
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీ, భార్యపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటన యానాంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యానాం వంశీకృష్ణ కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోవటానికి వచ్చిన కన్నతల్లీపై కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ దాడిలో అత్తాకోడళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న యానాం పోలీసులు శ్రీనివాస్‌కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment