ఘోర ప్రమాదం: తల్లిదండ్రులు, కొడుకు మృతి | Car Rams Into Canal 3 Deceased East Godavari District | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Published Fri, Dec 4 2020 10:31 AM | Last Updated on Fri, Dec 4 2020 11:19 AM

Car Rams Into Canal 3 Deceased East Godavari District - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి:  జిల్లాలోని కోటిపల్లి- యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం కోట గ్రామం వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ, ఆయన భార్య , రిటైర్డ్ లెక్చరర్ విజయలక్ష్మి, కుమారుడు ప్రణీత్‌గా గుర్తించారు. కాకినాడ నుంచి యానాం వస్తుండగా తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి: వివాహితను బలిగొన్న వివాహేతర సంబంధం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement