తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో.. | tragedy in East Godavari: tea is mixed with insecticide instead of | Sakshi
Sakshi News home page

తూ.గో.లో విషాదం: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..

Published Sat, Sep 14 2024 3:20 PM | Last Updated on Sat, Sep 14 2024 4:30 PM

tragedy in East Godavari: tea is mixed with insecticide instead of

తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.  టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్‌(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement