East Godavari District
-
పాస్టర్ ప్రవీణ్ శరీరంపై గాయాలు.. ప్రమాదమా? లేక హత్యా?
సాక్షి, రాజమండ్రి: ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారిలో గామన్ బ్రిడ్జ్‌పై ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని పాస్టర్లు కోరుతున్నారు. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి, దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. -
‘జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’
తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రతి కుటుంబంలోనూ ఉందని మాజీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. జగనన్న పేదల గడపలకే సంక్షేమాన్ని చేర్చారని..కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం దారుణంగా ఉందని, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి వారి వాహనాల ధ్వంసం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు.గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు.. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ గూడూరు శ్రీనివాస్ లు పాల్గొన్నారు. జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు‘ఎన్నికలు వచ్చేవరకు ప్రతి కార్యకర్త ఫైట్ చేస్తూనే ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఏ విధంగా ఇబ్బందిపడి బయటకు వచ్చారో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తయింది. కూటమి తొమ్మిది నెలల పాలనలో జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు. కూటమి నాయకులు సైతం జగనన్నను తలుచుకుంటున్నారు. అందరూ కలిసి ఐక్యతతో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. తగిలిన గాయాలు, మనపై కట్టిన కేసులు అవి.. ఎవరు మర్చిపోవద్దు మనకి కూడా ఒక రోజు వస్తుంది. అప్పుడు కూటమి నేతలకు తిరిగి ఇస్తాం. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి పాదాభివందనం. ప్రతి కార్యకర్తకు ఆడబిడ్డగా నేను అండగా ఉంటాను. జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’ అని తానేటి వనిత పేర్కొన్నారు.జగన్ అంటేనే నిజం..వైఎస్ జగన్ అంటేనే నిజం అని అన్నారు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జగన్ పాలనలో ఒక్క పైసా కూడా ఆశించకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పని చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వద్దని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే చెబుతున్నారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి స్వార్థంగా మాట్లాడిన వాడు చంద్రబాబు తప్ప ఇంకెవరూ లేరన్నారు. రాష్ట్ర సంపద పొందాల్సింది పేదవాడు. అది ఒక వర్గానికో ఒక పార్టీకో చెందటానికి మనం రాచరికంలో లేము. సంక్షేమ పథకాలు పొందాలంటే ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?, టీడీపీ, బీజేపీ, జనసేన, ఈనాడు, టీవీ 5, ఏబీఎన్ కలిసి ప్రజలను మోసం పోయేలా చేశారు. సూపర్ సిక్స్ అని అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవాడు చంద్రబాబు.. ఎన్నికల ముందు రాష్ట్రంలో రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నార చంద్రబాబు, పవన్, పురందేశ్వరీ. శ్వేతపత్రాలని కొన్ని రోజులు హడావుడి చేశారు. చివరకు మతాల మీదకు తెచ్చారు. లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు ప్రమాదకరమైన ట్రోల్స్ చేశారు. ప్రతినెల డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నాడు. ఆరున్నర లక్షల కోట్లు అని చివరికి చెప్పక తప్పలేదు. సంపద సృష్టిస్తానంటూ అధికారం కోసం అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం అమ్మబడి ఎత్తేశాడుఅన్నదాత సుఖీభవ అన్నాడు అది ఎత్తేశాడు. కేంద్రం ఇచ్చేవి కాకుండానే ప్రతి రైతుకు 20000 ఇస్తానన్నాడు. ఉచిత బస్సు లేదు.. మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఒకటి ఇచ్చాడు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే 79 వేల కోట్లు కావాలి...?, మహిళలకు 15000 ఇస్తా అన్నాడు ఎలా మోసపోయారో వారికి చెప్పాలి .మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’ అని పేర్కొన్నారు. -
కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా
టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా అమ్మమ్మ రాజేశ్వరీదేవి మృతి చెందారు. తణుకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య రాజేశ్వరి దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. సొంతూరు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రానాతో పాటు దగ్గుబాటి సురేష్ కూడా ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రానాకు రాజేశ్వరీదేవి స్వయానా అమ్మమ్మ కావడంతో పాడె మోశారు. రానా దగ్గుబాటి తల్లి లక్ష్మీ పుట్టింటి ఫ్యామిలీ రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ప్రముఖంగా ఉన్నారనే విషయం తెలిసిందే. -
భూగర్భజలం పుష్కలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ భూగర్భ జలాల లభ్యత పెరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో భూగర్భ జలమట్టం 4.19 మీటర్లు పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగిన జిల్లాల్లో శ్రీసత్యసాయి జిల్లా (12.69 మీటర్లు) మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ప్రకాశం జిల్లా (8.52 మీటర్లు), మూడో స్థానంలో పల్నాడు జిల్లా (7.97 మీటర్లు) ఉన్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా(1.16 మీటర్లు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (1.31 మీటర్లు), పార్వతీపురం మన్యం జిల్లా(1.52 మీటర్లు)లో అత్యల్పంగా పెరిగాయి. 26 జిల్లాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరగడంతో బోరు బావుల కింద రబీలో పంట సాగుకు, వేసవిలో తాగు నీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. సగటున 7.6 మీటర్లలో భూగర్భ జలాల లభ్యత నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై.. మే 31తో ముగుస్తుంది. గత నీటి సంవత్సరం ముగిసేటప్పటికి అంటే 2024 మే 31కి రాష్ట్రంలో భూగర్భ జలాలు 11.79 మీటర్లలో లభ్యమయ్యేవి. గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికి 858 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటిదాకా 950.57 మిల్లీమీటర్లు కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 10.79 శాతం ఎక్కువ. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం భూగర్భ జలమట్టం సగటున 7.6 మీటర్లకు చేరుకుంది. అంటే.. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే 4.19 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.బాపట్ల జిల్లా గరిష్టం.. తూర్పు గోదావరిలో కనిష్టం భూగర్భ జలాల లభ్యతలో బాపట్ల జిల్లా (2.63 మీటర్లతో) ప్రథమ స్థానంలో ఉంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా (2.64 మీటర్లు) రెండో స్థానంలో, గుంటూరు జిల్లా (3.39 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాయి. భూగర్భ జలాల లభ్యత కనిష్టంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా (21.66 మీటర్లతో) ప్రథమ స్థానంలో నిలవగా.. ఏలూరు జిల్లా(17.59 మీటర్లు) రెండో స్థానంలో, అన్నమయ్య జిల్లా(13.67 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. -
‘కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదు’
గోపాలపురం(ప.గో.జిల్లా): గోపాలపురం మండలం హుకుంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆమెను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత.. సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని వనిత డిమాండ్ చేశారు. -
దాడి వీడియోలున్నా పోలీసుల నుంచి స్పందన లేదు: మార్గాని భరత్
తూర్పుగోదావరి, సాక్షి: తూర్పుగోదావరి జిల్లా సీతంపేట మూలగొయ్యి గ్రామనికి చెందిన యువకుడుపై దాడి జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. దాడికి సంబంధించిన ప్రత్యక్ష వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. అయినా పోలీసుల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారాయన. సోమవారం మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు.‘‘మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనలో ఉన్నట్టుంది. కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల గళాన్ని వినిపిస్తాం. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాపై దాడులు చేయటం.. ప్రజాస్వామ్యానికి విఘాతం. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి.. ఏ కోర్టులో హాజరు పరుస్తున్నారో కూడా తెలియటం లేదు’’ అని అన్నారు. -
తూ.గో.లో ఘోరం.. బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉండ్రాజవరం మండలం సూర్యరావు పాలెం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగు దాటికి బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మిగతా కూలీలు ప్రాణభయంతో సమీపంలోని అరటి తోటల్లోకి పరిగెత్తారు. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరణించిన ఇద్దరు మహిళలని, బాణాసంచా తయారీ కేంద్రంలో పని చేసే వారిగా తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతులను నిడదవోలు మండలం తాడిమళ్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 10 మంది ఉన్నారు. -
రాజమండ్రిలో చిరుత కలకలం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. జాతీయ రహదారి సమీపంలో దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత సంచరించినట్లు ఆనవాళ్లను గుర్తించారు.చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు
తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్ అండ్ ఆర్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్ కాదని ఆర్డీవో కేఎన్ జ్యోతి అంటున్నారు. ‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్‌కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్సీపీ హయాంలోని ఫైల్సే తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది. -
గోదావరి వరద ఉద్ధృతి.. కూలిపోయిన 'సినిమా' చెట్టు
దాదాపు 100కి తెలుగు సినిమాల్లో కనిపించిన పెద్ద చెట్టు.. గోదావరి నది వరద ఉద్ధృతికి కూలిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లపూడి దగ్గరలోని కుమారదేవం గ్రామంలో నది ఒడ్డున నిద్ర గన్నేరు చెట్టు ఉంది. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని దాదాపు 145 నుంచి ఉన్న ఈ చెట్టు దగ్గర చాలా షూటింగ్స్ జరిగాయి. దీంతో ఇది కాస్త సినిమా చెట్టుగా పేరు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో నేరుగా రిలీజ్)పాడిపంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలా రాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే 108కి పైగా సినిమా సీన్స్ ఇక్కడ తీశారు. అలానే ఈ చెట్టు కింద సీన్ తీస్తే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా టాలీవుడ్లో ఉంది. ప్రముఖ దర్శకుడు వంశీ అయితే తన 18 సినిమాల్లో ఈ చెట్టుని చూపించారు. రాఘవేంద్రరావు, దాసరి, జంధ్యాల, ఈవీవీ కూడా ఈ చెట్టు సెంటిమెంట్ ఫాలో అయ్యారు.చివరగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా సీన్‌ని ఇక్కడ తీశారట. ఇక ఈ చెట్టు కూలిపోయిన వార్త తెలిసి.. తెలుగు ప్రేక్షకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన జ్ఞాపకాల్ని పంచుకుంటున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?) -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్‌ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసం
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడుతున్నారు. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా ఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారు. టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసిన శిలా ఫలకాన్ని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంతో మందితో పోరాడి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టామని.. అలజడి సృష్టించడం వల్ల ఉపయోగం లేదన్నారు.‘‘రాజమండ్రి ప్రశాంతమైన నగరం. ప్లైఓవర్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు శిలాఫలకంపై నా పేరు మాత్రమే కాదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్లు కూడా ఉన్నాయి. శిలాఫలం ధ్వంసం చేసినా ప్రజల మనసుల్లో మా పేరు తొలగించలేరు. అలజడి సృష్టించటం వల్ల ఉపయోగం లేదు. అభివృద్ధి కోసం పాటుపడాలి’’ మార్గాని భరత్ హితవు పలికారు. -
తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
సాక్షి తూర్పుగోదావరి జిల్లా: ఓ రోడ్డు ప్రమాదంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్‌ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా, క్లీనర్, డ్రైవర్‌కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్‌లను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్‌లను అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది.Cinematic: Accident leads to Rs 7 crore cash seizure packed in 7 cardboard boxes loaded in Tata Ace vehicle going from Vijayawada towards Vizag, that overturned after hitting a truck & one box fell out revealing currency hidden packed in between sacks #AndhraPradesh #EastGodavari pic.twitter.com/OXoy0oaRJI— Uma Sudhir (@umasudhir) May 11, 2024 బాక్స్‌లోని డబ్బులను అధికారులు,ఎలక్షన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ లెక్కిస్తోంది. నగదు మొత్తం రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం.ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు భారీ గా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Updates.. కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ కాకినాడ జిల్లా సిద్ధం ఇక్కడ కనిపిస్తోంది.. నిండు గోదావరి ఇక్కడ కనిపిస్తోంది.. అభిమాన వరద గోదావరి ఈ ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం.. దాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం మీ అందరిలోనూ కనిపిస్తోంది ఈ సభకు ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ, నా అక్కలకు, నా చెల్లెమ్మలకు, నా అవ్వలకు, నా తాతలకు, నా ప్రతీ సోదరుడికీ, నా ప్రతీ స్నేహితుడికి ముందుగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు ఇంటింట ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్ జరుగుతోంది ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలు వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుంది జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి లేదంటే బాబు మార్క్‌తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడు జగన్‌కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్ మార్క్ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుంది. అదే సమయంలో పెన్షన్ అందిస్తున్న జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశాం ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగింది. లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్ ముగింపు ఉంటుంది మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడు ఫ్యాన్‌కు ఓటేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్‌తో ముగింపు పడుతుంది. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు అన్నది జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి లేదంటే.. చంద్రబాబు మార్క్‌తో ముగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు ఫ్యాన్‌కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్ బోధన, ఐఎఫ్బీ ప్యానల్స్, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇక పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ దీనిలో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ద్వారా విదేశాల్లో అతి ఉన్నత విద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం తొలిసారి డిగ్రీలో మ్యాండెటరీ ఇంటెర్న్షిప్ ఇవన్నీ కొనసాగి మీ పిల్లలు ఎదగాలంటే.. మీ బిడ్డ వైఎస్ జగన్ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్ మార్క్ విప్లవాలు కొనసాగుతాయి. లేదంటే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, నాడు-నేడు రద్దు, బడి పిల్లలకు ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే సమయానికి ఇచ్చే విద్యాకానుక రద్దు. ట్యాబ్స్, విద్యా కానుక, వసతి దీవెన ఇలా అన్నీ కూడా రద్దు చంద్రబాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపులు చూడాల్సి ఉంటుంది మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. లకలక, లకలక అంటూ అన్నింటికి ముగింపు. ఫ్యాన్‌కు ఓటేస్తేనే గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఫ్యామిలీ డాక్టర్, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష ఇంటివద్దనే టెస్టులు, గ్రామంలోనే మందులు గ్రామంలో రూపు రేఖలు మారుస్తూ నాడు నేడు రూ. 25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య శ్రీతో పాటు ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్‌లు నిర్మాణం జగన్ మార్క్ ఈ విప్లవాలు కొనసాగాలంటే ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే కొనసాగుతాయి లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాలి అంటూ వైద్యం అందని పరిస్థితుల్లోకి పేదవాడిని తీసుకు పోతుంది ఫ్యాన్‌కు ఓటేస్తేనే పిల్లల్ని బడులకు పంపే తల్లులకు అమ్మ ఒడి అనే పథకం, విద్యా దీవెన, వసతి దీవెన. ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఈబీసీ నేస్తం కొనసాగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ వైఎస్సార్ జగనన్న కాలనీలు, అందులో 30 లక్షల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లలు.. అన్నీ కూడా వేగంగా అడుగులు ఫ్యాన్‌కు ఓటేస్తేనే.. నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబాలం ఇస్తూ యాబై శాతం రిజర్వేషన్లతో పదవులు అన్నీ కూడా ఉండాలంటే మీ బిడ్డ జగన్ మళ్లీ వస్తానే అనేది ఆలోచన చేయండి లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి వదల అంటాడు బాబు సిట్ అంటే పవన్ సిట్.. స్టాండ్ అంటే పవన్ స్టాండ్ ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది. బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుంది. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా? పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా? బాబు మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా మళ్లీ అక్క చెల్లెమ్మల బతుకులన్నీ అతలాకుతలం ఆవుతాయి. ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి.. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి ఎవరి ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఓటేయండి అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.. మీ జీవితాలను, తలరాతలను మార్చే ఎన్నికలు మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? లేకపోతే దోచుకుని దాచుకుని చంద్రబాబు పాలన కావాలా? మీ బిడ్డ చేసిన పాలన అందరికీ కనబడుతోంది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి కాకినాడ వైఎస్సార్సీపీ రూరల్ అభ్యర్థి కన్నబాబు స్పీచ్ చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తుంటే.. బాబు మాత్రం నాణ్యమైన మద్యం అందిస్తారంట వాలంటీర్ సేవలను అడ్డుకున్న కుట్రదారు చంద్రబాబు ఈ సందర్భంగా మేమంతా సిద్ధం అని తెలియజేసుకుంటున్నా అచ్చంపేట జంక్షన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం లక్షలాదిగా తరలి వచ్చిన ‘అభిమానం’ జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం కాకినాడ జిల్లా: అచ్చంపేట జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర మరికాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం\ సభలో పాల్గోని ప్రసంగించనున్న సీఎం జగన్ జిల్లా నలమూలల నుండి సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు కాకినాడ జిల్లా: ఉండూరు క్రాస్ వద్ద జె.సత్యనారాయణ అనే పేషెంట్‌ను కలిసిన సీఎం జగన్ పిరుదు భాగంలో సర్జరీ కావడంతో వీల్ ఛైర్‌కి పరిమితం అయిన కాకినాడ రూరల్ తూరంగికి చెందిన సత్యనారాయణ. ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా ఆదుకుంటానని హమీ ఇచ్చి మానవత్వం చాటుకున్న సీఎం జగన్ కాకినాడ జిల్లా: ఉండూరు క్రాస్ నుండి ప్రారంభమైన మేమంతా సిద్దం సీఎం జగన్ బస్సుయాత్ర మరికాసేపట్లో తిమ్మాపురం మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గోననున్న సీఎం జగన్ బస్సుయాత్రలో సీఎం జగన్‌కు భద్రత కట్టుదిట్టం బస్సుయాత్రలో ప్రత్యేకంగా మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పోలీస్ శాఖ, ఐ పేజ్ సంయుక్తంగా కమాండ్ సెంటర్ పర్యవేక్షణ సీఎం జగన్ భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు వైఎస్సార్సీపీలోకి చేరిన టీడీపీ, జనసేన కీలక నేతలు కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన జనసేన, తెలుగుదేశం, కీలక నేతలు కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి. రంగంపేట చేరుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్ చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనాలు బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ దారిపొడవునా సీఎం జగన్‌కు ఘన స్వాగతం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో అఖండ స్వాగతాలు కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్లో మేమంతా సిద్దం సభ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభమైన మేమంతా సిద్దం బస్సు యాత్ర మరికాసేపట్లో కాకినాడ జిల్లాలో ప్రవేశించనున్న సిఎం జగన్ యాత్ర సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్లపై బారులు తీరిన అశేష జనవాహిని నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు Memantha Siddham Yatra, Day -18. ఉదయం 9 గంటలకు ST రాజపురం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4.30 గంటలకు కాకినాడలో బహిరంగ సభ గోడిచర్ల దగ్గర రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/gtYVbwAgfq — YSR Congress Party (@YSRCParty) April 19, 2024 గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు కడియపులంకలో సీఎం వైఎస్ జగన్‌పై పూల వర్షం వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం -
మేమంతా సిద్ధం 17వ రోజు: సీఎం జగన్ బస్సు యాత్ర సాగిందిలా
Updates.. తూర్పుగోదావరి జిల్లా... 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర పర్యటన ముగించుకుని రాజానగరం మండలం ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ రాజానగరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. భారీగా హాజరైన ప్రజలు. బస్సుపైకి ఎక్కి ప్రజలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్. రాజానగరం వైపు సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర రాజమండ్రి: గోకవరం బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న బస్సు యాత్ర. సీఎం జగన్‌కు స్వాగతం పలికిన జనం దేవి చౌక్ సెంటర్లో కిక్కిరిసిన జనం జనసంద్రంగా మారిన రాజమండ్రి రోడ్లు రాజమండ్రి నగరంలో సిఎం వైఎస్ జగన్ కి అపూర్వ స్వాగతం అభిమానుల సందోహంతో పోటెత్తిన ఆజాద్ చౌక్. పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ముస్లింలు . జై జగన్ నినాదాలతో మార్మోగిన ఆజాద్ చౌక్ . తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు. చర్చిసెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర సీఎం జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం రాజమండ్రి సిటీలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు ఆనందంతో డాన్స్ వేసి మరి సీఎం జగనకు స్వాగతం పలుకుతున్న యువతులు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న రాజమండ్రి సిటీ జన సందోహంతో నిండిపోయిన మోరంపూడి, షెల్టన్, తాడితోట, ఆజాద్ చౌక్ , దేవి చౌక్ సెంటర్లు తాడితోట జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్‌కు పూలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు బూడిది గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన బస్సు యాత్ర రాజమండ్రి నగరంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సుయాత్ర మోరంపూడి జంక్షన్ దాటిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మరికాసేపట్లో తాడితోట జంక్షన్‌కు చేరుకోనున్న సీఎం బస్సుయాత్ర మోరంపూడి జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్‌కు జనహారతి.. వేమగిరికి చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర వేమగిరిలో పోటెత్తిన జనసంద్రం సీఎం జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం తూర్పుగోదావరి జిల్లా. కడియపులంకలో పోటెత్తిన జనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా రోడ్డుకు ఇరువైపుల బారులు తీరిన మహిళలు మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్‌కు జనహారతి కాసేపట్లో రాజమండ్రి నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షో కడియపు లంక చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజలు తూర్పుగోదావరి జిల్లా: కడియపు లంక వద్ద జగన్‌కు స్వాగతం పలికేందుకు హైవే పై భారీగా చేరుకున్న ప్రజలు సీఎం జగన్ పై తమ అభిమానం చాటుకునేందుకు పెద్ద ఎత్తన కడియపులంక,దుళ్ళ,జేగురుపాడు గ్రామాల నుండి చేరుకున్న మహిళలలు. గంటల తరబడి మండుటెండలో జగన్ కోసం నీరిక్షణ సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న మహిళలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను నమ్మేది లేదని స్పష్టం చేసిన మహిళలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పొట్టిలంక భోజన విరామ ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కోనసీమ జిల్లాలోకి మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రావులపాలెంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం మండుటెండలోనూ జననేత కోసం పోటెత్తిన అభిమానం సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో ఆఖండ స్వాగతాలు సీఎం జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు. రామకృష్ణంరాజును ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. వైఎస్సార్సీపీలోకి జనసేన, టీడీపీ కీలక నేతలు తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, టీడీపీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలోకి చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ(ఏసుబాబు), టి.త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కేశనపల్లి డి. సూర్యనారాయణ. రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు సారథ్యంలో వైఎస్సార్సీపీలోకి చేరిన జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన 17వ రోజు కొనసాగుతోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మండుటెండను సైతం లెక్కచేయక జననేత కోసం పోటెత్తిన జనం పలువురి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా బస్సు యాత్ర తేతలి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర అభిమానం.. ఆకాశమంత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో అమితాదరణ కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు జిల్లాలు దాటి ఎండా, వాన లెక్క చేయకుండా ప్రయాణం పగలూ, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్న అవ్వాతాతలు చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత వేలాది బైకులతో భారీ ర్యాలీలు గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణ సంచాలతో అఖండ స్వాగతాలు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు Day-17 తూర్పు గోదావరి జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2024 నేడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఇలా.. సీఎం జగన్ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
YSRCP తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థులు వీళ్లే
తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
టీడీపీకి రాజీనామా దిశగా మాజీ మంత్రి కేఎస్ జవహర్?
సాక్షి, తూర్పుగోదావరి: టికెట్ దక్కకపోవడంతో టీడీపీని వీడే యోచనలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జవహర్.. అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించలేదు. జవహర్‌ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జవహర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కొవ్వూరు టికెట్‌ను జవహర్ ఆశిస్తుండగా, నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించిన సంగతి తెలిసిందే. జవహర్.. కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు ఘోర అవమానం ఎదురైందా? పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెట్టారా? ద్విసభ్య కమిటీలోని ఓ నేత ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా? ఏళ్ల తరబడి పార్టీకి చేసిన సేవను లెక్క చేయకుండా పక్కన పెట్టేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల రెండో జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈసారి జవహర్‌కు కొవ్వూరు టికెట్టు దక్కనీయకుండా పార్టీలోని ఆయన వైరివర్గాలు బలంగా పని చేశాయి. దీంతో ఒకవేళ ఇక్కడ కాకపోయినా గత ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనైనా టికెట్టు ఇస్తారని జవహర్ వర్గం భావించింది. కానీ, అక్కడ టీడీపీ అభ్యర్థిగా కొటికలపూడి శ్రీనివాసరావును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గోపాలపురం నియోజకవర్గానికై నా పంపుతారని భావించగా.. మద్దిపాటి వెంకట్రాజు పేరు ఖరారు చేసింది. ఇప్పుడు కొవ్వూరులో కూడా ముప్పిడి పేరు ప్రకటించడం ద్వారా అన్నిచోట్లా జవహర్‌కు చంద్రబాబు మొండిచేయే చూపారు. ఫలితంగా పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో మాత్రమే కొనసాగే పరిస్థితి జవహర్‌కు ఏర్పడింది. ఈ పరిణామంతో ఆయన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భగ్గుమన్న జవహర్ వర్గీయులు పార్టీ జిల్లా అధ్యక్షుడు.. అందునా మాజీ మంత్రి అయిన జవహర్‌నే పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మారింది. జిల్లా స్థాయి నేతనే ఇలా పరాభవిస్తే.. ఇక సామాన్య నేతలకు టీడీపీలో న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ఆయా వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అధినేత నిర్ణయం జవహర్ వర్గీయులకు మింగుడు పడటం లేదు. తమ నేతకు చేసిన అవమానానికి పార్టీ తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని వారు సవాల్ విరుసుతున్నారు. ఈ అవమానంపై వారు భగ్గుమన్నారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫెక్ల్సీలను చించేశారు. అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో జవహర్ తన వర్గీయులతో సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జవహర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం సుజయకృష్ణ రంగారావును పంపింది. పార్టీ ఆదేశాల మేరకు పని చేయాలని సూచిస్తున్నా జవహర్ ససేమిరా అంటున్నారు. -
అన్నీ లాగేసుకుని.. ఇదేం లిస్ట్ బాబూ..?
తూర్పుగోదావరి/పశ్చిమ గోదావరి: ముందు నుంచి ఊహించిందే జరిగింది. టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత ఇరు పార్టీల నుంచి అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరాయి. కొన్ని చోట్ల ఆ పార్టీల ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అధిష్టానానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. రాజానగరంలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి ఎదురైంది. అలాగే.. రాజమండ్రి రూరల్ స్థానానికి ఇప్పటిదాకా ఇరు వర్గాలకు క్లారిటీ లేకుండా చేశారు. దీంతో.. టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక.. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. మరోవైపు.. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు సీట్లు టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. తణుకులో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని స్వయంగా ప్రకటించిన పవన్.. ఇప్పుడు చంద్రబాబుకి తలొగ్గి ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేశాడని కేడర్ మండిపడుతోంది. ఇక.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, చింతలపూడి స్థానాల్ని సైతం టీడీపీనే లాగేసుకుంది. ఈ క్రమంలో.. మాజీ మంత్రి పీతల సుజాతకు మొండి చేయి చూపించారు చంద్రబాబు. ఇక.. చింతలపూడి లో నాన్ లోకల్‌కి టికెట్ కేటాయించడంతో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంగా రోషన్‌కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. తాడేపల్లిగూడెం, నరసాపురం స్థానాల్లో టిడిపి జనసేన మధ్య కుమ్ములాటలతో తొలి జాబితాలో పంచాయితీ తేలలేదు. ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేననేత రెడ్డప్పల నాయుడుకి భంగపాటే ఎదురైంది. ఉండి నియోజకవర్గంలో టికెట్ పై ఆశకు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చినా విడివాడ రామచంద్ర రావుకు సీటు దక్కలేదు. పాపం.. తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ప్రచారం చేసుకున్న విడివాడ రామచంద్ర రావుకు చుక్కెదురైంది. -
ఇంతకీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు ఉన్నట్టా? లేనట్టా?
టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యకు ఇప్పుడు పోటీ చేయడానికి సీటే లేకుండా పోయిందా? రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ సీట్లలో ఏదీ బుచ్చయ్యకు ఖాయం కాలేదా? ఈ రెండు సీట్లు ఎవరికి కేటాయించబోతున్నారు? సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని టీడీపీ అధ్యక్షుడు ఎందుకు పట్టించుకోవడంలేదు? ఇంతకీ బుచ్చయ్యకు సీటు ఉన్నట్టా? లేనట్టా? తెలుగుదేశం పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి పోటీ చేసే స్థానం కోసం వెత్తుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా బుచ్చయ్య సిటింగ్ సీటు రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించాలని జనసేన నిర్ణయించుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన దుర్గేష్ ఓటమి పాలైనా, 40 వేలకు పైగా ఓట్లు సంపాదించుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపు సామాజికవర్గం కూడా దుర్గేష్ కు మద్దతుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే వ్యవహారం టీడీపీలో కలకలానికి కారణమవుతోంది. రాజమండ్రి రూరల్ తరపున తానే పోటీ చేస్తానని ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటున్న బుచ్చయ్య చౌదిరికి చంద్రబాబు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేదు. బుచ్చయ్య చౌదిరికి అడ్డాలాంటి కాతేరులో చంద్రబాబు సభ నిర్వహించినా, బుచ్చయ్య పేరును ప్రకటించలేదు. తర్వాత కూడా బుచ్చయ్యకు చంద్రబాబు నుంచి పోటీకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. దీంతో పోటీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న బుచ్చయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన నేత కందుల దుర్గేష్ కు కేటాయించినందున..రాజమండ్రి సిటీలో పోటీ చేసేందుకు బుచ్చయ్య సిద్ధపడుతున్నట్టు సమాచారం. అయితే రాజమండ్రి సిటీలో పోటీ చేయడానికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఎప్పుడో ఫిక్సయ్యారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం తనదేనంటూ ఆదిరెడ్డి వాసు గతంలో సభపెట్టి మరీ ప్రకటించారు. ఇపుడు బుచ్చయ్య దృష్టి మళ్ళీ సిటీ నియోజకవర్గంపై పడటంతో ఆదిరెడ్డి వర్గంలో అలజడి రేగుతోంది. ఇప్పటికే ఆదిరెడ్డి, బుచ్చయ్య వర్గాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తాజా పరిణామాలతో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాజానగరం నుండి కూడా బుచ్చయ్య పోటే చేసే అవకాశం లేకుండా పోయింది. రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటు రాజమండ్రి రూరల్ స్థానం కోల్పోయి, రాజానగరం దక్కక ఏం చేయాలో తెలియక బుచ్చయ్య వర్గం అయోమయంలో కూరుకుపోయింది. తన స్వంత నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడి సభ ఏర్పాటు చేసినా, తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించుకోలేని స్థితి బుచ్చయ్య ఎదుర్కొన్నారు. గతంలో మండపేటలో సభ ఏర్పాటు చేసినపుడు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేవేగుళ్ల జోగేశ్వరరావు అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన చంద్రబాబు కాతేరు బహిరంగసభలో తన పేరు కూడా ప్రకటిస్తారని బుచ్చ్యయ్య ఎదురు చూశారు. అయితే చంద్రబాబు పొరపాటున కూడా బుచ్చయ్య పేరును ప్రకటించకపోవడంతో తమకు ఎక్కడి స్థానం దక్కుతుందో, అసలు పోటీ చేసే అవకాశం లభిస్తుందో లేదో తెలియక బుచ్చయ్య వర్గం మథనపడుతోంది. రాజమండ్రి రూరల్ నుండి వరుసగా రెండు సార్లు విజయం సాధించినా, సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించినా, బుచ్చయ్యకు మాత్రం ఊరట లభించడం లేదు. త్యాగాలకు సిద్ధపడాలంటూ చంద్రబాబు ఇస్తున్న పిలుపునకు అర్ధం ఏమిటో, అది తమకే వర్తిస్తుందేమోనని బుచ్చయ్య అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ చదవండి: టీడీపీ చంద్రబాబు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. -
దేవరపల్లిలో జన జాతర
సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమం, చేసిన మేలును వివరించేందుకు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైంది. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల నుంచి అశేష సంఖ్యలో తరలి వచ్చిన జన ప్రవాహంతో దేవరపల్లి పరిసర ప్రాంతాలు, సభా ప్రాంగణం పోటెత్తాయి. తొలుత కృష్ణంపాలెం హైవే నుంచి సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలతో 6 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆరు వేల మందికి పైగా యువత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. దేవరపల్లి బస్టాండ్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకూ ప్రజలు నేతల ప్రసంగాలు శ్రద్ధగా విన్నారు. సీఎం జగన్ తమకు చేసిన మంచిని గుర్తుకు చేసుకుని ‘జై జగన్.. 2024 జగన్ వన్స్‌మోర్’ అంటూ నినదించారు. సంఘ సంస్కర్త సీఎం జగన్: మంత్రి చెల్లుబోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ సంఘ సంస్కర్త అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. నాలుగన్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.60 లక్షల కోట్లు జమ చేశారని, ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయని తెలిపారు. పేదలకు అంతర్జాతీయస్థాయి విద్య, వైద్య సౌకర్యాలను చేరువ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ తలెత్తుకొని తిరుగుతున్నారని వివరించారు. వృద్ధి రేటు పెంచిన సీఎం జగన్: మంత్రి కారుమూరి సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలతో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధిస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పేదల ఆరి్థక స్థితిగతులు మార్చారని అన్నారు. దీంతో రాష్ట్ర వృద్ధి రేటు 11.5 శాతానికి పెరిగిందని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కొని రైతులకు 72 గంటల్లోనే నగదు చెల్లించామన్నారు. సామాజిక సాధికారత సాధ్యం చేశారు : మంత్రి తానేటి వనిత దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న సామాజిక సాధికారతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధ్యం చేసి చూపించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు సంక్షేమంలో, పదవుల్లో పెద్ద వాటా ఇచ్చి, వారిని అభివృద్ధి పథంలోకి తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ట్యాబ్‌లు ఇస్తున్నారని, వారికి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే వాటి ద్వారా అందిస్తున్నారని చెప్పారు. దీనిని కూడా కొందరు తప్పుపడుతున్నారని, పెత్తందార్ల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవవచ్చు కానీ, పేద పిల్లలు చదివితే భరించలేరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పేదలకు భూములిచ్చారు: ఎంపీ సురేష్ వైఎస్ జగన్ అధికారం చేపట్టాక అసైన్డ్, అన్యాక్రాంతమైన భూములను పేదలకు అందించారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. మహిళా సాధికారతకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేత జగనేనన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి: ఎంపీ మార్గాని భరత్‌రామ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. రూ.10 వేల కోట్లు వెచ్చిస్తే మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: ఎమ్మెల్యే తలారి ఈ నాలుగున్నరేళ్లలో గోపాలపురం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి సీఎం జగన్ రూ.3 వేల కోట్లు వెచ్చించారని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. ఇందులో రూ.1,200 కోట్లు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. -
చంద్రబాబు, పవన్, బాలకృష్ణకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Updates.. ఎల్లో బ్యాచ్‌కు స్ట్రాంగ్ కౌంటర్.. సామర్లకోటలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంది. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కోరుకునేది ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం.. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకోవడం. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్. సినిమా షూటింగ్స్ లేని టైమ్‌లో ఇక్కడికి వచ్చి స్టోరీలు చెబుతాడు. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువ, విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. సీఎం జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయి.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుంది.. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. సీఎం జగన్ మాట్లాడుతూ.. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం. ►రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం. ►రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. ►కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు. ►రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. ►రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ►ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ►లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ►రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ►ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నాం. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ►ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందిస్తున్నాం. ►వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నాం. ►పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ►పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ►తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదు. ►మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చాం. ►సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ►నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం. ►మన ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయి. ►పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోంది. ►గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదు. ►పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. ►పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. ►సామర్లకోటలో బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్. ►జోతిప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ► జగనన్న కాలనీలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్. ► పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లను అందించిన సీఎం జగన్. ► జగనన్న కాలనీని పరిశీలించిన సీఎం జగన్ ► కాసేపట్లో సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సీఎం జగన్ బహిరంగ సభ. ► సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న సీఎం జగన్ ►సీఎం జగన్ సామర్లకోటకు చేరుకున్నారు. పార్టీ నేతలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. Stunning Visuals of #YSRJaganannaColonies to be launched by CM @ysjagan today at Samarlakota in Kakinada. 🏠 ✨💫 Samarlakota YSR Jagananna Colony is one of the largest housing colonies undertaken by the government, with the completion of approximately 2,000 housing units.… pic.twitter.com/DJ1alSIPuN — YSR Congress Party (@YSRCParty) October 12, 2023 ►సామర్లకోటకు బయలుదేరిన సీఎం జగన్ ►రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. ►కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొననున్నారు. ►మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు లో భాగంగా సామర్లకోటలో లబ్ధిదారులకు అందించనున్న ఇళ్ళ విజువల్స్. #YSRJaganannaColonies pic.twitter.com/1hb1PEI53I — YSR Congress Party (@YSRCParty) October 12, 2023 అడ్డంకులను అధిగమిస్తూ.. ►రాష్ట్రంలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. ►ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి ►పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది -
స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: సీఎం జగన్
Updates.. ములాఖత్‌లో మిలాకత్లా? చంద్రబాబు-పవన్‌లపై సీఎం జగన్ విమర్శలు - 45 ఏళ్ల నుంచి బాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారు - ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు - ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారు - సాక్ష్యాదారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారు - బాబు దొంగతనాల్లో వీరంతా వాటాదారులే - ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు - ఎల్లో మీడియా నిజాలను చూపించరు - ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతి పై మాట్లాడదు - నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారు - లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారు - స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే - ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు - ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు - సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది - ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది - ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు - డొల్ల సూట్ కేసు కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ తేల్చింది - ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు - కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు - ఎల్లో మీడియా ఈ నిజాలు చూపించదు , వినిపించదు - చంద్రబాబు పీఏకు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది - రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ? - ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ? - వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరు - లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు - ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు - ప్రజలంతా ఆలోచన చేయాలి - మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి - మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి - మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తాం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు లో నాలుగో విడత కాపు నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం - మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం - మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతఙ్ఞతలు చెబుతున్నా - కాపు నేస్తంతో ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నాం - వరుసగా ఐదేళ్ల పాటు రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం - 3,57,844 మందికి రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నాం - లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం - కాపు నేస్తం తో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరింది - ఒంటరి మహిళలకు ఆర్ధిక స్వాలంబన చేకూర్చడమే లక్ష్యం - 45 నుంచి 60 ఏళ్ల అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం - నాలుగేళ్లలో రూ. 2,029 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం - గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం అమలు చేయలేదు - ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు - కాపు పేద మహిళలకు అండగా ఉండాలనే ఈ పథకం - కేబినెట్ లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం - ఇది మీ అందరి ప్రభుత్వం - నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం - కులం, మతం, రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నాం - అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం - రూ. 2.30 లక్షల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా అందించాం - నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ది చేకూరింది - గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదు ? - చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదు - చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారు - రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు - 4 ఏళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247 కోట్లు ఇచ్చాం - మేనిఫెస్టో లో చెప్పిన దాని కంటే మిన్నగా చేశాం - గత ప్రభుత్వం మంజునాథ కమిషన్ పేరుతో మోసం చేసింది - అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు - అక్రమాలు చేసిన వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు - చట్టం ఎవరికైనా ఒక్కటే : సీఎం జగన్ ►నాలుగో విడతలో వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. కాపునేస్తంతో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు రూ.75వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేస్తున్నాం. లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. కాపు నేస్తంతో 4లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూరింది. 45 నుంచి 60 ఏళ్ల అక్క చెలమ్మలకు అండగా నిలిచాం. ► ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ సారథి. సీఎం జగన్‌కు నిడదవోలు ప్రజల తరఫున స్వాగతం. వైఎస్సార్ కాపునేస్తంతో ఒంటరి మహిళలకు ఎంతో లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేసింది. ► ముఖ్యమంత్రి జగన్ నిడదవోలు చేరుకున్నారు. ► నిడదవోలు బయలుదేరిన సీఎం జగన్. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు నిడదవోలులో పర్యటించనున్నారు. ► ఈ సందర్బంగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడతలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ► అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. ► 9:40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం జగన్ ► 10:10 నిడదవోలు టౌన్ సుబ్బరాజుపేటలోని హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకోనున్నారు. ► 10:20 సభా వేదిక వరకూ రోడ్ షో ► 10:35 సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాలలోనీ సభాస్థలి వద్దకు చేరుకుని నిధులు విడుదల చేస్తారు. ► 12:10 ఎలిఫెంట్ ప్రాంగణానికి చేరుకుని స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 12:45 హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరుతారు. -
10 ఏళ్లుగా వ్యవసాయం..బైక్ ట్రాలీ వాడకంతో తగ్గిన కూలీల ఖర్చు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన జుజ్జవరపు సతీశ్ గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కొబ్బరి తోటలో ఐదంచెల సాగు ద్వారా ఎకరానికి ఏటా రూ.1,05,000 నికరాదాయం పొందుతున్నారు. మోటార్ బైక్‌తో నడిచే ట్రాలీని, బైక్‌తో నడిచే స్ప్రేయర్‌ను తానే తయారు చేయించుకోవటం ద్వారా కూలీల ఖర్చును భారీగా తగ్గించుకోవటం ఆయన ప్రత్యేకత. రైతుసాధికార సంస్థలో మాస్టర్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకుడిగా మారారు. ఆయన స్ఫూర్తితో కురుకూరు గ్రామానికి చెందిన సుమారు పాతిక మంది రైతులు 300 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. రిటైర్డ్ ఐసిఏఆర్ ఉద్యోగుల సంఘం సి.హెచ్. రవీందర్‌రెడ్డి బెస్ట్ ఫార్మర్ అవార్డుతో సతీశ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో సత్కరించటం విశేషం. కొబ్బరి తోటలో ఐదంచెల అంతర పంటలను ఆయన సాగు చేస్తున్నారు. మొదటి లేయర్‌గా 27“27 అడుగులకు కొబ్బరి, రెండో లేయర్‌గా కొబ్బరి చెట్ల మధ్యలో 13.5“10 అడుగులలో కోకో సాగు చేస్తున్నారు. మూడో లేయర్లో 7“7 అడుగులలో వక్క మొక్కలు వేశారు. నాలుగో లేయర్లో వక్క మొక్కలకు మిరియాలు పాకిస్తున్నారు. ఐడో లేయర్ గా ఎండ పడే చోట ఫైనాపిల్ మొక్కలు నాటారు. కొబ్బరి మొక్కలు లేని చోట్ల జాజికాయ మొక్కలు నాటారు. ప్రతి 10 రోజులకు జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పిచికారీ కోసం టైప్ 2 సూపర్ జీవా మృతం వాడుతున్నారు. సాధారణంగా జీవామృతం తయారీకి ప్రతి సారీ ఆవు పేడ, మూత్రం అవసరం ఉంటుంది. అయితే, టైప్ 2 జీవామృతం తయారీకి ఒకసారి పేడ, మూత్రం వాడితే చాలు, ఆ తర్వాత 6 నెలల వరకు ఆ అవశేషాలకు 200 లీటర్ల నీటికి లీటరు జీవన ఎరువులతో పాటు బెల్లం జోడిస్తూ మళ్లీ మళ్లీ జీవామృతాన్ని తయారు చేసుకొని వాడటం వల్ల అదే ఫలితాలు వస్తున్నాయన్నారు. జీవామృతం వడపోతకు తాను రూపొందించిన ఆటోమేటిక్ ఫిల్టర్ సిస్టమ్‌ను మరో 20 మంది రైతులు 200 ఎకరాల తోటల్లో వాడుతున్నారని సతీశ్ (90107 42459) తెలిపారు. బైక్ ట్రాలీ ఖర్చు రూ. పది వేలు ద్విచక్ర మోటారు వాహనానికి వెనుక కట్టుకొని బరువులు లాక్కెళ్లేందుకు వీలుగా ఐదేళ్ల క్రితం సతీశ్ బైక్ ట్రాలీని సొంత ఆలోచనతో తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. ఎరువులు వేయటం వంటి పనులకు ఎకరానికి 8–10 మంది కూలీలు అవసరమవుతారని బైక్ ట్రాలీ ఉండటం మూలాన ఇద్దరు కూలీలతోనే వేగంగా పని పూర్తవుతోందని సతీశ్ తెలిపారు. బైక్ ఇంజన్‌తోనే జీవామృతం, పంచగవ్య, ఇతర ద్రావణాలు, కషాయాలను సైతం సులువుగా పిచికారీ చేయగలుగుతున్నానని తెలిపారు. బైక్ ట్రాలీ తయారీకి రూ. పది వేలు ఖర్చయ్యిందని, ఈ ఐదేళ్లలో దాని ద్వారా దాదాపు రూ. 2 లక్షల వరకు డబ్బు ఆదా అయ్యిందన్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం సులువు కావటం వల్ల ఇతర రైతులు సైతం స్ఫూర్తిని పొందుతున్నారన్నారు. తనను చూసి పాతిక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారన్నారు. జీవామృతాన్ని ఫిల్టర్ చేయటం, పిచికారీ చేయటం వంటి పనుల్లో కూడా మనుషుల ప్రమేయం తగ్గించే ఫిల్టర్ వ్యవస్థను నిర్మించటం వల్ల వడకట్టే పని సులువైపోయిందని, పిచికారీ చప్పున పూర్తవుతోందన్నారు. బైక్ స్ప్రేయర్ ద్వారా ఎకరంలో అర గంటలోనే పిచికారీ పూర్తవుతోందన్నారు. టైప్ 2 సూపర్ జీవామృతం తయారీ పద్ధతి రైతులకు వెసులుబాటుగా ఉందన్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు ‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సేంద్రియ సాగు పద్ధతులు, కషాయాలు/ ద్రావణాల తయారీ, విలువ జోడింపుపై తెలంగాణలో రైతులకు అవగాహన సదస్సులు జరగనున్నాయి. 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మం., పెద్దకురుంపల్లిలోని మల్లిఖార్జున రెడ్డి తోటలో, 10న జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లోని ఎడమల మల్లారెడ్డి తోటలో, 11న పెద్దపల్లి జిల్లా రామగిరి మం., కల్వచర్లలోని యాదగిరి శ్రీనివాస్ తోటలో (ఉ.10 గం.–సా. 4 గం.) సదస్సులు జరుగుతాయి. పాల్గొనదలచిన రైతులు తప్పనిసరిగా ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు.. 70939 73999 (వెంకట్‌రెడ్డి). అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. -
East Godavari Famous Foods: ఉమ్మడి తూ.గో. రుచులు.. మీరు ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
కోరుకొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం చూసొద్దాం రండి..!
-
East Godavari Famous Temples: తూర్పుకు వెళ్తే ఇంత మంది దేవుళ్లను చూడవచ్చా? (ఫొటోలు)
-
తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
-
పోలవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి
-
కొవ్వూరులో దారుణం.. సిలిండర్‌తో అత్తమామలపై అల్లుడి దాడి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలపై అల్లుడు విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను చితకబాదాడు. దీంతో మామ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్ర గాయాల పాలైన అత్తను స్థానికుల సహాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కొవ్వురు డీఎస్పీ వీఎస్ వర్మ, సీఐ వైవీ రమణ..సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అల్లుడి దాడిలో మృతిచెందిన మామను రాయంకుల శ్రీరాకృష్ణగా, గాయాలైన అత్త బేబీ(61)గా గుర్తించారు. అల్లుడిని దొమ్మేరుకు చెందిన నందిగం గోపి(42)గా తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: విధి అంటే ఇదేనేమో.. స్వగ్రామానికి వస్తూ అనంతలోకాలకు.. -
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి: సీఎం జగన్
Updates సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ►ఆ కుటుంబాల తలరాతలు మారాలి ►వారు పేదరికం నుంచి బయటకు రావాలి ►ఆ కుటుంబాలనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు లాంటి వారు రావాలి ►పేదరికం అనే సంకెళ్లను వారు తెంచుకోవాలి ►దానికి చదవులు ఒక్కటే మార్గం ►అందుకే నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా అడుగులేశాం ►నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను, ఆర్థికంగానూ గట్టిగా నిలబడాలంటే, వారు వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే.. దానికి చదువులు ఒక్కటే మార్గం ►ఒక అంబేద్కర్, ఒక సావిత్రీ పూలే కాని, మౌలానా అబ్దుల్ ఆజాద్ కాని… వారి నోట్లోనుంచి వచ్చిన మాట ఏంటంటే.. చదువు అనేది ఒక్క అస్త్రం అని అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చేపట్టాం ►చదువులు అన్నవి పేదలకు ఒక హక్కుగా అందాలి ►జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తోంది ►పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నాం ►జనవరి-ఫిబ్రవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బు జమచేస్తున్నాం ►లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం ►చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారు ► రూ. 1777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడు చంద్రబాబు ఆ డబ్బును కూడా మన ప్రభుత్వమే తీర్చింది ►బోర్డింగ్ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది ►ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండుమార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం ►అక్షరాల 25 లక్షల మందికిపైగా వర్తింపుచేస్తున్నాం ► కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చుచేశాం ►చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి ► ఫీజులు అరకొరగా ఇచ్చేవారు ►ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు ►ముష్టి వేసినట్టు ఇచ్చేవారు ►కేవలం రూ.35వేలు ఇచ్చేవారు ►మన ప్రభుత్వం ఫీజులు ఎంతైతే అంత ఇస్తోంది ►పిల్లలకు మంచి జరగాలని ఎంత ఫీజులైతే అంత చెల్లిస్తున్నాం ►ఎంత ఫీజులైనా ఫర్వాలేదు.. మీరు చదవండి… మీ జగనన్న చెల్లిస్తాడు ►పిల్లలకు మంచి మేనమామగా ఎప్పుడూ ఉంటాను ►ఇలాంటి పథకాలు ఇస్తుంటే… రాష్ట్రం దివాళా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ►మీడియా వ్యవస్థలు కొన్ని ఇలానే మాట్లాడుతున్నాయి ►భావి తరాల పిల్లల తలరాతలు మార్చేందుకు మేం పెట్టే ఖర్చు.. మానవ వనరులమీద పెట్టుబడులు అని చెప్తున్నాను ►రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్ చూపిస్తోంది ►ఏ రాష్ట్రంలో లేని విధంగా నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ►ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి ►అందులో చదువులు కూడా మారుతున్నాయి ►సీబీఎస్ఈ ఇంగ్లిషు మీడియం చదువులు వచ్చాయి ►బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్ వచ్చాయి ►గొప్ప మార్పులకు నిరద్శనం ఇది ►అంగన్వాడీల స్వరూపం కూడా మారుతోంది ►పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ►ఈ విషయంలో అక్షరాల ఒక్కో పథకానికి రూ.౨వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►విద్యాకానుక ద్వారా స్కూళ్లు తెరిచే సమయానికి కిట్లను అందిస్తున్నాం ►ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతి పిల్లాడికి మంచి బోధన అందించడంపై దృష్టిపెట్టాం ►సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు తీసుకు వచ్చాం ►పిల్లలకు ఇంటికి వెళ్లిన తర్వాత ట్యూటర్ ఉండాలన్న తాపత్రయంతో బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్ ఇచ్చాం ►ఆఫ్‌లైన్‌లో పనిచేసే ట్యాబులు ఇచ్చాం ►నాడు – నేడు పూర్తిచేసుకున్న మొదటి దఫా స్కూళ్లలో 6 నుంచి పై తరగుతులకు డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం ►ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ద్వారా డిజిటల్ బోధన తీసుకున్న ప్రభుత్వం మనదే ►ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేటు స్కూల్స్ పోటీపడే పరిస్థితి వస్తుంది ►గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు 37లక్షలు ఉంటే.. ఆ సంఖ్య 40 లక్షలు దాటింది ►ప్రభుత్వ స్కూళ్లమీద నమ్మకం కలిగింది ►డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి ►డిగ్రీల్లో చేరకుండా 2018-19లో 81,813 ఉంటే అది 2022-23 నాటికి 22,387కు తగ్గింది ►2018-19లో ఇంజినీరింగ్ చదివేవాళ్లు 80వేలు మంది అయితే ఈ ప్రభుత్వంలో 1.2 లక్షలమంది చదువుతున్నారు. దాదాపు 50శాతం వృద్ధి ఉంది: ►ఉన్నత విద్యతో పాఠ్యప్రణాళికను మార్చాం ►జాబో ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దాం ►25 మార్కెట్ ఓరియెంటెడ్, 67 బిజినెస్ ఒకేషన్ కోర్సులు ప్రవేశపెట్టాం ►దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టాం ►పిల్లల నైపుణ్యం పెంచడానికి ఆన్లైన్ కోర్సులు ఇప్పిస్తున్నాం ►మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ►వారిచేత కోర్సులు చెప్పించి.. సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం ►అమెజాన్ లాంటి సంస్థలు కూడా రాష్ట్రప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యాయి ►జగనన్న విదేశీ దీవెన కింద 21 ఫ్యాకల్టీలో 350 ప్రపంచస్థాయి కాలేజీల్లో రూ. 1.25 కోట్ల వరకూ కూడా ఫీజులు కడుతున్నాం ►సత్యానాదెళ్లలా.. మన రాష్ట్రం నుంచి ప్రతి కుటుంబం నుంచి రావాలి ►ప్రతి కుటుంబం నుంచి కూడా సత్యనాదెళ్లలు రావాలి ►ప్రతిభ మీరు చూపించండి… మీ ప్రతిభకు తోడుగా నేనున్నాను ►షాదీతోఫా, కళ్యాణమస్తు లాంటి పథకాలు కూడా టెన్త్ చదివితేనే అమలు ►విమర్శించే ప్రతిపక్షాలతా ఆలోచన చేయండి ►ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగేదా? ►లంచాలు ఇవ్వకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చేవా? ►అమ్మ ఒడి నుంచి చూస్తే.. విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత లాంటి పథకాలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తున్నాయి? ►అప్పుడు బడ్జెట్.. ఇప్పుడు కూడా అదే బడ్జెట్ ►అప్పులు వృద్ధి చూస్తే.. అప్పటితో చూస్తే.. ఇప్పుడే తక్కువ ►కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ►గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు జరగుతున్నాయి? ►గతంలో పేదవాడి గురించి ఆలోచన చేయలేదు ►పేదరికం పోవాలంటే.. ఏంచేయాలన్న ఆలోచన చేయలేదు ►గతంలో పాలకులంతా గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు ►చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ►ప్రజల గురించి వారెప్పుడూ ఆలోచన చేయలేదు ►దోచుకోవడం ఎలా.. ఎలా పంచుకోవడం.. అన్నదే వారి ఆలోచన ►అందుకే ఏ పేపర్లోనూ రాయరు… ఏ టీవీల్లోనూ డిబేట్లు పెట్టరు ►ప్రశ్నిస్తామన్న వాళ్లు… ప్రశ్నించరు ►ఇప్పుడు తోడేళ్లంతా కలిసికట్టుగా ఏకం అవుతామంటన్నారు ►జగన్‌కు వారి మాదిరిగా మీడియా ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సపోర్టూ ఉండకపోవచ్చు ►ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్వారు ►పేదవాడు ఒకవైపున ఉన్నాడు.. పెత్తందార్లు మరోవైపున ఉన్నాడు ►రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు ►మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి ►మంచి జరిగితే.. జగనన్నకు తోడుగా నిలవండి ►నా బలం మీరే.. నా నమ్మకం మీరే ►నేను నమ్ముకున్నది దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనలను ►రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ దీవెనలు ఉండాలని కోరుతున్నాను ► హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. తండ్రి ఆశయ సాధన కోసం పాటు పడుతున్న తనయుడు సీఎం జగన్. ముఖ్యమంత్రి జగనన్న పాలనలో అన్ని కులాలకు సమన్యాయం అందుతోంది. జగనన్న పాలనలో విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సీఎం జగన్ తీర్చిదిద్దారు. సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు వచ్చాయి. జగనన్న.. విద్యను పేదవాడి హక్కుగా మార్చారు. పేద విద్యార్థులు చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. చంద్రబాబు పాలనలో ఫీజు రియింబర్స్‌మెంట్ అరకొరగా ఇచ్చారు. జగన్ పేదల వైపు నిలబడితే.. చంద్రబాబు, పవన్ పెత్తందారుల వైపు నిలబడ్డారు. చంద్రబాబు పది మందితో కలిసి వచ్చినా సీఎం జగన్ ఒక్కరే ఎదుర్కొంటారు. సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తా. ► కొవ్వూరు చేరుకున్న సీఎం జగన్. ► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన, విశ్వరూప్. ►కొవ్వూరు బయలుదేరిన సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. ► జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ► అనంతరం, తూర్పో గోదావరి జిల్లా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ‘జగనన్న విద్యా దీవెన’.. ► పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. ‘జగనన్న వసతి దీవెన’.. ► అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. -
AP: అతిచిన్న వయసులో కైవల్య రెడ్డి రికార్డు.. నాసా ఐఏఎస్‌పీకి ఎంపిక
నిడదవోలు: ప్రతిష్టాత్మకమైన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నేతృత్వంలో నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం (ఐఏ ఎస్పీ)–2023కు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యరెడ్డి ఎంపికయ్యింది. నాసా భాగస్వామ్య సంస్థ ఏఈఎక్స్‌ఏ ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 25 ఏళ్లలోపు వయసున్న 50–60 మంది విద్యార్థులను ఐఏఎస్‌పీకి ఎంపిక చేస్తుంది. అన్ని దేశాల విద్యార్థుల నుంచి ప్రాజెక్ట్ నమూనాలను, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వాటిలో అత్యుత్తమ నమూనాలు పంపిన విద్యార్థులను ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి తుది జాబితాను రూపొందిస్తుంది. ఇటీవల నిర్వహించిన ఇంటర్వూ్యకు హాజరైన కైవల్య రెడ్డి ఎంపికైనట్లు ఏఈఎక్స్‌ఏ నుంచి సమాచారం అందింది. ఇదే తరహాలో ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులకు ఐఏఎస్‌పీలో భాగంగా ఆరు నెలలు ఆన్లైన్లో శిక్షణ ఇస్తారు. నవంబర్‌లో అమెరికాలోని అలబామా రాష్ట్రంలో 15 రోజులు వ్యోమగామి శిక్షణ ఇస్తారు. అదే సమయంలో విద్యార్థులను బృందాలుగా ఎంపిక చేసి అనుభవజ్ఞులైన నాసా శాస్త్రవేత్తలతో కలిసి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు. అతి చిన్న వయసులోనే.. నిడదవోలుకు చెందిన కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కైవల్య రెడ్డి (15) ఇటీవల పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్‌లో పాసైంది. ఖగోళశాస్త్రంపై ఆసక్తి కలిగిన కైవల్యరెడ్డి అతి చిన్న వయసులోనే ఐఏఎస్‌పీకి ఎంపికైన భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. గతంలో మన రాష్ట్రానికే చెందిన దంగేటి జాహ్నవి ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదుతున్న సమయంలో ఈ శిక్షణ పూర్తి చేసింది. ఇది కూడా చదవండి: బందరు పోర్టుకు శంకుస్థాపనపై సీఎం జగన్ ట్వీట్ -
బిల్డప్ బాబూ బిల్డప్..! ఆ విషయం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చాలా ఆత్రంగా ఉన్నారు. ఎలాగైనా ఆయా వర్గాల ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి నానా పాట్లు పడుతున్నారు. అందులోను రైతులలో ప్రభుత్వంపై అపనమ్మకం కలిగించాలన్నది ఆయన ఉద్దేశం. ఇందుకోసం ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలను ఎందుకు ఎంచుకున్నారో ఊహించడం కష్టం కాదు. భవిష్యత్తులో టీడీపీతో జనసేన కలిస్తే రెండు పార్టీల క్యాడర్ మద్య ఇబ్బందికర వాతావరణం లేకుండా చూసే లక్ష్యంతో కూడా ఆయన అక్కడే వారం రోజుల మకాం పెట్టినట్లు అనిపిస్తుంది. దుష్ప్రచారం చేయడానికే బాబు టూర్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోనే కాదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో కూడా వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగింది. కానీ ఆయన మాత్రం అక్కడే కూర్చుని రైతులను రెచ్చగొట్టడానికి విపరీత యత్నం చేశారు. ఆ క్రమంలో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. రైతులంతా తమ ధాన్యాన్ని తాడేపల్లికి తరలించాలట. పోరుబాట పట్టాలట. తానే ముందుంటారట. ఇలా ఎన్నిసార్లు ప్రజలను మభ్యపెట్టలేదు. నిజంగానే రైతులకు ఏదైనా కష్టం వస్తే ప్రతిపక్ష నేతగా వెళ్లి వారిని పరామర్శించడం తప్పు కాదు. అక్కడ ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేస్తే చేయవచ్చు. కానీ అచ్చంగా దుష్ప్రచారం చేయడానికే ఆయన టూర్ చేస్తున్నారు. రైతులకు అండగా సీఎం జగన్ అకాల వర్షాలవల్ల అక్కడక్కడా రైతులు ఇబ్బందికి గురి అయ్యారు. వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అదికారిని నియమించారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు కూడా దీనిపై మీడియా సమావేశం పెట్టి , తుపాను హెచ్చరికలు ఉన్నందున, వర్షాలు మరిన్ని కురిసే అవకాశం ఉన్నందున, తదుపరి తాము ఎన్యుమరేషన్ ప్రారంభించి రైతులకు తగు సాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌తో పోల్చితే రబీలో సాగు తక్కువగా ఉంటుంది. అందులోను మే నెల వచ్చేసరికి చాలా వరకు వ్యవసాయ ఆపరేషన్లు పూర్తి అయిపోతుంటాయి. ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నం అయినా నీటి సదుపాయం ఉన్నచోట ఏదో ఒక పంట వేస్తుంటారు. ఇలాంటి అకాల వర్షాలు పడినప్పుడు రైతులకు నష్టం జరుగుతుంటుంది. వారికి సాయం చేయాలని అడగడం వరకు తప్పు లేదు. ఎప్పుడు ఏ కారణం దొరుకుతుందా.. ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అన్న తాపత్రయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అవకాశం వచ్చిందే తడవుగా హడావుడి చేసి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రధాన రహదారుల వెంట వెళుతున్నప్పుడు ఆయా చోట్ల రైతులు పంటలు ఆరబోసి కనిపిస్తారు. కొందరు టార్పాలిన్లు కప్పి పంటలను కాపాడుకుంటున్నారు. అది చంద్రబాబుకు ఇష్టం లేదు. ధాన్యంతో పాటు మొక్కజొన్న పంట కొన్ని చోట్ల వర్షాల వల్ల తడిసింది. వాటిని ఎండబెడుతూ రైతులు కనిపించారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో పంట నష్టం తక్కువే అని చెప్పాలి. తెలంగాణలో అనేక చోట్ల వరి ధాన్యం కొట్టుకుపోయిన దృశ్యాలు టీవీలలో కనిపించాయి. ఇక్కడ మిల్లర్లు వాటిని తీసుకోబోమని చెబుతున్నారు. ఏపీలో అలా జరగడం లేదు. మిల్లర్లు తీసుకుంటున్నారు. అది కూడా చంద్రబాబుకు ఇష్టం లేదు. వారు తీసుకుంటున్నారు కనుక ఏదో ఒక ఆరోపణ చేయాలి. అందుకే వెంటనే నూక పేరుతో ధర తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు దగా కేంద్రాలని విమర్శించారు. అది అసలు కథ.. భరోసా కేంద్రాలవల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. రైతులు తక్షణమే తమ గ్రామంలో ఉన్న భరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తమ అవసరాలను వివరించి సాయం పొందుతున్నారు. ఆ వ్యవస్థ వల్ల వైఎస్సార్సీపీ పార్టీకి, సీఎం జగన్‌కు రాజకీయ ప్రయోజనం జరగరాదన్నది ఆయన కోరిక. అందుకే వాటిని సైతం ఆయన వదలిపెట్టడం లేదు. నిజంగానే ఎక్కడైనా రైతు భరోసా కేంద్రంలో ఏదైనా అవకతవక జరుగుతుంటే ప్రభుత్వ దృష్టికి తేవచ్చు. అలాకాకుండా గుంపగుత్తగా మొత్తం వ్యవస్థపైనే ఆరోపణలు చేయడం ద్వారా ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఆ పాయింట్ మాత్రం చెప్పరు తాను అధికారంలోకి వస్తే ఈ రైతు భరోసా కేంద్రాలను ఎత్తివేస్తామని చెప్పే దైర్యం చంద్రబాబుకు ఉందా? ఆ పాయింట్ మాత్రం చెప్పరు. ఎవరైనా అలాంటి ప్రశ్నలు అడిగితే వారి మీద మండిపడితారు. చివరికి ఆయన రైతుల కులాల గురించి కూడా ప్రశ్నించి మాట్లాడే స్థాయికి వెళ్లారంటే ఇంత సీనియర్ నేత ఇన్నాళ్లుగా ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేశారా అన్న భావన కలుగుతుంది. వాస్తవానికి ఎవరూ కూడా ఎదుటివారి కులాన్ని అడగరాదు. అందులోను సీనియర్ రాజకీయవేత్తలు అలాంటివాటికి దూరంగా ఉండాలి. కాని చంద్రబాబే అలా అడుగుతుంటే ఏమి చెబుదాం. యథా ప్రకారం తాను ఉంటే వర్షాలను ముందే పసికట్టి రైతులు నష్టపోకుండా చూసేవారట. బాబు విచిత్ర ప్రకటనలు గతంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే అభాసుపాలయ్యారు. సముద్రంలో తుపానులు కంట్రోల్ చేశానని, అమరావతిలో పది డిగ్రీల ఎండ తగ్గించాలని ఆదేశాలు ఇచ్చానని, సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, హైదరాబాద్ తానే కట్టానని, ఇలాంటి చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేసి చంద్రబాబు నవ్వులపాలయ్యారు. ఆ సంగతి ఆయనకు టీడీపీ నేతలు ఎవరూ చెప్పరో ఏమోకాని, మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై జోకులు వస్తున్నాయి. చంద్రబాబు ఉంటే అసలు వర్షాలే పడవు కదా అని ఎద్దేవ చేస్తున్నారు. రైతులంటే చిన్నచూపు అనంతపురం జిల్లాలో కరువు వస్తే రెయిన్ గన్లు అంటూ వందల కోట్లు వ్యయం చేసి తెచ్చి, కరవు తీరిపోయిందని చెప్పేశారు. అసలు వ్యవసాయంపైనే ఆయనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రైతులంటే చిన్నచూపు. వారు ఏమి చెప్పినా వింటారులే అన్న భావన. లేకుంటే 89 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని, తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపిస్తానని 2014 ఎన్నికలలో హామీ ఇవ్వగలిగేవారా? పాపం.. అమాయకులైన రైతులు నమ్మి ఆయనకు ఓట్లు వేస్తే , ఆ తర్వాత వారిని దారుణంగా మోసం చేయడమే కాకుండా, వారిని ఆశపోతులని అవమానించారు. చంద్రబాబు బిల్డప్ ఆయన అధికార ఆశ ముందు రైతుల ఆశ ఎంత చిన్నది. పైగా రైతులేమీ ఆయనను రుణాలు మాఫీ చేయాలని అడగలేదు. చంద్రబాబే ఊరువాడ తిరిగి రుణాలను మాఫీ చేస్తానని ప్రచారం చేసి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇప్పుడేమో రైతులంటే చాలా ప్రేమ ఉన్నట్లు వారి తరపున తాను పోరాడుతున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఆయన పేలాలు ఏరుకోవడానికి తిరుగుతున్నారని వారు ఆరోపించారు. అవును ఆయన ఓట్ల పేలాలను ఈ వర్షాల నష్టాలలో, కష్టాలలో ఏరుకోవాలని చూశారు. రైతులు ఆ విషయాన్ని గమనించలేనంతటి అమాయకులా!.. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు తన పర్యటనలో భారీగానే నగదు ఉండేలా చూసుకుంటున్నట్లుగా ఉంది. ఒక మహిళ ఏదో సమస్య చెప్పగానే 2.30 లక్షల రూపాయల సాయం చేశారట. మరికొన్నిచోట్ల ఐదువేలు, పదివేలు ఇలా ఇచ్చారని వార్తలు వచ్చాయి. డిజిటల్ కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన ఆయన ఇంత మొత్తాలలో నగదు ఇవ్వడం అంటే ఏమి అనుకోవాలి!అది వైట్ మనీ అవుతుందా!బ్లాక్ మనీ అవుతుందా! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి: జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి, వాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చిట్స్ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై సీఐడీకి కాకినాడ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్టు, ఫాల్స్ డిక్లరేషన్‌ను అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించారు. 49 సబ్స్కైబర్ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలిచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా చిట్‌ఫండ్ నిధులతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించడంతో 1982 చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లు ఆదిరెడ్డి, వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక, గత నవంబర్ నుంచి రాష్ట్రంలో చిట్‌ఫండ్ కంపెనీల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు చేపట్టింది. మార్చి 16న జగజ్జనని చిట్స్ సహా రాష్ట్రంలో పలు చిట్‌ఫండ్ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. -
ఆన్‌షోర్..ఆఫ్‌షోర్..ఎనీవేర్‌తో చమురు దోపిడీలకు చెక్
కాకినాడ క్రైం: ఆన్‌షోర్, ఆఫ్‌షోర్, ఎనీవేర్... ఇదీ చమురు దోపిడీలను నిలువరించేందుకు భద్రతా వ్యవస్థలు అనుసరిస్తున్న తాజా విధానం. సముద్ర ఉపరితలంపై కోస్టుగార్డు, తీర ప్రాంతాల్లో పోలీస్, ఎస్పీఎఫ్, మైరెన్ పోలీస్ తమ భద్రతా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సముద్ర భద్రత అంటే కోస్టుగార్డుకే పరిమితం అన్న స్థితిని దాటి తీర ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టి, జలాల్లో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తన అనుబంధ శాఖలతో కలిసి సమాయత్తమైంది. సముద్ర దొంగతనాలంటే సాధారణంగా చమురు కేంద్రంగా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనే శాసించే ప్రభావం ఉన్న చమురు ఉత్పత్తి నుంచి తరలింపు వరకు ప్రతి దశలోనూ పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు పేర్కొన్న వ్యవస్థలన్నీ ప్రత్యేక ప్రణాళికలతో శ్రమిస్తున్నాయి. ఆ వ్యూహాలను ప్రతిబింబించేలా కీలక సమావేశాలు, కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రక్రియలో భాగంగానే గురువారం వరకూ చేపట్టిన మాక్‌డ్రిల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముగిసిన సముద్ర జలశుద్ధి ప్రక్రియ కాకినాడ తీరంలో అబ్బురపరిచే సముద్ర జల శుద్ది మూడు రోజుల ప్రక్రియ ముగిసింది. ఇండియన్ కోస్టు గార్డు ఆధ్వర్యంలో కాకినాడ స్టేషన్ పరిధిలో యుద్ద ప్రదర్శనను తలపించే రీతిలో రీజినల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ పేరుతో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ కమాండెంట్ ఆఫీసర్ జి.వేణుమాధవ్ సారథ్యంలో భారీ స్థాయిలో చేపట్టిన ఈ మాక్ డ్రిల్ సముద్ర జలాల్లో చమురు తెట్లను తొలగించే ప్రక్రియతో పాటు భద్రతా పరమైన అంశాలకు నిర్వహణకు ఓ ట్రయల్‌గా అధికారులు తెలిపారు. అటు పోలీస్‌శాఖ... కోస్ట్‌గార్డుతో సహా అటు పోలీస్‌శాఖ సముద్ర తీరప్రాంత అనుబంధంగా జరిగే చమురు దోపిడీలపై దృష్టి సారించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలు హద్దులుగా ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతో ఇటీవల రాజమహేంద్రవరంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా చమురు చోరీల గణాంకాలపై చర్చించారని కాకినాడ జిల్లా పోలీస్ వర్గాలు తెలిపాయి. దొంగిలించి, తరలించేందుకు దొంగలు అనుసరిస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. పోలీస్ లేదా కోస్ట్‌గార్డు అడ్డుకుంటే ఎదుర్కోవడానికి వారు వినియోగించే ఆయుధాలు, అవి వారికి సమకూరుతున్న పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో చమురు దొంగతనాలకు పాల్పడ్డ పాత నిందితుల కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీ ఎస్పిలను ఆదేశించారు. ఆయన ఆదేశాలమేరకు ఎస్పిలు యంత్రాంగాన్ని సమాయత్తపరిచారు. చమురు లీకై తే... చమురు తరలించే రెండు ఓడలు ప్రమాదవశాత్తు లేదా దాడుల నేపథ్యంలో సముద్రంలో ఢీకొట్టుకుంటే లేదా లీకేజీలు ఏర్పడితే జరిగే నష్టం సముద్ర జీవుల పట్ల ప్రాణసంకటమని కమాండెంట్ వేణుమాధవ్ తెలిపారు. లీకై న చమురు ఆక్సిజన్‌ను నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని అన్నారు. తద్వారా జీవాలు ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు. చమురు నీటి నుంచి వేరు చేసే ప్రక్రియకు భారీ జల, వాయు మార్గ సంపత్తితో పాటు అధునాతన పరికర సామర్థ్యాన్ని కోస్టుగార్డు వినియోగించింది. 97 మంది అధికారులు సిబ్బంది మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. వీరిలో 85 మంది సైలర్లు, 12 మంది అధికారులు ఉన్నారు. రెండు విధాలుగా శుద్ది... చోరీలు జరిగినపుడు, ప్రమాదవశాత్తూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, లేదా మరే కారణం వల్లనైనా భారీ పడవల నుంచి సముద్రంలోకి నేరుగా చమురు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చమురు తెట్లు ఏర్పడ్డ సముద్ర జలాల శుద్ది ప్రక్రియను రెండు విధాలుగా చేపడతారు. ఆ రెండు విధానాలను మాక్ డ్రిల్‌లో ప్రదర్శించారు. చమురు తెట్టుకట్టిన ప్రాంతాన్ని చుట్టుముట్టి టీసీ–3 రసాయనాన్ని చల్లడం, ఈ క్రమంలో జరిగే రసాయనిక చర్య వల్ల ఆ చమురు సముద్రగర్భంలోకి చేరుతుంది. ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఆ వ్యర్థాన్ని తిరిగి సేకరిస్తారు. అంతకుముందు నీటిలో చమురు వ్యాప్తిని నిలువరించేందుకు ‘బూమ్’ను ప్రయోగించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓడలు భారీ ట్యూబ్ వంటి ప్రత్యేక నిర్మాణంతో రూపొందించబడ్డ ఈ బూమ్‌ను చమురు తెట్టు చుట్టూ వృత్తాకారంగా ఏర్పాటు చేస్తాయి. అది దాటి తెట్టు వ్యాపించే ప్రసక్తే లేదు. ఇది కాక రెండవ విధానం భారీ బ్రష్ ద్వారా తెట్టును సేకరించడం. ఇది తక్కువ మొత్తంలో ఏర్పడ్డ చమురు తెట్లు తొలగించేందుకు అనుకూలం. ఈ రెండు ప్రక్రియలు జరుగుతున్నంత సేపూ నిశిత పరిశీలన, పర్యవేక్షణ కోసం ‘ఏరియల్ రెక్కీ’ నిర్వహించారు. అద్భుత పనితీరు... సముద్ర జలాల్లో అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడంతో నేర నియంత్రణను సాకారం చేసే క్రమంలో అన్ని వేళల్లోనూ అప్రమత్తంగా ఉంటాం. మాక్‌డ్రిల్ పర్యావరణంపై మా బాధ్యత, చర్యలను ప్రతిబింబించే విధుల సమాహారం. ఈ ప్రదర్శన భారీ స్థాయిలో చేపట్టడంలో భద్రతా అంశాలను ప్రతిబింబించడం కూడా ఓ ఉద్దేశం. ఆ లక్ష్యంతోనే మాక్‌డ్రిల్‌కు గతంలో ఏనాడు వినియోగించని భారీ సంపత్తిని తీసుకొచ్చాం. అత్యంత సమర్థత ఉన్న సాంకేతికతనూ వినియోగించి ఎక్సర్సైజ్ నిర్వహించాం. ముఖ్యంగా చమురు దొంగతనాలను నిలువరించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసి అమలు చేస్తున్నాం– జి.వేణుమాధవ్, కమాండెంట్ ఆఫీసర్, కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ చమురు చోరీల నివారణకు కార్యాచరణ చమురు చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, డీఐజీ దిశానిర్దేశంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. తాజా సమావేశంలో చమురు చోరీల నివారణ, భద్రత దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు, గ్యాస్ సంస్థలకు భద్రత కల్పించడం, పైప్లైన్ల నుంచి పెట్రోలు, డీజిల్ దొంగిలిస్తున్న దొంగలను పట్టుకోవడం సంబంధిత దోపిడీలను అరికట్టడం ఇందులో కీలక అంశాలు. మైరెన్, కోస్ట్‌గార్డు పరస్పర సహకారంతో చమురు చోరీల నివారణ చర్యలకు సిద్దమయ్యాం. త్వరలో ప్రత్యేక కార్యాచరణ, బృంద నియామకాన్ని ప్రకటిస్తాం. – ఎస్.సతీష్‌కుమార్, ఎస్పి, కాకినాడ జిల్లా ప్రత్యేక భద్రత ఏర్పాటు సముద్రంలో చోరీలు ముఖ్యంగా చమురు దొంగతనాలు నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా తీర ప్రాంత వాసులతో మమేకమవుతూ దొంగల కార్యకలాపాలు నిలువరించే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఓఎన్జీసీ, రిలయన్స్ ఆయిల్ రిగ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఫాస్ట్ ఇంటర్సెప్ట్ బోట్లు అందుబాటులో ఉన్నా నిపుపయోగంగా ఉండటం వల్ల మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవడంలో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఇప్పటికే విన్నవించాం. – సుమంత్, మైరెన్ సీఐ -
అతివల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’!
సాక్షి, రాజమహేంద్రవరం: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకానికి రూపకల్పన చేశారు. సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలను విడతల వారీగా మాఫీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ. 485 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశారు. తాజాగా శనివారం మూడో విడతలో రూ.242.85 కోట్లు రుణమాఫీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను డీఆర్డీఏ అధికారులు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ఆసరా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్దేశం ఇదీ.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో తాను అధికారంలోకి వస్తే దశల వారీగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11, 2019 నాటికి వారు తీసుకున్న రుణాలను ఎంతైతే అప్పు నిల్వ మిగిలి ఉంటుందో వాటిని నాలుగు విడతలుగా ఆయా సంఘాలకు చెల్లించేందుకు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు. తూర్పు గోదావరిలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలున్నాయి. తొలి దశలో 27,297 సంఘాలకు రూ.241.98 కోట్లు, రెండో దశలో 27,417 సంఘాలకు రూ.244.04 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా శనివారం మూడో విడత కింద జిల్లాలో 27,413 స్వయం సహాయక సంఘాలకు లబ్ది చేకూరనుంది. రూ.242.85 కోట్ల నగదు మహిళల ఖాతాల్లో జమ కానుంది. సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి ప్రక్రియ ప్రారంభిస్తారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా జాబితా రూపకల్పన చేశారు. సచివాలయాల వద్ద జాబితాను అందుబాటులో ఉంచారు. సభ్యులు చనిపోయినా నామినీ వివరాలు అధికారులకు అందజేస్తే పరిష్కరించి సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటారు. రేపటి నుంచి వారోత్సవాలు ఆదివారం నుంచి వాడవాడలా ఆసరా సంబరాలు నిర్వహించేందుకు డీఆర్డీఏ సన్నద్దం చేస్తోంది. గ్రామం, మండల కేంద్రం, పట్టణం, నగరం మెదలు అన్ని ప్రాంతాల్లో ‘గడప గడపకు ఆసరా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ప్రజలకు, మహిళలకు వివరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు చేస్తున్న ఆర్థిక సాయంపై అవగాహక కల్పించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. టీడీపీ హయాంలో మోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు తీరని అన్యాయం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించారు. దీంతో మహిళలు రుణాలు చెల్లించలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన బాబు హామీ ఊసే ఎత్తలేదు. చేసేది లేక మహిళలు చేసిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. అప్పుకోసం బ్యాంకర్ల ద్వారా వేధింపులకు గురయ్యారు. తిరిగి 2019 ఎన్నికల సమంయలో మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు బాబు కొత్త పన్నాగం పన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలుగా పసుపూకుంకుమ కింద నగదు అందజేసి చేతులు దులుపుకున్నారు. గ్రహించిన డ్వాక్రా మహిళలు ఎన్నికల్లో బాబును దూరం పెట్టారు. వైఎస్సార్సీపీకి అధికారం కట్టబెట్టారు. స్వయం ఉపాధి దిశగా అడుగులు ప్రభుత్వం అంజేస్తున్న ఆసరా సొమ్ముతో మహిళలు స్వయం ఉపాధి దిశగా దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు స్త్రీనిధి ద్వారా వచ్చిన సొమ్మును జమ చేసుకుని పాడి పశువుల పెంపకం, కిరాణా దుకాణం, గుడ్లు విక్రయించడం, టెంట్లు అద్దెకు ఇస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. జీవన ప్రమాణాల మెరుగునకు కృషి మహిళల జీవన ప్రమాణాలు, ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఆసరా పథకం ఎంతగానో దోహదం చేస్తుంది. రుణమాఫీ ద్వారా వచ్చే నగదుతో పాడి పరిశ్రమ, చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం. స్వయం ఉపాధి పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా మహిళలు కుటుంబ పోషణకు భర్తకు చేదోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో ఆసరా నిధులు విడుదలయ్యాయి. ఆసరా వారోత్సవాల సందర్భంగా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి గ్రామంలో వివరిస్తాం. –ఎస్.సుభాషిణి, పీడీ డీఆర్డీఏ. -
ఈ సీజన్లో పోలవరం పనుల్లో పురోగతి: మంత్రి అంబటి
సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం నిర్మాణంలో రాబోయే నాలుగు ఐదు నెలలు కీలకమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వేల ఏళ్లపాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రాజెక్టు అని, అందుకే కాస్త ఆలస్యమైనా నాణ్యత విషయంలో రాజీపడబోమని తెలిపారాయన. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన ఆయన.. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సీజన్లో ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపిన మంత్రి అంబటి.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని మరోసారి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని చెప్పారాయన. పోలవరంపై తానేం రాజకీయ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారాయన. ఇది తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవగాహనారాహిత్యం, ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతోనో కాపర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ వేయడం వల్ల ఇంత అనర్థం జరిగిందని స్పస్టం చేశారు. డయాఫ్రమ్‌వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని, చర్యల సంగతి ప్రాజెక్టు పూర్తైన తర్వాతేనని చెప్పారాయన. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని.. నిపుణులు చెప్తున్న మాట అని మంత్రి అంబటి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేసి ముందుకు వెళ్లాలి. ఏ విధంగా రిపేర్ చేయాలో అధికారులు పరిశీలిస్తున్నారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని మరోసారి స్పష్టం చేశారాయన. ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరదల వల్ల డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ తొందరపాటుతోనే ప్రాజెక్టకు నష్టం జరిగింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు తప్పిదం తప్ప మరొకటి లేదు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేయాలి. దీని కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొందరపాటు, డెడ్లైన్లు ఎందుకు? వేళ ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అందుకే పనులు కాస్త ఆలస్యమైనా నాణ్యతగా ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారాయన. వైఎస్ఆర్ కలలు కన్న ప్రాజెక్టు ఇది. సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి. ఇదీ చదవండి: ఏపీ ఓ బంగారు గని -
నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
నిడదవోలు(తూ.గో. జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి నిడదవోలుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌కు సుబ్బరాజుపేట హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గం.లకు వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకున్న సీఎం జగన్.. వధూవరులను ఆశీర్వదించారు. హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జక్కం పూడి రాజా, ఎంపీ మర్గాని భరత్ , పలువురు ప్రజా ప్రతినిధులు వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. \ -
తెలుగు అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి.. ముఖ్య అతిథిగా సుమ.. ఫొటోలు వైరల్..
తూర్పు గోదావరి: ఖండాలు దాటినా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను మరువలేదు ఆ కుటుంబం. ఫ్రెంచి జాతీయత కలిగిన వారిద్దరికీ తెలుగు సంప్రదాయ రీతిలో వివాహం ఘనంగా జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతం యానాం పట్టణానికి చెందిన చింతా వెంకట్ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం ఫ్రాన్స్ దేశంలో స్థిరపడ్డారు. చింతా వెంకట్, వేద దంపతుల కుమారుడు సుమంత్ ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే దేశానికి చెందిన యువతి క్లమెన్టైన్తో అతడికి వివాహం కుదిరింది. ఈ వివాహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో స్వస్థలం యానాంలో చేయాలని నిర్ణయించారు. దీంతో హిందూ సంప్రదాయ రీతిలో స్థానిక గాజుల గార్డెన్స్ కల్యాణ మండపంలో సుమంత్, క్లమెన్టైన్ల వివాహం ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. వధూవరులను యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు. -
అనపర్తిలో బాబు హైడ్రామా.. ఐజీ పాలరాజు కీలక వ్యాఖ్యలు
సాక్షి, పశ్చిమగోదావరి: అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. కాగా, ఈ ఘటనపై భీమవరం ఐజీ పాలరాజు స్పందించారు. ఈ క్రమంలో ఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. అనపర్తిలో చంద్రబాబు పర్యటనలో స్థానిక నేతలు రోడ్డుపై సభ నిర్వహించడానికి వీలులేదని చెప్పాము. ర్యాలీగా వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. బహిరంగ సభకు అనుమతి లేదు. రెండు సభా స్థలాలు చూపించాము. స్థానిక నేతలు అనపర్తిలో సభ నిర్వహిస్తామని చెప్పారు. అనపర్తిలో యాక్ట్ 30 అమలులో ఉందని తెలిపాము. అనుమతుల విషయంపై చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. నిబంధనలకు విరుద్దంగా సభ జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు బస్సు అద్ధాలు పగులగొట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో చర్యలు తీసుకున్నాము. ఏ పార్టీ అయినా నిబంధనల ప్రకారం సభ నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేశారు. -
చంద్రబాబుపై బిక్కవోలు పీఎస్‌లో కేసు నమోదు
-
రూల్స్ బ్రేక్.. చంద్రబాబు, టీడీపీ నేతలకు షాక్
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రాజమండ్రి ఈస్ట్‌జోన్ డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, చంద్రబాబు నిబంధనలకు విరుద్దంగా రోడ్ షో నిర్వహించారు. పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించడంపై డీఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో, ఐపీసీ సెక్షన్లు 143, 359r/w, 149 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు సహా 8 మంది నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదైంది. అనపర్తిలో జరిగింది ఇదే.. ‘అనపర్తిలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. బహిరంగ సభ కోసం అనుమతి కావాలని ఆ పార్టీ నేతలు కోరారు. పోలీస్‌యాక్ట్ , జీవో నంబర్–1ను అనుసరించి రోడ్డుపై సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పాం. వారి సభ నిర్వహణకు అనుకూలంగా ఉండేలా కళాక్షేత్రంతో పాటు, ఒక లే అవుట్‌ను సూచించాం. అక్కడ పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పాం. అయినా వారు మా మాట వినిపించుకోకుండా రోడ్డుపై సభ పెట్టారు. ఇటు పోలీసులు, అటు ప్రజలకు ఇబ్బంది కలిగించారు’ అని తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి తెలిపారు. దీన్నిబట్టి ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు అలజడి సృష్టించాలని, ఘర్షణ ధోరణి అవలంబించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నారని స్పష్టమవుతోంది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచి వేట్లపాలెం కెనాల్ రోడ్డు మీదుగా రోడ్‌షోతో చంద్రబాబు అనపర్తి వైపు బయలుదేరారు. పోలీసులు వాహనాలను నిలుపుదల చేసే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు, టీడీపీ నాయకులను ఉసిగొల్పారు. వారు పోలీసులతో వాగ్వావాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఒక్కసారిగా రెచ్చిపోయి దౌర్జన్యంగా పోలీసులను తోసేశారు. దీంతో పలువురు పోలీసులు కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. బారికేడ్లను ఎత్తి పడేశారు. దీంతో పోలీసులు నేలపై కూర్చుని బతిమిలాడారు. అయినా చంద్రబాబు వినిపించుకోకుండా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి వాహనాలతో ముందుకు కదిలారు. లక్ష్మీనరసాపురంలో పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టారు. కారులో ఉన్న చంద్రబాబు కిందకు దిగి.. అక్కడే ఉన్న మీడియా వాహనాన్ని ముందుకు పిలిపించి ఆ వాహనం పైకి ఎక్కి మాట్లాడారు. మాకు అనుమతి ఉంది, మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామని రెచ్చగొట్టడంతో పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అనపర్తి దేవీచౌక్ సెంటర్‌కు చేరుకుని సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. -
అనపర్తిలో చంద్రబాబు హైడ్రామా.. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు!
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైనే సభ పెట్టెందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు.. ఎంత చెప్పినా తన అనుచరులతో బాబు వీరంగం సృష్టించారు. ఇక, చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బారికేడ్డు తొలగించి పోలీసులపై టీడీపీ కార్యకర్తలు జులం చూపించారు. దీంతో, స్థానికులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓవరాక్షన్‌పై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. పోలీసు ఆజ్ఞలను చంద్రబాబు ధిక్కరిస్తున్నారు. అనపర్తిలో నడిరోడ్డుపై సభ వద్దని చెప్పినా వినడం లేదు. నిబంధనలు పాటించాలి అన్నందుకు బాబు పేట్రేగిపోయారు. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. జీవో-1 అమలులో ఉందని హైకోర్టు చెప్పినా.. బాబు పట్టించుకోవడం లేదు. తనకు ప్రత్యేక రాజ్యాంగం ఉందని అనుకుంటున్నారు. నడిరోడ్డుపై సభ వద్దన్నందుకు డ్రామా మొదలుపెట్టారు. కన్నబాబు మాట్లాడుతూ.. జెడ్‌ప్లస్ కమాండోల రక్షణ ఉందని చంద్రబాబు బరితెగిస్తున్నారు. 11 మందిని బలి తీసుకున్నాక కూడా అదే పంథాలో వెళ్తున్నారు. చట్టం కన్నా తాను ఎక్కవని చంద్రబాబు అనుకుంటున్నారు. -
యువకుడిని కాపాడిన ఎంపీ మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో దూకబోయిన యువకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ చాకచక్యంగా కాపాడారు. రాజమండ్రి రోడ్డుకం రైల్వే వంతెనపై మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పనిచేశాడు. మంగళవారం బైక్‌పై రోడ్డు కం రైలు వంతెనపైకి వచ్చాడు. మోటారు సైకిల్‌ను పక్కనపెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన ఎంపీ భరత్‌రామ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, కారులోంచి బయటకు దూకి, ఆ యువకుడిని పట్టుకుని రోడ్డు మీదుకు లాగారు. ఎంపీ అనుచరులు కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎంపీ వెంటనే రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ గణేష్‌కు ఫోన్‌చేసి విషయం తెలిపారు. ఆ యువకుడిని ఆటోలో రెండోపట్టణ పోలీసుస్టేషకు తీసుకువెళ్లారు. యువకుడిని కాపాడిన ఎంపీ భరత్‌రామ్‌ను పలువురు అభినందించారు. -
ఆశలు ఆవిరి.. బంగారు భవిష్యత్తును చిదిమేసిన రోడ్డు ప్రమాదాలు!
ఆ విద్యార్థుల బంగారు భవిష్యత్తును రోడ్డు ప్రమాదాలు చిదిమేశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రాజమహేంద్రవరం స్నేహితులతో సరదాగా బైక్‌పై హాటల్‌కి బయలుదేరిన ఇద్దరు విద్యార్థులు డివైడర్‌ను ఢీకొని తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. తుని మండలం ఎస్. అన్నవరం శివారులో ఒక శుభకార్యక్రమానికి వెళ్లి కాలినడకన తిరిగివస్తున్న విద్యార్థిని మోటార్ సైక్లిస్ట్ ఢీకొనడంతో అసువులు బాసాడు. ఎంతో భవిష్యత్తు వున్న తమ పిల్లలు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్: టెన్త్ క్లాస్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాయి. స్నేహితులతో సరదాగా హోటల్‌కు వెళదామని బైక్‌పై బయలుదేరిన ఎన్.లక్ష్మీనారాయణ (15), బి.లాస్య (15) లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో మృతిచెందారు. ఈ విషాద ఘటన జాతీయ రహదారిపై కవలగొయ్యి సెంటర్‌కు కొద్దిదూరంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. లాస్య అప్పటికే మృతిచెందగా, లక్ష్మీనారాయణ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం బొమ్మూరుకు చెందిన లక్ష్మీనారాయణ, ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన లాస్య బొమ్మూరులోని ఇంగ్లిషు మీడియం స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తవడంతో ప్రిపరేషన్ హాలీడేస్ ఇచ్చారు. దీంతో హోటల్‌కు వెళదామని వీరు స్నేహితులతో కలిసి బైక్‌లపై బొమ్మూరు నుంచి లాలాచెరువు వైపు బయలుదేరారు. జాతీయ రహదారిపై కవలగొయ్యి సెంటర్ దాటిన తరువాత కొద్దిదూరంలో లారీని తప్పించుకుని ముందుకు వెళుతుండగా డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తండ్రి నల్లంరెడ్డి ఉమామహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశంనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలు అడియాస బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళతారన్న వారి తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. బొమ్మూరుకు చెందిన ఉమామహేశ్వర్ హార్లిక్స్ ఫ్యాక్టరీలో టెంపరరీగా పనిచేస్తూ, కిరాణాషాపు నిర్వహిస్తూ కుమార్తె, కుమారుడిని చదివిస్తున్నారు. సంతానంలో రెండోవాడైన లక్ష్మీనారాయణ రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడడంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతానికి చెందిన బి.శ్రీనివాస్ రెస్టారెంట్లో పనిచేస్తూ లాస్య ఏకైక కుమార్తె కావడంతో గారాబంగా పెంచుకున్నారు. లాస్య మృతిచెందడంపై తల్లిదండ్రులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. అందరితోను నవ్వుతూ మాట్లాడే లక్ష్మీనారాయణ, లాస్యలు మృతిచెందడంతో అటు పాఠశాలలోను, వారి నివాసప్రాంతాల్లోను విషాద ఛాయలు అలుముకున్నాయి. మోటార్ సైకిల్ ఢీకొని విద్యార్థి మృతి తుని రూరల్: మండలంలోని ఎస్.అన్నవరం శివారు సాయివేదిక సమీపంలో మోటార్ సైకిల్ ఢీకొనడంతో తుని పట్టణానికి చెందిన యండమూరి ఠాకూర్ సాయిశ్రీకర్ (15) మృతి చెందినట్టు రూరల్ ఎస్సై ఎ.బాలాజీ శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి వేదికలో జరిగిన శుభకార్యానికి హాజరై తుని నడచివస్తుండగా మోటార్ సైకిలిస్టు ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సాయి శ్రీకర్‌ను తుని ఏరియా ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై వివరించారు. సాయిశ్రీకర్ పదో తరగతి చదువుతున్నాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
తూర్పుగోదావరి జిల్లా: కోడిపందేల్లో విషాదం
-
మధురపూడికి మహర్దశ.. రూ.347 కోట్లతో ఎయిర్పోర్ట్ విస్తరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. ఇందుకోసం భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ మేరకు రూ.347.15 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. పనులకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించనుందని జాతీయ విమానాశ్రయం అధికారి అరుణ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలా.. మధురపూడి విమానాశ్రయంలో ప్రస్తుతం 3,165 మీటర్ల పొడవున్న రన్‌వే, 11 పార్కింగ్ బేస్‌తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం కలిగిన వసతి ఉంది. 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు స్టే చేసేందుకు సరిపోతుంది. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 12 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. విమాన రాకపోకల సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రతి రోజూ 1,200 మంది రాకపోకలు సాగిస్తుంటే.. ప్రస్తుతం ఉన్న భవనంలో కేవలం 225 మంది మాత్రమే స్టే చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం భవన సామర్థ్యం విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. రూ.347 కోట్లతో మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందుకు గానూ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భవన నిర్మాణం పూర్తయితే 1,400 మంది ప్రయాణికులు స్టే చేయవచ్చు. అంతేగాక ఒకేసారి 5 విమానాలు అరైవల్ అయినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు. భద్రతలోనూ మేటి ప్రయాణికులు, విమానాశ్రయ భద్రత, రక్షణ విషయంలో మధురపూడి ఏయిర్ పోర్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీని నిర్మాణం జరిగింది. యుద్ధ సమయంలో సముద్ర మార్గం ద్వారా రావాణాకు అనువైన ప్రాంతంగా ఖ్యాతి గడించింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ద విమానాలను ఇక్కడ ఉంచేవారు. సంతోషంగా ఉంది.. టెర్మినల్ భవన నిర్మాణ అనుమతులు, నిధుల విడుదల కోసం కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. గతేడాది డిసెంబరు 16న జరిగిన బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేశాం. కాంపిటేటివ్ అథారిటీ, పరిపాలనా ఆమోదం, వ్యయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్స్ సంబంధిత ఉన్నతాధికారులకు అందాయి. –మార్గాని భరత్‌రామ్, ఎంపీ, రాజమహేంద్రవరం పనులు ప్రారంభిస్తాం.. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు అధునాతన సేవలు అందించేందుకు భవన నిర్మాణం ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుత సేవలను మరింతగా విస్తరించే వెసులుబాటు కలుగుతుంది. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
బాబు పర్యటన వేళ టీడీపీలో వర్గపోరు.. తన్నుకున్నంత పనిచేశారు!
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని నిడదవోలు టీడీపీలో వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఈ ఘటన జరగడం విశేషం. వివరాల ప్రకారం.. నిడదవోలు నియోజకవర్గంలో చంద్రబాబు యాత్ర పారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడకు వస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. చంద్రబాబుకు స్వాగతం పలికే విషయంపై వాదనలకు దిగారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు కల్పించుకుని వారికి సర్దిచెప్పడంతో ఈ వ్యవహరం సద్దుమణిగింది. -
చారిత్రక నగరంలో ఫుడ్ నైట్
రాజమహేంద్రవరం సిటీ: ఆహార ప్రియులకు శుభవార్త.. రాత్రివేళ టిఫిన్ లేదా మరే ఇతర ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా ఎక్కడ దొరుకుతాయనే దిగులు చెందనక్కర లేదు. ఒకచోటే ఫుడ్ ఐటమ్స్ కొలువుతీరి స్వాగతం పలకనున్నాయి. చీకటి పడిందని చింతపడనక్కర్లేదు. అర్ధరాత్రి సమీపిస్తున్నా ఆదరాబాదరా పడనక్కరలేదు. హ్యాపీగా తినివెళ్లొచ్చు.. రాజమహేంద్రవరంలోనే ఈ అవకాశమండోయ్.. ఈ వివరాలేంటో తెలుసుకుందాం..! నగరంలో వినూత్నరీతిలో అర్బన్ ఫుడ్ ప్లాజా ఏర్పాటు కానుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రమయ్యాక చాలా మంది నగరానికి చేరుకునే ఇతర ప్రాంతాల వారు గాని ఇక్కడి ప్రజలు గాని రోడ్ల మీద ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా? అని వెతకటం సహజం. దీనిని దృష్టిలో పెట్టుకుని నగరపాలకసంస్థ రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ వివిధ రకాల ఫలహారాలు ఒకేచోట అందించాలని సంకల్పించింది. బిర్యాని, చైనీస్ ఫుడ్, తందూరీ, వెజిటేరియన్ ఫుడ్స్, పండ్ల రసాలు, ఫాస్ట్ ఫుడ్స్, టిఫిన్స్ ఇలా 10 రకాల ఆహారాలను ఒకే వేదికపైకి అందుబాటులోకి తేనుంది. ఇందు కోసం 33 స్టాల్స్‌ను సిద్ధం చేస్తోంది. విజయవాడ తరువాత మన జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఇలాంటి సదుపాయం కల్పించనుంది. స్టాల్స్ ఏర్పాటుకు రూ.1 కోటి వెచ్చించనుంది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రెండో గేట్ అర్బన్ స్క్వేరు సెంటర్‌ను ఆనుకుని అర్బన్ ఫుడ్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 200 మీటర్లు పొడవున్న ఈ రోడ్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఫుడ్ ప్లాజా ప్రాంతాన్ని అలంకరించనున్నారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులో సన్నాహాలు ఈ స్టాల్స్‌లో నిబంధనలకు అనుగుణంగా.. నాణ్యతను పాటించేలా ఉత్సాహవంతులైన వ్యాపారుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించారు. ఎన్నింటికి తెరవాలి.. ఎన్నింటికి క్లోజ్ చేయాలి.. ఎలాంటి నాణ్యత కల్పించాలి?, సందర్శకులతో వ్యవహరించే తీరు.. ఫుడ్ ఐటమ్స్ లాంటి విషయాలపై 521 మంది దరఖాస్తుదారులతో ఇప్పటికే కమిషనర్ దినేష్‌కుమార్ మాట్లాడారు. మొదటి దశలో కంబాల చెరువు రోడ్డు పక్కన, కోటి లింగాల ఘాట్ వద్ద ప్లాజాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు. అర్బన్æ ఫుడ్ ప్లాజాను ఈట్ స్ట్రీట్ పేరుతో షాడే బాలికల స్కూల్ రోడ్లో ప్రతిపాదించి సిద్ధం చేశారు. ఆ రోడ్డు సక్రమంగా లేదని చివరికి ఆర్ట్స్ కళాశాల రోడ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో పదిరోజులే సమయం ఉండటంతో ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో రాత్రి సమయాల్లో ప్రధాన సెంటర్లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పుడ్ప్లాజాతో ఈ ఇబ్బందులు చక్కబడే అవకాశాలున్నాయి. అర్బన్ ఫుడ్ ప్లాజా కచ్చితంగా ప్రజలకు ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పంచుతుందని కమిషనరు దినేష్‌కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మార్గంలో రాకపోకలను నియంత్రించనున్నారు. ఆహార ప్రియులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిని హాయిగా వెళ్లగలగాలనేది తమ ఉద్దేశమని కమిషనర్ పేర్కొన్నారు. డిసెంబరు 1న ప్రారంభం రాజమహేంద్రవరంలో ఫుడ్ ప్లాజా ఏర్పాటుతో ఆహార ప్రియుల కోసం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. విజయవాడ తరువాత ఈ నగరంలోనే ఏర్పాటు చేస్తున్నాం. 10 కేటగిరీల్లో 33 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రూ.25 వేలు ముందుగా డిపాజిట్ చెల్లించాలి. నెలకు రూ.10 వేలు అద్దెగా నిర్ణయించాం. ఈ నెల 21 వరకూ డిపాజిట్ చెల్లించేందుకు సమయం ఇచ్చాం. అందరి సమక్షంలో డ్రా తీసి దరఖాస్తుదారులకు షాపుల స్థలం కేటాయిస్తాం. రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ కోరుకున్న ఆహారం ఒకే వేదిక వద్ద లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – దినేష్‌కుమార్, కమిషనర్, నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం -
రాజమండ్రి: గూడ్స్ ప్రమాదం ఎఫెక్ట్.. 9 రైళ్లు రద్దు
సాక్షి, రాజమండ్రి: బాలాజీపేట వద్ద గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్తున్న గూడ్స్ రైలు భోగి పట్టాలపై పడిపోయింది. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు 9 రైళ్లను రద్దు చేశారు. 2 రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్టు తెలిపారు. రైళ్ల వివరాలు ఇవే.. - విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు. - గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు. - గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు - కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు. - విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు. ఇక, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
రాజమండ్రి చూసొద్దామా?
చారిత్రక నగరమైన రాజమండ్రి టూరిజం హబ్‌గా మారుతోంది. పవిత్ర గోదావరి తీరాన వెలసిన రాజమండ్రిలో రివర్ టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాజమండ్రి నగరంతోపాటు సమీపంలో గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుకలంక, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు, ఆకట్టుకునే మ్యూజియంలు, పురాతన కట్టడాలు, పాపికొండల టూరిజం వంటి సదుపాయలతో ఉన్న రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్ గా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో భాగమైన రాజమండ్రి, కాకినాడ, కోనసీమ, ఏజెన్సీలలో ఎన్నో అందమైన, ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలచిన ప్రదేశాలు ఉన్నాయి. నదీతీరంలో వెలసిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అద్భుతమైన అందాలకు చారిత్రక ఇతిహాసాలకు కొలువైన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పథకాలు సిద్దం చేసింది. రాజమండ్రి నగరం కేంద్రంగా రివర్, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా రాజమండ్రి నగరంలో గోదావరిపై 122 ఏళ్ల క్రితం నిర్మించిన హ్యావలాక్ వంతెనను అభివృద్ధి చేసి, టూరిజం స్పాట్ గా మార్చాలని భావిస్తోంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ వంతెనను వెడల్పు చేసి, వాకింగ్ ట్రాక్ తోపాటు, షాపింగ్ స్ట్రీట్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి నదిపై ఉన్న వంతెనను తీర్చిదిద్దితే దేశంలోనే పురాతనమైన గోదావరి వంతెన ప్రత్యేక గుర్తింపు పొందుతుంది రాష్ట్రంలో పాపికొండల టూరిజం ఇప్పటికే ఎంతో గుర్తింపు పొందింది. రాజమండ్రి నగరం కేంద్రంగానే పాపికొండల బోట్ల నిర్వహణ జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చే టూరిస్టులు రాజమండ్రికి వచ్చి,ఇక్కడినుంచి దేవీపట్నం వద్ద బోట్లు ఎక్కి పాపికొండల యాత్రకు వెళతారు. ఇపుడు యాత్రికులు బసచేయడానికి ఏర్పాట్లు చేయడం,అదే విధంగా స్థానికంగా రివర్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే హరిత, అర్ధర్ కాటన్ బోట్లుతోపాటు మరో పది ప్రైవేట్ బోట్లు పాపికొండలకు వెళ్లి వస్తున్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచి, మరికొన్ని బోట్లకు అనుమతివ్వడంతోపాటు పాపికొండల టూరిజాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజమండ్రికి సమీపంలో ధవళేశ్వరం వద్ద గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుక లంక పర్యాటకంగా అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తించారు. దాదాపు 57 ఎకరాలున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడానికి గతంలోనే ఎత్తు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో హోటల్ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఓబెరాయ్ గ్రూపు ఇక్కడ హోటల్స్, రిసార్టులు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి విస్తృతమైన అవకాశాలు ఏర్పడ్డాయి. రాజమండ్రి వచ్చే పర్యాటకులకు ఓవైపు ఆహ్లాదాన్నిచ్చే గోదావరిపై ఉన్న వంతెనలు, ఘాట్లు, వాటిలో ఉన్న పవిత్ర దేవాలయాలతోపాటు చారిత్రిక కట్టడాలు కూడా కనపడతాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినవి గోదావరి పై ధవళేశ్వరంలో కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట దానితోపాటు ఆయన పేరిట ఏర్పాటు చేసిన కాటన్ మ్యూజియం. రాజమండ్రికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండటంతో సుదూర ప్రాంతాలనుంచి సైతం పర్యాటకలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నగరంలోకి వచ్చే మార్గాన్ని సైతం ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దారు. రాజమండ్రికి సమీపంలోనే వాడపల్లి, ద్రాక్షారామ, అయినవిల్లి, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉండటం, రాజమండ్రి నగరంలో కూడా అనేక దేవాలయాలు, ఘాట్లు, ఉండటంతో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది. -
International Day of the Girl Child: భళారే.. బాలిక
ఆడపిల్ల..భూమ్మీద పడగానే.. పెదవి విరుపు..ఎదుగుతున్న ప్రతి దశలోనూ ఆటంకాలు..స్కూలు దూరంగా ఉంటే చదువు ఆపేయమంటారు. హైస్కూలు పూర్తవగానే ఈ చదువు చాలనేవారు కొందరు. డిగ్రీ చదువుదామంటే చదివి ఉద్యోగాలు చేయాలా అంటూ దీర్ఘాలు..పెళ్లి చేసేస్తే ఓ పనైపోతుందంటూ తన ఎదుటే చర్చలు..ఒంటరిగా వెళ్లాలంటే ఇబ్బందులు..ధైర్యంగా ముందడుగు వేద్దామంటే వెనక్కులాగేవారెందరో..మరోపక్క వేధింపులు..ఇలా పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛను హరించేవారే ఎక్కువ. ఇలాంటి నిరాశాపూరిత వాతావరణం అమ్మాయిల్లో చాలామందికి ఎదురవుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. తల్లితండ్రులు తమ ఆడబిడ్డలనూ చదివిస్తున్నారు. ఉద్యోగానికి పంపుతున్నారు. మరోపక్క ప్రభుత్వమూ అవకాశాల్లో ఆడపిల్లకు అగ్రాసనమేస్తోంది. జగన్ ప్రభుత్వంలో వీరికి పూర్తి ప్రోత్సాహం లభిస్తోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... ప్రతిభకు పట్టుదల జత కలిసి.. కడియం: ఆస్తిపాస్తుల్లేవు.. ఇద్దరూ ఆడపిల్లలు.. తండ్రి చిరు సంపాదనే ఆధారం..ఇలాంటి నేపథ్యంలో ప్రతిభకు పట్టుదల తోడై అ అమ్మాయి విదేశీ విద్యను అభ్యసిస్తోంది. కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన మేణ్ణి లీలావిష్ణుజ్యోతి చిన్నప్పటి నుంచి చదువులో మేటి. పదిలో 9.7 గ్రేడు సాధించి, ట్రిపుల్ ఐటీకి ఎంపికై, బీటెక్ పూర్తి చేసింది. 2019లో ఆమెరికాకు చెందిన నాసా సంస్థ నిర్వహించే ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్‌కు ఎంపికైంది. ఈ సమ్మిట్‌కు 30వేల ప్రాజెక్టుల్లో 100 మాత్రమే ఎంపిక చేస్తారు. తన సోదరి తులసీశ్యామలతో విష్ణుజ్యోతి కలిసి రూపొందించిన ప్రాజెక్టు ఎంపికైంది. దీంతో ఆ సమ్మిట్‌లో పాల్గొనగలిగింది. ఇంటర్నేషనల్ ఇండో నార్డియాక్ సమ్మిట్ (ఐనాక్)లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించింది. గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ)లో 340కి 305 మార్కులు సాధించింది. ఇంటర్నేషనల్ ఇంగ్లి్లషు లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్)లో 9కి 6.5 పాయింట్లు సాధించింది. అమెరికాలోని న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేసే అవకాశం లభించింది. ఈమె ప్రతిభకు ముగ్దులైన దాతల తోడ్పాటుతో ప్రస్తుతం న్యూజెర్సీలో ఎంఎస్ చేస్తోంది. ప్రతిభకు ఏదీ అడ్డుకాదని నిరూపిస్తోంది. ఒంటరిగానే జాతీయ స్థాయికి... సాక్షి, అమలాపురం: పదేళ్ల క్రితం దురదృష్టవశాత్తూ నా న్న దూరమయ్యాడు. ఐదారేళ్ల క్రితం ఒక ప్రమాదంలో కాలికి బలమైన గాయమైంది. అయినా ఆ యువతి ఆ త్మవిశ్వాసం ముందు ఎదురైన సవాళ్లే చిన్నబోయాయి. ముమ్మిడివరానికి చెందిన యెండూరి లలితాదేవి తా ను మాత్రం చిన్నప్పుడు కలలుగన్నట్టు జాతీయ స్థా యి వాలీబాల్ క్రీడాకారిణిగా ఎంపికవుతోంది. ప్రసుత్తం రాజమ హేంద్రవరంలో ఉపాధి కోసం ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్న లలితా బీచ్ వాలీబాల్‌లో ఆంధ్రాజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. 8వ తరగతి నుంచి తాను చదువుకున్న ముమ్మిడివరం ఉన్నత పాఠశాల లో వాలీబాల్ క్రీడ ఆరంభించిన లలితా దేవి తరువాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగింది. తల్లి ప్రోత్సాహం.. కోచ్‌ల పర్యవేక్షణలో వాలీబాల్‌లో రాటుదేలింది. ఇప్పటి వరకు బీచ్ వాలీబాల్‌లో రెండుసార్లు జాతీయ పోటీలకు, వాల్‌బాల్‌లో తొమ్మిదిసార్లు జాతీయ పోటీలకు, రెండుసార్లు జాతీయ గేమ్స్‌కు ఎంపికైంది. ఆమె సాధిస్తున్న విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ‘వాలీబాల్ ఆడిన తొలి రోజుల్లో కష్టంగా అనిపించేది. ఒకసారి ఆ ఆటను ప్రేమించడం మొదలు పెట్టాక వెనుతిరిగి చూడలేదు. కాలికి గాయం అయినప్పుడు గేమ్‌కు దూరమవుతానని భయపడినా పట్టుదలతో సాధన చేసి గాయాన్ని అధిగమించాన’ని లలితాదేవి చెబుతోంది. కైవల్య ప్రతిభకు ఆకాశమే హద్దు నిడదవోలు : వ్యొమగామి కావడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతోందీ బాలిక. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మీ దంపతుల మొదటి సంతానం కైవల్య. ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇటీవల తణుకులో నిర్వహించిన క్విజ్, వక్తృత్వం, సైన్స్ ఫెయిర్లలో ప్రథమ స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇస్రో, నాసాకు అనుబంధ సంస్థ స్పేస్ స్పోర్ట్స్ ఇండియా ఫౌండేషన్ (ఢిల్లీ) నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. వచ్చే మే నెలలో జరగనున్న నాసా ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించింది. ఇటీవల విశాఖలో సముద్ర శాస్త్రవేత్తల సమావేశంలో సముద్రాల పరిరక్షణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఇచ్చింది. స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ (న్యూఢిల్లీ) అంబాసిడర్ బృంద సభ్యులుగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికైంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనమికల్ సెర్ప్ కొలబ్రేషన్ సహకారంతో నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఆస్టరాయిడ్‌ను గుర్తించింది. ఇష్టమైన రంగంలో కష్టపడాలి తుని: ప్రస్తుత సమాజంలో బాలికలు అన్ని రంగాల్లోనూ నైపుణ్యంతో దూసుకుపోతున్నారు. విద్య,ఉద్యోగ, క్రీడా రంగాల్లో తమదైన ముద్ర కనబరుస్తున్నారని చెస్ క్రీడాకారిణి బి.ప్రత్యూష అన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా ఆమె అనుభవాలను ఇలా వివరించారు... చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న చదరంగం మహిళా గ్రాండ్ మాస్టర్ స్థాయికి తీసుకువెళ్లింది. జాతీయ,అంతర్జాతీయ వేదికలపై ఎంతోమంది ప్రముఖ చెస్ క్రీడాకారులతో పోటీపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. ప్రతిభ ఉంటే ఏదైనా సాధించడం సాధ్యమని నా అనుభవం నేర్పింది. పాఠశాల విద్య నుంచి కళాశాల వరకు నా ప్రయాణం సాగింది. తల్లిదండ్రులు, గురువులు అందించిన çస్ఫూర్తి అంతర్జాతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ స్థాయికి తీసుకువెళ్లింది. ప్రతి బాలికా తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన నేను ఇంతటి స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఒడిదొడుకులు చూశాను. ప్రస్తుతం అకాడమి ద్వారా ఎంతోమంది క్రీడాకారులకు చదరంగంలో శిక్షణ ఇస్తున్నాను’ అని వివరించారు. చిట్టితల్లి చదువుకు జగనన్న సాయం కపిలేశ్వరపురం/రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ బాలికా విద్యలో నాణ్యతను పెంచేందుకు దోహదపడుతోంది. విద్యార్థుల డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజనం తనిఖీ, ఆహార నాణ్యత, మరుగుదొడ్లలో పరిశుభ్రత, తదితర అంశాలను సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ పర్యవేక్షిస్తున్నారు. గ్రామ మహిళా పోలీస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరుతో సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈవ్ టీజింగ్, పోక్సో చట్టం, బాల్య వివాహాలు నిరోధక చట్టాలపై ప్రాధాన్యతను వివరిస్తున్నారు. డ్రాప్ అవుట్ల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా బడికి పంపుతున్న చిన్నారి తల్లి ఖాతాకు రూ.15వేలు సాయమందిస్తుంది. గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థుల్లో బాలికలే అధికం. ఆడపిల్లలను ఆదిలోనే అంతం చేసే లింగ నిర్ధారణ పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. కాకినాడలో 0–6 నెలల శిశువుల సంరక్షణ కోసం శిశుగృహ, రాజమహేంద్రవరంలో 6–12 సంవత్సరాల బాలల సంరక్షణ కోసం బాలసదన్ నిర్వహిస్తోంది. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షణలోని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని 84 హాస్టళ్లు బాలికలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆడపిల్లలను ఆపదలో ఆదుకునే దిశ యాప్‌పై పోలీసు అనుబంధ శాఖల సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు మొబైల్స్‌లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. గడచిన ఆరునెలల్లో కాకినాడలో 4,75,005, తూర్పుగోదావరి జిల్లాలో 2,38,944, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 1,34,671 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. బహిర్గతం చేసుకోలేని సమస్యలను తెలిపేందుకు పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం బాక్సులు ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్ 1098 బాల్య వివాహాల కట్డడి బాలికా వికాసానికి దోహదపడుతోంది. ఇలాంటి సంఘటనపై సమాచారం అందించాలని ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్ 1098 ఏర్పాటు చేసింది. సంవత్సరం అడ్డుకున్న బాల్య వివాహాలు 2018–19 185 2019–20 162 2020–21 147 2021–22 63 -
గోదావరి గట్లు.. ఇక దిట్టంగా..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల వేళ గోదావరి నది పరీవాహక ప్రాంతాల ప్రజలు నిశ్చింతగా జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత పాలకుల నిర్లక్ష్యంతో గాలికొదిలేసిన ఔట్‌ఫాల్ స్లూయిజ్‌లు, పంట కాలువ గట్లు, డ్రెయిన్ల గట్లను పటిష్టం చేయాలని నిర్ణయించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పనులు తప్ప.. తరువాత వచ్చిన పాలకులెవరూ వీటి జోలికి పోలేదు. గోదావరి వరదలతో ముప్పు పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగానే గత నెల వరదలు పరీవాహక ప్రాంతాలతో పాటు గోదావరి లంకల్లోని ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించడంతో కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలకు ముప్పు తప్పింది. ఇటీవల ఆయన స్వయంగా ముంపు బాధిత లంకల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పర్యటించి, పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ సందర్భంలోనే తక్షణం పటిష్టం చేయాల్సిన కాలువ, డ్రెయిన్ గట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పలు మండలాల్లో 23 పనులు అత్యవసరమని గుర్తించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. పునరావృతం కాకుండా.. గత నెలలో వచ్చిన వరదలతో ఎదురైన కష్టాలు భవిష్యత్తులో ఎదురు కాకుండా అత్యవసర పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఔట్‌ఫాల్ స్లూయిజ్‌లకు లీకేజీలు ఏర్పడి, భారీగా వరదలు వస్తే గట్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తాజా పనుల్లో వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవలి వరదలతో గోదావరి పాయల నుంచి నీరు పోటెత్తి పంట కాలువలపై నుంచి పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దెబ్బ తిన్న డ్రైన్ గట్ల వల్ల కూడా దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం.. తాజా పనుల్లో వీటికి ప్రాధాన్యం ఇచ్చింది. ధవళేశ్వరం హెడ్ వర్క్స్ పరిధిలో.. సఖినేటిపల్లి మండలం గొంది వశిష్ట ఎడమ గట్టు, గోడి అవుట్‌ఫాల్ స్లూయిజ్ మరమ్మతులకు రూ.22 లక్షలు. గోడి వశిష్ట ఎడమ గట్టు నొవ్వ అవుట్‌ఫాల్ స్లూయిస్జ్కు రూ.18 లక్షలు. మామిడికుదురు మండలం లూటుకుర్రు వైనతేయ కుడిగట్టు వాడబోది అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.8 లక్షలు. ఆదుర్రు – వైనతేయ కుడిగట్టు బచ్చలబండ అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.5 లక్షలు. గోగన్నమఠం వైనతేయ కుడిగట్టు కడలి అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.8 లక్షలు. పి.గన్నవరం మండలం వైనతేయ ఎడమ గట్టున కె.ముంజవరం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పరిధిలో కోతకు గురైన కట్ట మరమ్మతులకు రూ.10 లక్షలు. ఐ.పోలవరం మండలం పాత యింజరం వద్ద అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.40 లక్షలు. జి.మూలపొలం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.28 లక్షలు. కేశనకుర్రు పీఐపీ వరద గట్టుపై అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.45 లక్షలు. కాట్రేనికోన మండలం గొల్లగరువు అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.38 లక్షలు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి షట్టర్ల మరమ్మతులకు రూ.16 లక్షలు. గౌతమి కుడి గట్టుపై ప్రధాన అవుట్‌ఫాల్ స్లూయిజ్ స్క్రూ గేరింగ్, షట్టర్ మరమ్మతులకు రూ.44 లక్షలు. గోదావరి సెంట్రల్ డివిజన్లో.. 1986 వరద స్థాయికి అనుగుణంగా అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ఇరువైపులా ఐ.పోలవరం కుడి కాలువ గట్టు బలోపేతానికి రూ.40 లక్షలు. అన్నంపల్లి అక్విడెక్ట్‌కు ఇరువైపులా ఐ.పోలవరం ఎడమ కాలువ గట్టు బలోపేతానికి రూ.25 లక్షలు. అనాతవరం బ్రాంచి కెనాల్‌పై 0.80 కిలోమీటర్ వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.15 లక్షలు. గన్నవరం ప్రధాన కాలువపై వరద గేట్లు, గన్నవరం అక్విడెక్ట్ రెయిలింగ్ మరమ్మతులకు రూ.80 లక్షలు. రాజోలు, అమలాపురం డ్రైనేజీ సబ్ డివిజన్లలో.. ఇందుపల్లి ఎగువ కౌశిక మీడియం డ్రెయిన్ ఎడమ గట్టుకు రూ.6 లక్షలు. బండారులంక ఎగువ కౌశిక కుడి ప్రధాన డ్రెయిన్Œ కుడి గట్టుకు రూ.4 లక్షలు. సాకుర్రు మేజర్ డ్రెయిన్Œపై గట్లకు రూ.12 లక్షలు. బండారులంక ఎగువ కౌశిక మీడియం డ్రెయిన్ కుడిగట్టుకు రూ.10 లక్షలు. సాకుర్రు గున్నేపల్లి, సాకుర్రు మేజర్ డ్రెయిన్ గట్లకు రూ.10 లక్షలు. రాజోలులో నామనపాలెం మీడియం డ్రెయిన్, కోతకు గురైన ఒడ్డుకు రూ.15 లక్షలు. పొన్నమండ–2 డ్రెయిన్ అవుట్‌ఫాల్ స్లూయిజ్ షట్టర్ల మరమ్మతులకు రూ.5 లక్షలు. త్వరలో పనులు మొదలుపెడతాం ఈ రోజే పనులకు ఆమోదం తెలియచేశాం. వీటిని అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని, వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులకు ఆమోదం తెలియజేశాం. వీటితో పాటు శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనులు కూడా మరికొన్ని ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో ముందుగా అత్యవసర పనులు చేపడుతున్నాం. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనుకుంటున్నాం. త్వరలో టెండర్లు కూడా పిలిచి పనులు వేగవంతం చేస్తాం. – హిమాన్షు శుక్లా, కలెక్టర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అత్యవసర పనులు చేపడుతున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు అత్యవసర పనులను ప్రతిపాదించాం. గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్లో ఇవి చాలా కీలకమైనవి. ఇటీవలి వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు, వాటి షట్టర్లు పటిష్టమైతే వరదల సమయంలో ప్రమాదాలను చాలా వరకూ నియంత్రించవచ్చు. ఇందుకు తగ్గట్టుగానే ఈ పనులు మొదలు పెట్టనున్నాం. – ఆర్.కాశీవిశ్వేశ్వరరావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం నిధుల కేటాయింపు ఇలా.. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లకు : రూ.2.82 కోట్లు పంట కాలువ గట్ల రక్షణకు : రూ.1.60 కోట్లు డ్రెయిన్ల గట్ల పటిష్టతకు : రూ.62 లక్షలు -
కాఫర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారు: మంత్రి అంబటి
-
ఏపీ: ఖరీఫ్ సాగుకు ముందస్తుగా గోదావరి జలాలు విడుదల
-
సామాజిక న్యాయం సీఎం జగన్ ఘనతే.. రాజమండ్రి బహిరంగ సభలో మంత్రులు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టింది. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం: పినిపే విశ్వరూప్ సభలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విశ్వరూప్ అన్నారు. మూడేళ్లలో చారిత్రాత్మక నిర్ణయాలు: తానేటి వనిత మూడేళ్లలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని మంత్రి తానేటి వనిత అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. బలహీన వర్గాలకు రాజకీయ సాధికారిత కల్పించారన్నారు. సమ సమాజ స్థాపనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమేనని తానేటి వనిత అన్నారు. పాలనలో బలహీనవర్గాలకు అవకాశం: ధర్మాన ప్రసాదరావు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పరిపాలనలో బలహీన వర్గాలకు అవకాశం కల్పించింది సీఎం జగన్ మాత్రమేనన్నారు. కేబినెట్లో 74 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతోందన్నారు. మూడేళ్లలో రూ.లక్ష 20 వేల కోట్లకు పైగా లబ్ధిదారులకు అందజేశాం. పాలనలో సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని మంత్రి ధర్మాన దుయ్యబట్టారు. -
‘చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు’
పల్నాడు జిల్లా: హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబు(అనంత్ ఉదయ్ భాస్కర్) చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం జగన్ చెప్పారని జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుపై అంబటి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ అనంతబాబు హత్యకేసులో ఇరుక్కున్నారు. చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు. ధర్మం వైపే ఉంటామని ప్రభుత్వం చెప్పింది’ అని తెలిపారు. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును సోమవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతబాబుకు సుబ్రహ్మణ్యం రూ.25 వేలు ఇవాల్సి ఉందని.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందని అరెస్ట్ తర్వాత కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాకు తెలిపారు. కోపంతో అనంతబాబు.. సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టడంతో గ్రిల్ వల్ల అతని తలకు గాయం కావడంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
చిన్నారి జీవితాన్ని చిదిమేసిన కాల్వ నీరు.. ఒక్కాగానొక్క కొడుకు దూరమై..
సాక్షి, అమలాపురం రూరల్: ఇంటి ఎదురుగా పారే పంట కాల్వ ఆ చిన్నారిని మృత్యురూపంలో కబళించింది. ఆటలాడుకుంటున్న ఆ చిన్నారి జీవితాన్ని కాల్వ నీరు చిదిమేసింది. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి శివారు ముంగండవారిపేటకు చెందిన సత్తి షణ్ముఖ సత్యసాయి సాకేత్ (7) ప్రమాదవశాత్తూ ఇంటికెదురుగా పారే పంట కాల్వలో పడి బుధవారం ఉదయం మరణించాడు. అప్పటి వరకూ ఇంటి ముంగిట తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో సాకేత్ కాల్వలో పడిపోయాడు తోటి పిల్లలు ఈ విషయాన్ని సాకేత్ తల్లిదండ్రులు నరసింహమూర్తి, సంధ్యారాణిలకు చెప్పారు. నరసింహమూర్తి సోదరుడు శ్రీనివాసరావు, స్థానికులు కాల్వలోకి దిగి సాకేత్ కోసం గాలించినా ఫలితం లేదు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాల్వలు మూసివేసినా ఎగువ నీరు దిగువకు వస్తుండడంతో ప్రవాహ వేగం అధికంగా ఉంది. అమలాపురం తాలూకా ఎస్సై అందే పరదేశి ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లను, ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు కిలోమీటరు దూరం వరకూ కాల్వలో గాలింపు చేపట్టగా సాకేత్ మృత దేహం లభ్యమైంది. అప్పటి వరకూ ఆటలాడుకుంటూ కళ్లెదుటే కనిపించిన చిన్నారి సాకేత్ విగత జీవిగా కనిపించగానే తల్లిదండ్రులు నిర్ఘాంతపోయి కన్నీటి పర్యంతం అయ్యారు. వన్నె చింతలపూడి గ్రామంలో విషాదం అలుముకుంది. చదవండి: భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్ ఒక్కాగానొక్క కొడుకు దూరమై.. నరసింహమూర్తి, సంధ్యారాణి దంపతులకు సాకేత్ ఒక్కగానొక్క కొడుకు. ఏడేళ్ల కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అమలాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. తండ్రి నరసింహమూర్తి అమలాపురంలోని ఓ ఫైనాన్స్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లి సంధార్యాణి గృహిణి. ఏకైక బిడ్డ కన్ను మూయడంతో ఇంక మేము ఎవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాల్వల చెంతన లేదా సమీపంలో ఉన్న ఇళ్లకు చెందిన తమ పిల్లలను కదలికను పిల్లల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండాలని ఎస్సై పరదేశి సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 24 ఏళ్ల క్రితం పెళ్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డొస్తున్నాడని -
ప్రధాని నుంచి పురస్కారం అందుకున్న జెడ్పీ సీఈఓ
కాకినాడ సిటీ: దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తీకరణ్ జాతీయ స్థాయి పురస్కారాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదివారం వర్చువల్‌గా అందుకున్నారు. రాష్ట్రంలోనే అత్యుత్తమ జెడ్పీగా గుర్తించి ఈ అవార్డు అందజేశారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో మన జిల్లా దేశంలోనే అత్యుత్తమంగా గుర్తింపు పొందింది. ప్రతి నెల, మూడు నెలలకోసారి జెడ్పీ సమావేశం నిర్వహించి, 13 అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తద్వారా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయడంతో ఈ అవార్డు దక్కింది. జిల్లాలో సాగు, తాగు అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించడం.. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యా విధానం అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించి, రాష్ట్రంలోనే ఉన్నత స్థాయి ఉత్తీర్ణత సాధించడం.. ఆరోగ్య సేవలపై కేంద్రీకరణ.. జిల్లా ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయడం.. 108 కాల్ సెంటర్ల ఏర్పాటు ద్వారా సేవలు.. స్త్రీ, శిశు శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం.. జెడ్పీ పరిధిలోని వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు వివిధ సంక్షేమ పథకాలను సకాలంలో అందించడం.. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి, దాని నుంచి సంపద సృష్టించే కార్యక్రమాలు చేపట్టడం.. గ్రామీణ రహదారులను పట్టణ రోడ్లతో అనుసంధానం చేయడం.. గ్రామాల్లో మెరుగైన వీధి లైట్ల నిర్వహణ.. ఉపాధి హామీ పనులకు సకాలంలో బిల్లుల చెల్లింపు తదితర కార్యక్రమాలపై జిల్లా పరిషత్ దృష్టి పెట్టింది. తద్వారా జెడ్పీ ఈ అవార్డు దక్కించుకుంది. రాష్ట్రంలోనే జాతీయ స్థాయి అవార్డు అందుకున్న ఒకే ఒక్క జెడ్పీ మనది కావడంపై చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు హర్షం వ్యక్తం చేశారు. -
తూ. గో జిల్లా గోకవరంలో రేపు సీఎం జగన్ పర్యటన
-
ఆ అభ్యర్థికి టెన్త్‌లో 600 మార్కులట!
సాక్షి, కాకినాడ: పదో తరగతిలో 600కు 600 మార్కులు సాధించడం సాధ్యమయ్యే పనేనా?! కానీ ఓ అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో ఆ అభ్యర్థి ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులకు పదో తరగతిని అర్హతగా నిర్దేశించి.. దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే 2018లో పదో తరగతి పూర్తి చేసిన ఓ అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో 600, 582, 574 మార్కులు సాధించిన ముగ్గురిని అటెండర్లుగా ఎంపిక చేశారు. వారు బుధవారం ఉద్యోగాల్లో చేరారు. మెరిట్ జాబితాను పరిశీలించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో విషయం జాయింట్ కలెక్టర్ దృష్టికి చేరింది. దీంతో పదో తరగతి విద్యార్హత పత్రాల వాస్తవికతను నిర్ధారించేందుకు వాటిని ఎస్ఎస్సీ బోర్డుకు పంపాలని నిర్ణయించారు. చదవండి: (విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు ఇలా..) -
‘జీవీఎల్ ఏపీ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారు’
సాక్షి, తూర్పుగోదావరి: కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదాను తొలగించడానికి కారణం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కారణమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. తెలుగువారై ఉండి ప్రత్యేక హోదాను జీవీఎల్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై 22 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడామని, ఎంపీ మాట్లాడటం వల్లే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని రాజ్యసభలో అన్నారని మార్గాని భరత్ ప్రస్తావించారు. ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అంటూ చంద్రబాబు మహిళల్ని అవహేళన చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2,100 కోట్లు రీయింబర్స్మెంట్ చెయ్యాల్సి ఉంది. ఏపీలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి ఎంపీ మార్గాని భరత్ కృతజ్ఞతలు తెలిపారు. -
వాట్సాప్ మెసేజ్: తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా..
తాళ్లరేవు (తూర్పుగోదావరి): చదువు తనకు భారంగా మారిందని, ఇక తాను చదవలేనని, చచ్చిపోతానంటూ ఒక విద్యార్థి తల్లిదండ్రులకు పంపిన వాట్సాప్ ఆడియో మెసేజ్ తోటి విద్యార్థులను తీవ్ర కలవరానికి గురిచేసింది. కోరంగి పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కావటి మండలం, గొనపకుత్తిక గ్రామానికి చెందిన లొల్ల సాయిచరణ్ కోరంగి కైట్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లో ఉంటున్న సాయిచరణ్ ఆదివారం ఉదయం ఎన్సీసీ కటింగ్ చేయించుకునేందుకు బార్బర్ షాపునకు వెళ్లి వస్తానని చెప్పి అనుమతి తీసుకుని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కొద్దిసేపటి అనంతరం సాయిచరణ్ తల్లిదండ్రులు కళాశాల ప్రతినిధులకు ఫోన్ చేశారు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని, ఇప్పటివరకు ఎలాగో చదివానని ఇకపై తాను చదవలేకపోతున్నానని, తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా అంటూ విలపిస్తూ వాట్సాప్‌లో ఆడియో మెసేజ్ చేశాడని చాలా ఆందోళనగా ఉందని తెలిపారు. తక్షణమే స్పందించిన కళాశాల ప్రతినిధులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') పలువురు విద్యార్థులు కోరంగి, తాళ్లరేవు, యానాం పరిసర ప్రాంతాల్లో సాయిచరణ్ ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేదు. కళాశాల హాస్టల్ వార్డెన్ కృష్ణ, సాయిచరణ్ తండ్రి షణ్ముఖరావు కోరంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోరంగి హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిచరణ్‌కు బ్యాక్‌ల్యాగ్స్ కేవలం రెండే ఉన్నాయని, క్రీడలతోపాటు ఎన్సీసీ వంటి వాటిలో చాలా చురుకుగా ఉండేవాడని కళాశాల ప్రతినిధులు, తోటి విద్యార్థులు తెలిపారు. -
ఊహించని అద్భుతం: తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామనుకున్నారు..
కూనవరం (తూర్పుగోదావరి): తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామంటూ ముందుకు వచ్చిన వైద్య బృందానికి ఊహించని అద్భుతం తారసపడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం జరిగిన అరుదైన ఈ ఘటన ఆస్పత్రి చరిత్రలోనే లిఖించదగినదిగా పలువురు ప్రసంశిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన జోడె నాగమణి నిండు గర్భిణి. వచ్చే నెల 4వ తేదీన ఆమెకు కాన్పు కావలసి ఉంది. ప్రస్తుతం బీపీకి మందులు వాడుతోంది. దానికితోడు ఆయాసం ఎక్కువైంది. నొప్పులు రావడంతో కూనవరం మండలం కోతులగుట్ట సీహెచ్‌సీకి వెళ్లింది. చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని గ్రహించి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేస్తూ ఆ విషయాన్ని కోతులగుట్ట సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డికి సమాచారం ఇచ్చారు. డాక్టర్ కోటిరెడ్డి ఈ విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణకు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్యకు చేరవేశారు. అప్పటికే నాగమణి కోమాలోకి వెళ్లింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం కనిపించలేదు. మృత్యువు ఒడిలోకి జారుకున్న ఆ మహిళను చూసి మదనపడుతున్న వైద్యుల వద్దకు డాక్టర్ కోటిరెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య వెళ్లి కనీసం కడుపులో ఉన్న బిడ్డనైనా సేవ్ చేయాలని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ రామకృష్ణను కోరారు. చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) గర్భిణి సోదరుడు జోడె నాగేశ్వరరావు, భర్త సత్యనారాయణకు పరిస్థితి వివరించి అంగీకరింపజేశారు. డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ నరసయ్య, ఎనస్తీషియన్ కిషన్, ఐసీయూ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది బృందంగా ఏర్పడి ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. అనంతరం కొద్దిసేపటికి తల్లిలో కూడా కదలికలు గమనించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ అద్భుతం చూసిన వైద్యులు ఆమెకు వెంటనే వైద్య సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమం. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఇది అరుదైన సంఘటన అని అక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అన్నారు. వైద్యబృందం కృషిని ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణ మెచ్చుకున్నారు. -
‘రైతులను భయపెట్టేలా గోబెల్స్ ప్రచారం’
కాకినాడ: సంక్రాంతి ఇలా ముగిసిందో లేదో రైతులను భయపెట్టేలా గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టేశారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏపీలో వ్యవసాయ రంగంపై ఈనాడు తప్పుడు రాతలు రాయడంపై కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఈర్షతోనే తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. వర్షాల వల్ల పంటలు దెబ్బ తిన్నా ధాన్యం దిగుబడి తగ్గలేదని, సగటున ఎకరాకి 20 క్వింటాళ్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలియడంతో
సాక్షి, రాజమహేంద్రవరం: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. హతుడు నగరంలో చాలామందికి సుపరిచితుడు కావడంతో ఈ హత్య సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌నగర్‌కు చెందిన సీహెచ్ సునీల్ కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య స్థానిక ఒక కార్పొరేట్ స్కూలులో ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది. అందరితో కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉండటంతో నగరంలోని ప్రముఖులతో సునీల్‌కు పరిచయాలున్నాయి. సునీల్ కుటుంబానికి బొమ్మూరుకు చెందిన డెన్మర్ అనే వ్యక్తి కుటుంబానికి చాలాకాలంగా స్నేహం ఉంది. ఉద్యోగ రీత్యా డెన్మర్ అబుదాబీలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సునీల్‌కు, డెన్మర్ భార్యకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలియడంతో డెన్మర్ ఈ వ్యవహారంపై ఆరా తీశాడు. ఈ నేపథ్యంలో అతడు వారం రోజుల క్రితం రాజమహేంద్రవరంలోని బొమ్మూరు ప్రాంతంలోని తన ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచీ భార్యకు, డెన్మర్కు, సునీల్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం సునీల్ భార్య యథావిధిగా డ్యూటీకి వెళ్లిపోయింది. ఇంట్లో సునీల్ ఒంటరిగా ఉన్నాడు. కొంతసేపటికి ఆ ఇంటికి డెన్మర్, అతడి భార్య చేరుకున్నారు. అక్కడ ముగ్గురి మధ్య గంట పైగా వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. వారు తిరిగి వెళ్లిన కొద్దిసేపటికి సునీల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చదవండి: కూకట్‌పల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. మహిళను ఫాలో అవుతూ.. ఇంట్లో కేకలు వినిపించడంతో అక్కడకు వెళ్లిన స్థానికులు సునీల్ పరిస్థితిని గమనించి అతడి భార్యకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న ప్రకాశ్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. హత్యపై స్థానికులను ఆరా తీశారు. హతుడి దేహంపై మెడకు ఇరువైపులా, ఛాతి పైనా కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన కత్తిని హంతకులు అక్కడే పడేయడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. 20 రోజుల నరకయాతన.. చివరికి సునీల్ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న డెన్మర్, అతడి భార్యను బొమ్మూరులోని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. డెన్మర్ భార్య చేతిపై కూడా కత్తి గాయాలున్నాయని చెబుతున్నారు. బహుశా సునీల్‌ను హతమార్చేందుకు డెన్మర్ ప్రయత్నించినప్పుడు అతడి భార్య అడ్డుకొనేందుకు ప్రయత్నించి ఉంటుందని, ఆ క్రమంలోనే ఆమెకు కూడా కత్తి గాయాలయ్యాయని అనుమానిస్తున్నారు. -
పర్సు మర్చిపోయిన మోహన్.. శనక్కాయల సత్తియ్య... ఎక్కడున్నావ్...!
ఆ చిన్న పిల్లల పట్ల ఆ పేదోడు చూపించిన ‘పెద్ద మనస్సు’ 12 ఏళ్ళు గడిచినా సజీవంగా నిలిచింది. చేసేది చిరువ్యాపారమైనా చిన్నారులను చూసి ఆత్మీయతకనబరిచిన అతని తీరుకు ముగ్థుడైన ఓ ఎన్ఆర్ఐ దశాబ్ధాం తరువాత సదరు చిరువ్యాపారి కుటుంబాన్ని వెతికిపట్టుకుని రూ.25వేలు బహుమానంగా ఇచ్చి తన విజ్ఞతను, ఔదార్యాన్ని చాటుకున్నారు. సాక్షి, కాకినాడ: గింజాల పెదసత్తియ్య కాకినాడ బీచ్‌లో శనక్కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అమెరికాలో స్థిరపడ్డ మోహన్ నేమాని తన పిల్లలతో 2010లో కాకినాడ బీచ్‌కు వెళ్ళారు. అక్కడ పిల్లలు అడగడంతో శనక్కాయలు కొనిచ్చారు. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి పర్సు మర్చిపోయిన విషయాన్ని మోహన్ గుర్తించారు. విషయాన్ని గమనించిన పెదసత్తియ్య... పర్వాలేదు సార్, పిల్లలే కదా మరోసారి వచ్చినప్పుడు ఇద్దరుగాని లెండి అంటూ పంపించేశాడు. ఆ తరువాత మోహన్‌కుటుంబం అమెరికా వెళ్ళిపోయింది. అయితే మోహన్‌కుమారుడు ప్రణవ్ బీచ్‌రోడ్డులో ‘శనక్కాయల’ జ్ఞాపకాన్ని మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు తండ్రికి గుర్తుచేస్తూ సదరు చిరువ్యాపారి సత్తియ్యతో దిగిన ఫొటోను అలాగే జ్ఞాపకంగా ఉంచుకున్నారు. పెదసత్తియ్య కుటుంబానికి సహాయం అందిస్తున్న ప్రణవ్, అతని సోదరి సుచిత 12 ఏళ్ళ తరువాత... సదరు చిరువ్యాపారికి ఎంతోకొంత సొమ్ము ఇవ్వాలనుకున్నా అతడు ఎక్కడున్నాడో మోహన్ నేమానికి ఆచూకీ చిక్కలేదు. దీంతో తనకు బాగాప రిచయుస్తులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకురాగా, అతని కుటుంబం నాగులాపల్లిలో ఉంటుందని, రెండేళ్ళ క్రితమే సత్తియ్య చనిపోయాడని తెలుసుకున్నారు. సోంతూరుకు వచ్చిన మోహన్‌నేమాని కుటుంబం గురువారం అతని భార్య గంగ, ఇద్దరు పిల్లలను పిలిపించి నాటి విషయాన్ని జ్జాప్తికి తెచ్చారు. ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం వద్ద పెదసత్తియ్య కుటుంబం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో ఆయన నివాసం వద్ద రూ.25వేలు బహుమానంగా ఇచ్చారు. మోహన్కుటుంబాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అభినందించారు. మోహన్ నేమాని మాట్లాడుతూ తరచూ తన కుమారుడు ప్రణవ్ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుని కాకినాడ వెళ్ళినప్పుడు అతనికి కొంత సొమ్ము ఇద్దామని చెప్పేవాడని, ఈ క్రమంలోనే సొమ్ము అందజేశామని తెలిపారు. -
ఆర్మీలో చేరకున్నా అతని చుట్టూ యుద్ధ వాతావరణమే
పాత సామాన్లు.. చెక్కతో చక్కగా యుద్ధ పరికరాలు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఆ యువకుడు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు వెంకటరాయపురానికి చెందిన పంపన వెంకటరమణ వడ్రంగి పని చేస్తుంటాడు. అతని కుమారుడు నాగేంద్ర ఇంటర్మీడియట్ వరకూ చదివాడు. బాల్యం నుంచి పోలీసులు.. సైనికులు అంటే అమితంగా ఇష్టం. యుద్ధ ఇతివృత్తాలున్న సినిమాలనే చూసేవాడు. చెక్కతో తయారు చేసిన జేసీబీ సైనికుడు తరహాలో యూనిఫాంకుట్టించుకుని ధరించేవాడు. సైన్యంలో చేరాలనే ప్రయత్నాలు ఫలించలేదు. అయినా అదే ధ్యాసతో తనలోని వృత్తిపరమైన నైపుణ్యానికి పదును పెడుతున్నాడు. చెక్కతోపాటు ఇంట్లోని కొన్ని వ్యర్థ సామాన్లతో ఏకే–47ను తలపించే తుపాకీ తయారు చేశాడు. వాటిలో ఉపయోగించడానికి చెక్క బుల్లెట్లనూ తయారు చేశాడు. గన్‌లో బుల్లెట్ వేసి పేల్చగానే చెక్క బుల్లెట్ సుమారు 10 మీటర్ల దూరం దూసుకుపోతోంది. వడ్రంగి సామాన్లతో చెక్కలతో యుద్దటాంక్, బాంబర్లను తయారు చేశాడు. దీపావళి మందుగుండు సామగ్రితో బాంబర్ల మాదిరి సౌండ్‌తో పాటు దూసుకు పోతుండడం విశేషం. ఇది ఉత్తుత్తి యుద్ద ట్యాంకే.. ఆర్మీకల నెరవేరకున్నా.. ఎలాగైనా సైన్యంలో చేరాలనే పట్టుదలతో గతంలో నాగేంద్ర కాకినాడలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీకి వెళ్లాడు. పరుగులో వెనుకబడటంతో ఆర్మీ చాన్సు పోయింది.. కొడుకు ఉత్సాహం చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. తమ వంతు సహకారం అందించారు. ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో ఆర్ధిక పరిస్థితులూ అనుకూలించలేదు. దీంతో మధ్య లోనే చదువు ఆపేసిన కుల వృత్తిలో సెటిలయ్యాడు. తండ్రికి చేదోడువాదోడయ్యాడు. అయినా అతనిలో సైనికోత్సాహం వీడలేదు. తీరిక దొరికనప్పుడల్లా యుద్ధ పరికరాలు తయారు చేస్తుంటాడు. ఎప్పటికైనా మరిన్ని యుద్ద పరికరాలు, సామగ్రి, ఆయుధాలు, ట్యాంకులు తయారు చేసి ఆర్మీ పేరున ఎగ్జిబిషన్ పెట్టాలని నాగేంద్ర ఉత్సాహపడుతున్నాడు. -
ఫిబ్రవరి 8 నుంచి అంతర్వేది ఉత్సవాలు
సాక్షి, సఖినేటిపల్లి: అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. దేవస్థానం కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో విడుదల చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు ఉత్సవాల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 8న రథసప్తమి, 11న స్వామి కల్యాణం, 12న రథోత్సవం, 16న పౌర్ణమి సముద్రస్నానం, 17న తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహద్దూర్, అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.ప్రసాద్, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఈఓ బి.వెంకటేశ్వరరావు, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. (చదవండి: తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్) -
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు
వేటూరి తరువాత తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్త జిల్లాను విషాదంలోకి నెట్టేసింది. జిల్లాలో పాటల, సాహితీ ప్రియులు ఆయన పాటలతో ఉన్న బంధాన్ని.. పదాలు రగిలించిన స్ఫూర్తిని తల్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ‘ఏకాకి జీవితం నాది’ అంటూ నిష్క్రమించిన ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ: సీతారామశాస్త్రితో జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి వెంకట యోగి కాకినాడ ఐడియల్ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పని చేశారు. 1970–72 ప్రాంతంలో అదే కళాశాలలో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదివారు. తండ్రి నుంచి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయన సాహిత్య ప్రస్థానం కాకినాడలోనే ప్రారంభమైంది. కాకినాడ గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ బిల్డింగ్ వద్ద ఆయన కుటుంబం నివాసం ఉండేది. 1976 నుంచి 1984 వరకూ కాకినాడలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో క్లరికర్ క్యాడర్లో పని చేశారు. అక్కడి సాహితీవేత్తలు అద్దేపల్లి రామ్మోహనరావు తదితరులతో అప్పటికే పరిచయాలుండేవి. సాహితీవేత్త సీహెచ్ కృష్ణారావు నిర్వహించే ‘నెలనెలా వెన్నెల’ సాహిత్య సభలకు హాజరయ్యేవారు. కవితలు రాసి వినిపించేవారు. పద్మశ్రీ అవార్డు పొందిన సిరివెన్నెలను 2019 ఆగస్టు 3న కాకినాడ సూర్య కళామందిర్లో స్థానిక కవులు సత్కరించారు. ‘సిరివెన్నెల’గా మారిందిక్కడే.. సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ సినిమాల షూటింగ్‌లు దాదాపు ఈ జిల్లాలోనే జరిగేవి. కాకినాడకు చెందిన రచయిత ఆకెళ్ల ద్వారా విశ్వనాథ్‌కు సీతారామశాస్త్రి తొలిసారి పరిచయమయ్యారు. ఆయన ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్ జనని జన్మభూమి (1984) సినిమాలో తొలి అవకాశమిచ్చారు. రామచంద్రపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సిరివెన్నెల ఒక పాట పాడి వినిపించడంతో విశ్వనాథ్ ఆకర్షితులయ్యారు. ఆ పాటను వెంటనే జనని జన్మభూమి సినిమాలో తీసుకున్నారు. ఆయన సాహితీ స్థాయిని అర్థం చేసుకున్న విశ్వనాథ్ తన తదుపరి చిత్రమైన సిరివెన్నెలలో అవకాశమిచ్చారు. అందులోని పాటలన్నీ సీతారామశాస్త్రే రాశారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. రామచంద్రపురానికి చెందిన ఉజూరు వీర్రాజు, చింతా రామకృష్ణారెడ్డి, ఎం.భాస్కరరెడ్డిలు సంయుక్తంగా సిరివెన్నెల సినిమా నిర్మాణ సారథ్యం వహించారు. ఈ సినిమాలో పాట ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. సిరివెన్నెల సినిమా ఆయన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ►స్వాతి కిరణం చిత్రంలో స్వీయరచన శివానీ.. భవానీ పాట చిత్రీకరణ సందర్భంగా రామచంద్రపురంలోని రాజుగారి కోటలో సీతారామశాస్త్రి రెండు రోజుల పాటు సీతారామశాస్త్రి ఉన్నారు. కాజులూరు మండలం పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరాన్ని పలుమార్లు సందర్శించారు. ►సీతానగరం మండలం రాపాక పంచాయతీ పరిధిలోని శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానాన్ని సిరివెన్నెల ఏటా సందర్శించేవారు. ఆ పాట ఎప్పటికీ జనం నోళ్లలో.. సంప్రదాయ కావ్య భాషను చలన చిత్రాల్లో పాటగా మలచి, సామాన్యుడు సైతం సులువుగా పాడుకునే శైలిని ప్రవేశపెట్టారు సీతారామశాస్త్రి. ఆయన పాటలతో సినిమా సాహిత్యం సుసంపన్నమైంది. సీతారామశాస్త్రి మృతి చెందినప్పటికీ ఆయన పాట ఎప్పటికీ జనం నోళ్లలో నిలిచే ఉంటుంది. ఆయన కాకినాడలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు, వివిధ సాహిత్య సభల్లో ఆయనతో నా అనుబంధం స్నేహపాత్రమైనది. – దాట్ల దేవదానంరాజు, కవి, యానాం అలా పరిచయం చేశారు డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే సీతారామశాస్త్రి పరిచయం. ఆకెళ్ల గారితో పాటు సీతారామశాస్త్రిని తరచూ కలుసుకునేవాడిని. ఆయనకు నా కవిత్వం అంటే ఎంతో అభిమానం. ఒకసారి నేను ఆయన ఆఫీసుకు వెళ్లాను. అక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఉన్నారు. ‘ఈయన నా అభిమాన కవి’ అంటూ నన్ను ఆయనకు పరిచయం చేయడమే కాకుండా.. పత్రికల్లో అచ్చయ్యే నా కవితలను ఎత్తి రాసుకున్న డైరీ చూపించినపుడు నేనే ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచీ అనేక సందర్భాల్లో కలుస్తూనే ఉన్నాం. – డాక్టర్ శిఖామణి, సంపాదకుడు, కవిసంధ్య, యానాం సీతానగరం మండలం శ్రీరామనగరంలోని చిట్టిబాబాజీ ఆశ్రమంలో సిరివెన్నెల పూజలు (ఫైల్) మాది 40 ఏళ్ల స్నేహబంధం సీతారామశాస్త్రితో నాది 40 ఏళ్ల స్నేహబంధం. మాది సాహిత్య సంబంధమే కాదు.. ఆత్మీయ అనుబంధం కూడా. మా కుటుంబంలో ఓ వ్యక్తిలా ఉంటారు. సిరివెన్నెల మరణం తీరని లోటు. ఆయనపై ఓ పుస్తకం రాస్తున్నాను. ఓ అధ్యాయం పూర్తి చేశాను. ఇటీవల కలుసుకోవాలనుకున్నా అనారోగ్యం వల్ల వాయిదా పడింది. అమలాపురంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ‘సిరివెన్నెల సినీ గీతాలు’ శీర్షికతో పూర్తి చేసి ఆవిష్కరిస్తాను. – డాక్టర్ పైడిపాల, పాటల పరిశోధన రచయిత రాజమహేంద్రవరంతో అనుబంధం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సాహిత్య సభలకు సిరివెన్నెల తరచూ వచ్చేవారు. నగరానికి చెందిన చాగంటి శరత్‌బాబుతో ఎక్కువ సాంగత్యం ఉండేది. సామర్లకోటలోని రామ్షా వద్ద వీరిద్దరూ సహాయకులుగా ఉండేవారు. రామ్షా ఆయుర్వేద వైద్యుడే కాకుండా జ్యోతిష శాస్త్ర ప్రవీణుడు కూడా. దీంతో వీరిద్దరూ ఆయుర్వేదంతో పాటు జ్యోతిష శాస్త్రంపై కూడా పట్టు సంపాదించారు. ఏ ఉద్యోగం దొరకకపోతే జ్యోతిషం చెప్పుకొని బతకవచ్చంటూ సిరివెన్నెల సరదాగా అనేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చాగంటి శరత్‌బాబుతో ఉన్న బంధంతో ఆయన కుమార్తెను తన కోడలిగా చేసుకున్నారు. శరత్‌బాబు గత సెప్టెంబర్ 26న మరణించారు. అక్టోబర్ 5న రాజమహేంద్రవరం దానవాయిపేటలో జరిగిన సంస్మరణ సభలో సిరివెన్నెల పాల్గొన్నారు. అదే నగర చివరి సందర్శన అవుతుందని అభిమానులు అనుకోలేదు. సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నగరానికి చెందిన సినీ నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా కన్నీరు పెట్టుకున్నారు. సిరివెన్నెల చిత్రం షూటింగ్లో సీతారామశాస్త్రి తదితరులు ఆయనతో పరిచయం మరువలేనిది ‘సిరివెన్నెల’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహించడం నా జీవిత అదృష్టం. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు అమోఘం. పాటకు కొత్త సొబగులద్దారు. ఆయన రాసిన పాటలు ఆ సినిమాకు ప్రాణం పోశాయి. నంది అవార్డు రావటం ఎంతో ఆనందాన్ని అందించింది. మా చిత్రం నుంచే ఆయన ‘సిరివెన్నెల’గా మారిపోయారు. – ఉజూరు వీర్రాజు, సిరివెన్నెల నిర్మాత, రామచంద్రపురం -
సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి
సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసిన నాయకులకు వైఎస్సార్ సీపీలో సముచిత స్థానం లభిస్తుందనేది మరోసారి రుజువైంది. పార్టీకి అనంతబాబు చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత స్థానం కల్పిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సందర్భాల్లో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సీఎం ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ అధిష్టానం రంపచోడవరం నేత అనంత సత్య ఉదయభాస్కర్(అనంత బాబు)ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఆయన గెలుపు లాంఛనమే కానుంది. మున్సిపల్, జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఇటీవల వైఎస్సార్ సీపీ తిరుగులేని ఆధిక్యం చాటుకుంది. ఈ క్రమంలో అనంతబాబు గెలుపు నల్లేరుపై నడకే కానుంది. ‘ఓదార్పు’ నుంచీ జగన్ వెంటే.. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడు అనంతబాబు. ఓదార్పు యాత్ర నుంచి ఇప్పటి వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి నిలిచారు. అధికారంలో ఉండగా తమ పార్టీలో చేరాలని టీడీపీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయి. అక్రమ కేసులు పెట్టి వేధించినా తల వంచలేదు. తొమ్మిది రోజులు విశాఖ సెంట్రల్ జైలులో ఉంచినా పార్టీకే కట్టుబడి ఉన్నారు. ఆయన చెమటోడ్చి 2014లో వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యేగా గెలిపించినా ప్రలోభాలకు లొంగిన ఆమె పార్టీ ఫిరాయించారు. స్వయానా మేనమామలైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు సైతం వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించినా అనంతబాబు నమ్మిన జెండా వీడలేదు. రంపచోడవరం నియోజకవర్గంలో జగన్ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేశారు. అప్పటి నుండి జగన్ వెంట నడుస్తూ పార్టీని ఒంటి చేత్తో విజయపథాన నడిపిస్తూ మంచి గుర్తింపు పొందారు. చదవండి: (అన్నిటా అగ్రతాంబూలం.. రెండు ఎమ్మెల్సీ పదవులూ వారికే..) రాజకీయ కుటుంబ నేపథ్యం అనంత బాబు తాత వీర్రాజు, ముత్తాత పడాల వీర్రాజు పలు పర్యాయాలు అడ్డతీగల సమితి అధ్యక్షులుగా పని చేశారు. తండ్రి అనంత చక్రరావు 1982లో అడ్డతీగల సమితి ప్రెసిడెంట్, 1987లో అడ్డతీగల ఎంపీపీగా పని చేశారు. వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అనంత బాబు ఏజెన్సీలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఏజెన్సీలో తనదైన రాజకీయ వ్యూహంతో వైఎస్సార్ సీపీకి బలమైన బాటలు వేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పక్షాన నాగులపల్లి ధనలక్ష్మి సాధించిన 38 వేల ఓట్ల భారీ మెజారి అప్పట్లో ఒక రికార్డు. 2014, 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవశం చేసుకోవడంలో అనంతబాబు విశేష కృషి చేశారు. 2001లో అడ్డతీగల జెడ్పీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2019లో డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. టీడీపీ హయాంలో డీసీసీబీ పరిధిలోని పలు ప్రాథమిక సహకార సంఘాలు, బ్రాంచిల్లో జరిగిన అవినీతి బాగోతాలపై ఉక్కు పాదం మోపారు. -
అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి.. మాయ మాటలతో లైంగిక దాడి
సాక్షి, ఆలమూరు: వివాహిత ఒంటరితనాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఒక కామాంధుడు అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి లైంగిక దాడి జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో బాధితురాలు చాకచక్యంగా ఉపయోగించిన దిశ యాప్ నిందితుడిని పట్టించింది. ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల మధ్య జరిగిన ఈ ఘటన వివరాలను రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం వెల్లడించారు. మండపేటకు చెందిన వివాహిత తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా కొన్ని నెలలుగా అదే పట్టణంలో అమ్మగారి ఇంటి వద్ద ఉంటోంది. కుటుంబ సభ్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తన కుటుంబానికి సన్నిహితుడైన కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన అంగర వీర్రాఘవులను అద్దె ఇల్లు చూస్తే వేరేగా ఉంటానని చెప్పింది. ఈ నెల 22 రాత్రి బాధితురాలికి అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి రాఘవులు తన బైక్‌పై జొన్నాడ తీసుకువచ్చి బాగా పొద్దు పోయే వరకూ పలు ప్రదేశాలకు తిప్పాడు. మాయ మాటలతో మభ్యపెట్టి జొన్నాడలోని తన స్నేహితుడి ఇంటి వద్ద ఈ రాత్రి ఉండి ఉదయం వెళదామని నమ్మబలికాడు. అక్కడ నుంచి ఆమెను వెదురుమూడికి చెందిన దుర్గాప్రసాద్ సహకారంతో వడ్లమూరులోని తన నివాసానికి తీసుకుపోయి లైంగిక దాడి జరిపాడు. చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు) దిశ యాప్‌ను ఆశ్రయించిన బాధితురాలు లైంగిక దాడితో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు తన మొబైల్ నుంచి దిశ యాప్ ద్వారా కాల్ చేయడంతో పోలీసులకు సమాచారం అందింది. విషయం గ్రహించిన నిందితుడు రాఘవులు ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని స్విచాఫ్ చేయడంతో సిగ్నల్ కట్ అయింది. అప్పటికే దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఆలమూరు ఎస్సై ఎస్.శివప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్న సమాచారంతో అక్కడకు వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. బుధవారం తెల్లవారుజామున నిందితులిద్దరినీ వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని ఆలమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివప్రసాద్‌ను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రక్షణ పొందాలని ఆయన సూచించారు. చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..) -
జెడ్పీటీసీకి అమ్మాణీ రాజీనామా.. జనసేనకు ఉన్న ఏకైక జెడ్పీటీసీ లేనట్టే..
సాక్షి, తూర్పుగోదావరి(కడియం): స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలి పదవికి మార్గాని అమ్మాణీ (జనసేన) రాజీనామా చేశారు. ఈ మేరకు కలెక్టర్ సి.హరికిరణ్‌కు సోమవారం రాజీనామా లేఖ అందజేసినట్లు ఆమె తెలిపారు. భర్త ఏడుకొండలుతో కలిసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గతేడాది నామినేషన్ వేసినా ఎన్నిక వాయిదా పడడంతో కడియపులంక సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలిచానన్నారు. ఇటీవల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలిచానన్నారు. గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సర్పంచ్‌గానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో జిల్లాలో జనసేనకు ఉన్న ఏకైక జెడ్పీటీసీ లేనట్టే. -
గోకవరంలో ఘరానా మోసం
-
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..
వంతాడ నుంచి సాక్షి ప్రతినిధి బొల్లికొండ ఫణికుమార్: అది రక్షిత అటవీ ప్రాంతం. సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండ. దాని పైనే ఉంది చిన్న గిరిజన గ్రామం వంతాడ. ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేది. ఇప్పుడు ఆ కొండపై ప్రతి చోటా లోయలను తలపించేలా పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. వందల మీటర్ల లోతుకు తవ్వి వదిలేసిన ఎర్రమట్టి లోయలు మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ మెరిసే మట్టే అత్యంత విలువైన బాక్సైట్ ఖనిజం. అక్కడే లేటరైట్ కూడా ఉంది. వాటిపై మైనింగ్ మాఫియా కన్ను పడింది. అంతే అడవి స్వరూపమే మారిపోయింది. ఐదేళ్లలో ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖనిజాన్ని తవ్వేశారు. లేటరైట్‌తోపాటు దాని పేరు చెప్పి వేల కోట్ల విలువైన బాక్సైట్‌ను అమ్మేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తి రిజర్వు ఫారెస్టులోని గిరిజనాపురం, లింగంపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ తవ్వకాలు జరిగాయి. ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం పంచాయతీలోని వంతాడ గ్రామంలో ఈ భూములు కలిసిపోయి ఉంటాయి. మైనింగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగిన ఈ దోపిడీపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. టీడీపీ హయాం.. అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగం 2013లో కేంద్రం నుంచి అండ్రు మినరల్స్ సంస్థ వంతాడ పరిసరాల్లోని 200 ఎకరాల డిఫారెస్టేషన్కి అనుమతి సంపాదించింది. అదే సంవత్సరం డిసెంబర్ 4న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విస్తీర్ణాన్ని 8 భాగాలుగా విడగొట్టి 8 లేటరైట్ లీజులు మంజూరు చేసింది. అప్పుడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో టీడీపీ అధినేతకు తెరచాటు సంబంధాలు ఉండడంతో ఈ డిఫారెస్టేషన్ ప్రక్రియ సాధ్యమైంది. లీజుల మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వెంటనే వాటిని ఇచ్చేశారు. అనంతరం కొద్ది కాలానికే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ అడవిని ఊహించని స్థాయిలో కొల్లగొట్టేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగంలా నడిచింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో సన్నిహితంగా ఉండడంతో ఆ కంపెనీ వైపు ఎవరూ కన్నెత్తి చూడలేకపోయారు. పరిధి దాటి అడవిని కబళించినా, గిరిజనుల కడుపు కొట్టినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఒకే కుటుంబంలో 8 మందికి ఎడాపెడా లీజులు ఒక కుటుంబంలో పది మంది ఉంటే ప్రభుత్వం ద్వారా ఎంత మందికి లబ్ధి ఉంటుంది. ఉంటే ఒకరో, ఇద్దరో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఒకరిద్దరు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అందరికీ పథకాలు వర్తిస్తాయా? అర్హత ఉన్నా అందరికీ లబ్ధి సాధ్యం కాదు. ప్రభుత్వ నిబంధనలు అందుకు ఒప్పుకోవు. పేదల కోసం అమలు చేసే పథకాలు, ఉపాధి కల్పించే ఉద్యోగాలకే బోలెడు నిబంధనలుంటాయి. అలాంటిది ఒకే కుటుంబంలో 8 మందికి మైనింగ్ లీజులు ఇస్తే.. అదీ అత్యంత విలువైన లేటరైట్ లీజులు.. బరితెగించి ఇలా లీజులు ఇప్పించింది చంద్రబాబే. అండ్రు మినరల్స్ యజమాని అండ్రు రమేష్‌బాబు. ఆయన పేరుతో ఒక లీజు మంజూరు చేశారు. ఆయన భార్య అండ్రు సుజాత పేరుతో మరో లీజు. రమేష్‌బాబు దగ్గరి సోదరుడు (పెదనాన్న కుమారుడు) శ్రీనివాస్ పేరుతో మరో లీజు. శ్రీనివాస్ తల్లి సత్యవతి, భార్య ఉషారాణి పేరుతో రెండు లీజులు. వీరి దగ్గరి బంధువులైన మన్యం వెంకటేశ్వరరావు, మన్యం వెంకట రజని, వెంపాటి వీర్రాజులకు మరో మూడు లీజులు. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఎడాపెడా లేటరైట్ లీజులు ఇచ్చేశారు. ఒకే కుటుంబంలో అంతమందికి ఎలా లీజులు ఇచ్చారనే దానికి సమాధానం లేదు. గనుల శాఖలో వేల లీజు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక కుటుంబానికి అన్ని లీజులు మంజూరు చేయడంలోనే కుమ్మక్కు స్పష్టమవుతోంది. ఐదు రెట్లు ఎక్కువ ఖనిజం అక్రమంగా తరలించారు! అధికారికంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తవ్వినట్లు రికార్డుల్లో చూపింది అండ్రు మినరల్స్. దానికి రూ.88.30 కోట్ల సీనరేజి ఫీజు కట్టింది. నిజానికి దాని కంటే నాలుగైదు రెట్ల ఎక్కువ ఖనిజాన్ని అనధికారికంగా తవ్వి తరలించినట్లు భావిస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్లు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని చూసిన మైనింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో ఎ గ్రేడ్ (మెటలర్జికల్) లేటరైట్ మెట్రిక్ టన్ను రూ.200, బి గ్రేడ్ (నాన్–మెటలర్జికల్) లేటరైట్ టన్ను రూ.100కిపైగానే ఉంది. ఎ గ్రేడ్ లేటరైట్‌ను 30 శాతం, బి గ్రేడ్ లేటరైట్‌ను 70 శాతం తరలించారు. దీని విలువ వందల కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దోచేసింది వేల కోట్లు ! పైకి లేటరైట్ అని చూపిస్తున్నా అదంతా బాక్సైట్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లోతుగా విచారణ చేపట్టింది. అండ్రు మినరల్స్ చేసిన ఎగుమతుల్ని బట్టి ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. వేదాంత లిమిటెడ్ (ఒడిశా)కు ఐదేళ్లలో 32 లక్షల టన్నుల ఖనిజాన్ని సరఫరా చేసినట్లు ఈ కంపెనీ రికార్డుల్లో చూపింది. వాస్తవానికి ఆ కంపెనీ స్టీల్, అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు బాక్సైట్ వినియోగిస్తారు. ఈ నేపథ్యంలోనే అండ్రు కంపెనీ లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వేసి అమ్మేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే చైనాకు ఎగుమతి చేసిన 4.5 లక్షల టన్నుల ఖనిజం కూడా బాక్సైట్ అని భావిస్తున్నారు. బాక్సైట్ టన్ను రేటు మార్కెట్లో రూ.500 నుంచి వెయ్యి వరకు ఉంటుంది. ఈ లెక్కన అండ్రు మినరల్స్ లేటరైట్ ముసుగులో బాౖMð్సట్‌ను అమ్మి రూ. వేల కోట్లను అక్రమంగా సంపాదించిందనే అనుమానాలు బలపడుతున్నాయి. గనుల్లో తవ్విన ఖనిజాన్ని ప్రాసెస్ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు/బెండపూడి, అర్లధర/ప్రత్తిపాడులో రెండు స్టాక్ యార్డ్లు నిర్వహించారు. అందులో రోజుకు 8 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేసే క్రషింగ్ యూనిట్లు పెట్టారు. అక్కడే లేటరైట్‌ను ప్రాసెస్ చేసి బాక్సైట్‌గా మార్చి అమ్ముకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అడ్డగోలుగా తవ్వేశారు.. అవి కనపడకుండా పూడ్చి మొక్కలు నాటారు.. కేటాయించిన లీజు ప్రాంతం 200 ఎకరాలే అయినా దాన్ని దాటి తవ్వకాలు జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో బ్లాకులో (మొత్తం 8 బ్లాకులు) 25 ఎకరాలే వాళ్ల పరిధి. ఆ మార్కింగ్ లోపే తవ్వకాలు జరపాలి. కానీ దాన్ని దాటి అదనంగా ప్రతి బ్లాకులో 5 నుంచి 10 ఎకరాల్లో తవ్వకాలు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్లాకులతో సంబంధం లేకుండా కొన్నిచోట్ల విడిగా కూడా తవ్వేశారు. ఇలా 50 ఎకరాల కంటే ఎక్కువ అడవిని తొలిచేశారు. ఈ అక్రమ తవ్వకాలు బయటపడకుండా గొప్ప పన్నాగమే పన్నింది అండ్రు కంపెనీ. తవ్వేశాక మిగిలిన పనికిరాని రాళ్లు, మట్టితో ఆ గోతులను పూడ్చేశారు. తవ్వకాల పరిమాణం తెలియకుండా నాటిన నీలగిరి చెట్లు వాటిపై మళ్లీ మొక్కలు నాటేశారు. దీంతో అనధికారికంగా తవ్వకాలు జరిపిన చోట్ల ప్రస్తుతం మొక్కలే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎంత పరిమాణంలో అక్రమ తవ్వకాలు జరిగాయో కనిపెట్టడం అధికారులకు సాధ్యం కావడంలేదు. మైనింగ్ శాఖ నిర్వహించే సాధారణ డీజీపీఎస్, ఈటీఎస్ సర్వేలతో ఎంత తవ్వారో తెలియని పరిస్థితి నెలకొంది. మైనింగ్ తవ్వకాల్లో ఇదో కొత్త టెక్నిక్‌గా అధికారులు చెబుతున్నారు. ఎన్ని రకాల తనిఖీలు చేసినా అక్రమాలు బయటపడకుండా ఉండేలా అండ్రు మినరల్స్ తన పలుకుబడిని, ఆర్థిక బలాన్ని ఉపయోగించింది. అధిక లోడుతో లారీల తరలింపు 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో ప్రతిరోజు వందలాది లారీల్లో ఖనిజాన్ని తరలించారు. తవ్విన చోటు నుంచి స్టాక్ యార్డుకు ఒక్కో లారీ ప్రతిరోజూ 25 నుంచి 30 ట్రిప్పులు తిరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఒక లారీలో 12 టన్నుల ఖనిజాన్ని తరలించడానికే అనుమతి ఉంది. కానీ దానికి రెట్టింపు ఖనిజాన్ని లారీలో వేసేవారు. ఒకోసారి 30 టన్నులు కూడా లారీలో ఉండేదని సమాచారం. ఎప్పుడైనా మైనింగ్ అధికారులు తనిఖీ చేసినప్పుడు మాత్రం 12 టన్నులే వేసేవారు. ఆ తర్వాత మామూలే. మైనింగ్ నిబంధనల ప్రకారం తవ్విన ఖనిజాన్ని తరలించే లారీకి పర్మిట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ఆ లారీలో ఎంత పరిమాణం ఉందనేది చూడరు. దీన్ని ఆసరాగా తీసుకుని అండ్రు కంపెనీ పరిమితికి మించి ఇష్టానుసారం ఖనిజాన్ని తవ్వేసి తరలించేసింది. ఇప్పటికే స్టాక్ యార్డుల్లో రికార్డుల్లో చూపిన దానికన్నా అదనంగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం దీనికి రూ.12.32 కోట్లు జరిమానా వసూలు చేయాల్సివుంది. అటవీ శాఖకు యూజర్ చార్జీలు ఎగనామం తవ్వకాలు జరిపిన ప్రాంతం అంతా రిజర్వు ఫారెస్టు. అటవీ భూమిని మైనింగ్ కోసం కన్వర్ట్ చేసుకున్నారు. ఇలా చేసిన అటవీ భూమిలో తవ్విన ఖనిజానికి టన్నుకు రూ.10 అటవీ శాఖకు యూజర్ చార్జీగా చెల్లించాలి. 2013లో జీఓ నంబర్ 63 ప్రకారం ఈ యూజర్ చార్జీలు కచ్చితంగా కట్టాల్సిందే. అధికారికంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల లేటరైట్ తవ్వారు. దానిపై యూజర్ చార్జీల కింద రూ.8.3 కోట్లకుపైగా అటవీ శాఖకు చెల్లించాల్సి వుంది. కానీ ఆ చార్జీలను కూడా అండ్రు మినరల్స్ కట్టలేదు. రాజకీయ పలుకుబడి ఉండడంతో అటవీ శాఖాధికారులు కూడా దీనిపై నోరు మెదపలేకపోయారు. అండ్రు మినరల్స్ తవ్విన ఖనిజాన్ని నిల్వ చేసే స్టాక్ యార్డ్ టీడీపీ మళ్లీ వస్తే ఇంకా కుమ్మేయడానికి స్కెచ్ ఐదేళ్లలో అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసిన అండ్రు కుటుంబం టీడీపీ పెద్దల దన్నుతో అడవిని ఇంకా తవ్వేయడానికి ప్రణాళిక రూపొందించింది. 2019 ఎన్నికల్లోను మళ్లీ టీడీపీ గెలుస్తుందని అప్పుడు ఇంకా తవ్వుకోవచ్చనే ఉద్దేశంతో అదే ప్రాంతంలో మరిన్ని లీజులకు దరఖాస్తు చేసుకుంది. ఈసారి వంతాడ గ్రామం వెనుక ఉన్న అడవిని సర్వే చేసి హద్దులు కూడా నిర్ణయించింది. సుమారు 600 ఎకరాలను లీజుకు తీసుకునేందుకు మైనింగ్ శాఖకు దరఖాస్తులు పెట్టినట్లు సమాచారం. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అనుమతులు కూడా తెచ్చుకుని య«థేచ్ఛగా తవ్వకాలు చేసేవారు. కానీ టీడీపీ ఓడిపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. మైనింగ్ కోసం వంతాడ కొండపై రిజర్వు ఫారెస్టులో 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. మైనింగ్‌కు అనుమతి ఉన్నా రోడ్డు వేయడానికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ రోడ్డు కోసం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నా అది అధికారులను ప్రలోభపెట్టి తీసుకున్నట్లు చెబుతున్నారు. రిజర్వు ఫారెస్టులో అండ్రు సంస్థ నిర్మించిన రోడ్డు రక్షణ చర్యలూ లేవు మైనింగ్ ప్రాంతంలో పెద్దగా రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. మైనింగ్ చేసే చోట, స్టాక్ యార్డుల్లో సుమారు 500 మంది పనిచేసేవారు. ఖనిజాన్ని రవాణా చేసేందుకు వచ్చే వాహనాల సిబ్బంది వందల సంఖ్యలో ఉండేవారు. వారికి అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా పని చేయించుకున్నారు. రాత్రి సమయాల్లో వారు ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని చెబుతున్నారు. పనిచేసే వారిలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అధికారం అండతో మైనింగ్ చేసే చోట తీసుకోవాల్సిన కనీస చర్యల్ని అండ్రు కంపెనీ తీసుకోలేదని చెబుతున్నారు. స్థానికులకు ఉపాధి ఇవ్వలేదు.. అక్కడి రోడ్లను నాశనం చేశారు మరోవైపు మైనింగ్ జరిగే ప్రాంతంలో ఉన్న వంతాడ గ్రామవాసులకు పెద్దగా ఉపాధి కల్పించలేదు. అతికొద్ది మందికి మాత్రమే చిన్నచిన్న పనులు ఇచ్చినా ఎక్కువ మందిని బయట ప్రాంతం నుంచే తీసుకువచ్చారు. దీంతో వందల కోట్ల విలువైన ఖనిజాన్ని ఆ ప్రాంతం నుంచి తరలించుకుపోయినా అక్కడి ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపాధి దొరకలేదు. ఐదేళ్లపాటు ఓవర్ లోడు వాహనాలను నిరంతరాయంగా నడపడంతో ఆ ప్రాంతంలో రోడ్లు నాశనమయ్యాయి. స్టాక్ యార్డులో నిల్వ ఉన్న ఖనిజం లంపకలోవ–ప్రత్తిపాడు రోడ్డు చిద్రమైపోయింది. చివరికి ఖనిజాన్ని తరలించే టిప్పర్లు కూడా వెళ్లడం కష్టంగా మారడంతో అండ్రు కంపెనీ కోసం టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద రూ.12 కోట్లతో రోడ్డు మంజూరు చేసి నిర్మించింది. అనుమతి లేకుండా పెదశంకర్లపూడి వద్ద ఏలేరు ఎడమ కాలువ గట్టును మైనింగ్ వాహనాల రాకపోకలకు వినియోగించింది. దీనివల్ల కాలువ గట్టు ధ్వంసమై కుంగిపోయింది. పెద శంకర్లపూడి వద్ద ఏలేరు కాలువపై ఉన్న వంతెన అండ్రు లారీల రాకపోకలతో కుంగిపోయింది. మైనింగ్ తవ్వకాల వల్ల ఏర్పడే కాలుష్యంతో గిరిజనులు సాగు చేసే తోటలు దెబ్బతిన్నాయి. జీడిమామిడి తోటలు, సీతాఫలం దిగుబడులు తగ్గిపోయాయి. మరోవైపు మైనింగ్ కోసం ఈ ప్రాంతంలో నీటి వనరులను అండ్రు సంస్థ పెద్దఎత్తున వినియోగించింది. బోర్లు వేసి పెద్దఎత్తున నీటిని తోడేసింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. అండ్రు మినరల్స్ జరిపిన ఖనిజ తవ్వకాలు.. వృత్తంలో అక్కడే వదిలేసిన యంత్రాలు ఎవరీ అండ్రు.. అండ్రు మినరల్స్ యజమాని రమేష్‌బాబు. తన ఇంటి పేరుతోనే ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం. గతంలో అక్కడ స్టోన్ క్వారీలు ఉండేవి. క్రషర్లు నిర్వహించేవారు. క్రషర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2013లో తన కుటుంబ సభ్యుల పేరు మీదే లేటరైట్ లీజులు తీసుకున్నారు. పూర్తిగా లేటరైట్ మైనింగ్‌పైనే దృష్టి పెట్టారు. రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం పెట్టారు. టీడీపీ నాయకుల ద్వారా చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఆ తర్వాత లోకేశ్‌తో సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. చిన్న క్రషర్ యజమాని ఇప్పుడు మైనింగ్ ద్వారా వేల కోట్లు ఆర్జించినట్లు మైనింగ్ రంగంలో ఉన్న పెద్దవాళ్లు చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు, లోకేశ్ అండతోనే. టీడీపీ హయాంలో స్వయంగా లోకేశ్ ఈ లీజుల్లో తవ్వకాలను పర్యవేక్షించేవారని సమాచారం. స్థానిక టీడీపీ నేతలు, కొందరు మంత్రులకు ఈ తవ్వకాల్లో భాగమున్నట్లు చెబుతున్నారు. లారీలు తిరుగుతూనే ఉండేవి రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తవ్వేవాళ్లు. పెద్ద టిప్పర్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి. ఆ క్వారీలు లేకముందు అంతా పచ్చగా ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా ఎర్రమట్టి గోతులున్నాయి. ఆ క్వారీల వల్ల మా పిల్లలకు ఏమైనా ఉద్యోగాలిప్పిస్తారనుకున్నాం. అది కూడా లేదు. పెద్ద మిషన్లతో తవ్వుతుంటే మట్టితో మా తోటలు పాడైపోయేవి. ఎవరికి చెప్పుకోలేక అలాగే ఉండిపోయాం. – మాతే బాలమ్మ, వంతాడ ఇక్కడ ఖనిజం తవ్వుకున్నారు.. ఇక్కడ ఉద్యోగాలివ్వలేదు మా కొండపై ఐదేళ్లు ఎర్రమట్టి తవ్వుకుని వెళ్లారు. దానికి చాలా విలువ ఉంటుందని చెబుతున్నారు. మా ఏరియా మట్టితో కోట్లు సంపాదించినోళ్లు మా ఊర్లో పది మందికి కూడా ఉద్యోగాలివ్వలేదు. గట్టిగా మాట్లాడిన నలుగురైదుగురిని సూపర్వైజర్లుగా పెట్టుకున్నారు. క్వారీలు రాకముందు చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అది జరగలేదు. మా పంటలు పాడైపోయాయి. ఉపాధి తగ్గిపోయింది. – కుడే రాంబాబు, వంతాడ ఇష్టానుసారం తవ్వుకున్నారు మా ప్రాంతంలో ఖనిజాన్ని ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్లారు. కానీ మా ప్రాంతాలను పట్టించుకోలేదు. అండ్రు కంపెనీ లారీల వల్ల మా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. వంతెనలు కుంగిపోయాయి. ఆ లారీల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. పాడైన రోడ్లు బాగు చేస్తామన్నారు కానీ చేయలేదు. – అన్నిక సత్తిబాబు, ఇ.గోకవరం, ప్రత్తిపాడు మండలం ప్రాథమికంగా అక్రమాలు బయటపడ్డాయి.. అండ్రు మినరల్స్ తవ్వకాలపై చాలా ఫిర్యాదులు రావడంతో ప్రాథమిక విచారణకు ఆదేశించాం. అందులో కొన్ని అక్రమాలు బయటపడ్డాయి. స్టాక్ యార్డులో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం లెక్కకు మించి ఉంది. దీంతో ఇంకా లోతుగా విచారణ చేస్తున్నాం. తవ్విన చోట మళ్లీ పూడ్చి మొక్కలు నాటారు. దీంతో అసలు ఎంత తవ్వారో తెలియడంలేదు. అందుకే త్రీ డైమెన్షన్లో డ్రోన్ సర్వే చేయాలని నిర్ణయించాం. ఈ కంపెనీ తవ్వకాలు జరపకముందు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు శాటిలైట్ చిత్రాలను తెప్పిస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ డైరెక్టర్ ఇవీ చదవండి: Andhra Pradesh: పోలవరం.. శరవేగం ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
కొండెక్కిన కోడి..శ్రావణంలోనూ తగ్గని చికెన్ ధర
మండపేట: శ్రావణంలోనూ చికెన్ ధర దిగిరావడం లేదు. రూ.300లకు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. రెండు నెలల వ్యవధిలో రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన మేత ధరలు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ, చత్తీస్గడ్ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు విశ్లేషిన్నారు. కోడిగుడ్డు ధర మాత్రం కొంతమేర వినియోగదారులకు ఊరటనిస్తోంది. పండగరోజుల్లో.. తూర్పు గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2.5 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తున్నారు. ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 ఫామ్‌లలో ఏడు లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతుంది. 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి సిద్దమవుతుంటాయి. ఈ మేరకు రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ఆన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. కారణమేంటంటే.. - కోవిడ్ ఆంక్షలు సడలించినా మేత ధరలు అదుపులోకి రావడం లేదు. - ఆంక్షలు కారణంగా జూలైలో మేత రవాణా నిలిచిపోయింది. ధరలు పెరగడం మొదలైంది. - బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబిన్ కిలో రూ.35 నుంచి రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.106కు పెరిగిపోయింది. - మొక్కజొన్న రూ.12నుంచి రూ. 23కు పెరిగినట్టు కోళ్ల రైతులు చెబుతున్నారు. - కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పౌష్టికాహారంగా చికెన్ వినియోగం అధికం కావడంతో గత నెలలో కిలో చికెన్ రూ. 320వరకూ చేరింది. తర్వాత రూ.230ల నుంచి రూ.250లకు తగ్గింది. - వారం రోజులగా మళ్లీ ధరకు రెక్కలొస్తున్నాయి. ఆన్ సీజన్, మేత ధరలకు జడిసి కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో యిలర్ పెంపకం సగానికి పైగా తగ్గిపోయింది. దిగుమతిపై ఆధారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, తెలంగాణలోని ఆశ్వారావుపేట, సత్తుపల్లి, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో చికెన్ ధరలకు మరలా రెక్కలొస్తున్నాయి. బుధవారం కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.135లు వరకు పెరిగింది. వినియోగం సాధారణంగానే ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారవర్గాల అంచనా. అయితేగుడ్డు ధర క్రమంగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. రైతు ధర తగ్గిపోవడంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.5కి చేరుకుంది. మేత తగ్గితేనే కొత్త బ్యాచ్‌లు - బొబ్బా వెంకన్న బ్రాయిలర్ కోళ్ల రైతు శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. అయితే ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆన్‌సీజన్ మొదలు కావడం, మేత ధరలకు జడిసి ఎవరూ కొత్త బ్యాచ్‌లను వేయడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. కీ పాయింట్స్ - తూర్పు గోదావరి జిల్లాలో చికెన్ వినియోగం రోజుకి 2.50 లక్షల కిలోలు - బ్రాయిలర్ కోళ్ల ఫామ్స్ సంఖ్య 400 - రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ రూ. 300 - కోళ్ల మేత సోయబిన్ ధరల్లో పెరుగుదల రూ. 35 నుంచి రూ.100 చదవండి: సాగుకు ‘టెక్’ సాయం..! -
టీడీపీ నాయకత్వంపై బుచ్చయ్య చౌదరి అసంతృప్తి
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీలో అంతర్గత వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేనే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం పై విచారం వ్యక్తం చేశారు. కాగా, గత మార్చి నెలలో పార్టీ నాయకత్వ మార్పుపై బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మరొకసారి టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో టీడీపీ నేతలు సతమతమవుతున్నారు.ఒకవైపు పలు ఎన్నికల్లో టీడీపీ చవిచూసిన ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏం చేయాల్లో తెలియని డైలమాలో ఉన్నారు. -
Nadu Nedu: మన అస్త్రం చదువే: సీఎం జగన్
చిరునవ్వుతో చదివించేలా తోడుంటాం.. అక్కచెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా... ప్రతి బిడ్డకు మేనమామగా వారి భవిష్యత్తు బాగుండాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లలు బాగా చదవాలి. వారికి మనం ఇచ్చే ఆస్తి చదువే. వారి కాళ్లమీద వారు నిలబడాలని, పోటీ ప్రపంచంలో రాణించాలని, భవిష్యత్తు బాగుండాలని ఇవన్నీ చేస్తున్నాం. చదువు అనే అస్త్రంతో వారు పేదరికాన్ని జయించాలని కోరుకుంటున్నా. ఏ కష్టం లేకుండా, చిరునవ్వుతో తమ పిల్లలను చదివించేలా అక్కచెల్లెమ్మలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, పి.గన్నవరం (తూర్పుగోదావరి): చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా రాష్ట్రంలో నూతన విద్యావిధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వార్షిక విద్యా నివేదిక (అసర్) ప్రకారం మూడో తరగతిలో ఉన్న విద్యార్థుల్లో 22 శాతం మంది మాత్రమే 2వ తరగతి పాఠ్య పుస్తకాలను చదవగలిగే స్థితిలో ఉన్నారని, ఇలాంటి దుస్థితిని తొలగించి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకే విద్యా సంస్కరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో ఆరు రకాలుగా స్కూళ్లు ఉంటాయని, మొత్తం 57 వేల పాఠశాలలను ‘నాడు–నేడు’ ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జడ్పీ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు,. ఈ సందర్భంగా నాడు–నేడు ద్వారా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తొలివిడత స్కూళ్లను విద్యార్థులకు అంకితం చేయడంతోపాటు రెండో విడత పనులను కూడా ప్రారంభించారు. జగనన్న విద్యాకానుక కింద రెండో విడత స్టూడెంట్స్ కిట్లను పంపిణీ చేశారు. నూతన విద్యావిధానం వల్ల చేకూరే ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ విడమర్చి చెప్పారు. ఆ వివరాలివీ.. పి.గన్నవరం పాఠశాలలో..: విద్యార్థినిని ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం జగన్ ఇకపై 6 రకాల స్కూళ్లు ఇక మీదట రాష్ట్రంలో స్కూళ్లన్నీ 6 రకాలుగా ఉంటాయి. నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న వీటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. 1వ కేటగిరీలో పంచాయతీలకు అనుబంధంగా ఉండే హామ్లెట్ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్‌గా ప్రీ ప్రైమరీ 1 (పీపీ–1), ప్రీ ప్రైమరీ 2 (పీపీ–2)లతో ఉంటాయి. కిలోమీటర్ దూరంలోని ఫౌండేషన్ స్కూలుకు అనుబంధంగా ఇవి ఉంటాయి. 2వ కేటగిరీలో గ్రామం నుంచి కిలోమీటర్ దూరంలోనే ఫౌండేషన్ స్కూలు వస్తుంది. దీనిలో పీపీ –1, పీపీ –2తో పాటు 1, 2వ తరగతులుంటాయి. 3వ కేటగిరీలోని ఫౌండేషన్ ప్లస్ స్కూలులో పీపీ –1, పీపీ –2, 1, 2, 3, 4, 5 తరగతులుంటాయి. 4వ కేటగిరీలో ప్రీ హైస్కూలులో 3 నుంచి 7 లేదా 8వ తరగతుల వరకు ఉంటాయి. 5వ కేటగిరీలోని హైస్కూలులో 3 –10 వరకు తరగతులు ఉంటాయి. 6వ కేటగిరీలోని హైస్కూలు ప్లస్‌లో 3 నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి. శాటిలైట్ ఫౌండేషన్ స్కూలుకు కిలోమీటర్ దూరంలోనే ఫౌండేషన్ స్కూలు, 3 కిలోమీటర్ల లోపే హైస్కూలు వ్యవస్థ అందుబాటులో ఉంటాయి. ఇలా ఈ 6 విభాగాల్లోకి వచ్చే 57 వేల స్కూళ్లను నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేస్తాం. దీనికోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలతోపాటు బల్లపై కూర్చొని ముచ్చటిస్తున్న సీఎం దీనివల్ల మేలు ఏమిటంటే... ‘అసర్’ నిర్వహించిన సర్వేలో 3వ తరగతి పిల్లాడికి 2వ తరగతి పుస్తకమిచ్చి చదవమంటే 22 శాతం మంది మాత్రమే చదవగలిగారు. మిగిలిన వారు చదవలేకపోయారు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చడానికే ఈ కార్యక్రమం చేపట్టాం. పేద పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మరి కొద్ది సంవత్సరాల తరువాత గ్రాడ్యుయేట్లు అవుతారు. వీరికి మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు రావాలి. వారి కుటుంబాలు రూపురేఖలు, వారి భవిష్యత్తు మారాలన్న తపన, తాపత్రయంతో చదువులపై ఇంతగా ధ్యాసపెట్టి అడుగులు వేస్తున్నాం. టీచర్, విద్యార్థి నిష్పత్తి సరిగా లేక.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాల్సిన సబ్జెక్టులు 18 ఉండగా ఒక్క టీచరే ప్రతి క్లాసు, ప్రతి సబ్జెక్టుకు చెప్పడం వల్ల టీచర్, విద్యార్థి నిష్పత్తి అమలు కాకపోవడమే కాకుండా సబ్జెక్టులపై ఫోకస్ లేక పిల్లలకు పూర్తి అవగాహన కలగడం లేదు. దీన్ని చక్కదిద్దుతూ ప్రతి సబ్జెక్టుకు, ప్రతి క్లాçసుకు ఒక టీచర్ ఉండేలా మార్పులు చేయడానికి స్కూళ్లను 6 కేటగిరీలుగా మారుస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నాం. విద్యాకానుక బ్యాగును పరిశీలిస్తున్న సీఎం పిల్లల భవిష్యత్తు బాగుండాలని.. అక్కచెల్లెమ్మలకు ఒక తమ్ముడిగా, అన్నగా.. పిల్లలకు మేనమామగా వారి భవిష్యత్తు బాగుండాలని అనేక విద్యాకార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఎస్సీ నియోజకవర్గమైన పి.గన్నవరంలో ఈరోజు మూడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా దీర్ఘకాలం మూతబడిన బడులు ఈరోజు నుంచి తెరుచుకుంటున్నాయి. డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ లాంటి సంస్థల సూచనలతో పాఠశాలలను తెరుస్తున్నాం. కోవిడ్ ప్రోటోకాల్ పూర్తిగా పాటించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న చోట స్కూళ్లు తెరవాలని ఆదేశాలిచ్చాం. ఒక్కొక్క గదిలో 20 మందికి మించి విద్యార్థులు ఉండకుండా తరగతులు నిర్వహించాలి. అంతకన్నా ఎక్కువ మంది ఉంటే రోజు విడిచి రోజు వేర్వేరుగా నిర్వహించాలని సూచించాం. టీచర్లందరికీ వాక్సినేషన్ పూర్తి చేశాం. నాడు – నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, విద్యావ్యవస్థలో మార్పులు, సీబీఎస్ఈ విధానం, ఇంగ్లీషు మీడియం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన లాంటివన్నీ పేద కుటుంబాలకు మేలు జరిగేలా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవే. తాగునీటి స్వచ్ఛతను పరిశీలిస్తూ.. నాణ్యతలో రాజీలేకుండా విద్యాకానుక.. జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువులను నాణ్యతలో రాజీ లేకుండా అందచేస్తున్నాం. 2021 విద్యాసంవత్సరానికి విద్యాకానుక కింద మంచి స్కూలు బ్యాగు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు (ఒక పేజీలో తెలుగు, పక్కనే పేజీలో ఇంగ్లీషులో పాఠం ఉండేలా), నోట్ బుక్కులు, వర్కు బుక్కులు, బెల్టు, 2 జతల సాక్సులు, బూట్లు, కుట్టుకూలీ డబ్బులతో సహా మూడు జతల యూనిఫారంతోపాటు ఈసారి కొత్తగా డిక్షనరీ కూడా ఇస్తున్నాం. ఐదో తరగతి లోపు వారికి బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో డిక్షనరీలో పదాలతో పాటు బొమ్మలు కూడా ముద్రించాం. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డిక్షనరీ సైజ్ పెంచి విద్యాకానుక కిట్‌లో ఇస్తున్నాం. జగనన్న విద్యాకానుక ద్వారా రెండేళ్లలో రూ.1,380 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది 47.32 లక్షల మంది విద్యార్థులకు రూ.731 కోట్లతో కిట్లు అందిస్తున్నాం నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. లోపాలను సవరించి మంచి నాణ్యతతో కూడిన వస్తువులను పంపిణీ చేయించాం. పిల్లలు మోసేటప్పుడు ఇబ్బంది పడకుండా బ్యాగు బెల్టుల్లో కుషన్ కూడా పెట్టించాం. ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలించి మరీ ఇస్తున్నాం. స్కూళ్లలో పలు సదుపాయాలు.. మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ బడులు, హాస్టళ్ల రూపురేఖలు మార్చి కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నాం. పది రకాల అభివృద్ధి కార్యక్రమాలతో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు, టీచర్లుకు మంచి ఫర్నీచర్ ఏర్పాటు చేశాం. గ్రీన్ చాక్ బోర్డులు, విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మంచినీటి సదుపాయం కల్పించాం. రన్నింగ్ వాటర్‌తో మంచి టాయిలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చాం. ప్రతి స్కూలుకు రంగులు వేయించి కాంపౌండ్ వాల్, ఇతర మరమ్మతులు చేయించాం. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు, గోరుముద్ద కింద రుచికరమైన, పరిశుభ్రమైన పదార్ధాల తయారీకి కిచెన్షెడ్లు, కట్టించాం. పిల్లల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లీషు ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. విద్యా కార్యక్రమాలకు రూ.32,714 కోట్లు ఈ రెండేళ్లలో కేవలం విద్యా రంగంలోనే వివిధ కార్యక్రమాల కోసం రూ.32,714 కోట్లు ఖర్చు చేశాం. రెండేళ్లలో జగనన్న అమ్మఒడి ద్వారా 44,48,845 మంది తల్లులకు రూ.13,023 వేల కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన కింద 18,80,934 మంది పిల్లలకు రూ.5,573 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 15,56,956 మందికి రూ.2,270 కోట్లు ఇవ్వగలిగాం. గోరుముద్ద కింద 37 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.3,200 కోట్లకుపైగా ఖర్చు చేశాం. విద్యాకానుక కింద 47,32,064 మంది పిల్లలకు రూ.1,379 కోట్లు వ్యయం చేశాం. మనబడి నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్ల అభివృద్ధికి రూ.3,600 కోట్లకుపైగా వెచ్చించాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 30.16 లక్షల మంది కోసం రూ.3,600 కోట్లు వెచ్చించాం. మరుగుదొడ్ల నాణ్యతను వీక్షిస్తున్న ముఖ్యమంత్రి రెండేళ్లలో ప్రత్యక్షంగా ఫలితాలు.. ప్రభుత్వం రెండేళ్లుగా చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అమ్మ ఒడి, గోరుముద్ద, నాడు – నేడు లాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19 వరకు (వైఎస్సార్సీపీ అధికారంలోకి రాక ముందు) ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల సంఖ్య 70.43 లక్షలు ఉంటే ఇప్పుడది 73.05 లక్షలకు పెరిగింది. కోవిడ్ ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పథకాల వల్లే పెరిగిందని గర్వంగా చెబుతున్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలలను తీసుకుంటే గత సర్కారు హయాంలోని చివరి సంవత్సరంలో కేవలం 37.20 లక్షల మంది ఉంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 43.43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మన ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల తల్లుల్లో, ప్రతి బిడ్డలోనూ విశ్వాసం పెరిగింది. ఈ ప్రభుత్వం మన మంచి కోసం పనిచేస్తోందన్న భరోసా ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యను హక్కుగా చదువుకునేలా చర్యలు చేపట్టాం. పైలాన్ ఆవిష్కరణ.. రెండో విడతకు శ్రీకారం మనబడి నాడు–నేడు తొలివిడత ద్వారా 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేసిన నేపథ్యంలో సోమవారం నుంచి రెండో విడత స్కూళ్లలో నాడు – నేడు పనులకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం రెండో విడత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లను విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా అందచేశారు. విద్యాకానుక వస్తువుల నాణ్యతను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాటు విజ్ఞప్తి మేరకు తొగరపాయ బ్రిడ్జి, అప్పనపల్లి లిఫ్ట్, మొండెపు లంక చానెల్ ఆధునికీకరణ పనులను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అమ్మలా అన్నం.. థ్యాంక్స్ మామయ్యా గతంలో స్కూల్‌కి వెళ్లేటప్పుడు అమ్మ రోజూ లంచ్ బాక్స్ పెట్టేది. జగన్ మామయ్య సీఎం అయిన తర్వాత మా అందరికీ రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజుకో వెరైటీ ఫుడ్ అందచేస్తున్న జగన్ మామయ్యకు చాలా చాలా థ్యాంక్స్. గతంలో స్కూల్లో బాత్రూమ్కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రన్నింగ్ వాటర్‌తో పరిశుభ్రంగా ఉన్నాయి. నేను పెద్దయ్యాక మ్యాథ్స్ టీచర్ అవుతా. సీఎం మామయ్య మా కలలను నెరవేరుస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. – ప్రణవి, 5వ తరగతి విద్యార్థిని, ఎంపీపీ స్కూల్, మొగలికుదురు అందరికీ నాణ్యమైన విద్య.. జగనన్న విద్యా కానుక కిట్ చాలా బావుంది. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి పథకాలు గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రతీ విద్యార్థి నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. మన బడి ‘నాడు–నేడు’ విద్యార్థులకు కోహినూర్ వజ్రం లాంటింది. బలవర్ధకమైన భోజనం అందిస్తున్నారు. నాన్న టైలర్. వికలాంగుల పింఛన్ వస్తోంది. మా అమ్మకు రెండు సార్లు అమ్మ ఒడి వచ్చింది. ఆన్లైన్ తరగతుల కోసం మొబైల్ ఫోన్ తీసుకున్నాం. థ్యాంక్యూ జగన్ మామయ్యా. – కె.సాయి శరణ్య, 10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పి.గన్నవరం సీఎం చెప్పారంటే.. చేస్తారంతే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏదైనా మాట చెప్పారంటే చేసి తీరుతారన్న నమ్మకం ప్రజలందరిలో బలంగా ఉంది. సీఎం జగన్ ఏపీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపారు. నాడు – నేడు మహాయజ్ఞంలో తొలిఘట్టం పూర్తి చేసి ముందడుగు వేస్తున్న ధీరుడు. విద్య ఆవశ్యకతను చాటిచెప్పిన బీఆర్ అంబేడ్కర్, నెల్సన్ మండేలా, అబుల్ కలామ్ ఆజాద్ లాంటి మహనీయుల బాటలో సీఎం ముందుకు సాగుతున్నారు. గత పాలకులు ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తే జగనన్న మాట మేరకు పాఠశాలల స్థితిగతులను మారుస్తున్నారు. – ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి -
తూర్పుగోదావరి జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం
-
అనుకున్న దానికన్నా ఉత్తమంగా ఆడాం: సాత్విక్ సాయిరాజ్
అమలాపురం: ‘అనుకున్న దానికన్నా ఉత్తమంగా ఆడాం. క్వార్టర్స్‌కు వచ్చి ఉంటే పతకం సాధించేవాళ్లం. మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచినా క్వార్టర్స్‌కు అవకాశం రాలేదు. మా ప్రతిభ నిరాశపరచలేదు. ఫలితం అనుకూలం రాలేనందుకు బాధగా ఉన్నా 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తాను’ అని షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ పేర్కొన్నాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో త్రుటిలో క్వార్టర్ ఫైనల్స్ అవకాశం కోల్పోయిన సాత్విక్ శనివారం సొంత ఇంటికి చేరాడు. ఈ సందర్భంగా అమలాపురంలో ఘన స్వాగతం లభించింది. ఆయన ‘సాక్షి’తో టోక్యో అనుభవాలను పంచుకున్నాడు. సాత్విక్ మాట్లాడుతూ.. ప్రణాళికతో సిద్ధమవుతా.. ‘చిరకాల కోరిక తీరింది. ఒలింపిక్స్ వేదికపై మన వాళ్లు ఎవరైనా ఆడుతుంటే టీవీలో ఆసక్తిగా చూసేవాడిని. అలాంటిది నేనే ఆడుతున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. నిబంధన మేరకు ఏ జట్టు ఎక్కువ సెట్లు గెలిచారనే అంశం పరిగణలోకి తీసుకోవడం వల్ల క్వార్టర్స్ అవకాశం కోల్పోయాం. అయినా ప్రతిభతో క్రీడాభిమానుల మన్నననలు పొందాం. 2024లో పారిస్ ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సిద్ధమవుతాను. ప్రణాళికతో ఆడుతూ ఫిట్నెస్ పెంచుకుంటాను. డబుల్స్ కోచ్‌ను ఎంపిక చేసుకుని సాధన చేస్తాను. అట్టడుగు స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తే మనకు ఎక్కువ పతకాలు వస్తాయి. ఇతర దేశాల్లా లాంగ్ గోల్ పెట్టుకోవాలి. కనీసం నాలుగు, ఎనిమిదేళ్ల తరువాత జరిగే ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. దీటైన సదుపాయాలుండాలి. అథ్లెటిక్స్‌లో నిరంతరం పోటీలు జరగాలి. ఒడిశా హాకీని దత్తత చేసుకున్నట్టుగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క క్రీడను దత్తత చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను.’ అని సాత్విక్ సాయిరాజ్ తెలిపాడు. -
రాజమండ్రిలో దంపతులు ఆత్మహత్య
సాక్షి, తూర్పు గోదావరి : రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎస్. ఆర్ ఎనక్లేవ్ అపార్ట్మెంట్లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నడింపల్లి నరసింహారాజు, వెంకటరమణమ్మగా పోలీసులు గుర్తించారు. భర్త నిడదవోలులో టీచర్ కాగా, భార్య ఉమెన్స్ కాలేజ్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్ పని చేస్తోంది. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇంటింటికీ రేషన్ అద్భుతం.. కేంద్ర బృందాల కితాబు
కాకినాడ సిటీ/కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో అమలవుతున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని జైపూర్‌కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ అండ్ స్టడీస్ (సీడీఈసీఎస్) బృందాలు ప్రశంసించాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం–2013 అమలు తీరు సమగ్ర పరిశీలన, మదింపునకు కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ జైపూర్‌లోని సీడీఈసీఎస్ను థర్డ్‌పార్టీ మానిటరింగ్ సంస్థగా ఏర్పాటు చేసింది. ఈ సంస్థ బృందాలు తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించి సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో అధికారులతో సమావేశమయ్యారు. కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఈ బృందం సభ్యులు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సీనియర్ కన్సల్టెంట్ కె.గిరిజాశంకర్, సీడీఈసీఎస్ టీమ్ లీడర్ రవిపారీక్ తదితరులు ఇన్చార్జి కలెక్టర్ జి లక్ష్మీశ, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో సమావేశమయ్యారు. ఆది, సోమవారాల్లో కాకినాడ రూరల్, కరప మండలాలతో పాటు అర్బన్ పరిధిలోని మండల స్థాయి స్టాక్ పాయింట్లు, చౌకధరల దుకాణాలను పరిశీలించినట్లు తెలిపారు. రేషన్‌కార్డుదారులతో మాట్లాడి సరుకులు అందుతున్న తీరును తెలుసుకున్నట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తకార్డుల జారీ, పేర్ల చేర్పు, తొలగింపు తదితర సేవలు 21 రోజుల్లోపు ప్రజలకు అందుతున్నాయన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సగటున ఈ సమయం 45 రోజులుగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్యోజన (పీఎంజీకేవై), రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నట్లు చెప్పారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులు అందిస్తుండటం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉందన్నారు. రాష్ట్ర పీడీఎస్ కార్డుదారులకు సార్టెక్స్ బియ్యం అందిస్తుండడంపై కార్డుదారులు అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పటిష్ట, ప్రణాళికాయుత వ్యవస్థ ద్వారా జిల్లాలో 16.50 లక్షల రేషన్‌కార్డుల లబ్ధిదారులకు ప్రతి నెలా ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు అందుతున్నాయని, ప్రజాపంపిణీ వ్యవస్థలో అద్భుత పనితీరుకు గ్రామ, వార్డు వలంటీర్, సచివాలయ వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ వెళ్లి రేషన్ ఇవ్వడం ప్రశంసనీయమని సీడీఈసీఎస్ నోడల్ అధికారి డాక్టర్ ఉపేంద్ర కె.సింగ్ పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్లో ఆయన జేసీ (రెవెన్యూ) ఎస్.రామసుందర్‌రెడ్డి, డీఎస్వో మోహన్‌బాబుతో సమావేశమయ్యారు. ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, నంద్యాల మండలాల్లో స్వయంగా రేషన్ షాపులను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడినట్లు చెప్పారు. నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను ఇస్తున్నట్లు వినియోగదారులు చెప్పారన్నారు. ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందించే విధానం బాగుందని చెప్పారు. ఇందుకోసం జిల్లాలో 760 మినీ ట్రక్కులను ఏర్పాటు చేసినట్లు జేసీ రామసుందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో సీడీఈసీఎస్ అధికారులు అలీబాషా, రామారావు పాల్గొన్నారు. -
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తా..
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు ఏపీపీఎస్సీ సభ్యునిగా పదవి ఇవ్వడంతో కొందరు తమ సంస్థపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని నూతలపాటి సోనివుడ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎంపీ రఘరామకృష్ణంరాజు తనపై కొన్ని ఛానెల్స్‌లో వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తుచేశారు. గత 24 ఏళ్లుగా తమ సంస్థ అనాథ పిల్లలను చదివిస్తోందని పేర్కోన్నారు. అదే విధంగా, తమ సంస్థచే నిర్వహిస్తున్న హస్టల్లో బాలికల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. తమ సంస్థపై, తనపై అసత్య ఆరోపణలు చేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై మండిపడ్డారు. వారిపై కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తానని నూతల పాటి సోనివుడ్ అన్నారు. -
కాకినాడ పోర్టులో ఎల్ఎన్జీ టెర్మినల్
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ముంబైకి చెందిన హెచ్.ఎనర్జీ సంస్థ అనుబంధ సంస్థ ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈసీపీఎల్) దీనిని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.5,400 కోట్ల పెట్టుబడి అంచనాతో భారీ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తొలి దశ పనులు చేపట్టేందుకు ఈసీపీఎల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీర్ఘకాలం కొనసాగేలా.. ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణానికి భారీ వ్యయం కానుండటంతో.. టెర్మినల్‌ను దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుంది. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు (కేఎస్పీఎల్)ను 50 ఏళ్లపాటు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేఎస్పీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పైన పదేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. అయితే, కేఎస్పీఎల్ ఏర్పాటై 23 ఏళ్లు గడిచిపోగా.. ఇక 27 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెనుకంజ వేస్తోంది. కేఎస్పీఎల్ కన్సెషన్ సమయం అయినపోయిన తర్వాత కూడా టెర్మినల్ కొనసాగించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు లేదా కన్సెషన్ పీరియడ్ తర్వాత వచ్చే కొత్త ఆపరేటర్‌తో కొనసాగించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఎల్ఎన్జీ టెర్మినల్ తొలి దశ పనులను చేపట్టడానికి ఈసీపీఎల్ ముందుకొచ్చింది. తొలి దశలో రూ.1,800 కోట్ల పెట్టుబడులు కాకినాడ డీప్ వాటర్ పోర్టులో తొలి దశలో రూ.1,600 కోట్ల ఎల్ఎన్జీ టెర్మినల్, రూ.200 కోట్లతో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్స్ నిర్మించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డుకు ఈస్ట్‌కోస్ట్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రెండో దశలో మరో రూ.3,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కన్సెషన్ అగ్రిమెంట్‌పై స్పష్టత రావడంతో వర్షాకాలం తర్వాత ఈసీపీఎల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ‘సాక్షి’కి వివరించారు. 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేస్తుండగా.. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఏటా 1 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో ఏటా రూ.1,200 కోట్ల ఆదాయంతో పాటు కాకినాడ డీప్ వాటర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటా రూపంలో మరో రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ మధ్యనే గంగవరం పోర్టులో అత్యధిక వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూపు కూడా అక్కడ భారీ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు మురళీధరన్ తెలిపారు. ఈ రెండు టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఖజానాకు వచ్చే15 ఏళ్లలో వ్యాట్ రూపంలో రూ.50 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. -
గెయిల్ గ్యాస్ విస్పోటనానికి ఎనిమిదేళ్లు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కోనసీమ గుండెలపై నిప్పుల కొలిమి రాజేస్తున్న చమురు సంస్థలు హామీలు నెరవేర్చకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. పాతికేళ్ల క్రితం పాశర్లపూడి సమీపాన 1995 జనవరి 8న సంభవించిన దేవర్లంక బ్లో అవుట్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా రికార్డు సృష్టించింది. నాటి ప్రమాదంలో ప్రాణనష్టం లేకున్నా ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఆ బ్లో అవుట్ గాయం నుంచి కోలుకుంటుండగా, 2014 జూన్ 27న నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) సమీపాన ట్రంక్ పైపులైన్ పేలుడు ఘటన 23 మందిని పొట్టన పెట్టుకుంది. మరో 16 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఈ సంఘటనలే కాకుండా కోనసీమలో తరచూ జరిగే గ్యాస్ లీకేజీ ప్రమాదాలు అక్కడి ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) హామీలు గాలిలో కలిసిపోతున్నాయి. వాటిని నెరవేర్చడంలో ఆ సంస్థ విఫలమవుతోంది. నగరం గ్యాస్ విస్ఫోటం సందర్భంలో ఇచ్చిన హామీలే ఇప్పటికీ నెరవేరలేదు. 23 మంది మృతుల్లో కుటుంబాలకు కుటుంబాలే బూడిదైపోయాయి. ఒక్క గటిగంటి శ్రీనివాసరావు కుటుంబంలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. పరిహారం పెంపులో బాధితుల పక్షాన ‘జగన్’ నగరం జనాభా 6,279. ఇక్కడ ఘోర విస్ఫోటం జరిగి ఆదివారానికి ఎనిమిదేళ్లవుతున్న సందర్భంగా స్థానికులను ‘సాక్షి’ శనివారం పలకరించింది. గెయిల్ ఇచ్చిన ప్రధాన హామీలు ఇన్నేళ్లయినా ఆచరణకు నోచుకోలేదని వారు చెప్పారు. ఆ ప్రాంతంలో ఇళ్లు, పచ్చని కొబ్బరి తోటలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఘటనకు పూర్తి బాధ్యత గెయిల్‌దే. ఓఎన్జీసీ సహజ వాయువు వెలికి తీస్తే దాని సరఫరా, మార్కెటింగ్ చేసేది గెయిలే. ఆ ప్రక్రియలో లోపంతోనే విస్ఫోటం సంభవించింది. పేలుడు అనంతరం ఇచ్చిన హామీలను ఆ సంస్థ మరచిపోయిందని బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు సరే అన్నారు తప్ప మారుమాటాడలేదు. 48 గంటల్లో సంఘటన స్థలానికి వచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి వైఎస్సార్ సీపీ తరపున రూ.లక్ష పరిహారం అందించారు. మృతుల కుటుంబాలను, అమలాపురం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి వంతున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌పై స్పందించిన కేంద్రం పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచింది. గ్రామాభివృద్ధిని విస్మరించారు నగరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని గెయిల్ మాట ఇచ్చినప్పటికీ దానిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. ఏడాదికి రూ.2 కోట్ల చొప్పున ఐదేళ్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లకు రూ.4 కోట్లు మాత్రమే ఇచ్చారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న హామీని గెయిల్ పూర్తిగా విస్మరించింది.– తాడి రామకృష్ణ, నగరం పరిహారంలో మోసం పేలుడు సంఘటనలో తీవ్ర గాయాలతో ప్రాణాలు నిలబడ్డాయి. నాలుగు నెలలకు పైనే చికిత్స చేయించారు. నా భార్య రత్నకుమారి ఊపిరితిత్తులు దెబ్బతిని ఏడాదిన్నర తర్వాత చనిపోయింది. మా అమ్మ, ఇద్దరు కుమార్తెలు కూడా తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. నాకు రూ.25 లక్షలు, నా భార్యకు రూ.25 లక్షలు, ఇళ్లు దెబ్బ తిన్నందుకు రూ.15 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి, చివరకు రూ.10 లక్షలతో సరిపెట్టారు. పిల్లల విద్యకు, ఉపాధికి అవకాశం కల్పిస్తామని మోసం చేశారు. – బోనం పెద్దిరాజు, క్షతగాత్రుడు ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు గెయిల్ పైపులైన్ విస్ఫోటంలో నాతోపాటు బిడ్డలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని గెయిల్ మాట ఇచ్చింది. ఆ రోజు ఆ మాటకు చాలా సంతోషించాం. ఏదో ఒక భరోసా లభిస్తుందని అనుకున్నాం. ఎనిమిదేళ్లయినా హామీ నిలుపుకోలేదు. మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకరికి ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి. – వానరాశి దుర్గాదేవి, క్షతగాత్రురాలు చదవండి: సముద్రంలో చెన్నై పడవకు అగ్ని ప్రమాదం! -
మా నాన్న అంత్యక్రియలు మీరే చేయండి
జవహర్‌నగర్: కరోనా మహమ్మారి మిగిల్చిన ఓ విషాదకర ఘటన జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కుడిపూడి గున్నయ్య (75) కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వచ్చి సంతోష్‌నగర్‌లో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. గున్నయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీనివాస్ చిన్నతనం నుంచే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుమార్తెలకు వివాహమై ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం గున్నయ్య భార్య అనారోగ్యంతో చనిపోయారు. వారం రోజులుగా గున్నయ్య, కుమారుడు శ్రీనివాస్ కరోనా బారిన పడి నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గున్నయ్య మంగళవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో వైద్యులు తూర్పు గోదావరిలో ఉన్న ఆయన కుమార్తెలకు తండ్రి మరణ వార్త చెప్పారు. లాక్డౌన్ కారణంగా అక్కడికి రాలేకపోతున్నామని, పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు నాగ శ్రీదేవి వాట్సాప్ ద్వారా వేడుకున్నారు. స్పందించిన పోలీసులు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం గున్నయ్య కుమారుడు శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి మరణించిన విషయం అతనికి తెలియదు. చదవండి: దైవ దర్శనానికి వెళ్లొస్తామంటూ.. ముగ్గురి బలవన్మరణం -
ఇద్దరు భార్యలను హింసించి జైలుకు.. ఆపై
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ కళ్యాణం వెంకన్న మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపిన వివరాల మేరకు.. చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన వెంకన్నకి ఇద్దరు భార్యలు. వీరిపై అనుమానం పెంచుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఇతనిపై అభియోగం. చిత్రహింసలకు గురిచేస్తూ సెల్ఫోన్లో చిత్రీకరించేవాడు. ఆ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ చేశాయి. అతను పెట్టే బాధలు భరించలేక ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతూరు పోలీసులు ఏప్రిల్ 19వ తేదీన నిందితుడ్ని అరెస్టు చేశారు. సెంట్రల్ జైలుకి రిమాండ్‌కు తరలించారు. జైలులో అతను మంగళవారం ఉదయం స్నానాల గదిలో మెడకు టవల్ చుట్టుకుని మృతి చెంది ఉండడాన్ని సహచర ఖైదీలు గమనించి జైలు అధికారులకు తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ -
చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి
పిఠాపురం(తూర్పుగోదావరి): క్షణికావేశం ఎంత దారుణ పరిస్థితులకు దారి తీస్తుందో ఈ ఘటనే ఉదాహరణ. 30 ఏళ్లకు పైగా దాంపత్య జీవితం గడిపిన ఆ భర్త కేవలం తాను తెచ్చిన కూర వండనందుకు భార్యపై కోపంతో మనస్తాపానికి గురై తన జీవితాన్నే అంతం చేసుకున్నాడు. ఏకంగా ప్రాణాలే తీసుకోవడం ఆ కుటుంబం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది. శనివారం రాత్రి ఈ ఘటన గొల్లప్రోలు మండలం కొడవలిలో చోటు చేసుకుంది. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. కొడవలికి చెందిన సీహెచ్ త్రిమూర్తులు (50) రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లి చికెన్, మటన్ తీసుకొచ్చాడు. రెండు కూరలూ వండాలని భార్యకు చెప్పాడు. ఇప్పుడు ఒకటి.. మరొకటి రేపు ఆదివారం కాబట్టి వండుతానని భార్య చెప్పగా కోపోద్రిక్తుడయ్యాడు. తన మాట వినలేదంటూ వివాదానికి దిగి బయటకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే అతనిని ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి.. ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’ -
తూర్పు గోదావరి జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ తూర్పు గోదావరి జిల్లాలో
-
చంద్రబాబు సర్కారులో వైద్య పరికరాల స్కామ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన భారీ స్కామ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా అవిడి గ్రామానికి చెందిన ఇందుకూరి వెంకటరామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో గురువారం సీఐడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణకు ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా టెండర్లు పిలిచింది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియన్ టెలీ మాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ అనే సంస్థకు టెండరు ఖరారు చేసింది. కాగా, ఈ టెండరు ఖరారులో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారని రామరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాదికి రూ.450 కోట్ల భారీ మొత్తానికి టెండరు కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని తెలిపారు. టెండరు దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్ ధరల కంటే ఎన్నో రెట్లు అమాంతం పెంచేసి మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి.. ► వెంటిలేటర్ రూ.7.10 లక్షలుంటే దాన్ని రూ.11 లక్షలుగా చూపించారు. ఇలా 159 వెంటిలేటర్ల సరఫరా ద్వారా రూ.17.05 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. రూ.840 విలువ చేసే ఒక్కో గ్లూకో మీటరును రూ.5.08 లక్షలుగా చూపించారు. 12 గ్లూకో మీటర్ల కొనుగోలులో రూ.60.96 లక్షల అవినీతికి పాల్పడ్డారు. రూ.1.7 కోట్ల విలువ చేసే ఎమ్మారై మిషన్ (కర్నూలు ఆసుపత్రికి)ను రూ.3.50 కోట్లుగా చూపించారు. ► మొత్తంగా రూ.300 కోట్లు విలువ చేసే ఉపకరణాల విలువను రూ.500 కోట్లుగా చూపించారు. రూ.200 కోట్ల మేర చేతులు మారాయి. పైగా 2016–17, 2017–18లో నిర్వహణ వ్యయంగా అడ్డగోలుగా రూ.24.90 కోట్లు కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
అల్లవరం/తూర్పుగోదావరి: మండలంలోని గోడితిప్ప సెంటర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న వారిద్దరూ విధులు ముగించుకుని వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు, గురుకుల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గోడిలోని బాలికల గురుకుల పాఠశాలలో పరమట సుధారాణి(42), బాలుర గురుకులంలో సురేష్(47) ఔట్‌సోర్సింగ్‌పై కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. అమలాపురం నల్లవంతన వద్ద బండివారిపేటలో వీరు ఉంటున్నారు. ఈ దంపతులకు పదమూడేళ్ల పాప ఉంది. రోజూ ఇద్దరూ మోటారుసైకిల్‌పై డ్యూటీకి వస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం కూడా పాఠశాలలో విధులు ముగించుకుని బైకుపై ఇంటికి బయల్దేరారు. గోడితిప్ప సెంటర్ దాటిన తర్వాత మంగాయమ్మ ఆస్పత్రికి సమీపంలోని బెండమూర్లంక వైపు వేగంగా వచ్చిన ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తల్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కాసేపటి తర్వాత సుధారాణి మృతి చెందగా, సురేష్‌ను 108 వాహనంలో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరైగన చికిత్స కోసం సురేష్‌ని కిమ్స్‌కు తీసుకువెళ్లారు. అయితే, చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో వారి ఏకైక కుమార్తె అనాథ అయ్యింది. కాగా ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు వెంబడించి పోలీసులకు అప్పగించగా దర్యాప్తు చేపట్టారు. చదవండి: పని చేయాలని చెప్పడమే పాపమైంది.. -
మార్కులు తక్కువచ్చాయని విద్యార్థులపై దారుణం
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ కాలంలోను తల్లిదండ్రులు ధైర్యం చేసి మరీ విద్యార్థులను కళాశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్‌కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు. వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్ఫోన్లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీ పంపితే లెక్చరర్ అనుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ వ్యక్తం చేసున్నాయి. చదవండి: ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి -
ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలుపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14వ తేదీన ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు జిల్లాలకు సంబంధించి జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 8కి లెక్కింపు మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను కాకినాడ జేఎన్టీయూ కాలేజీలోను, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను గుంటూరు ఏసీ కాలేజీలోను లెక్కిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ► ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలుపొందారు. 1537 ఓట్ల మెజార్టీతో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏసీ కాలేజీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలవగా..అయిదుగురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల కౌంటింగ్‌కు 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు, ప్రాధాన్యత ఓటును బట్టే అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉన్నాయి. 13575 ఓట్లకు గాను 12554 ఓట్లు పోలయ్యాయి. 92.95 శాతం పోలింగ్ జరిగింది. -
టీడీపీ అడ్డదారులు: పైకి కత్తులు.. లోన పొత్తులు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో అనధికారికంగా చెట్టపట్టాలేసుకున్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం సర్దుబాటు ముసుగులో అనైతిక రాజకీయాలకు బరితెగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి ‘స్వతంత్ర’ అనే ముసుగు తగిలించినా ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉన్నందున తమ నాటకాలు చెల్లవని టీడీపీ కొత్త పద్ధతికి తెరతీసింది. అభ్యర్థులను నిలబెట్టలేక జనసేనతో సర్దుబాటు చేసుకుంది. చెరి సగం అంటూ వార్డుల్లో పోటీ చేస్తోంది. ఒకరికి బలమున్నచోట మరొకరు అభ్యర్థిని పెట్టకుండా పరస్పరం సహకరించుకునేలా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు విలువలు విడిచి బరిలో దిగుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మచ్చుకు కొన్ని ►జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన అడ్డదారులు తొక్కుతున్నాయి. ►అమలాపురం మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. అతి కష్టం మీద చెరో 16 వార్డుల్లో అభ్యర్థులను పెట్టుకున్నాయి. అవీ సర్దుబాట్లతోనే. జనసేన పోటీ చేసే వార్డుల్లో టీడీపీ పోటీ చేయకుండా నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు. 3, 4, 7, 8 వార్డుల్లో జనసేన అభ్యర్థుల విజయానికి సహకరిస్తూ టీడీపీ తన అభ్యర్థులను దింపలేదు. 5, 15, 22 వార్డుల్లో టీడీపీ కోసం జనసేన తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టకుండా పరోక్ష సహకారం అందిస్తోంది. ►రామచంద్రపురం మున్సిపాలిటీలో టీడీపీకి కాస్తో కూస్తో పట్టున్నచోట జనసేన.. టీడీపీకి బలమున్న చోట జనసేన అభ్యర్థులను నిలబెట్టలేదు. ఇక్కడ 28 వార్డులకు 18 చోట్ల పోటీ జరుగుతోంది. 10 వార్డుల్లో టీడీపీ పోటీలో ఉండగా జనసేన 13 వార్డుల్లో పోటీ పడుతుంది. టీడీపీ బలంగా ఉండే కొన్ని వార్డుల్లో గతంలోనే జనసేన పోటీ నుంచి తప్పుకొంది. జనసేనకు ఒక మోస్తరు బలగమున్నచోట టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపనే లేదు. 1, 2 వార్డులు టీడీపీకి గతంలో పట్టున్నవి. ఇక్కడ జనసేన పోటీలో లేదు. ఎనిమిదో వార్డులో జనసేన పోటీలో ఉండగా టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే 21, 22 వార్డుల్లో ఈసారి జనసేన పోటీలో ఉంది. వైఎస్సార్ సీపీని ఎదుర్కొనాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ మౌనం దాల్చింది. ►మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోనూ టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకోవాలని జనసేనతో పొత్తు పెట్టుకుంది. సామర్లకోటలో 5, 7, 11, 17, 27, 28, 30, 31 వార్డులను జనసేనకు వదిలేసింది. జనసేన పోటీ చేయకుండా వెనక్కు తగ్గిన 3, 4, 6, 8, 9, 10, 12, 13, 15, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 29 వార్డుల్లో మాత్రమే టీడీపీ పోటీ చేస్తోంది. ►పెద్దాపురం మున్సిపాలిటీలో 29 వార్డులుండగా టీడీపీ 27 వార్డుల్లోనే పోటీ చేస్తోంది. 10, 12 వార్డులను జనసేన అభ్యర్థులకు కేటాయించి టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. పంచాయతీ తీర్పుతో గుండెల్లో రైళ్లు కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్ష టీడీపీ.. జనసేన దారుణ పరాజయాలను మూటగట్టుకున్నాయి. పరస్పరం సహకరించుకున్నా రెండంకెలను చేరుకోలేకపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లోనైనా వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు కనీస పోటీ ఇచ్చేందుకు బహిరంగ మద్దతుతో ఈ రెండు పార్టీలూ బరిలోకి దిగాయి. ఆ పార్టీల అగ్రనేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు ప్రజల ముందు నటిస్తున్నారు. బీజేపీతో తమకు ఒప్పందమని జనసేన నేతలు చెబుతున్నారు. తీరా ఎన్నికలకొచ్చేసరికి మాట మీద నిలబడలేకపోతున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ అనైతిక పొత్తులు చూసి ద్వితీయ శ్రేణి నాయకులు, సాధారణ కార్యకర్తలు పలువురు అయోమయంలో పడుతున్నారు. సీఎం వైఎస జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతునిస్తూ ఏకపక్షంగా ఇస్తున్న తీర్పులతో ఈ రెండు పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక జనసేనతో ఒప్పందానికి రావడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. చదవండి: కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు చంద్రబాబుకు భారీ షాక్.. గో బ్యాక్ అంటూ నిరసన -
అల.. అంతర్వేదిలో.. కొంగొత్త 'రథ'సప్తమి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రథసప్తమి రోజున ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ గావించారు. సీఎం జగన్ ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి రథాన్ని లాగే వరకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబరు 5న స్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. కల్యాణోత్సవం నాటికి కొత్త రథం తయారవుతుందని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు నెలల్లోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త రథాన్ని తయారు చేయించారు. కల్యాణోత్సవాల నేపథ్యంలో నూతన రథాన్ని ప్రారంభించారు. స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ సీఎం వైఎస్ జగన్.. ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న రాజగోపురానికి నమస్కరిస్తూ.. గంటా మంటపం, ముఖ మంటపం మీదుగా అంతరాలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరాలయంలో స్వామికి ప్రీతిపాత్రమైన వింజామర సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. కోవిడ్–19 నేపథ్యంలో మార్చి 20 నుంచి రద్దు చేసిన అంతరాలయ దర్శనాన్ని.. ప్రస్తుతం కల్యాణోత్సవం సందర్భంగా సీఎం ద్వారా తిరిగి పునరుద్ధరించారు. అర్చకులు సీఎం జగన్ గోత్ర నామంతో అర్చన గావించారు. మంత్రపుష్ప సమర్పణ అనంతరం హారతిని సీఎం భక్తి భావంతో కళ్లకు అద్దుకుని నమస్కరించారు. అంతకు ముందు ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి శ్రీనివాస్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకట శాస్త్రి, అర్చకులు శ్రీను తదితరులు ధ్వజ స్తంభం వద్ద ఉన్న సింహద్వారం వద్ద ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు ♦ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం రాజ్యలక్ష్మీ అమ్మవారి ఉపాలయంలోని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ♦ఆశీర్వచన మంటపం వద్ద అర్చకులు, వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. లక్ష్మీనరసింహ స్వామి చిత్ర పటాన్ని అందజేశారు. అర్చకులు అందించిన స్వామి వారి ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలిని ముఖ్యమంత్రి స్వీకరించారు. ♦అనంతరం దేవస్థానంలో సుదర్శన హోమం జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, నూతన రథం తయారీకి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిలకించారు. కొత్త రథం తయారీలో వినియోగించిన బస్తర్ టేకు సేకరణ మొదలు.. చివరలో సంప్రోక్షణ ప్రక్రియ వరకు ఆయా దశలకు సంబంధించిన ఫొటోలను ఆసక్తిగా వీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన రథం తయారీని ప్రశంసించారు. ♦అనంతరం ఆలయానికి తూర్పు వైపున ఉన్న రాజగోపురం వద్ద నుంచి ఉన్న స్వామి వారి 38 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను దేవదాయ శాఖ కమిషనర్ అర్జున్‌రావు ముఖ్యమంత్రికి వివరించారు. హారతి తీసుకుని నమస్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి పసుపు, కుంకుమ పెట్టి.. కొబ్బరి కాయ కొట్టి.. ♦స్వామి సన్నిధి నుంచి పశ్చిమ రాజగోపురం ద్వారా సీఎం.. రథం వద్దకు చేరుకున్నారు. స్వయంగా పసుపు, కుంకుమలతో నూతన రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరి కాయ కొట్టారు. ఇతర భక్తులతో కలిసి రథాన్ని కొద్ది దూరం లాగారు. అనంతరం ఆలయానికి నలువైపులా ఉన్న భక్తులకు నమస్కరిస్తూ ముందుకు కదిలారు. ♦ఈ కార్యక్రమంలో సీఎం వెంట దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోష్, వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నృసింహుని రథానికి పూలదండ వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చదవండి: (మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..) (కోనసీమలో పల్లెపోరు) -
అటు కుక్కర్లు.. ఇటు ప్లాస్టిక్ స్టూళ్లకు డిమాండ్
అమలాపురం టౌన్: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని మార్కెట్లో కుక్కర్లు...ప్లాస్టిక్ స్టూల్స్కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల అభ్యర్థులకు ఈ గుర్తులను కేటాయించడంతో ఆయా అభ్యర్థుల్లో కొందరు ఓటర్లకు తమ గుర్తును తెలియజేస్తూ వారికి నిజమైన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ నజరానాగా ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో కేటాయించిన గుర్తుల నమూనాలు అవసరమైతే పెద్దవిగా తయారు చేయించి ఓటర్లను ఆకర్షించేలా ప్రదర్శిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన ఉంగరం, కత్తెర, మంచం తదితర గుర్తులను పెద్దవిగా నమూనా తయారు చేయించి వాటినే ప్రచారాల్లో విరివిగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు సర్పంచ్ అభ్యర్థులు బుల్లి మంచాల నమూనాలు, లేదా వాస్తవ మంచాలతోనే ప్రచారం చేస్తున్నారు. వార్డుల అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తుల్లో ముఖ్యంగా కుక్కర్, స్టూలు గుర్తులను నమూనాగానే కాకుండా అసలైన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్‌ను కొనుగోలు చేసి మరీ ఓటర్లకు అందిస్తున్నారు. నాలుగో విడతగా అమలాపురం డివిజన్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లోని వార్డుల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో చాలా మంది తమకు గుర్తులు కేటాయించిన తక్షణమే ఇలా కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. పి.గన్నవరం మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో రెండు వార్డుల్లో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ తొలి రోజు కొనుగోలు చేసి కొందరు ఓటర్లకు పంచిపెట్టినా, మర్నాడు మిగిలిన ఓటర్లకు పంచిపెట్టేందుకు మార్కెట్‌కు వెళితే కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ స్టాక్ లేదన్న సమాధానంతో నిరుత్సాహ పడ్డారు. కోనసీమలో అన్ని మండలాల్లో ముఖ్యంగా మేజర్ పంచాయతీల వార్డుల అభ్యర్థుల్లో చాలా మంది కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ ఇచ్చే ఓట్లు అడుగుతున్నారు. ఇలా ఇస్తున్న గ్రామాల్లో ఓటర్లు చమత్కారంగా జోక్‌లు వేసుకుంటున్నారు. ఉంగరం (రింగ్) గుర్తు వచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో బంగారం ఉంగరం ఓటర్లకు ఇస్తే ఎంత బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు
సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమలను అపహరించిన దొంగను విజయవాడ వెస్ట్‌జోన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ మిస్టరీకి తెరపడింది. గతేడాది సెప్టెంబరులో ప్రతిమలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఈ బృందాలు చివరకు ఇది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా (52) పనేనని నిర్ధారణకు వచ్చాక.. అందుకు సంబంధించిన పక్కా సాంకేతిక ఆధారాలను సేకరించాయి. వాటి ఆధారంగా జక్కంశెట్టి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. వాటిని తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. గోప్యంగా విచారణ చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్.. వెస్ట్‌జోన్ ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆలయంలో పనిచేసే సిబ్బందిని విచారించారు. అలాగే, ఆ సమయంలో దేవాలయ అభివృద్ధి పనుల కోసం పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఈ తరహా చోరీలకు పాల్పడే పాత నేరస్తులను పోలీసులు విచారించారు. చోరీ జరిగిన సమయంలో పాత నేరస్తులు ఎక్కడ ఉన్నారు? వారి కదలికలు, ఫోన్ కాల్‌డేటాతోపాటు టవర్ లోకేషన్ తదితర సాంకేతిక ఆధారాలను సేకరించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా చోరీ జరిగిన సమయంలో దుర్గగుడి సమీపంలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ప్రత్యేక బృందాన్ని తూర్పు గోదావరి జిల్లాకు పంపి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించి గోప్యంగా విచారిస్తున్నారు. విచారణలో తానే అపహరించినట్లు సాయిబాబా అంగీకరించాడని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ వెండి ప్రతిమలను తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించాడని, వాటిని సదరు వ్యాపారి కరిగించినట్లు తెలిసిందని, ఆ వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సాయిబాబాపై ఇప్పటివరకు 100కు పైగా కేసులున్నాయని.. వీటిలో అత్యధిక కేసులు ఆలయాలకు సంబంధించినవేనని వివరించారు. దొంగ దొరికింది ఇలా.. ప్రత్యేక బృందంలోని ఓ ఎస్సై.. సాయిబాబా కార్యకలాపాలపై దృష్టిసారించటంతో కేసు చిక్కుముడి వీడింది. 2007, 2008 మధ్యలో జక్కంశెట్టి సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఇప్పటివరకు అతనిపై వంద కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి, నరసాపురం, పాలకోడేరు, నిడదవోలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలు చేశాడు. సాయిబాబా వ్యవహారశైలి తెలిసిన ఈ ఎస్సై అతనిపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉంటున్న సాయిబాబా భార్య ఇంటికి వెళ్లి.. ‘మీకు ఇళ్ల పట్టా వచ్చింది.. మీ భర్త వివరాలు తెలియజేయండి’.. అంటూ ఎస్ఐ నమ్మబలికారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్‌చేయగా సాయిబాబు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలికి నిందితుడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసు కొలిక్కి రావడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చోరీ తీరును తెలుసుకునే క్రమంలో నిందితుడు సాయిబాబాను ఘటనా స్థలానికి తీసుకెళ్లి ‘సీన్ రీ కన్స్ట్రక్షన్’ చేయనున్నారు. కొండపైకి ఎప్పుడు చేరాడు? ఏ సమయంలో చోరీకి పాల్పడ్డాడు? తర్వాత వాటిని తీసుకుని ఏ మార్గంలో బయటపడ్డాడు? ఎక్కడ వాటిని దాచాడు? ఎవరికి విక్రయించాడు? ఇతరులు ఎవరైనా సహకరించారా? అనే అంశాలపై నిందితుడిని విచారణ చేయనున్నామని ఆ అధికారి వివరించారు. -
చంపి.. సంచిలో కట్టి.. చెరువులో పడేసి
సాక్షి, రాజానగరం: బొమ్మూరు పోలీసు స్టేషనులో వ్యక్తి అదృశ్యం కేసుగా నమోదైన యువకుడు మండలంలోని భూపాలపట్నం చెరువులో శవమై తేలాడు. తల, మొండెం వేరుచేయబడి ఉన్న ఈ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం ఉదయం చూసి వీఆర్వో కాళ్ల మోహనరావు ద్వారా రాజానగరం పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తిగత కక్షలో, మరో కారణమో తెలియదుగానీ ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా నరికి, సిమెంటు సంచిలో వేసి మూట కట్టి చెరువులో పడవేశారు. అయితే మూట కట్టు విడిపోయి, సంచెలో నుంచి కాళ్లు బయటకు వచ్చి నీటిపై తేలడంతో స్థానికుల ద్వారా బయటపడింది. ఈ సంఘటన వివరాలను మంగళవారం రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. భూపాలపట్నం శివారులోని చెరువులో తేలిన ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం శాంతిపురానికి చెందిన రొంగలి దుర్గాప్రసాద్(22)గా గుర్తించారు. అవివాహితుడైన ఆ యువకుడు ఈనెల 13న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని అతడి తండ్రి వీరబాబు ఈనెల 15న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విరోధులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వేరొక ప్రాంతంలో హత్య చేసి, ఆపై తలను, మొండేన్ని వేరుచేసి, సంచిలో మూట కట్టి, ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని తెలిపారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు, రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల, మొండెం వేరు చేసి ఉన్న మృతదేహం -
అంతర్వేది: నూతన రథాన్ని పరిశీలించిన మంత్రి
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన రథాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతోనే రథం పూర్తయిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిరంతర పర్యవేక్షణ తోనే రథం రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. రథం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరైతే బాగుంటుందన్నారు. నూతన రథాన్ని పాత షెడ్లో ఉంచాలా లేదా అన్న విషయంపై నిర్ణయిం తీసుకోలేదని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. -
స్టార్స్ అంతా డిసెంబర్లోనే పుడతారు..
స్టార్స్ అంతా డిసెంబర్ నెలలోనే పుడతారని సినీ నటి, ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ చమత్కరించారు. మన డైనమిక్ సీఎం జగన్మోహన్రెడ్డి కూడా డిసెంబర్లోనే పుట్టారని, తానూ ఇదే నెలలో పుట్టానని ఆమె అన్నారు. ‘అందరూ బాగున్నారా.. అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో మాట్లాడి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేదానినని, తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని అన్నారు. రాజమహేంద్రవరం రావడం చాలా అనందంగా ఉందని, ఇక్కడ గోదావరి అందాలు చాలా బాగుంటాయని అన్నారు. సాక్షి, సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): క్రీడల్లో గెలుపోటములు సహజం. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఓటమి గెలుపునకు నాంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కశాళాల క్రీడా ప్రాంగణంలో రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్ సీజన్–4 క్రికెట్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. మంత్రి అనిల్ కుమార్, ఎంపీ మార్గాని భరత్‌రామ్ బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలపై ప్రత్యేక అభిరుచి ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉండడం అదృష్టం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్రీడాకారులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్నారు. క్రీడాకారుల కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. మానసిక ఒత్తిళ్లను అధిగమించి మానసిక ఉల్లాసం పొందేందుకు క్రీడలను, వ్యాయామాలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ పర్యవేక్షణలో అజ్జరపు వాసు, కుంచే శేఖర్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహించడం అభినందనీయం అన్నారు. క్రీడలు మానసిక, శరీరక వికాసానికి పునాదులని భరత్ అన్నారు. ఐక్యతను పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. స్వామి వివేకానంద సూక్తులను అనుసరించి క్రీడాకారులు రాణించి సత్తాను చాటుతూ దేశవ్యాప్తంగా ప్రతిభను చాటుకోవాలన్నారు. ఎక్కవ రకాల క్రీడలను ప్రోత్సహించి ఆయా క్రీడలపై ఆసక్తి గల క్రీడాకారులకు తగిన వేదికల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. 7 రాష్ట్రాల క్రీడాకారులు ఈ సీజన్–4లో 24 బృందాలుగా పొల్గొనడం అభినందనీయం అన్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తానని ఎంపీ భరత్ అన్నారు. ఆర్ట్స్ కళాశాలలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సుమారు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని దీనిలో 50 శాతం సీఎస్ఆర్ కింద ఓఎన్జీసీ సమకూర్చాలని సభకు హాజరైన ఆ సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు ఆదేశ్ కుమార్‌ని ఎంపీ కోరారు. మరో విశిష్ట అతిథి పోలవరం ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ ఈ క్రికెట్ మ్యాచ్‌లు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, చందన నాగేశ్వర్, గుబ్బల రాంబాబు, గుర్రం గౌతమ్ పాల్గొన్నారు. బౌలింగ్ చేస్తున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్ -
‘అబద్ధం చెప్పనిదే ఆయనకు పూట గడవదు’
సాక్షి, కాకినాడ: ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు చెప్పనిదే చంద్రబాబుకు పూట గడవడం లేదని మండిపడ్డారు. పార్లమెంట్లో వ్యవసాయ బిల్లుకు టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు.. వారు పార్లమెంట్లో ఒకలా.. బయట మరోలా మాట్లాడతారని దుయ్యబట్టారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని బాబు యూటర్న్ తీసుకున్నారని, చంద్రబాబు వ్యాఖ్యలు ఢిల్లీ పెద్దలకు అర్థం కావనే భావనలో ఉన్నారని ఆయన విమర్శించారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని మంత్రి ప్రశ్నించారు. (చదవండి: ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత) ‘‘ఎంఎస్పీ కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తర్వాతే మేం మద్దతు తెలిపాం. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎంఎస్పీ కొనసాగిస్తున్నాం.రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పార్లమెంట్లో వివరించాం. రాష్ట్రంలో ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించాం. గ్రామ స్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారిగా గ్రేడెడ్ ఎంఎస్పీని తీసుకొచ్చాం. నిల్వ ఉండని పంటలకు కూడా మద్దతు ధర ప్రకటించాం. చంద్రబాబు హయాంలో ఒక్క పంటకు మద్దతు ధర ప్రకటించలేదు. చంద్రబాబు రైతులకు మేలు చేసే ఆలోచన ఒక్కటైనా చేశారా?’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. (చదవండి: ఆ స్థాయి నిమ్మగడ్డకు లేదు) -
ఘోర ప్రమాదం: తల్లిదండ్రులు, కొడుకు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కోటిపల్లి- యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం కోట గ్రామం వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ, ఆయన భార్య , రిటైర్డ్ లెక్చరర్ విజయలక్ష్మి, కుమారుడు ప్రణీత్‌గా గుర్తించారు. కాకినాడ నుంచి యానాం వస్తుండగా తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి: వివాహితను బలిగొన్న వివాహేతర సంబంధం) -
దారుణాలు సహించం: తానేటి వనిత
సాక్షి, కాకినాడ: నగరంలోని గోళీలపేటలో లైంగిక దాడికి గురైన బాలికను మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి జీజీహెచ్‌లో శనివారం పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాలికకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి తక్షణ సాయం లక్ష రూపాయలు అందచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క బాలిక, మహిళపై అత్యాచారాలు జరగకూడదని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. (చదవండి: తుపాన్ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా) నిఘా కొరవడిన మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తోందన్నారు. దిశ చట్టం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని, త్వరలోనే కొన్ని సవరణలతో చట్టం తీసుకొస్తామన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించామని, కేసులపై సత్వరమే స్పందిస్తున్నామని మంత్రి తానేటి వనిత తెలిపారు. (చదవండి: దారుణం.. పసిమొగ్గపై పైశాచికం) బాధితురాలికి అండగా ఉంటాం: మంత్రి వేణుగోపాల కృష్ణ లైంగిక దాడికి గురై జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి వేణుగోపాలకృష్ణ పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. చిన్నారిపై పాశవిక దాడి.. మనస్సు కలిచివేస్తోందన్నారు. నిందితులను పట్టుకోడానికి పోలీస్ బృందాలు నిర్విరామంగా గాలిస్తున్నాయని తెలిపారు. మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. -
దారుణం: పసిమొగ్గపై పైశాచికం
కాకినాడలో ఘోరం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఓ దుర్మార్గుడి పైశాచికత్వానికి ముక్కుపచ్చలారని పసిమొగ్గ విలవిల్లాడింది. ఆర్తనాదాలు చేసింది. తెల్లవారు జామున ఒంటి నిండా తీవ్రగాయాలతో ఓ వీధిలో చెత్తకుప్పలో కనిపించిన ఆ చిన్నారిని చూసి కుటుంబసభ్యులు లబోదిబోమన్నారు. మరోవైపు లైంగికదాడికి గురై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకురాగా.. వైద్యులు పోలీసు సిఫారసు ఉంటే తప్ప వైద్యం చేయలేమని చెప్పడంతో వారు పరుగుపరుగున పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. సాక్షి, కాకినాడ: కాకినాడ గోళీలపేట దండోరా నగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి అమ్మమ్మ తాతయ్యల మధ్య నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి 1.30 దాటాక చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తెల్లవారు జామున చిన్నారి తాతయ్య నల్లయ్య తన పక్కనే నిద్రించిన మనవరాలి కోసం చూడగా ఆమె కనిపించలేదు. భార్య కొత్తమ్మను నిద్రలేపి ఆరా తీశాడు. ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారి తండ్రి రాజును నిద్రలేపి అడిగాడు. బాలిక ఏమైందో తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు, 50 మందికి పైగా స్థానికులు కలసి ఉదయం వరకు వెతికారు. సుమారు ఉదయం 4.30 సమయంలో బాలిక వివస్త్రగా, ఒంటి నిండా గాయాలు, పంటి గాట్లతో రంపంమిల్లు వీధిలోని చెత్తకుప్పలో అచేతన స్థితిలో లభ్యమైంది. చిన్నారి జాడ కోసం వెతుకుతున్న వారికి అత్యంత దయనీయస్థితిలో బాలిక కనిపించింది. తక్షణమే కుటుంబసభ్యులు పాప శరీరాన్ని శుభ్రపరిచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బాలికను నిందితుడు వదిలి వెళ్లింది ఇక్కడే.. వైద్యం నిరాకరణ.. లైంగికదాడి జరగడంతో పోలీసుల సిఫారసు తప్పనిసరని చెబుతూ కాకినాడ జీజీహెచ్ వైద్యులు ఆ చిన్నారికి వైద్యం అందించేందుకు నిరాకరించడంతో తండ్రి పిల్లి రాజు, అమ్మమ్మ కన్నీటిపర్యంతమవుతూ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ టి.రామ్మోహన్‌రెడ్డి దృష్టికి వైద్యుల నిర్వాకాన్ని వెల్లడించారు. దీంతో సీఐ వారితో కలిసి హుటాహుటిన జీజీహెచ్‌కు వెళ్లి వైద్యుల తీరును నిలదీసి, చిన్నారులకు వైద్య సేవలందించేలా మాట్లాడారు. అత్యంత పాశవికంగా.. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆగంతకుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. ఏడ్చినందుకు చెంపలపై బలంగా కొట్టాడు. చిన్నారి శరీరంలోని పలు భాగాల్లో తీవ్రమైన పంటిగాట్లను వైద్యులు గుర్తించారు. మట్టిలో పడేసి లైంగికదాడికి పాల్పడడంతో చిన్నారి వీపు భాగం పూర్తిగా కొట్టుకుపోయి రక్తసిక్తమైంది. జననాంగాలు, పెదవులపైన పంటిగాయాలున్నాయని వైద్యుల పరిశీలనలో తేలింది. అచేతన స్థితికి జారుకున్న తర్వాతే పాపను వదిలాడని, అప్పటి వరకు అత్యంత కర్కశంగా చిన్నారిపై విరుచుకుపడ్డాడని వైద్యులు తెలిపారు. ముమ్మర తనిఖీలు అత్యాచార ఘటనను జిల్లా పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణించింది. ప్రత్యేక బృందాలను నియమించి అగంతకుడి కోసం గాలింపు చేపట్టింది. పోలీస్ జాగిలాలు చిన్నారి ఇంటి పరిసరాల్లో పలుచోట్ల అనుమానిత స్థితిలో సంచరించాయి. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ బాలిక నిద్రించిన ఇంటిని పరిశీలించారు. గడియపెట్టి నిద్రపోయారా? తెరిచి ఉంచారా? అన్న అంశాలపై ఆరా తీశారు. ఉక్కపోత కారణంగా తలుపులు తెరిచి ఉంచినట్టు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అనుమానిత వ్యక్తి, వ్యక్తుల సంచారంపై డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలోని సీఐలు గోవిందరావు, ఈశ్వరుడు చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. క్లూస్ బృందం బాలిక అదృశ్యమైన చోటు, లభ్యమైన చోట్లలో ఆధారాలను సేకరించారు. పలువురి పరామర్శ చిన్నారిని కాకినాడ జీజీహెచ్‌లో ఎస్పీ అస్మీ, జేసీ పరామర్శించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. చిన్నారి తల్లి మరియ పని కోసం హైదరాబాద్‌లో ఉంటోందని, తండ్రి, తాతయ్య, అమ్మమ్మల సంరక్షణలో బాలిక ఉంటోందన్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిగా దిశ డీఎస్పీ మురళీమోహన్ను నియమించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్æ సీఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కీలక మలుపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలిక కీలక ఆధారాన్ని వెల్లడించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి వివరాలను తెలిపింది. తండ్రి వరసయ్యే ఓ వ్యక్తి తనపై దారుణానికి ఒడిగట్టాడని, చిత్రహింసలు పెట్టి, కొడుతూ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక వెల్లడించిన వీడియో సాక్షి చేతికి అందింది. నిందితుడి కుమారుడు బాలికతో సఖ్యంగా ఉండడంతో ఆ బాలుడి తండ్రేనని పదేపదే చెప్పింది. సదరు వ్యక్తి బాలికకు తండ్రి వరుస అవుతాడని కుటుంబసభ్యులు నిర్ధారించుకొని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ దిశలోనే పోలీసులూ విచారణ జరుపుతున్నారు. అయితే బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించడం లేదు. -
జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు
సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అవార్డులు దక్కించుకుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డులను ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు వరించాయి. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్) ఓడిఎఫ్, జీరో వేస్ట్ మేనేజ్మెంట్, నూతన టెక్నాలజీలకు అవార్డులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు అవార్డులను కేంద్ర మంత్రి షెకావత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో నిర్వహణ సులభతరమైందని పేర్కొన్నారు. (చదవండి: ‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’) విశాఖ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ.. విశాఖ: అంతర్జాతీయ పోటీల్లో విశాఖ నగరం మూడో స్థానంలో నిలవడం శుభపరిణామం అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు.. ప్రజలు సహకరించటంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అన్ని పార్టీల ప్రజలు ఉన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకున్నా.. సీఎం వైఎస్ జగన్ మాత్రం పేదల విషయంలో రాజీ పడలేదన్నారు. ఇళ్ల పట్టాలు తీసుకోబోతున్న వ్యక్తుల్లో టీడీపీ సానుభూతి పరులు కూడా ఉన్నారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
కాకినాడ వైఎస్సార్సీపీలో విషాదం
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్సీపీలో విషాదం చోటు చేసుకుంది. సిటీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆయన గత కొంతకాలంగా విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్.. కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్ చేసి ఆరా తీశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఫ్రూటీ కుమార్ పార్టీకి ఎనలేని కృషి చేశారు. ఆయన మరణం పట్ల పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ధర్మాన్న కృష్ణదాస్ సంతాపం.. శ్రీకాకుళం: కాకినాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటి కుమార్ మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో అకాల మరణం బాధిస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘ఆ డబ్బుతో అపార్ట్మెంట్లు.. భారీ గెస్ట్ హౌస్’
సాక్షి, తూర్పుగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబే పోలవరం కాంట్రాక్టరుగా ఉన్నారని గతంలో ఒక కేంద్ర మంత్రే వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. 48 వేల కోట్ల మేర అంచనాలు ఇష్టారీతిన పెంచేశారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని, లెఫ్ట్ కెనాల్ , రైట్ కెనాల్ లో భారీ అవినీతి చోటు చేసుకుందని ధ్వజమెత్తారు. ‘‘రూ.5 కోట్ల వ్యయాన్ని గత ప్రభుత్వం రూ.25 కోట్లకు పెంచేసింది. యనమల వియ్యంకుడికి ఈ పనులు అప్పజెప్పారు. అంచనాలు 50 కోట్ల పెరిగిపోయాయి. ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం ప్రైవేటు భూములుగా చూపించింది. గత ప్రభుత్వం పోలవరం కాంటూరు లెవెల్స్ పెంచేసింది. దీంతో దేవీపట్నం మునిగిపోయింది. పోలవరం డబ్బుతో ఒక టీడీపీ ఎమ్మెల్యే మూడు అపార్ట్మెంట్లు కట్టారు. పోలవరం డబ్బు 10 కోట్లతో విజయవాడలో భారీ గెస్ట్ హౌస్ కట్టారని సోము వీర్రాజు ఆరోపించారు. (చదవండి: టీడీపీ నేతలు మా వైపు చూస్తున్నారు) -
తంటికొండ ఘటన: ఆగని మృత్యుఘోష
గోకవరం(తూర్పుగోదావరి): ఆ రక్తపు మరకలు ఇంకా మాయలేదు.. ఆక్రందనలు ఆగలేదు.. మృత్యుఘోష వీడలేదు.. తంటికొండ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోరుకొండ మండలం గాదరాడకు చెందిన చాగంటి సుజాత (38) ఆదివారం మృతి చెందినట్టు గోకవరం ఎస్సై పి.చెన్నారావు చెప్పారు. ప్రమాద స్థలంలోనే ఐదుగురు మృత్యువాత పడగా, ఆస్పత్రిలో సుజాత కుమార్తె హేమనీ శ్రీలలిత (13), పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపురం గ్రామానికి చెందిన సోమరౌతు గోపాలకృష్ణ (72) దుర్మరణం పాలయ్యారు. మృతురాలు సుజాత పెళ్లి కుమారుడికి సోదరి. ఈమెకు గాదరాడకు చెందిన పెద్దరాజుతో 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడితో పాటు కుమార్తె హేమనీ శ్రీలలిత ఉన్నారు. సోదరుడి వివాహం నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలసి ఠాకూరుపాలెం వెళ్లింది. తమ్ముడి వివాహాన్ని దగ్గరుండి జరిపించిన ఆమె అనంతరం జరిగిన దుర్ఘటనలో కుమార్తెతో పాటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే కుమార్తె మృతి చెందగా తీవ్రంగా గాయపడిన సుజాత చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది. తల్లీ కుమార్తెల మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలి సోదరి గోకవరానికి చెందిన కంబాల భాను (33) ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే మృతి చెందింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో గాయపడిన గోకవరానికి చెందిన కంబాల వెంకటరమణ, కంబాల మోహన సీతామలక్షి్మ, ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి చంద్ర, కాపవరానికి చెందిన జాజుల లక్ష్మన్న, జాజుల లక్షి్మ, గాదరాడకు చెందిన చాగంటి నూకరత్నం, పశి్చమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తాళ్లపురం గ్రామానికి చెందిన సోమరౌతు వెంకటలక్షి్మ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం తాడితోట (రాజమహేంద్రవరం): తంటికొండ దేవస్థానంలో ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని దర్యాప్తు అధికారి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా సెంట్రల్ డీఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. వ్యాన్‌పై వెళ్లిన పెళ్లి బృందం కొండ పైనుంచి కిందకు దిగుతుండగా వాహనం అదుపు తప్పి పడిపోయిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందారన్నారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ మద్యం తాగాడా లేదా అనేది పోస్టుమార్టం రిపోర్టును బట్టి తేలుతుందని ఆయన చెప్పారు. -
లక్షలు దిగమింగి.. అడ్డగోలు పోస్టింగ్‌లు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గత పాలకుల హయాంలో రూ.లక్షలకు లక్షలు దిగమింగి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా గ్రామ పంచాయతీల్లో పలువురికి పోస్టింగ్‌లు కట్టబెట్టేశారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ముడుపులు మెక్కి పోస్టింగ్‌లు ఇచ్చారు. తొలుత పార్ట్‌టైమ్ ఉద్యోగానికి తీసుకున్నారు. వారంతా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ హోదాల్లో ప్రభుత్వం నుంచి రూ.వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు. ఈ రకంగా జిల్లాలో అడ్డగోలుగా ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య పలు పంచాయతీల్లో లెక్కలు తీయగా 40 మంది ఉన్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవల విజిలెన్స్ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి కోరారు. ఎంతమంది ఉన్నారు, వారికి గ్రామ పంచాయతీల నుంచి ఎంతెంత జీతాలు చెల్లిస్తున్నారు. వారి సరి్టఫికెట్లు వంటి వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలు తుంగలోకి తొక్కి గ్రామ పంచాయతీల్లో ఉద్యోగాలు పొందిన వారి జాతకాలు బయట పెట్టేందుకు విజిలెన్స్ విభాగం కసరత్తు మొదలు పెట్టింది. విచారణ సాగకుండా ఎత్తుగడలు నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేలు జీతాలుగా తీసుకుంటున్న పరిస్థితుల్లో విచారణ జరిపితే ఎదురయ్యే పరిస్థితులను అక్రమార్కులు ముందుగానే గుర్తించారు. విచారణ ముందుకు సాగకుండా అడ్డుపుల్లలు వేసేలా అడుగులు వేస్తున్నారు. అడ్డగోలుగా ఉద్యోగాలు పొందిన వారంతా ఏదో విధంగా రెగ్యులరైజ్ చేయించుకోవాలని విజిలెన్స్ విచారణతో సంబంధం లేకుండా పావులు కదుపుతున్నారు. ఇన్నేళ్లు నుంచి పార్టుటైమ్ ఉద్యోగులుగా పంచాయతీల్లో పని చేస్తున్నాం.. తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి 101 ఖాతా ద్వారా జీతాలు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారులపై ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. సంతకాలు ఫోర్జరీ చేసి పోస్టింగ్‌లు ఏడెనిమిదేళ్ల క్రితం అక్రమ పోస్టింగ్ ఆర్డర్లు ఎలా వచ్చాయి? ఎవరెవరి పాత్ర ఉంది, పలు గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులుగా చెలామణి అవుతున్న వారు ఎందరున్నారు వంటి వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. 2009కి ముందు జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన పి.సుబ్రహ్మణ్యం, ఇన్చార్జి డీపీవోగా పనిచేసిన ఇస్మాయిల్ సంతకాలు ఫోర్జరీ చేసి ఈ ఉద్యోగాలు కొట్టేశారని సమాచారం. అనంతరం ఆ పోస్టులపై జిల్లా అధికారులు ఆరా తీసి చర్యలకు ఉపక్రమిస్తే కొందరు నాయకులు అడ్డుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు ఆ వివరాలు కూడా రాబట్టే పనిలో ఉన్నారు. అటువంటి వారంతా ప్రస్తుతం ఉద్యోగాలు క్రమబదీ్ధకరించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పైరవీలు సాగించడం కొసమెరుపు. ఈ పోస్టింగ్‌లపై అప్పటి ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కూడా జరిగిందిÐ. నాటి విచారణలో ఆ 40 పోస్టులు అక్రమమార్గంలో ఆర్డర్లు పొందినవేనని నిగ్గు తేల్చారు. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతుండగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఈ ఫైల్ అటకెక్కింది. ప్రస్తుతం ఈ అక్రమ పోస్టింగ్‌లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి గతంలో జరిగిన విషయాలు నా దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతా«ధికారుల దృష్టికి తీసుకువెళతాం. బాధ్యులపై చర్యలకు వెనుకాడేది లేదు. –ఆర్.విక్టర్, ఇన్చార్జి డీపీఓ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అక్రమంగా పోస్టింగ్‌లు పొందిన విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పలు గ్రామ పంచాయతీల్లో అక్రమమార్గంలో పోస్టింగ్‌లు పొందిన విషయం నా దృష్టికి రాలేదు. ప్రభుత్వం నుంచి న్యాయపరంగా కూడా ముందుకు వెళతాం. – నాగేశ్వరనాయక్, డీపీఓ (సెలవుపై ఉన్నారు) -
గౌతమీ తీరాన మహాత్ముని అడుగుజాడలు
రాజమహేంద్రవరం కల్చరల్: స్వాతంత్య్ర ఉద్యమకాలంలో జాతిపిత, మహాత్మా గాంధీ పాదస్పర్శతో అఖండ గౌతమీ తీరం పునీతమైంది. 1921–46 మధ్య కాలంలో మహాత్ముడు రాజమహేంద్రవరానికి ఐదు సార్లు వచ్చారు. 1921 మార్చి 30న, అదే సంవత్సరం ఏప్రిల్ 4న, 1929 మే 6న, 1933 డిసెంబర్ 25న, 1946 జనవరి 20వ తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. నేటికీ బా–బాపు కుటీరం పేరున ఉన్న కుటీరంలో గాం«దీజీ ఉపయోగించిన రాటా్నన్ని పదిలపరిచారు. 1929 మే 6వ తేదీ కందుకూరి వీరేశలింగ పురమందిరంలో స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 1929 పర్యటనల్లో పాల్ చౌక్ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. (నేటి కోటిపల్లి బస్టాండు సమీపంలో). నాటి జ్ఞాపకాలు మహాత్ముని వంటి ఒక వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే, ముందు తరాలవారు నమ్మకపోవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నారు. మహాత్ముని చూసిన ఒకరిద్దరు వ్యక్తులు ఇంకా మన నడుమ ఉండటం మన అదృష్టం.. నాటి జ్ఞాపకాలను, వారి మాటల్లోనే తలుచుకుందాం.. ఆ ముఖ వర్చస్సు ఆ తరువాత చూడలేదు: వైఎస్ నరసింహారావు ‘అది 1946వ సంవత్సరం. జనవరి 20వ తేదీ సాయంత్రం 4 గంటల సమయం. రాజమహేంద్రవరం రైల్వేస్టేషను గూడ్సుయార్డ్ ప్రాంతం. అక్కడ మహాత్మాగాంధీ దర్శనం పొందాను. అప్పుడు నా వయసు పది సంవత్సరాలు. గాంధీజీ కలకత్తా నుంచి మద్రాసు వెళుతూ, సుమారు 40 నిమిషాలు స్టేషను గూడ్సు యార్డు వద్ద ఉన్న మైదానంలో ప్రసంగించారు. నాకు సరిగా కనపడటం లేదంటే, బలిష్ఠుడైన మా తాతగారు నన్ను ఎత్తుకున్నారు. మహాత్ముని వంటి ముఖ వర్చస్సుతో ఉన్న వ్యక్తిని ఆ తరువాత నేను ఎప్పుడూ చూడలేదు. మహాత్ముని హిందీ ప్రసంగాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. అదే ఈ ప్రాంతంలో మహాత్ముని చివరి పర్యటన.. మరో విషాదకర సంఘటన.. అది 1948 ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం. మెయిన్ రోడ్డుమీద పెద్ద కోలాహలం.. కంభంవారి సత్రం చివరన ఉన్న మెయిన్ రోడ్డు మీదకు నేను పరిగెత్తాను. పూలరథంపైన వృద్ధుడైన ఒక గాంధేయవాది నిలబడి ఉన్నారు. తలపై అస్థికల పేటిని పెట్టుకున్నారు. రాజమహేంద్రవరం రైలు స్టేషను నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ఊరేగింపు సాగింది. ఊరేగింపు అగ్రభాగాన బ్యాండు, సన్నా యి మేళాలు, తరువాత గాం«దీజీకి ఇష్టమైన భజనగీతాలను ఆలపిస్తూ కొన్ని వందల మందితో ఊరేగింపు సాగింది. ఆ క్షణాన నాలో తెలియని ఆవేశం వచ్చింది. ఆ మహనీయుని పట్ల భక్త్యావేశంలో మునిగాను. అప్రయత్నంగా ఆ ఊరేగింపులోకి చొరబడ్డాను. గాంధీటోపీలు ధరించినవారెందరో ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. కోటిలింగాల ఘాట్‌లో అస్థికలు కలిపారు. అందరూ స్నానాలు చేశారు. నేను అప్రయత్నంగా స్నానం చేసి, తడిబట్టలతో ఇంటికి తిరిగి వచ్చాను. మన పవిత్ర కర్తవ్యం మహాత్ముడు రాజమండ్రి వచ్చిన తేదీలతో ఒక శిలాఫలకాన్ని రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషను ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. విజయవాడ రైల్వేస్టేషను ప్రవేశ హాలు వద్ద మహాత్ముడు విజయవాడకు వచ్చిన తేదీలను వివరిస్తూ, ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. మనకు కావలసింది కాసింత శ్రద్ధ. ముందు తరాలవారికి చరిత్ర తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. -
'అద్దె'రిపోయే స్కెచ్...
డబ్బు సులువుగా సంపాదించడంలో అతడు ఘనాపాటి. రూపాయి పెట్టుబడి లేకుండా ఎదురువారి బలహీనతను పెట్టుబడిగా చేసుకుని ఎంజాయ్ చేసే జల్సా రాయుడు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ పేరిట చక్రం తిప్పిన అతడు ఏడాదిగా లక్షలు విలువైన కార్ల యజమానులను బురిడీ కొట్టిస్తూ వస్తున్నాడు. విలువైన కార్లను బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నెలకు అద్దె ఎర చూపి ఆ తరువాత అద్దె ఇవ్వకుండా మనిషి కనిపించకుండా ముఖం చాటేసే ఆ ప్రబుద్ధుడు ఎట్టకేలకు ఓ బాధితురాలి ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు. సాక్షి, కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట కూరగాయల మార్కెట్ ఎదురుగా నివాసం ఉండే మండవల్లి వెంకట సత్య కృష్ణ మోహన్‌ను సర్పవరం పోలీసులు ఆదివారం ఛీటింగ్ కేసులో అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో సీఐ గోవిందరాజు మీడియా సమావేశంలో నిందితుడు చేసిన మోసాన్ని వివరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన కార్ల యజమానులకు అద్దె ఎర చూపి వారి కార్లను తీసుకుని ఇతరులకు అద్దెకు లేదా సొమ్ములు తీసుకుని తనఖా పెడుతూ నాగ వెంకట సత్య కృష్ణమోహన్ ఏడాదిగా వ్యాపారం సాగిస్తున్నాడు. ఆ విధంగా సుమారు 30 కార్ల వరకు అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుని వివరాలు వెల్లడిస్తున్న సర్పవరం సీఐ గోవిందరాజు మొదట్లో అద్దె చెల్లించి తరువాత కనిపించకుండా ముఖం చాటేయడంతో కృష్ణమోహన్‌పై అనుమానం వచ్చిన సామర్లకోట మండలం పనసపాడుకు చెందిన ఓ కారు యజమాని తోట పద్మజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో చాలా కార్ల యజమానులు తమ కార్లకు అద్దె చెల్లించడం లేదని, కార్లు చేతులు మారాయని పోలీసులకు తెలిపారు. కృష్ణమోహన్ అద్దెకు తీసుకున్న కార్లలో సుమారు రూ.1.50 కోట్ల విలువైన 14 కార్లను ఎస్సై కృష్ణబాబు, సిబ్బంది శనివారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. (కడపలో అంతరాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం) బాధితులకు సుమారు రూ.20 లక్షల వరకు అద్దె బకాయి పడినట్టు గుర్తించారు. కార్ల వివరాలు కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ, ఇన్చార్జి డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆదేశాలతో బాధితులు నష్టపోకుండా కేసు త్వరగా ఛేదించామని సీఐ తెలిపారు. ఇందుకు ఏఎస్సై నాగేశ్వరరావు, హెచ్‌సీ రామకృష్ణ, పీసీలు సతీష్, దుర్గాప్రసాద్, రూప్‌కుమార్‌లు సహకరించారన్నారు. -
అక్రమాలు చేసి.. ముఖం చాటేశారు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గండేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అవినీతి, అక్రమాలపై విచారణకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార అధికారులు కదిలారు. అక్రమాలకు సంబంధించిన రికార్డులు తారుమారు కాకుండా చూసేందుకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం వారు ప్రయత్నించారు. సొసైటీ సిబ్బంది సహకరించకపోవడంతో చివరకు సొసైటీ భవనాన్ని, అందులో కీలకమైన రికార్డులు ఉన్న బీరువాలను సీజ్ చేశారు. బినామీ పేర్లు, నకిలీ డాక్యుమెంట్లతో గండేపల్లి సొసైటీలో కొంతమంది ప్రబుద్ధులు రూ.23 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంపై.. డీసీసీబీలోని ఇద్దరు డిప్యూటీ జనరల్ మేనేజర్లతో చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీని నుంచి ఏదో ఒకలా బయట పడదామనుకుంటున్న సూత్రధారులు విచారణ ముందుకు సాగకుండా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రికార్డులను మాయం చేసే ప్రయత్నాలకు బుధవారమే తెర తీశారు. తొలిగా సొసైటీలో సిబ్బందిని అందుబాటులో లేకుండా చేశారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ సొసైటీలో 156 మంది బినామీ పేర్లు, నకిలీ బాండ్లతో విడుదల చేసిన రుణాల రికార్డుల కోసం విచారణాధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. విచారణ కోసం సొసైటీ కార్యాలయానికి వెళ్లేసరికి సిబ్బంది ముఖం చాటేయడంతో వారు అవాక్కయ్యారు. శుక్రవారం సొసైటీ వద్దకు వెళ్లగా రికార్డులు, కార్యాలయంలోని బీరువాల తాళాలు కూడా అందుబాటులో లేవనే సమాధానం వారికి ఎదురైంది. తద్వారా విచారణను అడ్డుకునేందుకు అక్రమార్కులు ఎత్తు వేశారు. సొసైటీలోని బీరువాల్లో ఉన్న రికార్డులను మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోందని స్థానికులు డీసీసీబీ అధికారులకు ఉప్పందించారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన డీసీసీబీ అధికారులు అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. విచారణ ముందుకు సాగాలంటే రికార్డులు తారుమారు కాకుండా చూడాలని, ప్రధాన ఆధారాలుగా భావిస్తున్న 156 మంది రైతుల పేర్లతో నమోదై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసే వరకూ సొసైటీలోని రికార్డులను భద్రంగా ఉంచాల ని జిల్లా సహకార అధికారి పాండురంగారావును డీసీసీబీ చైర్మన్ అనంతబా బు కోరారు. జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు పెద్దాపురం, ప్రత్తిపా డు సబ్ డివిజన్ల సహకార అధికారులు బీఎన్ శివకుమార్, శివకామేశ్వరరావు లు గండేపల్లి సొసైటీకి వెళ్లారు. సిబ్బందిని రికార్డుల గురించి అడగగా వారు ఇవ్వలేదు. అటెండర్‌కు కరోనా వచ్చినందు వల్ల తాళాలు లేవని చెప్పారు. వారి మాటలను విశ్వసించని అధికారు లు రికార్డులు ఉన్న మూడు బీరువాల తో పాటు, గండేపల్లి సొసైటీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. డీసీసీబీ జారీ చేసిన నోటీసులను సొసైటీ ప్రధాన ద్వారం తలుపులపై అతికించారు. ఈ అక్రమాలపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని డివిజనల్ సహకార ఆఫీసర్ రాధాకృష్ణ తెలిపారు. అక్రమార్కుల నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టే వరకూ విశ్రమించేది లేదన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై సహకార చట్టం ప్ర కారం చర్యలు తప్పవన్నారు. విచారణ ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసుల సాయం కూడా తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లపై మాటే
ఓ సారి అధికారం ఇస్తే పది కాలాలపాటు ప్రజల సేవలో తరించాలనుకోవాలి...ప్రజల మన్ననలు పొందుతూ వారి మదిలో పదిలంగా స్థానం సంపాదించాలని ప్రజాప్రతినిధి తపన పడాలి. కానీ టీడీపీ హయాంలో ప్రజాప్రతినిధులంటే నిధుల స్వాహాకే వచ్చినట్టుగా...అందుకే పదవిని చేపట్టినట్టుగా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఐదేళ్లే కాకుండా రానున్న ఐదేళ్లలో కూడా దోపిడీకి స్కెచ్ వేసుకొని మరీ స్వాహాకు ఉపక్రమించడం మరీ విడ్డూరం. అదృష్టవశాత్తూ వారు అధికారానికి దూరమయ్యారు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే నిలువు దోపిడీ జరిగేది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పచ్చ నేతల ముందు చూపుతో సహకార సంఘాల్లో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. జిల్లాలోని ఏ సహకార సంఘాన్ని కదిలించినా గత టీడీపీ ఏలుబడిలో ఎటు చూసినా అవినీతి కుంభకోణాలు బట్టబయలవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అండాదండా చూసుకుని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమనే ధీమాతో టీడీపీ నేతలు సహకార సంఘాల్లో దొంగలు పడ్డట్టుగా చొరబడి దొరికినంత దోచుకున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు, పంట రుణాలు మాఫీ చేస్తారని ఆ పార్టీ ఏలుబడిలోని సహకార సంఘాల పాలక వర్గాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు గట్టి నమ్మకంతో ఉన్నారు. అతి విశ్వాసంతోనే బినామీ పేర్లతో కోట్లు రుణాలు లాగేశారు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని రుచి చూపించారు. ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు రుణ మాఫీ అమలవుతుందనే గుడ్డి నమ్మకంతో జిల్లాలోని పలు సహకార సంఘాల ప్రతినిధులు నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో రూ.కోట్లకు పడగలెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక ఈ కుంభకోణాలను ఒకటొకటిగా ఛేదిస్తున్నారు. గతం దొంగల దోబూచులాట కొన్ని సంఘాలు, బ్రాంచీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలు బయటకు రాకుండా సంఘాల్లో పనిచేస్తున్న అధికారులు దాచిపెడుతున్నారు. గత పాలకవర్గాల్లో సంఘాలపై పడి నిలువునా దోచుకున్న వారే కావడం గమనార్హం. గత టీడీపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, సీఈఓల హయాంలో డీసీసీబీ, సహకార సంఘాలు కుంభకోణాలమయంగా మారిపోయాయి. ఈ కుంభకోణాల గుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో రట్టు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఇలా ఏజెన్సీలోని మొల్లేరు, మెట్ట ప్రాంతంలో లంపకలోవ, కోనసీమలో వద్దిపర్రు...తదితర సొసైటీలపై పడి రూ.కోట్లు కొట్టేసిన వైనాన్ని సాక్షి’ వెలుగులోకి తేవడం, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటున్నారు. గండేపల్లిలో తాజాగా... ఈ వరుసలోనే తాజాగా మెట్ట ప్రాంతంలోని గండేపల్లి సహకార సంఘం, గండేపల్లి డీసీసీ బ్రాంచీలో రూ.కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 2017 నవంబరు నెల నుంచి గండేపల్లి బ్రాంచి పరిధిలోని గండేపల్లి పీఏసీఎస్‌లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్లు, బినామీ రైతుల పేరుతో స్వాహా బాగోతమిదీ. గండేపల్లి డీసీసీబీ బ్రాంచి సూపర్వైజర్గా నేదూరి వాసుదేవరెడ్డి గతేడాది అక్టోబరు 28న జాయినయ్యారు. 2020 జనవరి 30న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చైర్మన్ ఆదేశాల మేరకు గండేపల్లి సొసైటీ రికార్డులను బ్యాంకులో పరిశీలించేందుకు సూపర్వైజర్ ప్రయత్నించారు. అందుకు సొసైటీ, బ్రాంచిల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ క్రమంలో 2017 నవంబరు 28 నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి రికార్డులు బ్యాంక్‌కు ఇవ్వలేదనే విషయం గుర్తించారు. గండేపల్లి బ్రాంచిలో సైతం రికార్డులను దాచిపెట్టారు. లోతుగా పరిశీలించే క్రమంలో బ్యాంకులో ఉన్న షాడో రిజిస్టర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా కొంత సమాచారాన్ని సూపర్వైజర్ సేకరించడంతో విషయం డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. సూపర్వైజర్ సంతకం లేకుండానే.. సూపర్వైజర్ సంతకం లేకుండా పది మంది సభ్యుల రుణాలు రెన్యువల్ చేసిన వైనం ఆ సందర్భంలోనే బయటపడింది. తన ప్రమేయం లేకుండా రుణాలు రెన్యువల్ చేయడంతో ఇందులో పెద్ద కుంభకోణమే దాగి ఉందనే అనుమానం, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం వెరసి సూపర్వైజర్ డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే రికార్డులు పరిశీలించే సరికి తీగ లాగితే డొంక కదిలినట్టు గండేపల్లి సొసైటీలో కోటి రూపాయల బినామీ రుణాల బాగోతం బయటకు వచ్చిందంటున్నారు. 10 మంది సభ్యుల రుణాలకు సంబంధించి అడ్వాన్సు స్టేట్మెంట్, రికవరీ స్టేట్మెంట్పై సొసైటీ సూపర్వైజర్ సంతకాలు లేకపోవడం గమనార్హం. మేనేజర్ ఒక్క కలం పోటుతో రూ.99,93,000 లక్షలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలను 2020, ఫిబ్రవరి 17న రెన్యువల్ చేయడం విశేషం. మొదట గుర్తించిన పది మంది సభ్యుల బినామీ రుణాలు రెన్యువల్ చేయడంతో మరిన్ని రుణాలు ఇదే రీతిన రెన్యువల్ చేశారని తెలియవచ్చింది. అలా గండేపల్లి సొసైటీలో మొత్తం 156 మంది సభ్యుల పేరుతో బినామీ పాస్‌పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్ పేపర్లతో సుమారు రూ.23 కోట్లు రుణాలు అప్పటి పాలకవర్గం హయాంలో విడుదలయ్యాయి. ఈ 156లో మొత్తం 50 మంది సభ్యుల(బినామీలు) రుణాలను రెన్యువల్ చేయగా, మిగిలిన 106 మంది రెన్యువల్ చేసే క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో బ్రేక్ పడిందంటున్నారు. ఈ నకిలీ పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మెషీన్‌ను గండేపల్లిలో ఏర్పాటు చేశారని, చివరకు బాండు పేపర్లను సబ్ రిజిస్ట్రార్ సీల్‌ను కూడా టేంపరింగ్ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ బినామీ రుణాలకు సంబంధించిన మొత్తం జాబితా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు కూడా చేరినట్టు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా డీసీసీబీ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే కుంభకోణం వెలుగులోకి రానుంది. ఇంకా మా దృష్టికి రాలేదు గండేపల్లి బ్రాంచ్ పరిధిలో రుణాల అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. జిల్లాలో ఏ సొసైటీ, బ్రాంచ్‌లో అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చినా వెంటనే చైర్మన్ అనంతబాబు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ కూడా చేస్తున్నాం. గండేపల్లి సొసైటీ విషయం చైర్మన్‌తో మాట్లాడతాను. – ప్రవీణ్‌కుమార్, డిసీసీబీ ఇన్చార్జ్ సీఈవో -
శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది నూతన రథం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్ టేకు కలప దుంగలను అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే ప్రక్రియ ప్రారంభమైందని, రథం నిర్మాణానికి 1330 ఘనపుటడుగుల కలప వినియోగిస్తున్నామని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. (చదవండి: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు) పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇటీవల వివరించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం) -
అలల కల్లోలం: ఉప్పొంగుతున్న కడలి
సఖినేటిపల్లి: ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఘడియలకు అంతర్వేది వద్ద తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలలు తీర ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలలుగా పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో పోటెత్తుతున్న ఉప్పునీరు, ప్రస్తుత అల్పపీడన ప్రభావానికి అమావాస్య తోడవడంతో సముద్రుడు మరింత ఉగ్రుడవుతున్నాడు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. శుక్రవారం సముద్ర కెరటాలు తీరాన్ని దాటుకుని సుమారు 500 మీటర్ల మేర అంతర్వేదికర కొత్త వంతెనకు సమీపంలో రోడ్డును దాటి సరుగుడు తోటల్లోకి చేరాయి. సాగరసంగమానికి సమీపాన ఉన్న పల్లిపాలెంలో ఇళ్ల వద్దకు కూడా ఉప్పునీరు పోటెత్తింది. అంతర్వేదికర గ్రామంలో ఉప్పునీరు పోటెత్తిన ప్రాంతాలను, పల్లిపాలెంలో ముంపునకు గురైన నివాస గృహాలను తహసీల్దార్ రామ కుమారి పరిశీలించారు. ముంపు నీటి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఆమె వెంట ఆర్ఐ బి.మనోజ్, వీఆర్వో బొల్లాప్రగడ సీతారామం, గ్రామస్తులు ఉన్నారు. పర్ర ప్రాంతానికి పోటెత్తిన ఉప్పునీరు ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానాం సముద్ర తీరంలో శుక్రవారం ఉదయం సముద్రపు అలలు బీచ్ రోడ్డు పల్లపు ప్రాంతంలోకి భారీగా చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బీచ్‌రోడ్డు వద్ద కట్టు కాలువ వంతెన సమీపంలో ఎస్.యానాంలోని రవ్వ చమురు సంస్థ ఆన్‌షోర్, ఆఫ్షోర్లకు పైపులైన్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పల్లంగా ఉండటం వల్ల అక్కడే సముద్రపు అలలు ఎగసి పడి నీరు కట్టు కాలువను దాటుకుని పర్ర ప్రాంతానికి ఎగబాకాయి. దీంతో పైప్‌లైన్ ఉన్న ప్రాంతంలో గాడిలా ఏర్పడి కాలువలా తయారయ్యింది. ఒక దశలో పైపులైన్ లీకయ్యిందంటూ వదంతులు వ్యాపించడంతో రవ్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రపు అలలు వస్తున్న ప్రాంతాన్ని రవ్వ యాజమాన్య సిబ్బంది పరిశీలించి, సముద్రపు పోటు అధికంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్యాహ్న సమయం వరకూ సముద్రపు నీరు భారీగా పర్రలోకి చేరడంతో డ్రెయిన్ల ద్వారా ఉప్పనీరు పంట పొలాలకు చేరుతోందని స్థానికులు, రైతులు ఆందోళన చెందారు. తహసీల్దారు కె.పద్మావతి, ఆర్ఐ ఎన్.ప్రసూన, వీఆర్ఓ రాములు బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అమావాస్య, అల్పపీడన ప్రభావంతో ఆటు పోట్లకు సముద్రం అల్లకల్లోలంగా మారిందని తేల్చారు. అంతర్వేదికరలో కొత్తవంతెన వద్ద రోడ్డును దాటుకుని సరుగుడు తోటల్లోకి చొచ్చుకు వస్తున్న ఉప్పునీరు నేలకొరిగిన భారీ వృక్షాలు.. కోతకు గురైన తీరం.. అల్లవరం: ఓడలరేవు తీరం వద్ద రక్షణగా ఉన్న కరకట్టలను, సరుగుడు తోటలను దాటుకుంటూ సముద్ర అలలు పల్లపు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వృక్షాలు సైతం కెరటాల తాకిడికి నేలకొరిగాయి. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన అలల తాకిడి శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. దీని ప్రభావంతో తీరం కోతకు గురైంది. తీరానికి ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులు సముద్రపు నీటితో నిండిపోయాయి. ఓడలరేవు ఆ‹ఫ్‌షోర్ టెరి్మనల్ ప్రహరీ, ఓడలరేవు తీరానికి పర్యాటకంగా పేరు తెచ్చిపెట్టిన సముద్ర రిసార్ట్సు గోడలను కెరటాలు తాకాయి. అమావాస్య ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చిందని, దీని ప్రభావం మరో మూడు, నాలుగు రోజులు ఉంటుందని అధికారులు అంటున్నారు. -
సాక్షి ఎఫెక్ట్: నిగ్గు తేలిన నిజాలు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్రమార్కులపై వేటు పడింది. సెంటు భూమి లేకపోయినా కమీషన్లకు కక్కుర్తి పడి, నకిలీ డాక్యుమెంట్లతో భూములు సృష్టించి, ఎడాపెడా రుణాల పేరుతో దోచేసిన వారిని ఎట్టకేలకు ఇంటికి సాగనంపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఆత్రేయపురం బ్రాంచి వద్దిపర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో అక్రమ రుణాల బాగోతంపై విచారణ పూర్తయింది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా నిగ్గు తేల్చిన డీసీసీబీ, సహకార ఉద్యోగు లు నలుగురిపై డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ శుక్రవారం వేటు వేశారు. ఉద్యోగంలో ఉన్న వారిని సస్పెండ్ చేయాలని, రిటైరైన సూపర్వైజర్, డీజీఎంల బెనిఫిట్లు నిలుపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో రూ.కోటిన్నర రుణాలు అక్రమ మార్గంలో విడుదల చేసినట్టు నిర్ధారణయింది. ఇందులో బాధ్యుల నుంచి 90 శాతం రికవరీ చేయడం డీసీసీబీకి కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం) ‘అవినీతిలో సహకారం.. రూ.కోటిన్నర మాయం’ శీర్షికన ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనంపై డీసీసీబీ చైర్మన్ స్పందించి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వద్దిపర్రు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గత తెలుగుదేశం ఏలుబడిలో నేతలు, సహకార అధికారులు కుమ్మక్కై బినామీ రైతుల పేర్లతో రూ.కోటిన్నర నొక్కేసిన వైనాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపించాలని డీసీసీబీ సీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు.. ఆగమేఘాల మీద డీసీసీబీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. వెంకటేశ్వరరావు విచారణ ముగించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్ క్రాంతికృష్ణ, వద్దిపర్రు సొసైటీ రిటైర్ సూపర్వైజర్ ఎం.మహాలక్ష్మిరాజు, రిటైర్డ్ డీజీఎం పి.పట్టాభి రామయ్య, మేనేజర్/లీగల్ ఆఫీసర్ పి.సత్తయ్యలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. సీఈఓ మునేశ్వరరావును ఇదివరకే విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. (చదవండి: ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..) నిగ్గు తేల్చిన అక్రమాలివే... ►వద్దిపర్రు సొసైటీ సభ్యుడు కొండ్రు నాంచారావు పేరున భూమి లేకపోయినా నకిలీ డాక్యుమెంట్లతో రూ.17.21 లక్షలు స్వాహా. ►మరో సభ్యుడు వాకలపూడి హరిబాబు ఎకరం భూమికి రూ.2.50 లక్షలకు అర్హత ఉండగా..రూ.5 లక్షలు. ఎల్టీ రుణంగా ఎకరం భూమి ఉంటే రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉండగా..రూ.6.28 లక్షలు ఇచ్చారు. టైటిల్ డీడ్ లేకుండానే ఇతని సోదరుడు విశ్వేశ్వరరావుకు రుణం మంజూరు. ►మూడెకరాలున్న మల్లాది వెంకటరామారావుకు రూ.7.65 లక్షలు రుణం ఇచ్చే అవకాశం ఉండగా.. రూ.14.65 లక్షలు ఇచ్చారు. ►కరుటూరి శ్రీనివాసరావుకు ఒక రుణంగా రూ.20 లక్షల వరకు ఇవ్వవచ్చు..కానీ అడ్డగోలుగా రూ.33 లక్షల రుణం మంజూరు చేశారు. ►భూమి తక్కువగా ఉన్నా..అర్హతకు మించి ఆచంట మంగాదేవి, ఆచంట పద్మావతి, కరుటూరి వెంకటలక్షి్మలకు బాండ్లు లేకపోయినా క్రెడిట్ లిమిట్ లేకుండా రుణాలివ్వడం. ►క్రెడిట్ లిమిట్ మంజూరు లేకుండా 40 మందికి ఏకంగా రూ.62.79 లక్షలు రుణాలు మంజూరు చేశారు. ఈ మంజూరులన్నీ బ్రాంచ్ మేనేజర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగాయని విచారణలో నిగ్గుతేల్చారు. ►రిటైరైన సూపర్వైజర్ ఎం.మహాలక్ష్మిరాజు బ్రాంచ్ మేనేజర్‌కు తెలియకుండా డీ నమూనా పట్టాలపై 21 మందికి రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడైంది. ►నిబంధనలకు విరుద్ధంగా సీఈఓ మునేశ్వరావుతోపాటు మహాలక్ష్మిరాజు వాయిదా మీరిన రుణాలపై న్యాయ పరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ►ఎల్ఈసీ కార్డులు రెన్యూవల్ చేయకుండా రుణాలు రెన్యూవల్ చేయడంలో సీఈఓతోపాటు సూపర్ వైజర్ బాధ్యులు. ►సంఘంలో క్రెడిట్ లిమిట్ మంజూరు ఉందా? లేదా? అని పరిశీలించకుండా 40 మంది సభ్యులకు రూ.62.79 లక్షలు లోన్లు మంజూరు చేశారు. ►31.03.2019 నాటికి రూ.31.68.150 మొండిబకాయిలుండగా.. ఇందులో మూడేళ్లు దాటిన రూ.24 లక్షలు ఉండగా..వాటి వసూళ్లకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ►భూములను పరిశీలించకుండా..డాక్యుమెంట్లు లేనప్పటికీ కొండ్రు నాంచారావుకు రుణం మంజూరు చేయడం. ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించకుండా రుణాలు ఇచ్చిన సూపర్వైజర్, మేనేజర్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన ప్పటి డీజీఎం పి.పట్టాభి రామయ్య బాధ్యునిగా తేల్చారు. ►వాకలపూడి హరిబాబు, సోదరుడు విశ్వేశ్వరావు, రాంబాబులకు రాజవరం సిండికేట్ బ్యాంకులో రుణాలున్నాయి. వీరికి డీసీసీబీ వెబ్‌ల్యాండ్ చూడకుండా అదనంగా రుణాలు మంజూరు చేయడం, వెబ్ ల్యాండ్ చూసి ఉంటే రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బ్రాంచ్ మేనేజర్, సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్ల బ్యాంక్ నష్టపోయింది. లీగర్ ఆఫీసర్ సత్తయ్య ఒక రుణం అవుట్ స్టాండింగ్ ఉండగా...మరో రుణానికి సిఫార్సు చేస్తూ వద్దిపర్రు సొసైటీ చేసిన తప్పును గుర్తించలేకపోవడం బాధ్యతారాహిత్యంగా గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. ‘బాధ్యతగా లేకుంటే ఇంటికే’ సొసైటీ, బ్రాంచి, చివరకు డీసీసీబీలో సైతం అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా లేకుంటే ఇంటికి పంపించేస్తా. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఏ దశలో అయినా నిర్లక్ష్యం, అవినీతి, కమీషన్లకు కక్కుర్తి పడితే కఠిన చర్యలు తప్పవు. డీసీసీబీ సీఈఓ స్థాయి నుంచి డీజీఎంలు, ఏజీఎంలు, లీగల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ వరకూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తించాలి. లేకుంటే ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి సిఫారసులతో వచ్చినా రైతులను మోసం చేసిన వారిని, బ్యాంకుకు నష్టం కలిగించిన వారిని ఉపేక్షించేది లేదు. – అనంతబాబు, చైర్మన్, డీసీసీబీ -
శ్రావణి ఆత్మహత్య కేసు: సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్‌రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతడు గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణలో భాగంగా దేవరాజ్‌రెడ్డి పలు సంచలన విషయాలు వెల్లడించాడు. దీంతో ఈ కేసులో మరో అనుమానితుడిగా ఉన్న సాయికృష్ణ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాయికృష్ణ, శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.(చదవండి: నటి శ్రావణి ఆత్మహత్య కేసు: అనేక మలుపులు) ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కొడుతున్నారంటూ, శ్రావణి దేవరాజ్‌తో మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు బయటకు వచ్చాయి. ఇందులో తన చావుకు సాయి కారణమని శ్రావణి చివరిసారిగా మాట్లాడిన మాటలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో గతంలోనూ దేవరాజ్‌ను, సాయి రక్తం వచ్చేలా కొట్టినట్లుగా సాక్ష్యాలు బయటపడ్డాయి. ఇక సాయి అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని ఆరోపించిన దేవరాజ్.. శ్రావణిని కూడా ఇలాగే ట్రాప్ చేసినట్లు తెలిపాడు. తన నుంచి విడిపోవాలంటూ ఆమెను వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నాడు. కాగా ఈ కేసులో ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.(చదవండి: నటి శ్రావణి- ఆర్ఎక్స్100 నిర్మాత ఆడియో లీక్) నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి: శ్రావణి ఈ కేసు విచారణ నేపథ్యంలో గతంలో దేవరాజ్ పుట్టినరోజు సందర్భంగా శ్రావణి మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ‘‘నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి.. ఎంతోమంది పరిచయమైనా నువ్ మాత్రమే స్పెషల్.. నీలో నాకు ఎప్పుడూ మిస్టేక్ అనిపించలేదు.. నా ఫ్యామిలీ మెంబర్ లా నువ్ నాతో ఉన్నావ్. నేను ఎక్కడున్నా నీకు శుభాకాంక్షలు చెప్తాను. నేను చాలాసార్లు హర్ట్ చేశాను. నేను ఎవరికీ సారీ చెప్పను నీకు మాత్రమే చెప్తున్నాను. నిన్ను ఏమన్నా నన్ను తిరిగి ఒక్క మాట అనవ్. నాకు ఫోన్ చెయు అప్పుడపుడు’’అంటూ శ్రావణి దేవరాజ్‌పై తనకున్న అభిమానం చాటుకుంది.(చదవండి: నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు) -
హలో.. బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నా..
ముమ్మిడివరం (తూర్పుగోదావరి): ‘‘నేను బ్యాంకు మేనేజర్‌ను.. మీ ఖాతాకు ఆధార్ లింకు కానందువల్లే ప్రధాన మంత్రి స్కీమ్ రూ.10 వేలు మీ ఖాతాకు జమ కాలేదు.’’ అంటూ ఓ ఖాతాదారుడి బ్యాంకు వివరాలు తెలుసుకుని అతడి ఖాతా నుంచి రూ.94వేలు కాజేసిన ఉదంతమిది. ముమ్మిడివరం ఎస్సై కేవీ నాగార్జున కథనం ప్రకారం.. కొత్తలంక పంచాయతీ శివారు తోట్ల పాలానికి చెందిన ఈతకోట మణిరాజు కొత్తపేట లేబర్ ఆఫీసులో సబార్డ్‌నేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈనెల 7వ తేదీన సెల్: 7908490408 ద్వారా ఫోన్ వచ్చింది. ‘‘నేను బ్యాంకు మేనేజర్‌ను నీకు ప్రధాన మంత్రి స్కీమ్ ద్వారా వచ్చే రూ.10వేలు ఈ ఖాతాకు ఆధార్ లింక లేకపోవడం వల్ల జమ కాలేదు’’ ఈ మొత్తం జమ కావాలంటే నీ ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్పాలి అని మణిరాజును అవతలి వ్యక్తి కోరాడు. నీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును పై మొబైల్ నంబర్‌కు గూగుల్ పే చేయాలని సూచించాడు. దీంతో మణిరాజు తన ఖాతాలో ఉన్న రూ.94 వేలు గూగుల్ పే చేసి ఫోన్ చేశాడు. నీకు పది నిమిషాల్లో నీ సొమ్ము రూ.94 వేలతో పాటు ప్రధాన మంత్రి స్కీమ్ రూ.10వేలు కలిపి రూ.1,04,000 నీ ఖాతాలో జమవుతాయని చెప్పాడు. అప్పటి నుంచి ఆ నంబర్‌కు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని మణిరాజు తెలిపాడు. బ్యాంకుకు వెళ్లి చూడగా తాను మోసపోయాయని తెలిసి గురువారం ముమ్మిడివరం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కేవీ నాగార్జున తెలిపాడు. -
నటి శ్రావణి ఆత్మహత్య కేసు: గంటకో మలుపు
హైదరాబాద్/పిఠాపురం: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు గంటకో మలుపు తిరుగుతోంది. దేవరాజ్‌రెడ్డి, సాయి, అశోక్‌రెడ్డి.. ఈ ముగ్గురి మధ్యే కథ నడుస్తోంది. వీరితో శ్రావణి మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. దేవరాజ్‌రెడ్డి, సాయితో శ్రావణి చేసిన టిక్‌టాక్ వీడియోలు కూడా బయటికొచ్చాయి. దేవరాజ్‌రెడ్డి కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు ప్రస్తుతం ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దేవరాజ్‌రెడ్డి గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు లొంగిపోయాడు. ఇద్దరూ ప్రేమించుకున్నట్టు చెప్పాడు. అయితే ఈ కేసులో తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి పేరు తెరపైకొచ్చింది. శ్రావణి, అశోక్‌రెడ్డి మధ్య ఫోన్ కాల్స్ వివరాలు బయటికొచ్చాయి. దేవరాజ్‌రెడ్డి వద్ద శ్రావణి, అశోక్‌రెడ్డికి సంబంధించిన ఫొటోలు, వీడియోలున్నాయని.. వాటిని అడ్డం పెట్టుకుని అతను బెదిరిస్తున్నట్టుగా ఫోన్ సంభాషణల్లో ఉంది. సాయితో పాటు అశోక్‌రెడ్డిని కూడా విచారిస్తామని పోలీసులు చెప్పారు. (చదవండి: నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు) నిలదీయడంతో వేధింపులు దేవరాజ్ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. టిక్ టాక్ ద్వారా యువతులను ఆకర్షించి ప్రేమ పేరుతో దేవరాజ్ పలువురిని మోసం చేసినట్టు తెలిసింది. శ్రావణిని కూడా అలానే ప్రేమలోకి దించి, ఆమెకు తెలియకుండా ఆమె సెల్ ఫోన్లోని వ్యక్తిగత సమాచారం తీసుకున్నాడు. ప్రేమ పేరుతో దేవరాజ్ పలువురిని మోసం చేసినట్టు ఆలస్యంగా తెలుసుకున్న శ్రావణి అతడిని నిలదీసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకుని వేధింపులకు పాల్పడటంతో జూన్ 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు వాపస్ తీసుకోవాలని, లేదంటే అశోక్‌రెడ్డి, సాయితో మాట్లాడిన ఆడియోలను సోషల్ మీడియాలో పెడతానని దేవరాజ్ బెదిరించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తూర్పు గోదావరి జిల్లాలోని శ్రావణి స్వగ్రామం గొల్లప్రోలులో గురువారం ఆమె అంత్యక్రియలను బంధువులు నిర్వహించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కూడా తెల్లవారుజామున ఆమె మృతదేహం వెంట గొల్లప్రోలుకు వచ్చారు. తనకు, శ్రావణి ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదని టిక్‌టాక్ ద్వారా పరిచయమైన కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డే శ్రావణి మృతికి కారకుడని ఆరోపించారు. (చదవండి: కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్‌తో దాడి) -
అంతర్వేది ఘటనపై అంతర్గత కమిటీ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనపై జిల్లా యంత్రాంగం అంతర్గత విచారణకు ఆదేశించింది. సంఘటనకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జిల్లా అగి్నమాపక అధికారి రత్నకుమార్, అదనపు ఎస్పీ కరణం కుమార్, అంతర్వేది ఆలయ ఈఓ చక్రధరరావులతో ఈ కమిటీ ఏర్పాటైంది. నాలుగైదు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. (చదవండి: అంతర్వేది ఆలయ రథం దగ్ధం) ఈ సంఘటనలో కుట్ర కోణం ఉన్నట్లుగా ఎక్కడా ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి కొంతకాలంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ, చెత్తను పోగు చేసి మంట పెడుతున్నట్టు గుర్తించారు. రథం దగ్ధం సంఘటన జరిగిన శనివారం రాత్రి ఆ వ్యక్తి మంటలు.. మంటలు.. అంటూ కేకలు వేస్తూ వెళ్లాడని అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనలో కుట్రకోణం ఏమీ లేదని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఒకపక్క పోలీసులు, మరోపక్క రెవెన్యూ అధికారులు ఈ మిస్టరీని ఛేదించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ధ్రువీకరించారు. (చదవండి: కూతురు ఫోన్ రికార్డుతో బయటపడ్డ మర్డర్ స్కెచ్) -
అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం
-
అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం చోటుచేసుకుంది. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి వెల్లంపల్లి దిగ్భ్రాంతి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన.. దేవదాయ కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. సహయక చర్యులు చేపడుతున్న దేవదాయ, పోలీస్, పైరింజన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను విచారణ అధికారిగా నియమించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున: నిర్మాణానికి చర్యులు చేపట్టాలని దేవదాయ కమిషనర్‌కు మంత్రి సూచించారు. అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన అంతర్వేది ఘటన దురదృష్టకరం -స్వరూపానందేంద్ర రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి -స్వరూపానందేంద్ర దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి -స్వరూపానందేంద్ర హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది -స్వరూపానందేంద్ర నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి -స్వరూపానందేంద్ర -
కానిస్టేబుల్‌నంటూ టిప్‌టాప్‌గా ముస్తాబై..
కరప(తూర్పుగోదావరి): టిప్‌టాప్‌గా ముస్తాబై, స్కూటర్‌పై దర్జాగా వచ్చి, దుస్తులు కొనుగోలు చేసి, కరప పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ని అని చెప్పి అరువు పేరుతో ఉడాయించింది ఓ మహిళ. పోలీసు పేరుతో వ్యాపారికి టోకరా ఇచ్చిన ఘటన కరపలో చోటుచేసుకుంది. బాధిత వ్యాపారి నక్కా శ్రీనివాస్ కథనం ప్రకారం.. కరప గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాస్ డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో రెడీమేడ్ వస్త్ర దుకాణంతో స్వయం ఉపాధి కల్పించుకున్నాడు. రెండు వారాల క్రితం ఆ దుకాణానికి ఒక మహిళ వచ్చి యజమానితో ఆకర్షణీయంగా మాట్లాడి, రూ.3,300 విలువ చేసే దుస్తులు తీసుకుంది. వ్యాపారి సొమ్ములు అడగగా కరప పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చానని, రేపు డ్యూటీకి వచ్చినప్పుడు తీసుకువచ్చి, ఇచ్చేస్తానని నమ్మకంగా చెప్పింది. ఆ వ్యాపారి ఆమె మొబైల్ నంబరు, ఇవ్వాల్సిన బాకీ బుక్‌లో నోట్ చేసుకున్నాడు. వచ్చిన స్కూటర్ నంబరు కూడా (ఏపీ 05 డీసీ, 9813) నోట్ చేసుకున్నాడు. రెండు వారాలవుతున్నా బాకీ ఇవ్వకపోవడంతో తనకిచ్చిన మొబైల్ నంబరు 9849700844కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్‌లో ఉంది. కరప స్టేషన్లో అడిగితే అటువంటి వారు ఇక్కడ పని చేయడంలేదని చెప్పడంతో మహిళ చేతిలో మోసపోయినట్టు గ్రహించి, లబోదిబోమంటున్నాడు. కరప ఎస్సై డి.రామారావును వివరణ కోరగా బాధితుడు నుంచి ఫిర్యాదు రాలేదన్నారు. మొబైల్ నంబర్‌ను ఆరా తీయగా ఉపేంద్ర అనిల్‌కుమార్ పేరుపై తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా చిరునామాతో ఉందని, స్కూటర్ నంబర్ ప్రకారం ఏసుబాబు బాలి, ఏలేశ్వరం పేరున రిజిస్టర్ అయి ఉన్నట్టు కరప ఎస్సై తెలిపారు. -
వయస్సు రెండున్నరేళ్లు.. ఐక్యూ అదుర్స్
రామచంద్రపురం రూరల్: ఆ చిన్నారి వయస్సు రెండున్నరేళ్లు. పేరు కట్టా హేమాన్స్ సాయి సత్య సూర్య. రామచంద్రపురం మండ లం తాళ్లపొలానికి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ మనవడు. రెండు న్నరేళ్ల వయస్సులోనే ప్రపంచ దేశాల జెండాలను గుర్తిస్తూ అవి ఏ దేశానికి చెందినవో చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అంతే కాదు అక్షరాలు, అంకెలు, ఇంగ్లిష్ నెలలు, తెలుగు నెలలు, తెలుగు నక్షత్రాలు, రాశులు, తిథులు, జాతీయ చిహ్నాలు, ఖండాలు, దేశంలోని రాష్ట్రాలు–వాటి రాజధానులు, 115 రకాల పరమాణు మూలకాలు, ప్రఖ్యాత వ్యక్తులు తదితర అంశాలను అలవోకగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. హేమాన్స్ తల్లిదండ్రులు నిరోష, శర్వాణి ఇద్దరూ విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి తాళ్లపొలంలోనే ఉంటున్నారు. చిన్నారి ప్రతిభకు పదును పెడుతున్న తల్లిదండ్రులను స్థానికులు అభినందిస్తున్నారు. -
దాచి.. దోచుకుంటున్నారు...!
పిఠాపురం: అధికారంలో ఉన్నంత కాలం దోచుకున్నది చాలేదన్నట్టు ఇప్పుడు ఏకంగా అక్రమంగా మద్యం అమ్ముకుని మరీ దోచుకుంటున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకున్న టీడీపీ పక్క రాష్ట్రం నుంచి భారీగా మద్యాన్ని తరలించినట్టు ఎక్సైజ్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. 2019 ఎన్నికల్లో పంపిణీ చేయడం కోసం తెచ్చిన మద్యాన్ని కొత్తపల్లి మండల తెలుగుదేశం ముఖ్య నేత దాచిపెట్టి ఇప్పుడు మద్యం రేట్లు పెరగడంతో అధిక రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు. కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన టీడీపీ ముఖ్యనేత తన అనుచరుల ద్వారా పాలకేంద్రాన్ని అడ్డాగా చేసుకుని మద్యం బాటిళ్లను ఎక్కువ రేట్లకు విక్ర యిస్తూ గత కొన్ని నెలలు గా దోచుకుంటున్నట్టు విచారణలో తేలింది. ఎక్సైజ్ సీఐ కె.కాత్యాయని కథనం ప్రకారం.... కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు వచ్చిన సమాచారం ప్రకారం పిఠాపురం స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ఆధ్యర్యంలో ఎక్సైజ్ శాఖాధికారులు ఆదివారం అర్ధరా త్రి మాటు వేసి దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేత అనుచరులు పెనుమల్లు సుబ్బిరెడ్డి, కడిమిశెట్టి సూర్యచక్రం పట్టుబడ్డారు. వీరి నుంచి 103 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు ఆమె తెలిపారు. ఈదాడుల్లో పిఠాపురం ఎక్సైజ్ శాఖాధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ నేతలకు తెలియకుండా.. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి తెచ్చి నియోజకవర్గ ముఖ్యనేతకు తెలియకుండా మద్యంను దాచిపెట్టి, ఇప్పుడు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ పథకాలలో భారీగా అక్రమాలకు పాల్పడిన సదరు మండల టీడీపీ నేత ఇప్పుడు అక్రమ మద్యం అమ్ముతు కూడా దోచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుండగా అధికారులు విచారణ చేస్తున్నారు. -
రాజకీయ ధురంధరుడు ఇకలేరు
అనపర్తి: నిస్వార్థ సేవకుడు, రాజకీయ ధురంధరుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు సత్తి వీర్రెడ్డి(81) ఇకలేరు. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన సత్తి వీర్రెడ్డి బుధవారం రాత్రి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. వీర్రెడ్డి రామవరం సొసైటీ అధ్యక్షుడిగా, పొలమూరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా, చెరకు అభివృద్ధి మండలి చైర్మన్‌గా, వైఎస్సార్ సీపీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. ఆయన భార్య రామవరం గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. పెద్దకుమారుడు వైజాగ్‌లో గౌతమి వ్యాపార సంస్థల అధినేతగా, చిన కుమారుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఈయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం ఆయన స్వగ్రామమైన రామవరం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అభిమానులు తుది వీడ్కోలు పలికారు. అందరితో ఆప్యాయంగా ఉండే వీర్రెడ్డి ఇక లేరన్న విషయం ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురి సంతాపం.. వీర్రెడ్డి మృతికి ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి, పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు వీర్రెడ్డి కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించి సానుభూతి తెలిపారు. మంచి మిత్రుడిని కోల్పోయా... రాజకీయాల్లో నీతి, నిజాయితీగా మెలుగుతూ పార్టీకి, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన మిత్రుడు వీర్రెడ్డిని కోల్పోవడం తనకు అత్యంత బాధాకరమని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కన్నీటి పర్యంతమయ్యారు. వీర్రెడ్డి మరణ వార్త విని గురువారం ఉదయం రామవరం చేరుకున్నారు. ఆయన వీర్రెడ్డి భౌతికకాయంపై పూలమాల వేసి, వైఎస్సార్ సీపీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ ధురంధరుడు, రాయవరం మునసుబు స్ఫూర్తితో ఆయన శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వీర్రెడ్డితో తనకు గల సాన్నిహిత్యాన్ని బోస్ గుర్తు చేసుకున్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వీర్రెడ్డి పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేశారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం బోస్‌తోపాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ఉధృతి ఫోటోలు
-
48 గంటల్లో మోడల్ హౌస్
-
నలుగురు మత్స్యకారుల గల్లంతు
సాక్షి, కాకినాడ: బతుకుతెరువు కోసం బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో చోటుచేసుకుంది. ఈ నెల 11న ఉప్పాడ శివారు అమీనాబాద్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా భైరవపాలెం వద్ద బోటు ఇంజన్ పాడైనట్లు తమ వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆ తర్వాత నుంచి ఫోన్ పనిచేయలేదు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ ఆదేశాలతో ఇండియన్ కోస్టు గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. -
వాట్సాప్‌లోనే వ్యాపారమంతా..
రాజమహేంద్రవరం రూరల్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గడపదాటడానికి జనం జంకుతున్నారు. దీంతో నిత్యవసరాలు, కూరగాయలు, పండ్లు ఇతర వస్తువులు కొనుగోలుకు నగర, పట్టణాల్లో మెజారిటీ శాతం ప్రజలు డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రయాణ భారం తగ్గడం, ప్రయాస లేకుండా నిత్యవసరాలు ఇంటి వద్దకే రావడంతో ఆన్లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వసులు, సూపర్మార్కెట్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో డోర్‌డెలివరీ రూపంలో వినియోగదారులను వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. ఆన్లైన్లో గ్లోసరీ డెలివరీ సరీ్వస్‌లకు సంబంధించిన ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తద్వారా నిత్యవసరాలు ఆర్డరు చేసిన వెంటనే డోర్ డెలివరీ చేస్తున్నారు. సూపర్మార్కెట్లలో వాట్సాప్‌లలో నిత్యావసరాల జాబితాను పంపిస్తే నిర్వాహకులు డోర్ డెలివరీ చేపడుతున్నారు. జిల్లాలో ఆన్లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వసులు పదుల సంఖ్యలో ఉండగా, సూపర్మార్కెట్లు వందల సంఖ్యలో నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తున్నాయి. నిత్యావసర వస్తువులను నామమాత్రంగా డెలివరీ చార్జీలు తీసుకుని సరుకులు అందజేస్తున్నారు. కొన్ని మార్ట్లు, సూపర్మార్కెట్లు కూరగాయలు, పండ్లు సైతం డోర్ డెలివరీ చేస్తున్నారు. కొంతమంది మంచినీటి టిన్లను సైతం సరఫరా చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో రాజమహేంద్రవరం, కాకినాడ ఇతర మున్సిపాలిటీల్లో రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లను విశాల మైదనాలు, క్రీడా మైదానాల్లోకి తరలించి విక్రయాలు చేపడుతున్నారు. అయితే అక్కడ భౌతికదూరం, మాస్‌్కలు ధరించడం కొందరు సరిగా పాటించడం లేదు. దీంతో తోపుడు బండ్లపై ఇళ్ల దగ్గరకు వచ్చే కూరగాయలు సైకిళ్లు, బండ్లపై వచ్చే కూరగాయలు కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో లభించే ధరలకన్నా రూ.2, 3 తేడాతో తాజా కూరగాయలు, పండ్లు ఇంటి వద్దకే వస్తుండడంతో ఇక్కడ కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శానిటైజేషన్ చేశాకే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో రోజురోజుకు జాగ్రత్త చర్యలపై అవగాహన పెరుగుతోంది. దీంతో డోర్ డెలివరీ ద్వారా సరఫరా చేసే ప్యాక్, నిత్యవసర సరుకులను శానిటైజ్ చేశాకే ఇంట్లోకి తీసుకుంటున్నారు. డోర్ డెలివరీపై వచ్చే వస్తువుల బాక్స్‌లను శానిటైజేషన్ చేసిన తర్వాతే తాకాలని వైద్యులు సూచిస్తుండడంతో ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు.. ఆన్లైన్లో తమ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని నిత్యవసరాలు ఆర్డర్ చేసిన వెంటనే వినియోగదారులకు నిరీ్ణత సమయంలో డోర్ డెలివరీ చేస్తున్నారు. నిత్యవసరాలతో పాటు మంచినీటి టిన్లను సైతం సరఫరా చేస్తున్నాం. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు నిత్యవసరాలు డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నాం. కరోనా నేపథ్యంలో శానిటైజేషన్ చేసిన తరువాతే సరుకులు బాయ్స్ వినియోగదారులకు ఇస్తున్నాం. –డి.వెంకన్నబాబు, ఆన్లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వస్ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం -
డెడ్లైన్లు విధించడానికి మీరెవ్వరూ..!
సాక్షి, కాకినాడ: అమరావతిని ఏక రాజధానిగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పదవి లేదని పిచ్చి పట్టినట్లు మాట్లాడొద్దు. మీ వయస్సుకు, అనుభవానికి తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించాలి. అమరావతిపై సెంటిమెంట్ ఉంటే.. వెంటనే మీ ఎమ్మెల్యేలతో సహా మీరు పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి. గతంలో తెలంగాణ సెంటిమెంట్ ఉండబట్టే కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారని’’ ఆయన గుర్తు చేశారు. (రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్ర హోంశాఖ) తమ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అడగడానికి మాత్రమే అర్హులని, తమకు రెఫరెండం, డెడ్లైన్లు విధించడానికి మీరెవ్వరని చంద్రబాబును దుయ్యబట్టారు. మూడు రాజధానులు రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగమని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఆయన ఒక చక్రవర్తిలా కలగన్నాడు
సాక్షి, పశ్చిమగోదావరి: విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని చంద్రబాబునాయుడు పూర్తి చేయలేదని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివరామకృష్ణ కమిటీని కనీసం పట్టించుకోలేదు. ఆయన ఒక చక్రవర్తిలా కలగన్నాడు. రాజధానిలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ నిర్మాణం చేశాడు..?. కపట నాటకానికి, కుట్రపూరిత రాజకీయానికి తెరతీశాడు. సుమారు రెండు వేల ఎకరాల భూమిని అమ్ముకున్నాడు కానీ ఏ ఒక్క రైతుకు ప్రయోజనం కలగలేదు. (గుడివాడలో 'హౌస్ ఫర్ ఆల్' పథకం ప్రారంభం) మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఈ రాష్ట్రంలో అడుగులు వేస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్‌పై ఆరోపణలు చేశారు. అందులో ఏమాత్రం తప్పులేదు కనుకే విచారణ ఎదుర్కొన్నారు. కానీ మీ మీద ఆరోపణ వస్తే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. స్టేలు తెచ్చుకుంటే మీరు నిరపరాధి కాదు. అమరావతి భూముల్లో మీరు చేసిన స్కామ్‌లు సీబీఐ ఎంక్వయిరీలో అన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాటిని అనుభవించాలి. అనుభవించే రోజులు వస్తాయి. న్యాయస్థానాన్ని మభ్యపెట్టి, మేనేజ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులు క్షమించరంటూ చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. (సీఐ సస్పెన్షన్‌పై టీడీపీ విషప్రచారం) -
నవ వధువు ఆత్మహత్య
-
'అజ్ఞాతవాసి ఇకనైనా కళ్లు తెరువు'
సాక్షి, ఏలూరు: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్రలను సమాధి చేసిన శుభదినం. రాజధాని ఎప్పటికీ మారదు మారదు అంటూ చంద్రబాబుకు వంత పాడిన పవన్ కల్యాణ్‌కి ఇది దుర్దినం. ప్రజలకు శుభదినం. మూడు రాజధానులు ప్రజల కోరిక. మూడు ప్రాంతాల అభివృద్ధి విజ్ఞులు ఆలోచన. ఇకనైనా అజ్ఞాతవాసి ట్విట్టర్ నివాసి పవన్ కల్యాణ్ కళ్లు తెరువు అని గ్రంధి శ్రీనివాస్ హితువు పలికారు. రాష్ట్ర ప్రజల విజయం: కొట్టు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష పరిపాలన వికేంద్రీకరణగా మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం ఎంతో శుభసూచకమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేయడం ఎంతో ఆనందదాయకం. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతం కావటం రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారు. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని ఈ రోజు గవర్నర్ నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రముఖమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనడంలో ఎలాంటి సందేహం లేదని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్టానికి శుభదాయకం: ఎంపీ భరత్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతో పాటు.. రెండు రాజధానుల నడుమ ఉన్న గోదావరి జిల్లాలు కూడా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. వెనుకబడిన 3 ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు 4 రాయలసీమ జిల్లాలు కూడా రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు ఈ నిర్ణయం వెలువడటం రాష్టానికి శుభదాయకం అని మార్గాని భరత్ తెలిపారు. కృష్ణా: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందునునట్లు ఉదయభాను వివరించారు. -
మాజీ మంత్రి కొప్పన మోహనరావు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు(1978,1989) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కొప్పన వైఎస్సార్సీపీకి సేవలందించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటుగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోహనరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మార్కెటింగ్ కేంద్రాలుగా ఆర్బీకేలు..
సాక్షి, తూర్పు గోదావరి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ.. వారికి వెన్నుదన్నుగా ఉండాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దేశంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. జిల్లాలోని మండపేట మండలం ఆర్తమూరులో సోమవారం రైతులతో నిర్వహించిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 10600 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహకారం అందుతోందని.. రానున్న కాలంలో వీటిని మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చబోతున్నామని తెలిపారు. అదే విధంగా 200 కోట్ల రూపాయిలతో ఇంటిగ్రేటెడ్ ల్యాబులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘త్వరగా పాడయ్యే పంటలకు సైతం గిట్టుబాటు ధర కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అదే విధంగా రైతులకు ఏదైనా ప్రమాదం లేదా మరణం సంభవిస్తే ఏడు లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోంది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో 15 లక్షల రూపాయిలు విలువ చేసే వ్యవసాయ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతుకు అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యం’’అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. -
గురివిందలా మాటలు.. నక్కజిత్తుల ఆటలు
ఓ కొంగ ఓ చెరువు పక్కన ఒంటి కాలిపై జపం చేస్తున్నట్టు నటిస్తోంది. అది చూసిన చెరువులో చేపలు ఎంతో సంతోషించాయి. తమ శత్రువు ఆధ్యాత్మికంగా మారిపోయాడని ... ఇక తమ బతుకులకు ఢోకా ఉండదని భ్రమపడి పైకి వచ్చి స్వేచ్ఛగా విహరించసాగాయి. అంతే తన దగ్గరకు వచ్చిన ఒక్కో చేపను గుటుక్కున మింగి మళ్లీ జపం చేస్తున్నట్టు నటించేది. కొద్ది రోజులకు కుట్రను గమనించిన ఆ చేపలు దేవుడి దగ్గరకు వెళ్లి ‘మమ్మల్నే కాదు... జపం పేరుతో మిమ్మల్ని కూడా మోసం చేసిందని...మమ్మల్ని రక్షించండని ప్రభూ’ అని వేడుకున్నాయి. ఇప్పటికి కళ్లు తెరిచారు కదా...ఇక నుంచి మీకు రక్షే వెళ్లండ’ని దీవించి పంపించాడు దేవుడు. ఆ కథలోలా అప్పటి సీఎం చంద్రబాబు కొంగ జపం చేసి రాష్ట్ర దళితులను వేధించుకు తినడమే కాకుండా తీవ్ర అవమానాలకు గురిచేశాడు. అయితే ఆ అమాయక చేపల్లా ఇక్కడి దళితులు ఎవరినీ వేడుకోలేదు..ఆ కుట్రలను, మోసాలను గమనించారు. పిడికిలి బిగించి వాస్తవాలను గ్రహించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని దాదాపుగా సమాధి చేశారు. అయినా బుద్ధి తెచ్చుకోని ఆ నేతలు ఇంకా కుటిల రాజకీయాలకు తెరదీస్తూనే ఉన్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: గురివింద గింజ మాదిరిగా మాటలాడుతూ నక్క జిత్తుల రాజకీయాలకు తెరదీస్తున్న టీడీపీ నేతలపై దళిత వర్గ ప్రజలే మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న దళిత ఘటనల్లో స్పందనకు ... వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తక్షణ చర్యలకు నక్కకు...నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆ వర్గ నేతలే ఉదాహరణలతో చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్‌లో నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా న్యాయం అందని ద్రాక్షే. బాధితులు న్యాయం కోసం వెళితే అది దక్కకపోగా ఎదురు కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టేవారు. అటువంటి పరిస్థితులన్నీ ఈ ఏడాది కాలంలో పూర్తిగా మారిపోయాయి. తప్పు చేసే వారు ఎంతటి వారైనా చివరకు సొంత పార్టీ వారైనా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వదిలి పెట్టడం లేదు. ఇలా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు, వారి తాబేదారులకు కంటగింపుగా మారింది. మునికూడలి ఘటనలో తక్షణ చర్యలు సీతానగరం మండలం మునికూడలిలో ఇసుక లారీ ఢీకొని ఒక వ్యక్తికి కాలు విరిగిందని (కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు విజయ్ తనను లారీ ఢీకొట్ట లేదని బైక్ బోల్తా పడి పడిపోయానని, తన పేరు, కులాన్ని అనవసరంగా నాయకులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు.) దళిత యువకులు లారీ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అటుగా కారులో వెళుతున్న మునికూడలి వైఎస్సార్సీపీ నేత కవల కృష్ణమూర్తి ఆ వివాదాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నించగా వారు అతని కారు అద్దాలు పగలగొట్టారు. (ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం) వారించిన అడపా పుష్కరాన్ని కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో ఐదుగురు దళిత యువకులపై వారిచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 20న ఒక నిందితుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి సిబ్బందితో కలిసి చిత్రహింసలకు గురిచేసి జుత్తు కత్తిరించిన ఘటనపై స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్రంగా పరిగణించి జారీ చేసిన ఆదేశాలతో ఇన్చార్జ్ ఎస్సై ఫిరోజ్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వరప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదైంది. రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. బాధ్యత కలిగిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పినిపే విశ్వరూప్, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆస్పత్రిలో ఉన్న బాధితుడు వరప్రసాద్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇవిగో సాక్ష్యాలు.. ►ఏవీ చర్యలు ? చంద్రబాబు ఏలుబడిలో రెండున్నరేళ్ల క్రితం అమలాపురం ఎర్రవంతెన వద్ద పెంపుడు కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో పంట కాల్వలో పడి పదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు ? ►తుని నియోజకవర్గంలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సోదరుడు కృష్ణుడు అవినీతికి అడ్డుపడ్డ వారిని పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడ్డారు. ►2016లో తుని కాపు గర్జన అనంతరం ఘటనల్లో సంబంధం లేని ఎస్సీ, బీసీలపై టీడీపీ సర్కార్ కేసులతో వేధింపులకు పాల్పడింది. ►ఐ.పోలవరం మండలం కేశనకుర్రు సంత మార్కెట్లో అంబేడ్కర్ విగ్రహం తొలగింపు విషయంలో ఆందోళనకు దిగిన పాపానికి దళితులపై అక్కడి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఎదురు కేసులతో వేధింపులకు దిగారు. (ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బాబూ) బాబు హయాంలో ఎదురు దాడులే కదా... చంద్రబాబు ఏలుబడిలో రెండున్నరేళ్ల క్రితం అమలాపురం ఎర్రవంతెన వద్ద పెంపుడు కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో పంట కాల్వలో పడి పదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ కుక్క యజమాని అప్పటి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయానా సోదరుడు జగ్గయ్యనాయుడే. హోం మంత్రి సోదరుడు కావడంతో దళిత సంఘాల ఒత్తిడి నేపథ్యంలో చాలా రోజుల తరువాత కేసు నమోదు చేసినా ఆ దళిత బాలుడు పెంపుడు కుక్క తరమడం వల్లే కాల్వలో పడి చనిపోయాడని ఎఫ్ఐఆర్లో ఎక్కడా పేర్కొనలేదు. తన ఇంటికి కూత వేటు దూరంలో నివాసం ఉండే రాజప్ప కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా మనసు రాలేదు. తుని నియోజకవర్గంలో అప్పటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సోదరుడు కృష్ణుడు అవినీతికి అడ్డుపడ్డ వారిని పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడ్డ ఘటనలు కోకొల్లలు. తాండవ నదిలో యనమల సోదరుల అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు ఎస్సీ వర్గానికి చెందిన పలువురిపై అక్రమ కేసులు బనాయించారు. 2016లో తుని కాపు గర్జన అనంతర ఘటనల్లో సంబంధం లేని ఎస్సీ, బీసీలపై టీడీపీ సర్కార్ కేసులతో వేధింపులకు పాల్పడింది. ఆ బాధితుల జాబితాలో ప్రస్తుత ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, కోటనందూరు మండలం భీమవరపుకోట మాజీ సర్పంచి జిగటాల వీరబాబు, బీసీ వర్గానికి చెందిన లగుడు శ్రీను, కొయ్యా శ్రీను, రేలంగి రమణాగౌడ్ ఉండటం గమనార్హం. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు సంత మార్కెట్లో అంబేడ్కర్ విగ్రహం తొలగింపు విషయంలో ఆందోళనకు దిగినందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఎదురు కేసులతో వేధింపులకు దిగారు. ఈ వివాదంలో ఆ నియోకవర్గం మొత్తం మీద 400 మంది దళితులపై కేసులు బనాయించారు. రాజకీయ రంగు... సీఎం స్థాయి నుంచి ఎస్పీ వరకూ అడుగడుగునా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చర్యలు తీసుకున్నారు. ఇంత చేస్తే కేవలం ప్రచారం, రాజకీయ ఉనికి కోసం టీడీపీ తెర వెనుక ఉండి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారానికి దిగుతోంది. దళితులు వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా ఉన్నారనే దుగ్ధతో వారిని పార్టీకి దూరం చేయాలనే కుట్రలో భాగంగా ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారు. మునికూడలి ఘటనలో బాధితుడు వరప్రసాద్ టీడీపీ క్రియాశీలక కార్యకర్త. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవల కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నాయకుడు. ప్రభుత్వం పార్టీ పక్షాన నిలిచి ఉంటే కృష్ణమూర్తిపై కేసు నమోదయ్యేదా, ఎస్ఐ ఇతర పోలీసుల సస్పెన్షన్, ఎస్సీ,ఎస్టీ అత్యాచార కేసు నమోదు చేసే వారా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిష్పాక్షికత కనిపిస్తున్నా మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి నాయకులు ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నాలు చేయడాన్ని దళిత మేధావులే గర్హిస్తున్నారు. -
శిరోముండనం ఘటనపై వేగంగా దర్యాప్తు
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం ఘటనపై మరింత వేగంగా దర్యాప్తు జరపాలని ఆ జిల్లా ఎస్పీని డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఆదేశించారు. డీజీపీ ఇంకా ఏమన్నారంటే.. ► ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే దర్యాప్తు చేపట్టాం. ఈ కేసులో ఎస్సై, కానిస్టేబుల్స్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు కేసు నమోదు చేశాం. ► ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం. ► నేరానికి పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. ► ఘటనపై దర్యాప్తు పూర్తి చేశాక దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ► ఈ ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతాం. -
‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’
-
ఇన్నాళ్లు సేవ చేసినందుకు ఇదా ఫలితం?
-
దారుణం: రాత్రంతా వర్షంలోనే..
సాక్షి, తూర్పుగోదావరి: మహమ్మారి కరోనా భయం మానవత్వాన్ని మంటగలుపుతోంది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇందుకు అద్దం పట్టే ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో చోటుచేసుకుంది. తన భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఓ ఏఎన్ఎం పడరాని పాట్లు పడ్డారు. రాత్రంతా వర్షంలోనే ఉండిపోయారు. వివరాలు.. బుర్రిలంకకు చెందిన ఓ మహిళ ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ఇటీవల కోవిడ్-19 బారిన పడటంతో అతడిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఏఎన్ఎం కారణంగా తమకు కూడా కరోనా సోకుతుందనే భయంతో గ్రామస్తులు ఆమెను ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె రాత్రంతా వర్షంలోనే గడిపారు. (కడసారి వీడ్కోలుకు కానరారే!) ఈ విషయం గురించి సదరు ఏఎన్ఎం మాట్లాడుతూ.. సొంత ఇంట్లోకి తనను అడుగుపెట్టనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు గ్రామానికి సేవ చేసినందుకు ఇదేనా ఫలితం అంటూ వాపోయారు. కాగా మహమ్మారి సోకిందంటే చాలు సొంత వాళ్లను కూడా శత్రువులుగా భావించే రోజులు దాపురించిన తరుణంలో... సాధారణ ప్రజలతో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్లకు కూడా చేదు అనుభవాలు తప్పడం లేదు. ఇక కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబ సభ్యులే నిరాకరిస్తున్న ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. -
బాధ్యులపై చర్యలు తప్పవు: మంత్రి వనిత
సాక్షి, తూర్పుగోదావరి: సీతానగరం ఘటన బాధితుడిని మంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాదితుడిని బుధవారం రోజున పరామర్శించిన మంత్రి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ దళిత సంఘాలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఘటనకు సంబంధించిన బాధ్యులైన వారందరిపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. (శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు) లైంగికదాడికి గురైన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, మధురపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలికను కూడా మంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి, ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితురాలికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేసినట్లు తెలిపారు. (బాలికపై సామూహిక అత్యాచారం) (పీఎస్‌లో యువకుడికి శిరోముండనం) -
‘అబద్దాల ఫ్యాక్టరీకి అప్రకటిత అధ్యక్షుడు’
సాక్షి, కాకినాడ: గోదావరిలో లేని వరదలను ఉన్నట్లు ఈనాడు పత్రిక తప్పుడు కథనాలను రాస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాత ఫొటోలను ప్రచురించి ప్రజలను ఆ పత్రిక భయాందోళనలకు గురి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు రైతులు సంతోషంగా ఉంటే సహించలేరని, అలాంటి వారు పత్రికల ద్వారా విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. అసలు మీ దారి ఎటూ.. ‘‘గోదావరి వరద పై ఓ అసత్య కథనాన్ని ప్రచురించడం దారుణం. గడచిన 3, 4 దశాబ్దాల్లో లేనంతంగా వరద గత ఏడాది గోదావరి, కృష్ణా నదులలో వచ్చింది. అన్నింటిని సమీక్షించి..ఈ ఏడాది ముందస్తుగా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. పోలవరం కాంట్రాక్టర్లకు కాసులు కురిపించాలని చంద్రబాబు చేసిన నిర్వాకం వల్లే కాఫర్ డ్యామ్ వల్ల గత ఏడాది గోదావరికి ముంపు అధికమైంది. ఆయన చేసిన పని వల్ల ఆనాడు వరద గ్రామాల్లో సహయక చర్యలు అందించడానికి 108,104 వాహనాలు లేవు. కానీ ఇవాళ.. వరద ముంపు గ్రామాల్లో సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. సహయక చర్యలు అందించేందుకు 108,104 వాహనాలు ఉన్నాయి. గత ఏడాది వరదలకు ముంపు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా విద్యుత్ స్తంబాలను 11.5 మీటర్ల ఎత్తుకు మార్చాం. అసలు మీదారి ఎటూ అని ఈనాడును అడుగుతున్నా’’ అంటూ కన్నబాబు నిలదీశారు. (హ్యారీపోటర్‌ను మరిపిస్తున్నావ్ కిట్టన్నా!) ఆ తప్పుడు లెక్కలు ఎవరిచ్చారు.. చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి యనమల అప్రకటిత అధ్యక్షుడని.. అసమానతలు, అసత్యాలను ఆయన ప్రచారం చేస్తున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం రద్దు చేసిందని యనమల చెబుతున్న రూ.18120 కోట్ల తప్పుడు లెక్కలు ఎవరిచ్చారు అని కన్నబాబు ప్రశ్నించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు రూ.42603 కోట్లు ఇచ్చాం. 3.9 కోట్ల మందికి ప్రయోజనం కలిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 21 పథకాలు అమలు చేస్తోంది. ఏ పథకాన్ని రద్దు చేశామో యనమల చెప్పాలి?. బురద చల్లితే ప్రభుత్వమే కడుక్కుంటుందన్న ధోరణితో యనమల మాట్లాడుతున్నారని మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు. 3 లక్షల ఉద్యోగాలు తొలగించామని కళా వెంక్రటావ్ అంటున్నారు. ఎక్కడ తొలగించామో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. సీఎం జగన్ 4 లక్షల మందికి సచివాలయ, వాలంటీర్ ఉద్యోగాలు కల్పించారని కన్నబాబు పేర్కొన్నారు. -
‘గత వైఫల్యాలను ఆ పత్రిక రాస్తే బాగుంటుంది’
సాక్షి, కాకినాడ: టీడీపీ హయాంలో రైతుల పట్ల సరైన విధానం పాటించలేదని, వారికి జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. (అర్హులైన మహిళలందరికీ ‘వైఎస్సార్ చేయూత’) రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంటే, కొన్ని పత్రికల్లో చిత్ర విచిత్రమైన కథనాలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వైఫల్యాలపై ఈనాడు పత్రిక కథనాలు ప్రచురిస్తే బాగుంటుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకుండా అమలు చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. (వ్యవసాయాభివృద్ధిలో ఆర్బీకేలది కీలక భూమిక) -
ప్రజాధనం గోదారి పాలు.. టీడీపీ నిర్వాకం
రాజుల సొమ్ము.. రాళ్లపాలు అన్నట్టుగా.. నాటి చంద్రన్న సర్కారు కమీషన్ల కక్కుర్తితో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గోదారి పాలు చేసింది. సరైన అనుమతులు లేకుండానే నాటి ప్రభుత్వం నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భారీగా కమీషన్లు ఎత్తిపోశారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అసలు ఈ ఎత్తిపోతల పథకమే వృథా అని చాలామంది అప్పట్లోనే చెప్పారు. అయినప్పటికీ కమీషన్ల కక్కుర్తితో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం ఆగమేఘాల మీద నిర్మించేసింది. ఇప్పుడీ పథకం ‘ఉత్తిపోతలు’గా మారినట్టే కనిపిస్తోంది. దీని నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఎత్తిపోయడానికి వీల్లేదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొద్ది రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారగా.. దీనికోసం ఖర్చు చూపించిన రూ.1,638 కోట్లను చంద్రన్న ప్రభుత్వం గోదారిలో కలిపినట్టయ్యిందన్న విమర్శలు వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పాలకుల స్వలాభపేక్ష ఫలితంగా ప్రజాధనం ఎలా దురి్వనియోగం అవుతుందో కళ్లకు కడుతోంది పురుషోత్తపట్నం ఎత్తిపోల పథకం. మెట్ట ప్రాంత సంజీవనిగా పిలిచే ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి నీటిని పంపింగ్ చేస్తామని నమ్మించి, నాటి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఈ పథకం ద్వారా గత పాలకులు రూ.కోట్లు కొల్లగొట్టేశారు. 2017 ఆగస్టు 15న అప్పటి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. సాగునీరు విడుదల చేస్తున్నట్టు పెద్ద ఆర్భాటమే చేశారు. 2017లో పాక్షికంగా 1.63 టీఎంసీలు, 2018–19 ఖరీఫ్‌న్‌లో 7.81 టీఎంసీలు.. అది కూడా గోదావరికి వరదలు వచ్చినప్పుడు విడుదల చేశారు. పోలవరం ఎడమ కాలువ, ఏలేరు ప్రాజెక్టులు ఉండగా ఈ ఎత్తిపోతల పథకం వృథా అని రైతులు, ఇంజినీర్లు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు చెవికెక్కలేదు. ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే.. కమీషన్లకు కక్కుర్తి పడి, అధికార బలంతో రూ.1,638 కోట్ల ప్రజల సొమ్ము గోదావరిపాలు చేశారు. అనుమతులు తీసుకోకుండానే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం, రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై ఎన్జీటీ, న్యాయస్థానాలు చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేయరాదంటూ ఎన్జీటీ తాజాగా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. బలవంతపు భూసేకరణ.. అక్రమ కేసులు వాస్తవానికి ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆద్యంతం వివాదాస్పదంగానే జరిగింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రెవెన్యూ పరిధిలో భూములకు పరిహారం తక్కువని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని 70 ఎకరాలకు చెందిన 85 మంది రైతులు అప్పట్లో డిమాండ్ చేశారు. వారిని దారిలోకి తెచ్చుకునేందుకు క్రిమినల్ కేసులు పెట్టి, బలవంతంగా నాటి ప్రభుత్వం భూములు తీసుకుంది. దీనిపై 30 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి న్యాయ పోరాటానికి మద్దతుగా ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అప్పట్లో ఆమరణ దీక్ష కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత జక్కంపూడి రాజా పురుషోత్తపట్నం రైతుల సమస్యను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వారిపై చంద్రబాబు సర్కార్ పెట్టిన అక్రమ కేసులను ఇటీవల ఎత్తివేయించారు. దీంతో ఆ రైతులకు ఉపశమనం లభించింది. ‘ఏలేరు’లో సమృద్ధిగా జలాలు ఏలేరు రిజర్వాయర్ కింద ఖరీఫ్‌లో 60 వేలు, రబీలో 40 వేల ఎకరాల సాగు జరుగుతోంది. ఒక టీఎంసీ జలాలతో 10 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది. ప్రస్తుతం ఏలేరు జలాశయంలో 12.21 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. దీంతో ఆయకట్టుకు ఎటువంటి ఢోకా లేదు. సీజన్ ప్రారంభంలోనే సమృద్ధిగా నిల్వలుంటే వర్షాలు విస్తారంగా పడితే ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ– రామవరం లిఫ్ట్‌తో సంబంధం లేకుండానే ఏలేరు ఆయకట్టులో రెండు పంటలకూ సమృద్ధిగా నీరందుతోంది. ఇటువంటి ఏలేరు ప్రాజెక్టులోకి గోదావరి నీటిని ఎత్తి పోస్తామని నమ్మబలికి, రైతుల పేరుతో పురుషోత్తపట్నం పథకాన్ని తీసుకువచ్చి, కమీషన్ల రూపంలో రూ.కోట్లు కొట్టేశారని మెట్ట ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. ఏలేరు ప్రాజెక్టు రైతులపై ప్రేమ కంటే కమీషన్ల పై యావ ఎక్కువయ్యే చంద్రబాబు అండ్ కో ఇలా చేశారని రైతు ప్రతినిధులు విమర్శిస్తున్నారు. రామవరం లిఫ్ట్ పేరుతో రూ.500 కోట్లు వృథా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భాగంగా రామవరం వద్ద రెండో లిఫ్ట్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఏలేరు ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేశారు. రామవరం పంపు హౌస్‌కు మూడు కిలోమీటర్లు దూరాన కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం, ఏలేరు కాలువలు క్రాస్ అవుతున్నాయి. రెండో దశ లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండానే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని ఏలేరు ప్రధాన కాలువలోకి మళ్లించవచ్చు. అలా చేసే అవకాశం ఉన్నప్పటికీ రెండో దశ లిఫ్ట్ పేరుతో రూ.500 కోట్లు వృథా చేశారని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. నీటి విడుదలకు ఎన్జీటీ ‘నో’ అనుమతులు లేకుండానే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతున్నారంటూ ప్రారంభంలోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా దీని నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం, పర్యావరణ అనుమతి, కేంద్ర జలసంఘం నుంచి అనుమతి వచ్చే వరకూ ‘పురుషోత్తపట్నం’ నుంచి నీటి విడుదలను నిలుపు చేయాలని తాజాగా ఆదేశించింది. కీలకమైన ఈ అనుమతులేవీ తీసుకోకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ ఎత్తిపోతల పథకం చేపట్టి ప్రజాధనాన్ని చంద్రబాబు వృథా చేశారని రైతులు దుయ్యబడుతున్నారు. కేసులు పెట్టి వేధించారు పురుషోత్తపట్నం పథకంలో నేను 4.32 ఎకరాలు కోల్పోయాను. నా అనుమతి లేకుండా, సంతకం చేయకపోయినా భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. భార్యతో సహా ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రయతి్నస్తే పోలీసులు అడ్డుకుని, ఇంటిలోనే బంధించారు. నా అంగీకారం లేకుండానే క్రిమినల్ కేసులు పెట్టి మరీ భూమిని బలవంతంగా తీసుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసులను రద్దు చేసింది. – కరుటూరి శ్రీనివాస్, రైతు,రామచంద్రపురం,సీతానగరం మండలం జక్కంపూడి కృషితో కేసులు ఎత్తేశారు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని అడిగాం. ఆ చట్టం ప్రకారం ఎకరాకు రూ.39 లక్షలు వస్తుంది. అలా పరిహారం చెల్లించకుండా పోలీసు బందోబస్తుతో బలవంతంగా భూముల్ని లాగేసుకుని మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా మాపై ఉన్న కేసులను ఎత్తేశారు. కేసులు ఎత్తివేసినట్టే పరిహారం విషయంలో కూడా ఆదుకుంటారనే నమ్మకంతో ఉన్నాం. – ఐఎస్ఎన్ రాజు, చినకొండేపూడి, సీతానగరం మండలం ‘పురుషోత్తపట్నం’లో ‘బాబు’ లూటీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో చంద్రబాబు అండ్ కో రూ.కోట్లు లూటీ చేసింది. రూ.1,638 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసినా ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించలేని పరిస్థితి చంద్రబాబు నిర్వాకంతోనే ఏర్పడింది. ఆయనకు కమీషన్లపై ఉన్న ధ్యాస ప్రాజెక్టుకు అనుమతులు రాబట్టడంలో లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చినా లెక్క చేయలేదు. దానికి అభ్యంతరాలు ఎదురైనా ఇక్కడ పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టి హడావుడిగా పూర్తి చేసి, కమీషన్లు నొక్కేశారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం కూడా ఇవ్వకపోగా, తిరిగి వారిపై అక్రమంగా కేసులు పెట్టి బలవంతంగా భూములు లాగేసుకున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి రైతులపై కేసులు ఎత్తివేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అవసరం లేదన్న నిపుణుల సూచనలను చంద్రబాబు పెడచెవిన పెట్టి ప్రజల సొమ్మును దుబారా చేశారు. పోలవరం యుద్ధప్రాతిపదికన జరుగుతోందని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఆ ప్రాజెక్టులో భాగంగానే దీనిని చేపడుతున్నామని అప్పట్లో చెప్పారు. దీనిలో ఆంతర్యమేమిటి? – జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం -
‘ఆయనదంతా కృత్రిమ ఉద్యమం’
సాక్షి, తూర్పుగోదావరి: 29 గ్రామాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కృతిమ ఉద్యమాలు చేయిస్తున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పలేదని విమర్శించారు.‘‘మీ పెట్టుబడిదారులు అమరావతిలో 33 వేల ఎకరాలు సేకరించాకే అమరావతిని రాజధానిని చేశారు తప్ప రైతులపై ప్రేమతో కాదు. అమరావతిలో చంద్రబాబు ఒక్క శాశ్వతమైన భవనం ఏమైనా కట్టారా? మండలిలో బిల్లులు పాస్ కాకుండా చంద్రబాబు కుట్రలు చేశారని’’ ఆయన నిప్పులు చెరిగారు. ఆయన కబుర్లు చెప్పడం తప్ప ఏపీకి చేసిందేమీ లేదని సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. (‘ఆయన వ్యాఖ్యల వెనుక ఏ కుట్ర దాగుందో’) -
టీడీపీ అండ.. రూ.కోటి స్వాహా
టీడీపీ హయాంలో అట్టహాసంగా ప్రారంభించిన ఏపీ ఫైబర్‌నెట్ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో రాజమహేంద్రవరం బ్రాంచిలోని మెయిన్ సర్వీస్ ఆపరేటర్ (ఎంఎస్ఓ) యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపాడు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కనెక్షన్ల పేరిట రూ.కోటి స్వాహా చేశాడు. ప్రభుత్వ ఆదేశాలతో తాజాగా ప్రక్షాళన చేపట్టిన అధికారులకు ఎంఎస్ఓ అక్రమాలు విస్తుగొలుపుతున్నాయి. ప్రభుత్వానికి రూ.58 లక్షల బకాయిలు చెల్లించకపోవడంతోపాటు అధిక వసూళ్లకు దర్జాగా బిల్లులు ఇచ్చిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: 2018 జూన్‌లో రాజమహేంద్రవరంలో ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. టీడీపీ పెద్దల అండదండలతో రాజమహేంద్రవరం బ్రాంచి ఎంఎస్ఓ ఆశపు రాజేశ్వరరావు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాడు. నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్ల చార్జీలను పెంచేసి అటు వినియోగదారులను, టార్గెట్ల పేరిట ఇటు ఆపరేట్లను అడ్డగోలుగా దోచేసుకున్నాడు. నగరంలో దాదాపు వంద మంది ఆపరేటర్లు పదివేల కనెక్షన్లు తీసుకువచ్చారు. నెలకు కనెక్షన్ చార్జి రూ.235కు గాను ప్రభుత్వానికి రూ.105 చెల్లించగా, ఎంఎస్ఓ వాటా రూ.30, మిగిలిన రూ.100 ఆపరేటర్లకు చెల్లించాల్సి అతను ఉంది. కాగా జీఎస్టీ అంటూ రూ.85 మాత్రమే ఆపరేటర్లకు చే ల్లించేవాడు. ఈ మేరకు ఒక్కో కనెక్షన్‌కి అదనంగా రూ.15 వంతున పదివేల కనెక్షన్లకు నెలకి రూ.1.50 లక్షలు తన ఖాతాలో వేసుకునేవాడు. ఈ మేరకు ఏడాదిలో రూ.18 లక్షల మొత్తాన్ని ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్ల నుంచి దోచేశాడు. ఆయా ఆర్థిక లావాదేవీలకు ఫైబర్‌నెట్ పేరిట రశీదులు ఇవ్వాల్సి ఉండగా, అదనపు వసూళ్ల విషయం బయటకు పొక్కకుండా తనకు చెందిన శ్రీవేన్ గ్రూప్ పేరిట బిల్లులు ఇచ్చేవాడు. 2018 ఆగస్టు నెల నాటికి 100 కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తి చేసిన కేబుల్ ఆపరేటర్లకు కనెక్షన్‌కు రూ.250 వంతున ఏపీ ఫైబర్‌నెట్ చెల్లించిన ఇన్సెంటివ్ రూ.6.47 లక్షలు కాజేసిన విషయం వెలుగుచూసింది. వంద కనెక్షన్లకు వసూళ్లు.. ఉన్న మేరకే చెల్లింపులు వంద కనెక్షన్లు లక్ష్యం చేరుకోకుంటే తొలగిస్తారని ఎంఎస్ఓ భయాందోళనలకు గురిచేయడంతో 20, 30 కనెక్షన్లు ఉన్న ఆపరేటర్లు సైతం వంద కనెక్షన్ల మొత్తాన్ని చెల్లించేవారు. అయితే ఫైబర్‌నెట్‌కు మాత్రం ఉన్న కనెక్షన్లకు మాత్రమే సొమ్ము చెల్లించేవాడు. 2018 జూన్ నుంచి ఏడాదికాలం పాటు కనెక్షన్ల పేరిట దాదాపు 7.5 లక్షలు వసూలు చేశారు. పాన్ పేరిట అక్రమాలు : కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ఫైబర్‌నెట్ ఉచితంగా పాన్ (పాసీవ్ ఆప్టికల్ నెట్వర్క్) అందజేస్తుంది. కాగా ఎంఎస్ఓ రాజేశ్వరరావు ఒక్కొక్కరి వద్ద నుంచి పాన్ పేరిట రూ.5,000 నుంచి రూ.25,000 వరకు దాదాపు రూ.7.5 లక్షలు వసూలు చేసినట్టు ఓ అంచనా. బాక్స్‌లు డియాక్టివ్ కావడంతో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి వెనక్కి వచ్చిన రూ.2.47 లక్షలు కేబుల్ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఎంఎస్ఓ స్వాహా చేశాడు. ప్రభుత్వానికి బకాయిలు ఎగవేత కనెక్షన్లకు సంబంధించి చార్జీలను రాజేశ్వరరావు ఏపీ ఫైబర్‌నెట్‌కు చెల్లించలేదు. దాదాపు రూ.58 లక్షల బకాయిలు పేరుకుపోవడంతో ఏపీ ఫైబర్‌నెట్ ప్రసారాలు నిలిపివేసింది. వినియోగదారులు ఆపరేటర్లను నిలదీయడంతో చేసేదిలేక ఎంఎస్ఓ రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా గత ఏడాది అక్టోబరులో ఆందోళనలు నిర్వహించి త్రీటౌన్ పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. కేబుల్ ఆపరేటర్లకి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని పోలీసుల సమక్షంలో రాజీ కూడా కుదుర్చుకున్నాడు. కాని ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు. వెలుగుచూస్తున్న అక్రమాలు 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు యథేచ్ఛగా సాగిన రాజేశ్వరరావు అక్రమాలకు ప్రభుత్వం మారడంతో తెరపడింది. ఆపరేటర్ల నుంచి అందిన ఫిర్యాదులతో అధికారులు నిర్వహించిన విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. దాదాపు కోటి రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరావు మీద చర్యలకు ఉపక్రమించిన అధికారులు అతనిని పక్కనపెట్టి మరొకరిని ఎంఎస్ఓగా నియమించారు. ప్రసారాల నిలుపుదలతో ఇబ్బంది ఏపీ ఫైబర్‌నెట్‌కి చెల్లించవలసిన మొత్తాన్ని నేను చెల్లించాను. కాని పాత ఎంఎస్ఓ వాటిని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో మా ప్రాంతంలో ప్రసారాలను నిలుపుదల చేశారు. దానితో కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ఫైబర్‌నెట్ వారు కలుగచేసుకుని మా ప్రసారాలను తిరిగి ప్రారంభించవలసిందిగా కోరుతున్నా. – కాకర ప్రవీణ్‌కుమార్, ఫైబర్‌నెట్ ఆపరేటర్ మాకు కోడ్లను కూడా ఇవ్వలేదు కేబుల్ ఆపరేటర్లకు వ్యక్తిగతంగా ఇవ్వవలసిన కోడ్లకు బదులు ఎంఎస్ఓ రాజేశ్వరరావు తన సొంత కోడ్‌తో యాక్సిస్ చేసేవాడు. ఇప్పుడు ప్రసారాలను నిలిపివేయడంతో మాకు కోడ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా మాకు రావల్సిన కోడ్లను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. – బల్లా సూరిబాబు, ఫైబర్‌నెట్ ఆపరేటర్ బాబు శ్రీకారం చుట్టింది ఇక్కడే రాష్ట్రంలో ఏపీ ఫైబర్‌నెట్‌కు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మన జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. 2016 డిసెంబర్ 29న సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలో ఈ వ్యవస్థను ఆరంభించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి ఈ వ్యవస్థను ప్రారంభించిన ఈ జిల్లాలోనే ఇంత పెద్దఎత్తున దోపిడీ జరుగగా ఇక మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2016లో ఫైబర్‌నెట్‌ను ప్రారంభిస్తున్న నాటి సీఎం చంద్రబాబు