rajanagaram
-
తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..
తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
-
దద్దరిల్లిన రాజానగరం
-
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
-
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
-
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
-
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
-
కలవచర్ల గ్రామంలో పార్ను ప్రారంభించిన మంత్రి అమరనాథ్
-
ఇంటింటికి గోదావరి
-
రాజమండ్రి కాతేరు చంద్రబాబు సభలో గందరగోళం
-
సాధికార యాత్రకు జననీరాజనం
-
బూరుగుపూడిలో ‘సామాజిక’ ప్రభంజనం
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో సామాజిక నినాదం మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అశేష సంఖ్యలో హాజరైన జనం బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘జై జగన్.. జైజై జగన్’ నినాదాలతో రహదారి దద్దరిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో దోసకాయలపల్లి నుంచి బూరుగుపూడి వద్ద సభా ప్రాంగణం వరకూ పెద్దఎత్తున బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మేళతాళాలు, పూలజల్లులు, జేజేలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన లబ్ధిని గుర్తుచేసేలా మంత్రులు, నేతలు సాగించిన ప్రసంగాలు వింటూ.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్లీ జగన్‌కే పట్టం కడతామని నినదించారు. ఈ సభలో హోంమంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వెల్లివెరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. పిల్లల చదువులకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కలను నిజంచేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న పేదరికం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆరు శాతానికి తగ్గింది. సామాన్యుల నేత : ఎంపీ సురేష్ సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల నాయకుడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వ్యవసాయం పండుగ కావాలన్నా మళ్లీ జగనే సీఎం కావాలి. ఆయన పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోంది. సంక్షేమం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసి సామాన్యుల నేతగా ఖ్యాతి గడించారు. పేదలు మరింత బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలి. అన్ని వర్గాలూ ప్రభుత్వంలో భాగస్వాములే : మంత్రి జోగి రమేష్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు అందరూ భాగస్వాములే. రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చి గౌరవించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో నాలుగు స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, చైర్మన్ స్థానాలిచ్చారు. సామాజిక న్యాయ నిర్ణేత జగన్ : పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ హామీలన్నీ అమలుచేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుంది. జగన్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమైంది. అలాంటి నేతను తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలి. 175 ఎందుకు ఇవ్వకూడదు? : అలీ మంచి చేసే నేతను ప్రజలు అభిమానిస్తారు. అందుకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్‌కు ఘన విజయం చేకూర్చడం. ‘వై నాట్ 175’ అని సీఎం ప్రతి సమావేశంలో చెబుతుంటారు. ప్రజలకు మంచి చేస్తున్న ఆయన అడిగిన సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ అభివృద్ధి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం రాజానగరం అభివృద్ధి, సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి రూ.1,152 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1,145 కోట్లు వెచ్చించాం. 20 వేల మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేశాం. రూ.104 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. రూ.217 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నాంది పలికాం. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడేందుకు రూ.91 కోట్లతో తొర్రిగెడ్డ కాలువపై రివర్స్ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టు నిర్మించనున్నాం. -
East Godavari: జైత్రయాత్రలా సామాజిక బస్సు యాత్ర
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. 42వ రోజు బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర సాగింది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. ఊసరవెల్లి చంద్రబాబు: మంత్రి మేరుగ నాగార్జున ఊసరవెల్లి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు. రాజ్యాంగబద్ధమైన అవకాశాలు రాకుండా చేశారు. చంద్రబాబు హయాంలో బీసీ ఎస్సీలపై అనేక దాడులు పాల్పడ్డారు. కులం, మతం, వర్గం, పార్టీ తారతమ్యం లేకుండా అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. పేదల పిల్లలకు కార్పొరేట్ విద్య చదివించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వమిది. పేదలకు 31 లక్షలు ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్‌కే జనం పట్టం: మంత్రి తానేటి వనిత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సీఎం జగన్ హయాంలో సామాజిక న్యాయం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించి పేదరికాన్ని దూరం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు బురద జల్లుతున్నారు. పిల్లలకు అందించే ట్యాబులపై కూడా బురద జల్లుతున్నారు. జగనన్న అందిస్తున్న పాలనలో కంటెంట్ ఉంది.. అందుకే ఆయన కటౌట్‌తో సాధికార బస్సు యాత్రలు చేయగలుగుతున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్‌కే జనం పట్టం కడతారు ఇది ప్రజలు గ్రహించాలి: ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు కావాలా.. ప్రేమను పంచుతున్న జగన్ కావాలా అన్న విషయాన్ని జనం తెలుసుకోవాలి. మరో ఐదేళ్లు జగనన్నకు అవకాశం ఇస్తే విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు అద్భుతంగా రూపొందుతాయి. -
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్ (ఫోటోలు)
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చదవండి: ‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ -
ఎనిమిదేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రీ ఎంట్రీ
సాక్షి, తూర్పుగోదావరి(రాజానగరం): ‘కథ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షక్షులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాంతార’, ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ‘కార్తికేయ –2’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. పరమ మూఢభక్తితో కూడిన కథాంశంతో తీసిన చిత్రాలను కూడా ఈ రోజు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే వారు ఎప్పుడూ ఒకే మూసలో ఉండే చిత్రాలను కాకుండా కొత్తదనం ఉన్న చిత్రాలనే ఆదరిస్తారని అర్థమవుతోంది’ అంటున్నారు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. తూర్పు గోదావరి జిల్లాలోని కొంకుదురుకు చెందిన ఈయన రాజానగరంలో శుక్రవారంఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 2014లో యమలీల–2 సినిమా తీసి, విరామం తీసుకున్న ఆయన తాజాగా మెగాఫోన్ పట్టారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడిగా ఎనిమిదేళ్ల విరామం తరువాత ఇస్తున్న రీ ఎంట్రీ గురించి వివరించారు. ప్రశ్న: రాజేంద్రుడు–గజేంద్రుడు, మాయలోడు, వినోదం, మావిచిగురు, యమలీల, శుభలగ్నం వంటి అనేక సూపర్ హిట్లు ఇచ్చిన మీరు చాలా కాలంగా సినిమాలు తీయడం లేదు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? జవాబు: ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ అనే చిత్రాన్ని తీస్తున్నాను. దాదాపుగా షూటింగ్ పార్టు అంతా పూర్తయింది. జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో సహాయ్లరగర్, మృణాళిని హీరో హీరోయిన్లు కాగా ఆర్గానిక్ మామగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. అలాగే మీనా, సునీల్, అజయ్‌ఘోష్, సూర్య, హేమ ఇలా అనేకమంది తారాగణం ఉన్నారు. గతంలో నేను తీసిన చిత్రాలలో కనిపించే కుటుంబ నేపథ్య వాతావరణంతోపాటు హాస్యరసం, కష్టాలు, కన్నీళ్లు, చక్కటి సంగీతంతో కూడిన వినోదం.. అన్నీ ఉంటాయి. ప్రశ్న: ఎనిమిదేళ్ల అనంతరం ఈ సినిమా తీయడానికి కారణం? జవాబు: కాలంతోపాటు ప్రేక్షకుల ఆదరణలో వస్తున్న మార్పులను గమనిస్తున్న నేను ఖాళీగా కుర్చోవడం ఎందుకని ఒక కథ తయారు చేశా. దానికి స్క్రీన్‌ప్లే, మాటలు కూడా రాసిన తరువాత రూ. 10 కోట్ల వ్యయంతో ఈ సినిమాను తీశాను. క్లైమాక్స్‌లో కూడా నవ్వులు కురిపించే చిత్రంగా వచ్చింది. గతంలో మాయలోడు, వినోదం సినిమాలు వచ్చాయి. వాటిని మరింపిచే రీతిలో ఈ సినిమా ఉంటుంది. దీనిలో వ్యక్తుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, పగలు, ప్రతీకారాలు, అన్నీ మిళితమై ఉంటాయి. ప్రతి అంశంలోను కామెడీ ఉంటుంది. ప్రశ్న: మీ సినిమాలో సందేశం ఏమైనా ఉంటుందా? జవాబు: ‘ప్రేమను ప్రేమతోనే కలుపుకోవాలి గాని, పగలు, ప్రతీకారాలతో కాదనే’ సందేశంతో ఈ సినిమాను రూపొందించాం. ప్రేమించడం చేతనైన వాడికి కష్టం తెలియదు, పగతో రగిలిపోయేవాడికి సుఖం దొరకదు, ఇది జగమెరిగిన సత్యం. ప్రశ్న: తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటి? జవాబు: తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడిక్కెడికో పరుగులు పెడుతోంది. ఆనందమే, కానీ బడ్జెట్ విషయంలో కాస్త కంట్రోలు ఉంటే బాగుంటుంది. కథ డిమాండ్‌ని బట్టి వ్యయం ఉండాలిగాని, గొప్పగా చెప్పుకునేందుకు కాలాన్ని, డబ్బును వృథా చేయకూడదు. వృథా చేస్తే డబ్బు సంపాదించుకోవచ్చునేమోగాని, కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. ప్రశ్న: దర్శకుడిగా కెరీర్ కొనసాగిస్తారా? జవాబు: కొంతకాలం పాటు సినిమాలు తీయడం కొనసాగిస్తాను. ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటే.... -
ప్రారంభమైన మొబైల్ థియేటర్
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలకు సమీపాన హెబిటేట్ రెస్టారెంట్ పక్కన ఏర్పాటు చేసిన మొబైల్ థియేటర్ ప్రారంభమైంది. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సోమవారం దీనిని ప్రారంభించారు. ‘పిక్చర్ టైమ్’ సంస్థ ఏర్పాటు చేసిన ఈ థియేటర్ గ్రామీణ ప్రాంతాల వారికి ఐమాక్స్‌లో సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులలో ఒకరైన చైతన్య తెలిపారు. ఇన్‌ఫ్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ (గాలి నింపిన టెంట్)తో తయారైన ఈ థియేటర్ అన్ని వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకుంటుందన్నారు. 35 ఎంఎం స్క్రీన్‌తో, 120 సిటింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌కి ఏడాది పాటు అనుమతులున్నాయని, ఈనెల 29న విడుదలయ్యే ఆచార్య సినిమాతో రెగ్యులర్ షోలు వేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌తోపాటు బుకింగ్ కౌంటర్‌లోను లభించే టికెట్లు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లభిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జీఎస్ఎల్ ప్రతినిధులు డాక్టర్ గన్ని సందీప్, డాక్టర్ జి. తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జనబాట కార్యక్రమం
-
హత్యల మిస్టరీ వీడింది.. తాగి తందనాలాడుతుంటే తిడుతోందని..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం, సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితులను అరెస్టు చేశామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగీ తెలిపారు. మినీ వ్యాన్ డ్రైవర్ హత్య కేసులో ముగ్గురిని, వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, నిందితుల్లో ఇద్దరు బాల నేరస్తులున్నారని వివరించారు. తన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వేలిముద్రే పట్టించింది పిఠాపురానికి చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ ఒగ్గు నాగేంద్ర (32) ఈ నెల 26న తాడేపల్లిగూడెం వెళ్లి కమలా ఫలాల లోడు వేసుకుని తిరిగి వెళుతున్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నన్నయ యూనివర్సిటీ సమీపానికి వచ్చేసరికి ఆ వ్యాన్‌ను రాజమహేంద్రవరం శంభూనగర్కు చెందిన మద్ది వెంకట సాయి (వెంకట్), కడియం మండలం వేమగిరికి చెందిన తూము ముత్యాలు, ఓ బాల నేరస్తుడు కలిసి ఆపారు. నాగేంద్రను బెదిరించి డబ్బులు, సెల్‌ఫోన్ లాక్కొనేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో ముద్దాయిలు చాకులతో అతడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచి పరారయ్యారు. జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందాడు. ఈ కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్ క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఓ నిందితుడి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ముద్దాయిలను ఆదివారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నాగేంద్రను హత్య చేసిన తరువాత నిందితులు విశాఖకు పారిపోయారు. తిరిగి వస్తూ కత్తిపూడిలో ఓ స్కూటర్ దొంగిలించారు. వారి నుంచి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటర్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల్లో మద్ది వెంకట సాయిపై చోరీ కేసులతో పాటు సస్పెక్ట్ షీటు కూడా ఉంది. అలాగే తూము ముత్యాలుపై ఒక కేసు, బాల నేరస్తుడిపై రెండు కేసులు ఉన్నాయి. ఈ కేసును చాకచక్యంగా విచారించి, నిందితులను అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుభాష్, క్లూస్ టీం ఎస్సై ప్రవీణ్, ఎస్సైలు ఎండీ జుబేర్, సుధాకర్, హెడ్ కానిస్టేబుళ్లు రమణ, ఎం.ప్రసాద్, కానిస్టేబుళ్లు బి.విజయకుమార్, కె.పవన్‌కుమార్, సూరిబాబు, ఆర్వీ రమణ, ఎన్.రాంబాబులను ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. చదవండి: (ఊరి చివర పాడుబడిన బావిలో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య) తాగి తందనాలాడుతుంటే తిడుతోందని.. సీతానగరం మండలం వంగలపూడిలో ఈ నెల 24న జరిగిన కోదేళ్ల నాగమ్మ అలియాస్ చింతాలమ్మ (72) హత్య కేసు మిస్టరీని కూడా పోలీసులు ఛేదించారు. నాగమ్మ మృతదేహంపై గాయాలుండటంతో ఆమె బంధువు కొండయ్య ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో విచారించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇచ్చిన ముఖ్య సమాచారం ఆధారంగా వంగలపూడికే చెందిన యువకుడు ఇండుగుమిల్లి నవీన్‌ను, ఓ బాల నేరస్తుడిని వీఆర్వో ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించారు. ప్రతి రోజూ మద్యం తాగి ఊళ్లో బలాదూర్‌గా తిరుగుతున్న వీరిని నాగమ్మ తరచూ అసభ్య పదజాలంతో తిట్టేది. ఈ నెల 24న పుట్టిన రోజు సందర్భంగా మద్యం తాగి వస్తున్న వారిద్దరినీ చూసిన నాగమ్మ తీవ్రమైన పదజాలంతో దూషించింది. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలని నిందితులిద్దరూ నిర్ణయించుకున్నారు. వెంటనే నాగమ్మ ఇంట్లోకి వెళ్లి చెంబుతో ఆమె ముఖంపై కొట్టారు. ఆమె ఇంట్లోనే ఉన్న గునపంతో ఆమె ఛాతి మీద బాది హతమార్చారు. నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. వృద్ధురాలి హత్యకు వారు ఉపయోగించిన చెంబు, గునపం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో ప్రతిభ చూపిన కోరుకొండ ఇన్స్పెక్టర్ పీఈ పవన్‌కుమార్‌రెడ్డి, సీతానగరం ఎస్సై కె.శుభశేఖర్, కానిస్టేబుళ్లు పి.రాము, ఎస్.ప్రసాద్, సీహెచ్ గోవిందు, బి.వెంకటేష్‌లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. విలేకర్ల సమావేశంలో శాంతిభద్రతల ఏఎస్పీ లతామాధురి, నార్త్‌జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. చదవండి: (భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!) -
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న కరోనా
రాజానగరం: కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాలను కకావికలం చేస్తోంది. కొన్ని కుటుంబాలపై కక్ష కడుతోంది. లాలాచెరువు హెచ్‌బీ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు 10 రోజుల వ్యవధిలో కరోనా వైరస్‌తో మృతిచెందడం కాలనీవాసులను తీవ్రంగా కలచివేస్తుంది. రాజమహేంద్రవరంలో నటరాజు, శివజ్యోతి థియేటర్లకు మేనేజర్‌గా పనిచేస్తున్న జీవీవీఎస్‌శర్మ అనే నటరాజశర్మ (75) కరోనా వైరస్‌తో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగిన శర్మ పిల్లలు ముగ్గురికి వివాహాలు చేశారు. ఈ సంతానంలో 10 రోజుల క్రితం పెద్దమ్మాయి (45), ఐదు రోజుల క్రితం చిన్నమ్మాయి (32), కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూనే మరణించారు. ప్రస్తుతం శర్మ భార్య హోమ్క్వారంటైన్లో ఉన్నారు. వేదమాత బ్రహ్మణ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన అయ్యప్పస్వామి మాల దీక్ష ధరించి, 36 సంవత్సరాల నుంచి శబరిమలై వెళ్లి వస్తూ, గురుస్వామిగా పేరొందారు. నటరాజ థియేటర్ మేనేజర్‌గా ఉండటంతో అంతా నటరాజశర్మ అని పిలిచేవారు. శర్మ మరణం పట్ల మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు మెట్ల ఏసుపాదం తదితరులు విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు. చదవండి: అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు అమ్మకు కేక్ కొనాలని వెళ్తూ.. -
చుట్టేసెయ్ చుట్టేసెయ్.. భూమి..
సాక్షి, రాజానగరం: ప్రఖ్యాత రచయిత రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘లోక సంచారి’ అతడికి స్ఫూర్తి. మాతృదేశాన్ని చుట్టి రావాలన్నది అతడి సంకల్పం. తన 25వ ఏట ప్రారంభమైన అతడి సంచారం ఎనిమిదేళ్లుగా 17 వేల కిలోమీటర్లు కొనసాగింది. ఇంకా సాగుతూనే ఉంది. తన ద్విచక్ర వాహనాలైన బుల్లెట్, లేదా బైక్‌పై పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు తదితర ప్రఖ్యాత స్థలాలను అతడు చుట్టి వచ్చాడు. తాజాగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర రాజధాని హంపీ నగరాన్ని సందర్శించి వచ్చాడు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన జీవితాశయమని చెప్తాడు రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చెందిన 33 ఏళ్ల పెన్నాడ మోహన్. బీఎస్సీ చదివిన అతడు ఉద్యోగం కోసం చూడకుండా వ్యాపారం వైపు అడుగులు వేశాడు. భార్య, ఇద్దరు కుమారులున్న మోహన్.. ‘సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్’ అన్న మహాకవి మాటలను ఉన్నంతలో ఆచరించేందుకు ‘లియో ఫౌండేషన్’ ప్రారంభించాడు. దివాన్‌చెరువులో జాతీయ రహదారిని ఆనుకుని ఒక సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్న ఆయన ఎనిమిదేళ్లుగా ఏటా దేశంలోని ఏదో ఒక ముఖ్య ప్రదేశానికి వెళ్లి వస్తుంటాడు. తన యాత్రలను ద్విచక్ర వాహనాలపైనే సాగిస్తూ రాత్రి వేళ గుడారం వేసుకుని తలదాచుకుంటాడు. కొన్నిచోట్ల స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభించేదని చెప్తాడు. ఈ యాత్రానుభవాలతో పుస్తకం తీసుకువస్తా.. తాను చూసిన ప్రకృతి అందాలను, సంస్కృతులను భావితరాలకు తెలియజేసేందుకు మోహన్ కొన్ని పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాడు. వాటిలో ‘నేను చూసిన డొక్కా సీతమ్మ’, ‘ఆ రాత్రి నేను కాదేమో’, ‘తలుపులు లేని ఊరు స్యాలియా’ వంటివి బాగా పాఠకాదరణ పొందాయి. ఎనిమిదేళ్లు సాగిన యాత్రపై ‘ప్రయాణంలో నా జీవితం’ అనే పుస్తకాన్ని కూడా తీసుకువస్తానంటున్నాడు. ఇంతవరకూ తన యాత్రలకు కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని, అదే స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహిస్తానంటున్నాడు మోహన్. -
దోచుకొని దాచుకున్న మీరా విమర్శించేది?
సాక్షి, కోరుకొండ (రాజానగరం): గత టీడీపీ ప్రభుత్వంలో దొరికినంత దోచుకొని దాచుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కోరుకొండ శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కళావేదిక పై ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ చేస్తున్న అసత్య ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఒక్కరికి ఓటు వేస్తే ముగ్గురం నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తామని ఆనాడే చెప్పామన్నారు. మా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని నన్ను నా పిల్లలు దేవతగా కొలుస్తారని, నా మాటను శాసనంగా భావిస్తారని అన్నారు. తన కుటుంబంపై వెంకటేష్ తరుచూ ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఇసుక, మట్టి దోచుకోవడం, ధనార్జనే థ్యేయంగా పనిచేయడంతోనే టీడీపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీకు ప్రజలు గుణపాఠం చెప్పార న్నారు. మీరు గాలివాటున రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. గతంలో మీ సతీమణి అన్నపూర్ణకు టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిపోయారని, మరోసారి ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకుండా మీరు ఎలా లాక్కున్నారో అందరికి తెలుసు అన్నారు. స్వచ్ఛ కోరుకొండ కార్యక్రమంలో గ్రామ వలంటీర్లు పాల్గొంటున్నారని దానిని మాజీ ఎమ్మెల్యే రాజకీయం చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర, వనం–మనం కార్యక్రమంలో ప్రభుత్వాధికారులను, విద్యార్థులను ఎలా ఉపయోగించుకున్నారో మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక దోపిడీ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులపై మీ ప్రోత్సాహంతోనే దాడిచేసిన సంఘటన అందరికీ తెలిసిందేనని అన్నారు. కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతిని ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తీసుకువచ్చారన్నారు. దానిని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, లేకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల నాయకులు తిరుమలశెట్టి సత్యనారాయణ, నక్కా రాంబాబు, బొరుసు బద్రి, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి తాడితోట (రాజమహేంద్రవరం ) : వైద్య విధానపరిషత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిని సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతానన్నారు. ఈ సంఘం వైఎస్సార్ సీపీ టీయూసీకి అనుబంధంగా పని చేస్తుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికకు వైఎస్సార్ సీపీ టీయూసీ తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జి మస్తానప్ప ఎన్నికల పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. -
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల దుర్మరణం
‘నాతిచరామి’ అంటూ పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను మరువ లేదేమోనన్నట్టుగా.. ఆ దంపతులు.. ఒకరికొకరు తోడుగా మృత్యు కౌగిట్లోకి ఒదిగిపోయారు. రాజానగరం శివారు శ్రీరామనగర్‌లో బంధువుల ఇంట ఓ ఫంక్షన్‌కు వెళ్లిన తోకాడకు చెందిన దంపతులు రాయుడు నరసింహమూర్తి, సత్యవతి.. తిరుగు పయనంలో.. ఆ ఫంక్షన్ జరిగిన ఇంటికి సమీపంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బంధువులంటే అతడికి వల్లమానిన అభిమానం. ఎవరింట ఏ కార్యక్రమం జరిగినా.. తప్పనిసరిగా హాజరై అందరితో సరదాగా ఉండే అతడంటే వారందరికీ కూడా ఎంతో అభిమానం. అదేవిధంగా శ్రీరామనగర్‌లో బంధువుల ఇంట నిర్వహించిన ఫంక్షన్‌కు భార్య, కుమారుడితో వచ్చి తిరిగి వెళుతుంటే.. ఆ ఇంటి సమీపంలోనే ప్రమాదానికి గురై భార్యతో సహా చని పోయాడు. విషయం తెలుసుకున్న పంక్షన్‌లోని వారందరూ పరుగున వెళ్లి విగతజీవులుగా పడి ఉన్న భార్యాభర్తలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సాక్షి, తూర్పుగోదావరి: రాజానగరం శివారు శ్రీరామనగర్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. మండలంలోని తోకాడకు చెందిన రాయుడు నరసింహమూర్తి (55), అతని భార్య సత్యవతి (50) కుమారుడు గోవిందుతో కలసి మోటారు బైకుపై శ్రీరామనగర్‌లోని బంధువుల ఇంట జరిగే ఒక ఫంక్షన్‌కు వచ్చారు. ఫంక్షన్ ముగిశాక తిరుగు పయనమై డివైడర్ దాటి అవతల వైపువెళుతుండగా బైక్‌పై ఉన్న వీరిని.. జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకు నడుపుతున్న కుమారుడు గోవిందుతోపాటు వెనుక కూర్చున్న భార్యాభర్తలు ఎగిరి పడ్డారు. డివైడర్‌పై వర్షపు నీరు పోయేందుకు నిర్మించిన సీసీ బోదెల అంచులకు భార్యాభర్తల తలలు బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. గోవిందు మాత్రం డివైడర్‌పై గడ్డితో ఉన్న మట్టిపై పడటంతో కాలు, చెయ్యి విరిగింది. వెంటనే అతడిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు చిన్నతనంలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరిలో పెద్దవాడికి, అమ్మాయికి వివాహాలను వారు చేశారు. గాయపడిన కుమారుడు గోవిందు అవివాహితుడు. సంఘటన స్థలంలో ప్రమాదం జరిగిన తీరును రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సమయం మించిపోవడంతో సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. -
పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి..
సాక్షి, రాజానగరం(తూర్పు గోదావరి) : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జాతీయ రహదారి పై లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దివాన్‌చెరువుకు చెందిన బలభద్ర వీరభద్రరావు అనే చిన్నబ్బు (55) అనారోగ్యంతో రాజమహేంద్రవరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన ఇయ్యపురాలిని పరామర్శించేందుకు భార్య, మనుమడితో కలసి బైకు పై వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళుతున్న లారీని వెనుక వస్తున్న మరో లారీ అధిగమించే ప్రయత్నంలో రహదారి పక్క నుంచి వెళుతున్న చిన్నబ్బు బైకును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అతడి భార్య, మనుమడు రహదారికి ఎడమ వైపు పడిపోగా, చిన్నబ్బు కుడివైపునకు పడటంతో లారీ అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కట్టుకున్న భర్త మృత్యువాత పడడంతో చిన్నబ్బు భార్య సూర్యలక్ష్మి సొమ్మసిల్లి పోయారు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరభద్రరావు -
తరిమి కొట్టి.. చెట్టుకు కట్టి..
సాక్షి, రాజానగరం(పశ్చిమ గోదావరి): భూవివాదంలో ఓ వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటనతో రాజంపేటవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మునికూడలికి చెందిన చిడిపి నాగభూషణానికి తన చిన్నాన్న చిడిపి నాగయ్యతో తొమ్మిది సెంట్ల భూవివాదం కొంతకాలంగా నడుస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు తన చిన్నాన్న కుమారుడు చిడిపి నాగేశ్వరావు(స్టాలిన్) మునికూడలి పంచాయతీ పరిధిలోని రాజంపేటలో ఉన్న భూమిని దున్నుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న స్టాలిన్, తన కుమారుడు తరుణ్‌లతోపాటుగా ఇనుగంటివారిపేటకు చెందిన నలుగురు యువకులు క్రికెట్ బ్యాట్లు, స్టంప్లతో నాగభూషణంపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు రాజంపేట గ్రామంలోకి పరుగులు తీశాడు. నీలవేణి అనే మహిళకు తన వద్ద ఉన్న బ్యాగ్‌ను ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పగా, అప్పటికే దాడి చేస్తున్న వారు చేరుకోవడంతో భయభ్రాంతులకు గురై ఆమె తిరిగి బ్యాగ్‌ను నాగభూషణానికి అందించింది. నాగభూషణం నుంచి బ్యాగ్‌ను తీసుకుని కొడుతూ ఈడ్చుకుని వెళ్లి పొలం వద్ద ఉన్న కొబ్బరి చెట్టుకు కట్టేశారు. విషయం తెలిసిన నాగభూషణం కుమారుడు రాజు 100కు కాల్ చేయడంతో స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, కానిస్టేబుల్ ప్రసాద్ వెళ్లి చెట్టుకు కట్టి ఉన్న నాగభూషణాన్ని విడిపించారు. బ్యాగ్‌లో పొలం దస్తావేజులు, రెండు బ్యాంక్ చెక్‌బుక్‌లతోపాటుగా పాస్‌బుక్‌లు, ప్రాజెక్ట్‌కు సంబంధించిన పత్రాలు, రూ.45 వేలు ఉన్నాయని భాదితుడు నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కోరుకొండ సీఐ పవన్‌కుమార్ రెడ్డి, ఎస్సై డి ఆనంద్ కుమార్ విచారించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆనంద్ కుమార్ తెలిపారు.