Rajanagaram Assembly Constituency
-
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తూర్పు గోదావరి, సాక్షి: మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.రాజానగరం సిద్ధమా? ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల చూపిస్తున్న ప్రతీ అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి.నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్ బడులు. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. సైకిల్ డ్యామేజ్ ఎంతలా అంటే.. ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్ రిపేర్ కోసం మెకానిక్‌లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి.. తుప్పు పట్టిన ఆ సైకిల్‌ను చూశారు. ఆ సైకిల్‌కు సీటు లేదు. చక్రాల్లేవ్. సైకిల్‌కు పెడెల్ లేదు. ట్యూబ్‌లు ల్లేవ్. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో.ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారు. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ముఖ్యమైన మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా?. ఇంటింటికీ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో పంపించి.. ఆ తర్వాత ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా?ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెస్టో డ్రామాలాడుతున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఢిల్లీతో కుట్రలు పన్ని..ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా?. జగన్ ఏదైనా బటన్లు నొక్కాడో.. ఆ బటన్లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్ 4వ తేదీ తర్వాత.. ఒక వారంలోనే ఆ బటన్లు అన్నీ క్లియర్ చేస్తాడు. 👉కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే జగన్లాగా బాబు బటన్లు నొక్కలేదు. ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కోసం డబ్బులు ఇవ్వలేదు. ఏ పథకం లేదు. మీ బిడ్డ అలా కాదు. 59 నెలల కాలంలో 130 బటన్లు నొక్కాడు. రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు దగ్గర దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఎన్నికల కోసం ఆ డబ్బు పంచే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది మనదే.. మన దగ్గర దోచేసిన సొమ్ము. కాబట్టి, ఏ ఒక్కరూ వద్దు అని చెప్పకండి. కానీ, ఓటేసేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి.👉ఇది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు. పెత్తందారు మరోవైపున జరుగుతున్న యుద్ధం. ఇంట్లోవాళ్లతో అందరితో మాట్లాడండి. అభిప్రాయం తీసుకోండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందనేది చూడండి. జాగ్రత్తగా ఓటేయండి. ఈ విషయం చెప్పడం అవసరం.👉ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు. అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి. ఛీటింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డా. గూడురి శ్రీనివాసులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని పేరుపేరున ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. -
జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది. వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్‌రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. బత్తులపై బాబు ఆగ్రహం చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు. -
పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: జనసేన –టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో.. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం అంతకన్నా హాస్యాస్పదమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ, ఒక్క రాజోలులోనే జనసేన గెలిచింది. అలాంటి రాజోలు స్థానంలో జనసేన పోటీ చేయడం ఏమైనా విచిత్రమా? రాజానగరం నియోజకవర్గాన్ని టీడీపీ ఇప్పటికే జనసేనకు వదిలేసింది. పవన్ పోటీ చేస్తున్నట్లు చెప్పింది కూడా ఈ రెండు నియోజకవర్గాలే. ఇక్కడే డ్రామా మొత్తం బయటపడిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. మండపేట, అరకు నియోజకవర్గాలకు చంద్రబాబు ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడానికి కౌంటర్‌గా, గుణపాఠం చెబుతున్నట్లుగా పవన్ ఈ ప్రకటన చేయలేదన్నది సుస్పష్టమని అంటున్నారు. కేవలం పార్టీ నేతలు, అభిమానుల ముందు బిల్డప్ ఇవ్వడానికే పవన్ రెండు నియోజకవర్గాలపై ఈ హాస్యాస్పద ప్రకటన చేశారని, దీని వెనుకా చంద్రబాబే ఉన్నారని రాజకీయ పరిశీలకులు, జనసేన నేతలు కూడా చెబుతున్నారు. టీడీపీ – జనసేనల మధ్య పొత్తు ఖరారై నాలుగు నెలలు దాటింగి. ఇప్పుటికీ రెండు పార్టీల మధ్య సీట్ల గొడవ సాగుతూనే ఉంది. సీట్ల కేటాయింపుపై బాబు–పవన్ ఉమ్మడిగా ప్రకటన చేయాలని ఇప్పటికి రెండుసార్లు నిర్ణయించి, విఫలమయ్యారు. ఇంకో పక్క మా సీటు మీరెలా అడుగుతారంటూ నియోజకవర్గాల్లో టీడీపీ –జనసేన నాయకులు గొడవలు పడుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ తేలకపోయినప్పటకీ మండపేట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్టు ఆ రెండు చోట్లా సభలు పెట్టి మరీ చెప్పారు. అభ్యర్థులను కూడా ఆ సభల్లోనే ప్రకటించారు. బాబు తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా మండపేట నేతలు పవన్‌ను కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ శుక్రవారం నాటి ప్రకటన చేశారని చర్చ సాగుతోంది. సీట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం, టీడీపీ ఏకపక్ష వైఖరి కారణంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య పెద్దస్థాయిలో నెలకొన్న విభేదాలను తగ్గించి, అన్ని చోట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేన ఓట్లు టీడీపీకి బదలాయించడం కోసమే బాబు, పవన్ వ్యూహాత్మకంగా ఈ నాటకాన్ని మొదలుపెట్టి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. దీనికి ‘టిట్ ఫర్ టాట్’గా కలరింగ్ ఇవ్వడం ఆ ఇద్దరికే చెల్లిందంటున్నారు. పొత్తులకు ఎన్నెన్ని ఎత్తులో.. నమ్మించి నట్టేట ముంచడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును పవన్ విశ్వసిస్తున్నారని జనసేన నేతలూ నమ్మడంలేదు. పొత్తుల కోసం మొదటి నుంచి వెంపర్లాడుతూ మరోవైపు అలాంటిదేమీ లేదన్నట్లు బాబు, పవన్ చెబుతూ వచ్చారు. ఈ డ్రామాను ఇరు పారీ్టల వారితో పాటు రాష్ట్ర ప్రజలూ ఏ దశలోనూ విశ్వసించలేదు. ఈ దశలోనే స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ములాఖత్ మాటున పవన్ పొత్తు ప్రకటనా నాటకమన్న విషయం అప్పట్లోనే తేటతెల్లమైంది. బాబు అరెస్టుతో టీడీపీ పనైపోయిందని, పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ అత్యధిక సంఖ్యలో సీట్లను కేటాయించే అవకాశం ఉందని నమ్మి ఆ పార్టీ నాయకులు కూడా కలిసిపోయేందుకు రెడీ అయ్యారు. జనసేన 68 సీట్లను టీడీపీ ముందు ప్రతిపాదించి, కనీసం 45 స్థానాల్లో పోటీ చేయాలని ఆశపడుతోంది. అందులో సగం సీట్లు కూడా జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదని చర్చ సాగుతోంది. క్రమంగా టీడీపీ ముసుగు తొలగి, మోసపూరిత వైఖరి బయట పడుతుండటంతో జనసేన నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారంతా చంద్రబాబు, టీడీపీ మోసపూరిత వైఖరి గురించి మాట్లాడుతుంటే.. జనసేన అధినేత పవన్ మాత్రం సర్దుకుపోవాలన్న మాటలే వినిపిస్తున్నారు. పొత్తులో ఎలాంటి పరిస్థితులు ఉన్నా జనసేన సర్దుకపోవాల్సిందేనని, భరించాల్సిందేనని సొంత పార్టీ నేతలకు పదేపదే చెబుతున్నారు. శుక్రవారంనాటి సమావేశంలోనూ.. ముందుగా రెండు నియోజకవర్గాలపై ఓ బిల్డప్ ప్రకటన చేసి, చివరికి వచ్చేసరికి సర్దుకుపోవాల్సిందేనన్న టీడీపీ సందేశాన్నే ఇచ్చారు. సీట్ల కేటాయింపు తేలక మునుపే చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్ధులను ప్రకటించడంపై సొంత పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతూనే.. వాళ్ల పార్టీలో ఉన్న పరిస్థితిని మనమే అర్ధం చేసుకోవాలంటూ చంద్రబాబుకు వంతపాడారు. సీఎం పదవి లేదన్నలోకేశ్కూ జీ హుజూరే! టీడీపీ –జనసేన పొత్తు ఉన్నప్పటికీ, సీఎం పదవిలో పవన్ కళ్యాణ్‌కు వాటా లేదంటూ గతంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు సైతం తాజాగా జనసేన అధినేత జీహుజూర్ అనేశారు. నెల కిత్రం లోకేశ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ (రెండో మాటే లేదు)’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో జనసేన పారీ్టలో పెద్ద దుమారమే రేగింది. ఇన్నాళ్లూ దానిపై ఒక్కసారి కూడా మాట్లాడని పవన్.. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో స్పందించారు. పెద్ద మనస్సుతో ఆ వ్యాఖ్యలను తానే పట్టించుకోకుండా వదిలేశానని వివరించారు. 2024లో జగన్ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటన్నింటికీ నన్ను చాలా సార్లు రెస్పాండ్ కానీయకుండా చేస్తోందంటూ వంకలు చెప్పారు. ఎమ్మెల్యే సీట్లను పక్కనపెట్టి.. వార్డు పదవుల వాటా చర్చ రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ టీడీపీ కేటాయిస్తుంది, సీఎం పదవిలో వాటా ఉంటుందా అని జనసేన నేతలు ఉత్కంఠతో ఉంటే.. పవన్ మాత్రం వీటి ఊసెత్తకుండా ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిన్ని సీట్లు వస్తాయంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్లెన్ని వస్తాయో చెప్పకుండా.. ఈ ఎన్నికల తర్వాత కామన్ పొలిటికల్ ప్రోగ్రాం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మొదలు కార్పోరేషన్ వరకు జనసేన ఖచి్చతంగా మూడో వంతు సీట్లను తీసుకుంటుందంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే సీట్ల దగ్గర తాను ఆగిపోవడం లేదంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఏమిటో తెలిసిన జనసేన నేతలు పవన్ మాటలను నమ్మడంలేదు. ఇదంతా అసెంబ్లీ సీట్ల కేటాయింపుల వ్యవహారం నుంచి జనసేన నేతలు, అభిమానులను పక్కదారి పట్టించే ప్రయత్నమేనని, చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. చివరివరకు ఇలా సాగదీసి, ఎన్నికల ముంగిట్లో ఓ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు విదిలిస్తారన్నది సుస్పష్టమని చెబుతున్నారు. కేవలం జనసేన ఓట్లు టీడీపీకి పడటానికే చంద్రబాబు ఇలా జనసేన నేతలు, అభిమానులకు పవన్‌తో చెప్పిస్తున్నారని విశ్లేíÙస్తున్నారు. -
బూరుగుపూడిలో ‘సామాజిక’ ప్రభంజనం
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో సామాజిక నినాదం మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అశేష సంఖ్యలో హాజరైన జనం బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘జై జగన్.. జైజై జగన్’ నినాదాలతో రహదారి దద్దరిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో దోసకాయలపల్లి నుంచి బూరుగుపూడి వద్ద సభా ప్రాంగణం వరకూ పెద్దఎత్తున బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మేళతాళాలు, పూలజల్లులు, జేజేలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన లబ్ధిని గుర్తుచేసేలా మంత్రులు, నేతలు సాగించిన ప్రసంగాలు వింటూ.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్లీ జగన్‌కే పట్టం కడతామని నినదించారు. ఈ సభలో హోంమంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వెల్లివెరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. పిల్లల చదువులకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కలను నిజంచేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న పేదరికం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆరు శాతానికి తగ్గింది. సామాన్యుల నేత : ఎంపీ సురేష్ సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల నాయకుడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వ్యవసాయం పండుగ కావాలన్నా మళ్లీ జగనే సీఎం కావాలి. ఆయన పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోంది. సంక్షేమం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసి సామాన్యుల నేతగా ఖ్యాతి గడించారు. పేదలు మరింత బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలి. అన్ని వర్గాలూ ప్రభుత్వంలో భాగస్వాములే : మంత్రి జోగి రమేష్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు అందరూ భాగస్వాములే. రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చి గౌరవించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో నాలుగు స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, చైర్మన్ స్థానాలిచ్చారు. సామాజిక న్యాయ నిర్ణేత జగన్ : పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ హామీలన్నీ అమలుచేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుంది. జగన్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమైంది. అలాంటి నేతను తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలి. 175 ఎందుకు ఇవ్వకూడదు? : అలీ మంచి చేసే నేతను ప్రజలు అభిమానిస్తారు. అందుకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్‌కు ఘన విజయం చేకూర్చడం. ‘వై నాట్ 175’ అని సీఎం ప్రతి సమావేశంలో చెబుతుంటారు. ప్రజలకు మంచి చేస్తున్న ఆయన అడిగిన సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ అభివృద్ధి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం రాజానగరం అభివృద్ధి, సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి రూ.1,152 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1,145 కోట్లు వెచ్చించాం. 20 వేల మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేశాం. రూ.104 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. రూ.217 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నాంది పలికాం. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడేందుకు రూ.91 కోట్లతో తొర్రిగెడ్డ కాలువపై రివర్స్ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టు నిర్మించనున్నాం.