AP 175
-
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
AP Election 2024 Counting And Results Updates03:43 PM, June 4th, 2024పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపుఅధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది02:43 PM, June 4th, 2024పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్02:41 PM, June 4th, 2024అన్నమయ్య జిల్లా:రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్రెడ్డిశ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 5989502:40 PM, June 4th, 2024కడప పార్లమెంట్వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజ.63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్వైఎస్ అవినాష్ రెడ్డి: 500912టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694వైఎస్ షర్మిలా రెడ్డి: 11871202:40 PM, June 4th, 2024ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిరాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డివైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 8128602:26 PM, June 4th, 2024పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజచిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి6623 ఓట్ల లీడింగ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ 01:50 PM, June 4th, 2024ముందంజలో అవినాష్‌రెడ్డి కడప: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ముందంజ01:05 PM, June 4th, 2024రాజంపేటలో వైఎస్సార్సీపీ ముందంజరాజంపేటలో వైఎస్సార్సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజకదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్సీపీ లీడ్12:21 PM, June 4th, 2024పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్పుంగనూరు: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్యవేడులో వైఎస్సార్సీపీ ఆధిక్యంవైఎస్సార్సీపీ-23497బీజేపీ-16,60311:15 AM, June 4th, 2024పాలకొండలో వైఎస్సార్సీ ముందంజగుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధిక్యతగుంతకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డినరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం10:54 AM, June 4th, 2024దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికివైఎస్సార్సీపీ-22965టీడీపీ-20921పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5110టీడీపీ-12309టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5478టీడీపీ-6263ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)వైఎస్సార్సీపీ-13805టీడీపీ -1786410:31 AM, June 4th, 2024తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తిగూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మూడో రౌండ్లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంవైఎస్సార్సీపీ-12,687బీజేపీ-11091నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం9:52 AM, June 4th, 2024వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ9:24 AM, June 4th, 2024అనపర్తి, తిరువూరులో వైఎస్సార్సీపీ లీడ్హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యంపుట్టపర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంసర్వేపల్లిలో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధిక్యందర్శిలో వైఎస్సార్సీపీ ముందంజఅరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్9:20 AM, June 4th, 2024పాలకొల్లులో టీడీపీ ముందంజఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యంభీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యంతణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యంతాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం9:15 AM, June 4th, 2024విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలుసర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లుమరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం9:13 AM, June 4th, 2024పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజతిరువూరులో వైఎస్సార్సీపీ ముందంజఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యం9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యంఅవినాష్రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లుపోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్‌లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలుపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్ సెంటర్లో పినిపే విశ్వరూప్అమలాపురంలో కౌంటింగ్ సెంటర్‌కి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్‌కు ఏఆర్ఓ,ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్‌లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్‌వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులుకౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది. -
జగన్.. సీబీఎన్.. పవన్.. ఆ ఉత్కంఠ తప్పదా?
ఆంధ్రప్రదేశ్‌కి జూన్ 4వ తేదీ అంత్యంత కీలకం. ప్రజా తీర్పు వెలువడే రోజు అది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించింది. కౌంటింగ్ ప్రక్రియ సరళి ఎలా ఉండనుందో ఒక స్పష్టత కూడా ఇచ్చింది. అయితే ప్రధాన పార్టీల గెలుపొటముల మీదే కాదు.. మూడు ప్రధాన పార్టీల అధినేతలకు ఎలాంటి ఫలితాలు దక్కనున్నాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కౌంటింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్‌బ్యాలెట్ కౌంటింగ్ ముగిశాకే.. ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. ఒక్కొక్క రౌండ్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ఈవీఎం కౌంటింగ్ పూర్తయ్యాక.. ఓటర్ స్లిప్(మొరాయించిన ఈవీఎంలలోని స్లిప్‌లను) ఆఖరిగా లెక్కిస్తారు. ఆ తర్వాతే ఫలితాన్ని ప్రకటిస్తారు. మరి ఫస్ట్ ఫలితం ఎక్కడి నుంచి రానుందంటే.. 175 స్థానాలకు పోటీ పడ్డ అభ్యర్థుల్లో కొందరి భవితవ్యం కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే తెలిసిపోతుంది. కానీ, కొన్ని చోట్ల మాత్రం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే.. ఏపీ ఎన్నికల తొలి ఫలితం గోదావరి జిల్లాల నుంచే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంగానీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంగానీ తొలి ఫలితం అందించనుంది. కారణం ఆ రెండు చోట్ల కేవలం 13 రౌండ్లలోనే ఫలితం వచ్చేస్తుంది కాబట్టి. ఈ రెండు సెగ్మెంట్లలో నరసాపురంలో 1,43,825 ఓట్లు, కొవ్వూరులో 1,58,176 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాబట్టి.. మధ్యాహ్నాం లోపే ఈ రెండు నియోజకవర్గ తుది ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లోని ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలు కూడా ఇంచుమించుగా త్వరగానే ఫలితాలు వచ్చేయొచ్చు. ఈ రెండు నియోజకవర్గాలలో 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆచంటలో 1,49,048 ఓట్లు, పాలకొల్లులో 1,60,489 ఓట్లు పోలయ్యాయి.👉ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం కోసం సాయంత్రం దాకా ఆగాల్సిందే. ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాబట్టి, టైం పడుతుంది. పులివెందులలో ఈ ఎన్నికలకుగానూ 1,86,833 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 91,484 మంది ఓట్లు వేస్తే 95,339 మంది మహిళలు ఓట్లు వేసారు. గత రెండు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైఎస్ జగన్‌ను పులివెందుల ప్రజలు గెలిపించారు. 2014లో 75,243 వేల మెజారిటీ, 2019లో 90,110 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 👉టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గ ఫలితం మరోలా రాబోతోందా? అనే చర్చ ఏపీ రాజకీయ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది. అయితే కుప్పంలో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది. ఇక్కడ 2,02,920 ఓట్ల పోలవ్వడంతో సాయంత్రంలోపు ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. కుప్పంలో చంద్రబాబు వరుసగా ఏడుసార్లు గెలుపొందారు. కుప్పాన్ని తన ఇలాకాగా ప్రకటించుకున్న ఆయన.. 2014 ఎన్నికల్లో 47 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. 20189 ఎన్నికల నాటికి ఆ మెజారిటీ 30వేలకు పడిపోయింది. 👉పిఠాపురంలో 2,04,811 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ ఫలితాలు దాదాపుగా మద్యాహ్నం 2 గంటల తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో ఈ స్థానం గురించి ప్రత్యేక చర్చ నడుస్తోంది. గోదావరి జిల్లాల నుంచే మరికొన్ని నియోజకవర్గాల ఫలితాలు త్వరగా వెల్లడి కానున్నాయి. పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఫలితాలు కూడా త్వరగానే వెలువడే ఛాన్స్ ఉంది. ఈ నాలుగు చోట్ల 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక పోలవరం మినహా మిగిలిన 15 నియోజకవర్గాలు కూడా 20 రౌండ్ల లోపు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తంగా.. గోదావరి జిల్లాల తుది ఫలితాలపై మధ్యాహ్నానికి స్పష్టత రానుంది. 👉కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం ఫలితాలు కూడా త్వరగానే రాబోతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో కూడా 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 👉అయితే.. అన్నింటికంటే చిట్టచివరగా అల్లూరి జిల్లా రంపచోడవరం , తిరుపతి చంద్రగిరి ఫలితాలు రాబోతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో దాదాపు 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో పూర్తి స్ధాయి ఫలితాలు రావడానికి రాత్రి సమయం పట్టే అవకాశం ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో 2,08,025 ఓట్లు పోలవ్వగా...చంద్రగిరి నియోజకవర్గంలో 2,51,788 ఓట్లు పోలయ్యాయి. అలాగే నంద్యాల/కర్నూలు పాణ్యం, విశాఖ భీమిలి నియోజకవర్గాలలో కూడా ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశాలే ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో కూడా 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలో 2,75,747 ఓట్లు పోలయ్యాయి. పాణ్యం నియోజకవర్గంలో 2,46,935 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు నియోజకవర్గాలలో లెక్కించాల్సిన ఓట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో ఫలితాలు చిట్టచివరినే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.👉.. మొత్తంగా 175 నియోజకవర్గాలకు గాను అత్యధికంగా 111 నియోజకవర్గాలలో 20 కంటే తక్కువ రౌండ్ల లోనే లెక్కింపు చేయబోతున్నారు. ఆ కౌంటింగ్ మధ్యాహ్నాం 2గం. లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా, ఆయా జిల్లాల కలెక్టర్లని ఆదేశించారు. 👉మరో 60 నియోజకవర్గాలలో 21 నుంచి 24 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగబోతొంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోపు ప్రకటించొచ్చు. 👉ముందుగా ఫలితాలను సువిధ యాప్ లో అప్ లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి, 21-ఈ ను అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారులు పంపించాల్సి ఉంటుంది. -
ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
జూన్ 4.. సరిగ్గా ఇంకో ఆరో రోజులు మాత్రమే. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజది. అదే సమయంలో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.. ఎలాంటి తీర్పు వెలువడనుందో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఏపీలోనూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయ వర్గాల్లో, మరోవైపు ఓట్లేసిన ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా గెలుపొటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేవిగా కూటమి ఈ ఎన్నికలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్సీపీ మాత్రం మొదటి నుంచి గెలుపు ధీమా ప్రదర్శిస్తోంది. అయితే.. ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే.. పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.ఎన్నికల పోలింగ్ టైంలో జరిగిన హింసాత్మక ఘటనలు, తమ పార్టీ నేతలను.. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, తదనంతర పరిణామాలపై వైఎస్సార్సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనే అనుమానాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో.. ఈసీ అలర్ట్ అయ్యింది. మరింత విమర్శలు వెల్లువెత్తకుడా ముందస్తు చర్యలు చేపట్టింది.శాంతి భద్రతలను విఘాతం కల్గకుండా.. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ కోసం అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సీఐడీ డీఎస్పీ సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు.మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటోంది. మొత్తంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో! పార్టీల తీరు ఇలా..ఏపీలో వైఎస్సార్సీపీలో జోష్ కనిపిస్తోంది. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకు వేసి జూన్ 9న కాబోయే పాలనా రాజధాని విశాఖలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ మాత్రం.. ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయింది. కూటమికి బాకా ఊదిన ఎల్లో మీడియా ఒకట్రెండు రోజులు విజయం కూటమిదే అంటూ హడావిడి చేసినప్పటికీ.. తర్వాత చల్లబడి పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరమేమో!.ఇక.. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్ అధికారికంగా లండన్‌పర్యటనకు వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లడమూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి పురందేశ్వరి, షర్మిల సంగతి సరేసరి. ఫలితాలను ముందే ఊహించి వాళ్లు ఇలా మౌనంగా ఉండిపోతున్నారా? అనే చర్చా ఏపీలో నడుస్తోంది ఇప్పుడు. -
బదిలీల తర్వాతే హింస!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కారణాలను నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.అధికారుల బదిలీ తర్వాతే అల్లర్లు..సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారులను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు పల్నాడు, కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది.కౌంటింగ్ రోజు జాగ్రత్త..రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించినట్లు తెలిసింది. -
‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
ఏపీ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్సీపీ సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. ప్రతిపక్షాలు, పచ్చ బ్యాచ్ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్ ప్రకటన చేశారు.సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్ క్యాంపైనయిర్స్ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేనని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు.అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే భారీగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడం కూడా ఇందుకు ఒక ఉదాహారణ. ఇక, 2019లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్ ఇప్పటి వరకు చేసిన ఏ ప్రకటన అయినా ఆచితూచి మాత్రమే చేశారు.పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన సీఎం జగన్.. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. సీఎం జగన్ సంచలన ప్రకటనతో కూటమి నేతలు డీలా పడినట్టు తెలుస్తోంది.అయితే, ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే వ్యక్తి. ఆయన ఏ పని చేసినా పూర్తి పారదర్శకంగా ఉంటారు. వేర్వేరు సమీకరణాలు అన్నీ పరిశీలించి ముందడుగు వేస్తారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల మార్పు సమయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రతిపక్షాలు, సీఎం జగన్ అంటే గిట్టని వారు ఎన్ని కామెంట్స్ చేసినా ఆయన అవేవీ పట్టించుకోకుండా ముందుకుసాగారు. ఎంతో దమ్ము, ధైర్యంతో అభ్యర్థులను మార్చారు. ఒక నాయకుడిగా తన నాయకత్వం మీద, పార్టీ మీద, పాలన మీద ఉన్న నమ్మకాన్ని ఈ ప్రకటన సంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఫస్ట్ రియాక్షన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్ ఫైట్, ఎవరికి ఎడ్జ్ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్ చేసిన ప్రకటన పట్ల షాక్ తిన్నాయి. ఒక నాయకుడు.. ఎంతో నమ్మకంగా చేసిన ఒక ధృడమైన ప్రకటన.. వైనాట్ 175 నినాదాన్ని చర్చనీయాంశం చేశాయి. -
‘ఏపీలో వార్ వన్ సైడే.. YSRCPదే గెలుపు’
విశాఖపట్నం, సాక్షి: పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. గురువారం విశాఖలో వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధికే ప్రజలు ఓటేసి పట్టం కట్టబోతున్నారు.. ..గతంలో ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో.. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్సార్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా సీఎం జగన్ విజయం సాధిస్తారు. గతంలో కంటే వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయి. .. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. అందుకే వార్ వన్‌సైడ్ కాబోతోంది. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు. .. ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు తాము చేస్తున్న అల్లర్లకు, హింసకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. కేంద్రంలో ఏ పార్టీకి, కూటమికి మెజారిటీ రాకూడదు. మన పార్టీల అవసరం వాళ్లకు పడాలి. పనికిమాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి’’ అంటూ అమర్నాథ్ ప్రసంగించారు. -
CBN: టెన్షన్‌తో బాబుకి ముచ్చెమటలు!
ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీల విజయావకాశాలపై ఎంత చర్చ జరుగుతున్నదో, అంతకన్నా ఎక్కువ చర్చ కొందరు ప్రధాన నేతల నియోజకవర్గాలపై కూడా జరుగుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరోసారి ఆయన గెలుస్తారా?లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలు ఈసారి తాము హిట్ కొడతామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాకపోతే ఆయన ఎన్నడూ అంత మెజార్టీతో గెలవలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన గెలుస్తారా?ఓడతారా అన్నది పక్కన పెడితే, ఈ ఎన్నికలలో ఆయనకు ముచ్చెమటలు పట్టాయన్నది మాత్రం వాస్తవం. అందుకే ఆయన పలు రకాల వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. అందులో ధనబలం కూడా ప్రముఖంగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఓటుకు పదివేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడలేదని కొందరు చెబుతున్నారు. వివిద నియోజకవర్గాలలో అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేసినా, కుప్పంలో చంద్రబాబు తరపున ఓట్ల కొనుగోలుకు వెచ్చించిన వ్యయం ఒక రికార్డుగా కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబునాయుడు కుప్పంలో వరసగా ఏడుసార్లు గెలిచి ఎనిమిదో సారి పోటీచేస్తున్నారు. అంతకుముందు చంద్రగిరిలో ఆయన ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉండే, వెనుకబడిన ప్రాంతం అయిన కుప్పంను ఎంపిక చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఆ విషయంలో సఫలం అవుతున్నారు. అత్యధికంగా బీసీ వర్గాలు ఉండే కుప్పంను ఆయన తన కోటగా మార్చుకున్నారు. అభివృద్ది విషయంలో మాత్రం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా చంద్రబాబు డబ్బు, దొంగ ఓట్లు ఇతర వ్యూహాల ద్వారా గెలుస్తూ వస్తున్నారు.సరిహద్దులోని తమిళనాడు, కర్నాటక గ్రామాలకు చెందినవారిని కూడా కుప్పం ఓటర్లుగా నమోదు చేయించి రాజకీయంగా లబ్ది పొందేవారని చెబుతారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా కలిసి వచ్చింది. గతంలో వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో వీక్ అభ్యర్ధిని కాంగ్రెస్ కుప్పంలో పెట్టేలా చేసుకునేవారని అంటారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి కొంత మారింది. క్రమేపి ఆయన మెజార్టీని తగ్గించే పనిలో వైఎస్సార్సీపీ పడింది. రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కుప్పంలో ఈయనను ఢీకొట్టడానికి సిద్ధం అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో కీలకమైన దొంగ ఓట్లను తొలగించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. సుమారు 17 వేల దొంగ ఓట్లను ఆయన తొలగించగలిగానని చెప్పేవారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించారు.తదుపరి ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ అభ్యర్ధి భరత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా, కుప్పం అభివృద్దిపై దృష్టి పెట్టారు. కుప్పంను మున్సిపాలిటీ చేయడం, రెవెన్యూ డివిజన్ చేయడం, స్కూళ్లు బాగు చేయడం, హంద్రీ-నీవా నీటిని విడుదల చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కొంత ఆకట్టుకున్నారు. వైఎస్సార్సీపీ గట్టి కృషి ఫలితంగా స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అది షాక్ అయింది. దాంతో ఆయన అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం ఏడాదికి ఒకటి, రెండుసార్లు కుప్పం వచ్చినా సరిపోయే పరిస్థితి పోయిందని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. నెల, నెల రావడం ఆరంభించారు. అది సరిపోదని భావించి అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నట్లు కథ నడిపారు.అదే టైమ్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంలో పట్టు బిగించడం ఆరంభించారు. దాంతో చంద్రబాబుకు రాజకీయంగా ఊపిరి ఆడని పరిస్థితి కల్పించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కొద్ది రోజులు అక్కడే ఉండి గడప, గడపకు వెళ్లడం చేశారు. కుప్పంలో రాజకీయం చేయడం ఆరంభించిన తర్వాత ఇలా ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, ఆయా వర్గాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం వంటివి ఈసారే చేశారు. గతంలో ఆయన తన ప్రతినిధులతో పనులు చేయించేవారు. అలాగే కుప్పం నుంచే కొంతమందిని పిలిపించుకుని హైదరాబాద్‌లోనో, ఉండవల్లిలోనో మాట్లాడి పంపించేవారు. ఆ పరిస్థితి మారి, ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలోనే ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించవలసి వచ్చింది.తనకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని అప్పుడప్పుడు డైలాగులు చెప్పినా, ఆయనకు ఎప్పుడూ అంత ఆధిక్యత రాలేదు సరికదా! క్రమేపి తగ్గుతూ వచ్చింది. 2014లో నలభై ఎనిమిదివేల మెజార్టీ వస్తే 2019లో అది 30 వేలకు తగ్గింది. ఇప్పుడు దొంగ ఓట్లను మరింత తగ్గించగలగడంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. స్థానిక ఎన్నికలలో టీడీపీ కన్నా వైఎస్సార్సీపీకి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే ట్రెండ్ కొనసాగినా, ఆ ఓట్లను ప్రామాణికంగా తీసుకున్నా చంద్రబాబు ఓటమికి గురికాక తప్పదు. స్థానిక ఎన్నికలకు, శాసనసభ ఎన్నికల సరళికి కొంత తేడా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పుడు తిరిగి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆయన శ్రమపడ్డారు. అయినా గెలుస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది.ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ నిత్యం కుప్పంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అండతో అక్కడ నిరంతరం జనంలో తిరుగుతున్నారు. దాంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరిగిందన్నది ఆ పార్టీ వాదన. అయితే చంద్రబాబుకు అక్కడ ఉన్న పట్టు అంత తేలికగా పోదని, ఆయా వర్గాలవారిని తనవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు పదివేల రూపాయల వరకు పంచవలసిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటింగ్ పూర్తి అయ్యాక కొన్ని సర్వేలలో చంద్రబాబు ఓడిపోయే అవకాశం కూడా ఉందని వార్తలు రావడం ఆయనకు, టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే.స్థానిక ఎన్నికల తర్వాత ఒక దశలో కుప్పంతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే పార్టీకి నష్టం వస్తుందని భయపడ్డారు. రిస్కు ఉందని తెలిసినా అక్కడే పోటీ చేయక తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను అక్కడే ఉంచి రాజకీయం నడిపారు. గతంలో చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందన్న చర్చ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారా? లేదా? అనే చర్చ జరగడం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం కానీ, వైఎస్సార్సీపీ కార్యక్రమాలు కానీ సఫలం అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే పెద్ద విజయంగా భావిస్తున్నారు.జగన్ అమలు చేసిన వివిద సంక్షేమ స్కీములు కుప్పంలో కూడా అమలు అయ్యాయి. దానివల్ల సుమారు రెండువేల కోట్ల మేర అక్కడి ప్రజలు లబ్దిపొందారు. కొన్ని వందల మందికి స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కూడా నిర్మించారు. ఆ రకంగా బలహీనవర్గాలను వైఎస్సార్సీపీ బాగానే ఆకట్టుకుంది. దానికితోడు బీసీలలో రెండు బలమైన వర్గాలను వైఎస్సార్సీపీ తనవైపు తిప్పుకోగలిగింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తన హయాంలో జరగని పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతుండడం ఆయనకు ఇబ్బందిగా ఉంది. స్థానిక ఎన్నికలలో ఓటమితో నైతికంగా దెబ్బతిన్న చంద్రబాబుకు దొంగ ఓట్లు కూడా చాలావరకు వైదొలగడం గడ్డుగా మారింది. అయినప్పటికీ ఆయనకు ఉండే క్లౌట్ ఆయనకు ఉండవచ్చు. అందువల్లే చంద్రబాబు ఓడిపోతారని పలువురు చెబుతున్నా, ఒకవేళ చంద్రబాబు ఓడిపోకపోయినా, మెజార్టీ బాగా తగ్గిపోతుందని అంచనాలు ఉన్నాయి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
సాక్షి, నరసరావుపేట: ‘స్వతంత్రంగా ఓటేసుకునే హక్కు ఉండకూడదా... టీడీపీకి ఓటేయకుంటే గ్రామాలు విడిచిపెట్టి వెళ్లిపోవాలా... వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపడం నేరమా... మమ్మల్ని పోలీసులు ఎందుకు కాపాడటం లేదు...’ ఇదీ ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజల ఆవేదన. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదన్న అక్కసుతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో టీడీపీ గూండాలు సోమవారం అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే.ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఊరొదిలి వేరేచోట బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ‘సాక్షి’తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్సీపీకి ఓటేశామన్న కక్షతో సోమవారం రాత్రి 7 గంటల నుంచి సుమారు ఐదు గంటల పాటు గ్రామంలో అరాచకం సృష్టించారనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే లక్ష్యంగా వారు దాడిచేశారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకు రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం..ఎస్టీ వాడివి మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తావా ఎంత ధైర్యంరా అంటూ మాపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. భయంతో పొలాల్లోకి పరుగులు తీశాం. ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు, ఆటోని ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ మావాళ్లను కొట్టారు. దిక్కుతోచని స్థితిలో బందువుల వద్ద తలదాచుకున్నాం.– కాండ్రకుంట హనుమంతుఊళ్లో ఉంటే చంపేస్తామంటున్నారు!జగనన్న పాలనలో మాకు మంచి జరిగింది కాబట్టే వైఎస్సార్సీపీకి ఓటేశాం. అందుకే మాపై కక్ష పెంచుకున్నారు. ఊళ్లో ఉంటే చంపుతామని బెదిరించారు. పోలీసులే రక్షణ కల్పించాలి.– దేవరపు రత్తయ్య బీసీ రజకటీడీపీకి ఓటేయకపోతే బతకనివ్వరా?పొలం పనులు చేసుకుంటూ బతికేవాళ్లం. మా జీవితాలు మారుస్తున్నాడన్న అభిమానంతో జగనన్నకి ఓటేశాం. దానికే మాపై దాడిచేసి, కులం పేరుతో దూషించారు. మా జేసీబీ, ట్రాక్టర్, బైకులు ధ్వంసం చేశారు. ఊళ్లో ఉంటే చంపుతారని భయమేసి భార్యా, పిల్లలతో పక్క ఊళ్లో ఉంటున్నాం. టీడీపీకి ఓటేయకపోతే ఊరొదిలి పోవాలా...– మేకల హనుమంతు, కొత్తగణేశునిపాడు -
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 15th AP Elections 2024 News Political Updates9:16 PM, May 15th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి7:30 PM, May 15th, 2024రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు6:09 PM, May 15th, 2024పోలింగ్‌లో మహిళా విప్లవం కనిపించింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటింగ్ ద్వారా ప్రజావిప్లవం చూపించారు81.86 శాతం పోలింగ్ నమోదవడం గొప్ప విషయంసమర్థవంతమైన పరిపాలన చేయటం వలనే జనమంతా బయటకు వచ్చి ఓట్లేశారుచివరి ఇంటి వరకు ఎక్కడా అక్రమాలు లేకుండా పాలనా ఫలాలు అందాయిదీన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు మారణకాండ సృష్టించారుబడుగు, బలహీన వర్గాలపై దాడులకు దిగారుఓటర్లు బయటకు రాకుండా చేసేందుకు చేయరాని కుట్రలు చేశారుమంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలపై కూడా దాడులు చేశారు2019లో పసుపుకుంకుమ కింద డబ్బులిచ్చినందున తామే గెలుస్తామన్నారుచివరికి 23 సీట్లతో సరిపెట్టుకున్నారుఈసారి పురుషుల కంటే ఐదు లక్షలమంది మహిళలు అధికంగా ఓట్లేశారువారంతా జగన్‌కే పట్టం కట్టారుజగన్ చేసిన న్యాయపాలన చూసిన మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లేశారుకులం, మతం, ప్రాంతాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారుహైదరాబాద్ నుండి రౌడీలు, గుండాలను తెచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతామా?సమస్యాత్మక కేంద్రాల వద్ద ఒక్కొక కానిస్టేబుల్ని మాత్రమే పెట్టారుఅసలు ఎన్నికల కమిషన్ అత్యంత దారుణంగా వ్యవహరించిందిఎల్లోమీడియా ఎంత విషం చిమ్మినా జనం పట్టించుకోలేదు5:31 PM, May 15th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ5:06 PM, May 15th, 2024నర్సీపట్నం మండలంలో టీడీపీ నేతల దుర్మార్గ చర్యఅనకాపల్లి:ధర్మసాగరంలో మహిళను కొట్టి వివస్త్రను చేసిన టీడీపీ కార్యకర్తలుమహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపుఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న బాధితురాలు కుమారిగతంలో వాలంటీర్‌గా విధులు నిర్వహించిన కుమారిఎన్నికలు అయ్యాక ఇంటికెళ్లి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు 4:12 PM, May 15th, 2024పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?: పేర్ని నానిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారుమా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారుపోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణంపల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది?బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారుమా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారుపురందేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగిందిఅంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు4:09 PM, May 15th, 2024పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీతో కుమ్మక్కయ్యారు: మంత్రి అంబటి రాంబాబుపోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారుమాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారుటీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదుదీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారునన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్ఛగా తిరగనిచ్చారుచాలా దుర్మార్గపు చర్యలకు దిగారుపోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారుఅలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్ఠం వలన హింస జరిగిందిఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందిపోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారుసీఎస్, డీజీపిలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చుతన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?3:51 PM, May 15th, 2024టీడీపీ దాడులపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుడీజీపి హరీష్ కుమార్ గుప్తాని కలిసిన వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు3:19 PM, May 15th, 2024ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఢిల్లీకి పిలిచిన ఈసీఐఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు3:15 PM, May 15th, 2024కాసేపట్లో డీజీపి హరీష్ కుమార్ గుప్తాను కలవనున్న వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలవనున్న వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు1:10 PM, May 15th, 2024పల్నాడులో టెన్షన్..!పల్నాడు జిల్లా..పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన కలెక్టర్మాచర్ల, గురజాల నియోజకవర్గంలో షాపులు ముయించివేస్తున్న పోలీసులు 12:20 PM, May 15th, 2024పల్నాడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతితాడేపల్లి :చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిమరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం జగన్వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్ష 12:00 PM, May 15th, 2024తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్..అనంతపురం:తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వీరంగం సృష్టించిన పోలీసులుసీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసంహార్డ్ డిస్క్, సీపీయూలను మాయం చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పనిమనుషులను బెదిరించిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలో 30 మంది వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డివైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదుఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారుపోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం 11:40 AM, May 15th, 2024పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు: మంత్రి మేరుగ నాగార్జునతాడేపల్లి :మేరుగ నాగార్జున కామెంట్స్.. మంత్రి కామెంట్స్..వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.జూన్ నాలుగోవ తేదిన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది.చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్ళాడు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదుకేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాంఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు.జూన్ నాలుగున రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తాంరాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందిపేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారుడీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. 9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు -
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్‌తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలతఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. పచ్చ ముఠాల విధ్వంసకాండజనసేన కార్యకర్తల దౌర్జన్యంజమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడిపల్నాట పచ్చ మూక భీభత్సకాండఆగని టీడీపీ అరాచకాలు -
జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
నెల్లూరు, సాక్షి: పోలింగ్‌తో ఏపీలో జన జాతర నడుస్తోంది. దూర సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి కావలికి వచ్చిన ఓ దివ్యంగురాలి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ వద్ద ఓటేయడానికి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆ దివ్యాంగురాలు భావోద్వేగంగా మాట్లాడారు. జగనన్న ద్వారా తాను లబ్ధి పొందానని.. అందుకే కృతజ్ఞతతో జగన్ అన్నకు ఓటు వేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు.అన్నా.. సాయం అంటే చాలూ.. అప్పటికప్పుడే అధికారుల్ని పిలిపించుకుని గంటల వ్యవధిలోనే సాయం అందేలా చూడడం సీఎం జగన్ నైజం. అలా ఈ 59 నెలల్లో లక్షల మంది వ్యధలను సీఎం జగన్ స్వయంగా విని.. వాళ్లకు ప్రభుత్వం తరఫున సాయం అందించడం చూశాం కూడా. -
నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు చివరి క్షణంలో ఓటర్లను ఆకట్టుకోవడంకోసం చేయవలసిన పనులన్నీ చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలలో హోరాహోరీ ప్రచారం జరిగింది. తెలంగాణలో ఉన్నంతలో వ్యక్తిగత విమర్శలకన్నా, విధానాలు, ప్రభుత్వాల పనితీరుపైనే విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరుగుతుండడంతో అంత తీవ్రత కనిపించడం లేదు. అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్దేశించే ఎన్నికలుగా అంతా చూస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం కూటమిల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది. కూటమి తరపున కొన్ని మీడియా సంస్థలు రంగంలో దిగి పచ్చి అబద్దాలను ప్రచారం చేయడానికి కూడా వెనుకాడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విధానాలకు పరిమితం కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటివారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇచ్చారనిపిస్తుంది. ఈ ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాధ్యత అంతా ఓటర్లపై పడింది.ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నదానిపై ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. దానికన్నా ముందుగా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుందాం. తమకు కావల్సిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. కేవలం ప్రలోభాలకు లొంగకుండా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ ఓట్లను వేసే పరిస్తితి రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది. ప్రజలు ఈ సందర్భంగా గమనించవలసిన అంశాలను తెలుసుకుందాం!ఓటు విలువ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకం. గ్రామవార్డు నుంచి పార్లమెంటు వరకు ఓట్ల ద్వారానే తమ నాయకులను ఎన్నుకునే గొప్ప వ్యవస్థ మనది. దీనిని బాధ్యతాయుతంగా అందరూ ఉపయోగించుకుంటే అది అర్దవంతంగా ఉంటుంది. కేవలం డబ్బు వంటి ప్రలోభాలకు లొంగితే ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుంది. అయినప్పటికి వర్తమాన రాజకీయాలలో డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగడం లేదు. అది దురదృష్టకరం. డబ్బు తీసుకున్నా, కేవలం ఆ ప్రాతిపదికనే ఓటు వేయడం లేదని పలుమార్లు రుజువు అవుతోంది. ఉదాహరణకు గతంలో ఒకసారి ఒక నేత డబ్బులు పందారం చేసినా ఓటమి చెందారు. దాంతో ఆయన తాను డబ్బు ఇచ్చిన ఇళ్లకు వెళ్లి, డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేసి వసూలు చేసుకున్నారు. ఇలాంటి అనుభవాలు కూడా ఎదురవుతాయని ఓటర్లు గుర్తించాలి. అందుకే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని గమనించి ప్రలోభాలకు గురి కాకుండా ఓట్లు వేస్తే సమాజానికి మంచిది.అబద్దాల ప్రచారాలు: దురదృష్గవశాత్తు మన ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలు అసత్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎదుటివారిని తిట్టడానికి ఈ అబద్దాలను వాడుతున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ప్రత్యర్ధి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక నేతపై దుమ్మెత్తి పోస్తారు. అదే నేత తమ పార్టీలోకి రాగానే మొత్తం మాఫీ అయినట్లు ఎన్నికలలో పోటీకి గాను టిక్కెట్లు కూడా ఇస్తుంటారు. వీరిలో ఎవరు పద్దతిగా ఉన్నారు? ఎవరిపపైన తక్కువ ఆరోపణలు ఉన్నాయి?ఏ అభ్యర్ధి తమకు అందుబాటులో ఉంటున్నారు? మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తే బాగుంటుంది.ప్రజాసేవ: ప్రతి రాజకీయ పార్టీ నేత తాము వచ్చే ఐదేళ్లు చాలా పెద్ద ఎత్తున సేవ చేస్తామని చెబుతారు. ఆ సందర్భంలో ఈ ఎన్నికల వరకు వారు ఎలా అందుబాటులో ఉన్నారు? ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? వారివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతోంది? అన్న అంశాల ఆధారంగా ఓట్లు వేస్తే ఉపయుక్తంగా ఉండవచ్చు. కరోనా వంటి సంక్షేభ సమయంలో ఏ నేత ప్రజలను ఆదుకున్నారు? ఏ నేత వేరే రాష్ట్రంలో ఉండి విమర్శలు చేస్తూ కూర్చున్నారు? అన్నవాటిని ఆలోచించుకోగలగాలి.గుణగణాలు: పోటీ చేస్తున్న అభ్యర్దుల గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేయగలిగితే అసాంఘీక శక్తులు రాజకీయాలలోకి రాకుండా ఉంటాయి.కాని దురదృష్టవశాత్తు ఎక్కువ తప్పులు చేసేవారిని కూడా ఎన్నికలలో ఒక్కోసారి గెలిపిస్తున్నారు.వ్యక్తిగత జీవితంలో చాలా అరాచకంగా వ్యవహరించి, ప్రజాజీవితంలో నీతులు చెప్పేవారిని మ్మకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ, మహిళల జీవితాలతో ఆడుకుంటుంటే అలాంటివారికి ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఏదో ఒక ఆకర్షణకు లోనై ఓట్లు వేయడం కాకుండా, ఆ వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలకే మంచి జరుగుతుందా?లేదా?అన్నదానిపై దృష్టి పెట్టాలి.సమాజానికి ఆ అభ్యర్ధి ఏమైనా కొంతైనా ఆదర్శంగా ఉన్నాడా?లేదా?అన్నది కూడా చూడాలి.నాయకుల నిబద్దత: నాయకుల నిబద్దతను కూడా పరిశీలించాలి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?లేక తన మాటలను తానే మింగేస్తాడా?అన్నది పరీక్షించాలి. చెప్పాడంటే చేస్తాడంతే అన్న చందంగా నేతలు ఉంటే మంచిదే. కాని చెప్పేదొకటి, చేసేదొకటి అయితే ప్రజలు నమ్మకపోవడమే బెటర్.నాయకులలో ఎవరు నిజాయితీగా ఉంటున్నారు? ఎవరు కుట్రలు,కుతంత్రాలకు పాల్పడుతున్నది అర్ధం చేసుకోవాలి. పైకి నీతులు చెబుతూ, లోపల గోతులు తవ్వుతున్నది ఎవరో గుర్తించాలి. లేకంటే గుంటనక్కల వంటి నేతలు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత నష్టపోయేది ప్రజలే అన్న సంగతి గుర్తించాలి.ఏ నాయకుడు అబద్దాలకు ప్రాధాన్యత ఇవ్వడు అన్నది తెలుసుకోవాలి.ఏ నేత అచ్చంగా అబద్దాలపైనే ఆధారపడి తరచు మాటలు మార్చుతుంటాడో అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఓడించితే వారికి గుణపాఠం చెప్పినట్లవుతుంది.మానిఫెస్టో: ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలను ప్రకటించాయి. వాటిలో ఎన్ని నిజమైన హామీలు, ఎన్ని గాలి హామీలన్నదానిపై ఓటర్లు ఒక అవగాహనకు రావాలి?ఎవరైనా ఆకాశం తీసుకు వచ్చి మీ ఇంటి ముందు పెడతానంటే నమ్ముతామా?అలాగే ఒక కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామన్న రీతిలో వాగ్దానాలు చేస్తే విశ్వసిస్తామా? రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలకు అయ్యే ఖర్చు గురించి ఆ పార్టీ నేతలు చెప్పకపోతే వారిని అసలు విశ్వసించవద్దు. ఆ వాగ్దానాలన్నీ గాలిమూటలేనని తెలుసుకుని తగు విధంగా ఓట్లు వేయాలి.అధికారం వచ్చేవరకు కల్లబొల్లి హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఓటర్లనే డబాయించడం చేసే నేతలను గుర్తు పెట్టుకుని ఓడించకపోతే, వారు నిత్యం మోసం చేస్తూనే ఉంటారు.అలవాటుప్రకారం మోసం చేసేవారిది తప్పుకాదు..మోసపోయేవారిదే తప్పు అని ఒకనానుడి ఉంది. అందువల్ల తాము మోసపోతున్నామా?లేదా? అన్నదాని ఆధారంగా ఓటు వినియోగించుకోవాలి.కొన్ని పార్టీలు తమ మానిఫెస్టోని ఎన్నికల తర్వాత వెబ్ సైట్ నుంచి తొలగించేస్తుంటాయి. అలాంటివారిని అసలు నమ్మవద్దని చెప్పకతప్పదు.కొన్ని హామీలు ప్రమాదకరంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణమని వాగ్దానం చేశారు. వారు అదికారంలోకి వచ్చాక తేలికగా ఉండే ఆ హామీని అమలు చేశారు.దాని ఫలితంగా లక్షల మంది ఆటోలవారు ఉపాది కోల్పోయారు. చివరికి వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మెట్రో రైలు కూడా తీవ్రనష్టాలపాలవుతోంది.దాంతో మెట్రో రైల్ నిర్వహణ నుంచి వైదొలగుతామని ఆ సంస్థ చెబుతోందట.తప్పుడు ప్రచారాలు: కొన్ని రాజకీయ పార్టీలు అచ్చం తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీపై ఉన్నవి,లేనివి కల్పించి, అబూత కల్పనలను ప్రచారం చేస్తుంటాయి.అందువల్ల ఏ రాజకీయ పార్టీ చేసే ప్రచారంలో అయినా నిజం ఉందా?లేదా? అన్నది నిర్దారించుకోవాలి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఎవరూ వ్యవహరించకూడదు. ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ పార్టీ లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన దుష్ప్రచారంపై కేసు నమోదు అయినా, అదే తప్పుడు ప్రచారాన్ని ఆ పార్టీ కొనసాగించింది.అలా చేయవచ్చా? ఎట్టి పరిస్థితిలోను అలాంటి పార్టీలను విశ్వసించకూడదు. ఒకవేళ నమ్మితే ఓటర్లు తమ గొయ్యి తాము తవ్వుకున్నట్లే అవుతుంది.మీడియా కథనాలు: ఎపికి సంబంధించి మీడియా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. ఒక వర్గం మీడియా స్వతంత్రంగా ఉన్నామన్న ముసుగులో పచ్చి అబద్దాలను వార్తలుగా అల్లి రాస్తోంది. కల్పిత కథనాలకు అంతులేకుండా ఉంటోంది. ఒక రాజకీయపార్టీపై నిత్యం ద్వేషంతో విషం కక్కుతోంది. అలాంటి పత్రికలను అసలు పరిగణనలోకి తీసుకోవద్దు. స్వేచ్చగా ,వాస్తవం ఏమిటో తెలుసుకుని ఓట్లు వేయాలి.ప్రజా ప్రయోజనాలకన్నా, తమ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న మీడియాను గుర్తించగలగాలి.ప్రభుత్వ పనితీరు: నాయకుల పనితీరు, వ్యవహార శైలితో పాటు ఆ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తమ బాధ్యతలను నిర్వహించిన వైనాన్ని కూడా సమీక్షించుకోవాలి. తమ మానిఫెస్టోలో ఉన్న అంశాలను సంబంధిత రాజకీయ పార్టీ పూర్తి చేసిందా?లేదా?ప్రభుత్వం తమకు అందుబాటులో ఉదా? లేదా? పాలనను తమ గడపవద్దకు తీసుకు వచ్చిందా? లేదా? ఎపిలో ఓడరేవులు, కొత్త పరిశ్రమల, మెడికల్ కాలేజీలు, ఐటి హబ్‌ల తయారీ మొదలైనవాటికి ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం గట్టిగా కృషి చేసిందో గమనించాలి.ఉద్దానం వంటి కిడ్నీ బాధిత ప్రాంతానికి ఏ ప్రభుత్వం బాగా సాయం చేసింది?విద్య, వైద్యం వంటి కీలకమైన రంగాలలో ఏ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్నది కూడా ఆలోచించాలి. కొన్ని ప్రభుత్వాలు విద్య,వైద్య రంగాలను ప్రైవేటు రంగానికి అప్పగించేసి ఉండవచ్చు. ఇంకో ప్రభుత్వం విద్య,వైద్యం పేదలకు నిత్యం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఓటరుగా మీరు ఎటు ఉండాలనుకుంటున్నారో తేల్చుకోవాలి.గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, వార్డు క్లినిక్ వంటివి అవసరమా?కాదా? వలంటీర్ల వ్యవస్థ అవసరమా? కాదా? దానిపై ఎవరు మాట మార్చారు? ఎవరు నికరంగా నిలబడ్డారు? తదితర అంశాలను గమనంలోకి తీసుకుని ఓటు హక్కు వాడుకోవడం కూడా అవసరమే. ఒక పార్టీ మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన రాజకీయ పార్టీలే, మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తామని చెబుతుంటే నమ్మవచ్చా? అంటే వారు తొలుత చేసిన విమర్శల ప్రకారం అప్పట్లో ఒక శ్రీలంక అయితే, వీరు అధికారంలోకి వస్తే మూడు శ్రీలంకలు చేస్తామని చెబుతున్నట్లేనా? మనం దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి?అన్నదానిపై స్పష్టతకు రావాలి.సోషల్ మీడియా: సోషల్ మీడియా బాగా విస్తరించడం వల్ల ఒక మేలు జరుగుతోంది. అలాగే మరో కీడు కూడా ఎదురవుతోంది. తప్పుడు ప్రకటనలు చేసే రాజకీయ నేతల పాత వీడియోలతో సహా బయటపెట్టి సోషల్ మీడియా ఎండగడుతోంది. అంతవరకు బాగానే ఉంది. మరికొంత సోషల్ మీడియా మరింత ఆరాచకంగా పచ్చి అబద్దాలను, వదంతులను ప్రచారం చేస్తుంటుంది. అందువల్ల సోషల్ మీడియాను పాలు, నీళ్ల మాదిరి వేరు చేసుకుని నిజాలనే నమ్మాలి. ఈ సందర్భంగా సమాజంలో అశాంతి, గొడవలు సృష్టించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అలాంటివాటికి తావివ్వకుండా జాగ్రత్తపడాలి.సత్వరమే ఓటు వేసుకోవడం బెబర్: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కు వాడుకునే అవకాశం ఉన్నా, సాధ్యమైనంతవరకు పెందలకడే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓట్లు వేస్తే బెటర్. ఆ తర్వాత తమ ఓటు ఎవరో వేసేశారని ఫిర్యాదు చేసినా, పెద్ద ఉపయోగం ఉండదు. వృద్దులు, మహిళలు ఇతరత్రా సీరియస్ సమస్యలు ఉన్నవారు తమకు సంబంధించిన బంధువులను వెంటబెట్టుకుని ఓట్లు వేయాలి తప్ప, పోలింగ్ బూత్ లోని సిబ్బందిని సహాయం అడగితే కొన్నిసార్లు నష్టం జరగవచ్చు. ఆ సిబ్బంది వారికి నచ్చినవారికి ఓటు వేస్తే చేయగలిగింది ఏమీ ఉండదు. అన్నిసార్లు అలా జరుగుతుందని కాదు. కాని కొన్ని సందర్భాలలో ఇలా జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొన్నిసార్లు అపోహలు కూడా వస్తుంటాయి.ఓటర్ స్లిప్‌తో పాటు, గుర్తింపు కార్డును కూడా తీసుకువెళ్లడం మర్చిపోవద్దు.ఏది ఏమైనా 2024 శాసనసభ ఎప్నికల ఫలితాలు ఒక కీలకమైన మలుపు అవుతాయని చెప్పాలి. ఒక రాష్ట్ర గమనాన్ని నిర్దేశిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తమకు మేలు చేస్తుందనుకున్న రాజకీయ పార్టీకి ఓటు వేసుకుని గెలిపిస్తే ఆ రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు -
ఆ పాలన మాకొద్దు.. 'బాబో'!
ఆ పాలన మాకొద్దు.. బాబో! -
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
ఏలూరు, సాక్షి: చంద్రబాబు ప్రలోభాలకు గురి కావొద్దని.. మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పథకాలు కొనసాగాలన్నా.. ఇంటింటా అభివృద్ధి జరగాలన్నా మీ బిడ్డ జగన్‌ను మళ్లీ ఆశీర్వాదించాలని కోరారాయన. కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార భేరిలో ఆయన మాట్లాడుతూ..కైకలూరు సిద్ధమా?.. ఇంతటి ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా అందరి ముఖంలో చిక్కటి చిరునవ్వు కనిపిస్తోంది. మీ అందరి ప్రేమానురాగాలు, మీ అందరి ఆప్యాయతల నడుమ.. ఇక్కడకు వచ్చిన నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. అక్కచెల్లెమ్మల కోసం మీ బిడ్డ జగన్ వివిధ పథకాల కోసం 130 సార్లు బటన్ నొక్కాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఏదేళ్లు ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ కావడం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన.మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్టిఫైడ్ కోర్సులు.. మాండేటరీ ఇంటర్న్‌షిప్.. ఈ చదువుల విప్లవాలు గతంలో ఏనాడైనా జరిగాయా?అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా.. వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా?గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. అవ్వాతాతలకు నేరుగా ఇంటి వద్దకే పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. ఇంటికే పెన్షన్ వచ్చిందా?. ఇంటికే రేషన్ వచ్చిందా.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరిగింది. మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. రైతన్నలకు ఉచిత పంటలబీమా. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ. రైతన్నలకు పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నల చేయి పట్టుకుని నడిపించే గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ.. గతంలో ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా.. అండగా.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల ఉన్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలు, కూరగాయలు అమ్ముకునేవాళ్లు, ఫుట్‌పాత పక్కన ఇడ్లీలువేసుకునేవాళ్లు.. వారి కోసం ఈరోజు జగనన్న తోడు. రజకులకు, బ్రహ్మణులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇన్ని పథకాలు ఏనాడైనా ఉన్నాయా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. మొట్టమొదటిసారిగా ఆరోగ్యరక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఉచితంగా రూ.25 లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ అయ్యాక రెస్ట్ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. పేదవాడి కోసం ఇంటి వద్దకే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయా?.గ్రామంలో అయినా 600 సేవలు అందిస్తూ కనిపిస్తున్న సచివాలయం. అదే గ్రామంలో వలంటీర్ వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ ఓ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల కోసం.. వాళ్ల రక్షణ కోసం గ్రామంలోనే మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల కోసం ఫోన్లోనే దిశ యాప్. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలు ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా పోలీసులు వచ్చి ‘‘చెల్లెమ్మా ఏం జరిగింది?’’ అని అడుగుతున్న పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూశారా? ఆలోచన చేయండి.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి.. మూడుసార్లు సీఎం చేశానంటాడు. మరి పేదవాళ్లకు ఒక్కటంటే ఒక్కటైనా మంచి గుర్తుకొస్తుందా?.(లేదు.. అనే సమాధానం వచ్చింది). చంద్రబాబు పేరు చెబితే ఏ పథకం కూడా గుర్తుకు రాదు. ఏ మంచి గుర్తుకు రాలేదు. ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. మోసాలు.ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. సంతకం పెట్టిన ఈ ఫాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. 2014 ప్రజలు నమ్మి చంద్రబాబుకి ఓటేశారు. ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించిన వాటిల్లో ఒక్కటైనా చేశారా?.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు ఈ పెద్దమనిషి చంద్రబాబు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు.. మాఫీ అయ్యాయా?. రెండో హామీ.. పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయైనా మాఫీ అయ్యాయా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ వేస్తామన్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? ఒక్కరి అకౌంట్లో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా? అని అడుగుతున్నా.అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. ఇంటింటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు? చేశారా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు? చేశారా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. చేశారా? కైకలూరులో ఏమైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? దాన్నీ అమ్మేశారు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..మళ్లీ ఇదే ముగ్గురూ.. ఇదే కూటమి.. ఇదే చంద్రబాబు.. సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు అంట.. నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు ప్రలోభాలను నమ్మొద్దు. ఐదేళ్లు మీ అందరికి క్యాలెండర్‌ఇచ్చి.. ఏ నెలలో ఏం చేస్తాం అనేది.. ఏ నెలలో చేయూత, అమ్మ ఒడి అని ప్రతీ నెలా.. క్రమం తప్పకుండా చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి. చంద్రబాబు ప్రలోభాలతో మోసపోకండి. జరుగుతున్న మంచిని పొగొట్టుకోకండి.వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.కొల్లూరు సమస్య పరిష్కారం కావాలన్నా.. మీ బిడ్డ సీఎం కావాలి. చెప్పిన మాట ప్రకారం సర్వే జరుగుతోంది. సర్వేకు సంబంధించిన రిపోర్టు పూర్తికాగానే.. అదనపు భూమిని పంచుతాం. అదీ బిడ్డ జగన్ చేతుల మీదుగానే జరుగుతుంది.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ.. మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్.. చెల్లి మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. బీజేపీ ఎక్కడ ఉండాలి.. సింక్‌లోనే ఉండాలి. కాదు.. చెరువులో ఉండాలి.వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎన్ఆర్(దూలం నాగేశ్వరరావు) , కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలమలశెట్టి సునీల్ గెలిపించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. -
చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోవొద్దు: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారని.. అధికారంలోకి వచ్చాక మాయలు, మోసాలే ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. .. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ముఖ్యహామీలంటూ ప్రతి ఇంటికీ పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?చంద్రబాబు విఫల హామీలుమొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. రూ.25 వేల కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?..ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు , చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూరుకు మించి అభివృద్ధి అన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు?.. జరిగిందా? మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అక్కా నమ్ముతారా? అన్నా నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటున్నారు? ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా?.. ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరీ.. ఏ నెలలో అమ్మ ఒడి, చేయూత అని ఫలానా నెలలో ఫలానా ఇస్తామని చెప్పి మరీ మేలు చేశాడు. పొరపాటును చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి.. ఇంటికి జరుగుతున్న మంచిని పొగొట్టుకోవద్దు.వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌లను గెలిపించాలని సీఎం జగన్ చిలకలూరిపేట ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. సెల్ఫీతో సీఎం జగన్ సందడిచిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కైకలూరు బయల్దేరిన సమయంలో కొందరు అభిమానులు సీఎం జగన్‌తో సెల్ఫీ కోరారు. తన ప్రచార రథం దిగి కిందకు వచ్చిన ఆయన.. వాళ్లతో సరదాగా సెల్ఫీ దిగారు. ఆపై అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రచార రథం నెమ్మదిగా ముందుకు సాగింది. -
చంద్రబాబుకు చివరి పంచ్.. బాంబు పేల్చిన శర్మాజీ!
ఎన్నో వైద్యాలు చేస్తున్నాం.. హోమియోపతి.. అల్లోపతి.. నేచురోపతి.. ఆయుర్వేదం.. కేరళ మూలికావైద్యం.. ప్రకృతివైద్యం.. అన్నీ చూశాం. ఎన్ని చేస్తున్నా రోగిలో చలనం లేదు.. కళ్ళలో కళ లేదు.. కాళ్ళూ చేతులూ కదలడం లేదు.. శ్వాస కష్టంగానే ఉంది. నాడీ అందడం లేదు.. గుండె కూడా నీరసంగా కొట్టుకుంటోంది.. నాకైతే నమ్మకంలేదు.. దగ్గరోళ్ళు.. రావాల్సినవాళ్లు ఉంటే పిలిపించుకోండి. పనిలోపనిగా అటు కట్టెలు.. కుండ.. పాడె.. చిల్లర పైసలు సిద్ధం చేసుకోండి.. అని డాక్టర్ చెప్పినమాదిరిగానే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చంద్రబాబుకు చెప్పేశాడట.మీకోసం ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేశాం. బాదుడే బాదుడు.. వస్తున్నా మీకోసం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి. ఇదేం ఖర్మ, యువగళం వంటి ఎన్ని ప్రోగ్రాములు చేసినా పార్టీకి మైలేజి రాకపోగా బాబు విశ్వసనీయత మీద ప్రజల్లో సందేహాలు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గడం లేదు. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఆయన చెప్పిందే చేస్తారు అనే అంశాన్ని ప్రజలు బాగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమే అనేది ఒక బ్రాండ్ ప్రజల్లో ఉండిపోయింది.దీంతో ఆయన ఎన్ని హామీలు ఇస్తున్నా నమ్మడం లేదు.. దానికితోడు కూటమి కట్టిన బీజేపీ.. జనసేన మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు లేదు.. ఎక్కడికక్కడ విభేదాలు పొడసూపుతున్నాయి. లోకేష్ పార్టీకి బలం అని అనుకుంటున్నారు.. తప్ప అయన ఎక్సట్రా లగేజ్ అనే విషయం కూడా రాబిన్ శర్మ చెప్పేసారు. ఇటు తమ పార్టీ ప్రోగ్రాములు డ్యామేజ్ అయిపోగా అటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. వాలంటీర్లు.. పెన్షన్ల వంటి అంశాలను టీడీపీ నెత్తికి ఎత్తుకుంది. అది కూడా నెత్తి బొప్పి కట్టింది తప్ప ప్రయోజనం లేకపోయింది. ఆసరా... విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను సైతం కోర్టులో కేసువేసి అడ్డుకున్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక ప్లెయిన్ రోడ్లో డ్రైవింగ్ కష్టం అనుకున్న చంద్రబాబు వెనుకడోర్ నుంచి యుద్ధానికి తెగబడ్డారు. కేవలం దుష్ప్రచారం ద్వారా ఓటర్లకు తికమకపెట్టి గెలవాలన్నదే వాళ్ళ ప్లాన్. అందుకే దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ ఇబ్బందిలేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలన్నది అయన పార్టీ ప్లాన్‌గా మారింది. చంద్రబాబు ఏమి చేస్తాడు.. ఏమి చేయలేదు.. అనేది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అందుకే ఇక మ్యానిఫెస్టోను మడిచి పొయ్యిలో పెట్టిన టీడీపీ ఇప్పుడు ఏకంగా కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పదిరోజులుగా అన్ని పత్రికలూ.. ఛానెళ్లలో అదే అంశం మీద తప్పుడు సమాచారంతో పేజీల కొద్దీ ప్రకటనలు కుమ్ముతున్నారు. ఇక గత ఇరవయ్యేళ్ళుగా తెలుగుదేశానికి వచ్చిన సీట్లు చూస్తే ఇలా ఉన్నాయ్.. 2004 - 34 సీట్లు2009 - 54 సీట్లు2014 - 102 సీట్లు2019 - 23 సీట్లుఆంటే జనసేన.. బీజేపీలతో పొత్తుపెట్టుకున్న 2014 లో మాత్రమే మూడంకెల స్కోర్ వచ్చింది తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి 294 సీట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం మూడంకెల స్కోర్ చేరలేదు.. అంటే టీడీపీ బలం ఎప్పుడూ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది తప్ప గొప్పగా ఏమి లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆలాగే సీట్లు వస్తాయి తప్ప అధికారం దక్కడం అసాధ్యం అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది. -
చంద్రబాబు పాలనలో ప్రశాంతత ఎక్కడిది?
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి రంగం సిద్దమైంది. ఒక రకంగా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిమోహన్ రెడ్డికి మళ్లీ ఓటు వేయవలసిన అవసరం ఉందా? లేదా? అన్నదే కీలకమైన చర్చ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లు చేసిన కార్యక్రమాలు, విపక్ష నేతగా చంద్రబాబు అనుసరించిన విధానాలు, ఇద్దరి మధ్య ఉన్న వత్యాసాలు, ప్రజల పట్ల వీరికి ఉండే నిబద్దత, చెప్పిన మాటపై నిలబడే తత్వం మొదలైనవన్నీ ప్రజల ముందుకు పరీక్షకు వస్తాయి. వీటన్నిటిని ఆలోచించి ఓటర్లు ఒక నిర్ణయానికి వస్తే సముచితంగా ఉంటుంది.⇒ బహుశా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి చర్చించుకుంటున్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల మధ్య ఉన్న తేడా గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విశ్వసనీయతకు నిలువుటద్దంగా కనిపిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అన్న పదమే తన నిఘంటువులో లేనట్లు ప్రజల ముందు నిలబడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అబద్దాలు చెప్పడం చాతకాదు.. చంద్రబాబుకు నిజాలు చెప్పడం చాతకాదు అంటే ఆశ్చర్యం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన మనిషి అయితే చంద్రబాబు నాయుడు మానిప్యులేషన్స్, మానేజ్మెంట్ నైపుణ్యం ద్వారా ఎదిగిన వ్యక్తి.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పేదల పట్ల అపారమైన అనురక్తి ఉందని పలుమార్లు రుజువైంది. తన పాదయాత్రలో కానీ, ముఖ్యమంత్రి అయ్యాక తన టూర్లలో కానీ ఆయన పేదలు, వృద్దులు, అనారోగ్యానికి గురైనవారిని దగ్గరకు తీసుకునే తీరు ఇందుకు అద్దం పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే పెత్తందార్లకు ప్రతినిధిగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత పేదలకు ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ఎప్పుడూ, ఎక్కడా అనుచితంగా వ్యవహరించలేదు. వ్యాఖ్యలు చేయలేదు. పైగా వారందరిని నా.. నా.. నా.. అని పిలుచుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నించారు.⇒ నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే పవిత్ర ఆలయంలోకి వచ్చి ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. మత్స్యకారుల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాగ్దానం ఇస్తే నిలబెట్టుకోవడానికి తాపత్రయపడతారు. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత అసలు ఆ వాగ్దానం తానెప్పుడు చేశానన్నట్లు మాట్లాడతారు. అవసరమైతే అన్ని హామీలు ఎక్కడ అమలు చేస్తామని ప్రశ్నిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను మంచి చేశానని అనుకుంటే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలకు పిలుపు ఇస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్లను బెదిరించి ఓటు అడుగుతారు. తాను వేసిన రోడ్డు మీద నడుస్తారు.. తాను ఇచ్చిన టాయిలెట్ వాడతారు.. ఇంకొకరికి ఎలా ఓటు వేస్తారు? అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరుస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఉన్న రాజధాని 29 గ్రామాలలోని తన వర్గం వాళ్లకు, తన పార్టీ వారికి ఎలా ఉపయోగపడాలా? అని ఆలోచిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిది రియల్ డెవలప్ మెంట్ విజన్ అయితే చంద్రబాబుది రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ విజన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒక్క లక్షలమందికి ఇళ్ళ స్థలాలు, ఇరవై లక్షల ఇళ్లునిర్మించడం ద్వారా సుమారు పది లక్షల కోట్ల సంపదను పేదవారికి సృష్టిస్తే, చంద్రబాబు అమరావతిలో కొద్దివేల మందికి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా కోట్ల రూపాయల సంపద సృష్టించి, అదంతా ఏపీకోసమే అని బుకాయిస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత' రాష్ట్రం కష్టాలలో ఉంది.. నేను అది చేయలేను.. ఇది చేయలేను.. నేను చాలా కష్టపడుతున్నాను.." అంటూ ఇలాంటి సానుభూతి మాటలు చెప్పలేదు. తాను చేయగలిగింది చేసుకుంటూ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. అదే చంద్రబాబు విభజిత ఏపీలో తన ఐదేళ్ల పాలనలో నిత్యం రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉంది.. తాను ఇరవైనాలుగు గంటలు శ్రమిస్తున్నాను.. ప్రజలు సహకరించాలి.. విరాళాలు ఇవ్వాలి. రాజధానికి ఇటుకలు కొనాలి.. అంటూ ఎప్పుడూ ఆయన ఏడుపుకొట్టు మాటలు మాట్లాడి ప్రజలను విసిగించేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అభివృద్ది ద్వారా మూడు ప్రాంతాలు వికసించాలని చెబుతారు. చంద్రబాబు ఒక్క అమరావతి గ్రామాలలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా రాజధానులపై తన అభిప్రాయాన్ని ఒకే రకంగా చెబుతారు. అదే చంద్రబాబు అయితే ఒక్కోచోట ఒకరకంగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కలల రాజధాని అమరావతిని రక్షించడానికే వచ్చారని చంద్రబాబు విజయవాడ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. విశాఖ, తిరుపతి ప్రాంతాలలో మాత్రం అమరావతి ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తెచ్చి దానిపైనే కట్టుబడి ఉండి ప్రజలందరికి ఇళ్ల వద్దే సేవలు అందించారు. చంద్రబాబు వలంటీర్లపైన నీచమైన విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని అంటారు. పైగా పదివేల రూపాయల వేతనం ఇస్తానని మభ్య పెట్టే యత్నం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఎంత వ్యయం అవుతుందో స్పష్టంగా వివరించారు. చంద్రబాబు పొరపాటున కూడా తన హామీలకు ఎంత వ్యయం అయ్యేది చెప్పకుండా జనాన్ని మాయ చేయాలని చూస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినదానికన్నా మూడు రెట్లు అదనంగా ఇస్తానని ప్రజలను నమ్మించాలని చూస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2019 మానిఫెస్టో, కొత్త మానిఫెస్టో చూపించి తాను ఏమి చేసింది వివరించుతారు. చంద్రబాబు ఎప్పుడూ 2014 నాటి మానిఫెస్టో ఊసే ఎత్తరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని దూషించరు. ఉదాహరణకు చంద్రబాబుతో కుమ్మక్కై సోనియాగాంధీ దారుణమైన అక్రమ కేసులు పెట్టించినా ఎన్నడూ ఆమెను ఒక్క మాట అనలేదు. అలాగే ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలే కోరుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అని అంటారు. చంద్రబాబు మాత్రం తాను జాతీయ నాయకుడనని భ్రమపడుతుంటారు.⇒ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక విమానాలలో తిరిగి మోదీకి పోటీగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కడతారు. కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ను గాలికి వదలివేస్తారు. మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఎలుతాడని అంటారు. విదేశాలలో సైతం మోదీ వల్ల పరువు పోయిందని చెపబుతారు. కానీ మోదీనే మళ్లీ ప్రధాని అయ్యేసరికి యుటర్న్ తీసుకుని కాళ్లావేళ్లపడి ఆయనతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు మోదీ విశ్వగురు అయ్యారని పొగుడుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అభివృద్దిని పూర్తి స్థాయిలో చెప్పుకోరు. ఉదాహరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ తయారి ప్లాంట్, బద్వేల్ లో సెంచరీ ప్లై వుడ్ ప్లాంట్, విశాఖలో అదానీ డేటా సెంటర్.. ఇలా అనేక పరిశ్రమలు వచ్చినా ఆయన రోజూ ప్రచారం చేసుకోరు. కానీ చంద్రబాబు మాత్రం అసలు పరిశ్రమలే రాలేదని, అభివృద్ది లేదని డబాయించి ప్రచారం చేస్తుంటారు.⇒ ఆయన టైమ్‌లో వచ్చిన ఒక్క కియా ప్లాంట్‌నే ఎల్లవేళలా ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు టైమ్ లో ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే యత్నం జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆస్పత్రి, నిపుణుల నియామకం, పరిశోధనతో పాటు 700 కోట్లతో శుద్ది చేసిన సురక్షిత నీరు సరఫరా స్కీమ్ అమలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన వాగ్దానాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు ఇస్తే, చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. అందులో కూడా అత్యధికం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీములనే కొనసాగించి అదనంగా మరింత ఇస్తానని చెబుతారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల విద్యకు, ప్రభుత్వ స్కూళ్ల బాగుచేతకు ప్రాధాన్యం ఇస్తుంటే, చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెబుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దితే, చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. విద్య, వైద్యం ప్రైవేటు రంగానికి అప్పగించి వారికి లాభాలు సమకూర్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినన్ని స్కీములు, కొత్త వ్యవస్థలు మరే ముఖ్యమంత్రి తీసుకు రాలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం వంటివి తీసుకువస్తే చంద్రబాబు ఎన్నడూ ఆ దిశగా యోచించలేదు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అంత విజన్ ఉంది.. ఇంత విజన్ ఉంది అని గొప్పలు చెప్పుకోకపోయినా, అనేక వ్యవస్థలను సృష్టించి తన విజన్ ఏమిటో ప్రజలకు తెలియచేశారు. చంద్రబాబు తనకు 2020 విజన్, 2037 విజన్ అంటూ ఆయా చోట్ల కాపీ కొట్టిన విషయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ తాను చాలా గొప్పవాడినని భ్రమపడుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకు వచ్చిన స్కీములన్నిటిని ఆయనే చెప్పలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో, అంత సంఖ్యలో పథకాలు తెచ్చి అమలు చేసి తన సమర్థత ఏమిటో ఏపీ ప్రజలకు చూపించారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, తదితర స్కీముల ప్రస్తావన వస్తే ఠక్కున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారు. కానీ చంద్రబాబు తనది ఫలానా స్కీము అని చెప్పుకునే పరిస్థితి లేదు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లపాటు ప్రశాంతంగా పాలన సాగితే, చంద్రబాబు కక్షపూరిత పాలన అని, విధ్వంసం అని, వినాశనం అని దుర్మార్గ ప్రచారం చేస్తుంటారు. తన టైమ్‌లో అమరావతి పేరుతో ముప్పై ఐదు వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని విధ్వంసం చేస్తే మాత్రం అది గొప్ప విషయం అని ఊదర గొడుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరకంగా స్వయం ప్రకాశం అయితే చంద్రబాబు ఎవరో ఒకరిపై ఆధారపడి పదవిలోకి వస్తుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాలు, నష్టాలకు ఓర్చి, పెద్ద, పెద్ద రాజకీయ తిమింగలాలను ఎదుర్కుని నిలబడితే, చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, కూటమి ఎత్తులు, జిత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుంటారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కష్ట జీవి అయితే, చంద్రబాబు కష్టపడుతున్నట్లు నటించే జీవి అని చెప్పాలి. అబద్దాలు ఆడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడరు. చంద్రబాబు అలవోకగా అబద్దాలు ఆడగలరు. అసత్యాలను సృష్టించగలరు. అందుకు ఉదాహరణే లాండ్ టైటిలింగ్ చట్టంపై లేనిపోని ఒక మోసపూరిత కల్పిత వదంతులను సృష్టించి జనంలోకి వదిలారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను కూడా దూషించరు. చంద్రబాబు ప్రతి చోట తన ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను నోటికి వచ్చినట్లు దూషిస్తుంటారు. అదే టైమ్‌లో తనను ఎవరైనా ఏదైనా అంటే ప్రజల కోసం పడతానంటూ కొత్త డ్రామా ఆడుతారు. రాజకీయ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరితో నైనా కలవడానికి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానకి సిగ్గుపడరు. అంతకు ముందు బండబూతులు తిట్టుకున్నా, ఏ మాత్రం ఫీల్ కారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు, లేదా వ్యక్తుల మేనేజ్మెంట్ తెలియని వ్యక్తి అయితే, చంద్రబాబు అచ్చంగా వ్యవస్థలు, మీడియాను మేనేజ్ చేసే నిపుణుడుగా పేరొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి.. చంద్రబాబు మీడియాపై ఆధారపడే మనిషి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఓడించలేమని భయపడే చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీలతో పొత్తుపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ధైర్యంగా తన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని జనంతోనే తన పొత్తు అని ధైర్యంగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య వయస్కుడైతే, చంద్రబాబు 75 ఏళ్ల వృద్దుడు. ప్రజలు తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆర్టీసీ ఎంతో హ్యాపీ..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఈ పేరు వింటనే ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...ఈ పేరు చెవిలో పడితేనే ఆ ఉద్యోగుల్లో హడల్ ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటం...కల కూడా. గతంలో చంద్రబాబుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విలీనం సాధ్యం కాదని కొట్టిపారేశారు. అంతేకాదు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించి తన రాజగురువు రామోజీరావుకు అప్పగించాలన్న దురాలోచన కూడా చేశారన్నది బహిరంగ రహస్యమే. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.దశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలను సాకారం చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ చరిత్రాతి్మక నిర్ణయం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో నవోదయాన్ని తీసుకువచి్చంది. ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలను కలి్పంచడమే కాకుండా ఆర్టీసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోంది. ఆర్టీసీ పట్ల చంద్రబాబు వైఖరి? ఆయన విధానాలు ...ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అనే అంశాలను ఓసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.జగన్ విలీన హాసం..!⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం.⇒ ఉద్యోగుల జీతాల కోసం ఒక్క నెల కూడా అప్పు చేయలేదు. ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లించింది. ఇప్పటికి 52 నెలల్లో రూ.15,600 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. ⇒ జీతాల కోసం అప్పులే చేయలేదు కాబట్టి...వడ్డీ సమస్యే లేదు ⇒ వైస్సార్సీపీ కోసం అద్దెకు తీసుకున్న బస్సులకు తక్షణమే పార్టీ ఖాతా నుంచి బిల్లుల చెల్లింపు ⇒ జీతాల చెల్లింపునకు ఐదేళ్లలో రూ.2,500 కోట్లు అప్పు తీర్చింది. అప్పు రూ.2 వేల కోట్లకు తగ్గింది. ⇒ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం బకాయి రూ.200 కోట్లు చెల్లింపు దాంతో ఉద్యోగులకు సులభంగా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు ⇒ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ప్రమాద బీమా సదుపాయం ప్రమాద బీమా మొదట రూ.45 లక్షలకు...అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు పెంపు ⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ⇒ 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పన ⇒ 2016 నుంచి 2019 మధ్య పెండింగులో ఉన్న 845 మందికి ఉద్యోగాలు ⇒ 2020 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు ⇒ 2020 తరువాత అనారోగ్య కారణంతో పదవీ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు. ⇒ 2020 తరువాత రిటైరైన ఉద్యోగులకు గ్రాడ్యుటీ రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కింద రూ.271.89 కోట్లు, సరెండర్ లీవుల కింద రూ.165 కోట్లు చెల్లింపు ⇒ ఇప్పటికి 1,406 కొత్త బస్సులు కొనుగోలు. మరో 1,500 కొత్త బస్సుల కొనుగోలుకు ప్రతిపాదన. తొలిసారిగా ఈ–బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ. తిరుమల–తిరుపతి ఘాట్‌లో 100 ఈ–బస్సులు. రానున్న ఐదేళ్లలో 7 వేల ఈ–బస్సుల కొనుగోలుకు నిర్ణయం ⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.బాబు మాటల మోసం..!⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. ⇒ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి. ⇒ ఉద్యోగుల జీతాల కోసం చేసిన అప్పులే ఏడాదికి రూ.350 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది.⇒ టీడీపీ అవసరాల కోసం బస్సుల వినియోగం. బిల్లులు చెల్లించని టీడీపీ.⇒ రూ.4,500 కోట్ల నష్టాల్లో ఉండేది.⇒ ఉద్యోగుల పరపతి సంఘానికి రూ.200 కోట్ల బకాయి పడడంతోరుణాలు ఇవ్వలేని దుస్థితి.⇒ ప్రమాద బీమా రూ.30 లక్షలు మాత్రమే.⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం.⇒ కారుణ్య నియామకాలు చేపట్ట లేదు.⇒ గ్రాడ్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, సరెండర్ లీవులు పెండింగ్..⇒ కొత్త బస్సులు కొనుగోలు లేదు.⇒ పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలుఇవి చదవండి: పిఠాపురంతోనే సీఎం జగన్ లాస్ట్ పంచ్.. -
సీమకు సైంధవుడు..
దేశంలోనే తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను మళ్లించకుండా నాడు చంద్రబాబు ద్రోహం చేయగా, నేడు గరిష్టంగా ఒడిసిపట్టి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి చాటుకుంటున్నారని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతిలో పూర్తి సామర్థ్యం మేరకు నీటి తరలింపు పనులను పూర్తి చేయడంతోపాటు తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు, అవుకు రిజర్వాయర్లు, గాలేరు–నగరిలో భాగమైన గండికోట, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండలతోపాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని ఇప్పటికే పూర్తి చేయగా రెండో సొరంగం కూడా దాదాపుగా పూర్తి అయింది. నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను తరలించడం ద్వారా ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీలకు హక్కుగా దక్కిన జలాలను వాడుకోవడం కోసం రాయలసీమ ఎత్తిపోతలను సీఎం వైఎస్ జగన్ చేపడితే దానిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారని రైతులు మండిపడుతున్నారు.శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన చోట కొత్త ప్రాజెక్టులను నిరి్మంచడం కోసం రాయలసీమ కరవు నివారణ పథకం కింద సీఎం జగన్ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు.హంద్రీ–నీవా సుజల స్రవంతి..మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.తన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి సింహ భాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్‌హౌస్ నిర్మించిన మహానేత వైఎస్.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా నీటిని తరలించేలా ముచ్చుమర్రి ఎత్తిపోతల 2007, ఆగస్టు 31న చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు. నాడు అలా..విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22(ప్రైస్ ఎస్కలేషన్), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2017 జనవరి 3న జాతికి అంకితం చేసిన నాటి సీఎం చంద్రబాబు.. ఇది తన ఘనతే అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.హంద్రీ–నీవా అంతర్భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేందకు చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమే‹Ùకు కట్టబెట్టిన చంద్రబాబు.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు.మహానేత వైఎస్ పూర్తి చేసిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా టీడీపీ హయాంలో ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా సీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేశారు.నేడు ఇలా..వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు.హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు.హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి.. ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రతి ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నారు.తెలుగు గంగ..శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్ కడప(1.67 లక్షల ఎకరాలు), ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు) కలిపి మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది తెలుగుగంగ ప్రాజెక్టు ఉద్దేశం. నాడు అలా...పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్సార్‌ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కలువ) ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు చేరే జలాల్లో 15 వేల క్యూసెక్కులను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌కు తరలించేలా 7.8 కి.మీ. పొడవున తవ్విన లింక్ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం వల్ల 6 నుంచి 7 వేల క్యూసెక్కులను కూడా తరలించేందుకు వీలయ్యేది కాదు. దీంతో వెలిగోడు రిజర్వాయర్(16.95 టీఎంసీలు) నిండేది కాదు. లింక్ కెనాల్‌కు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యంతో నీటిని తరలించడం ద్వారా వెలిగోడును సకాలంలో నింపాలన్న ఆలోచన కూడా 2014–19 మధ్య చంద్రబాబు చేయలేదు.వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్‌కు ఐదు వేల క్యూసెక్కులను తరలించేలా 42.566 కిమీల పొడవున తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 నుంచి 2,500 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు. మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి. తెలుగుంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేసిన పాపాన పోలేదు. ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతులను దెబ్బతీశారు.నేడు ఇలా..వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్‌ను, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ కాలువల ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు నీటిని తరలించడానికి మార్గం సుగమం చేశారు. దీంతో 2019, 2020, 2021, 2022లో వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు.వెలిగోడు రిజర్వాయర్బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వకు లైన్ క్లియర్ చేశారు. 2021–22 నుంచే బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తూ రైతుల జీవన ప్రమాణాలను పెంచేలా సీఎం జగన్ కృషి చేశారు.బ్రహ్మంసాగర్గాలేరు – నగరి సుజల స్రవంతి..శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 1.55, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షలకు సాగునీరు, ఐదు లక్షల మందికి తాగునీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాళెం, వామికొండ, సర్వారాయసాగర్‌ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు.నాడు అలా...2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద తవ్వాల్సిన జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్(పెలుసుమట్టి)లో 165 మీటర్ల మేర మాత్రమే పనులు చేయాలి. వాటిని చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక సొరంగానికి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా కాలువ(లూప్)తో సరిపుచ్చారు.కమీషన్లు రావనే కారణంతో గాలేరు–నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. దాంతో కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను పట్టించుకోలేదు.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పది టీఎంసీల సామర్థ్యం) నిర్వాసితులకు కూడా చంద్రబాబు పునరావాసం కల్పించలేదు. ఏటా కేవలం సగటున రెండు మూడు టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు.నేడు ఇలా..సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు అంటే పది వేల క్యూసెక్కులను తరలించేలా అభివృద్ధి చేయించారు. రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనంతో పూర్తి చేశారు. ఇప్పుడు గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. శ్రీశైలానికి వరద వచ్చిన 30 రోజుల్లోనే గాలేరు–నగరి కింద ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేలకు పెంచిన సీఎం జగన్ ఆ పనులను కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది.గండికోట రిజర్వాయర్గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో గండికోటలో ఏటా 26.85 టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించి.. రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (ఆరు టీఎంసీలు), వామికొండసాగర్(1.6 టీఎంసీలు), సర్వారాయసాగర్(3.06 టీఎంసీలు)లలోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో ఏటా పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతుల జీవితాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు.రైతుల హక్కులు నాడు తాకట్టు.. నేడు పరిరక్షణవిభజన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తించింది. శ్రీశైలం నిర్వహణను ఆంధ్రప్రదేశ్‌కు, నాగార్జునసాగర్ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని ఏపీకి అప్పగించకుండా తన అధీనంలోనే ఉంచుకోవడంపాటు ఏపీ భూభాగంలోని నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా అ«దీనంలోకి తీసుకుంది. రాష్ట్ర హక్కులను హరించేలా తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు.శ్రీశైలంలో 834(మల్యాల), 795(ముచ్చుమర్రి) అడుగుల నుంచి హంద్రీ–నీవా ద్వారా రోజుకు 3850 క్యూసెక్కులు మాత్రమే తరలించే సామర్థ్యం ఏపీకి ఉంది. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 881 అడుగుల్లో నీటి మట్టం శ్రీశైలంలో ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. తెలంగాణ సర్కార్ రోజూ 6.5 టీఎంసీలను తోడేస్తే శ్రీశైలంలో నీటి మట్టం పెరగదు. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందవు. ఓటుకు కోట్లు కేసుకు జడిసి బాబు నోరుమెదపలేదు.వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఇది పూర్తయితే తనకు భవిష్యత్ లేదని చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారు. -
మీ ఓటు.. విశ్వసనీయతకా? మోసానికా?
వైఎస్సార్సీపీ 2019 మేనిఫెస్టో..హామీ: వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కలి్పంచి.. రైతులకు దన్నుగా నిలుస్తాం. అమలు: రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నీతి ఆయోగ్ అత్యుత్తమ పథకంగా ప్రశంసించింది. ఐదేళ్లలో పంటలు దెబ్బతిన్న 54.76 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి.. మార్కెట్లో ధరలేని పంటల ఉత్పత్తులు 21.73 లక్షల టన్నులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రూ.7,796 కోట్లను వెచ్చించి, రైతులకు అండగా నిలిచారు. తుఫాన్లు, అధిక వర్షాల వల్ల తడిచిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. పంట నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.3,261.61 కోట్లు అందించారు.హామీ: వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా కింద ఆర్థిక సహాయం అందిస్తాం. అమలు: ఆరోగ్యశ్రీ కింద చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల కోసం రూ.13,421 కోట్లు ఖర్చు చేశారు. విశ్రాంతి సమయంలో రోగులకు ఆరోగ్య ఆసరా కింద 24.59 లక్షల మందికి రూ.1,465 కోట్లను అందించారు. ఈ రెండు పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ మరో అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచారు. గతంలో ఇది రూ.5 లక్షల వరకే ఉండేది.హామీ: పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు అందిస్తాం. అమలు:ఇచ్చిన మాట మేరకు జగనన్న విద్యా దీవెన పథకం 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లను ఫీజురీయింబర్స్‌మెంట్‌గా చెల్లించారు. 2017–19 మధ్య చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లను సీఎం జగన్ చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద 25.17 లక్షల మంది విద్యార్థులకు రూ.4,275.76 కోట్లను అందించారు. 2022–23 విద్యా సంవత్సరంలో గరిష్టంగా 1.80 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువు పూర్తిచేసుకున్న వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.హామీ: వైఎస్సార్ ఆసరా పథకం కింద ఎన్నికల రోజు వరకూ అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే అందిస్తాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. అమలు: 2019, ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల మహిళలు 78.94 లక్షల మందికి ఉన్న రూ.25,570.90 కోట్లను నాలుగు విడతల్లో నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల మహిళలకు రూ.4,969.04 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.హామీ: జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి కలను నిజం చేస్తాం. అమలు: కరోనా మహమ్మారి ప్రభావం వల్ల లాక్‌డౌన్‌తో రెండేళ్లు పనులు చేయలేని పరిస్థితి. మిగతా మూడేళ్లలో రూ.35,268.05 కోట్లతో ఆరు ప్రాజెక్టులు (సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, అవుకు సొరంగం, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు–తొలి దశ) పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్.. డయాఫ్రమ్ వాల్‌తో మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసి.. గోదావరి వరదను మళ్లించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌పై కేంద్రం నిర్ణయం వెల్లడించడమే తరువాయి.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాలకు నీళ్లందించి రైతుల సాగునీటి కలను నిజం చేశారు.హామీ: ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ స్థలాలను అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం. అమలు: ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసి.. వాటిపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరుతోనే రిజి్రస్టేషన్ చేసి ఇచ్చారు. ఈ స్థలాల మార్కెట్ విలువ రూ.76 వేల కోట్లకుపైగానే పలుకుతోంది. అంతే కాకుండా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి.. ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతోపాటు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించారు. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేసి.. ఒక్కో లబి్ధదారుకు రూ.55 వేల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో లబ్ధిదారుకు రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ స్థిరాస్థితిని సమకూర్చారు.హామీ: బీసీల అభ్యున్నతికి ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వైఎస్సార్ చేయూత ద్వారా ఎంత అవసరమైతే అన్ని నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కలి్పస్తూ చట్టం తెస్తాం. బీసీ జనగణన చేసి.. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కలి్పంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. అమలు: బీసీల అభ్యున్నతికి చెప్పిన దాని కంటే అధికంగా నిధులు ఖర్చు చేశారు. డీబీటీ రూపంలో రూ.1.28 లక్షల కోట్లను బీసీ లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా జమా చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.52 వేల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ కలిపి మొత్తం రూ.1.80 లక్షల కోట్లను బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేశారు. బీసీల్లోని ఉప కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ వర్గాల వారినే చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారు. నామినేటెడ్ పనుల్లో, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు. బీసీ జనగణన చేయించి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతోపాటు ఇదే అంశంపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించారు. వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతానంటూ ఆ వర్గాలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు.హామీ: షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ.పది వేలు ఆర్థిక సహాయం చేసి తోడుగా ఉంటాం. అమలు: చెప్పిన మాట మేరకు ఐదేళ్లలో 3.37 లక్షల మందికి జగనన్న చేదోడు పథకం కింద రూ.1,260.17 కోట్లను సహాయంగా అందించి, తోడుగా నిలిచారు.హామీ: మగ్గం ఉన్న చేనేత కారి్మకుల కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలను ప్రోత్సాహకంగా ఇస్తాం. అమలు: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 82,130 మంది మగ్గం ఉన్న చేనేత కారి్మకులకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.982.98 కోట్లను ప్రోత్సాహకంగా అందించారు.హామీ: కులవృత్తిదారులు, చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.పది వేలు ఇస్తాం. అమలు: జగనన్న తోడు పథకం కింద 15.87 లక్షల మందికి సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చారు. సున్నా వడ్డీ కింద వారికి రూ.88.33 కోట్లు ఇచ్చారు.హామీ: వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తాం. అమలు: చెప్పిన మాట మేరకు 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు 33.15 లక్షల మందికి రూ.19,189.59 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. ఆదాయం పొందుతూ ఆర్థిక సాధికారత సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడే దిశగా అడుగులు వేస్తున్నారు.హామీ: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రాయితీల (భూమి, పన్ను, విద్యుత్)తోపాటు ఏపీఐడీసీని పునరుద్ధరించి.. నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. అమలు: అధికారం చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా నిలుపుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీఐడీసీని పునరుద్ధరించారు. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) 1.9 లక్షల నుంచి ఏడు లక్షలకు చేరుకున్నాయి. 22.07 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనతో గత 59 నెలల్లోనే కొత్తగా 28.92 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అన్నీ కలిపి ఏకంగా 6,48,087 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. హామీ ఇవ్వకున్నా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, పది ఇండ్రస్టియల్ నోడ్స్ నిర్మాణంతో పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు.హామీ: పార్లమెంటు నియోజకవర్గం యూనిట్‌గా ఒక జిల్లాను ఏర్పాటు చేసి.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తా. అమలు: 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిరి్మస్తున్నారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు.హామీ: ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి.. అదే ఊరిలోని పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అమలు: రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సగటున 50 నుంచి 75 ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి.. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించి.. గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. వివిధ శాఖల్లో 2.31 లక్షల ఉద్యోగులను నియమించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. ఈ 59 నెలల్లోనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్ఎంఈలు, స్వయం ఉపాధితో కలిపి 58.22 లక్షల మందికిపైగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు.హామీ: ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తాం. విద్యా ప్రమాణాలు పెంచుతాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతాం. అమలు: నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసే పనులను రెండు దశల్లో చేపట్టారు. తొలి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకున్నా సరే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే జగనన్న విద్యాకానుక పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు సాక్స్‌లు అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్నం నాణ్యమైన భోజనంతోపాటు చిక్కీ ఇస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పిల్లలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), వైట్‌హౌస్ వేదికలపై రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానం, సంస్కరణలపై అనర్గళంగా ప్రసంగించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హామీ: వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 అందిస్తాం. అమలు: మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే అధికంగా.. ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఐదేళ్లలో రూ.67,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఈ పథకం కింద ఐదేళ్లలో 53,58,366 మంది రైతులకు రూ.34,378.16 కోట్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.హామీ: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.4 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంక్‌ల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడు వారి చేతికి అందేటట్టు అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా చెల్లిస్తాం. అమలు: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.పది వేలకు పెంచారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఐదేళ్లలో 2.43 లక్షల మందికి రూ.538.06 కోట్లను అందించారు. డీజిల్ సబ్సిడీని అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా అందిస్తున్నారు.హామీ: అవ్వాతాతలకు పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి.. పెన్షన్‌ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూపోతాం. అమలు: ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.2,250కు పెంచే ఫైలుపై 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ తొలి సంతకం చేశారు. దశలవారీగా పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష చూపకుండా 66.34 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత 59 నెలల్లో పెన్షన్ రూపంలో రూ.90,590.6 కోట్లను పంపిణీ చేశారు.టీడీపీ కూటమి 2014 మేనిఫెస్టో..హామీ: అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తా. అమలు: రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేయకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2014, జూన్ 8న చంద్రబాబు మోసం చేశారు. వ్యవసాయ రుణాల మాఫీపై కోటయ్య కమిటీని వేసి.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో కోతలు పెట్టి రూ.15,297 కోట్లను మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.72,315 కోట్లు మాఫీ చేయకుండా రైతులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. అమలు: టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల మహిళలు బకాయిపడ్డారు. ఆ రుణాల్లో ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు వంచించారు.హామీ: ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తా. అమలు: 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ కేవలం 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. రాష్ట్రంలోని కోటికిపైగా ఇళ్ల(కుటుంబాలు)కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కింద పైసా కూడా ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున 60 నెలలకు రూ.1.20 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టి చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తా. అమలు: ఐదేళ్లలో పుట్టిన ఒక్క ఆడబిడ్డ పేరుతో ఒక్క పైసా కూడా డిపాజిట్ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు.హామీ: అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి.. పక్కా ఇళ్లు కట్టిస్తాం. అమలు: మూడు సెంట్లు స్థలం మాట దేవుడెరుగు.. కనీసం ఏ ఒక్కరికీ సెంటు స్థలం కూడా ఇవ్వకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఏటా రూ.పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేస్తా. అమలు: ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను బీసీ సబ్ ప్లాన్ కింద ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కానీ.. ఐదేళ్లలో రూ.36 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసి, అందులోనూ అవినీతికి పాల్పడి బీసీలను మోసం చేశారు.హామీ: చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ చేస్తా. అమలు: ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయకుండా చేనేత, పవర్‌లూమ్స్ కారి్మకులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి నగరంలో, జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మిస్తా. అమలు: సింగపూర్‌ను మించి అభివృద్ధి మాటేమోగానీ అడ్డగోలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. జిల్లా కేంద్రాల మాట దేవుడెరుగు కనీసం ఏ ఒక్క నగరంలో కూడా హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదిరాయి కూడా వేసిన పాపాన పోలేదు.హామీ: మహిళల భద్రతకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తా. ఆపదలో ఉన్న మహిళలకు సెలఫోన్ల ద్వారా 5 నిమిషాలలో సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటుచేస్తా. అమలు: ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ మహిళల మానప్రాణాలతో చెలగాటమాడటం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇసుక దోపిడీకి అడ్డుతగిలిన తహసీల్దార్ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని లాగి, దాడిచేసినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.హామీ: పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తెస్తా. అమలు: విద్యా విధానంలో మార్పుల మాట దేవుడెరుగు కనీసం ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇవ్వకుండా మోసం చేశారు. ఫీజు ఎంత ఉన్నారూ.35 వేలు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్ కింద ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లితండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడింది.హామీ: ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తా. అమలు: ఆరోగ్యశ్రీ పేరును ఎనీ్టఆర్ వైద్య సేవగా మార్చిన చంద్రబాబు.. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి యాజమాన్యాలు నిరాకరించాయి. దాంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. ఆరోగ్యశ్రీ కింద చంద్రబాబు పెట్టిన రూ.600 కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లించారు.హామీ: రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్ట నివారణకు రైతుల వారీగా బీమా సౌకర్యం కలి్పస్తా. అమలు: ధరల స్థిరీకరణ నిధి కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గిట్టుబాటు ధరలు దక్కక ధాన్యం, అపరాలు, ఉల్లి, టమాటా, మామిడి, బత్తాయి తదితర రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేశారు.హామీ: ప్రతి జిల్లాకూ, పట్టణానికి, మండలానికి, గ్రామానికి ఒక దార్శనిక పత్రం (విజన్ డాక్యుమెంట్)ను తయారుచేసి అభివృద్ధి చేస్తాం. అమలు: ప్రతి జిల్లా, పట్టణం, మండలం, గ్రామం అభివృద్ధి మాటేమోగానీ.. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు బ్యాచ్ అధోగతిపాలు చేశాయి.హామీ: అవినీతిరహిత సుపరిపాలన, పాలనలో పారదర్శకత తెస్తా. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. అమలు: అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిలోనూ చంద్రబాబు అగ్రగామిగా నిలిపారు. చంద్రబాబు మానసపుత్రిక అయిన జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు లంచాల కోసం ప్రజలను పీడించాయి.హామీ: కొత్తగా కళింగపట్నం, నరసాపురం ఓడరేవు, నిజాంపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులను నిరి్మంచి, పాత పోర్టులతో అనుసంధానం చేస్తూ ఇండ్రస్టియల్ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తా. అమలు: ఐదేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పోర్టు నిర్మాణ పనలు కూడా చంద్రబాబు ప్రారంభించలేదు. ఇండ్రస్టియల్ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.హామీ: వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్స్ (ర్యాపిడ్ రైల్వే ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ)ను ప్రవేశపెడతాం. అమలు: బుల్లెట్ ట్రైన్స్ పేరుతో ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎన్నడూ ఆ మాట ఎత్తడానికి కూడా సాహసించలేదు.హామీ: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తా. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తాం. అమలు: కమీషన్ల కక్కుర్తితో జాతీయ పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019, ఏప్రిల్ 1న రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున నిధులు దోచేశారు. దాంతో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.హామీ: కేంద్రం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టింది. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధానిగా ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తా. అమలు: ప్రపంచస్థాయి నగరం మాటేమోగానీ.. ఆ ముసుగులో ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి అంతర్జాతీయ స్థాయి భూ కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారు. అమరావతిలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని నిరి్మంచలేకపోయారు. కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కలి్పంచలేకపోయారు. -
CM Jagan: కదిలించిన కడప చైతన్యం
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఈరోజు కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోందో మీ అందరికీ తెలుసు. కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది.. నాన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మీరంతా చూశారు. ఆ సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాక సింబల్ వచ్చి కేవలం 14 రోజులు మాత్రమే అయినా మీ బిడ్డతో మీరంతా నిలబడి 5,45,000 మెజారిటీ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఆ రికార్డు మెజారిటీతో మీ బిడ్డ ఆరోజు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరీ జగన్? అని చూసింది. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప వన్‌టౌన్ సమీపంలోని మద్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఎవరు నిర్ణయించాలి?ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజలు, వైఎస్సార్ మీద అభిమానం ఉన్న వారు నిర్ణయించాలా? లేక ఆ పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్ శత్రువులు నిర్ణయించాలా? అనేది మీరంతా ఆలోచన చేయాలని కోరుతున్నా. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రాజకీయంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మీ బిడ్డ మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి.. అదే కాంగ్రెస్, అదే టీడీపీతో ప్రత్యక్షంగా ఒకరితో, పరోక్షంగా ఇంకొకరితో కలిసిపోయి వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్రలో వీరందరూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇలాంటి వాళ్లా వైఎస్సార్ వారసులు?దుర్మార్గంగా అబద్ధాల ప్రచారం...వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును, ఆ కీర్తి ప్రతిష్టలను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీ ఆయన కుమారుడిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టింది. ఆ 16 నెలలు నాకు ఎవరు ఇస్తారు? ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించింది. ఆ ఛార్జ్‌షీట్‌లో నాన్నగారి పేరును మనంతట మనమే పెట్టించామట! ఇంత దుర్మార్గంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటే అసలా పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా? ఆ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా?రాజకీయ శూన్యత సృష్టించి...నా పక్కన అవినాష్ ఉన్నాడు. నాకన్నా 13 ఏళ్ల చిన్నోడు. మా అందరికన్నా చిన్న పిల్లోడు. ఈ పిల్లోడి జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు దగ్గర నుంచి కుట్రలు పన్నుతున్నారు. ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి, టీవీ 5 దాకా కుట్రలు పన్నుతున్నారు. కడప జిల్లాలో ఒక రాజకీయ వ్యాక్యూమ్ క్రియేట్ చేసి అందులోకి వాళ్లు రావాలని కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వీళ్లంతా మనుషులేనా? అవినాష్ ఎలాంటి వాడో మీకు, నాకు తెలుసు. అవినాష్ మీద నాకు, మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్‌ను గొప్ప మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ కోరుతున్నా. ఇన్నేళ్లకు ఇడుపులపాయకు..నాన్న 2009లో హఠాన్మరణం పాలైతే ఆ తర్వాత వైఎస్సార్ కుటుంబాన్ని వాళ్లు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికి తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాన్న సమాధి దగ్గరకి వాళ్లు వస్తారట! ఇడుపులపాయ దగ్గరకు వస్తారట! చూడటానికి వస్తారట! ఢిల్లీ నుంచి వస్తారట! ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల వేళ వస్తారట..! ఎన్నికల కోసం వస్తారట! ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలో భాగస్తులం అయినట్లే. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లే. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని, ఎన్డీఏని గెలిపించడం కాదా?పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో కాపురం..ఎన్నికల వేళ వీళ్లు ఎందుకు మన రాష్ట్రానికి వస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతున్నాయో గమనించండి. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ పెద్దమనిషి చంద్రబాబు పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రి పూట కాంగ్రెస్‌తో కాపురం చేస్తాడు! రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో గమనించండి. నాన్నగారు బతికున్నప్పుడు ఎవరితో విబేధించి యుద్ధం చేశారో, ఆయన్ను అభిమానించే ప్రతి కార్యకర్తా ఎవరితో యుద్ధం చేశారో, ఇవాళ వైఎస్సార్ వారసులు అని చెప్పుకుంటున్న వాళ్లు అదే ఈనాడుతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో, చంద్రబాబుతోనూ చెట్టాపట్టాలు వేసుకుని వాళ్లను గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చే యత్నం చేస్తున్నారంటే ఇంతకంటే హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఉంటాయా? -
'విద్యావంతుడినంటావ్'..! ఇదేనా తెలివి.. శ్రీభరత్!!
సాక్షి, విశాఖపట్నం: విద్యావంతుడినంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్.. ఎన్నికల్లో గెలవలేనని తెలిసి రోజురోజుకీ దిగజారిపోతున్నారు. అక్రమాలకు కేరాఫ్‌గా మారిన దివంగత తాత అడుగు జాడల్లోనే నడుస్తూ.. తన సొంత వర్సిటీ కోసం దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు కేంద్రంగా మారిన ఏయూలో ఈవీఎంలు భద్రపరచొద్దంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈవీఎంల రక్షణ వలయం గురించి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతనే తప్పుపడుతున్న ఆయన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏయూపై ఈసీకి లేఖతో కలకలం!తాజాగా రిటర్నింగ్ అధికారికి రాసిన ఒక లేఖ భరత్ బేలతనాన్ని, అవివేకాన్ని, తేటతెల్లం చేస్తుంది. భారత ఎన్నికల సంఘంపై కానీ, భారతదేశ ఎన్నికల ప్రక్రియపై కానీ భరత్‌కు ఎలాంటి నమ్మకం, విశ్వాసం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిస్తే వాటిని ట్యాంపరింగ్ చేస్తారని, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఈవీఎంలను మార్పు చేసేస్తారంటూ ఏకంగా రిటర్నింగ్ అధికారికి లేఖ రాయడం కలకలం రేపుతోంది.ఈ విషయం తెలుసా? అసలు పూర్వాపరాలేవీ తెలియకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం భరత్‌కు వారసత్వంగా వచ్చినట్లుందని అందరూ నవ్వుతున్నారు. వాస్తవానికి ఈనెల 13న జరిగే ఎన్నికల తరువాత ఈవీఎంలను ఏయూలో భద్రపరచాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఏయూ ప్రాంగణాన్ని వారు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఈవీఎంల భద్రపరిచే భవనంలోకి ఈగ కూడా చొరబడే వీలు లేకుండా అవసరమైన అన్ని చర్యలను దాదాపు నెల రోజుల నుంచి ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు.ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు ఏయూలోనే భద్రపరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అక్కడే సజావుగా నిర్వహిస్తున్నారు. ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఏ ఒక్క ఓటు గానీ, ఈవీఎం, బ్యాలెట్ బాక్సు కానీ ట్యాంపరింగ్ జరగలేదు. అందుకే ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఏయూనే ఎంపిక చేస్తుందన్న విషయం తెలియకుండా చేసిన ఆరోపణలతో భరత్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈసీపై విశ్వాసం లేదా..?ఎన్నికల సంఘాన్ని దాని విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా శ్రీ భరత్ లేఖ రాశారు. ఈవీఎంల భద్రతకు పటిష్టమైన రక్షణ వలయంలో చుట్టూ సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కానీ, రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధీనంలో కానీ ఉండవు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరుస్తారు.వీటి జోలికి వెళ్లడం గానీ, వాటిని చూడడం కానీ, వాటిని ముట్టుకోవడం కానీ, వాటిని ట్యాంపరింగ్ చేయడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా.. ఎంపీ బరిలో రెండో సారి ఎలా పోటీ చేస్తున్నారంటూ విశాఖ వాసులు, విద్యావంతులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే తమ ఓటు వృథాగా మారినట్లేనని భావిస్తున్నారు. భరత్ రాసిన లేఖపై టీడీపీ నాయకులే మండిపడుతున్నారు.టీచర్లనీ మార్చేయ్యాలంట.?ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్ని మారిస్తే సరిపోదు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని కూడా మార్చేయాలి అని భరత్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లందరినీ కించపరిచేవిధంగా మాట్లాడటం కూడా భరత్ దిగజారుడు తనానికి నిదర్శమని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే.. గీతం విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులను భరత్ బలవంతంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో పాఠాలు చెప్పుకునే మమ్మల్ని ఇలా ప్రచారానికి తిప్పడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇవి చదవండి: ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ములాఖత్.. బండారం బద్దలైంది -
మంగళగిరి మారుమోగింది.. ‘జై జగన్.. సీఎం జగన్’
గుంటూరు, సాక్షి: అది మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్.. కాస్త ఎండపూట ఇసుకేస్తే రాలనంత జనం చేరారు. సంక్షేమ సారథికి మద్దతు పలికేందుకు అశేషంగా తరలివచ్చిన జన సునామే అది. ఆ అభిమానం ఇంతటితో ఆగలేదు.. సీఎం జగన్ ప్రసంగించే సమయంలో సీఎం సీఎం.. జై జగన్.. జయహో జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేలా చేశారు. మంగళగిరిలో పచ్చ బ్యాచ్ మొదటి నుంచి ఒకరమైన ప్రచారంతో ముందుకు పోతోంది. బీసీ జనాభా అత్యధికంగా ఉండే చోట.. అగ్ర కులానికి, అందునా గత ఎన్నికల్లో ఓడిన తమ చిన్నబాస్ నారా లోకేష్‌ను బరిలోకి దింపింది. బీసీ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని తప్పించి మరీ.. బీసీ సామాజిక వర్గానికి, అందునా ఒక మహిళను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. మురుగుడు లావణ్య ప్రచారానికి వెళ్లిన చోటల్లా.. ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నారా లోకేష్‌కి ఆదరణ కరువు కావడంతో.. టీడీపీకి ఏమాత్రం మింగుడు పడలేదు.దీంతో మంగళగిరిలో నారా కుటుంబం ప్రచారాన్ని.. ఐటీడీపీ అండ్‌కో పేజీలు సోషల్‌మీడియాలో జాకీలు పెట్టడం ప్రారంభించారు. అక్కడా ప్రతికూల కామెంట్లే వినిపించాయి. అప్పటికీ కూడా మంగళగిరిలో టీడీపీ జెండానే ఎగురుతుందంటూ లోకేష్ అండ్ కో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈలోపే..సీఎం జగన్ మంగళగిరి ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు#MemanthaSiddham, #YSJaganAgain. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. జయజయధ్వానాలు పలికారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్ చెప్పిన మాటలు.. ఆపై కొనసాగిన స్పీచ్ మంగళగిరి ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాన్ గుర్తుకు తమ ఓటేసి.. కూటమి నేతలను తిప్పికొడతామంటూ తమ నినాదాలతో స్పష్టం చేశారు మంగళగిరి వాసులు. ..‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?’’.. అంటూ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. స్థానికంగా ఉండే లావణ్యమ్మ(మురుగుడు లావణ్య)కు ఓటేయాలన్నప్పుడు కూడా ప్రజల నుంచి.. సిద్ధం అనే సమాధానమే వినిపించింది. మొత్తంగా.. గ్రాఫిక్స్ అనే వాళ్ల గూబ గుయ్యి మనేలా.. కూటమి వెన్నులో వణుకు పుట్టేలా.. మంగళగిరి ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది. -
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్‌ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
మేతకొచ్చాడు.. మరో నేత!
యర్రగొండపాలెం: ‘టీడీపీ జమానా.. అవినీతి ఖాజానా’ అని కమ్యూనిస్టులు ఓ పుస్తకమే అచ్చేశారు గుర్తుంది కదా.. అధికారం చేతిలో ఉంటే టీడీపీ నేతల అవినీతి దందా ఎలా సాగుతుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అడ్డగోలు హామీలతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థులు ఓడిన చోట ‘త్రీ మెన్ కమిటీ’లకు పెత్తనం అప్పగించడం ద్వారా దుస్సంప్రదాయానికి తెరతీశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజును సంతలో పశువులా కొనుగోలు చేసి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అధికారమే అండగా తెలుగు తమ్ముళ్లు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి చెలరేగారు. నీరు–చెట్టు పనుల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో రూ.కోట్లు దండుకున్నారు. టీడీపీకి మళ్లీ ఓటేస్తే ఇప్పుడొచ్చిన నేత ఇంకెంత మేస్తాడోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.టీడీపీ జమానాలో పచ్చ నేతల అవినీతి దందాను కళ్లారా చూసిన వైపాలెం నియోజకవర్గ ప్రజలు.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకెంత దోచేస్తారో అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికారులను కీలు»ొమ్మలుగా మార్చి జన్మభూమి కమిటీలతో సాగించిన అరాచకాలను మరోమారు మననం చేసుకుంటున్నారు. పథకం ఇవ్వాలంటే లంచం, పని కేటాయించాలంటే కమీషన్, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసి సొమ్ము చేసుకోవడం ద్వారా టీడీపీ నాయకులు రూ.కోట్లు గడించారు.నీరు–చెట్టు పనులకు అంచనాలు వేసే సమయంలోనే 25 శాతం కమీషన్ అందేలా టీడీపీ నేతలు పక్కాగా స్కెచ్ వేసినట్లు ఆరోపణలున్నాయి. 2015–17 మధ్య యర్రగొండపాలెం నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద 1235 పనులకు రూ.51.51 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత రెండేళ్లలో సుమారు రూ.43.5 కోట్లతో అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు. దాదాపు రూ.95 కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టిన టీడీపీ నాయకులు.. అందులో 25 శాతం అంటే రూ.28 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి సుమారు రూ.15 కోట్ల వరకు టీడీపీ నేతలు కొల్లగొట్టారు.నీరు–చెట్టులో నిధుల గోల్మాల్..యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి చెరువులో నేషనల్ హైవే కాంట్రాక్టర్ అధికారికంగా మట్టి తవ్వుకోగా ఏర్పడిన గోతులను టీడీపీ నాయకులు నీరు చెట్టులో చేసినట్లు చూపి ఏకంగా రూ.60 లక్షల బిల్లు పొందారు. పుల్లలచెరువు మండలంలోని కాటివీరన్న చెరువులో పనులు చేపట్టకుండా మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు రూ.10 లక్షలు కాజేశారు. ఇదే పద్ధతిలో మండలంలో 26 మంది టీడీపీ నాయకులు పనులు చేయకుండానే బిల్లులు పొందారు. పెద్దారవీడు మండలంలో దేవరాజుగట్టు చెరువులో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాల్లోకి తరలించకుండా అక్కడే కట్టగా పోసి బిల్లు పొందారు. పెద్దదోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం మండలాల్లోని చెరువుల్లో కూలీలతో పనులు చేయించాల్సిన చోట యంత్రాలను ఉపయోగించి బిల్లుల రూపంలో ప్రభుత్వ సొమ్ము దిగమింగారు.భూములు కాజేసిన పచ్చ గద్దలు!వైపాలెంలోని టోల్‌ప్లాజా పరిసరాల్లోని అగ్రహారం భూములపై కన్నేసిన టీడీపీ నాయకులు రికార్డుల్లో పూర్వీకుల పేర్లు ఎక్కించుకుని రైతులను నిలువునా ముంచారు. అప్పటి పుల్లలచెరువు టీడీపీ మండల అధ్యక్షుడు కబ్జా చేసిన భూమి విల్లు ఇప్పుడు రూ.2 కోట్లకు పైమాటే. కొందరు అక్రమార్కులు కబ్జా చేసిన భూములను సత్య ఫిష్ కంపెనీకి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ భూములకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి.పుల్లలచెరువు మండలంలో టీడీపీ నేతలు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ఆన్లైన్ చేయించుకున్నారు. బోగస్ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి లక్షలాది రూపాయలు రుణాలుగా పొందారు. పుల్లలచెరువులో సర్వే నెంబర్ 887–2 లో 0.86 సెంట్ల ప్రభుత్వ భూమిని టీడీపీ మండల నాయకుడు తన పేరుపై ఆన్లైన్ చేయించుకున్నాడు. మర్రివేముల సర్వే నెంబర్ 80లో 136 ఎకరాల అటవీ భూమిని 8 సబ్డివిజన్లు చేసి దాదాపు 30 ఎకరాలు కబ్జా చేశారు. ఐటీవరంలో సర్వే నంబర్ 991లో కొండపోరం బోకు భూమి 60 ఎకరాలను నలుగురు టీడీపీ నేతలు కబ్జా చేసి పాస్ పుస్తకాలు పొందారు. శతకోడు సర్వే నంబర్ 439లో భూమినీ కబ్జా చేశారు.త్రిపురాంతకం మండలం నర్శింగాపురం పరిధిలో రైతులకు చెందిన 118 ఎకరాల భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో పాలుట్ల రమణమ్మ పేరుపై ఆన్లైన్ చేసి ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెద్దమీరం గ్రామానికి చెందిన మీగడ వీర సత్య పేరుపై ఆన్లైన్ చేశారు.టీడీపీ నేతల భూదాహానికి అప్పటి పెద్దారవీడు, పెద్దదోర్నాల తహసీల్దార్లు సహా ఐదుగురు వీఆర్వోలు సస్పెండయ్యారు.ఇవి చదవండి: డీబీటీ లబ్దిదారులతో టీడీపీ ముఠా చెలగాటం -
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ఇలా..!
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దళిత మహిళ అయిన హోంమంత్రి తానేటి వని తపై దాడులకు దిగటం సిగ్గుచేటని అన్నారు.విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు పా ల్పడ్డారని, మాచర్ల నియోజకవర్గంలోని శిరి గిరిపాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమపై దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. హోంమంత్రి తానేటి వనితపై దాడిని మహిళా లో కం సీరియస్‌గా తీసుకుందని, మహిళలంతా ఏకమై ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చె ప్పేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించటం ఖాయమని పోతుల సునీత చెప్పారు.మహిళలపై టీడీపీ దాడులు దుర్మార్గం..ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మహిళలపై టీడీపీ కూటమి నేతలు దుర్మార్గంగా దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల మహిళలపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలమీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆమె గురువారం లేఖ రా శారు.ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించడంతో దళితులు, మహిళలు భ యాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా కుమారుడు మహిళలపై దాడి చేయడం దారుణమన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలిపై, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ నేతలు దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. -
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
సాక్షి, అమరావతి: ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...పదే పదే ఆ తప్పులనే పునరుక్తం చేస్తుంటే అది అలవాటు...గ్రహపాటు...దురలవాటు..అలాంటి దురలవాటును ఈనాడు ఆనవాయితీగా మార్చుకుంది..అబద్ధాలనే రాయడానికే కంకణం కట్టుకున్నానన్నట్లుగా ఉంది ఆ పత్రిక వక్రీకరణల ధోరణి...గతంలో కౌలురైతుల సాయంపై అడ్డగోలుగా వక్రీకరిస్తే అది తప్పని ...వాస్తవమేంటని గణాంకాలతో రుజువు చేసినా... మూర్ఖపు రాతలతో మళ్లీ రాసిన తప్పులనే రాస్తూ... తన అజ్ఞానాన్ని, తానేం చేసినా చెల్లిపోతుందన్న అహంకారాన్ని రామోజీ నిరూపించుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే ఈనాడు దుష్టరాతల తలంపును పాఠకులు అర్థం చేసుకున్నారు..ఒక నిజాన్ని ఎన్నిసార్లు అబద్ధంగా చూపాలనుకున్నా అది అవాస్తవంగా మారదన్న వాస్తవం రామోజీకి బోధపడినట్లు లేదు... రైతులకు ఆపన్నహస్తమందిస్తున్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం... ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు కొండంత ఊతంగా నిలుస్తూ... వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్నదే జగన్ ప్రభుత్వం... రైతులే కాదు...వారితో సమానంగా కౌలు రైతుల భుజంపైనా భరోసా చెయ్యేసి... వారిని అక్కున చేర్చుకుంటున్నదే ఈ ప్రభుత్వం...ఆ నిజాన్ని అబద్ధం చేయాలని రామోజీ తహతహలాడిపోతూ.. గురువారం ఈనాడులో ..‘ధీమా లేదు...బీమా రాదు’... శీర్షికన ప్రచురించిన కథనం ఒక బోగస్. నిజాలేమిటో సవివరంగా గణాంక సహితంగా చెప్పడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్...గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచనే చేయని పంట సాగు హక్కు దారుల చట్టం–2019ను తీసుకురావడమే కాదు..సీసీఆర్సీల ఆధారంగా భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తోంది. పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా రైతులు మద్దతు ధరకు సులువుగా అమ్ముకోగలుగుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు దురదృష్టవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఈ ప్రభుత్వం అందిస్తోంది.అబద్ధం: పెట్టుబడి సాయానికి అర్హులు కారట..వాస్తవం: బాబు హయాంలో కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకు పైసా విదల్చ లేదు. తద్భిన్నంగా ...నేడు దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకూ రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది.మెజార్టీ కౌలుదారులు సొంత భూమినీ కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన సెంటు భూమిలేని కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇలా గత ఐదేళ్లలో 5.57 లక్షల మంది కౌలు రైతులకు రూ.751.42 కోట్లు, 4.01 లక్షల అటవీ భూములు (ఆర్వో ఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ.541.58 కోట్లు కలిపి మొత్తం 9.58 లక్షల మందికి రూ.1293 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి సహాయంగా అందించింది. అంటే ఏటా సగటున 1.92 లక్షల మందికి రూ.259 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఈనాడుకు మాత్రం 1.07 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించినట్టుగా కని్పంచింది.అబద్ధం: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకూ ఈ ప్రభుత్వం వర్తింప చేస్తోంది. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా ఈ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈనాడుకు మాత్రం సున్నా వడ్డీ రాయితీ పొందిన వారే కని్పంచలేదు. ఈ ఐదేళ్లలో 3,54,878 మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 3,67,903 మందికి రూ.424 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌సబ్సిడీ) పంపిణీ చేస్తే, ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో పెట్టుబడి రాయితీ పొందిన వారు 48,290 మంది, పంటల బీమా పరిహారం పొందిన వారు 88,619 మంది మాత్రమే కని్పస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని తక్కువ చేయాలన్న దుష్టతలంపేనని ఇట్టే అర్థమవుతోంది.అబద్ధం: కౌలు రైతులకు పంట రుణాల్లేవు..వడ్డీ రాయితీకి సున్నా..వాస్తవం: వాస్తవ సాగు దారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్ద ఎత్తున రుణాలు అందేలా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 14.75 లక్షల మంది కౌలుదారులకు రూ.8,642.40 కోట్ల రుణాలను ఈ ప్రభుత్వం అందించింది. ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో రుణాలు పొందిన వారు 1.68 లక్షల మందే కని్పంచారు. ఈ –క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంట రుణాలు పొందిన 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని జగన్ ప్రభుత్వం అందించింది. -
Potina Mahesh: పవన్ అక్రమాస్తుల వివరాలు ఇవే..!
విజయవాడ: రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్ పెద్ద చీడపురుగని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. జనసేన స్థాపించిన పదేళ్లలో ఆయన సుమారు రూ.15 వందల కోట్ల నుంచి రూ.రెండు వేల కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని ఆయన వెల్లడించారు. 2014లో కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉంటూ కారు ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పిన పవన్ ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు, తిరగటానికి హెలికాప్టర్, అనేక ఆస్తులను తొమ్మిదేళ్లలో ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఇటీవల కాలంలో పవన్ ఏ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించకపోయినా.. రూ.వందల కోట్ల లాభాలు రాకపోయినా జనసేన పార్టీ పెట్టాకే పవన్‌కు రూ.వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని నడపలేక తీసేశారుగానీ.. జనసేన పార్టీని మాత్రం ముందే చంద్రబాబుకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్న దుర్మార్గుడు పవన్.మాలాంటి వాళ్లందర్నీ రాజకీయంగా, ఆరి్థకంగా బలిపశువులు చేసి ఆయన మాత్రం అన్ని రకాలుగా బాగుపడ్డారు. కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి, బీసీలను మార్పుకోసం పోరాడాలని సూచించి ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, నేను చంద్రబాబు సేవకుణ్ణి, చంద్రబాబు పాలేరుని అంటూ ప్యాకేజీ తీసుకుని మాలాంటి వాళ్లను పవన్ బలి పశువులని చేసి ఆయన మాత్రం బాగా ఆరి్థకంగా బలపడ్డారు.ఈ సమావేశంలో పవన్ ఆక్రమాస్తులు.. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన వాటి వివరాలను పోతిన మహేష్ వెల్లడించారు. అవి..మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన పవన్ బినామి అయినా నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోషడుపు వెంకటేశ్వరరావు పేరు మీద రూ.100 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆధార్ కార్డుపై అనేక అనుమానాలున్నాయి. పోషడుపు వెంకటేశ్వరరావు గుంటూరు అయితే చెల్లించిన బ్యాంకు చెల్లింపులు హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకువి. వీటిపై సమాధానం చెప్పాలి. రెండు రిజి్రస్టేషన్లకి పోషడుపు వెంకటేశ్వరరావు హాజరుకాగా.. మరొక రెండు రిజి్రస్టేషన్లకు నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ వి. నవీన్‌కుమార్ హాజరయ్యారు. డాక్యుమెంట్ నెంబర్లు : 704/2024, 2244/2024, 2818/2024, 3555/2024, 5002/2014.రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో పవన్ ఫామ్‌హౌస్ 14 ఎకరాల్లో ఉందని అఫిడవిట్లో చూపించారు. కానీ, అది 45–50 ఎకరాల్లో ఉంది. పాతది 14 ఎకరాలైతే.. 2019 ఎన్నికల తర్వాత పవన్ మరొక 30 ఎకరాలు కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరం ఏడున్నర కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. అది కూడా బినామీ పేర్ల మీద పెట్టారు.2019 ఎన్నికల్లో పవన్‌కు ఎన్ఆర్ఐలు, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు రూ.125 కోట్ల విరాళాలిచ్చారు. వాటిని వసూలుచేసింది పీవీ రావు, ఆర్ఆర్ రామ్మోహన్, చింతల పార్థసారధి, ముత్తంశెట్టి కృష్ణారావు. అందులో 90శాతం నగదు రూపంలో, పది శాతం డీడీల రూపంలో ఇచ్చారు. ఆ డబ్బుల వివరాలు అడిగినందునే వాళ్ల మధ్య వివాదాలు తలెత్తాయి.పవన్ నిజస్వరూపం తెలియాలంటే 2018–2024 వరకు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్ తప్ప పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టాలి.పవన్ హైదరాబాదులో కొనుగోలు చేసిన 4,200 గజాల విలువ రూ.50 కోట్లుగా చూపించారు. దానిని 2021–2024 మధ్యే కొనుగోలు చేశారు. నిజానికి.. దాని విలువ సుమారు 125 కోట్లుగా ఉంది. మిగిలిన రూ.75 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. సినిమాలు లేకుండా ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి.పవన్ బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ల కింద రూ.28 కోట్లు ఉన్నాయని చూపించారు. కానీ, బయట వ్యక్తుల దగ్గర రూ.46 కోట్ల అప్పులను కూడా చూపించారు. బ్యాంకులో రూ.28 కోట్లు ఉండగా ఎక్కువ వడ్డీకి ఎవరైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటారా?సినీ పరిశ్రమలోను, బయట పవన్ బినామీలున్నారు. వారిలో ప్రధానంగా నర్రా శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. వీరితోపాటు అమెరికాలోని పవన్ పిన్ని కొడుకు అనిల్, అలాగే, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, తంగేళ్ల సుమన్ వీరంతా కూడా ఆయన బినామీలే.ఇక పవన్ కొనుగోలు చేసిన ఆస్తులు కాకుండా అనేక ఆస్తులు అగ్రిమెంట్ మీద స్వా«దీనం చేసుకున్నారు. వాటినింకా రిజి్రస్టేషన్ చేసుకోలేదు. ఎన్నికల తర్వాత కొన్ని సినిమా అడ్వాన్సుల కింద తీసుకున్నట్లు చూపించి ఆపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్నారు. అలాగే, హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి కార్యాలయం వెనుక నాలుగు నెలలు కిందటి వరకు జనసేన కార్యాలయంగా ఉన్న స్థలం సొంత కార్యాలయంగా మారిపోయింది.టీ టైమ్ తంగెళ్ల శ్రీనివాస్‌కు 2,500 టీ దుకాణాలు ఉన్నాయి. పవన్ తన బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకునేందుకు ఈ దుకాణాలను మార్గంగా ఎంచుకున్నారు.పవన్ తన పిల్లల పేర్లు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దుచేశానని చెప్పారుగానీ ఎప్పుడు ఏ బ్యాంకులో ఎంత మొత్తానివి రద్దుచేసి ఏ ఆస్తి కొన్నారో చెప్పాలి.జనసేన కార్యాలయాల కోసం కొనుగోలు చేస్తున్న స్థలాలన్నీ కూడా పవన్ పేరు మీద ఎందుకు పెట్టాలి? పార్టీ పేరు మీద ఎందుకు రిజి్రస్టేషన్ చేయించడంలేదు?ప్యాకేజ్ ద్వారా తీసుకున్న డబ్బుల్ని ఫ్లోరిడాలో పెట్టుబడులు పెట్టేందుకే పవన్ విరాళాల ముసుగులో అమెరికా వెళ్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేయడానికి పవన్ యత్నిస్తున్నారు. హాసిని ప్రొడక్షన్స్ ద్వారా ఈ డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.పవన్‌తో తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా, డబ్బులు రాకపోయినా నిర్మాత విశ్వప్రసాద్ పవన్‌తో ఏడు సినిమాలు తీస్తానని చెప్తున్నారు. ఈ చిదంబర రహస్యం ఏంటి?పవన్ ప్రధాన బినామి టీజీ విశ్వప్రసాద్‌పై సీబీఐ విచారణ చేయాలి. ఈడీ, సీఐడీలు కేసులు నమోదు చేయాలి. రేణుదేశాయ్‌కు ప్రతినెలా రూ.10 లక్షలు టీజీ విశ్వప్రసాద్ తీసుకెళ్లి ఇస్తున్నారు.ప్యాకేజీకి అదనంగా పవన్‌కళ్యాణ్ సీట్లు అమ్ముకున్న మాట ముమ్మాటికి నిజం. జనసేన టికెట్లను తెలుగుదేశం వాళ్లకు ఇచ్చినందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 కోట్లు పవన్ వసూలుచేశారు. -
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు...కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు.చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యఆర్థికస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం?ఏది నిజం..?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు.వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆఆర్థికక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్‌లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆఆర్థికక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ.వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా.జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి.ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆఆర్థికక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆఆర్థికక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్‌సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా?2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు.2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆఆర్థికక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది.ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు.2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు.2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక.చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ?ఈనాడు ఆరోపణ: రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు.వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు.ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కలి్పస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు.ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యఆర్థికంచారు. దీనికీ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు.ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు.అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు.అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు? -
అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
తెలుగుదేశం కూటమి డబుల్ గేమ్ అనాలా? లేక దొంగ నాటకాలని అనలా? అమరావతి రాజధాని అంటే ఇతర ప్రాంతాల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా? బుధవారం నాడు తెలుగుదేశం కూటమి వివిధ పత్రికలలో ప్రచార ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ, కలికిరి రాక సందర్భంలో ఈ అడ్వైర్టైజ్ మెంట్ ఇచ్చారు. కేవలం విజయవాడ ప్రాంత ఎడిషన్లలో మాత్రం అమరావతి రాజధాని అని ప్రస్తావించి, ఇతర ప్రాంత ఎడిషన్లలో మాత్రం రాష్ట్ర వికాసానికి అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలలో ప్రజలలో వ్యతిరేకత బహిర్గతమై, ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భయపడడమే కదా!విజయవాడ పత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది. 'మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి' అని ఉంది. అదే విశాఖపట్నం ఏరియాలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ...' అని రాశారు. అంటే విజయవాడకు మోదీ వస్తున్నది కేవలం అమరావతి గురించేనని అనుకోవాలా? రాష్ట్ర వికాసం కోసం కాదా? విశాఖకు అమరావతి కలల రాజధాని కాదని చెప్పడమే కదా! ఒకపక్క అమరావతితోనే అభివృద్ది అంటూ సొల్లు పురాణం చెప్పే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నారంటే వారికి తమపై తమకే నమ్మకం లేదనే కదా?ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా స్పష్టంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తద్వారా వికేంద్రీకరణ జరిగి అభివృద్దికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఆయన మానిఫెస్టోలో కూడా చెప్పారు. విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.విశేషం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజధాని అయితే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. శ్రీభరత్ విశాఖ నుంచి టీడీపీ పక్షాన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఆయన అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ది కాదని, ఇరవై ఏళ్లయినా పడుతుందని, విశాఖ అయితే ఆ ఇబ్బంది ఉండదని అన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అభ్యర్ధులు ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రచారం చేస్తున్నారని తేలిపోతోంది. నిజానికి అమరావతి రాజధాని అని గతంలో హడావుడి చేసినా తెలుగుదేశంను ప్రజలు ఓడించారు. చివరికి అమరావతి గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలోను, మంగళగిరి నియోజకవర్గంలోను టీడీపీ ఓడిపోయింది.స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలయ్యారు. దానికి కారణం అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు జరిపిన భూదందానే. ఈ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఇదంతా ఒక కులం వారికోసం, ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొని లాభపడ్డవారి కోసమేనని ఇక్కడి ప్రజలు కూడా అనుమానించారు. దాంతో అమరావతి రాజధాని అన్న కాన్సెప్ట్‌కు ప్రజామోదం లేకుండా పోయింది. అయినా 2019 తర్వాత కూడా రాజధాని రైతుల పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అండతో కల్పిత ఉద్యమాలను టీడీపీ నడిపింది. అయినా ఇప్పుడు అమరావతి అంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఈ రకంగా డబుల్ గేమ్ ఆరంభించారని భావించాలి.అమరావతికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రచారం చేసేవారు. బీజేపీతో చెడ్డాక ప్రధాని మోదీ అమరావతికి ఏమీ ఇవ్వలేదని, చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని కూడా ఆయన విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి గాను ప్రజలు మోదీ రోడ్‌షో కు రావాలని కోరారు. గతంలో బీజేపీ నేతలు కూడా అమరావతి భూ స్కామ్ చాలా పెద్దదని విమర్శించేవారు. ఇప్పుడు మోదీ అమరావతికి ఏమైనా లక్ష కోట్ల నిధులు ఇస్తానని కూటమి నేతలకు హామీ ఇచ్చారా? అసలు ఏపీలో ఫలానా అభివృద్ది చేస్తానని మోదీ గ్యారంటీ ఇవ్వడం లేదు. అయినా వీరు మాత్రం ప్రజలను రకరకాలుగా మోసం చేయడానికి యత్నిస్తున్నారు.రాజమండ్రి, అనకాపల్లిలలో జరిగిన ప్రధాని సభలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయనపై నేరుగా అనివీతి ఆరోపణలు చేయలేదు. కాకపోతే జనరల్‌గా ఏవో కొన్ని విమర్శలు చేయాలి కాబట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతి అంటూ ఇంతకాలం టీడీపీ ఏమి ఆరోపిస్తుందో వాటినే ఆయన కూడా చెప్పి వెళ్లారు. విశేషం ఏమిటంటే మోదీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబు ఉపన్యాసం వినకుండానే నిష్క్రమించడం. బహుశా చంద్రబాబు మాటల మీద వీరికి నమ్మకం పోయిందేమో తెలియదు. మోదీని ఏపీకి తీసుకు రావడం ద్వారా తమకు పలుకుబడి ఉందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సహేతుక కారణాలు చూపకుండానే బదిలీ చేయడం, నాలుగేళ్లుగా అమలు అవుతున్న స్కీముల ద్వారా లబ్ది దారులకు డబ్బు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వడం, వలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయడం, చంద్రబాబు ఎంత నీచంగా ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో రాలేదు. అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా రాయబేరాలు సాగించి కాళ్లా, వేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడానికే అని అర్దం అవుతుంది.తమపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్తపడడానికే అని ప్రజలంతా భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలోనే కాదు. పలు విషయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల అంతా వినాశనమేనని గతంలో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దారుణమైన ఆరోపణలు ఆ చిన్నస్థాయి వలంటీర్లపై గుప్పించారు. తదుపరి ఎన్నికల సమయానికి తాము కూడా వలంటీర్లను కొనసాగిస్తామని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రకటించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోందని చంద్రబాబు, పవన్ లు విమర్శించేవారు. కానీ వారి ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికన్నా మూడు రెట్ల వ్యయంతో సంక్షేమ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ మాత్రం అదేదో ప్రమాదకరమైనదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ చట్టం గురించి మోదీ, అమిత్ షా సభలలో మాత్రం నోరు విప్పరు.ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్న, అబద్దాలు చెబుతున్న టీడీపీ కూటమికి ఎవరైనా ఓటు వేస్తే, వారి అబద్దాలకు ఆమోద ముద్ర వేసినట్లే అవుతుంది. చివరిగా ఒక మాట. పవన్ కల్యాణ్ పెద్ద కవి మాదిరిగా పర్వతం ఎవరికి తలవంచదు. సముద్రం ఎవరి కాళ్ల వద్దకు వెళ్లదు.. అంటూ సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ మోదీ పాల్గొన్న సభలో ఈయన వంగి, వంగి ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని విస్తుపరిచింది. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ ఉన్నారని ప్రజలకు క్లారిటీ వచ్చింది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
'ఏంటిది సుజనా'..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తీరు స్థానిక ఓటర్లలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం, ఆర్యవైశ్య, నగర సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. తాజాగా ఆయన వీరితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో ‘నా ఎదుగుదలకు మీరే కారణం.. మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి’అంటూ తెగ ఊదరగొట్టారు. దీంతో సమావేశాలకు వెళ్లిన వారంతా ఒకటే మాట.. బ్యాంకులు లూటీ చేసి, ఆ డబ్బుతో ఎన్నికలకో పార్టీ మారే సుజనా ఎదుగుదలకు తామెలా కారణమవుతామని మిత్రులతో గుసగుసలాడుకుంటున్నారు. కొంపదీసి ఈయన ఎగ్గొట్టిన బ్యాంకు రుణాల బకాయిల్ని తమ నెత్తిన రుద్దుతారేమోనని భయపడుతున్నారట.ఇవి చదవండి: 'గ్లాస్ గుచ్చుకుంది'..! -
'గ్లాస్ గుచ్చుకుంది'..!
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు గ్లాసు గుర్తు గట్టిగానే గుచ్చుకుంటోందట. ఇప్పటికే జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన ఓట్లనే చీల్చుతారని తెగ ఇదైపోతున్నారట. దీనికి గ్లాసు గుర్తు తోడు కావడంతో భయపడ్డ ఆయన, గ్లాస్ గుర్తు దక్కిన స్వతంత్ర అభ్యర్థి ఇంటికెళ్లి మరీ బతిమాలుకున్నారట.తను గెలిచాక అధిక మొత్తం ముట్టజెప్తానని హామీ ఇచ్చారట. అయి తే 2014లో ఆయన తీరు గుర్తుకొచ్చి తక్షణ బేరం మాట్లాడుకున్నారట. కాస్త ‘భారీ’స్థాయిలో బతిమాలుకున్నాకే ఆ అభ్యర్థి వెనక్కి తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి పరువు తప్ప, అధికారం మాత్రం దక్కదన్న నమ్మకానికొచ్చేశారట..!ఇవి చదవండి: 'పులుసు కారుతోంది'..! -
PK: 'పులుసు కారుతోంది'..!
ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్.. అని ఆంగ్ల నానుడి. నాలుగైదు రోజులుగా పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్‌కల్యాణ్ ముఖాన్ని చూస్తే.. ఆయన పరిస్థితి ఏంటన్నది తెలిసిపోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి భయం పవన్‌ను నిలువెల్లా వణికిస్తోందట. టీడీపీ నేత వర్మ అనుచరులు పవన్‌కు సహకరించేది లేదని ఇప్పటికే వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మోతెక్కిస్తున్నారు.మరోవైపు మహాసేన రాజేష్ కూడా జనసేన ఓటమే లక్ష్యంగా తమ సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని పవన్ అభిమానుల ఆరోపణ. పవన్‌ను ఎదగనిస్తే లోకేశం రాజకీయ భవిష్యత్తుకు గుదిబండలా మారతారన్న భయంతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆక్రోశిస్తున్నారు. అందుకే చిరంజీవితో సహా పవన్ తన కుటుంబాన్ని, బుల్లితెర, సినీ పరిశ్రమలో తన అనుయాయుల్ని బతిమాలి మరీ ఎన్నికల ప్రచారంలోకి దించారట.ఇవి చదవండి: బాబు-మోదీ ఇద్దరూ తోడు దొంగలే.. -
బాబు–మోదీ ఇద్దరూ తోడు దొంగలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని స్పష్టమైంది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో టీడీపీ, బీజేపీలు జట్టుకట్టి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. హోదాను అటకెక్కించారు. హోదా వస్తే రాయలసీమ భవిత బంగారం అవుతుందనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త రాగం అందుకున్న చంద్రబాబు హోదాను మోదీకి తాకట్టు పెట్టారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం మోసం చేసిందంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు.ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన ఆ రెండు పారీ్టలు మళ్లీ రాయలసీమ ప్రజల్ని మోసగిస్తున్నాయి. ప్రధాని బుధవారం రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ప్రత్యేక హోదాపై, రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీపై మోదీని చంద్రబాబు కనీసం ప్రశ్నించలేదు. హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీతో కలిసి ప్రచారానికి ఎలా వచ్చారని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. గుండెకాయ లాంటి రాజధాని పోయింది. హైదరాబాద్‌ను కోల్పోవడంతో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపన వేగం పుంజుకుని రాష్ట్రం గాడిన పడుతుందని రాష్ట్ర ప్రజలు భావించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయంపై మొరపెట్టుకుంటే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీనిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే.. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే రాష్ట్ర ప్రజల ఆశల్ని చంద్రబాబు.. కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తన స్వార్థం చూసుకున్నాడు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించారు. ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది. అంతకంటే ప్యాకేజీతోనే మేలు.. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు’ అని 2017లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.2014లో కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అంతా ఆశపడ్డారు. ఆ సమయంలో కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు పూర్తిగా కేంద్రానికి లొంగిపోయారు. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజితో అంతకంటే మేలు చేస్తుందని కొత్తపల్లవి ఆలపించారు. ఆ ప్రకటనతో ఏపీ ప్రజలు అవాక్కయ్యారు. అతన్ని వ్యతిరేకించిన వారిని జైల్లో పెడతానని బెదిరించారు.సీమకు తీరని అన్యాయం.. రాయలసీమలో 69 శాతం భూమి సాగు ప్రాంతం కాగా.. మిగతా 31 శాతం భూమి పరిశ్రమలు స్థాపనకు అనుకూలం.1. పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు అందుబాటులో ఉన్నాయి. 2. సమీపంలో బెంగళూరు, కర్నూలు, కడప, తిరుపతి ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. 3. ఎగుమతులు, దిగుమతులకు చెన్నై, గోవా, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులో ఉన్నాయి. 4. కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుష్కలంగా నీరు ఉంది. హంద్రీ–నీవాతో వైఎస్సార్ రిజర్వాయర్లు నిర్మించారు.పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ‘హోదా’ వచ్చుంటే ‘సీమ’ రూపరేఖలే మారిపోయేవి. ‘సీమ’ అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేవి. నిజానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు, గరుడ స్టీల్స్, కియా మినహా పరిశ్రమల జాడ లేదు. ఇవి మినహా 2019 వరకూ వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ప్రస్తుత ప్రభుత్వం చొరవతో గ్రీన్కో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటు నిర్మిస్తోంది. దీంతో 25 వేల ఉద్యోగాలు రానున్నాయి.ప్రత్యేక హోదా వచ్చుంటే..1. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల్లో పూర్తి మినహాయింపు ఇస్తారు. 2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. కేంద్రం కూడా 25–30 శాతం రాయితీ ఇస్తుంది. 3. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్‌పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 4. 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్‌చార్జీలపై 50 శా>తం రాయితీ ఇస్తారు. 5. పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడిసరుకు తీసుకెళ్లేందుకు, తయారీ వస్తువుల ఎగుమతి ఖర్చును కేంద్రం భరిస్తుంది.పరిశ్రమల ప్లాంట్లు, యంత్రాలపై పెట్టుబడిలో 30 శాతం రాయితీ వస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పాత పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమలు స్థాపించినవారికి 25–55 శాతం వెసులుబాటు ప్రత్యేక హోదాతో లభిస్తుంది. ఇలాంటి అవకాశాలతోనే ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. హోదా ప్రకటిస్తే భూములు, పారిశ్రామికీకరణకు యోగ్యంగా ఉన్న ‘‘సీమ’లో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడతాయి. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందేవి. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీలోనూ మోసమే.. విభజన చట్టంలో రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని విభజన చట్టంలో 46(ఏ), 46(బి)లో పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.22,400 కోట్లు ఈ ప్రాంతాలకు 2014–2019లో మంజూరు చేయాలి. సెక్షన్ 46లో బుందేల్‌ఖండ్ అనే మాట తీసేసి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి పేరుతో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మనకు హక్కుగా రావల్సిన బుందేల్‌ఖండ్ ప్యాకేజీ ఇస్తే ప్రత్యేక ప్యాకేజితో పనిలేకుండా సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టేవి. ఈ విషయంలో కూడా చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. అపారమైన ఖనిజం ‘సీమ’ సొంతం!రాయలసీమలో డోలమైట్, ఐరన్‌ఓర్, గ్రానైట్, యురేనియం, సిలికా, బైరెటీసీ, లైమ్‌స్టోన్, క్వారŠట్జ్తో పాటు ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. రామగిరి, జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్, వజ్రకరూరల్, తుగ్గలి మండలాల్లో వజ్ర నిక్షేపాలున్నాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే సీమలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. తాడిపత్రి, బేతంచెర్ల, కొలిమిగుండ్లలో నాపరాయి గనులు ఉండడంతో సిమెంట్ పరిశ్రమల స్థాపన పెరిగేది. హోదాతో వ్యవసాయాధారిత పరిశ్రమలకూ ఊతం..‘సీమ’కు హంద్రీ–నీవాతో ఏటా 40 టీఎంసీల జలాలు వస్తాయి. దీంతో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎక్కువ స్థాపించే అవకాశం ఉంది. వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడుతో పాటు హారి్టకల్చర్ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఆపిల్ మినహా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంటు, కాటన్ పరిశ్రమలు, చీనీ జ్యూస్ తయారీ పరిశ్రమ, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వ్యవసాయ, ఉద్యానపంటల ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా స్థాపించే అవకాశం ఉంది. దీంతో రైతులు పండించే పంట సులభంగా మార్కెట్‌కు చేరుతుంది. ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, నగరి, ఎమ్మిగనూరు, ఉరవకొండ, మాధవరం ప్రాంతాల్లో నేత కారి్మకులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కులు నిరి్మస్తే, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోదా వస్తే సంబంధిత పరిశ్రమలకు ఎక్కువగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మానవ వనరులు పుష్కలం!రాయలసీమలో జేఎన్టీయూతో పాటు ఎస్కేయూ, ఎస్వీ, రాయలసీమ, యోగి వేమన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ ఉంది. ఈ వర్సిటీల ద్వారా ఏటా వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. వీరికి వృతినైపుణ్య శిక్షణ ఇస్తే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.రాయలసీమకు బాబు ద్రోహం!2014–19 మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఆ ఐదేళ్లలో ప్రత్యేక హోదా వాణి విని్పంచలేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి సీమకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తలూపారు. ‘సీమ’ భవిష్యత్తును బలిపెట్టారు. హోదా వస్తే పరిశ్రమలు స్థాపించిన వారికి మేలు జరుగుతుంది, నిధుల స్వాహాకు అవకాశం తక్కువ! ప్యాకేజీ వస్తే అంతా స్వాహా చేయొచ్చు! ఇదే సూత్రాన్ని చంద్రబాబు నమ్మి హోదాను కేంద్రం ముందు తాకట్టుపెట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. -
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తూర్పు గోదావరి, సాక్షి: మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.రాజానగరం సిద్ధమా? ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల చూపిస్తున్న ప్రతీ అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి.నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్ బడులు. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. సైకిల్ డ్యామేజ్ ఎంతలా అంటే.. ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్ రిపేర్ కోసం మెకానిక్‌లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి.. తుప్పు పట్టిన ఆ సైకిల్‌ను చూశారు. ఆ సైకిల్‌కు సీటు లేదు. చక్రాల్లేవ్. సైకిల్‌కు పెడెల్ లేదు. ట్యూబ్‌లు ల్లేవ్. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో.ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారు. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ముఖ్యమైన మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా?. ఇంటింటికీ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో పంపించి.. ఆ తర్వాత ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా?ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెస్టో డ్రామాలాడుతున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఢిల్లీతో కుట్రలు పన్ని..ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా?. జగన్ ఏదైనా బటన్లు నొక్కాడో.. ఆ బటన్లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్ 4వ తేదీ తర్వాత.. ఒక వారంలోనే ఆ బటన్లు అన్నీ క్లియర్ చేస్తాడు. 👉కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే జగన్లాగా బాబు బటన్లు నొక్కలేదు. ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కోసం డబ్బులు ఇవ్వలేదు. ఏ పథకం లేదు. మీ బిడ్డ అలా కాదు. 59 నెలల కాలంలో 130 బటన్లు నొక్కాడు. రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు దగ్గర దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఎన్నికల కోసం ఆ డబ్బు పంచే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది మనదే.. మన దగ్గర దోచేసిన సొమ్ము. కాబట్టి, ఏ ఒక్కరూ వద్దు అని చెప్పకండి. కానీ, ఓటేసేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి.👉ఇది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు. పెత్తందారు మరోవైపున జరుగుతున్న యుద్ధం. ఇంట్లోవాళ్లతో అందరితో మాట్లాడండి. అభిప్రాయం తీసుకోండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందనేది చూడండి. జాగ్రత్తగా ఓటేయండి. ఈ విషయం చెప్పడం అవసరం.👉ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు. అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి. ఛీటింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డా. గూడురి శ్రీనివాసులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని పేరుపేరున ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. -
AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని రీతిలో ఈ దఫా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సంక్షేమాభివృద్ధిలు, సామాజిక న్యాయం అజెండాగా అధికార వైఎస్సార్సీపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడకముందే ప్రచార క్షేత్రంలోకి దిగింది. మరోవైపు.. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు గందరగోళం నడుమ అయోమయంగానే సాగుతోంది కూమిటి పార్టీల ప్రచారం.ఏపీలో ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5గం. ప్రచార పర్వం ముగియనుంది. మే 13వ తేదీన(సోమవారం) ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి నాలుగు రోజుల్లో ప్రచారం హోరెత్తె అవకాశాలున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లతో సంబంధం లేకుండా.. ఏడాది కిందటి నుంచే వైఎస్సార్సీపీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అభ్యర్థుల ఎంపిక.. అందునా సిట్టింగ్‌లలో ఎవరెవరిని తప్పిస్తారనేది ముందు నుంచే చెబుతూ పార్టీని, పార్టీ శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చారు. అందుకే సిట్టింగ్‌లలో కొందరికి సీట్లు దక్కకపోయినా.. పార్టీ కేడర్ మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆ వెంటనే సిద్ధం సభలతో పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణను దేశం మొత్తానికి చూపించిన సీఎం జగన్.. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు.ఇక బస్సు యాత్ర ముగిసిన వెంటనే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో.. మరోవైపు జగన్ కోసం సిద్ధం పేరిట మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ విశ్వసనీయత ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో.. సీఎం జగన్ కేవలం తన పరిపాలన గురించి, చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే సీఎం జగన్ ప్రచారం ఏ రూపంలో ఉన్నా సరే.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఇక కూటమి పార్టీల ప్రచారానికి ప్రజా స్పందనే కరువైంది. ఒకవైపు ఎన్నికల ప్రచార సభలకు జనం లేక వెలవెలబోతుంటే.. పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. యువగళం, ప్రజాగళం, వారాహి.. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎవరికి వారే సభలు పెట్టినా.. ఆఖరికి అంతా కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహించినా.. జనం ఆసక్తి చూపించడం లేదు. ఆఖరికి.. సూపర్‌సిక్స్ ల్యాంటి గిఫ్ట్ ప్యాక్‌లతో ఎరవేసే యత్నం చేసినా.. ఛీ కొట్టేస్తున్నారు. కూటమి పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో జనాకర్షణ కోసం చెమటోస్తున్నారు.ప్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ప్రజాగళం సాగుతోంది. తన హయాంలో జరిగిన ఇది అని చెప్పలేకపోతున్నారు, ప్రజల్లో సెంటిమెంటును ఎమోషన్‌ను రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనకు అధికారం వస్తే ఇలా చేస్తానని ఇవి అమలు చేస్తానని చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఊగిపోతూ పవన్ చేస్తున్న ప్రసంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అసలు ప్రచారం చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పూర్తిగా దూరం ఉండిపోయారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చే కుట్రలో భాగంగా సీఎం జగన్‌ను.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం చెప్పుకోవడం వేస్ట్.కూటమిలో బీజేపీ కూడా ఉండడంతో.. చివరి నాలుగు రోజుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారంలోకి దిగనున్నారు. మోదీ, అమిత్ షాలు ప్రచారం చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతంగా ప్రతిపక్ష కూటమి ప్రచారం అయోమయంగా, గందరగోళంగా సాగుతుండగా, ఒక షెడ్యూల్ ప్రకారం క్లారిటీతో వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. -
నాడు ఒప్పయింది.. నేడు తప్పయిందా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు.చంద్రబాబుకు పనికొస్తుంది ఆంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు.. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు...ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి, విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు.👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది.:::: సిమ్మాదిరప్పన్న -
సీను సీతారైంది సాంబడా
ఎంతమంది రౌడీలను పెట్టినా హీరో లొంగడం లేదు.. పైగా ఎగిరెగిరి తంతున్నాడు. వచ్చినవాళ్లు వచ్చినట్లే నేలకు కరుచుకుపోతున్నారు.. ఇక ఇలాక్కాదని రావుగోపాలరావుకు కోపం వచ్చింది. బొంబాయి నుంచి జిముంబా అనే పెద్ద దాదాను తీసుకొచ్చాడు. వాడు మామూలు మనిషి కాదు.. పూటకు రెండు గొర్రెలు వంద గుడ్లు తింటాడు. వాణ్ని ఎవరూ ఎదుర్కోలేరు. అలాంటివాణ్ణి హీరోమీదకు ఉసిగొల్పాడు.. మొదటి రెండు షాట్లు తిన్న హీరో ఇక లేచాడు. కళ్ళలో పడిన దుమ్మును దులిపేసి.. నడుముకు తువాలు చుట్టి జై భజరంగి భళి అంటూ గర్జించాడు.. ఎగిరెగిరి తన్నాడు.. దెబ్బకు జిముంబా కూడా నేల కరిచేసాడు.ఆంధ్ర పాలిటిక్స్ కూడా ఇలాగే ఉన్నాయ్.. రావుగోపాలరావు పాత్రలో ఉన్న చంద్రబాబు కూడా ఇలాగే హీరో జగన్ మీద రకరకాల వాళ్ళను ప్రయోగిస్తున్నారు... వలంటీర్ల మీద దుమ్ము రేపబోయాడు... అది ఎదురుతన్నింది... వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను ఆపించాలని చూసాడు... వృద్ధులతో తిట్లు కాసాడు.. ఇంగ్లిష్ మీడియం వద్దన్నాడు.. పేరెంట్స్ తో చీవాట్లు కాసాడు... ఇక ఇలా కాదని ఎక్కడా లేని ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని బయటకు తెచ్చి ఇది వచ్చిందంటే ఇక మీ భూములన్నీ ఉఫ్... జగన్ ఎత్తుకుపోతాడు.. అంటూ తన బ్యాచ్ తో కలిసి తెగ ప్రచారం చేసాడు... పత్రికలూ...మీడియా..చానెళ్లు ఇవన్నీ నాలుగురోజులపాటు ఇదే పనిమీద ఉన్నాయ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయారు... ఎల్లో మీడియా సంస్థలన్నీ ఒళ్ళంతా సూదులతో గుచ్చుకుని కొరడాలతో కొట్టుకున్నారు... జనాన్ని భయపెట్టేసి కంగారు పెట్టేసి.. వామ్మో వాయ్యో అనేలా చేసి....సంబరపడుతున్న తరుణంలో మెల్లగా సీఎం వైయస్ జగన్ మైక్ అందుకున్నారు. చదవండి: కొత్త పగటివేషగాడు వచ్చాడుఅసలు ఆ చట్టం ఆంటే ఏమిటి... దానిలోని లోటుపాట్లు...అంతా చిన్నపిల్లలకు వివరించినట్లు చెప్పారు... లక్షల ఎకరాల చుక్కల భూములను పేదలకు పంచింది మీ జగన్.... లక్షల ఎకరాల పోడు భూముల మీద గిరిజనులకు హక్కులిచ్చాము... ఇంకా చంద్రబాబు గ్యాంగ్ అడ్డుకున్నా.. కోర్టుల్లో కేసులు వేసినా లక్షలమందికి వేలాది ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చాము...ఇదీ మీ జగన్ నిజాయితీ...ఇదీ మీ జగన్ కు మీ పట్ల ఉన్న ప్రేమ... అలాంటి జగన్ మీ భూములు లాక్కుంటాడా ? ఈ ఐదేళ్ల పాలనలో మీరు జగన్‌ను ఇదేనా అర్థం చేసుకున్నది... అంటూ వివరించారు. దీంతో జనానికి విషయం అర్థం ఐంది.అంటే పెన్షన్ల విషయంలో కుట్రపన్నినట్లే ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం విషయంలోనూ చంద్రబాబు కావాలనే ప్రజలను తప్పుదోవపడుతున్నట్లు జనానికి అర్థం ఐంది... దీంతోబాటు అలంటి తప్పుడు ప్రకటనలు..ప్రసంగాలు చేస్తున్నందుకు ఎన్నికల సంఘం ఆదేశాలతో చంద్రబాబు, లోకేష్ సీఐడీ కేసు నమోదు చేసింది.దీంతో ప్రజలకు విషయం అర్థమైంది...అంతేకాకుండా ఆ అంశం ప్రజల మనస్సుల్లోంచి తొలగిపోతూ... జై జగన్ అనే నినాదం వచ్చి చేరుతోంది... దీంతో ఎల్లో మీడియా... చంద్రబాబు క్యాంప్ తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు.. ఎంతో ప్లాన్ చేసి ఈ టైట్లింగ్ చట్టం మీద గాయిగాత్తర చేయబోతే ఇలాగయ్యిందేంటిరా సాంబడా అంటూ తండ్రీకొడుకులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.. మనం ఎంత పెద్ద కుట్రపన్నినా అటు జగన్ ఒక్క బాణంతో దాన్ని ఎఱుర్కొంటూనే తిరిగి ఆ వ్యూహం మనకు తగిలేలా చేస్తున్నాడు..ఇలాగైతే ఎలారా సాంబా అని తండ్రీకొడుకులు కొత్త కుట్రలకు సిద్ధమవుతున్నారు... ఈసారి ఢిల్లీ కాకుండా బీహార్ నుంచి భిక్షు యాదవ్ ను తెచ్చేపనిలో ఉన్నారేమో... చూడాలి.:::: సిమ్మదిరప్పన్న -
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
శ్రీసత్యసాయి, సాక్షి: చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్లో శనివారం మధ్యాహ్నాం జరిగిన ప్రచార భేరిలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. లేచి లకలకలక అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి.దేవుడి దయతో.. ప్రజల చల్లని దీవెనలతో 58 నెలల మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రూ.2 లక్షల 70 కోట్ల వేల రూపాయలు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీ ద్వారా బటన్లు నొక్కడం జమ చేశాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్ర చరిత్రలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే.. 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టోలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 99 శాతం హామీలు అమలు అయ్యింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గతంలో.. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో తీసుకొచ్చి.. తర్వాత చెత్త బుట్టలో వేస్తారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. మేనిఫెస్టో హామీలు నెరవేర్చి, ఇప్పుడు ఇదే మేనిఫెస్టోతో ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుతం మీ బిడ్డ ప్రభుత్వమే.మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులతో ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. అక్కాచెల్లెమ్మలు తమ సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ కానుక. ఇవేవైనా గతంలో జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ.. ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం, చేదోడు, లాయర్లకు లా నేస్తం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా?. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతలా పట్టించుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో. ఆరోగ్యశ్రీని ఉచితంగా రూ.25లక్షలకు విస్తరించడం, గ్రామంలోనే ఫ్యామిలీ క్లినిక్, విలేజ్ డాక్టర్, ఇంటికే సురక్ష.. ఇవేవైనా గతంలో జరిగాయా?..గతంలో ఎన్నడూ లేనివిధంగా.. ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీ, గ్రామంలో ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల సంరక్షణ కోసం దిశా యాప్.. ఇవేప్పుడైనా గతంలో చూశారా?.. ఇవన్నీ 59 నెలల పాలనలో జరిగినవి వాస్తవమా కాదా?..మరో వంక.. 75 ఏళ్ల ముసలాయన. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు. మరి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా ఆయన చేసిన మంచి గుర్తుకు వస్తుందా?. పిండి కొద్ది రొట్టే సామెత.. పిండి ఎక్కువ ఉంటే.. రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువైతే తగ్గుతాయి. కానీ, పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే తాను, తన వారు తినేయడమే స్కీమ్‌గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా?.. అదే మీ బిడ్డ జగన్.. ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి.. అక్కాచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు.చంద్రబాబు హయాంలో ఇదే డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది. దత్తపుత్రుడు, ఈనాడు, టీవీ5, వీళ్ల జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందో ప్రజలు నిలదీయాలి. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అది ఎలా ఉంటుందంటే.. 2014లో చంద్రబాబు ప్రతీ ఇంటికి పంపిన మేనిఫెస్టో తెలుస్తుంది.స్వయంగా చంద్రబాబు సంతకం చేసి ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించాడు. ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? అని హిందూపురం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రశ్నించారు(లేదు అనే సమాధానం జనం నుంచి వచ్చింది. రుణమాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నారు.. చేశారా?. ఇంటింటికీ ఉద్యోగం.. అది కుదరకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఇచ్చారా?. అర్హులకు 3 సెంట్ల స్థలం.. పక్కా ఇళ్లు అన్నారు. కనీసం ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. ప్రతీ నగరంలో హైటెక్ సిటీ.. సింగపూర్‌ను మించిన అభివృద్ధి అన్నారు. జరిగిందా?..మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట. మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంట. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంట. నమ్ముతారా?..మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. రెండు బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. 175కి 175.. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు.. ఒక్కటి కూడా తగ్గేది లేదు.. సిద్ధమేనా?..(సిద్ధం అనే బదులు ప్రజల నుంచి వచ్చింది). మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. ఈ విషయాల్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీలో ఒకరైన.. మీ బీసీ కులానికి చెందిన దీపిక నిల్చుంది. గెలిపిస్తే.. ఎప్పుడూ మీ దగ్గరే, మీతోనే ఉంటుంది. ఇంకా చాలా మంచి చేయిస్తా. ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత.. అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది.. ఓటేసి గెలిపించాలని సీఎం జగన్ కోరారు. ఎండను లెక్క చేయకుండా నాపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అనిరాజకీయాలు దిగజారిపోయాయి. భయంకరమైన అబద్ధాలు చూస్తున్నాం. ఇదే చంద్రబాబు తన మనుషులతో అవ్వాతాతలకు వలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటికి రాకుండా చేశారు. ఆ అవ్వాతాతలు తిట్టుకుంటుంటే.. ఆ నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టే యత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. ఈ మధ్య ఇంకో అబద్ధం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా?. అసలు ఆ చట్టం ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. భూమిమీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుంది. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ, అలా ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదు. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తైన తర్వాత ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇలా ఇచ్చే ల్యాండ్ లైటిల్స్కు ఇన్సూరెన్స్కూడా చేస్తుంది. రైతులు తరఫున, భూ యజమానుల తరఫున ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది, వారి పక్షాన నిలబడుతుంది. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి కావాలి. బ్రిటీష్ కాలం తర్వాత.. ఇప్పుడు వందేళ్ల తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నాడు. సరిహద్దు రాళ్లు పెడుతున్నాం.. రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం. సబ్ డివిజన్ చేస్తున్నాం. రైతన్నలకే పదిలంగా హక్కు పత్రాలు పంపిణీచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలు…. ఉన్నాయి. ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యింది. రాబోయే రోజుల్లో పూర్తిగా 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం. అప్పుడు ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. పూర్తి హక్కులతో రికార్డ్స్ అప్డేట్ అవుతాయి, సబ్ డివిజన్లు కూడా అవుతాయి. ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.ఇంకో అబద్ధం.. ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది. పత్రాలల్లో తప్పులు ఉండకూడదని ఆన్లైన్లో అందుబాటులోకి ఫార్మాట్ తీసుకొచ్చాం. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతోంది.కాబట్టి చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెబుతున్నారు. ఇవన్నీ నమ్మొద్దు. మోసపోవద్దు. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే.. మీరు మీ బిడ్డకు సైనికులుగా నిలవండి అంటూ సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు: చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు నమ్మరని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని వనదుర్గాపురం, తొట్టికండ్రిగ, కృష్ణజమ్మపురం, శ్రీకావేరిరాజుపురం, పాలసముద్రం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటి సీఎం మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 99.5 శాతం అమలు చేశారన్నారు. సచివాలయాల ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగావకాశం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టుల భర్తీ, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్‌తో కలసి ఐదేళ్లలోమొత్తం 6.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రజలకు మేలు చేశామనే పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని భావించే చంద్రబాబు జనసేన, బీజేపీతోపాటు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని హీనంగా తిట్టిన చంద్రబాబు కేసుల భయంతో బీజేపీకి సాష్టాంగం పడ్డారని విమర్శించారు.అధికారం కోసం కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించామని, ఈ ఎన్నికల్లో తన కుమార్తె కృపాలక్ష్మిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికే పీసీసీ అధ్యక్షులు షరి్మల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఏపీకి వలస వచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనామళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాష్ రాజు, సింగిల్‌విండో చైర్మన్ గాలి జ్యోతి, వైస్ ఎంపీపీ శేఖర్ యాద్, పార్టీ మండల కన్వీనర్ తులసియాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్భళగన్, సినీ నిర్మాత షణ్ముగం, ఆర్బీకే చైర్మన్ పోలయ్య, పుత్తూరు మార్కెట్ డైరెక్టర్ రమాదేవి, కో–ఆప్షన్ మెంబర్ వేలు, సర్పంచ్ గాలి మహేష్ బాబు, అయ్యప్ప, నరసింహరాజు, భాష్కర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, పుత్తూరు కేశవరెడ్డి, మురళి, నరసింహన్, ప్రేమ్‌కుమార్, ఆనందన్, ప్రకాశ్, కుమార్, చంద్రశేఖర్‌రాజు, షణ్ముగరెడ్డి, వరదరాజు, చిన్నవరదరాజు, సిద్దమందడి, శరవణన్, కుట్టి, చిన్నపయ్యన్, లక్ష్మణన్, రాజామణి, అరుల్, బాబు, మనోహర్, దనంజయన్, వాసురాజు, కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షణ్ముగం పాల్గొన్నారు. -
బాబుకు ఓటు అడిగే అర్హతే లేదు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబుకు కనీసం ఓటు అడిగే అర్హత కూడా లేదని మంత్రి, వైఎస్సార్సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని కొత్తయిండ్లు, కొత్తపేట, ఎల్ఐసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మంత్రి మాట్లాడుతూ బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి చచ్చిన పాములాంటివాడని, ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసి, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారని కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకెళ్లి సేవలు అందించామని తెలిపారు.వలంటీర్లు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు సైతం భయపడినా, జగనన్న వలంటీర్లు మాత్రం ధైర్యంగా రోగులకు సేవలు అందించారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామని వివరించారు. జగన్మోహన్రెడ్డి చేసేవి మాత్రమే చెబుతారని , వాటినే మేనిఫెస్టోగా విడుదల చేశారన్నారు. ఐదేళ్లలో 98 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన వైఎస్సార్సీపీకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడిగే అర్హత ఉందని వెల్లడించారు.చంద్రబాబు , పవన్‌కల్యాణ విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉందని, దీన్ని బట్టే అది ఎంత మోసకారి మేనిఫెస్టోనో అర్థమవుతోందని తెలిపారు. బారు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈనెల 13న జరిగే పోలింగ్ రోజున ప్రతి ఒక్కకూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జి ఫకృదీ్ధన్‌షరీఫ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ జిల్లా అమ్ము పాల్గొన్నారు. -
పచ్చ చిలుకలుగా ఆ మేధావులు.. కళ్లకు గంతలు కట్టిన చంద్రబాబు
ఈ మధ్య కాలంలో తెలుగుదేశం బాకా మీడియా ఈనాడు కొత్త పుంతలు తొక్కి ఏపీ జనాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మేధావుల పేరుతో కొందరిని తీసుకు వచ్చి, ఇంటర్వ్యూలు అంటూ ఒక తంతు నడిపి, వారితో తమకు కావల్సినవి చెప్పించుకుని ప్రజలను మోసం చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మేధావులుగా ముద్ర వేసుకున్న కొంతమంది భ్రష్టు పట్టిపోతున్నారు. ఈనాడు రామోజీ పైత్యాన్ని ఈ మేధావుల నోట్లో పెట్టి పచ్చి అబద్ధాలను చెప్పిస్తున్నారు. ఆ మేధావులైనా నిస్సిగ్గుగా ఒక పార్టీ కోసం పనిచేయడం ఏమిటో అర్దం కాదు.ఏ అంశానికైన రెండు కోణాలు ఉంటాయి. వాటిలో ఒకదానివైపే చూసి, రెండో కోణాన్ని వదలివేసి మాట్లాడితే ఆ వ్యక్తి ఎలా మేధావి అవుతారో అర్దం కాదు. ఈనాడు మీడియా నిర్లజ్జగా బట్టలు ఊడదీసుకుని తిరుగుతోంది కాబట్టి, మేధావుల ముసుగులో మరికొందరిని కూడా అలాగే చేస్తోంది. ఇప్పటికే మాజీ ఐఎఎస్‌లు నిమ్మగడ్డ రమేష్ కుమార్, జయప్రకాష్ నారాయణ, పీవీ రమేష్ వంటివారిని తమ ప్రయోజనాలకు వాడుకున్న ఈనాడు మీడియా కొద్ది రోజుల క్రితం ఆర్దిక వేత్త పేరుతో మహేంద్రదేవ్‌ను తెరపైకి తెచ్చి ఆయనతో కొన్ని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయించి బానర్గా తన పత్రికలో అచ్చేసింది. అది చదివితే వీరు నిజంగా మేధావులా, లేక తెలుగుదేశం కోసం రామోజీ చెప్పినట్లు, కోరినట్లు మాట్లాడే మేతావులా అన్నది తెలుసుకోవడం కష్టం కాదు.లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కొంతకాలం క్రితం వరకు ఏపీలో విద్య, వైద్య రంగాలలో సంస్కరణలు, అమలు అవుతున్న స్కీములు చాలా బాగున్నాయని మెచ్చుకునేవారు. కానీ ఎన్నికల సమయానికి ఆయనపై రామోజీ ఒత్తిడి బాగానే పనిచేసినట్లుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి జేపీ కూడా యుటర్న్ తీసుకుని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించి ఎన్డీఏ కి అనుకూలంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం ఆరంభించారన్నమాట. జేపీ ఇంతగా దిగజారి పోయి చివరికి కుల ముద్ర వేయించుకునే దుస్థితికి వస్తారని నేనైతే ఊహించలేదు.ఈనాడు మీడియా కోసం ప్రచారం చేస్తున్న ఈ మేధావులలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉండడాన్ని అంతా గమనిస్తున్నారు. దీనివల్ల చంద్రబాబుకే నష్టం తప్ప ఇంకొకటి కాదు. తాము చేస్తున్నది ఏమిటో వారికి తెలియడం లేదు. తాజాగా మహేంద్రదేవ్ అనే మరో మేధావిని ఈనాడు ముగ్గులోకి దింపి ఆయనను కూడ గబ్బు లేపింది. ఆయన తండ్రి సంజీవదేవ్ చాలా గౌరవమైన వ్యక్తి. ఈయన కూడా పద్ధతిగానే ఉంటారు. కానీ రామోజీ ట్రాప్‌లో పడి తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకున్నారనిపిస్తుంది.ఇంతకాలం టీడీపీ కోసం పనిచేసిన సోకాల్డ్ మాజీ ఐఏఎస్‌లు చెప్పేదానిని జనం నమ్మడం లేదని మహేంద్రదేవ్ ను ప్రవేశపెట్టినట్లు అనిపిస్తుంది. ఆయనను ఇంటర్వ్యూ చేయడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ ప్రశ్నలు అడిగిన తీరు, ఆయననుంచి జవాబులు రప్పించుకున్న వైనం చూస్తే, కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కడానికి, ఏపీ ప్రజలను మోసం చేయడానికే ఈ ఇంటర్వ్యూని వాడుకున్నారని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోందట. ఇది ఒక ప్రశ్న. దానిపై ఆయన అవునంటూ దిక్కుమాలిన సమాధానం. దేశవ్యాప్తంగా ఈ సమస్య లేదా! ఆ మాటకు వస్తే అమెరికా వంటి అగ్రదేశంలో కూడా నిరుద్యోగం ఉంది. అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరానికి వచ్చి చూస్తే అడ్డాలపై పనులు లేని కూలీలు, వందలు, వేల సంఖ్యలో కనిపిస్తారు. ఉద్యోగం కోసం తిరిగే వేలాది మంది యువకులు కనిపిస్తారు. వారిని మోసం చేసి డబ్బులు వసూలు చేసుకునే కంపెనీలకు తక్కువేమీ లేదు. కానీ రామోజీ దిక్కుమాలిన ఆలోచన ఏమిటంటే ఏపీలో మాత్రమే నిరుద్యోగ సమస్య ఉన్నట్లు జనాన్ని నమ్మించాలనే.పోనీ ఆ మాటకు వస్తే 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదు! ఆయన పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా! అప్పుడు ఎందుకు తేలేకపోయారో చెప్పాలి కదా! పరిశ్రమలకు ఆయువుపట్టుగా భావించే ప్రత్యేక హోదాను వద్దన్న చంద్రబాబు నిర్వాకం మాట ఏమిటి? ఇది ఒక అంశం అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా సమస్య ఉన్నప్పటికీ, మూడేళ్లలో ఆయన టైమ్‌లో వచ్చిన పరిశ్రమలు, ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైనవాటి గురించి ఈ మేధావులు పట్టించుకోరు.చంద్రబాబు టైమ్ లో వచ్చిన కియా కార్ల ప్లాంట్ వచ్చింది. అది తమ ఘనత అని బీజేపీ నాయకులు చెబుతారు. అది వేరే విషయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్‌లో అనేక పరిశ్రమలు వచ్చాయి. వాటిని పట్టించుకోరు. పైగా పరిశ్రమలు తరలిపోతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన ఒక్కో పోర్టు వల్ల రెండువేల మందికి ఉపాధికి కల్పిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలు మొదలైనవాటిని ప్రోత్సహించడం, స్వయం ఉపాధి కింద లక్షల యూనిట్లు వచ్చిన వైనాన్ని జనం మర్చిపోవాలన్నది ఈనాడు మీడియా కోరిక. దానికి ఈ మేధావులు బాజా వాయించడం దురదృష్టకరం.ఏపీకి పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా అడ్డుకోవాలా అని అడ్డగోలు కథనాల గురించి ఈ మేధావులకు తెలియదు. ప్రభుత్వపరంగా చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా రెండున్నర లక్షల మందికి ఐదువేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వీటన్నిటిని ఉపాధి కింద పరిగణనలోకి తీసుకోకుండా కుహానా మేధావులు చెబుతున్నారు. సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ బాధ పడ్డారు. బాగానే ఉంది.2014లో చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తానంటే లక్ష కోట్ల రూపాయల రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని వాగ్ధానం చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఎందుకు బాండ్ కొట్టింది. అప్పుడు ఏ సంపద సృష్టించి రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. పోనీ ఫలానా రకంగా సంపద సృష్టించానని చెప్పగలరా! కేవలం అమరావతి రాజధాని పేరుతో 29 గ్రామాలలో తన వాళ్లతో భూములు కొనిపించి రేట్లు పెంచడమే సంపద సృష్టించడం అవుతుందా? ఆఆ గ్రామాలలో వేల ఎకరాల భూములలో పంటలను ఎండబెట్టి విధ్వంసానికి పాల్పడితే అది గొప్ప విషయం అని రాస్తారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారు. రాష్ట్రం అంతటా పేదలకు సంపద పెరగాలని ఆయన తలపెట్టారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తద్వారా ఒక్కొక్కరికి ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆస్తి లేదా సంపద సమకూరింది. దీనిని సంపదగా ఈ మేధావులు పరిగణిచరా? రాష్ట్ర రుణాలు పద్నాలుగు లక్షల కోట్లు దాటిపోయాయని ఈయనకు ఎవరు చెప్పారు. ఈనాడు వాళ్లు చెప్పిన అబద్ధాలను ప్రచారం చేయడం కోసం ఈయన పరువు తీసుకోవాలా? అసలు ఎప్ఆర్బీఎం పరిధిలో లేకుండా రాష్ట్రాలు ఆ స్థాయిలో రుణాలు చేయగలుగుతాయా? జీఎస్ డీపీ వృద్ధిలో ఏపీ అగ్ర భాగాన ఉందన్న సంగతి ఈ మేధావులకు తెలియదా? తెలియకపోతే తప్పు ఏపీ ప్రజలదా!కరోనా సంక్షోభంలో ఏపీ ప్రభుత్వం ఎంత చక్కగా విధులు నిర్వర్తించింది వీరికి తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీరు రామోజీ, చంద్రబాబు వంటి పెత్తందారుల తరపున పని చేస్తున్నారు కనుక. ప్రత్యక్ష నగదు బదిలీ తాత్కాలికమేనని అంటున్నారు. బాగానే ఉంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీముల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారనే కదా! అది తప్పని మీరు నమ్మితే ఏమి చెప్పాలి. ఎవరు అలాంటి స్కీములు అమలు చేసినా మంచిది కాదని అనాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే ఒప్పు అన్న చందంగా మాట్లాడి మీ మేధావి మస్తిష్కానికి దరిద్రపు రాజకీయం అంటిందన్న అభిప్రాయం కలిగించడం లేదా?వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీముల ద్వారా ఏటా సుమారు ఏభైవేల కోట్ల రూపాయల నగదు పంపిణీ చేశారు. దాంతో ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఇదే బాబు, పవన్‌లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నదానికంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా నగదు పంచుతామని చెబుతున్నారు. అంటే ఏటా లక్షన్నర కోట్లు పంచుతామని అంటున్నారన్నమాట. దీనిని మేధావి మహేంద్రదేవ్ తప్పు పడతారా? లేక సమర్థిస్తారా? చంద్రబాబు ఏమి చేసినా ఈయనకు కూడా బాగానే ఉంటుందని అనుకోవాలా! ఇంత చిన్న లాజిక్ ను మహేంద్రదేవ్ వంటివారు కూడా విస్మరిస్తే సమాజానికి ఎలాంటి సంకేతం ఇస్తుంది?పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కేంద్రం తగు రీతిలో నిధులు ఇవ్వకపోవడం కారణమని వీరికి తెలియదా! విద్యా రంగంలో వచ్చిన మార్పుల గురించి ముందుగా మహేంద్రదేవ్ వంటివారు స్వయంగా ఏపీకి వెళ్లి పరిశీలించి చూసిన తర్వాత ఏవైనా విమర్శలు లేదా సలహాలు ఇవ్వవచ్చు. అలాకాకుండా రామోజీ కళ్లలో ఆనందం చూడడానికి వీరు ఏమి చెబితే అది చెప్పడానికి అయితే మహేంద్రదేవ్ వంటివారి మేధావితనం ఎవరికి పనికి వచ్చినట్లు. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలియకుండా ఇలాంటి మేధావులు మాట్లాడడం ఎంత దారుణం.ఏడాదికి రెండు లక్షల మంది ఇంజనీరింగ్ చదవుతున్నారట. వారిలో కొందరికి కూడా రాష్ట్రంలో ఉద్యోగాలు రావడం లేదట. మరి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమి చేసినట్లు? ఆ ప్రశ్న అసలు ఈ మేధావులకు రాదా? ఈనాడు వాళ్లు చెత్త ప్రశ్నలు వేస్తే, మహాద్భాగ్యమన్నట్లు వీరు వారికి కావల్సిన సమాధానాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమలు వేటిని వీరు గుర్తించరా! వాటన్నిటి జాబితా చాంతాడు అవుతుంది.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు చేయాలన్నది రామోజీ విధానం అయితే ఆయన ఉద్యోగం కోసం అప్పట్లోనే ఢిల్లీ ఎందుకు వెళ్లారు? హైదరాబాద్‌లో ఎందుకు కంపెనీలు పెట్టారు? చంద్రబాబు నాయుడు ఏపీలో కాకుండా హైదరాబాద్, తెలంగాణలో తన యూనిట్లు ఎందుకు నెలకొల్పారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పని దిక్కుమాలిన ధీరిలు చెబుతున్నారు. అదే అమెరికా వెళితే అంతా తన ఘనత అని డబ్బా వాయించుకుంటారు. ఉపాధి లేకపోతే డ్రగ్స్ వంటి వ్యసనాలు వస్తాయట.అదే కరెక్టు అయితే హైదరాబాద్, బెంగుళూరు, గుజరాత్ తదితర ప్రాంతాలలో డ్రగ్స్ ఎందుకు విస్తారంగా ఉన్నాయి? హైదరాబాద్ లోనే అత్యధికంగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్న సంగతి వీరికి తెలియదా! బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ తెప్పించింది ఎవరన్నది ఇంతవరకు ఎందుకు తేల్చలేదు? మేధావులు కేవలం ఎవరి రాజకీయ స్వార్థం కోసమో ఇంటర్వ్యూలు ఇచ్చి వారి పరువు పోగొట్టుకోకూడదు.నిజానికి మహేంద్ర దేవ్ వంటివారికి వాస్తవాలు తెలియనివి కావు. ఏకపక్షంగా మాట్లాడడం పద్ధతి కాదని కూడా తెలుసు. కానీ మరి వారిపై ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో కానీ, రామోజీ కోరుకున్న అబద్ధాలు చెప్పి అనవసరంగా భ్రష్టు పడుతున్నారు. మేధావులు వాస్తవ పరిస్థితి తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పాలి. ఎన్నికల సమయంలోనే వీరు మాటలను టీడీపీ మీడియా ప్రచారం చేయడంలోనే కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. ఆ విషయాన్ని టీడీపీ తరపున మాట్లాడే మేధావులు తెలుసుకుంటే మంచిది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
YSRCP స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే
గుంటూరు, సాక్షి: ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లంటే రాజకీయాలు అవపోసపట్టిన నేతలు, పెద్ద పెద్ద కాన్వాయ్‌లలో వచ్చి ఊదరగొట్టే రాజకీయ ఉద్దండులు.. ఈ తరహా ప్రచారం కనిపిస్తుంది. కానీ స్టార్ క్యాంపెయినర్లు అంటే తెలిసిన ముఖాలే ఉండాలా ఏంటి?. దేశ రాజకీయాల్లోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ. తొలిసారి సామాన్యులకు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌ను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో 87 శాతం పేదలకు పథకాలు అందాయని, ఇప్పుడు ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్లేందుకు జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాల్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం చేపడుతున్నాం. పార్టీ బూత్ లెవల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2019-24 మధ్య అమలు చేసిన సంక్షేమం.. ఈ దఫా అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారో వాటిని వివరిస్తారు. ఇవాళ్టి నుంచే అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి ఈ కార్యక్రమం నడుస్తుంది.ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతుందనేది తెలియజేసేందుకు క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ చేరవేస్తాం. చంద్రబాబులాగా మేనిఫెస్టోను పక్కన పడే విధంగా కాకుండా.. రికార్డెడ్‌గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని సజ్జల ఈ సందర్భంగా అన్నారు.ఇక.. వైఎస్సార్సీపీ తరఫున 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశాం. వివిధ సామాజిక వర్గాల నుంచి వీళ్లను ఎంపిక చేసి ఈసీకి అందజేశాం. సీఎం జగన్ మీద తమ అభిమానం ప్రదర్శిస్తూనే.. మరోసారి వైఎస్సార్సీపీకి ఎందుకు ఓటేయాలో వీళ్లు రాష్ట్ర ఓటర్లకు వివరిస్తారని సజ్జల తెలిపారు. YSRCP స్టార్ క్యాంపెయినర్లు వీళ్లేచల్లా ఈశ్వరి(మైలవరం, ఎన్టీఆర్ జిల్లా)ఎ. అనంతలక్ష్మి(రాజమండ్రి సిటీ, తూర్పు గోదావరి జిల్లా)పండలనేని శివప్రసాద్(అవనిగడ్డ, కృష్ణా)సయ్యద్ అన్వర్(నెల్లూరు జిల్లా)కటారి జగదీష్(అనకాపల్లి జిల్లా)తనకు టీడీపీకి, చంద్రబాబుకి ఉన్నట్లు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు లేరని, వైఎస్సార్సీపీ పాలనలో లబ్ధి పొందిన సామాన్యులే తన స్టార్‌క్యాంపెయినర్లు అని, ఈ లెక్కన దేశంలోనే తనకు ఉన్నంత స్టార్ క్యాంపెయినింగ్ మరెవరికి ఉండబోదని, ఇది ఒక చరిత్ర అని సీఎం జగన్ తరచూ చెబుతూ వస్తుండడం చూస్తున్నదే. ఇప్పుడు అదే నిజం చేస్తూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సామాన్యులకు చోటు కల్పించి ట్రెండ్ సెట్ చేశారాయన. -
మోసం.. వంచన.. అప్పుడూ, ఇప్పుడూ బాబు మేనిఫెస్టో అదే..
2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్👉: 58 నెలల్లో నవరత్నాల పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లు జమ 👉: సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో మరో రూ.95,001 కోట్లు 👉: డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.3,61,811 కోట్లు.. ఏటా సగటున రూ.72,362 కోట్లు వ్యయం 👉: సీఎం రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు అండ్ గ్యాంగ్ 👉: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: అంటే.. ఇప్పటి కంటే ఏటా రూ.92,638 కోట్లకుపైగా అదనంగా అవసరం 👉: టీడీపీ మేనిఫెస్టో అమలుకు ఐదేళ్లలో మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు వ్యయం చేసిన దాని కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం 👉: సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు 👉: పద్నాలుగేళ్ల బాబు పాలనలో ప్రతిఏటా రెవెన్యూ లోటేనని సాక్ష్యాలతో వివరించిన సీఎం జగన్👉: ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో మురళీమోహన్ వంటి బినామీలకే సంపద సృష్టించిన చంద్రబాబు 👉: 2014–19 మధ్య అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలకు భూ సంపద సృష్టించిన వైనం 👉: ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఖజానా నుంచి ఖర్చు పెట్టి బినామీలకు సంపద సృష్టించేలా ఎత్తుగడ 👉: 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నారని మేనిఫెస్టోను ముట్టుకోని బీజేపీ 👉: పథకాల అమలుకు నిధులు ఎలా తెస్తారో వివరణ ఇవ్వాలంటున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు 👉: వివరణ ఇవ్వకపోతే తాను మోసం చేస్తున్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టీకరణసాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈసారి విశ్వరూపం ప్రదర్శించారు. జనసేన, బీజేపీలతో జత కట్టినా ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి వచ్చి ఉనికి చాటుకోవడం కోసం ఆచరణలో అమలుకు వీలుకాని రీతిలో హామీలతో ముంచెత్తుతూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన తరహాలోనే ఈసారీ ప్రజలను వంచించడానికి సిద్ధమయ్యారని గ్రహించిన బీజేపీ.. మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదని టీడీపీ వర్గాలే చర్చించుకుంటుండటం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. గత 58 నెలల్లో నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. అవినీతికి తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.95,001 కోట్లు వ్యయం చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటిదాకా రూ.3,61,811 కోట్లు వ్యయం చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.72,362 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తుంటే.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి శ్రీలంకగా మార్చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడితే.. ఎల్లో మీడియా అదే పల్లవి అందుకుంది.అదనంగా రూ.4,63,189 కోట్లు ఎలా తెస్తావ్ బాబూ? టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌తోపాటు పేర్కొన్న ఇతర హామీల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరమని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే అదనంగా ఏటా రూ.92,638 కోట్లు అవసరం. ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లు అవసరం. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎలా తెస్తావని ప్రశి్నస్తుంటే సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్పించి స్పష్టంగా లెక్క చెప్పలేక తప్పించుకుంటున్నారు. హైటెక్ సిటీలో, అమరావతిలో బినామీలకే సంపద సృష్టి గతంలో సంపద సృష్టించానని, ఇప్పుడూ సంపద సృష్టించి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మురళీమోహన్ వంటి బినామీలు, వందిమాగధులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత హైటెక్ సిటీ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసి బినామీలకు సంపద సృష్టించారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక.. విజయవాడ–గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసే చోటు గురించి బినామీలు, వందిమాగధులకు ముందుగా లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. వేలాది ఎకరాల భూములు తక్కువ ధరలకే కొల్లగొట్టారు. ఆ భూ సంపదను రెట్టింపు చేయడానికి రాజధానిగా అమరావతిని చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఖజానా నుంచి అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి.. బినామీలు, వందిమాగధులు కాజేసిన భూ సంపదను మరింతగా పెంచడానికి ఎత్తులు వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పాలించా రు. ఆ 14 ఏళ్లు.. ప్రతి ఏటా రెవెన్యూ లోటే. ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెట్టిందీ చంద్రబాబే. 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్‌రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ.. సీఎం జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. దీన్ని బట్టి చంద్రబాబే ఎడాపెడా అప్పులు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. 👉: అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు అధికారంలోకి రాక ముందు అంటే 2014 జూన్ 7 నాటికి రాష్ట్రానికి రూ.1,53,346 కోట్ల అప్పు ఉంటే.. 2019 మే 29 నాటికి అది రూ.4,12,288 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ అప్పులు రూ.7,03,471 కోట్లకు చేరాయి. 👉: సంపద సృష్టించానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ.. వాస్తవానికి చంద్రబాబు హయాం (2014–19)లో మూలధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. 👉: జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది స్పష్టమవుతోంది. 👉: చంద్రబాబు హయాంలో జీఎస్డీపీలో పన్నుల భారం సగటున 6.57 శాతం ఉంటే.. జగన్ హయాంలో అది 6.35 శాతమే. అంటే.. సీఎం జగన్ హయాంలోనే పన్నుల భారం తక్కువ. ఇది ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా), కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చిన లెక్క.అప్పుడు అమెరికా అవుతుందా? పేదరిక నిర్మూలనే ధ్యేయంగా.. అవసరమైన మేరకు తక్కువగా అప్పులు చేస్తూ.. ప్రజలపై తక్కువగా పన్నుల భారం మోపుతూ.. ఆరి్థక క్రమశిక్షణ పాటిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయి. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలకు ఐదేళ్లలో రూ.8.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.నిధులు ఎలా తెస్తారో చెప్పండిటీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే రూ.92,638 కోట్లు అదనంగా అవసరం. ఈ లెక్కన ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం. ఆ నిధులను ఎలా తెస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నానని చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టం చేస్తున్నారు. -
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
సాక్షి, అమరావతి: దేశమంతటా ఎన్డీయే మిత్రపక్షాలుగా కొనసాగుతున్న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ గుర్తుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో, బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం ఫొటో జత పరిచి ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు – పవన్‌కల్యాణ్‌లు అమలుకు సాధ్యం కాని ఆల్ ఫ్రీ హామీలు ఇస్తుండడంతో ఉమ్మడి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేనట్లు బీజేపీ వ్యవహరించిందని స్పష్టమవుతోంది. అందువల్లే మంగళవారం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోలో మోదీ, కమలం ఫొటోలు చోటుచేసుకోలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనప్పటికీ.. లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఆ రాష్ట్రంలోని పీఎంకే, తమిళ్ మానిల కాంగ్రెస్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ ఇటీవల వేరుగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ముఖచిత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించింది. పీఎంకే కూడా విడిగా మేనిఫెస్టోను విడుదల చేయగా, దాని చివరి పేజీలో బీజేపీ గుర్తు కమలం సహా అన్ని మిత్రపక్ష పార్టీల గుర్తులను ముద్రించింది. ఇందుకు బీజేపీ కూడా అంగీకారం తెలిపింది. ఒక్క ఏపీలో మాత్రమే చంద్రబాబు, పవన్‌ల మేనిఫెస్టోపై తమ ముద్ర ఏదీ లేకుండా బీజేపీ జాగ్రత్త పడటం.. అసలు ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఇష్టపడక పోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాబు అల్ ఫ్రీ హామీలను నమ్మే పరిస్థితి లేదు పదేళ్ల కిత్రం 2014లో టీడీపీ–బీజేపీ–జనసేనలు ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు ఇచి్చన హామీలలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాదాపు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు అదే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మూడు పార్టీల పొత్తులో మళ్లీ అన్నీ అల్ ఫ్రీ హామీలనే ఇవ్వడంతో వాటి అమలులో సాధ్యాసాధ్యాలపై బీజేపీకి నమ్మకం కుదరలేదని తెలుస్తోంది. అందుకే పొత్తులో ఉన్నప్పటికీ ఉమ్మడి మేనిఫెస్టోకు దూరం జరిగింది. ‘గత వారం బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రాలలో పొత్తులో ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు మా మద్దతు ఉంటుంది’ అనే ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. అయితే బీజేపీ కేవలం కంటితుడుపుగా తమ మిత్రపక్షాలను సంతృపి పరచడం కోసమే ఈ వ్యాఖ్యలు చేసిందని పలువురు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు.. బీజేపీ జాతీయ స్థాయిలో ఎన్డీయే మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ, రాష్ట్ర పార్టీ వేరుగా మేనిఫెస్టోను విడుదల చేసింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఒక మేనిఫెస్టోను, సీమాంధ్రకు మరొక మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. 2019 ఎన్నికల సమయంలోనూ బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో వేరుగా మరొక మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ పరంపరలో కేవలం చంద్రబాబు–పవన్‌ల మేనిఫెస్టోలోని హామీలపై నమ్మకం లేకే బీజేపీ ఢిల్లీ పెద్దలు జాతీయ మేనిఫెస్టోతో సరిపెట్టి, మద్దతు మాత్రమే ఇచ్చారని రాష్ట్ర బీజేపీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఈ అవమానకర విషయాన్ని ఎలా అధిగమించాలో తెలియక చంద్రబాబు అండ్ గ్యాంగ్ తల పట్టుకుంది. -
‘జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్‌షోలో సీఎం జగన్
విజయనగరం, సాక్షి: కుర్చీలు లాక్కోవడం, వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం, మనషుల్ని చంపేయడం.. ఇదే చంద్రబాబు రాజకీయమని, అలాంటి చంద్రబాబుకి ఓటేయమని అడిగే అర్హత ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం ఉదయం బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు.ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు. మళ్లీ మోసపోవడం ఖాయం. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు.. ఈ ఓటుతో మీ తలరాతలు మారుతాయి. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించేవి ఈ ఎన్నికలు....చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమం అందించాం. ప్రతీ పేదవాడికి అండగా ఉంటూ వైద్యం అందించాం. రైతన్నకు చేయిపట్టుకుని సాయం అందించాం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరగని సామాజిక న్యాయం కళ్లెదుటే కనిపిస్తోంది. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం... ఎన్టీఆర్ కుర్చీని లాక్కుని, సొంత పార్టీ అధ్యక్షుడ్ని కుట్రలతో చంపేసిన వ్యక్తి. వంగవీటి మోహన రంగాను కుట్రలతో చంపింది ఎవరు?. ఐఎస్ అధికారి రాఘవేంద్రను కుట్రలతో చంపించింది ఎవరు?. ఇప్పడు మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేనని చంద్రబాబుకి అర్థం అయ్యింది. మోసపూరిత హామీలతో.. ఎన్నెన్ని మాటలు చెబుతున్నా ప్రజలెవరూ చంద్రబాబును నమ్మడం లేరు. జనం మోసపోవడానికి సిద్ధం లేరని చంద్రబాబుకి అర్థం అయ్యింది. ఈ జగన్‌ను చంపేస్తే ఏమౌతుంది అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సిగ్గుచేటు పరిణామం.చంద్రబాబు మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి. అయ్యా చంద్రబాబూ.. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్, ఆ మహానేతకు వచ్చిన ప్రజాదరణను ఓర్వలేక అసెంబ్లీ సాక్షిగా ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్’ అని అన్నమాటల్నినేను మరిచిపోలేను. నాడు నా తండ్రిని, నేడు నన్నూ.. ఈ ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనలేక నువ్వు మాట్లాడే మాటలు.. నీ నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. బాబు మెంటల్ హెల్త్ ఏ స్థాయిలో ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి.కానీ, చంద్రబాబు అనుకుంటే జగన్ చనిపోడు.. జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు. అవ్వాతాలు, అక్కాచెల్లెమ్మల ప్రార్థనలు, దీవెనలే నాకు శ్రీరామరక్ష... ఎన్నికలయ్యాక చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. కానీ, మీ బిడ్డ ఈ జగన్ 58 నెలల పాలనలో 99 శాతం హామీలు అమలు చేశాడు. అయ్యా.. నువ్వు 14 ఏళ్లు సీఎంగా చేశావ్. మరి నీ పేరు చెబితే ఒక్క పేదవాడికి మంచి చేసినట్లు గుర్తుకు వస్తుందా?. 2014లో మేనిఫెస్టోతో చంద్రబాబు చేసిన మోసం గుర్తుందా?. ప్రధాన హామీల పేరుతో ఏ ఒక్క వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి, అదే మోసపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.వలంటీర్ల ద్వారా మళ్లీ సంక్షేమం కొనసాగాలన్నా, వైద్యం ఆరోగ్య సేవలు.. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలన్నా.. ఫ్యాన్ గుర్తును రెండుసార్లు నొక్కాలి. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్సీపీకే రావాలి. దేశంలో ఎన్నడూ జరగని విధంగా, రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు.. మొత్తం రెండొందల స్థానాలకు ఏకంగా 100 స్థానాలు.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు పోటీకి దిగుతున్నారు. సామాజిక న్యాయం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోండి.వైఎస్సార్సీపీ తరఫున బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్. వెంకట చిన అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఆయన్ని గెలిపించి సామాజిక న్యాయాన్ని గెలిపించాలి. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌లను గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
‘ఓ బోగస్ బాబూ.. ఈ జగన్‌లా ఏం చేశావు?’
ప్రకాశం, సాక్షి: నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని.. ఒక మాట చెబితే కచ్చితంగా చేసి తీరతాడని ప్రజలు భావించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అయితే చంద్రబాబుకి ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని తేల్చి చెప్పారాయన. మంగళవారం ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలోని కొండేపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపు. చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది. ఐదేళ్లపాటు ప్రజల రక్తం తాగుగుతుంది. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తులను నిర్ణయించేది.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. .. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. ఓటేసే ముందు ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ రిపోర్టు అనేది చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాల రిపోర్టు పరిశీలిస్తే.. జాబ్ రావాలంటే బాబు రావాలి అనే మాటలు గుర్తున్నాయా?. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ముష్టిలాగా ఉద్యోగాలిచ్చారు. కేవలం 31 వేల ఉద్యోగాలిచ్చారు. మన ప్రభుత్వం 58 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్ కార్డు.. చంద్రబాబుది బోగస్ కార్డు.వ్యవసాయం, రైతుల విషయంలో హామీలను చూద్దాం. రైతుల రుణమాఫీ అని మోసం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించలేదు. పెట్టుబడి సాయం ఇచ్చారా?. రైతులకు సమయానికి సబ్సిడీ ఇచ్చింది ఏనాడైనా ఉందా?. సున్నా వడ్డీ ఈ పెద్ద మనిషి ఇచ్చాడా?. మీ బిడ్డ జగన్ ఇచ్చాడా?. కనీసం పెట్టుబడితో రైతులకు భరోసా నిలిచారా?. వ్యవసాయం దండగా అని చంద్రబాబు మాట్లాడింది నిజం కాదా?. బషీర్‌బాగ్‌లో రైతులపైకాల్పులు జరిపించింది. ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అంది చంద్రబాబు కాదా?. రైతుల్ని నిట్టనిలువుగా ముంచిన చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ కాదా?మీ జగన్ రైతులకు ఏం చేశాడో చూద్దాం. రైతు భరోసా ఇచ్చాం. పెట్టుబడికి సాయంగా ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది, ఉచిత పంటల బీమా, పంటల కొనుగోలు ఇలా అన్నీ ఈ 58 నెలలకాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా?. ఇది కళ్లకు కనిపిస్తున్న ప్రోగ్రెస్.యెల్లో మీడియా చంద్రబాబుని డెవలప్మెంట్ కింగ్ అని పొగుడుతుంది. మరి చంద్రబాబు ఏం చేశారు?. మన పాలనలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విలేజ్ క్లినిక్‌లు కట్టించింది ఎవరు?. వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు?. ఉద్దానం సమస్యను తీర్చింది ఎవరు?. ఎయిర్‌పోర్టు విస్తరణ చేపట్టింది ఎవరు?. ఈ జగన్‌లా ఏదైనా అభివృద్ధి చేశావా? అని చంద్రబాబును సీఎం జగన్ నిలదీశారు. ఇలాంటి చంద్రబాబు డెవలప్మెంట్ విషయంలోనూ బోగస్రిపోర్టు ఇచ్చుకుంటున్నారు.ఓ చంద్రబాబూ.. ఇంటింటా ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపింది ఎవరు?. పేదల సంకెళ్లను తెంచుకునేలా చదువుతో బాగు చేయించింది ఎవరు?. నాడు నేడుతో విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది ఎవరు? మీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అని అడుగుతున్నా. పచ్చ కామెర్లు వచ్చాయా?. కళ్లెదుట కనిపిస్తున్న రిపోర్టు కనిపించడం లేదా? అని సీఎం జగన్ మండిపడ్డారు.బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం. పెన్షన్ల విషయంలో కుట్రను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉండి అవ్వాతాతల కష్టాలను ఏనాడైనాపట్టించుకున్నాడా?. పెన్షన్లను ఇంటికే అందిస్తున్న ఘనత మీ బిడ్డది. చంద్రబాబు కుట్రలు చేస్తూనే నెపం మీ బిడ్డ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ మనపై ఆరోపణలు చేయడం కంటే దిగజారుడు తనం ఉందా?. చంద్రబాబు హయాంలో ఏనాడూ మంచి చేసిన చరిత్రలేదు. చంద్రబాబు ధ్యాస దోచుకోవడం, దోచుకోవడం పంచుకోవడం మీద కాబట్టే అక్కాచెల్లెమ్మలకు న్యాయం జరగలేదు. ఎవరి విశ్వసనీయత ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలు.. చేసిన మోసం గుర్తున్నాయా?. ఇంటింటికి జాబ్ అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తా అన్నారు. కనీసం ఒక్క రూపాయికూడా చంద్రబాబు ఇవ్వలేదు. ఇది మోసం కాదా?. వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా. మన బతుకులు బాగుపడాలన్నా. మన ఆస్పత్రులు, బడులు బాగుపడాలన్నా. ప్రతీ ఒక్కరం ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు తగ్గేలేదు. సిద్ధమేనా?.. మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట, తాగేసిన టీ గ్లాస్ సింక్‌లో ఉండాలి. మీ చల్లని దీవెనలతో.. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను గెలిపించాలని కోరుకుంటున్నా ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 30వ తేదీన(మంగళవారం) మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం జగన్ రేపు(మంగళవారం) పాల్గొనే ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను విడుదల చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరుధిలో కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని,పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌరసేవలందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారు?. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయించడమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చుకున్నాడు. ..చంద్రబాబు లెటర్లు రాసి, ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదు. సీఎం జగన్‌ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడ కలలు వస్తాయి...పెన్షనర్ల పరిస్థితికి చంద్రబాబే కారణం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం అవస్థలు పడ్డారు. చంద్రబాబు ఏనాడు సరిగ్గా పెన్షన్లు అందించలేదు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. చంద్రబాబు, ఆయన ముఠా కారణంగా పెన్షనర్లకు అవస్థలు. .. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరచిపోలేదు. పెన్షనర్ల శాపాలు చంద్రబాబుకు తగులుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఉంది. కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. .. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అడ్డగోలుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించటం లేదు. ఈ దేశంలో ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయాడు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు. -
ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది
పార్టీ పెట్టి పుష్కరం దాటినా అసెంబ్లీ గేటును తాకలేకపోయిన పవన్ కళ్యాణ్‌ను ఈసారైనా గేటు దాటించేందుకు ఆ ఫ్యామిలీ మొత్తం శ్రమిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు పిఠాపురంలో పర్యటించారు. వర్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ.. మొత్తానికి తనను అసెంబ్లీకి పంపే బాధ్యత వర్మదే అని పూర్తిగా సరెండర్ అయ్యారు పవన్. ఇక నాగబాబు.. ఇంకా జబర్దస్త్ టీమ్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలామంది అక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీంతోబాటు మొన్న వరుణ్ తేజ్ సైతం రాడ్ షో నిర్వహించి బాబాయ్‌ను గెలిపించాలని కోరారు.ఇది కూడా సరిపోవడం లేదని భావించిన పవన్ ఇక ఏకంగా తన పెద్దన్న చిరంజీవిని సైతం రంగంలోకి దించుతున్నారు. తానూ రాజకీయాలకు దూరమని, అసలు పక్క రాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, తానిప్పుడు పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టానని, తనను పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ చేయవద్దని ఆమధ్య మీడియాముఖంగా ప్రజలకు వివరణ ఇచ్చారు. ఐతే ఇప్పుడు పవన్ పరిస్థితి దారుణంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నా తరుణంలో చిరంజీవి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులతో కూర్చుని ఒక వీడియోను సైతం రిలీజ్ చేసారు.ఇక అవనీ కాదు కానీ నేనే వస్తాను అని ఫిక్స్ అయిన చిరంజీవి ఇప్పుడు పిఠాపురం వస్తున్నారు. త్వరలో అయన ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పవన్ మీద పోటీ చేస్తున్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా వర్మ పోటీ చేశారు. ఆనాడు చిరంజీవి వంగా గీతకు పిఠాపురంలో ప్రచారం చేశారు. అప్పుడు గీత ఏకంగా వర్మను ఓడించి అసెంబ్లీకి వెళ్లారు. అయితే ఆ వంగా గీత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మళ్ళీ అదే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అదే చిరంజీవి గీతకు వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. గతంలో గీతను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేసిన చిరంజీవి ఇప్పుడు అదే గీతను ఓడించాలంటూ తమ్ముడి కోసం ప్రచారం చేయబోతున్నారు. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ ప్రభావంతో పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. దానికితోడు స్థానికురాలు అయిన గీతను ఓడించడం తనకు అసాధ్యం అని పవన్ కు అర్థం కావడంతో కనీసం జీవితంలో ఒకసారి అయినా ఎమ్మెల్యే అవ్వాలన్న జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.:::: సిమ్మాదిరప్పన్న -
మోసాల బాబు వద్దు.. జగన్ ముద్దంటున్న జనం
అది కాదురా అప్పలరాజు.. కంకర్రాళ్ళు గంపెడు ఎందుకురా.. పనికొచ్చే రత్నం ఒక్కటి ఉంటె సరిపోదేట్రా.. ఎదవ సంతానం పదిమందిని కంటే యేటి లాభం.. వజ్రంలాంటి కొడుకు ఒక్కడు ఉంటె సరిపోదేట్రా.. కాయలివ్వని చెట్లు వెయ్యి ఉంటె యేటి లాభం.. పళ్ళిచ్చే మొక్క ఒక్కటి సరిపోదేట్రా.. అంటున్నారు నారాయణ.. ఒరేయ్ బాబు నీ ఎగ్జామ్పుల్స్ ఆపురా నాయిన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్... హాయిగా తాటిముంజెలు తిని ప్రశాంతంగా కూకోరా అన్నాడు... అప్పలరాజు... వెంటనే నారాయణ అందుకుని.... అదేరా.. నిన్న జగన్ మ్యానిఫెస్టో ఇచ్చాడు కదా... అదైతే నాకు నచ్చిందిరా... చక్కగా రైతులకు... మహిళలకు, చిరు ఉద్యోగులకు తాను ఏమి చేయగలడో అది క్లారిటీగా చెప్పేసాడు... చంద్రబాబు మాదిరి వంద మాటలు చెప్పి రెండు అమలు చేసి మిగతావి ఎగదొబ్బే రకం కాదని లచ్ఛమంది సమక్షంలో ఒప్పుకున్నాడు.తండ్రి మాదిరి మనిషిరా... ఎక్కడా మాయ మర్మం.. ఉండవు... చెప్పేదే చేస్తాడు..చేసేదే చెబుతాడు...అదన్నమాట... అన్నాడు నారాయణ... ఐతే ఇప్పుడేమంటావ్ రా బాబు అన్నాడు అప్పలరాజు... నేనేమీ అనడం లేదురా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకుడు మనకు ఉండాల... చంద్రబాబు మాదిరి వెయ్యి మాటలు చెప్పి... రెండో మూడో అమలు చేసి కాదన్నా మ్యానిఫెస్టోను దాచేసేవాడు మనకు వద్దురా బాబు... ఎంత చేయగలడో... అదే చెప్పాడు.. కాబట్టి నాకు మరొక్కసారి జగన్ నచ్చాడురా... అన్నాడు.. నారాయణ.. నువ్వన్నదీ నిజమేరా.. అలా నిజాయితీగా చేసేవాళ్ళు... చెప్పేవాళ్ళు లేరిప్పుడు... ఇక చంద్రబాబు ఐతే మొత్తం మాయ చేస్తాడు... అలాంటివాళ్లను ఇప్పటికే మూడుసార్లు నమ్మి మునిగిపోయాం చాలురా బాబూ... అనుకుంటూ తాటిముంజెలు తింటూ కూర్చున్నారు ఇద్దరు...అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏమి లాభం... కదలని చెక్క గుర్రం ఎంత బావుంటే ఏమి లాభం.... పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటె ఏమి లాభం... అలాగే అమలు చేయని మ్యానిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటె ఏమి లాభం... అందుకే చెప్పేదే చేస్తాం... చేసేదే చెబుతాం .... విశ్వసనీయతే మా ప్రాణం... ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆకాశాన్నంటే హామీలు లేవు...ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తాం అనే బొంకులు లేవు.. ఊరూవాడా పందిరివేస్తాం... రోజూ మీకు విందుభోజనాలు పెడతాం అనే మాయలు లేవు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ...ఎక్కడెక్కడ .. ఏఏవర్గాలకు ఏయే విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడా అలా చేస్తూ వెళతాం అంటూ హామీ ఇచ్చారు.. అమ్మఒడి .. రైతుభరోసా వంటివి ఆయావర్గాలకు మేలు చేస్తాయి.ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు... అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం, తరువాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు.. ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు... ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి... చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు.. మాటలు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. జగన్ అన్న ఉంటే చాలు... ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది.AP people praising cm ys jagan manifesto 2024 for ap elections:::: సిమ్మాదిరప్పన్న -
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్‌సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్‌తో వైఎస్సార్సీపీలో జోష్ -
టీడీపీ తొండాట.. బాబు అండ్ కోకు మామూలే!
గతంలో ఒక జోక్ ఉండేది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మాచ్ జరుగుతుంటే మా వైపు ధోని వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని భారత క్రికెటర్లు చెబితే, తమ వైపు ఎంపైర్ అంటే రిఫరీ ఉన్నారులే అని పాక్ క్రికెటర్లు అన్నారని జోక్‌గా చెప్పుకునేవారు. సరిగ్గా ఏపీలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే, ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పొత్తు కట్టి తిరిగి అధికారంలోకి రావాలని సంకల్పించారు. కానీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన, బీజేపీ లతో పాటు ఎల్లో మీడియాతో నేరుగాను, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలతో పరోక్ష కూటమి కడుతున్నారు. తాజాగా ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డారా అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.నిష్పక్షపాతంగా ఉంటోన్న ఈసీపై కూటమి నేతలు బీజేపీ ద్వారా ఒత్తిడి తెస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తత్ఫలితంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి టీడీపీ కూటమి నేతలకు అవకాశం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రత్యర్థులు అనుసరిస్తున్న ఇలాంటి అనైతిక వ్యూహాలను ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్రెడ్డికు కొత్తకాదని చెప్పాలి.వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితం.. పొలిటికల్ కెరియర్ చెప్పాలంటే.. మరీ పెద్దదేం కాదు. ఆయన 2009 నుంచే రాజకీయాలలో ఉన్నట్లు లెక్క. అంటే 15 ఏళ్ల రాజకీయ జీవితం అన్న మాట. కానీ ఆయన ఎదుర్కున్నన్ని సమస్యలు, సవాళ్లు దేశంలోనే మరే నేతకు ఎదురు అయి ఉండకపోవచ్చు. ప్రత్యేకించి ఆయా వ్యవస్థలు పగబట్టినట్లుగా ఆయనపై పడ్డ తీరు తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక పెద్ద టీవీ సిరియల్ అవుతుంది. సినిమా తీస్తే ఒక సంచలన కథ అవుతుంది.తాజాగా 2024 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అదే తరహా దాడి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఒంటరిగా ఎదుర్కోలేమన్న భయంతో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డట్టు అనిపిస్తుంది. ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం ఉద్దేశం కానప్పటికీ, జరిగిన పరిణామాలు విశ్లేషించినప్పుడు అలాంటి భావన కలుగుతోంది. లేకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి దాడి, హత్యాయత్నం జరిగితే ఆ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని ఎన్నికల సంఘం సహేతుక కారణం లేకుండా బదిలీ చేయడం, నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఇంటిలెజెన్స్ హెడ్‌ను మార్చడం తాజా ఉదాహరణలుగా నిలుస్తాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఇలా వ్యవస్థలనుంచి చికాకులు రావడం కొత్తకాదు. చిన్న వయసులోనే అనేక కష్టాలు పడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె ధైర్యం మాత్రం మెచ్చుకోదగింది. అదే సాహస యాత్రను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న ఫలితంగా సోనియాగాంధీ, చంద్రబాబు వంటివారు కుమ్మక్కై అక్రమ కేసులుపెట్టినా చలించలేదు. పదహారు నెలలు జైలులోపెట్టినా బెదరలేదు. ఇన్ని అడ్డంకులు అధిగమించి, 2014లో తనపార్టీకి ఓటమి ఎదురైనా నిబ్బరంగా రాజకీయాలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి 3800 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల ఆదరణ చూరగొని రికార్డు స్థాయిలో 2019లో 151 సీట్లను గెలుచుకున్నారు. అది రాజకీయ ప్రత్యర్దులకు కంటగింపుగా మారింది.ముఖ్యంగా తనకంటే పాతికేళ్ల చిన్నవాడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ స్థాయిలో ప్రజల మన్నన పొందడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం నచ్చలేదు. ఆయనకే కాదు. తన మీడియా బలంతో రాజకీయాలను శాసించాలని అనుకునే రామోజీరావు వంటివారికి అసలు గిట్టలేదు. దాంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాడన్నమాటే కానీ, మళ్లీ అవే సమస్యలు. మళ్లీ అవే ఆటంకాలు. మళ్లీ ఆయా వ్యవస్థల నుంచి ఇబ్బందులు. పార్టీ పెట్టిన కొత్తలో సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఆయనను వెంటబడి వేధించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరికొన్ని వ్యవస్థలు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ నుంచి పదే, పదే వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడన్న చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు కొందరితో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని సమస్యలు పెట్టాలో అన్నీ సృష్టించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ స్కీమును ఆరంభించినా, ఏ సంస్కరణను తీసుకు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో లిటిగేషన్ తీసుకురావడం, వాటిని న్యాయ వ్యవస్థలో కొందరు ఎంటర్ టెయిన్ చేయడం వంటివి ప్రజలలో అనేక డౌట్లకు కారణం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఇబ్బంది పెట్టాలని టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తున్నట్లు కనిపిస్తుంది.తెలుగుదేశం వారు రాసిచ్చిన ఒక ఫిర్యాదుపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంతకం పెట్టి ఎన్నికల సంఘానికి పంపారు. అందులో ఏకంగా 22 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు చేయడం ఒక ఎత్తు అయితే, తమకు ఫలానా అధికారులు కావాలని, వారికి తాము కోరిన రీతిలో పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరడం ఒక సంచలనం. అలాంటి ఫిర్యాదు చేసిన పురందేశ్వరిని మందలించవలసిన ఎన్నికల సంఘం, అలా చేయకపోగా, వారు కోరిన రీతిలో స్పందించారు. అంటే బీజేపీతో టిడిపి ఎందుకు పొత్తు పెట్టుకున్నదో అర్థం చేసుకోవచ్చన్నమాట.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అని అనడమే కాకుండా, అనేక రకాలుగా దూషణలు చేసినా, ఓటమి తర్వాత మళ్లీ కాళ్లా, వేళ్లాపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తనపై ఉన్న కేసుల భయంతోనే చంద్రబాబు ఇలా చేశారులే అనుకున్నారు. కానీ అదొక్కటే కాదని, వ్యవస్థను మేనేజ్ చేయడానికి కూడా ఈ పొత్తు అవసరమని ఆయన లెక్కగట్టుకున్నారని అర్దం అయింది. పురందేశ్వరి ఫిర్యాదు తర్వాత కొందరు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అయినా టీడీపీ కూటమికి సంతృప్తి కలగలేదు. మరికొందరిని కూడా తప్పించాలని తలపెట్టారు. గతంలో ఇంటెలెజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో కీలక భూమిక పోషించారని ఆరోపణలు వచ్చాయి.గత ఎన్నికల సమయంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. అప్పట్లో ఏబీపై నిర్దిష్ట అభియోగాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇంటలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులుపై అలాంటి ఆరోపణలు లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు రాసిన కథనాలలో కూడా సీతారామాంజనేయులపై స్పష్లంగా ఫలానా ఆరోపణ అని చెప్పలేకపోయాయి. కాకపోతే ఆయన ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో ప్రవర్తిస్తున్నారన్నట్లుగా రాశాయి. ఆ ఇబ్బంది ఏమిటో తెలియలేదు. అంటే విపక్ష కూటమికి చెందినవారు డబ్బు రవాణా చేసినా, మద్యం సీసాలు సరఫరా చేసినా, దౌర్జన్యాలు చేసినా ఈ అధికారులు పట్టించుకోరాదన్నది వారి ఉద్దేశంగా ఉంది. పోనీ వీరు అధికార పార్టీ వారికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కేసులు పెట్టడం లేదా? అంటే అదేమీ లేదు. తెలుగుదేశం పత్రిక ఈనాడులోనే వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెట్టిన ఉదంతాలను ఇచ్చింది.ఇక విజయవాడ కమిషనర్ కాంతీలాల్ రాణా బదిలీ అయితే మరీ ఘోరం అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్నప్పుడు ఒక దుండగుడు రాయి విసిరాడు. ఫలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గాయపడ్డారు. ఆ కేసు రాణా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. దానిని ఆయన విజయవంతంగా పరిశోధిస్తూ, సాంకేతికతను వాడి నిందితుడిని పట్టుకున్నారు. ఆ నిందితుడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని బయటకు వినవస్తోంది. అంతే! రాణాపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించి ఎన్నికల సంఘం ఆయనను బదిలీ చేసి ప్రజలను ఆశ్చర్యపరచింది. ఈయన బదిలీకి ఏ కారణం ఉందో చెప్పరు. వీరంతా వైఎస్సార్సీపీకి అనుకూలమని ఒక ముద్రవేసి వారిపై చర్య తీసుకోవాలని కోరారు.గతంలో ఏబీని పక్కన పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల సంఘం తీరును తప్పు పడుతూ ఏకంగా ముఖ్య ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి ధర్నా చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అలా చేయడం లేదు. ఎవరు బదిలీ అయినా, ఎవరిని కొత్తగా నియమించినా ఆయన పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతూ ప్రజలలో తిరుగుతున్నారు. ఒక వైపు ప్రధాని మోదీ ముస్లింలపై, కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, వాటిపై పదిహేడువేల మంది ఫిర్యాదు చేసినా, స్పందించని ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం చిన్న, చిన్నవాటిపై మాత్రం సీరియస్‌గా స్పందిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిపై దాడి కేసులో విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేస్తోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Siddham: సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కాసేపటి కిందటే ఆయన వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే అందుకు ముందు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. నామినేషన్ గ్యాప్‌లో తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. సిద్ధం పేరుతో ఒకవైపు వైఎస్సార్సీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ఏపీ ఓటర్లకు ఆయన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరుతున్న సంగతి చూస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సిద్ధం.. ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ తాజాగా ట్వీట్ చేశారాయన. Andhra Pradesh Siddham!#VoteForFan— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2024 అంతకు ముందు వైఎస్సార్సీపీ సిద్ధం సభల్లో తన ప్రసంగాలతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో ఎన్నికల మూడ్ తీసుకొచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రల సమయంలోనూ ఆయా జిల్లాలను ఉద్దేశిస్తూ సిద్ధం అని ట్వీట్లు చేసింది చూశాం. ఇప్పుడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుస్తూ.. పార్టీలో జోష్ నింపుతూ ఆంధ్రప్రదేశ్ సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. -
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
Pawan Kalyan: రాజకీయ అజ్ఞాని అని ఒప్పుకున్నట్లేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలోకి ఎందుకు వచ్చినట్లు! ఆయన ఏమి సాధించినట్లు! ఆయన ఏమి మాట్లాడుతున్నట్లు! ఎవరి కోసం ఆయన పని చేస్తున్నట్లు! ఎవరో ఒకరిని ద్వేషించడానికి అయితే రాజకీయాలలోకి రావడం వల్ల ఉపయోగం ఉండదు. సమాజానికి ఏదో రకంగా సేవ చేయడానికి రాజకీయాలలోకి రావాలని అనుకుంటారు. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, వేరే పార్టీ నేత కోసం నిత్యం పరితపించే వ్యక్తిగా పవన్ దేశంలోనే ఒక రికార్డు సాదించినట్లు అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ తీరుతెన్నులు చూశాక ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కల్యాణ్ అవసరం ఎంత మాత్రం లేదనిపిస్తుంది. ఆయనకు ఒక సిద్దాంతం లేదని, పద్దతి పాడు లేదని అడుగడుగున అందరికి తెలిసిపోతుంది. అందుకే ఆయన రాజకీయాలలో రాణించలేకపోతున్నారని భావించాలి.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయనకు ద్వేషం ఉండవచ్చు. ఆయనను అర్జంట్‌గా పదవి నుంచి దించేయాలన్నంత కోపం ఉండవచ్చు. అందుకోసం ఆయన ప్రయత్నిస్తే తప్పేమీ కాదు. కానీ జగన్‌ను అసలు ఎందుకు పదవి నుంచి దించాలన్నదానిపై ఆయనకు ఒక స్పష్టత ఉండాలి కదా! తనపార్టీని తానే నాశనం చేసుకుని, తన పార్టీవారిని తానే అవమానించి బయటకు వెళ్లగొడుతున్న అరుదైన రికార్డు ఉన్న పవన్ కల్యాణ్‌కు ఏవిషయంలోను స్పష్టత ఉండదు. అలాంటప్పుడు జగన్ విషయంలో ఏమి క్లారిటీ ఉంటుంది! జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయనకు వ్యతిరేకత ఉందా? వలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలు మొదలైనవి నచ్చలేదా! ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రత్యేక నీటి పథకం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తేవడం పవన్‌కు ఇష్టం లేదా? జగన్ విధానాలు నచ్చకపోతే ఫలానాది బాగాలేదు.. తాము దానికి ప్రత్యామ్నాయం ఇది సూచిస్తున్నానని చెప్పవచ్చు.కానీ అలా ఎన్నడైనా చేశారా! సముద్ర తీరంలో జగన్ నిర్మిస్తున్న ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విద్యుత్, తదితరరంగాలలో కొత్తగా తెస్తున్న పరిశ్రమలు ఇష్టం లేదా! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ వంటివారికి వీటిని అడ్డుకోవడం ద్వారా ఒక లాభాన్ని ఆశిస్తున్నారు. వాటిపై దుష్ప్రచారం చేయడం ద్వారా తమకు రాజకీయ లబ్ది కలగాలని వారు కోరుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తామే ప్రభుత్వాన్ని నడపవచ్చన్నది రామోజీ, రాధాకృష్ణల కుట్ర. కానీ, అందులో పవన్ కల్యాణ్‌కు అసలు పాత్రే ఇవ్వరు కదా. మహా ఇస్తే ఒక ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టుకోమంటారు తప్ప ఇంకొకటి కాదని అంతా భావిస్తారు. ఈ మాత్రం దానికి పవన్ కల్యాణ్ తన ప్రతిష్టను అంతా పణంగా పెట్టి తన పార్టీని తాకట్టు పెట్టి. తనవారందరిని నట్టేట ముంచి చంద్రబాబు పాదాల వద్ద రాజకీయ బానిసత్వం చేయడం దేనికో ఆయన అభిమానులకు కూడా అంతు పట్టదు.ఈ మద్యకాలంలో పార్టీ నుంచి బయటకు వస్తున్న అనేక మందినేతలు ఎలా వాపోతున్నారో కనబడుతూనే ఉంది కదా! శాసనసభ ఎన్నికలలో పార్టీ తరపున పోటీచేసే అవకాశం వస్తుందని నమ్మిన పలువురు నేతలు కోట్లు ఖర్చు పెట్టారట. ఇప్పుడు పవన్ కల్యాణ్ వారిని తూర్పు తిరిగి దండం పెట్టుకోండని చెప్పి, ఆయన మాత్రం పడమర వైపు తిరిగి చంద్రబాబుకు సరెండర్ అయిపోయారు. తత్పలితంగా పార్టీని కేవలం పది, పరకా సీట్లకే పరిమితం చేశారు. మిగిలిన చోట్ల లక్షలు, కోట్లు వ్యయం చేసిన నేతలంగా నిండా మునిగిపోయారు. బుద్ది తక్కువై పవన్‌ను నమ్మామని వారు చెబుతున్నారు. ఇందులో తెలుగుదేశం నేతల్నీ తప్పు పట్టలేం. ఎందుకంటే వారంతా చాలాకాలం నుంచి ఒకే మాట చెబుతున్నారు. పదో - పరకో సీట్లు పడేస్తే పవన్ కల్యాణ్ తాము చెప్పినట్లు పడి ఉంటారని వారు అంటూ వచ్చారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఒక సభలో చెప్పి, తాను పదోపరకకో లొంగుతానా? అంటూ మాట్లాడితే జనసేన వారంతా బాగా మాట్లాడారులే అనుకున్నారు.. కానీ ఆయన చివరికి పది సీట్ల కోసం టీడీపీకి సరెండర్ అయ్యారు. పేరుకు ఇరవైఒక్క సీట్లు అయినా, పది సీట్ల వరకు చంద్రబాబు పంపించిన టీడీపీ నేతలకే పవన్ సీట్లు ఇచ్చారు.ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకు? వారాహి భోషాణం దేనికి, ఎవరి కోసం బిల్డప్? అసలు తెలుగుదేశంలో విలీనం చేసేస్తే సరిపోయేది కదా అని జనసేనను నమ్మి నాశనం అయినవారు అడుగుతున్నారు. వారిది అరణ్యరోదనగా మిగిల్చిన పవన్ కల్యాణ్ ప్రతి విషయంలోను చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నారు. చంద్రబాబు తెలివిగా పవన్ కల్యాణ్‌ను పది సీట్లకే పరిమితం చేసి జనసేనను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాంతో ఇంతకాలం తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నానని, చంద్రబాబుకు సమానంగా ఆయన పక్కనే నడుస్తున్నానని చెప్పుకున్న పవన్ కల్యాణ్‌ను అసలు ఆ రేసులో లేకుండా చేసుకున్నారు. తద్వారా తాను, లేదా తన కుమారుడు లోకేష్‌లు మాత్రమే.. ఒకవేళ అవకాశం వస్తే సీఎం పదవి చేపట్టడానికి వీలుగా పవన్‌ను లొంగదీసుకున్నారు.పవన్ కూడా ఒక ఎమ్మెల్యే పదవి వస్తే మహద్బాగ్యం అంటూ పిఠాపురంలో ఒక నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతను బతిమలాడుకుంటున్న తీరు ఆయన రాజకీయాలకు పనికిరాడని రుజువు చేస్తుంది. తనపార్టీవారిని గెలిపిస్తారని అనుకు్న్నవారికి భ్రమలు తొలగిస్తూ పవన్ కల్యాణ్ తను గెలుపుకోసం పిఠాపురంలో టీడీపీ నేత కాళ్లావేళ్లా పడుతున్నారు. ఇలా తన రాజకీయ పార్టీని తానే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరు చూస్తే రాజకీయాలలో ఏ మాత్రం పరిణితి లేని అజ్ఞాని అన్న సంగతి పదే, పదే అర్ధం అవుతుంది. జగన్ తనకు తానే దండలో రాయి పెట్టుకుని కొట్టుకున్నారట! ఏ మాత్రం ఇంగితం ఉన్నవారైనా ఇలా మాట్లాడతారా! లోకేష్ పిచ్చి వ్యాఖ్యలకు, పవన్ బుర్ర తక్కువ కామెంట్లకు తేడా ఏమీ కనిపంచదు. చంద్రబాబే అతి తెలివితో ముందుగా తానేదో ఖండించినట్లు నటించి, ఆ తర్వాత గులకరాయి తగిలిందంటూ డబుల్ టాక్ చేశారు.పవన్ కల్యాణ్‌కు ఆ మాత్రం కూడా కుట్ర తెలివితేటలు కూడా లేవు. చంద్రబాబు ఏది చెబితే అదే తాను కూడా వంత పాడి గులకరాయి స్వరం ఎత్తుకున్నారు. జగన్‌కు తగిలింది గ్రానైట్ రాయి అని, పొరపాటున అది నవరగంతకు తగిలినా, కంటికి తగిలినా ఎంత ప్రమాదం జరిగేది! అంతదాకా ఎందుకు ఒక గులకరాయిని తీసుకుని తమవాళ్లతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కొట్టించుకు చూస్తే దాని పవర్ ఏమిటో తెలుస్తుంది. జగన్‌కు ఆ రకంగా గాయమైతే కనీసం సానుభూతి తెలపకపోగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పైగా రాష్ట్రంలో ఏవేవో నేరాలు జరిగాయట. అప్పుడు ఎవరూ స్పందించలేదట. సమాజంలో జరిగే నేరాలకు, ముఖ్యమంత్రిపై దాడికి లింకు పెట్టి మాట్లాడడంలోనే పవన్ కల్యాణ్ అజ్ఞానం తెలుస్తుంది.సుగాలి ప్రీతి హత్య గురించి మాట్లాడారు. అది ఎప్పుడు జరిగింది.. చంద్రబాబు పాలన టైమ్ లోనే కదా! మరి అలాంటి చంద్రబాబుతో ఎందుకు జత కట్టారు! వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేగా! అప్పుడు శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని పవన్ అన్నారా! పైగా వివేకా కూతురు సునీత నాలుక మడతేసి చెబుతున్న అసత్యాలను ఈయన ఎత్తుకున్నారు. సునీతే తన తండ్రి హత్య జరిగిన రోజుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలపైనే ఆరోపణలు చేశారు కదా! ఆ తర్వాత కాలంలో, హత్య తానే చేశానని చెప్పుకుంటున్న వ్యక్తికి ఈమె ఎందుకు బెయిల్ ఇప్పించారు! ఈ విషయాలేవీ పవన్‌కు పట్టవా! ఏదో ఒకటి జగన్ పై బురద వేసి చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తికి ఎవరు రాజకీయాల గురించి చెప్పాలి.మళ్లీ ముప్పైవేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ పిచ్చి వాగుడు. అదే నిజమని నమ్మితే వలంటీర్ల వ్యవస్థను తీసివేస్తామని పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పడంం లేదు? చంద్రబాబు అయితే యూటర్న్ తీసుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారే! జగన్ అమలు చేస్తున్న స్కీములను తామూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా తాము ఎంత బలహీనంగా ఉన్నది వీరిద్దరూ తెలియచేస్తున్నట్లే కదా! జగన్‌పై జరిగిన దాడి లేదా హత్యాయత్నం ఘటనలో తొలుత పవన్ సోదరుడు నాగబాబు కొంత అభ్యంతరకరంగా వ్యాఖ్యానించినా, ఆ తర్వాత సర్దుకుని దాడిని ఖండించారే.ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, దాడి హేయమని ఖండించారు కదా! నాగబాబుకు దాడి ఎలా కనిపించింది? పవన్ కల్యాణ్‌కు ఎందుకు కనిపించలేదు! అంటే పవన్ కల్యాణ్ పిచ్చి మాటలుమాట్లాడుతున్నారని తేలిపోవడం లేదా! పవన్‌కు నాగబాబు ఇచ్చిన స్టేట్ మెంటే జవాబుగా కనిపిస్తుంది కదా! అంటే నాగబాబుకు ఉన్న విజ్ఞత కూడా పవన్ కల్యాణ్‌కు లేదనే అనుకోవల్సిందే కదా! పవన్ కల్యాణ్ హుంకరింపులు, గంతులు, ఆవేశం నటిస్తూ ఊగిపోవడాలు ఇవన్ని చూసిన తర్వాత మనందరికి ఒక స్పష్టత వస్తుంది కదా! ఈయన రాజకీయాలకు ఏ మాత్రం తగడని. వ్యక్తిగత జీవితంలో అనైతిక ప్రవర్తనతో పాటు, ఇలాంటి అజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎంత ప్రమాదకరం! ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు సిగరెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఉంటాయి. అలాగే పవన్ కల్యాణ్ పాలిటిక్స్ రాజకీయ సమాజానికి, ఏపీ ప్రజలకు ప్రమాదకరమని అనిపించడం లేదా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తమ్ముడే అనుకుంటే.. అన్నయ్య కూడా అంతేనా..!?
ఎవరైనా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అందులోను సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అప్రతిష్టపాలవుతారు. కానీ ఆర్దిక, రాజకీయ సంబంధాలు పెనవేసుకుపోయినప్పుడు కొందరు సెలబ్రిటీలు సైతం తమ వ్యక్తిత్వాన్ని వదలుకుని దిగజారడం సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురించే చెబుతున్నది. ఆయన అంటే అందరికి గౌరవమే. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. కానీ అందుకు విరుద్దంగా ఆయన ప్రవర్తిస్తే అభిమానగణం అప్సెట్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి అలాగే వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చెప్పిన చిరంజీవి సడన్‌గా మాట మార్చి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు. పోనీ అదేదో ఏదైనా రాజకీయ పార్టీలో పోటీచేసిన సామాన్యులకు మద్దతు ఇస్తే ఆయనకు పేరే వచ్చేది. ఏ పార్టీలో ఉన్న పేదలకైనా తన అండ ఉంటుందని చెబితే ఆయనకు కీర్తి వచ్చేది. కానీ ఆయన ఒక పెద్ద పెత్తందారీకి, ఆర్దిక నేరాభియోగాలు ఉన్న వ్యక్తికి సహకారం అందిస్తున్నట్లు ప్రకటించితే జనం ఏమని అనుకుంటారు. ఆయనకు ఈపాటి ఆలోచన రాకపోయిందా! అవును! కొన్ని సబంధాల ముందు అవేవి కనపించకపోవచ్చు. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాలు కలిసి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీకి చెందిన సీ.ఎం. రమేష్ వ్యూహాత్మకంగా బీజేపీలోకి వెళ్లి, ఇప్పుడు అనకాపల్లిలో లోక్ సభ సీటుకు కూడా పోటీచేస్తున్నారు. బహుశా చిరంజీవి, రమేష్‌లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అదేదో ఢిల్లీ స్థాయిలో కనుక ఎవరి దృష్టికి రాలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో సీ.ఎం. రమేష్ కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ సంప్రదింపులు జరిపి చిరంజీవి తనకు మద్దతు ప్రకటించేలా చేసుకున్నారు. సీ.ఎం. రమేష్ పలు ఆర్ధిక నేరాభియాలు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఒక సినీ నటుడు వేణు ఈయనపై 450 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన రమేష్ గురించి చిరంజీవికి ఏమీ తెలియకుండా సంఘీభావం ప్రకటించి ఉంటారా? అన్న సందేహం రావచ్చు. తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకున్నారు. ఈ పొత్తులో పవన్ కల్యాణ్ ధోరణి చూసి పలువురు జనసేన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అది వేరే కథ. పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు కోసం పనిచేసినా చిరంజీవి వారితో కలవలేదు. అప్పట్లో ఈయన కాంగ్రెస్ నేతగా ఉండేవారు. చంద్రబాబును విమర్శిస్తూ కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేకించి హిందుపూర్ లో ముస్లిం అభ్యర్ధికి కాకుండా బాలకృష్ణకు సీటు ఇవ్వడాన్ని చిరంజీవి తప్పు పట్టారు. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాలకు దూరం అయి సినిమాలపైనే దృష్టి పెడతామని ప్రకటించారు. అలాగే ఉంటారులే అనుకుంటే సడన్‌గా ఇప్పుడు కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా తాను కూడా పెత్తందారులలో భాగమేనని చిరంజీవి రుజువు చేసుకున్నారు. ఈయన నటించిన పలు సినిమాలు చూసి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ఆ సినిమాల వల్ల స్పూర్తిపొంది చిరంజీవి అంటే అంత గొప్పవాడు.. ఇంత గొప్పవాడు అని భావిస్తుంటారు. ఆయన ఠాగూర్ సినిమాలో నటిస్తే, ఈయన అంత గొప్ప నిజాయితీపరుడు అని అభిమానులు అంతా సంతోషించారు. రుద్రవీణ వంటి ప్రోగ్రెసివ్ సినిమాలో హీరోగా నటించి ఆదర్శవాది అనిపించుకున్నారు. పేదల తరపున పనిచేసే నేతగా, మద్యపానాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తీరా వాస్తవ ప్రపంచంలోకి చూస్తే చిరంజీవి అందుకు భిన్నంగా కనిపించడం ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది. సీ.ఎం.రమేష్ సారా వ్యాపారంతో జీవితాన్ని మొదలుపెట్టి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, రాజకీయాలలోకి వచ్చి వేల కోట్లకు అధిపతి అయ్యారు. రమేష్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంతంగా విమానం కొని ఆయా పార్టీలవారిని అందులో తిప్పే స్థాయికి ఎదిగారు. అది చట్టబద్దంగా, న్యాయబద్దంగా చేస్తే మంచిదే. కానీ సీ.ఎం. రమేష్ నడిపిన లావాదేవీల గురించి చిరంజీవికి తెలియవని అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ ఏదో ఆతీత సంబంధం ఏర్పడి ఉండాలి. అందుకే రమేష్‌కు అనుకూలంగా చిరంజీవి ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో చిరంజీవి తన పరువు తానే పొగొట్టుకున్నారు. ప్రజల దృష్టిలో పలచన అయ్యారు. చిరంజీవి ఎన్నికలలో పోటీచేస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్‌కు అనుకూలంగా మాట్లాడితే శభాష్ అనిపపించుకునేవారు. ఒక ఉపాధి హామీ కూలి ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఆయనకు సంఘీభావం చెప్పి ఉంటే అంతా మెచ్చుకునేవారు. కానీ ఆర్ధిక నేరారోపణలు ఉన్న బీజేపీ అభ్యర్ధులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం అంటే ఆయన మాటలకు, చేతలకు ఉన్న తేడా తెలియచేస్తుంది. అసలు చిరంజీవి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారా? ఆ పార్టీ నేతలు కొందరు ఈయన కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారని చెప్పారు.. కానీ ఈయనేమో బీజేపీ కూటమి అభ్యర్ధికి భజన చేస్తున్నారు. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే చిరంజీవి సినిమాల సంగతి ఎలా ఉన్నా, రాజకీయాలలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఎక్కడకు వెళ్లినా వేలు, లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చేవారు. దానిని చూసి ఆయన రాజకీయాలలోకి రావాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటే అదో రకంగా ఉండేది. కానీ రాజకీయాలలోకి వచ్చేది, రానిది చెప్పకుండా దాగుడుమూతలు ఆడేవారు.ఏదో వేరు పేరుతో సంస్థ పెట్టి కార్యకలాపాలు నిర్వహించి, తన బావమరిది అరవింద్‌ను ముందు పెట్టి కథ నడిపారు. ఆయా పార్టీలలోని నేతలు, ముఖ్యంగా తన సామాజికవర్గంవారు అంతా చిరంజీవి రాజకీయాలలోకి రావాలని కోరుతున్నట్లు ప్రకటనలు చేసేవారు. వారంతా కోరితే వస్తున్నట్లు కనిపించాలన్నది ఈయన ఉద్దేశం కావచ్చు. కానీ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చిరంజీవి గురించి, ఆయన పెట్టబోయే పక్షం గురించి వ్యతిరేక ప్రచారం చేసేశాయి. దాంతో ఆదిలోనే హంసపాదు మాదిరి ఆయన పార్టీకి విఘ్నాలు ఎదురయ్యేయి. ఆయన ఎట్టకేలకు చిరంజీవి తిరుపతిలో ఒక భారీ సభ పెట్టి ప్రజారాజ్యం పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ అయితే పెట్టారు కానీ, దానికి తగ్గ వ్యూహాలు, ఎజండాను సిద్ధం చేసుకోలేకపోయారు. తొలి రోజుల్లో ఈ పార్టీ వల్ల కాంగ్రెస్‌కు దెబ్బతగులుందని అనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆయనకు బాగానే ప్రచారం చేశాయి. కానీ దానివల్ల తెలుగుదేశంకు నష్టం వాటిల్లుతోందని అంచనాకు వచ్చిన ఆ మీడియా వెంటనే ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని గబ్బు పట్టించేవి. ఇది కేవలం కాపుల పార్టీ అన్న ముద్రవేశారు. దానిని ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యానికి లేకుండా పోయింది. తన బావమరిది అల్లు అరవింద్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్దిక విషయాలలో కొన్ని విమర్శలు వచ్చేలా చిరంజీవి వ్యవహరించారని అంటారు. టీడీపీ అయితే చిరంజీవి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేసేది. టిక్కెట్లు రాని కొందరు అదే తరహా ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు నాయుడు తన కోవర్టులను కొందరిని ముందుగానే ప్రజారాజ్యంలో ప్రవేశపెట్టి, తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి తిట్టించేవారు. ఇదే చిరంజీవికి పెద్ద సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తు పెట్టుకోవాలని చిరంజీవి ఆలోచన చేశారు. కానీ దానిని పడనివ్వకుండా వామపక్ష జాతీయ నేతలను చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలు తదితర కారణాల వల్ల ప్రజారాజ్యం ఎన్నికలకు ముందే చతికిలపడింది. చివరికి ఉమ్మడి ఏపీలో పద్దెనిమిది సీట్లకే పరిమితం అవడం కాకుండా, చిరంజీవే రెండు చోట్ల పోటీచేసి ఒక చోట ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ నడపడంలో తడబడ్డారు. ఆ దశలో జెండా పీకేద్దాం అని చిరంజీవి భావిస్తున్నారని ఈనాడు మీడియా ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది. అది చూసి చిరంజీవి చాలా బాధపడ్డారు. తదుపరి అప్పట్లో జరిగిన వివిధ పరిణామాలలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను తనకు అనుకకూలంగా మలచుకోవడంలో విఫలం అయిన ఈయన తనపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, రాజ్యసభకు వెళ్లి కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి పొంది సంతృప్తి చెందారు. కానీ 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి మళ్లీ సినిమాలపైనే దృస్టి పెడతామని అన్నారు. ఇంతలో తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేనను ప్రకటించినా ఈయన పట్టించుకోలేదు. ఎవరి రాజకీయాలు వారివే అన్నట్లు వ్యవహరించారు. 2019లో పవన్ కల్యాణ్ సొంతంగా ఒక కూటమి పెట్టుకుని రెండు నియోజకవర్గాలలో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు కూడా చిరంజీవి పెద్దగా స్పందించలేదు. వైఎస్సార్సీపీ గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి సత్సంబంధాలు కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆయనకు విశేష గౌరవాన్ని ఇచ్చారు. సినిమా సమస్యలపై చర్చలు జరపడానికి ఒక బృందాన్ని తీసుకువెళ్లారు. ఆ సందర్భంలో చిరంజీవిని అవమానించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వ్యాఖ్యానించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్ని చూసినవారు ఇక చిరంజీవి రాజీకీయాల జోలికి రారని అనుకుంటే పవన్ కల్యాణ్‌కు ఐదు కోట్ల చెక్ ఇచ్చి దానికి ప్రచారం కల్పించారు. బహుశా పవన్ వైపు నుంచి ఏదో ఒత్తిడి వచ్చి ఉండాలి. ఆ తర్వాత సీ.ఎం. రమేష్ ఉదంతంతో చిరంజీవి తన ప్రతిష్టను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఠాగూర్, రుద్రవీణ వంటి సినిమాలలో చిరంజీవి చేసింది నటనేనని, రియల్ జీవితంలో ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని అభిమానులంతా అనుకునే పరిస్థితి తెచ్చారు. కాపు సామాజికవర్గం ఒకసారి చిరంజీవిని నమ్మి, తదుపరి పవన్ కల్యాణ్‌ను నమ్మి మోసపోయిందన్న అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికీ వారిని మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తిగా సరెండర్ అయి జనసేన ఉనికినే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్‌కు చిరంజీవి మద్దతు ఇచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయకుండా బీజేపీకి ఎందుకు సంఘీభావం ప్రకటించారని ఆలోచిస్తే కొందరు ఇది పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినదానికి ప్రతిఫలం అని అంటున్నారు. మరి కొందరు అదే కారణం అయితే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీలో నేరుగా చేరి ఉండేవారన్నది మరికొందరి భావన. కేవలం సీ.ఎం. రమేష్‌ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కోసం వీడియో చేయడం కేవలం వ్యక్తిగత కారణాలే అయి ఉండవచ్చన్నది మరికొందరి భావన. ఏది ఏమైనా చిరంజీవి చేసింది తప్పు. అనైతికం, పరువు కోల్పోయే విషయం అని అంతా ఒప్పుకుంటున్నారు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
April 20th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
-
బాబు గురి గులకరాయిపైనే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికలకు ఇక 25 రోజులే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ న గారా కూడా మోగింది. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేదలు, అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మీరంతా సిద్ధమేనా? జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు దాకా పెత్తందార్ల దోపిడీకి, మనందరి పేదల పక్షపాత ప్రభుత్వానికి మధ్య ఈరోజు క్లాస్‌వార్ జరుగుతోంది. చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు కాబట్టే నాపై వేయించటానికి బాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. ఈ యుద్ధంలో ఆ పేదల వ్యతిరేక కూటమిని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? మరోసారి జైత్రయాత్రకు సింహగర్జనతో సిద్ధం కావాలి. ఫ్యాన్‌కు 2 ఓట్లు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం’’అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్లో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో భారీ జనసందోహాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. పసుపు పతి నిద్ర లేస్తాడు.. జాగ్రత్త! అభిమాన సముద్రంగా మారిన వరద గోదావరి ఇవాళ ఇక్కడ కనిపిస్తోంది. ఐదేళ్లుగా మనందరి ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం ఇక్కడ కనిపిస్తోంది. ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈరోజు మీ అందరిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్లు.. అంటే 1,825 రోజులు.. రాబోయే 60 నెలల పాటు మన బతుకులు ఎలా ఉంటాయి? అనేది నిర్ణయించే మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇక మీదట కూడా అందాలా? లేక అవి రద్దు కావడం అన్నది మీ ఓటుపైనే ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జగన్‌కు ఓటు వేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న నిజం. బాబు మోసాల మేనిఫెస్టో చెబుతున్న వాస్తవం. ఫ్యాన్‌కు ఓటు వేస్తే గ్రామగ్రామాన, పట్టణాల్లో సేవలందిస్తున్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు తథ్యం. ఫ్యాన్‌కు ఓటు వేస్తే అవ్వాతాతలకు ఇంటివద్దే రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ల ద్వారా జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా గత 58 నెలల్లో డీబీటీ ద్వారా మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. మళ్లీ పసుపు పతి నిద్ర లేస్తాడు! వదల బొమ్మాళీ.. వదల.. అంటూ మళ్లీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు ప్రతి ఇంటికీ వస్తాడు. జాగ్రత్త సుమా..! ఒక్క ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే విత్తనం నుంచి పంట విక్రయం వరకూ ఇప్పుడు సేవలందిస్తున్న ఆర్బీకేలు కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకేలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు ఖాయం. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఏటా క్రమం తప్పకుండా అందుతుంది. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, సున్నావడ్డీకే పంట రుణాలు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోళ్లు నిరాటంకంగా జరుగుతాయి. లేదంటే మళ్లీ చంద్రబాబు మార్కు పాలన, మళ్లీ కత్తిరింపులు, పథకాలన్నీ ముగింపు జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. పెద్దవారి పిల్లలు అసూయపడేలా.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, రూపురేఖలు మారిన స్కూళ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీ ప్యానళ్లు, 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ఉన్నత చదువులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, డిగ్రీ విద్యార్థులకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశీ వర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, తొలిసారిగా డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్‌షిప్.. ఇవన్నీ కొనసాగుతాయి. మీ జగన్ ఇదే స్థానంలో ఉంటే మరో పదేళ్లలో పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడతారంటే.. వారు అనర్గళంగా మాట్లాడే మాటలకు పెద్దవారి పిల్లలు అసూయ పడే పరిస్థితి వస్తుంది. బాబుకు ఓటేస్తే కత్తిరింపులు.. ముగింపు ఫ్యాన్‌పై రెండు ఓట్లు పడితే జగన్ మార్కు విప్లవాలన్నీ కొనసాగుతాయి. లేదంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, స్కూళ్ల రూపురేఖలు మార్చే నాడు–నేడు రద్దు, బడి పిల్లలకు రోజుకో మెనూతో ఇచ్చే గోరుముద్ద రద్దు, బడులు తెరిచే సమయానికి పిల్లలకు ఇస్తున్న విద్యాకానుక రద్దు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన రద్దు.. 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు రద్దు.. వీటన్నిటికీ కత్తిరింపులు ముగింపే! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు రద్దు అవుతాయి. అందుకే ఆలోచన చేయండి. పొరపాటు జరిగిందంటే..మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. నిద్ర లేచి మీ పిల్లల చదువులు, బడులు అన్నిటికీ లకలక.. లకలక అంటూ ముగింపు పలుకుతుంది. విప్లవాత్మక పాలన కొనసాగేందుకు.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజీ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దే పరీక్షలు – మందులు, నాడు– నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉత్తమ సేవలు, రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం, ఆపరేషన్ తరువాత జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం లాంటి ప్రతి పేదవాడిని బతికించే జగన్ మార్కు విప్లవాత్మక పాలన కొనసాగుతుంది. లేదంటే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాళీ అంటుంది. పేదవాడు అప్పుల పాలై వైద్యం అందని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది ఆ చంద్రముఖి. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే అక్కచెల్లెమ్మల రాజ్యం, పిల్లలను బడులకు పంపే అమ్మలకు అమ్మ ఒడి, చదువులకు ఇబ్బంది లేకుండా విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ జగనన్న కాలనీలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహాల నిర్మాణం.. అన్నీ కొనసాగి వేగంగా అడుగులు ముందుకు పడతాయి. గతంలో నాకు ఓట్లేయని వారూ ఆలోచించండి.. పొదుపు సంఘాల మహిళలకు బాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? ఓటు వేసే ముందు మీ కుటుంబమంతా కూర్చుని బాగా ఆలోచన చేయండి. ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి. ఎవరివల్ల మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఓటు వేయాలని కోరుతున్నా. మీ తలరాతలను మార్చే ఎన్నికలివి. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కొనసాగాలా? లేక రాష్ట్రాన్ని పెత్తందార్లు అందరూ కలసి దోచుకుని, పంచుకునే కూటమి పాలన కావాలా? 58 నెలలుగా మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పలు కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. కులం కారణం కావచ్చు.. ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామనే కారణం కావచ్చు.. లేదా ఇతర కారణాలు కావచ్చు.. ఆ అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను కూడా అడుగుతున్నా. గత ఎన్నికల్లో మీరు నాకు ఓటు వేయకపోయినా ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, క్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చుగానీ మీ కుటుంబానికి, మీ బ్యాంక్ ఖాతాల్లోకి 58 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన పథకాల డబ్బులు మీకు నిజాలే చెబుతాయి. ఇంటికే వలంటీర్ల సేవలు, ఇంటి వద్దకే పెన్షన్, రేషన్, వైద్యం, సర్టిఫికెట్లు, ఇళ్ల పట్టాలు.. ఇవన్నీ మీకు నిజాలే చెబుతాయి. మారిపోయిన మన గవర్నమెంట్ స్కూళ్లు, పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, వ్యవసాయం.. ఇవన్నీ మీకు వాస్తవాలు చెబుతాయి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగిందో ఆలోచన చేయండి. 2014లో బాబు మోసాలివీ.. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ♦ ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ అర్హులైన వారందరికి మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ♦ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? కాకినాడలో కనిపిస్తోందా? పోనీ పిఠాపురంలో కట్టారా? ♦ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అదీ లేదు. ♦ ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటికి కేజీ బంగారం అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. ఇన్ని మోసాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా, సోషల్ మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబు నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి టార్చిలైట్లు వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని వ్యవస్థలు, మన చదువులు, పిల్లలు, రైతన్నలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! ఇంటింటికీ మంచి చేశాడు కాబట్టి ఈ ఎన్నికల యుద్ధానికి మీ బిడ్డ ఒంటరిగా బయల్దేరాడు. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకే ఏ మంచిపనీ లేదు కాబట్టి వారంతా కూటమిగా ఏకమయ్యారు. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పాటైన కూటమి కాదు. ఎన్ని టికెట్లు ఇవ్వాలి? ఎవరు పోటీ చేయాలి? చివరికి ఆ ప్యాకేజీ స్టార్ ఎక్కడ నిలబడాలో కూడా బాబు నిర్ణయిస్తేనే కుదిరిన పొత్తులవి. ఆ ప్యాకేజీ స్టార్‌ను భీమవరం.. గాజువాక.. పిఠాపురం.. ఇలా ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుందనుకుంటే అక్కడ నిలబెట్టిన పరిస్థితి!ఇక బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! జగన్‌ను తిట్టు అంటే తిట్టు..! కొట్టు అంటే కొట్టు..! దత్తపుత్రా నీకిచ్చేది 80 కాదు.. 20 అంటే అందుకు కూడా జీ హుజూర్! ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి! కులాన్ని హోల్‌సేల్‌గా అమ్మేయగలననే భ్రమతో.. ఏపీని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే.. కులాన్ని హోల్‌సేల్‌గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడు. ఈయనకు ఏపీ అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్తాడు. ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండదు ఈ మ్యారేజీ స్టార్‌కు. ఏ భార్య అయినా ప్రేమ ఉండదు! పెళ్లిళ్లే కాదు..నియోజకవర్గాలు కూడా మార్చేశాడు. వెనుకటికి ఒకడు పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకన బెటు్టకెళ్లాడట! ఆ పిల్లిని చంకన బెట్టుకెళ్లింది ఎవరో ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు. బాబు తన చంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలినట్లు ఇప్పుడు అర్థమైంది. ఇదీ గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్‌తో గటగట తాగేది బాబు.. దాన్ని తోమి, తుడిచి మళ్లీ బాబుకు అందించేది మాత్రం.. ఈ ప్యాకేజీ స్టార్! బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్‌తో.. బీజేపీలోకి వదినమ్మ ఈ కూటమిలో వదినమ్మ బాబు చేరమంటే కాంగ్రెస్‌లో చేరింది. ఇదే బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. బాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది! 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా.. బాబు కోవర్టుగా అదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికే ఇస్తారు. వద్దంటే వారిని ఆపేస్తారు, మారుస్తారు. చంద్రబాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. బీఫామ్ బీజేపీదైనా, కాంగ్రెస్‌దైనా, టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే! మత్స్యకారులకు మాటిస్తున్నా.. కాసేపటి క్రితం కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్య్సకారుల సమస్యల గురించి ప్రస్తావించారు. నాకు మంచి మనసు ఉంది కాబట్టే.. ముమ్మిడివరంలో జరిగిన నష్టాన్ని, ఎప్పటి నుంచే పరిష్కారం కాని సమస్యను పరిష్కరించాం. ఓఎన్జీసీ కమిటీని ఏర్పాటు చేయటానికి మీ బిడ్డ ప్రభుత్వ చొరవే కారణమనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కమిటీ సిఫారసులు ఆధారంగా ప్రతి మత్య్సకార కుటుంబానికి మంచి జరిగేలా మీ బిడ్డ తోడుగా ఉంటాడని మాట ఇస్తున్నా. బాబుకు మిగిలింది గులక రాళ్లే... చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలు ముగిసేదాకా రంగురంగుల స్వప్నాలను చూపిస్తుంది. ఆ తరువాత చెత్తబుట్టలో మినహా ఎక్కడా కనిపించదు. ఎన్నికల తరువాత మోసాలు చేయడం చంద్రబాబు నైజం! ఆయన పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్లు ఏవీ లేవు. మంచి వ్యవస్థలు గానీ, పథకాలుగానీ, ప్రజలకు చేసిన మంచిగానీ ఒక్కటీ లేవు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు. కాబట్టే నాపై వేయించటానికి చంద్రబాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. మన మైలు రాళ్లు.. గత 58 నెలల పాలనలో మనం వేసిన పునాది రాళ్లు, మైలు రాళ్లు చరిత్రలో ఎప్పటికీ విప్లవాలుగా నిలిచిపోతాయి. కాబట్టే మనం జెండా తలెత్తుకుని ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతోంది. ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా? వద్దా? ఆలోచన చేయమని కోరుతున్నా. ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని ప్రతి ఇంట్లో స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు వచ్చి వివరించాలి. బాబు గత చరిత్రను, 2014లో ఇదే కూటమి పేరుతో చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. -
CM Jagan : ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో జన జాతరను తలపిస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ తరలివచ్చిన జన సందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నడినెత్తిన సూరీడు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలని, ఆయనతో మాట కలపాలని రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఆయనకు అప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో దారిపొడవునా సీఎం వైఎస్ జగన్ కోసం జనం వేచి చూసి మరీ స్వాగతం పలికారు. సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది దిక్కులు నాలుగే. కానీ ‘తూర్పు’ ఓ ప్రత్యేకత ఉంటుంది! ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే మరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘తూర్పు’ గోదావరి స్పెషాలిటీ ఏంటన్నది.. మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... ఈ జిల్లాపై పట్టు అధికారానికి మెట్టు అని చరిత్ర ఇప్పటికే చాలాసార్లు చెప్పింది! అలాంటి ‘తూర్పు’లో జగనన్న ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొత్త చరిత్రను లిఖిస్తోంది బస్సు యాత్ర ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! కాదూ కూడదు.. మాకు రుజువు కావాలంటున్నారా? చాలా సింపుల్... సీఎం జగన్ బస్సు యాత్రను దగ్గరగా ఫాలో కండి.. అభిమానంతో ఉప్పొంగిపోతున్న ప్రజలను చూడండి. ఇవ్వాళ రంగంపేటలో మొదలైన యాత్ర, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు చేరుకుంటుంది. ఇక్కడ కొద్దిసేపు భోజన విరామం. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్లకు రాత్రి వరకు చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. సీఎంను కలవడానికి ప్రజలు పోటీ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట వద్ద పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుయాత్రకు జనం ఆత్మీయ స్వాగతం పలికారు. సామర్లకోటలో మిట్టమధ్యాహ్నపు మండుటెండల్లోనూ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి కోసం జనం బారులు తీరారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద 12:20గంటలకు బస్సు యాత్ర చేరుకుంది. స్థానికులకు అభివాదం చేసిన సీఎం జగన్.. కొద్దిసేపు వారిని కలిసారు. మధ్యాహ్నం 12.37గంటల నుంచి12.48 వరకు సామర్లకోట ఫ్లైఓవర్ పై బస్సు యాత్ర సాగింది. సామర్లకోట ఉన్డూరు క్రాస్ కు 12.48 గంటలకు చేరుకున్నారు సీఎం జగన్. సామర్లకోట అచ్చంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు కోరడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సును కొద్దిసేపు నిలిపివేశారు. కిందికి దిగి మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్‌ను దీవించారు. -
సీఎం జగన్ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్’పై అనుమానాలెన్నో!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగినప్పుడు తెలుగుదేశం స్పందన, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పిచ్చి రాతలు, నిందితులను పోలీసులు ట్రేస్ చేయడంతో టీడీపీకానీ, వారి మీడియా కానీ మాటలు మార్చిన వైనం చూస్తే కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా ఒక మాట మీద ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడరాదు. నిందితులకు మద్దతుగా సానుభూతి వచనాలు చెప్పడానికి యత్నించకూడదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక పదునైన రాయి ద్వారా హత్యాయత్నం నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నిటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎక్కువగా కంగారు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖండన తప్ప ఇతరత్రా స్పందించనవసరం లేని వాటిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలుత ఖండన చేసినట్లు కనిపించినా, ఆ తర్వాత నాటకం అంటూ ఆరోపించడం ఆరంభించారు. కానీ పోలీసులు కచ్చితంగా ఇది హత్యాయత్నమేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అజిత్ సింగ్ నగర్ వద్ద జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ట్రాక్ రికార్డు అంత సవ్యంగా లేదు. ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్లే ఆయన అనుచరులే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఇప్పుడు పోలీసుల రిమాండ్‌లోని అంశాలను బట్టి అర్థం అవుతుంది. ఈ రిపోర్టులో ఇంకా కుట్రదారులదాకా వెళ్లలేదు కానీ, భవిష్యత్తులో ఈ కేసులో కుట్రకు పాల్పడింది ఎవరు అన్న దర్యాప్తు జరుగుతుంది. అప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుతానికి ఒక నిందితుడు వేముల సతీష్‌ను పోలీసులు పట్టుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక స్కూల్‌కు, ఒక దేవాలయానికి మధ్య ఉన్న చెట్ల వద్ద ఎవరికి కనబడకుండా ఈ దాడి చేశారు. పొరపాటున ఆ రాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటికి తగిలి ఉంటే ఏమిటి పరిస్థితి! అంతేకాదు, నవరగంత వద్ద ఆ పదునైన రాయి తగిలి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేది. అంత పెద్ద గాయం కంటిపైన తగిలితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా అది కేవలం గులకరాయి దాడిగా అభివర్ణించడం నీచంగా ఉంది. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ముఖ్యమంత్రికి వేసిన దండలో వచ్చిన రాయి కావచ్చని పిచ్చి వాదన తెచ్చారు. లోకేష్ వంటి పరిణితిలేని వ్యక్తి ఈ రాయిని తాడేపల్లి పాలెస్ నుంచి వచ్చిందని అహంకారపూరిత, కనీసం ఇంగితం లేని వ్యాఖ్య చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా తొలుత అయితే ఇదంతా పోలీసుల వైఫల్యంగా తేల్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసురుతున్నప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని, వారు ఎందుకు ఆపలేకపోయారని నిలదీస్తూ వార్తలు రాశారు. అప్పటికి వీరికి ఒక నమ్మకం ఉండి ఉండాలి. ఈ రాయి విసిరిన వ్యక్తులను విజయవాడ పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని భావించి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పోలీసులదే వైఫల్యం అన్నట్లు ప్రొజెక్టు చేసే యత్నం చేశారు. చంద్రబాబు తన సహజ శైలిలో దీనిపై కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడి తన లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారు. ఇక్కడ కీలకమైన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలుత ఈ దాడి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అనుమానితులను, నిందితులను పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయన్న సమాచారం రాగానే మాట మార్చి, అదేదో కావాలని చేసింది కాకపోవచ్చన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అన్నా క్యాంటిన్ ఎత్తివేశారని కోపంతో, తన తల్లికి రోడ్‌షోకు వచ్చినందుకు ఇస్తానన్న 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో రాయి విసిరి ఉండవచ్చని బొండా అన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ కేసులో కనుక తనను కూడా ఇరికించాలని చూస్తే జూన్ నాలుగు తర్వాత ఆ పోలీసుల సంగతి చూస్తానని బెదిరించారు. ఇది అచ్చం చంద్రబాబు, లోకేష్‌ల నుంచి తర్ఫీదు పొందినట్లే మాట్లాడారు. వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, అధికారులను ,ముఖ్యంగా పోలీసులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ స్వరం మార్చింది. బీసీ వర్గానికి చెందినవారిని కేసులో పెడతారా అని అచ్చెన్నాయుడు విమర్శించారు. హత్యాయత్నం ఘటనలలో కులం చూసి కేసు పెట్టాలని కొత్త రాజ్యాంగాన్ని వీరు చెబుతున్నారు. అలాగైతే చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు కూడా కులం చూసే కేసులు పెట్టారా? ఇక చంద్రబాబు అయితే ఈ కేసులో బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు కేసు దర్యాప్తే ఒక దశకు రాకుండానే చంద్రబాబుకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? అంటే ఈ హత్యాయత్నం ఎలా జరిగింది? అందులో ఎవరు ఉన్నారు? ఎవరికి సంబంధించినవారో ముందే తెలుసునని అనుకోవాలి. పోలీసు రిమాండ్ రిపోర్టులో వేముల సతీష్ అనే వ్యక్తి పదునైన రాయి విసిరితే, అందుకు ప్రేరేపించింది మరో వ్యక్తి అని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలపలేదు. ఈ రెండో నిందితుడు బొండా ఉమా అనుచరులలో ఒక ముఖ్యుడన్న ప్రచారం జరుగుతోంది. లేదా బొండా తన పేరును నిందితులు చెబుతారన్న భయం ఏమైనా ఏర్పడిందా?ఇప్పటికే సతీష్ తాను నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు. ఆ తర్వాత అందుకు ఎవరు ప్రోద్బలం చేసింది కూడా చెప్పి ఉంటారు. తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం వీరికి పట్టుకుంది. దాంతో వెంటనే పోలీసులను విమర్శించడం ఆరంభించారు. అందుకు ఈనాడు, జ్యోతి వంటి అనైతికంగా మారిన మీడియాను వాడుకున్నారు. ఒక ముఖ్యమంత్రిపై అంత దాడి జరిగితే, సానుభూతి చూపకపోతే మానే, ఏకంగా నిందితులకు మద్దతు ఇచ్చేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వారు మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీలో ఎవరికి సంబంధం లేకపోతే, అసలు ఈ అంశం గురించి వారు ప్రస్తావించవలసిన పనే లేదు. కానీ అందుకు భిన్నంగా అతిగా వ్యవహరించి తెలుగుదేశం నేతలు వారికివారే ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. ఈనాడు మీడియా నిందితులు ఉన్న వడ్డెర కాలనీకి వెళ్లి నిందితుల కుటుంబాలు చాలా బాధలో ఉన్నట్లు, వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నట్లు వార్తలు ప్రచారం చేశారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని రాసిన ఈ మీడియా ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకోవడాన్ని తప్పు పడుతోంది. నిందితుడు రాళ్ళు విసరడంలో నేర్పరి అయి ఉండాలి. లేకుంటే ముఖ్యమంత్రి కంటిపై భాగానికి తగిలేలా ఎలా వేయగలుగుతారు? ఇతనికి సహకరించినవారిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తన పేరు ఎక్కడ వస్తుందోనని బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్లినటట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులను బెదిరించారు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అతనికి అనుకూలంగా వాదించడానికి లాయర్లు వచ్చారు. రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి ఇంత పెద్ద లాయర్లను పెట్టుకునే శక్తి ఎక్కడ నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఇక్కడ కూడా సరిగ్గా చంద్రబాబు పై వచ్చిన కేసుల్లో వాదించిన రీతిలోనే ఈ లాయర్లు వాదన చేసినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబుకు ఐటి నోటీసులు వస్తే, ఫలానా ఆఫీస్‌కు జ్యురిస్ డిక్షన్ లేదని సమాధానం ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించారు. ఇప్పుడు వేముల సతీష్ మైనర్ అని చెప్పడానికి ఆయన లాయర్లు యత్నించారు. కానీ పోలీసులు పకడ్బందిగా అతనికి పందొమ్మిదేళ్లని నిరూపించారు. తదుపరి సతీష్ రాయి వేయలేదన్న వాదనకు వెళ్లారు. సీఎంకు వేసిన దండ కర్ర గీసుకుని ఉండవచ్చని వాదించినట్లు అతని తరపు లాయర్ చెప్పారు. జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయం అయిన సంగతిని విస్మరించారేమో తెలియదు. దండ కర్ర గీసుకుంటే ఒకరికే గాయం అవుతుంది కానీ, ఇద్దరికి అవ్వదు కదా! ఈ లాజిక్ మిస్ అయి మాట్లాడినట్లు అనిపిస్తుంది. మరో సంగతి చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుడు అప్రూవర్‌గా మారడంతోనే అతనికి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు కుట్రదారులన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మాత్రం నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఈ కేసుతో ముఖ్యమంత్రి పై జరిగిన హత్యాయత్నం కేసును పోల్చి చూస్తే, రాయి విసిరిన వ్యక్తి సంగతి ఎలా ఉన్నా, వెనుక ఉన్న కుట్రదారులకు కీలక పాత్ర ఉంటుందన్నమాట. కుట్రదారులను పట్టుకుని జైలులో పెట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రముఖ నేతలపై జరిగిన హత్యాయత్నం, దాడుల కేసుల్లో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు సుముఖంగా ఉండేవారు కారు. కానీ ఇక్కడ సతీష్ రిమాండ్ సమయంలోనే లాయర్లు రావడం విశేషం. మామూలుగా అయితే పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగానే రిపోర్టు చూసుకుని న్యాయమూర్తి రిమాండ్‌కు పంపిస్తుంటారు. కానీ అతని తరపు లాయర్లు రావడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామం చూసిన తర్వాత, అతని ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుడిని కాపాడడానికి పెద్దప్రయత్నమే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. దీనికి కారణం ఆ నిందితుడు విచారణలో తమ పేర్లు చెబితే అది సమస్య అవుతుందన్న భయం కావచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలుగుదేశం నేతలుకానీ, ఎల్లో మీడియా కానీ వ్యవహరించిన వైనం అనుమానాస్పదంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. వారు అతిగా స్పందించడం, గులకరాయి దాడి అని పనికిమాలిన రాతలు రాయడం, నిందితుడిని రక్షించే యత్నం చేయడం ఇవన్నీ గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు కనిపించడం లేదూ! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నామినేషన్ల పర్వం షురూ..
అనంతపురం: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు కాస్త మందకొడిగా సాగింది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి కేవలం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్ఓ వినోద్‌కుమార్ వద్ద సోషలిస్టు యూనిట్ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ అభ్యర్థిగా బి.నాగముత్యాలు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థిగా శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన శ్రీరంగరాజులు గోపినాథ్ నామినేషన్ వేశారు. ఆ ఒక్క అసెంబ్లీ స్థానం మినహా.. జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున ఆ పార్టీ నేతలు ఆర్ఓకు పత్రాలు అందజేశారు. ఎస్‌యూసీఐ (సీ) పార్టీ అభ్యర్థిగా డి.రాఘవేంద్ర నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సాకే రాజేష్‌కుమార్ నామినేషన్ వేశారు. రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం.బి. చిన్నప్పయ్య నామినేషన్ దాఖలు చేశారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీరంగరాజుల గోపినాథ్ నామినేషన్ వేశారు. పకడ్బందీగా నిర్వహిస్తాం.. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తామని అనంతపురం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం గురువారం ఆయన కలెక్టరేట్లోని ఆర్ఓ చాంబర్లో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25 వరకు ఉంటుందన్నారు. 26న పరిశీలన నిర్వహిస్తామన్నారు. ఉపసంహరణకు 29వ తేదీ ఆఖరన్నారు. ఎన్నికల పోలింగ్ మే 13న ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న నిర్వహిస్తామన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నామినేషన్‌తో పాటు జత చేయాల్సిన డాక్యుమెంట్లకు సంబంధించి చెక్‌లిస్ట్ ఇస్తారన్నారు. ఆ ప్రకారం పత్రాల్లోని అన్ని గడులు తప్పక పూరించాలన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచించారు. నామినేషన్ దాఖలు క్రమంలో ఏదైనా సందేహం వస్తే సిబ్బందిని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. నామినేషన్ల సందర్భంగా ఆర్ఓ కార్యాలయం వద్ద ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇవి చదవండి: టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే.. -
టీడీపీ ‘తమ్ముళ్ల’ నిరుత్సాహం..
సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టంలోనే టీడీపీ కథ తేలిపోయింది. మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు తొలిరోజే షాక్ తగిలింది. రాప్తాడు బరిలో ఉంటానని ముందుగానే ప్రకటించిన ప్రొఫెసర్ రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రాప్తాడు టీడీపీ టికెట్ ఆశించిన సంగతి తెలిసిందే. ఇక మరో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి గురువారం నామినేషన్ పత్రాలు సమర్పించగా, జనం కరువయ్యారు. జనంలేక.. నానా హంగామా.. భారీ జనసమీకరణతో ఆర్భాటంగా నామినేషన్ వేయాలని భావించిన ‘పల్లె’ కుటుంబ సభ్యులకు కార్యకర్తలు ఝలక్ ఇచ్చారు. భోజన వసతి ఏర్పాటు చేసి.. మద్యం, డబ్బు ఎరగా వేసి ఆహ్వానించినా జనం పెద్దగా స్పందించలేదు. ఓడిపోయే వారి వెంట ఎందుకు నడవాలని కార్యకర్తలూ రాలేదు. దీన్ని కవర్ చేసుకునేందుకు తెలుగు ‘తమ్ముళ్లు’ మద్యం మత్తులో పుట్టపర్తి రోడ్ల వెంట ఓవరాక్షన్ చేస్తూ.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారు. బైక్‌ల సైలెన్సర్లు తీసేసి పెద్దపెద్ద శబ్ధాలతో హడావిడి చేశారు. అనంతరం కొందరు తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయం ముందుకు వెళ్లి హంగామా చేశారు. ప్రచారం రథం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అర్బన్ సీఐ కొండారెడ్డి అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. ‘పరిటాల’కు రెబల్స్ బెడద.. రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీతను అధిష్టానం ఖరారు చేసింది. అయితే ధర్మవరం టికెట్ ఆశించి.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడంతో ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. రోజుకొకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. మిగతా ఎక్కడా నాయకులే లేరా? పరిటాల కుటుంబానికే టికెట్ ఇవ్వాలా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాప్తాడు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్.. తొలిరోజే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పరిటాల కుటుంబానికి తొలిరోజే షాక్ తగిలింది. ‘తమ్ముళ్ల’ నిరుత్సాహం.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రాలేదు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతే కారణంగా కార్యకర్తలెవరూ పెద్దగా స్పందించడం లేదు. చాలా చోట్ల అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి విన్నవించినా.. చంద్రబాబు – నారా లోకేశ్ వినకుండా.. వారినే బరిలో దింపడాన్ని చాలామంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో టీడీపీలో కొందరు నాయకులు కొనసాగుతున్నా.. వారు అనుచరులందరినీ అధికార పార్టీ వైపు పంపిస్తున్నారు. హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగా రోజుకు సగటున వంద పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీ గూటికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ కొత్తచెరువు: ‘పల్లె’ నామినేషన్ అనంతరం గురువారం సాయంత్రం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన కమ్మ, బోయ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయప్ప నాయుడు, బోయ రామాంజి పుట్టపర్తిలో జరిగిన ‘పల్లె’ సింధూర నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలో తాము గొప్ప అంటే తాము గొప్ప అంటూ ఘర్షణ పడ్డారు. అనంతరం జయప్ప నాయుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో రామాంజి పుట్టపర్తి, భైరాపురంలోని తన బంధువర్గాన్ని ఓ ఆటోలో తీసుకుని కమ్మవారిపల్లి వెళ్తున్నాడు. అయితే బండ్లపల్లి క్రాస్ సమీపంలో జయప్ప ఎదురుపడటంతో అతనిపై దాడికి దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న జయప్ప నాయుడు వర్గీయులు సైతం రామాంజి బంధువులపై దాడులు చేశారు. ఒకానొక దశలో ఆటోకు సైతం నిప్పుపెట్టాలని చూడగా... కొత్తచెరువుకు చెందిన ఓ టీడీపీనేత ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ ఘటనలో భైరాపురం గ్రామ యువకులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: అక్కడ వ్యాపారుల సొమ్మంతా ప్రసాదార్పణం.. -
పరిటాల సునీతకు ఝలక్..!
ఎన్నికల ప్రక్రియ ఆదిలోనే పరిటాల సునీతకు ఊహించని షాక్ తగిలింది. రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్‌గా ప్రొఫెసర్ రాజేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సునీతకు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ రాజేష్ తన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. సునీతకు గట్టి దెబ్బే.. కనగానపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ సానుభూతిపరుడు. ఆయన తండ్రి రామన్న గతంలో పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. కనగానపల్లి సర్పంచ్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం రాజేష్ పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నిర్వహించుకుంటూ ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నారు. రెండు సంవత్సరాలుగా రాప్తాడు నియోజకవర్గంలో తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ తరఫున రాప్తాడు అసెంబ్లీకి కానీ, హిందూపురం ఎంపీ స్థానం నుంచి కానీ పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ, ప్రజాదరణ ఉన్న వారిని పట్టించుకోకుండా డబ్బున్న అభ్యర్థుల వైపు చంద్రబాబు చూడడంతో రాజేష్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇప్పటికే రాప్తాడులో ప్రజా బలం లేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు రాజేష్ కారణంగా గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవి చదవండి: నామినేషన్ల మొదలైనా.. తెగని టీడీపీ సీట్ల పంచాయితీ! -
అక్కడ వ్యాపారుల సొమ్మంతా ప్రసాదార్పణం..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ఫండ్ పేరుతో కూటమి అభ్యర్థి అందినకాడికి వసూలు చేసేస్తున్నాడు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భాగమైన ఆ నియోజకవర్గంలో ఆ అగ్రకుల పెత్తందారు సీటు దక్కించుకునే దగ్గర నుంచి అన్నింటా వసూళ్లే. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని నిర్థారణకు వచ్చిన ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన, వసూళ్లకు తెగబడి అందినకాడికి దోచుకోవాలనే వ్యూహానికి తెర లేపారు. విజయవాడ సిటీకి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకుని తద్వారా ఇక్కడ ఉన్న సహజవనరులు దోచుకోవాలని, రియల్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టాలన్నది ఆయన లక్ష్యం. అది ఫలించే సూచనలు కనిపించకపోవడంతో ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తనకు ఇప్పుడు సహకరిస్తేనే.. రేపు తన వంతు సహకారం ఉంటుందని అన్యాపదేశంగా హెచ్చరిస్తుండటం గమనార్హం. కప్పం కట్టాల్సిందేనంటూ ఇండెంట్లు.. జిల్లాలో హాట్ సీట్..ఇన్‌కం క్రియేట్ సీట్‌గా పేరున్న ఆ నియోజకవర్గంలో రియల్ వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిల్డర్లు, రియల్ వ్యాపారులకు ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చేశారు. వైద్యం, విద్య, వ్యాపార రంగంలో స్థిరపడ్డ వ్యక్తులను కూడా టార్గెట్ చేశారు. అన్నీ సజావుగా సాగాలంటే కప్పం కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. భవిష్యత్తు ‘‘కమ్మ’’గా ఉండాలంటే మీకు బాధ్యత ఉందా? లేదా? అనే సెంటిమెంట్‌నూ వాడుకుంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ఆర్ఐల జాబితాను సిద్ధం చేసి తన అనుయాయుల ద్వారా ఫోన్లు చేయించి ఫండ్ రెడీ చేసుకోమని తాము చెప్పిన వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచిస్తున్నట్టు తెలిసింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆయన ఉచిత ఇసుక, రియల్ వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో వ్యాపారాలకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. అడ్డగోలుగా సహజవనరుల్ని బొక్కేసి, అనుయాయులకు నాలుగురాళ్లు వెనకేసుకునేలా తోడ్పాటునందించారు. ఈ దఫా వాళ్లందరినీ ఫండ్స్ కోసం టార్గెట్ చేసి గల్లా పెట్టె నింపుకొనే పనిలో పడ్డారు. ఎన్ఆర్ఐల ఫండ్‌తోనే సీటు దక్కింది.. ఆది నుంచి సీటు లేదని తేలిపోవటంతో ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడాయన. ఎన్ఆర్ఐల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా కప్పం కట్టించి మరీ చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడిక వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇండెంట్లు పెట్టడానికి, ముక్కుపిండి వసూలు చేసేందుకు ఓ పది మందితో కూడిన కమిటీని వేశారు. ఓ మాజీ సర్పంచ్‌కు ఆ కమిటీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి రంగంలోకి దించారు. ఇక ఆ కమిటీ కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు కనీసం రూ.25 కోట్లకు పైగా వసూలు చేయాలని ఆయన టార్గెట్ పెట్టుకుని జల్లెడ పట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో సైతం.. ఎన్నికలొస్తే ఆ అగ్రకుల అభ్యర్థికి పండగే...తన సామాజిక వర్గం దండిగా ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కోటీశ్వరులు, ఎన్ఆర్ఐల జాబితాలు తయారుచేసి వసూళ్ల పర్వం మొదలెడతాడు. వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి, మిగతా సగం వెనకేసుకుంటాడు. గతంలో ఇలాగే చేశాడు. ఈసారి ఆ పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ రాగా ఎన్ఆర్ఐల ఫండ్ గ్యారంటీతోనే చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఆయన బరితెగించి వసూళ్ల కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించాడు. ఊరూరా ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారుల జాబితాలు సేకరించి వసూళ్ల పర్వం మొదలెట్టాడు. కూటమి అభ్యర్థి 2019లో అధిష్టానం ఇచ్చిన సొమ్ము, ఇతరత్రా ఫండ్స్‌లో ఖర్చుపెట్టగా తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో సుమారు రూ.4 కోట్లకు పైగా పందేలు కట్టారు. సొమ్ము పోయి శని పట్టింది. ఈ దఫా అలాంటి పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోయిన సొమ్ముతో పాటుగా ఈ దఫా అధికమొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఈ చందాల వసూళ్లు నియోజక వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్లో దోపిడీ ఉంటే.. పొరపాటున ఈయన గెలిస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇవి చదవండి: నామినేషన్ల పర్వం షురూ.. -
నామినేషన్ల మొదలైనా.. తెగని టీడీపీ సీట్ల పంచాయితీ!
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు భానుడి భగభగలు.. మరోవైపు సార్వత్రిక ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తుంటే.. కూటమిలో ఇంకా టికెట్ల పంచాయితీ కుంపటి రగులుతూనే ఉంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. సీట్ల సర్దుబాటులో నెలకొన్న గందరగోళం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు మార్పుల వైఖరికి జనసేన, బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాడుగులలో సైకిల్ తొక్కేదెవరో తెలియక అయోమయంలో క్యాడర్ ఉండగా.. అరకులో కమలం వికసించకుండా టీడీపీ యత్నాలు జోరందుకున్నాయి. విశాఖ దక్షిణంలో జనసేన అభ్యర్థి వద్దేవద్దంటూ ఆ పార్టీ నేతలే తేల్చి చెబుతుండటంతో ఎటుపోవాలో తెలియక క్యాడర్ ఊగిసలాడుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే.. కూటమి మాత్రం పొత్తు చిక్కుల్లో కూరుకుపోయింది. చివరి నిమిషం వరకూ ఎవరికి సీటు దక్కుతుందో తెలియక అయోమయంలో టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా మాడుగుల, అరకు నియోజకవర్గాల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మాడుగులలో తొలుత పైలా ప్రసాదరావుకు చంద్రబాబు సీటు ప్రకటించారు. దీంతో ఆయన ప్రచారానికి ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేశారు. అయితే తాజాగా ఈ సీటును తనకే కేటాయించారని బండారు ప్రకటించుకున్నారు. దీంతో పైలా వర్గం కోపంతో రగిలిపోతోంది. ఇన్నాళ్లూ ఈ టికెట్ ఆశించిన గవిరెడ్డి రామానాయుడు, పీవీజీ కుమార్‌లకు భంగపాటు తప్పలేదు. పెందుర్తి నుంచి మాడుగులకు బండారు రావడంతో అక్కడ పార్టీ క్యాడర్ రగిలిపోతోంది. మాడుగులలో గురువారం బండారు నిర్వహించిన సమావేశానికి పైలా గైర్హాజరయ్యారు. బండారు, చంద్రబాబు తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో పాటు అయోమయానికి గురవుతున్నారు. జనసేనది ఇదే పరిస్థితి.. అటు జనసేనకు సంబంధించి దక్షిణ నియోజకవర్గంలోనూ అసమ్మతి ఇంకా కొనసాగుతోంది. బీఫారం దక్కించుకున్న వంశీకృష్ణకు సీటు ఇవ్వొద్దంటూ పలువురు నేతలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. వంశీని కొనసాగిస్తే.. ఓడించి తీరుతామంటూ తేల్చి చెబుతున్నారు. జనసేనలోనే వర్గపోరు ఉండటంతో.. ప్రచారానికి వెళ్లకుండా ఆ పార్టీ శ్రేణులు ఇంటికే పరిమితమవుతున్నారు. కీలక నేతలు ప్రచారానికి డుమ్మా కొడుతుండటంతో.. వారు లేకుండా ప్రచారానికి వెళ్తే.. తమని బ్లాక్ లిస్టులో పెడతారేమోనన్న సంకట స్థితిలో మూడు పార్టీల క్యాడర్లో ఉంది. బయటికి రాలేక.. నియోజకవర్గంలో తిరగలేక.. నాయకులు సైతం అందుబాటులో ఉండకపోవడంతో ఆయా పార్టీల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది. మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు పొడిచినా.. అది మునిగిపోయే పడవ మాత్రమేననే తత్వం ఆ పార్టీల కార్యకర్తల్లోనూ బలంగా నాటుకుంది. అరకులోనే అదే దుస్థితి.. రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రకటించిన టీడీపీ సీటు అరకు నియోజకవర్గానిదే. దొన్ను దొర అరకు అభ్యర్థి అంటూ బాబు ప్రజాగళం సభలో ప్రకటించారు. అప్పటి నుంచి ప్రచారం నిర్వహించిన దొన్ను దొరకు చివరికి భంగపాటు తప్పలేదు. ఆ స్థానాన్ని బీజేపీకి ఇస్తున్నట్లు బాబు ప్రకటించడంతో అసమ్మతి భగ్గుమంది. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తన తడాఖా చూపిస్తానంటూ దొన్నుదొర బహిరంగంగా సవాల్ విసిరారు. దీంతో అరకులో కూటమి రెండు ముక్కలైంది. బీజేపీ అభ్యర్థితో పాటు నడవాలా..? రెబల్‌గా అడుగులు వేస్తున్న దొన్ను దొరతో ఉండాలా అని తేల్చుకోలేక మూడు పార్టీల క్యాడర్ గందరగోళంలో ఉంది. మరోవైపు అరకులో కమలం వికసించకుండా ఆపేందుకు టీడీపీ యత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇవి చదవండి: టీడీపీ ‘తమ్ముళ్ల’ నిరుత్సాహం.. -
సీఎం జగన్ హత్యకు కుట్ర జరిగింది : రిమాండు రిపోర్టు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఏ1 నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. దాడి వెనుక సీఎం జగన్‌ను చంపాలన్న దురుద్ధేశం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. సీఎంను హత్య చేయాలనే కుట్రతోనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్లు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు సీఎం జగన్‌కు గాయం మాత్రమే అయిందన్నారు. సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కుట్ర ఎలా జరిగిందంటే? ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్‌ను ప్రేరేపించాడు. ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్‌ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడు సింగ్ నగర్ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్ చేశాడు సీఎం జగన్ వచ్చే వరకు ఎదురు చూశాడు దాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడు ప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడు నిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయి సీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్‌గా ఉంది ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాం సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం 17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశాం నిందితుడికి రిమాండ్ సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్ కు రిమాండ్ విధించింది కోర్టు. పోలీసులు నిందితుడిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ & మెట్రో పొలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా.. న్యాయస్థానం సతీష్‌కు 14 రోజులు రిమాండ్ విధించింది. సతీష్‌ను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తున్నట్టు సమాచారం. తెలుగుదేశం, జనసేనలో తత్తరపాటు సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసుల విచారణ వేగవంతం అయిన కొద్దీ తెలుగుదేశం, జనసేన నాయకుల్లో తీవ్ర కలకలం, తత్తరపాటును గత మూడు రోజులుగా చూస్తున్నాం. దాడి జరిగిన రోజునుంచీ ఈ ఘటనను వీలైనంత వరకు చిన్నగా చేసే ప్రయత్నం చేశారు. అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా తమ నోరు పారేసుకున్నారు. లోకేష్ చేసిన ట్వీట్ అయితే తీవ్ర వివాదస్పదం అయింది. పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ టిడిపి అధినేత చంద్రబాబే ఏకంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటి వరకూ పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయినా చంద్రబాబే ఓ అడుగు ముందుకేసి టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమని కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించాడు. పోలీసులు గానీ, వారి దర్యాప్తు గురించి కానీ, ఎవరిని విచారిస్తున్నారన్న విషయం కానీ, ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్నది ఏదీ పోలీసులు చెప్పకపోయినా.. గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకునే రీతిలో చంద్రబాబు వ్యవహరించారు. బోండా.. నీ సంగతేంటీ? ఇక టిడిపి సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ టిడిపి అభ్యర్థి బొండా ఉమ వ్యవహరశైలి తీవ్ర వివాదస్పదంగా ఉంది. దర్యాప్తులో అన్ని వేళ్లు తనవైపు చూపిస్తుండడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో ఇష్టానుసారంగా కామెంట్లు చేశాడు బోండా ఉమా. ఆయన కామెంట్లు చూస్తే.. అన్నా క్యాంటీన్ మూసేసినందుకు కోపంతో కొట్టాడు ర్యాలీకి వస్తే రూ.300 ఇస్తానని ఇవ్వలేదు అందుకే కొట్టాడు సింపతీ కోసం వైఎస్సార్సిపి వాళ్లే కొట్టించుకున్నారు అధికారులను హెచ్చరిస్తున్నా.. నా పేరు ఈ కేసులో పెట్టొద్దు జూన్ 4 తర్వాత పోలీసుల సంగతి తెలుస్తా ఇప్పుడు దర్యాప్తులో వేముల సతీష్ పాత్ర బయటపడడంతో బోండా ఉమ తనను తాను కాపాడుకోడానికి రాజకీయాలు చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్ -
గోదావరిలో జనజాతర.. జగన్ వస్తే ఉప్పెనే
సాక్షి, పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా కొనసాగుతోంది. సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు. రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న మండుటెండలను లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. రావులపాలెం సెంటర్లోనయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెనలా తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఎక్కడో నాసికా త్రయంబకంలో పుట్టిన గోదారి.... పిల్ల కాలువలతో మొదలుపెట్టి... వాగులు, వంకలు, ఏరులు, నదులన్నీ ఇచ్చే శక్తితో పోటెత్తిపోతుంది... ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కూడా అంతే! ఇడుపుల పాయలో మొదలైన జనవాహిని కూడా.. అంతకంతకూ బలం పుంజుకుంటుంది... ప్రతి సభ జన సంద్రాన్ని తలపిస్తోంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి, రాజానగరం మీదుగా ST రాజపురం చేరే.. నేటి యాత్రలోనూ గోదారోళ్ల అభిమానం, అప్యాయతలు కళ్లకు కడుతున్నాయి! చిన్నా పెద్ద తేడా లేదు... రాజు పేద అన్న అంతరమూ కానరాదు. ఎటు చూస్తే అటు పండుగ వాతావరణం. చిరునవ్వుల కేరింతలు.. పెత్తందార్లపై పోరుకూ మేమూ సిద్ధం అంటూ నినాదాలు! ఈ ఉత్సవం... ఐదేళ్ల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుడుతున్నట్లే! మరోవైపు జననేత తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడం ఆలస్యం.. బస్సుయాత్ర వెళ్లే రహదారికి తమ గ్రామం దూరంగా ఉన్నాసరే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులు, యువత ప్రతికూల వాతావరణంలోనూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి జగన్‌కు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పసిపిల్లలతో పాటు వచ్చిన తల్లులు, బాలింతలు ఇలా ఒకరేమిటి గంటల తరబడి జగన్‌ను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా వీధుల్లోకి పోటెత్తుతున్నారు. -
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
బందిపోటు రాజకీయమే బాబు పాలన మార్క్!
సాక్షి, పలాస: అయ్యా చంద్రబాబూ.. నీ 14 ఏళ్ల అమోఘమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతోపాటు నీ ముఠాలో ఉన్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఇలా అందరూ ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో.. రాష్ట్ర భవిష్యత్తును ఎంత నాశనం చేశారో ప్రజలంతా చూశారు. పెత్తందార్ల ముఠాకు చంద్రబాబు నాయకుడనేది ప్రజలందరికీ తెలిసిపోయింది’ అని అప్పలరాజు తెలిపారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కు వంతపాడిన పీవీ రమేష్ చంద్రబాబు తొత్తుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏదేదో మాట్లాడాడు. మరి, యువతకు ఉద్యోగాల పేరిట శిక్షణ ఇస్తామంటూ చంద్రబాబు ముఠా స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌కు పాల్పడ్డప్పుడు ఇదే వ్యక్తి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ ప్రోగ్రాంకు సంబంధించి నోట్‌ఫైల్ తయారు చేశాడు. నోట్‌ఫైల్‌లో పీవీ రమేష్ అనే అధికారి చేతిరాతతో ఏం రాశాడో కూడా అందరం చూశాం. ‘ఓరల్ ఇనస్ట్రక్షన్ ఆఫ్ హానరబుల్ సీఎం.. రిలీజ్ ద ఫండ్స్..’ అని రాసింది ఇదే పీవీ రమేష్. ఈ సంగతి ఆయన మరిచినా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. రూల్స్‌ను అతిక్రమించి మరీ చంద్రబాబు ఫండ్స్‌ను రిలీజ్ చేయమన్నాడు. అప్పటికీ, కిందిస్థాయి అధికారులు ఇది సాధ్యం కాదనప్పటికీ, ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆదేశాలంటూ చెప్పిందీ ఆయనే.. స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ జరుగుతుందనే సమాచారం ఆయనకు తెలిసినప్పటికీ ఫండ్స్ రిలీజ్ చేశారు. పైగా, ఆ స్కామ్‌తో తనకేం సంబంధం లేదని ఎంటైర్ ఫైల్ రిఫరెన్స్ కోసం తనకు పంపాలని కూడా నోట్‌ఫైల్‌లో రాశాడు. దళితుడిగా పుట్టి.. పేదవర్గాలకు అన్యాయం చేస్తావా..? పీవీ రమేష్‌ను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. ఏమయ్యా.. నువ్వూ ఒక దళితుడివే కదా...? దళితులకు ఏం అవసరమో నీకు తెలియదా..? నువ్వు ఆర్థికరంగ నిపుణుడువే కదా..? అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్ అదే కదా..? మరి, ఒక పేదవాడి సంక్షేమానికి ఆ బడ్జెట్లో చంద్రబాబు ఏం చేశాడు..? ఇవాళ జగన్మోహన్రెడ్డి గారు ఏం చేస్తున్నారో నీకు తెలియదా..? మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు ఖజానాలో ఉంది కేవలం రూ.100 కోట్లే.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరంటూ మాట్లాడాడు కదా..? ఇది వాస్తవమే కదా..? మరి, జగన్మోహన్రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకూ ప్రతీ నెలా ఒకటోతేదీకే మేం జీతాలెలా ఇచ్చాం..? దాదాపు డీబీటీ కింద ప్రభుత్వ సంక్షేమాన్ని పేద ప్రజలకు రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపిణీ చేశాం..? ఇన్నిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేయగలిగాం..? వీటిపై నీకు ఏనాడూ ఆలోచన కలగలేదా..? అదే నువ్వు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవ్వన్నీ చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు..? దీనికి నువ్వు స్పష్టమైన సమాధానం చెప్పాలి. దళితుడిగా పుట్టి దళితులకు అన్యాయం చేసే మాటల్ని దయచేసి నువ్వు మాట్లాడొద్దు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే దళితుల్ని పదేపదే అవమానిస్తూ.. వారి సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని అతనికి వంతపాడుతున్నావంటే నిన్ను ఏ రకమైన మనిషిగా సంభోదించాలో నీకునువ్వు ఆలోచించుకో.. పెత్తందారీ ముఠా నాయకుడైన చంద్రబాబుకు నువ్వు వంత పాడుతున్నావంటే నువ్వెలాంటి వాడివో రాష్ట్రప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమౌతుంది. బందిపోటు రాజకీయమే బాబు పాలన మార్క్ చంద్రబాబు ఈ రాష్ట్రప్రజలకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడు..? ఆయన పాలనలో పేదలకు మంచి చేసిన మార్క్ ఏంటి..? ఆ విషయం చెప్పుకోలేనోళ్లు ఇవాళ రాష్ట్రంలో బందిపోట్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పేదలకు అవసరమైన వైద్యాలయాలన్నీ నిర్వీర్యం చేయడం బందిపోట్ల పరిపాలన కాదా..? అదే, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. పేదవాడికి అందుబాటులో వైద్యనిలయాలున్నాయి. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్‌లు, మండలస్థాయిలో ప్రైమరీ హెల్త్ క్లినిక్‌లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఏరియా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, పాత ఆస్పత్రి భవనాలన్నింటినీ నాడు - నేడు కింద బాగుచేయడం అనేది బందిపోట్ల పాలన అంటారా..? పేదపిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను తీసుకుంటే నీ హయాంలో ఏ ఒక్క పాఠశాలనైనా బాగు చేయగలిగావా..? ..ఇవాళ నాడు-నేడు కింద స్కూళ్ల భవనాలను సుందరంగా తీర్చిదిద్దడాన్ని బందిపోట్ల పాలన అంటారా..? ఏ రంగం తీసుకున్నా.. 14 ఏళ్ల పరిపాలనలో నీ మార్కేంటి..? రాష్ట్రంలో ఫలానా ప్రాజెక్టు నీ బ్రెయిన్ చైల్డ్‌గా చెప్పుకునే దమ్ముందా..? నీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాగలిగావా.? ఏమీ చేయలేని నువ్వొక పెద్ద అభివృద్ధి దార్శనీకుడవని నీ తొత్తులు చేసే భజన మేం వినాల్నా..? ఏంటి నీ బందిపోటు రాజకీయం..? ఇకనైనా నీ బోడి మాటలు కట్టిపెట్టు. నీకులా మాకు మాట్లాడటం చేతగాదా..? మేమేమీ చదువుకోలేదా..? నీకన్నా ఎక్కువే చదివి రాజకీయాల్లో ఉన్నామని గుర్తించు. దివంగత వైఎస్ఆర్ బ్రెయిన్‌చైల్డ్ ఉత్తరాంధ్ర సృజలస్రవంతి ఉత్తరాంధ్ర సృజలస్రవంతి కోసం నువ్వు కల గన్నావా..? ఏం మాట్లాడుతున్నావు..? ఆ ప్రాజెక్టు ఎవరి బ్రెయిన్‌చైల్డ్..? దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు పోలవరం దగ్గర్నుంచీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తీసుకురావాలని ప్రాజెక్టును రూపకల్పన చేశారు. పోలవరం లెఫ్ట్‌కెనాల్‌ను విశాఖపట్టణం వరకు ఆయనే తవ్వించారు. ఉత్తరాంధ్ర సృజలస్రవంతికి శాంక్షన్ ఇచ్చి ఇక్కడ్నుంచి విజయనగరం వరకు నీటిని పంపాలని చూస్తే.. సరిగ్గా వారు దిగిపోయేనాటికి చంద్రబాబు 2018లో మరో జీవో ఇచ్చాడు. అంటే, దీన్నిబట్టి ఉత్తరాంధ్ర సృజలస్రవంతి గురించి ఎవరు కలగన్నట్టు..? చంద్రబాబూ.. నీ హాయంలో ఉత్తరాంధ్ర సృజలస్రవంతి ప్రాజెక్టు కోసం ఒక్క ఎకరా భూమినైనా సేకరించావా..? కనీసం, నీ హయాంలో భూసేకరణ అథారిటీనైనా ఏర్పాటు చేశావా..? నువ్వు ఏమీ చేయకపోతే.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మేం భూమిని సేకరించాం. ఇప్పటికే భూసేకరణ పూర్తిచేసుకుని పనులు మొదలుపెట్టబోతున్నాం. ప్రేమోత్సవం కబుర్లే గానీ.. టూరిజంకు నువ్వేం వెలగబెట్టావ్..? విశాఖపట్టణంలో టూరిజం అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావా..? గతంలో నువ్వేం మాట్లాడావో మరిచావా..? విశాఖలో ప్రేమోత్సవం పెడతానన్నావు గుర్తుందా..? గతంలో గోవాలో జరిగిందంట.. దాన్ని తెచ్చి విశాఖలో పెడతానన్నది నువ్వేకదా..? మరి, పెట్టావా..? ఇదంతా నా సొంత కవిత్వం కాదు. మీ ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసిందే మాట్లాడుతున్నాను. ప్రేమోత్సవంలో ప్రతీ జంటకూ ఒక ఇండివిడ్యువల్ టెంట్ ఏర్పాటు, మూడు రోజులపాటు బికినీలతో షోలని చెప్పావే..? ఇవ్వన్నీ మేం మరిచిపోయామా..? నీ ప్రేమోత్సవాలు.. కామోత్సవాలన్నీ ప్రజలకింకా గుర్తున్నాయి. ఇవాళ ఇక్కడకొచ్చి వైజాగ్ నుంచి భావనపాడు వరకూ బీచ్‌రోడ్ వేస్తానంటే.. నీ 14 ఏళ్లు అధికారంలో ఏం గాడిదలు కాశావు..? అప్పట్లో చేయని టూరిజం అభివృద్ధి... రేపు చేస్తానంటే నీ మాటలు నమ్మేది ఎవరయ్యా ..? నీ కల్లబొల్లి కబుర్లు కట్టిపెడితే మంచిది. 4 పోర్టులు, హార్బర్లతో తీరప్రాంత అభివృద్ధిప్రదాత జగన్‌గారు రాష్ట్రంలో సుమారు 975 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంటే నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో నువ్వు చేసిందేంటి.? ఎక్కడైనా ఒక ఇటుక పెడ్డ గానీ ఒక సిమెంట్ బస్తాగానీ వేశావా..? ఎన్ని హార్బర్లు, పోర్టులు మంజూరు చేశావు..? అదే జగన్మోహన్రెడ్డి గారి హయాంలో ఇవాళ 4 పోర్టులు నిర్మాణమవుతున్నాయి. మూలపేట, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టు, మచిలీపట్నం, రామాయపట్టణం పోర్టులు శరవేగంగా పనులు జరుగుతోన్నాయి. మరి, నీ హయాంలో ఇవ్వనీ చేయడం నీకు చేతకాలేదా..? నీ ఊహకందని అభివృద్ధి ఇది. ప్రతీ జిల్లాలో హార్బర్లు మంజూరు చేశారు. ఇప్పటికే 4 హార్బర్లు కూడా పూర్తయ్యాయి. అలాంటిది, నువ్వు ఇప్పుడొచ్చి కోస్టల్లైన్లో రోడ్లు వేసేదేముంది..? అభివృద్ధి చేసేదేముంది..? నీ చేతగానితనం చూసింతర్వాతే ప్రజలు నిన్ను నీ పార్టీని మూలనకూర్చోబెట్టారు. పారిశ్రామికాభివృద్ధిపై నీ ఉత్తకబుర్లు ప్రజలకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడుతున్నావే..? నువ్వు తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెబుతావా చంద్రబాబూ..? భోగాపురం ఏయిర్పోర్టు, మూలపేట పోర్టు, బుడగట్లపాడు హార్బర్లను కట్టడంతో పాటు నువ్వులపేట ఎఫ్ఎల్సీని హార్బర్‌గా మార్చబోతున్నాం. చింతపల్లి జెట్టీని మేం కడుతున్నాం. భీమిలి దగ్గర అదనంగా మరో జెట్టీ ఇచ్చాం. పోర్టుకోసం 4,600 ఎకరాల ల్యాండ్‌బ్యాంకును సిద్ధం చేసి ఉంచాం. మరి, నీ హయాంలో నువ్వు చేసిందేంటి..? చెప్పుకోవడానికి నువ్వు చేసిందేమీలేదు. అది చేస్తా.. ఇది చేస్తాననే నీ ఉత్తకబుర్లును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. బాబు వయసుకు మాటలకు పొంతన ఉందా? రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని ఊదరగొట్టుకునే నీకు ఎదుటి మనిషిని గౌరవించడం తెలియదా..? నువ్వు మా నోట్లో సీసం పోస్తానంటావా..? దొబ్బెస్తారంటావా..? బొక్కేశారంటావా.?? బూతులు నీకేనా.. మాకు రావా..? నీ భాషకు నీ వయస్సుకేమైనా సంబంధం ఉందా..? నీ నోటికేదొస్తే అది మాట్లాడటం కాదు చంద్రబాబూ.. ? మేమూ అధికారంలో ఉన్నాం. నువ్వు నోట్లో సీసం పోస్తే.. మేం నీ నవరంధ్రాల్లోనూ అదే సీసం పోయగలం. ఇందులో మాకేం మొహమాటం లేదు. ఇప్పటికైనా నీ వయస్సును నువ్వు గుర్తు తెచ్చుకుని ఎందుకంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావో.. సమాధానం చెప్పు. రుషికొండపై నీ పిచ్చివాగుడు కట్టిపెడితే మంచిది రుషికొండ జపం చేసే బాబూ.. నిన్నొక ప్రశ్న అడుగుతున్నాను. గతంలో రుషికొండపై రిసార్టు కొండమీద కట్టలేదా..? కొండను తొలిచి హరిత బీచ్ రిసార్టు కట్టలేదా.. జవాబివ్వు..? దాన్ని ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్యక్రమం అక్కడ జరుగుతోంది. మరి, రామోజీరావు రామోజీఫిల్మ్సిటీని ఎక్కడ కట్టాడు..? కట్టింది కొండమీద కాదా..? రామానాయుడు స్టూడియోను కూడా కొండతొలిచి కట్టిందే కదా..? మధురవాడ ఐటీ ఎస్ఈజెడ్ కొండలమీదనే కదా కట్టింది..? అంటే, మీరు కట్టినప్పుడు అవన్నీ ప్రకృతికి అనుకూలం..? మేం కడితే మాత్రం ప్రకృతికి ప్రతికూలమా..? రుషికొండపై మేం ఇవాళ కట్టేది ప్రైవేటు భవనాలేమీ కాదు. అవన్నీ ప్రభుత్వ భవనాలే గనుక నీ పిచ్చివాగుడు కట్టిపెడితే మంచిది. ఉద్దానం ఆస్పత్రిపై నీ బడాయి మాటలు చాలించు ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఆస్పత్రి నువ్వు కట్టించావా..? నువ్వు ఆ రోజు ఇచ్చిన శాంక్షన్ ఆర్డర్ ఏంటి..? ప్రైవేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కళాశాలల సంఘం ఆధ్వర్యంలో వాళ్లు ఒక ఆస్పత్రి పెట్టుకుంటానంటే నువ్వు భూమివ్వాలని ఆర్డర్ ఇచ్చావు గానీ.. కిడ్నీ డయాలసిస్ సెంటర్ కోసం కాదే..? పైగా, నువ్వు వచ్చి ఇక్కడ 200 పడకల ఆస్పత్రి ఇచ్చానని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా..? నువ్వు మనిషివా..? మృగానివా..? సూదికొండ దోపిడీ చేస్తానంటే ఊరుకునేదిలేదు సూదికొండ గురించి నువ్వు నా మీద అభాండాలేయడం కాదు. ఎవడైతే సూదికొండను దోచేద్దామని పనిచేస్తున్నాడో వాడి మెడలోనే నువ్వు కండువా వేశావని తెలుసుకో.. నేనిప్పుడు ఒక విషయం చెబుతున్నా.. నా ప్రాణం ఉండగా సూదికొండపై ఎవడినీ చేయి వేయనివ్వనని హెచ్చరిస్తున్నా గుర్తుపెట్టుకోండి.. 6.72 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్‌గారిది ఇంటికో ఉద్యోగం ఇస్తానని నాడు యువనేస్తం పేరిట చంద్రబాబు యువమోసం చేసింది చాలక.. మళ్లీ ఇప్పుడొచ్చి అదేమాట మాట్లాడుతున్నాడు. అది నోరా.. తాడిమట్టా..? ఆయన హయాంలో 70 లక్షల టీచర్ల ఉద్యోగాలిచ్చానంటాడు. అసలు, అంతమంది విద్యార్థులే లేరుకదా..? మరి, టీచర్ల పోస్టులు అన్నెలా ఇచ్చావు..? అదే జగన్మోహన్రెడ్డి గారు అధికారంలోకొచ్చాక కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కలిపి 6.72 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఉత్తరాంధ్రలో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే చంద్రబాబు బందిపోటు రాజకీయాలను అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు లేరు. ఒకప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని అక్రమ కేసులు పెట్టారో.. గిరిజన కుటుంబాలు ఇళ్లూవాకిళ్లు, ఊళ్లు వదిలిపెట్టి అడవుల బాట పట్టారో అందరికీ తెలుసు. కానీ, జగన్మోహన్రెడ్డి పాలనలో అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వ సంక్షేమం నేరుగా పేదల ఖాతాలకు చేరుతుంటే ఆనందంగా జీవనం గడుపుతున్నారు. ఎవరి హయాంలో పరిపాలన ఎంత సంతోషంగా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు గనుక రేపటి ఎన్నికల్లోనూ ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని ధీమాగా చెబుతున్నాం అని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. -
చంద్రబాబూ.. డైలాగులు చెబితే సరిపోదు!
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం... ప్రజలంతా ఫ్రస్టేషన్లో ఉన్నారు... ఇవన్నీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న డైలాగులు. ఇవన్నీ పాత డైలాగులే అయినా, కొత్తగా చెబుతున్నట్లు కనిపిస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా నిజమేనా అన్నదానికి సమాధానం దొరకదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం అంటే ఏమిటి? ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పనులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయనే కదా.. చంద్రబాబు సొదగా నిత్యం చెప్పేది. ఇక్కడే ఆయనలో బహురూపి కనిపిస్తాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే పనులన్నీ తాను చేస్తానని అంటారు. కావాలంటే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తానని చెబుతారు. మరి అది రాష్ట్రాన్ని నాశనం చేయడం అవ్వదా అంటే జవాబు దొరకదు. అదేమంటే తాము సంపద సృష్టించి ఖర్చు చేస్తామని చంద్రబాబు ఒక పిచ్చి డైలాగు చెబుతారు. అదెలాగో మాత్రం వివరించరు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఈ నాలుగేళ్లు పూర్తిగా వ్యతిరేకించారు. అనేక నిందలు మోపారు. దానివల్ల రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేశారు. వలంటీర్లు అంటే ఏమిటి? వారు చేసేది ఏమిటి? మూటలు మోసే ఉద్యోగం. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారు! అని చంద్రబాబు విమర్శించేసేవారు. ఈయన దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లు ఆడవాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారని దారుణమైన నీచమైన ఆరోపణ చేశారు. ఇవి విన్నవారికి ఏమినిపిస్తుంది. ఓహో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలన్నీ తొలగిస్తారు కాబోలు అనుకుంటే, అందరిని ఆశ్చర్యపరచే విధంగా ప్రకటన చేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం ఐదువేల రూపాయలను పదివేల రూపాయలు చేస్తామని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదువేలు ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్న చంద్రబాబు ఇప్పుడు రెట్టింపు వేతనం ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడతానంటే జనం ఎవరైనా నమ్ముతారా! గతంలో 2014లో లక్ష కోట్ల రుణాల మాఫీ చేస్తానని అంటే చంద్రబాబును నమ్మి ఓటేసిన వారిని ఎలా నట్టేట ముంచింది తెలిసిన వారంతా ఆయన ఏదో ఒకటి ఇలాగే చెబుతారులే అని సరిపెట్టుకుంటున్నారు. అసలు విశ్వసనీయతతో నిమిత్తం లేకుండా మాట్లాడడం అంటే ఇది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్దాప్య పెన్షన్లను రెండువేల నుంచి మూడువేల రూపాయలకు పెంచితే రాష్ట్రం నాశనం అయినట్లు కదా! ఆ మాట నేరుగా చెప్పకపోయినా, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే కదా చంద్రబాబు చెబుతూ వస్తోంది. మరి తాను అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయల పెన్షన్ ఇస్తానని అంటున్నారు. అది బొంకడమా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాంటి హామీనే ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే చంద్రబాబు కూడా పొరపాటున అధికారంలోకి వస్తే అలాగే చేస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం ఉండదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు చేయూత స్కీమ్ కింద ఏడాదికి 18750 రూపాయలు ఇస్తుంటే రాష్ట్రం పాడైపోతోందని చంద్రబాబు బృందం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఆయన మీడియా ప్రచారం చేసింది. చిత్రంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వాగ్ధానాలలో ప్రతి మహిళకు 1500 ఇస్తానని అంటున్నారు. అప్పుడు రాష్ట్రం పాడవదా? అంటే సమాధానం ఉండదు. అమ్మ ఒడి కింద స్కూల్‌కు వెళ్లే పిల్లల కోసం పదిహేను వేలు ఇస్తానంటే డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని పరోక్షంగా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు అదే స్కీమ్‌కు తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అక్కడితో ఆగలేదు. సంసారాలు చేసుకునేవారంతా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఒక దిక్కుమాలిన సలహా ఇస్తున్నారు. రైతు భరోసా కింద వైఎస్ జగన్మోహన్రెడ్డి 13500 ఇస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నది వీరి మనసులో మాట. కానీ 2024 ఎన్నికలలో రైతులను మోసం చేయడానికి ఏకంగా ఇరవైవేల చొప్పున ఇస్తానని అంటున్నారు. గతంలో రుణమాఫీ చేస్తానని చెప్పి జనాన్ని ఆ తర్వాత ఆశపోతులన్నట్లుగా ఇప్పుడు మాత్రం దూషించరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా అనేది ఆయనే.వలంటీర్ల సేవలను నిమ్మగడ్డ ద్వారా నిలుపుదల చేయించిన తర్వాత లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు కదా! అని చెప్పింది చంద్రబాబే! ఇవన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఇంతకీ ఏ రకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరికి అర్దం కాదు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసింది చెప్పరు. తాను ఇన్ని పోర్టులు నిర్మింప చేశానని చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టులను నిర్మిస్తున్న ఘనత పొందారు. అవే కాదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే కదా! అయినా రాష్ట్రం నాశనం అయిందని అంటారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నిర్మించడం, 800 గ్రామాలకు వాటర్ స్కీమ్ అమలు చేయడం రాష్ట్రాన్ని పాడు చేయడమా? లేక తన పద్నాలుగేళ్ల పాలనలో ఆ ఆస్పత్రి నిర్మించని చంద్రబాబు రాష్ట్రాన్ని పాడు చేసినట్లా? రాజధాని అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను సమీకరించి పంటలు లేకుండా చేసిన చంద్రబాబు విధ్వంసానికి పాల్పడినట్లా? కాదా! అన్ని హంగులు ఉన్న విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా లక్ష కోట్లు ఆదా చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేసినట్లా!ప్రతిదానికి ఒక సినిమా డైలాగు మాదిరి చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించాలని అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్లు కాదు. విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్‌ను నిర్మించడం ద్వారా వేలాది మందిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తే రాష్ట్రం ఏ రకంగా నాశనం అవుతుంది? మరి అదే పని చంద్రబాబు తన పాలనలో ఎందుకు చేయలేకపోయారు? బడులకు రంగులేస్తే సరిపోతుందా అని అంటారు. మరి తన హయాంలో వాటిని బాగు చేయడానికి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పరు. ఆస్పత్రులను వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగు చేస్తే రాష్ట్రం పాడైందట. చంద్రబాబు పట్టించుకోకుండా ఉంటే అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరిగినట్లా? ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక స్థాయిలో అవసరం లేదని అంటారు. అలాంటప్పుడు తన కొడుకును, మనుమడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదంటే మాత్రం నోరు పెగలదు. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు. ప్రభుత్వ స్కూళ్లలో ఉంటే తప్పని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కాపాడతారట. ముప్పైఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే రాష్ట్రం పాడైపోయినట్లు.. తన హయాంలో ఒక్క ఇల్లు కట్టకుండా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేసినట్లా? పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి నిర్మాణాలు చేస్తుంటే రాష్ట్రం ఎలా నాశనం అవుతుందో తెలియదు. చంద్రబాబు టరమ్‌లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాకపోయినా, రాష్ట్రాన్ని బాగా అభివృద్ది చేసినట్లు! ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి అడ్డగోలు మీడియాను అడ్డం పెట్టుకుని పడికట్టు డైలాగులు చెబితే సరిపోదు. స్పష్టంగా ఏ రకంగా రాష్ట్రం నష్టపోతోంది చెప్పి, ఆ తర్వాత తాను ఏమి చేస్తానో చెప్పగలిగితే ఆలోచించవచ్చు. కేవలం ప్రజలను భ్రమలలో పెట్టాలన్న దృష్టితోనే ఇలాంటి మాటలు చెబితే ప్రజలు ఎవరు అభివృద్ది చేసేది, ఎవరు చేయనిది అర్ధం చేసుకోగలరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పవన్ కల్యాణ్ Vs పవన్ కల్యాణ్.. పిఠాపురంలో విచిత్ర పరిస్థితి
పనివాడు పందిరి వేస్తె పిచ్చుకలొచ్చి పడగొట్టాయి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బుగ్గైపోతోంది. గతంలో జగన్‌ను సీఎం కానివ్వను.. ఇది శాసనం.. అని భారీ డైలాగులు కొట్టిన పవన్ కట్ చేస్తే గాజువాక, భీమవరం రెండుచోట్లా ఓడిపోయారు. ఇటు జగన్ రాజాలాగా సీఎంగా అసెంబ్లీకి వెళ్లారు. ఈసారి కూడా పవన్ గట్టిగానే మాట్లాడారు. హే జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కేస్తా అన్నారు... డైలాగ్ ఐతే ఎవరో రాసింది సులువుగా చెప్పేశారు కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తొక్కడం సంగతి అటుంచి ఈ భారీ డైలాగ్స్ పవన్ పాలిట సంకటంలా మారాయి. ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా డిసైడైన పవన్ భూతవైద్యులు, కోయదొరలను, ఎరుకలసాని, గవ్వలు రాళ్లతో భవిష్యత్ చెప్పేవాళ్ళు, కొండదొరలను సైతం సంప్రదించి..చంద్రబాబు సలహాతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండేచోట పిఠాపురంలో పోటీ చేయాలనీ డిసైడయ్యారు. ఎంసెట్‌లో రెండుసార్లు మూడేసి లక్షల ర్యాంకులతో కుదేలైపోయి ఏందీ.. ఈసారీ ఎంసెట్ రాలేదా.. అదేంటి.. బాగా చదవాలమ్మా అని చుట్టాలు ఇచ్చే బోడి సలహాలతో విసిగిపోయి...సిగ్గుతో చచ్చిపోయిన పిల్లాడిమాదిరి పరువుపోగొట్టుకున్న పవన్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో అయినా ఎంసెట్ కొట్టాలన్న స్టూడెంట్ లెక్క ఈపాలి ఎలాగైనా అసెంబ్లీలో అధ్యక్షా అనాలన్న కసిమీద ఉన్నారు. అందుకే పిఠాపురంలో గెలుపుకోసం గతంలో తాను పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించిన వర్మ ఇంటికే వెళ్లి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. నా గెలుపు నీ చేతిలో ఉందంటూ పవన్ మోకరిల్లారు.. సరే వర్మ పని చేస్తాడు అనుకుంటున్న తరుణంలో ఈయన పిఠాపురం వెళ్లేసరికి అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు.. ఆయనకూడా అచ్చం ఈయన మాదిరిగానే మెడ మీద చెయ్యివేసి రుద్దుకుంటూ... సరిగ్గా నిలబడకుండా ఊగిపోతూహ..హ..అంటుంటే ఎవుడ్రా నువ్వూ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నించారట.. ఏయ్ నేను పవన్ కళ్యాణ్.. ఎస్..నేనే పవన్ కళ్యాణ్ అంటున్నారాయన..ఇంతకూ ఎవరా అని చూస్తే అయన నవరంగ్ నేషనల్ పార్టీ అభ్యర్థి అని, అయన పేరుకూడా కె. పవన్ కళ్యాణ్ అని, తాను పిఠాపురంలో బకెట్ గుర్తు మీద పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానని అయన అంటున్నారు. ఆ బకెట్ గుర్తు చూడడానికి గాజు గ్లాసు గుర్తు మాదిరిగానే ఉండడంతో నిరక్షరాస్యులు ఓటేసేటపుడు గందరగోళానికి గురై గాజు గ్లాసును బదులుగా ఈ బకెట్ గుర్తుమీద నొక్కేస్తే ఎలా అని జనసేనాని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓ రెండు మూడు వేల ఓట్లు ఆ బకెట్ గుర్తు పాలైనా తనకు ఓటమి తప్పదని జనసేనాని టెన్షన్ పడుతున్నారు. అందుకే దరిద్రుడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదలడం లేదని పెద్దలు అంటారు. -సిమ్మాదిరప్పన్న. -
Memantha Siddham Photos: జననేతను చూసేందుకు.. కరచాలనం.. మాట కలిపేందుకు.. ఫొటోల కోసం ఆరాటం (ఫోటోలు)
-
Memantha Siddham Photos: గన్నవరం.. అభిమాన సంద్రం (ఫోటోలు)
-
మేమంతా సిద్ధం : అడుగడునా సీఎం జగన్‌కు జననీరాజనం (ఫొటోలు)
-
సరికొత్త నినాదంతో జనంలోకి YSRCP
గుంటూరు, సాక్షి: నిలువెల్లా విషం నింపేసుకున్న రాజకీయ ప్రత్యర్థులు.. అక్కసుతో ఆయనపై రాళ్లు వేయించారు. పైగా సింపథీ డ్రామాలంటూ ఎల్లో మీడియా ద్వారా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. కానీ, సీఎం జగన్‌ది ఉక్కు సంకల్పం. సంయమనంతో వ్యవహరిస్తూ.. నొప్పిని భరిస్తూనే చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. పచ్చ కుట్రల్ని అర్థం చేసుకుంటున్నారు గనుకే జనం సైతం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త స్లోగన్ తెరపైకి రాగా.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కొన్నాళ్ల కిందట సిద్ధం.. పేరుతో ఎన్నికల సమరశంఖారావం పూరించారు సీఎం జగన్. కేవలం రెండు అక్షరాలతోనే షెడ్యూల్ రాకముందే ఎన్నికల వాతావరణం సృష్టించగలిగారాయాన. అంతేకాదు దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో నాలుగు సిద్ధం సభల్ని నిర్వహించి.. అశేష ప్రజా స్పందన దక్కించుకున్నారు. సిద్ధంను కాపీ కొట్టి మేము కూడా సిద్ధం, సంసిద్ధం అంటూ విపక్షాలు ప్రచారం చేసుకున్నాయేగానీ అవి అస్సలు వర్కవుట్ కాలేదు. ఆపై కొత్తగా ఎన్ని స్లోగనులు తెచ్చినా.. జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ టైమ్ లో వైసీపీ మరో సరికొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రతో ముందుకు వచ్చింది. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్ని మినహాయించి 21 రోజుల యాత్రను చేపట్టారు సీఎం జగన్. మేమంతా సిద్ధంలోనూ సీఎం జగన్‌కు బ్రహ్మరథమే పడుతున్నారు జనం. ఇక ఇప్పుడు.. జగన్ కోసం సిద్ధం అంటూ మరో కొత్త స్లోగన్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి సంబంధించి ప్రచారాల విషయంలో వైఎస్సార్సీపీ మొదటి నుంచి దూకుడునే ప్రదర్శిస్తోంది. వైవిధ్యతతో జనాల్ని ఆకట్టుకోగలగడమే కాకుండా.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ విషయంలో అనుకూల మీడియా, ఆస్థాన రచయితలు ఉన్న టీడీపీ మాత్రం ప్రచార వ్యూహాల్లో వైఎస్సార్సీపీకి దరిదాపుల్లోకి రాలేకపోవడం గమనార్హం. -
ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుంచి తప్పించుకోగలిగానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైద్యులు విశ్రాంతి సూచించడంతో ఒక్కరోజు విరామం అనంతరం.. సోమవారం ఉదయం కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించారాయన. అయితే యాత్ర ప్రారంభానికి ముందు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నేతలు సీఎం జగన్‌ను కలిసి పరామర్శించారు. ‘‘ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి. ధైర్యంగా అడుగులు ముందుకు వేద్ధాం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీర్వాదం నుంచే దాడి నుంచి తప్పించుకున్నా. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ఎలాంటి దాడులు మనల్ని ఆపలేవు’’ అని సీఎం జగన్, పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని సీఎం జగన్ దృష్టికి వైఎస్సార్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చిన నేతలందరినీ అందరినీ చిరునవ్వుతో పలకరించిన సీఎం జగన్.. ఆ తర్వాత యాత్రను ప్రారంభించారు. 👉: గాయంతోనే మేమంతా సిద్ధం యాత్రకు సీఎం జగన్ (ఫొటోలు) -
‘‘రాళ్లతో కొట్టండి.. మసి చేయండి!’’.. ఇంత జరిగినా మారని బాబు తీరు
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఏమన్నారో గమనించారా! తనకు ప్రత్యర్ధిగా ఉన్న వేరే పార్టీ నేతను రాళ్లతో కొట్టండి అని చెబుతున్నారు. పైగా ఆ నేతను ఉద్దేశించి దున్నపోతు అని కూడా సంబోధిస్తున్నారు. మరో సందర్భంలో ఏమన్నారంటే తమ్ముళ్లూ మనం కొట్టే దెబ్బకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మసి అయిపోవాలి.. తెలుగుదేశం కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. టీడీపీ కార్యకర్తలు ప్రత్యర్దులపై రాళ్లతో దాడి చేయాలనే చెప్పడమే కదా! వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను పట్టుకుని అంతమాట అన్నారంటే మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది కదా! ఈ వీడియోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు చూపించారు. ఇవి విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయిన ఎవరో టీడీపీ దుండగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసిరారని వైఎస్సార్సీపీ వారు అనుకోవడంలో తప్పు ఏమి ఉంటుంది? ఆ అనుమానం నిజమా? కాదా? అన్నది పోలీసులు నిర్ధారిస్తారు. ప్రాథమికంగా చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికు రాజకీయంగా ఉన్న ప్రధాన ప్రత్యర్ధి పార్టీపైనే సందేహాలు వస్తాయి. దానికి తగినట్లుగానే ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు స్పందించిన తీరు కూడా పలు సంశయాలు కలిగిస్తుంది. చంద్రబాబేమో కొంత తెలివిగా దాడిని ఖండిస్తూ నిష్పాక్షిక విచారణ చేయించి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. అంటే దాని అర్దం ఏమిటి? ఇది దుండగులు చేసిన పని అయినా, అధికారులను తప్పు పట్టే రీతిలో ఆయన మాట్లాడారు. ఓకే! అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరడం తప్పుకాదు. కానీ అందులో కూడా అంతర్లీనంగా మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, రాయి వేసిన వారిని కాపాడాలన్న భావన ఆయనలో ఉన్నట్లు అనిపించదా! మరుసటి రోజుకు మాట మార్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వచ్చి పడింది గులకరాయి అని నీచ ప్రచారం ఆరంభించారు. చంద్రబాబు అలా మాట్లాడితే అధికారిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్య దారుణంగా ఉంది. "కమలాసన్" అంటూ ఎద్దేవ చేస్తూ ఇదంతా డ్రామా అన్నట్లుగా వ్యాఖ్యానించింది. దీనికి ,చంద్రబాబుకు సంబంధం ఉండదా? అంటే.. కచ్చితంగా ఉంటుంది. ప్రతి దానిలోను ఆయన డబుల్ గేమ్ ఆడుతుంటారు. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం అయినా, వలంటీర్ల సంగతి అయినా, మోదీ, సోనియాలపై వ్యాఖ్యలు అయినా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడి యుటర్న్ తీసుకోవడం ఆయనకు సర్వసాధారణం. చంద్రబాబు దాదాపు పద్నాలుగేళ్లపాటు సీఎంగా ఉన్నారు. పదిహేనేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంత సీనియర్ ఎంత మర్యాదగా, ఎంత హుందాగా ఉండాలి! కానీ తన రాజకీయ స్వార్దం ముందు ఆయనకు అవేవి అక్కర్లేదు. అదే తనను ఎవరైనా పొరపాటున ఏమైన అంటే మాత్రం అమ్మో.. నన్ను అన్నారు.. నేను ప్రజల కోసం పడతాను అంటూ డ్రామా రక్తి కట్టిస్తారు. ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా అంతా తబలా వాయిస్తాయి. ఆయన మాత్రం ఎదుటి వ్యక్తిని ఎంత మాట పడితే అంత అనేస్తారు. కొన్నిసార్లు అసలు ఈయన మతి ఉండి మాట్లాడుతున్నారా అన్న సంశయం కూడా వస్తుంది. టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణిస్తూ ప్రకటనలు చేశారు. కోడికత్తి-2 అంటూ వ్యంగ్య వ్యాఖ్యనాలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏకంగా ఆ రాయి తాడేపల్లి పాలస్ నుంచి వచ్చిందంటూ ఒక పిచ్చి వ్యాఖ్య చేసి తన రాజకీయ అపరిపక్వతను, పిల్ల చేష్టను తెలియచేసుకున్నారు. జనసేన నేత నాగబాబు మాత్రం తొలుత అభ్యంతర వ్యాఖ్య చేసి తదుపరి దానిని తీసివేసి పద్దతిగా ఖండించారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.. ఏ నాయకుడి మీద ఎలాంటి దాడి జరిగినా, ముందుగా అంతా ఖండించాలి. తమ పార్టీపై ఏదైనా ఆరోపణ వస్తే అది నిజం కాకపోతే అంతవరకు చెప్పవచ్చు. మరి అధికార పార్టీ తమపై ఆరోపణ చేయవచ్చా అని ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బాధిత స్థానంలో ఉంది. తన అనుమానాన్ని వెల్లడించింది. అందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పోలీసుల దర్యాప్తులో ఇలాంటివన్నీ తేలే అవకాశం ఉంటుంది. అంతెందుకు! ఏపీలో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డా, వారిలో ఒకరిని వైఎస్సార్సీపీ పార్టీ అని పులిమి ఈనాడు మీడియా ప్రచారం చేయడం లేదా? రాష్ట్రంలో జరిగే చిన్న నేరమైనా, పెద్ద నేరమైనా, దానిని వైఎస్సార్సీపీకి అంటకట్టే విధంగా అది వైఎస్సార్సీపీ నేతల పనే అనుకుంటున్నారని ఈనాడు మీడియా ఎందుకు నిర్లజ్జగా రాస్తోంది. దానిని తప్పు అని తెలుగుదేశం వారు అనడం లేదే! పైగా ఈనాడు మీడియా వాగడం, టీడీపీ ప్రచారానికి పెట్టడం, రాష్ట్రంలో ఏదో అయిపోయిందన్న తప్పుడు భావన కలిగించే యత్నం చేయడం నిత్యకృత్యం అయిందే. అందువల్ల వైఎస్సార్సీపీ నేతలు తమకు ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి ఆధారంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వంటివారు తన ప్రసంగాలలో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోలను చూపిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు వైఎస్సార్‌సీపీవారిని బట్టలూడదీసి కొడతాం అని ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అందువల్లే టీడీపీ అభిమాని లేదా, కార్యకర్త, లేదా మూర్ఖుడు ఎవరైనా మానసికంగా పర్వర్ట్ గా మారి ఇలా దాడి చేశారు అన్న అభిప్రాయం కలగదా! గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా విజయవాడ నగర వీధులలో వేలాది జనం తండోపతండాలుగా తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ప్రకటిస్తుంటే చూసి ఓర్వలేనివారు ఇలాంటి ఘాతుకానికి పాల్పడినట్లు అర్థం అవడం లేదా!రాయలసీమలో ఆరంభం అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్ యాత్ర మొదటి నుంచి ఒక రికార్డు స్థాయిలో జనాదరణ పొందుతోంది. రాయలసీమ ఆయనకు బాగా పట్టుఉన్న ప్రాంతం కనుక వచ్చారులే అనుకుంటే గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో అదే స్థాయిలో జనం రావడం టీడీపీ వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దాంతో వారికి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతవరకు తమకు కూడా విజయావకాశాలు ఉంటాయని ఆశతో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నిరాశ ఆవరించే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి బలహీనవర్గాలవారు, మహిళలు, పిల్లలు వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్ యాత్రలో పాల్గొని ఆయనకు సంఘీబావం ప్రకటిస్తున్న వైనం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఐదేళ్ల పాలన తర్వాత ఈ స్థాయిలో ఇలాంటి జన స్పందన రాలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనం వీదులలోకి వచ్చి స్వాగతం చెప్పారు. కానీ ఏడేళ్ల పాలన తర్వాత ఎన్టీఆర్ జనంలోకి వెళితే స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. ఆయన 1989లో తొలుత ఉమ్మడి ఏపీలో మేడ్చల్ వద్ద సభ పెడితే కేవలం కొద్ది వందల మంది మాత్రమే సభకు వచ్చారు. అప్పుడే టీడీపీ ఆ ఎన్నికలలో ఓడిపోతుందని అర్దం అయింది. చివరికి ఎన్టీఆర్ సైతం కల్వకుర్తిలో ఓటమి చెందారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయం చూస్తే ఆయనేమీ సినీ నటుడు కాదు. పెద్ద అందగాడు కాదు. గొప్ప వక్త అని కూడా చెప్పలేం. కానీ తాను చెప్పదలచుకున్నది ప్రజలకు అర్దం అయ్యేలా స్పష్టంగా చెబుతూ, ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ స్పీచ్ ఇస్తుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో తీసుకువచ్చినన్ని సంస్కరణలు మరే సీఎం తీసుకురాలేదన్నది పచ్చి నిజం. అలాగే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఈయనే. ఇన్ని అభివృద్ది పనులు చేపట్టింది కూడా జగనే. వీటన్నిటి ఫలితమే ఐదేళ్ల పాలన తర్వాత స్వచ్ఛందంగా ప్రజలు ఆయనను చూడడానికి తరలివస్తున్నారు. దీనిని గమనించే చంద్రబాబు నాయుడు తాను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరే చేస్తానని చెప్పవలసి వచ్చింది. ఒకదఫా సీఎంగా జగన్ పాలనను.. డెబ్బై ఐదేళ్ల వృద్దుడు అయిన చంద్రబాబు తాను కూడా కొనసాగిస్తానని చెప్పడమే పెద్ద విజయం కాదని ఎవరైనా అనగలరా! వలంటీర్ల మొదలు, అమ్మ ఒడి వంటి స్కీముల వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డినే చంద్రబాబు ఫాలో అయ్యే పరిస్థితి రావడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుభూతి కోసం నాటకాలు ఆడవలసిన అవసరం లేదని తేటతెల్లం అవుతోంది. టీడీపీ వారు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వారి కంగాళీతనం బయటపడుతోందన్నమాట. గత ఎన్నికల ప్రచారం సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో ఒక కత్తితో ఒక యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి చేశాడు. అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గన్ లేదా కాట్ బాల్ పంగలకర్ర వంటి దానితో రాయి లేదా పెల్లెట్ పెట్టి కొట్టి ఉండాలి. అందువల్లే అంత పదునుగా గాయం అయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటి పై భాగాన తగిలి గాయం అయింది. అదే పొరపాటున నవరగంత వద్ద తగిలి ఉంటే ఎంత ప్రమాదమో ఊహించుకోవడమే కష్టం. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ప్రాథమిక చికిత్స తీసుకుని మళ్లీ జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. జనం ఆయన బస్ వెంట పరుగులు తీస్తూ అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త.. అని చెప్పారంటేనే ఆయనపై వారిలో ఎంత ప్రేమ ఏర్పడిందో తెలుస్తుంది. అంతగా ప్రజలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కనెక్ట్ అయ్యారని అర్దం. సానుభూతి కోసం ఎవరైనా కన్ను పోగొట్టుకుంటారా? ప్రాణం పోగొట్టుకుంటారా? ఇంత నీచంగా మాట్లాడతారా? 2003లో చంద్రబాబు నాయుడు తిరుమల వెళుతుండగా, అలిపిరి వద్ద బాంబులు పేలాయి. ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా పరామర్శకు వెళ్లి, తిరుపతిలో ఈ దాడికి నిరసనగా దీక్ష చేశారు. ఆ రోజు ఆయన అంత హుందగా ఉంటే, ఈరోజున తెలుగుదేశం పార్టీ ఇంత ఘోరంగా వ్యవహరించింది. అప్పుడు అదంతా నక్సల్స్ పని అని పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చారు కానీ, పోలీసుల నిర్లక్ష్యం అంటూ డైవర్ట్ చేసే యత్నం చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం కానీ, ఆ పార్టీ మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, దుండగులను కాపాడే యత్నం చేయడం దుర్మార్గంగా కనిపిస్తుంది. నిజానికి ఇలాంటి ఘటనలు సృష్టించడంలో కానీ, సానుభూతి డ్రామాలు ఆడడంలో కానీ టీడీపీకి ఉన్న అనుభవం తక్కువేమీ కాదు. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్.బి స్టేడియంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రామా అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మల్లెల బాబ్జి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అలిపిరి బ్లాస్ట్ తర్వాత చాలా రోజులు చంద్రబాబు కట్టు కట్టుకుని తిరిగే వారు. సానుభూతి వస్తుందని అనుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ క్రమంలో చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో చేతికి కట్టు తగిలించుకుంటున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత రోశయ్య గమనించి, నిమ్స్ డాక్టర్లను ఉద్దేశించి చమత్కారంగా ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబుకు పొరపాటున ఒక చేతికి బదులు మరో చేతికి కట్టు తగిలిస్తున్నారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కట్టు లేకుండానే తిరిగారు. ప్రజలలో అలజడి కోసం ఎలాంటి అశాంతి నైనా సృష్టించాలన్నది చంద్రబాబు విధానంగా ఉంటుందని పలువురు టీడీపీ నేతలు చెబుతుంటారు. మాజీ మంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు జిల్లాలకు ఫోన్లు చేయించి బస్‌లు దగ్దం చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. బంద్ అంటే బస్‌ల అద్దాలు పగలకొట్టడమో, బస్‌లు దగ్ధం చేయడమో జరగకపోతే ఎలా అని.. ఈ చంద్రబాబు అంటారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో కూడా ప్రస్తావించారు. అమిత్ షా పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు నల్ల బెలూన్లు సెక్యూరిటీకి విఘాతం కలిగించేలా ఎగురవేశారు. పుంగనూరు, ఆంగళ్లు వద్ద టీడీపీ కార్యకర్తలను దాడులు చేయాలని రెచ్చగొట్టారు. టీడీపీ కార్యకర్తలు పోలీసు వ్యాన్ దహనం చేయడమే కాకుండా, రాళ్లు విసరడంతో ఒక పోలీసు కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఇదంతా చంద్రబాబు నైజం అని అంతా తెలుసుకున్నారు. రాజమండ్రి, కందుకూరు, గుంటూరులలో తన వల్ల తొక్కిసలాట జరిగి అనేక మంది తెలిసినా, మొత్తం పోలీసులపై తోసేసి చంద్రబాబు తప్పించుకున్నారు. ఆయన కుట్రదారుడిగా ముద్ర పొందినా, దానిని కనిపించనివ్వకుండా, రామోజీ, రాధాకృష్ణ వంటి మీడియా ప్రముఖులు కవర్ చేసేసి చాలా పవిత్రుడుగా చూపించే యత్నం చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు దొరికిపోతుంటారు. అందుకు ఉదాహరణే తాజాగా రాళ్లతో కొట్టండి.. మసి చేయండి అని అన్న చంద్రబాబు వ్యాఖ్యల వీడియోలు. సోషల్ మీడియా రాబట్టి ఈ మాత్రం అయినా ప్రజలకు తెలుస్తోంది. లేకుంటే ఎల్లో మీడియా ప్రజలను ఎప్పటికి మోసం చేస్తూనే ఉండేది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిని పక్కదారి పట్టించడానికి టీడీపీ కూటమి ఏదైనా ప్లాన్ చేస్తుందా అన్న డౌటు కూడా చాలమందిలో ఉంది. అనుకున్నట్లే ఆదివారం సాయంత్రానికి తనపైన రాళ్లు పడ్డాయని చంద్రబాబు సీన్ సృష్టించారు. అది నిజమా? కాదా? అన్నది తేలవలసి ఉంటుంది. పవన్ కల్యాణ్‌పై కూడా దాడి జరిగిందని చంద్రబాబు చెప్పేశారు. తీరా చూస్తే పవన్ కల్యాణ్‌పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం అయింది. దీనిని బట్టే వీరు ఎలా ప్రవర్తిస్తున్నది అర్థం కావడం లేదా! అందువల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు అనండి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనండి.. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించారు. తన నొప్పిని భరిస్తూ జనంతో మమేకం అయిన తీరు అభినందనీయం. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Memantha Siddham Photos: గాయంతోనే మేమంతా సిద్ధం యాత్రకు సీఎం జగన్ (ఫొటోలు)
-
జగనన్నే మా సీఎం.. మేము సైతం సిద్ధం
బిడ్డ ఎలా ఉన్నాడోనని ఓ తల్లి.. కొడుకు ఏం చేస్తున్నాడోనని ఓ తండ్రి.. అన్నకేమైందోనని ఓ చెల్లి, తమ్ముడు.. ఇలా జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా ఆదరించే ప్రతి ఒక్కరూ తమ నేతను చూడాలని మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా వెల్లువెత్తున్నారు.. వారిలో ఎవరిని కదిపినా..ఎందుకొచ్చారని అడిగినా.. వారు పొందిన సంక్షేమం జగన్ పై అభిమానం ఉప్పొంగుతోంది.. చంద్రబాబుపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు.. బాధతో కన్నీరులొకుతున్నారు.. కుట్రలపై కోపోద్రిక్తులవుతున్నారు.. ఇలాంటి దృశ్యాలెన్నో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరం భారీగా చేరుకుంటున్న జనం, వైఎస్సార్ సిపి శ్రేణులు జననేత, సంక్షేమ సారథిపై జరిగిన దాడితో యావత్ రాష్ట్రం రగిలిపోతోంది. పచ్చ కుట్రలను చేధిస్తూ.. మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. బస్సు యాత్రలో అప్యాయ పలకరింపులతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడికెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఈ క్రమంలో.. చిన్న వట్టిపల్లి నుండి గన్నవరం తరలి వెళ్తున్న యువత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గారిని చూడాలనిపెదవాడపల్లి నుండి వెళుతున్న దివ్యాంగుడు వేల్పుల బాలరాజు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మాలాంటి వాళ్లు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాము. చాలామందికి పించను ఇస్తున్నారు. నాకైతే ఇళ్ల స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కట్టించారు. మా పిల్లలకి చదువుకునేందుకు డబ్బులు ఇస్తున్నారు. లాప్టాప్ కూడా ఇచ్చారు. మా ఊళ్లో చాలామందికి అమ్మ ఒడి డబ్బులు పడుతున్నాయి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఒక్కటీ రాలేదు. టిడిపి అధికారంలోకి వస్తే పేదల బతుకులు బుగ్గి పాలవుతాయి. మళ్లీ జగనే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జుజ్జవరపు విజయకుమార్, తెన్నేరు, పెనమలూరు మండలం నాపేరు ఎం. ప్రసాద్. మాది ఉంగుటూరు మండలం గన్నవరం నియోజకవర్గం పొనుకుమాడు. నాకు పింఛను.. మా ఆవిడకి కాపునేస్తం... నాకు రైతు భరోసా ఇస్తున్నారు..మా కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంది. చంద్రబాబు కుట్రలను ప్రజలు తెలుసుకుంటున్నారు. పెన్షన్లు అందకుండా పేదల ఉసురు పోసుకున్నారు. పేదల ఇబ్బందులకు చంద్రబాబే కారణం. ఆయన మనుషులే కేసులు వేసారు. దానివల్లే పెన్షన్ ఇంటికి ఇవ్వకుండా ఆపారు. ఈ సారి తగిన బుద్ధి చెపేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు మంచి చేస్తున్న జగన్ కే మా మద్దతు. మా నాయకుడు మా మంచి కోసం మా ఊరు వస్తున్నాడు. ఆయన్ని చూడటం ఎంతో సంతోషం ఎం. ప్రసాద్, పొనుకుమాడు సీఎం జగన్ ప్రభుత్వంలో నాకు సొంతింటి కల నెరవేరింది. మా పాపకు అమ్మ ఒడి వస్తుంది. మా అమ్మకు వద్దప్ప పింఛన్ వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు పన్నిన సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలేరు. మా అభిమాన నాయకుడు జగన్‌ను కనులారా చూసేందుకు మండుటెండ సైతం లెక్కచేయకుండా వేచి చూస్తున్నాం. చంద్రబాబు పుట్టిన రాజకీయం వల్ల వృద్ధులు పింఛన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎలాంటి వారు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. నాతో పాటు మా కుటుంబ సభ్యులందరి ఓట్లు కూడా జగన్ గారికి. జగన్‌ను రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తీరుతాం. మాధవి ఆత్కూరు, ఉంగుటూరు మండలం. -
ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
Live Updates.. కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహా సముద్రం కనిపిస్తోంది ఇది ప్రజల సముద్రం మే 13వ తేదీన జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడిన ప్రజల సముద్రం ఇది ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న దమ్ములకు, నా అవ్వా-తాతలకు, ప్రతీ ఒక్కరికీ మీ బిడ్డ హృదయ పూర్వకంగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సమర శంఖం పూరిద్దామా.. ప్రజల సంక్షేమం కోసం, పేదల భవిష్యత్ కోసం, పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలన్నీ కొనసాగించేందుకు, ప్రతీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, పెత్తందార్లపై యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున.. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు. మీ జగన్‌పై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్‌ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే. విప్లవాత్మక మార్పులు మీ బిడ్డ పాలనలో జరిగాయి జన్మభూమి కమిటీలతో చంద్రబాబు గ్రామాలను దోచేశాడు పెట్టుబడి సాయంగా రైతన్నకు రైతు భరోసా ఇస్తున్నాం ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చింది మీ జగన్.. మీ బిడ్డ పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా ఉంటున్నాం 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం మనం చేసిన మార్పులతో పెత్తందార్ల కడుపు మండుతోంది 58 నెలల్లోనే మీ బిడ్డ సంక్షేమాన్ని మీ ఇంటికి తీసుకొచ్చాడు ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్క్ కనిపిస్తోంది రూ. 3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదే గ్రామ సచివాలయాల ద్వారా 600పైగా సేవలు రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయంటే మీ జగన్. 10 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయంటే మీ జగన్ 10 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు అంటే మీ జగన్ ఎయిర్పోర్ట్ విస్తరణ అంటే మీ జగన్ కొత్త భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వాయువేగంతో జరుగుతున్నాయంటే మీ జగన్ మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు, 10 ఇండస్ట్రీయల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్ ప్రణాళిక బద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయంటే మీ జగన్ వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా వస్తున్నామంటే మీ జగన్ మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించి 99శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది. మరి వారి జెండా నలుగురితో జత కట్టినా ఎగరలేక కింద పడుతోంది మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా.. వద్దా? మరి ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా.. వద్దా.. అందుకే మళ్లీ చెబుతున్నా.. ఈ ఎన్నికల్లో ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. రాబోయే ఐదేళ్లలో మీ భవిష్యత్‌ను నిర్ణయించేవే ఈ ఎన్నికలు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుంటాయనే ఆలోచన చేయండి అలా ఆలోచన చేసి ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుందనే విషయం గుర్తు పెట్టుకోండి చంద్రబాబు కూటమి చరిత్రను కూడా ప్రతీ ఇంటికి వెళ్లి వివరించండి 2014లో చంద్రబాబు అండ్ కో కూటమిగా ఏర్పడి ప్రజలను మోసం చేసిన వైనాన్ని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి మనందరి నమ్మకం సీఎం జగన్: కొడాలి నాని సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్ ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారు చంద్రబాబుది మాయా కూటమి సీఎం జగన్‌ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడు దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్‌ను కాపాడాయి గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ జై జగన్ నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం కాసేపట్లో గుడివాడలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ మేమంతా సిద్ధం సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు మేమంతా సిద్ధం అంటూ నినదిస్తున్న అభిమాన తరంగం గుడివాడ మేమంతా సిద్ధం సభలో జనప్రభంజనం జై జగన్ నినాదాలతో హోరెత్తుతున్న సభా ప్రాంగణం మేమంతా సిద్ధం సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ కృష్ణాజిల్లా: గుడివాడలో జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం సభ బహిరంగ సభకు అవనిగడ్డ నుంచి వేలాదిగా తరలి వెళ్లిన కార్యకర్తలు అభిమానులు జెండా ఊపి బస్సులను ప్రారంభించిన అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ గుడివాడ నియోజకవర్గం పుట్టగుంటలో సీఎం వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికిన ప్రజలు మరి కాసేపట్లో జొన్నపాడు వద్ద భోజనం విరామం హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సీఎం జగన్‌కు భారీగా స్వాగతం పలుకుతున్న ప్రజానికం ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన సీఎం జగన్ మనకు దేవుడి దయ, ప్రజల ఆశ్వీరాదం ఉంది. ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. ధైర్యంగా ముందుకు అడుగువేద్దాం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ►తేలప్రోలుకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర ►అడుగడుగునా హారతులు, పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు ►ఆత్కూరు దాటి ముందుకు సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర.. ►గన్నవరం జంక్షన్ చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర. ►ప్రజలతో కిక్కిరిసిన గన్నవరం రహదారులు ►సీఎం జగన్‌కి దారిపొడవునా గన్నవరం ప్రజల అపూర్వ స్వాగతం గన్నవరంలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న గన్నవరంవాసులు జనసంద్రమైన గన్నవరం. టీడీపీ కుట్రలకు ఓటుతోనే బుద్ధి చెబుతామంటున్న గన్నవరంవాసులు జనం సమస్యలు వింటూ.. దాడి తర్వాత తొలిసారి ప్రజల్లోకి సీఎం జగన్ కేసరపల్లిలో యాత్ర ప్రారంభమైన కాసేపటికే.. 100 మీటర్ల పరిధిలో రెండుసార్లు బస్సు నుంచి బయటకు వచ్చిన సీఎం జగన్ బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్న సీఎం జగన్ ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కేసరపల్లి నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర దాడి ఘటనలో గాయపడిన సీఎం జగన్.. విశ్రాంతి తీసుకుని ఒక్కరోజు విరామంతో యాత్ర చేపట్టిన సీఎం జగన్ నిఘా నీడలో కొనసాగనున్న యాత్ర సీఎం జగన్ పర్యటించే ప్రాంతాల్లో నిశితంగా పరిశీలించనున్న అధికారులు పూలు జల్లడం, క్రేన్లతో గజమాలలపై ఆంక్షలు విధించిన అధికారులు సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభ జనసంద్రంగా మారిన గన్నవరం ఉక్కు సంకల్పంతో ముందుకు సాగనున్న యాత్ర సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కేసరపల్లి క్యాంప్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు దేవినేని గౌతమ్, దేవినేని స్మిత, కాంగ్రెస్ నేత.. ఉక్కు కాకాని రామ్మోహన్ రావు మనవడు కాకాని విజయ్ కుమార్ సీఎం జగన్ సమక్షంలో వైస్సార్సీపీలో చేరిక ►జన సంక్షేమ సారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరంకు భారీగా చేరుకుంటున్న జనం, వైఎస్సార్సీపీ శ్రేణులు. మరికాసేపట్లో కేసరపల్లి నుంచి ప్రారంభంకానున్న బస్సు యాత్ర ► వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కృష్ణా జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2024 ► బస్సు యాత్రలో భాగంగా గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. Memantha Siddham Yatra, Day -15. ఉదయం 9 గంటలకు కేసరపల్లి దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడులో మేమంతా సిద్ధం సభ ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/4V7r6jxFey — YSR Congress Party (@YSRCParty) April 15, 2024 ► గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రతి రోజు ఓ జైత్రయాత్రలా కొనసాగుతోంది. అడుగడుగునా సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది మేమంతా సిద్ధం 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 15) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్ , పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. చదవండి: ఇది ఖచ్చితంగా క్లాస్ వార్.. పేదలపై పెత్తందారుల దాడి -
‘సీఎం జగన్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది’
06:15 PM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి దారుణం: కేశినేని నాని అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు దీని వెనుక పెద్ద కుట్ర ఉంది బోండా ఉమా రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు దాడికి చంద్రబాబు, లోకేష్, బోండా ఉమానే కారణం విజయవాడలో అల్లర్లు సృష్టించాలన్నదే చంద్రబాబు కుట్ర దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలి 05:50 PM, April 14th 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ హరికృష్ణ నేతృత్వంలో ఆరుగురు ఏసీపీలతో టాస్క్‌ఫోర్స్ ఘటనా స్థలంలో ఇప్పటికే పలు దఫాలు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు, సెల్ టవర్ల లోకేషన్ల ఆధారంగా పోలీసుల విచారణ ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు 05:46 PM, April 14th 2024 సీఎం జగన్‌పై అక్కసుతోనే దాడికి పాల్పడ్డారు: వెల్లంపల్లి జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు సీఎం జగన్‌కు తీవ్ర గాయమైంది నా కంటికి కూడా గాయమైంది టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు, బోండా ఉమా రౌడియిజానికి తెరలేపారు అధికారం లేనప్పుడే వాళ్లు ఇలా చేశారు రేపు వాళ్లకు అధికారం ఇస్తే ఏమవుద్ది.. ఆలోచించండి ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి దాడులకు తెగబడటం దారణం చంద్రబాబు ఎందుకు ఇంత దిగజారిపోయారు చంద్రబాబు హయాంలోనే వంగవీటి రంగ హత్య జరిగింది దేవుడి ఆశీస్సుల వల్లే సీఎం జగన్‌కు ప్రమాదం తప్పింది ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి 05:18 PM, April 14th 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన: ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సీఈవోతో సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైఎస్సార్సీపీ నేతల భేటీ సీఎంపై దాడి వెనుక కుట్ర కోణం ఉందన్న వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం జగన్ ఎడమ కన్నుపై దాడి జరిగింది రాజకీయాలకు అతీతంగా పలు రాష్ట్రాల నేతలు ఖండించారు ఈ ఘటనను ప్రధాని సహా అందరూ ఖండించారు విపక్ష నేతలు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు దాడి ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు హేయం ఈ దాడి పథకం ప్రకారమే జరిగినట్టు స్పష్టం అవుతోంది ఆబ్జెక్ట్ చాలా ఫోర్స్‌తో జగన్ కంటిపై తగిలి వెల్లంపల్లి కంటికి తగిలింది కొంచెం ఉంటే వెల్లంపల్లి కన్నుపోయేది షార్ప్ షూటర్ గురి తప్పకుండా ఏదైనా ఎయిర్‌గన్ నుండి షూట్ చేసినట్టు తెలుస్తోంది పవర్ ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇది చేయలేరు ఈ అంశాలన్నీ ఈసీ దృష్టికి తీసుకెళ్లాం చంద్రబాబు, టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని ఈసీని కోరాం 05:07 PM, April 14th 2024 ఎన్టీఆర్ జిల్లా: ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సీఎం జగన్‌పై దాడిని నిరసిస్తూ జగ్గయ్య పేట బైపాస్ రోడ్డుపై నల్ల జెండాలతో నిరసన పాల్గొన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏపీలో సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు అండ్ కో రాళ్ల దాడి చేయిస్తున్నారు సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకోవడం చంద్రబాబు తరం కాదు సీఎం జగన్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యం, రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడే ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఓటమి పాలు అవుతుంది. ప్రజలు చంద్రబాబు ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. దాడిపై ఉన్నత స్థాయి కమిటీలతో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. 03:40 PM, April 14th 2024 విశాఖ: టీడీపీ నేతలకు దాడులు చేయడం కొత్త కాదు: వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్‌ను అంతమొందించాలని కూటమి నేతలు చూస్తున్నారు దాడులు అనేది టీడీపీ నేతల సంస్కృతి సీఎం జగన్ పై రాయితో చేసిన దాడి కాదు ఎయిర్ గన్ లాంటి బలమైన వస్తువుతో హత్యాయత్నం చేశారు 2019 ఎన్నికలకు ముందు ఇదేవిధంగా హత్యాయత్నం చేశారు సీఎం ప్రాణాలను కాపాడుకునే పనిలో మేముంటే, స్క్రిప్ట్‌లు రాసుకునే పనిలో టీడీపీ నేతలు ఉన్నారు వారే హత్యాయత్నానికి పాల్పడి వారే మళ్లీ మా పైన నెపం నెడుతున్నారు టీడీపీ నేతలకు దాడులు చేయడం కొత్త కాదు గతంలో కుటుంబ సభ్యులతో వచ్చిన అమిత్ షా పై రాళ్లదాడికి టీడీపీ నేతలు తెగబడ్డారు కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల దీవెనలు సీఎం జగన్ కు ఎన్నడూ ఉంటాయి 03:29 PM, April 14th 2024 విజయవాడ: సీఎం జగన్ పై దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలోనే ఉన్నాము సాక్షి టీవీతో ప్రత్యక్ష సాక్షి, డాబా కొట్టుల సెంటర్ నివాసి మహమ్మద్ షఫీ సింగ్ నగర్ ఫ్లై ఓవర్ నుండి ఆయనను ఫాలో అయ్యాము దాడికి పాల్పడిన వ్యక్తి దొరికి ఉంటే మహిళలే అతనికి తగిన శాస్తి చేసేవారు సీఎం కు దెబ్బ తగలగానే మహిళలంతా దాడి చేసిన వ్యక్తిని దూషించారు సీఎం జగన్ తో పాటే వెల్లంపల్లికి దెబ్బ తగలడం స్పష్టంగా కనిపించింది బలమైన దెబ్బ తగలగానే సీఎం జగన్ ఎంతో బాధకు గురయ్యారు సీఎం బాధకు లోనవడం మేమంతా స్పష్టంగా చూశాం 02:45 PM, April 14th 2024 తాడేపల్లి : సీఎం జగన్‌పై దాడి దుర్మార్గపు చర్య : ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీలోని పెద్దల ప్రోత్సాహం లేనిదే సీఎంపై దాడికి దిగలేరు దాడులకు పాల్పడాలనే ఆలోచనలే అమానుషం ఎన్ని కుట్రలు పన్నినా మళ్ళీ సీఎం జగనే భగవంతుడు, ప్రజలే జగన్‌ని కాపాడుకుంటారు 02:40 PM, April 14th 2024 విజయవాడ సీఎం వైఎస్ జగన్‌పై హత్నాయత్నం చాలా దారుణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సింగ్ నగర్ గంగానమ్మగుడి వద్ద వివేకానంద సెంటినరీ హైస్కూలు ప్రాంతంలో మల్లాదివిష్ణు పరిశీలన రాజకీయమనగా సీఎం వైఎస్ జగన్ ని ఎదుర్కోలేక హత్నాయత్నానికి పాల్పడ్డారు సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది సీఎంపై హత్యాయత్నం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉంది సీఎం వైఎస్ జగన్‌పై గత కొన్ని రోజులగా చంద్రబాబు చేస్తున్న దారుణ వ్యాఖ్యలు.. రెచ్చగొట్టే మాటలు చేస్తున్నాం ఇప్పటికే ఆధారాలతో చంద్రబాబు తీరుపై ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేశాం సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేస్తాం 02:26 PM, April 14th 2024 సీఎం జగన్ మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు ప్లాన్ ప్రకారం దాడి చేసినట్టు పోలీసుల ప్రాథమిక నిర్థారణ క్లూస్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం ఏసీపీ స్థాయి అధికారులతో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు 02:12 PM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి వెనక టీడీపీ: మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. వారిలా మేము కూడా సహనం కోల్పోతే.. టీడీపీ వారు రోడ్లపై తిరగగలరా..? నేను ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు దాడి జరిగిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర ఓ సారి పరిశీలించాలి టీడీపీ సోషల్ మీడియాలో చేసే పోస్టులు వారి నైజాన్ని తెలియజేస్తుంది సీఎం జగన్ ప్రజలను నమ్ముకున్నారు ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సీఎం జగన్ ను ఏమీ చెయ్యలేరు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది.. 02:04 PM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన కామెంట్స్ సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారు పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగింది చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు దాడులు జరిగాయి నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టాలని చెప్పాడు చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో దాడి చేశారు చాలా పకడ్బంధీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్‌తో దాడి చేశారు ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్నుకు తగిలింది దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్‌తో గాయంతో బయటపడ్డారు దీన్ని ఖండించాల్సిన కొందరు వ్యక్తులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు ఎన్నికల సందర్బంగా గుర్తింపు పొందిన తొమ్మిది సంస్థల సర్వేల్లో వైఎస్సార్సీపీకి భారీ మోజార్టీలు వస్తాయని చెప్పాయి. దీంతో, సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఇలా చేశారు విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి ఇలా దాడి చేశాయి ఒక సీఎం ప్రాణాలు తీయడానికే ప్రయత్నం జరిగిందంటే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉంది ఎంతో పక్కగా దాడి చేయబట్టే సీఎం జగన్‌కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలింది ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు పగలైనా, రాత్రి సమయంలోనైనా కరెంట్ తీసేస్తారు? ఈ విషయం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా? చంద్రబాబు బస్సుపై రోడ్ షోలు చేసేటప్పుడు కరెంట్ తీయలేదా? సీఎం జగనే కరెంట్ తీయించారని టీడీపీ నేత పిచ్చివాగుడు వాగుతున్నారు అధికారులపై యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నాడ సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను 01:30 PM, April 14th 2024 సీఎం జగన్‌పై రాళ్ల దాడి దారుణం.. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఘటనను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారు.. ఇది పిరికిపందల చర్య కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేది ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు ఎయిర్‌గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారు ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారు ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెబుతారు ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడారు కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరు ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదు. పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఇలా మాట్లాడతారా?. ప్రతీ చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారు నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్‌కు లేదు సింపతీతో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగింది చంద్రబాబు కూడా అందుకే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు కొట్టండి అంటూ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు అధికారం రాదన్న అసహనంతో ఇలా రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు రాజకీయ సిద్దాంతంలోనే ద్వేషం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం ఉన్నాయి. చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేతికి కట్టుతో వెళ్లి పాల్గొన్నాడు కానీ చంద్రబాబు డ్రామాలకు ప్రజలు బుద్ధి చెప్పారు చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తాడో దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఒక పుస్తకంలో రాశాడు సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని ఉన్న నాయకుడు ప్రజలతో ఇలానే మమేకం అవుతూ ముందుకు సాగుతారు 12:13 PM, April 14th 2024 సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ రెండు రకాలుగా దాడి జరగొచ్చని పోలీసులు అనుమానం వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య నుంచి రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం మరో వైపు వివేకానంద స్కూల్ నుండి దాడి చేసి ఉండొచ్చని అనుమానం తెరుచుకుని ఉన్న వివేకానంద స్కూల్లోని కొన్ని కిటికీలు వాటి నుండి ఎయిర్ గన్స్ తో క్యాటర్ బాల్ తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం దీంతో స్కూల్ నుండి దాడి జరగొచ్చన్న కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు స్కూల్‌కి గుడికి మధ్య నుండి చెట్ల మధ్య నుండి దాడి జరగొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు కుడివైపు జన సమూహం ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుండి దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం పూర్తిగా చీకటిగా, చెట్లు ఉండడంతో ఎవరికీ కనిపించని నిందితుడు దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానం కేవలం 20 నుండి 30 అడుగుల దూరం నుండే సీఎం జగన్ ని టార్గెట్ చేసిన టీడీపీ గుండాలు సీఎం జగన్‌ని బలంగా కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే దాడి 10:44 AM, April 14th 2024 సీఎం జగన్ పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్‌కి తగిలిన వెంటనే నాకు గాయమైంది ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు నాకు కను గుడ్డు మీద రేష్ అయ్యింది నాకు విపరీతంగా నొప్పి వస్తోంది సీఎం జగన్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకి ఫిర్యాదు చేశాను పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారించాలి చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు సీఎం జగన్ పైన ఈరోజు కుట్ర చేశాడు సిగ్గులేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే అలిపిరి బాంబు దాడిలో ఒక చేతికి గాయమైతే.. మరో చేతికి కట్టు కట్టించుకుని డ్రామా ఆడింది చంద్రబాబు కాదా స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయితే ఒంటి నిండా జబ్బులు ఉన్నాయని డ్రామా ఆడింది చంద్రబాబు కాదా ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని జైలులో పెడితే ఫైల్స్ ఉన్నాయని డ్రామా ఆడాడు వాళ్లు మా ముఖ్యమంత్రిని విమర్శిస్తారా? టీడీపీ నాయకులు నెల రోజుల్లోనే దీనికి మూల్యం చెల్లించక తప్పదు 10:54 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ మంత్రి రోజా రోడ్డుపై నిరసన పుత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మంత్రి ఆర్కే రోజా దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు పై చర్యలు తీసుకోవాలి సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర దాడి చేయించారు చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి 10:47 AM, April 14th 2024 లోకేష్, అచ్చెన్నాయుడు నోరు అదుపులోకి పెట్టుకోవాలి: ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బస్సు యాత్రలో సీఎం జగన్‌కి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు ఎన్టీఆర్ పై చెప్పులు, అమీత్ షా పై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుది నాకు తెలిసి రాజకీయాల్లో అత్యంత ధైర్యశాలి సీఎం జగన్ దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలి 10:30 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి పిరికపంద చర్య: వైఎస్ అవినాష్‌రెడ్డి సీఎం జగన్‌పై దాడిని ఖండించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విజయవాడ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రోడ్‌షో జరిగింది జగన్ వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు రోడ్ షోకు ఆటంకం కలిగించేందుకు దాడికి పాల్పడ్డారు. 10:20 AM, April 14th 2024 సీఎం జగన్‌పై జరిగిన దాడి వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నాడు అధికారం కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు 10:15 AM, April 14th 2024 సీఎం జగన్‌పై పథకం ప్రకారమే దాడి: వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలి దాడి చేసిన వెంటనే చంద్రబాబు మార్క్ రాజకీయం మొదలు పెట్టారు.. సీఎంపై దాడిని కూడా డ్రామా అనడం బాబు నైజం విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకు వస్తాయి.. 9:58 AM, April 14th 2024 కుట్ర కోణంలోనే సీఎం జగన్‌పై దాడి: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాడి ఘటనను కూడా టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారు దాడి తీవ్రత పెద్దదైనప్పటికీ.. సీఎం జగన్ మొక్కవోని సంకల్పంతో యాత్రను కొనసాగిస్తున్నారు ప్రజల్లో ఆదరణ కలిగిన వంగవీటి రంగాను సైతం చంద్రబాబు హత్య చేయించారు ప్రజల్లో సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక చంద్రబాబు, పవన్ ఈ తరహా దాడులకు పాల్పడ్డారు 9:50 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి అత్యంత భయానకం: మంత్రి మేరుగ నాగార్జున అదృష్టవశాత్తూ సీఎం ప్రాణాలతో బయటపడ్డారు సీఎం జగన్‌ను మట్టుబెట్టడానికే పక్కా ప్లాన్‌తో దాడి చంద్రబాబు రక్తచరిత్రలో ఇదో టైప్ హత్యాయత్నం దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉంది.. ఆ కోణంలోనే విచారణ జరపాలి సీఎం పై జరిగిన దాడి కేసును అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ విచారణ జరపాలి ఎల్లో మీడియా పిచ్చి రాతలు మానుకోవాలి 9:48 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి: మంత్రి వేణు పేదవాడిని సమర్థించే వ్యక్తిని దెబ్బతీయటానికి ప్రతిపక్షాలు చేసిన కుట్ర ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూడలేకే దాడులకు పాల్పడుతున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాల కుట్రలతో సీఎం జగన్‌కు మరింత ప్రజాదరణ పెరుగుతుంది జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి 9:46 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ తిరుపతిలో భూమన నిరసన దీక్ష సీఎం జగన్‌పై దాడిని ఖండించిన భూమన కరుణాకర్‌రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్ హత్య రాజకీయాలు నశించాలి రెండు మూడు నెలలు నుంచి సీఎం జగన్‌ను అంతం చేస్తామన్న మాటలు నిజం చేస్తున్నారు చంద్రబాబు హస్తాలు రక్తసిక్తమైనవి వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడు సీఎం జగన్‌ను అంతం చేయాలనే లక్ష్యంగా ఈ దాడి చేశారు 9:11 AM, April 14th 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్లూస్ టీం ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుంచి దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారించిన పోలీసులు 30 అడుగులు దూరం నుంచి దాడి చేసిన ఆగంతకుడు 9:01 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడిని ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోకేష్ వ్యాఖ్యలను గమనిస్తే దాడికి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తుంది ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్‌పై దాడి చేశారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారు సిద్దం సభలు, బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదు లోకేష్ ట్విట్టర్లో 2019 లో కోడి కత్తి, 2024లో రాయి దాడి అని పెట్టారు అయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతుంది ఎవరైనా రాయితో దూరం నుంచి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా? అదే రాయిని లోకేష్‌కి ఇస్తాం, అదే ప్రాంతంలో బస్సు ఎక్కి ఎవరితో అయినా రాయితో కొట్టించుకోవాలి అప్పుడు కరెక్ట్‌గా ప్లాన్ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యం అవుతుందో లేదో తెలుస్తుంది ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం గతంలో పాదయాత్రకు గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోందన్నారు కృష్ణా జిల్లా ఇంచార్జ్‌గా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశాం మళ్లీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో స్పందన రావడంతో ఈ కుట్రకు తెరలేపారు 8:10 AM, April 14th 2024 పాఠశాల నుంచే దాడి? దాడి జరిగిన ప్రాంతానికి 20 అడుగుల దూరంలోనే వివేకానంద స్కూలు మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉన్నట్లు గుర్తింపు పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే సెంట్రల్ టీడీపీ ఆఫీసు ఓ టీడీపీ నేత అనుచరుల వద్ద ఎయిర్‌గన్ వంటి మారణాయుధాలు 7:32 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి: స్పందించిన ప్రధాని మోదీ.. వైఎస్సార్సీపీ నేతలు.. జగన్ త్వరగా కోలుకోవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను -‘ఎక్స్’లో ప్రధాని మోదీ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను- స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై దాడి గురించి విని షాక్ అయ్యా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నా-మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హింసకు తావు లేదు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కఠినమైన ముందస్తు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. జగనన్నా.. జాగ్రత్తగా ఉండండి-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడి చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగింది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే దాడి చేస్తున్నారు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ కలిసినా జగన్‌ను ఏమీ చేయలేకపోతున్నామని, చివరికి దాడులకు పాల్పడుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలతో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు- మంత్రి అంబటి రాంబాబ ఓటమి భయంతోనే సీఎం జగన్‌పై దాడి ఓటమి భయంతోనే సీఎం వైఎస్ జగన్‌పైన టీడీపీ దాడులకు తెగబడుతోంది. సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుండటాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి ఇలాంటి దాడులకు, ఉడత ఊపులకు సీఎం భయపడరు రాజకీయంగా జగన్‌ను ఒంటరిగా ఢీకొట్టలేని టీడీపీ.. జనసేనను, బీజేపీని వెంట తెచ్చుకుంది- తానేటి వనిత, హోం శాఖ మంత్రి 7:13 AM, April 14th 2024 నేడు బస్సు యాత్రకు విరామం విజయవాడలో సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటర్లో టీడీపీ మూకల దాడిలో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై బలమైన గాయం వైద్యుల సలహా మేరకు ఆదివారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం తదుపరి షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ వెల్లడి 7:05 AM, April 14th 2024 వ్యూహం కాదిది.. ద్రోహం! కూటమిలో త్యాగం చేయాల్సి వస్తే బలవుతున్నది బీజేపీ, జనసేనే చంద్రబాబు, ఆయన బంధువర్గంలో మాత్రం అందరికీ టికెట్లు రాత్రికి రాత్రి వచ్చేవారిని కూడా.. అటూ ఇటూ పంపిస్తున్న బాబు ‘పచ్చ’ నేతలకు టికెట్లిచ్చి సొంత నేతలకు బీజేపీ, జనసేన ద్రోహం ప్రకటించిన వారిని కూడా బాబు ఆదేశాలతో మార్చేస్తున్న తీరు ఆఖరికి మాజీ సైనికుడికి ఇచ్చామంటున్న అనపర్తిపైనా బాబు కన్ను ఆ సీటును బీజేపీ నుంచి తీసుకోవటానికి ఎత్తుగడ.. వదినమ్మ ఓకే! బాలకృష్ణ వియ్యంకుడి కోసం విశాఖ నుంచి బీజేపీని పంపేసిన వైనం అనకాపల్లి ఇచ్చి.. అది తన బంటు సీఎం రమేశ్‌కే వచ్చేలా ఎత్తుగడ మొదటి నుంచీ బీజేపీని నమ్ముకున్న అగ్రనేతలకూ మొండిచెయ్యి జనసేనకు ఇచ్చిన సీట్లలో 70 శాతం టీడీపీ, ఇతర పార్టీల వారికే ఆరణి శ్రీనివాసులను బాబే పంపినట్లు తిరుపతిలో చెప్పిన పవన్ బాబు మార్కు రాజకీయాలతో కుదేలవుతున్న బీజేపీ, జనసేన శ్రేణులు అందుకే ఆగ్రహంతో వరసగా రాజీనామాలు 6:56 AM, April 14th 2024 జగన్‌కు భద్రత పెంచాలి: ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి ఇది కూటమి కుట్రే.. ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దాడులు కుట్రలు, కుతంత్రాలు పన్నినా జగన్‌ను ఎదుర్కొనటం సాధ్యం కాదు నువ్వు నిజంగానే సీఎం @ysjagan గారిపై జరిగిన దాడిని ఖండిచాలనుకుంటే మీ టీడీపీ అధికారిక అకౌంట్ నుంచి ఇంత నీచంగా ఎందుకు పోస్ట్ చేపించావ్ @ncbn? దాడి జరిగిన వెంటనే వరుసపెట్టి ఇంత నీచంగా మీ పార్టీ అకౌంట్ లో పోస్ట్ చేయించడం వెనుక నీ ఉద్దేశం ఏంటి చంద్రబాబూ? pic.twitter.com/mesAPqD7AF — YSR Congress Party (@YSRCParty) April 13, 2024 6:55 AM, April 14th 2024 ధ్వంస రచనే కూటమి కుతంత్రం సీఎం జగన్‌పై దాడి వెనుక చంద్రబాబు ముఠా భారీ కుట్ర ముందస్తు పన్నాగంతోనే పోలీసు అధికారులపై ఫిర్యాదులు పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొనే లక్ష్యం తద్వారా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహ రచన అందులో భాగంగానే ఐపీఎస్‌లపై పురందేశ్వరి ద్వారా చంద్రబాబు ఫిర్యాదు ఎవర్ని నియమించాలో కూడా చెప్పిన పచ్చ ముఠా తీవ్రంగా స్పందించిన అధికారులు.. పారని బాబు పాచిక దాంతో సీఎం యాత్రలో దాడులకు కుతంత్రం తద్వారా శాంతిభద్రతల సమస్య సృష్టించే కుట్ర దెబ్బ తగిలినా చిరునవ్వుతో సీఎం జగన్ శాంతి సందేశం సీఎం జగన్ సందేశంతో సంయమనం పాటించిన వైఎస్సార్సీపీ శ్రేణులు బెడిసికొట్టిన చంద్రబాబు కూటమి కుతంత్రం వైద్యులు సూచనల మేరకు కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళిన సీఎం @ysjagan. జగనన్న కు తగిలిన గాయాన్ని పరిశీలించి కుట్లు వేసిన వైద్యులు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందకండి, దయచేసి అందరూ సంయమనం పాటించండి. 🙏🏻 pic.twitter.com/L44H0sTSsY — YSR Congress Party (@YSRCParty) April 13, 2024 6:53 AM, April 14th 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం! సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర వారధి దాటిన దగ్గర్నుంచీ అడుగడుగునా జనం నీరాజనాలు రాత్రి 8.10 సమయంలో సింగ్‌నగర్‌లో జగన్ టార్గెట్‌గా దుశ్చర్య పథకం ప్రకారం ఒక స్కూల్ రెండో అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు అక్కడి నుంచి జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగటంతో.. తప్పిన గురి కనుబొమపై తీవ్ర గాయం.. పక్కకు తూలి.. గాయాన్ని అదిమి పట్టుకున్న జగన్ జనానికి అభివాదం చేస్తూనే బస్సులోకి.. ఆ వెంటనే ప్రథమ చికిత్స అనంతరం గాయంతోనే యాత్రను కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్ కనుబొమ పైన తగిలాక.. పక్కనున్న వెలంపల్లికీ గాయం ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి... పలు రకాలుగా నిపుణుల వ్యాఖ్యలు రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్... ఏదైనా కావచ్చని వ్యాఖ్యలు ఆ వేగాన్ని బట్టి చూస్తే.. అది కచ్చితంగా హత్యాయత్నమేనన్న వెలంపల్లి ఈ దురాగతానికి పాల్పడింది చంద్రబాబు నాయుడేనంటూ విమర్శలు ‘టప్’మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశినేని నాని షెడ్యూలు ప్రకారం రాత్రి 10.38 వరకూ సాగి... ముగిసిన యాత్ర అనంతరం నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోకల్ అనస్తీషియా ఇచ్చి.. కుట్లు వేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌కు సూచన.. నేడు యాత్రకు విరామం దాడిని.. బాబు వైఖరిని మూకుమ్మడిగా ఖండించిన వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసనలు ప్లాన్ చేసి చేయాల్సిన అవసరం రాజకీయ ప్రత్యర్థులదేనని వ్యాఖ్యలు దాడిని తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమత ఆకాంక్ష -
April 13th : ఏపీ ఎన్నికల సమాచారం..
April 13th AP Elections 2024 News Political Updates.. 08:40PM, April 13th 2024 నెల్లూరు: నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోటంరెడ్డి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ద్వజం రూరల్ నియోజకవర్గ ప్రజలను పీడించి.. బిల్డర్స్ ను బెదిరించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపాటు ఎన్నికల సమయంలో కోటంరెడ్డి.. జిమ్మిక్కుల రాజకీయం చేస్తారని.. ప్రజలెవ్వరు నమ్మొద్దని విజ్ఞప్తి. 08: 15PM, April 13th 2024 ఏలూరు జిల్లా: నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై ముద్ర బోయిన వెంకటేశ్వరరావు ఫైర్ నేను వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయానని పార్థసారథి వ్యాఖ్యానించటం పద్ధతి కాదు ఇప్పుడు నువ్వు టీడీపీకి, గతంలో నీ తండ్రి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అమ్ముడుపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పార్థసారథి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజలే నీకు బుద్ధి చెబుతారు నా కార్యకర్తలని ఫోన్లో బెదిరించటం పద్ధతి కాదు ఇద్దరం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పెనమలూరులో గాని నూజివీడులో గాని పోటీ చేద్దాం రా రెండు చోట్ల నా మీద ఒక ఓటు ఎక్కువ వచ్చినా నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా మళ్లీ నా కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటి ముందు బైఠాయిస్తా 03: 15PM, April 13th 2024 తిరుపతి జిల్లా: తిరుపతిలో వైఎస్సార్పీపీలోకి భారీగా చేరికలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరిన బిజేపి నాయకులు, నగర యువత తిరుపతి 19వ డివిజన్లోని బీజేపీ నాయకులు, నగర యువత పద్మావతీపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూమన అభియన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుపతి నగరాభివృద్ధిని చూసి వారంతా వైఎస్సార్సీపీలో చేరారు 02: 25PM, April 13th 2024 బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని లేఖ రాశావు మర్చిపోయావా చంద్రబాబు: మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రలోభాలు పెట్టి బీసీలను లొంగ తీసుకోవాలనుకున్నావు కులగణన పూలే జయంతి నాడు ప్రకటించాం... సజావుగా పూర్తి చేస్తాం.. కులగణన వివరాలు ప్రజలకు పంపిస్తాం కమిషన్లకు కక్కుర్తి పడి గతంలో నాణ్యత లోపం ఉన్న పనిముట్లను సరఫరా చేసావ్ సామాజిక సాధికారతకు నిలువెత్తు దర్పణం సీఎం జగన్ కులగణనకు భారతీయ జనతా పార్టీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి 02: 10PM, April 13th 2024 విశాఖపట్నం: బొత్స సత్యనారాయణ పాయింట్స్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు వ్యతిరేకమని కూటమి నేతలు చెప్పగలరా స్టీల్ ప్లాంట్‌పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి టిడిపి జనసేన బీజేపీకీ ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే లాబీయింగ్ చేసే సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాను అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడానికి స్థానికంగా ఉన్న బీసీ నేత టీడీపీకి దొరకలేదా వాలంటీర్లపై చంద్రబాబు మాటలు చూస్తుంటే నాలిక తాటిమట్ట అనే విధంగా ఉన్నాయి 02: 00PM, April 13th 2024 వైఎస్ఆర్ జిల్లా: పులివెందులలో షర్మిల, సునీత విమర్శలపై భగ్గుమన్న మహిళా కౌన్సిలర్లు షర్మిల, సునీత విమర్శలను తీవ్రంగా ఖండించిన కౌన్సిలర్లు అక్కచెల్లెల్లు ఇద్దరు కాంగ్రెస్ గెలిస్తే పులివెందులకు ఏం చేస్తారో చెప్పడం లేదు ఎప్పుడు హత్యలు, హంతుకులు అంటూ విమర్శలు చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి అంతేగానీ ఎంపి అవినాష్ రెడ్డి హంతకుడు.. సీఎం వైఎస్ జగన్ కాపాడాడు అంటూ మాట్లాడుతున్నారు షర్మిల ఒక్కరే కాదు.. మేము కూడా వైఎస్ఆర్ కుమార్తెలాంటి వారమే సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి చూడండి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలతో ఆదుకున్నారు రాష్టంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పదకాలు అమలువుతుంటే పధకాలు లేవంటున్నారు? ఎంపీ, సీఎంలపై అపనిందలు మోపడం మానుకోండి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడని అంటున్నారు.. మీరు చూశారా చెప్పండి? మీ లబ్ది కోసం వైఎస్ఆర్ కూతురినని తెలంగాణాకు వెళ్లి పార్టీ పెట్టారు అక్కడ పార్టీ మూసేసి మళ్లీ ఇక్కడికి వచ్చారు మీరు మాట్లాడినంత మాత్రనా ఇక్కడ వినేవారు ఎవరు లేరు మీ నీచపు రాజకీయాలు ఇక్కడ తరం కావు 2024 ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు ఎంపీ అవినాష్‌రెడ్డి 5 లక్షల మెజార్టీతోను, సీఎం వైఎస్ జగన్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం 01: 10PM, April 13th 2024 కాకినాడ జిల్లా కాకినాడ: మిధున్ రెడ్డి, రిజినల్ కోఆర్డినేటర్ కామెంట్లు పిఠాపురంలో వంగా గీతా బలమైన అభ్యర్ధి పవన్ కళ్యాణ్ రాకముందే ఆమె అక్కడ అభ్యర్ధిగా ఉన్నారు గతంలో ఎమ్మెల్యే గా వంగా గీతా పని చేశారు... నిత్యం ప్రజల్లో ఉంటారు యిబ్బందులు వస్తే ఎవరూ అందుబాటులో ఉంటారు అని ప్రజలు కోరుకుంటారు పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దత్తు ఇస్తారు పవన్ కళ్యాణ్ ను వాళ్ళ క్యాడరే చేరుకోలేరు ఆయన ఎక్కడ ఉండాడో తెలియదు.. ఎప్పుడు వస్తాడో తెలియదు పిఠాపురం పై మేము ప్రత్యేక దృష్టి పెట్టానవసరం లేదు 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి పిఠాపురం లో వైఎస్ఆర్ సిపి బలంగా ఉంది పిఠాపురంలో కష్టపడుకొవాల్సింది పవన్ కళ్యాణ్ డబ్బులకు ప్రజలు ఓట్లు వెయ్యరు నా సీటు నాకు ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ఇంత వరకు నేను పిఠాపురం లో అడుగు పెట్టింది లేదు తాను ఓడిపోతే చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు పవన్ కళ్యాణ్ కోసం పట్టించుకోనవసరం లేదు 01: 00PM, April 13th 2024 విశాఖపట్నం: బొత్స సత్యనారాయణ పాయింట్స్.. జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడని నాయకులు బీసీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ వంటివారు బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇస్తున్నారు మాత్యకారులను ఎమ్మేల్యేలుగా, మంత్రులుగా చేసే ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్ రానున్న ఎన్నికల్లో మత్స్యకారులకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు ఒక మత్స్యకారుడిని రాజ్య సభకు పంపించారు బలహీనవర్గాలంటే చంద్రబాబుకు, పవన్‌కు చిన్న చూపు మాయలు చేసే మాటలు మేము చెప్పము నా రాజకీయ భవిష్యత్తులో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదు మన పార్టీ బలహీనవర్గాల పార్టీ అని జగన్ నాతో అనేవారు 12: 30PM, April 13th 2024 చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి 58 నెలల మన పాలనను మీరు చూశారు గత చంద్రబాబు పాలనను మీరు చూశారు నాయకుడి ఎన్నికలో పొరపాటు చేస్తే మనం చేసేదీ ఏమీ ఉండదు మనం తీసుకునే నిర్ణయం సరైంది అయితే, మన అడుగులు ముందుకు పడతాయి చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు చంద్రబాబు గతంలో 98శాతం హామీలను ఎగ్గొట్టారు ఆప్కోకు కూడా చంద్రబాబు బకాయిలు పెట్టారు ఒక్కరికైనా చంద్రబాబు సెంట్ స్థలం ఇచ్చారా? మనం స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3,706 కోట్లు ఖర్చు చేశాం లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో డబ్బు జమ చేశాం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం 1.06 లక్షల మందికి లబ్ధి జరిగింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేశాం పెన్షన్ రూ.3వేలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది మంగళగిరిలో చేనేతలు ఎక్కువుగా ఉన్నారని, చేనేత మహిళకు సీటు ఇచ్చాం బీసీలు ఎక్కువగా ఉన్నా... చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు ఇవ్వరు 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం చేనేతలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం రెండు ఎమ్మెల్సీలు చేనేతలకు ఇచ్చాం 8 మంది మున్సిపల్ చైర్మన్లు చేనేతలకు ఇచ్చాం 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు నామినేటెడ్ పదవుల్లోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం చేనేత వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలిచాం మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ధి జరిగింది అక్కా చెల్లెమ్మలకు రూ.1530 కోట్ల లబ్ధి నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్ల లబ్ధి టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా 12: 00PM, April 13th 2024 విశాఖపట్నం: వాసుపల్లి గణేష్ పాయింట్స్.. చంద్రబాబుకు జగన్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది సీఎం జగన్ కాలి గోటికి చంద్రబాబు సరిపోడు మత్స్య కారులు తోలు తీస్తానని చంద్రబాబు బెదిరించారు నలుగురు మత్స్య కారులు కు ఎంఎల్ఏ సీట్లు సీఎం జగన్ ఇచ్చారు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తున్నారు మత్స్య కారులను చంద్రబాబు మోసం చేశారు మత్స్య కారులు చంద్రబాబు తోలు తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి 11:30AM, April 13th 2024 చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని చూడలేదు సిఎం శ్రీ వైఎస్ జగన్ కు పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరు జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు ది శ్రీ వైఎస్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అని నెరవేర్చారు 600 హామీలు ఇచ్చి, గెలిచిన వెంటనే మానిఫెస్టో కూడా కనపడకుండా చేశారు బాబు వస్తె జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగానే 2.5 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు 14 వేల కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు దానికి అదనంగా 10 వేల కోట్లు వడ్డీ కావడంతో సిఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఆ రుణాలు చెల్లించారు చంద్రబాబు మన ప్రాంతంలో మొయిస్తున్న మూడు ప్రాజెక్టులు అడ్డుకున్నారు ఎన్నికలు పూర్తి అవగానే ఆ కేసులు గెలిచి మళ్ళీ పనులు చేపడతాం కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బిజెపి నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, రాష్ట్రాన్ని విడగొడతాను అని డిల్లోలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారు హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారు రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తి నేడు బిజెపి నుండి రాజంపేట ఎంపిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు నాకంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మిథున్ భారీ మెజారిటీతో గెలిపించాలి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలని ప్రజలే సిద్దం గా ఉన్నారు ఎమ్మెల్యేగా నన్ను, ఎంపిగా శ్రీ మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా మీ రెండు అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుకుంటున్నా 11:00AM, April 13th 2024 విశాఖపట్నం: విశాఖ సౌత్ నియోజకవర్గంలో మళ్లీ మొదటకి వచ్చిన జనసేన పరిస్థితి వంశీకృష్ణకు వ్యతిరేకంగా సాదిక్ మీడియా సమావేశం మహ్మద్ సాదిక్ జనసేన నేత పాయింట్స్.. సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ వెనకబడి ఉన్నారు వైఎస్సార్సీపీ అభ్యర్థి రాకెట్లా దూసుకు వెళ్తున్నారు వంశీకృష్ణ సౌత్‌లో గెలిచే పరిస్థితి లేదు వంశీకృష్ణను సౌత్ నియోజకవర్గం నుంచి తప్పించాలి సౌత్ నియోజకవర్గంలో స్థానికులకే సీటు కేటాయించాలి వంశీ కృష్ణను అభ్యర్థిగా పెట్టడం వల్ల సౌత్‌లో జనసేన ఓడిపోతుంది 10:30AM, April 13th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సెల్ఫీ ఫోటో కోసం వచ్చిన అభిమానిపై బాలకృష్ణ దురుసు ప్రవర్తన కదిరి నుంచి సైకిల్ రావాలి యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ బాలకృష్ణ తీరుపై మండిపడుతున్న కదిరి వాసులు 10:00AM, April 13th 2024 తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో పచ్చబ్యాచ్(టీడీపీ నాయకులు) బరితెగింపు అభివృద్ధిని చూసి ఓర్వలేక శిలాఫలకాలు ధ్వంసం చంద్రగిరి అక్కగార్ల కాలనీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు వాటి పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్ రోడ్డు శిలాఫలకాలు రాత్రికిరాత్రి సుమారు నాలుగు ఫలకాలను ధ్వంసం చేసిన పచ్చమూకలు మండిపడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు 9:30AM, April 13th 2024 విశాఖపట్నం: వరుదు కళ్యాణి పాయింట్స్.. సీఎం జగన్ ప్రచారానికి విశేషమైన స్పందన లభిస్తోంది ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు ఎన్డీఏ అంటే నారా డిజాస్టర్ ఏలియన్స్‌గా మారింది కాల కూటమి విషంగా చంద్రబాబు, పవన్ పురంధేశ్వరి తయారయ్యారు ఎన్ని కూటములు వచ్చిన సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు వాలాంటిర్లను గంజాయి దొంగలుగా చంద్రబాబు విమర్శించారు 650 హామీలు ఇచ్చి ఒక హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు తల్లిని తిట్టించిన వారితో పవన్ ఎలా కలుస్తారు 9:00AM, April 13th 2024 విజయవాడ షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్‌ను నమ్మవద్దు: వైఎస్ విమలారెడ్డి షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూశాను అవినాష్ హత్య చేయడం ఎవరైనా చూసారా నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు వాళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు.. అతనికి కుటుంబం ఉంది ఏ పాపం చేయని భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి వైఎస్సార్‌ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు జగన్‌పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్‌కి వ్యతిరేకంగా ఉన్నారు రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా వైఎస్సార్ ఉన్నపుడు వివేకానందరెడ్డి కడప చూసుకున్నారు ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు అవినాష్‌పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి ఇదంతా చేస్తున్నారు జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానందరెడ్డి పనిచేశారు ప్రజలంతా సీఎం జగన్‌కి అండగా ఉండాలి మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి అవినాష్‌కు, జగన్‌కు ఓట్లు వేసి గెలిపించాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి 8:30AM, April 13th 2024 చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా: సీఎం జగన్ చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు. మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు. మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని… pic.twitter.com/0HTBkdXBch — YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2024 8:00AM, April 13th 2024 విజయవాడ బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైఖరితో బీజేపీలో మరో కీలకనేత రాజీనామా బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా చందు సాంబశివరావు ఏపీ బీజేపీ పురందేశ్వరి వైఖరి పట్ల బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తులు 7:40AM, April 13th 2024 తిరుపతి గ్రాండ్ రిడ్జి హోటల్ లో రాత్రి బిజెపి నేతలకు చేదు అనుభవం ఉమ్మడి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపుకు సహకరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం బిజెపి నేతల్ని పట్టించుకోక పోవడంతో రాత్రి అలిగి వెళ్లిపోయిన నాయకులు భానుప్రకాష్, శాంతారెడ్డి ఈరోజు ఉదయం 8.30 గంటలకు బిజెపి నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్ తిరుపతి అసెంబ్లీ స్థానం గెలుపుకు సహకరించాలని టిడిపి, జనసేన పార్టీ నాయకులను కోరిన పవన్ పవర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రాకులాట జనసేన, టిడిపి నాయకులును బ్రతిమలాడిన పవన్ తిరుపతి అసెంబ్లీ సీటు చంద్రబాబు స్వయంగా జనసేనకు ఇచ్చారు అని టిడిపి నేతలకు స్పష్టం చేసిన పవన్ ఖంగుతిన్న టీడిపి నేతలు 7:20AM, April 13th 2024 ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే! 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే! 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/LNccqje4Px — YSR Congress Party (@YSRCParty) April 12, 2024 7:00AM, April 13th 2024 నెల్లూరు జిల్లా.. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదు: విజయసాయిరెడ్డి రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి 2024 లో గెలిచిన తర్వాత సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కూడా ముందుంటుంది 2024 -2029 లోపల కందుకూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా కందుకూరులో పరిశ్రమలు తీసుకువస్తాం ఆ బాధ్యత మాదే 6:50AM, April 13th 2024 క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు.. ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. -ఎంపీ వైవీ సుబ్బారెడ్డి #TDPJSPBJPCollapse#TDPAgainistVolunteers#EndOfTDP pic.twitter.com/aNZoTdc6Ij — YSR Congress Party (@YSRCParty) April 12, 2024 6:40AM, April 13th 2024 మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ? పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయి: సీఎం జగన్ మీరే నా స్టార్ క్యాంపైనర్లు.. ప్రతి ఇంటికీ వెళ్లి మంచికి అండగా నిలబడమని కోరాలి చంద్రబాబుకు ఓటు వేయడమంటే.. మరోసారి మోసపోవడమే ఇంటికొస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు, వదినమ్మ వంత పాట ముగ్గురూ కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ 6:25AM, April 13th 2024 వైఎస్సార్సీపీని ఎదుర్కోలేకపోతున్నాం.. మన సభలకు స్పందన లేదు.. ఇలాగైతే ఎలా? కూటమి నేతల తర్జనభర్జన హాజరైన పవన్, బాబు, బీజేపీ ముఖ్య నేతలు కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ 6:20AM, April 13th 2024 ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా లోకేశ్ ఐ ఫోన్ ట్యాపింగ్ అంటూ టీడీపీ కొత్త నాటకం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అసలు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్ చేసే టెక్నాలజీనే లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఫోన్ ట్యాపింగ్, ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబే సిద్ధహస్తుడు 6:15 AM, April 13th 2024 దొరికాడు దొంగ ‘స్కిల్’బెడిసికొట్టి కటకటాల్లోకి.. సీమెన్స్ కంపెనీ ముసుగులో భారీ దోపిడీ కుట్రదారు,లబ్దిదారు చంద్రబాబే A1 చంద్రబాబు అరెస్ట్... అవినీతి నెట్వర్క్ ద్వారాచంద్రబాబు బంగ్లాకు రూ.241కోట్లు రాజమహేంద్రవరంసెంట్రల్ జైల్లో 52 రోజులు సీఐడీ దర్యాప్తుల్లో ఆధారాలతోసహా వెల్లడి 17ఏ కింద చంద్రబాబుకు రక్షణ లభించదన్న సుప్రీంకోర్టు షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు కేజ్రీవాల్ అరెస్ట్ తరహా లోనే చంద్రబాబుపై ఈడీ కన్ను ఇదీ చంద్రబాబు అవినీతి ‘స్కిల్’ 6:00 AM, April 13th 2024 రౌడీఛీటర్ చింతమనేని ..ఇది తప్పన్న పాపానికి మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళతాడొకడు.. అధిక వడ్డీలకు అప్పులిచ్చి,గడువులోగా తీర్చలేదన్న సాకుతో పక్కకు రమ్మంటున్న వారిని వెనకేసుకొస్తాడు ఇంకొకడు.. ప్రకృతిని చెరబట్టడానికే పుట్టామన్నట్లు వ్యవహరిస్తాడు మరొకడు.. చిన్నారులని కూడా చూడకుండా లైంగికంగా వేధించే వెధవలకు అండగా నిలుస్తాడొక దుర్మార్గుడు.. ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదంటే కడుపైనా చేయాలని నిస్సిగ్గుగా, సందేశంగా చెబుతాడో నేత.. ‘అసలు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని స్వయంగా పార్టీ అధినేతే హేళన చేస్తాడు.. ఇలాంటి వాళ్లంతా ప్రజలను ఉద్దరిస్తారట! ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో వీరందరిదీ అందె వేసిన చేయి. ఇలాంటి టీడీపీలో ఒక్కో నేతది ఒక్కో చీకటి చరిత్ర.నేటి నుంచి ఒక్కొక్కరి బాగోతాన్ని‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఎమ్మెల్యే హోదాలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి తహసీల్దార్ వనజాక్షి జుట్టుపట్టి ఈడ్చి దాడి చేసిన వైనం.. చంద్రబాబు హయాంలోనే రౌడీషిట్ అత్యంత వివాదాస్పద రాజకీయ నేతగా ముద్ర ఎస్సీలకు రాజకీయాలు ఎందుకురా.. అంటూ తీవ్ర స్థాయిలో దూషణ పవన్ కళ్యాణ్.. వాళ్ల అన్న చిరంజీవినే గెలిపించలేనివాడు అంటూ వ్యక్తిగత విమర్శలు ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో పోలవరం కుడికాల్వ విధ్వంసం 5 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ మింగిన మహా అవినీతిపరుడు కొల్లేరులోనూ వందల ఎకరాల్లో సొంతంగా అక్రమ సాగు 1,860 ఎకరాల అక్రమ సాగులో అడ్డగోలుగా కమీషన్ల దందా -
మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలు వివరించి స్టార్ క్యాంపైనర్లుగా చేయాలి. ఈ మంచి కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ రావాలి.. మోసపోకూడదంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి గడపకూ చెప్పాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి గుంటూరు శివారు ఏటుకూరు వద్ద నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అందరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. ఈరోజు గుంటూరులో కనిపిస్తున్న ఈ మహా జన సముద్రం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పుడు జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు, ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అవ్వాతాత, సోదరులు, స్నేహితులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి గ్రామానికి పౌర సేవలు, విద్య, వైద్యం, రైతన్న లకు భరోసా, అక్క చెల్లెమ్మలకు సాధికారత, అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సేవలు అందించిన మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను ఒక్క రూపాయి కూడా లంచం, వివక్షకు తావు లేకుండా 130 సార్లు బటన్ నొక్కి పారదర్శకంగా నేరుగా అందించిన ఈ ప్రభుత్వానికి, మీ జగన్‌కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కేందుకు, మరో వంద మందికి చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా? రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు.. ఈ ఎన్నికల యుద్ధం కేవలం చంద్రబాబుకు, జగన్‌కు మధ్య జరుగుతున్నది కాదు. ఈ యుద్ధం బాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, వాటిని ఆపిన బాబు దుర్మార్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది వారి మోసాలకు, మన విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఆ అబద్ధాల బాబుకు ఇద్దరు వంత పాడుతున్నారు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు. 2014 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించిన బాబు ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ నమ్మబలుకుతున్నారు. మంచి కొనసాగాలో వద్దో ఆలోచించండి.. ఈ రోజు మీరంతా ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో కలసి ఒక్క అంశంపై ఆలోచన చేయమని కోరుతున్నా. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే గత 58 నెలలుగా జరుగుతున్న మంచిని మీరందరూ కొనసాగించేందుకే ఓటు వేసినట్లే. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. ఈ 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని మీ అంతట మీరే మీకు వద్దని చెప్పినట్లేనని గుర్తుంచుకోవాలని కోరుతు న్నా. 58 నెలల క్రితం మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి ఫలానాది చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్ మాదిరిగా భావించి 99 శాతం హామీలను అమలు చేసి మీ ముందుకు వచ్చి మరోసారి ఆశీస్సులు కోరుతున్నాడు. సెల్‌ఫోన్ లైట్లతో సంఘీభావం.. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుండాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆస్పత్రులు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లలో ఏ ఒక్కటీ తగ్గకుండా గెలిపించేందుకు మీరు సిద్ధమేనా? పేదల భవిష్యత్తు బాగుండాలని చేస్తున్న ఈ యుద్ధానికి మీరంతా సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయాలి. పాలకుడు మోసగాడైతే... ఎలాంటి వారు రాజకీయ నాయకుడిగా ఉండాలి? ఎలాంటి వారిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలన్న విషయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఎందుకంటే మనం వేసే ఓటు ద్వారా రాబోయే ఐదేళ్ల జీవితం ఆ పాలకుడి చేతుల్లో పెడుతున్నాం. ఆ పాలకుడికి మంచి మనసు ఉండి మంచి చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడు అయితే మన బతుకులు అంధకారం అవుతాయి. పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. అక్కచెల్లెమ్మల బతుకులు అతలాకుతలం అవుతాయి. రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యల పాలవుతాయి. అవ్వాతాతల సంక్షేమం అడుగంటిపోతుంది. అందుకే ఈ వాస్తవాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా. గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న కిలారు రోశయ్య, అసెంబ్లీ అభ్యర్థులు నూరి ఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, మురుగుడు లావణ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, విడదల రజని, అంబటి మురళీకృష్ణ, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, బత్తుల దేవానంద్ తదితరులు ఏటుకూరు సిద్ధం సభలో పాల్గొన్నారు. బాధలు విన్నాడు.. భరోసా ఇచ్చాడు.. తనను కలిసిన బాధితులకు సీఎం జగన్ ఆపన్న హస్తం సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను పలువురు కలిసి తమవారికి వచ్చిన కష్టాలు చెప్పుకొన్నారు. వైద్యం అందించాలని కోరారు. వారి బాధలు సావధానంగా విన్న సీఎం జగన్.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన తన సోదరుడు షేక్ సుభానికి వైద్యం చేయించండన్నా అంటూ గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన బాజీబీ సీఎం జగన్‌ను వేడుకున్నారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని భాగ్యనగర్ కాలనీ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ వస్తున్నారని తెలుసుకుని కోమాలో ఉన్న సోదరుడిని కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్స్‌లో తీసుకొచ్చి రోడ్డుపై నిలబడింది బాజీబీ. వారిని గమనించిన సీఎం వెంటనే బస్సు దిగి సమస్యను తెలుసుకున్నారు. వీఆర్వోగా పనిచేస్తున్న సుభాని గత ఆగస్ట్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, అప్పటి నుంచి కోమాలోకి వెళ్లాడని చెబుతూ ఇప్పటి వరకు రూ.20 లక్షలు ఖర్చయ్యాయని, సీఎం సహాయనిధి ద్వారా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రూ.3 లక్షలు సాయం కూడా అందించారని సీఎం దృష్టికి తెచ్చారు. ఇక వైద్యం చేయించే స్తోమత తమకు లేదన్నారు. వారి సమస్యను విన్న సీఎం జగన్.. సుభానికి ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన గంటెల వెంకటేశ్వర్లు, శారదల 12 ఏళ్ల కుమారుడు చరణ్‌కు పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మేమంతా సిద్ధం యాత్రకు ధూళిపాళ్ల శివారులో సీఎం జగన్ రోడ్ షో చేస్తుండగా బస్సు వెంట ఆ బాలుడిని ఎత్తుకుని తల్లిదండ్రులు పరుగెత్తడం సీఎం జగన్ గమనించి.. బస్సాపి వారిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే చరణ్‌కు వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్యానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. బాబు మోసాలకు వంతపాడుతున్న వదినమ్మ, దత్తపుత్రుడు సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాల బుర్రకథకు తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కని పిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘మీ బిడ్డకు ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించాలని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి’ అని ప్రజలను కోరుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. భారీ వర్షంలోనూ జనం ‘సిద్ధం’ భోజన విరామం కూడా లేకుండా 9 గంటల పాటు సీఎం జగన్ యాత్ర అభిమాన సముద్రం ముందు గాలి దుమారం తేలిపోయింది. ఈదురు గాలులు వీస్తున్నా జనసందోహం చెక్కు చెదరని సంకల్పంతో జననేత కోసం నిరీక్షించింది. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సుయాత్ర పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నంబూరు వరకు జరిగింది. యాత్ర మేడికొండూరు చేరుకునేసరికి ఈదురు గాలులతో వర్షం మొదలైంది. జన సంద్రమే గొడుగులా సీఎం జగన్ కాన్వాయి ముందుకు సాగింది. గుంటూరులో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు పలుదఫాలుగా వర్షం పడింది. గాలుల ధాటికి పలు చోట్ల ఫ్లెక్సీలు ఒరిగిపోవడంతో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని నిలబెట్టడం గమనార్హం. ఏటుకూరులో భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణం మొత్తం తడిచి ముద్ద అయింది. ప్రతిచోటా అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర శుక్రవారం భోజన విరామం కూడా లేకుండా తొమ్మిది గంటల పాటు నిరాటంకంగా సాగింది. గుంటూరు జిల్లాలో పేరేచర్ల నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర జనసంద్రాన్ని తలపిస్తూ రోడ్‌షో జరిగింది. 2014 ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. ఒక్కసారి 2014 ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. నాడు కూడా ఇదే కూటమి! మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలతో ప్రజల జీవితాలతో చెలగా టమాడారు. ఇదే చంద్రబాబు సంతకం చేసి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో పాంప్లెట్లు ముద్రించి ప్రతి ఇంటికి పంపారు. మీరు మర్చిపోతారేమోననే భయంతో టీవీలలో, పేపర్లలో ఊదరగొట్టారు. చంద్రబాబు నాటి మోసాల్లో ఒక్కసారి ముఖ్యమైన వాటిని మీకు గుర్తు చేస్తా. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మీకుగానీ, మీ ఇంటి చుట్టుపక్కల వారికిగానీ ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. మరి జరిగిందా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి గుంటూరులో ఏమైనా కనిపిస్తోందా? -
పురంధేశ్వరి మాటల తూటాలతో.. మూడు పార్టీల్లో అయోమయం!
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక ప్రకటన అందరిని ఆశ్చర్యపరచింది. మూడు పార్టీలదీ ఒకటే ఎజెండా అని ఆమె అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని దించడమేనని ఆమె చెప్పారు. ఇదా ఎజెండా అంటే అని ఒరిజినల్ బీజేపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. టిక్కెట్ల విషయంలో వ్యక్తం అవుతున్న నిరసనలు, పార్టీల మధ్య అవగాహన కుదుర్చుకోవడంలో ఒక ప్రాతిపదిక లేని వైనంపై కొందరు అసహనం చెందుతున్న తీరు కానీ పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చాయి. వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న పురందేశ్వరి ఎలాగోలా తాను ఎంపీగా గెలిస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఛీప్ సెక్రటరీ, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై తెలిపిన నిరసన సహజంగానే పార్టీలోని అయోమయ పరిస్థితిని బహిర్గతం చేసింది. "ఆదోనిలో బీజేపీకి పట్టుంది. మిగిలిన ఏడు స్థానాలు ఏ ప్రాతిపదిక మీద బీజేపీకి కేటాయించారో అర్థం కావటం లేదు. ముందే అక్కడ ఎవరు బీజేపీ తరఫున పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయించి తర్వాత బీజేపీ కేటాయించారా అనే అనుమానం చాలామంది బీజేపీ వారికి కలుగుతున్నది." అని ఆయన అన్నారు. దీనికి పురందేశ్వరి వద్ద జవాబు ఉన్నదా? గతంలో తీవ్ర వైరం ఉన్నా, రాజకీయ పదవులపై ఉన్న ఆశతో ఇప్పుడు పురందేశ్వరి తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజీపడి రాజకీయం చేస్తున్నారు. దీనివల్ల ఆమె ప్రతిష్ట మసకబారుతున్నా, పట్టించుకునే దశలో లేరు. పైగా మూడు పార్టీల కూటమిని ఆమె త్రివేణి సంగమం అని అంటున్నారు. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి టీడీపీ కానీ, ఆ తర్వాత జనసేన కానీ ఈ కూటమిని పవిత్ర సంగమం అని భావించడం లేదు. తప్పనిసరి తద్దినం అని చంద్రబాబు మాటల్లో ఇప్పటికే వ్యక్తం అయింది. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, కేసులకు ఉపయోగపడతారులే అని తప్ప వేరే లక్ష్యం లేదని ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ నేతలు ఈ పొత్తు విషయంలో ఎందుకు చీవాట్లు పెట్టారో ఎవరూ వివరించలేదు. ప్రధాని మోడీ ఏపీ ప్రచార సభకు వచ్చి ఏమైనా కొత్త హామీ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇష్టం లేని పెళ్లికి వచ్చినట్లు వచ్చి వెళ్లారు. కానీ పురందేశ్వరి మాత్రం ఒకటే ఎజెండా అని చెబుతున్నారు. ఏదైనా పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడానికి ఒక కామన్ ఎజెండా ఉండాలి. దానిపై ముందుగానే చర్చలు జరిపి ఒక ప్రకటన చేయాలి. అలాంటిది ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ పక్షాన ఆయన సూపర్ సిక్స్ అని కొన్ని వాగ్దానాలను ప్రకటించారు. వాటన్నిటిని బీజేపీ ఆమోదిస్తుందా? అన్నది ఆమె చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటటీలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అవన్నీ ఆచరణ సాద్యం కానీ హామీలని ప్రచారం చేసింది. అలాంటిది ఏపీలో అంతకు మించి టీడీపీ హామీలు ఇచ్చింది. వాటన్నిటిని కామన్ ఎజెండాలో పెడతారా? 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఫోటోలతో కొన్ని హామీలు ఇచ్చారు. నిజానికి అవన్నీ టీడీపీ ప్రకటించినవి. కానీ కరపత్రంపై మోడీ పోటో కూడా ఉండడంతో బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వచ్చింది. కానీ బీజేపీ నేతలు రైతు రుణమాఫీ వంటి కొన్ని హామీలు తమకు సంబంధం లేనివని ఆ తర్వాత చెప్పేవారు. ఇప్పుడు కూడా ఎన్నికల వరకు కామన్ ఎజెండా అని ప్రచారం చేసి, ఆ తర్వాత ఎవరికి వారు తమది కాదని చేతులెత్తేస్తే ఎవరు బాద్యత వహిస్తారు. అంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎవరికి తోచిన హామీలు అవి ఇచ్చి తర్వాత తమకు సంబంధం లేదని ప్రజలను మోసం చేస్తారా? ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుమార్లు మాట మార్చారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఆయన హోదా విషయంలో తన తాజా వైఖరి ఏమిటో చెప్పలేదు. బహుశా ప్రత్యేక హోదా వంటి అంశాలను డిమాండ్ చేయవద్దని బీజేపీ కండిషన్ పెట్టిందేమో తెలియదు. ఎందుకంటే ఆయన దీనిపై బీజేపీని ప్రశ్నించకుండా, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా తేలేదని చెబుతున్నారు. మరి ఈ అంశంలో బీజేపీ స్పందిస్తుంందా? రైతుల రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీకి చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు కామన్‌గా అంతా కలిపి ప్రచారం చేసుకున్నారు. కానీ అమలు టైమ్ వచ్చేసరికి చంద్రబాబు కేంద్రం సహకరించడం లేదని విమర్శించేవారు. అలాగే బీజేపీ తాము ఇలాంటి హామీలను సమర్ధించబోమని చెప్పేది. బీజేపీ వారు కోరితేనే తాను పొత్తు పెట్టుకున్నానని ముస్లింల సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంపై పురందేశ్వరి ఇంతవరకు వ్యాఖ్యానించకపోవడం కూడా సహజంగానే విమర్శలకు దారి తీస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ముస్లిం రిజర్వేషన్ లను చంద్రబాబు కూడా కొనసాగించారు. ఇప్పుడు కూడా ముస్లింలను రక్షించింది తానే అని అంటున్నారు. దీనికి సంబందించి ఇద్దరి మద్య వైరుధ్యాలు ఉన్నాయా. ఒక కామన్ ఎజెండా పెట్టుకుంటారా. చంద్రబాబుతో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిస్తారా? గతంలో అనేక అంశాలలో బీజేపీని చంద్రబాబు తీవ్రంగా దుయ్యబట్టారు. వాటన్నిటిలో ఎవరు రాజీపడ్డారు? టీడీపీనా? లేక బీజేపీనా? త్రిబుల్ తలాఖ్‌ను కేంద్రం రద్దు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ముస్లింలను అరెస్టు చేయడానికే బీజేపీ కుట్ర అని ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తన వైఖరి మార్చుకున్నారా?లేక బీజేపీనే ఏపీ వరకు చంద్రబాబు కోసం తన సిద్దాంతాన్ని వదలుకుందా? ఇన్ని వైరుద్యాల మధ్య పవిత్ర పొత్తుగా బీజేపీ అధ్యక్షురాలు భావించి ఏకంగా త్రివేణి సంగమంగా అభివర్ణించడం ప్రజలను మోసం చేసే యత్నమే అని చెప్పాలి. మన దేశంలో అనేక నదులు కాలుష్యంతో నిండిపోయాయి. త్రివేణి సంగమం పరిస్థితి కూడా అంతే.అలాగే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కూడా అనైతికం, అపవిత్రం. కేవలం అధికార కాంక్షతో, పదవీ లాలసతో ప్రజలను మోసం చేయడానికి ఈ మూడు పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయి. వారికి చిత్తశుద్ది ఉంటే 2014లో తమ కూటమి ఏమి చెప్పింది? ఏమి చేసింది? ఎందుకు విడిపోయింది? ఎందుకు మళ్లీ ఇప్పుడు కలుస్తున్నది? పార్టీల మద్య ఉన్న వైరుద్యాలను ఏమైనా పరిష్కరించుకున్నారా?... మొదలైనవాటి గురించి స్పష్టత ఇచ్చి, ఆ తర్వాత కొత్త హామీలపై ఒక అవగాహన వచ్చామని ప్రజలకు చెప్పగలగాలి. లేకుంటే వీరికి కామన్ ఎజెండా ఏమీ లేదన్న సంగతి ప్రజలకు బాగానే అర్దం అవుతుంది. ఒకరిని దించడానికి కూటములు కట్టడం కాదు. తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పగలిగితేనే ప్రజలు నమ్ముతారు? ఏపీలో ఏర్పడిన కూటమికి ఆ లక్షణం లేదు. పరస్పర అవసరాల కోసం ఏర్పడిన ఈ కూటమి, గతంలో మాదిరే ఎన్నికల తర్వాత ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ప్రజలను మోసం చేయరన్న గ్యారంటీ ఏముంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!
పెళ్లి కార్డు చూసి.. అందులోని కుటుంబాలు.. బంధువుల తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయొచ్చు. సినిమా పోస్టర్‌లోని పేర్లు చూసి.. అంటే హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. మ్యూజిక్.. విలన్స్.. ఇతర టెక్నీషియన్స్‌ను చూసి అది ఎలాంటి కాంబినేషలో చెప్పేయొచ్చు. క్రికెట్ టీమ్ లోని సభ్యులను బట్టి ఆయా జట్టు ఎంత బలమైందో ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ తానూ ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి.. దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి.. ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినపుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు.. కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రధాన ప్రచారకర్తలు (స్టార్ క్యాంపెయినర్లను) చూసి కూడా జనం నివ్వెరపోతున్నారు. మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ @JanaSenaParty కి అంత కామెడీ అయిపోయాయి! ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్షీట్లు చూసుకోండి! #PackageStarPK… https://t.co/4Sh27uDfyq — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 వాస్తవానికి ఏదైనా పార్టీ తరఫున ప్రముఖ రాజకీయ నాయకుడు.. లేదా పెద్ద క్రీడాకారుడు.. సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ.. హైపర్ ఆది.. గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలాంటివాళ్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజాకీయ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహనా అయినా ఉందా.? అసలు ఆ పార్టీని నెత్తినపెట్టుకుని మోయాల్సిన అవసరం.. ఆ జనసేనకు వత్తాసు పలకాల్సిన అవసరం వాళ్లకు ఏముందనున్నది అర్థం కానీ విషయం. ఇక పార్టీలో కేవలం చందాలు వసూళ్లకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించడం లేదన్నది మరోమారు స్పష్టమైంది. పవన్‌కు రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం.. ఎలాంటి దృక్పథం ఉందన్నాడో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తోందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందినపేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న -
మన్యం ప్రజలు మీ వెంటే..
పార్వతీపురం మన్యం: మన్యంలో ‘ఫ్యాన్’ జోరు తగ్గలేదు. వైఎస్సార్సీపీకి తిరుగులేదు. గత ఫలితాలే కాదు.. రాబోవు ఎన్నికల్లోనూ జగనన్న ప్రభుత్వానికి ఇక్కడ ఢోకా లేదు. ఏ ఇంట తలుపు తట్టినా.. ఏ వీధి మలుపు తిరిగినా ఇదే మాట. ప్రతి ఒక్కరి నోటా.. వైఎస్సార్సీపీ సంక్షేమం పాట. గతంలో ప్రభుత్వ పథకమంటే తెలియని అమాయక గిరిజనం. పేర్లు వారివి.. పథకాలు మరొకరివి. నేడు జగన్ పుణ్యమాని వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాక, లబ్ధినీ ఇంటి వద్దే పొందగలుగుతున్నారు. పోడు పట్టాలు దక్కించుకుంటున్నారు. అందుకే నాటి కంటే.. నేడు ‘ఫ్యాన్’ మరింత స్పీడుగా తిరుగుతోంది. వైఎస్సార్సీపీ గాలి ప్రతీ ఊరు, వాడ, గూడలో జోరుగా వీస్తోంది. కంచుకోటగా.. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటగా మారాయి. 2014, 2019 ఎన్నికల్లో సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పార్టీ తరఫున బరిలోకి దిగిన పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అలజంగి జోగారావు గెలుపొందారు. ఇంక స్థానిక సంస్థల్లోనూ అత్యధిక ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులు సైతం తిరుగులేని ఆధిక్యం సాధించారు. వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలు గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. తిరుగులేదు.. సాలూరు నియోజకవర్గంలో పీడిక రాజన్నదొర వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ హయాంలో 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మొత్తం 1,46,839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొరకు 78,430 ఓట్లు రాగా.. తెలుగుదేశం పార్టీ అభ్యరి్థకి 58,401 ఓట్లు వచ్చాయి. 20,029 ఓట్ల మెజారిటీతో రాజన్నదొర గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తరఫు న బరిలోకి దిగిన రాజన్నదొరకు 63,755 ఓట్లు వచ్చాయి. 47.8 శాతం ఓటింగ్‌తో ఆయన విజయం సాధించారు. పార్వతీపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మొత్తం 1,37,154 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్సీ పీ అభ్యర్థి అలజంగి జోగారావుకు 75,304 ఓట్లు వచ్చాయి. 24,199 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి చెందారు. కురుపాం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 1,38,723 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణికి 74,527 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 26,602 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై ఆమె ఘ న విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ 55,435 ఓట్లు సాధించారు.19,083 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి 55,337 ఓట్లు సాధించి విజయం సాధించారు. 1,620 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 18 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. స్థానిక సంస్థల్లోనూ సత్తా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. పార్వతీపురం నియోజకవర్గంలో 89 సర్పంచ్ స్థానాలుండగా.. వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు 76 చోట్ల గెలుపొందారు. ఎంపీటీసీలు 51కి 48, జెడ్పీటీసీలు మూడుకు మూడు స్థానాలు వైఎస్సార్‌సీపీవే. పార్వతీపురం పట్టణంలో 30 వార్డులుండగా.. ఇందులో 24 మంది వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లే. కురుపాం నియోజకవర్గంలో ఐదుకు ఐదు.. జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 137 పంచాయతీ సర్పంచ్ స్థానాలుండగా.. వందకుపైగా మద్దతుదారులు గెలిచారు. పాలకొండ నియోజకవర్గంలోనూ జగన్ పట్ల ఉన్న విధేయతను అక్కడి ప్రజలు చూపించారు. పాలకొండలో 20కి 17 మంది కౌన్సిలర్లు వైఎస్సార్పీ నుంచి గెలిచారు. జెడ్పీటీసీలు నాలుగుకు నాలుగూ విజయం దక్కించుకున్నారు. నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలనూ మద్దతుదారులే దక్కించుకున్నారు. సాలూరు నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీలు, ఎంపీపీ లు వైఎస్సార్పీవే. మున్సిపల్ చైర్మన్‌నూ గెలుచుకుంది. సర్పంచ్, కౌన్సిలర్ స్థానాలనూ అత్యధికంగా కైవసం చేసుకుని ఆధిక్యతను చాటింది. జగన్ ఆశయాలకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు గిరిజన ప్రజలతో నిత్యం మమేకమయ్యారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో కురుపాం, సాలూరు ఎమ్మెల్యేలు గిరిజన శాఖకు మంత్రులుగానూ వ్యవహరించారు. దీనివల్ల గిరిజనుల జీవన స్థితిగతులు మరింతగా మారాయి. సంక్షేమ పథకా లు ప్రతి గడపకూ వెళ్లాయి. గతంలో నిరక్షరాస్యులై న గిరిజనులకు తమ పేరిట ఏ పథకాలు వచ్చేవో కూడా తెలియదు. ఇప్పుడు నేరుగా వలంటీర్ల ద్వారానే లబ్ధి పొందగలుగుతున్నారు. ఊరిలో ఉన్న సచివాలయం నుంచి అన్నిరకాల ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. గిరి శిఖర గ్రామాలకు రహదారులనేకం మంజూరయ్యాయి. తాగునీరు అందుతోంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు చేతికందాయి. జగనన్న లేఅవుట్ల కింద ఇళ్లు, ఇంటి పట్టాలను పొందారు. పింఛన్లు పొందుతున్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టడంతో వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి. అందుకే.. ఏ ప్రాంతానికి వెళ్లినా జగన్ పట్ల తమ విధేయతను చాటుతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. తామంతా మరోసారి అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఇవి చదవండి: అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు -
TDP సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ ఫిక్స్
అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చేయడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇలానే 2014లో అలవి కాని హామీలు 650 వరకూ ఇచ్చేసి.. గద్దెనెక్కిన తరువాత వాటిని తుంగలో తొక్కేసిన ఆయన.. మేక వన్నె పులిలా.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వస్తూ సూపర్ సిక్స్ పేరిట గుప్పిస్తున్న హామీలు ఏవిధంగా నమ్ముతామని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణ వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు ఢంకా బజాయించి మరీ చెప్పారు. బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కూడా చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని గొప్పగా చెప్పారు. చంద్రబాబు మాటలు అమాయకంగా నమ్మిన చాలామంది తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చివరకు రుణ భారం తడిసి మోపెడై, బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుకుని అవమానాల పాలైన రైతులు, డ్వాక్రా మహిళలు లబోదిబోమన్నారు. తనఖా పెట్టిన బంగారం బ్యాంకుల నుంచి ఇంటికి వచ్చేస్తుందని నమ్మి మోసపోయారు. రైతులకు ‘బాబు’గారి జెల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా రూ.3,290 కోట్ల రుణాలు తీసుకుంటారు. వారికి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. చివరకు అరకొరగా రూ.25 వేల లోపు మాత్రమే చేసి, మధ్యలోనే వదిలేసి, రైతులను నిలువునా ముంచేశారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలను ఏవిధంగా నమ్మాలని రైతులు ప్రశి్నస్తున్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారిలా.. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ ప్రకటించారు. అది నమ్మి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,10,336 స్వయం సహాయక సంఘాల్లోని 10,71,078 మంది మహిళలు అప్పటికి తమపై ఉన్న రూ.1,07,107 కోట్ల రుణాలు మాఫీ అయిపోతాయని సంబరపడ్డారు. తీరా గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు చిల్లిగవ్వ కూడా మాఫీ చేయకుండా దగా చేశారు. దీంతో ఆయనకు ఓట్లేసి మోసపోయామని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు – కుంకుమ పేరిట ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా (రూ.2,500, రూ.3,500, రూ.4,000) రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా దానిని కొంతమందికే పరిమితం చేశారు. అది కూడా రూ.2,500, రూ.3,500 మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన రూ.4 వేలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ చెక్కులు కాస్తా చెల్లుబాటు కాకుండా పోయాయి. వాటిని మహిళలు చిత్తుకాగితాల్లా చెత్తబుట్టలో వేయాల్సి వచ్చింది. నిరుద్యోగులకు కుచ్చుటోపీ 2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చేంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, కొంత మందికి మొక్కుబడిగా రూ.1,000 చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంకా కాపులకు రిజర్వేషన్, ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్ హౌస్‌లు నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు గాలికొదిలేశారు. ఇలా అప్పట్లో ఆయన ఇచ్చిన హామీల్లో దేనినీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా వంచించారు. చివరకు టీడీపీ అధికారి వెబ్సైట్ నుంచి నాడు ఇచ్చిన మేనిఫెస్టోను సైతం మాయం చేసేశారు. అప్పట్లో ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు.. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జనం నిలదీస్తారనే జంకూ గొంకూ లేకుండా ఈ ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలు అంటూ మరోసారి చేస్తున్న ప్రచారాన్ని నమ్మబోమని ప్రజలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీల తరఫున టీడీపీ నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ఇస్తున్న నాలుగు పేజీల బుక్‌లెట్‌ను చాలామంది ఏమాత్రం చూడకుండా పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు తీరుకు పూర్తి భిన్నంగా గత ఎన్నికల వేళ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేసిన వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ‘ఆడియో’ దుమారం -
Memantha Siddham Bus Yatra Photos: సామాన్యులతో ఆప్యాయంగా సీఎం జగన్ (ఫొటోలు)
-
షర్మిల రాజకీయం.. ఘోరంగా మిస్ ఫైర్!
అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. అని ఒక పాట ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే అయినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి అయిన షర్మిలను ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఆదరించే వర్గాలలో కొంత చీలిక తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు. తదనుగుణంగా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలలో ఉన్న షర్మిలను అక్కడ నుంచి ఏపీకి తీసుకురావడంలో పరోక్షంగా ఒక పాత్ర పోషించారు. చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెను ఏపీ రాజకీయాలలోకే వెళ్లాలని పట్టుబట్టారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ వద్ద దీనిపై పంచాయతీ కూడా జరిగింది. ఆమె ఏపీ రాజకీయాలలోకి వెళ్లేలా ఒప్పందం కుదిరిన తర్వాతే ఆమె పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నారు. తదుపరి షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె కూడా చంద్రబాబు తరపునే పనిచేస్తూ అన్నను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా తన ఉపన్యాసాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శిస్తూ చెల్లెలుకు న్యాయం చేయడం లేదని అనేవారు. షర్మిల పట్ల, అలాగే విజయమ్మ పట్ల తనకు సానుభూతి ఉందన్నట్లు మాట్లాడేవారు. షర్మిల రాజకీయాలలోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా తన వెనుక ఎవరు ఉంది ప్రపంచానికి పరోక్షంగా చెప్పేశారు. రాధాకృష్ణ అంటే చంద్రబాబు సొంత మనిషి కింద లెక్క. చంద్రబాబు తరపున ఆయా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారని ఎక్కువ మంది నమ్ముతారు. అలాంటి వ్యక్తి చేసిన రాయబారం ఫలించి ఆమె కొంతకాలం తెలంగాణలో పార్టీ నడిపి, ఆ తర్వాత ఏపీ రాజకీయాలలోకి వచ్చారు. అంతవరకు తాను తెలంగాణ బిడ్డనని, ఈ మట్టిని వదలిపెట్టనని షర్మిల చేసిన శపధాలన్నీ గాలిలో కలిసిపోయాయి. షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కనుక, ఆ ఓట్లను ఆమె కొంతవరకు చీల్చగలిగితే అది తమకు లాభిస్తుందని చంద్రబాబు, రాధాకృష్ణ అంచనా వేసుకున్నారు. ఆమె కూడా వారికి యధో శక్తి రాజకీయంగా ఉపయోగపడుతూ, తన అన్నను విమర్శిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో గతంలో మాట్లాడినదానికి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్న తీరు కూడా ఇంకో నిదర్శనంగా కనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చంద్రబాబును సైతం కొంతమేర విమర్శించవలసి వస్తోంది. వాటిని ఎడిట్ చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శించిన మేర తమ మీడియాలో ప్రచారం చేశాయి. కాలం గడిచే కొద్ది చంద్రబాబుకు తత్వం బోధపడినట్లుగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. వారిలో కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ వద్దకు రాకుండా కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారా అని చంద్రబాబు మదనపడుతున్నారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనకు వచ్చారు. బహుశా షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు వచ్చే ఓట్లలో ఏమైనా గండి పడుతుందా అని సర్వేలు చేయించుకుని ఉండాలి. ఆ సర్వేలలో షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఎలాంటి నష్టం ఉండదని తేలి ఉండవచ్చు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఉపయుక్తంగా ఉంటుందన్న సమాచారం వచ్చి ఉండవచ్చు. దాంతో అంతవరకు షర్మిలను భుజాన వేసుకుని సానుభూతి వచనాలు పలికిన చంద్రబాబు మళ్లీ పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ పాత డైలాగులు చెప్పడం ఆరంభించారు. 2014లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తదుపరి 2018లో తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను కలిపి విమర్శించేవారు. 2024 నాటికి అదే మోదీతో, బీజేపీతో ఆత్మగౌరవం వదలుకుని మరీ పొత్తు పెట్టుకున్నారు. డబుల్ స్టాండర్స్ కు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు ఇలా యూ టర్న్‌లు తీసుకోవడం కొత్తకాదు. ప్రస్తుతం కూడా అలాగే షర్మిల విషయంలో కూడా యు టర్న్ తీసుకుని మాట్లాడడం ఆరంభించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే షర్మిల వచ్చారని ఆయన చెబుతున్నారు. పెద్ద కాంగ్రెస్, వైకాపా పిల్ల కాంగ్రెస్ అని పాతపల్లవిని కొత్తగా ఎత్తుకున్నారు. ఈ రెండు కలిసి డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ఆయన అన్నారు. అక్కడితో ఆగకుండా రాజకీయాలకు దూరంగా ఇంటిలోనే ఉంటున్న విజయమ్మ పేరు ప్రస్తావించి.. మొన్నటివరకు కుమారుడికి ఆంధ్ర, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చారని చెప్పిన విజయమ్మ ఇప్పుడేమో కుమార్తెను ఏపీలో యుద్దానికి పంపారని అన్నారు. పిల్లలకే న్యాయం చేయలేని తల్లి ఐదు కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. షర్మిలకు అన్యాయం జరిగితే ఇంటిలోనే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! తన రాజకీయ అవసరాల కోసం తన ప్రత్యర్ది పార్టీ అధినేత ఇళ్లలో ఉన్న ఆడవారిపై కూడా అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి చంద్రబాబు వెనుకాడరనే కదా! తన భార్యను ఎవరో ఏదో అన్నారంటూ అసెంబ్లీలో రచ్చ చేసి, బయటకు వచ్చి ఏడుపు లంఖించుకున్న ఆయన, విజయమ్మపై విమర్శలు చేయవలసిన అవసరం ఏముంది. అంటే ఏదో రకంగా రెచ్చగొడితే ఆమె కూడా కామెంట్ చేస్తే, ఈ విషయంపై చర్చ కొనసాగించాలన్న దురుద్దేశంతోనా అనే సందేహం వస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానిఫెస్టోల గురించి సవాల్ చేస్తూ ప్రజా సమస్యల గురించి అధికంగా ప్రస్తావిస్తూ, యాత్ర సాగిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇలా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. దీని అంతటికి ఒక కారణం కనిపిస్తుంది. వలంటీర్లు తదితర అంశాలలో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు వాటిని జనం మర్చిపోవాలన్న లక్ష్యంతో పనికి రాని ఉపన్యాసాలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే? షర్మిల వల్ల తనకు రాజకీయంగా కలిసి వస్తుందని ఆయన ఆశించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ఇచ్చే వర్గాలలో ఎలాంటి విభజన రాకపోగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎంతో కొంత చీలుతుందని ఆయనకు అర్దం అయినట్లుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీచేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేమన్న భయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్రాప్‌లో వేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులోకి వెళ్లారు.కానీ దీనివల్ల మైనార్టీ వర్గాలలో తనపై వ్యతిరేకత ఏర్పడిందని చంద్రబాబు అర్ధం చేసుకుని ముస్లింలకు తన పాలనలో రక్షణ ఉందని చెప్పడం ఆరంభించారు. షర్మిల వల్ల చీలే ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలపై ఆదారపడకుండా, తన ప్రభుత్వ పనితీరు, స్కీముల వల్ల ప్రజలకు జరిగిన మేలు మొదలైన విషయాలను చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. బీజేపీ,జనసేనలతో నేరుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్, సీపీఐ వంటి పక్షాలతో అవగాహన పెట్టుకున్నారన్నది ఎక్కువ భావన. అయినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేకపోతున్నామన్న ఆందోళన చంద్రబాబులో ఏర్పడింది. అందులో భాగంగానే షర్మిలపై చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. కొన్నాళ్ల క్రితం కూటమి సభ జరిగినప్పుడు మోదీ ఇలాగే అన్నా, చెల్లెళ్లు ఒకటేనని అన్నప్పుడు చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ టీడీపీ ఓట్లకే గండిపడుతోందని సర్వేలు తెలపడంతో ఆయనలో మరింత కంగారు ఏర్పడింది. నిజానికి షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు ఇప్పటికి 99 శాతం నియోజకవర్గాలలో ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. 99 శాతం సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోవడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అయినా ఆమెను అడ్డుపెట్టుకుని తను లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తే, ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి భవిష్యత్తే అయోమయంలో పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. తత్ఫలితంగా చంద్రబాబు కొత్త స్వరం ఆలపిస్తున్నారు. అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి అనే చందంగానే చంద్రబాబు పరిస్థితి ఏర్పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం జగన్ బస్సుయాత్ర: వినుకొండలో జన ప్రవాహం
Live Updates.. వినుకొండలో జన ప్రవాహం వినుకొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం జనసంద్రంగా మారిన వినుకొండ దారిపొడవునా భారీ గజమాలతో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికిన ప్రజలు మేమంతా సిద్ధమంటూ... ముఖ్యమంత్రి బస్సుతో పాటు కదిలిన జన ప్రవాహం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దారిపొడవునా సంఘీభావం తెలిపిన విద్యార్దులు, యువతీ యువకులు, చిన్నారులతో సహా తల్లులు, అవ్వాతాతలు. సుమారు రెండు గంటలకు పైగా వినుకొండలో కొనసాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర పొద్దు గడుస్తున్నా తగ్గని ఉత్సాహం... వినుకొండలో బారులు తీరిన జనం అశేష జనవాహిని మధ్య కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంతగా జనం సీఎ జగన్‌కు అడుగడుగునా జననీరాజనాలు వినుకొండలో సీఎం జగన్‌కు ప్రజల బ్రహ్మరథం పల్నాడు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వినుకొండలో సీఎం జగన్‌కు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్‌కు అడుగడుగునా జననీరాజనాలు దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర వినుకొండ అడ్డరోడ్డు వద్ద సీఎం జగన్ భోజన విరామం ఇక్కడ నుంచి సాయంత్రం ఐదు గంటలకి వినుకొండలో సీఎం జగన్ బస్సుయాత్ర ►చింతలచెరువు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర. ►ఘన స్వాగతం పలికిన చింతల చెరువు ప్రజలు ►కురిచేడు గ్రామంలో సీఎం జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం ►ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ బస్సుయాత్రకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు ►సీఎం.. సీఎం నినాదాలతో దద్దరిల్లిన కురిచేడు గ్రామం ►అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకే.. పెన్షన్ కోసం అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ సచివాలయాలను ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాడు. ప్రతి నెలా ఒకటో తారీఖున అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు పెన్షన్‌ను మీ బిడ్డ… pic.twitter.com/gjQ6WqWIQS — YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2024 ►వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖిలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నా అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేది మీకు గుర్తుందా గత ప్రభుత్వంలో పెన్షన్ ఎంతమందికి వచ్చేది గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందకి మాత్రమే పెన్షన్ వచ్చేది ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక అవ్వాతాతల ఆత్మ గౌరవం కోసం ఆలోచన చేశాను దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకోచ్చాం వాలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికే పెన్షన్ పంపించాం 56 నెలలుగా మన ప్రభుత్వం 1వ తేదీ ఉదయమే పెన్షన్ అందించాం గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశాం అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించాం కుల, మత, రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందించాం ఇవాళ 66 లక్షల మందికి పైగాపెన్షన్ అందిస్తున్నాం ఇవాళ రూ.3 వేల వరకూ పెన్షన్ పెంచుకుంటూ వచ్చాం అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే మనసులో ప్రేమ ఉండాలి 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏ రోజైనా చంద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా? రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేశాయి వీటిని మార్చేందుకు మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తున్నాడు ఎన్నికల ముందు మేనిఫెస్టో అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారు ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేశారు. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం రాదు.. మోసాలు చేయలేడు చంద్రబాబు, వారి కూటమిలా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పలేను మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడంతే జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే రూ.3 వేల ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు నెలకు రూ. రెండు వేల కోట్లు పెన్షన్లకే ఇస్తున్నాం 58 నెలలుగా పెన్షన్ల కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశాం చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు చేయగలిగేదే చెప్పాలి.. చేయలేనిది నేను చెప్పకూడదు పేదలకు మంచి చేసే విషయంలో జగన్‌తో పోటీపడే వారు దేశంలోనే లేరు 2014లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశారు మోసం చేసేవారిని నమ్మొద్దని కోరుతున్నా చంద్రబాబు హామీల ఖర్చు లక్షా 40 వేల కోట్లు దాటిపోతున్నాయి అందరినీ మోసం చేసేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారు చంద్రబాబుకు ఓటు వేస్తే.. పులి నోట్లో తలపెట్టినట్టే లబ్దిదారులు మాట్లాడుతూ... వాలంటీర్లు మొన్నటి వరకూ పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇచ్చేవారు చంద్రబాబు చేసిన పనితో ఈ నెల పెన్షన్ కోసం ఇబ్బంది పడ్డాం మాకు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే మేలు జరుగుతుంది చంద్రబాబు మాపై ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదు పెన్షన్ అందకుండా చేసి ఆయన ఏం సాధిస్తాడు వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది గతంలో చంద్రబాబు మనుషులకే పెన్షన్ వచ్చేవారు జన్మభూమి కమిటీ సిఫార్సులు చేసిన వారికే పెన్షన్ వచ్చేది జగన్ పాలనలోనే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ వచ్చింది ► ప్రకాశం జిల్లాలో పదకొండోరోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. ►పదకొండో రోజు పల్నాడు జిల్లా సిద్ధమా? Day-11 పల్నాడు జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2024 ► వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 11వ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగనుంది. ► ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సీఎం జగన్ బయలుదేరుతారు. ► ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం మూడు గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు. -
బాబును నమ్మితే పులికి బలే: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ప్రకాశం జిల్లా పొదిలిలో ఈరోజు ఇసుక వేసినా రాలనంతగా జనసముద్రం, ప్రజా కెరటం కనిపిస్తోంది. మంచి చేసిన మన ప్ర భుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయీ చేయీ కలిపి చేస్తున్న నినాదమే సిద్ధం.. సిద్ధం! ప్రజల అజెండాతో మనం, జెండాలు జతకట్టి వారు తలపడుతున్న ఈ ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించి ఇంటింటా అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. 10వ రోజు బస్సు యాత్ర సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొనకనమిట్ల జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన ‘‘మేమంతా సిద్ధం’’ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఎండ నిప్పులు చెరుగుతున్నా భారీ ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘ప్రజల రాజ్యాన్ని, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు వస్తున్న మూడు పార్టీల కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కాదు. గత ఐదేళ్లుగా బాగుపడ్డ మీ పిల్లలు బడులు, చదువులు, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతుకు అందుతున్న భరోసా, సామాజిక న్యాయం.. ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి వెనక్కు వెళ్లాలా? అన్నది నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మళ్లీ మోసపోయి వెనక్కు వెళ్లాలా? అనే అంశాన్ని నిర్ణయించే ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొనసాగింపు.. ముగింపు మధ్య పోరాటం ఇవి జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌ది పేదల పక్షం అని గర్వంగా చెబుతున్నా. మీ ప్రతి ఓటూ వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది. మీకు, మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా? లేదా? అనేది నిర్ణయిస్తుంది. ఐదు వారాల్లో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో జగన్‌కు ఓటు వేస్తే జరుగుతున్న ప్రతి మంచీ కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నింటికి ముగింపు పలికినట్లే. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి. బాబు దారి ఎప్పుడూ అడ్డదారే... చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే. ఆయనకు విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియదు. చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటంటే.. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు. అవ్వాతాతా... ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో నేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించాడు. పెన్షన్లు పేదవాడి ఇంటికి వెళ్లకూడదట. వలంటీర్లు అలా వెళ్లటం నేరమట. పెన్షన్లు ఇంటికి వెళ్లి ఇచ్చే కార్యక్రమం ఇవాళ కొత్తగా జరగడం లేదు. ఇంటికి వెళ్లి అందించి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 58 నెలలుగా జరిగింది. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే అది ఆదివారమైనా, సెలవురోజైనా 1వ తారీఖు ఉదయాన్నే వలంటీర్ మనవడు, మనవరాళ్లు అవ్వాతాతల వద్దకు ఇంటికివెళ్లి చేతిలో పెన్షన్లు పెట్టారు. చంద్రబాబు హయాంలో రూ.1,000 మాత్రమే అరకొరగా ఇస్తే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్లి ఇంటివద్దే అందించే ఓ గొప్ప వ్యవస్థను తెచ్చింది. చంద్రబాబు హయాంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు, లంచాలు, వివక్ష లేదు. ఎక్కడెక్కడికో తిరిగి క్యూలో నిలబడి నరకయాతన అనుభవించిన రోజులు చంద్రబాబు పాలనలో చూశాం. వలంటీరు వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అందుకే కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. వలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడు. అవ్వాతాతల మరణాలకు కారకుడు.. ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వాతాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్కచెల్లెమ్మలను, దివ్యాంగులను మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా 30 మంది పైచిలుకు అవ్వలు, తాతల చావులకు కారకుడైన చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలి. తన స్వార్థ రాజకీయాలకు అనేక మంది మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడిని శాడిస్ట్ అనక మరేమంటారో మీరే చెప్పండి. ఈ ఎన్నికల సమయంలో, అధికారం మన చేతుల్లో లేని సమయంలో మాత్రమే పెన్షన్ మన ఇంటికి రాకుండా ఎందుకు ఆగింది? అది ఆగలేదు.. అడ్డుకోబట్టే రాకుండా పోయింది. శాడిస్ట్ అంటే ఎవరంటే... తన 14 ఏళ్ల పాలనలో ఏనాడూ ఇంటికి పెన్షన్ ఇవ్వని చంద్రబాబు కుట్రలతో, అక్కసుతో ఆపించాడు. కాబట్టే ఈరోజు నేను చంద్రబాబును, దొంగల ముఠాను అడుగుతున్నా. శాడిస్ట్ అంటే ఎవరు? శాడిజం అంటే ఏమిటి? ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేని వాడు శాడిస్ట్. పేదవాడు పెద్దవాడు అవుతుంటే ఓర్వలేని వాడు శాడిస్ట్. పేదలకు ఇళ్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకునే వాళ్లను శాడిస్ట్ అంటారు. వ్యవసాయం దండగ అని మాట్లాడిన మనిషిని శాడిస్ట్ అంటారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని వెటకారం చేసిన వ్యక్తి శాడిస్ట్ అంటే. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను కించపరుస్తూ మాట్లాడితే గ్రామాల్లో వాళ్ల పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవమానించిన చంద్రబాబును శాడిస్ట్ అంటారు. అవునా? కాదా? ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెడుతుంటే అడ్డుకుని అక్కసు వెళ్లగక్కిన బాబుకన్నా పెద్ద శాడిస్టు ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా? మీ బిడ్డ నేరుగా అందించే డీబీటీ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతోందని తెలిసి కూడా రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందంటూ దిక్కుమాలిన ప్రచారం చేసిన నిన్ను శాడిస్ట్ అనక ఏమనాలి చంద్రబాబూ? వలంటీర్లను కించపరిచిన శాడిస్ట్ గ్యాంగ్.. సేవా భావంతో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న వలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్లని, ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆబోతుల్లా పడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని నీచంగా మాట్లాడిన నువ్వు, నీ గ్యాంగు శాడిస్టులు కాకపోతే మరి ఎవరయ్యా? అని అడుగుతున్నా చంద్రబాబును. మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మ గీతాంజలిని సోషల్ మీడియా సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్ట్ ఎవరైనా ఉంటారా చంద్రబాబూ? 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా? ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దామా? మన జెండా తలెత్తుకుని రెపరెపలాడుతుంటే.. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు, కూటమి చరిత్ర ఏమిటి? 2014లో ఏం చెప్పారో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దామా? ముఖ్యమైన హామీలు ఒక్కసారి చూద్దాం. రూ.87,612 కోట్ల రైతుల రుణమాఫీ చేశాడా? రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేశారా? ఇంటింటికీ ఒక ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. 60 నెలల్లో నెలకు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇంటికి వచ్చాయా? పేదలకు 3 సెంట్ల స్థలం కథ దేవుడెరుగు ఒక్క సెంటు స్థలమైనా, కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ.. అయ్యాయా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ పొదిలిలో ఏమన్నా హైటెక్ సిటీ కనిపిస్తోందా? మార్కాపురంలో అయినా కనిపిస్తోందా? పోనీ ఒంగోలులో కనిపిస్తోందా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? ఇదే చంద్రబాబు మరోసారి కూటమి కట్టి మళ్లీ వస్తున్నాడు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలిగించి సిద్ధమే అని గట్టిగా నినదించండి. ఇంటింటా జగన్ మార్కు ► మన 58 నెలల పాలన ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలిస్తే గ్రామ గ్రామాన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాలంటే మీ జగన్. రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్. విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్. అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ బిడ్డ జగన్. ఇంటింటికీ వలంటీర్ సేవలంటే మీ జగన్. రైతు భరోసా అంటే మీ జగన్. పగటిపూటే నాణ్యమైన ఉచిత కరెంట్, సమయానికి ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీకే రుణాలు, ఉచిత పంటల బీమా.. ఇవన్నీ అంటే మీ బిడ్డ జగన్. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే కూడా మీ జగనే. అమూల్ ద్వారా పాడి రైతులకు లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు సేకరణ ధరలు పెరిగాయంటే కారణం మీ జగన్. వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది ఎవరంటే మీ జగన్. ఏకంగా 35 లక్షల ఎకరాల మీద పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించింది ఎవరంటే మీ జగన్. ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే 58 నెలల్లో సాకారం కావడంతో చంద్రబాబు 20 జెలూసిల్ మాత్రలు వేసుకున్నా తగ్గనంత అసూయతో, కడుపు మంటతో బాధపడుతున్నాడు. ► నాడు నేడు, ఇంగ్లీషు మీడియంతో ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి అందుతోందంటే కారణం మీ జగన్. విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద, బైలింగ్వల్ టెక్టŠస్‌బుక్స్, ట్యాబులు, 6వ తరగతి నుంచి ప్రతి క్లాసులో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌తో క్లాసు రూములు ఉన్నాయంటే కారణం మీ జగన్. ► పేదలెవరూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి ఏకంగా రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం మీ జగన్‌దే. ఆరోగ్య ఆసరా అందుతోందంటే కారణం మీ జగన్. ప్రభుత్వ ఆస్పత్రులు మారాయంటే కారణం మీ జగన్. ఏకంగా 54 వేల కొత్త పోస్టులు వైద్య రంగంలో భర్తీ అయ్యాయంటే, రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే కారణం మీ జగన్. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయంటే కారణం మీ జగన్. ఆసరా, సున్నా వడ్డీ, దిశా యాప్‌తో అక్కచెల్లెమ్మలు భరోసాగా ఉన్నారంటే కారణం మీ జగన్. నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, లా నేస్తం అంటే మీ జగన్. ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లతో రాజకీయ సాధికారత దక్కిందంటే కారణం మీ బిడ్డ జగన్. ► 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ 58 నెలల కాలంలో భర్తీ చేస్తే ఏకంగా 80 శాతం ఉద్యోగాలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే తమ్ముళ్లు, చెల్లెమ్మలకే దక్కాయి. బటన్ నొక్కి డీబీటీతో అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన రూ.2.70 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే లబ్ధి చేకూరిందంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా గొప్ప అర్థం ఏముంటుంది? ► ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణం జరుగుతున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వాయువేగంతో నిర్మాణం జరుగుతోంది. 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి ఏది తీసుకున్నా ఈ 58 నెలల కాలంలోనే అడుగులు పడ్డాయని గర్వంగా చెబుతున్నా. ఇవన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న సత్యాలు. ► ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రతి ఒక్కరి మంచి కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే చంద్రబాబు మాత్రం దోచుకోవడానికి, పంచుకోవటానికి ఉపయోగించాడు. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. కానీ అప్పుల గ్రోత్ రేటు అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రజలకు పరిచయం చేశారు. అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని కోరారు. ఆయనకన్నా పెద్ద శాడిస్టు ఎవరుంటారు...? మన ప్రభుత్వంలో తనకి మేలు జరిగిందని చెప్పినందుకు నా చెల్లెమ్మ గీతాంజలిని సోషల్ మీడియాలో టీడీపీ సైకోలతో వేధించి ప్రాణం తీసిన చంద్రబాబు కన్నా పెద్ద శాడిస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా... గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లీష్ బడులు కనిపిస్తున్నాయి. ఇలా ఏది తీసుకున్నా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అంటూ ఆదివారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా కొనకనమిట్ల: ‘జగనన్న ఆశీస్సులతో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నా.. మీ ఆశీస్సులు అందించండి. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ఉంటా..’ అని ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. 1988 నుంచి 36 ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబంతో తన అనుబంధం కొనసాగుతోందన్నారు. ‘ఒంగోలు ప్రజలు ఎంతో మంచివారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని జగనన్న నన్ను పంపాడు. మీ అందరి అండదండలు నాకు ఉండాలి. నాకు వ్యాపారాలు, వ్యాపకాలు, వ్యసనాలు లేవు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. నేనిక్కడే నివాసముంటా. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటా. ఒంగోలు పార్లమెంట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా’ అని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనతోపాటు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తండ్రి ఆశయం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. – ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి ఆకాంక్షలు నెరవేర్చిన జననేత మార్కాపురం: ఐదేళ్ల పాలనలో 99 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు ఓటు ఎందుకు వేయాలి? ప్రతిపక్షాలకు ఎందుకు వేయకూడదు? అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. నవరత్నాలు అనే రెండు పేజీల మేనిఫెస్టో ద్వారా జగనన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారన్నారు. చెప్పినవే కాకుండా చెప్పనివాటిని సైతం అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటు వేసి ఆశీర్వదించాలని ధైర్యంగా అడిగిన నేత ఒక్క జగనన్న మాత్రమేనన్నారు. పేదలకు అండగా ఉండేందుకు ఈ ప్రభుత్వానికి మరోసారి ఆశీస్సులు అందించాలని కోరారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనన్నారు. వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రాభివృద్ధి కొనసాగేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. – అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి -
Memantha Siddham Photos: మండుటెండలోనూ పోటెత్తిన జన ప్రభంజనం (ఫొటోలు)
-
మేమంతా నీ వెంటే.. ఊరూరా అభిమాన వర్షం (ఫొటోలు)
-
పదో రోజు ‘మేమంతా సిద్ధం’: దారి పొడవునా జననేతకు నీరా‘జనం’
Memantha Sidham Day 10 Highlights CM Jagan Bus Yatra Details సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన దర్శి ప్రజలు దర్శిలో పండుగ వాతావరణం దర్శిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన దర్శి ప్రజలు దర్శిలో పండగ వాతావరణం కాసేపట్లో దర్శి చేరుకోనున్న సీఎం జగన్ బస్సు యాత్ర దర్శిలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు భారీ స్వాగత ఏర్పాట్లు సిటీ మొత్తం మైక్ సెట్లు ఏర్పాట్లు చేసిన కార్యకర్తలు గజ మాలలు, తోరణాలు, మేళ తాళాలతో భారీ స్వాగతం పలకనున్న దర్శి ప్రజలు సీఎం జగన్ రాక కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలు గడియారం సెంటర్‌కి భారీగా చేరుకున్న ప్రజలు.. ‘కొనకొనమిట్ల’ సభలో సీఎం జగన్ ప్రసంగం.. ముఖ్యాంశాలు జన సముద్రం కనిపిస్తోంది ఇసుక వేసినా రాలనంతా జనం కనిపిస్తున్నారు చేయి చేయి కలిపిన ప్రజా కెరటంలా మేమంతా సిద్ధం అని వినిపిస్తోంది పేదల వ్యతిరేకులను ఓడించి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా ఈ ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నికలు కావు పిల్లల బడులు, అక్క,చెల్లెల సాధికారత, అవ్వా,తాతల సంక్షేమం,రైతు భరోసా కొనసాగాలా మోసపోయి వెనక్కు వెళ్లాలా అని నిర్ణయించే ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయి మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడు అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి పెన్షన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడు వాలంటీర్లతో పెన్షన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించాడు ఈ ఎన్నికలు పేదలు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో నెల ఒకటో తారీఖున పెన్షన్లు తెచ్చిచ్చారు చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెన్షన్లుకు లంచాలు తీసుకున్నాయి వెయ్యి రూపాలయ కోసం రోజుల తరబడి నిలుచున్నా పెన్షన్లు రాలేదు ఎక్కడా లంచాల్లేకుండా వాలంటీర్ వ్యవస్థతో మీ బిడ్డ పెన్షన్లు ఇప్పించాడు వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు షాడిస్టు కాక ఇంకేంటి వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ గుర్తుకు రాని చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఇది మీ బిడ్డ 58 ఏళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్.. మీ బిడ్డ గ్రామగ్రామానా ఫ్యామిలీ డాక్టర్ అంటే మీ జగన్.. మీ బిడ్డ అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ జగన్.. మీ బిడ్డ ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్..మీ బిడ్డ పగటి పూటే రైతన్నలకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా అంటే మీ జగన్..మీబిడ్డ ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే మీ జగన్..మీ బిడ్డ అమూల్‌ను తీసుకువచ్చి పాడి రైతులకు ధరలు పెంచింది మీ జగన్.. మీ బిడ్డ వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది మీ జగన్..మీ బిడ్డ ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది మీ జగన్..మీ బిడ్డ నాడు..నేడుతో ప్రభుత్వ బడులు రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్..మీ బిడ్డ అమ్మఒడి ఇచ్చింది మీ జగన్.. మీ బిడ్డ పెద్ద చదువుల కోసం విద్యాదీవెన, విద్యావసతి ఇచ్చింది మీ జగన్..మీ బిడ్డ ప్రభుత్వ ఆస్పత్రులు రూపు మారాయంటే కారణం మీ జగన్.. మీ బిడ్డ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అంటే మీ జగన్ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కారణం మీ జగన్ అక్క చెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ అంటే మీ జగన్ వాహన మిత్ర అంటే మీ జగన్ లా నేస్తం అంటే మీ జగన్ అక్కచెల్లెమ్మలకు రాజకీయ సాధికరత దక్కించింది మీ జగన్ 58 నెలల కాలంలో 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ అక్కచెల్లెమ్మలకే దక్కాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ,ఎస్టీ,బీసీలకు న్యాయం చేశాం రాష్ట్రంలో 4 సీ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా జరగుతోంది కొత్త మెడికల్ కాలేజీలు శరవేగంగా నిర్మిస్తున్నాం మేనిఫెస్టోలో నూటికి 90 శాతం హామీలు నెరవేర్చాం స్కీములన్నీ గ్రామంలో కళ్లెదుటే కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నీ మీ బిడ్డ ఎలా చేశాడు..చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఐదు జెలుసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు ఇందుకే మన జెండా తలెత్తుకోని ఎగురుతూ ఉంది వాళ్ల జెండా 4 జెండాలతో జత కట్టినా కింద పడుతోంది 2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు మళ్లీ అదే చంద్రబాబు,పవన్‌కల్యాణ్, మోదీ వస్తున్నారు హామీల కరపత్రాలను చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు 80 వేల కోట్ల రుణమాఫీ చేశాడా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశాడా ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా ఇంటింటికి ఉద్యోగమిచ్చాడా..నిరుద్యోగ భృతి ఇచ్చాడా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చాడా పక్కా ఇళ్లు నిర్మించాడా ఏపీని సింగపూర్‌గా మార్చాడా ప్రతి నగరాన్ని హైటెక్‌సిటీ చేస్తానన్నాడు చేశాడా ఇప్పుడు మళ్లీ ఇంటింటికి బంగారం,ఇంటింటికి బెంజ్ కారంటూ వస్తున్నాడు చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి మీరు సిద్ధమేనా సిద్ధమయితే సెల్ఫోన్లో టార్చ్ ఆన్ చేసి సిద్ధమే అని నినదించండి 175కు 175 ఎమ్మెల్యే..25కు25 ఎంపీ సీట్లు గెలిపించేందుకు సిద్ధమేనా మన గుర్తు ఫ్యాను.. గుర్తుంచుకుని ఓటేయండి ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్ సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు పేదలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ దమ్మున్న నాయకుడు సీఎం జగన్ కొనకొనమిట్ల ‘మేమంతా సిద్ధం’ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ప్రకాశం జిల్లా, కొనకొనమిట్ల మేమంతా సిద్ధం సభకు చేరుకున్న బస్సు యాత్ర కాసేపట్లో సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ సభకు భారీగా హాజరైన జనం పెత్తందారులపై పోరుకు సిద్ధం అని నినాదాలు పెద అరికట్ల చేరుకున్న బస్సు యాత్ర మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం పెద అరికట్ల గ్రామం చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర 43 డిగ్రీల మండుటెండలోనూ తగ్గని జనాల ఉత్సాహం రోడ్డుకు రెండువైపులా బారులు తీరి సీఎం జగన్ బస్సుయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన చిన్నారులు, విద్యార్ధులు, యువకులు, మహిళలు, అన్నదాతలు, అవ్వాతాతలు కదిలి వచ్చిన కనిగిరి జగన్ బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం పామూరు బస్టాండ్‌లో సీఎం జగన్‌కు గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండుటెండలోనూ కిక్కిరిసిన కనిగిరి రోడ్లు పూలు చల్లుతూ అభిమాన వర్షం కురిపించినమహిళలు సీఎం జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్న రామాపురం గ్రామస్తులు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన రామాపురం గ్రామస్తులు తమ గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్.. ఇలా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలందుతున్నాయంటూ రామాపురం గ్రామస్తులు.. సీఎంను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కనిగిరి చేరుకుంది అడుగడునా సీఎం జగన్‌కు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్న ప్రజలు కనిగిరిలో కొనసాగుతున్న యాత్ర ప్రకాశం జిల్లాలో ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్‌కు అడుగడునా జననీరాజనం దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు ఆపూర్వ స్వాగతం నా స్టార్ క్యాంపెయినర్లతో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర: సీఎం జగన్ పదో రోజు ప్రకాశం జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది యాత్రలో కలిసిన పిల్లలు, వృద్ధులు, మహిళలతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు With my star campaigners from Day-10 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/wl7knYIYUD — YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2024 జగనన్న కోసం యువ స్టార్ క్యాంపెయినర్ కరోనా మహమ్మరి వల్ల తన తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఈ యువకుడి పేరు మునగ అభిరామ్, వయస్సు 18. తాను ఆనాధను కాదని తనకి జగనన్న ఉన్నారంటూ ఇవాళ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం యాత్రలో కనిపించాడు కోవిడ్ తో తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, ఆ విషయం తెలుసుకున్న సీఎం జగన్ చిన్న బిడ్డ ఆనాధగా మిగలకూడదని ఆయన ఆ బిడ్డ జీవితానికి ఒక లైఫ్‌లైన్‌గా నిలిచారు. దాదాపు రూ. 10 లక్షల సీఎం నిధులను కేటాయించి ఆ బిడ్డకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు, అదే బిడ్డ అభిరామ్ సీఎం జగన్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరిగి వచ్చాడు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు సీఎం జగన్‌ను చూడటానికి భారీగా తరలివస్తున్న ప్రజానికం పొన్నలూరు మండలం కే అగ్రహారం చేరుకున్న సీఎం జగన్ అగ్రహారంలో భారీ క్రేన్స్‌తో 10 గజమాలలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు సీఎం జగన్ సమక్షంలో చేరికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు చెందిన కీలక నేతలు జువ్విగుంటక్రాస్ స్టే పాయింట్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి వైయస్సార్సీపీ కండువాలు వేసిన ముఖ్యమంత్రి వైయస్సార్సీపీలోకి చేరిన టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్‌గౌడ్, క్లస్టర్ ఇన్‌ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్‌లు. వైయస్సార్సీపీలోకి చేరిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీ వీ ఆర్ కె చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్ కిరణ్‌లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ మరికొద్ది సేపటిలో కె. అగ్రహారానికి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు గ్రామ ఎంట్రన్స్ వద్దకి భారీగా చేరుకున్న గ్రామస్థులు జువ్విగుంట క్రాస్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. రాత్రి బస పాయింట్ జువ్విగుంట క్రాస్ సీఎం జగన్ బస్సు యాత్ర బయలుదేరింది సీఎం జగన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేతలు చేరిక జువ్విగుంట రాత్రి బస వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ చలమోలు అశోక్ గౌడ్ పదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కే అగ్రహారం వద్ద 10 గజమాలలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సీఎం జగన్‌ను చూడటానికి భారీగా చేరుకుంటున్న ప్రజానికం పదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో మేమంతి సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో జువ్విగుంట క్రాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్దఅరికట్ల చేరుకోకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అనంతరం చిన్నఅరికట్ల, మూగిచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకోనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనకనమెట్ల క్రాస్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్ , పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి బస్సు యాత్ర రాత్రికి వెంకటాచలంపల్లిలో బస చేయనున్న సీఎం జగన్ ప్రకాశం జిల్లా సిద్ధమా...? పదో రోజు ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర కోసం సీఎం జగన్ ట్వీట్ చేశారు. Day-10 ప్రకాశం జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2024 పదో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగనుంది. సీఎం జగన్ బస్సు యాత్ర.. జువ్విగుంట క్రాస్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. మేమంతా సిద్ధం - 10వ రోజు ఆదివారం (ఏప్రిల్ 7) షెడ్యూల్ ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్‌లో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల తరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు. Memantha Siddham Yatra, Day -10. ఉదయం 9 గంటలకు జువ్విగుంట దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు కొనకనమెట్ల దగ్గర బహిరంగ సభ వెంకటాచలంపల్లి క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zqgVFAcXrX — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 తొమ్మిదో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర సూపర్ సక్సెస్ మీరే మా ఆశ.. మీరే మా శ్వాస అంటూ సీఎం జగన్‌ను చూసేందుకు పోటెత్తిన జనాలు మండుటెండను సైతం లెక్క చేయక.. కావలి బహిరంగ సభలో జనసునామీ తన కోసం వచ్చిన వారిని సీఎం జగన్ ఆప్యాయంగా పలకరిచి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిన్నారులు.. యువతులు.. వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగి వారిలో ఆనందోత్సాహాలను నింపారు తొమ్మిది రోజుల మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అభిమానం ఇలా.. Moments of the Day 💫 Memantha Siddham Yatra, Day -9.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/z5dD3NKqk4 — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 Memorable moments from Day-8 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/2E1E92T1qy — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-7.#MemanthaSiddham pic.twitter.com/gDPSZ3rQk3 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-6.#MemanthaSiddham pic.twitter.com/ilx21YyCAC — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from Day-5 of the Memantha Siddham Yatra.#MemanthaSiddham pic.twitter.com/dmCglCUqjC — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from Day-4 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/xqPvXEB4CW — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-3.#MemantaSiddham pic.twitter.com/OYKtc0ssb3 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-2.#MemanthaSiddham pic.twitter.com/uEx9NXjGRO — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-1.#MemanthaSiddham pic.twitter.com/MVp6W2q0eM — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 -
నువ్వే కావాలి జగన్
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి)సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కుల మతాలకు అతీతంగా తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని, వీలైతే మాట్లాడాలని ఊరూ వాడల్లోని చిన్నా, పెద్దా తరలివచ్చి శనివారం 9వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘మళ్లీ నువ్వే కావాలి జగన్’ అంటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కావలి బహిరంగ సభ జన సంద్రాన్ని తలపించింది. చింతారెడ్డిపాలెంలోని రాత్రి బస నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అంతకు ముందు తనను కలిసిన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికల కార్యాచరణపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో చింతారెడ్డిపాలెం రోడ్‌షోలో ఓ మహిళ తన బిడ్డ అనారోగ్య బాధను చెప్పుకునేందుకు ఎదురు చూస్తుండడాన్ని గమనించిన సీఎం.. దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భగత్‌సింగ్ కాలనీకి చేరుకునే సరికి జాతీయ రహదారిపై భారీగా హాజరైన మహిళలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ఘన స్వాగతం కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో పలువురు మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి సీఎం విజయాన్ని కాంక్షించారు. బుల్లితెర నటుడు రియాజ్ సైతం సీఎంను కలిసి బస్సు యాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం సున్నబట్టి, తిప్ప మీదుగా సీఎం రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజుపాళ్యంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎదురు చూస్తున్న అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. చింతరెడ్డిపాలెం నుంచి సింగరాయకొండ వరకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రజాభిమానం వెల్లువెత్తింది. బస్సు దిగి సీఎం జగన్ మహిళలు, వృద్ధులను పలుకరించారు. ఎండను లెక్క చేయని అభిమానం ఐదేళ్ల పాలనలో తాము ఆర్థికంగా నిలదొక్కుకుని, ఆత్మగౌరవంతో జీవించడానికి చేదోడుగా నిలిచిన సీఎం జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 41 డిగ్రీలకు పైగా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా తిప్ప, గౌరవరం, కావలి బైపాస్‌లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చంటిబిడ్డ తల్లులు రోడ్లపై బారులు తీరి జననేతను చూడటానికి పోటీపడ్డారు. మార్గం మధ్యలో భారీ గజమాలతో సత్కరించారు. సీఎం జగన్ 4.30 గంటలకు రోడ్‌షో ద్వారా కావలిలోని సభా స్థలికి చేరుకున్నారు. సభ అనంతరం సీఎం బస్సు యాత్ర ఏలూరుపాడు, ఉలవపాడు మీదుగా 7 గంటలకు సింగరాయకొండ క్రాస్‌కు చేరుకుంది. ఉదయం నుంచి సీఎం రాక కోసం ఎదురు చూస్తున్న ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఓగురు మీదుగా 8 గంటలకు కందుకూరుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రపై బంతిపూల వర్షం కురిసింది.పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా ప్రకాశం జిల్లాలోని జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. జనసంద్రమైన కావలి పెద్ద ఎత్తున కదలివచ్చిన జనం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా కావలిలో నినాదాలు హోరెత్తించారు. జాతీయ రహదారి జనాలతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసానికి జనసంద్రమే ప్రతీక అని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆ బిడ్డను చూడకపోతే ఎలా? సూరీడు నడినెత్తిపైకి వచ్చాడు.. ఎండ వేడికి రోడ్డు సెగలు పుట్టిస్తోంది.. చెట్టు నీడలోనూ చెమట చుక్క ఆరట్లేదు.. ఇంతలో నెత్తిపై తుండు గుడ్డతో బక్కపల్చని శరీరంతో 70 ఏళ్ల వృద్ధురాలు కావలి పట్టణ శివారులో కనిపించింది. ఎవరి కోసమో ఎదురు చూస్తోంది. ‘ఏం అవ్వా.. మండుటెండలో ఇక్కడేం చేస్తున్నావు’ అని అడిగితే.. ‘జగన్ బాబు ఇంకా రాలేదా.. ఎంత దూరంలో ఉన్నాడు..’ అని ఎదురు ప్రశ్నించింది. ‘ఈ వయసులో ఒక పక్క గస పోస్తూ ఎందుకీ తిప్పలు’ అంటే.. ఒకింత కోపంతో చూసింది. నాలాంటోళ్లు ఎందరికో ఆయన ఎంతో మేలు చేశాడు. ‘అలాంటి బిడ్డ మా ఊరికి వచ్చినప్పుడు చూడకపోతే ఎలా? నా పేరు శాంతమ్మ. నాకు ముగ్గురు ఆడ బిడ్డలు. పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారు. కానీ.. జగన్ బాబు నా బాగు కోసం ప్రతి నెలా 1వ తేదీనే ఇంటికి పింఛన్ పంపించాడు. అది ఇప్పుడు ఇంటికి రాకుండా వాళ్లు (టీడీపీ)ఆపేశారు. అందుకే జగన్‌బాబు ఏం చేబితే అది చేద్దామని ఇక్కడికి వచ్చాను’ అని చెప్పింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో శాంతమ్మలాంటి ఎంతో మంది అవ్వాతాతలు కనిపించారు. -
టీడీపీ పని ఔటేనా? అశోక్ గజపతి రాజు మాటల్లో అంతరార్థం ఏంటీ?
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందా? పార్టీ చరిత్రలోనే ఇంతటి అధ్వాన్న పరిస్థితులు ఎన్నడూ లేవా? చంద్రబాబు నాయకుడి అసమర్ధ సారధ్యమే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితిని తెచ్చిపెట్టిందా? ఇక పార్టీకి భవిష్యత్తు లేనట్లేనా? టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మనోభావాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ ఔను అన్న సమాధానాలే వస్తాయి. పార్టీ దుస్థితిని చూసి తట్టుకోలేకపోయిన అశోక్ గజపతి రాజు వంటి సీనియరే ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండలేనని చెప్పేసినట్లు సమాచారం. అంతగా అవసరం అనుకుంటే సలహాలు మాత్రమే ఇస్తానని ఆయన అన్నారని పార్టీ వర్గాల్లోనే కలకలం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ నడక ఎలా సాగుతోంది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఇపుడు ఎంత బలహీనంగా అడుగులు పడుతున్నాయి? ఎన్టీయార్ టిడిపిని స్థాపించినప్పుడు ఆయనతో పాటు చాలా మంది నేతలు రాజకీయ ప్రస్థానాలు ప్రారంభించారు. చాలా మంది రాజకీయ జీవితాలు అప్పుడే మొదలయ్యాయి. అప్పటి టిడిపి నేతలందరికీ అది ఒక స్వర్ణ యుగం. ఎన్నో విలువలతో ఏర్పడిన నాటి టిడిపి ఎన్టీయార్ తోనే కనుమరుగు అయిపోయింది. ఇపుడున్న టిడిపి చంద్రబాబు నాయకత్వంలో పాతాళం దిశగా శరవేగంగా దిగజారిపోతోంది. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి ఎన్టీయార్ టిడిపిని స్థాపించారు. ఆ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీతో నేరుగా చేతులు కలిపిన రోజునే టిడిపిలో ఎన్టీయార్ తాలూకు ఆనవాళ్లు ఏమన్నా ఉంటే అవి మాయం అయిపోయాయి గత సిద్ధాంతాలకు కాలం చెల్లింది. చంద్రబాబు నాయుడి అవకాశవాద రాజకీయాలు టిడిపిని దివాళా తీయించాయనే చెప్పాలి. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు అందులో ఉండి ఆ తర్వాత ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచినపుడు చంద్రబాబుతో అంటకాగిన సీనియర్ నేతలు సైతం టిడిపిని చంద్రబాబు నడిపిస్తోన్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పార్టీలో ఇక క్రియాశీలకంగా కొనసాగలేం అని నిర్ణయించేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో ఎన్టీయార్ హయాంలో మంత్రిగా పనిచేసి ఆయన వెన్నుపోటు సమయంలో చంద్రబాబు శిబిరంలో ఉన్న అశోక్ గజపతి రాజు ప్రస్తుతం టిడిపి తీరుపై కోపంగా ఉన్నారు. ఒకపక్క బిజెపితో ప్రత్యక్ష స్నేహం. మరోవైపు కాంగ్రెస్ తో చీకటి స్నేహం. ఇంత దగుల్బాజీ రాజకీయాలను తన కెరీర్ లోనే చూడలేదని అశోక్ గజపతి రాజు తన అనుయాయులతో అంటున్నట్లు సమాచారం. పార్టీ అధినేతగా చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరి..ఆయన మాటల తీరు కూడా అభ్యంతరకరంగానే ఉన్నాయని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నిన్న కాక మొన్ననే చంద్రబాబు నాయుడు శింగనమల నియోజక వర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు దాన్ని హేళన చేస్తూ పేదలను అవమానిస్తూ డ్రైవర్ల పట్ల తనకున్న ఏవగింపును చాటుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కౌంటర్ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఔను చంద్రబాబూ.. మాది పేదల పార్టీ కాబట్టే పేదవాడైన టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చాం..మరో చోట ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాం? మీలా మాది పెత్తందార్ల పార్టీ కాదు కదా అని చురకంటించారు. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడి వెకిలి మాటలు.. దానికి జగన్ మోహన్ రెడ్డి దీటైన సమాధానం పైనే చర్చ నడుస్తోంది. దీంతోనే సెల్ఫ్ గోల్ వేసుకున్న చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై కక్ష సాధింపుతో ఎన్నికల వేళ వాలంటీర్ల చేత పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇప్పించకుండా ఆంక్షలు విధించాలంటూ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు అందుకున్న ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. దాంతో ఒకటో తారీఖున తెల్లవారు జామునే పింఛన్లను తమ ఇంటికి తెచ్చి ఇచ్చే వాలంటీర్లు ఏప్రిల్ ఒకటో తేదీన రాకపోవడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు నరకయాతన పడ్డారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడి టిడిపి పార్టీయే అని తెలుసుకుని వారు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లపై ఆంక్షలు విధించేలా చేసి ఏదో విజయం సాధించామని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఈ నేలబారు రాజకీయంతో ప్రజల్లో ఆయనపట్ల వ్యతిరేకత ఎన్నో రెట్లు పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు. ఇక పొత్తుల కోసం బిజెపి అగ్రనేతల కాళ్లా వేళ్లా పడి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వెంపర్లాడ్డం కూడా టిడిపి సీనియర్లకు నచ్చడం లేదు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని బిజెపితో పొత్తుకోసం చంద్రబాబు నాయుడు అంతలా దేబిరించాల్సిన అవసరం ఏముందని? సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలోనే ఉత్తరాంధ్ర సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తన అనుచరులతో మాట్లాడుతూ టిడిపి ఇంత అధ్వాన్న స్థితికి పడిపోడానికి కారణం చంద్రబాబు అసమర్ధ నాయకత్వమే అని పెదవి విరిచారట. ఇక ఈ పార్టీలో యాక్టివ్ గా ఉండలేనని అస్త్ర సన్యాసం ప్రకటించారట. పార్టీ నాయకత్వానికి కావాలని అనుకుంటే సలహాలు సూచనలు ఇస్తాను తప్ప నేనైతే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండలేని అని తేల్చి చెప్పేశారట. ఈ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం ఖాయమన్న సంకేతాలను చాలా సర్వేలు అందించాయి. జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు లక్షలాదిగా జనం తరలి వస్తోంటే చంద్రబాబు నాయుడి ప్రజాగళానికి జనం మొహం చాటేస్తున్నారు. ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో ఈ కార్యక్రమాలే చాటి చెబుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత పార్టీలోని సీనియర్లంతా ఒక్కసారిగా చంద్రబాబు పై తిరుగుబాటు చేయడం ఖాయమంటున్నారు వారు. -
#CM YS Jagan: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ సీఎం జగన్
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుందని గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి చేసే వేర్వేరు ప్లాట్‌ఫాంలపై చేసే పోస్టులను విశ్లేషించి, ఎవరిపై ఏ టాపిక్‌పై ఎంత సమయం గడుపుతున్నారన్న దాన్ని బట్టి.. గూగుల్ ట్రెండ్స్ ఫలితాలు ఇస్తుంది. ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టాప్‌లో ఉండగా.. దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేకపోవడం గమనార్హం. గూగుల్ ట్రెండ్స్‌కు సంబంధించి రెండు రకాల రిపోర్టులు పరిశీలిద్దాం. ఒకటి 90 రోజులకు సంబంధించి, మరొకటి గత 30 రోజులకు సంబంధించి. ముందుగా గడిచిన 90 రోజుల ట్రెండ్స్ చూస్తే.. యావరేజ్ ఇంటరెస్ట్ ఓవర్ టైం ►సీఎం వైఎస్ జగన్- 39 నిమిషాలు ►చంద్రబాబు నాయుడు- 12 నిమిషాలు (ఒక్కో యూజర్ ఆయా వ్యక్తుల మీద ఒక రోజు వెచ్చించిన సమయం) గడచిన 90 రోజుల్లో సీఎం జగన్‌కు దగ్గరగా చంద్రబాబు వచ్చింది ఒకే ఒక సారి. అది కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మాత్రమే. ఆ కేసులో చంద్రబాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. తనపై కేసు కొట్టేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పైగా అరెస్ట్ సబబేనని తేల్చిచెప్పింది కూడా. ఇక గడచిన 30 రోజులు అంటే ఎన్నికల వేడి బాగా పెరిగిన తర్వాత గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. యావరేజ్ ఇంటరెస్ట్ ఓవర్ టైం ►సీఎం వైఎస్ జగన్- 45 నిమిషాలు ►చంద్రబాబు నాయుడు- 16 నిమిషాలు తెలుగు భాషలో ఉన్న మీడియాలో సింహాభాగం చంద్రబాబు, ఆయన మనుష్యుల చేతిలో ఉంది. ఇన్నాళ్లు చంద్రబాబు, ఎల్లోమీడియా ఏది చెప్పినా అది నిజమని నమ్మేవారు. ఇప్పుడు జనం ముందు సోషల్ మీడియా పుణ్యమా అని అసలు నిజాలను నెటిజన్లు మాత్రం బయటకు తీస్తూనే ఉన్నారు. అందుకే ఎన్నికల వేళ చంద్రబాబును మరింత దూరం పెట్టారు. -
చంద్రబాబు అహంకారి.. 2019 కంటే TDPకి ఘోరమైన ఓటమి: సజ్జల
గుంటూరు, సాక్షి: చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని.. ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. జనసేన, బీజేపీలో ఉన్నవాళ్లకు నిరాశే. కూటమిలో ఉన్నా చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారు అయ్యాయి. కానీ, 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారు. పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంది. ►2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన పాలనను ప్రజలు మరిచిపోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఈవో మీదకు దూకుడుగా వెళ్లారు. దబాయించి మాట్లాడారు.. (అందుకు సంబంధించిన వీడియోను సజ్జల ప్రదర్శించారు). వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. వాటిపై దాడి చేస్తూ వస్తున్నారు. ►చంద్రబాబు అండ్ కో కక్షతో వలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందర ఆ వ్యవస్థను దూరం చేసింది. తన ఏజెంట్ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా కుట్ర చేస్తోంది. వలంటీర్ వ్యవస్థ వల్ల రెండ్రోజుల్లో ఫించన్ల పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడది ఆలస్యం అయ్యింది. దీంతో పెన్షనర్షలోనూ ఆందోళన వ్యక్తం అయ్యింది. దురదృష్టవశాత్తూ.. ఎండలకు తాళలేక కొందరు చనిపోయారు. అధికారులపైనా చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాక్షస మనస్తతత్వం ఏ నాయకుడిలో కనిపించలేదు. ►చంద్రబాబును శాశ్వతంగా సీఎంను చేసేదాకా రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రుడికి మనసు శాంతించదేమోనని సజ్జల అన్నారు. చంద్రబాబు వదిన పురందేశ్వరి జాతీయ పార్టీలో ఉన్నా.. ఎజెండా మాత్రం చంద్రబాబు కోసం పని చేయడమే. అహంకారంతో ఈ మధ్య ఆమె అధికారులపైనే ఫిర్యాదు చేశారు. చంద్రబాబే సీఎం అనుకుని ఆమె లేఖ రాశారా?. ఈసీ తాను చెప్పినట్లు వింటుందని లేఖ రాశారా? తెలియదు. తన మరిదిని సీఎం చేయాలన్నదే ఆమె తాపత్రయంగా కనిపిస్తోంది. ►చంద్రబాబు చేష్టలతో ఏపీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 2014-19 పాలన ఎక్కడ పునరావృతం అవుతుందో అని ఆలోచన చేశారు. రావణుడిలా చంద్రబాబు మారు వేషంలో ఓటర్ల దగ్గరకు వస్తున్నారు. బాబు సాధువు రూపంలో వచ్చి నమ్మించే యత్నం చేశారు. ఏపీ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతీ వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తోంది. కోవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ఒక్క పథకం కూడా ఆపకుండా అందించారు. సచివాలయ ఉద్యోగులు లక్షా పాతిక వేల మంది ఉన్నారని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ►షర్మిల ఇవ్వాల్సిన సంజాయిషీలు చాలా ఉన్నాయి. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయం అయ్యారు?. ఇక్కడి(ఏపీ) కాంగ్రెస్ బాధ్యతలు ఎవరిచ్చారు? ఎందుకు షర్మిల తీసుకున్నారు?.. కాంగ్రెస్‌తో కొట్లాడుతానని.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మాట్లాడని ఆమె.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. ఇదంతా.. మరో నెలలో ప్రజా కోర్టులో అది తేలుతుంది అని సజ్జల అన్నారు. -
‘అరరె.. బాబు బుర్రలో చిప్‌కి ఏమైంది?’
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కానీ, ఇతరత్రా ఆయా ప్రాంతాలలో జరిగిన సభలలో కానీ చేసిన వివిధ ప్రసంగాలు తమాషాగా ఉంటున్నాయి. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఏమిటి! ఇలా మాట్లాడుతున్నారు.. అన్న సందేహం అందరిలో కలుగుతోంది. కొన్ని ఉదాహరణలు చూడండి. మగవారు టీడీపీకి ఓటు వేయకపోతే వారికి ఆడవాళ్లు భోజనం పెట్టవద్దని చంద్రబాబు అన్నారు. టీడీపీ గ్రాఫ్ పెరగాలని ఆయన అనడం వరకు అభ్యంతరం లేదు. కానీ గ్రాఫ్ పెరగకపోతే దానికి ప్రజలు బాధ్యులట. అందుకే బగ్గింగ్ మెకానీజం ఏదో ఆయన వద్ద ఉందట. ఎవరి ఇంటిలో ఏమి అనుకుంటున్నది ఆయనకు తెలిసిపోతుందని బెదిరిస్తున్నారు. దేశంలో ఇలాంటి విచిత్రమైన ప్రకటన చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు ఉండరు. చంద్రబాబు ఇలా పలు ఆణిముత్యాలను తన ప్రసంగాలలో చెబుతున్నారు. వాటిలో మరీ పరువు తక్కువవి అయితే, టీడీపీకి నష్టం కలిగించేవి అయితే ఎల్లో మీడియా జాగ్రత్తగా ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నాయి. ఆయన నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తారట. ఎవరైనా మద్యం సేవించవద్దని చెప్పాలా? లేక బాగా తాగండి.. తాను అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ తాగిస్తానని చెబుతారా? పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి హామీలా ఇచ్చేది! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరు తమ పిల్లలను బాగా చదివించాలని చెబుతుంటే, చంద్రబాబేమో పేదలకు మద్యం అందిస్తానంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లన్ని చంద్రబాబు టైమ్ లో వచ్చినవే అయినా, వాటన్నిటిని వైఎస్ జగన్మోహన్రెడ్డికు అంటగడుతూ దుష్ప్రచారం చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సైకో అని చంద్రబాబు అంటారు. ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నిస్తారు. తానేసిన రోడ్డుపై నడుస్తారా? తాను ఇచ్చిన మరుగుదొడ్లను వాడతారా అని ప్రశ్నిస్తారు. తన ప్రచార పిచ్చికి గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకున్నారన్న విమర్శ ఎప్పటికి ఆయనపై ఉంటుంది. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా కందుకూరులో ఇరుకు రోడ్డుపై మీటింగ్ పెట్టి తొక్కిసలాటకు కారణం అయ్యారు. ఇక్కడ ఎనిమిది మంది మరణించారు. అలాగే గుంటూరు తొక్కిసలాటలో మరో ముగ్గురు చనిపోయారు. ఇలాంటి ఘటనలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలలో ఎప్పుడైనా జరిగాయా? వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పరిపాలనను ఇంటి వద్దకు తీసుకు వెళితే సైకో అంట. ఈయనేమో ప్రజలను బలిగొంటే వారి ఖర్మ అట. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఈయనకు అండగా ఉండి వారు నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అబద్ధాలు వండి ప్రజల మీద రుద్దుతున్నారు. వాటన్నిటిని ఈయన పట్టుకుని తిరుగుతుంటారు. అలాంటివారిని సైకో అంటారు కానీ, తన మానాన తాను స్కీములు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలా సైకో అవుతారు? వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఐదేళ్లలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నది వాస్తవం. చంద్రబాబు టైమ్ లో మాదిరి ఉద్యమాలు, ఆందోళనలు దాదాపు లేవు. ప్రజలంతా ఈ స్కీముల ద్వారా లబ్ది పొందుతూ సంతృప్తిగా ఉంటే వీరికి కడుపు మంటగా ఉందని చెప్పాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈయన కూటమి కట్టారట. జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. నిజంగానే జనంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉందని నమ్మితే టీడీపీ ఎందుకు ఒంటరిగా పోటీచేయడం లేదు? వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆదరణ పొందుతుండడం వల్ల ఆయనను ఓడించలేమన్న భయంతోనే కదా కూటమి కట్టింది. అయినా గెలుపు మీద సందేహాలు ఏర్పడడంతో చంద్రబాబు చెమటోడ్చుతున్నారు. చివరికి కుప్పంలో ఏమవుతుందో అన్న వణుకు ఆయనలో పుట్టింది. అందువల్లే ఒకటికి రెండుసార్లు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నారు. కుప్పంకు విమానాశ్రయమని, కుప్పంలో అది చేస్తా, ఇది చేస్తా అంటూ హామీలు ఇస్తూ గెలిపించాలని తంటాలు పడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటిని ఎందుకు చేయలేదంటే సమాధానం ఉండదు. హైదరాబాద్‌కు తానే ఫౌండేషన్ వేశానని, రైతులు పొలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి, మిగులు కరెంటును అమ్ముకోవచ్చని అందరూ ఆశ్చర్యపోయే ప్రకటనలు చేస్తున్నారు. ఏపీలో గంజాయి అధికంగా ఉందని అబద్ధాలు ప్రచారం చేసి రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నోరు జారి వైశ్యుల, కిరాణా షాపులవారి ఆగ్రహానికి గురయ్యారు. రావులపాలెం సభలో మాట్లాడుతూ కిరాణా షాపులలో గంజాయి అమ్మతున్నారని విమర్శించారు. దానిపై షాపుల యజమానులంతా బంద్ పాటించగా, వివిధ ప్రాంతాలలో వైశ్య సంఘాలు తీవ్రంగా నిరసించాయి. టిప్పర్ డ్రైవర్‌కు వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇస్తారా అని డ్రైవర్ వృత్తి చేసుకునేవారిని అవమానించారు. ఫలితంగా డ్రైవర్లంతా టీడీపీపై మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఏమైంది! ఇలా మాట్లాడుతున్నారు అని జనం విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. కుప్పంకు హంద్రీ-నీవా జలాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చినా ఎద్దేవగా మాట్లాడారు. ప్రస్తుతం కృష్ణా నదిలో నీళ్లు లేకపోతే, కుప్పంకు వచ్చే కాల్వల్లో నీళ్లేవి అని చంద్రబాబు ప్రశ్నించి ప్రజలను మోసం చేయాలని యత్నించారు. కుప్పం ప్రాంతంలోని చెరువులలో గతంలో ఎన్నడైనా వేసవిలో నీళ్లు ఉండేవా? ఇప్పుడు ఎందుకు ఉన్నాయి. అవి హంద్రీ-నీవా నీళ్లు కాదా? ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు. కుప్పంలో సైతం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీముల వల్ల కొన్నివేల కోట్ల మేర ప్రజలు లబ్ది పొందారు. సుమారు రెండువేల మందికి ఇళ్ల స్థలాలు వచ్చాయి. ఇళ్లు కట్టుకున్నారు. వీటన్నిటిని కప్పిపుచ్చుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో విద్వంసం అంటూ పడికట్టు డైలాగులు వదలుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద సాయం చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న స్కీములను మూడు రెట్లు అమలు చేస్తామని ఎలా చెబుతున్నారు? అంటే ప్రజలను మోసం చేయడమే కదా? సోషల్ మీడియాలో ఒక సామాన్యుడి వ్యాఖ్య చూశాను. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు మూడు లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేసి వారిని ఆదుకున్నారు. చంద్రబాబు టైమ్ లో కూడా రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు కదా! ఆ డబ్బు అంతా అప్పుడు ఏమైపోయింది? వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలా ఇవ్వగలిగాడు?" అని ప్రశ్నించాడు. దీనికి చంద్రబాబు జవాబు ఇవ్వగలిగితే అప్పుడు ఆయన చెప్పే మాటలకు ఏమైనా విలువ వస్తుంది. తను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తానని చెబితే జనం విశ్వసిస్తారా? తాను పద్నాలుగేళ్లు గొప్పగా పాలన చేశానని, ప్రత్యేకించి 2014 -2019 మధ్య ఫలానా విధంగా పాలన చేశానని, దానినే మళ్లీ అందిస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఒక వైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను మంచి చేశానని అనుకుంటేనే ఓటు వేయండని ధైర్యంగా అంటుంటే, చంద్రబాబు మాత్రం తన పాలన గురించి చెప్పలేని దైన్య స్థితిలో ఉన్నారన్నది వాస్తవం. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చీరలతో ఓటర్లకు ఎర.. ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంట్రీతో గుట్టురట్టు!
కర్నూలు: వరుసగా రెండు సార్లు ఓటమిపాలైన తండ్రీకుమారులు.. ఈసారి గెలుపుకోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారు.. చీరల మూటలు తెచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తమ అనుచరులతో ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి టీడీపీ నాయకులు దొరికిపోయారు. వీరు కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అనుచరులు కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు నెలరోజుల ముందే కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రలోభాలకు తెర లేపారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అదే ఉత్సాహంతో మూడవ సారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మారి్నంగ్ వాక్, ఇంటింటి ప్రచారం కార్యక్రమాలతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలు వివరిస్తూ ఆపార్టీ నేతలు బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం నేతల్లో సమన్వయం లేదు. తండ్రి టీజీ వెంకటేష్ ఒక పార్టీ, కుమారుడు టీజీ భరత్ మరో పారీ్టలో కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కూటమి ఏర్పడినా ఏ రోజూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలసి తిరిగిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. టీజీ భరత్ ఒక్కరే సైకిల్ యాత్ర పేరుతో కాలనీలలో తిరుగుతున్నా స్పందన అంతంత మాత్రమే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ప్రత్యేక మ్యానిఫెస్టో పేరుతో ఆ పార్టీ నేతలు నగర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి తండ్రీ కుమారులు ఓడిపోయారు. ఆ పారీ్టకి వెన్నుదన్నుగా ఉన్న లక్కీ–2 కుటుంబం కాంగ్రెస్ పారీ్టలో చేరింది. పి.జి.నరసింహులు యాదవ్ కొత్తపేట ప్రాంతంలో గతంలో కార్పొరేటర్‌గా స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా పనిచేశారు. తాజాగా వీరి కుటుంబంలోనే ఉన్న 51వ వార్డు కార్పొరేటర్ మౌనిక రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పారీ్టకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వీరంతా టీజీ కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. ఇప్పుడు వీరంతా వెంట లేరు. పారీ్టలో నైరాశ్యం ఉంది. జోష్ లేదు. ఏలాగైన గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇక్కడ టీజీ భరత్ ప్రయత్నాలు చేస్తున్నారు. చీరలతో ఓటర్లకు ఎర.. తమ ప్రభుత్వ హయంలో ఫలానా పనులు చేశాం. ఓట్లు వేయండి అని చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. నగరంలోని ఎర్రబురుజు వద్ద కార్యకర్తలను కొంతమందిని నియమించి పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమీపంలోని విక్టరీ థియేటర్లో చీరల మూటలు దాచారు. ఎర్రబురుజు, బొంగుల బజార్, నెహ్రూరోడ్డు, మించిన్ బజార్ వంటి కాలనీలలో ముందుగానే స్థానిక తెలుగుదేశం నాయకులు ఓటర్లకు స్లిప్పులు పంచారు. ఒకేసారి అందరూ వెళ్లకుండా పక్కాగా ప్రణాళిక ప్రకారం చీరల పంపిణీకి రంగం సిద్దం చేశారు. గుట్టుగా ఎర వేసి ఓట్లు కొల్లగొట్టేందుకు చేసిన టీడీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు టీడీపీ వారు దాచిన చీరల మూటలు సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు.. కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కమిషన్ నియమించిన ఫ్ల్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో విక్టరీ థియేటర్లో తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో మూటల మాటున దాచిన చీరలు బయట పడ్డాయి. మొత్తం 975 చీరలు స్వాదీనం చేసుకున్నారు. ఒక్కొక్క చీర రూ.200 ప్రకారం ఉన్నట్లు గుర్తించిన అ«ధికారులు దాదాపు రూ.2 లక్షలు విలువ చేసే చీరలను సీజ్ చేసి నగరపాలక కార్యాలయానికి తరలించారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు రిటరి్నంగ్ అధికారి భార్గవ్‌తేజ వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియామావళిని తప్పకుండా పాటించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే తాను గెలిస్తే ఇది చేస్తా.. అది చేస్తా అని చెప్పుకునేందుకు ఏమీ లేక తాయిలాలు నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు. తాగినోళ్లకు తాగినంత.. గత ఆదివారం.. ఓ హోటల్ కేంద్రంగా టీజీ భరత్ విందురాజకీయం నడిచింది. అప్పటికే అందిన సమాచారం మేరకు.. సాయంత్రానికి కొన్ని కుల సంఘాల ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. కులాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సుమారు పది మంది కూర్చునే వెసలుబాటు కల్పించారు. సమావేశంలో తమ భవిష్యత్‌కు హామీ లభిస్తుందనుకుని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. ఇంతలో టీజీ భరత్ వచ్చి.. అందరూ సహకరిస్తే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెనుదిరిగారు. అప్పుడు మొదలైంది.. తాగినోళ్లకు తాగినంత మందు. రాత్రి సుమారు 11 గంటల వరకు ఈ తతంగం నడిచింది. అంతేకాదు.. తిన్నంత భోజనం కూడా ఏర్పాటు చేశారు.. ఎన్నికల సమయం కదామరి! ఏదో సమావేశం అనుకుని వచ్చిన కొందరు పెద్దలు ఇదేం పని అనుకుని నిట్టూర్చి బయటకు వెళ్లిపోగా.. మరికొందరు ఎంచక్కా విందు, మందుతో ఊగితూగుతూపోయారు. ఓ ఫంక్షన్ హాలులోనూ..? నగరంలోని సంకల్బాగ్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో టీడీపీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తాయిలాలు దాచి పెట్టినట్లు సమాచారం. ఒకే చోట చీరలు, బహుమతులు దాచి పెడితే ఇబ్బందులు వస్తాయని టీజీ అనుచరులు ఈ ఫంక్షన్ హాలులో దాదాపు 30 వేల నుంచి 50 వేల దాకా చీరలు దాచి ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఎన్నికల పర్యవేక్షణ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది విక్టరీ థియేటర్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న చీరలను పెద్ద సంఖ్యలో స్వా«దీనం చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. కుల సంఘాలకు ఎర.. కులాల వారీగా నాయకులను ఎన్నికల వేళ ప్రలోభపెట్టేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీగా తాయిలాలు ప్రకటించడమే కాక ముఖ్యమైన వారికి విందులు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. భరత్ వార్డుల వారీగా కొంతమందిని చేరదీసి వార్డుల్లో ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్న వార్డుల్లోని ముఖ్యులను పిలిపించుకొని ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి కానుకలు పంపిణీ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఇవి చదవండి: వీళ్లా.. అభ్యర్థులు! -
తొమ్మిదో రోజు ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
CM YS Jagan Memantha Siddham Bus Yatra Updates.. తొమ్మిదో రోజు ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జువ్విగుంట క్రాస్ వద్ద నైట్ స్టే పాయింట్‌కి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పొన్నలూరు చేరుకుంది సీఎం జగన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది కావలి బహిరంగ సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరం వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. కావలి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మన నెల్లూరు జిల్లా కావలిలో ఉవ్వేత్తున ఎగిసే కడలి తరంగాన్ని మించిన జన ప్రభంజనం.. ఇసుకవేసినా రాలనంతగా ఈ రోజు నా ఎదుట కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా మరో 5 వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు.. పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు.. పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు.. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు.. ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు? మేనిఫెస్టో చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబు ఉందా? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు ఇప్పటికీ చేసిన పనులు చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు లేదు.. మీ బిడ్డ ప్రతి ఇంటికి మంచి చేశాడు రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలలపాటు సంక్షేమం అందించా మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చా నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా? సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకోచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం.. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా.. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి మరో ఐదేళ్లపాటు మంచి కొనసాగాలంటే తోడుగా ఉండాలి.. ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు.. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డప పుడితే రూ. 25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు... ఇచ్చాడా? 3 సెంట్ల స్థలం.. కుట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు.. ఇచ్చాడా? రూ. 10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా? సింగ్‌పూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు.. నిర్మించాడా? మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు.. సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు.. నమ్మొద్దు రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందు మీరంతా సిద్ధమా? జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు సిద్ధం: ప్రతాప్‌కుమార్ రెడ్డి కావలి బహిరంగ సభలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..: అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చూస్తుంటే జనసముద్రం కనిపిస్తా ఉంది. మన పక్కన సముద్రం ఉంది ఆ సాగర ఘోష వినపడదు కానీ జన హృదయ నేత, ఉప్పొంగిన జనసముద్రం హోరు సాక్షిగా మీముందు రెండు మాటలు మాట్లాడతాను. రామరాజ్యం, ధర్మరాజ్యం తర్వాత మనదేశ చరిత్రలో గుప్తుల రాజ్యంలో ఆకలి చావులు లేవు. అశోకుని కాలంలో కులమతాల వివక్షత లేదు. కాకతీయ రాజ్యంలో మహిళలదే ఎప్పుడూ పైచేయిగా ఉండేది. అదే రాయలవారి పాలనలో సమ సమాజం, వైద్య, విద్య, వ్యవసాయం అన్నీ కూడా సుభిక్షంగా ఉండేవి. ఇవన్నీ కూడా మనం చరిత్ర బుక్కుల్లో రాసుకున్నాం, చదువుకున్నాం. ఆ శకాలు, కాలాలు ముగిసిపోగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తా ఉన్నాం అభద్రత, అశాంతి, అవినీతి పెరిగిపోగా దేవుడా మా బ్రతుకులు బాగుచేయ్, దేవుడా మా కష్టాలు తీర్చవయ్యా అంటూ అభాగ్యుల ఆర్తనాదాలు మిన్నంటిన సమయంలో ఆ దైవం దిగిరాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను తొలగించి అభాగ్యుల కష్టాలను, కన్నీటిని తుడిచే మన దూతగా, మన రాష్ట్రానికి వెలుగు చూపే రత్నాల దీపంగా జగనన్నను ఈ రాష్ట్రానికి పంపారు. రాయలసీమ గడ్డ పైనుంచి నడిచివచ్చే రాయలపాలన వారసుడిగా నవరత్నాల వెలుగులు అందరికీ పంచే సంక్షేమ దివిటి చేతబూని బడుగు, బలహీన భవిష్యత్తు వారధిగా మన ముందుకు వస్తున్నాడు మన జననేత జగనన్న. మీ రాకతో మన కావలి, మా కావలి పులకించింది. నువ్వే మా నమ్మకమంటూ స్వాగతిస్తోంది. జయహో జగన్, జై జగన్ నినాదాలతో ఎన్నికల సమరంలో మీవెంట నడిచేందుకు మేమంతా సిద్ధమంటూ మా యువత, మా అక్కచెల్లెమ్మలు అంతా కూడా ఉరకలేస్తున్నారు. జనం గుండెల్లో గుడి కట్టడమే అజెండాగా మన ముందుకు వచ్చిన జగనన్న కోసం మనమంతా కూడా సిద్ధమా. శ్రామిక శక్తికి సంపద సమానంగా అందితేనే సంక్షేమరాజ్యం, ప్రజలు స్వయంగా సమృద్ధి సాధించాలన్నా గాంధీజీ స్వప్నాలు, ఆశయాలు సాధించాలన్నా అది జగనన్నకే సాధ్యం. కాబట్టి ఈరోజు మీ అందరికీ గుర్తుంది, జగనన్న మాట చెబితే తప్పకుండా చేస్తాడు. అదేవిధంగా ఈరోజు ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్నే అని మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు జగనన్నను ఈ రాష్ట్రానికి మరలా మనం ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధమా. మన కావలి నియోజకవర్గానికి సంబంధించి జగనన్న.. రామాయపట్నం పోర్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మత్స్యకారుల కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లాంటి ప్రాజెక్టును కూడా ఇవ్వడం జరిగింది. మన కావలి నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకుపోవడమే కాకుండా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతోందంటే అది ఒక్క జగనన్నకే సాధ్యమైందని తెలియజేస్తున్నాను. కాబట్టి మన కావలి ప్రజలు తప్పకుండా జగనన్న వెంట మనమంతా కూడా నడవాలి. జరిగే ఎన్నికల పోరాటంలో తప్పకుండా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మనమంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నాను. కావలి బహిరంగ సభా వేదికపై సీఎం జగన్ బహిరంగ సభలో పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం కావలి బహిరంగ సభ వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్ వాక్ ర్యాంప్ మీద నడుస్తూ లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు ప్రజలకు సీఎం జగన్ అభివాదం చేశారు కావలి బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లంచ్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అఖిలభారత యాదవ సంఘం, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభసభ్యుడు బీద మస్తాన్‌రావు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్రాంగణానికి చేరుకున్నబస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్‌కు అడుగడుగునా జననీరాజనం కాసేపట్లో కావలిలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ కావలి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరికలు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లంచ్ స్టే పాయింట్ వద్ద సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు ఉమ్మిడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ ఎస్.శ్రీనుబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సీహెచ్ వెంకటేశ్వరరావు కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుబాషిణి, జనసేన అమలాపురం మండల పార్టీ జనరల్ సెక్రటరీ కె చినబాబుతో పాటు జనసేన పార్టీ వివిధ విభాగాలకు చెందిన ఇతర నేతలు ►సీఎం జగన్ బస్సుయాత్ర నేపథ్యంలో ఆయన రాక కోసం ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద భారీ సంఖ్యలో వేచిచూస్తున్న అభిమానులు. ►సీఎం జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ కోసం ఎదురుచూపులు. ►రాజుపాలెం చేరుకున్న సీఎం జగన్ ►కోవూరు క్రాస్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర కోవూరు నియోజకవర్గం రేగడి చెలిక వద్ద రోడ్డుమీద ప్లకార్డు పట్టుకొని ఉన్న యువతిని చూసి కాన్వాయ్ ఆపిన సీఎం జగన్ ఏలూరుకు చెందిన బాల కళ్యాణి శ్రీ సిటీలో పని చేస్తుండగా.. స్థానికంగా వ్యక్తి వేధిస్తున్నాడని.. పోలీసులు పట్టించుకోవడంలేదని సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసిన యువతీ ఘటనపై విచారణ జరపాలని అధికారులు ఆదేశించిన సీఎం జగన్ ►నెల్లూరులో సీఎం జగన్‌ను కలిసిన టీవీ యాక్టర్, కమెడియన్ రియాజ్ అభిమానులకు జగన్ ఇచ్చే విలువ ఇది! @ysjagan 🤍 ఏ రోజైనా ఇలా పక్కన కూర్చుపెట్టున్నావా రా @PawanKalyan? #YSJaganAgain #VoteForFan #MemanthaSiddham #AndhraPradesh pic.twitter.com/iUmHDu7oE5 — Balaa | 𝗦𝗶𝗱𝗱𝗵𝗮𝗺 (@BalaaTweets) April 6, 2024 ►ఈ సందర్బంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన నేతలు. కోవూరు జంక్షన్ చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 🔥#MemanthaSiddham pic.twitter.com/y6YFU8qxG5 — Rahul (@2024YCP) April 6, 2024 ►నెల్లూరు జిల్లాలో తొమ్మిదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ►రూరల్ నియోజకవర్గంలోని చింతా రెడ్ది పాలెం క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర. ► సీఎం జగన్‌కి ఘన స్వాగతం పలికిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనం అరుణమ్మ, మేయర్ స్రవంతి, ఇతర ముఖ్య నేతలు ►చింతరెడ్డిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు. ►పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్. ఈ సందర్బంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి. ► నెల్లూరు జిల్లా సిద్ధమా..? సీఎం జగన్ ట్వీట్ Day-9 నెల్లూరు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 ► వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు తొమ్మిదో రోజు (శనివారం) కొనసాగునుంది. సీఎం వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు బస్సుయాత్రకు బయలుదేరుతారు. ► నేడు కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం మూడు గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. Memantha Siddham Yatra, Day -9. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు కావలి బైపాస్ దగ్గరబహిరంగ సభ జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/3oqaBoGJAU — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 ► సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు. ఎనిమిది రోజుల మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అభిమానం ఇలా.. Memorable moments from Day-8 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/2E1E92T1qy — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-7.#MemanthaSiddham pic.twitter.com/gDPSZ3rQk3 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-6.#MemanthaSiddham pic.twitter.com/ilx21YyCAC — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from Day-5 of the Memantha Siddham Yatra.#MemanthaSiddham pic.twitter.com/dmCglCUqjC — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from Day-4 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/xqPvXEB4CW — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-3.#MemantaSiddham pic.twitter.com/OYKtc0ssb3 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-2.#MemanthaSiddham pic.twitter.com/uEx9NXjGRO — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-1.#MemanthaSiddham pic.twitter.com/MVp6W2q0eM — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 -
బాబు తన ప్లాన్ ప్రకారమే జనసేన 'కుర్చీ మడతెట్టేశాడు'!
ప్రకాశం: టీడీపీ అధినేత జిత్తుల మారి నారా ఎత్తులతో జిల్లాలోనే జనసేన కుర్చీ మడతెట్టేశాడు. నాలుగేళ్లుగా దర్శిలో కష్టపడిన స్థానిక టీడీపీ, సేనలకు చంద్రబాబు మొండిచేయి చూపారు. ఇక్కడ అభ్యర్థి విషయంపై చివరి వరకూ ఇటు టీడీపీ.. అటు జనసేనలను ఊరించారు. ఆశావహులను ఉసూరుమనిపించారు. చివరకు ఈ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని జిల్లా ఎల్లలు దాటి తన సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళకు టికెట్ ఇచ్చి స్థానిక నేతలకు బాబు మార్క్ షాక్ ఇచ్చారు. దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నాలుగేళ్లుగా జనసేన పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో గిద్దలూరు తర్వాత జనసేనలు ఆశించింది దర్శి స్థానాన్నే. 2019లో ఇక్కడ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు కాపు సామాజిక వర్గానికి చెందిన బొటుకు రమేష్. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన వరికూటి నాగరాజు కూడా 2024లో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఒక వేళ పొత్తులో భాగంగా జనసేనకు ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వాల్సి వస్తుందేమోనని టీడీపీ అధినేత చంద్రబాబు తన మార్క్ కుట్ర రాజకీయానికి తెరతీశారు. అప్పటి వరకూ గ్లాసు పార్టీని నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి పోటీగా తన సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని జనసేనలోకి పంపేందుకు పథకాన్ని రచించారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో ఉన్న నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గరికపాటి వెంకట్‌ను జనసేన పార్టీలోకి పంపారు. పక్కా ప్లాన్ ప్రకారం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన వెంకట్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాడు. భారీగా జనసేన, టీడీపీల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జనసేన టికెట్ నాదేనంటూ స్పీడ్ పెంచి హంగామా చేశారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన ఎడ్ల పందేలు, ముగ్గుల పోటీలు వంటి పలు కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించిన టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న పమిడి రమేష్ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇక వెంకట్ అన్నీ తానై వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో సమీకరణాలు మారిపోతూ వచ్చాయి. గాల్లో కృష్ణ చైతన్య.. అద్దంకిలో ఉన్న బాచిన చెంచు గరటయ్య, ఆయన కుమారుడు కృష్ణ చైతన్యలను పార్టీలోకి తీసుకుని అవసరమైతే జనసేన నుంచి పోటీ చేయాలని బాబు కండీషన్లు పెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు ఈయన కంటే ధనవంతుడికి గాలం వేశారు. రహస్యంగా ఆయనతో చర్చలు జరుపుతూనే మరో పక్క కృష్ణచైతన్యకు మొండిచేయి చూపారు. చివరకు చీరాల టికెట్ అయినా కేటాయించాలని గరటయ్య చంద్రబాబును కోరారు. అక్కడా వారిని చివరి వరకూ ఊరించి ఉసూరుమనిపించారు. బాబు రాజకీయ కుట్రలకు ప్రస్తుతం తండ్రీ, కొడుకుల పరిస్థితి అగమ్యంగా మారింది. ఇక కమ్మసామాజిక వర్గానికి చెందిన గోరంట్ల రవికుమార్‌ను ఇన్చార్జిగా రంగంలోకి దింపారు. ఆయన్ను స్థానిక కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన నేతలు పూర్తిగా వ్యతిరేకించారు. జనసేన కానీ, టీడీపీ అయినా స్థానికులకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎల్లో మీడియా ద్వారా రోజుకో పేరును తెరపైకి తెచ్చి స్థానిక నేతలను గందరగోళానికి గురిచేశారు. ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో కొత్త పేర్లను ప్రచారంలోకి తెచ్చారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు స్థానిక కేడర్‌ను సైతం పట్టించుకోకుండా పొరుగు జిల్లాకు చెందిన గొట్టిపాటి లక్ష్మికి టికెట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. వాస్తవానికి నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్‌గా ప్రైవేట్ క్లీనిక్ నిర్వహిస్తున్న ఆమె అక్కడే టికెట్ ఆశించారు. అయితే ఆమెకు అనూహ్యంగా దర్శి టికెట్ ఇచ్చారు. ఈ నిర్ణయంపై రెండు పార్టీల నేతలు విస్మయానికి గురయ్యారు. అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ ఎలా పనికొస్తుందంటూ బాహాటంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. టికెట్ ఆశలతో స్థాయిని బట్టి రూ.లక్షలు, రూ.కోట్లు ఖర్చుచేసుకున్న జనసేన నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదంటూ ఆ పార్టీ కార్యకర్తలు సైతం హెచ్చరిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన గరికపాటి వెంకట్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థి లక్ష్మి బంధువులు రంగంలోకి దిగినట్టు తెలిసింది. అతనితో చర్చలు జరుపుతున్న విషయం స్థానిక కేడర్‌కు తెలిసింది. నీతో పాటు మేము కూడా పార్టీలో కష్టపడ్డాం. రూ.లక్షలు ఖర్చుచేశాం..మరి మా పరిస్థితి ఏంటని నిలదీసినట్టు స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చంద్రబాబు ఎత్తులకు జనసేనలు చిత్తయ్యారు. ఇవి చదవండి: చీరలతో ఓటర్లకు ఎర.. ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంట్రీతో గుట్టురట్టు! -
'మేమంతా సిద్ధం' సభతో.. కపట కూటమిలో మొదలైన వణుకు!
సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా హారతులు పట్టి, దిష్టితీసి, దీవెనలందించారు. బస్సు యాత్రగా వస్తున్న సీఎం జగన్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ‘నువ్వే మళ్లీ సీఎం.. మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ముసలి, ముతక, చిన్నాపెద్దా తేడాలేకుండా అభిమాన నేతను చూసి తరించారు. సెల్ఫీలు దిగి సంతోషంతో ఉప్పొంగి పోయారు. కరచాలనానికి పోటీపడ్డారు. దారిపొడవునా పూల వర్షం కురిపించారు. గుండెగుడిలో గూడుకట్టుకున్న అభిమానాన్ని రంగరించి ఆత్మీయతను పంచారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపగా.. కపట కూటమి నేతల్లో వణుకుపుట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పలు సంక్షేమ పథకాలను అందుకుంటున్న అనేక మంది లబ్ధిదారులు బస్సు యాత్రలో దారి పొడవునా జననేతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అప్యాయంగా పలుకరిస్తూ ‘నువ్వు సల్లగా ఉండాలి నాయనా’ అంటూ దీవించి ముందుకు సాగనంపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు గ్రామాల మీదుగా సాగింది. ఈ బస్సు యాత్రలో మరోసారి పల్లెలను పలుకరిస్తూ.. స్థానికుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఈనెల 2న ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చౌడేపల్లి, పుంగనూరు, సదుం, కల్లూరు, పాకాల, ఐరాల, పూతలపట్టు, చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి, గూడూరు మండలాల మీదుగా సాగింది. బస్సు యాత్ర సాగినంత దూరం సీఎం వైఎస్ జగన్‌ని చూసేందుకు జనం బారులు తీరారు. సీఎం బస్సు దిగి వారందరినీ ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగతం లభించింది. దామలచెరువుకు ముందే ఉగాది పండుగ వచ్చిందా? అనిపించేలా పండుగ వాతావరణం కనిపించింది. ఆత్మీయ సమావేశం కల్లూరు శివారు ప్రాంతంలో కురుబ సామాజికవర్గం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం, చిన్నసింగమాల వద్ద ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని భరోసా కల్పించారు. వారి ఆత్మీయతతో సీఎం వైఎస్ జగన్ పులకరించిపోయారు. ఇదిలా ఉంటే.. కల్లూరులో నిర్వహించిన బస్సు యాత్రకు ముస్లింమైనారిటీ మహిళలు పోటెత్తారు. దారిపొడవునా సీఎం వైఎస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి, నాయుడుపేటలో ట్రాంజెండర్స్ సీఎం వైఎస్ జగన్‌కి గుమ్మడి కాయలతో దిష్టి తీసి ఆశీర్వదించి ముందుకు సాగనంపారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూతలపట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలు నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలోని జనం, వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చెయ్యకుండా.. పనులన్నింటినీ పక్కనబెట్టి జననేతను ఒక్కసారి చూసేందుకు పరితపించిపోయారు. ఆయా పార్లమెంట్ పరిధి నుంచి వచ్చిన వారితో సభా ప్రాంగణం నిండిపోయి జాతీయ రహదారి కూడా కిక్కిరిసిపోయింది. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. పచ్చ కూటమిలో కుదేలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభించడంతో పచ్చ కూటమి నేతల్లో వణుకు పుట్టింది. చంద్రబాబు వెంకటగిరి, గంగాధరనెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, కుప్పంలో నిర్వహించిన అన్ని బహిరంగ సభలకు హాజరైన జనం ఒక ఎత్తైతే.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం సభ ఒక్కటే ఒక ఎత్తుగా నిలిచిందని జనం చర్చించుకోవడం కనిపించింది. అదేవిధంగా మేమంతా సిద్ధం సభలు, బస్సు యాత్రకు వెళ్లలేని అనేక మంది టీవీలకు అతుక్కుపోయి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన, ప్రసంగాన్ని వినడం విశేషం. మారుమూల గ్రామాల నుంచి మేమంతా సిద్ధం సభలకు తరలిచ్చే జనాన్ని చూసిని జనం, మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ‘కూటమి కుదేలవ్వడం ఖాయం’ అని చర్చించుకోవడం గమనార్హం. ఇవి చదవండి: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర తొమ్మిదో రోజు షెడ్యూల్ ఇలా.. -
చంద్రబాబు, లోకేశ్‌ల.. ఎమ్మెల్సీ మంత్రం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని టీడీపీలో ఇప్పుడు నియోజక వర్గానికో కొల్ల అప్పలనాయుడు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ గొంప కృష్ణ, ఓ కిమిడి నాగార్జున, ఓ బొబ్బిలి చిరంజీవులు, ఓ ఆర్పీ భంజ్‌దేవ్, ఓ మీసాల గీత, ఓ తెంటు లక్ష్మునాయుడు, ఓ కేఏ నాయుడు, ఓ కావలి గ్రీష్మ, ఓ కర్రోతు బంగార్రాజు.. ఇలా ఊహూ అన్న ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్సీ చేసేస్తామని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హామీలిచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ ఉద్యోగాలిస్తామని హీరో రవితేజ బృందాన్ని బురిడీ కొట్టించిన సీన్ గుర్తొస్తుంది. ‘ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్‌యార్డా, ఏసియాడా, జింకా, బంకా (హెచ్‌పీసీఎల్)... ఏ కంపెనీలో ఉద్యోగం కావాలి? జీఎం కావాల్న? ఏజీఎం కావాల్న?’ అని ఊరించి డబ్బులు నొక్కేసి కృష్ణభగవాన్ లాఘవంగా జెల్ల కొట్టేసిన హాస్యభరిత సన్నివేశం ఇప్పుడీ టీడీపీ నాయకుల సీట్ల వ్యవహారంలో కనిపిస్తోంది. మాట ఇస్తే ఆరునూరైనా అమలుచేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి మనస్థత్వం కాదు వారిది!. చంద్రబాబు, లోకేశ్ హామీలిచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత ఎలా ముంచేస్తారో కొల్ల అప్పలనాయుడి అనుభవమే నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా మద్దతు కూడగట్టాలని ప్రతి నియోజకవర్గంలో రెబెల్స్‌కు ఎమ్మెల్సీ ఆశ చూపిస్తున్నారు. లేదంటే నామినేటెడ్ పోస్టు.. అదీ లేదంటే సముచిత స్థానం కల్పిస్తామని భ్రమలు కల్పిస్తున్నారు. ఉన్నవెన్ని? వచ్చేవెన్ని? రాష్ట్ర శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. రెండేళ్లకోసారి మూడింట ఒకటో వంతు మంది పదవీ విరమణ చేస్తుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బలం 43 కాగా టీడీపీకి ఉన్నవి ఎనిమిది మాత్రమే. మిగతావాటిలో పీడీఎఫ్ సభ్యులు ఇద్దరు, స్వతంత్ర సభ్యులు నలుగురు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిపోయినట్లుగానే భవిష్యత్తులో శాసనమండలి నుంచి కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేట్లు ఉంది. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాల్లో భాగంగా సొమ్ములు దండిగా ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడినవారికి మొండిచేయి చూపిస్తున్నారు. వారిని బుజ్జగించడానికి ‘ఎమ్మెల్సీ’ పదవులనే బిస్కెట్లు వేస్తున్నారు. మన రెండు జిల్లాల్లోనే పది మంది వరకూ ఇలాంటి ఆశాజీవులు ఉంటే... రాష్ట్రంలో ఇలా ఆశలపల్లకి ఎక్కిస్తున్నవారి సంఖ్య వందకు పైమాటే. చంద్రబాబు బూటకపు హామీలిచ్చి ప్రజలనే కాదు సొంత పార్టీ నాయకులనూ బురిడీ కొట్టిస్తున్నారడంలో సందేహం అక్కర్లేదు. కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి.. మరీ.. ఈయన పేరు కొల్ల అప్పలనాయుడు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండుసార్లు తన అనుచరులనే ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌ను చేస్తానని ఆశచూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా మొండిచేయి చూపించారు. చౌదరి ధనలక్ష్మిని చంద్రబాబు ఆ పదవిలో కూర్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి... ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తారని ఆశించిన కొల్లకు జెల్ల కొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజును అందలం ఎక్కించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొల్ల తాను రెబెల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు. ఇవి చదవండి: బాబు తన ప్లాన్ ప్రకారమే జనసేన 'కుర్చీ మడతెట్టేశాడు'! -
పవన్.. చిత్తశుద్ధే తారుమారు! పిఠాపురంలో కష్టాలే..
కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాన్ని ఏరి కోరి ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లోనూ కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకునే ఆయన బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ మొదటినుంచీ కాపు వ్యతిరేకి అయిన చంద్రబాబుతో అంటకాగడం వల్లనే కాపు మేథావులు పవన్ కల్యాణ్‌ను దూరం పెడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. కాపుల ఆరాధ్య నాయకుడైన వంగవీటి రంగా హత్యకేసులో అన్నీ వేళ్లూ చంద్రబాబు నాయుడివైపే చూపిస్తోంటే.. పవన్ కల్యాణ్ ఆ చంద్రబాబుతోనే జట్టు కట్టి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయడంకోసం కాపుల రాజకీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంపై కాపుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తనకు కులాలు మతాలు లేవంటారు పవన్ కల్యాణ్. ఆ వెంటనే నేను రెల్లి కులస్థుడినంటారు. టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్లకోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తే.. కాపులకు రిజర్వేషన్లేంటి? కులాల పేరుతో ఉద్యమాలేంటి? అంటూ పోజు కొట్టారు పవన్ కల్యాణ్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు రిజర్వేషన్లు ఏమయ్యాయంటూ అమాయకంగా అడిగారు ఇదే పవన్. వంగవీటి రంగా అంటే తనకు చాలా గౌరవం అన్నారు. ఆయన్ని జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఒకసారి.. ఓ సారి రంగా మా ఇంటికి వస్తే టీ ఇచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. వంగవీటి రంగా దారుణ హత్య వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే అని రంగా హత్య జరిగిన సమయంలో హోంమంత్రిగా ఉన్న కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో కాపు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రంగాతో పాటు తనని కూడా హతమార్చడానికి చంద్రబాబు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్నరాన్న అభియోగంపై జైలుకెళ్తే పవన్ కల్యాణ్ చాలా బాధపడ్డారట. రంగా హత్యోదంతం నేపథ్యంలో కాపులు చంద్రబాబును ఏవగించుకుంటున్నారని గమనించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని కాపులు - కమ్మలు కలిసి ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించాలంటే కాపులు - కమ్మలు చేతులు కలపాల్సిందేనని పవన్ థియరీని విడుదల చేశారు. కాపుల్లో రంగాకి అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. అటువంటినేతను చంద్రబాబు నాయుడు పొట్టన పెట్టుకున్నారన్న కోపం కూడా కాపుల్లో ఉంది. కాపు ఓట్లతోనే గెలవగలను అనుకుంటోన్న పవన్ పిఠాపురం సీటును ఎంచుకున్నది చంద్రబాబు సలహాతోనే అంటున్నారు. అయితే కాపుల్లో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని సంక్షోభంలో ఉన్న టీడీపీకి మద్దతు పలికారు పవన్ కల్యాణ్. అయినా ఎన్నికల పొత్తులో కనీసం ఓ 60 సీట్లు కూడా సాధించుకోకుండా ముష్టి 21 సీట్లతో సరిపెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయి. అదికూడా చంద్రబాబును సీఎంని చేయడానికి పవన్ పరితపిస్తోన్న తీరు కాపులకు నచ్చడం లేదు. చంద్రబాబు నాయుడి కోసం, కాపులకోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలను సైతం పవన్ దూరం పెట్టేశారు. అంతే కాదు వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. మైక్ పట్టుకుని ఉపన్యాసాలు దంచేటపుడు తాను విశ్వమానవుడినని పవన్ చెబుతూ ఉంటారు. కొద్ది నిముషాల్లోనే అది మర్చిపోయి కులాల ప్రస్తావన తెస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డిపై ద్వేషంతో ఆయన నియోజక వర్గం అయిన పులివెందులను దూషిస్తూ పైశాచికానందాన్ని పొందుతూ ఉంటారు. కాపులకోసం పవన్ కల్యాణ్ ఏనాడూ చిత్తశుద్ధిగా పనిచేయలేదు కాబట్టే భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో కాపులు కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు. అందుకే ఆయన ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ అదే రిపీట్ అవుతుందంటున్నారు పాలక పక్ష నేతలు. ఇవి చదవండి: నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్ జాగ్రత్త! -
నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్ జాగ్రత్త!
పచ్చపార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది. జనసేన-బీజేపీలతో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్ తో పరోక్షంగానూ కమ్యూనిస్టులతో సీక్రెట్ ఒప్పందాలతోనూ బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది. దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటేశాయని అర్ధమైపోతోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో వలంటీర్లపై కక్షసాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనే లాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో జనం అంతా జగన్ మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్ధం అయిపోయింది. మరేం చేయాలి? ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. దాంతో పాలక పక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు. అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్లల్లో తిరుగుతున్నాయి స్టూవర్ట్ పురం దొంగల ముఠాలకన్నా ప్రమాదకరమైన ముఠాలవి.చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం..ఆయన రాజకీయ ప్రత్యర్ధులపై విష ప్రచారం చేయడం ఈ ముఠాల పని. దీనికోసం వీరికి కిరాయి చెల్లిస్తున్నారు. ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే... తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. చంద్రబాబు నాయకత్వానికి కూడా. ఈ ఎన్నికల్లో కూడా ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళాలు వేయాల్సిందే. ప్రస్తుత వాతావరణం చూస్తోంటే ఈ సారి కూడా వైఎస్సార్సీపీ విజయమే ఖాయమని రక రకాల సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇస్తున్నారు అంతా. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది. టీడీపీ గెలుస్తుందని చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్ధమైపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను మెదడులోంచి బయటకు తీశారు. ఆ ఆలోచన ఏంటంటే.. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుస్తందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి. వైఎస్సార్సీపీ గెలవదని చెబితే ఏమైనా వర్కవుట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను అమలు చేస్తున్నారు. జనం ఎక్కువగా తచ్చాడే కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రైళ్లల్లో కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు. ఈ గుంపుల పని ఏంటంటే.. మేం వైఎస్ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ.. ఈ సారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది" అని ప్రచారం చేస్తున్నారు. అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట. దీనికి గానూ ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్టజెబుతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచులను ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే..ఈ మౌత్ టాక్ మల్లిగాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు. పీకే ఫ్యామిలీపై విషం చిమ్మినోళ్లే.. జనం రద్దీగా ఉండే చోట వీళ్లు అమాంతం వచ్చి.. వాళ్లే మాటలు కలిపి ఈ సారి వైఎస్సార్సీపీ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కవుట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గుంపుల్లో ఉండే వారంతా పచ్చ కార్యకర్తలే. గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కల్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్ మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు. మౌత్ టాక్‌తోనే పాలక పక్షాన్ని దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అసలింతకీ ఈ అయిడియా రావడానికి కారణాలేంటి? చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కుంగిపోడానికి కారణాలు ఉన్నాయి. జనం తమ వైపు లేరు. విజయం తమ వైపు లేదు. అధికారం తమకు దక్కేలా లేదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు. చంద్రబాబు, లోకేష్ లు సభలు పెడితే జనం కనపడ్డం లేదు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనపడ్డం లేదు. ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్లు బైర్లు కమ్మి కళ్లముందు ఏమీ కనపడ్డం లేదు. తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్ధం అయిపోయింది. పార్టీయే కాదు తన సొంత నియోజక వర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది. గుణపాఠం తప్పదా? పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. కాలం కలిసొచ్చినపుడు..తమ పెంపుడు మీడియా తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీలో కాదు తన సొంత నియోజక వర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. అది సరిపోదని బిజెపి నేతలు ఛీ ఛీ అంటోన్న కాళ్లబేరాలాడి పొత్తు పెట్టుకున్నారు. తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో కాంగ్రెస్ తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని 2014 నుంచి ఏపీలో ఏ ఎన్నికలోనూ బోణీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు. అయినా వర్కవుట్ అయ్యే లా లేదని.. స్వయం ప్రకటిత మేథావులను తీసుకొచ్చి వారికి ఓ దుకాణం తెరిచి ఆ దుకాణం తరపున పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ దుకాణం తరపునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించారు. మండు టెండల్లో అవ్వా తాతలను మంచాలపై తీసుకెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటోన్న దృశ్యాలు చూసి యావత్ ఆంధ్ర ప్రదేశ్ ... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు వలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛనుదార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరుగుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుయ్యిమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు. దిక్కుమాలిన ఐడియాలు రక రకాల సర్వేలు ఏపీలో YSRCP అఖండ విజయం ఖాయమని తేల్చాయి. చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. సిగ్గు లజ్జ వదిలేసి బిజెపి నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయ్యింది. ఏం చేయాలో పాలుపలోలేదు. ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్ల పై ఆంక్షలు విధిస్తే ఇపుడు 66 లక్షల మంది పింఛను దార్లు తనపై పీకలదాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవ రంధ్రాల్లోంచి భయం కారిపోతోంది. అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషం చిమ్మితే ఆ మేరకు అయినా వైఎస్సార్సీపీ ఓట్లకు గండి కొట్టచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకూ పనికిరావంటున్నారు రాజకీయ పండితులు. అయితే ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అయిదేళ్లుగా తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లల్లో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు. తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర లో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఆయన బస్సుయాత్ర ఆరంభించగానే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తోన్న భీకర వేడి వాతావరణంలోనూ ఆరేళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్ మోహన్ రెడ్డినే సిఎంని చేసుకోడానికి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడి తరపున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు.. వైఎస్సార్సీపీ విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పాలక పక్ష నేతలు. -
ఒకప్పుడు పొసగేదే కాదు.. ఇప్పుడు మరీ ఇంత ఆత్మీయతా?
ఏపీలో వైఎస్సార్సీపీను ఓడించలేమన్న భావనకు వచ్చిన విపక్ష కూటమి ఇప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయానికి బరి తెగిస్తోంది. బీజేపీని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలిసిపోతూనే ఉన్నాయి. పట్టుమని పది అసెంబ్లీ సీట్లకు పోటీచేయని బీజేపీ పక్షాన ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల సంఘానికి పోలీసు అధికారులపై ఒక పెద్ద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న 22 మంది పోలీసు అధికారులపై ఈ ఫిర్యాదు ఉంది. అది చదివితే ఒక విషయం బోధ పడుతుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న నాటకం అని ఇట్టే అర్దం అయిపోతుంది. బీజేపీ తాను పోటీచేస్తున్న ప్రాంతాలలో పోలీసు అధికారులు ఎవరైనా తప్పు చేస్తున్నారని సమాచారం ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లవచ్చు. అలాకాకుండా ఇంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారంటే ఇదంతా టీడీపీ కుట్రగానే కనిపిస్తుంది. ఇందులో విడ్డూరం ఏమిటంటే 'తమకు ఫలానా అధికారులు కావాలని అడగడం'. బహుశా దేశంలోనే ఇలా ఏ రాజకీయ పార్టీ కోరి ఉండరు. తాను నేరుగా ఫిర్యాదు చేస్తే పోలీసు వ్యవస్థ అంతా తమకు వ్యతిరేకం అవుతుందని, దాని వల్ల నష్టం ఏమైనా జరుగుతుందేమోనని అనుమానించిన చంద్రబాబు ఈ పనికి పురందేశ్వరిని పురమాయించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఏదైనా అప్రతిష్ట వచ్చినా పురందేశ్వరికే కాబట్టి వ్యూహాత్మకంగా ఈ ప్లాన్ అమలు చేశారని అనుకోవాలి. ఎన్టీ రామారావు కుమార్తెగా ఉన్న పురందేశ్వరి ఆయనకు ప్రతిష్ట తీసుకురాకపోతే మానే.. ఆయన పరువు తీస్తున్న కూతురుగా ప్రసిద్దికెక్కుతున్నారు. 'ఒకప్పుడు చంద్రబాబుకు, పురందేశ్వరికి మధ్య ఏ మాత్రం పొసగేది కాదు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును పలుమార్లు చంద్రబాబు అవమానించారని ఆమె మదనపడేవారు. ఒక సందర్భంలో ఆమె ఇంటిలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబును పలకరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదంటే ఆశ్చర్యం కాదు'. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఇలా రెండు కుటుంబాల మధ్య ఇంత ఆత్మీయత ఎలా వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. పురందేశ్వరి తమకు జరిగిన అవమానాలు మర్చిపోయి తెలుగుదేశం ఎజెండా కోసం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటే, ఆమె ఎంపీ పదవి కోసం ఎంత తహతహలాడుతున్నారో అర్ధం అవుతుంది. 2014లో కూడా బీజేపీ, జనసేన,టీడీపీ కలిసి పోటీచేశాయి. కానీ అప్పటికి చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజీ కుదరలేదు. చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి పురందేశ్వరిని తెలివిగా రాజంపేటలో పోటీచేయించారు. తద్వారా ఆమె అక్కడ ఓడిపోయేలా చేశారు. చాలాకాలం ఆ బాధ ఆమెలో ఉండేది. ఎప్పుడు రాజీపడ్డారో కానీ, చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో జైలులో ఉన్నప్పుడు లోకేష్‌ను పురందేశ్వరి వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్‌షా తో కలిపారు. అలాగే ఎన్టీ రామారావు గోల్డ్ కాయిన్ విడుదల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను పిలిచి, అక్కడ చంద్రబాబుతో మాట, మంతి కలిసేలా దగ్గుబాటి దంపతులు చేశారు. బీజేపీ అధిష్టానం పురందేశ్వరిని ఎందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చేశారో తెలియదు కానీ, ఆమె అప్పటి నుంచి ఆ పార్టీని పూర్తిగా తెలుగుదేశంకు అనుకూలంగా మార్చివేశారు. చివరికి బీజేపీ ఇచ్చిన లోక్ సభ టిక్కెట్లు ఆరింటిలో ఐదు ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే దక్కడం విశేషం. ఒరిజినల్ బీజేపీ నేతలంతా దిక్కుతోచని స్థితిలో తమ ఖర్మ అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ విషయాలు పక్కనబెడితే పురందేశ్వరి రాసిన ఫిర్యాదును పరిశీలిస్తే, అందులో టీడీపీ అరాచకాలను అడ్డుకున్నవారి పేర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్‌లను బయటకు తెచ్చినవారి పేర్లే ఎక్కువగా కనిపించాయి. ప్రత్యేకించి ఒక సామాజికవర్గంపై వ్యతిరేకతతో కూడా ఈ ఫిర్యాదు చేశారా అన్న అనుమానం వస్తుంది. టీడీపీ మీడియాలో వచ్చిన కథనంలో ఏమి రాశారో చూడండి.. 'డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నుంచి ఎస్పీ ఆనందరెడ్డి వరకు అని పేర్కొనడంలోనే కుత్సిత స్వభావం కనిపిస్తుంది.వీరంతా వైసిపితో సంబంధాలు ఉన్నవారట. విపక్షాలను వేధిస్తున్నారట. వీరిని తప్పిస్తేకానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఈమె అంటున్నారు'. నిజానికి ఈ 22 మంది ఎవరో పురందేశ్వరికి తెలియకపోవచ్చు. వీరి పేర్లు చెప్పాలని ఆమెను అడిగితే చెప్పలేకపోవచ్చు కూడా. ఎందుకంటే కేవలం టీడీపీ రాసిన ఒక పత్రంపై ఆమె సంతకాలు చేసి ఎన్నికల సంఘానికి పంపి ఉండవచ్చనిపిస్తుంది. బహుశా టీడీపీ హయాంలో ఆనాటి ఇంటిలెజెన్స్ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావు మాదిరే, అలాగే కొందరు ఎస్పీల మాదిరే ఇప్పుడు కూడా ఐపిఎస్ అధికారులు ఎవరైనా చేస్తారేమోనన్న అనుమానంతో టీడీపీ ఈ లేఖ రాయించి ఉంటుంది. వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ కార్యకలాపాలు కూడా పర్యవేక్షించేవారు. ఈ మాట అప్పట్లో టీడీపీ నేతలే చెప్పిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బహుశా టీడీపీ కూటమికి అవకాశం ఇస్తే అలాంటివారిని నియమించుకోవాలని భావిస్తున్నారేమో తెలియదు. ఈనాడు రామోజీరావు మరో అడుగు ముందుకేసి కొన్ని జిల్లాలలో కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులకు కూడా పక్షపాత బుద్ధి ఆరోపిస్తూ పెద్ద స్టోరీ ఇచ్చేసింది. జర్నలిజం విలువలను దిగజార్చి టీడీపీకి నీచమైన రీతిలో మద్దతు ఇస్తున్న రామోజీనుంచి ఇంతకన్నా విలువలను ఆశించడం అత్యాశే అవుతుంది. పురందేశ్వరి రాసిన లేఖలో డీజీపీపై ఆరోపణలు చేస్తూ, సీక్రెట్ ఫండ్‌ను సొంతానికి వాడుకున్నారని, సంబంధిత ఫైళ్లను ద్వంసం చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏవీ చూపకుండా ఇలా రాయడం ఎంత బాధ్యతారాహిత్యం! వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు ఎన్నికలను మేనేజ్ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు బాగా డబ్బులు తీసుకున్నారని పురందేశ్వరి ఆరోపణ. 'విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారట. ప్రధాని సభకు జనం రాకుండా చేశారట'. వీటిలో ఒక్కదానికైనా అర్ధం ఉందా? పిచ్చి ఆరోపణలు చేసి జనాన్ని మోసం చేయడం తప్ప. చిత్తూరు ఎస్పీ జాషువా ఇటీవలే చిత్తూరు జిల్లాకు వెళ్లారు. ఆయనపై కూడా ఆరోపణ చేస్తూ కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత పెట్టుకున్నారని పురందేశ్వరి అంటున్నారు.. 'కుప్పంలో వైఎస్సార్సీపీ నేతలు ఏవో అరాచకాలు చేశారట. వాటిని చూసిచూడనట్లు వ్యవహరించారట'. ఈ ఫిర్యాదు చూస్తే అసలు భయం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న అనుమానం వస్తుంది. 'పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా ప్రధాని సభకు జనం రాకుండా చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారట'. ఏమైనా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తారా? ప్రధాని సభకు వెళ్లేవారిపై జాగ్రత్తగా నిఘా పెట్టకపోతే ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. చెక్ పోస్టులు పెడితే మోడీ సభకు జనం రాకుండా ఉంటారా? ఇలాంటి అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తే, వాటిని నమ్మి ఎన్నికల కమిషన్ ఆయనను పక్కనబెట్టిందా? అందుకే అయితే కచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగుతోందన్న అభిప్రాయం కలుగుతుంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్‌పై కూడా ఆరోపణ చేశారు. 'ఆయన మీడియా సంస్థలను బెదిరిస్తున్నారట'. మార్గదర్శి అక్రమాలను బయటపెడితే అది మీడియాను బెదిరించడమా! చంద్రబాబును స్కిల్ స్కామ్‌లో అరెస్టు చేస్తే అది ఆయన చేసిన తప్పా! డిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారో, లేదో కానీ, అంతా కలిపి వంద కోట్ల స్కామ్‌లో ఈడి అరెస్టు చేసింది. ఆప్ మరో నేత మనీష్ సిసోడియా ఏడాదిగా జైలులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేశారు. అదంతా పద్ధతిగా జరిగినట్లు చెప్పే బీజేపీ ఏపీలో చంద్రబాబుపై వచ్చిన వందల, వేల కోట్ల రూపాయల విలువైన స్కామ్‌లను సమర్ధించడం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా తమ అడ్డగోలు పనులకు సహకరించని అధికారులను, టీడీపీ ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టిన అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికే పురందేశ్వరి ద్వారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఇలాంటి ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తుంది. వీటన్నిటిని పరిశీలించారో, లేక బీజేపీ ఒత్తిడి పనిచేసిందో కానీ వీరిలో కొందరిని ఎన్నికల సంఘం బదిలీ చేసి వారిని సంతృప్తి పరచే యత్నం చేసింది. అయినా అది చాలలేదని, ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో ఆమె ఫిర్యాదు పేరుతో అందులోని అంశాలు అంటూ భారీ కథనం ఇచ్చారు. ఇదంతా కచ్చితంగా అధికారులను భయపెట్టి తమకు అనుకూలంగా లొంగదీసుకునే యత్నమే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. '2019లో చంద్రబాబు నియమించుకున్న పోలీసు అధికారులే జిల్లాలలోను, రాష్ట్ర స్థాయిలోను వివిధ బాధ్యతలలో ఉన్నారు కదా! వీరిలో కొందరిని ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తే టీడీపీ ప్రభుత్వం హైకోర్టుకు కూడా వెళ్లింది కదా! అప్పుడేమో అధికారులంతా సుద్దపూసలని, ఇప్పుడేమో అవినీతి పరులని బురద చల్లడానికి టీడీపీ మీడియా యత్నించింది'. ఎవరైనా అధికారి తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. కానీ కేవలం ఒత్తిడులకు లొంగి ఐపీఎస్ అధికారులను పక్కనబెడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే అది వ్యవస్థకే చేటు తెస్తుంది. బ్లాక్ మెయిల్ చేసే రాజకీయనాయకులకు, మీడియాకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీ కూటమి ఇంకెన్ని కుట్రలకు పాల్పడుతుందో చూడాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎన్నికల పర్వం.. మీ అభ్యర్థి గురించి తెలుసా.. డబ్బు పంచితే..
దేశంఅంతటా సార్వత్రిక ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పర్వం మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే చాలామందికి వారి నియోజకవర్గంలోని అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. అందులో అభ్యర్థుల పూర్తి వివరాలు పొందుపరిచారు. దాంతో ఓటర్లు పార్టీ అభ్యర్థులకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకునే వీలుందని ఈసీ చెప్పింది. దాంతోపాటు చివరి నిమిషంలో గెలుపే లక్ష్యంగా పోటీదారులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా చాలాచోట్ల డబ్బు పంచే అవకాశం ఉంది. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ఈసీ మరో యాప్‌ను ప్రారంభించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నో యువర్ క్యాండిడేట్(కేవైసీ) యాప్ మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేట్’ (కేవైసీ) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికలు రెండింటి మీదా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థుల నేర చరిత్రతో పాటు ఆర్థిక స్థితిగతులనూ తెలుసుకోవచ్చు. ఇది ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థుల పేరుతో సెర్చ్ చేసి, సమాచారాన్ని పొందొచ్చు. నేరాలకు పాల్పడి ఉన్నట్టయితే అవి ఎలాంటివో కూడా ఇందులో కనిపిస్తాయి. ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’ సి-విజిల్ యాప్ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచటం వంటి వాటికి పాల్పడుతుంటే దీని సాయం తీసుకోవచ్చు. దీని ద్వారా ఫొటో తీసి లేదా వీడియోను రికార్డు చేసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే చాలు. యాప్‌లోని జీఐఎస్ మ్యాప్స్ ఫీచర్ దానంతటదే లొకేషన్‌ను గుర్తిస్తుంది. ఫిర్యాదు జిల్లా కంట్రోల్ రూమ్‌కు, అక్కడి నుంచి ఫీల్డ్ యూనిట్ అధికారులకు చేరుతుంది. లొకేషన్ ఆధారంగా సంఘటన జరిగిన చోటును గుర్తిస్తారు. కంప్లెయింట్‌ను ధ్రువీకరించి ఎన్నికల సంఘానికి చెందిన నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్‌కు పంపిస్తారు. ఫిర్యాదు చేసినవారికి దాని స్థితిగతులను 100 నిమిషాల్లో తెలియజేస్తారు. ఇదీ చదవండి.. ఆంధ్రప్రదేశ్ ఎంపీ అభ్యర్థుల జాబితా: జిల్లాల వారి లిస్ట్ (ఫోటోలు) -
వలంటీర్ల సేవలు ఆగవు.. ఆ ఫైల్‌పైనే తొలి సంతకం: సీఎం జగన్
చంద్రబాబు దుర్మార్గం వల్ల నిన్న, ఈరోజు (బుధ, గురువారాల్లో) ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్‌ను అందుకునే క్రమంలో నడవలేక, అవస్థ పడలేక ప్రాణాలు విడిచారు. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడును హంతకుడు అందామా? లేక అంతకన్నా దారుణమైన పదం ఏమైనా ఉంటే అది అందామా? ఆలోచించండి. అయ్యా చంద్రబాబూ.. మీ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు. పెన్షన్, రేషన్‌కార్డు, సర్టిఫికెట్, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండింది. ఈరోజు వలంటీర్ వ్యవస్థ వల్ల ఆ కష్టాలు లేవు. అందుకే కదా మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయ్యా చంద్రబాబూ.. నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు.. మూడుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా.. మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి పని, స్కీము గుర్తుకు వస్తుందా? పైగా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. అందుకే చంద్రబాబుకు నా అనే వాళ్లు ఈ రాష్ట్రంలో కరువు. పక్క రాష్ట్రంలో కూడా ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా అంటే అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్లందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి దొంగల ముఠా. వీరంతా మన రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఇదీ వీళ్లకు తెలిసిన రాజకీయం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, తిరుపతి: ‘రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులు ఉన్నారు. అయ్యా.. చంద్రబాబు నాయుడూ.. ఇలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఇబ్బంది పడిన వారందరికీ ఒకేమాట చెబుతున్నా. కొంచం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. మళ్లీ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికీ సేవలందించే ఫైల్‌పైన నా మొట్ట మొదటి సంతకం చేస్తాను’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ‘మేమంతా సిద్ధం’ ఎనిమిదవ రోజు బస్సు యాత్ర గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. ఈ సందర్భంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ.. అడ్డు తగులుతున్న దుష్ట చతుష్టయంపై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ఆత్మబంధువులైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, సోదరులు, స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి మాత్రమే కావని, మీ తల రాతలు మార్చే ఎన్నికలని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రెండు భావజాలాల మధ్య సంఘర్షణ ► రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలివి. జగన్‌ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం.. పెత్తందారీ భావజాలానికి, మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి, అదే గవర్నమెంట్ బడిని నాడు–నేడుతో మొదలు పెట్టి.. ఇంగ్లిష్ మీడియం, పిల్లల చేతుల్లో ట్యాబులు, డిజిటల్ బోధన, సీబీఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం సాగిస్తున్న మనకు మధ్య పోరాటం ఈ ఎన్నికలు. ► పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని, ఒక వేళ ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం. ► నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడానికి మనసు లేని గత టీడీపీ పాలనకు.. ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం పదవులు ఇస్తూ నా.. నా.. నా.. నా.. అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ► 650 హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన వారికి, రూ 2.70 లక్షల కోట్లు.. అందులో 75 శాతానికి పైగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే లబ్ధి పొందిన పరిస్థితి. డీబీటీగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోయేలా చేసిన మన ప్రభుత్వం మధ్య జరుగుతున్న యుద్ధం. ► పెన్షన్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఎరువులు, ఇలా ఏ స్కీమైనా, ఏ పౌర సేవ అయినా క్యూల్లో నిలబడి.. వివక్షకు లోనై, లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అందాలనే అహంకార భావజాలానికి, ఆ సేవలన్నీ పేదవాడి ఇంటి వద్దకే వచ్చి తలుపుతట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి, డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తే జీర్ణించుకోలేక.. ► ఇంటికే వచ్చి పెన్షన్ సొమ్ము అవ్వాతాతల చేతుల్లో పెట్టడం మొన్నటి దాకా చూశాం. 58 నెలలుగా ప్రతి నెలా 1వ తారీఖున ఆదివారమైనా, సెలవుదినమైనా తెల్లవారక మునుపే వలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వాతాతలకు ఒక మంచి మనవడిగా, మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెట్టారు. ఎన్నికలు వచ్చేసరికే ఇది జీర్ణించుకోలేక అసూయతో చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఎన్నికల కమిషన్‌కు పిటిషన్ పెట్టించి అడ్డుకున్నారు. ► గతంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1,000 ఇస్తున్న పెన్షన్‌ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3 వేలకు పెంచుకుంటూ పోయాం. ఇది వారికి గిట్టలేదు. రాజకీయాలు నిజంగా చెడిపోయాయి. దిగజారిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు.. రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్మీట్లు పెట్టి మేమే వలంటీర్లతో పింఛన్ల పంపిణీని ఆపించామని చెప్పడం మీరంతా కూడా చూశారు. వీళ్ల అహంకార ధోరణిని ఏరకంగా నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారో మీరంతా గమనించారు. ► ఇంత మందికి అండగా నిలబడ్డాం కాబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్ల మంది ప్రజలు జగన్‌కు అండగా నిలిచారని సంతోషంగా చెబుతున్నా. నా పేద అక్కచెల్లెమ్మలు నన్ను తోబుట్టువుగా భావిస్తున్నారని గర్వంగా చెబుతాను. నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వాతాతలు, జగన్ మామ అని ప్రేమగా పిలిచే చిన్నారులు.. ఇలా వీళ్లంతా నా బంధువులు. వీరి భవిష్యత్తు మార్చడం కోసమే ఈ 58 నెలలుగా తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. డబుల్ సెంచరీ కొట్టాలి ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా? ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉంది. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. మన అభ్యర్థులకు ఓటేసి ఆశీర్వదించండి మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మన అభ్యర్థులపై ఉంచాలని సవినయంగా కోరుతున్నా. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి, సూళ్లూరుపేట నుంచి సంజీవయ్య, తిరుపతి నుంచి అభినయ్, గూడూరు నుంచి మురళి, సత్యవేడు నుంచి రాజేష్, కాళహస్తి నుంచి మధుసూదన్, వెంకటగిరి నుంచి రామ్, ఈ పార్లమెంటుకే సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి, నా సహచరుడు గోవర్ధన్‌లకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందివ్వాలి. మన గుర్తు ఫ్యాన్ అని మరచిపోవద్దు. చంద్రబాబుది కిచిడీ మేనిఫెస్టో.. ఏ ఒక్కరూ తన కులం, మతం, ఆర్థిక పరిస్థితి వల్ల మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం కోసం ఈ 58 నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు. ధనికులకు ఒకరకమైన చదువు, పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండటానికి వీల్లేదని క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు. మీ బిడ్డ వేసిన ఈ విత్తనాలు మరో 10–15 సంవత్సరాల్లో ఏ స్థాయి వృక్షాలు అవుతాయంటే.. మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు.. ఏ లెవల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడతారంటే, పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్లు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇంటింటికీ మంచి చేయగలిగాం కాబట్టే, మనకు వారి మాదిరిగా కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులతో పని లేదు. ► మీ బిడ్డ మోసం చేయలేదు. మంచి చేశాను కాబట్టే మళ్లీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో ప్రజల ఆశీస్సుల కోసం వచ్చాను. 2024 ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు. మోసాలు చేయడు. చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు. ఒక్కటే గుర్తుంచుకోండి. జగన్‌కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు.. ఉండదు. జగన్ చేయలేని ఏ స్కీమైనా చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేదు. ► చంద్రబాబు అబద్ధాల కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబు మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజల్ని ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి నోటికి ఏదొస్తే అది చెబుతాడు. అందుకే చంద్రబాబు నాయుడుతో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాల కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకు ఉంది. లీడర్ అంటే కార్యకర్త కాలర్ ఎగరేసేలా ఉండాలి ► మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతున్నా. తనను ప్రేమించే ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వలంటీర్.. ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు.. మనసున్న నాయకుడు, మాట ఇస్తే తప్పడు అని చెప్పుకునేలా ఉండాలి. విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికే ప్రతి ఒక్కరినీ మోసం చేసేందుకు రంగు రంగుల హామీలతో మేనిఫెస్టోలు ఇచ్చే నాయకుడు కావాలా ఆలోచించండి. ► చంద్రబాబు కేజీ బంగారం అంటాడు.. బెంజ్ కారు అంటాడు.. సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ సెవెన్ అంటాడు. మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదని మోసం చేస్తాడు. చంద్రబాబును నమ్ముకుని, ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా గ్రామాల్లోకి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుందా? ► మన ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా ప్రతి ఇంటికీ చేయగలిగిన మంచి అంతా చేస్తాను. ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ► ఇదే చంద్రబాబు 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు.చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన నాయుడుపేటలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. -
Memantha Siddham Photos: తిరుపతిలో సీఎం జగన్ బస్సు యాత్ర (ఫొటోలు)
-
చంద్రబాబు అరాచకాలు.. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?: సజ్జల
సాక్షి, గుంటూరు: ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నవాళ్లే ఇవాళ లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచవచ్చని అంటున్నారని ప్రతిపక్షాల తీరుపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నాం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదు.ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. వలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?. చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయి. అందుకే టీడీపీ వాళ్లు మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో ఎవరైతే విమర్శలు చేశారో.. ఇవాళ వాళ్లే లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచొచ్చు కదా అని అంటున్నారు. వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో.. గతంలో ఒకటో తేదీన వలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు రెండోరోజుకి 60 శాతం పంపిణీ మాత్రమే జరిగింది. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తోంది. ఆ విషయం చంద్రబాబుకి తెలుసుకాబట్టే మాపై ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదు. ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నదే ఆలోచన. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ రెండ్రోజుల్లో రుచి చూపించారు. ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు. అది రేపు ఎన్నికల్లో తెలుస్తోంది అని సజ్జల అన్నారు. అధికారుల బదిలీలపై.. అధికారుల్లో వందశాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు ఉంటారు?. అధికారుల్ని డీమోరలైజ్ చేసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని సభలో పోలీసుల పాత్ర తక్కువగా ఉంటుంది. చంద్రబాబు, పురందేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారు. కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి మరీ అధికారుల్ని బదిలీ చేయించారు. మేం వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనుకోవట్లేదు. మేం ప్రజలనే నమ్ముకున్నాం. రేపు మేం గెలిచాక అధికారుల వల్లే గెలిచారు అని అనడానికి వాళ్లకు ఇప్పుడు లేకుండా పోయింది అని సజ్జల పేర్కొన్నారు. -
పవన్.. ఇంత దానికి అంత బిల్డప్ అవసరమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. చివరికి జనసేన కార్యకర్తలను ఆయన బ్లేడ్ బ్యాచ్‌లతో పోల్చుతున్నారు. ఇది అమాయకత్వంగా చేసినా లేక అహంభావంతో చేసినా పవన్‌కు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏమిటో ప్రజలకు అర్దం అయిపోతోంది. జనం ఎక్కువ మంది తన వద్ద పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్ తీసుకు వచ్చి తనను, తన సిబ్బందిని గాయపరుస్తున్నారని దారుణమైన ఆరోపణ చేశారు. ప్రత్యర్ధి పార్టీ పన్నాగాలు తెలుసు కదా! అంటూ ముక్తాయింపు ఇచ్చారు. నిజానికి ఆయన వద్దకు వెళ్లేవారంతా మెజార్టీ సినిమా అభిమానులే. లేదా జనసేన కార్యకర్తలు. నిజంగానే వచ్చినవారు ఎవరితోనైనా ప్రమాదం ఉందని భావిస్తే, మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకుని, ఎవరి వద్ద అయినా అభ్యంతరకర వస్తువులు ఉంటే తీసేసుకోవచ్చు. అలా చేయకుండా తనను అభిమానంతో చూడడానికి వచ్చినవారిని బ్లేడ్ బ్యాచ్‌తో పోల్చడం కేవలం అహంకారం తప్ప మరొకటి కాదు. ఎందుకు ఈయన ఈ ప్రకటన చేశారో తెలుసా? కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ బస చేసిన చోట జనసేన కార్యకర్తలు కొంతమంది గుమికూడి ఆయనను కలవడానికి ప్రయత్నించారట. ఆయన సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు వారిని అనుమతించలేదు. గంటల సేపు వేచి చూసినా తమ నాయకుడిని కలుసుకోలేకపోయారు. అంతలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ తన అనుచరులతో కలిసి పవన్ కల్యాణ్ బసకు వచ్చారట. వెంటనే ఆయనను, అనుచరులను లోనికి పంపించేశారట. అది చూసి ఒళ్లు మండిన ఒక జనసేన కార్యకర్త తమకు ఇంత అవమానం చేస్తారా అని ప్రశ్నిస్తూ ఒక ఆడియో టేప్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయింది. ఆయన దృష్టికి కూడా అది వెళ్లి ఉండాలి. దాంతో ఆయన స్వరం మార్చి కొత్త రాగం ఆలపించారన్నమాట. 'నిజంగానే ఎవరైనా బ్లేడ్ తీసుకుని ఆయన చేతిమీదో, లేక సెక్యూరిటీ సిబ్బంది చేతుల మీదో కోస్తే గాయం అవుతుంది కదా! అప్పుడు రక్తం వస్తుంది కదా! లేదా బట్టలు చిరుగుతాయి కదా! ఇన్నాళ్లుగా ఒక్కసారైనా అలాంటివి జరిగినట్లు పవన్‌కల్యాణ్ చెప్పలేదే!' పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు జరిగిన అవమానం నుంచి దారి మళ్ళించేందుకు పవన్ ఈ కొత్త డ్రామా ఆడాడని అనుకోవడంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది. 'పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరిని కలవాలన్నది తన కోరిక అని, ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలన్నది తన అభిలాష' అని చెప్పారు. వచ్చిన జనసైనికులను కలవడానికి ఇష్టం ఉండదు కానీ, ఓట్ల కోసం పిఠాపురం ప్రజలందరితో ఫోటో దిగాలని ఉందని అంటే ఎవరు నమ్ముతారు? నిజంగానే అలా ఉంటే ప్రతీ ఊరుకు వెళ్లి అక్కడివారితో ఫోటో దిగండి. ఎవరు అడ్డుపడుతారు? అదే ఎన్నికల ప్రచారం అనుకోండి.. అప్పుడు పిఠాపురం అవసరాలు, సమస్యల గురించి తెలుసుకోవలసిన అవసరం లేకుండా పోతుందేమో! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 'టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మను ఇదే పవన్‌కల్యాణ్ 2019 ఎన్నికలలో పేకాట క్లబ్‌లు నడిపే వ్యక్తిగా అభివర్ణించి అవమానించారు. ఇప్పుడు అదే వర్మను తనను గెలిపించాలని వేడుకుంటున్నారు'. గతంలో సముద్రం ఎవరి వద్దకు రాదు.. పర్వతాలు ఎవరికి తలవంచవు అంటూ డైలాగులు చెప్పిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం నేతలను బతిమిలాడుకుంటున్నారు. తన జనసైనికుల మీద కన్నా టీడీపీ వారే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. తన గెలుపు బాధ్యత వర్మ చేతులలో పెడుతున్నానని ఆయన చెప్పారు. ప్లీజ్.. ఈ ఒక్కసారైనా తనను గెలిపించాలని అభ్యర్ధిస్తున్నానని అంటున్నారు. ఎందుకింత బేలతనం! 'ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా? నలుగురిని గెలిపించాల్సిన తమ నేతే ఇలా దిగజారి మాట్లాడుతున్నారంటే జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి సంకేతం పంపుతుంది'! జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ గురించి ఆయన మాట్లాడుతూ గ్లాస్ పగిలితే మరింత పదును తేలుతుందని ఓ పిచ్చి డైలాగు చెప్పారు. పగిలిన గ్లాస్ ఎవరికి ఉపయోగపడదు. జాగ్రత్తగా, ఎవరికీ ప్రమాదం లేకుండా ఆ ముక్కలను బయట పడేస్తారు. పగిలిన గ్లాస్ ముక్కను జనసేన కార్యకర్తలు పట్టుకున్నా, వారికి చేతులు తెగుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. ఆ సంగతి కూడా తెలియకుండా సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం. 'పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని ఆయన చెబుతున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ గతంలో భీమవరంలో పోటీచేసినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. కానీ అక్కడ ఓడిపోయిన తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో ఉంటానంటే ఎవరు నమ్ముతారు?' సినిమా షూటింగ్‌లు మానుకుని ఇక్కడ ఉంటానంటే నమ్మడానికి ప్రజలు కాదు కదా, జనసైనికులు కూడా విశ్వసించరు. తమ పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. సంతోషమే. కానీ 'పదేళ్ల జనసేన ప్రస్తానంలో ఎందరు నాయకులు తయారయ్యారు. చివరికి టీడీపీ నుంచి పొందిన ముష్టి 24 సీట్లలో మూడు తగ్గించుకుని, అందులో కూడా ఓ ఆరేడు సీట్లు టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు ఎందుకు ఇచ్చారో చెప్పాలి'. పొత్తులో ఉన్న పార్టీల నుంచి నేతలను ఎవరైనా తీసుకుంటారా?అలా చేశారంటే ఏమిటి దాని అర్దం! జనసేనకు నేతలు లేరనే కదా? ఉన్న జనసేన నేతలు పనికిరారని పవన్ భావిస్తున్నట్లే కదా? జనసేనలో కొత్తగా చేరిన టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్‌కు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు. పాలకొండ సీటును కూడా జనసేనలో చేరిన టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు ఇవ్వబోతున్నారట. టీడీపీతో సన్నిహితంగా మెలిగిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి టిక్కెట్ ఇచ్చారు. భీమవరంలో టీడీపీ నేత పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి టిక్కెట్ ఇవ్వడంపై అక్కడి జనసేన, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మచిలీపట్నం లోక్‌సభ సీటును వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి కేటాయించారు. ఇవన్నీ గమనిస్తే ఏమి తెలుస్తుంది? పదేళ్లలో పట్టుమని పది నియోజకవర్గాలలో జనసేన నుంచి నేతలను తయారు చేసుకోలేకపోయారనే కదా! ఈ పాటి దానికి ఇంత బిల్డప్ అవసరమా అని కొందరు సామాన్యులు ఎద్దేవ చేస్తున్నారు!. 'షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు కానీ, తాను అలా చేయలేదని పవన్‌కల్యాణ్ అంటున్నారు. ఆమె పార్టీని విలీనం చేసినా, పవన్‌కల్యాణ్ టీడీపీలో విలీనం చేయకుండా ఆ పార్టీకి తాకట్టు పెట్టినా పెద్ద తేడా ఏముందన్నది విశ్లేషకుల ప్రశ్న'. 2019లో సుమారు 140 నియోజకవర్గాలలో పోటీచేసిన జనసేన 2024లో పద్దెనిమిది నియోజకవర్గాలలో సొంత నేతలను పోటీలో ఉంచలేకపోయింది. ఈ సంగతి ప్రజలకు తెలియదా! పవన్‌కల్యాణ్ ఎంతగా భయపడుతున్నారంటే, మతపరమైన రాజకీయాలు చేయడానికి వెనుకాడడం లేదు. గుడులలో ఏదో జరిగిందని, దోషులను పట్టుకోలేదంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి వచ్చారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని పవన్ అంటున్నారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్ మొత్తం మీద తిరుగుతోందని ఆయన ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తన గ్లాస్ పగిలిపోయిందని పవన్ కల్యాణే ఒప్పుకుంటున్నారు. తన చుట్టూ బ్లేడ్ బ్యాచ్‌లు తిరుగుతున్నాయని ఆయనే చెబుతున్నారు కనుక, ఆయన అభిమానులు కూడా జాగ్రత్తగా ఉండడమే బెటర్!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎనిమిదో రోజు మేమంతా సిద్ధం.. చింతరెడ్డి పాలెం వద్ద ముగియనున్న బస్సు యాత్ర
Memantha Sidham Day 8 Highlights CM Jagan Bus Yatra Details సీఎం జగన్ ప్రసంగం.. నాయుడుపేటలో మహా జనప్రభంజనం కనిపిస్తోంది: సీఎం జగన్ మంచిని అడ్డుకుంటున్న దుష్టచతుష్టయంపై యుద్ధానికి సిద్ధమా? అన్ని వర్గాలకు మనం మంచి చేశాం పేదలు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా సిద్ధమా? మంచిన అడ్డుకుంటున్న దుష్టచతుష్టయంపై యుద్ధానికి సిద్ధమా? ప్రభంజనం అనే పదానికి అర్థం చెప్పేలా ఈ సభ నిలిచిపోతుంది మంచిని అడ్డుకుంటున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగబోతుంది ఈ ఎన్నికలు కేవలం, ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదు మనం వేసే ఓటు మన భవిష్యత్తు, తలరాతలు రాసుకోవడం కోసం మనం వేసే ఓటుతో రాబోయే ఐదేళ్లలో పేదల తలరాతను నిర్ణయిస్తుంది ఇంటింటి అభివృద్ధిని కొనాసాగించేందుకు మీరంతా సిద్ధమా? ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా? పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి? 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా? మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్లీ వాలంటీర్లను తీసుకురావడం కోసమే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు: సీఎం జగన్ బాబుకు నా అనేవాళ్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు వీళ్ల రాజకీయం దోచుకోవడం, దాచుకోవడం క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను పేదలకు అందించాలని శ్రీకారం చుట్టాం పిల్లలకు క్వాలిటీ చదువు అందించాలన్నదే నా తపన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం సాధ్యం కాని హామీలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టడు బాబులా నేను మోసపూరిత హామీలు ఇవ్వను జగన్ చేయలేని ఏ స్కీంను చంద్రబాబు చేయలేడు చంద్రబాబు కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని అనుకోవడం లేదు మంచి చేసి ఆత్మవిశ్వాసంతో మీ బిడ్డ మీ ముందుకు వచ్చాడు మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసాలు చేయడు మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు హామీలు నెరవేర్చలేని బాబుకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: సీఎం జగన్ 58 నెలల్లో మేనిఫెస్టోలో చెప్పనవి కూడా అమలు చేశాం రైతులకు చంద్రబాబు రుణమాఫీ చేస్తా అన్నాడు చేశాడా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా? 3 సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు.. కనీసం సెంటు స్థలమైన ఇచ్చాడా? మోసాల నుంచి మన పేదల భవిష్యత్‌ను కాపాడుకునే యుద్ధానికి మీరంతా సిద్ధమా? జగన్ అంటే జనం.. జనం అంటే జగన్: కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి, సూళ్లూరుపేట గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, అంబేడ్కర్ కలలు కన్న సమ సమాజం, శ్రీశ్రీ వంటి కవులు కలలు కన్న మరో ప్రపంచం...ఈ కలలన్నీ నిజం చేస్తూ నవశకాన్ని నిర్మిస్తున్న నిర్మాత, సంక్షేమదాత, అభివృద్ధి ప్రదాత, యువత భవితను మార్చి రాస్తున్న విధాత, నా దైవం సీఎం వైఎస్ జగన్ గారికి నమస్కారం. తిరుపతి జిల్లా మేమంతా సిద్ధం సభకు స్వాగతం. జగనన్నా అంటే జనం జగనన్న వెంటే ఈ జనం ఆయన పిలుపు ఒక ప్రభంజనం ఆయన పేరే ఒక రణ నినాదం మన జగన్ నినాదంతో దిక్కులు పిక్కటిల్లాలి శతృవుల గుండెల్లో భూకంపం పుట్టాలి నాతో గొంతు కలిపి జైజగన్ అనండి. జై జగన్ జై జగన్ ఒక పేద దళిత కుంటుంబంలో పుట్టి, సాధారణ ప్రభుత్వ ఉద్యోగినైన నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేసారు. ఇప్పుడు మూడో సారి మీ సైనికుడిగా నన్ను పోటీలో నిలిపారు. అందుకు ధన్యవాదాలు. మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు వలలో, మగ్గాలో, మేకలో ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించామని గొప్పలు చెప్పుకున్న నాయకుల్ని చూసాం. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అనే పెత్తందారీ వ్యవస్థకు మూలపురుషుడు చంద్రబాబును చూసాం. బీసీల తోకలు కత్తిరిస్తాం అనే చంద్రబాబు అహంకారాన్ని చూసాం. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మమ్మలన్ని అందరినీ ఆదరించి, మీ అందరి చేతుల్లో ఉండాల్సింది పనిముట్లు కాదు, రాజ్యాధికారం అని..మా వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను, మంత్రులను చేసి సామాజికసాధికారత కల్పించిన ఏకైక పాలకులు మీరే సార్. నన్నే తీసుకుంటే ఆలయ ప్రవేశంలేని సామాజిక వర్గం నాది. అలాంటిది టీటీడీ బోర్డులో నాకు చోటిచ్చిన గొప్ప నాయకులు మీరు. జగనన్న పాలనలో సామాజిక న్యాయానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇంత గొప్ప అవకాశాన్ని మీరు నాకు అందించినందుకు...జన్మ జన్మలకీ రుణపడే ఉంటాను. మా నియోజకవర్గంలో, మన ప్రభుత్వ హయాంలో, మీసారధ్యంలో సుమారు 1400 కోట్లతో అభివృద్ధి పనులు చేసాం. 2,400 కోట్లు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మీకే దక్కింది. అందుకు ఈ సూళ్లూరుపేట ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటారు. మాదో చిన్న విన్నపం...2024 లో మీరు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.. అప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత - ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేందుకు, స్వర్ణముఖి నదిలో సబ్ సర్పేజ్ డ్యామ్‌లు, నాయుడుపేట నడిబొడ్డులో పోతునవెన్నువాను కాలువ ఆధునీకరణ, చెంబేడు రిజర్వాయిర్, తడలో మత్స్యకార సోదరులకు ఆశ్రమ పాఠశాల, ఎస్సీఎస్టీలకు ఆశ్రమ పాఠశాల నిర్మించాలని కోరుకుంటున్నాను. వంచన చేసే చంద్రబాబు పార్టీకి సమాధికట్టి మంచిచేసే జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం తిరుపతి జిల్లాలోని 7 నియోజక వర్గాలు, పార్లమెంట్ స్థానాలు గెలిపించి జగనన్నకు గిఫ్టుగా ఇచ్చి, 175కు 175 అనే జగనన్న టార్గెట్‌లో భాగస్వాములు అయ్యేందుకు మీరు సిద్ధమా... ప్రారంభమైన నాయుడుపేట మేమంతా సిద్ధం సభ నాయుడుపేట బహిరంగ సభలో తిరుపతి జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ర్యాంప్ మీద ప్రజలకు అభివాదం చేస్తూ నడిచిన సీఎం జగన్ నాయుడుపేట బహిరంగ సభా వేదిక నుంచి అభిమానులకు, పార్టీ కేడర్‌కు సీఎం జగన్ అభివాదం తిరుపతి మేమంతా సిద్ధం సభ ప్రారంభం దివంగత వైఎస్సార్ విగ్రహానికి నివాళర్పించిన సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలనతో సీఎం జగన్ బహిరంగ సభ ప్రారంభం నాయుడుపేట చేరుకున్న సీఎం జగన్ నాయుడుపేటలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ అశేష జనవాహిని నడుమ జై జగన్.. జగన్ వన్స్‌మోర్ నినాదాలతో మారుమోగుతున్న సభా ప్రాంగణం కాసేపట్లో నాయుడుపేటలో బహిరంగ సభ తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర నాయుడుపేటలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభ కాసేపట్లో నాయుడుపేట సభా ప్రాంగణం చేరుకోనున్న సీఎం జగన్ సమస్యలు వింటూ.. మేమంతా సిద్ధం పేరిట వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం బస్సు యాత్రలో ముందుకు సాగుతున్న సీఎం జగన్ మార్గం మధ్యలో జనంతో మమేకం వాళ్ల కష్టాలు, కన్నీళ్లు సైతం వింటున్న వైనం తాజాగా తిరుపతి జిల్లాలోనూ అవే దృశ్యాలు జగనన్న మాకు కష్టం వచ్చిందనగానే.. వాళ్లకు దగ్గరగా వెళ్లి సమస్య అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్ ఏర్పేడు వద్ద సీఎంను కలిసి తన సమస్య చెప్పుకున్న మహిళ శ్రీకాళహస్తిలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన గజమాల చిల్లకూరులో సీఎం జగన్ చిల్లకూరు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర పూలు చల్లుతూ.. గజమాలతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ జ్యోతి, ఆటో డ్రైవర్, శ్రీకాళహస్తి ఈ ప్రభుత్వంలో నా పిల్లలను బాగా చదివించుకుంటున్నా. ఈ తడవ కూడా జయం మనదే జగనన్నా. శ్రీకాళహస్తిలో ఏడు ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను. ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలూ అందుకున్నాను. నా పిల్లలను బాగా చదివించుకుంటున్నాను. నా ఆటో బాడుగ కట్టుకోలేకపోతున్నా, ఓ సొంత ఆటో ఇప్పించన్నా? సీఎం వైఎస్ జగన్.. సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా లారీ, టిప్పర్ కొనాలన్నా..తక్కువ వడ్డీతో కొనుక్కునేందుకు వీలుగా బ్యాంకులతో మాట్లాడి ఏదన్నా చేద్దాం. వెంకటేష్, ఆటో అసోసియేషన్ సభ్యుడు, తిరుపతి ప్రతి పేదవాడి గుండెలో దేవుడై కొలువున్నారు మీరు ఈ ప్రభుత్వంలో నవరత్నాల ద్వారా మా అమ్మకి వృద్ధాప్య పింఛన్ వచ్చింది, మా అబ్బాయికి అమ్మ ఒడి వచ్చింది, నాన్నకు రైతుభరోసా వచ్చింది. ప్రతి పేదవాడి గుండెలో మీరు దేవుడిలా ఉన్నారు. మీరు టిప్పర్ డ్రైవర్ కి సీటు ఇవ్వడం సంతోషంగా ఉంది. పూర్ణేష్, శ్రీకాళహస్తి, ఆటో డ్రైవర్ మేమంతా నీ స్టార్ కేంపెయినర్లం పదేళ్లుగా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. ఇలాగే మీరు పేద ప్రజలకు మీరు అండగా ఉండండి జగనన్నా. మేమంతా నీ స్టార్ కేంపెయినర్లమై నీ వెంటే ఉంటాం. నా బిడ్డకు అమ్మ ఒడి వస్తోంది, నాకు ఇంటి స్థలం వచ్చింది. పేద ప్రజలు నీవల్లే చల్లగా ఉన్నారు. దె య్యాలను తరిమి కొట్టి దేవుడిలాంటి నిన్ను మళ్లీ గెలిపించుకునేందుకు మా ఆటో డ్రైవర్లందరం సిద్ధంగా ఉన్నాం. జయశంకర్, లారీ డ్రైవర్, శ్రీకాళహస్తి జగనన్నా మీరు పెద్ద మనసుతో శింగనమల సీటు ఓ డ్రైవర్ కు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ చంద్రబాబు అతన్ని దూషించడం తప్పు. ఆ డ్రైవర్ ను అసెంబ్లీకి పంపింస్తాం. అతడినే కాదు రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలు 175 మందినీ అసెంబ్లీకి పంపేందుకు ఐదుకోట్ల ఆంధ్రులూ సిద్ధంగా ఉన్నారు. జగనన్నా మా లారీ డ్రైవర్లకు ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే వారికి ఆర్థిక సాయం దొరికేలా ఏదైనా బీమా వచ్చే మార్గం చూడాలని మా డ్రైవర్లందరి తరఫునా కోరుతున్నాను. సీఎం వైఎస్ జగన్.. నువు చెప్పిన విషయాన్ని తప్పకుండా ఆలోచిస్తాం. వెంకటేష్, ఆటో డ్రైవర్, పూర్ణకుంభం సర్కిల్, తిరుపతి జగనన్నా నేను మీ ద్వారా చాలా లబ్ది పొందాను. మా అమ్మకు ఆసరా, మా పాపకు అమ్మ ఒడి వచ్చాయి. ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది. జగనన్నా మీతో మాట్లాడాలంటే మాట రావడం లేదు. మా ఆటో, టాక్సీ డ్రైవర్లకు కూడా ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మరో 30 ఏళ్లు సీఎంగా మీరే ఉండాలి. ఓంకార్, మల్లిగుంట, టిప్పర్ డ్రైవర్, తొట్టంబేడు మండలం, తిరుపతి జగనన్నా ఆటోవాళ్లకు ఇస్తున్నట్టే టిప్పర్ డ్రైవర్లకు కూడా ప్రతి ఏటా ఏదైనా లబ్ది అందించేలా చూడండి అన్నా. మా ఎమ్మెల్యే మాకు మోటార్లు ఏర్పాటు చేసి పంటలకు నీళ్లు ఇస్తున్నాడు. మేం రెండు కార్లు పంటలు వేసుకుని పచ్చగా బతుకుతున్నాం. ఆటో డ్రైవర్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ మా ఆటో స్టాండ్ లోని ప్రతి డ్రైవర్ నవరత్నాల పథకాలు పొందుతున్నారు. మా నాయకులు రెండేళ్లలో తిరుపతిలో రోడ్లు వెడల్పు చేసి మా ట్రాఫిక్ కష్టాలు తీర్చి, నగరాన్ని సుందరణీకరణ చేసారు. అనంతపురంలో ఒక డ్రైవర్ కు ఎమ్మెల్యే సీటు మీరు ఇచ్చారని తెలిసి ఎంతో సంతోషించాం. కానీ అవతల పక్క టీడీపీ వాళ్లు డ్రైవర్లను తక్కువ చేసి మాట్లాడటం విని బాధపడ్డాం. ఆ చంద్రబాబుకు మా డ్రైవర్లు అందరం ఓటుతో గుణపాఠం చెబుతాం. సుధాకర్, ఆటో డ్రైవర్, తిరుపతి 22 ఏళ్లుగా నేను ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాను. ఒక ఆటో డ్రైవర్ గా నేను వాహన మిత్ర అందుకున్నాను. మా ఇంట్లో డ్వాక్రా రుణ మాఫీ వల్ల మా కుటుంబం లబ్ది పొందింది. లైసెన్స్ లు తీసుకుని అద్దె ఆటోలు నడుపుకునే వారికి కూడా పదివేలు వాహన మిత్ర అందించాలని కోరుతున్నాం. అల్లాభక్ష్ శేషాద్రీ టాక్సీ యూనియన్ సభ్యుడు, మీ సాయం మరిచిపోలేను జగనన్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ మాకు ఒకసారి అమ్మ ఒడి, నాలుగుసార్లు వాహనమిత్ర, డ్వాక్రా, ఫీజ్ రీయంబర్స్మెంట్ వచ్చాయి. నాకు గుండెపోటు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. నా జీవితంలో మిమ్మల్ని, మీరు చేసిన మేలును మరిచిపోలేను. రవి కుమార్ రెడ్డి, ఆటో డ్రైవర్, శ్రీకాళహస్తి జగనన్నా.. మళ్లీ మీరే సీఎం 2004 నుండి నేను ఆటో నడుపుతున్నాను. మీరు ఇచ్చిన ప్రతి పథకం అందరికీ అందుతున్నాయి. మాకోసం మీరు చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆటో డ్రైవర్లంతా మీ పక్షానే ఉన్నారు. మళ్లీ మీరే మా సీఎం. చిన్నసింగమల చేరుకున్న సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు టిప్పర్ డ్రైవర్‌కు చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్ ఇచ్చా వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్, బీఈడీ చదివాడు చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా బాధపడలేదు ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు జగన్ టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి బాబు? కోట్ల రూపాయాలు ఉన్నవారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు జగన్ ఏం తప్పు చేశాడని టీడీపీ అవహేళన చేస్తోంది. ఆటో, ట్యాక్సి, టిప్పర్ డ్రైవర్లకు తోడుగా ఉంటున్నాం ఏడాది రూ.10వేల చొప్పున, ఐదేళ్లలో రూ.50 వేలు ఇచ్చాం వాహనమిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చాం శ్రీకాళహస్తిలో సీఎం జగన్ బస్సుయాత్రకు అపూర్వ స్పందన మండుటెండలోనూ శ్రీకాళహస్తిలో రోడ్డుకిరువైపులా బస్సుయాత్రలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన మహిళలు విజయవంతంగా సాగుతున్న ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర అడుగడుగునా సీఎం జగన్‌కు బ్రహ్మరథం పుడుతున్న ప్రజలు ప్రజలతో మమేకం అవుతున్న సీఎం జగన్, సంక్షేమంపై ఆరా మరి కాసేపట్లో శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డుకి వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర సీఎం జగన్‌కు స్వాగతం పలకడానికి భారీగా చేరుకుంటున్న ప్రజానికం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరికలు ఎద్దల చెరువు వద్ద బస్సుయాత్రలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో వైఎస్సార్సీపీలో చేరిక కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన విష్టువర్ధన్ రెడ్డి ఏర్పేడు దాటిన సీఎం జగన్ బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర కొనసాగుతోంది సీఎం జగన్‌కు ప్రజలు భారీగా స్వాగతం పలుకుతున్నారు చిన్నసింగమల రానున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చిన్నసింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో సమావేశం కానున్న సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు తమను దూషించటం, ఎగతాళి చేయటంపై డ్రైవర్ల ఆగ్రహం జగన్ టిప్పర్ డ్రైవర్‌కి సీటు ఇచ్చి అక్కున చేర్చుకుంటే చంద్రబాబుకు కడుపుమంట ఎందుకంటూ ఫైర్ సంక్షేమ పథకాలతో తమ కుటుంబాలు బాగు పడుతున్నాయంటున్న ఆటో డ్రైవర్లు ప్రతి ఏటా అందిస్తున్న రూ.10 వేలు తమకెంతో ఉపయోగపడుతున్నాయంటున్న ఆటోవాలాలు ఏర్పేడులో సీఎం జగన్ కలిసి ఫోటో దిగేందుకు పరిగెడుతున్న అభిమాని కాళ్ళకు ఉన్న చెప్పులు తెగిపోయాయి అది గమనించిన సీఎం జగన్ పిలిచి సెల్ఫీ దిగారు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది ఏర్పేడు మండలంలోని ఇసుక తాగేలి వద్ద మహిళలతో సీఎం జగన్ మాట్లాడారు మరికొద్దిసేపటిలో ఏర్పేడుకి చేరుకోనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. బస్సు యాత్రలో వస్తున్న సీఎం జగన్‌కు గజమాలతో స్వాగతం పలకనున్న ఏర్పేడు గ్రామస్థులు ఏర్పేడు చౌరస్తాకి భారీగా చేరుకొంటున్న కార్యకర్తలు, అభిమానులు. మరోసారి సీఎం జగనే సీఎం అవుతారు: తిరుపతి ప్రజలు రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవటం ఖాయం వృద్ధులను చాలా ఇబ్బందులకు గురిచేశారు గురవరాజుపల్లెలో సీఎం జగన్‌కు ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేశారు ఓ మహిళ సమస్యను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం గురవరాజుపల్లె నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభమైంది తిరుపతి జిల్లాలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతుంది. తిరుపతి జిల్లాలో కాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కాసేపట్లో గురవరాజుపల్లె నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల చేరుకోనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిన్నసింగమలలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లోతో సీఎం జగన్ ముఖముఖి అనంతరం చావలి మీదుగా నాయుడుపేటకు బస్సు యాత్ర సాయంత్రం నాయుడుపేటలో ‘మేమంతా సిద్ధం’బహిరంగ సభ నాయుడుపేట బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్ , మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెంకు బస్సు యాత్ర తిరుపతి జిల్లా సిద్ధమా...? సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇవాళ తిరుపతి జిల్లాలో కొనసాగనుంది ఈ సందర్భంగా ‘Day-8 తిరుపతి జిల్లా సిద్ధమా...? ’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు Day-8 తిరుపతి జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం- 8వ రోజు షెడ్యూల్.. మేమంతా సిద్ధం ఎనిమిదో రోజు బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లో తో ముఖముఖిలో పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేట లోనుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్ , మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు.ఘేడ ఏడో రోజు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనం ఉమ్మడి చిత్తూరు జిల్లా మురిసిపోయింది ప్రచండ భానుని ఎదురొడ్డి అభిమాన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడింది సీఎం జగన్‌కు అడగడుగునా అపూర్వ స్వాగతం లభించింది జగనన్న జైత్రయాత్రకు ఊరూవాడా కదిలివచ్చింది దారిపొడవునా హారతులు పట్టి.. పూల వర్షం కురిపించి ఆనందోత్సాహాలను చాటుకుంది ‘నువ్వే కావాలి... నువ్వే రావాలి’ అంటూ ఉద్వేగంతో నినదించింది కుట్రలను ఓడించేందుకు ‘మేమంతా సిద్ధం’ అని ప్రతినబూనింది -
మేమంతా సిద్ధం @ఏడో రోజు: ప్రజలతో సీఎం జగన్ మమేకం
Memantha Sidham Day 7 Highlights CM Jagan Bus Yatra Details పూతలపట్టు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఒకటే తేదీన సూర్యుడు ఉదయించే ముందు వాలంటీర్లువ చ్చి పెన్షన్లు ఇచ్చేవారు. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుంది జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. 3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రైతు భరోసా పేరుతో రైతులకు నేరు 34,370 కోట్లు ఇచ్చాం . ఉచిత పంటల భీమా కోసం రూ. 7,800 కోట్లు చెల్లించాం. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రైతుకు రూ. 3,262 కోట్లు అందించాం. 53 లక్షల మంది తల్లుల అకంట్లలో అమ్మఒడిడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద 18 వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయుత కింద 39 ళక్షల మంది అక్క చెల్లెళ్లకు రూ. 19,182 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం కింద 1,876 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం కింద రూ. 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసారా కింద 25, 571 కోట్లు. ఆరోగ్య శ్రీ కింద 33 12463 కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ కింద అక్క చెల్లెళ్లకు రూ. 4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ. 1,390 కోట్లు ఇచ్చాం. 10 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులకు రూ. 906 కోట్లు చెల్లించాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం ఆరోగశ్రీని 25 లక్షలకు పెంచింది మీ జగన్ ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 70 వేల కోట్లను నేరుగా అకౌంట్లో వేసింది మధ్యలో ఎక్కడా జన్మభూమి లాంటి దళారులు లేరు. మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్ వారి చేతుల్లో పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తు వస్తుందా 14 ఏళ్ల కాలంలో చంద్రబాబు మీ ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు? ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియాం తెచ్చిందెవరు? విలేజ్ క్లీనిక్, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ను ఏర్పాటు చేసింది ఎవరు? ఇంటింటికీ పౌరసేవల్నీ డోర్‌డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మీ జగన్ ఒకటో తేదీ ఆదివారమైనా సరే అవ్వాతాతలకు పెన్షన్లు అందించిన వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది మీ జగన్. పూతలపట్టులో జన మహాసముద్రం కనిపిస్తోంది: సీఎం జగన్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..? ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా? ఈ ఎన్నికల్లో మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మంచి ఓ వైపు, చెడు మరోవైపు.. ధర్మం ఓవైపు అధర్మం మరోవైపున్నాయి. ఓవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం.. ఓవైపు నిజం, మరోవైపు అబద్దం అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్స్‌గిఫ్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పూతలపట్టు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ కాసేపట్లో పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు కాసేపట్లో పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్ దామలచెరువులో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం వేలాదిగా తరలి వచ్చిన జన ప్రభంజనం సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం దామలచెరువు చేరుకున్న సీఎం జగన్ చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర దామలచెరువు వద్ద పదుల సంఖ్యలో గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎంకు స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు ఎర్రటి ఎండల్లోనూ మేమంతా సిద్ధమంటూ సీఎం బస్సు యాత్రలో జన జాతర షెడ్యూల్లో లేకున్నా.. ప్రజల కోసం.. కల్లూరులో స్థానిక ప్రజల కోరిక మేరకు షెడ్యూల్లో లేకున్నా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లిన సీఎం జగన్ కల్లూరులో సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన జనం మండుటెండలోను కదం తొక్కిన మహిళా లోకం కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎం జగన్‌ను చూసేందుకు వెల్లువలా తరలివచ్చిన ప్రజలు కల్లూరు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సీఎం జగన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు సీఎం జగన్‌కు హారతులు ఇచ్చిన అక్కా చెళ్లెమ్మలు బస్సు మీది నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ నేను విన్నాను... నేను ఉన్నాను పెరాలసిస్ బాధితుడికి సీఎం వైఎస్ జగన్ భరోసా చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని నమ్ముతున్నామని ముఖేష్ తల్లి ఆశాభావం వ్యక్తం చేసారు. మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసారు సీఎం వైఎస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం నమ్మకంగా ఉంది మతుకువారిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర దారిపొడవునా సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ప్రజానికం చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది దారిపొడవునా సీఎం జగన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు సీఎం సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత మేమంతా సిద్ధం బస్సుయాత్రలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ముఖ్యనేత అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, 2019లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ. హరికృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి సీఎం జగన్ సమక్షంలో పార్టీలో కీలక నేతల చేరికలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన కీలక నేతలు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎం సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం అమ్మగారిపల్లె నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన అన్నమయ్య, చిత్తూరు జిల్లా చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ సదుం సర్కిల్లో స్వాగత ఏర్పాట్లు... సదుం సర్కిల్ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డాన్స్‌లతో సందడిగా సదుం సర్కిల్ సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అమ్మగారిపల్లె నుంచి బయల్దేరిన సీఎం జగన్ సీఎం జగన్‌కు అమ్మగారిపల్లిలో భారీగా స్వాగతం పలికిన ప్రజానికం సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకోనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్కు చేరుకోనున్న బస్సు యాత్ర సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లిక్రాస్, చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగ గువరరాజుపల్లెకు చేరుకోనున్న బస్సు యాత్ర రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం జగన్ బస చిత్తూరు జిల్లాలో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అమ్మగారిపల్లె నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరానున్న సీఎం జగన్ సదుం సర్కిల్ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డాన్స్‌లతో సందడిగా సదుం సర్కిల్ చిత్తూరు జిల్లా సిద్ధమా..? ఏడో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చిత్తురులో కొనసాగనుంది ‘చిత్తూరు జిల్లా సిద్ధమా...?’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు Day-7 చిత్తూరు జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 ఏడో రోజు ‘మేమంతా బస్సు’ యాత్ర షెడ్యూల్: నేడు చిత్తూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు సదుం, కల్లూరు మీదుగా, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో దామలచెరువు వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది అనంతరం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని లంచ్ బ్రేక్ తీసుకుంటారు అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు సభ అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజవర్గం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాధంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి, చంద్రగిరి క్రాస్ వరకు కొనసాగుతుంది అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట, గురవరాజుపల్లెకు చేరుకుని సీఎం జగన్ రాత్రి బస చేస్తారు Memantha Siddham Yatra, Day -7. ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె వరకు కొనసాగుతుంది. గురువరాజుపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/qw7x7QFOCM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సూపర్ సక్సెస్ అన్నమయ్య జిల్లాల్లో సీఎం జగన్‌కు భారీగా స్వాగతం పలికిన ప్రజానికం దారి పొడవునా ప్రజలతో మమేకమైన సీఎం జగన్ పలువురి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం పార్టీలో చేరిన పలువురు నేతలు మదనపల్లిలో మేమంతా సిద్ధం బహిరంగ సభకు పోటెత్తిన జనం ఎన్నికలకు మేమంతా సిద్ధం అంటూ నినాదించిన శ్రేణులు సీఎం ప్రసంగిస్తూ బాబు పేరెత్తగానే శ్రేణుల్లో ఉత్సాహం ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసిన సీఎం జగన్ మధ్యాహ్నం నుంచి సభ ముగిసే వరకు కార్యకర్తల్లో తగ్గని జోష్ -
పెన్షన్లు ఆపింది చంద్రబాబే: సీఎం జగన్
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతి లాగా అధికారం కోసం ఐదేళ్ల తర్వాత ‘పసుపు’పతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ ‘పసుపు’పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటున నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్లే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు, కుతంత్రాలతో జెండాలతో జత కట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప : ‘చంద్రబాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై ఏడుపే. ఈ ఏడుపులో భాగంగా మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. ఈ పెన్షన్ డబ్బులు అందితే తప్ప జీవితాలు గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇచ్చిపోతున్న వలంటీర్లపై తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించాడు. వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. జగన్‌ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నానన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు, వికలాంగులకు తోడుగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి.. ఏకంగా ఆ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఈ పెద్దమనిషి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడని, పేద పిల్లలకు ట్యాబులిస్తుంటే కూడా వ్యతిరేకించారని చెప్పారు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ భావజాలం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పెత్తందార్లకు, ఇలాంటి పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మెరిట్ విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? ► ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు.అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టాడు. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరూ కుట్రలు, కుతంత్రాలతో ఏకమవుతున్నారు. ► ఇంత మంది జతకట్టి వచ్చినా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్.. పరీక్ష పాసవుతాడా? ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా? ► విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు, పేద వర్గాలు భయపడరు. పైగా పెత్తందారులతో సమరానికి మేమంతా సిద్ధం.. అని చెబుతున్నారు. ► ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా.. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రంలా మదనపల్లె కనిపిస్తోంది. టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం ► ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది రూ.లక్ష కోట్లు అదనం. మొత్తంగా రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఇదీ మన ట్రాక్ రికార్డు. ► చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే, ఇతర సేవలు అందించే వలంటీర్లు, విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, డిజిటల్ బోధన, ఆర్బీకేలు, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్‌న్‌పుట్ సబ్సిడీ గుర్తుకొస్తాయి. ► 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చాం. మనం వచ్చేటప్పటికి 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగనే. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే వర్గాల వారే ఉన్నారు. ► అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఈ పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ► కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని కంపెనీలు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయి. నిజమైన సామాజిక న్యాయానికి జైకొడదాం ► నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్‌లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ► ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. మన భవిష్యత్తు, మన తల రాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం.. అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేదల రక్తం పీల్చే పసుపుపతి చంద్రబాబు ► మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబునాయుడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్ టైజ్మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామ న్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. ► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టాలా.. వద్దా? ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడుదాం. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను.. కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని కోరుతున్నా. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌తో, మైనార్టీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు, కూటమికి ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించండి. మన అభ్యర్థులకు దీవెనలు అందించండి మన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలి. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట నుంచి అమర్నాథ్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకనాథ్‌రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాను అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ తిప్పికొట్టాలి. రెండు బటన్లు నొక్కాలి.. ► పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఆగకూడదంటే, మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే బాబు లాంటి సైంధవులు ఎప్పటికీ అడ్డు పడే అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే ప్రతి పేదవాడు మరో 40 రోజుల్లో రెండు బటన్లు నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. అప్పుడు ఈ వదల బొమ్మాళీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ► జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటానని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ► ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని.. ఒక బైబిల్, ఖురాన్న్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాకే ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. -
నమ్ముకుంటే నట్టేట ముంచారు
సాక్షి, విశాఖపట్నం : నోట్ల కట్టలు చూపించినవారికే టికెట్ కన్ఫార్మ్ చేసిన చంద్రబాబు వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీని నమ్ముకుంటూ పనిచేస్తుంటే నోట్ల కట్టలకు సీట్లు అమ్ముకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోకపార్టీ జనసేనలోనూ ఇదే వైఖరి కనిపిస్తోంది. పదేళ్లు కష్టపడిన వారిని పక్కన పెట్టేసి.. కొత్తగా కండువా కప్పుకున్న వారికి టికెట్ కట్టబెట్టిన పవన్ వ్యవహారంపైనా కేడర్‌లో వ్యతిరేకత మొదలైంది. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేసుకొని కండువాపై కండువా వేసుకుంటూ ప్రచారం చేయడం తమ వల్ల కాదంటూ టీడీపీ, జనసేన నాయకులు కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఉమ్మడి విశాఖలో ప్రతి నియోజకవర్గంలోనూ ఈ అసమ్మతి కుంపటి రోజురోజుకూ రాజుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్ మొత్తం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తీరు తూర్పారపడుతున్నారు. జనసేనతో కోట్లకు బేరం దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో మమేకమైన పార్టీ నేతలు డా.విల్లూరి చక్రవర్తి, నజీర్‌కి కూడా చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. పార్టీని నమ్ముకుంటూ వచ్చిన తమను మోసం చేయడం తగదని వేడుకున్నా.. వారి మాటలు వినేందుకు కూడా చంద్రబాబు, లోకేష్ ఇష్టపడలేదని సమాచారం. దీంతో దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు బేరం కుదుర్చుకున్నాడని విమర్శలు కోడై కూస్తున్నాయి. గంటాకు సీటు అమ్మేశారు భీమిలి నియోజకవర్గంలో ఆది నుంచి కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్న కోరాడ రాజబాబు, కర్రోతు బంగార్రాజును గతంలో మెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారి దగ్గర డబ్బులు లేవంటూ గంటా వైపు మొగ్గు చూపారు. సుమారు రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేయగలనని చంద్రబాబుకు చెప్పి.. టికెట్ ఇవ్వాలని కోరాడ కోరినా.. సరిపోవంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వర్గాలు బాబు వైఖరిపై మండిపడుతున్నాయి. భీమిలిని నాశనం చేసిన గంటాకు టికెట్ అమ్మేసుకున్నారంటూ టీడీపీ శ్రేణులే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నాయి. ద్వితీయశ్రేణి నేతలపై నిర్లక్ష్యం ఉత్తర నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గెలిచిన నాటినుంచి నియోజకవర్గం ముఖం చాటేసిన తర్వాత.. అక్కడి కార్పొరేటర్లు, ద్వితీయశ్రేణి నేతలు పార్టీకి కాపుకాస్తూ వచ్చారు. అయితే ఇక్కడ టికెట్‌ను బీజేపీకి కేటాయించడంతో పార్టీలో ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ‘గ్లాసు’లోనూ అసమ్మతి తుపాను ఇక పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబుతోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా పయనిస్తూ.. చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కూడా.. బాబు లక్షణాలు వంటబట్టాయి. తనని నమ్ముకొని పార్టీలోకి వచ్చిన వారి భవిష్యత్తును గాలిలో దీపం మాదిరిగా వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు పవన్ పొత్తు వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నారు. టికెట్ ఆశించి పార్టీకి ఏ తాడు బొంగరం లేకపోయినా అన్నీ తామై కోట్లు ఖర్చు చేసిన వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. నియోజకవర్గంలో జనసేన కోసం పాటుపడిన వారికి, టికెట్ ఆశించి పార్టీలో చేరిన వారికీ పవన్ ఝలక్ ఇచ్చారు. భీమిలిలో పంచకర్ల సందీప్‌కు టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో మోసం చేయడంపై భీమిలి జనసేన వర్గం పవన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దక్షిణంలో టికెట్ ఇస్తామన్న హామీతో గ్లాసు పట్టుకున్న కార్పొరేటర్లు కందుల నాగరాజు, సాధిక్.. పవన్‌ను నమ్ముకొని రోడ్డున పడ్డారు. ఉత్తర నియోజకవర్గంలో పసుపులేటి ఉషాకిరణ్కీ పవన్ వెన్నుపోటు పొడిచారు. గాజువాక టికెట్ ఆశించి పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేసిన సుందరపు సతీష్‌ని కరివేపాకులా తీసిపారేశారు. అనకాపల్లిలో పరుచూరి భాస్కరరావు పవన్ హ్యాండిచ్చారు. పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితకు సీటు ఇవ్వొద్దని జనసేన నేత గెడ్డం బుజ్జి అభ్యర్థన కూడా పవన్ కల్యాణ్ పరిగణలోకి తీసుకోలేదు. ఇలా కూటమి పేరుతో టికెట్లు అమ్ముకున్నారంటూ జనసేన శ్రేణులు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. -
నూతన విద్యా విప్లవం వర్ధిల్లాలంటే...
గత ఐదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. కానీ తమ పిల్లల్ని ఖరీదైన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించిన వారు... పేదలు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. దేశంలో ప్రయివేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతున్నదో తెలియదా? ప్రజా మేధావులకు తెలివి కన్నా, బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా! దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ప్రయోగాన్ని జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది... తమ పిల్లల భవిష్యత్తు కోసం! 2024 ఆంధ్ర ఎన్నికలు గత రెండు ఎన్నికల కంటే పూర్తిగా భిన్నమైనవి. 2014లో ఒకవైపు మూడు పార్టీల కూటమికీ, వైసీపీకీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగాయి. అప్పుడు కేంద్రంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆనాడు కొత్త రాష్ట్ర రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ ప్రధాన అంశాలు. 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలు విడివిడిగా కొట్లా డాయి. వైసీపీ తన కొత్త విద్యా విధానం, గ్రామాల అభివృద్ధి అంశాలతో 151 సీట్లు గెలిచింది. విడిగా పోరాడిన మూడు పార్టీలు మట్టికరిచాయి. చంద్రబాబుకు 23 సీట్లు, పవన్ కల్యాణ్‌కి 1 సీటు వచ్చాయి. గత ఐదేండ్లలో ఆ పార్టీలు ఊహించని విధంగా దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. దీన్ని ఏపీ నాయ కులు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. వీరేకాక దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎం.వి. రమణ కూడా వ్యతిరేకించారు. సమస్య కోర్టుకు పోయింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు జడ్జిగా రమణకు ఇంగ్లిష్ భాష పాత్ర ఎంతో తెలుసు. అయినా వ్యతిరేకించారు. వీరుకాక మీడియా రంగంలో ఈనాడు గ్రూపు, ఆంధ్రజ్యోతి గ్రూపు, టీవీ 5 నెట్వర్క్ అధిపతులు తమ పిల్లల్ని మంచి, మంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించి... రైతులు, కూలీలు, దళితులు, బీసీలు, ఆదివాసులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. ఈ ఎన్నికల్లో మళ్ళీ 2014 నాటి ప్రతిపక్ష గుంపు జత కట్టింది. జగన్‌ను ఓడించాలని వీళ్ళు రాత్రింబవళ్లు పనిచేసేది ఎందుకోసం? ముఖ్యంగా గ్రామీణ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు ఆపెయ్యడం కోసం. ఈ క్రమంలో జయప్రకాశ్ నారాయణ గురించి కొంత చర్చించాలి. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కొంతకాలం ఆయన పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. ఆ దశలో తెలంగాణలో నక్సలైట్లకూ, తెలుగుదేశం పార్టీకీ తీవ్ర సంఘర్షణ జరుగుతున్నది. ఎన్టీఆర్ సన్నిహిత సోషలిస్టు నాయకుడొకరు కేజీ కన్నాభిరన్ (అప్పటి పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు)కు కబురుపెట్టి, ముఖ్యమంత్రితో హక్కుల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు నేను, కన్నాభిరన్, బాలగోపాల్, ఎం.టి. ఖాన్ వెళ్లాం. మేం వెయిటింగ్ రూంలో ఉండగా జయప్రకాశ్ నారాయణ ఆ మీటింగ్‌ను జరగ కుండా చూడాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఎన్టీఆర్ వినలేదు. మీటింగ్ జరిగింది. నక్సలైట్లను అణచివెయ్యాలి గానీ వారితో చర్చలేమిటని జేపీ ఆలోచన. ఆ విభాగాన్ని చూసే పోలీస్ ఆఫీసర్ అరవిందరావుది కూడా అదే ఆలోచన. మా పౌరహక్కుల టీమ్ ఇరుపక్షాల హత్యలు, కిడ్నాప్‌లు, ఎన్కౌంటర్లు ఆపించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న రోజులవి. అప్పుడు ఎన్కౌంటర్లు, టీడీపీ కార్యకర్తల కిడ్నాపులు చాలా జరిగాయి. ఆ తరువాత జయప్రకాశ్ నారాయణ ఈనాడు పేపర్, ఈటీవీ ద్వారా మేధావి అవతారమెత్తాడు. అక్కడి నుండి ఒక ఎన్జీవో పెట్టి, ‘లోక్‌సత్తా’ (అంటే ఇంగ్లిష్‌లో గ్లోబల్ పవర్) అనే రాజకీయ పార్టీ రూపందాల్చి, దానికి అలుపెరుగని, ఎన్నడూ దిగిపోని ఏకో ముఖ (అంటే ఆ పార్టీలో మరో ముఖమే కనపడదు) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్లోబల్ పవర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఉన్న మూడు పార్టీల కూటమి చాలనట్లు నాలుగో పార్టీగా అందులో చేరాడు. ఇప్పుడు జేపీ లక్ష్యమంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువు ఆపి, మళ్లీ తెలుగు మీడియం పెట్టేంత వరకూ పోరాటం చెయ్యడం! ఆయన మరో లక్ష్యం గ్రామాలలో స్కూళ్ల నిర్మాణం, సెక్రటే రియట్ నిర్మాణాలను ఆపి అభివృద్ధికి మార్గంగా అమరావతిని సింగ పూర్లా చూపడం! అభివృద్ధిపై ప్రపంచ యూనివర్సిటీలు చదివే గొప్ప పుస్తకం ఆయన రాసినట్లు, డెవలప్మెంటల్ ఎకనామిక్స్‌లో తాను అథారిటీ అయినట్లు నిరంతర యూట్యూబ్ ఉపన్యాసాలు ఇస్తున్నారు. గ్లోబల్ పవర్ ఈనాడు నుండి ఇప్పుడు యూట్యూబ్‌కు మారింది. విద్యా వ్యవస్థ మీద కూడా జాన్‌డ్యూయి (కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్ గురువు) కంటే తానే మంచి ఎక్స్‌ఫర్ట్ అన్న రీతిలో ఉపన్యాసాలు ఇస్తారు. జేపీ ప్రపంచ మార్పు మీద ఇంగ్లిష్‌లోనో, తెలుగులోనో రాసిన మంచి పుస్తకం మార్కెట్లో ఉంటే చదవాలని ఉంది. కానీ ఇంతవరకు ఒక్కటీ కనిపించలేదు. 30,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు తీసు కున్నప్పుడు వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి. ఆయన సలహా, సహకారం లేకుండా చంద్రబాబు ఆ పని చెయ్యడు. ఇప్పుడు గ్రామీణ బడుల నిర్మాణం, ఇంగ్లిష్ మీడియం చదువు, అమ్మ ఒడి పథకం ఆపి, అమరావతి పట్టణం వచ్చే ఐదేండ్లలో కడితే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధితో పాటు దేశానికే ఒక మోడల్ సిటీ వస్తుందని బహుశా జేపీగారి నమ్మకం. కానీ ఒక ఎనిమిదో తరగతి విద్యార్థి మా తల్లిదండ్రులు జగన్‌కు ఓటేసి గెలిపించకపోతే, ఇంగ్లిష్ మీడియం ఆగి పోతే, నాకొచ్చే బట్టలు, బూట్లు ఆగిపోతే నేను ఉన్న బట్టలు సర్దుకుని ఇంట్లోనుండి పారిపోతాను అన్నాడు. ఆ పిల్లోడి ఆశను ఏం చెయ్యా లని ఈ నాయకులు అనుకుంటున్నారు? ప్రజా మేధావికి తెలివి కన్నా, వాగ్దాటి కన్నా బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా! దేశంలో ప్రయివేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతుందో వీరందరికీ తెలువదా? 2024–25 ఎకనమిక్ సంవత్సరానికి ధీరూబాయి అంబానీ కొడుకు, కోడలు నడిపే స్కూలు ఫీజు చూడండి: సంవత్సరానికి ఎల్కేజీ విద్యార్థి ఫీజు: 1,70,000. 8–10వ తరగతి పిల్లల ఫీజు: 5,90,000. 11–12వ తరగతి పిల్లల పీజు: 9,65,000. ఇటువంటి స్కూళ్లు దేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏ మాతృభాషలో నడుస్తు న్నాయి? ఇంతింత ఫీజులలో ఇంగ్లిష్ మీడియంలో, విదేశీ సిలబస్‌తో చదివే పిల్లల్ని జగన్ మోడల్ విద్యా విధానం ద్వారా కాక ఎలా ఎదు ర్కొంటారు? ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది కాదు సమస్య. ఈ ఎన్నికల పోరాటంలో అక్కడ ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఇంగ్లిష్ క్వాలిటీ విద్యా ఎక్స్పెరిమెంట్ ఏమైతది అనేది కీలకమైన సమస్య. నేనొక సొంత పార్టీ పెట్టుకొని జగన్‌తో పొత్తు పెట్టుకొని ఈ వ్యాసం రాయడం లేదు. జగన్ ఇచ్చిన ఎమ్మెల్యే పదవో, రాజ్యసభ ఎంపీ పదవో తీసుకుని రాయడం లేదు. ఈ దేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు మీద భయంతో రాస్తున్నాను. ఒక పబ్లిక్ ఇంట లెక్చువల్‌కు దోపిడీకి, అణచివేతకు గురౌతున్న ప్రజల జీవనం మారడం ముఖ్యం. రాజకీయ నాయకులకు రాజకీయాలలో తమ ఉనికి ముఖ్యం. తమ ఉనికి కోసమైనా రాజకీయ నాయకులు ప్రజల మార్పు కోసం, సమానత్వం సాధించడం కోసం చర్యలు చేపట్టి నప్పుడు వాటిని సమర్థించడం ప్రజా మేధావి ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలోని దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ఎక్స్పెరిమెంట్ జగన్ ప్రభుత్వం చేస్తున్నందున నేనీ విద్యా విధానాన్ని సమర్థిస్తున్నాను. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది... తమ పిల్లల భవిష్యత్తు కోసం! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా!
ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు టీడీపీని ముంచేశారు. వారిద్దరూ కలిసి ఏపీలో వేళ్లూనుకున్న వలంటీర్ల వ్యవస్థపై విషం కక్కుతూ రాసిన రాతలన్నీ నిజమేనని భ్రమపడి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విలవిలలాడుతున్నారు. ఆయనకు తత్వం బోధపడేసరికి టైమ్ ముగిసిపోయింది. జరగవలసిన డామేజీ జరిగిపోయింది. అందుకే రామోజీ, రాధాకృష్ణలు స్వరం మార్చి తాము చేసిన తప్పును వైఎస్సార్సీపీపై నెట్టేస్తూ పూర్తిగా దొరికిపోయారు. వలంటీర్లు పెన్షన్లు తీసుకునే వృద్దుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బు ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగానే తమ పన్నాగం ఫలించిందని వారు చంకలు గుద్దుకున్నారు. కొద్ది గంటలలోనే తాము ఎంత బ్లండర్ చేసింది అర్ధం చేసుకుని దానిని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ ఏజెంట్‌గా మార్చుకుని, ఆయన ద్వారా అకృత్యాలు చేయిస్తూ ఏపీ ప్రజలను పీడించడమే టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు పనిగా పెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఆయన ద్వారా హైకోర్టులో వలంటీర్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం, అది చాలదన్నట్లు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేయించారు. అంతేకాక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక, కేంద్రంలో ఎవరి ద్వారానో ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన నిర్ణయాలను టీడీపీ తెప్పించుకుంటోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ క్రమంలో వలంటీర్లు ఈ మూడు నెలలు తమ సేవలు అందించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం అయినా ఇందులో ఉన్న మతలబు ఏమిటి? వృద్దులకు అందుతున్న సదుపాయం రద్దు చేయడం వల్ల వారు పడే బాధలు ఏమిటి? అన్నవి ఆలోచించకుండా టీడీపీ ఏజెంట్ కోరిందే తడవుగా ఆదేశాలు ఇచ్చేసింది. నిజానికి మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదు. అసలు అలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేయకూడదు. ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా అడగవచ్చు కదా! ఇది ఎప్పటి నుంచో అమలు చేస్తున్న విధానం అయినా ఎన్నికల కమిషన్ వలంటీర్ల సేవలు అందకుండా చేసిందంటే రాజకీయ కుట్ర కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వలంటీర్లు పెన్షనర్లను కలిసి డబ్బు ఇస్తేనే వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనుకుంటే, ఇప్పుడు మాత్రం వేయకుండా ఉంటారా? టీడీపీ కుట్ర చేసి పెన్షన్లు తమ ఇంటికి రాకుండా ఆపిందని వారు తెలుసుకోకుండా ఉంటారా? ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబును వారు బండబూతులు తిడుతున్నారు. ఎవరైనా టీవీవారు దీని గురించి ప్రశ్నిస్తే టీడీపీపై విరుచుకుపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తమను మళ్లీ ఆఫీస్‌ల చుట్టూ తిప్పుతారా అని నిలదీస్తున్నారు. దీంతో.. పరిస్థితి అర్ధం చేసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే యుటర్న్ తీసుకుని పెన్షన్ దారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారు. ఆ రాసేదేదో ఎన్నికల సంఘానికి రాసి, వలంటీర్ల ద్వారానే పెన్షన్లు ఇళ్లకు పంపిణీ చేయాలని రాసి ఉంటే కాస్త గౌరవం అయినా మిగిలేది. కానీ అన్నిటిలోను డబుల్ స్టాండర్స్ పాటించే చంద్రబాబు ఇందులో కూడా ఆ ధోరణిలోనే వెళ్లారు. వలంటీర్లను గతంలో తిట్టింది ఆయనే. ఆయనకు తోడు పవన్ కల్యాణ్. మళ్లీ ఇద్దరూ యు టర్న్ తీసుకుని వలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక బినామీ సంస్థను స్థాపించి వలంటీర్లకు, ఇతరత్రా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం, కోర్టులలో, ఇతర వ్యవస్థలలో లిటిగేషన్ పెట్టించడం చేశారు. అందులో భాగంగానే ఈ వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు అని చెప్పాలి. ఆ ఫిర్యాదుల ఫలితం తెలుగుదేశం మెడకే చుట్టుకుంటోందన్న విషయం తెలుసుకుని అంతే స్పీడ్‌గా రామోజీ, రాధాకృష్ణలు యుటర్న్ తీసుకుని చంద్రబాబును రక్షించడం కోసం కొత్త కథనాలు అల్లారు. వైఎస్సార్సీపీవారే పెన్షన్లను ఇళ్ల వద్ద ఇవ్వకుండా అడ్డుకున్నారని వీరు అడ్డగోలు కథనాలు రాశారు. వృద్దులు గ్రామ, వార్డు సచివాలయాలలో పెన్షన్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే, అమ్మో వారిని ఎండలో తిప్పుతారా అంటూ వారిపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ బానర్ కథనాలు ఇచ్చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడింది అర్దం అవుతుంది. తాము అతి తెలివితో వలంటీర్ల వ్యవస్థపై బురదచల్లి చంద్రబాబుకు ఏదో మేలు చేశామని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయి టీడీపీకి ఉరితాడుగా మారడంతో మళ్లీ మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి యత్నించారు. గ్రామ, వార్డు సచివాలయాలలో 1.35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారిని పెన్షనర్ల ఇళ్లకు పంపించి డబ్బు ఇప్పించవచ్చని ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి కథనాలు వండాయి. బహుశా ఈ నాలుగేళ్లలో గ్రామ,వార్డు సచివాలయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని రామోజీ, రాధాకృష్ణ అంగీకరించారు. 'చిత్రమేమిటంటే.. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి డబ్బు ఇస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్లటా! అదే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వృద్దుల ఇళ్లకు వెళ్ళి డబ్బు ఇస్తే అది ఎన్నికలను ప్రభావితం చేయడం కాదట. ఇవేమి పిచ్చి రాతలు, ఈ సచివాలయాల ఉద్యోగులు సైతం వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్‌లో వచ్చినవారే కదా! వీరు వెళ్లి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది అనికాక, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని చెబుతారా? వలంటీర్లను నిలుపుదల చేయడంతో వృద్దులంతా టీడీపీని బండబూతులు తిడుతుండడంతో భయపడి రామోజీ, రాధాకృష్ణలు ఏమి చేయాలో దిక్కుతోచక ఇలాంటి కథనాలు రాసి వైఎస్సార్సీపీపై పడి ఏడ్చారు. పైగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఒకవేళ వీరు కోరుకున్నట్లు వృద్దుల ఇళ్ల వద్దకు వీళ్లను పంపుతూ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే అప్పుడు మళ్లీ ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి దానిని కూడా విమర్శిస్తూ డబ్బును వృద్దుల చేతికి ఇస్తున్నారని, ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్ర అని రాసి ఉండేవి. గతంలో టీచర్లను స్కూళ్ల బాగు చేతకు సంబంధించిన విధులలో పెడితేనే, వారిని అలా వాడతారా? ఇలా వాడతారా? అంటూ ఇదే మీడియా నానా యాగి చేసింది. సచివాలయ ఉద్యోగులను మాత్రం ఇప్పటికిప్పుడు వారికి సంబంధం లేని డ్యూటికీ వేయాలట. అంతా రామోజీ ఇష్టం అన్నమాట! ఎన్నికల సంఘం పవిత్రతపైన బురద చల్లేలా వైఎస్సార్సీపీ ఏదో చేసింది అంటూ ఆ వ్యవస్థపై ఏదో తెలుగుదేశంకు అంత గొప్ప అభిప్రాయం ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోకపోతే, అదే సంస్థను ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగ తిట్టిపోసేవి. జగన్మోహన్రెడ్డి వారిని మేనేజ్ చేసేశారని ఏకిపారేసేవారు. '2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ కార్యాలయానికి వెళ్లి ఎంత రచ్చ చేశారో గుర్తు లేదా?' అప్పుడు మాత్రం ఎన్నికల సంఘం పవిత్రమైనదని ఈనాడు రాయలేదే! బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఎన్నికల కమిషన్‌ను కేంద్రం ద్వారా ప్రభావితం చేయడానికే అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్నికలు 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకొండున ఎందుకు జరిగాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తర్వాత ఎన్నికలు మే పదమూడు వరకు ఎందుకు వెళ్లాయి? ఇందులో మేనేజ్మెంట్ లేదని ఎవరైనా అనుకుంటారా? అందులోను చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో తెలియదా! లేకుంటే వారికి కావల్సినట్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎలా ఇస్తుంది? కనీసం ఏపీ ప్రభుత్వ అభిప్రాయం అయినా తీసుకుందా? కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్‌కు ఈ వ్యవహారంలో బాద్యత లేదట! ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి, దారుణమైన ఆదేశాలు తెప్పించిన రమేష్ ఉత్తముడట! ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించిన ఏపీ ప్రభుత్వ అధికారులు చెడ్డవారట. వలంటీర్ల వ్యవస్తపై నీచమైన విమర్శలు చేస్తూ పలు కదనాలు రాసిన రామోజీ గొప్పవాడట. ఆ విమర్శలను సమర్దించిన చంద్రబాబు,పవన్‌లు గొప్ప నాయకులట. అంత గొప్పగా ఫీల్ అయితే వలంటీర్ల పై ఆంక్షలు పెట్టిన కొద్ది గంటలలోనే చంద్రబాబు కానీ, ఈ మీడియా సంస్థలు కానీ తమకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుని వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రామోజీ, రాధాకృష్ణలు తనకు ఎంత డామేజీ చేశారో చంద్రబాబుకు అర్దం అయ్యే ఉంటుంది. కానీ ఆయన నిస్సహాయుడిగా మిగిలారు. వారి చేతిలో ఒక బందీగా ఉండి, వారు చెప్పినట్లు ఆడే పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే తప్పుడు వార్తలు, అబద్దాలనే మహా ప్రసాదంగా భావించి చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలేసరికి లబోదిబో అంటున్నారు. ఇంటింటికి పంపీణీ సులువేనని టీడీపీవారు కానీ, 'ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ కొత్త రాగం ఎందుకు అందుకున్నారో ప్రజలు అర్ధం చేసుకోలేరా? ఇంటింటికి పెన్షన్ ఇచ్చేటప్పుడు వలంటీర్లు అయితేనేమి? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అయితేమి?' ఈ మాత్రం ఇంగితం లేకుండా వలంటీర్లపై విషం కక్కిన ఎల్లో మీడియా, తాము చేసిన దిక్కుమాలిన చర్యవల్ల, తాము జాకీలేసి లేపుతున్న తెలుగుదేశంకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అర్ధం అయిందని అనుకోవాలి. కొన్నిచోట్ల వలంటీర్లు టీడీపీ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నారు. ఒక్క మచిలీపట్నంలోనే 1227 మంది వలంటీర్లు రాజీనామా చేశారట. ఇదంతా టీడీపీకి తల బొప్పి కట్టించేదే. అసలే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రచార సభలలో ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. టిప్పర్ డ్రైవర్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి టిక్కెట్ ఇస్తారా అని చంద్రబాబు అన్న ఫలితంగా లక్షల సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ఆగ్రహం తెప్పించారు. ఇప్పుడు వృద్దాప్య పెన్షన్లు ఇళ్లకు ఇవ్వకుండా ఆపి పాపం మూటకట్టుకోవడంతో అరవై లక్షలమంది టీడీపీకి, చంద్రబాబుకు శాపనార్ధాలు పెడుతున్నారు. దీని అంతటికి కారణం ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారేనని కూడా ప్రజలకు తెలిసిపోయింది. చంద్రబాబుకు కూడా అవగతమైంది కానీ, ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దెబ్బమీద దెబ్బపడుతుండడంతో ఏపీలో టీడీపీ గెలవడం అసాద్యమన్న భావన సర్వత్రా ఏర్పడడంతో దానిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా రకరకాల విన్యాసాలు, యుటర్న్‌లు చేస్తోంది. టీడీపీని ఆకాశానికి జాకీలతో ఎత్తాలని ప్లాన్ చేసిన వారిద్దరూ చివరికి పెద్ద గోతిలో పడేశారు. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ గోయినుంచి పైకి లేవడం అంత తేలిక కాదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు
సాక్షి, అన్నమయ్య: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆరో రోజు అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ సీఎం జగన్ బస్సు యాత్ర చీకటిమనిపెల్లెలో ప్రారంభమైంది. ఈ క్రమంలో చీకటిమనిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి సీఎం జగన్ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. బీజేపీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్, కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం.గంగాధర్ వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
పెన్షన్ల పంపిణీ బ్యాక్ ఫైర్.. సరిదిద్దుకోలేక టీడీపీ తిప్పలు
కొండవీటి దొంగలో చిరంజీవిని ఎలాగైనా పట్టుకుంటానని. ఆయన్ను నిలువరిస్తానని ప్రతినబూనిన పోలీస్ ఆఫీసర్ విజయశాంతి ఆయన్ను వెంబడిస్తుంది. చిరంజీవిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరదు.. చివరకు ఆమె పెద్ద బురదగుంటలో పడిపోతుంది.. దీంతో చిరంజీవి వచ్చి నన్ను ఉచ్చులో దించుతామని నువ్వు రొచ్చులో పడ్డావేంటి అంటాడు. అచ్చం ఇపుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఐంది. రేసు గుర్రంలా దూసుకెళ్తున్న జగన్‌ను నిలువరించేందుకు వేసిన వలంటీర్ల ఉచ్చు తిరిగి చంద్రబాబు మెడకు చుట్టుకుంది. దాన్నిప్పుడు తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లుంది టీడీపీ పరిస్థితి. వాస్తవానికి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తులో సీట్లు ప్రకటించిన దగ్గర్నుంచి వారి పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎటునుంచి చూస్తున్నా ఎక్కడోచోట ఇబ్బంది కనిపిస్తూనే ఉంది. దానికితోడు టీడీపీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేని చోట్ల తమ వాళ్ళను జనసేనలోకి పంపించి అక్కడ గ్లాసు గుర్తు మీద పోటీ చేయిస్తున్నారు. అవనిగడ్డలో బుద్ధప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ అలా టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్ళే.. ఇదిలా ఉండగానే తమ కూటమిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ వేసిన తప్పటడుగు ఇప్పుడు వాళ్ళను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. చిన్న గాయాన్ని గోక్కుని... గెలుక్కుని పెద్ద పుండుగా మార్చినట్లు ఐంది. ఇన్నేళ్ళుగా వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. ఐతే అది ఆపాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులమేరకు వాలనీర్లను పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం దూరం పెట్టింది. అది సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారని, అది తమకు లాభిస్తుందని టీడీపీ క్యాంప్ భావించింది. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ అదే అంశం మీద ప్రజల్లోకి వెళ్ళింది. ఫస్ట్ తేదీ వచ్చినా పెన్షన్లు ఇవ్వలేకపోవడానికి టీడీపీ కారణం... చంద్రబాబే వాలంటీర్లను అడ్డుకున్నారు. లేకుంటే ఈపాటికి అవ్వాతాతలకు పెన్షన్లు అందేవి అంటూ వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాతోబాటు ఆ పార్టీ నాయకులూ ప్రచారం మొదలు పెట్టి.. ఈ అంశాన్ని ప్రజలకు వివరించారు. ఇంకేముంది... ప్రజలు.. దాదాపు 67 లక్షలమంది వృద్ధులు.. వికలాంగులు తిట్లు అందుకున్నారు. మా నోటికాడి కూడు ఆపేసారు... లేకుంటే ఈపాటికి మాకు పెన్షన్లు అందేవి.. చంద్రబాబు పెద్ద కుట్రదారు అంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ ఎండల్లో వృద్ధులం ఎక్కడికి వెళ్తాం.. మా వాలంటీర్ ఉంటే మాకు చక్కగా పెన్షన్లు అందేవి.. ఈ చంద్రబాబు మాకు పెన్షన్లు ఆపేసాడు.. ఎన్నికల్లో అయన సంగతి చూస్తాం అంటున్నారు. రోజూ ఇంట్లోని రొట్టెముక్కల్ని తినేస్తున్న ఎలకను పట్టుకునేందుకు పిల్లి ఒక ఉచ్చు తయారు చేసింది... అది ఎలక మెడకు వేయబోతే తిరిగి తన మెడకే చుట్టుకోవడంతో దాన్ని తీసుకోలేక పిల్లి గిలగిలా కొట్టుకుంది... అచ్చం ఇలాగే ఇంటింటికి వలంటీర్ల ద్వారా సేవలు అందిస్తూ తన ఓట్లను సునాయాసంగా ఎత్తుకుపోతున్న సీఎం వైయస్ జగన్‌ను అదుపు చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు... వలంటీర్ల కాళ్లకు కర్ర అడ్డం బెట్టి వాళ్ళను పడగొట్టి తాను రేసులో ముందుకు పోదాం అనుకున్నారు... అయితే చంద్రబాబు ఆ కర్రను తన కాళ్ళమధ్య పెట్టుకుని తానే బోర్లా పడినట్లు ఐంది.. దీంతో ఇప్పుడు లేవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇది కాస్తా టీడీపీకి డ్యామేజ్‌గా మారింది. దీంతో ఇప్పుడు బాబు, టీడీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. సచివాలయంలో లక్ష ముప్ఫైవేలమంది ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్లతో పెన్షన్లు ఇప్పించండి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అసలు జగనొచ్చాక ఉద్యోగాలే ఇవ్వలేదని చెబుతూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు సచివాలయంలోని లక్షా ముప్పైవేల ఉద్యోగులు ఉన్నారుగా వాళ్లతో పెన్షన్లు ఇవ్వండి అని సలహా ఇచ్చేసారు. మొత్తానికి కూటమి కూర్చిన తరువాత పార్టీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు ఏదేదో చేసి ప్రభుత్వాన్ని గందరగోళపరుద్దామని భావించి తానే ఉచ్చులో చిక్కుకున్నట్లు అయింది. ఇప్పుడు మెడకు చుట్టుకున్న తాడును తప్పించుకునేందుకు చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ అంశంలో పవన్ కల్యాణ్... బీజేపీలు సైలెంట్ గా ఉన్నాయ్... చంద్రబాబు చేసిన పెంటను తామెందుకు నెత్తికి రుద్దుకోవాలి అనుకున్నాయో ఏమో మరి ఆ పార్టీలు... దాని నేతలు మాత్రం ఈ అంశాన్ని విననట్లే ఊరుకున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
6వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..
-
కదిరిలో కదం తొక్కిన ప్రభంజనం.. సీఎం జగన్ కు అఖండ ఘన స్వాగతాలు
-
జోరుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
ఆరో రోజు మేమంతా సిద్ధం: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Memantha Sidham Day 6 Highlights CM Jagan Bus Yatra Details మదనపల్లె సభ సక్సెస్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికీ చేసిన మంచికి మద్దతు తెలుపుతూ తరలివచ్చిన సమరయోధుల సముద్రం మదనపల్లెలో నాకు కనిపించింది మరో 6 వారాల్లో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం.. మరి మీరంతా సిద్ధమేనా? మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికీ చేసిన మంచికి మద్దతు తెలుపుతూ తరలివచ్చిన సమరయోధుల సముద్రం మదనపల్లెలో నాకు కనిపించింది. మరో 6 వారాల్లో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం.. మరి మీరంతా సిద్ధమేనా?#MemanthaSiddham pic.twitter.com/Z0Nbf7kyOc — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నారు.. 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోడీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు!#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/DJqhuefo9V — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మదనపల్లెలోని మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మదనపల్లెలో అన్నమయ్య జిల్లాలో ఇక్కడ కనిపిస్తున్న అభిమానం.. ఒక జనసముద్రాన్ని తలపిస్తోంది మన అందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలనే సంకల్పంతో వచ్చిన సమరయోధుల సముద్రం ఇక్కడ కనిపిస్తోంది ఇంటింటి నుంచి తరలి మదనపల్లె వచ్చిన నా ఆత్మ బంధుల జన సముద్రమిది నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వా తాతలకు మీ అందరికీ కూడా పేరు పేరునా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. ప్రతీ గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్ సెంచరీ కొట్టేందుకు, రెండు వందలకు రెండొందల కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం మ్యానిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం.. నెరవేర్చిన తర్వాత ఓటు అడగటానికి అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం. విశ్వసనీయతకు ఇది అర్థం అని చెబుతూ అడుగులు వేశాం ఈ 58 నెలల పాలనలో.. ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత మీ ముందు నిలబడి ఇది మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతీ ఇంటికి వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్‌కు మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, మన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారంటే దానికి కారణం మంచి చేశాం కాబట్టేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రులు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరికీ తోడు కుట్రలు-కుతంత్రాలు ఒక్కడి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారంటే మిమ్మల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా వారందరికీ తెలియని విషయం ఒక్కటి ఉంది.. 99 శాతం మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతున్నాను. మరి కనీసం 10 శాతం మార్కులు తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతున్నాను ఏకంగా 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు.. తన హయాంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చని బాబు నిలబడగలుగుతాడా? అని అడుగుతున్నా విలువులు, విశ్వసనీయతలు లేని ఇలాంటి వారితో ముఫ్పై పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన అభిమానులు కానీ మన వాలంటీర్లు కానీ, ఇంటింటి అభివృద్ధి అందుకున్న పేద వర్గాలు కానీ భయపడతారా? అని అడుగుతున్నాను. జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదు జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయి లంచాలు, వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ దిశ యాప్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు 2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేల డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తాడంట ఇది 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు మరి మదనపల్లెలో ఏమైనా హైటెక్ సిటీ కనబడుతుందా? ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటివి 650కి పైగా హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితి ఇది అయితే, మరి మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోదీ గారితో ఉన్న ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ పంపించారు చంద్రబాబు. ఇందులో ఒక్కటైన నెరవేర్చారా అని గట్టిగా అడుగుతున్నాను పోనీ ప్రత్యేకహోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను ఇప్పుడు మళ్లీ ఇదే పొత్తు.. ఇదే పార్టీలు.. ఇదే కూటమి.. మరోసారి ఇదే మాదిరిగా మీటింగ్‌లు పెట్టి, మరోసారి రంగు రంగుల మ్యానిఫెస్టోలు తయారు చేసి డ్రామకు తెరతీశారు. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు.. ఇంటింటికి కేజీ బంగారం అంటున్నారు.. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అంటూ ఉన్నారు.. సూపర్ సెవన్ అంటున్నారు మరి వదలబొమ్మాలి అంటూ మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు పసుపుపతి తయారవుతున్నాడు చంద్రబాబు మరి వీరిని నమ్మవచ్చా అని మీ అందరిని కూడా అడుగుతున్నా నమ్మినవారిని నట్టేట ముంచి, మరోసారి మన రాష్ట్రాని దోచుకోవాలని బాబు ప్లాన్ బాబుకు అధికారం కావాల్సింది మంచి చేయడం కోసం కాదు.. దోచుకోవడం కోసం, దాన్ని దాచుకోవడం కోసం అధికారం కావాలి ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా.. వద్దా అని అడుగుతున్నాను గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ చదువు చెబుతా వద్దన్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలా.. వద్దా అని అడుగుతున్నాను పేదలంటే చంద్రబాబుకు కక్ష నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నాడు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. గతంలో కోర్టులకెళ్లి అడ్డుకున్నాడు బాబుకు ఓటు వేశామంటే వాలంటీర్ వ్యవస్థను సైతం, స్కీములను సైతం, పెన్షన్లను సైతం అన్నింటికీ రద్దు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి పేదలకు అందాల్సిన ప్రతీ ఒక్క రూపాయి.. ఏ సంక్షేమ పథకం ఆగకుండా గత ఐదేళ్లు మాదిరిగా పొందాలంటే.. బాబులాంటి సైంధవుడికి అవకాశం ఇవ్వకూడదు అది జరగాలి అంటే రెండు బటన్లు ప్రతీ పేదవాడు నొక్కాలి పేదవాళ్ల కోసం, నా అక్క చెల్లెమ్మల భవిష్యత్ కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు.. వారంతా ఏకమై రెండే రెండు బటన్లు నొక్కాలి.. ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలి మన వేసే ఈ ఓటు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్, మీ ఇంట్లో ఆడపడుచుల భవిష్యత్, మీ ఇంట్లో అవ్వా తాతల భవిష్యత్ అంతా కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది అనే విషయం గ్రహించమని అడుగుతున్నాను జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం.. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే ఈ మంచి అంతా కొనసాగుతుందని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి అన్నమయ్య జిల్లాపై సీఎం జగన్ ప్రేమ చేతల్లో చూపించారు: మిథున్‌రెడ్డి సాగు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేశారు ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టారు సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది: నిస్సార్ అహ్మద్ ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం మదనపల్లె మేమంతా సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం పెత్తందారులపై పోరుకు ‘మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగసభ సీఎం జగన్ ట్వీట్.. ఆరవ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో.. With my star campaigners from Day-6 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/KxnAfbVe9O — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మదనపల్లి సభకు బయలుదేరిన సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర కాసేపట్లో మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ మదనపల్లె బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ అంగళ్లు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర యాత్ర బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ రోడ్డుకు ఇరువైపుల భారీ సంఖ్యలో ప్రజలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం పెత్తందారులపై పోరుకు ‘మేమంతా సిద్ధం’ అని నినాదాలు దారిపొడవునా సీఎం వైఎస్ జగన్‌కు జననీరాజనాలు ప్రజలతో మమేకమవుత్ను సీఎం జగన్.. నేనున్నానంటూ సీఎం భరోసా కురభలకోట మండలం కంటేవారిపల్లి చేరుకున్న జగన్ బస్సు యాత్ర పెద్దపల్లి క్రాస్ వద్ద సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కనికలతోపుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్టలో సీఎం జగన్ తుమ్మనంగుట్టలో యాత్ర బస్సు దిగిన సీఎం జగన్ సీఎం జగన్ బస్సు యాత్ర బుర్రకాయలకోట క్రాస్ దాటింది సీఎం జగన్‌కు ప్రజలు, అభిమానులు స్వాగతం పలికారు అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర సీఎం జగన్‌కు ప్రజలు భారీగా స్వాగతం పలుకుతున్నారు కొంతమంది తమ సమస్యలు సీఎం జగన్‌కు చెప్పుకున్నారు వేపూరి కోట క్రాస్‌లో సీఎం జగన్‌కు భారీ స్వాగతం ఉమా శంకర్ కాలనీ వద్ద సీఎం జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం పూల వర్షం కురిపించిన చిన్నారులు సీఎం జగన్‌పై అభిమానంతో... కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అమరనాథ్ సీఎం జగన్‌పై అభిమానంతో ఉద్యోగం వదిలి బైక్‌తో బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఈరోజు ములకలచెరువు నుంచి యాత్ర వెంట ఉన్నారు ములకలచెరువు దాటి.. పెద్దపాళ్యం చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజానికం వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత ఎం. గంగాధర్ చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం. గంగాధర్ వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత మొబసిర్ అహ్మద్ చీకటిమునిపల్లి స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్ వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ నేత ఏవీ సుబ్బారెడ్డి చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో బీజేపీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ వీ సుబ్బారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర మొలకల చెరువు వద్దకు చేరుకున్న సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు వద్ద గజమాలతో సీఎంకు ఘనస్వాగతం పలికిన ప్రజలు. ఆరో రోజు మేమంతా సిద్దం.. ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర చీకటిమనిపల్లెలో ప్రారంభమైన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ములకలచెరువు,పెదపాలెం, వేపురికోట మీదుగా.. బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్లు వరకు కొనసాగనున్న యాత్ర సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ సభ అనంతరం.. నిమ్మనల్లి క్రాస్, బోయకొండ క్రాస్చ చౌడేనపల్లి సోమల మీదుగా అమ్మగారిపల్లె దాకా యాత్ర రాత్రికి అమ్మగారిపల్లెలోనే సీఎం జగన్ బస దారిపొడవునా ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న ప్రజానీకం ఆరో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్ యాత్రకు అన్నమయ్య జిల్లా సిద్ధమా...? అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. Day-6 అన్నమయ్య జిల్లా సిద్ధమా…?#MemantaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన అడుగడుగునా నీరాజనం పడుతున్న ఏపీ ప్రజలు నేడు అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించనున్న యాత్ర మదనపల్లెలో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ ఇదీ చదవండి: మేమంతా మీ వెంటే.. జననేత యాత్రలో జనగర్జన అన్నమయ్య జిల్లా మేమంతా సిద్ధం - 6వ రోజు ఆరవ రోజుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు 40 కిలోమీటర్లు మేర కొనసాగానున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు మదనపల్లి టిప్పుసుల్తాన్ మైదానంలో మేమంతా సిద్దం బస్సు యాత్ర బహిరంగ సభ సీఎం జగన్ పాలనలో.. జిల్లా పునర్విభజనతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో డిబిటి, నాన్ డిబిటి ద్వారా రూ. 9,450 కోట్ల నగదు బదిలీ మదనపల్లెలో రూ. 500 కోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు బీటీ కాలేజీ యూనివర్శిటిగా అభివృద్ధి రూ. 24 కోట్లతో 100 పడకలతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి తిరుపతి - పీలేరు -మదనపల్లి జాతీయ రహదారి రాయచోటి దాహార్తి తీరుస్తూ 100 కోట్లు కేటాయింపు జిల్లా కేంద్రంగా రాయచోటి అభివృద్ధి రూ. 25 కోట్లతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి రూ. 100 కోట్లతో రాయచోటి లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం అన్నమయ్య జిల్లా మేమంతా సిద్ధం - 6వ రోజు షెడ్యూల్ ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. ములకలచెరువు,పెదపాలెం మీదగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ళు చేరుకుంటారు. అంగళ్ళు దాటినతరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకి మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారులో రాత్రి బసకు చేరుకుంటారు Memantha Siddham Yatra, Day -6. ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు మదనపల్లె బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం సోమల మీదుగా అమ్మగారిపల్లె వరకు కొనసాగుతుంది అమ్మగారిపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zohYZ3HsEw — YSR Congress Party (@YSRCParty) April 2, 2024 సీఎం జగన్ రోడ్ షోకు ఊరూరా ఘన స్వాగతం 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం కళ్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం.. రోడ్ షోలో ఊరూరా ఘన స్వాగతం మండుటెండైనా.. అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం.. మూడు జిల్లాల్లో అతి పెద్ద ప్రజా సభలుగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు.. మాటకు కట్టుబడి.. నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వలఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర మాటపై ఎన్నడూ నిలబడని బాబును ఛీకొడుతున్న జనం.. టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోని వైనం చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సభలలో సీఎం జగన్‌కు సంఘీభావం అనంతలో మేమంతా సిద్ధం.. సూపర్ సక్సెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కొనసాగిన సీఎం జగన్ బస్సు యాత్ర ఐదో రోజు అనంతలో యాత్రకు ప్రజల బ్రహ్మరథం అనంతలోనూ సూపర్ సక్సెస్ అయ్యిందంటూ వైఎస్సార్సీపీ Day 5 - శ్రీ సత్యసాయి జిల్లా సిద్ధం! #MemanthaSiddham pic.twitter.com/PZNYJryRQI — YS Jagan Mohan Reddy (@ysjagan) April 1, 2024 -
ఒక్కరోజు ఎండలకే పవన్ పరార్
ఎండాకాలం... ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ఉంటాయి. సుకుమారంగా సున్నితంగా పెరిగే జీవులకు ఇవి గడ్డు రోజులు. కోళ్లఫారాలు...హైబ్రిడ్ ఆవులు.. గేదెలు పెంచేవాళ్ళు తమ జీవాలను కాపాడుకునేందుకు వాటికి ఏసీలు పెడుతుంటారు. తరచూ చల్లని నీళ్లు చల్లుతూ వాటిని కూల్ చేస్తుంటారు.. లేదంటే అవి ఎండవేడికి తట్టుకోలేక గుడ్లు తేలేస్తాయి..నిత్యం ప్రజల్లోనే ఉంటాను.. ప్రజలతోనే ఉంటాను.. ప్రజలకోసం ఉంటాను.. సీఎం వైఎస్ జగన్‌కు యుద్ధాన్ని చూపిస్తాను అంటూ పెద్ద డైలాగ్స్ చెప్పిన పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనను ముగించారు. వాస్తవానికి ఏప్రిల్ రెండో తేదీ వరకూ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. మచ్చుకు ఒక రోజు అలా పిఠాపురం వెళ్లి టీడీపీ వర్మను.. ఇంకొందరు పెద్దలను కలిసి ప్రచారం చేసారు. ప్లీజ్.. ప్లీజ్.. నన్ను గెలిపించండి అని అర్థించారు. తాను గెలిస్తే అక్కడ ప్రైవేటుగా నిధులు సేకరించి ఆస్పత్రి నిర్మిస్తాను అని చెప్పి... కాస్త హడావుడి చేసారు. అంతే.. మళ్ళీ సాయంత్రం చూస్తే పవన్ లేరు. జంప్.. ఏమైంది అని ఆరా తీస్తే జర్రమొచ్చింది అనే సమాచారం తెలిసింది. మండుటెండల్లో రెండ్రోజులు జనాల్లో తిరిగేసరికి ఆయనకు ఆరోగ్యం చెడింది. సాయంత్రానికి జర్రమొచ్చింది... జ్వరం రావడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.. దానికితోడు ఆయన మీద అభిమానులు పూలు చల్లడంతో అది కూడా ఎలర్జీకి దారితీసిందని తెలిసింది.. దీంతో ఇక ప్రచారం రద్దు చేసి విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజకీయం అంటే అప్పుడప్పుడు వచ్చి షో చేసి.. ఫోటోలు దిగి... ప్రభుత్వాన్ని.. రాజకీయ వైరి పక్షాలను నోటికొచ్చినట్లు తిట్టడం కాదని.. ఎండావానలను లెక్కచేయకుండా ప్రజల్లో ఉండాలని... అప్పుడే వారి అభిమానం చూరగొంటామని ప్రజలు సైతం అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ అంటే సినిమాల్లో పెద్ద స్టార్.. అడుగుతీసి అడుగువేస్తే పూలు పరుస్తారు... గొడుగుపడతారు.. మేకప్ చెదిరిపోకుండా క్షణానికోసారి టచప్ చేస్తారు. గంటకోసారి ఏసీలో కూర్చోవచ్చు.. కానీ రాజకీయాల్లో అదేం ఉండదు.. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ... వాగులు వంకలు... గుట్టలు కొండలు అన్నీ దాటాలి. ప్రతి గుండెనూ తడమాలి... ప్రతిపేదవాన్నీ తనవాడు అనుకోవాలి... అన్ని చేస్తేతప్ప ప్రజల్లో నిలవలేరు. జస్ట్ అలా వచ్చి నోటికొచ్చినట్లు తిట్టేసి వెళ్ళిపోతే రాజకీయం కాదు అనే విషయం పవన్ కల్యాణ్‌కు అర్థం కాలేదు. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది... దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో... సేనాని దమ్ము ఇంతేనా... ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం... స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా... క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా ? పిఠాపురం ఒక్కదానికే అయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని... బ్రాయిలర్ కోడి మళ్ళీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
Kurnool : టీడీపీలో ‘బొగ్గుల’ కుంపటి
కర్నూలు: టీడీపీలో ముసలం పుట్టింది. కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వ్యతిరేకంగా ఉన్న వారంతా ఒక్కటయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన వారంతా మొదటి నుంచి బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆకెపోగు ప్రభాకర్‌కు టికెట్ వస్తుందని అందరు భావించారు. అయితే ఊహించని రీతిలో పార్టీ సభ్యత్వం కూడా లేని బొగ్గుల దస్తగిరిని అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆకెపోగు ప్రభాకర్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు ఎలాంటి భరోసా లభించలేదు. కోట్ల వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించక పోవడంతో ఆ వర్గానికి చెందిన నాలుగు మండలాల ముఖ్య నాయకులు కర్నూలులోని భూపాల్ కాంప్లెక్స్‌లో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఆకెపోగు ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి గూడూరు మాజీ జెడ్పీటీసీ, మండల టీడీపీ కన్వీనర్ జూలకల్లు సుధాకర్‌రెడ్డి, కర్నూలు మండల పార్టీ అధ్యక్షులు శంకర్, కోడుమూరు మాజీ సర్పంచ్ సీబీలత, కోడుమూరు సింగిల్ విండో అధ్యక్షులు మధుసూధన్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు హేమాద్రిరెడ్డి, కర్నూలు మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ సుందర్రాజు, గుడిపాడు చంద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పంచలింగాల రాజశేఖర్‌రెడ్డి, కొత్తకోట సర్పంచు శ్రీనివాసులు, ఉల్చాల మాజీ సర్పంచు రాఘవేంధ్ర, గూడురు మైనారిటీ సెల్ కన్వీనర్ సలీం, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి వంశీధర్‌రెడ్డి, టీడీపీ బీసీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి విజయకుమార్‌తో పాటు పలువురు క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రెబల్ అభ్యర్థిగా ఆకెపోగు ప్రభాకర్? సమావేశంలో టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి వర్గంగా ముద్రపడిన బొగ్గుల దస్తగిరిని ఎన్నికల్లో ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఆకెపోగు ప్రభాకర్‌ను రెబల్ అభ్యర్థిగా బరిలో నిలపాలని కొందరు నేతలు చేసిన ప్రతిపాదనకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశం విషయం బయటకు పొక్కిన నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న డాక్టర్ శ్రీనివాసమూర్తి రంగంలోకి దిగారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఫోన్లో కోరినట్లు సమాచారం. అయితే మరో రెండు రోజుల్లో కోడుమూరులో సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకొని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. పార్టీ మారేందుకు సమాలోచనలు.. సమావేశంలో కొందరు ఆకెపోగు ప్రభాకర్‌ను రెబల్ అభ్యర్థిగా పోటీ చేయిద్దామనగా, వద్దొద్దు .. మనమే పార్టీ మారదాం, వైఎస్సార్సీపీలోకి వెళ్లి సత్తా చాటుదామని మరి కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సమావేశానికి కర్నూలు రూరల్, కోడుమూరు, గూడురు, సీ బెళగల్ మండలాలకు చెందిన ముఖ్య నేతలు హాజరై ప్రభాకర్‌కు మద్దతు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. -
టిట్ ఫర్ టాట్.. రేవంత్ రాజకీయం అదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తాము ఒక గేటు తెరిచామని చెప్పిన తీరు సరైనదేనా? కాదా? అన్నదానిపై చర్చించడం కొంచెం కష్టమే అని చెప్పాలి. గత ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే గేమ్ ఆడి అప్రతిష్టపాలయ్యారు. ఆ అనుభవం ఉన్నప్పటికీ రేవంత్ ఎందుకు ఇదే విధానంలోకి వెళ్లాలని భావిస్తున్నారు?. ‘టిట్ ఫర్ టాట్’ అనుకోవాలా? తన ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఫిరాయింపులే మార్గమని ఆయన భావిస్తున్నారా?. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు బొటాబొటి మెజార్టీనే వచ్చింది. అయినా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను బలహీనపర్చడానికి రేవంత్ ఈ వ్యూహం ఎంచుకున్నట్లుగా ఉంది. ఇక తన మార్కు రాజకీయం చూస్తారని దబాయించి మరీ చెబుతున్నారు. అధికారంలో ఉంటే ఎంత జబర్దస్త్‌గా మాట్లాడవచ్చో రేవంత్ రుజువు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున అటూ-ఇటూ నేతలు మారుతూనే ఉంటారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరడం, స్వయంగా రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పడం కచ్చితంగా అభ్యంతరకరం అని చెప్పాలి. కేసీఆర్ గతంలో తమకు చేసిన అవమానానికి ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని సీఎం చెప్పవచ్చు. అంతేకాక తన ప్రభుత్వాన్ని పడగొడతానంటున్నారు కనుక తానే ఎడ్వాన్స్ అవుతున్నానని అనవచ్చు. ఇక్కడ విశేషం ఏమిటంటే బీఆర్ఎస్ నుంచి ఎంత మంది దొరికితే అంతమందిని తమ పార్టీలలో కలుపుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. దీనిని ఎదుర్కోవడం బీఆర్ఎస్కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు పెద్ద సవాలే. ఇప్పటికే పాతిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్‌కు టచ్‌లోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. బహుశా గతంలో కేసీఆర్ చేసినట్లుగానే బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నట్లు ప్రకటిస్తారేమో చూడాలి. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుసరించినట్లే కాంగ్రెస్ స్పీకర్ ప్రసాదకుమార్ కూడా వ్యవహరించారు. పోచారం మాదిరే ప్రసాద్ కూడా బీఆర్ఎస్ ఫిర్యాదును తీసుకోవడానికి ఇష్టపడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారిన తర్వాత, అందరు కలిసి విలీనం అయినట్లు లేఖ ఇస్తే దానికి పోచారం ఆమోదముద్ర వేశారు. సరిగ్గా అదే స్ట్రాటజీని ఈ స్పీకర్ కూడా ఫాలో అవుతుండవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39 మంది గెలవగా, ఒకరు మరణించడంతో వారి సంఖ్య 38కి చేరింది. ఇప్పటికే పదిహేను మందికి పైగా రేవంత్‌ను కలిశారు. వారంతా అబివృద్ది పనుల కోసమే కలిశామని చెబుతున్నా, వారిలో ఎందరు పార్టీలో ఉంటారన్నది అనుమానమే. ఎందుకంటే అధికార రాజకీయాలకు అలవాటుపడిన ఈ రోజుల్లో పవర్ లేకుండా ఎమ్మెల్యేలు ఉండడం కష్టమే. ప్రతిపక్షంలో ఉంటే ఏ పనులు అవ్వవనే భయం ఏర్పడుతోంది. పైగా ఏవైనా కేసులు వస్తే పోలీసుల అండ కావాలంటే అధికారపార్టీ అవసరం అన్న భావన నెలకొంది. ఇది మంచిదా? కాదా? అంటే ఎవరూ మంచిదని చెప్పరు. కానీ, వర్తమాన రాజకీయాల్లో ప్రత్యేకించి చిన్న రాష్ట్రాలలో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉందని చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇందుకు అతీతంగా లేదు. ఇతర పార్టీల ఎంపీలను ఆకట్టుకోవడానికి బీజేపీ కూడా వ్యూహాలు అమలు చేస్తోంది. ఉదాహరణకు 2019లో ఏపీలో టీడీపీ ఓటమి తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అవుతున్నట్లు లేఖ ఇవ్వడం, ఆనాటి ఉప రాష్ట్రపతి దానిని ఆమోదించడం జరిగిపోయాయి. అలాగే ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. దీనిని ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ సమర్ధంగా ఎదుర్కుని జనంలోకి వెళ్లారు. దాంతో ఆయనకు విలువ పెరిగింది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అలాంటి ఫిరాయింపుల జోలికి వెళ్లలేదు. చంద్రబాబుతో తేడా వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చినా వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పలేదు. తెలంగాణలో పరిస్థితి అలా లేదు. తొలుత రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు డైరెక్షన్ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి ఏభై లక్షలతో వెళ్లి పట్టుబడ్డారు. దాంతో ఆయన అరెస్టు కావల్సి వచ్చింది. అప్పట్లో ఇదంతా కుట్ర అని రేవంత్ వాదించారు. ఆ తర్వాత కేసీఆర్ ఇదేదో ప్రమాదంగా ఉందని భావించి అప్పట్లో టీడీపీలో ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని తనవైపు లాగేశారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురిని తన పార్టీలోకి తీసుకు వచ్చారు. అయినా 2018లో ఆయనకు పెద్ద ఇబ్బంది రాలేదు. 88 సీట్లతో మంచి విజయం సాధించారు. ఈ గెలుపు తర్వాత కూడా కేసీఆర్ తన విధానం మార్చుకోలేదు. మళ్లీ కాంగ్రెస్ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇదంతా అనైతికమని తెలిసినా తనకు ఎదురు లేదన్న అహంభావంతో కేసీఆర్ ముందుకు వెళ్లారు. 2014లో టీడీపీకి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటే, పన్నెండు మంది టీఆర్ఎస్లో చేరిపోయారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాకపోతే చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరడం విశేషం. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంపై రేవంత్ పోరాటం కూడా చేశారు. కోర్టుకు కూడా వెళ్లారు. కానీ, ఫలితం దక్కలేదు. ఆ అనుభవాలన్నీ ఉన్నప్పటికీ, రేవంత్ అదే గేమ్ మొదలు పెడుతున్నారు. ఆయన గేట్లు తెరిస్తే కొందరు ఎమ్మెల్యేలు చేరితే చేరవచ్చు. కానీ, ఇప్పటికే ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసి ఓడిపోయిన నేతలు దీనిపై గుర్రుగా ఉంటారు. దానం నాగేందర్‌తో పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటే అభ్యంతరం ఉండనవసరం లేదు. అలాకాకుండా పార్టీ కండువా కప్పడం సరికాదు. దానంకు పార్టీ మారడం కొత్తకాదు. 1994 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 2004లో అసిఫ్ నగర్ నుంచి టీడీపీ పక్షాన పోటీచేసి గెలిచారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వెంటనే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. కానీ, వైఎఎస్సార్ అప్పుడు పదవికి రాజీనామా చేయించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. అదివేరే విషయం. తదుపరి 2009లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. అప్పట్లో టీఆర్ఎస్ పైన ఒంటికాలిమీద లేచేవారు. తన ఇంటివద్దకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయనకు పెద్ద గొడవ కూడా అయింది. చిత్రం ఏమిటంటే 2018 ఎన్నికల నాటికి ఆయన టీఆర్ఎస్ గూటికి చేరుకోగలిగారు. 2023లో కూడా బీఆర్ఎస్( టిఆర్ఎస్ పేరు మారింది) పక్షాన గెలిచారు. కానీ, అధికారం రాకపోవడంతో వెంటనే పార్టీ ఫిరాయించేశారు. ఇంతకాలం కాంగ్రెస్ స్థానిక నేతలు ఆయనపై భూకబ్జా ఆరోపణలు చేస్తుండేవారు. దానంను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కొందరు కాంగ్రెస్ వాదులు ధర్నా కూడా చేశారు. అయినా రేవంత్ వీటిని పట్టించుకోకుండా దానంను చేర్చుకున్నారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో రేవంత్ ఈ ఆపరేషన్ ఆకర్ష్ దానంతో మొదలు పెట్టారని అనుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గతంలో తాను ప్రాతినిద్యం వహించిన మల్కాజిగిరితో సహా ఎక్కువ సీట్లు గెలవడం ముఖ్యం. అందుకు ఆయన ఈ గేమ్ మొదలు పెట్టారని అనుకోవచ్చు. దానికి ఆయన కేసీఆర్ పైన, బీజేపీ నేతలపైన సాకులు చెబుతుండవచ్చు. వాటిని జనం ఎవరూ నమ్మరు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డిల మధ్య ప్రకటనల యుద్దం. ఉత్తుత్తి పోరాటమే అని వేరే చెప్పనవసరం లేదు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బీఆర్ఎస్ను వీడడం ఎలా ఉందంటే జూలియస్ సీజర్ నాటకంలో యూ టూ బ్రూటస్ అన్న డైలాగు ఒకటి ఉంది. అది ‘కేకే’కి బాగా వర్తించవచ్చు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం ఉన్నా, ఆయనకు టీఆర్ఎస్లోకి వచ్చాకే, కేసీఆర్ అండ లభించాకే ఒక గౌరవం, గుర్తింపు వచ్చాయి. దానిని వదలుకుని హైదరాబాద్ మేయర్‌గా ఉన్న తన కూతురు రాజకీయం కోసం పార్టీ మారారు. ప్రత్యక్ష ఎన్నికలలో ఎన్నడూ గెలవని కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా మూడుసార్లు రావడానికి కేసీఆర్ కారకుడు. అయినా రాజకీయలలో కృతజ్ఞతకు తావులేదని కేకే రుజువు చేశారు. ఇలాంటి వాళ్లను కేసీఆర్ పక్కన పెట్టుకుని రాజకీయం చేశారు తప్ప పార్టీ నిర్మాణానికి గట్టి పునాది వేసుకోలేకపోయారు. మరో ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయన కుమార్తెకు వరంగల్ నుంచి ఎంపీగా పోటీకి బీఆర్ఎస్ టిక్కెట్ వచ్చినా, వద్దనుకుని కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా కడియం అప్పుడప్పుడు చంద్రబాబుతో కూడా బెదిరింపు రాజకీయమే చేశారని ప్రచారం ఉంది. కొంతకాలం ఆగినా, తదుపరి టీఆర్ఎస్కు వెళ్లిపోయారు. అక్కడ పదవులుపొందినా, తనకు కొంతకాలం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా, తదుపరి మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో ఉండవచ్చు. తన కుమార్తెకు కాంగ్రెస్ టిక్కెట్ రావాలంటే తాను కూడా పార్టీ మారాలి. ఈ నేపద్యంలో నైతిక విలువల గురించి మాట్లాడుకోవడం గొంగట్లో వెంట్రుకలు ఏరుకున్నట్లే ఉంటుంది. రేవంత్ ఇలా బీఆర్ఎస్ నేతలను ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్‌లో తన సొంత గ్రూపును బలపరచుకోవడం కూడా ఒక లక్ష్యం అనుకోవచ్చు. స్థూలంగా చూసినప్పుడు ఫిరాయింపులకు రాజముద్ర వేసిన కేసీఆర్ చివరికి ప్రజల చేతిలో ఓడిపోక తప్పలేదు. అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బాగుపడిందీ లేదు. ఆయన కూడా ప్రభుత్వాన్ని కోల్పోయారు. ఈ అనుభవాలు ఉన్నా రేవంత్ తన రాజకీయం తనది అంటున్నారు. బహుశా ఆయన ఉద్దేశం ఈ ఐదేళ్లు సేఫ్‌గా ఉండాలని అనుకోవచ్చు. ఈలోగా బీఆర్ఎస్ బాగా బలహీనపడితే అది తనకు అడ్వాంటేజ్‌గా మారుతుందని భావిస్తుండవచ్చు. బీజేపీ కూడా ఇలాంటి ఫిరాయింపు రాజకీయాలను ఆయా రాష్ట్రాలలో అమలు చేసింది. కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో రాజీనామా చేయించి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని తన చేతిలో తెచ్చుకుని ఉప ఎన్నికలలో వారిని గెలిపించుకుంది. అయినా కర్నాటకలో సాధారణ ఎన్నికలలో ఓటమి తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ తగలలేదు. మళ్లీ గెలవగలిగింది. ఉమ్మడి ఏపీలో పార్టీ ఫిరాయింపులు చాలానే జరిగాయి. 1978లో కాంగ్రెస్-ఐకి 180 సీట్లు వచ్చి అధికారం సాధించింది. కాంగ్రెస్-ఆర్కు 30, జనతా పార్టీకి అరవై సీట్లు వస్తే ఈ రెండు పార్టీలకు చెందిన సుమారు ఎనభై ఐదు మంది అధికార కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. అప్పట్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లేదు. ఆ తర్వాత కాలంలో ఈ చట్టం వచ్చినా ఫిరాయింపులు ఏమీ ఆగలేదు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య పోవడం లేదు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీల చీలిక ఒక ఉదాహరణ అవుతుంది. మరో సంగతి చెప్పాలి. విభజిత ఏపీలో పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు తప్ప అంతా 2019 ఎన్నికలలో ఓడిపోయారు. ప్రజలు ఈ రకమైన తీర్పు ఇస్తారన్న భయం ఉంటే పార్టీలు మారేవారు సంకోచిస్తారు. అధికార పక్షం కూడా కాస్త ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయడానికి నానా పాట్లు పడుతోంది. ఈ నేపధ్యంలో ఎప్పుడు ఏ గండం వస్తుందో అన్న సందేహం కాంగ్రెస్‌లో ఉండవచ్చు. అందుకే ముందస్తుగా రేవంత్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకోవచ్చు. వీటిని గట్టిగా బీఆర్ఎస్ ఎదిరించే పరిస్థితి లేదు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అన్న సమాధానం వారికి వస్తుంది. అంతకుముందు పార్టీ మారివారిని ఉరివేయాలని కాంగ్రెస్ నేతలు అన్నా, ఇప్పుడు అవన్ని మర్చిపోతారు. ఎందుకంటే ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు ప్రజాస్వామ్యానికి ఉరి వేస్తున్నారు కనుక. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కదం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు
4 వ రోజు స్టార్ క్యాంపెయినర్లతోసీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ పలు ఫొటోలను ట్వీట్ చేశారు. ‘నాలుగో రోజు మేమంతా సిద్ధం యాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో..’ అంటూ పేదలతో మమేకమైన ఫొటోలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ ఫొటోలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి, అమరావతి (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డనైన నాకు అండగా నిలవండి. మీరే నా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి. జరిగిన మంచిని ఇంటింటా వివరించాలి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కదం తొక్కుతున్నారు. నాలుగో రోజు శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగిన బస్సు యాత్రలోని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. యాత్రలో ఆద్యంతం ప్రజల నుంచి ఘన స్వాగతం లభించడంతో పాటు, మండుటెండను సైతం లెక్క చేయకుండా ముసలిముతక, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం కర్నూలు జిల్లా రాతన వద్ద బస శిబిరంలో పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా ముఖ్యనేతలు సీఎం జగన్‌ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం 10.30 గంటల ప్రాంతంలో శిబిరం నుంచి యాత్రను ప్రారంభించారు. రాతన గ్రామంలో భారీ గజమాలతో, ఆనందోత్సాహాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఊరంతా∙రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరి వైఎసార్సీపీ ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేశారు. అనంతరం ఇదే జిల్లా తుగ్గలికి చేరుకున్న సీఎం జగన్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో గడిచిన ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేసిన మంచిని సీఎం వివరించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో మాట్లాడారు. జాతీయ రహదారి పొడవునా జనమే జనం గుత్తి పట్టణంలో రోడ్‌షో తర్వాత బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్44)పై మిడుతూరు, పామిడి, కల్లూరు, గార్లదిన్నె మీదుగా సీఎం అనంతపురం చేరుకున్నారు. గుత్తి నుంచి అనంతపురం వరకూ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు మండలాల గ్రామాల్లోని ప్రజలు రోడ్డు మీదకు చేరుకున్నారు. దీంతో ప్రతి పాయింట్ వద్ద సీఎం జగన్ బస్సు ఆపి ప్రజలకు అభివాదం చేశారు. పామిడిలో వేల మంది జనం జాతీయ రహదారి మీదకు చేరుకుని సీఎం జగన్‌కు తమ మద్దతు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గ ప్రజలు కల్లూరులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతపురం పట్టణంలోని రాజీవ్‌కాలనీ, తపోవనం ప్రజలు, నాయకులు అతిపెద్ద గజమాలలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు అనంతపురం చేరుకోవాల్సి ఉండగా 9 గంటలు దాటాక చేరుకున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తీరడంతో ఉదయం నుంచే నిర్దేశించిన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా యాత్ర కొనసాగింది. అయినపటగ్పటికీ ప్రజలు ఏ మాత్రం విసిగి పోకుండా అభిమాన నేతను కలవడానికి ఓపికతో వేచిచూశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావులేకుండా సంక్షేమ ఫలాలను తమ దరిచేర్చడంతో పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్‌ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతపురంలో రోడ్‌షో అనంతరం రాప్తాడు, ఎస్కేయూ మీదుగా శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం వరకు యాత్ర చేరుకుంది. రాత్రి 10.30 గంటలకు రాప్తాడు చేరుకుంది. అప్పటికే రోడ్డుపై ఉన్న వేల మంది జనాలు జై జగన్ నినాదాలతో సీఎంపై అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగింది. నాలుగోరోజుబస్సు యాత్రకు అపూర్వ స్పందన కర్నూలు (సెంట్రల్)/తుగ్గలి: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అభిమానం పోటెత్తింది. పల్లె పల్లెలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా పూల స్వాగతంతో అభిమానం చాటుకున్నారు. భారీ క్రేన్లతో గజమాలలు వేసి ఉప్పొంగిపోయారు. నాలుగో రోజు బస్సు యాత్ర పత్తికొండ నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం 10.32 గంటలకు సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి యాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.25 గంటలకు అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె పొలిమేర్లలోకి చేరుకోవడంతో కర్నూలు జిల్లాలో యాత్ర ముగిసింది. తుగ్గలిలో ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ప్రజల సమస్యలు విన్నారు. సలహాలు స్వీకరించారు. బస్సు యాత్ర సాగిందిలా.. ♦ ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమా మహేశ్వర నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లికార్జున్‌తోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి సీఎం వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ♦ ఉదయం 10.32 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు పత్తికొండలో ప్రారంభం. ♦ 10.50 గంటలకు రాతనలో అపూర్వ స్పందన. భారీ క్రేన్ ద్వారా సీఎంకు గజమాల వేసి పూల బాట పరిచారు. ♦ 11.20 గంటలకు మాజీ ఎమ్మెల్యే, దివంగత తమ్మారెడ్డి కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. తమ్మారెడ్డి పెద్ద కుమారుడు ప్రతాపరెడ్డి, సోదరుని కుమారుడు ప్రహ్లాదరెడ్డి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న తమ్మారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి, కోడళ్లు రంగమ్మ, విజయలక్ష్మి, అరుణమ్మలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డితో మాట్లాడారు. ♦ 11.46 గంటలకు తుగ్గలి సమీపంలో ప్రజలతో ముఖాముఖి. ♦ మధ్యాహ్నం 1.29 గంటలకు గిరిగెట్లలో ప్రజల ఘన స్వాగతం. ♦ 1.49 గంటలకు జొన్నగిరిలో పూల వర్షం. తమ గ్రామ సమీపంలోని చెరువును హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో నింపాలని విన్నపం. ♦ 2 గంటలకు ఎర్రగుడిలో సీఎం జగన్ కాన్వాయ్‌పై పూల వర్షం. ♦ 2.25 గంటలకు అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశం. ♦ రాత్రి 11 గంటలకు బస శిబిరానికి చేరుకున్న సీఎం జగన్ గుత్తిలో జన సునామీ తుగ్గలిలో ముఖాముఖి అనంతరం తిరిగి బస్సు యాత్ర ప్రారంభమై జొన్నగిరి, ఎర్రగుడి మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. మిట్ట మధ్యాహ్నం భానుడి ప్రతాపాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడికి ప్రజలు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర బసినేపల్లి, గుత్తి ఆర్‌ఎస్‌ల మీదుగా గుత్తి పట్టణానికి చేరుకుంది. బసినేపల్లి నుంచి గుత్తి పట్టణం వరకూ ఇసుకేస్తే రాలనంతగా జనం యాత్రలో మమేకం అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే శనివారం సాయంత్రం గుత్తి పట్టణం జన సునామీని తలపించింది. అశేషమైన జనం కదలి రావడంతో సీఎం జగన్ రోడ్ షో కాన్వాయ్ ముందుకు చాలా నెమ్మదిగా కదిలింది. గుత్తి రైల్వే బ్రిడ్జ్ నుంచి ఎన్‌హెచ్ 44 మధ్య 7 కి.మీ దూరం రెండు గంటలకు పైగానే రోడ్‌షో కొనసాగింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. -
టీడీపీలో కోట్లకు సీట్లు
సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కోట్లుకు టికెట్లు’ వ్యవహారం రచ్చకెక్కింది. కోరినన్ని కోట్లిస్తేనే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు చోట్ల డబ్బు డిపాజిట్ చేస్తేనే టికెట్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’.. అన్న తరహాలోనే ఇప్పుడూ పెద్ద నేతకు ‘బ్రీఫింగ్’ వెళ్తేనే టికెట్ ఖరారవుతోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీకి విధేయులుగా ఉండే నేతలు సైతం ఈ డబ్బు దందాపై రగిలిపోతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి వ్యక్తులకు వేలం పాట పెట్టి మరీ సీట్లు అమ్మేసినట్లు టీడీపీ నేతలు వాపోతున్నారు. వారి ఆవేదన హద్దులు దాటి దాడులు చేసే స్థాయికి చేరింది. అనంతపురం అర్బన్ సీటును అక్కడి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరికి కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కి ఇవ్వడంపై అనంతపురం టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టి, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను దహనం చేస్తున్నారు. ఈ సీటును లోకేశ్ రూ.30 కోట్లకు అమ్మేసినట్లు పార్టీ నేతలు మీడియాలోనే చెబుతున్నారు. గుంతకల్లు అసెంబ్లీ సీటును కూడా ఇలాగే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి కేటాయించారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఇన్‌ఛార్జి జితేంద్రగౌడ్కి మొండిచేయి చూపి అప్పటికప్పుడు పార్టీలో చేరిన జయరాంకి ఇచ్చేశారు. ఇందుకోసం ఆయన చంద్రబాబు, లోకేశ్‌కి భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. దర్శి సీటు స్థానికేతరురాలికి ఇవ్వడం వెనుక ! ఒంగోలు జిల్లా దర్శి సీటును కూడా వేరే ప్రాంతానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కేటాయించారు. నిజానికి ఈ సీటును చాలాకాలం క్రితమే బేరం పెట్టినా కొనేందుకు ఎవరూ రాలేదు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. ఆఫర్లు ప్రకటించినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట సీటు ఆశించిన డాక్టర్ లక్ష్మి కుటుంబానికి ఆ సీటు కాకుండా దర్శి కేటాయించారు. నిర్దేశించిన రేటు ముట్టజెప్పడంతో స్థానికేతరురాలు అయినా ఆమెకు సీటు ఇచ్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏ సీటూ ఇవ్వకూడదనుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన కోరుకున్న భీమిలి సీటు ఇవ్వడం వెనుకా భారీ డీల్ ఉన్నట్లు తెలుస్తోంది. గంటాను విశాఖ నుంచి పూర్తిగా దూరంగా పంపడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు. ఆయన ససేమిరా అన్నారు. విశాఖ జిల్లాలోనే ఏదో ఒక సీటు కావాలని కోరారు. అందుకు మొదట ఒప్పుకోని చంద్రబాబు.. మొదటి మూడు జాబితాల్లోనూ అవకాశం కల్పించలేదు. ఇక ఆయనకు సీటు రాదనుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే గంటా ఇచ్చిన భారీ ఆఫర్‌కి చంద్రబాబు, లోకేశ్ తలొగ్గినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జనసేనకు ఇవ్వాల్సిన భీమిలి సీటును పొత్తులో లేకుండా చేసి మరీ ఆఖరి జాబితాలో గంటాకు కట్టబెట్టారని సమాచారం. ఒంగోలు లోక్‌సభ సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వడం వెనుకా డబ్బు డీల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీటు ఇవ్వడాన్నిబట్టి దానికి గట్టి రేటు పెట్టి డబ్బు దండుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వడానికి ఒప్పుకున్నా, అరెస్టయి బెయిల్‌పై ఉన్న వ్యక్తికి టికెట్టిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇలా అంతకుముందు ప్రకటించిన లోక్‌సభ సీట్లకు సైతం పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఎంపీ టికెట్ రేటు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల ఎంపీ సీట్ల ఖరారు వెనుక వందల కోట్ల డీల్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఎంపీ సీటు కోసం రూ.100 నుంచి రూ.200 కోట్ల డీల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో పని చేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సీట్లు ఇవ్వడానికి డబ్బు తప్ప మరో కారణం లేదని తెలుస్తోంది. సగానికిపైగా అసెంబ్లీ సీట్ల ఖరారులోనూ ఇదే సూత్రాన్ని పాటించారు. రెండు రకాల డిపాజిట్లు చేస్తేనే కాని సీటు ఖరారు కాలేదని అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడీపీ అభ్యర్థి తన అనుచరుల వద్ద వాపోయారు. ఒక డిపాజిట్ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి, మరొకటి చినబాబుకు చేశాకే చాలామంది సీట్లు దక్కించుకున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఆయన వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ ఇస్తామంటే వారికి సీట్లు ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తే సీట్లతోపాటు తమను కూడా అమ్మేస్తున్నారని వాపోతున్నారు. అందుకే పలుచోట్ల కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారిని బూతులు కూడా తిడుతున్నారు. -
అవ్వా, తాతల కోసం..
-
బీజేపీతో చంద్రబాబు ‘దొంగాట’
ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముస్లీంల సమావేశంలో బీజేపీతో పొత్తు గురించి ఎందుకు మాట మార్చారు? డిల్లీలో ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుని మూడు రోజుల పాటు వేచి ఉండి హోం మంత్రి అమిత్-షాను కలిసి బీజేపీతో పొత్తు కోసం కాళ్లబేరం ఆడిన చంద్రబాబు నాయుడు మాట మార్చి బీజేపీనే తమతో పొత్తు కోరిందని ఎందుకు చెప్పుకున్నారు? ఇది అబద్దమని తెలిసినా ఆయన ఈ మాట అన్నారంటే బీజేపీతో పొత్తు వల్ల నష్టం ఎక్కువగా జరుగుతోందని భయపడుతున్నారా? ఈ సందర్భంలో ఒక్క నిజం చెప్పినట్లు అనిపిస్తుంది. కేంద్రంతో తనకు అవసరం ఉంది కనుక ఈ పొత్తుకు అంగీకరించానని చంద్రబాబు అన్నారు. ఇన్నాళ్లు రాష్ట్ర అవసరాల కోసం అని ప్రచారం చేస్తూ వచ్చిన చంద్రబాబు కీలకమైన ఈ సమావేశంలో గబాలున వాస్తవం చెప్పేశారు. తనపై కేంద్రంలో ఉన్న కేసులలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే బీజేపీతో పొత్తు అవసరమని ఆయన చెప్పకనే చెప్పేశారు. అలాగే బీజేపీ సాయంతో రాష్ట్రంలో తనపై స్కామ్‌ల కేసుల నుంచి కూడా బయటపడవచ్చని ఆయన ఆశిస్తుండవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు బీజేపీనే పొత్తు కోరిందని.. అందుకే పొత్తు అని అనడంలో ఆంతర్యం ఏమిటి? బహుశా దీనికి సంబంధించిన వీడియో బయటకు వెళ్లదు అని అనుకుని ఉండవచ్చు. టీడీపీ మీడియా ఈ వార్తను తొక్కిపెట్టింది. కాని సోషల్ మీడియా దానిని బయటకు తీసుకు వచ్చింది. దాంతో చంద్రబాబు మరోమారు అబద్దం ఆడారన్న సంగతి ఏపీ ప్రజలకు తెలిసిపోయింది. 2019లో టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి బీజేపీతో అంటకాగడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. పవన్‌కల్యాణ్‌ను ముందుగా బీజేపీ వారి వద్దకు పంపి, బీజేపీతో సత్సంబందాల కోసం ఆయనను మద్యవర్తిగా వాడుకున్నారు. నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు. దాంతో బీజేపీ కూడా శాంతించి ఆయనపై ఉన్న ఆర్దిక నేరాల కేసుల ఫైళ్లను పక్కన పడేసింది. వేల కోట్ల స్కాములకు చంద్రబాబు పాల్పడ్డారని ఆరోపించిన కేంద్రం తదుపరి ఒక్క చర్య తీసుకోకుండా చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. ఆ క్రమంలో బీజేపీతో శాసనసభ ఎన్నికలలో పొత్తు కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరికి ఢిల్లీకి పవన్‌తో కలిసి వెళ్లి అమిత్-షా అప్పాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూశారు. అది అవమానకరమైనా ఆయన అలా చేశారంటే అవసరం అలాంటిది. అలా చేసిన చంద్రబాబు ముస్లీంలను మోసం చేయడానికి మాట మార్చి బీజేపీవారే తమను పొత్తు అడిగారని చెబుతున్నారు. నిజానికి చంద్రబాబుకు ఇష్టం లేకపోతే, బీజేపీవారు కోరినా ఒప్పుకోకుండా ఉండవచ్చు. సహజంగానే దీనిపై బీజేపీ నేతలకు కూడా మండుతుంది. కొద్ది రోజుల క్రితం హోం మంత్రి అమిత్-షా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు తనంతట తానే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లారని, ఓటమి తర్వాత ఆయనకు పరిస్థితి అర్ధమై, తిరిగి చేరారని అన్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా టీడీపీని బీజేపీ వద్దకు తీసుకు వెళ్లడానికి తాను బీజేపీ పెద్దల నుంచి చివాట్లు తిన్నానని, వారు అంగీకరించకపోతే తాను దండాలు పెట్టి బతిమలాడానని అన్నారు. అంటే దీని అర్దం చంద్రబాబే బీజేపీ పొత్తు కోసం తహతహ లాడారనే కదా! కాని అలవాటు ప్రకారం మళ్లీ మాట మార్చారు. దానికి కారణం బీజేపీతో పొత్తుపై ఏపీలోని ప్రజలు అంత సుముఖంగా లేరని భావించడం ఒక కారణం అయితే ముస్లీంలు పూర్తిగా ఈ పొత్తును తిరస్కరిస్తుండడం మరో కారణం. వారిని మాయ చేయడానికి గాను చంద్రబాబు ఈ కొత్త రాగం ఆలపించారు. దీనికి సమాధానం చెప్పవలసింది జనసేన, బీజేపీలే. అయినా ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్, పురందేశ్వరిలను తనదారిలోకే తెచ్చుకున్నారు కనుక వారు ప్రశ్నించరన్న నమ్మకం ఉంది. పైగా పురందేశ్వరి అయితే ఈ పొత్తు చారిత్రక అవసరమని గొప్పగా చెప్పారు. కేవలం రాజమండ్రిలో ఎంపీగా గెలవాలన్న తాపత్రయంలో బీజేపీ పరువు పోతున్నా ఆమె సమర్దించే దుస్థితిలో ఉన్నారు. చంద్రబాబు కాని, పవన్ కల్యాణ్ కాని బీజేపీ నుంచి ఎలాంటి నిర్దిష్ట హామీ పొందకుండా బీజేపీతో కలిశారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వేజోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన చట్టంలోని ఆస్తుల పంపిణీ, తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న వివాదాల పరిష్కారం వంటివాటిపై ఒక్క హామీ కూడా తీసుకోకుండా టీడీపీ, జనసేనలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఏపీ ప్రజలలో అసంతృప్తి ఉంది. గతంలో మాదిరి ప్రధాని మోదీకి అంత వేవ్ లేదు. ప్రజాగళం పేరుతో జరిగిన సభలో కూడా మోదీని ఈ నేతలు ఒక్క కోరిక కోరలేదు. మోదీ కూడా రాష్ట్రానికి ఏమి చేయనున్నారో చెప్పలేదు. దాంతో ప్రజలలో ఈ మూడు పార్టీల వల్ల ఉపయోగం లేదన్న భావన నెలకొంది. ఇది ఒక సమస్య అయితే ముస్లీం, క్రిస్టియన్ వర్గాలు బీజేపీని ఈసారి మరింత ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాయి. ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్-షా ఇప్పటికే ప్రకటించారు. దానిని చంద్రబాబు ఖండించే పరిస్థితి లేదు. కేంద్రం తీసుకు వచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌పై కూడా మైనార్టీలు గుర్రుగా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా సాగాయి. చంద్రబాబు గతంలో పలుమార్లు ఈ అంశంపై బీజేపీని విమర్శించారు. ఇప్పుడు యుటర్న్ తీసుకుని సీఏఏని సమర్దించారు. ముస్లీం రిజర్వేషన్ల గురించి అటు, ఇటు కాకుండా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ అగ్రనేత చేసిన ప్రకటనను ఖండించలేకపోయారు. పైగా బీజేపీ నేతలు ఎన్డీఏ ఎజెండాకు కట్టుబడి చంద్రబాబు పని చేయాల్సిందేనని అంటున్నారు. అంటే దీని అర్దం ముస్లీం రిజర్వేషన్లను చంద్రబాబు కూడా వ్యతిరేకించాల్సిందేనని వారు భావిస్తున్నారు. దీనిపై నిర్దిష్ట హామీ ఇవ్వలేని దుస్తితిలో చంద్రబాబు ఉన్నారు. ఇది కూడా ముస్లీంలకు అసంతృప్తిగా ఉంది. గతంలో ట్రిపుల్ తలాఖ్ రద్దును కూడా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించి ప్రచారం చేశారు. 2019 ఎన్నికల సమయంలో ప్రదాని మోదీని టెర్రరిస్టు అనడమే కాకుండా మళ్లీ ఆయన గెలిస్తే మైనార్టీలకు ఓట్లు కూడా తీసేస్తారని హెచ్చరించారు. కాని ఇప్పుడు అన్నిటిలో తన వైఖరి మార్చేసుకుని బీజేపీని అంటకాగడానికి సిద్దం అయిపోయారు. ఈ నేపధ్య్ంలో ముస్లీం వర్గం అంతా దూరం అయితే తమకు ఘోర పరాజయం ఎదురవుతుందన్న భయం ఏర్పడింది. టీడీపీ నేతలు ఈ విషయాన్ని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో కూడా తమ వ్యాఖ్యలను చేస్తున్నారు. కనీసం ఏభై నియోజకవర్గాలలో ముస్లీంలు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్తితిలో ఉన్నారని అంచనా. ఒక్కో నియోజకవర్గంలో ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ముస్లీం ఓటర్లు ఉన్నారట. కుప్పంలో సైతం ఆయనకు ఈ వర్గాలలో వ్యతిరేకత ఏర్పడవచ్చు. అందుకే కుప్పంలో వారితో ప్రత్యేకించి సమావేశమై తాను బీజేపీతో పొత్తు కోరుకోలేదని అబద్దం ఆడారు. బీజేపీతో చంద్రబాబు పలుమార్లు దొంగాట ఆడారు. 1996, 1998 ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీగా అభివర్ణిస్తూ కమ్యూనిస్టులతో కలిసి ప్రచారం చేశారు. తదుపరి 1998 ఎన్నికల ఫలితాలు రాగానే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలోకి దూకేశారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ తాను తప్పు చేశానని, జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని అన్నారు. అంతకుముందు గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీని నరహంతకుడని ద్వజమెత్తారు. అయినా 2014 నాటికి మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి బతిమలాడి, కాళ్లా-వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2018 నాటికి మళ్లీ మోదీని దూషిస్తూ బయటకు వచ్చేశారు. బీజేపీ ఏపీకి ఏమీ చేయలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిందని అన్నారు. తిరిగి 2024నాటికి బీజేపీ పెద్దలను ఎలా మేనేజ్ చేసుకున్నారో కాని, తిరిగి పొత్తు పెట్టుకున్నారు. అయినా ముస్లీంల మీటింగ్‌లో మాత్రమే అమిత్-షా నే ఏదో బతిమలాడినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసి అప్రతిష్టపాలయ్యారు. వెనకటికి ఒక సామెత ఉంది. ‘ఏడాది ఉతికినా ఎలుక తోక నలుపే’ అని అంటారు. అలాగే చంద్రబాబు కూడా తన పాత అలవాట్లను మార్చుకోలేరు ప్రతి దానికి యుటర్న్ తీసుకోవడం, అబద్దాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. ఈసారి ముస్లీంలను మాయ చేయడానికి ప్రయత్నించారు కాని, అంతా బహిర్గతం అయిపోయింది. దీనివల్ల ఆయన ఎత్తుగడ పారలేదనే చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎట్టకేలకు దేశం ఆఖరి జాబితా
సాక్షి, అమరావతి: టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎట్టకేలకు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 9 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేశారు. దీంతో 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో 94 సీట్లు ప్రకటించినా పి.గన్నవరం అభ్యర్థి రాజేష్‌ని అన్ని వర్గాలు వ్యతిరేకించడంతో ఆయనకు సీటు ఉపసంహరించారు. ఈ జాబితాలోనే అనపర్తి, అరకు సీట్లు ఖరారు చేసినా అవి రెండు బీజేపీకి వెళ్లడంతో వాటిని వదులుకున్నారు. రెండో జాబితాలో ఖరారు చేసిన కదిరి స్థానంలో తాజాగా మార్పులు చేశారు. మొదటి జాబితాలో 13 ఎంపీ స్థానాలకు ప్రకటించగా పొత్తులో మిగిలిన నాలుగు సీట్లకు ఇప్పుడు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో టీడీపీ పోటీ చేసే చోట్ల మొత్తం అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. చీపురుపల్లికి కళా వెంకట్రావు చీపురుపల్లి సీటును చివరికి రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అంటగట్టారు. ఓడిపోయే ఆ స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీ చేయించడానికి ఎంత ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. దీంతో కళా వెంకట్రావును అక్కడ పోటీ చేయించాలని నిర్ణయించారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఎచ్చెర్ల సీటు పొత్తులో బీజేపీకి కేటాయించడంతో కళాకు చీపురుపల్లి సీటు ఇచ్చారు. దీనికి ఆయన చాలారోజులు ఒప్పుకోకపోయినా బుజ్జగించి ఖరారు చేశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు కోసం మొదటి నుంచి గట్టిగా పట్టుబడిన గంటా చివరికి దాన్ని దక్కించుకున్నారు. ఒక దశలో ఆ సీటు జనసేనకు వెళ్లే పరిస్థితి ఏర్పడగా గంటా పెద్దఎత్తున లాబీయింగ్ చేయడంతోపాటు భారీగా డబ్బులిచ్చి విశాఖ జిల్లాలో నాలుగు స్థానాల ఆర్థిక బాధ్యతలు కూడా చూసుకునేందుకు ముందుకు రావడంతో ఆయనకే సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. అరకు జిల్లా పాడేరు (ఎస్టీ) స్థానాన్ని కిల్లు వెంకట రమేష్‌నాయుడుకి ఇచ్చారు. మొదట ఈ సీటును బీజేపీకి కేటాయించే ఉద్దేశంతో అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీజేపీ అరకు సీటును తీసుకోవడంతో ఆ స్థానంలో ఖరారు చేసిన దొన్నుదొర అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఉపసంహరించుకుంది. దాని బదులు ఇప్పుడు పాడేరు స్థానంలో అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థి దొరకని దర్శి స్థానానికి బయట ప్రాంతం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దిగుమతి చేసుకుని సీటు కేటాయించారు. అసంతృప్త నేత సుబ్రహ్మణ్యంకు రాజంపేట రాయచోటి ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీ సీట్లలో ఏదీ దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న భత్యాల చెంగల్రా యుడు, జగన్మోహనరావుకు షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆలూరు స్థానాన్ని వీరభద్రగౌడ్‌కి కేటాయించి కోట్ల సుజాతమ్మకు షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఆ లూరు సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలోకి ఫిరాయించిన గుమ్మనూరు జయరామ్‌కి గుంతకల్లు టికెట్ ఇ చ్చారు. అనంతపురం అర్బన్ సీటును దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి కేటాయించి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి ఝలక్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కదిరి స్థానంలోనూ మార్పు చేశారు. ఈ స్థానాన్ని ఆశించిన కందికుంట ప్రసాద్‌పై నకిలీ డీడీల కేసు ఉండడంతో రెండో జాబితాలో ఆయన భార్య యశోదా దేవికి సీటు ఇచ్చారు. అయితే ప్రసాద్‌పై కేసును కోర్టు కొట్టివేయడంతో యశోదాదేవి బదులు ఇప్పుడు ప్రసాద్‌కి సీటు ఖరారు చేశారు. కడపలో ఫలించని బాబు తంత్రం పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎచ్చెర్ల సీటు దక్కక అసంతృప్తితో ఉన్న కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ సీటును కేటాయించారు. ఒంగోలు సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఖరారు చేశారు. అనంతపురం ఎంపీ స్థానాన్ని అంబికా లక్ష్మీ నారాయణకు ఇచ్చి జేసీ కుటుంబానికి షాక్ ఇచ్చారు. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి ఈ సీటు కోసం లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. కడప ఎంపీ సీటును జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డికి కేటాయించారు. జమ్మలమడుగు సీటు బీజేపీకి వెళ్లడంతో భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ నేత, తన బాబాయి ఆదినారాయణరెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉండడంతో తప్పని పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు ఇచ్చారు. వైఎస్ వివేకా హత్యోదంతాన్ని అడ్డు పెట్టుకుని కడప ఎంపీ సీటుపై రాజకీయం చేయాలని ప్రయత్నించిన చంద్రబాబు చివరికి అభాసుపాలై అసంతృప్త నేతకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. -
మోసగాళ్లను నమ్మొద్దు
చంద్రబాబు ఈ రోజు శింగనమలకు వెళ్లారు. వైఎస్సార్సీపీ ఓ టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చిందని హేళన చేసి తూలనాడారు. ఆ పిల్లోడు చదువుపై కూడా తప్పులు చెప్పారు. అవునయ్యా.. పేదవాడికి టికెట్ ఇచ్చాం. తప్పేముందయ్యా చంద్రబాబూ? వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరే. కాదని చెప్పలేదు. కానీ అతను చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదువులు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా చేశాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్‌గా తన కాళ్లపై నిలబడ్డాడు. వీరాంజనేయులు చాలా ఏళ్లుగా మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి పేద కార్యకర్తకు మీ జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీ జగన్ 175 అసెంబ్లీ, 25 ఎంపీలలో 200 స్థానాల్లో ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. పేదవారికి అండగా ఉండే జగన్‌కు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబుకు మధ్య తేడాను గమనించాలని కోరుతున్నా. అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం ఎస్సీలది. అక్కడ మన అభ్యర్థి పేరు లక్కప్ప. చంద్రబాబు అక్కడికి వెళ్లి ఉపాధి హామీ కూలీకీ జగన్ టికెట్ ఇచ్చారు అని అంటారు. అవునయ్యా.. ఉపాధి కూలీ, పేదవాడైన లక్కప్పకు టికెట్ ఇచ్చాం. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఇదీ తేడా. మాది పేదల పార్టీ. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘పొత్తులు, జిత్తులు, మోసాలు, అబద్దాలు, కుట్రలతో వారు మళ్లీ మీ ముందుకు వస్తున్నారు. మాట నిలబెట్టుకున్న మనకూ, మాట తప్పిన చంద్రబాబుకూ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. మనందరి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్ చేసిన మంచిని, చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. మోసం చేసిన వారి తోకలు కత్తిరించే స్టార్ క్యాంపెయినర్లు మీరే. ఈ ఐదేళ్ల పాలనలో మేలు చేసి చూపించి ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్నాం. మీకు మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఆయన ఎమ్మిగనూరు బహిరంగ సభలో మాట్లాడారు. జన సముద్రంగా మారిన ఎమ్మిగనూరు సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెప్పారు. మే 13న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో పేదల పక్షాన నిలిచి పెత్తందారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. అని ప్రశ్నించారు. సిద్ధం అంటూ చేతులు పైకెత్తిన ఈ మహా సైన్యం.. పైకి లేచిన ప్రతి చేయి, ఉప్పొంగిన ప్రతి గుండె మా ఇంట గత ఐదేళ్లుగా మంచి జరిగింది అని చెబుతోందన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.., – సాక్షి ప్రతినిధి, కర్నూలు పిల్లల భవిష్యత్ కోసమే సంస్కరణలు ♦ మా ప్రభుత్వ బడులు బాగుపడుతున్నాయని, మా పిల్లల చదువులు మెరుగు పడుతున్నాయని ప్రతీ గుండె చెబుతోంది. రాష్ట్రంలో ఈ 58 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 10–16 ఏళ్ల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన బడుల్లో, విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. నిలబెట్టే చదువు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతికేలా అవకాశాలు మన విద్యా విధానంలో తీసుకొచ్చాం. ♦ బడులకు పంపే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడిని తీసుకొచ్చాం. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, తరగతి గదులు, కార్పొరేట్ కంటే గొప్పగా 6వ తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానల్ ద్వారా డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు, విద్యా కానుక కిట్లు, గోరుముద్ద, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు మంచి మార్పులు తీసుకొచ్చాం. ♦పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ పేదల పెద్ద చదువులకు అండగా నిలిచాం. బోధనలో మార్పులు, ఇంటర్న్‌షిప్‌తో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. పిల్లలకు ఓట్లు ఉండవని, వారి చదువుల గురించి గతంలో ఏ పాలకుడు పట్టించుకోలేదు. వారి బతుకులు మారాలన్న తపన, తాపత్రయంతో మనం అడుగులు ముందుకు వేశాం. ఈ ఎన్నికలు కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేందుకు తూతూ మంత్రంగా ఓటు వేసేవి కాదు. పిల్లల భవిష్యత్, వారి తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆడబిడ్డలు ఎదిగేలా అడుగులు వేశాం ♦ మన బంగారు తల్లులు ఆడబిడ్డలు, అవ్వల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందని అడిగితే చెప్పేందుకు ఒక్కటైనా ఉందా? మన రాష్ట్రంలో నూటికి 30 మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేయలేదు. బాల్య వివాహాలను ఆపే పరిస్థితి కూడా లేదు. తన బిడ్డను, వారి భవిష్యత్‌ను నిర్ణయించే శక్తి తల్లుల చేతుల్లో లేదంటే.. అలాంటి పాలకులు ఉన్నా, లేకున్నా ఒకటే. ♦ పాదయాత్రలో నా కళ్లతో చూసిన మరో విషయం చెబుతా. పూలు, వరి, తృణధాన్యాల దాకా ప్రతి గింజ ఎవరి నోట్లోకి వెళుతుందో భగవంతుడు రాస్తాడు. ప్రతీ గింజ పండించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్లతో చూశా. పని వాళ్లుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్న లక్షల మంది వారి బతుకులను ఎంత కష్టంగా లాగుతున్నారో చూశా. వారి బతుకులు మారాలని ఈ 58 నెలల్లో అడుగులు ముందుకు వేశాం. ♦రోజు కూలీ, దోశలు.. ఇడ్లీలు అమ్మే ఓ అక్క, కుట్టుమిషన్ నడిపే ఓ చెల్లి ఇలా వీరంతా బాగుపడాలి. వీరందరి జీవితాల్లో వెలుగులు రావాలని పథకాలు తీసుకొచ్చాం. ఈ ఆలోచనల నుంచే అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, తోడు, చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా పుట్టాయి. కుదేలైన పొదుపు సంఘాలు ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో ఇవాళ తలెత్తుకుని నిలబడ్డాయి. 45–60 ఏళ్ల వయస్సులో నా అక్కచెల్లెమ్మల జీవితాలను బాగు చేసేందుకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అనే పథకాలు పుట్టాయి. చేతల్లో సామాజిక న్యాయం ♦ స్వాతంత్య్రం వచ్చిన ఈ 77 ఏళ్లలో సామాజిక న్యాయం అంశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఇందులో 75 శాతం పైచిలుకు నా.. నా.. అని పిలిచే నా సామాజిక వర్గాలకే వచ్చాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చే వరకూ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు ఏకంగా మరో 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 80 శాతం ఉద్యోగాలు ఈ వర్గాల వారే. నామినేషన్‌పై ఇచ్చే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఏకంగా 50 శాతం చట్టం చేసి ఈ వర్గాలకే వచ్చేట్లు చేసింది కూడా మీ ప్రభుత్వమే. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీ, మంత్రి పదవుల వరకూ ఈ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇవ్వడం సప్తవర్ణాల మిశ్రమం, సామాజిక ఇంధ్ర ధనస్సు అని చెప్పేందుకు సంతోష పడుతున్నా. భవిష్యత్‌ను మార్చే ఎన్నికలివి ♦ దేశంలో తొలిసారి ఆలయ బోర్డులు, మార్కెట్ కమిటీలు, రాజకీయ నియామకాల్లో ఏకంగా 50 శాతం పదవులకు చట్టం చేసి మహిళలకు ఇచ్చిన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలి. బ్యాంకులకు వెళ్లి.. మహిళల అకౌంట్లలో చంద్రబాబు ఐదేళ్ల వివరాలు, మన ప్రభుత్వంలోని ఐదేళ్ల వివరాలు చూడండి. చంద్రబాబు పాలనలో మీ ఖాతాలకు ఒక్క రూపాయి అయినా వచ్చిందా? మీ బిడ్డ ప్రభుత్వ హయాంలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. ప్రతిపక్షం మాయలు, మోసాల్ని నమ్ముకుంటే.. మీ ప్రభుత్వం మీకు చేసిన మంచిని నమ్ముకుంది. ఈ ఎన్నికలు 2.5 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు.. వారి భవిష్యత్, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని గుర్తు పెట్టుకోవాలి. ♦రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం ఇది. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఈ 58 నెలల్లో ఏకంగా రూ.67,500 ప్రతీ రైతు చేతిలో పెట్టాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. చంద్రబాబు హయాంలో రాత్రి పూట 12 గంటలకు ఎప్పడో కరెంట్ వచ్చేది. ఈ రోజు పగటి పూటే నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి రైతులకు ఉచిత పంటల బీమా ఇస్తున్నాం. వరదలు, తుపాన్లు వచ్చి రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్లోనే ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. అసైన్డ్, ఇనాంతో పాటు 22ఏకు సంబంధించిన 35 లక్షల ఎకరాల భూములపై శాశ్వత భూ హక్కులు కల్పించిన ప్రభుత్వం ఇది. రైతు పేరు పలకడమే నేరంగా భావించి, వారిని మోసం చేయడం, వ్యవసాయం దండుగ అనే పార్టీలకు మద్దతిస్తారా? మీకు అండగా నిలిచే మీ భూమిపుత్రుడికి అండగా నిలుస్తారా? మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి ♦ నా చేతికి మాత్రమే కాదు.. మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని కోరుతున్నా. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. దిశ యాప్ ద్వారా 35 వేల మంది అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే వారికి భద్రత కల్పించిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టాలి. మహిళా పోలీసును ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలి. అవ్వా, తాతలకు.. అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు, దివ్యాంగులకు ఒకటో తేదీన, సెలవైనా సూర్యోదయానికి ముందే వారి చేతిలో పింఛన్ పెట్టేందుకు వలంటీర్‌ను ఇంటికే పంపిన ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. ♦ పింఛన్ తీసుకునే 66 లక్షల మందిలో అవ్వలు, వితంతు అక్క చెల్లెమ్మలు 45 లక్షల మంది ఉన్నారు. వీరందరూ మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలని కోరుతున్నా. ఈ 58 నెలల్లో లంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం. అందులో రూ.1.90 లక్షల కోట్లు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి మహిళ సాధికారతను ఉద్యమంగా నడిపిన ప్రభుత్వం ఇది. వారి భవిష్యత్ కోసం రక్షాబంధన్ కట్టాలని కోరుతున్నా. బాబు తోక కత్తిరించండి ♦ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ది చెప్పండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేసిన వారు, బీసీల తోకలు కత్తిరిస్తాం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అనే చంద్రబాబు తోకను మరోసారి కత్తిరించాలని కోరుతున్నా. నాన్న ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను పణంగా పెట్టడమే కాకుండా, గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న బాబును ఏ ఒక్కరైనా సమర్థిస్తారా? ఈ వర్గాలన్నీ నేను అక్కున చేర్చుకున్న వర్గాలు. ♦ బాబుకు నా.. నా.. అని పిలచుకునే వర్గాలు హైదరాబాద్ మెట్రోలో హైటెక్‌సిటీలో ఉన్నాయి. ఇక్కడ లేవు. ఓ ఈనాడు, ఆంధ్ర‡జ్యోతి, టీవీ–5 వీరికి తోడు ఓ దత్తపుత్రుడు. వీరు మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, మోసాలు మాత్రమే. ఐదేళ్ల కిందట ఓ దత్తపుత్రుడు, ఢిల్లీ నుంచి మోడీని తెచ్చుకుని ఇదే చంద్రబాబు 2014లో మేనిఫెస్టో అని చెప్పి రంగు రంగుల కాగితాలు తీసుకొచ్చారు. 650 హామీలు ఇచ్చారు. ఇవి ప్రజలు మర్చిపోతారు అని ముఖ్యమైన హామీలు అంటూ ఓ కరపత్రం (చేత్తో పట్టుకుని చూపిస్తూ) సంతకం చేసి ప్రతీ ఇంటికి పంపారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లో ప్రకటనలు ఇచ్చారు. చంద్రబాబు మోసాలు ఇవిగో.. ♦ రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. రూ. 87,612 కోట్లు మాఫీ చేశాడా? ♦ డ్వాకా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. రూ.4,205 కోట్లు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటింటికీ ఓ ఉద్యోగం.. లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇచ్చారా? ♦ అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు సాయం ఇస్తామన్నారు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా? ♦రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, మహిళ రుణాలు మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతీ నగరాన్ని హైటెక్‌సిటీగా నిర్మించడం ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. మీ నగరంలో, జిల్లాలో హైటెక్‌సిటీ ఎక్కడైనా కన్పించిందా? ♦ ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు మోడీ ఫొటో పెట్టుకుని ఇంటింటికీ పంపిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటైనా చేశారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? మన టార్గెట్ 175కు 175 ఒక్క హామీ నెరవేర్చకపోగా, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి, మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ దత్తపుత్రుడు, చంద్రబాబు, మోడీ ఇదే ముగ్గురూ కలిసి సూపర్‌సిక్స్, సూపర్సెవన్ అంటున్నారు. ప్రతి ఇంటికీ కిలో బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి మోసాల నుంచి రాష్ట్రంలోని పేదల భవిష్యత్‌ను కాపాడుకోవాలా? వద్దా? ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా? సిద్ధం అంటే జేబులో నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి పేదవాడి భవిష్యత్ కోసం మేమంతా సిద్ధం అని లైట్ వేసి పిలుపునివ్వండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ ఆన్ చేసి మద్దతు పలికారు). మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి. ఈ ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175. 25కు 25 ఎంపీలు గెలవాలి. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ ఎమ్మెల్యేలుగా బుట్టారేణుక, సాయిప్రసాద్‌రెడ్డి, విరూపాక్షి, ఇంతియాజ్, డాక్టర్ సతీశ్, బాలనాగిరెడ్డి, శ్రీదేవిని నిండు మనస్సుతో ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి గెలిపించాలి. సంక్షేమంతో ఎమ్మిగనూరుకు రూ.650 కోట్లు.. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలు అమోఘం. ముఖ్యమంత్రి జగన్ చొరవతో ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలకు రూ.650 కోట్ల మేర లబ్ధి చేకూరింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌దే. గాజులదిన్నె ప్రాజెక్టును ఆధునీకరించడం, గాజులదిన్నెకు హంద్రీనీవా నుంచి 3 టీంఎంసీల నీటిని తరలించే అవకాశాన్ని కల్పించింది కూడా ముఖ్యమంత్రి జగనే. సామాజిక న్యాయం లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతల సంక్షేమానికి టైక్స్‌టైల్ హబ్‌ను విస్తరించడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు మరిన్ని ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని కోరుతున్నా. పేద వర్గాలకు అందుతున్న పథకాలు కొనసాగాలన్నా, మరింత మెరుగుపర్చాలన్నా వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపాలనే లక్ష్యంతో ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలి. బీసీ మహిళనైన నాకు ఎమ్మిగనూరు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.– బుట్టా రేణుక, ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి చిన్నా.. నేనున్నా! ♦ చూపులేని చిన్నారికి సీఎం భరోసా ♦ తక్షణమే స్పందించిన సీఎంవో కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి శుక్రవారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభమైన సమయంలో గ్రామానికి చెందిన రేష్మ అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తె పింజరి జుహతో కలసి ఆయన వద్దకు వచ్చింది. పుట్టుకతోనే తన కుమార్తెకు రెండు కళ్లు కనిపించవని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. మూడు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పాపకు కంటి చూపు రాదని డాక్టర్లు చెప్పారని విలపించింది. కనీసం పెన్షనైనా మంజూరు చేస్తే పాపకు అవసరమైన మందులకు ఉపయోగపడుతుందని అభ్యర్థించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్ తన పీఏ ద్వారా సమాచారాన్ని సీఎంవోకు చేరవేశారు. సీఎంవో కార్యాలయం అధికారులు పాపకు సంబంధించి వివరాలను సేకరించారు. -
కోడుమూరు Day-3 : నీతోనే జనం.. నీదేగా జయం (ఫొటోలు)
-
చంద్రబాబుకు తగ్గట్టే.. టీడీపీ అభ్యర్దుల నోటి జారుడు!
వాలంటీర్ల వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద తెలుగుదేశం లీడర్లు చేస్తున్న కామెంట్లు, అనుసరిస్తోన్న ధోరణి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. చంద్రబాబు తగ్గట్టే కొందరు టీడీపీ అభ్యర్దులు కూడా నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడి వివాదాస్పదులవుతున్నారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్ది బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణంగా ఉంది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వలంటీర్లపై ద్వేషంతో ప్రవర్తిస్తోంది. తొలుత చంద్రబాబు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినా, ఆ తర్వాత వారి ప్రాముఖ్యత, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించక తప్పలేదు. మొదట వలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు అవహేళన చేశారు. ఇళ్లలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారని నీచంగా ఆరోపించారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, తాను కూడా వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని ప్రకటించారు. పైగా 'వలంటీర్లకు ఏభై వేల రూపాయల వరకు వచ్చే ఏర్పాటు చేస్తారట. అదెలాగో ఎవరికి తెలియదు'. వలంటీర్లకు ఆయన తాయిలాలు వేసే దశకు వచ్చారంటే ఆ వ్యవస్థ ఎంత బలంగా నాటుకుంది అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ప్లస్ అవుతున్నదన్నదే ఆయన బాధ. టీడీపీ నేతలలో వలంటీర్లు అంటే భయం ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం తమమీద పడుతుందేమోనన్న సందేహం వారిలో ఉంది. 'పవన్ కల్యాణ్ అయితే ఏకంగా వలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చారు. నిజానికి వలంటీర్లలో అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు ఉన్నారు. అయినా వీరిద్దరూ దారుణంగా మాట్లాడారు. వారికంటే తానేమీ తక్కువ తీసిపోలేదన్నట్లు సుధీర్ రెడ్డి వంటి వారు మరీ మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు'. కరోనా కష్టకాలంలో ఏపీలో ప్రజలకు అండగా ఉండి వలంటీర్లు చేసిన సేవలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే పలకరించడానికి భయపడిన రోజుల్లో కరోనా సోకిన వారిని ఆస్పత్రులలో చేర్చి, వారికి చికిత్స జరిగేదాక శ్రద్ద తీసుకున్న వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారంటే వారి సంస్కారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్త సఫలం అవుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఊహించలేదు. అందుకే ఇష్టారీతిన మాట్లాడి నోరుపారేసుకున్నారు. ఆ తర్వాత తప్పును గుర్తించినా లాభం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వలంటీరు వందల మందిని ప్రభావితం చేయగలిగే శక్తి మంతులయ్యారన్నది వీరి అనుమానం. వలంటీర్లు సేవలందిస్తున్న ఆ వ్యవస్థను నెలకొల్పి ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోంది. కులం, ప్రాంతం, పార్టీ.. ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏపీలో మొదటిసారిగా ఇలా స్కీములు అమలు అవుతున్నాయి. 'గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తే, అవినీతి విశృంఖలంగా చేస్తే టీడీపీ గబ్బు పట్టిపోయింది'. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వలంటీర్ల సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతుండడంతో పూర్వకాలంలో టీడీపీకి ఓటు వేసినవారు సైతం ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుతున్నారు. దాంతో కంగారు పుట్టిన టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడి మరింత అప్రతిష్టపాలవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలకు సంతోషపడి ఒక్కో వలంటీర్‌కు పది మంది చొప్పున టీడీపీ వారు మారినా, పాతిక లక్షల మంది వైఎస్సార్సీపీకి అనుకూలం అవుతారన్నది వీరి అంచనా. అందుకే వలంటీర్ల వ్యవస్థను అవుననాలో, లేక కాదానలో తేల్చుకోలేక, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి మరింతగా పలచన అవుతున్నారు. 'గతంలో రోజుల తరబడి వృద్ధులు తమ పెన్షన్ల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లకే వలంటీర్లు వచ్చి ఇస్తుండడంతో వృద్ధులంతా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు. సహజంగానే అది టీడీపీవారికి గంగవెర్రిలెత్తిస్తుంటుంది'. 'చిత్రం ఏమిటంటే ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్టు అని వ్యాఖ్యానిస్తే, టీడీపీ నేతలు బొజ్జల వంటివారు వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతున్నారు'. చంద్రబాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నట్లే వీరు కూడా వలంటీర్లను ప్రశంసించక తప్పని స్థితి ఏర్పడింది. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏభై ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తే, ఇప్పుడు చంద్రబాబు ప్రతి ఇరవై కుటుంబాలకు ఒక వలంటీర్‌ను పెడతానని చెబుతున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తానని అంటున్నారు'. జనం వీటిని నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. వలంటీర్లను తెగతిట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని పెడతామంటే అన్నిటిలోను యుటర్న్ తీసుకున్నట్లు దీనిలో కూడా మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి పాట్లు పడుతున్నారని తెలియడం లేదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
'మేమంతా సిద్ధం @ డే 3': సీఎం జగన్ బస్సు యాత్ర అప్డేట్స్
Memantha Siddham Yatra.. CM Jagan Bus Yatra Day-3 Highlights And Updates సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? 58 నెలల పరిపాలనలో జరిగిన మంచిని, మార్పును గమనించమని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నా మీరంతా కూడా ప్రతీ ఇంటికి వెళ్లి ఈ మార్పుల గురించి చెప్పాలని కోరుతున్నాను ఈ రోజు మన విద్యారంగంలో జరుగుతున్న మార్పులు ఎలాంటివి అంటే.. 15-16 ఏళ్ల తర్వాత మన విద్యార్థి చదువుల తర్వాత ఆనాటి ప్రపంచంలో ఎలా ఉంటారు అని ఆలోచించి.. వారి భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి ఏ కుటుంబమైనా మద్దతు పలకకుండా ఎందుకు ఉంటుంది అని ఆలోచన చేయమని కోరుతున్నాను గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం రావడం లేదని, ఈ చదువుల వల్ల ఉపయోగం లేదని, పట్టాలు చేతికొచ్చినా ఉపయోగం లేదని బాధపడుతున్న యువత గురించి నాకు బాగా తెలుసు కాబట్టే విద్యా రంగంలో కనివినీ విధంగా మార్పులు తీసుకొచ్చాం భవిష్యత్తును నిలబెట్టే చదవులు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతికే అవకాశాలు కల్పించడానికి మొత్తంగా మన విద్యా విధానంలో 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేశాం పిల్లలు బడిబాట పట్టాలని అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం పిల్లల చేతులకు విద్య నేర్పే ట్యాబ్‌లు ఇచ్చాం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టటం గతంలో ఎప్పుడైనా జరిగిందా? పెద్ద చదువుల కోసం పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని చెబుతున్నాయి మా గవర్నమెంట్ స్కూళ్లు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోంది కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం అమ్మ ఒడి, విద్యా దీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నాం పిల్లల చదువుల గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు పేదరికం నుంచి బయటపడాలంటే పిల్లలు చదువుకోవాలి పిల్లల చదువుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదు ఒక గింజను పండించడంలో ఒక రైతు పాత్ర, ఒక కూలీ పాత్ర నా కళ్లతో నేను చూశా ప్రతీ గింజ పండించడంలో నా అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడ్డారో నా కళ్లతో నేను చూశా ఈ రోజు పనివాళ్లుగా, రోజు కూలీలుగా చిన చిన వ్యాపారాలు చేసుకుంటూ ఆత్మగౌరవం లక్ష కుటుంబాలు వారి బతుకు బండిని ఎలా లాగుతున్నాయో నా కళ్లతో నేను చూసుకుంటూ వచ్చా వారి ముఖాల్లో సంతోషం, వారి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తేనే వారి బ్రతుకు బాగుంటుందని ఆలోచించే నా 58 నెలల పాలనలో అడుగులు వేశాం ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు, మట్టిలో మాణిక్యాలు పండాలంటే, ఒక రోజు కూలీ, ఒక ఆటో డ్రైవర్, ఒక కూరగాయల అమ్మే చెల్లెమ్మ, దోశెలు, ఇడ్డీలు అమ్మే చెల్లెమ్మ.. ఇలా వీరి జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచన చేశాం ఈ ఆలోచనల నుంచి పుట్టించి ఒక అమ్మ ఒడి, ఒక విద్యా దీవెన, ఒక వసతి దీవెన, ఒక తోడు అనే పథకం, ఒక చేదోడు అనే పథకం, ఓ నేతన్న నేస్తం అన్న పథకం, మత్య్సకార భరోసా అనే పథకం ఈ ఆలోచనల నుంచే పుట్టాయి కుదేలైన పొదుపు సంఘాలను జీవితాలను చిన్నా భిన్నం అయిన పరిస్థితుల చూసి వారి జీవితాల్లో వెలుగు నింపాలనే ఆలోచనతో పుట్టింది.. ఒక సున్నా వడ్డీ అనే పథకం, ఒక ఆసరా అనే పథకం పుట్టింది నలభై సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కలు నా చెల్లెమ్మల జీవితాలు బాగుంటాయని ఆలోచన చేసే ఒక కాపు నేస్తం అనే పథకం పుట్టింది, ఒక ఈబీసీ నేస్తం అనే పథకం పుట్టింది, ఒక చేయూత అనే పథకం పుట్టింది అన్నింటికీ మించి ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే సంక్షేమ ఫలాల్ని పెట్టగలిగితేనే ఆ కుటుంబాలు బాగుంటాయనే ఆలోచనల నుంచే ప్రతీ పథకం పుట్టింది ఐదేళ్లుగా నేను అమలు చేసిన సంక్షేమాన్ని చూశారు.. వైఎస్సార్సీపీ తరఫున మొత్తం 200 సీట్లలో(లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు కలిపి) 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం అంటే 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను. ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా అభాగ్యులైన అక్క చెల్లెమ్మల కోసం, అవ్వా తాతల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం మనది.. అది ఆదివారం అయినా, సెలవు దినం అయినా దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధికంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ బిడ్డ ప్రభుత్వం 66 లక్షల మందికి నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నాం 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లు పేదల ఖాతాలకు బదిలీ చేశాం మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా రెండు లక్షల డబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితులు.. ప్రతీ ఇంట్లో కూడా లక్షల లక్షల కనిపిస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి ఇదంతా కేవలం 58 నెలల కాలంలోనే జరిగింది అనేది గుర్తుపెట్టుకోమని చెబుతున్నా ప్రతి పక్షం మాయల్ని, మోసాన్ని నమ్ముకుంటే.. మన అందరి ప్రభుత్వం చేసిన మంచిని నమ్ముకుంది. కాబట్టే చెబుతా ఉన్నా.. ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కాదు.. ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల అక్క చెల్లెమ్మల భవిష్యత్, వారి భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని ప్రతీ అక్క చెల్లెమ్మ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకు డ్రైవర్‌కు టికెట్ ఇచ్చాం వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడు.. బీఈడీ కూడా చేశాడు బాబు హయాంలో ఉద్యోగం దొర్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు పేదవాడైన వీరాంజనేయులు ఎదగాలనే టికెట్ ఇచ్చాం మేం టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చామని బాబు హేళన చేశాడు ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభలో బుట్టా రేణుకా ప్రసంగంలోని ముఖ్యాంశాలు కర్నూలు నుంచి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారాలు ఎప్పుడు కనివినీ ఓ చారిత్రాత్మక పరిపాలన అందించిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్రెడ్డికు దక్కుతుంది ఎవ్వరూ ఊహించని విధంగా సంక్షేమ అభివృద్ధి, ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందాన్ని నింపాలని, ప్రతివాడి పేదవాడి ముఖాల్లో చిరునవ్వు ఉండాలని.. ప్రతీ నిమిషం పేదవాడి గురించే ఆలోచించే సంక్షేమ అభివృద్ధిని తీసుకొచ్చారు సీఎం జగన్ ఈ ఐదేళ్లు చక్కటి పాలన అందించిన ఘనత సీఎం జగన్‌ది ఈ ఐదేళ్లలో విద్య, వైద్య రంగలో రూపురేఖలు మార్చి ఓ కార్పోరేట్‌ను విద్యను అందిస్తూ, పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత సీఎం జగన్‌గారికే దక్కుతుంది. ఎమ్మిగనూరుకు చేరుకున్న సీఎం జగన్ ఎమ్మిగనూరు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ ఎమ్మిగనూరులో జనహోరు నంద్యాల, ప్రొద్దుటూరు సభకు మించి పోటెత్తిన ప్రజా ప్రవాహం అంచనాలను మించి మేమంతా సిద్ధం బహిరంగ సభ ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిన బహిరంగ సభా ప్రాంగణం మేమంతా సిద్ధం సభకు తరలివస్తున్న జనసందోహం ఎమ్మిగనూరు సభకు లక్షలాదిగా తరలివచ్చిన జనం కాసేపట్లో ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభా ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం జగన్ ఇప్పటికే ఎమ్మిగనూరు సభకు భారీ స్థాయిలో తరలి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు జన జాతరలా సాగుతున్న సీఎం జగన్ బస్సుయాత్ర దారులన్నీ మేమంతా సిద్ధం బహిరంగ సభ వైపే బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత కృష్ణారెడ్డి హెచ్ కైరవాడిలో సీఎం జగన్ రోడ్ షోకు విశేష స్పందన మేమంతా సిద్ధం మహాసభకు తరలి వెళ్లిన ఆదోని వైఎస్సార్సీపీ శ్రేణులు ఎమ్మిగనూరు పట్టణంలో ఈరోజు(శుక్రవారం) సాయంత్రం జరిగే మేము సిద్ధం మహాసభకు ఆదోని నుంచి భారీగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో 150 బస్సులు 150 ట్యాక్సీలలో తరలి వెళ్లిన పార్టీ కార్యకర్తలు, నాయకులు వేముగోడు గ్రామానికి చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి స్వాగతం పలికిన ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక అభిమానంతో కానుకలు.. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కోడుమూరులో జననేత సీఎం జగన్‌పై హద్దులు లేని అభిమానం ప్రదర్శించిన గ్రామస్తులు వివిధ వర్గాల తరఫున సీఎం జగన్‌కు కానుకలు చిరునవ్వులతో స్వీకరించి.. ఫొటోలు దిగిన సీఎం జగన్ కోడుమూరులో అశేష ప్రజాభిమానం కోడుమూరు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర దారిపొడవునా బారులు తీరిన గ్రామస్తులు బస్సు పైకి ఎక్కి ప్రజాభివందనం చేస్తున్న సీఎం జగన్ భారీ గజమాలతో స్వాగతం పలికిన కోడుమూరు గ్రామస్తులు మేమంతా సిద్ధంకు ప్రజల బ్రహ్మరథం మూడో రోజు కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర దారిపొడవునా జై జగన్ నినాదాలు సీఎం జగన్ యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బస్సు దిగి ప్రజలను పలకరిస్తున్న సీఎం జగన్ పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర మూడో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర పెంచికలపాడు శిబిరం వద్ద భారీగా గూడిన జనం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ సీఎం జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ ఖాన్, డా.జరదొడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జననేతకు స్వాగతం కోసం జగనన్నను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు మేమంతా సిద్ధం అంటున్న కోడుమూరు ప్రజలు కోడుమూరులో సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచే ఎదురుచూస్తున్న అభిమాన గణం మరికాసేపట్లో కోడుమూరు నియోజక వర్గం పెంచికాల పాడు నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్దం అంటూ సీఎం జగన్ కోసం భారీగా తరలివచ్చిన ప్రజలు కాసేపట్లో కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కర్నూలు జిల్లా సిద్ధమా.. అంటూ ట్వీట్ చేసిన సీఎం జగన్ కర్నూలు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 నేడు కర్నూల్ జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మూడో రోజుకి చేరిన మేమంతా సిద్ధం యాత్ర కర్నూల్ పార్లమెంట్ స్థానం పరిధిలో కొనసాగనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బస్సు యాత్ర మధ్యాహ్నాం రాళ్ల దొడ్డి వద్ద హాల్టింగ్.. భోజన విరామం సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ నిన్న నంద్యాల జిల్లాలో కొనసాగిన యాత్ర నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో మేమంతా సిద్ధం బహిరంగ సభ సూపర్ సక్సెస్ అని వైఎస్సార్సీపీ ట్వీట్ నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం కార్యక్రమం సూపర్ సక్సెస్🔥#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/PZvGGLdvde — YSR Congress Party (@YSRCParty) March 28, 2024 జన సంద్రంగా మారిన నంద్యాలలో జగనన్న.. క్లిక్ చేయండి ఇది కదా అభిమానం అంటే.. సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు ఉదయం 6 గంటలకే పర్లకు చెందిన చిన్న మద్దిలేటి అనే దివ్యాంగుడు అక్కడికి చేరుకున్నారు మేమంతా సిద్ధం - 3వ రోజు ముందుకు ఇలా.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభం పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనున్న సీఎం జగన్ రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకోనున్న సీఎం జగన్ ఎన్నికల ప్రచార రథం సాయంత్రం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం సభ ముగిశాక.. తిరిగి ప్రారంభం కానున్న బస్సు యాత్ర అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి మీదుగా పత్తికొండ బైపాస్ చేరిక స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో విడిది ఏర్పాటు.. సీఎం జగన్ రాత్రికి అక్కడే బస Memantha Siddham Yatra - Day 3. కర్నూలు జిల్లాలో పెంచికలపాడు నుంచి ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకి ఎమ్మిగనూరులో బహిరంగ సభ #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/JNmFC8zRA1 — YSR Congress Party (@YSRCParty) March 29, 2024 ఇదీ చదవండి: ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్ వైఎస్సార్సీపీ ‘మేమంతా సిద్ధం’ పేరిట రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో సీఎం జగన్ అడుగడుగునా సాదర స్వాగతం పలుకుతున్న ప్రజలు, పార్టీ శ్రేణులు అభిమానానికి సీఎం జగన్ ఫిదా మొన్న ప్రొద్దుటూరు, నిన్న నంద్యాల బహిరంగ సభకు పోటెత్తిన జన సంద్రం సెల్‌ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్ సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవ్వరూ చేయని మార్పులు మనం చేశాం 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్లెదుటే కన్పిస్తోంది పిల్లల భవిష్యత్‌కు దారి చూపాం.. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందాం చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం అంటూ నంద్యాల ఓటర్లకు పిలుపు ఇచ్చిన సీఎం జగన్ -
March 29th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News March 29th Telugu Updates 9:30 PM, March 29th 2024 నెల్లూరు: వింజమూర్లో జరిగిన చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు టికెట్ రాలేదని గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఉదయగిరి నియోజకవర్గ కూటమి నాయకులకు వేదికపై దక్కని చోటు 9:00 PM, March 29th 2024 అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ టీడీపీకి రాజీనామా యోచనలో కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఉమామహేశ్వర నాయుడును కలిసిన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన నేతలు 8:50 PM, March 29th 2024 తాడేపల్లి : చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ ఫైర్ వైఎస్సార్సీపీలో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం అయినా పేదలు రాజకీయంగా ఎదుగుతుంటే మీకు అంత కడుపుమంట ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? వైయస్ఆర్సీపీ లో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అయినా పేదలు రాజకీయంగా ఎదుగుతుంటే మీకు అంత కడుపుమంట ఎందుకు చంద్రబాబు నాయుడు గారు?#MemanthaSiddham pic.twitter.com/dSxGLtAe9Z — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 5:50 PM, March 29th 2024 ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?\ నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను. ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా 4:50 PM, March 29th 2024 విజయవాడ: టీడీపీపై X లో ఘాటైన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత పోతిన మహేష్ టీడీపీ నాయకులు జనసేన పార్టీ మీద పెట్టిన శ్రద్ధలో సగం టీడీపీ మీద పెట్టుండాల్సింది అలా చేసుంటే టీడీపీ నాయకులను సెంట్రల్ నియోజకవర్గంలో కాపాడుకోవచ్చు జనసేనలో చీలికలు తెచ్చే పనులుమాని మీ పార్టీని బలపర్చుకోండంటూ చురకలు పొత్తు ధర్మం మాకే కాదు, మీకు కూడా వర్తిస్తుందంటూ పోస్టు పెట్టిన పోతిన మహేష్ 4:29 PM, March 29th 2024 అనంతపురం: మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టిక్కెట్ ఇవ్వడంపై ఆగ్రహం గుంతకల్లు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల నిరసన చంద్రబాబు ఫ్లెక్సీలు దహనం చేసిన టీడీపీ నేతలు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ 4:15 PM, March 29th 2024 విజయవాడ: సీటు దక్కకపోవడంతో విజయవాడ వెస్ట్ జనసేన నేత పోతిన మహేష్ ఆవేదన పోరాడి పోరాడి కన్నీరు కూడా రావడం లేదు నా బాధను క్రీస్తు శిలువకు చెప్పుకున్నా సీటు కోసం పోరాడినా అవకాశం రాలేదు ప్రతి రోజూ పరీక్ష అంటే ఎలా అంటూ ఉద్వేగానికి లోనైన పోతిన మహేష్ 4:01 PM, March 29th 2024 నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చిన కావలి జనం బహిరంగ సభకు జనాలు లేకపోవడంతో సుమారు గంటలు పాటు హెలిపాడ్ దగ్గరే ఉండిపోయిన చంద్రబాబు జనాలను సమీకరించడంలో టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విఫలమయ్యారంటూ చంద్రబాబు ఆగ్రహం రెండు గంటల 50 నిమిషాలకే ప్రత్యేక హెలికాప్టర్లో కావలి జడ్పీ గ్రౌండ్ లో దిగిన చంద్రబాబు నాలుగు గంటలకి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉన్నా కూడా.. జనాలు రాకపోవడంతో గ్రౌండ్ లోనే ఉన్న బాబు టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఓవరాక్షన్ కారణంగానే ఇలా జరిగిందని తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం కావ్య కృష్ణారెడ్డి నియంతృత్వ పోకడల వల్ల కావలిలో పార్టీ నాశనం అయిందని చంద్రబాబుకు నేతల ఫిర్యాదు 3:59 PM, March 29th 2024 అనంతపురం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మనస్తాపం అనంతపురం అర్బన్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ప్రభాకర్ చౌదరి చంద్రబాబు తీరును తప్పుబట్టిన టీడీపీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి టీడీపీ లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదా? టీడీపీ ఓ లిమిటెడ్ కంపెనీలా మారిపోయింది చంద్రబాబు ను కలవాల్సిన అవసరం నాకు లేదు చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం ఏ సర్వే ఆధారంగా అనంతపురం టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా 3:50 PM, March 29th 2024 ప్రకాశం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గంలో మరోసారి ఎగిరేది వైఎస్సార్సీపీ జెండానే: వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం సంక్షేమం,అభివృద్ధితో మళ్లీ జగన్ రావాలని కోరుకుంటున్న ప్రజలు సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేసుకుందాం సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు సీఎం జగన్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఒంగోలు పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ 3:20 PM, March 29th 2024 అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి దగ్గుపాటి ప్రసాద్‌కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి తీవ్ర అసంతృప్తి ఫ్లెక్సీలు తగలబెట్టిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం 3:15 PM, March 29th 2024 అంబేద్కర్ కోనసీమ జనసేన పార్టీకి పితాని బాలకృష్ణ గుడ్ బై జనసేన పార్టీ, పదవికి రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ ఈ నెల 30న(రేపు) సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న పితాని బాలకృష్ణ 3:03 PM, March 29th 2024 తాడేపల్లి : అవ్వాతాతల అప్యాయతపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం మనం చేసిన మంచి దారి పొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/C0VOCM7NvQ — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 2:25 PM, March 29th 2024 బీసీలకు చంద్రబాబు హ్యాండ్ బీసీలకు చంద్రబాబు ఊచకోత లోక్‌సభ సీట్లలో బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు టీడీపీ కూటమిలో 25లో కేవలం ఆరు సీట్లు మాత్రమే బీసీలకు... 20 అన్‌రిజర్వ్ సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇచ్చిన వైఎస్సార్సీసీ 2:13 PM, March 29th 2024 పెండింగ్ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు అభ్యర్థుల్ని ఖరారు చేసి జాబితా విడుదల చేసిన చంద్రబాబు జాబితా విడుదల చేసిన టీడీపీ పంతం నెగ్గించుకున్న గంటా శ్రీనివాస్.. భీమిలి సీటు గంటాకే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు జయరాం టికెట్‌పై మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ తీవ్ర అభ్యంతరాలు జయరాంకు టికెట్ ఇవ్వొద్దని ఆందోళనలు, నిరసనలు పట్టించుకోని చంద్రబాబు అనంత సీనియర్ నేత ప్రభాకరచౌదరికి నిరాశ జేసీ కుటుంబం నుంచి ఈసారి ఒక్కరికే సీటు జేసీ వారసుడు పవన్కుమార్కూ నిరాశే తాపడిత్రి నుంచి అస్మిత్‌రెడ్డికి ఛాన్స్ 1:45 PM, March 29th 2024 తారాస్థాయికి చేరిన టీడీపీ అసమ్మతి సెగలు తిరుపతి సత్యవేడు నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన టిడిపి అసమ్మతి సెగలు కోనేటి ఆదిమూలం కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు సమావేశం ఎన్.ఆర్. ఐ రమేష్ నాయుడు నేతృత్వంలో తిరుపతి రాజ్ పార్క్ హోటల్ లో సత్యవేడు టిడిపి అసమ్మతి నేతలు సమావేశం నారాయణ వనం, పిచ్చాటురు, కే.వి.బి.పురం, బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్య పాలెం, సత్యవేడు, నాగల పురం మండలాలుకు చెందిన టీడీపీ నేతలు ,ముఖ్య నాయకులు హాజరు 1:23 PM, March 29th 2024 కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు కోడమూరు, వేముగోడు, సార్ గోనెగండ్ల మీదుగా సాగనున్న యాత్ర సాయంత్రం ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ 12:54 PM, March 29th 2024 ఆసక్తికరంగా ధర్మవరం రాజకీయం పొత్తులో భాగంగా బీజేపీ సత్యకుమార్‌కు సీటు కేటాయింపు మండిపడుతున్న టీడీపీ జనసేన శ్రేణులు బీజేపీ అభ్యర్థికి సహకరించబోమంటూ ప్రకటనలు ఇరు వర్గాల నేతలను పిలిపించుకుని మాట్లాడనున్న టీడీపీ-జనసేన అధినేతలు 12:43 PM, March 29th 2024 నూకసాని వ్యాఖ్యలతో ప్రకాశం టీడీపీలో అలజడి టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ సంచలన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో కొందరు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు రెండు మూడు రోజుల్లో అలాంటి నేతలకు గట్టి సమాధానం చెబుతా.. పరోక్షంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు , ఒంగోలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై వ్యాఖ్యలు గత కొద్దిరోజులుగా దామచర్ల జనార్దన్ కి నూకసాని బాలాజీ కి మధ్య విబేధాలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గా తనకు గౌరవం ఇవ్వలేదని నూకసాని బాలాజీ గుర్రు బీసీ కోటాలో ఒంగోలు ఎంపీ సీటు ఆశించిన నూకసాని నూకసానికి మొండి చేయి చూపించిన చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవం రోజునే జిల్లా పార్టీ అధ్యక్షుడు వ్యాఖ్యలు పై జిల్లా లో తీవ్ర చర్చ 12:12 PM, March 29th 2024 దేవినేని ఉమను బుజ్జగిస్తున్న చంద్రబాబు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో సీటు నిరాకరణ మైలవరం టికెట్ వలస నేత వసంత కృష్ణకు కేటాయించడంతో దేవినేని నిరాశ పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని దేవినేని ఉమకు చెప్పిన చంద్రబాబు దేవినేని ఉమకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు సమన్వయ బాధ్యతలు ఇస్తానని చల్లబర్చే యత్నం 11:30 AM, March 29th 2024 ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం సుందరపు విజయ్ కుమార్ పై ఐవీఆర్ఎస్ సర్వే సీటు కేటాయించి నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళన విజయ్ కుమార్ యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం తర్వాత జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరంగా పవన్ కల్యాణ్ చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పీవీఎస్ఎన్ రాజు అసంతృప్తి అనుచరులతో సమావేశం భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ 11:15 AM, March 29th 2024 అమరావతి: పెండింగ్ సీట్లలో అభ్యర్ధుల ఖరారుపై తేల్చుకోలేకపోతున్న జనసేన 3 అసెంబ్లీ, ఒక లోక్ సభ సీటుపై ఇంకా రాని స్పష్టత డైలమాలోనే బందరు పార్లమెంటు సీటు మరింత సమర్ధవంతమైన అభ్యర్ధుల కోసం పవన్ సెర్చ్ ఆపరేషన్ అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్ధుల కోసం జనసేన గాలింపు 11:00 AM, March 29th 2024 కృష్ణా జిల్లా గన్నవరంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదంటూ జనసేన నేతల ఆవేదన పవన్ చెప్పడంతో టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నాం టీడీపీకి బానిసత్వం చేయడానికి మేం సిద్ధంగా లేం: గన్నవరం జనసేన ఇన్ ఛార్జ్ చలమలశెట్టి రమేష్ బాబు 10:45 AM, March 29th 2024 ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టీడీపీలో బయటపడ్డ వర్గపోరు పార్టీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య పై అసమ్మతి నేతల ఫైర్ కమ్మ సామాజికవర్గ నేతలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం -స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరిక 10:34 AM, March 29th 2024 జనసేన సీటు.. అయినా పవన్ ప్రచారానికి దూరం?! ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం సుందరపు విజయ్ కుమార్ పై ఐవీఆర్ఎస్ సర్వే సీటు కేటాయించి సర్వే నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళన విజయ్ కుమార్ ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం తరువాత జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరంగా పవన్ కల్యాణ్ చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పి వి ఎస్ ఎన్ రాజు అసంతృప్తి అనుచరులతో రహస్యంగా సమావేశం భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ 10:00 AM, March 29th 2024 మూడో రోజు సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్ యాత్ర పెంచికలపాడు వద్ద ప్రారంభమైంది. 09:53 AM, March 29th 2024 జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విభేదాలు పెనుగంచిప్రోలులో సమావేశమైన జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా విడిపోయిన క్యాడర్ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం పార్టీలో మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు :బొల్లా రామకృష్ణ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం వర్గీయులుగా మా పై ముద్ర వేశారు :బొల్లా రామకృష్ణ శ్రీరామ్ రాజగోపాల్ కు అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇంతవకూ మమ్మల్ని కలుపుకుపోవడం లేదు :బొల్లా రామకృష్ణ నేను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు:బొల్లా రామకృష్ణ గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించా :బొల్లా రామకృష్ణ నేను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు :బొల్లా రామకృష్ణ టీడీపీ పార్టీ అందరిదీ.. తాతయ్య సొత్తు కాదు:బొల్లా రామకృష్ణ శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) నాపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి :బొల్లా రామకృష్ణ లేకపోతే నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా:బొల్లా రామకృష్ణ 09:15 AM, March 29th 2024 ‘సార్.. పురందేశ్వరి తీరుతో పార్టీ భ్రష్టుపట్టుకుపోయింది’ వాడి వేడిగా జరిగిన విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం బీజేపీ అగ్ర నేతలు అరుణ్ సింగ్, మధుకర్ జీ హాజరు మీటింగ్‌లోనే ఆ ఇద్దరిని నిలదీసిన బీజేపీ నాయకులు ఉత్తరాంధ్ర నుంచి సీఎం రమేష్, ఎన్ ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడంపై అసంతృప్తి ఓసి వెలమ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉత్తరాంధ్రలో సీట్లు ఎలా ఇస్తారని ఆగ్రహం పార్టీ కోసం కష్టపడ్డ మాధవ్, జివిఎల్, సోము వీర్రాజు సీట్లు కేటాయించకపోవడంపై మండిపాటు కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నల వర్షం పురందేశ్వరి తీరు వల్ల పార్టీ భ్రష్టుపట్టుకుపోయిందని ఫైర్ అయిన నేతలు ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో నాలుగో వంతు సీట్లు కమ్మ సామాజిక వర్గానికే కట్టబెట్టారని ఫిర్యాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేయలేమని స్పష్టం చేసిన బీజేపీ నేతలు ఒక్క అసెంబ్లీ స్థానం మహిళలకు కేటాయించక పోవడాన్ని తప్పు పట్టిన నేతలు 08:49 AM, March 29th 2024 నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కావలి, వింజమూరు బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ప్రజా గళం పేరిట ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత 08:21 AM, March 29th 2024 ఏప్రిల్ 7న పెందుర్తి లో పవన్ ప్రచారం ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ ప్రచారం షెడ్యూల్ ప్రకటన పెందుర్తి లేదా వేపగుంటలో పవన్ బహిరంగ సభ 07:48 AM, March 29th 2024 Memantha Siddham.. డే 3 షెడ్యూల్ మూడో రోజుకి చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర నేటి(మార్చి 29) సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ విడుదల చేసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరిక మధ్యాహ్నాం రాళ్లదొడ్డికి వద్ద భోజన విరామం ఆపై కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభకు చేరిక సాయంత్రం ఎమ్మిగనూర్ బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ చేరిక ఇవాళ రాత్రికి అక్కడి కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిన శిబిరంలో బస ఇదీ చదవండి: ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు 07:40 AM, March 29th 2024 రఘురామ.. కొత్త పాట ఇంకా నరసాపురం టికెట్ ఆశలు వదులుకోని రఘురామ కృష్ణంరాజు చంద్రబాబు తనకు అన్యాయం చేయరంటూ స్టేట్మెంట్ మోదీ, బాబు, పవన్‌లపై పూర్తి విశ్వాసం ఉందంటూ వ్యాఖ్యలు బీజేపీ ఢిల్లీ పెద్దలు తనకు బాగా క్లోజ్ అంటూ బిల్డప్పులు ఇచ్చే రఘురామ ఏపీ బీజేపీ అధిష్టానంతో మాత్రం పరిచయం, సాన్నిహిత్యం లేదంటూ సన్నాయి నొక్కులు అందుకే టికెట్ వచ్చి ఉండకపోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్య 07:35 AM, March 29th 2024 పచ్చ పార్టీ ప్రలోభాలు డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి పార్టీ నేతల కొనుగోళ్లు గ్రామస్థాయి నేతలకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు.. చోటా నేతలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు.. పార్టీలో చేరిన వారికి రూ.10వేల చొప్పున చెల్లింపులు అదే మండలస్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఆఫర్ అద్దంకి, పర్చూరు, రేపల్లెలోనూ టీడీపీ ప్రలోభాలు బాపట్ల, వేమూరులోనూ ఇదే పరిస్థితి ఓటర్లను నమ్మలేక నేతల కొనుగోలుకు సిద్ధపడిన వైనం బాపట్ల టీడీపీ అభ్యర్థి వర్మ కంపెనీ కంటైనర్‌లో పట్టుబడ్డ రూ.56 లక్షల నగదు ఆక్వా కంటైనర్ల మాటున పెద్దఎత్తున టీడీపీ నేతలు నగదు రవాణా! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 07:12 AM, March 29th 2024 మారని బాబు, మళ్లీ పాత హామీలే ప్రజాగళం రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ లీడర్లు మళ్లీ పాత హామీల లిస్టును చదివి వినిపించిన చంద్రబాబు ప్రతీ పొలంలో బిందు సేద్యం పెట్టిస్తాను సీమకు గోదావరి జలాలు తీసుకువస్తా రాయలసీమలో ప్రతి చెరువు నింపుతా యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తాను అందరికీ వర్క్ ఫ్రం హోం జాబ్‌లు ఇప్పిస్తాను ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు షర్మిల, సునీతలను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలను కూడా నేనే మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో ఇన్ని మార్పులు చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వానికి 58 నెలలు మాత్రమే పట్టింది. అయితే 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇందులో కనీసం 10 శాతం కూడా చేయలేదు. ఒకవేళ చేసుంటే ఎల్లోమీడియా, ఆయన భజనపరులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ ఇవన్నీ చేసిన నాకు దక్కిన బ… pic.twitter.com/9eGfucnFXQ — YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2024 సంబంధిత కథనం: అలా చేసుంటే ఎల్లో మీడియా ఆకాశానికెత్తేదే కదా! 07:06 AM, March 29th 2024 అనపర్తిలో TDP ఆగ్రహజ్వాలలు నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో భగ్గుమన్న అనపర్తి నల్లమిల్లికి జరిగిన అన్యాయంపై భగ్గుమన్న శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మండిపాటు పార్టీ కరపత్రాలు, జెండా, సైకిల్ దహనం టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బిజేపీ ఆఫీస్ ముందు కూర్చున్న పనతల సురేష్ సీటు ఇవ్వలేదంటూ అధిష్టానంపై వరదాపురం సూరి అసంతృప్తి కూటమిలో ఓవైపు ఆందోళనలు.. మరోవైపు సర్దుబాట్లు అనపర్తి తెలుగు తమ్ముళ్లతో చంద్రబాబు చర్చలు పరిస్థితి చక్కదిద్ధేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్ నల్లమిల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చంద్రబాబుతో నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితి, కార్యకర్తల ఆవేదనను వివరించిన నల్లమిల్లి పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే తనను బలిచేశారని అధినేతకు స్పష్టం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ‘మీకోసం తెగించి పోరాడిన అతికొద్ది మంది నేతలలో నేనూ ఒకడిని’ అని నల్లమిల్లి ఆవేదన నాలుగు దశాబ్దాలపాటు మా కుటుంబం మీ వెంటే ఉందన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయినా అన్యాయం చేశారన్న నల్లమిల్లి నేటి నుంచి కుటుంబంతో సహా జనంలోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయం వివరించి సింపథీ కోసం యత్నించనున్న నల్లమిల్లి 06:51AM, March 29th 2024 మేమంతా సిద్ధం.. ప్రభంజనం నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు జన సంద్రంలా నంద్యాల.. బహిరంగ సభకు పోటెత్తిన జనం నేడు కర్నూలు జిల్లాలో కొనసాగనున్న యాత్ర ఎమ్మిగనూరులో సాయంత్రం భారీ బహిరంగ సభ 06:42AM, March 29th 2024 అల్లూరి జిల్లా.. బాబుపై సీనియర్ల ఆగ్రహం ఇద్దరికీ నో టికెట్ బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరుగుతున్న అసంతృప్తి ఇటీవలే అబ్రహం ఫైర్.. అదే రూట్లో దొన్నుదొర తాడోపేడో తేల్చుకునేందుకు విజయవాడకు దొన్నుదొర అరకు అభ్యర్థిగా దొన్నుదొర పేరును మొదట్లోనే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు టికెట్ బీజేపీకి కేటాయించడంపై ఆగ్రహం 06:42AM, March 29th 2024 ‘తూర్పు’లో తలకిందులు! తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలు దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో మూడు ముక్కలైన టీడీపీ తలో దారీ వెతుక్కుంటున్న కూటమి నేతలు 06:30AM, March 29th 2024 ఓటుతో తలరాతను మార్చుకుందాం: సీఎం జగన్ నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్‌ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్ సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవ్వరూ చేయని మార్పులు మనం చేశాం 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్లెదుటే కన్పిస్తోంది పిల్లల భవిష్యత్‌కు దారి చూపాం.. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందాం నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం కార్యక్రమం సూపర్ సక్సెస్🔥#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/PZvGGLdvde — YSR Congress Party (@YSRCParty) March 28, 2024 -
పేదల తలరాతలు మార్చే ఎన్నికలివి : సీఎం వైఎస్ జగన్
సాక్షి, నంద్యాల : వైఎస్సార్సీపీ 58నెలల పాలనలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోయాయని, ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మారాయి. సర్కారు స్కూళ్లలో డిజిటల్ బోధన వచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతూ పేదవాడికి ఆరోగ్య పరీక్షలతోపాటు మందులు కావాలన్నా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నాం’ అని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలను అందజేస్తున్నామన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆళ్లగడ్డలోని రాత్రి బస ప్రాంతం నుంచి గురువారం ఉదయం మొదలైంది. అక్కడి నుంచి సీఎం జగన్ ఉదయం 11 గంటల సమయంలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని రైతులు, వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని మాట్లాడారు. ప్రతి అక్కచెల్లెమ్మ తమ సొంత కాళ్లమీద నిలబడేలా రుణాలు, ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నాం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ దిశ యాప్ తీసుకొచ్చాం. ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలను నిమిషాల వ్యవధిలో ఆదుకుంటున్నాం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశామని గొప్పలు చెప్పుకునే వారు ఏ రోజూ కనీసం ఆలోచన చేయని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల వ్యవధిలో గొప్ప మార్పులు తెచ్చాడు. వ్యవస్థల్లో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను గమనించండి. ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయండి. దేవుడి దయవల్ల ఇంత మంచి చేయగలిగాం. వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మీరు సలహాలు ఇవ్వవచ్చు. అందరికీ ఓ విన్నపం.. ఎన్నికల కోడ్ కారణంగా పథకాలకు ఆటంకం తలెత్తకుండా ఈ మధ్య కాలంలో ఈబీసీ నేస్తం, చేయూత బటన్లు నొక్కాం. ఇది వరకు వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కోడ్ కారణంగా పది రోజులు అటు ఇటుగా పథకాల లబ్ధి నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవుతుంది. దీని గురించి ఆందోళన చెందవద్దు. చిన్న పిల్లాడు చేసిన పనులు..మీరెందుకు చేయలేదు? నేను చాలా చిన్న పిల్లాడిని. మన ప్రభుత్వం కంటే ముందు మీరు చాలా ప్రభుత్వాలను చూశారు. నాకన్నా వయసులో పెద్దోళ్లు, ఎంతో అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే వారు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక నా కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన పరిపాలన చేశారు. ఆయన ఏకంగా 14 ఏళ్లు పాలించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను వయసులో ఆయన కంటే చాలా చిన్నోడిని. నేను ఒకటే అడుగుతున్నా. ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశారా? మీరంతా దీనిపై ఆలోచన చేయాలి. ఈ రోజు ఏ రకంగా మన బతుకులు, జీవితాలు మారాయి? ఏ రకంగా వ్యవస్థల్లో మార్పులు తేగలిగాం? అనే విషయాలను అందరూ ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. రైతన్నకు ప్రతి అడుగులో అండగా.. ప్రతి రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. రైతన్నల కోసమే ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. గత పాలనలో బ్యాంకులలో పంట రుణాలు అందకుంటే ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలో తెలియని దుస్థితి. అలాంటిది ఈ రోజు గ్రామంలోనే ఆర్బీకేలను తీసుకొచ్చి ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, పంట నష్టపోతే సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నాం. రైతన్నకు పెట్టుబడి సాయంగా రూ.13,500 చొప్పున మీ బిడ్డ హయాంలోనే అందుతోంది. మీ కుటుంబంతో చర్చించండి.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. ఓటు వేయలేదని వివక్ష చూపించలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధిని అందజేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు వచ్చాయి. విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు మీడియంతో ప్రచురించిన పుస్తకాలను పిల్లలకు అందజేస్తున్నాం. విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఉచితంగా ఇస్తున్నాం. మీరంతా ఒక్కసారి ఇంటికి వెళ్లి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో సాకారమైన మార్పులను గమనించండి. ఇది కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలు. అందరూ ఇంటికి వెళ్లాక ఒక్కసారి మీ భార్య, పిల్లలు, ఇంట్లో అవ్వాతాతలతో మాట్లాడండి. అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. నేడు ఎమ్మిగనూరులో సీఎం జగన్ సభ సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజైన శుక్రవారం కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. బస్సు యాత్ర శుక్రవారం షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ పెంచికలపాడు నుంచి బయలుదేరి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు. ఆ ప్రాంతంలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకొని మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్‌కు దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. ఒక్క ఊరికే రూ.49 కోట్ల ఉపకారం కేవలం ఒక్క ఎర్రగుంట్ల గ్రామానికే 58 నెలల వ్యవధిలో వివిధ పథకాల ద్వారా డీబీటీతో రూ.49 కోట్ల మేర లబ్ధి చేకూర్చగలిగాం. ఈ గ్రామంలోని రెండు సచివాలయాల పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది లబ్ధిదారులున్నారు? ఎవరెవరికి ఏయే పథకాలు అందాయి? అనే విషయాలను కాసేపటి క్రితమే అడిగి తెలుసుకున్నా. గ్రామంలో 1,496 ఇళ్లు ఉండగా, 1,391 ఇళ్లకు ప్రభుత్వ పథకాల ద్వారా రూ.48,74,34,136 అందాయి. 93 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందాయి. ఒక్క ఈ ఊరులోనే వైఎస్సార్ పెన్షన్ కింద రూ.16.52 కోట్లు పంపిణీ చేశాం. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.6.81 కోట్లు, అమ్మఒడితో 1,043 మంది తల్లులకు రూ.4.69 కోట్లు అందజేశాం. వైఎస్సార్ ఆసరా కింద రూ.3.88 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 492 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2.96 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 837 మందికి రూ.2.46 కోట్లు, హౌసింగ్ కింద రూ.2.75 కోట్లు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2.24 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీతో రూ.1.13 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.కోటి, సున్నా వడ్డీ కింద రూ.86 లక్షలు, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.67 లక్షలు, జగనన్న తోడు కింద ఇచ్చిన రుణాలు రూ.41.30 లక్షలు, చేదోడు కింద రూ.40 లక్షలు, కాపు నేస్తం కింద రూ.31 లక్షలు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.21.48 లక్షలు అందజేశాం. మీ బిడ్డ గత 58 నెలల వ్యవధిలో ఒక్క గ్రామానికే ఇంత మంచి చేశాడనే విషయాన్ని గమనించాలని కోరుతున్నా. వీటితోపాటు గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ కింద మరింత అదనంగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా ఎవరూ లంచం అడగడం లేదు. అర్హత ఉంటే చాలు పారదర్శకంగా ప్రయోజనాన్ని అందిస్తున్నాం. చివరిగా.. ఈ ముఖాముఖిలో వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. సమయాభావం వల్ల అందరికీ మాట్లాడే అవకాశం దొరకలేదు. మీ అందరికీ స్లిప్పులు ఇచ్చాం. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అందులో రాసి బాక్సులో వేస్తే నా దగ్గరికి వస్తాయి. వ్యవస్థను ఇంకా బాగుపరిచే సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులను సీఎం జగన్ చేసి చూపించారు. తెలంగాణలో నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయాలని తలపెట్టి చేతులెత్తేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సర్కారు బడుల రూపురేఖలు మార్చి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. – హుసేన్‌బాషా, ఎర్రగుంట్ల ఎన్నో పథకాలు అందించారు నాలాంటి వారికి అన్నగా, పిల్లలకు మేనమామలా, అవ్వాతాతలకు మనవడిగా ఎంతో మందికి కుమారుడిగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధిస్తారు. – పుష్పలత, ఎర్రగుంట్ల రూ.5 లక్షలు బీమా వచ్చింది మా అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందింది. నాలుగుసార్లు అమ్మ ఒడి పథకం వర్తించింది. అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారు. – పద్మావతి, గోవిందపల్లె స్కూళ్ల రూపురేఖలు మార్చారు ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా తీర్చిదిద్దారు. ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తున్నారు. గతంలో మా పాఠశాలకు ప్రహరీ లేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. మరుగుదొడ్ల వసతి కల్పించారు. గోరుముద్ద ద్వారా చిక్కీలు, గుడ్లు, రాగిజావతో ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నారు. – చర్విత, విద్యార్థిని, శిరివెళ్ల ఆదుకున్న సీఎంఆర్ఎఫ్.. నా కుమారుడికి చిన్న వయసులోనే గుండెకు రంధ్రం పడి పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తింది. ఆపరేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆపరేషన్ చేశారు. నా కుమారుడు బతికి బయటపడ్డాడంటే సీఎం జగన్ చలవే. ఆయనే మళ్లీ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – నాగరాజు దంపతులు, ఎర్రగుంట్ల పాదయాత్ర హామీలన్నీ నెరవేర్చారు చంద్రబాబు 600కిపైగా హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌కు మాత్రమే దక్కుతుంది. మాకు మళ్లీ అధికారం ఇస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం, పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు ఆర్థిక చేయూతనందిస్తామని చెబుతున్నాం. కానీ, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో ఒక్కసారి గమనించండి. ఒకరేమో తమ దగ్గర ఎర్ర పుస్తకంలో పేర్లు రాసుకున్నామని, అధికారంలోకి వస్తే వారి అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఇంకొకరేమో తాము అధికారంలోకి వస్తే మీరంతా గుడుల్లో, బడుల్లో దాక్కోవాలంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పగటి కలలు కనడం మానండి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేది జగనే. – గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈ రోజు ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ జనం కోసం నిలబడిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో ప్రజల బాధలు విన్నారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం అలాగే ఉండాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యుల జెండాను, అణగారిన వర్గాల అజెండాను మోసుకుంటూ, నడుచుకుంటూ వచ్చారు. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు తగిన సమయం వచ్చింది. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ రెండో రోజు యాత్ర సాగిందిలా.. మేమంతా సిద్ధం అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. ♦ రాత్రి బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9.40 గంటలకు సీఎం జగన్ బయటకు వచ్చారు. ♦ 9.45 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు మీదుగా ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ♦ 11.10 గంటలకు ఎర్రగుంట్ల గ్రామంలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖిలో పాల్గొని ప్రసంగించారు. ♦ 12.50 గంటలకు సభ నుంచి బయటకు వచ్చి వెంకటాపురం, శిరివెళ్ల మెట్ట మీదుగా దీబగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ♦ మధ్యాహ్నం 2 గంటలకు దీబగుంట్ల వద్ద ఎమ్మెల్యే శిల్పా రవి పుష్పగుచ్చాలు అందజేసి నంద్యాల నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. ♦ 2.40 గంటలకు చాబోలు వద్ద భోజన విరామం కోసం ఆగారు. ♦ సాయంత్రం 4.40 గంటలకు చాబోలు నుంచి రైతు నగరం క్రాస్ మీదుగా బొమ్మలసత్రం ఫ్లై ఓవర్ మీదుగా ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభ వద్దకు 5.30 గంటలకు చేరుకున్నారు. ♦ 5.40 గంటల నుంచి 7.10 వరకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ♦ 8.10 గంటలకు ఆర్జీఎం కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థులకు అభివాదం చేశారు. ♦ 9.40 గంటలకు పాణ్యం, సుగాలిమెట్ట, హుసేనాపురం, ఓర్వకల్లు మీదుగా నన్నూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ♦ పెద్దటేకూరు, మార్కాపురం క్రాస్ మీదుగా రాత్రి 11.06 గంటలకు బస చేయనున్నపెంచికలపాడుకు చేరుకున్నారు. -
చీకటి యుద్ధాన్ని 'ఎదుర్కొందాం': సీఎం జగన్
మేనిఫెస్టో అంటే ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో వేసే సంస్కృతి చంద్రబాబుది. మనం మాట చెబితే బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99 శాతం హామీలు అమలు చేసి చూపించాం. ఈ మార్పుల్లో 10 శాతం లేదా 5 శాతం అయినా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో తీసుకొచ్చారా? మనం చేసిన దాంట్లో కనీసం 5 శాతం చంద్రబాబు చేసి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, ఎల్లో మీడియా, ఆయన మనుషులు మా బాబుకు ఒకటి కాదు పది రంగాల్లో నోబెల్ ప్రైజులు, 4 ఆస్కార్లు, మెగసెసే అవార్డులు ఇవ్వాలనే వారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు.. ఇద్దరూ కలిసి వచ్చి చంద్రబాబుకు శాలువా కప్పాలని ప్రచారం చేసేవారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షిప్రతినిధి, కర్నూలు: పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు మాటలను పొరపాటున కూడా నమ్మొద్దని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సూచించారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సైనికులేనన్నారు. చీకటి రాతలు రాసేందుకు మనకు ఈనాడు, ఏబీఎన్, టీవీ–5.. ఇంకా ఇలాంటి వారు తోడు లేరని.. ఎల్లో ఛానెల్స్, పత్రికలను బాబులాగా పోషించలేదని చెప్పారు. అందువల్ల సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్ అని, ఒక ఛానల్ ఓనర్ అని దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఎదుర్కోవాలని చెప్పారు. మనందరి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రతి ఇంటా వివరించాలని కోరారు. పేదవాడి భవిష్యత్‌కు అండగా నిలబడేందుకు, మంచి చేసిన మన ప్రభుత్వానికి తోడుగా ఉండేందుకు, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలిపించేందుకు, రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మళ్లీ మనమంతా సిద్ధమై ఈ చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందామని చెప్పారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ గురువారం ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. జనం గుండెల్లో గుడి కట్టుకున్న మనల్ని ఎదుర్కొనేందుకు వారు జెండాలతో జత కట్టారని.. సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు తరలి వచ్చిన ప్రజా సైన్యంతో నంద్యాల ఒక సముద్రంలా మారి ‘సిద్ధం’ అంటోందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. డబుల్ సెంచరీ సర్కారును స్థాపిద్దాం ► గతంలో చంద్రబాబు అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత.. అందుకు భిన్నంగా ఐదేళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత.. ఒక నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాము సింహాసనం ఎక్కుతామంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో, అలాగే నారా వారి పాలన మళ్లీ తీసుకువస్తానంటే ఒప్పుకోం అంటూ నంద్యాల నుంచి ఏలూరు వరకు, కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజలంతా నినదిస్తున్నారు. ► ప్రజల రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, మహిళ, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడతామని మూడు పార్టీలు చూస్తున్నాయి. వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా ‘అదృశ్య హస్తం’గా తోడుగా ఉంది. ఇటువైపు చూస్తే జగన్ ఒకే ఒక్కడు. అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు వీరికి తోడు బీజేపీ. పరోక్షంగా మరో పార్టీ కాంగ్రెస్. వీరు సరిపోనట్లు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5. ఇంతమంది కేవలం ఒకే ఒక జగన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. వీరిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? (సిద్ధమే అని జనం నినాదాలు చేశారు). ► పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటిలోకి తీసుకుపోదామని పొత్తులమారి, జిత్తుల మారి, ఎత్తులమారి పార్టీలన్నీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు అందరం సిద్ధమవుదాం. మరోసారి ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేసి, వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 స్థానాలు మొత్తంగా 200 స్థానాలు సాధించి డబుల్ సెంచరీ సర్కారును స్థాపించేందుకు సిద్ధమవుదాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ► మీ జగన్ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వం తీసుకురాని మార్పులను తీసుకువచ్చాడని గర్వంగా చెబుతున్నా. మీ గ్రామంలోనే మార్పు కన్పిస్తోంది. ఈ రోజు గ్రామంలోకి, పట్టణంలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం.. అందులో పది మంది అదే ఊరి పిల్లలు పని చేస్తూ కనిపిస్తారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే సెలవైనా, ఆదివారమైనా వలంటీర్లు అవ్వాతాతల వద్దకు వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ► రైతు భరోసా కేంద్రం, నాడు–నేడు ద్వారా మారిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, విలేజ్ క్లినిక్‌లు కన్పిస్తాయి. బర్త్ సర్టిఫికెట్, పింఛన్, రేషన్‌కార్డు లాంటి ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ వెళ్లి తలుపుతట్టి అందిస్తున్న పాలన మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతే జరుగుతోంది. ► రూ.2.70 లక్షల కోట్లు బటన్‌నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూపాయి లంచం, వివక్ష లేకుండా అర్హులకు పథకాలు అందించాం. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, పింఛన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్నతోడు, చేదోడు, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా అందిస్తున్నాం. ► అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌ను పెట్టాం. బటన్ నొక్కితే చాలు, ఆపదలో ఉంటే పది నిమిషాల్లో పోలీసులు నేరుగా వచ్చి ఆదుకుంటున్నారు. ► నాడు–నేడులతో ప్రభుత్వ బడులను మార్చింది.. గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లీషు మీడియం, బైజూస్ కంటెంట్, పిల్లల బైలింగ్వల్ పుస్తకాలు, ట్యాబ్‌లు, తరగతి గదుల్లో ఐఎఫ్బి ప్యానల్స్, డిజిటల్ తరగతులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ సిలబస్, ఐబీ ఇలాంటివన్నీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే వచ్చాయి. వైద్య, వ్యవసాయ రంగంలో సమూల మార్పులు ► వైద్య రంగంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏకంగా 54 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది రిక్రూట్ అయ్యారు. నాణ్యమైన మందులు అందిస్తున్నాం. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్నున్నాం. నంద్యాలలోనూ మెడికల్ కాలేజి కన్పిస్తోంది. ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏకంగా 2,300 రోగాలకు వర్తించేలా తీసుకెళ్లాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ► ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబితే, నెలకు రూ.5 వేల చొప్పున ఆరోగ్య ఆసరా ద్వారా సాయం చేస్తున్నాం. గ్రామ స్థాయిలో 10,600 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, అర్బన్ హెల్త్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. కొత్తగా 108, 104 వెహికల్స్ 1500 కొనుగోలు చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్‌లను డాక్టర్లతో అనుసంధానం చేశాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. పేదవాడికి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నాం. ఇవన్నీ మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగాయి. ► రైతన్నలకు ఏటా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.13,500 ఇస్తూ, ఈ ఐదేళ్లలో రూ.67,500 అందించాం. 10,778 ఆర్బీకేలు విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నకు తోడుగా పని చేస్తున్నాయి. పగటిపూటే 9గంటల నాణ్యమైన విద్యుత్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, చంద్రబాబు మూసేసిన చిత్తూరు డెయిరీ లాంటివి తెరిపించాం. అమూల్ ద్వారా పాడి రైతులకు తోడుగా నిలవడం ద్వారా లీటర్‌పై రూ.10–20 దాకా అదనంగా వచ్చేలా చేశాం. 22–ఏ కింద నుంచి తొలగించి 19.17 లక్షల మంది రైతులకు 34.75 లక్షల ఎకరాల్లో పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. సామాజిక న్యాయంలో సువర్ణాధ్యాయం ► సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం. తొలిసారి నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి 50 శాతం పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. మంత్రి మండలి నుంచి 68 శాతం పదవులు ఈ వర్గాలకు ఇచ్చాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు అదనంగా 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వీటిలో 80 శాతం నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. ► అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతో పాటు కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. రూ.16 వేల కోట్లతో 4 సీపోర్టులు, రూ.3,800 కోట్లతో పది షిషింగ్ హార్బర్లు కడుతున్నాం. రాష్ట్రంలో 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు కన్పిస్తున్నాయి. 11 వేల ఆర్బీకేలు ఉన్నాయి. 11 వేల విలేజ్ క్లినిక్‌లు ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టం. బాబు ధ్యాసంతా దోచుకోవడమే.. ‘రాజకీయాల్లో నాయకుడు అంటే ‘అదిగో మా నాయకుడు’ అని కాలర్ ఎగరేసుకుని చెప్పేలా ఉండాలి. విలువలు, విశ్వసనీయత అనే పదానికి అర్థం ఉండాలి. మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికీ, ఏ గడ్డి అయినా తినేందుకు సిద్ధంగా ఉండే నాయకులు ఈ రాష్ట్రానికి కావాలా? ఇవాళ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ. లక్షలు కన్పిస్తాయి. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ మీ ఖాతాల్లో జమ చేశాడని గర్వంగా చెబుతున్నా. చంద్రబాబు ఇలా ఎందుకు చేయలేదంటే.. ఆయన ధ్యాసంతా దోచుకోవడం, పంచుకోవడమే. మంచి జరిగింది మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే. మంచి చేసిన జగన్ మీ అందరిని నమ్ముకుని ఎన్నికల బరిలో ఉంటే, చెడు చేసిన బాబు పొత్తులు, కుట్రలు, మోసాల్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు’ అని సీఎం జగన్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు బుగ్గన, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, బిజేంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సు«దీర్, కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలను గెలిపించాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఇందులో ఒక్కటైనా నెరవేర్చారా? ► ఈ కరపత్రంలో చంద్రబాబు సంతకం ఉంది. మోడీ ఫొటో ఉంది. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ఫొటో ఉంది. 2014లో ఈ కరపత్రంతో పాటు ఇందులోని హామీలను టీవీల్లో ఊదరగొట్టారు. ► రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు, రైతుల రుణ మాఫీ చేశాడా? ► డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నారు. రూ.14,205 కోట్లు. ఒక్కరూపాయి అయినా చేశారా? ► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నారు. మీ ఇంట్లో లేదా పక్కింట్లో పుట్టిన ఏ ఆడబిడ్డకైనా డిపాజిట్ చేశారా? ► ఇంటింటికీ ఉద్యోగం.. లేదంటే రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తానన్నారు. 60 నెలల్లో ప్రతి కుటుంబానికి 1.20 లక్షలు ఇవ్వాలి. ఇచ్చారా? ► అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు ఇస్తానన్నారు. ఒక్కరికైనా ఒక సెంటయినా ఇచ్చారా? ► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్, మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సింగపూర్‌కు మించి రాష్ట్రం అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు. ఈ హామీలన్నీ 2014లో మోడీ, చంద్రబాబు, దత్తపుత్రుడి ఫోటోతో పంపారు. ఇందులో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ప్రత్యేక హోదా ఇచ్చారా? (లేదు.. లేదు.. అని ప్రజలు నినాదాలు) ఇవన్నీ ఇవ్వకపోగా సూపర్ సిక్స్.. సెవెన్ అంటూ రంగురంగుల మేనిఫెస్టోతో మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ► మనం చేసిన మంచిలో కనీసం 5 శాతం అయినా చంద్రబాబు చేసి ఉంటే.. ఇదే ఎల్లో మీడియా చంద్రబాబు కంటే మరో నాయకుడు ప్రపంచంలో లేరని ఢంకా బజాయించేవారు. మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏదో తెలుసా! పేదల గుండెల్లో సంతోషం. వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం, పిల్లల చదువుల్లో విప్లవం, వారి కుటుంబాల్లో సాధికారత, అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు.. ఇవీ జగన్‌కు కావల్సిన అవార్డులు, రివార్డులు. వీటి కోసమే జగన్ ఆరాట పడతాడు. ప్రయాస పడతాడు. ► 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీం కూడా గుర్తుకు రాదు. ఆయన వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మాత్రం అందరికీ తెలుసు. బాబు పేరు చెబితే వ్యవసాయం దండగ, బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు, రుణామాఫీ అని రైతులను నిలువునా ముంచేయడం, బాబు వస్తే కరువొస్తుందనే నానుడి, రెయిన్‌గన్‌తో కరువును జయించిన ఓ పిట్టలదొర గుర్తుకు వస్తాడు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలనే మాటలు గుర్తుకు వస్తాయి. -
అనపర్తిలో ఆగ్రహ జ్వాల! స్పందించని బాబు తీరు..
తూర్పుగోదావరి: నోటి దగ్గర కూడు లాగేసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకుంటే వారికి ఎంత కోపం వస్తుంది? సరిగ్గా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ఆరంభించారు. తదనంతర పరిణామాల్లో టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరింది. చంద్రబాబు వెళ్లి బీజేపీ నేతలతో బేరసారాలు సాగించడమే కాకుండా.. వారడిగిన స్థాయిలో సీట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనపర్తి సీటును బీజేపీకి సమర్పించుకున్నారు. దీంతో తాజాగా ఇక్కడి నుంచి విపక్ష కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ములగపాటి శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించారు. కనీసం రామకృష్ణారెడ్డికి మాటమాత్రంగా కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ పరిణామాలు అనపర్తి టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకోవడంతో వారు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా రచ్చ వాస్తవానికి అనపర్తి టికెట్టుపై నియోజకవర్గ టీడీపీలో నాలుగు రోజులుగా రచ్చ జరుగుతోంది. ఈ సీటును బీజేపీకి కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో కొద్ది రోజులుగా టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను వారు అడ్డుకున్నారు. తొలిగా బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయవద్దంటూ నిలిపివేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులకు రాజీనామాలు చేస్తూ సోమవారం రాజమహేంద్రవరంలో ఉన్న టీడీపీ జోన్–2 కో ఆర్డినేటర్ రావు వెంకట సుజయ కృష్ణ రంగారావుకు లేఖలు అందజేశారు. అలాగే మంగళవారం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ధర్నా చేశారు. బుధవారం పెదపూడిలో నిరసన చేపట్టారు. అదే రోజు సాయంత్రం బీజేపీ అభ్యర్థిగా శివరామ కృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. ఈ క్రమంలో రామవరంలోని ఆయన నివాసానికి టీడీపీ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికై నా టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి, రామకృష్ణారెడ్డికే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోస్తున్న నల్లమిల్లి కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కట్టప్ప రాజకీయాలు చేయద్దంటూ చంద్రబాబును తీవ్రంగా దూషించారు. టీడీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలు, పార్టీ జెండాలను కుప్పగా పోసి తగులబెట్టారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇన్నాళ్లూ తాను పడిన కష్టం నిష్ప్రయోజనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తిరిగి ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంత తంతు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు కానీ, ఇతర పెద్దలు కానీ స్పందించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపండి అనపర్తి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి దిగజారుడు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం కేటాయించకపోతే ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలే తప్ప, రామవరంలో చేస్తే ఉపయోగమేమిటని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి పొత్తుల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించడం ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని, చంద్రబాబు నిర్ణయమని అన్నారు. తనకు టికెట్టు రాకుండా స్థానిక వైఎస్సార్ సీపీ కుట్రలు చేస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించడం.. ఆడలేక మద్దెల ఓడు సామెతను గుర్తు చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా తనకు తగిలే ఎదురు దెబ్బను వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆపాదించడం రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తనకు టికెట్టు రాకుండా వైఎస్సార్ సీపీ నేతలు రూ.20 కోట్లకు బేరసారాలు నడిపారంటూ ఆయన పేర్కొనడం విడ్డూరంగా ఉందని, ఎవరైనా అధిక మొత్తంలో నగదు ముట్టజెపితే అమ్ముడుపోయే స్థితిలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారా అని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ల కిందట బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో చేసిన అసత్య ప్రమాణం, ఇటీవల అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారికి సంబంధించి అవహేళనగా మాట్లాడిన ఫలితమే నేడు రామకృష్ణారెడ్డికి పట్టిన దుస్థితి అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని కర్మఫలాలు అనుభవించక తప్పదని కృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ వారా కుమారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇవి చదవండి: బాబు పొత్తు ధర్మం చిత్తు చిత్తు? -
మనసున్న మారాజు.. మత్స్యకారుల్లో వెలుగులు
సాక్షి, విశాఖపట్నం, అచ్యుతాపురం: మత్స్యకారులపై మమకారంతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి పట్ల మరోసారి ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే మత్స్యకారుల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల భృతి, లీటర్‌పై రూ.9 డీజిల్ సబ్సిడీ, 50 ఏళ్లకే పెన్షను, వేట సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల పరిహారం వంటి పలు ప్రయోజనాలను చేకూరుస్తున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటున్నారు. గత నవంబర్ 19 అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. బాధిత బోటు యజమానులకు మూడు రోజుల్లోనే భారీ మొత్తంలో రూ.7.11 కోట్ల పరిహారాన్ని అందజేశారు. ఈ బోట్లపై ఆధారపడ్డ కలాసీలు 400 మంది జీవనోపాధి కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెల్లించారు. ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించడంపై బాధిత మత్స్యకారులు ఎంతగానో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమకు ఈ మేళ్లన్నీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయన్న ఆనందంలో ఉన్నారు. మత్స్యకారులపై మమకారం గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సముద్రంలో మ త్స్యకారుల బోట్లు కాలిపోయినా, మునిగిపోయి నా, తుపాన్లలో దెబ్బతిన్నా పరిహారం సక్రమంగా ఇచ్చేవారు కాదు. ఇచ్చే అరకొర సాయం కూడా ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు భిన్నంగా మత్స్యకారులపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారికొచ్చే కష్టాలపై తక్షణమే స్పందించి ఉదారంగా సాయమందిస్తున్నారు. టీడీపీ హయాంలో మునిగిన, అగ్ని ప్రమాదానికి గురైన, తుపాన్లలో దెబ్బతి న్న బోట్లకు కూడా పరిహారం అందించేలా చూడాల ని బాధిత మత్స్యకారులు తాజా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కోరారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం బాధిత మత్స్యకారులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వివిధ ప్రమాద ఘటనల్లో దెబ్బతిన్న 36 బోట్లకు రూ.1.35 కోట్ల నిధులు విడుదల చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ నిధులు జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమయ్యాయి. జగనన్న ప్రభుత్వం ఆదుకుంది చేపల వేటే నాకు జీవనాధారం. నేను భార్య, ముగ్గురు పిల్లల్ని పోషించాలి. చేపల్ని పట్టి అమ్ముకుంటే వచ్చే సొమ్ము జీవనానికే సరిపోతుంది. వేట నిషేధ సమయంలో అక్కరకొస్తుందని ఆదా చేద్దామనుకుంటే ఎప్పుడూ వీలయ్యేది కాదు. జగనన్న ప్రభుత్వం వేట నిషేధ సమయంలో రూ.10 వేల మత్స్యకార భరోసా అందిస్తోంది. దాంతో నా కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించగలుగుతున్నాను. డీజిల్ కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాను. –గనగళ్ల దేముడు, పూడిమడక గ్రామం, అచ్యుతాపురం మండలం చంద్రబాబు హయాంలో పస్తులే వేటకెళితేనే కడుపు నిండేది. లేకుంటే పస్తులే. చంద్రబాబు హయాంలో మత్స్యకార భృతి ఎప్పుడో ఇచ్చేవారు. అది కూడా రూ.4 వేలు. వేట నిషేధ సమయంలో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సివచ్చేది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకార భరోసా కింద రూ.10 వేల పరిహారం నిషేధ కాలంలోనే ఇవ్వడంతో కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగపడు తోంది. నాకు ఒక బోటు ఉండడంతో సబ్సిడీపై డీజిల్ అందిస్తున్నారు. ఇది నాకు ఎంతో ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది. –చోడపల్లి సింహాచలం, తంతడి గ్రామం, అచ్యుతాపురం మండలం దెబ్బతిన్న బోట్లు 2014–2019 మధ్య కాలంలో మొత్తం 36 బోట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 21 బోట్లు సముద్రంలో మునిగిపోగా, నాలుగు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఐదు నీటి అడుగున చిక్కుకుపోయాయి. మరో ఆరు బోట్లు ఫిషింగ్ హార్బర్లో ప్రమాదాల పాలై పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఇందులో 2014 హుద్‌హుద్ తుపానుకు మునిగిపోయిన రెండు బోట్లకు, 2018 తిత్లీ తుపానులో మునిగిన మూడు బోట్లకు, 2019 పెథాయ్, జావద్ తుపాన్లకు మునిగిపోయిన 11 బోట్లకు టీడీపీ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో దెబ్బతిన్న బోట్లకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాయమందిస్తుండడంపై మనసున్న మారాజు అంటూ సీఎం జగన్‌ను మత్స్యకారులు కొనియాడుతున్నారు. ఆయన రుణం తీర్చుకుంటామని పేర్కొంటున్నారు. -
చంద్రబాబు ఝలక్‌తో తలో దారి!
అల్లూరి సీతారామరాజు: అరకు పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. క్షుద్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన చంద్రబాబు నిర్ణయాలను పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అరకు పార్లమెంట్ టికెట్ బీజేపీకి కేటాయింపు.. టీడీపీలో సీనియర్లను పక్కనబెట్టి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం వంటి పరిణామాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల పరిస్థితి తలోదారి అన్నట్టుగా ఉంది. అరకు పార్లమెంట్ టికెట్‌ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం వారికి మింగుడు పడటం లేదు. ఏమాత్రం ఉనికి లేని బీజేపీకి టికెట్ ఎలా కేటాయిస్తారని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కూటమి (బీజేపీ) అభ్యర్థి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు మద్దతుగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ తరఫున అరకు ఎంపీగా గెలుపొందిన ఆమె పార్టీకి దూరంగా ఉంటూ స్వప్రయోజనాలకోసం ఐదేళ్ల పదవిని వాడుకున్నారని, నియోజకవర్గంలో ఎన్నడూ కనిపించని ఆమె తరఫున ఎలా ప్రచారం చేయాలని వారు మదనపడుతున్నారు. ఆమైపె ఆర్థికపరమైన అంశాలతోపాటు ఎస్టీ కాదని కేసులు ఉన్నాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె కోసం ప్రచారం చేయలేమని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు బహిరంగంగానే చెబుతున్నారు. మొదటి నుంచి ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీకి పట్టు ఎక్కువ. పార్టీ ఫిరాయించిన నాటి నుంచి కొత్తపల్లి గీతపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించిన వంతల రాజేశ్వరి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పారు. ఇదే పరిస్థితి కొత్తపల్లి గీతకు కూడా తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ శ్రేణులు మొరపెట్టుకున్నా.. రంపచోడవరం అసెంబ్లీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నాయకత్వంలో ఆందోళన చేసినప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేదు. పార్టీలో సీనియర్లను కాదని మిరియాల శిరీష దేవికి ఎలా టికెట్ ఇస్తారని, దీనివల్ల నష్టం జరుగుతుందని పార్టీ శ్రేణులు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. నెలరోజుల క్రితం పార్టీలోకి వచ్చిన ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు అనుచరులు బహిరంగంగా విమర్శించారు. టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషదేవి భర్త భాస్కర్‌కు సంబంధించిన కేసుల వివరాలను టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు స్వయంగా చంద్రబాబుకు అందజేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసగించినట్టుగా ఆయనకు వివరించారు. ఈ పరిస్థితుల్లో శిరీషదేవిని అభ్యర్థిగా కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్పదని తెలియజేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. రెబల్‌గా బరిలోకి? చంద్రబాబు ఇచ్చిన ఝలక్‌తో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఇంటికే పరిమితమయ్యారు. టీడీపీ తనకు రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చినప్పటికీ వైఎస్సార్సీపీని విడిచి వెళ్లేది లేదని అప్పటిలో ప్రకటించిన వంతల రాజేశ్వరి ఆ తరువాత పార్టీ ఫిరాయించడంపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే ఆమె ఓటమికి కారణమైంది. అప్పటిలో పార్టీ మారేదిలేదని ఆమె ప్రకటించిన దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలావుండగా ఎన్నికల్లో టీడీపీ రెబల్‌గా పోటీచేయాలా లేదా అనే దానిపై వంతల రాజేశ్వరి అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇవి చదవండి: కాలవ మోసం.. ఇదే సాక్ష్యం! -
చంద్రబాబు ఎత్తులకు తెలుగు తమ్ముళ్లు తుస్!!
సాక్షి రాయచోటి: తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆవిర్భావం నుంచి అండగా ఉంటున్న వారికి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు దాపురించాయి. ‘కష్టకాలంలో అండగా ఉన్నారు...అన్ని విధాల ఆదుకోవడంతోపాటు టికెట్ కూడా మీకే’ అంటూ ఊసరవెళ్లి మాటలతో పార్టీ పెద్దలు బురిడీ కొట్టించారు. పొత్తుల మాయో...లేక బాబు జిత్తులో...డబ్బుల మూటలు తీసుకురాలేరనో గానీ... ఆది నుంచి ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో శృంగభంగం తప్పలేదు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల కొత్త అభ్యర్థులను తెరమీదికి తేవడంతో గరంగరంగా ఉన్న ‘దేశం’ శ్రేణులకు తాజాగా రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్లోనూ అలజడి ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లాలో అధికంగా ముస్లిం మైనార్టీ వర్గాలు ఉన్న నేపధ్యంలో ఎన్నికల్లో దెబ్బ తగులుతుందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. ‘సుగవాసి’ కుటుంబానికి ఎగనామం రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారులు సుగవాసి బాలసుబ్రమణ్యం, సుగవాసి ప్రసాద్‌బాబు టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సుగవాసి బాలసుబ్రమణ్యంకు రాజంపేట పార్లమెంటు సీటు కేటాయించినట్లు అంతర్గతంగా చెప్పడంతో ఆయన రెండు నెలలుగా అనునిత్యం తిరుగుతున్నారు. పార్లమెంటు అభ్యర్థిగా తనను బలపరచాలని జిల్లాలో తిరుగుతూ...మరోవైపు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి అప్పజెప్పడంతో కాపు సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే సుగవాసి వర్గీయులు సంబంధిత పార్టీ కార్యాలయాల వద్ద టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా తొలగించారు. మదనపల్లె, రాయచోటిలోనూ అంతర్గత పోరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లోనూ టీడీపీ అంతర్గతపోరుతో సతమతమవుతోంది. మదనపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షాజహాన్‌బాషాను ప్రకటించడంతో అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొమ్మలపాటి రమేష్ కినుక వహించారు. మరోవైపు రాయచోటిలో ఇదివరకే మండిపల్లికి టికెట్ కేటాయించినా.. అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఇక్కడి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి స్తబ్దుగా ఉండిపోయారు. రాజంపేట టికెట్‌పై ప్రతిష్ఠంభన కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీకి పనిచేసిన వారికి సంబంధం లేకుండా టిక్కెట్లు అధిష్టానం కేటాయించడంపై శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజంపేట టీడీపీ టిక్కెట్‌కు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులుకు చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి లేదా సుగవాసి కుటుంబానికి సంబంధించిన బాలసుబ్రమణ్యంకు కేటాయిస్తారని చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు జనసేనకు టిక్కెట్ కేటాయిస్తారని ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గ టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. కోడూరులో నైరాశ్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాకుండా రైల్వేకోడూరు టికెట్‌ను జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలో నైరాశ్యం అలుముకుంది. ముందే గ్రూపు రాజకీయాలతో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేనకు టిక్కెట్ కేటాయించడంతో టీడీపీలో అనిశ్చితి నెలకొంది. పైగా నియోజకవర్గ ఇన్చార్జ్ రూపానందరెడ్డి సూచించిన అభ్యర్థికి కాకుండా కొత్త అభ్యర్థికి టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. చంద్రబాబు జిత్తులకు బలైన మరో నేత, పారిశ్రామికి వేత్త గంటా నరహరి.. గంటా నరహరి టీడీపీ తరఫున ముందుగా రాజంపేట లోక్‌సభ స్థానం టికెట్ ఆశించారు. ఈ క్రమంలో పట్టణంలో అన్న క్యాంటీన్ ను సొంత డబ్బుతో నిర్వహించారు. తాజాగా రాజంపేట లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ అయినా వచ్చేస్తుందని గంటా నరహరి ఆశించారు. అయితే ఎమ్మెల్యే టికెట్ కూడా వేరే అభ్యర్థికి ఖరారైందని తెలిసి చివరికి మూడు రోజుల క్రితం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారనే విషయం మరోసారి గంటా విషయంలో బహిర్గతమైందని రాజకీయపరిశీలకులు అంటున్నారు. ఇవి చదవండి: కూటమిలో వేరు కుంపట్లు -
కాలవ మోసం.. ఇదే సాక్ష్యం!
ఇది రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో నాయీ బ్రాహ్మణ భవన నిర్మాణం కోసమంటూ టీడీపీ హయాంలో వేసిన వేసిన శిలాఫలకం. సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికలు రెండు నెలల్లో జరగబోతున్నాయగా.. అప్పట్లో మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులు హడావుడిగా శిలాఫలకం వేసేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టించుకోకుండా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కనికట్టు చేసేశారు. ఇదొక్కటే కాదు... పలు వర్గాలను మచ్చిక చేసుకునేందుకు పట్టణంలో అనేక చోట్ల ఇలాగే శిలాఫలకాలతో నాటకాలకు తెరలేపి వలపన్నారు. కానీ, అప్పటికే ఆయన మోసాలతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. తనను నమ్మి ఓట్లేసిన పాపానికి నియోజకవర్గ ప్రజలను గతంలో కాలవ శ్రీనివాసులు నిండా ముంచారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినా నియోజకవర్గానికి ఆయన ఒరగ బెట్టిందేమీ లేదు. పైగా టీడీపీ నేతలతో కలిసి దోపిడీలకు తెగబడ్డారు. కావాల్సినంత వెనకేసుకున్నారు. అప్పట్లో ప్రజలపై పచ్చమూకలు దౌర్జన్యాలకు పాల్పడినా అడ్డు చెప్పలేదు. జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తున్నా ఆపలేదు సరికదా.. వారికే వంత పాడారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నారు. కుల సంఘాలకు కుచ్చుటోపీ.. మంత్రిగా ఉన్నన్నాళ్లూ నియోజకవర్గాన్ని పట్టించుకోని కాలవ శ్రీనివాసులు.. గత సార్వత్రిక ఎన్నికల ముందు నాటకాలకు తెరలేపారు. ఎలాగైనా ఓట్లు రాబట్టేందుకు కల్యాణ మండపాల పేరుతో డ్రామాలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉండగా, రాయదుర్గం ముత్రాసు కాలనీ బైపాస్‌రోడ్డు పక్కన షాదీమహల్‌కు, మల్లాపురం లౌఅవుట్ వద్ద రజక భవనానికి, బళ్లారి రోడ్డులో స్వకుళసాలి సమాజ కళ్యాణ మండపానికి శంకుస్థాపనలు చేశారు. ఆర్భాటంగా శిలాఫలకాలు వేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేవలం గంట ముందు కూడా డీ హీరేహాళ్ మండలం ఓబుళాపురం వద్ద గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ఓ నీటి పథకానికి శంకుస్థాపన చేశారంటే ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు ఆయన ఎంతలా యత్నించారో అర్థం చేసుకోవచ్చు. కాలవ మోసాలకు నేటికీ ఆ శిలాఫలకాలు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. మళ్లీ మోసగించేందుకు కుయుక్తులు.. ఎన్నికల సమయంలో నాటకాలు ఆడడం అలవాటుగా మార్చుకున్న కాలవ శ్రీనివాసులు.. నేడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుయుక్తులకు తెరలేపారు. ఈ సారి గెలిస్తే తప్పకుండా కల్యాణ మండపాలు పూర్తి చేస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. కానీ, ఆయన మోసాలు పసిగట్టిన నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే పూర్తి చేయలేని నిర్మాణాలను.. మళ్లీ గెలిపిస్తే పూర్తి చేస్తామని చెబుతుండడం హాస్యాస్పదమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 650 హామీలిచ్చి, ఆఖరుకు ఆరింటిని కూడా నెరవేర్చని టీడీపీ అధినేత చంద్రబాబు బాటలోనే కాలవ శ్రీనివాసులు ఇంకా నడుస్తుండడం బాధాకరమంటూ నిట్టూరుస్తున్నారు. కాలవను ఎవరూ నమ్మరు! గత ఎన్నికల ముందు షాదీమహల్ నిర్మాణానికి కాలవ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ముస్లిం, మైనార్టీలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశపడ్డాం. చివరికి అంతా ఆర్భాటమేనని తేలింది. పైసా నిధులు మంజూరు చేయకుండా మోసం చేశారు. ఇలాగే, శ్మశాన వాటికకు కూడా శిలాఫలకం వేసి చెవిలో పూలు పెట్టారు. నేడు మళ్లీ డ్రామాలాడుతున్న ఆయనను నమ్మేవారు లేరు. – గోనబావి షర్మశ్, రాయదుర్గం ఆశలపై నీళ్లు చల్లారు.. కల్యాణ మండపం నిర్మిస్తామని చెప్పి నాయీ బ్రాహ్మణులను కాలవ శ్రీనివాసులు మోసగించారు. శాంతినగర్‌లో శిలాఫలకం వేసినప్పుడు చాలా సంతోషించాం. అంతటితోనే చేతులు దులుపుకుని మా ఆశలపై నీళ్లు చల్లారు. నిధులు మంజూరు చేయకపోవడంతో నేటికీ శిలా ఫలకం ప్రజలను వెక్కిరిస్తోంది. – రఘురాం, రాయదుర్గం మాయమాటలతో సరి టీడీపీ హయాంలో స్వకులశాలి, కుర్నిశాలి, పద్మశాలి కులాల వారి కోసం కల్యాణ మండపాలు నిర్మిస్తామంటూ శిలా ఫలకాలు వేశారు. ఇవి పూర్తయ్యాక ఎంతో ఉపయోగపడతాయని అనుకున్నాం. తీరా చూస్తే అవి ఉత్తుత్తివని తేలింది. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి వంచించడం సరికాదు. – నగేష్, శాంతినగర్, రాయదుర్గం -
బాబు పొత్తు ధర్మం చిత్తు చిత్తు?
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు అంటేనే అవకాశవాద రాజకీయాలకు, కుట్రలు, కుతంత్రాలకు ఆద్యుడు. కేవలం తన అవసరాల కోసమే పొత్తులు, ఎత్తులతో చెత్త రాజకీయాలు చేయడంలో ఆయనదే అగ్రస్థానం. 2014లో తన అవసరాల కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని గద్దెనెక్కారు. అధికారంలో భాగస్వామం ఇవ్వాల్సి వస్తుందని వారితో తెగతెంపులు చేసుకున్నారు. 2019లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. తర్వాత అవినీతి కేసుల్లో 52 రోజులు జైలు జీవితం అనుభవించారు. తాజాగా ఎన్నికల్లో మళ్లీ బీజేపీ వద్ద మోకరిల్లారు. ఢిల్లీలో పడిగాపులు కాసి ఎట్టకేలకు ఎన్డీఏ కూటమిలో బెర్తు సంపాదించారు. ఈ ఎత్తుగడ అంతా ఎందుకంటే కేసుల నుంచి తప్పించుకునేందుకేనని అందరికీ తెలిసిపోయింది. అయినా యథావిధిగానే చంద్రబాబు తన ప్రసంగాల్లో మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మరో వైపు తన మార్కు రాజకీయానికి పదును పెట్టారు. ఎన్నికల ప్రచారం నుంచి పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టేశారు. కూటమి పార్టీల్లోని మిత్రపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో మిత్రపక్షాలు రగిలిపోతున్నాయి. రోడ్ షో సభల్లోనూ అదే తీరు.. పలమనేరు, పుత్తూరు రోడ్ షో సభల్లోనూ చంద్రబాబు తీరులోనూ మార్పులేదు. ఇక్కడ కూడా మిత్రపక్షాల నేతలకు అవకాశం ఇవ్వలేదు. జిల్లాలో బీజేపీతోపాటు జనసేన పార్టీలకు చెప్పుకోదగ్గ నేతలు ఉన్నప్పటికీ వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. తన ప్రసంగాల్లో కూడా మిత్రపక్ష నేతల పేర్లుగానీ, వారి భాగస్వామ్యం కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కూటమి పార్టీలన్నీ టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని మాత్రం పదేపదే విన్నవించారు. ఇరుకు సందుల్లో సభలా.. రాజకీయాల్లో 40 ఏళ్లు అనుభవం ఉందంటూ పదే పదే చెప్పుకునే చంద్రబాబు తన స్థాయికి తగిన విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించటం లేదని సాక్షాత్తూ టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. కుప్పంతోపాటు పలమనేరు, పుత్తూరు నిర్వహించిన సభలు చాలా ఇరుకు సందుల్లో నిర్వహించారు. జనం రారనే ఉద్దేశంతోనే చంద్రబాబు ముందస్తు జాగ్రత్తగా పట్టుమని వందమంది నిలబడలేని సందుల్లో సభలు పెట్టడం గమనార్హం. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనం రాలేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనం ముందు చుట్టూ పలుచగా జనం కనిపించడంతో ఏం చేయాలో దిక్కుతోచక తల పట్టుకునే పరిస్థితి ఎదురవుతోంది. జెండాలు మోయడానికేనా..? పొత్తు కోసం వెంపర్లాడిన చంద్రబాబు ఆ పొత్తు ధర్మాన్ని ఆచరించటం లేదని బీజేపీ, జనసేన నేతలు లోలోన రగిలిపోతున్నారు. తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా అడుగడుగునా అవమానిస్తున్నారని ఆయా పార్టీ నేతలు బాహాటకంగానే చెబుతున్నారు. తమను కేవలం జెండాలు మోయడానికే చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో తమ సత్తా చూపాలని ఆ రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు వన్‌మ్యాన్ షో.. చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఆరంభించారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఏకంగా మూడు రోజులు గడిపారు. పార్టీ నేతలు, క్యాడర్‌తో వరుసగా సమావేశాలు నిర్వహించి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. కానీ, పొత్తు ధర్మాన్ని యథావిధిగా పక్కన పెట్టేశారు. తన ప్రసంగంలో సొంత పార్టీ టీడీపీ కేడర్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీ, జనసేన మైత్రిని కేవలం కరివేపాకులా ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారాన్ని జిల్లాతోపాటు తన సొంత కుప్పం నుంచే ప్రారంభించిన సందర్భంగా, పొత్తులు ఎందుకు? ఏ కారణం చేత కూటమిగా ఏర్పడాల్సి వచ్చింది? అనే విషయాన్ని వివరించకుండానే లక్ష మెజారిటీతో గెలిపించాలని పదేపదే ప్రాధేయపడ్డారు. కనీసం వేదికలపై మిత్ర పక్షాలు బీజేపీ, జనసేన నేతలను మాట వరుసకు ఊడా పిలవలేదు. వచ్చిన వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో కూటమి పార్టీ నేతల్లో తీవ్ర అసహనం కనిపించింది. ఇవి చదవండి: ‘దక్షిణ’ నాదంటే నాదే! -
Jana Sena Clash: ‘దక్షిణ’ నాదంటే నాదే!
సాక్షి, విశాఖపట్నం: జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్‌లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థుల జాబితాల్లో విశాఖ దక్షిణ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయినా ఈ సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ‘వంశీ వద్దు.. స్థానికులే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. కొద్దిరోజుల క్రితం ఒక మేకను తీసుకొచ్చి వంశీతో పోలుస్తూ ఈ సీటును బలి చేయొద్దని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వంశీ వర్గీయులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జనసేన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. వంశీ ఎన్నికల ప్రచారానికి వ్యతిరేక వర్గీయులు దూరంగా ఉంటున్నారు. మరోపక్క వంశీకృష్ణకు టికెట్ కేటాయింపు ప్రకటన వట్టిదేనని, అంతా బూటకమని కందుల బహిరంగంగానే చెబుతున్నారు. పవన్ ఆ సీటును తనకే ఖరారు చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. మంగళగిరికి కందుల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి విశాఖ దక్షిణ సీటు తనకే కేటాయించాలని కోరేందుకు కందుల నాగరాజు గురువారం మంగళగిరికి పయనమయ్యారు. వంశీకృష్ణకు సీటిస్తే ఓడిపోతారని, తనకిస్తే గెలుస్తానని చెప్పడానికి వెళ్లారు. సీటు ఇస్తారన్న హామీతోనే గతంలో జనసేనలో చేరానని, ఒకవేళ తనకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి గుడ్‌బై చెబుతానని పవన్‌కు స్పష్టం చేయనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంగళగిరి పంచాయతీలో దక్షిణ టికెట్‌పై ఏం తేలుస్తారోనని జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇవి చదవండి: ‘సైకిల్’ దొంగ దొరికాడోచ్! -
వేమిరెడ్డికి ఎన్నికలకు ముందే షాకులు..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంటాడుతున్న ఓటమి భయం.. స్వపక్షం నుంచే ఎదురవుతున్న నిరసనలు.. ఖర్చు పేరిట పీల్చిపిప్పి చేస్తున్న నేతలు.. ఇలా వరుస షాకులతో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎన్నికలకు ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలతో ఏ మాత్రం సంబంధంలేని ఆయన ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, అభ్యర్థులు మాట్లాడే సమయానికి వీరు నిష్క్రమిస్తుండటంతో పుండుమీద కారం జల్లిన పరిస్థితి వేమిరెడ్డికి ఏర్పడింది. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజకీయ పరిస్థితి ఓ అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అనే రీతిలో సాగుతోంది. ప్రచారానికి వెళ్తున్న వేమిరెడ్డి దంపతులకు స్వపక్ష నేతల నుంచే అవమానాలు, నిరసనలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో టీడీపీ గ్రాఫ్ మెరుగుపడకపోవడం.. పైగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవనే సంకేతాల తరుణంలో కీలక నేతలుగా ప్రచారం చేసుకుంటూ అందిన కాడికి గుంజాలనే ఉద్దేశంతో కొందరు ఆయన చుట్టూ కోటరీగా ఏర్పడ్డారు. వలసలను ప్రోత్సహిస్తున్నా పెరగని ప్రజాదరణ భారీ ప్యాకేజీలతో టీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ప్రజాదరణ ఏ మాత్రం పెరగడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టిన అత్యుత్తమ పదవులతో పాటు గౌరవ మర్యాదలు పొందిన వీరి పరిస్థితి ప్రస్తుతం ఒక్కసారిగా తిరగబడింది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పట్టుబట్టి టీడీపీ కోవూరు అభ్యర్థిగా తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును ఖరారు చేయించారు. వాస్తవానికి ఏళ్ల పాటు కష్టించి తానే అభ్యర్థినని విస్తృత ప్రచారం చేసిన పోలంరెడ్డి దినేష్‌రెడ్డికి ఈ పరిస్థితి మింగుడుపడలేదు. తనను పక్కనబెట్టడాన్ని జీర్ణించుకోలేని దినేష్ తనదైన శైలిలో రాజకీయాలకు తెరలేపారు. వెన్నంటే ఉంటూ నిరసనలకు సై.. వేమిరెడ్డి వెన్నంటే దినేష్‌రెడ్డి ఉంటూ తెరచాటు రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అధిష్టాన ఆదేశాలతో పార్టీ కోసం పనిచేస్తూ.. ప్రశాంతక్కను గెలిపించుకుందామంటూ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్న దినేష్.. పరోక్షంగా వారికి నిరసన సెగ చూపేలా కేడర్‌ను సమాయత్తపరుస్తున్నారని సమాచారం. ఇందుకూరుపేట మండలానికి ఆదివారం ఆమె వెళ్లగా, టీడీపీ వర్గీయులు భారీగా గుమిగూడి గో బ్యాక్.. ప్రశాంతి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు నిరీక్షించినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆమె వెనుదిరిగారు. ఇదే సమయంలో దినేష్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినదించడం.. అనంతరం తన వర్గంతో కలిసి వెళ్లి ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిర్వహించడాన్ని దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. ఆత్మీయ సమావేశాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ప్రశాంతిరెడ్డికి వెన్నుపోటు తప్పదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఆగండయ్యా..! కోవూరులోని నెల్లూరు గ్రాండ్ హోటల్, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతుండగానే, సభ నుంచి వెళ్లేందుకు కేడర్ సన్నద్ధమయ్యారు. ఎక్కడికెళ్తున్నారు.. ఆగండి అని వేమిరెడ్డి వేడుకున్నా పట్టించుకోకుండా అందరూ బయల్దేరారు. ఖర్చులంటూ ఒత్తిడి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల కోసం వేమిరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. వేమిరెడ్డి నివాసంలో నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వారు డిమాండ్ చేశారని తెలిసింది. ఇంకా నామినేషన్ల పర్వమే ప్రారంభం కాలేదు.. అప్పుడే డబ్బులేంటి.. తర్వాత చూద్దామని ఆయన చెప్పారని సమాచారం. ఇవి చదవండి: కూటమిలో వేరు కుంపట్లు