yanam
-
చీరమీను.. రుచి అదిరేను.. రేటెంతైనా తినాల్సిందే
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే చీరమీనుల్ని చూస్తే గోదావరి వాసులు లొట్టలేస్తారు. శీతల గాలి తిరిగిందంటే.. గోదావరి తీరంలో చీరమీను కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు. గోదావరికి వరదలు వస్తే పులస చేపల కోసం క్యూకట్టే తరహాలోనే అక్టోబరు నెలాఖరు మొదలు నవంబరు నెలాఖరు వరకూ చీరమీను కోసం గోదావరి తీరంలో తెల్లవారకుండానే జనం తండోపతండాలుగానే కనిపిస్తుంటారు. పోషకాలు దండిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే అరుదైన ఈ చిట్టి చేపలను కొనాల్సిందేనంటారు. కార్తీకాన్ని ఎంతో నిష్టగా ఆచరించే వారు సైతం అరుదుగా లభించే చీరమీనును మాత్రం వదిలిపెట్టరు. కొలత ఏదైనా.. ధర ఎంతైనా.. మార్కెట్లో అన్నిరకాల వస్తువులను కేజీలు, లీటర్లలో కొలుస్తుంటారు. కానీ.. చీరమీను మాత్రం సంప్రదాయంగా వస్తున్న గిద్ద, సోల, గ్లాసు, తవ్వ , శేరు, కుంచం, బకెట్ కొలమానంతో విక్రయిస్తున్నారు. చీరమీను రోజువారీ లభ్యతను బట్టి లభ్యతను బట్టి ప్రస్తుతం శేరు (సుమారు కిలో) రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. ఈ చీరమీను ఎక్కువగా యానాం, భైరవపాలెం, ఎదుర్లంక, జి.వేమవరం, గుత్తెనదీవి, జి.మూలపొలం, ఎదుర్లంక, మురమళ్ల, పశువుల్లంక, మొల్లేటిమొగ, పండి, పల్లం, సూరసేన యానాం, అంతర్వేదికర, వేమగిరి గ్రామాల్లో లభిస్తోంది. సెలీనియం అధికం సంపూర్ణ ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో సెలీనియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలోని హానికరమైన కణాలతో పోరాడటానికి సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలిందని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవునికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపర్చి ఆస్తమాను తగ్గించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్, గుండె సంబంధ వ్యాధులు, కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడానికి చీరమీనులో ఉండే సెలీనియం సహాయపడుతుందని చెబుతున్నారు. చీరమీనుతో మసాలా కర్రీ, చింతకాయలతో కలిపి కూర, చీరమీను గారెలు కూడా వేస్తుంటారు. అంగుళం నుంచి.. ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అరుదుగా లభించే చీరమీను లిజార్డ్ ఫిష్ జాతికి చెందిన చేపగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సినోడాంటిడే కుటుంబానికి చెందిన చేపలివి. వీటి శాస్త్రీయ నామం సారిడా గ్రాసిలిస్. సారిడా టంబిల, సారిడా అండోస్క్యామిస్ జాతులకు చెందిన చిట్టి చేపలని కూడా పిలుస్తారు. అంగుళం నుంచి మూడు అంగుళాల పరిమాణంలో ఉండే చీరమీను చీరల సాయంతో పడుతుంటారు. రంగు, రంగు చీరలను చూసి ఈ చిట్టిచేపలు గోదావరి అడుగు నుంచి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. అలా చీరల్లోకి సమూహాలుగా వచ్చి ఇవి జాలర్లకు పట్టుబడుతుంటాయి. రేటెంతైనా తినాల్సిందే చాలా అరుదైన చీరమీను మార్కెట్లోకి వచ్చి0దంటే ఎంత ధరకైనా కొనాల్సిందే. మా చిన్నప్పుడు తాతల కాలం నుంచి చీరమీను సీజన్లో ఒక్కసారైనా ఈ కూర తినాలని చెప్పేవారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా ఉండటంతో ఏ సీజన్లోను విడిచిపెట్టం. ఎంత ధర ఉన్నా కొని తినాల్సిందే. ధర రూ.5 వేలు ఉన్నా కొని కూర వండిస్తాం. – చిక్కాల నరసింహమూర్తి, యానాం ఆరోగ్యానికి దోహదం సీజనల్‌గా దొరికే చీరమీను ఎంత రుచిగా ఉంటుందో.. ఆరోగ్యానికి కూడా అంతే దోహదం చేస్తుంది. కాల్షియం, పొటాషియం, జింక్, అయోడిన్ చీరమీనులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమెగా–3 ప్యాటీ యాసిడ్స్‌తో ఎంతో ఉపయోగం. ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అందుకే ఈ ప్రాంతంలో మాంసాహార ప్రియులు సీజన్లో దొరికే చీరమీను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనుగోలు చేస్తుంటారు. – కె.కరుణాకర్, మత్స్యశాఖ అధికారి, కాకినాడ -
AP: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కాకినాడ జిల్లా: గోదావరి నదిలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కొనసాగుతోంది. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కావడంతో గ్యాస్ నదిలో పొంగుతూ బుడగలుగా బయటకు వెళ్తుంది. లీకేజీని ఆపేందకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా లీకేజీ అదుపులోకి రావడం లేదు.యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది ముఖ ద్వారానికి సమీపంలో గ్యాస్ లీకేజీ కావడంతో గోదావరి, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకం కానుందని గ్యాస్ లీకేజీపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
పోలీసుల ముసుగులో దందా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారం వచ్చిందో లేదో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల ఆగడాలు మామూలుగా లేవు. అధికారం తమ గుప్పెట్లో ఉందనే ధైర్యం, తమ ప్రజాప్రతినిధుల అండదండలున్నాయనే బరితెగింపుతో ఆయా పార్టీల నేతలు చెలరేగిపోతూ దోపిడీలు, దౌర్జన్యాల కోసం నకిలీ పోలీసుల అవతారమెత్తుతున్నారు. నిజానికి.. రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన ప్రతీపైసా నాటి సీఎం వైఎస్ జగన్ డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా బ్యాంకు ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసేవారు. అదే సందర్భంలో తాము అమలుచేస్తున్న డీబీటీని చంద్రబాబు అండ్ కో దోచుకో, పంచుకో, తినుకోగా మార్చేస్తుందని జగన్ పదేపదే హెచ్చరించేవారు. అప్పుడు ఆయనన్నట్లుగానే ఇప్పుడు కూటమి నేతలు ఆ మాటలను నిజంచేసి చూపిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిని మించి మరొకరు దందాలు చేస్తున్న తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం నియోజకవర్గం మసకపల్లి గ్రామంలో తాజాగా చోటుచేసుకున్న ఇలాంటి ఘటనే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అక్కడ ఏం జరిగిందంటే..చౌకగా కొని.. ‘చీప్’గా కల్తీచేసి..పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో తక్కువ ధరకు లభించే వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లను కొందరు కూటమి నేతలు కొనుగోలు చేసి వాటి లేబుళ్లు, బాటిళ్లు మార్చి రామచంద్రాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీచేసి విక్రయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నియంత్రణలో ఉన్న ఈ అక్రమ మద్యం దందా.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతోంది. ఈ క్రమంలో.. మంగళవారం రాత్రి పామర్రు పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు జనసేన ద్వితీయ శ్రేణి నేతలు అరిశెట్టి మణికంఠ (అయ్యప్ప) మరొకరు యానాం మద్యాన్ని పామర్రు తరలిస్తున్నారు. విషయం తెలుసుకుని మసకపల్లి, ద్రాక్షారామ ప్రాంతానికి చెందిన టీడీపీ, జనసేన నేతలు రవ్వా భూషణం, సలాది శ్రీనివాస్ పాణింగపల్లి వద్ద మాటేశారు. అక్కడకు దగ్గర్లోనే కారు పార్కు చేశారు. అందులో నకిలీ పోలీసులు ఇద్దరిని ఖాకీ డ్రెస్సుతో కూర్చోబెట్టారు. యానాం నుంచి లిక్కర్ బాటిళ్లతో వచ్చిన జనసేన ద్వితీయశ్రేణి నేతలను అడ్డగించి, కారులో స్పెషల్ పార్టీ పోలీసులున్నారు.. మీ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని తెదేపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించడంతో ఇద్దరినీ కిడ్నాప్‌చేసి కారులో ఆ రాత్రి ద్రాక్షారామ తరలించారు. కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే పోలీసులు మా వెంటే ఉన్నారని, కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో కేసులకు భయపడి జనసేన ద్వితీయ శ్రేణి నేతలు రూ.25 వేలు చేతిలో పెట్టి మిగిలింది తరువాత చూస్తామని చెప్పడంతో వారిని విడిచిపెట్టారు. మణికంఠ అక్కడి నుంచి బయటపడి పామర్రు వచ్చేశాక వారిపై పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గత రెండ్రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు కూటమి నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పామర్రు ఎస్ఐ జానీబాషాను సంప్రదించగా ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
నీట మునిగిన యానాం
-
యానాం వద్ద భారీ అగ్నిప్రమాదం
-
యానాం: బోటులో మంటలు.. ఒకరు సజీవదహనం
సాక్షి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. యానాంలోని దరియాలతిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న వ్యక్తి సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం.. యానాంలో బోటు ప్రమాదం జరిగింది. దరియాలతిప్ప వద్ద బోటులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న గంగాద్రి అనే వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక, ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది నుంచి దరియాలతిప్పకు వచ్చినట్టు గుర్తించారు. -
రీజెన్సీ సిరామిక్స్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ గురువారం పునఃప్రారంభమైంది. కార్మికుల వివాదాల నేపథ్యంలో దశాబ్దంన్నర క్రితం యానాం రీజెన్సీ లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. రీజెన్సీ సిరామిక్స్‌ను తిరిగి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్లిష్టమైన డిజైన్లకు మారుపేరుగా నిలిచిన రీజెన్సీ సిరామిక్స్ తొలిసారి రీజెన్సీ నేచురల్ టైల్స్‌ను చెన్నయ్‌లో విడుదల చేసింది. రూ.70 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ నాలుగు టైల్స్ తయారీ లైన్లలో మొదటి దానిని ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. కంపెనీ మొదటి లైన్ రోజుకు 7 వేల చదరపు మీటర్లను ఉత్పత్తి చేయనుంది. దీనిని రోజుకు 25 వేల చదరపు మీటర్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అన్ని పరిమాణాలు, రకాలు, గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్, పాలి‹Ù్డ విట్రిఫైడ్ టైల్స్, డబుల్ చార్జ్డ్ టైల్స్, వాల్ టైల్స్, ఎక్స్టీరియర్ టైల్స్, స్టెప్స్, రైజర్లలో ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు. రీజెన్సీ ఉత్పత్తులను దేశంలోనే దక్షిణాది, తూర్పు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రీజన్సీ డైరెక్టర్ నరాల సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్నారు. రాజధాని నగరాలతోపాటు మిగిలిన నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. యానాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరి్థక వ్యవస్థ బలోపేతంలో రీజెన్సీ భాగస్వామ్యం వహిస్తుందని ఆయన చెప్పారు. -
యానాం రీజెన్సీకి పూర్వ వైభవం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ 11 ఏళ్ల తరువాత పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. 1985లో ఏర్పాటైన యానాం రీజెన్సీ 2012లో వివాదాల నేపథ్యంలో యాజమాన్యం లాక్ అవుట్ ప్రకటించింది. ఈ పరిణామంతో ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అప్పటినుంచి ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 50 వేల జనాభా గల యానాం అభివృద్ధిలో రీజెన్సీ సిరామిక్స్ పాత్ర ఎంతో ఉంది. 1980వ దశకంలో సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో జీఎన్ నాయుడు తదితరులు కలిసి ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా మంచిపేరు సంపాదించి 1986–87 వరకు సిరామిక్స్ టైల్స్‌ను విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అప్పట్లో ఈ ఫ్యాక్టరీలో రోజుకు 26వేల చదరపు అడుగుల మేర టైల్స్ ఉత్పత్తి చేసేవారు. రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమతో యానాం, దాని సరిహద్దున మన రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 6 వేల నుంచి 7 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. పరిశ్రమకు అనుబంధంగా సిరామిక్స్ టైల్స్ తయారీకి ఉపయోగపడే చిన్నతరహా పరిశ్రమలు, అట్టల తయారీ ఫ్యాక్టరీలను స్థాపించడంతో మహిళలకు ఉపాధి లభించింది. విధ్వంసం నేపథ్యంలో మూత వేతనాలు, పీఎఫ్ వంటి విషయాల్లో కార్మీక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో కార్మీకులు ఆందోళనకు దిగారు. కార్మీక సంఘ ప్రతినిధి మచ్చా మురళీమోహన్ యానాం పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. అనంతరం 2012 జనవరి 27న కొందరు దుండగులు సృష్టించిన విధ్వంసం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది.ఫ్యాక్టరీని తగులబెట్టి ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కె.చంద్రశేఖర్‌ను హత్య చేశారు. నాటి విధ్వంసంతో ఫ్యాక్టరీకి రూ.300 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిణామాలతో యాజమాన్యం ఫ్యాక్టరీని లాక్అవుట్ చేసింది. వేలాది మంది కార్మీకులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. కాగా.. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, రీజెన్సీ సీఎండీ గూడూరు నారయ్య నాయుడు, సీఈఓ, ఈడీ సత్యేంద్రప్రసాద్ తదితరులు మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలించి ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి యాజమాన్యం ముందుకొచ్చింది. వివాదానికి ముందు కార్మీకులకు చెల్లించాల్సిన సెటిల్మెంట్స్పై ఒక అంగీకారానికి వచ్చారు. ఫ్యాక్టరీకి సంబంధించి దనియాలతిప్పలో ఉన్న భూముల్లో కార్మీకులకు ప్లాట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అక్టోబర్ నెలలో తొలివిడత రూ.70 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని రీజెన్సీ సీఈవో సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద ధ్రువీకరించారు. మలి విడతలో 2025 మార్చి నాటికి మూడింతల రెట్టింపు ఉత్పత్తిని తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రెండు నెలల్లో పునఃప్రారంభిస్తాం విజయ దశమి సందర్భంగా పరిశ్రమను పునఃప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ కోసం గెయిల్‌ను అభ్యర్థించాం. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కూడా నివేదించాం. కార్మీకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో పనులు అప్పగించడమే కాకుండా సర్వీస్ కూడా చేస్తున్నాం. – డాక్టర్ గుడారు నారయ్య నాయుడు, సీఎండీ, రీజెన్సీ సిరామిక్స్ 11 ఏళ్ల కల నెరవేరుతోంది యానాంలో పారిశ్రామిక రంగం పూర్వవైభవానికి రీజెన్సీ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించడం దోహదం చేస్తుంది. యాజమాన్యం ముందుకు రావడం శుభపరిణామం. వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా ఆదాయం సమకూరుతుంది. – గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఎమ్మెల్యే, యానాం -
ప్రియుడి ఆత్యహత్య.. అతడి బాటలోనే ప్రియురాలు
తూర్పు గోదావరి: ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి తనువు చాలించారు. ఈ ఘటనతో యానాంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక(22)కు ఓ అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది. రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలోఉంది. గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం రూ.500 అడిగితే.. తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అప్పట్నుంచి మౌనిక కళాశాలకు వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ.. మానసిక కుంగుబాటుతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై ఎస్సై నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
యానాం - ఎదుర్లంక వారధి వద్ద ఉద్ధృతంగా గౌతమీ నది
-
పులస సీజన్ వచ్చేసింది.. రికార్డులు షురూ
సాక్షి, కాకినాడ: అత్యంత అరుదైన.. విలువైందిగా భావించే చేప ‘పులస’ సీజన్ మొదలైంది. యానాం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు లభ్యమవుతాయని తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లోకి మొదటి చేప వచ్చి.. మాంచి రేటుకే అమ్ముడుపోయింది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వారం తర్వాత మొట్టమొదటి పులస వలకి చిక్కిందట. రెండు కేజీల దాకా బరువు ఉన్న దీనిని రూ.15 వేల రూపాయలకు అమ్మినట్లు మహిళ చెబుతోంది. పులసల కోసం కాకినాడ, రాజమండ్రి నుంచే కాదు.. హైదరాబాద్ నుంచి కూడా జనం వస్తుంటారని సదరు మహిళ అంటోంది. దీంతో ఈ ఏడాది పులస గరిష్టంగా ఏ రేటుకు అమ్ముడుపోతుందో అనే ఆసక్తి నెలకొంది. గోదావరి జిల్లాల్లో ‘పుస్తెలు అమ్మినా సరే.. పులస తినాలి’ అని నానుడి. పులస చేప దొరకడమే చాలా అరుదు.. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. దీంతో ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు జనం వెనుకాడరు. పులసలు.. గోదావరి నదిలో మాత్రమే లభిస్తుంటాయి. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. -
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్‌కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్‌పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్‌పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్‌లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
తెలుగు అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి.. ముఖ్య అతిథిగా సుమ.. ఫొటోలు వైరల్..
తూర్పు గోదావరి: ఖండాలు దాటినా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను మరువలేదు ఆ కుటుంబం. ఫ్రెంచి జాతీయత కలిగిన వారిద్దరికీ తెలుగు సంప్రదాయ రీతిలో వివాహం ఘనంగా జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతం యానాం పట్టణానికి చెందిన చింతా వెంకట్ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం ఫ్రాన్స్ దేశంలో స్థిరపడ్డారు. చింతా వెంకట్, వేద దంపతుల కుమారుడు సుమంత్ ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే దేశానికి చెందిన యువతి క్లమెన్టైన్తో అతడికి వివాహం కుదిరింది. ఈ వివాహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో స్వస్థలం యానాంలో చేయాలని నిర్ణయించారు. దీంతో హిందూ సంప్రదాయ రీతిలో స్థానిక గాజుల గార్డెన్స్ కల్యాణ మండపంలో సుమంత్, క్లమెన్టైన్ల వివాహం ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. వధూవరులను యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు. -
అనుమానాస్పద స్థితిలో భార్య.. నిద్రమాత్రలు మింగి భర్త..
సాక్షి, యానాం: పట్టణ పరిధిలోని మెట్టకూరు గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక సాయికాలనీలో నివాసం ఉంటున్న వివాహిత దంగేటి లక్ష్మీభవాని(20) బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఆమె భర్త, ఆర్ఎంపీ వైద్యం చేసే దంగటి వరప్రసాద్ నిద్రమాత్రలు మింగడంతో అతను స్థానిక జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. యానాం మెట్టకూరు సాయికాలనీకి చెందిన దంగేటి వరప్రసాద్‌కు గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన లక్ష్మీభవానికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారై ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. మృతదేహాన్ని యానాం జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బడుగు కనకారావు తెలిపారు. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు వరప్రసాద్ తండ్రి సూర్యనారాయణ, తల్లి బేబీలే తన కుమారై లక్ష్మీభవాని మృతికి కారకులని మృతురాలి తల్లి అరుణ బుధవారం విలేకరుల వద్ద ఆరోపించింది. తన కుమారైను ముందుగా చంపేసి తరువాత ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని, ఆర్ఎంపీ వైద్యుడిగా ఉన్న వరప్రసాద్ స్లీపింగ్ టాబ్లెలెట్స్ మింగినట్లు నటిస్తున్నాడని ఆరోపించింది. అనుమానిస్తూ రోజూ తనను కొడుతున్నారని లక్ష్మీభవాని ఫోన్లో చెప్పేదని అయితే సర్దుబాటు చేసుకుంటారని భావించామని చెప్పింది. గొడవలపై పెద్దల సమక్షంలో ఇటీవల అంగీకారం కుదరడంతో మూడు నెలల క్రితమే గోకవరం మండలం కొత్తపల్లి నుంచి కాపురానికి తన కుమారై యానాం వచ్చిందని అంతలోనే ఘోరం జరిగిందన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. -
యానాం లో ఘనంగా మత్స్యకార దినోత్సవ వేడుకలు
-
యానంలో ‘జెట్టి’ హీరో సందడి
‘జెట్టి’సినిమా హీరో మాన్యం కృష్ణ యానంలో సందడి చేశాడు. ఈ శుక్రవారం ఉదయం ఆటకు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుతో ప్రేక్షకుల సమక్షంలో సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇటువంటి కథ లు తెరమీద కు తీసుకురావడం చాలా కష్టం. ఈ ప్రయత్నం చేసిన టీమ్ ని అభినందిస్తున్నాను. ఈ కథ లో చూపిన సమస్యలు చాలా మందికి బాధ్యతలను గుర్తు చేస్తాయి. ఈ సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ.. ‘జెట్టి సినిమా ని ఆదరిస్తున్న యానం ప్రాంత వాసులకు కృతజ్ఞతలు. తీర ప్రాంతాలలో జెట్టి సినిమా ఆదరణ పెరుగుతుంది. షోలు కూడా పెరుగుతుండటం చాలా ఆనందం గా ఉంది. మల్లాడి కృష్ణ రావు గారికి కృతజ్ఞతలు.మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ దక్కుతున్నందుకు ఆనందం గా ఉంది’అన్నారు. -
వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు
యానాం: ఎదుటివారికి సాయపడాలనే ఆలోచనతో మొదలు పెట్టిన ఆ కార్యక్రమం అయిదేళ్లుగా అవిచ్ఛినంగా సాగడమే కాక అభాగ్యులను ఆదుకుంటోంది. తమ పూర్వవిద్యార్థులు అనాథాశ్రమాలకు సహాయ పడాలనే ఆలోచనతో మొదలు పెట్టిన గుప్పెడు బియ్యం.. గుప్పెడు సాయం సేవా కార్యక్రమం నేటికీ కొనసాగిస్తూ రీజెన్సీ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి సేవానిరతి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా... ప్రతి బుధవారం ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యం తీసుకువచ్చి... కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి బుధవారం ఉదయం వచ్చేటప్పుడు తమ వెంట గుప్పెడు బియ్యాన్ని చిన్న పాటి బాక్సుల్లో తీసుకువస్తారు. తరగతి గదికి వెళ్లకముందే బియ్యాన్ని కళాశాల ఆవరణలో ఉంచిన ప్రత్యేకంగా తయారు చేయించిన పెద్ద డ్రమ్ములో వేస్తారు. ఆ విధంగా కళాశాలలో ఉన్న ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 530 మందితో పాటు 23 సిబ్బంది బియ్యాన్ని తీసుకువచ్చి మనం ఒకరికి సహాయపడుతున్నాం అనే భావనతో డబ్బాలో వేస్తారు. ఈ విధంగా 100 కేజీలు అయిన తర్వాత ఆ బియ్యాన్ని వివిధ అనాథ ఆశ్రమాలకు సంచుల్లో అందిస్తున్నారు. దాదాపు రెండు వారాల్లోనే డబ్బా నిండిపోతుంది. దీంతో రెండువారాలకు వచ్చే బియ్యాన్ని అనాథలకు, ఎవరూ ఆధారంలేని అభాగ్యులకు అందిస్తున్నారు. వీటిని స్వయంగా విద్యార్థులే తీసుకువెళ్లి అందించడం గమనార్హం. 2017లో ప్రారంభం విద్యార్థులకు సేవాభావాన్ని, నైతికతను, సామాజిక విలువలను తెలియజేయాలనే ఆలోచనతో 2017లో గుప్పెడు బియ్యం..గుప్పెడు సహాయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మార్తాండప్రసాద్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సరెళ్ల వీరకుమార్, పీఈటీ సోమేష్, అధ్యాపక సిబ్బంది విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉంటున్నారు. మా వంతు తోడ్పడుతున్నాం అభాగ్యులకు తోడ్పాలనే ఆలోచనతో మేమంతా గుప్పెడు బియ్యాన్ని తీసుకువస్తున్నాం. ఈ కార్యక్రమం మా పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. దీనిని అవిఘ్నంగా కొనసాగిస్తూ సేకరించిన బియ్యాన్ని అనాథాశ్రమాలకు అందిస్తూ మా వంతు తోడ్పడుతున్నాం. – ఎం.అరవింద్, పి.మురళీకృష్ణ, ఎస్.సూర్య, సీహెచ్ అవినాష్‌రెడ్డి (రీజెన్సీ ఇంటర్ విద్యార్థులు) అయిదేళ్లుగా నిరాటంకంగా సమాజంలో పేదలకు విద్యార్థులు ఏవిధంగా సహాయపడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. సహాయపడే విధానాన్ని విద్యార్థులకు నేర్పాలి అనే అధ్యాపకుల ఆలోచనతో ఇది మొదలయ్యింది. అయిదేళ్లుగా నిరాటంకంగా సాగుతోంది. –మార్తాండప్రసాద్, ప్రిన్సిపాల్, రీజెన్సీ కళాశాల -
బ్యాంక్ మేనేజర్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్.. మచిలీపట్నంలో ఏం జరిగింది?
యానాం: యూకో బ్యాంకు మేనేజర్ విస్సాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) ఆత్మహత్య ఘటన నేపథ్యంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్‌లో బ్యాలెన్స్ షీట్లో రూ.29 లక్షలు తక్కువగా వుందని, ఆ సొమ్మును ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ అనధికారికంగా తీసుకున్నారని పేర్కొంటూ బుధవారం యానాం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బడుగు కనకారావుకు అసిస్టెంట్ మేనేజర్ కోమలి, క్యాషియర్ విమలాజ్యోతి ఫిర్యాదు చేశారు. మంగళవారం తాము బ్రాంచ్ తెరిచేటప్పటికి కంప్యూటర్ నగదు తక్కువగా చూపిందని పేర్కొన్నారు. ఆ కోణంలో బ్యాంకు ఉన్నతాధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. బ్రాంచ్‌లో ఉన్న రికార్డుల తనిఖీ, ఆడిటింగ్ సైతం చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో రుణ గ్రహీతల అప్పులు తీర్చేందుకు.. మచిలీపట్నం బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసేటప్పుడు ఇచ్చిన రుణాలను సంబంధిత రుణగ్రహీతలు తీర్చకపోవడంతో తానే బ్యాంకు నిబంధనల ప్రకారం తీర్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురి దగ్గర మేనేజర్ శ్రీకాంత్ అప్పులు చేసినట్టు, వాటికి వడ్డీలు సైతం కడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యానాం బ్రాంచ్‌లో ఘటన చోటు చేసుకుంది. మా ఒత్తిడి లేదు యానాం యూకో బ్రాంచ్ మేనేజర్‌పై రుణాల రికవరీ కోసం బ్యాంకు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమని ఆ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ మృతికి చింతిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బ్యాంకు లావాదేవీలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
ఓ దౌర్భాగ్యుడి క్రూరత్వం.. తల్లిని తన్ని.. పీకపై కాలితో తొక్కి..
యానాం: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిపై మద్యానికి బానిసైన కన్న కొడుకు అతి క్రూరంగా వ్యవహరించాడు. పింఛను డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంకా ఇవ్వాలంటూ ఆమెను తలపై కాలితో తన్నుతూ.. చివరకు కాలితో పీకపై తొక్కి హత్యయత్నానికి ఒడిగట్టాడు. ఆమెను కొడుతున్న ఘటనను పక్కింటి వారు సెల్‌ఫోనులో చిత్రీకరించడంతో ఈ దారుణం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి మొదటి కుమారుడు సుబ్బారావు, మనవడు ఉమామహేశ్వరరావు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం ఉప్పర్ల కాలనీకి చెందిన తల్లిబోయిన లక్ష్మి(75)కు ముగ్గురు కుమారులు. భర్త సుబ్బారావు రెండేళ్ల కిందట మృతి చెందాడు. మూడో కొడుకు రాములు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇటీవల ఐదు నెలల పాటు లక్ష్మి అతడి వద్ద ఉంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత రెండు నెలల పాటు మొదటి కుమారుడు సుబ్బారావు వద్ద ఉంది. రెండో కుమారుడు వెంకన్న వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మికి వృద్ధాప్య పింఛను రూ.2,500 వస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిని తన ఇంటి వద్ద ఉంచుకుని చూసుకుంటానని వెంకన్న ఇటీవల పల్లిపాలెంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే మద్యానికి బానిసైన వెంకన్న తల్లి లక్ష్మిని తరచూ కొడుతూండేవాడు. ఆదివారం పూటుగా తాగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తనకు డబ్బులివ్వాలంటూ తల్లిని ఇంట్లోంచి ఈడ్చుకుంటూ బయటపడేశాడు. చదవండి: (కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే) కాలితో తన్నుతూ, విచక్షణారహితంగా పీకపై కాలితో అనేకసార్లు తొక్కాడు. అడ్డుకుంటే తమను కూడా కొడతాడన్న భయంతో చుట్టుపక్కల వారు ప్రేక్షక పాత్ర వహించారు. చివరకు అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె మెదడులో రక్తస్రావం జరిగిందని, స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. తల్లిపై తనయుడు చేసిన దాడి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు గొల్లపాలెం ఇన్చార్జి ఎస్సై వాసు సోమవారం యానాం జీజీహెచ్‌కు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితురాలు లక్ష్మికి పండ్లు ఇచ్చారు. నిందితుడు వెంకన్నను అదుపులోకి తీసుకున్నామని, అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
యానాం: క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. యానాంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అలా.. గవర్నర్ ఇలా.. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ వల్లే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు సంభవించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. విదేశాలే ఈ కుట్ర చేసి ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు గవర్నర్ తమిళిసై మాట్లాడటం గమనార్హం. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 51.8అడుగులకు చేరింది. ఎగువ నుంచి 13 లక్షల 50వేలు క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వస్తోంది. భద్రాచలం టౌన్‌లోని ముంపునకు గురైన కాలనీలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికీ రామాలయం పురవీధులు చెరువులను తలపిస్తున్నాయి. 53 అడుగుల లోపు వచ్చిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి తెలిపారు. చదవండి: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు -
యానాంలో వరద ఉధృతి
కాకినాడ జిల్లా: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి. నడుం లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యానాంలోని ఓల్డేజ్ హోం వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు బాధితులకు ఆహారం, త్రాగునీరు, కొవ్వొత్తులను స్థానికంగా ఉన్న నేతలు సరఫరా చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత మండలాలలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జోగి రమేష్, హోం మంత్రి తానేటి వనిత, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌లు విస్తృతంగా పర్యటించారు. పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో పర్యటించిన మంత్రులు.. అన్నంపల్లి ఆక్విడెక్ట్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. దీనిలో భాగంగా అమలాపురంలో వరద సహాయక చర్యలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఇందులో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాక్షిటీవీ బృందం సాహస యాత్ర ఏలూరు జిల్లా: గోదావరి వరదలో మునిగిన గ్రామాలను సాక్షిటీవి బృందం సందర్శించింది. నాటుపడవ, లాంచీలలో ప్రయాణం చేసి.. గోదావరి ప్రధాన ప్రవాహం మీదుగా కొండల్లోకి వెళ్లారు. గత వారం రోజులుగా కొండల మీద తలదాచుకున్న వారిని సాక్షి బృందం కలిసింది. చిగురుమామిడి, నాళ్లవరం, బోళ్లపల్లి, కన్నాయిగుట్ట గ్రామాల్లో సాక్షిటీవి బృందం పర్యటించి వారి కష్టాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఇప్పటివరకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారపదార్ధాలను ప్రభుత్వం వారికి అందించింది. ప్రత్యేక లాంచీలో నిత్యావసర వస్తువులను అధికారులు పంపించారు. -
సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి: నిర్మాత బన్నీ వాసు
‘‘కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రతి ఒక్కరూ జీరో నుంచి మళ్లీ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఒక సినిమా మొదలు పెట్టడం గొప్ప విషయం’’ అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రానికి ‘యానం’ అనే టైటిల్ ఖరారు చేశారు. షేక్స్పియర్ రచనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణాకర న్ దర్శకుడు. కేఎస్ఐ సినిమా అన్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ బ్యానర్ లోగోను బన్నీ వాసు, ‘యానం’ టైటిల్ లోగోను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ–‘‘నేను దర్శకత్వం వహించిన నాటకాలు, యాడ్ఫిల్మ్స్కు కరుణాకరన్ వర్క్ చేశాడు. ‘యానం’ తో దర్శకునిగా తను మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్‌గారు తొలిసారి నిర్మిస్తున్న ‘యానం’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అన్నకి థ్యాంక్స్’’ అన్నారు కరుణాకరన్. -
క్రికెట్ బెట్టింగ్...ఏడుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలోని యానాం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రధాన బుకీ సీహెచ్ సాయిరామ్ వర్మ పరారీలో ఉండగా.. ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డిలతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన తన్నీరు నాగరాజు 2016లో క్రికెట్ బెట్టింగ్ కేసులో వనస్థలిపురం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. మెయిన్ బుకీ సాయిరామ్ వర్మతో చేతులు కలిపి హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్స్ మొదలుపెట్టాడు. తన స్నేహితుడైన కృష్ణా జిల్లా, చింతకుంటపాలెం గ్రామానికి చెందిన గుండు కిశోర్‌ను రెండు నెలల పాటు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయాలని ఇందుకు నెలకు రూ.50వేల కమీషన్ ఇస్తానని చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. తన బంధువులైన ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తన్నీరు అశోక్, చెమ్మేటి వినోద్‌లను సబ్ బుకీలుగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలో వినోద్ ఇంట్లో బెట్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మ్యాచ్ మొదలు మూడు లైన్ల ద్వారా సబ్ బుకీలు పందేలు కాసే పంటర్లకు ఆన్లైన్లో లింక్‌లు పంపేవారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి పంటర్లు రూ.10–50 వేల మధ్య పందేలు కాస్తుంటారు. ప్రతి బెట్టింగ్‌కు సబ్ బుకీలు రేటింగ్స్ ఇస్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాక.. ఏ పంటర్ల నుంచి ఎంత సొమ్ము వసూలు చేయాలి, ఎంత చెల్లించాలో బుకీలు ఏజెంట్లకు సూచిస్తారు. మొత్తం లాభంలో సబ్ బుకీలకు 3 శాతం కమీషన్‌గా ఇచ్చేవారు. ఆన్లైన్లో పందేలు కాసేవారి కోసం సాయిరామ్ వర్మ ‘రోమన్ క్యాథలిస్ట్ కులమదై స్వామి’ అనే పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్‌లో నకిలీ ఖాతాను తెరిచాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు.. సత్యానగర్ కాలనీలోని స్థావరంపై దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సబ్ బుకీలు నాగరాజు, కిశోర్, అశోక్, వినోద్‌లతో పాటు పంటర్లు చైతన్యపురీకి చెందిన కోట్ల దినేష్ భార్గవ్, కొత్తపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్, శంకర్‌పల్లికి చెందిన బోజన రాజులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11.80 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.31,17,576 సొమ్ముతో పాటు 9 ఫోన్లు, కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు) -
పట్టపగలు దారుణ హత్య.. యానాంలో కలకలం
యానాం(తూర్పు గోదావరి): పట్టపగలే ఓ వ్యక్తి హత్యకు గురవడం యానాంలో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని గోపాల్ నగర్ మోకా వారి వీధికి చెందిన మోకా వెంకటేశ్వరరావు (57)ను ఆయన ఇంట్లోనే ఓ దుండగుడు శనివారం కత్తితో దాడిచేశాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు కారులో హుటాహుటిన యానాం జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. మధ్యాహ్నం తాను బయటకు వెళ్తున్నప్పుడు కాజులూరు మండలానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నారాయణస్వామి తమ ఇంటికి వచ్చాడని హతుని కుమారుడు ఆనందమూర్తి పోలీసులకు చెప్పాడు. అతడే తన తండ్రిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. నారాయణస్వామి వద్ద వెంకటేశ్వరరావు గతంలో అప్పు తీసుకున్నట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నారాయణస్వామి పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. ఈ సంఘటనపై ఎస్సై నందకుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ జీజీహెచ్‌లో సందర్శించారు. హతుని కుమారుడు ఆనందమూర్తిని ఓదార్చారు. ఎస్పీ బాలచంద్ర, సీఐ అర్విసెల్వంలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
విందుకు వెళ్తుండగా మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్
యానాం: ఆనందంగా ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై వెళుతున్న ఆ కుటుంబాన్ని స్కార్ఫ్ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఆ మహిళ ధరించిన స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకు పోవడంతో ఆమె కింద పడటంతో తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. గురువారం కాట్రేనికోన మండలం పల్లంకు చెందిన దంపతులు పాలెపు లక్ష్మణ్, పాలెపు దుర్గ (25) యానాం శివారు సావిత్రినగర్‌లో బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై తమ మూడేళ్ల కుమారైతో వెళ్తున్నారు. మార్గమధ్యలో దొమ్మేటిపేట ఇసుక కాలువ వద్దకు వచ్చేసరికి దుర్గ ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుపోయింది. దీంతో బైక్ అదుపుతప్పి ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరిన ఆమెను స్థానికులు యానాం జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ దుర్గ మృతిచెందింది. భర్త లక్ష్మణ్‌కు, కుమారైకు స్వల్ప గాయాలయ్యాయి. యానాం ట్రాఫిక్ ఎస్సై కట్టా సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకూ ఇక నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకం వర్తించనుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం తూర్పు గోదావరి జిల్లాకు మధ్యలో ఉంటుంది. అక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు వారికి కూడా వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్ రైతు భరోసా లబ్ధి అందనుంది. యానాంకు చెందిన 865 మంది రైతులకు ఏపీలో వ్యవసాయ భూములున్నాయి. ఒక్కొక్కరికీ రైతు భరోసా కింద రెండు విడతల్లో రూ.7,500 జమ చేయనున్నారు. మొదటి విడతగా మే 13న ఆంధ్ర ప్రాంత రైతులతో పాటు రూ.5,500 వేల చొప్పున ఆ రైతులకూ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందంగా ఉంది నాకు యానాంలో ఐదెకరాలుంది. ఆంధ్రా పరిధిలో రెండెకరాలుంది. వైఎస్సార్ రైతు భరోసాకు గతంలో దరఖాస్తు చేశా. ఆధార్ కార్డు యానాం అడ్రస్‌తో ఉండడంతో నాన్ రెసిడెంట్ అంటూ రైతు భరోసా వర్తింప చేయలేదు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా వర్తింప చేయాలని నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది. – కోన సత్తియ్య, రైతు, యానాం సీఎం కీలక నిర్ణయంతో.. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం రైతులకు ఏపీలో పలుచోట్ల భూములున్నాయి. స్థానికంగా నివసించని కారణంగా వారికి వైఎస్సార్ రైతు భరోసా వర్తించదు. అయినప్పటికీ వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చెందిన 865 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ చదవండి: ఏపీ: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి -
మంత్రి విశ్రాంతి ప్రకటన.. ప్రజలు కన్నీటి పర్యంతం
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉద్వేగానికి లోనయ్యారు. తాను విశ్రాంతి తీసుకోదలచినట్టు ఆయన చేసిన ప్రకటనతో యానం వాసులు కన్నీటి పర్యంతం అయ్యారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. యానం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు అందరికి సుపరిచితులే. కాంగ్రెస్‌కు చెందిన ఈ నేత 25 ఏళ్లుగా యానం ప్రజలతో మమేకం అయ్యారు. వరస విజయాలతో దూసుకొచ్చిన ఆయన యానం ప్రజల కోసం పదవిని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని చాటారు. ఆ దిశగా ఇటీవల తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదన్న ప్రకటన వెలువడింది. ఇందుకు తగ్గట్టుగా ఆదివారం యానం అయ్యన్నగర్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన మల్లాడి కృష్ణారావును రాజకీయాల్లో ఉండాల్సిందే, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ప్రజలు కన్నీటి పర్యంతంతో విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రజలు, మద్దతుదారులు కన్నీటిపర్యంతంతో విజ్ఞప్తి చేయడంతో ఉద్వేగానికి లోనైన మల్లాడి రుమాలతో పలుమార్లు చెమరిన కళ్లను తడుచుకోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతూ తాను నిర్ణయం తీసుకున్నానని, తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరూ రారని స్పష్టం చేశారు. తనకు విశ్రాంతి కావాలని, దయ చేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మనలో ఒకర్ని ఎంపిక చేసి, పుదుచ్చేరి అసెంబ్లీకి పంపుదామని పిలుపునిచ్చారు. ఆ ఒకరు ఎవరో ప్రజలు చెప్పాలని, యానం అభివృద్ధిని కాంక్షించే ఆ వ్యక్తికి సంపూర్ణ మద్దతుఇద్దామన్నారు. తాను ఎక్కడికి వెళ్లనని, ఇక్కడే ఉంటానని ప్రజలకు నచ్చచెప్పారు. -
మంగళవాయిద్యాలు మోగాల్సిన చోట మృత్యుపంజా
‘ఆకాశమంత పందిరి...భూదేవంత పీట వేద్దామా...పెళ్లి బాజాలు మారుమోగిపోవాలి...విద్యుత్తు కాంతులు ధగధగలాడాలి... పెద్ద ఎత్తున బంధువులను పిలవాలి ... వారికి పెట్టే భోజనాలు కొన్నేళ్లపాటు గుర్తుండిపోవాలి...కల్యాణ మండపం కొత్తకాంతులీనాల’ంటూ ఆ క్షణం వరకూ సంబర పడిన చోట తీవ్ర విషాదం అలముకుంది. ఈ సందడికి కారణమైన వరుడితోపాటు తల్లిదండ్రులను మృత్యువు జలసమాధి చేసింది. నిశ్చితార్థానికి గుర్తుగా కొనుగోలు చేసిన కొత్తకారే మృత్యుకుహరంగా మారింది. కట్టిన మామిడి తోరణాలు వాడకముందే ఆ ఇంట చావుబాజా మోగాల్సి వచ్చింది. పెళ్లికుమార్తె ఇంట ఆ యువకుడి నిశ్చితార్థం ఎంతో ఆనందంగా జరిగింది. అనంతరం కోలాహలంగా జరిగిన ఆ వేడుకకు గుర్తుగా వరుడి తల్లిదండ్రులు కారు కొనుగోలు చేశారు. పెళ్లికుమారుడితో కలిసి తల్లిదండ్రులిద్దరూ ఆ కారులోనే ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. ఊహించని విధంగా ఆ కారే వారి పాలిట మృత్యుశకటమైంది. మార్గం మధ్యలో అదుపు తప్పి ఓ మంచినీటి చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ ఇంటివాడు కావాల్సిన ఆ యువకుడితో పాటు అతడి తల్లిదండ్రులూ జలసమాధి అయ్యారు. మరికొన్ని రోజుల్లో పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట ఈ సంఘటన పెనువిషాదాన్ని నింపింది. సాక్షి, కె.గంగవరం/యానాం: జీవిత పయనంలో కీలక మలుపు అయిన వివాహ క్రతువులోని ప్రతి ఘట్టం కడదాకా ఓ మధురానుభూతిగా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ యువకుడూ అలానే కోరుకున్నాడు. కానీ, అతడిపై విధి చిన్నచూపు చూసింది. మృత్యువు పంజా విసిరింది. నిశ్చితార్థం జరిగిన కొద్ది గంటల్లోనే కని, పెంచిన తల్లిదండ్రులు సహా అతడు, మృత్యుకౌగిట్లోకి ఒరిగిపోయాడు. నిశ్చితార్థానికి గుర్తుగా కొనుకున్న కొత్త కారే వారి జీవితాలకు జలసమాధి కట్టేసింది. ఆనందంగా ఇంటికి చేరుకొని, పెళ్లి పనుల్లో మునిగిపోవాల్సిన వారు.. అయినవారికి మృత్యువేదనను పంచి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నిశ్చితార్థ వేడుక సందర్భంగా ఇంటి వద్ద అలంకరించిన పూలు ఇంకా వాడిపోకముందే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఆ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు, చూసిన వారి గుండెలను పిండేసిన ఈ విషాద సంఘటన కె.గంగవరం మండలం కోట గ్రామంలో చోటు చేసుకుంది. చదవండి: (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి) యానాం పట్టణానికి చెందిన కామవరపు సత్యప్రసాద్ (63) విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన భార్య కామవరపు విజయలక్ష్మి (61) స్థానిక ఎస్టీపీపీ ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పని చేసి గత సంవత్సరం రిటైరయ్యారు. యానాం సీబీఎస్ పాఠశాల రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రశాంత్ హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు వివాహమైంది. చిన్నకుమారుడు ప్రణీత్‌చంద్ర (32) బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజోలు బ్రాంచిలో క్రెడిట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు ఇటీవల రాజమహేంద్రవరానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం జరిగిన నిశ్చితార్థానికి సత్యప్రసాద్ దంపతులు, ప్రణీత్‌చంద్ర రాజమహేంద్రవరం వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రశాంత్ కూడా వచ్చారు. నిశ్చితార్థం అనంతరం ప్రశాంత్ విమానంలో తిరుగుపయనమయ్యారు. ఈ సంఘటన జీవితంలో గుర్తుగా ఉండాలన్న కోరికతో సత్యప్రసాద్ దంపతులు కొత్త కారు కొనుగోలు చేశారు. అనంతరం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ వద్ద పని చూసుకున్నారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆ దంపతులు, వరుడు ప్రణీత్‌చంద్ర కలిసి రావులపాలెం సమీపంలోని జొన్నాడ మీదుగా ఏటిగట్టు రోడ్డులో కొత్తగా కొన్న కారులో బయలుదేరారు. ముందు సీట్లలో తండ్రీ కొడుకులు, వెనుక సీటులో విజయలక్ష్మి కూర్చున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా మరో గంటలో ఇంటికి చేరుకుంటామని చెప్పారు. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..) కోటిపల్లి – కోట ఏటిగట్టు రహదారిలో కోట గ్రామం మంచినీటి చెరువు వద్ద ఉన్న పెద్ద మలుపులో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఒక్కసారిగా పల్టీలు కొడుతూ చెరువులో దూసుకుపోయింది. కారు పల్టీ కొట్టే సమయంలో వెనుక డోర్ తెరచుకోవడంతో అందులో ఉన్న విజయలక్ష్మి ఎగిరి చెరువులో పడిపోయారు. సత్యప్రసాద్, ప్రణీత్‌చంద్ర కారులో నుంచి బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయి, ఒకరిని ఒకరు పట్టుకుని, కూర్చున్నచోటే జలసమాధి అయ్యారు. మరో గంట తరువాత కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అందుబాటులో లేదని సమాచారం వచ్చింది. దీంతో వారికి అనుమానం వచ్చి, వీరి ఆచూకీ కోసం ప్రయత్నించారు. రాత్రి మూడు గంటల సమయంలో కోటిపల్లి నుంచి కోట వరకూ గాలించగా మంచినీటి చెరువులో కారు కనిపించింది. వెంటనే వారు 100కు ఫోన్ చేశారు. ద్రాక్షారామ ఎస్సై ఎన్.రామకృష్ణ చేరుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును, మృతదేహాలను వెలికి తీశారు. సంఘటన స్థలంలోనే శవపంచనామా చేసి, మృతదేహాలను బంధువుల సమక్షంలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్సీ బాలాచంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దారి తప్పి.. కోటిపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే వంతెన వద్దకు వచ్చేసరికి వీరు దారి తెలియక ఏటిగట్టుపై కాకుండా పాత ఇసుక ర్యాంపునకు వెళ్లే మార్గంలోకి వెళ్లారు. రైల్వేకు చెందిన ప్రైవేటు వాచ్‌మన్‌తో పాటు అక్కడున్న వారు గమనించి, కారును ఆపి ఆ దారిలో వాహనాలు వెళ్లవని పైనుంచి వెళ్లాలని చెప్పారు. దీంతో వారు కారును వెనక్కి తిప్పి, వారు గట్టుపై నుంచి వెళ్లారు. అక్కడి నుంచి మరో 10 నిమిషాలు ప్రయాణించగానే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. సీట్ బెల్ట్ వేసుకోవడం వల్లనే ప్రణీత్ బయటకు రాలేకపోయాడని, లేకపోతే వారిని రక్షించేవాడని సంఘటన స్థలానికి వచ్చిన పలువురు చెప్పారు. -
ఘోర ప్రమాదం: తల్లిదండ్రులు, కొడుకు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కోటిపల్లి- యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం కోట గ్రామం వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ, ఆయన భార్య , రిటైర్డ్ లెక్చరర్ విజయలక్ష్మి, కుమారుడు ప్రణీత్‌గా గుర్తించారు. కాకినాడ నుంచి యానాం వస్తుండగా తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి: వివాహితను బలిగొన్న వివాహేతర సంబంధం) -
ఇదో ‘ఫ్రెంచి’ బంధం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాటి మాట. యానాంలో 137 ఏళ్ల పాలనను ఫ్రెంచి పాలకులు విడిచి వెళుతున్న రోజులవి. అప్పుడు యానాంలో సుమారు ఏడెనిమిది వేల మంది ఉంటారు. ఫ్రెంచి పాలకులు యానాంలో ఉన్న పౌరులను ‘ఫ్రెంచి పౌరసత్వం తీసుకుంటారా, భారతీయ పౌరులుగా కొనసాగుతారా?’ అని అడిగారు. ఫ్రెంచి పౌరసత్వం తీసుకుంటే భారత్‌తో విడిపోయాక ఆ దేశానికి పంపేస్తారనే భయంతో 90 శాతం మంది ఫ్రెంచి పౌరసత్వానికి వెనుకాడారు. ధైర్యం చేసిన 15 కుటుంబాలు ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నాయి. ఆ 15 కుటుంబాలే ఇప్పుడు యానాంలో 50 కుటుంబాలయ్యాయి. వీరి ద్వారా మరో 200 కుటుంబాలు ఫ్రాన్స్‌లో స్థిరపడ్డాయి. ఆరు దశాబ్ధాలుగా (1954 నుంచి) యానాం, ఫ్రెంచి కుటుంబాల మధ్య ఆత్మీయత, అనుబంధాలు నేటికీ చెక్కు చెదరలేదు. యానాంలో ఉన్న ఫ్రెంచి పౌరులను, ఫ్రాన్స్‌లో స్థిరపడిన యానాం ఫ్రెంచి పౌరులను ‘సాక్షి’ పలకరించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఫ్రెంచి పౌరసత్వం ఉంటే చాలు నాడు ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్న కుటుంబాల భవిష్యత్తు బంగారమైంది. 65 ఏళ్లు దాటితే ఫ్రెంచి పౌరుడికి ‘సెక్యూర్’ పథకం ద్వారా 900 యూరోలు (సుమారు రూ.75 వేలు) పెన్షన్ వస్తుంది. వృద్ధులను సాకే అటెండెంట్‌కు 550 యూరోలు (రూ.50 వేలు), ఇంటి అద్దెలో 50 శాతం, 25 సంవత్సరాలు దాటితే నిరుద్యోగ భృతి 550 యూరోలు (సుమారు రూ.50 వేలు) ఇస్తారు. ఫ్రెంచి పౌరసత్వం కలిగి, ఆ దేశంలో కనీసం ఆరు నెలలైనా ఉంటేనే వీటన్నింటికీ అర్హులు. ఫ్రెంచి పౌరసత్వం ఉన్న వారు ప్రపంచంలోని 129 దేశాలతో పాటు 24 యూరోపియన్ యూనియన్ దేశాలను వీసా లేకుండా చుట్టిరావచ్చు. ఆత్మీయత, అనుబంధాలకు ప్రతిరూపం స్థానికులతో యానాంలోని ఫ్రెంచి పౌరులు ఆరు దశాబ్దాలుగా విడదీయరాని అనుబంధాన్నే కొనసాగిస్తున్నారు. జూలై 14న ఫ్రెంచి జాతీయ దినోత్సవం. నవంబరు 11 ఫ్రెంచి పాలకులు యానాం విడిచిపెట్టి వెళ్లిపోయిన రోజును, మన పండగలను యానాం ప్రజలు, యానాంలోని ఫ్రెంచి పౌరులు కలిసే జరుపుకోవడం విశేషం. రోమన్ కేథలిక్ చర్చికి ప్రతి ఆదివారం హిందువులూ వెళుతుంటారు. యానాంకు చెందిన దవులూరి చంద్రశేఖ ర్, ఫ్రెంచి యువతి షావలోత్ భారతీయ సంప్రదాయంలో 2018 లో పెళ్లిపీటలు ఎక్కారు. యానాంలోనూ ఈఫిల్ టవర్ నిర్మించి ఇరు ప్రాంతాల మధ్య విడదీయరాని బంధాన్ని చాటిచెప్పారు. యానాంలో ఫ్రెంచి పాలన 1750లో హైదరాబాద్ నిజాం నవాబు ముజఫర్ జంగ్ ఫ్రెంచి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. మూడుసార్లు బ్రిటిషు వారి చేతిలోకి వెళ్లిన యానాం.. 1817లో చివరిగా ఫ్రెంచి వారి ఆధీనంలోనికి వెళ్లింది. యానాం సుమారు 137 ఏళ్లు ఫ్రెంచి పాలనలో ఉంది. 1954లో ఫ్రెంచి పాలన నుంచి బయటపడి, స్వాతం త్య్రం పొంది పుదుచ్చేరిలో భాగమైంది. ఫ్రెంచి పౌరసత్వంతో ఇక్కడున్న వారం దరూ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని చెన్నైలోని ఫ్రా న్స్ కాన్సులేట్ జనరల్ కా ర్యాలయంలో ఓటు వేస్తారు. భారతీయతను ప్రేమిస్తారు ఫ్రాన్స్ ఆర్మీలో పని చేసి 2015లో రిటైరయ్యా. ఎక్కువ కాలం ఫ్రాన్స్‌లో ఉండటంతో అక్కడి వారితో విడదీయరాని అనుబంధమేర్పడింది. భారతీయతను వారు ప్రేమిస్తారు. –దవులూరి మృచ్ఛి, మాజీ సైనికుడు, ఫ్రెంచి జాతీయుడు,యానాం ఫ్రెంచి పౌరుల యోగక్షేమాలు తెలుసుకుంటారు ఫ్రెంచి కాన్సులేట్ జనరల్ నేరుగా మాట్లాడి, యానాంలో ఉన్న ఫ్రెంచి పౌరుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. వారాంతపు నివేదికలు కాన్సులేట్ నుంచి తీసుకుంటారు. రిటైరై, ఇక్కడ ఉన్న వారి బాగోగులను నిశితంగా పరిశీలిస్తుంటారు. – సాధనాల బాబు, ఫ్రెంచి పౌరుల ప్రతినిధి, యానాం ఆరు నెలలు అక్కడ.. ఆరు నెలలు ఇక్కడ ఫ్రాన్స్‌లో ఏళ్ల తరబడి నివసిస్తున్నా ఇక్కడి ఆచార సంప్రదాయాలను వీడలేదు. నాకు సెక్యూర్ స్కీమ్ ద్వారా ఫ్రెంచి ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ ఇస్తుంది. నా మనుమరాలు, మనువడుల చదువుకయ్యే ప్రతి పైసా ఫ్రెంచి ప్రభుత్వమే భరిస్తోంది. – సాధనాల అనసూయ, ఫ్రెంచి పౌరురాలు, యానాం -
యానాంలో టోర్నడో
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం తీరంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అమెరికాలో వచ్చేంత స్థాయిలో కాకపోయినా.. చిన్నపాటి టోర్నడో అరగంట పాటు ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. 11 ఎకరాల రొయ్యల చెరువుల్లోకి ప్రవేశించడంతో మోటార్లు, ఏరియేటర్స్, వలలు, బర్డ్ ఫెన్సింగ్, వివిధ నిర్మాణాలు నాశనమయ్యాయి. యానాం: అమెరికాలో ఏదో ఒకచోట నిత్యం సుడులు తిరుగుతూ విధ్వంసం సృష్టించే టోర్నడో కాకినాడ సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం తీరంలో అరగంట పాటు ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. సుడులు తిరుగుతూ.. ► యానాం శివారు అయ్యన్న నగర్, పరంపేట సముద్ర తీర గ్రామాల్లో శుక్రవారం విపరీతమైన వేగంతో సుడులు తిరుగుతూ బీభత్సం సృష్టించింది. ► తీరం నుంచి పక్కనే ఉన్న పెన్మెత్స సత్తిరాజు అనే రైతుకు చెందిన 11 ఎకరాల రొయ్యల చెరువుల్లోకి ప్రవేశించడంతో మోటార్లు, ఏరియేటర్స్, వలలు, బర్డ్ ఫెన్సింగ్‌లు ధ్వంసం అవడంతో భారీ నష్టం సంభవించింది. ► తీరాన్ని ఆనుకుని ఉన్న అయ్యన్న నగర్, పరంపేట, నీలపల్లి తదితర గ్రామాల్లోనూ కలకలం రేపింది. దీని ప్రభావంతో భారీ రేకుల పందిరి ఎగిరిపడింది. పలుచోట్ల ఇళ్ల ముందున్న కొబ్బరాకు దడులు, గుడిసెలు టోర్నడో సుడిగాలికి ధ్వంసమయ్యాయి. ► ఈ ప్రాంతంలో టోర్నడోలు గతంలో ఎప్పుడూ ఏర్పడకపోవడంతో చాలామంది మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ► యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా ఘటనా స్థలానికి వచ్చి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ► తూర్పు తీరంలో.. ఇది రెండో టోర్నడోగా చెబుతున్నారు. గత నెల 4న కాకినాడ తీరంలోని భైరవపాలెం ప్రాంతంలో సముద్రం వెలుపల 4 కిలోమీటర్ల దూరంలో తొలి టోర్నడో ఏర్పడింది. ► వేటకు వెళ్లిన మత్స్యకారులు తప్ప ఇతరులెవరూ దానిని చూడలేదు. టోర్నడోలు ఎందుకొస్తాయంటే.. ► టోర్నడోలను మధ్య అక్షాంశాలలో ఏర్పడే తీవ్రమైన సుడి గాలులుగా చెబుతారు. వీటిలో గాలి ఉత్తరార్ధ గోళంలో అపసవ్యంగా తిరుగుతుంది. ► పరిసర ఖండాల నుంచి వీచే చలి గాలి, సముద్రపు వెచ్చని గాలి కలిసినపుడు టోర్నడోలు ఏర్పడతాయి. ► మేఘాలు గరాటు ఆకారంలో ఏర్పడతాయి. ఒక్కోసారి భూమిని కూడా చేరుతాయి. వీటివల్ల విపరీతమైన నష్టం సంభవిస్తుంది. ► సాధారణంగా టోర్నడోలు ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మిస్సిసిపీ, మిస్సోరీ లోయల ప్రాంతాల్లో ఏర్పడుతుంటాయి. చైనా, జపాను తీరాలకు ఆవల కూడా ఇవి సంభవిస్తుంటాయి. -
యానాంలో అద్భుత దృశ్యం
-
యానాంలో అద్భుత దృశ్యం
తూర్పుగోదావరి జిల్లా యానాంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. మనకు పెద్దగా పరిచయం లేని టోర్నడో యానాంకు సమీపంలో చెరువుల వద్ద శుక్రవారం కనిపించింది. ఆకాశంతో భూమి కలిసిపోయిందా అన్నట్లుగా ఉన్న ఆ దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. తమ సెల్ ఫోన్లో బంధించడమే కాకుండా వైరల్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టోర్నడో వీడియో చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. (హృదయాన్ని తాకే వీడియో: నీళ్ల కోసం ఉడత..) -
‘హద్దు’ దాటి.. అక్రమ రవాణా
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: యానాంలోని బంకులకు గోకవరం గుమ్మళ్లదొడ్డిలోని స్టోరేజీ ట్యాంకుల నుంచి ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతోంది. ఒక్కో బంకు ప్రతి నెలా 2 లక్షల లీటర్ల డీజిల్, లక్ష లీటర్ల పెట్రోలు దిగుమతి చేసుకుంటున్నాయి. దీని ప్రకారం అక్కడున్న మొత్తం 11 బంకుల ద్వారా ప్రతి నెలా సుమారు 22 లక్షల లీటర్ల డీజిల్, 11 లక్షల లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రపాలిత ప్రాంతాల్లో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తక్కువగా ఉంటుంది. దీంతో పొరుగునే ఉన్న మన రాష్ట్రంతో పోలిస్తే యానాంలో పెట్రో ధరలు తక్కువ. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారులు అక్కడి పెట్రోల్ బంకుల నుంచి పెట్రోలు, డీజిల్‌ను అక్రమ మార్గాల్లో మన జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కిళ్లీ కొట్లు, రోడ్డు మార్జిన్లలో.. ఇటీవలి వరకూ యానాంలో పెట్రోలు, డీజి ల్ ధరలు మన జిల్లా కంటే లీటరుకు ఏడెనిమిది రూపాయలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం యానాంలో లీటర్ డీజిల్ రూ.76, పెట్రోలు రూ.80.34గా ఉంది. అదే యానాంకు ఆనుకుని మన జిల్లాలో ఉన్న తాళ్లరేవులో డీజిల్ ధర రూ.78.79, పెట్రోలు రూ.83.63గా ఉంది. కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను దాదాపు ప్రతి రోజూ పెంచుతోంది. ఈ నేపథ్యంలో యానాంలో కూడా పెట్రో ధరలు పెరిగాయి. అయినప్పటికీ మనకంటే రేటు తక్కువగానే ఉండడంతో.. పలువురు వ్యాపారులు అక్క డి బంకుల్లో కొనుగోలు చేసిన పెట్రోలు, డీజిల్‌ను కొంత లాభం వేసుకుని మన జిల్లా లోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ముఖ్యంగా కోనసీమలోని మురమళ్ల, ముమ్మిడివరం, మహిపాల చెరువు, అనాతవరం, క్రాప, భట్నవిల్లి, రామచంద్రపురం, మండపేట, కాకినాడ తదితర ప్రాంతాలకు వీటిని అక్రమంగా తరలించి అమ్ముతున్నారు. సోడా, కిళ్లీ దుకాణాల వద్ద, రోడ్డు మార్జిన్లలోను బహిరంగంగానే అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతి రోజూ తెల్లవారుజామున అటు కోనసీమ, ఇటు కాకినాడ, మరోపక్క రామచంద్రపురం ప్రాంతాల నుంచి మోటార్ సైకిళ్లపై వచ్చిన రిటైలర్లు పెద్దపెద్ద ప్లాస్టిక్ టిన్నులతో బారులు తీరి యానాంలో దర్శనమిస్తారు. ఒక్కో మోటార్ బైక్‌పై కనీసం 200 లీటర్ల పెట్రోలు తరలిస్తున్నారు. తీరప్రాంతాల్లో ఆక్వా చెరువుల్లో ఉపయోగిస్తున్న ఇంజన్ల కోసం కూడా భారీగా డీజిల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖాకీలకు కాసులు యానాం నుంచి జిల్లాకు పెట్రో ఉత్పత్తుల అక్రమ రవాణాను కట్టడి చేయడంలో జిల్లా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది పోలీసులు దీనిని కాసులు సంపాదించుకోవడానికి అవకాశంగా కూడా తీసుకుంటున్నారు. చెక్‌పోస్టుల్లో అందిన కాడికి జేబులో వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ అక్రమ రవాణా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పోలీసులకు కాసులు కురిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోలుతో వెళ్తున్న ఒక్కో వాహనదారు వద్ద రూ.200 నుంచి రూ.500 వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. యానాం బైపాస్, నీలపల్లి వంతెన, అరటికాయలంక, బాపనపల్లి సెంటర్, కాపులపాలెం, ఎదుర్లంక, అరటికాయలంక తదితర ప్రాంతాల్లో పోలీసులు ముడుపులు మెక్కి చమురు అక్రమ రవాణాదార్లను వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. 80 శాతం అక్రమంగా తరలింపు! పెట్రోలు బంకుల్లో జరుగుతున్న విక్రయాల ద్వారా ప్రతి నెలా వ్యాట్ రూపంలో యానాంకు రూ.5 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా. వాస్తవానికి యానాం పరి«ధిలోని వినియోగదారులు కొనుగోలు చేసే పెట్రోలు, డీజిల్ 20 శాతం కూడా మించదని చెబుతున్నారు. దీనినిబట్టి ప్రతి నెలా పన్ను రూపంలో వస్తున్న రూ.5 కోట్ల ఆదాయంలో ఆ ప్రాంతం నుంచి వస్తున్నది రూ.కోటి మాత్రమే. దీనిని తీసివేయగా మిగిలిన 80 శాతం అమ్మకాలు అక్రమ వ్యాపారం ద్వారానే జరుగుతున్నట్టు అంచనా. తద్వారా మన జిల్లా ప్రతి నెలా రూ.4 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నట్టు లెక్కలు కడుతున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని యానాం సరి‘హద్దు’ దాటకుండా పెట్రో ఉత్పత్తులకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. తనిఖీలు చేస్తున్నాం యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి పెట్రోలు, డీజిల్‌ను పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న 14 మందిని అరెస్టు చేసి ఐదు కేసులు నమోదు చేశాం. యానాం నుంచి పెట్రోలు, డీజిల్ అక్రమంగా తరలి రాకుండా యానాం చుట్టుపక్కల పకడ్బందీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. గట్టి నిఘా పెట్టి, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి పెట్రోలు, డీజిల్ తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – కరణం కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) -
సీఎం జగన్‌ను కలిసిన పుదుచ్చేరి మంత్రి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పుదుచ్చేరి ఆరోగ్య, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యానాంకు సంబంధించిన పలు అంశాలను ఆయన చర్చించినట్టు తెలిసింది. సీఎం జగన్ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని అభినందించారు. అనంతరం వివిధ అంశాలపై సీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచిన విషయం తెలిసిందే. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్) -
మంత్రి అసంతృప్తి.. గవర్నర్‌పై ఫిర్యాదు
సాక్షి, యానాం : కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదంటూ పుదుచ్చేరి గవర్నర్‌పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. తన ఆదేశాలను పట్టించుకోని యానాం అధికారుల తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆ ఏడుగురు యానాం వాసులను క్వారంటైన్ చేయకుండా ఉంటే పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి వైదొలుగుతానని మల్లాడి ప్రకటించారు. కాగా, మూడు రోజుల క్రిందట ఇతర ప్రాంతాల నుండి ఏడుగురు స్దానికులు యానాంకు వచ్చారు. వీరిని అధికారులు సరిహద్దు వద్దే నిలువరించారు. ఈ నేపథ్యంలో ఆ ఏడుగురిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించాలని మల్లాడి చేసిన ఆదేశాలను యానాం అధికారులు పట్టించుకోలేదు. దీంతో మంత్రి తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. చదవండి : లాక్డౌన్: గల్ఫ్ బాధితులకు శుభవార్త! -
దారుణం: భార్య, కన్నతల్లిపై కత్తితో..
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీ, భార్యపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటన యానాంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యానాం వంశీకృష్ణ కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోవటానికి వచ్చిన కన్నతల్లీపై కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ దాడిలో అత్తాకోడళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న యానాం పోలీసులు శ్రీనివాస్‌కోసం గాలిస్తున్నారు. చదవండి : ఫేస్బుక్ వీడియోపై కామెంట్లు చేసిందని.. -
నిరసనల మధ్య కిరణ్‌బేడీ యానాం పర్యటన
తూర్పుగోదావరి, యానాం: యానాం విచ్చేసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పర్యటన గురువారం ప్రజల నిరసనల మధ్య ప్రారంభమైంది. స్ధానిక ప్రభుత్వ అతిథి గృహం వద్దకు చేరుకున్న నియోజకవర్గ పరిధిలోని వందలాదిమంది ప్రజలు నల్లజెండాలు, బెలూన్లు, ధస్తులు ధరించి ఆమె పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారని, యానాం అభివృద్ధికి సంబంధించిన ఫైల్స్‌ను ఆమోదించకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఉచితబియ్యం పథకానికి సంబంధించి బియ్యం ఇవ్వడం లేదని, అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు నిలిపి వేశారని వారు ఆరోపించారు. పేదవర్గాలకు వ్యతిరేకంగా ఎల్జీ వైఖరి పేదవర్గాలకు వ్యతిరేకంగా ఎల్జీ కిరణ్‌బేడీ వ్యవహరిస్తున్నారని యానాం పర్యటన వల్ల ప్రజాసమస్యలు పరిష్కారం కాకపోగా, వేలాది రూపాయిల ప్రజాధనం ఆమె పర్యటకు, ఏర్పాట్లకు ఖర్చవుతున్నాయని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. గురువారం ఆయన çస్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహనిర్మాణాలు ఉన్నాయ ని చెబుతూ ఫ్రాన్స్‌తిప్ప, వెంకటరత్నం నగర్, అ య్యన్ననగర్, కురసాంపేట తదితర ప్రాంతాల్లోని భవనాలను తీసివేయాలని అన్యాయంగా ఎల్జీ ఆదేశాలు జారీ చేశారని వారికి విద్యుత్తు, తాగునీరు నిలుపుదల చేశారన్నారు. 2018లో యానాంకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైతే నిర్మాణ పనులు చేపట్టకుండా నిలిపివేశారని, రూ.137కో ట్లతో చేపట్టే వరద నియంత్రణ çపనులను నిలిపివేశారని ఆరోపించారు. జీఎస్పీసీ కంపెనీ ఇచ్చిన రూ.19 కోట్లు వేట నష్టపరిహారంలో రూ.10 కోట్లు పంపిణీ చేసి మిగతా రూ.తొమ్మిది కోట్లు ఇవ్వకుండా నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఆమె అనుకూలంగా మీడియాలో ప్రచారానికి 12 మందిని పుదుచ్చేరి నుంచి రప్పించుకున్నారని, ఆమెకు ఆమెతో వచ్చిన వారికి కాకినాడలో ఒక ఖరీదైన హోటల్లో బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.52వేలు ఖర్చయ్యిందని ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. -
పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, యానాం: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి కేంద్రపాలిత ప్రాంతం యానాం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కొమానపల్లిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సభ అనంతరం అక్కడి నుంచి గాడిలంక చేరుకుని, హెలికాప్టర్లో యానాంలోని రాజీవ్‌గాంధీ బీచ్ వద్దకు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఎస్పీ రచనాసింగ్ తదితర అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి సీఎం జగన్ కారులో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు గృహానికి చేరుకున్నారు. ఆయన్ను మంత్రి కృష్ణారావు సాదరంగా ఆహ్వానించారు. కృష్ణారావు తండ్రి సూర్యనారాయణ కాంస్య విగ్రహానికి సీఎం జగన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని మంత్రి మల్లాడి ఇతర మంత్రులతో సీఎం జగన్ సుమారు 1.15 గంటల పాటు భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాజీవ్ రివర్‌బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బారులు తీరిన జనం యానాం చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు వేలాది మంది జనం రోడ్డులకు ఇరువైపులా వేచి ఉన్నారు. ఆయన కారులో ప్రయాణించే సమయంలో జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఎం జగన్ సైతం కారు నుంచి వారికి రెండు చేతుల జోడించి అభివాదం చేశారు. ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కూడా ప్రజలు జేజేలు పలుకుతూ అమ అభిమానాన్ని చాటుకున్నారు. విస్తృత పోలీసు బందోబస్తు సీఎం జగన్ యానాం పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే రహదారులు, మంత్రి మల్లాడి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్, యానాం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయన పర్యటించే వీధులను తమ ఆ«దీనంలోనికి తీసుకున్నారు. -
తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో మత్స్యకారులకు పలు హామీలు ఇచ్చారు. వీటి అమలుకు సీఎం ఆ రోజు శ్రీకారం చుట్టనున్నారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ) కార్యకలాపాల ఫలితంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆ సంస్థ ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం జరగడంతో.. ఆ మొత్తాన్ని తమ ప్రభుత్వమే ఇస్తుందని పాదయాత్రలో వాగ్దానం చేశారు. ఆమేరకు రూ.78.22 కోట్లు మత్స్యకారులకు అందజేయనున్నారు. అలాగే ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి, ఎదుర్లంక ఎస్సీ లంక భూముల్లో రూ.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 21న సీఎం పర్యటన సాగనుందిలా.. ►ఉదయం 9.45 : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో ముమ్మిడివరం మండలం గాడిలంక చేరుకుంటారు. ►ఉదయం 9.50 : రోడ్డు మార్గంలో బయలుదేరి ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామం చేరుకుంటారు. పశువుల్లంక నుంచి వలసలతిప్ప హై లెవెల్ బ్రిడ్జి (వైఎస్సార్ వారధి) ప్రారంభిస్తారు. ►ఉదయం 10.20 : ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సభాస్థలికి చేరుకుంటారు. దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పస్తారు. జ్యోతి వెలిగించి, వందేమాతరం గేయం ఆలపిస్తారు. ►ఉదయం 10.40 – 11.00 : మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగిస్తారు. ►ఉదయం 11.00 – 11.45 : మత్స్యకార భరోసా, జీఎస్పీసీ బకాయి రూ.78.22 కోట్ల నిధులు అందజేస్తారు. ►11.45 : సభా ప్రాంగణం నుంచి గాడిలంక హెలిప్యాడ్‌కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు యానాం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 12.25 : పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి చేరుకుంటారు. ఇటీవల దివంతులైన కృష్ణారావు తండ్రి మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లిలోని తన నివాసానికి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ట్రాఫిక్ మళ్లింపు కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐ.పోలవరం, ముమ్మిడివరం, యానాం పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి మంగళ వారం తెలిపారు. అమలాపురం వైపు నుంచి కాకినాడ వెళ్లే లైట్ మోటార్ వాహనాలు (4 చక్రాలు), భారీ వాహనాలు (4 చక్రాల కన్నా ఎక్కువ ఉన్నవి) ఈదరపల్లి, అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం మీదుగా వెళ్లాలి. కాకినాడ వైపు నుంచి అమలాపురం వైపు వెళ్లే లైట్ మోటార్ వాహనాలు, భారీ వాహనాలు యానాం, పిల్లంక, గోపులంక, రావులపాలెం మీదుగా వెళ్లాలి. ట్రాఫిక్ మళ్లింపునకు అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. -
అదృశ్యమయ్యాడనుకుంటే.. ఇంట్లోనే శవమై కనిపించాడు
సాక్షి, యానాం: అదృశ్యమయ్యాడనుకున్న వ్యక్తి రెండు నెలల తరువాత తన నివాసంలోనే శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యానాం పట్టణంలోని టైడల్‌లాకు సమీపంలోని ఓల్డ్ రాజీవ్‌నగర్ రెండో వీధిలో నివసిస్తున్న నల్లి చిట్టిబాబు (50) రెండు నెలల క్రితం కనబడకుండా పోయారని ఆయన బంధువులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆయన కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మిస్సింగ్ కేసును నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం చిట్టిబాబు నివాసం నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం వచ్చి ఇంటిని పరిశీలించగా తలుపులకు గడియ వేసి ఉంది. దాంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా శిథిలస్ధితిలో అస్థి పంజరంగా గుర్తుపట్టలేని రీతిలో ఒక మూలన మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు, అతని బంధువులు అది చిట్టిబాబే అని గుర్తించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని స్థానిక జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు అవివాహితుడని, ఆయన ఇంట్లో ఒక్కరే ఉంటుంటారని, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో సైతం స్థానికులు తెలియదని ఎస్సై సురేష్ అన్నారు. చిట్టిబాబు తలుపు గడియపెట్టుకోవడంతో పాటు ఆ గదిలోనే ఉండిపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోయారన్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
‘కనకాల’పేటలో విషాదం
సాక్షి, తూర్పుగోదావరి(కనకాలపేట) : సినీ నటుడు, దర్శకుడు కనకాల దేవదాసు మృతి చెందారన్న వార్త తెలియడంతో.. యానాం నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం కనకాలపేటలో శుక్రవారం విషాదం నెలకొంది. సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలను, ఆయనతో గడిపిన క్షణాలను స్థానికులు గుర్తు చేసుకున్నారు. సినీ రంగంలో గొప్ప మేధావిగా గుర్తింపు పొంది.. అనేకమందికి నటనలో శిక్షణ ఇచ్చి, సినీరంగానికి అగ్రశ్రేణి నటులను ఇచ్చిన ఆయన.. బతుకు తెరువు రీత్యా దూరతీరాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామం కనకాలపేటతో అనుబంధాన్ని కొనసాగించేవారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామం కనకాలపేట ఎప్పుడు వచ్చినా బంధువులు, స్నేహితులతో గడిపేవారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. ఆయన వల్లనే తమ కనకాలపేట గ్రామానికి మంచి పేరు వచ్చిందని చెప్పారు. కనకాలపేటలో 25 సంవత్సరాల క్రితం కోదండరామాలయం పునర్నిర్మాణం జరిగిన సమయంలో దేవతామూర్తుల విగ్రహాలను కనకాల దేవదాసు ప్రత్యేకంగా తెప్పించి, ఆయన తల్లిదండ్రులతో ప్రతిష్ఠింపజేశారు. అనంతరం 11 సంవత్సరాల క్రితం ఉత్సవాల నిర్వహణకు శాశ్వతగా నిధిగా రూ.లక్ష ఇచ్చారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. దేవదాసు పర్యవేక్షణలో శ్రీరామనవమి రోజున ఆయన కుమారుడు రాజీవ్, కోడలు, ప్రఖ్యాత బుల్లితెర యాంకర్ సుమలతో ఐదేళ్ల కిందట కోదండ రామాలయంలో కల్యాణం నిర్వహించారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు హంసాని రామలక్ష్మణుడు ‘సాక్షి’కి చెప్పారు. కనకాల దేవదాసు మృతి పట్ల గ్రామస్తులు సంతాపం తెలిపారు. ఎంతోమందికి మార్గదర్శకుడు కనకాల దేవదాసు నటనలో ఎంతోమందికి ఓనమాలు నేర్పించి సినీరంగంలో ఉన్నత స్థితికి తీసుకువెళ్లారని ఆయన సోదరుడు కనకాల రామదాసు అన్నారు. యానాంలోని తన నివాసంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మొన్ననే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని, ఈలోగా ఇటువంటి విషాద వార్త వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనకాల దేవదాసుతో పరిచయాన్ని స్థానికుడు సాధనాల బాబు కూడా గుర్తు చేసుకున్నారు. దేవదాసు మృతికి యానాం తెలగ, కాపు అభ్యుదయ సంఘం తీవ్ర సంతాపం తెలిపింది. 1945లో జననం కనకాల దేవదాసు కనకాలపేట గ్రామంలో 1945 జూలై 30న కనకాల తాతయ్య, మహాలక్ష్మమ్మలకు జన్మించారు. తాతయ్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉండగా మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 1971 నవంబర్‌లో లక్ష్మీదేవితో కనకాల దేవదాసుకు వివాహమైంది. లక్ష్మీదేవి గత సంవత్సరం ఆగస్టు 2న మరణించారు. కనకాల దేవదాసుకు కుమారుడు రాజీవ్, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. దేవదాసు విద్యాభ్యాసమంతా యానాం, కాకినాడ, విశాఖపట్నంలలో సాగింది. యానాంలోని సెంట్రల్ బాలుర హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకూ చదువుకున్నారు. అనంతరం కాకినాడ పీఆర్జీ కళాశాలలో పీయూసీ, విశాఖపట్నం ఏవీఎన్ కళాశాలలో బీఏ (హెచ్ఈపీ) చదివారు. నటన పట్ల మక్కువతో 1965లో ఆంధ్రా యూనివర్సిటీలో డిప్లమో ఇన్ యాక్టింగ్ చేశారు. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో 1966–67లో శిక్షణ పొందారు. అనంతరం ఏపీ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపించి నటనలో అనేకమందికి శిక్షణ ఇచ్చి, అగ్రశ్రేణి నటులుగా తీర్చిదిద్దారు. -
ఆలయంలోకి డ్రైనేజీ నీరు
సాక్షి, యానాం (తూర్పు గోదావరి): యానాంలోని ప్రఖ్యాత పిళ్లయ్యార్ స్వామి(లక్ష్మీగణపతి) ఆలయంలోనికి డ్రైనేజీ నీరు ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీవర్షానికి దేవాలయంకు చేర్చి ఉన్న డ్రైనేజీ పొంగి పొర్లడంతో ఆ నీరు కాస్తా దేవాయంలోనికి ప్రవహించింది. దీంతో పూజలు కోసం వచ్చిన భక్తులు అవస్థలు పడ్డారు. ప్రధానంగా పవిత్రమైన గర్భగుడిలోనికి సైతం నీరు ప్రవహించడంతో అక్కడే ఉన్న భక్తులు లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా మండపంలోనికి భారీగా డ్రైనేజీ నీరు చేరింది. డ్రైనేజీని శుభ్రపరచకపోవడంతో ముఖ్యంగా పిల్లారాయవీధిలోని డ్రైనేజీని శుభ్రపరచకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజీ ఆక్రమణకు గురైందని, మురుగునీరు శివారుకు వెళ్లలేని పరిస్ధితి నెలకొని ఉందని అంటున్నారు. దీనికి తోడు డ్రైనేజీలో వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోయినప్పటికీ సంబంధిత మున్సిపాలిటీ యంత్రాంగం వారంలో ఒకటి రెండు సార్లు మించి స్కిల్ట్‌ను తీయడం లేదని దీంతో ఎక్కడ వ్యర్థాలు అక్కడ అడ్డుగా ఉండిపోవడంతో శివారుకు మురుగునీరు ప్రవహించక వర్షం వస్తే పిల్లారాయవీధి మొత్తం మునిగిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లారాయవీధిలో వర్షం వస్తే అవస్థే పిల్లారాయవీధి లోనే ముఖ్యమైన ప్రభుత్వ జూనియర్, డిగ్రీకళాశాల, హైస్కూల్, బ్యాంకులు, పోలీస్‌స్టేషన్, వివిధ వ్యాపారసముదాయాలు ఎక్కువగా ఉండటంతో ఈ వీధిగుండా ప్రయాణించే వారు ఎక్కువగా ఉంటారు. వర్షం వస్తే ఈ వీధిలోని ప్రధానంగా కాలేజీ వద్ద నీరు నిలువ ఉండిపోతుంది. ప్రభుత్వం స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని శాశ్వతప్రాతిపదికన నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా పిల్లారాయ దేవాలయం వద్ద డ్రైనేజీ నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
మనసున్న మారాజు
యానాం: పది రూపాయలిచ్చి లక్షలాది రూపాయల ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో కూడా యానాంకు చెందిన ఓ దళితుడు నిస్వార్థంగా తనకున్న రూ.కోటి విలువ చేసే భూమిని పేదలకు పంచిపెట్టారు. కుల మతాలకు అతీతంగా 54 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. యానాం మున్సిపాలిటీ పరిధిలోని దరియాలతిప్పకు చెందిన మెల్లం సుబ్బారావు గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తన పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మన్నన పొందారు. సుబ్బారావుకు దరియాలతిప్పలో రెండు ఎకరాలు కొబ్బరి తోట ఉంది. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.కోటి వరకు ఉంటుంది. అయినా కూడా పేదలకు సొంత గూడు కల్పించేందుకు ఆ భూమిని ఆదివారం ఉదారంగా పంచి పెట్టాడు. 65 చదరపు మీటర్ల చొప్పున విభజించి ఎస్సీలు, మత్స్య కారులు, బ్రాహ్మణులు, కాపులు, శెట్టిబలిజకు చెందిన 54 మంది పేదలకు పంపిణీ చేశారు. కాగా, సుబ్బారావుకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా మిగిలిన వారు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావు మాట్లాడుతూ ‘సొంత ఇళ్లు లేని పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఎప్పటికైనా వారికి సాయపడాలని అనుకున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇళ్లు లేని వారికి ఏదో నా వంతు సాయం చేశాననే సంతృప్తి కలిగింది’ అని పేర్కొన్నారు. -
యానాంలో స్వైన్‌ఫ్లూ కలకలం..
తూర్పుగోదావరి, యానాం: యానాం పట్టణంలో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించింది. పట్టణపరిధిలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఇసుకపట్ల సంపత్ అనే వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకిందని కాకినాడకు చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు రక్తపరీక్షల ఆధారంగా గుర్తించి మెరుగైన వైద్యం కోసం అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కొన్ని రోజులుగా సంపత్ అనారోగ్యబారిన పడడంతో అతడిని కుటుంబసభ్యులు శుక్రవారం యానాంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమించడంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి ఆదివారం మధ్యాహ్నం స్వైన్‌ఫ్లూ అని నిర్ధారించారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. బాధితుడు దరియాలతిప్పలో ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అపరిశుభ్రత వల్లే : అంబేడ్కర్‌నగర్ గ్రామస్తులు అంబేడ్కర్ నగర్ శివారు ప్రాంతాలు ముఖ్యంగా కోరంగినదీ కాలువ వెంబడి ఉన్న ఏటిగట్టుకు ఆనుకుని ఉన్న నివాసాల వద్ద పరిసరాలు అశుభ్రంగా ఉంటున్నాయని పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, మున్సిపాలిటీవారు చెత్తను తీసుకువెళ్లడం లేదని గ్రామస్తులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. పందులు గుంపులుగా వచ్చి అక్కడే తిష్టవేస్తున్నాయని వాటి గురించి ఎవరూ పట్టించు కోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇక్కడి చెత్తను తొలగించడం లేదు సరికదా, ఎక్కడి నుంచో తెచ్చిన చెత్తను ఇక్కడే వేస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా పందులు స్వైరవిహారం చేయడం వల్లే స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నివాసాల చెంతకు పందులు వస్తుండటంతో పలువురిపై దాడులు చేస్తున్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని వారు ముక్తంకంఠంతో కోరుతున్నారు. -
కోనసీమలో పెథాయ్ బీభత్సం
-
బలహీన పడిన పెథాయ్ తుపాను
సాక్షి, అమరావతి: వేగంగా దూసుకొస్తూ తీవ్ర ఉత్కంఠ రేపిన పెథాయ్ తుపాను ఎట్టకేలకు బలహీన పడింది. తీవ్ర వాయుగుండంగా మారి కాకినాడ సమీపంలో కేంద్రీకృతమైంది. ఈశాన్య దిశగా పయనిస్తూ, సోమవారం రాత్రి తునికి సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్రమేణా బలహీన పడుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల పన్నెండు గంటల్లో ఉత్తర కోస్తా, యానాంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావారణ అధికారులు తెలిపారు. ఇక పెథాయ్ తుపాన్ ధాటికి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వివిధ ప్రాంతాల్లో పెథాయ్ తుపాన్ అప్డేట్స్ ఇవి.. ఉప్పొంగి గ్రామానికి చేరువగా వచ్చిన సముద్రం! శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నడుమూరు వద్ద సముద్రం ఉప్పొంగి.. గ్రామ సమీపంలోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అలల తాకిడికి ఒడ్డున లంగరు వేసిన బోట్లును సముద్రంలోకి కొట్టుకుపోయాయి. దీంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తిత్లీ తుపాన్ సమయంలోనూ సముద్రం ఇంతగా ముందుకురాలేదని, పెథాయ్ తుపాన్ తీవ్రంగా ఉండటంతోనే ఈ పరిస్థితి నెలకొందని మత్య్సకారులు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం పెథాయ్ తుపాన్ ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 33,448 హెకార్లలో ఖరీఫ్ పంటకు నష్టం వాటిల్లింది. రూ.33 కోట్లు విలువైన చేసే ధాన్యం తడిసి ముద్దయింది. రూ. ఆరు కోట్ల విలువ పత్తిపంట తుడిచిపెట్టుకుపోయింది. రూ. రెండు కోట్లు విలువ చేసే పొగాకు పంట నష్టం వాటిల్లింది. రూ. కోటి తొంభై ఏడు లక్షల విలువ చేసే ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. పెథాయ్ వల్ల శ్రీకాకుళంకు వరద ముప్పు పెథాయ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. ధనంజయ రెడ్డి హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహాయ చర్యలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నాగావళి, వంశధార, బహుదా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విజయవాడలో జలమయమైన రోడ్లు.. పెథాయ్ తుపాన్ ధాటికి విజయవాడలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మొగల్ రాజపురం వద్ద అపార్ట్మెంట్లలోకి నీళ్లు చొచ్చుకొని రావడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకాశ్ నగర్, సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చింది. వన్‌టౌన్‌లో దుకాణాల్లోని నీరు రావడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నామని విజయవాడ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నా.. పరిస్థితి మాత్రం ఘోరంగా ఉందని బాధితులు అంటున్నారు. వర్షం తగ్గితేకానీ నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. తుపాను వల్ల వీచిన చలిగాలులకి తట్టుకోలేక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చింతపాడు వద్ద దాదాపు వెయ్యి గొర్రెలు మృతి చెందాయి. ఏడుగురు మత్స్యకారులు ఆచూకి లభ్యం చేపల వేటకు వెళ్లి కనబడకుండా పోయిన కాకినాడకి చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకి లభ్యమైంది. గత గురువారం వేటకు వెళ్లిన వీరు అల్లవరం మండలం సీతారామపురం వద్ద సరక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే వీరయ్య పెథాయ్ తుపాను కారణంగా నష్టపోయిన వరి, మిరప పంటచేలను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం. వీరయ్య పరిశీలించారు. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలంలో పర్యటించి నష్టపోయిన రైతును పరమార్శించారు. పంట నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాం: ఎస్పీ రవి ప్రకాశ్ తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన భీమవరం, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల మండలంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన 300 మంది సివిల్ పోలీసులను సహాయక చర్యల్లో నియమించామని తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రోడ్లకు ఎటువంటి నష్టం కలగలేదు : కలెక్టర్ కాటంనేని భాస్కర్ పెథాయ్ తుపాను కాట్రేనీకోన వద్ద తీరాన్ని తాకడంతో జిల్లాకు కొంత ఉపశమనం కలిగిందని పశ్చిమగోదావరి కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన నర్సాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లాలో తుపాను పరిస్థితిని సమీక్షించారు. తుపాను తీవ్రత వల్ల రోడ్లకు ఎటువంటి నష్టం కలుగలేదన్నారు. కొన్ని చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని, వెంటనే పునరుద్ధరించామని చెప్పారు. ఆచంట, పాలకొల్లు పోడూరు, పెనుగొండ మొదలగు మండలాలలో భారీ వర్షం కురిసిందని, పరిస్థితిపై ఇంకా కొంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు. కాకినాడను తాకిన పెథాయ్ పెథాయ్ తుపాన్ కాకినాడను తాకింది. దీంతో కాకినాడ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. మరో రెండు గంటలపాటు కాకినాడ ప్రాంతంలో పెథాయ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. తీవ్ర ప్రభావం చూపే అవకాశం పెథాయ్ తుపాన్ ప్రభావంతో గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మరో రెండు గంటలపాటు తుపాన్ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు, కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆలయ ధ్వజ స్తంభం కూలిపోయింది. తుపాన్ తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. తుపాన్ తీరం దాటడంతో కాకినాడు, యానాం, తుని మండలాల్లో రానున్న రెండు గంటలపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావంతో మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. తుపాన్ తీరం దాటే సమయంలో కొనసీమపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాట్రేనికోనలో కారుపై విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా: పెథాయ్ తుపాను ప్రభావంతో పూసపాటిరేగ మండలంలో భారీ ఈదురు గాలులు.. దీంతో పెద్ద ఎత్తున నేలకొరిగిన మెుక్కజొన్న పంట బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ కాకినాడ: దుమ్ములపేటలో వైఎస్సార్సీపీ కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించి.. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలను పరామార్శించారు. వెంటనే అధికారులు స్పందించి తుపాన్లో చిక్కుకున్న వారిని రక్షించాలని ఆయన కోరారు. కాగా, తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పిఠాపురం వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు పర్యటించారు. తుపాన్ సహాయక కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులను ఆయన పరామార్శించారు. ఉదయం నుండి అధికారులు తమకు ఎటువంటి ఆహరం, త్రాగునీరు అందించలేదని దొరబాబుకు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ఆయన బిసెట్లు, త్రాగునీరు అందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యానాంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
ఘనంగా ముగిసిన యానాం ప్రజా ఉత్సవాలు
యానాం: 16వ యానాం ప్రజా ఉత్సవాలు చివరి రోజు సోమవారం పాటల సందడితో ఘనంగా ముగిశాయి. ముగింపు రోజు కావడంతో యానాం పరిసర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ఈ ఉత్సవాలు తిలకించేందుకు తరలివచ్చారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ప్రజా ఉత్సవాల్లో టీవీ, సినీ సంగీత గాయకుల పాటలు అలరించాయి. ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ పాడిన ఫిదా చిత్రంలోని ‘వచ్చెందే’.. అనే పాటకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. బాహుబలి చిత్రంలోని పాటలను సమీరా భరద్వాజ్ పాడి వినిపించారు. సోని, కృష్ణచైతన్య, హనుమ, సాయిశిల్ప తదితరులు పాడిన పాటలు ఆహూతులను అలరించాయి. అనంతరం ప్రత్యేక మ్యాజిక్ కార్యక్రమం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో పుదుచ్ఛేరి ఆరోగ్యశాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కమిషనర్ గౌరీ సరోజ, ఎస్పీ నితిన్ గోహల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యానాం ప్రజా ఉత్సవాలు తరలివచ్చిన జనసందోహం
-
ఆకతాయిని చెప్పు తెగేలా కొట్టి ఈడ్చి తన్నింది
సాక్షి, యానాం : యువతులు ఇప్పుడు ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అల్లరిచిల్లర పనులు చేయాలనుకుంటున్నవారి దుమ్ముదులుపుతున్నారు. మాటలతో బెదిరించడం మాత్రమే కాదు చేయి కూడా చేసుకుంటూ మరోసారి అల్లరి చేయాలనే ఆలోచన అంటేనే భయపడేలా చేస్తున్నారు. యానాంలో అల్లరికి పాల్పడిన ఓ ఆకతాయికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువతులు కలిసి యానాంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ పనిమీద వచ్చారు. అదే సమయంలో అక్కడే మద్యం మత్తులో ఉన్న ఓ ఆకతాయి యువకుడు వారిపై చేయి వేసే ప్రయత్నం చేశాడు. అసభ్యంగా తాకబోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి అతడి దుమ్ముదులిపింది. కిందపడేసి ఈడ్చి తన్నింది. గల్లాపట్టి లాక్కెళ్లింది. చెప్పుతీసుకొని వీపు పగులగొట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి స్కూటిపై వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. -
ఆకతాయికి చుక్కలు చూపించిన యువతి
-
బైక్‌పై వెళుతుండగా.. మెడలోంచి నోట్లోకి దిగిన ఇనుపచువ్వ
సాక్షి, కాకినాడ: బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కిందపడ్డాడు. ఈ సమయంలో అతని గొంతులోకి ఇనుప చువ్వ దిగింది. శనివారం సాయంత్రం యానాం వద్ద ఈ సంఘటన జరిగింది. సురేష్ అనే వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తుండగా యానాం వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా ఆటో రావడంతో దాన్ని తప్పించబోయాడు. ఈ క్రమంలో బైక్‌పై నుంచి ఆయన జారిపడగా రోడ్డుపైనున్న ఇనుప చువ్వ మెడలో నుండి నోట్లోకి దూసుకొచ్చింది. వెంటనే చువ్వతోపాటు ఆయనను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కుదుటగా ఉంది. యానాం వద్ద 216 జాతీయ రహదారి పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
తొండంగి (తుని) : మామిడికాయలు కొనుగోలు చేసేందుకు వాహనంలో బయలుదేరిన వ్యాపారులు మార్గమధ్యలోనే ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. యానాంలోని యూకేవీ నగర్‌కు చెందిన వ్యాపారులు సీహెచ్ గోవిందు, భావన రాంబాబు, సాపిరెడ్డి ఏసు మామిడికాయలు కొనుగోలుకు టాటా ఏస్ వ్యాన్‌లో తుని బయలుదేరారు. కాకినాడ బీచ్‌రోడ్డు మీదుగా ఒంటిమామిడి జంక్షన్ నుంచి తొండంగి మీదుగా అన్నవరం బైపాస్‌లోకి వస్తున్నారు. ఎ.కొత్తపల్లి కావటి చెరువు మలుపు వద్ద వీరు వస్తున్న వీరి వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటన సమయంలో వ్యాన్ తొట్టెలో ఇద్దరు నిద్రస్తుండగా డ్రైవర్ రాజు, వ్యాపారి గోవిందు (42) కేబిన్‌లో ఉన్నారు. గోవిందు కాళ్లు నుజ్జవ్వడంతో తీవ్ర రక్తస్రావమైంది. తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అతడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాంబాబు, ఏసుబాబులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై తొండంగి ఎస్సై బి.కృష్ణమాచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతినికి భార్య రాము, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన మృతుడు గోవిందు బంధువులు, కుటుంబ సభ్యులు తుని ఏరియా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉపాధి కూలీ... మరొకరికి తీవ్ర గాయాలు తాళ్లరేవు (ముమ్మిడివరం) : పోలేకుర్రు పంచాయతీ చినబాపనపల్లిలో బుధవారం పిడుగు పడడంతో ఉపాధి కూలీ కర్రి సత్యనారాయణ (42) మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఇరిగేషన్ కాలువలో సుమారు 120 మంది ఉపాధి కూలీలు పని చేస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వర్షం వస్తుంటే ఐదుగురు పూరిపాకలోకి వెళ్లారు. అక్కడ పిడుగు పడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తీవ్రగాయాల పాలైన దాకే చిట్టిబాబును స్థానికులు యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెపుతున్నారు. పిడుగుపాటు సత్యనారాయణ మృతి చెందడంతో కూలీలు తీవ్ర ఆవేదన చెందారు. స్థానిక సర్పంచ్ మొండి హరిచిన్నారావు, తహసీల్దార్ లోడా జోసెఫ్, ఎంపీడీఓ సీహెచ్ చినబాబు, ఏఎస్సై ఏవీ సుబ్బారావు తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా కోసం తరలించారు. కోరంగి ఎస్సై వి.సుమంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేయసిని గోదావరిలోకి తోసేసిన ప్రియుడు
కాకినాడ : వారు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. మన ప్రేమకథకు పెళ్లితో సుఖాంతం పలుకుదాం అని అడిగినందుకు ప్రేయసిని గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు ఆ ప్రేమికుడు. ఈ ఘటన పాండిచ్చేరి పరిధిలోని యానాంలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన గండి అలివేణి(26) రాజమండ్రి గ్యాస్ అధారిటీ ఆప్ ఇండియా(గెయిల్)లో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తోంది. ఎస్.యానంకు చెందిన శ్రీనివాసరావు రాజమండ్రిలోని బట్టలషాపులో పనిచేసేవాడు. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. గత కొంతకాలంగా పెళ్లిచేసుకోమని అలివేణి శ్రీనివాస్‌ను కోరుతోంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ఆదివారం రాత్రి యానాం వెళ్లాడు. వారు యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై కొద్దిసేపు గడిపారు. సోమవారం వేకువజామున పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆమె తలపై మోది, గొంతు నులిమి వంతెనపై నుంచి గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. అనంతరం ఆమె సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు. గమనించిన స్థానిక మత్స్యకారులు అలివేణిని రక్షించి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఐ.పోలవరం ఎస్సై వి.శివకుమార్ ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గొలుసుల దొంగ అరెస్టు
రూ.6.5 లక్షల చోరీసొత్తు స్వాధీనం యానాం : నిర్జనప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. ఒంటరిగా వెళుతున్న మహిళలను వెంబడిస్తాడు.. అంతే క్షణంలో మెడలోని బంగారు గొలుసులు అపహరించి ఉడాయిస్తాడు. యానాంలోని వివిధ ప్రదేశాల్లో కొన్నేళ్లుగా బంగారు గొలుసులు దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగను యానాం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌చేశారు. యానాం ఎస్పీ నితి¯ŒS గౌహల్ శుక్రవారం ఈ ఘటనకు సంబంధించి వివరాలును విలేకరులకు వివరించారు. యానాంలోని కనకాలపేటలోని ఆదిఆంధ్ర పేటకు చెందిన మందపల్లి రాంబాబు అలియాస్ రమేష్ (29) 2014 నుంచి సుమారు 7 బంగారు నగల దొంగతనాల కేసుల్లో నిందితుడిగా వున్నాడు. శుక్రవారం అతనిని యానాంలోని త్యాగరాయవీధిలోని భవానిబ్యాంకర్స్ ఎదురుగా తచ్చాడుతుండగా ఎస్సై శివకుమార్, క్రైమ్‌పార్టీ అరెస్ట్‌చేసి, అతని వద్దనుంచి రూ.6.5 లక్షల విలువచేసే 210.57గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యానాంలోని బెజవాడాగార్డె¯Œ్స, కురసాంపేట, యూకేవీ నగర్, గణపతినగర్, హనుమా¯ŒS డాబా, కనకాలపేట, సుభద్రనగర్ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను వెంబడించి వారిమెడలోని విలువైన బంగారు ఆభరణాలను తెంచి పారిపోతుంటాడు. నాలుగేళ్లుగా అతడు దొంగిలించిన వాటిలో ఎక్కువగా మంగళసూత్రాలు, గొలుసులు తదితరమైనవి వున్నాయి. తాము స్వాధీనం చేసుకున్న బంగారాన్ని బాధితులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు. రాంబాబు గతంలో మల్లాడి సత్తిబాబు అనే వ్యక్తి వద్ద కారుడ్రైవర్‌గా పనిచేసేవాడని అతని వద్ద కూడా ఈ విధంగానే బంగారాన్ని దొంగిలించాడని తెలిపారు. నిందితుడ్ని పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్ఐ శివకుమార్‌ను, కానిస్టేబుళ్లు సతీష్, దుర్గారావు, ప్రతాప్‌లను ఎస్పీ అభినందించారు. -
సేనా పతకం గ్రహీత వీరనరేష్కు సత్కారం
యానాం : 68వ రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైన్యంలో అత్యున్నత సేవలందించే వారికి ఇచ్చే సేనా పతకాన్ని పొందిన యానాంకు చెందిన మేజర్ ఓలేటి వీరనరేష్ను మంగళవారం పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఘనంగా సత్కరించారు. అయన ఛాంబర్‌కు తండ్రి వీరరాఘవ శర్మతో కలిసి వీర నరేష్ మర్యాద పూర్వకంగా వచ్చారు. ఈ సందర్భంగా వీరనరేష్ను పరిపాలనాధికారి సాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు. చదువు,ఆటపాటలతో పాటు దేశంకోసం కూడా ఆలోచించాలి : వీర న రేష్ విద్యార్ధులు చదువు,ఆటపాటలతో పాటు దేశం కోసం కూడా ఆలోచించాలని దేశానికి ఏదైనా చేయాలనే దృఢ సంకల్పాన్ని అలవర్చుకోవాలని సేనా పతకం అవార్డు గ్రహీత ఓలేటి వీరనరేష్ ఉద్బోధించారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆర్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగిన శాఖా కార్యక్రమంలో వీరనరేష్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ ఎ¯ŒSపీవీ రామారావు, సంపర్క్ ప్రముఖ్ పంచాగం విశ్వనాధం, ముఖ్యశిక్షఖ్ కుడిపూడి సూర్యప్రకాశ్ ‡ పాల్గొన్నారు. -
దేశసేవ మా బిడ్డకు దేవుడిచ్చిన అదృష్టం
మా అబ్బాయిని చూసి గర్విస్తున్నాం సేనా మెడల్ గ్రహీత వీరనరేష్ కన్నవారి ఆనందం యానాం : దేశం కోసం సేవ చేసే అదృష్టాన్ని దేవుడు కొందరికి మాత్రమే ఇస్తాడని యానాంకు చెందిన ఓలేటి లక్షీ్మవీరనరేష్ తల్లిదండ్రులు వీరరాఘవశర్మ, అన్నపూర్ణ పేర్కొన్నారు.సైనికాధికారి అయిన నరేష్ సెప్టెంబర్ 29న జరిగిన సర్జికల్ దాడుల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మేజర్స్కు ఇచ్చే సేనా మెడల్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో శర్మ, అన్నపూర్ణ శుక్రవారం గోపాల్‌నగర్‌లోని స్వగృహంలో ‘సాక్షి’తో మాట్లాడారు. నరేష్ చదువులో బాగా రాణించాడని, ఉద్యోగరీత్యా జంగారెడ్డిగూడెంలో ఉండటంతో నరేష్ ప్రాథమికవిద్య జంగారెడ్డిగూడెం, ఏలూరు,అమలాపురంలలో సాగిందని అన్నారు. ఆరునుంచి పదవతరగతివరకు యానాం నవోదయలో, అనంతరం విశాఖలోని కొమ్మాది నవోదయలో ఇంటర్మీడియట్ చదివాడని తెలిపారు. 2000లో యూపీఎస్సీకి ఎంపికై అనంతరం పూనె వద్దనున్న కడగోశలలో నేషనల్ డిఫె¯Œ్స అకాడమీలో శిక్షణ పొంది, 2003లో ఇండియ¯ŒS మిలిటరీ అకాడమీ (డెహ్రడూ¯ŒS)లో చేరి, ఆఫీసర్ కమిష¯ŒS్డతో లెఫ్టినెంట్ హోదా పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత సైన్యంలో మేజర్ హోదాలో పనిచేస్తున్నాడని తెలిపారు. తమ కుటుంబంలో ఎవరూ ఆర్మీలో లేకపోయినా కుమారుడిని చేరేందుకు ప్రోత్సహించినట్లు తెలిపారు. సర్జికల్ దాడుల్లో ధైర్యసాహసాలు భారత –పాకిస్థా¯ŒS సరిహద్దు రేఖ అయిన లై¯ŒS ఆఫ్ కంట్రోల్‌ని దాటి అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత సైన్యం సర్జికల్ దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో మేజర్ వీరనరేష్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారు.ఈ నేపథ్యంలో మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన వీరనరేష్కు భారతప్రభుత్వం సేనామెడల్‌ను ప్రదానం చేసింది. ఈ మెడల్ పొందిన 91 మందిలో నరేష్ మూడవ వ్యక్తి కావడం విశేషం. -
యానాంలో ఘనంగా ప్రజా ఉత్సవాలు
-
షోభాయ‘యానాం’
పట్టణంలో ప్రారంభమైన ఫల, పుష్ప ప్రదర్శన అబ్బురపరుస్తున్న పుష్పాలు, కాయగూరలు ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ బస్ ముమ్మిడివరం, తాళ్లరేవు : రంగురంగుల పుష్పాలు, వివిధ రకాల వృక్షజాతులు, అబ్బురపరిచే కాయగూరలు, ఆకట్టుకునే కార్వింగ్ చిత్రాలతో యానాంలో ఫల, పుష్పప్రదర్శన కనువిందు చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న 18వ ఫలపుష్ప ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. సుమారు రూ.35లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో హైబ్రీడ్, దేశవాళీ జాతులకు చెందిన వేలాది పుష్పాలు, ప్రత్యేకతలు కలిగిన కాయగూరలతోపాటు పూణే, బెంగళూరుల నుంచి తీసుకువచ్చిన వివిధ రకాల గులాబీలు, ఆర్కిడ్స్ ఆకట్టుకోనున్నాయి. వివిధ రకాలైన బంతి, చామంతి, గులాబీలతో పాటు పోయి¯ŒSసెట్టియా, మినీ దాలియా, దాలియా, బెంగళూరు గులాబీలు, ఆఫ్రికా మేరిగోల్డ్, బోన్సాయ్, ఫైర్‌బెల్, తరూనియా, జర్బెరా, లిలియం, కార్నేషన్, డెండ్రోబియం, హెలికోనియా తదితర పుష్పజాతులను పొందుపరిచారు. రైతులు పండించిన భారీ గుమ్మడి, ఆనబ, కంద తదితర కాయగూరలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అలరించిన కార్వింగ్ ఆకృతులు ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్వింగ్ చిత్రాలు చూపరులను ముచ్చట గొలుపుతున్నాయి. ముఖ్యంగా పురివిప్పిన నెమలి, పచ్చిమిరపలతో తయారు చేసిన హంసలు, గుమ్మడికాయ పుష్పాలు, గుమ్మడిపై చెక్కిన గాంధీ, అంబేడ్కర్ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే పువ్వులతో చేసి బాతు అందరికీ స్వాగతం పలుకుతోంది. ఆకట్టుకున్న ‘ఎయిర్‌బస్’ 18వ ఫల పుష్ప ప్రదర్శనలో కార్నేష¯ŒS పుష్పాలతో రూపొందించిన ఎయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బెంగళూరుకు చెందిన డచ్ ఫ్లవర్స్ సంస్థ మేనేజర్ వరదరాజ¯ŒS పర్యవేక్షణలో ఈ ఎయిర్‌బస్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. టేకాఫ్ తీసుకుంటున్న ఏరోప్లే¯ŒS మాదిరిగా ఏర్పాటు చేస్తున్న ఈ ఎయిర్‌బస్ ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక అకర్షణగా ఉంది. అలాగే ఈ సారి విభిన్న రీతిలో ఉన్న ఆర్నమెంటల్ క్రోటన్ల మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. ఆయా ఏర్పాట్లను వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ మురుగు¯ŒS నేతృత్వంలో అధికారులు చిక్కాల జోగి రాజు, ఐకే ఖా¯ŒSలు పర్యవేక్షిస్తున్నారు. -
6 నుంచి యానాం ప్రజా ఉత్సవాలు
ఫల పుష్ప ప్రదర్శనకూ ఏర్పాట్లు ముస్తాబవుతున్న బాలయోగి క్రీడామైదానం హాజరుకానున్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం యానాం టౌ¯ŒS : పుదుచ్చేరి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8 వరకు 15వ యానాం ప్రజా ఉత్సవాలను, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 18వ ఫల, పుష్ప ప్రదర్శనను స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో నిర్వహించనున్నారు. పుదుచ్చేరి పర్యాటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, ప్రాంతీయ పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రీడామైదానంలో భారీ స్వాగత ద్వారాలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటుకు ప్రత్యేక వేదికను తీర్చిదిద్దుతున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారు. 8న జరిగే ముగింపు వేడుకల్లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్‌బేడీ పాల్గొననున్నారు. ఉత్సవాల్లో తొలిరోజున ప్రముఖ సినీనటుడు మోహ¯ŒSబాబుతో పాటు పలువురు ప్రముఖులను సత్కరించనున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజా ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు పలు సాంస్కృతిక, నృత్యప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఫల, పుష్ప ప్రదర్శనలో 20 వేల మొక్కలు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫల, పుష్ప ప్రదర్శనలో సుమారు 20 వేల పుష్పజాతుల మొక్కలు కనువిందు చేయనున్నాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు రప్పించి నర్సరీలో నాలుగు నెలలుగా 20 రకాల మొక్కలను పెంచి సిద్ధం చేశారు. వీటితో పాటు బెంగళూరు, పూణేల నుంచి తీసుకొచ్చిన వివిధ రకాల గులాబీ తదితర పూలమొక్కలను వివిధ రకాల కూరగాయలు, ఆయా రకాల పండ్ల స్టాళ్లను ప్రదర్శనలో ఉంచనున్నారు. -
సముద్రంలో గల్లంతైన వ్యక్తి సురక్షితం
కాకినాడ రూరల్ /యానాంటౌన్ : వార్దా తుపానుతో ఆదివారం ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగలో బోటు తిరగబడి గల్లంతైన ఇద్దరిలో ఒకరు సురక్షితంగా Výæట్టుకు చేరారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటకు చెందిన ఇద్దరు సముద్రంలో బోటు తిరగబడడంతో గల్లంతైన సంగతి తెలిసిందే. వారిలో గంపల అచ్చారావు (25) అలల ఉధృతికి కొట్టుకుపోయి సుమారు ఆరు గంటల సేపు ఈదుతూ మడ అడవుల్లోకి వెళ్లిపోయాడు. అక్కడ చెట్టును పట్టుకొని ఉన్న అచ్చారావును సోమవారం పీతల వేటకు వెళ్లిన జాలర్లు చూశారు. ఆ విషయం మత్స ్యశాఖాధికారులకు వారు తెలియజేశారు. అధికారుల సాయంతో వారు అచ్చారావును భైరవపాలెం ఒడ్డుకు తీసుకువచ్చారు. నీటిలో నానిపోయిన అచ్చారావు ఒంటిపై గాయాలు ఉండడంతో అతనికి అక్కడ ప్రాథమిక చికిత్స చేసి యానాం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్టు మత్స్యశాఖ డీడీ ఎస్. అంజలి, ఏడీఏ కె. కనకరాజు, ఏఈ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. అచ్చారావు జాడ తెలియడంతో పెద్దలు వంకా సింహాద్రి, సూరాడ రాజు, మైలపల్లి జగన్నాథం, మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ యానాం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అచ్చారావును కలసి మనోధైర్యాన్ని కలుగజేశారు. కాగా సముద్రంలో గల్లంతైన ఓసుపల్లి మహేంద్ర (19) జాడ ఇంకా తెలియరాలేదు. స్థానిక ఇ¯ŒSచార్జి పరిపాలనాధికారి కాలే సాయినాథ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గూటం శివగణేష్ సోమవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి అచ్చారావు ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అచ్చారావు బంధువులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. -
తెలుగు కథ మరింత పరిపుష్టం కావాలి
యానాం టౌ¯ŒS : తెలుగు కథ మరింత పరిపుష్టం కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మిదేవి తెలిపారు. సర్వశిక్ష అభియా¯ŒS సమావేశ మందిరంలో సాహిత్య అకాడమీ, స్థానిక స్ఫూర్తి సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలుగు రచయితల సమావేశంలో భాగంగా ‘కథానికా పఠనం – నేటి తెలుగు కథ’ అంశంపై ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా సంవత్సరానికి రెండు వేల కథలు వస్తున్నాయన్నారు. వాటిలో ఏరితే మంచి కథలు వందకు మించి ఉండటం లేదని చెప్పారు. క్షీణిస్తున్న మానవ సంబంధాలు, వృద్ధాప్య సమస్యలు తదితర అంశాలపై చాలా మంది కథలు రాస్తున్నారని చెప్పారు. రాసి లాగే వాసి కూడా పెరిగితే తెలుగు కథ మరింత పరిపుష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. సభకు అ««దl్యక్షత వహించిన స్ఫూర్తి సాహితీ సమాఖ్య అధ్యక్షుడు, కవి, కథకుడు దాట్ల దేవదానంరాజు మాట్లాడుతూ కథ జీవన వాస్తవికతను, మానవ సంబంధాల విధ్వంసం, ఆచార వ్యవహారాలు, సామాజిక సమస్యలను, అంతరంగిక విషయాలను ప్రతిబిం బించే ప్రక్రియ అని చెప్పారు. ప్రస్తుతం కథలలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. ప్రముఖ కథకుడు చింతకింది శ్రీనివాసరావు ‘మా దేవుడుమాయ బొగట్టా’ అనే కథను, కవి, కథకుడు అద్దేపల్లి ప్రభు ‘సీతక్కకొండ’ కథను, జి.లక్ష్మి ‘కళాకారుడు’ కథను, దాట్ల దేవదానంరాజు ‘గోదాట్లో గోదారి’ కథలను తమదైన శైలిలో వినిపించి అలరించారు. కవిత్వం మనిషిని స్పందింపజేస్తుంది అనంతరం కవితా పఠనం–నేటి తెలుగు కవిత్వం అంశంపై జరిగిన సదస్సులో సాహితీ విమర్శకులు ఎం.నారాయణశర్మ మాట్లాడుతూ ప్రస్తుతం సారవంతమైన కవిత్వం వస్తుందని తెలిపారు. సమకాలీన అంశాలపై కవులు కవిత్వం రాస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిన కవి డాక్టర్ శిఖామణి మాట్లాడుతూ కవిత్వం మనిషిలోని పశు లక్షణాలను దూరం చేసి సౌజన్యమూర్తిగా మారుస్తుందని చెప్పా రు. వచన కవిత్వానికి 70 ఏళ్లు నిండాయ న్నారు. సమాజం ఉన్నతికి కవిత్వం అవసరమన్నారు. కవులు డాక్టర్ ఎ¯ŒS.గోపి, ఎండ్లూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వి.భాస్కరరెడ్డి వందన సమర్పణ చేశారు. -
బౌద్ధ బిక్షవు విగ్రహం లభ్యం
ఆసక్తిగా తిలకించి, పూజలు చేసిన ప్రజలు యానాం టౌన్ : యానాం శివారు సావిత్రినగర్ ప్రాంతంలో సముద్రపు మొగ వద్ద యానాంకు సంబంధించిన దీవి ఒడ్డున ఒక విగ్రహం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ విగ్రహాన్ని గుర్తించారు. వెదురుగెడలతో పెద్ద తెప్పలా కట్టి ఉంది. దానిపై గోపురంలా ఉన్న పందిరిలో బిక్షాపాత్రలో చెయ్యిపెట్టినట్టుగా ఉంది. గోపురం పూర్తిగా అలంకరించి, యుకే మిల్క్ పేరుతో ఉన్న డబ్బాలు తెప్పకు తీగలతో కట్టి ఉన్నాయి. ఏదో విగ్రహం సముద్రంలో కొట్టుకు వచ్చిందన్న విషయం తెలుసుకున్న సావిత్రినగర్, గిరియాంపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు, యువకులు, పిల్లలు నావలపై అధికసంఖ్యలో తరలి వెళ్లి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. దైవ విగ్రహంగా భావించి, మహిళలు, తదితరులు కొబ్బరికాయులు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ విషయం మత్స్యకార గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది. సముద్రపు ఒడ్డున గుర్తించిన ఈ విగ్రహం ఒక బౌద్ధ బిక్షవు (మాంక్ ఇన్ బుద్ధిస్ట్)విగ్రహంగా తెలుస్తోంది. బౌద్ధ బిక్షవు మాదిరిగా బిక్షాపాత్రతో ఉంది. సింగపూర్, మలేషియా దేశాలకు చెందిన బౌద్ధబిక్షవుకు సంబంధించిన విగ్రహంగా భావిస్తున్నారు. సముద్రంలో కొట్టుకువచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. విగ్రహం ఉన్న గోపురం ««థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ దేశాలలో బుద్ధుని ఆలయాల తరహాలో ఉంది. -
సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలే
ఏపీ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ ఘనంగా యానాం కవితోత్సవం-2016 ఉభయ రాష్ట్రాల నుంచి రచయితలు, కవులు రాక యానాం టౌన్ : కవులు, రచయితలు చేసే రచనల ద్వారానే నిజమైన మార్పు వస్తుందని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలేనని, మంచి రచనలు సమాజ ఉన్నతికి దోహదపడతాయని చెప్పారు. స్థానిక కవి సంధ్య, స్ఫూర్తి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం యానాం కవితోత్సవం–2016 నిర్వహించారు. కవి సం«ధ్య అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ శిఖామణి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన గౌరవ అతి«థిగా ప్రసంగించారు. కవులు, రచయితలు తెలుగువారిలో భాషాభిమానం పెంపొందించడానికి మరింత కృషి చేయాలన్నారు. అప్పుడే కవులు, రచయితలు చేసే రచనలకు విలువ ఉంటుందన్నారు. కన్నడులకు, తమిళలకు ఉన్న భాషాభిమానం తెలుగువారిలో లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు జాతి గొప్పది, మన భాష గొప్పది అన్న భావన అందరిలోనూ కలగాలని ఆకాంక్షించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ సాహిత్యం సమాజానికి అవసరమని, కవిత్వం మనిషిని స్పందింపజేస్తుందని చెప్పారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ కవి కె.శివారెడ్డి ‘మానవ నాగరికత– కవిత్వం’ అంశంపై మాట్లాడారు. మానవ వికాసానికి సాహిత్యం దోహదం చేస్తుందన్నారు. ఏపీ గిరిజన సహకార సంస్థ ఎండీ, ప్రముఖ కవి ఆకెళ్ల రవిప్రకాష్ మాట్లాడుతూ గతంలో తాను యానాం పరిపాలనాధికారిగా పనిచేశానని, అప్పట్లో కవిత్వం మీద ఉన్న ఆసక్తితో తొలిసారి ఉగాదికి కవిసమ్మేళనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డాక్టర్ శిఖామణి మాట్లాడుతూ ఎర్రన రచించిన పద్యాన్ని తనదైన శైలిలో వినిపించారు.శిఖామణి సాహితీ తొలి పురస్కారం కె.శివారెడ్డికి ప్రదానం చేయాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కాలే సాయినాథ్, మధునాపంతుల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇన్సెర్టు కవితోత్సవం–2016 ప్రారంభం యానాం గోదావరి తీరం శనివారం సాహితీ సుగంధాలతో పులకించింది. వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు తరలివచ్చి తమ సాహిత్యం, కవిత్వంతో సాహితీ ప్రియులను, అభిమానులను అలరించారు. కవిసంధ్య సాహితీ, సాంస్కృతిక సంస్థ, స్ఫూర్తి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గాజుల గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన బొజ్జా తారకం, ఆవత్స సోమసుందర్ ప్రాంగణంలో యానాం కవితోత్సవం–2016ను నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకను ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు దివంగత మంగళంపల్లి బాల మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు సుప్రసిద్ధ కవులు కె.శివారెడ్డి, కొలకలూరి ఇనాక్, ప్రముఖ చిత్రకారులు శ్రీలా వీర్రాజు, అక్బర్, ఏపీ గిరిజన సహకార సంస్థ ఎండీ, కవి ఆకెళ్ల రవిప్రకాష్ , ఇండియా టూరిజం ఏడీ తుల్లిమల్లి విల్సన్‌సుధాకర్, కవిసంధ్య అధ్యక్షుడు డాక్టర్ శిఖామణి, కవి దాట్ల దేవదానంరాజు, డాక్టర్ వరుగు భాస్కరరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం సభా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు, సాహితీప్రియులు, అభిమానులు పాల్గొన్నారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సహకారం, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కళలు, సాంస్కృతికశాఖ సౌజన్యంతో డాక్టర్ శిఖామణి సారథ్యలో ఈ కవితోత్సవాన్ని నిర్వహించారు. -
కూచిపూడి నృత్యోత్సవానికి యానాం విద్యార్థిని
యానాం టౌన్ : ఇంటర్నేషనల్ డ్యాన్స్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఏపీ భవన్ న్యూఢిల్లీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫెస్టివల్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ కార్యక్రమంలో యానాం విద్యార్థిని కడియం హిమమహాలక్ష్మి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనుంది. ఈ ఫెస్టివల్‌ను న్యూఢిల్లీలోని ఏపీ భవన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో ఈ నెల 20 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హిమ మహాలక్ష్మి ఈ నెల 22న సాయంత్రం 6.30కు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనుంది. ఈ మేరకు హిమమహాలక్ష్మి ఎంపికైనట్టు ఇంటర్నేషనల్ డ్యాన్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తాడేపల్లి నుంచి సమాచారం అందినట్టు విద్యార్థిని తండ్రి భాస్కర్ సోమవారం విలేకరులతో తెలిపారు. అలాగే హిమమహాలక్ష్మి ఫోటోతో ఉన్న ఆహ్వానపత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. హిమ మార్చినెలలో ఢిల్లీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆ««దl్వర్యంలో నిర్వహించిన ప్రపంచ సంస్కృతి సదస్సుకు ఎంపికై, కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అందరి దృíష్టిని ఆకర్శించింది. యానాంలో విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న జవహర్ మినీ బాల భవన్లో ఆర్.శ్రీవాత్సవి వద్ద హిమమహాలక్ష్మి కూచిపూడి నృత్యంపై శిక్షణ పొందింది. హిమ మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నట్టు ఆమె తండ్రి తెలిపారు. -
కనుల పండువగా తెప్పోత్సవం
యానాం టౌన్ : యానాం వేంకటేశ్వరస్వామివారి చతుర్ధశి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి మీసాల వెంకన్న స్వామి వారి తెప్సోత్సవాన్ని స్థానిక అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్‌గాంధీ రివర్‌బీచ్ వద్ద గౌతమి గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. విద్యుత్ దీపాలు, వివిధరకాల పూలతో హంసరూపంలో సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువుతీరిన వేంకటేశ్వరస్వామివారు గౌతమి గోదావరిలో కొంతసేపు విహరించారు. తొలుత తెప్పపై ప్రముఖ వైఖానస పండితులు వాడపల్లి గోపాలాచార్యులు, ఆలయఅర్చకులు, వేదపండితులు ఆధ్వర్యంలో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. పరిపాలనా«ధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, దేవస్దాన కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ పాల్గొన్నారు. గౌతమిగోదావరిలో గంటపాటు సాగిన తెప్పోత్సవాన్ని వందలాది మంది భక్తులు, స్థానిక ప్రముఖులు, నాయకులు తిలకించారు. -
3 నుంచి మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు
పందిరిరాట ముహూర్తంతో ఏర్పాట్లకు శ్రీకారం తిరుమల తరహాలో 10 రోజుల వైభవంగా నిర్వహణ యానాం టౌన్ : ‘మీసాల వెంకన్న, చల్దికూడు వెంకన్న, యానాం వెంకన్న’గా ప్రసిద్ధి చెందిన యానాం భూసమేత వెంకటేశ్వరస్వామి వారి 14వ బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 3 నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆలయ ప్రాంగణంలో పందిరిరాట ముహూర్తాన్ని వేదపండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. యానాం వెంకటేశ్వర దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బ్రహ్మోత్సవాలను 10 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. పందిరిరాట ముహూర్తం సందర్భంగా ఆలయంలో అర్చకులు పెద్దింటి లక్ష్మణాచార్యులు, నరసింహాచార్యులు, పెద్దింటి రఘురామవినోద్ తదితరులు మంగళవాయిద్యాల మధ్య వేదమంత్రాలతో విశేష పూజలను నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్, ప్రతినిధులు కాదా వెంకటేశ్వరరావు, ఆకుల నాగేశ్వరరావు, గంధం శంకరరావు, కె.గాంధీ, ఎక్స్ప్రెషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మద్దింశెట్టి జియన్న దంపతులు పూజలు చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను కమిటీ ఆ««దl్వర్యంలో చేపట్టనున్నట్టు ఉమాశంకర్ తెలిపారు. రోజూ వాహనోత్సవాలు, ఆలయంలో వేదపండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో పూజలను నిర్వహిస్తామన్నారు. -
పుదుచ్చేరి సీఎం సభలో ఉద్రిక్తత
యానాం టౌన్ : యానాంలోని జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో ఆదివారం పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి పాల్గొన్న సభలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత మిక్సీలు, గ్రైండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఎన్.రంగసామి ఆదివారం ఉదయం యానాం వచ్చారు. పంపిణీని ప్రారంభించేందుకు ఆయనతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యే బాలన్, పీఆర్టీసీ ైచె ర్మన్ జ్ఞానశేఖరన్ వేదికపైకి వచ్చారు. వీరితో పాటు త్వరలో యానాంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యానాం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న విశ్రాంత ఎస్పీ తిరుకోటి భైరవస్వామి వే దికపైకి వెళ్లారు. ప్రభుత్వం నిర్వహించే సభలో ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం తగదని సీఎం వద్ద ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లాడి వర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు నిలబడి ఆయనకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పలువురు వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత, తోపులాట చోటుచేసుకుంది. వారిని పోలీసులు అదుపు చేశారు. ఈ దశలో కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం రంగసామి మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత భైరవస్వామి మద్దతుదారులు ఆయనను వేదిక కిందకు తీసుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం సభ కొనసాగింది. ఇటువ ంటివి సాధారణం : ఈ వివాదంపై సీఎం రంగసామి స్పందిస్తూ.. ఇటువంటి ఘటనలు సాధారణమని విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు, అభ్యర్థుల విషయమై ఎన్నికల నోటిఫికేషన్ వ చ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
యానాంలో ఆరుగురి జలసమాధి వెనుక వాస్తవం
-
నదిలో కారు పడి ఐదుగురి మృతి
-
గోదావరిలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురి మృతి
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా యానాం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. యానాం శివారు దరియాలతిప్ప ఏటిగట్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గతరాత్రి ఇండికా కారు ( ap 5V 201) అదుపు తప్పి గోదావరి నదిలో పడిపోయింది. కారు వేగంగా వెళ్లి అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని నదిలో పడిపోయింది. అయితే చీకటి కావడంతో ఎవరూ గమనించలేదు. తెల్లవారు జామున కారు నీటిలో తేలుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును వెలికి తీశారు ఈ దుర్ఘటనలో అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులంతా కాకినాడ తూరంగిలోని డ్రైవర్ కాలనీకి చెందినవారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు మహిళలు, ఒక బాలుడి అదృశ్యం
యానాం టౌన్: యానాంలోని అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్న ఇద్ద రు మహిళలు, ఒక బాలుడు అదృశ్యమయ్యారు. వివాహితలు దారా కృష్ణవేణి, దారా లలితాదేవి, బాలుడు అఖిల్‌కుమార్ గత నెల జనవరి 18 నుంచి కనిపించడం లేదని భర్త దారా రవికుమార్ బుధవారం సాయంత్రం యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఎస్సై అబ్బులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...దారా రవికుమార్‌కు తొమ్మిది సంవత్సరాల క్రితం కృష్ణవేణితో వివాహం జరిగింది. అయితే కృష్ణవేణి అనారోగ్యం దృష్ట్యా ఆమె చెల్లెలు లలితాదేవిని కూడా రవికుమార్‌కు ఇచ్చి వివాహం చే శారు. కృష్ణవేణి కుమారుడు అఖిల్‌కుమార్. ఈ కుటుంబం కొంతకాలంగా స్థానిక అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తోంది. లలితాదేవిని రవికుమార్ బీఈడీ చదివిస్తున్నాడు. అయితే ఆమె క్లాసులకు సరిగ్గా వెళ్లడం లేదని భర్త రవికుమార్ మందలించాడు. అదే రోజు నుంచి వారు కనిపించడం లేదని రవికుమార్ తమకు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రవికుమార్ గుల్ల వ్యాపారం చేస్తున్నాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
యానాం పోవాలా.. ఈఫిల్ చూడాలా...!
యానాం: విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్ చూడాలనుకుంటున్నారా... అయితే యానాం పదండి. ఈఫిల్ టవర్ ప్యారిస్ లో కదా ఉంది. యానాం ఎందుకు అంటారా. అచ్చుగుద్దినట్టు ఈఫిల్ టవర్ ను పోలిన కట్టడాన్ని యానాంలో నిర్మించారు. స్థానిక గిరియాంపేటలో నిర్మించిన ఈ కట్టడానికి ఒబిలిస్క్‌టవర్ (యానాం టవర్)గా నామకరణం చేశారు. 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించారు. 100.6 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ లో పలు ప్రత్యేకతలున్నాయి. కింది అంతస్థులో మీటింగ్ హాల్ ఉంది. 53.3 మీటర్ల ఎత్తువరకు లిఫ్ట్ లో వెళ్లొచ్చు. 21.6 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్, 26.5 మీటర్ల ఎత్తులో వీక్షణ మందిరం నిర్మించారు. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుని నిలబడేలా దీన్ని డిజైన్ చేశారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చొరవతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎ.అజయ్ కుమార్ సింగ్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. పర్యాటకులను ఒబిలిస్క్‌టవర్ విశేషంగా ఆకట్టుకోనుంది. మీరు చూడాలనుకుంటే యానాంకు పయనం కట్టండి. -
యానాంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
-
యానాం ఫెర్రీరోడ్‌లో భారీ అగ్నిప్రమాదం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని యానాం ఫెర్రీరోడ్‌లో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇళ్లలో 3 గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 పూరిళ్లు అగ్నికి ఆహుతి కాగా, 30 కుటుంబాలు నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్నం: పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ, దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, కాకినాడలో గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. యానాంలో వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజీవ్ బీచ్ రోడ్, చెర్రీరోడ్, బాలయోగికాలనీ, న్యూ రాజీవ్ కాలనీలు ముంపుకు గురయ్యాయి. యానాం ఎమ్మెల్యే కృష్ణారావు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ** -
పదేళ్ల బాలికపై లైంగిక దాడి
యానాం టౌన్ : కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పదేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ దాట్ల వంశీధరరెడ్డి కథనం ప్రకారం... యానాంలో ఆదివారం మధ్యాహ్నం వినాయక చవితి పందిరి వద్ద ఉన్న బాలికను.. ఎలిపే రాజేష్ అనే యువకుడు గేమ్స్ ఆడడానికి సెల్‌ఫోన్ ఇస్తానని తన ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని తల్లికి ఆ బాలిక చెప్పగా.. ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆనంద్ రీజెన్సీ అధినేత మృతిపై సీబీఐ విచారణ!
యానాం : ఆనంద్ రీజెన్సీ గ్రూప్ సంస్థలు, ఆనంద్ సినీ సర్వీసెస్ అధినేత ఎం.రవిశంకర్ ప్రసాద్ మరణంపై చెన్నైకు చెందిన సీబీఐ అధికారుల బృందం విచారణ చేపట్టినట్లు సమాచారం. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం యానాం వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై 7వ తేదీన రవిశంకర్ ప్రసాద్ స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న ఆనంద్ రీజెన్సీ హోటల్‌కు వచ్చి, రాత్రి అక్కడ బస చేశారు. మరుసటి రోజు వేకువజామున యానాం-ఎదుర్లంక వారధిపై గొడుగును పట్టుకుని మార్నింగ్ వాక్కు వెళ్లినట్లు టోల్‌గేట్‌లోని సీసీ కెమెరా పుటేజిలో ఉంది. అప్పుడు అదృశ్యమైన రవిశంకర్ ప్రసాద్ జూలై 13న ఐ.పోలవరం మండలం గుత్తినదీవి శివారు గోగుల్లంక సమీపంలోని రేవులో విగతజీవిగా కనిపించారు. దీనిపై ఐ.పోలవరం పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసు నమోదు అయ్యింది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆదేశాల మేరకు చెన్నైకు చెందిన సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ చేపట్టినట్లు సమాచారం. రవిశంకర్ ప్రసాద్ మరణానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. -
9 వేల కోట్లతో కొత్తబావుల్లో ఉత్పత్తి
ఉప్పలగుప్తం, న్యూస్‌లైన్ : కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఉప్పలగుప్తం మండలం సూరసేన యానాంలో గల ‘రవ్వ’ చమురు క్షేత్రంలో రూ.9 వేల కోట్లతో కొత్తబావుల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు క్షేత్రం యాజమాన్య సంస్థల్లో ఒకటైన కెయిర్న్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా 20 అతిపెద్ద స్వతంత్ర చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన తమ సంస్థ చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీతతో పాటుగా స్థానికాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొంది. భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హైడ్రోకార్బన్ల అన్వేషణ, ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు సాధించిందని, కనుగొన్న బావుల్లో త్వరితగతిన ఉత్పత్తి మొదలుపెట్టి దేశంలో 25% ముడిచమురు అందిస్తున్న ఘనతను సొంతం చేసుకుందని తెలిపిం ది. రవ్వ యాజమాన్య సంస్థలైనఓఎన్జీసీ, వీడియోకాన్, రవ్వ ఆయిల్ భాగస్వామ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు 3500 బారెల్స్ చమురు ఉత్పత్తి చేశామని, ఇప్పటి వరకు 245 మిలియన్ బారెల్స్ ముడిచమురు, 330 బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. 2013-14 ఆఖరి క్వార్టర్లో అంచనాను మించి 29,151 బారల్స్ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి జరిగినట్టు వివరించింది. సామాజిక సేవలతో అవార్డులు దాదాపు 1400 హెక్టార్లలో విస్తరించి ఉన్న రవ్వ ప్లాంట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలోని ఆరువేల మంది జనాభాకు వివిధ సేవలు అందిస్తున్నట్లు కెయిర్న్ తెలిపింది. గ్రామంలో 560 వ్యక్తిగత మరుగుదొడ్లు, పేదలకు 200 పక్కాగృహాలు నిర్మించి, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొంది. -
చెత్తకుండిలో పేలుడు: బాలికకు తీవ్రగాయాలు
చెత్తకుండిలో పేలుడు సంభవించి వీరవాణి (15) అనే బాలికతోపాటు మరో మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన యానాంలోని సావిత్రి నగర్లో నిన్న చోటు చేసుకుంది. ఆ ఘటనలో మహిళకు స్వల్పగాయాలు కాగా, బాలికను తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ బాలిక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్య సాయం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆ బాలికను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చెత్త కుండిలో పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మందుగుండి సామాగ్రిని చెత్తకుండిలో వేయడం వల్లే ఆ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అప్రమతమైన యానాం జైలు సిబ్బంది
-
ఖైదీని తప్పించేందుకు సబ్‌జైలుపై దాడికి యత్నం
యానాం : తూర్పు గోదావరి జిల్లా యానాం సబ్‌జైలులోకి ప్రవేశించేందుకు పదిమంది దుండగులు సినిమా ఫక్కీలో యత్నించారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పుదుచ్చేరికి చెందిన ఇద్దరు ఖైదీలను తప్పించేందుకు ....దుండగులు ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాడు సాయంతో వీరంతా సబ్‌జైలు వెనక నుంచి జైల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిలో ఎనిమిదిమంది లోనికి ప్రవేశించగా, మరో ఇద్దరు బయట వేచి ఉన్నారు. అయితే అప్రమత్తమైన హోంగార్డు.... పోలీసులకు సమాచారం అందించటంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితులను యానాం పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మరోవైపు పరారైనవారి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది పుదుచ్చేరికి చెందిన మణికంఠ అనే ఖైదీతో పాటు మరొకరిని అధికారులు యానాం సబ్ జైలుకు తరలించారు. వారిని విడిపించేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు సమాచారం. కాగా మణికంఠను హతమార్చేందుకే దుండగులు వచ్చినట్లు మరో వాదన వినిపిస్తుంది. నిందితులంతా పుదుచ్చేరికి చెందినవారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.