May 15th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections 2024: May 15th Politics Latest News Updates Telugu | Sakshi
Sakshi News home page

May 15th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Wed, May 15 2024 7:35 AM | Last Updated on Wed, May 15 2024 9:17 PM

AP Elections 2024: May 15th Politics Latest News Updates Telugu

May 15th AP Elections 2024 News Political Updates

9:16 PM, May 15th, 2024
మైదుకూరులో టీడీపీ గుండాల దాడి

  • విశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం 
  • ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలు
  • దాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • ఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

7:30 PM, May 15th, 2024
రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • టీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయి
  • రిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారు
  • టీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాం
  • ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది
  • పురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు
  • వారు కోరిన అధికారులను వేశారు
  • మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు
  • విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు
  • విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి
  • అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?
  • టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది
  • రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారు
  • ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు
  • ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు
  • అక్కడే ఎక్కువ హింస చెలరేగింది
  • జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి
  • మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు
  • ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు
  • వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి
  • ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి
  • సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది
  • కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది
  • కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది
  • సీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం
  • పోలింగ్ తర్వాత కూడా పరిపాలన  జరగకుండా చేయటం ఏంటి?
  • వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం
  • పురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం
  • పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది
  • లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?
  • ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు
  • రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?
  • ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు

6:09 PM, May 15th, 2024
పోలింగ్‌లో మహిళా విప్లవం కనిపించింది: ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటింగ్ ద్వారా ప్రజావిప్లవం చూపించారు
  • 81.86 శాతం పోలింగ్ నమోదవడం గొప్ప విషయం
  • సమర్థవంతమైన పరిపాలన చేయటం వలనే జనమంతా బయటకు వచ్చి ఓట్లేశారు
  • చివరి ఇంటి వరకు ఎక్కడా అక్రమాలు లేకుండా పాలనా ఫలాలు అందాయి
  • దీన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు మారణకాండ సృష్టించారు
  • బడుగు, బలహీన వర్గాలపై దాడులకు దిగారు
  • ఓటర్లు బయటకు రాకుండా చేసేందుకు చేయరాని కుట్రలు చేశారు
  • మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలపై కూడా దాడులు చేశారు
  • 2019లో పసుపుకుంకుమ కింద డబ్బులిచ్చినందున తామే గెలుస్తామన్నారు
  • చివరికి 23 సీట్లతో సరిపెట్టుకున్నారు
  • ఈసారి పురుషుల కంటే ఐదు లక్షలమంది మహిళలు అధికంగా ఓట్లేశారు
  • వారంతా జగన్‌కే పట్టం కట్టారు
  • జగన్ చేసిన న్యాయపాలన చూసిన మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లేశారు
  • కులం, మతం, ప్రాంతాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారు
  • హైదరాబాద్ నుండి రౌడీలు, గుండాలను తెచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతామా?
  • సమస్యాత్మక కేంద్రాల వద్ద ఒక్కొక కానిస్టేబుల్‌ని మాత్రమే పెట్టారు
  • అసలు ఎన్నికల కమిషన్ అత్యంత దారుణంగా వ్యవహరించింది
  • ఎల్లోమీడియా ఎంత విషం చిమ్మినా జనం పట్టించుకోలేదు

5:31 PM, May 15th, 2024
ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

  • టీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
  • పోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీ
  • పోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి దీపక్‌ మిశ్రా హాజరైనట్లు గుర్తింపు
  • ఆ తర్వాత నుంచి పోలీస్‌ అధికారుల మార్పులపై అనుమానాలు
  • మాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్‌ఐల మార్పులు
  • చివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్‌ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌
  • చేయొద్దని విచారణ అధికారిపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీ
  • ఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ

5:06 PM, May 15th, 2024
నర్సీపట్నం మండలంలో టీడీపీ నేతల దుర్మార్గ చర్య

  • అనకాపల్లి:
  • ధర్మసాగరంలో మహిళను కొట్టి వివస్త్రను చేసిన టీడీపీ కార్యకర్తలు
  • మహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న బాధితురాలు కుమారి
  • గతంలో వాలంటీర్‌గా విధులు నిర్వహించిన కుమారి
  • ఎన్నికలు అయ్యాక ఇంటికెళ్లి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు
     

4:12 PM, May 15th, 2024
పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?: పేర్ని నాని

  • టీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు
  • మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు
  • పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం
  • పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?
  • రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది?
  • బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు
  • మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు
  • పురందేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది
  • అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు

4:09 PM, May 15th, 2024
పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీతో కుమ్మక్కయ్యారు: మంత్రి అంబటి రాంబాబు

  • పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు
  • మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు
  • టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు
  • దీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారు
  • నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్ఛగా తిరగనిచ్చారు
  • చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు
  • పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు
  • అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?
  • అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?
  • అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్ఠం వలన హింస జరిగింది
  • ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది
  • పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు
  • సీఎస్, డీజీపిలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు
  • తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?
  • వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?

3:51 PM, May 15th, 2024
టీడీపీ దాడులపై డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

  • డీజీపి హరీష్ కుమార్ గుప్తాని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • రాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • డీజీపిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు

3:19 PM, May 15th, 2024
ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

  • ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐ
  • ఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీ
  • ఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్
  • అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలు
  • పల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐ
  • ఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు

3:15 PM, May 15th, 2024
కాసేపట్లో డీజీపి హరీష్ కుమార్ గుప్తాను కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

  • రాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
  • డీజీపిని కలవనున్న వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు

1:10 PM, May 15th, 2024
పల్నాడులో టెన్షన్‌..!

  • పల్నాడు జిల్లా..
  • పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన కలెక్టర్
  • మాచర్ల, గురజాల నియోజకవర్గంలో షాపులు ముయించివేస్తున్న పోలీసులు

 

12:20 PM, May 15th, 2024
పల్నాడు ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

  • తాడేపల్లి :
  • చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
  • మరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం జగన్‌
  • వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్ష
     

12:00 PM, May 15th, 2024
తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్‌..

  • అనంతపురం:
  • తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదం
  • ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వీరంగం సృష్టించిన పోలీసులు
  • సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం
  • హార్డ్ డిస్క్, సీపీయూలను మాయం చేసిన పోలీసులు
  • ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పనిమనుషులను బెదిరించిన పోలీసులు
  • తాడిపత్రి నియోజకవర్గంలో 30 మంది వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
  • ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారు
  • పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

 

11:40 AM, May 15th, 2024

పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు: మంత్రి మేరుగ నాగార్జున

  • తాడేపల్లి :
  • మేరుగ నాగార్జున కామెంట్స్‌..  మంత్రి కామెంట్స్..
  • వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.
  • ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.
  • ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.
  • జూన్ నాలుగోవ తేదిన వైఎస్సార్‌సీపీ సునామీ రాబోతుంది.
  • చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్ళాడు.
  • పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.
  • సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు
  • కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.
  • పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.
  • అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాం
  • ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు.
  • జూన్ నాలుగున రాష్ట్ర చరిత్రలో నూతన  అధ్యాయం లిఖిస్తాం
  • రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుంది
  • పేదలు వైఎ‍స్సార్‌సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.
  • వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారు
  • డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే.
     

9:40 AM, May 15th, 2024
టీడీపీ నాయకుల దాష్టీకం..

  • పల్నాడు జిల్లా..
  • దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకం
  • కర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు
  • బత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులు
  • తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.
  • గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్‌ చేసిన పోలీసులు

 

8:51 AM, May 15th, 2024
ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండ

  • ఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
  • వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడి
  • గణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు
  • పోలింగ్ కేంద్రాల వద్ద  ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనం
  • గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం
  • ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడి
  • రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  • కొనసాగుతున్న పోలీస్‌ పహారా

 

8:25 AM, May 15th, 2024
కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీ

  • వైయస్సార్ జిల్లా  జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్
  • పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలు
  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు

 

7:59 AM, May 15th, 2024
ఏపీలో పోలింగ్‌ శాతం మొత్తంగా ఇలా.. 

ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.

ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.

అల్లూరి : 70.20

అనకాపల్లి : 83.84

అనంతపురం :  81.08

అన్నమయ్య :  77.83

బాపట్ల : 85.15

చిత్తూరు : 87.09

కోనసీమ :  83.84

తూ.గో : 80.93

ఏలూరు : 83.67

గుంటూరు : 78.81

కాకినాడ:  80.31

కృష్ణా:  84.05

కర్నూలు : 76.42

నంద్యాల:  82.09

ఎన్టీఆర్:  79.36

పల్నాడు : 85.65

పార్వతిపురం మన్యం : 77.10

ప్రకాశం : 87.09

నెల్లూరు : 79.63

సత్యసాయి : 84.63

శ్రీకాకుళం : 75.59

తిరుపతి : 78.63

విశాఖ : 68.63

విజయనగరం : 81.33

ప.గో : 82.59

కడప : 79.58

 

 

7:45 AM, May 15th, 2024
టీడీపీ నేతల దాడులు..

  • పల్నాడు జిల్లా
  • మాచవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.
  • మాచవరం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.
  • ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. 
  • గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు.

 

7:20 AM, May 15th, 2024
శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డి

  • అనంతపురం:
  • ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్‌..
  • టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం
  • తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలి
  • శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం.

 

7:00 AM, May 15th, 2024
తాడిపత్రిలో ఉద్రిక్తతలు..

  • అనంతపురం:
  • తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపు
  • తాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు
  • ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులు
  • అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు
  • పోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • తాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి 
  • తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులు
  • నగరంలో 144 సెక్షన్ కొనసాగింపు

 

6:45 AM, May 15th, 2024
డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ 

  • టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్
  • ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. 
  • ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. 
  • చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ 
  • ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్‌. 
  • దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. 
  • పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు.


 

6:30 AM, May 15th, 2024

విశాఖ:
 రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్స

  • అన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్‌ గాలి కనిపించింది
  • మహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారు
  • తమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.
  • ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నింది
  • ప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.
  • ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి
  • వైఎస్‌ .జగన్‌ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు
  • ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చుతారు
  • మాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదు
  • నేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించింది
  • ఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్ట
  • మాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారు
  • చంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసు
  • మాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి,  సీఎం జగన్
  • సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారు
  • టీడీపీ నేతలు సహనం కోల్పోయారు
  • మా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాం
  • ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement