సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీలో అంతర్గత వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేనే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం పై విచారం వ్యక్తం చేశారు.
కాగా, గత మార్చి నెలలో పార్టీ నాయకత్వ మార్పుపై బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మరొకసారి టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో టీడీపీ నేతలు సతమతమవుతున్నారు.ఒకవైపు పలు ఎన్నికల్లో టీడీపీ చవిచూసిన ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏం చేయాల్లో తెలియని డైలమాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment