జీఎస్‌ఎల్‌లో ప్రారంభమైన ఫెలోషిప్ వర్క్‌షాప్ | Fellowship Workshop in GSL started | Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎల్‌లో ప్రారంభమైన ఫెలోషిప్ వర్క్‌షాప్

Published Sat, Jul 2 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

Fellowship Workshop in GSL started

 రాజానగరం : ఉదరకోశ, జీర్ణాశయ, పేగులకు సంబంధించిన వ్యాధులకు సర్జరీలు చేసే వైద్యులకు అందజేసే ఫెలోషిప్ వర్క్‌షాప్ స్థానిక జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో శుక్రవారం ప్రారంభమైంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఎదురయ్యే సంక్లిష్టతలు, నివారణలు, సులువులు, రిస్కులు, సవాళ్లు తదితర 15 అంశాలపై అనుభవజ్ఞులైన వైద్యులు సోదాహరణంగా వివరించారు.
 
  ఫెలోషిప్ ఇన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గాస్ట్రో, ఎండో సర్జన్స్ ఇచ్చే ఈ ఫెలోషిప్ నిర్వహణకు ఏపీలో మొదటిసారిగా జీఎస్‌ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రులను అసోసియేషన్ ఎంపిక చేసిందని ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ సమీర్ రంజన్ తెలిపారు. సర్జన్ల వృత్తి నైపుణ్యాలను మదింపు చేయడానికి పరిపూర్ణమైన వైద్యవిజ్ఞాన సదుపాయాలు, వసతులు ఉండాలి. అటువంటి సౌకర్యాలు ఉన్నందునే జీఎస్‌ఎల్‌ని ఎంపికచేశారన్నారు.
 
 అసోసియేషన్, జీఎస్‌ఎల్ వైద్య కళాశాల సర్జరీ విభాగం, సిములేటర్ లేబొరేటరీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాపు మొదటి రోజు నిరంతర వైద్య విద్య(సీఎంఈ) కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ లకు చెందిన సుమారు 90 మంది సర్జన్లు పాల్గొన్నారు. రెండో రోజు ఫెలోషిప్ టెస్ట్ జరగనుందని, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎగ్జామినర్లుగా వ్యవహరిస్తారన్నారు.
 
  మూడో రోజు సీనియర్ వైద్యులు చేసే శస్త్ర చికిత్సలను మిగిలిన సర్జన్లు లైవ్‌లో చూస్తూ అనుమానాలను నివృత్తి చేసుకుంటా వారితో చర్చిస్తారని లేబొరేటరీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆకృతి తెలిపారు. జిల్లాకు చెందిన వైద ్య విద్య అధ్యాపకులు డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ దిలీప్‌సోరెన్, డాక్టర్ సుష్మ, డాక్టర్ భాస్కరచౌదరి, హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ కోన లక్ష్మి, న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ మీనాక్షిశ ర్మ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక ్టర్ వైవి శర్మ, సూపరింటెండెంట్ డాక్టర్ టి. సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement