించారు. రాజకీయనేతలంతా మాధవ్‌పై కన్నెర్ర చేశారు. కానీ మహిళలు మాత్రం స్టేషన్‌కు వచ్చి రెండు చేతులెత్తి ‘నువ్వు మా దేవుడివయ్యా!’ అంటూ మొక్కారు. కానీ ‘ఎక్సైజ్’ దెబ్బకు అనంతపురం ట్రాఫిక్‌లోకి వచ్చి పడ్డారు. తర్వాత సీఐగా ప్రమోషన్ వచ్చింది. వన్‌టౌన్ ఏరియాలో మద్యం దుకాణాలకు సరికొత్త నిబంధనలు రూపొందించి సీసీ కెమెరాలు పెట్టించారు. ఇది మద్యం సిండికేట్ జీర్ణించుకోలేకోయింది. ‘స్వచ్ఛ భారత్’ అంటూ టీబీ ఆస్పత్రి శుభ్రం చేయించి హోంమంత్రి చినరాజప్పతో సన్మానం అందుకున్నారు. ఇంతలోనే ‘అనంత’లో కేబుల్ ఇష్యూకూ సంబంధించి పరిటాల శ్రీరాంకు వార్నింగ్ ఇచ్చారు. హౌసింగ్‌బోర్డులోని ఓ స్థలానికి సంబంధించి జెడ్పీ చైర్మన్ చమన్‌ను హెచ్చరించారు. వారి దెబ్బకు ఏకంగా సీఐడీకి వెళ్లాడు. దాదాపు ఏడాదిపాటు మాధవ్ మాట ‘అనంత’లో వినిపించలేదు. తర్వాత త్రీటౌన్ సీఐగా మళ్లీ ‘అనంత’కు వచ్చాడు. ఇక్కడా అదే తీరు. ఏం మారలేదు. త్రీటౌన్ పరిధే కాదు... జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఎవరు స్టేషన్‌కు వచ్చినా సమస్య విని జోక్యం చేసుకున్నారు. ఇది ఇతర పోలీసులకు మింగుడు పడలేదు. డీఎస్పీ, ఎస్పీ వరకూ దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో నోట్లరద్దు ఘటన సమయంలో ఎస్ఐపై చేయి చేసుకున్నారని మాధవ్ ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు. అప్పటికే అతని ఇమేజ్ తట్టుకోలేని పోలీసులు మాధవ్‌ను బాధ్యున్ని చేస్తూ వీఆర్‌కు పంపారు. తర్వాత కదిరి సీఐగా వచ్చిన తర్వాత కూడా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి డీఎస్పీని, జిల్లా ఎస్పీని ఏకంగా పోలీసుశాఖను కొజ్జాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ స్పందించలేదు. కానీ మాధవ్ విలేకరుల సమావేశం పెట్టిమరీ ‘డిపార్ట్మెంట్ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ‘అనంత’లోనే కాదు... ఎస్ఐగా కడప జిల్లాలో కూడా ఇదే తరహా డ్యూటీ చేశారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి... ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాల్లోకి రావాలని మాధవ్ తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చారు. వైఎస్సార్సీపీలో చేరారు. కానీ అప్పటి వరకూ మాధవ్‌కు అండగా నిలిచి పోలీసులు ఒక్కసారిగా సహాయ నిరాకరణ చేశారు. కారణం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు కావడమే. కనీసం అరే.. మనోడు ఇన్నేళ్లు పోలీసుశాఖలో పనిచేశాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత గెలుపోటములు దైవాదీనం, కానీ కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్నే త్యాగం చేస్తున్నాడు. కనీసం మనం రాజీనామా ఆమోదించేందుకు సహకరిద్దామని ఉన్నతాధికారులు ఆలోచించలేదు. ఎంతసేపు ఎలా మాధవ్ నామినేషన్‌ను ఆపాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. పైకి గంభీరంగా కన్పిస్తున్న మాధవ్ లోలోల చాలా బాధపడుతున్నారు. ‘నేను – నా ఖాకీ చొక్కా.. అంటూ 22ఏళ్లకుపైగా నిక్కచ్చిగా డ్యూటీ చేశా. నా ఉద్యోగాన్ని నేను వదలుకుంటానన్నా ప్రభుత్వం అడ్డుపడుతోందని వేదనపడుతున్నారు. అతనిపై కుట్రలు ఎందుకు? రాజీనామా ఆమోదించండి? నామినేషన్‌కు అడ్డంకులు తొలగించండి అని న్యాయం స్థానం ఉత్తర్వులిచ్చినా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు పనిచేస్తోంది ప్రభుత్వం కనుసన్నల్లో కాదు. ఎలక్షన్ కమిషన్ అజమాయిషీలో. నిర్ణయాధికారం ప్రభుత్వానిది కాదు... ఎన్నికల కమిషన్‌దే. ప్రభుత్వ ఒత్తిడి ఉన్నన్ని రోజులు రాజీనామా ఆమోదించకుండా ఉన్న అధికారులు కనీసం ఇప్పుడైనా రాజీనామా ఆమోదించాలని మాధవ్‌తో పాటు ఆయన అభిమానులు కోరుతున్నారు. -
పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు: గోరంట్ల మాధవ్
-
‘పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు’
సాక్షి, అమరావతి: తనను విధుల నుంచి రిలీవ్ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకుండా కర్నూలు డీఐజీ తప్పించుకుని తిరుగుతున్నారని హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న అధికారి తనను రిలీవ్ చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకుని తిరగడం సిగ్గుచేటని విమర్శించారు. రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. (మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల) అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిపి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపును సునాయాసం చేసేందుకే తనను రీలీవ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, పోలీస్ అధికారులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడం దుర్మర్గమన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డైరెక్టన్లో డీఐజీ పని చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు. ఐపీఎస్ అధికారులు రాజకీయ పార్టీల కోసం పనిచేయకూడదని, డీజీ, కర్నూలు డీఐజీ తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుకెళ్లినట్లు మాధవ్ వెల్లడించారు. -
ఈ పురం ఎవరికి వరం
హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం.. ఎన్నికలంటేనే రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈ సిగ్మెంట్ పరిధిలో ఉన్నహిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన కుమారుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప పోటీచేస్తుండగా వైఎస్సార్సీపీ నుంచి గోరంట్ల మాధవ్ బరిలో దిగారు. హిందూపురం తొలి ఎన్నికల్లో పెనుకొండ పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉండేది. 1957లో ఆ స్థానంలో హిందూపురం అవిర్భవించింది. 1952 ఎన్నికల్లో కేఎంపీపీ అభ్యర్థి కేఎస్ రాఘవాచారిఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత హిందూపురం స్థానానికి 15సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), టీడీపీలు ఐదేసి సార్లు గెలుపొందాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి గెలిచాక లోక్‌సభ స్పీకర్ అయ్యారు. ఈ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గెలుపొందారు. ఇక్కడ వరుసగా మూడోసారి పోటీ చేసిన అభ్యర్థి గెలిచిన సందర్భం లేదు. కిష్టప్ప వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. టీడీపీకి ఎదురుగాలి.. పెచ్చుమీరిన విభేదాలతో టీడీపీ బలహీనపడింది. పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథితో కిష్టప్పకు తీవ్ర విభేదాలున్నాయి. ఎంపీ నుంచి గెలవడం కష్టమని భావించి ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లాలని ప్రయత్నించగా కుదర్లేదు. మరోవైపు ఈ పార్లమెంటరీ పరిధిలో మైనారిటీల ఓట్లు ఎక్కువ. అయితే టీడీపీ ఒక్క సీటు కూడా మైనారిటీలకు కేటాయించలేదు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ శ్రీధర్‌రెడ్డి దూసుకుపోతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ బాగోగులను పూర్తిగా విస్మరించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ వైఎస్సార్ సీపీలో చేరారు. బాలయ్యపై రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ బరిలోకి దిగారు. రాప్తాడులో మంత్రి సునీత కుటుంబ‘సామంత పాలన’పై తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ధర్మవరంలో ఎమ్మెల్యే వరదాపురం వ్యవహారంతో టీడీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్న ధర్మవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి దూసుకుపోతున్నారు. మడకశిరలో టీడీపీ తరఫున ఈరన్న, వైఎస్సార్ సీపీ తరఫున డాక్టర్ తిప్పేస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైఎస్ హయాంలో లేపాక్షి హబ్.. దివంగత సీఎం వైఎస్ హిందూపురం సమీపంలో ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఇందులోని పరిశ్రమలకు నీరందించేందుకు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టారు. 25 శాతం పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వీటిలో ఏఒక్క సంస్థ పురోగతికి పాటు పడలేదు. పెద్ద పెద్ద సంస్థలంటూ శంకుస్థాపనలకే పరిమితం చేశారు. గోరంట్ల మాధవ్ సానుకూలతలు : పోలీసు అధికారిగా మంచి పేరుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు పార్లమెంట్ పరిధిలో ఎక్కువ శాతం ఓటర్లు ఉన్న కురుబ సామాజికవర్గం నేత కావడం. జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడం. టీడీపీ అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియడం. నిమ్మల కిష్టప్ప సానుకూలతలు : రెండు సార్లు ఎంపీగా చేసిన అనుభవం.. ఆర్థికంగా అండదండలు అందించే అనుచరగణం వ్యతిరేకతలు: రెండు మార్లు ఎంపీగా చేసినప్పటికీ ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదని ప్రజల్లో బలంగా ఉంది. అలాగే నేతల అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోయాయి చేనేత రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రిక్తహస్తం చూపడం. – మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం -
మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల
సాక్షి, అనంతపురం : చంద్రబాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తన తండ్రి హెచ్చరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.... తన నామినేషన్ విషయంలో ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు అని వాఖ్యానించారు. ‘ రాజకీయాల్లోకి వచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని మా నాన్న చెప్పారు. చంద్రబాబు వంటి ప్రమాదకరమైన వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్నట్లుగానే నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. నాపై గతంలో కొట్టి వేసిన కేసులను సాకుగా చూపి తప్పుడు ఆరోపణలు చేశారు. నాపై కేసులు ఉన్నాయంటూ కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి :గోరంట్ల మాధవ్‌కు లైన్‌క్లియర్) ఈసీకి ఫిర్యాదు చేస్తా.. తనను నామినేషన్ అడ్డుకునేందుకు కుట్ర పన్నిన వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మాధవ్ పేర్కొన్నారు. నిమ్మల కిష్టప్ప దమ్ముంటే గెలుపోటములలో తలపడాలని సవాల్ విసిరారు. బీసీలకు పెద్దపీట వేసే వైఎస్సార్ సీపీ నాయకుడిగా బీసీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలపై చంద్రబాబు ఒలకబోస్తున్న కపట ప్రేమను అందరికీ తెలియజేస్తానని వ్యాఖ్యానించారు. కాగా రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితమే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిడంతో నామినేషన్‌కు మార్గం సుగమమైంది. -
గోరంట్ల మాధవ్‌కు లైన్‌క్లియర్
-
గోరంట్ల మాధవ్‌కు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై ట్రిబ్యునల్ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్ఎస్ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది. కాగా బీసీలకు పెద్దపీట వేసేందుకు వైఎస్సార్ సీపీ ఏడు లోక్‌సభ స్థానాలు వారికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయన నామినేషన్‌పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. -
‘ఆటలు సాగవనే గోరంట్లను అడ్డుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తే చంద్రబాబు గుండెల్లో వణుకుపుడుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ విజయం తథ్యమని తెలిసే టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. అనంతపురంలో టీడీపీ అరాచకాలు బయటకు వస్తాయనే.. ప్రభుత్వ ఉద్యోగానికి మాధవ్ సమర్పించిన రాజీనామా ఆమోదం పొందకుండా చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘బీసీలకు సీట్లివ్వరు.. తమ పార్టీ సీట్లిచ్చినా అధికార మదంతో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తారు’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నేరుగా ఢీకొట్టే సత్తాలేని బాబు.! ‘జనసేన పార్టీలో నాగబాబు చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అది మీ యిష్టం. టీడీపీ అభ్యర్థులు గెలవడానికే జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. చంద్రబాబు కూటమిలో కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ, వామపక్షాలతో పాటు ఊరూ.. పేరూ లేని కేఏ.పాల్ పార్టీ కూడా చేరినట్టుంది. బాబుకు నేరుగా పోటీచేయడం.. కనీసం నేరుగా పొత్తులు పెట్టుకోవడం కూడా చేతకాదు. ఎప్పుడూ ముసుగు రాజకీయాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుంటారు’ అని చంద్రబాబుపై వాగ్బాణాలు సంధించారు. (చదవండి : జగనన్నను సీఎంగా చూడాలన్నదే నాన్న కోరిక: వైఎస్ సునీతా రెడ్డి) వివేకా హత్యపై బాబు కట్టుకథలు ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారు. వివేకాది అనుమానాస్పద మృతి అని తెలిసేవరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేనదని బుకాయిస్తున్నారు. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తుంటే పోలీసులు ఎందుకు వాస్తవాలు వెల్లడించడం లేదు. తండ్రి హత్యకేసులో దోషులను శిక్షించడానికి నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని ఆయన కూతురు వైఎస్ సునీత ఫిర్యాదు చేస్తే.. వక్రీకరణలు చేస్తారా. చనిపోయింది మామూలు వ్యక్తి కాదు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలందించిన వ్యక్తి. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. లోకేశ్ పొరపాటుగానో, గ్రహపాటుగానో వివేకా మృతి విషయం తెలిసి ‘పరవశించా!’ అన్నారు. కానీ, లోకేశ్ మాటలను బాబు నిజం చేస్తున్నారు. సిట్ వేసి అది ఏం చేయాలో ఆయనే చెప్తున్నారు. వాస్తవాలు తొక్కిపట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది నీచ రాజకీయం. వివేకానందరెడ్డిది ఓ పొలిటికల్ మర్డర్. ఎన్నికల దాకా హంతకులెవరో బయటపడకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. దిగజారి మాట్లాడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు’ అని పద్మ హెచ్చరించారు. -
సామాన్యులే... మాన్యులు
వారంతా సాధారణ కార్యకర్తలు. కానీ, ప్రజా సేవలో అసాధారణ అవకాశం అందుకున్నారు. వైఎస్సార్సీపీ అండతో లోక్‌సభ టికెట్లు దక్కించుకుని బలమైన ప్రత్యర్థులతో ఢీకి సిద్ధమంటున్నారు. రాజ వంశీకుడిపై.. సాధారణ గిరిజన మహిళ గొడ్డేటి మాధవిని విశాఖ జిల్లా అరకు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించగానే రాష్ట్రం యావత్తు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఇక్కడ ఎదుర్కొనబోయేది టీడీపీ అభ్యర్ధి రాజ వంశీకుడు, కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్. అలాంటి నాయకుడిపై పోటీకి నిలిపినందున అసలీ మాధవి ఎవరనేది చర్చకు వచ్చింది. ఆమె కొన్ని నెలల క్రితం వరకు విశాఖపట్నం ఏజెన్సీ కొయ్యూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు పీఈటీ. అరకు పరిధిలో అత్యధికంగా ఉన్న కొండ దొర తెగకు చెందిన సాధారణ గిరిజన మహిళ. పార్టీలోకి రావాల్సిందిగా ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి మాధవికి ఆహ్వానం అందింది. వైఎస్ జగన్ పాదయాత్ర విశాఖపట్నం జిల్లా చేరినప్పుడు ఆమె పార్టీలో చేరారు. వెంటనే అరకు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అప్పటినుంచి చురుగ్గా వ్యవహరిస్తూ గిరిజనుల్లో గుర్తింపు సాధించారు. దీంతో ఇచ్చిన మాట నిలుపుకొంటూ, అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజనులకు గుర్తింపునిస్తూ వైఎస్ జగన్ ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అతి సామాన్యుడు నందిగం సురేష్... పార్టీలో సామాన్య కార్యకర్త. మాదిగ సామాజిక వర్గంలోని దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఈయన్ని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యం, సంచలనం రెండూ రేపాయి. అయితే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ భూ దందాలు, దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిబద్ధుడైన పార్టీ కార్యకర్తగా ఉద్యమాలు చేసిన సురేష్‌ను అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి టికెట్ ఇచ్చారు. అంతేకాదు ఇడుపులపాయలో పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్ ద్వారా విడుదల చేయించారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లి గెలిచే ఆలోచనలో ఉన్న టీడీపీ వర్గాలు ఈ పరిణామంతో అవాక్కయ్యాయి. దీనిని ఎలా తిప్పికొట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. దండెత్తిన సామాన్యుడు దువ్వాడ శ్రీనివాస్... శ్రీకాకుళం జిల్లాలో విచ్చలవిడి అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న కింజరాపు కుటుంబాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ నిలిపిన అభ్యర్థి. సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబం జిల్లాలో ఇసుక, గ్రానైట్, కాంట్రాక్టు దందాలతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడింది. తమను ఎదిరించేవారిపై దాడులతో బెంబేలెత్తించింది. వారితో పోలిస్తే దువ్వాడ శ్రీనివాస్ సామాన్యుడు. జిల్లాలో అత్యధికంగా ఉన్న కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై ఉపాధ్యక్షుడయ్యారు. అనంతరం జిల్లాలో థర్మల్ ప్లాంట్ల వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారు. తన వ్యాపారాలను కింజరాపు కుటుంబం దెబ్బతీసినా శ్రీనివాస్ వెనకడుగు వేయలేదు. 2014 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ, చిత్తశుద్ధితో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు వైఎస్ జగన్ మరో పెద్ద అవకాశం కల్పించారు. మహారాజుపై పోటీకి రైతుబిడ్డ బెల్లాన చంద్రశేఖర్... విజయనగరం లోక్‌సభ స్ధానం వైఎస్సార్సీపీ అభ్యర్థి. రాజ కుటుంబానికి చెందిన అశోక్ గజపతి రాజుపై ఆయన పోటీ చేస్తున్నారు. సంపన్నుడైన అశోక్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ సాధారణ రైతు బిడ్డ బెల్లాన చంద్రశేఖర్‌ను నిలపడం విశేషం. ఈయన విజయ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. మధ్య తరగతి కుటుంబం. సర్పంచ్ నుంచి అంచలంచెలుగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా, పార్టీనే నమ్ముకుని ఉన్నారు. దీంతో వైఎస్ జగన్ ఆయనకు మరింత పెద్ద అవకాశం ఇచ్చారు. పోలీస్ పవర్ కొన్ని నెలల క్రితం వరకు సాధారణ సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్‌ను హిందూపూర్ ఎంపీ అభ్యర్థ్ధిగా ప్రకటించడం రాజకీయాల్లో సంచలనం రేపింది. సిన్సియర్ పోలీస్ అధికారి. పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేవారు కాదు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ దౌర్జన్యాలు, అరాచకాలను అడ్డుకున్నారు. మీసం మెలేసి మరీ సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాజీవితంలోకి రావాలని భావించారు. వైఎస్సార్సీపీ అవకాశం కల్పించింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గాల ప్రభావం ఉండే జిల్లాలో బీసీ వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం సంచలనమైంది. -
ఓట్ల తొలగింపు కుట్ర బాబు,లోకేష్‌దే
అనంతపురం, కదిరి : రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఓట్ల తొలగింపు కుట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పనే అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మంగళవారం తన స్వగృహంలో కదిరి సమన్వయకర్త డా.పెడబల్లి వెంకట సిద్ధారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఏనాడూ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించలేదన్నారు. ఎప్పుడూ స్వార్థం కోసమే ఉపయోగించారన్నారు. ఓట్లు, సీట్లు తప్పా ఆయనకు ఇంకేమీ పట్టవు.. ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపునకు ఐటీశాఖ ఉపయోగపడుతుందనే ఏపీలో లోకేష్‌బాబుకు ఐటీ మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ ద్వారా ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు, ఏపార్టీకి సానుభూతి పరులు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవన్నీ బహిర్గతం కావడంతో తండ్రీ కొడుకులపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఉలుకెందుకు బాబూ?: ఏపీ ప్రజల వివరాలు బహిర్గతమైన విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తుంటే చంద్రబాబు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని మాధవ్ అన్నారు. కచ్చితంగా ఇది చంద్రబాబు పన్నిన కుట్రేనన్నారు. ఐటీ గ్రిడ్ సీఈఓకు, లోకేష్‌బాబుకు సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 30 సీట్లు కూడా రావనే విషయం చంద్రబాబు గ్రహించే ఇలా ఓట్లను తొలగించే దుర్మార్గపు పనులకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. రెండు రోజులుగా చంద్రబాబు హడావుడి చూస్తుంటే ఐడీ గ్రిడ్‌కు, ప్రభుత్వానికి సంబంధం ఉందనే విషయం చెప్పకనే అర్థమవుతోందన్నారు. -
'అశోక'చక్రం.. 'దివాకర' అస్త్రం!
‘జేసీ దివాకర్‌రెడ్డిపై సీఐ గోరంట్ల మాధవ్ ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయలేదు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా తప్పు చేయలేదని నిర్ధారించింది’– హైకోర్టు కౌంటర్ పిటీషన్లో జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ‘ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని గోరంట్ల మాధవ్ భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు.’– మాధవ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశం. 506 సెక్షన్‌కింద కేసు నమోదు ‘పోలీసులా? కొజ్జా నా కొడుకులా? ఏ జాతికి సంబంధించిన వాళ్లు వీళ్లు.’– గత ఏడాది సెప్టెంబర్ 16న ఎంపీ జేసీ వ్యాఖ్యలు పోలీసు శాఖ టీడీపీ చెప్పుచేతల్లో పని చేస్తుందనేందుకు ఇది తాజా ఉదాహరణ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒక కాకి గాయపడితే.. వంద కాకులు అక్కడికి వచ్చి చేరడం చూశాం. అలాంటిది.. పోలీసు శాఖ పరువును, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఓ నేత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఓ పోలీసుకు సొంత శాఖ నుంచే మద్దతు లభించని పరిస్థితి. టీడీపీ నేతలు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా.. చివరకు పోలీసు శాఖ పరువును బజారున పడేస్తున్నా.. ఆ శాఖ ఉన్నతాధికారిగా ఎస్పీ కూడా చేష్టలుడిగి చూస్తుండటం సామాన్య ప్రజలను సైతం ఆలోచనలో పడేస్తోంది. జిల్లాలో అసలేం జరుగుతుందో పరిశీలిస్తే.. తానుఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావించిన జేసీ దివాకర్‌రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 16న ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో భాగంగా దళిత సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ‘నీయబ్బ చేతగాని నా కొడుకులు.. మీరు కనపడితే...(రాయలేని భాష)’ అని దారుణంగా మాట్లాడారు. ఈ విషయంలో ఎస్పీ అశోక్‌కుమార్ కూడా మౌనం వహించారు. ఇకపోతే తాడిపత్రిలో 2017 డిసెంబర్ 21న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి విధుల్లో ఉన్న సీఐని ‘మీకు..(రాయలేని భాష) దమ్ములేదా? చేతకాకపోతే సెలవులో వెళ్లిపోండి? అన్నారు. జేసీ అనుచరుడు మునిసిపల్ వైస్ చైర్మన్ జిలాన్ ఏకంగా సీఐతో ‘మీ వద్ద లాఠీలు ఉంటే మా వద్ద కట్టెలు ఉన్నాయి. పది నిమిషాల సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలీదు’ అని ఏకంగా బెదిరించి అల్టిమేటం జారీ చేశారు. అయినప్పటికీ సీఐ నుంచి ఎస్పీ దాకా ఎవ్వరూ స్పందించలేదు. ఎందుకంటే వీరంతా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు. ఏమైనా ముందడుగు వేస్తే ‘బదిలీ అవుతుందేమోననే భయం’తో నిమ్మకుండిపోయారు. పోలీసుశాఖ పరువును కాపాడలేకపోయారు. కానీ సీఐ గోరంట్ల మాధవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోలీసులపై దుర్భాషలాడే వారికి హెచ్చరిక చేశారు. పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపారు. పోలీసులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికి సమర్థించారు. ఖాకీ వదలగానే తప్పయిందా?: మాధవ్ వ్యాఖ్యలపై జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులపై జేసీ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్.. మాధవ్‌కు అండగా నిలిచారు. జేసీపై మాధవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేసు నమోదు చేయలేమని చెప్పారు. కానీ మాధవ్ తన ఉద్యోగానికి డిసెంబర్ 29న వీఆర్ఎస్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. వీఆర్ఎస్ ఇవ్వగానే అదే రోజు రాత్రి గతంలో జేసీపై మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎస్పీ చార్జ్ మెమో దాఖలు చేశారు. అయితే అందులో ఒకరోజు ముందు తేదీ అంటే డిసెంబర్ 28తో జారీ చేశారు. సెప్టెంబర్ 28న మాధవ్ వ్యాఖ్యలు చేశారు, అతనిపై కేసు నమోదు చేయాలని 29న జేసీ దివాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కానీ మాధవ్ వీఆర్ఎస్ ఇచ్చిన రోజు చార్జ్ మెమో ఇచ్చారంటే ఎస్పీ స్థాయి అధికారే రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారనేది తెలుస్తోంది. ఆ తర్వాత మాధవ్‌ను ఎలా ఇబ్బంది పెట్టాలనే చర్చే టీడీపీ నేతలతో పాటు పోలీసుశాఖ ఉన్నతాధికారుల్లోనూ కొనసాగింది. అందుకే నిబంధనల మేరకు వీఆర్ఎస్ ఇచ్చినా, ఇప్పటి వరకూ దాన్ని పోలీసుశాఖ ఆమోదించ లేదని తెలుస్తోంది. మాధవ్‌పై ఎలాగైనా కేసు నమోదు చేయాలని.. లేదంటే ఎస్పీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తామని జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులను బెదిరించారు. దీంతో ఇప్పటి వరకూ అండగా ఉండి, ఇప్పుడు కేసు నమోదు చేస్తే తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతుందని, తాడిపత్రి కోర్టులో ఓ పిటిషన్ వేస్తే కేసు నమోదు చేస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల కిందట జేసీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఉత్తర్వులకు లోబడి వెంటనే పోలీసులు సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు. హైకోర్టులో పిటిషన్ వేస్తే కౌంటర్ దాఖలు చేసిన ఎస్పీ, తాడిపత్రి కోర్టులో ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదనేది వేయి డాలర్న ప్రశ్న. కేవలం మాధవ్ వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఉండటం, జనాకర్షన కలిగిన నేతగా ఎదుగుతుండటంతో రాజకీయంగా ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ తరహా కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుశాఖలో తీవ్ర చర్చ విధి నిర్వహణలో ఉన్న గెజిటెడ్ ర్యాంకు అధికారులను సైతం ఇష్టానుసారం జేసీ బ్రదర్స్ దూషించినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో పోలీసుశాఖ పరువును కాపాడేందుకు మాధవ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులే కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ బ్రదర్స్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులతో పాటు సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల తీరు ఇలా ఉంటే, పోలీసులు ధైర్యంగా ఎలా పనిచేయగలరని సొంత శాఖలేనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీపై కేసు నమోదు చేస్తే మహా అయితే రాజకీయ ఒత్తిళ్లతో బదిలీ బహుమానంగా వస్తుందని, కానీ పోలీసు పరువు నిలబడుతుందని చర్చ జరుగుతోంది. అలా కాకుండా పోలీసులపై దూషణలకు దిగిన వారిని వదిలిస్తే.. రేపు ఎంపీ, ఎమ్మెల్యే నుంచి ఎంపీటీసీ దాకా.. ఆపై రోడ్డున వెళ్లే రౌడీషీటర్ కూడా ఇదే వైఖరి అవలంబిస్తారని ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఓటు కుట్రలకు చెక్ పెట్టండి
అనంతపురం అర్బన్: రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఓట్ల తొలగింపునకు భారీగా కుట్రకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఓటర్లు, సానుభూతిపరుల లక్ష్యంగా అధికారపార్టీ ఈ చర్యలకు పాల్పుడతోందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్, రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కలెక్టర్ వీరపాండియన్‌కు విన్నవించారు. బుధవారం వారు కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిసి ఫిర్యాదు చేయడంతోపాటు ఆధారాలను సమర్పించారు. నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్సీపీకి చెందిన దాదాపు 14 వేల ఓట్లను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓటర్లకు తెలియకుండా ఫారం–7లో దరఖాస్తు చేశారన్నారు. ఆ తర్వాత బీఎల్ఓపై ఒత్తిడి తీసుకొచ్చి వాటని ఆమోదింపజేసేలా కుట్రకు తెరతీశారన్నారు. ఓటు తొలగింపునకు సంబంధించి నోటీసు అందడంతో జరుగుతున్న కుట్ర వెలుగు చూసిందన్నారు. ప్రస్తుతం ఓట్ల తొలగింపునకు వచ్చి దరఖాస్తులన్నీ బోగస్‌వేనని చెప్పారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఫారం–7 దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇంటింటికి వెళ్లి విచారణ చేయించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, నాయకుడు హరినాథ్‌రెడ్డి, న్యాయవాది నరేంద్రరెడ్డి ఉన్నారు. -
'గోరంట్ల'ను కొండంత'జేసి'!
గోరంతను కొండంత చేస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్‌పై కక్ష సాధింపునకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తనను వ్యక్తిగతంగా మాధవ్ దూషించారని ఆరోపిస్తూ ఇప్పటికే ఆయన పోలీస్ స్టేషన్, హైకోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఎక్కడా మాధవ్ తప్పు చేయలేదని తేలడంతో సోమవారం తాడిపత్రి కోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసు నమోదు చేయాలని రిట్ దాఖలు చేశారు. దీంతో జేసీ, పోలీసుల మధ్య సమసిపోయిందనుకున్న వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభోదానంద ఆశ్రమ ఘటన వ్యవహారంలో అప్పటి డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పరుష వ్యాఖ్యలతో దూషించారు. మొత్తం పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యం దెబ్బతినేలా పోలీసులను ‘కొజ్జాలు’గా అభివర్ణించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతో పాటు ఉద్యోగ వర్గాలు, సామాన్య ప్రజల్లోనూ జేసీపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఈ ఘటన తర్వాత పోలీసు సంఘం తరఫున అప్పటి పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్, కార్యదర్శి మాధవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు నిజాయతీగా పనిచేస్తున్నారని, ఇటీవల పలు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు కించపరిచేలా మాట్లాడుతున్నారని, చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించామని చెప్పారు. ఇకపై ఎవరైనా పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ‘నాలుక కోస్తాం’ అని మాధవ్ అన్నారు. ఎక్కడా కూడా జేసీ దివాకర్‌రెడ్డి పేరు ఉచ్ఛరించి విమర్శలు చేయలేదు. పైగా జరిగిన ఘటనపై కూడా విమర్శించలేదు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమనేలా మాట్లాడారు. అయితే తనను వ్యక్తిగతంగా దూషించారని జేసీ భావించి తాడిపత్రిపోలీసుస్టేషన్‌లో మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్నట్లు మాధవ్ ఎక్కడా జేసీని వ్యక్తిగతంగా కించపరచలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులపై హైకోర్టును ఆశ్రయించిన వైనం: పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ జేసీ హైకోర్టును ఆశ్రయించి రిట్ దాఖలు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మాధవ్ వ్యాఖ్యలు పరిశీలించామని, ఎక్కడా జేసీని వ్యక్తిగతంగా బెదిరించడం, కించపరచడం చేయలేదని అందులో పేర్కొన్నారు. దీంతో పాటు న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా న్యాయసలహా కోసం ఈ అంశాన్ని ‘డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్’కు ఎస్పీ సిఫారసు చేశారు. మొత్తం వ్యవహారంలో కూడా గోరంట్ల మాధవ్, జేసీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సొసైటీని ఉద్దేశించి జనరల్‌గా చేసిన వ్యాఖ్యలను, జేసీ తనకు ఎలా ఆపాదించుకుంటారని పోలీసుల తరఫు న్యాయవాదులు కూడా వాదించారు. దీంతో ఎంత ప్రయత్నించినా కేసు నమోదు చేయలేదనే భావనకు జేసీ వచ్చారు. వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత తిరిగి కొత్త కుట్ర ఈ వ్యవహారం జరుగుతుండగానే గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాధవ్‌ను హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. మాధవ్ నియామకంతో ఒక్కసారిగా టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న మాధవ్‌ను రాజకీయంగా ఆదిలోనే దెబ్బతీయాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హైకోర్టు పరిధిలో ఉన్న కేసును తిరిగి కింది కోర్టుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సోమవారం ఉదయం జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి కోర్టుకు వెళ్లి మాధవ్‌పై ప్రైవేటు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. నిజానికి పైకోర్టు పరిధిలో ఉన్న కేసులపై కింది కోర్టులను ఆశ్రయిస్తే వాటిని విచారణకు స్వీకరించరని న్యాయనిపుణులు అంటున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈ విషయం జేసీకి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కోర్టును ఆశ్రయించారంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాధవ్‌ను కేసులో ఇరికించే కుట్రగా విపక్ష పార్టీ భావిస్తోంది. -
పేదలకు సేవకుడిగా ఉంటా..
కదిరి: ‘చాలా పేదరికం నుండి వచ్చాను. మా తాత గొంగడి భుజాన వేసుకొని గొర్రెలు మేపి నన్ను చదివించారు. పేదల కష్టాలు బాగా తెలుసు.. ఆ పేదలకు నా వంతు సేవలు అందించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. వారికి సేవకుడిగా పనిచేస్తా. బడుగులకు వైఎస్సార్ సీపీ మంచి వేదిక. విధి నిర్వహణలో భాగంగా నేను జగన్ పాదయాత్రలో పాల్గొని పేదల పట్ల ఆయన చూపిన ప్రేమను కళ్లారా చూశాను. అందుకే ఈ పార్టీలో చేరాను’ అని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త కురుబ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆ పార్టీ కదిరి సమన్వయకర్త డా.పెడబల్లి వెంకట సిద్దారెడ్డి సోమవారం గోరంట్ల మాధవ్‌ను నేరుగా ఆయన గృహంలో కలిసి సన్మానించారు. మాధవ్ నేతృత్వంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడారు. తాను సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ఎల్ఎల్బీ పూర్తి చేసినట్లు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఇప్పటికీ ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కష్టం ఇకపై ఎవ్వరికీ రాకుండా చూస్తానన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉన్నత చదువుల భాగ్యం కలుగుతుందని భరోసానిచ్చారు. ‘మీరు మీ పిల్లలను బడికి పంపినందుకు ప్రతి ఏటా ఆ తల్లి ఖాతాలో రూ15 వేలు జమచేస్తాను. మీ పిల్లలను ఇంజినీరింగ్ చదివిస్తారో, డాక్టర్‌ను చేయాలనుకుంటారో నాకు వదిలిపెట్టండి. వారి చదువులకయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన భరోసా నాలో స్ఫూర్తిని రగిలించాయి. అందుకే జగన్ మాటలకు బాగా ఆకర్షితుడినయ్యాను. ఆయనకు అభిమాని అయ్యాను. ఇదే నన్ను వైఎస్సార్సీపీలో చేరేందుకు కారణమైంది.’ అంటూ వివరించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డితో తనకు వ్యక్తిగత శత్రుత్వం ఏదీ లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సిద్ధాంతాల మేరకే తాను వ్యవహరిస్తానని పేర్కొన్నారు. -
చంద్రబాబు పాలనంతా స్వార్థమే
అనంతపురం , పరిగి: సీఎం చంద్రబాబు పాలనంతా స్వార్థభరితమేనని రాజకీయ లబ్ధి కోసం నారా వారు ఎన్ని అబద్దాలు ఆడటానికి, మోసాలు చేయడానికైనా వెనుకాడబోరని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం పరిగి మండలంలోని ఊటుకూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకరానారాయణ మాట్లాడుతూ పసుపు కుంకుమ కార్యక్రమం పేరుతో మహిళలను చంద్రబాబు నిలువునా దగా చేస్తున్నారన్నారు. దఫాలుగా మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మభ్యపెట్టి మోసం చేస్తున్నారన్నారు. కేవలం ఎన్నికల కోసమే చేస్తున్న కుయుక్తులు తప్ప మహిళలపై ఆయనకు ఎలాంటి ప్రేమలేదన్నారు. మహిళలకు ప్రజయోజనం చేకూర్చే సీఎం అయితే నాలుగున్నరేళ్లు నిద్రపోయారా అని ప్రశ్నించారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి మరోసారి దోచుకున్న అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారని శంకరనారాయణ ధ్వజమెత్తారు. ప్రజా సేవ చేసేందుకేరాజకీయాల్లోకి వచ్చా ప్రజలకు నేరుగా సేవలు చేయాలన్న కోరికతో రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదనపై ఆశ లేదని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ అన్నారు. రాజకీయ నాయకుడిగా పరిగి మండలంలో అడుగు పెట్టిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యువకులు, ప్రజలు కేరింతలు పెడుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‘బడుగు బలహీన వర్గాల నుండీ వచ్చాను.. వారికి అండగా నిలిచి అభివృద్ధికి చేయూత నివ్వడమే జీవిత లక్ష్యమని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. పోలీస్విధి నిర్వహణలో కూడా ఎప్పుడూ పేద ప్రజల పక్షానే నిలిచానన్నారు. ఎన్నో రాజకీయ ఒత్తిడులు, ఇబ్బందులకు గురయ్యానని చెప్పారు. ఉద్యోగ పరంగా పరిమితులు ఉంటాయని, రాజకీయపరంగా ప్రజాసేవకు పరిమితులుండవన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలో నడిచి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయరాం, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి డీవీ రమణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వరరావు, ప్రభు, బీఆర్ నారాయణ, చెన్నకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు పెద్దపీట
బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ క్రమంగా ఆ వర్గానికి దూరమవుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కీలక పదవులు కట్టబెడుతూ ఆ వర్గంలో చెరగని ముద్ర వేసుకుంటోంది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తలుగా బోయ, కురుబ సామాజిక వర్గాలకు చెందిన పీడీ తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌కు స్థానం కల్పించింది. ఇకపోతే రాయదుర్గం, పెనుకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల సమన్వయకర్తలుగా కూడా బీసీ వర్గాలకు చెందిన కాపు రామచంద్ర, శంకరనారాయణ, ఉషాశ్రీలకు ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్న సీఐ గోరంట్ల మాధవ్ ఇటీవల తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ వెనుకబడిన వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు శాఖలో కూడా నిజాయతీ అధికారిగా, విధి నిర్వహణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే ఆయనన్ను అత్యంత కీలకమైన, ప్రాధాన్యత కలిగిన పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించడం విశేషం. బీసీలకు ప్రాధాన్యం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పదవుల కేటాయింపులో పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా బోయ రంగయ్య కొనసాగుతున్నారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా, పెనుకొండ సమన్వయకర్తగా కురుబ శంకర్‌నారాయణ, కళ్యాణదుర్గం, రాయదుర్గం సమన్వయకర్తలుగా కురుబ ఉషాశ్రీచరణ్, కాపు రామచంద్ర(వీరశైవ లింగాయత్)లు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ‘పురం’ పార్లమెంట్ సమన్వయకర్తగా కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ను నియమించడంతో బీసీలకు పార్టీలో మరింత సముచిత స్థానం, గౌరవం లభించినట్లయింది. ఇప్పటికే పార్టీ పదవుల్లోనూ అత్యంత కీలకమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన కిష్టప్ప, రాగే పరుశురాంలు కొనసాగుతున్నారు. బీసీలకు జగన్ ఇచ్చిన గౌరవం ఇది: గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నన్ను నియమించిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నాకు సహకరించిన జిల్లా ఇన్చార్జ్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు శంకర్‌నారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, సమన్వయకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యోగ జీవితం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు నన్ను ప్రోత్సహించి, వెన్నంటే నిలిచిన కురుబ సోదరులతో పాటు బీసీలకు కృతజ్ఞతలు. మా అధినేత ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. అనంతపురం జిల్లాలో మా పార్టీ జెండాను రెపరెపలాడించడమే పార్టీ నేతల ముందున్న ప్రథమ కర్తవ్యం. దీని కోసం సైనికుడిలా పోరాడతా. -
గోరంట్ల మాధవ్‌కు కీలక బాధ్యతలు
సాక్షి, అనంతపురం : హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఇటీవలే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల పవరేంటో చూపిస్తానని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. -
వైఎస్సార్సీపీలో చేరిన గోరంట్ల మాధవ్
-
ఎర్రగుంట్లలో వ్యక్తి దారుణహత్య
ఎర్రగుంట్ల : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని వేంపల్లి రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. పెసల శ్రీనివాసరెడ్డి(54) అనే వ్యక్తి గొంతుకు గుడ్డచుట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు...కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లి శ్రీనివాసరెడ్డి సొంతూరు. పట్టణంలోని వేంపల్లి రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో శ్రీనివాసరెడ్డి నివసిస్తున్నారు. ఇతనికి తల్లిదండ్రులు లేరు. మద్యానికి అలవాడుపడిన శ్రీనివాసరెడ్డితో భార్య సుశీల ఐదేళ్ల క్రితం గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కోర్డులో విడాకుల కేసు నడుస్తోంది. కమలాపురం మండలం ఎర్రగుడిపాడుకు చెందిన సుబ్బమ్మ, శ్రీనివాసరెడ్డి ఇంటిలో పనిమనిషిగా చేస్తుంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఇంటిలో పనిచేయడానికి వచ్చింది. అప్పటికే ఇంటి గేటు తెరిచిఉండడంతో శ్రీనివాసరెడ్డిని పిలిచినా పలకలేదు. అయితే ఇంటిలోకి వెళ్లి చూడగా గొంతుకు టువాల్తో బిగించి ఉంది. అలాగే బీరువా తెరిచి ఉంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉన్నాయి. పనిమనిషి విషయాన్ని మద్యం తీసుకువచ్చే బ్రాందీషాపు కిరణ్‌కు ఫోన్ చేసి చెప్పింది. కిరణ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎర్రగుంట్ల సీఐలు వెంకటరమణ, కొండారెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలంలో ఆదారాలు సేకరించారు. పనిమనిషి సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన గోరంట్ల మాధవ్
సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో ఇటీవల వరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పనిచేసిన గోరంట్ల మాధవ్ శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఆయనకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున వైఎస్సార్సీపీలో చేరడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. బీసీలు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విధానాల పట్ల ఆకర్షితుడనై పార్టీలో చేరానని తెలిపారు. ఆయన పోరాట పటిమతో స్ఫూర్తిని పొందానని అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాధవ్ 1996 బ్యాచ్‌లో ఎస్ఐగా చేరి వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పనిచేశారు. సీఐ పదవికి రాజీనామా చేసే నాటికి రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బాబు చేతిలో మళ్లీ మోసపోవద్దు.. నాలుగున్నరేళ్లపాటు ప్రజా వ్యతిరేక పాలన చేసి ఎన్నికలు మరో మూడు నెలల్లో వస్తున్నాయనగా సీఎం చంద్రబాబు ప్రజలకు, బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని, వీటిని నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.క్రిష్ణప్ప విజ్ఞప్తి చేశారు. నిజంగా చంద్రబాబుకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పాలనా పగ్గాలు చేపట్టినప్పుడే మేలు చేసేవారని ఇంతకాలం ఎందుకు మిన్నకున్నారనేది ప్రజలు గ్రహించాలన్నారు. బీసీలపై వైఎస్ జగన్‌కు నిజమైన ప్రేమ ఉందని, అందుకే బీసీల అధ్యయన కమిటీని వేశారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 142 బీసీ కులాలను ఈ కమిటీ కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి ఝలక్ గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి తీవ్ర షాక్ తగిలింది. టీడీపీ బీసీ, ఎస్సీ నేతలు పలువురు హైదరాబాద్‌లో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో వారంతా జగన్‌ను కలిసి పార్టీలో చేరాలనే అభిలాషను వ్యక్తం చేశారు. భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బండారు కుమారి, మండల తెలుగు యువత అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, జిల్లా చేనేత నాయకుడు మనోహర్, భట్టిప్రోలు పంచాయితీ మాజీ సర్పంచ్ కంభం మరియమ్మ తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. -
వైఎస్సార్సీపీలో చేరిన సీఐ గోరంట్ల మాధవ్
సాక్షి, హైదరాబాద్ : పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతపురానికి చెందిన మాధవ్‌కు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఐ మాధవ్‌తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీని చేరువ చేయడానికి కృషి చేస్తానని, అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల పవరేంటో చూపిస్తానని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన సీఐ గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. -
మరోసారి బయటపడ్డ టీడీపీ,జనసేన మైత్రి
-
పవన్ కళ్యాణ్‌ను ఏమీ అనొద్దు!
సాక్షి, అమరావతి : చంద్రబాబు–పవన్ కళ్యాణ్‌ల రహస్య స్నేహం మరోసారి బయటపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష సాధించేందుకే టీఆర్ఎస్ నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతిస్తున్నారని గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్‌ను విమర్శించొద్దని చంద్రబాబు టీడీపీ నేతలకు హుకుం జారీచేశారు. దీంతో వారి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం బహిర్గతమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ బాధ్యులతో శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. పవన్ జోలికి వెళ్లొద్దని స్పష్టమైన సూచనలు చేశారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌లపైనే ఆరోపణలు చేయాలని, వారు ముగ్గురు ఒకటేనన్న ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఈ సమయంలో పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని పవన్ కూడా ఉన్నాడుగా అని గుర్తు చేయగా.. తాను చెప్పింది చేయాలని బుచ్చయ్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పవన్ ఇంతకాలం చంద్రబాబును, టీడీపీని పైకి తిడుతూ లోలోపల స్నేహం చేస్తున్నట్లు స్పష్టమైంది. 25 ఎంపీ, 150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలవాలి కాగా, వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ, 150 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యమని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. కేసీఆర్, జగన్ తప్ప అందరూ కోల్‌కత వచ్చారని.. వారిద్దరూ మోడీ వెంట ఉన్నారని స్పష్టమైందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది అసలు లేదని, అదొక శూన్యమని, పెద్ద సున్నా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీకి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేశారని, అదసలు బీజేపీకి ప్రతిపక్షమే కాదన్నారు. టీఆర్ఎస్ నాయకులను ఆంధ్ర ద్వేషులుగా, వరంగల్‌లో తనపై రాళ్లేసిన వారితో జగన్ లాలూచీ పడినట్లు ప్రచారం చేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చామని బీజేపీ అనడం హాస్యాస్పదమన్నారు. ప్రతీ కార్యకర్త ఒక మొబైల్ మీడియా (సంచార మాధ్యమం)గా మారి ఈ విషయాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, డబ్బులు ఖర్చుపెట్టే అభ్యర్థులను వైఎస్సార్ కాంగ్రెస్ వెతుకుతోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా చేస్తోందన్నారు. -
మాధవ్ హోరు... బీకే బేజారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కురుబలు రాజకీయంగా ఎదగకూడదన్నది టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సిద్ధాంతం. ఆ సామాజిక వర్గంలో అన్నీ తానై వ్యవహరించాలన్నది ఆయన లక్ష్యం. కురుబ సామాజిక వర్గమంతా తనకే మద్దతు పలకాన్నది ఆయన ప్లాన్.. కానీ ఆదివారం నగరంలో జరిగిన కురుబ గర్జనలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. సీఐ మాధవ్ సభ ప్రాంగణానికి రాగానే జనం ఈలలతో హోరెత్తించారు. దీన్ని చూసి తట్టుకోలేని బీకే పార్థసారథి ప్రశాంతంగా సాగుతున్న ‘కురుబగర్జన’లో వివాదాన్ని రగిల్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఆదివారం జూనియర్ కాలేజీ మైదానంలో ‘కురుబగర్జన’లో సీఐ గోరంట్ల మాధవ్ కన్పించగానే 15 నిమిషాల పాటు ఈలలు, కేకలతో సభ హోరెత్తింది. మాధవ్ క్రేజ్ చూసి తట్టుకోలేక అక్కసుతో పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి నోరుపారేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు గర్జనకు ముఖ్య అతిథిగా వచ్చిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా మాట్లాడకుండానే వెనుదిరిగారంటే పార్థసారథి సభను ఏరకంగా తప్పుదోవ పట్టించారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో పార్థసారథి వైఖరిని కురుబలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనకు బుద్ధి లేదు.. పిల్లాట ఆడతారు కురబ సమావేశం జరుగుతున్నపుడు మాధవ్‌ను వేదికపై పిలవలేదు. సమావేశం ప్రారంభమైన తర్వాత కులాభిమానంతో సామాన్య కురుబ వ్యక్తిగా సమావేశం చూడాలని మాధవ్ వేదిక ముందు కూర్చునేందుకు రాబోయారు. మాధవ్ కన్పించగానే జనాలు భూజాలపైకి ఎత్తుకుని ఈలలు, కేకలు వేస్తూ ‘కురుబల సింహం మాధవ్ జిందాబాద్’ అంటూ వేదిక వద్దకు తీసుకురాబోయారు. ఈ సమయంలోప్రసంగిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ ప్రసంగం ఆపి అలా చూస్తుండిపోయారు. అతను ఎవరని సిద్ధరామయ్య పక్కన వారిని అడిగి తెలుసుకున్నారు. జనాల ఆపకుండా ఈలలు, కేకలు వేయడంతో టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి తట్టుకోలేక తన అక్కసు వెళ్లగక్కారు. మైకు తీసుకుని ‘ఏయ్ ఏమయ్యా! మీరందరూ...సహకరించాలి. ఆయన్ను వదిలేయండి..కోతికి కళ్లుతాపితే ఎలా? బుద్ధిలేదా?’ అన్నారు. అయినా జనహోరు ఆగలేదు. ‘కురబ టైగర్ గోరంట్ల మాధవ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభకు వచ్చిన కురుబలను ‘మీరంతా అల్లరిమూకలా? ఆయనకు బుద్ధిలేదు, పిల్ల ఆట ఆడతారు, అతన్ని అవతలికి పొమ్మను. ఇట్టా రాజకీయాలు పనికిరావు, రేవణ్ణ మాట్లాడతారు, సహకరించండి’ అని బీకే అన్నారు. అయినప్పటికీ జనాలు స్పందించలేదు. బీకే పార్థసారథి తనపై పరుష వ్యాఖ్యలు చేసినా మాధవ్ హుందాగా అందరికీ నమస్కారం చేసి వెనుదిరిగారు. కానీ వేదికపై రావాలని జనాలు మళ్లీ పట్టుబట్టారు. దీంతో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ జోక్యం చేసుకుని మాధవ్ వేదికపైకి రావాలని పిలిచారు. అప్పుడు తిరిగి ప్రజలంతా మాధవ్‌ను భుజాలపై ఎత్తుకుని వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేదిక ఎక్కిన మాధవ్ అభివాదం చేయగా... సభమొత్తం హోరెత్తింది. మాధవ్కున్న క్రేజ్‌ను సిద్ధరామయ్య, రేవణ్ణతో పాటు వేదికపై ఉన్నవారంతా అలా చూస్తూ ఉండిపోయారు. అనంతరం బీకే వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య వెళ్లిపోయారు. భోజనానికి వెళ్లారని, వస్తారని వేదికపై ఉన్నవారు చెప్పారు. బీకే పార్థసారథి కూడా వేదిక దిగి వెళ్లిపోవడంతో మాధవ్ కూడా వెళ్లిపోయారు. బీకే తీరుపై కురుబల ఆగ్రహం అయితే సాటి కురుబ వ్యక్తికి ఉన్న ప్రజాస్పందన చూసి ఎమ్మెల్యే బీకే∙ఓర్వలేకపోయారని, అలాంటపుడు కురబల్లో ఎక్కడ ఐక్యత ఉంటుందనీ, కురుబల్లో ఆయన తప్ప మరొకరు ఎదగకూడదనే వైఖరి బీకేలో ఉందని సభకు వచ్చినవారంతా చర్చించుకున్నారు. -
బుచ్చయ్యపై తమ్ముళ్ల గుస్సా
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక, ఫ్లాట్ల కేటాయింపు పారదర్శకంగా చేశాం. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా లంచాలు అడిగితే 1100కి ఫిర్యాదు చేయండి’’ అంటూ ఈ నెల 26వ తేదీన ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు పలువురు కార్పొరేటర్లలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం సహాయంతో జీ ప్లస్ 3 అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చేందుకు పథకం రూపాందిం చారు. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థలు, పిఠాపురం, అమలాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రపు రం, మండపేట, సామర్లకోట మున్సిపాలిటీల్లో 2015లో దాదాపు 21 వేల ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో రాజమహేం ద్రవరం నగరపాలక సంస్థ వాటాగా 4,200 ఇళ్లు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం 2016 మే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కొక్కచోట ఒక్కోలా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 16 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు, తొర్రేడు, శాటిలైట్‌సిటీ ప్రాంతాల్లో 4,200 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఫలితంగా స్థలం మా పరిధిలోనిదంటూ రూరల్ ఎమ్మెల్యే ఇళ్లలో వాటా తీసుకున్నారు. 2,400 ఇళ్లు నగరపాలక సంస్థలోని డివిజన్లకు, మిగతా 1,800 రూరల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇచ్చేలా నిర్ణయించారు. ఆ మేరకు 50 డివిజన్లలో డివిజన్‌కు 35 మంది చొప్పున లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేశారు. ప్రజా ప్రతినిధులకు వాటాలు.. డివిజన్‌కు 35 ఇళ్ల చొప్పున 1,750 ఇళ్లకు లాటరీ తీయగా, రాజమహేంద్రవరం రూరల్‌లో ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక జరిగిందీ ఎవరికీ తెలియదు. లాటరీ అనంతరం అప్పటి కమిషనర్, ప్రజా ప్రతినిధులు ప్రతి కార్పొరేటర్‌కు తలా రెండు ఇళ్ల చొప్పున ఇచ్చారు. ఇవిగాక అధికార టీడీపీ కార్పొరేటర్లలో కొంతమందికి ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఐదు ఇళ్లు చొప్పున ఇచ్చారు. వాటి లబ్ధిదారులను ఆయా కార్పొరేటర్లు ఎంపిక చేశారు. ఈ ఇళ్లను పలువురు రూ.50 వేల చొప్పున తీసుకుని ఇవ్వగా, మరికొందరు ఏమీ ఆశించకుండానే అర్హులైన వారిని సిఫార్సు చేశారు. నగదు వసూలు చేసే విషయమై పలుమార్లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించారని సమాచారం. అయినా పట్టించుకోని పలువురు యథావిధిగా తమపని తాము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు ముందు ఎమ్మెల్యే గోరంట్ల లంచాలు ఇవ్వొద్దంటూ బహిరంగ ప్రకటన చేయడంతో పలువురు కార్పొరేటర్లు గరంగరంగా ఉన్నారు. ఆ వ్యవహారాల సంగతేంటీ..? ఎమ్మెల్యే గోరంట్ల తమను ఉద్దేశించి తమ డివిజన్ ప్రజల ముందు మాట్లాడడంతో కార్పొరేటర్లు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టవద్దని కూడా చెప్పవచ్చుగా అంటూ సమావేశంలోనే పలువురు పక్కవారి వద్ద వ్యాఖ్యానించారు. అక్కడ ఖర్చు పెట్టిన డబ్బు ఎలా తిరిగి రాబట్టాలో సెలవిస్తే వింటామని సమావేశంలో కూర్చున్న పలువురు కార్పొరేటర్ల భర్తలు వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హయాంలో ఆవరోడ్డులో కట్టిన ఇళ్లను గత ఏడాది పంపిణీ చేశారు. అక్కడ అనర్హులంటూ దాదాపు 600 మందికి మొండిచేయి చూపారు. ఆయా ఫ్లాట్లను గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుంగు అనుచరులు, కార్పొరేషన్లో పదవులు ఉన్నవారు గ్రౌండ్ ఫ్లోర్ రూ.6 లక్షలు, మొదటి అంతస్తు రూ.4 లక్షలు, రెండో అంతస్తు రూ.2.75 లక్షల చొప్పున విక్రయించుకున్నారని, మరి వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఇన్స్పెక్టర్ల నియామకాలకు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇసుక ర్యాంపులు గుప్పెట్లో పెట్టుకుని రోజూ రూ.లక్షలు దండుకుంటున్న వైనంపై కూడా మాట్లాడాలని అధికార పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్న చందంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడడంపై ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్లలో చర్చ జరుగుతోంది. ఇది ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. మరో వైపు గోరంట్ల వ్యాఖ్యలు విన్న ఇతరులు.. ‘ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా?’ అంటూ చమత్కరించడం కొసమెరుపు. -
నాలుక కోస్తా అన్నావ్.. ఎక్కడికి రావాలి
-
నాలుక కోస్తా అన్నావ్.. ఎక్కడికి రావాలి: జేసీ
సాక్షి, అనంతపురం : ‘నాలుక కోస్తా అన్నావ్’... ఎక్కడికి రావాలని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, కదిరి సీఐ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు కొజ్జాలు అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై సీఐ మాధవ్ ఘాటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తన నాలుక కోయాలని, తనపైనే మీసాలు తిప్పుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా.. తేల్చుకుందాం’ అని సవాల్ విసిరారు. ఈ నెల 25 తర్వాత తాను బయటకు వెళ్తున్నట్లు.. ఈ లోపు ఎక్కడికి రావాలో చెప్పు తాడోపేడో తెల్చుకుందామన్నారు. (చదవండి: జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసుల తీవ్ర హెచ్చరిక) తాడిపత్రి ఘర్షణ సమయంలో పోలీసులు బాధ్యాతాయుతంగా వ్యవహరించలేదన్నారు. 200 మంది కర్రలతో దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు కొజ్జాల్లా పారిపోయారని, వారితో తను కూడా ఓ కొజ్జాలా పరుగెత్తినట్లు తెలిపారు. ఆడ, మగ కాని వారిని కొజ్జా అంటారని, ఈ పదం రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతారని, ఎవరైన బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. తను ఏ ఒక్కరి పేరుతో ఆ పదాన్ని ఉచ్చరించలేదని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు పరుగెత్తితే అలా అన్నానని చెప్పారు. ఈ విషయంలో తనది తప్పని నిరూపిస్తే పాదాభివందనం చేస్తానని, సీఐ మాధవ్ సినిమాల్లో హీరో సాయికుమార్‌లా మీసాలు తిప్పుతున్నాడని మండిపడ్డారు. ఈ సీఐ గతంలో తను చుట్టూ ఎన్నోసార్లు తిరిగాడన్నారు. అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రభోదానందస్వామి ఆశ్రమాన్ని తొలిగించాలని జేసీ డిమాండ్ చేశారు. విచారణ కమిటీకి ఇప్పటికే స్థానికులు అన్ని చెప్పారని, భక్తి భావంతో ప్రబోదానందస్వామి ఆశ్రమానికి ఒకసారి తను వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఆయన డేరా బాబాతో సమానమని ఆరోపించారు. చదవండి: పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారు!