‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’.. బుక్‌లెట్‌లను ఆవిష్కరిస్తున్న నేతలు
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో సామాజిక నినాదం మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అశేష సంఖ్యలో హాజరైన జనం బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘జై జగన్.. జైజై జగన్’ నినాదాలతో రహదారి దద్దరిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో దోసకాయలపల్లి నుంచి బూరుగుపూడి వద్ద సభా ప్రాంగణం వరకూ పెద్దఎత్తున బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు.
దారి పొడవునా మేళతాళాలు, పూలజల్లులు, జేజేలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన లబ్ధిని గుర్తుచేసేలా మంత్రులు, నేతలు సాగించిన ప్రసంగాలు వింటూ.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్లీ జగన్‌కే పట్టం కడతామని నినదించారు. ఈ సభలో హోంమంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున
సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వెల్లివెరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. పిల్లల చదువులకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కలను నిజంచేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న పేదరికం.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆరు శాతానికి తగ్గింది.
సామాన్యుల నేత : ఎంపీ సురేష్
సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల నాయకుడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వ్యవసాయం పండుగ కావాలన్నా మళ్లీ జగనే సీఎం కావాలి. ఆయన పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోంది. సంక్షేమం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసి సామాన్యుల నేతగా ఖ్యాతి గడించారు. పేదలు మరింత బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలి.
అన్ని వర్గాలూ ప్రభుత్వంలో భాగస్వాములే : మంత్రి జోగి రమేష్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు అందరూ భాగస్వాములే. రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చి గౌరవించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో నాలుగు స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, చైర్మన్ స్థానాలిచ్చారు.
సామాజిక న్యాయ నిర్ణేత జగన్ : పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ
హామీలన్నీ అమలుచేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుంది. జగన్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమైంది. అలాంటి నేతను తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలి.
175 ఎందుకు ఇవ్వకూడదు? : అలీ
మంచి చేసే నేతను ప్రజలు అభిమానిస్తారు. అందుకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్‌కు ఘన విజయం చేకూర్చడం. ‘వై నాట్ 175’ అని సీఎం ప్రతి సమావేశంలో చెబుతుంటారు. ప్రజలకు మంచి చేస్తున్న ఆయన అడిగిన సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
నియోజకవర్గ అభివృద్ధి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం
రాజానగరం అభివృద్ధి, సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి రూ.1,152 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1,145 కోట్లు వెచ్చించాం. 20 వేల మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేశాం. రూ.104 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. రూ.217 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నాంది పలికాం. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడేందుకు రూ.91 కోట్లతో తొర్రిగెడ్డ కాలువపై రివర్స్ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టు నిర్మించనున్నాం.
Comments
Please login to add a commentAdd a comment