AP Political News Jan 13th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Political News Updates Headlines 13th Jan 2024 Telugu | Sakshi
Sakshi News home page

AP Political News Jan 13th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Sat, Jan 13 2024 6:53 AM | Last Updated on Sun, Feb 4 2024 1:42 PM

AP Elections Political News Updates Headlines 13th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

08:31 PM, జనవరి 13, 2024
ఎన్ని సీట్లిస్తారు చెప్పండి?

  • టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ
  • ఉండవల్లి బాబు నివాసంలో కొనసాగుతున్న సమావేశం
  • ఎన్ని సీట్లు ఇస్తారనేది తేల్చుకునే పనిలో జనసేనాని
  • పవన్‌ వెంట నాదెండ్ల మనోహర్‌
  • జనసేన కోరినన్ని ఇవ్వలేమని ఇదివరకే తేల్చేసిన టీడీపీ
  • తెలంగాణలో బీజేపీ 8 ఇచ్చింది కాబట్టి 20 దాకా ఇచ్చే యోచనలో చంద్రబాబు
  • 40 నుంచి 50 మధ్య సీట్లు కావాలంటున్న పవన్‌
  • సొంత పార్టీ నేతల ఒత్తిడి నేపథ్యంలో సీట్ల ఫిగర్‌ తేల్చుకునే పనిలో పవన్‌

07:55 PM, జనవరి 13, 2024
బాబుపై విరుచుకుపడ్డ రాయపాటి రంగారావు 

  • టీడీపీ అధినేత చం‍ద్రబాబుపై రాయపాటి రంగారావు ఆగ్రహం
  • చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ స్మగ్లర్
  • చంద్రబాబు నాయుడు కరప్షన్ కింగ్
  • లోకేష్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు
  • కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబు అలవాటు
  • విజయవాడలో కేశినేని నాని కుటుంబంలో చిచ్చుపెట్టాడు
  • ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి రాయపాటి శైలజ తో నా మీద ఆరోపణలు చేయిస్తున్నాడు
  • అమరావతి ఉద్యమం పేరుతో ఎంతెంత డబ్బులు వసూలు చేశారో ముందు రాయపాటి శైలజ చెప్పాలి
  • వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళినాయో అంతా నాకు తెలుసు
  • రాయపాటి శైలజ నీకు అసలు పార్టీ సభ్యత్వం ఉందా?
  • చంద్రబాబు నాయుడు నిన్ను రాజకీయంగా వాడుకుని వదిలేస్తాడు
  • పాదయాత్ర అయిపోయిన తర్వాత లోకేష్ డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడు

07:20 PM, జనవరి 13, 2024
చంద్రబాబు నివాసానికి పవన్‌ కల్యాణ్‌

  • టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌
  • ఉండవల్లిలోని బాబు నివాసంలో పవన్‌ సమావేశం
  • తొలిసారి ఉండవల్లి బాబు నివాసానికి పవన్‌
  • పవన్‌ వెంట నాదెండ్ల మనోహర్‌
  • సీట్ల సర్దుబాటుపై చర్చించనున్న నేతలు
  • ఉమ్మడి మేనిఫెస్టో పైనా చర్చించే అవకాశం
  • పొత్తులో భాగంగా.. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేదానిపైనా ఇప్పటికీ లేని స్పష్టత
  • మరోవైపు జనసేన కోరుతున్న స్థానాల్లోనూ పోటీ చేయాలని టీడీపీ నేతల యత్నం
  • సీట్ల పంపకంపై తేల్చుకునేందుకు బాబు నివాసానికి పవన్‌

06:57 PM, జనవరి 13, 2024
కాసేపట్లో వైఎస్సార్‌సీపీ నాలుగో జాబితా?

  • నాలుగో జాబితా విడుదల చేయనున్న వైఎస్సార్‌సీపీ
  • అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల ఇన్‌ఛార్జిల మార్పులో భాగం
  • ఐదు లేదా ఆరు స్థానాలకు ఇన్‌ఛార్జిల మార్పుతో జాబితా విడుదల
  • ఇప్పటికే మూడు జాబితాల్లో 50 అసెంబ్లీ, 9 పార్లమెంటరీ స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్చిన పార్టీ
  • సామాజిక సమీకరణాలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగానే మార్పులని ప్రకటించిన పార్టీ

05:57 PM, జనవరి 13, 2024
గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  • గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఓవరాక్షన్
  • లిక్కర్ కుంభకోణంలో హైకోర్టు షరతులు భాగంగా విచారణ అధికారి వద్ద లొంగిపోయి పూచికత్తు సమర్పించడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు
  • చంద్రబాబు రాక సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఓవరాక్షన్
  • పోలీసులతో వాగ్వివాదం
  • బారికేడ్లను నెట్టేసి పోలీసు పైన దౌర్జన్యం
  • పోలీసులకు తెలుగుదేశం నాయకులకు మధ్య తోపులాట

05:12 PM, జనవరి 13, 2024
చంద్రబాబుకు పెనమలూరు సెగ

  • చంద్రబాబు బాబు కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చిన బోడే వర్గం
  • బోడే ప్రసాద్‌కే టికెట్‌ ఇవ్వాలంటూ అనుచరుల పట్టు
  • తాడిగడప సీఐడీ కార్యాలయం వద్ద ఘటన

04:31 PM, జనవరి 13, 2024
ఐఆర్‌ఆర్‌ కేసులో లొంగిపోయిన చంద్రబాబు

  • తాడేపల్లి సిట్‌ ఆఫీస్‌కు చేరుకున్న చంద్రబాబు నాయుడు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో సిట్‌ ముందు లొంగిపోయిన చంద్రబాబు
  • పూచీకత్తులు సమర్పించి బెయిల్‌ పొందనున్న చంద్రబాబు
  • హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో.. ఈ పరిణామం

04:16 PM, జనవరి 13, 2024
ఎల్లో మీడియాలో నాపై తప్పుడు ప్రచారం : ఎమ్మెల్యే తోపుదుర్తి

  • మోసగాళ్లకు పరిటాల శ్రీరామ్ వత్తాసు పలుకుతున్నారు
  • సీపీఐ రామకృష్ణకు నన్ను విమర్శించే స్థాయి లేదు
  • ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తా 
  • పచ్చ బ్యాచ్‌కు రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వార్నింగ్‌
     

04:11 PM, జనవరి 13, 2024
కాసేపట్లో తాడేపల్లి సిట్‌ ఆఫీస్‌కు చంద్రబాబు

  • ఇన్నర్‌రింగ్‌రోడ్‌ స్కాం కేసు, మద్యం పాలసీ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ పొందిన టీడీపీ అధినేత
  • ఈ రెండు కేసులో విచారణ అధికారులకు పూచీకత్తులు సమర్పించనున్న చంద్రబాబు


04:06 PM, జనవరి 13, 2024
పొత్తుల తక్కెడ.. సీట్లపై స్పష్టత ఎప్పుడు?

  • ఇవాళ రాత్రికి చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
  • డిన్నర్ మీట్ లో కలుసుకోనున్న ఇరువురు నేతల మధ్య కీలక చర్చలు 
  • సీట్ల సర్దుబాటుపై ఇంకా రాని అవగాహన
  • 50 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ టికెట్లు అడుతున్నజనసేన
  • 15 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ టికెట్లు ఇస్తానంటున్న టీడీపీ
  • తెలంగాణలో బీజేపీ 8 సీట్లే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్న టీడీపీ
  • తెలంగాణ వేరు, ఏపీ వేరు.. ఎక్కువ సీట్లు కావాలంటున్న జనసేన
  • ఇన్నాళ్లు పార్టీ వెంట తిరిగిన వాళ్ల నుంచి టికెట్ల కోసం ఒత్తిడి
  • మాకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు? వెంటనే తేల్చేయాలంటున్న పవన్‌ కళ్యాణ్‌
  • మరో వైపు పవన్‌పై పెరుగుతున్న ఒత్తిడి
  • పవన్‌ కల్యాణ్‌ను కలుస్తున్న టీడీపీ నేతలు
  • మా నియోజకవర్గాల వైపు చూడొద్దంటూ టీడీపీ నేతల అల్టిమేటం
  • ఎప్పటినుంచో ఉన్నాం.. ఇప్పుడు పొత్తుల పేరిట మావైపు రావొద్దని పవన్‌కు చెబుతున్న టీడీపీ నేతలు
  • డిన్నర్‌ భేటీలో ఈ విషయాలన్నింటిపై స్పష్టత అడగాలని పవన్‌ నిర్ణయం
  • ఇంకా నాన్చడం వల్ల పూర్తిగా నష్టపోతామని చెబుతోన్న పవన్‌ కళ్యాణ్‌
  • కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాలనుంచి పోటీకి ఆసక్తి చూపుతోన్న పవన్‌


04:00 PM, జనవరి 13, 2024
పవన్‌కు 40 సీట్లే చాలట!

  • హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ
  • టీడీపీ జనసేన పొత్తులపై కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య  లేఖ విడుదల
  • బీజేపీతో కలిసి వెళ్లే ఆవశ్యకతపై పవన్‌ను కలిసినట్లు(రెండు రోజుల కిందట) వెల్లడి
  • పొత్తులో 60 సీట్లు అడగాలని పవన్‌కు సూచించిన హరిరామ జోగయ్య
  • 40 సీట్లతో సరిపెట్టుకోవాలనుకుంటున్న పవన్‌
  • ఇదే విషయాన్ని లేఖలో బహిర్గతం చేసిన హరిరామ జోగయ్య
  • పవన్‌ రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని హరిరామ జోగయ్య ఆకాంక్ష
  • జనసైనికులు అదే కోరుకుంటున్నారని లేఖలో వెల్లడించిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు

  
03:30 PM, జనవరి 13, 2024

ఇసుక కేసు.. పూచీకత్తు సమర్పించిన చంద్రబాబు

  • విజయవాడ సీఐడీ ఆఫీస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
  • ఇసుక కేసులో పూచీకత్తుల సమర్పణ
  • తాజాగా.. ఏపీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన చంద్రబాబు
  • కాసేపట్లో తాడేపల్లి సీఐడీ ఆఫీస్‌కు చంద్రబాబు
  • ఐఆర్‌ఆర్‌, మద్యం కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ పొందిన చంద్రబాబు
  • తాడేపల్లి సీఐడీ ఆఫీస్‌కు వెళ్లి పూచీకత్తుల సమర్పణ

02:59 PM, జనవరి 13, 2024
సీఐడీ ఎదుట లొంగిపోయి.. పూచీకత్తులు సమర్పించిన కొల్లు

  • లిక్కర్‌ స్కాంలో సీఐడీ కార్యాలయానికి కొల్లు రవీంద్ర
  • విచారణాధికారి దగ్గర లొంగిపోయిన కొల్లు రవీంద్ర
  • ముందస్తు బెయిల్‌ కోసం పూచీకత్తు సమర్పించిన కొల్లు రవీంద్ర
  • లిక్కర్‌ స్కాంలో ఏ2 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర

ఇదీ చదవండి: సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!

02:45 PM, జనవరి 13, 2024
అసలు చంద్రబాబు ఎలా గెలుస్తాడు?: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

  • చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి  సెటైర్లు
  • చంద్రబాబు అమరావతిని చైనా,జపాన్, సింగపూర్ చేస్తా అంటాడు
  • ఎన్నో చెప్తాడుగానీ.. ఇద్దరు పుత్రుల్ని ఎమ్మెల్యే చేయలేకపోయాడు
  • ఒకరు పుత్రుడు ఓన్ అయితే ఇంకో పుత్రుడు లోన్
  • భవిష్యత్తుకి గ్యారెంటీ అంటాడు.. నలుగురు ష్యురిటీ పెడితే గాని చంద్రబాబు సెంట్రల్ జైల్ నుండి బయటకు రాలేదు
  • రూ. 2 లక్షల 50 కోట్లుతో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ది
  • రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబు అధికారంలోకి అసలు ఎలా వస్తాడు?
  • ఎంత దుష్ప్రచారం చేసినా.. ప్రజలు మళ్ళీ గుద్దేది ఫ్యాన్ కే

02:22 PM, జనవరి 13, 2024
అది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

  • పార్టీ మార్పు ప్రచారంపై కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి స్పందన
  • టీడీపీలోకి వెళ్తున్నానేది తప్పుడు ప్రచారం
  • అధిష్టానంతో ఎలాంటి విబేధాలు లేవు 
  • అధిష్టాన నిర్ణయం ప్రతీ ఒక్కరూ ఆమోదించాల్సిందే

02:11 PM, జనవరి 13, 2024
జనసేనలోకి ముద్రగడ?!

  • కిర్లంపూడిలో కాపు నేత ముద్రగడ పద్మనాభంతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ భేటీ
  • మూడో రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన బొలిశెట్టి
  • జనసేనలో చేరేందుకు ముద్రగడ సుముఖత?
  • ఈ నెల 20 లేదా 23న కిర్లంపూడికి పవన్‌
  • జనసేనలోకి ముద్రగడను ఆహ్వానించే అవకాశం

02:07 PM, జనవరి 13, 2024
సీఎం సూచన మేరకే అరకు వచ్చా: వైవీ సుబ్బారెడ్డి

  • అల్లూరి జిల్లా అరకు పార్లమెంట్ అసెంబ్లీ సమన్వయకర్తల ఎంపికపై ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయ సేకరణ
  • అరకులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులతో సమావేశమైన వైవీ సుబ్బారెడ్డి
  • సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అరకు వచ్చా: వైవీ సుబ్బారెడ్డి
  • ఇప్పటికే అరకు పార్లమెంటు అసెంబ్లీ సమన్వయకర్తలను ఎంపిక చేయడం జరిగింది : వైవీ సుబ్బారెడ్డి
  • కొన్ని సామాజిక వర్గాల అభిప్రాయం మేరకు మరోసారి సీఎం అరకు వెళ్లాలని చెప్పారు: వైవీ సుబ్బారెడ్డి
  • అన్ని వర్గాల అభిప్రాయం మేరకు నివేదిక ఇస్తాం: వైవీ సుబ్బారెడ్డి

01:42 PM, జనవరి 13, 2024
చంద్రబాబు దొడ్డిదారి రాజకీయం

  • జనసేన నుంచీ టీడీపీ అభ్యర్థులే
  • పవన్ దగ్గరకు టీడీపీ నేతల్ని పంపిస్తున్న చంద్రబాబు
  • జనసేన పార్టీ నుంచి తన అభ్యర్థులే ఉండేలా బాబు ప్లాన్!
  • పవన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
  • విజయవాడ వెస్ట్ సీటు కోసం జలీల్ ఖాన్‌ను పంపిన చంద్రబాబు
  • మొన్న పవన్ కల్యాణ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్
  • పెడన సీటు కోసం వేదవ్యాస్‌ను పంపిన చంద్రబాబు
  • కొద్ది రోజుల క్రితం పవన్‌ను కలసిన మాజీ ఎంపీ మాగంటి బాబు
  • ఎంపీ సీటు జనసేన నుంచి కోరిన మాగంటి బాబు
  • తిరుపతి సీటు కోసం పవన్‌ను కలిసిన సుగుణమ్మ
  • జనసేనకు అభ్యర్థులు లేక టీడీపీ నేతల్ని పంపుతున్న చంద్రబాబు
  • చంద్రబాబు తీరు పట్ల జనసేన నాయకుల్లో అనుమానాలు
  • అభ్యర్థులు లేక తామే పవన్ కు పంపుతున్నామని చెప్తున్న టీడీపీ నేతలు
  • పార్టీని నమ్ముకుని ఉన్న వారికి పవన్ మొండిచేయి చూపుతారని జనసేనలో చర్చ

01:23 PM, జనవరి 13, 2024
దమ్ముంటే నా సవాల్‌ స్వీకరించండి.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 

  • రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారు
  • నాకు 500 కోట్లు అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపించారు.
  • రూ.50 కోట్లు ఇస్తే నా ఆస్తులు రాసిస్తానని సవాల్‌ చేసినా ఎవరూ స్పందించలేదు
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నాపై అసత్య ప్రచారం చేస్తున్నాయి
  • ఇప్పుడు 100 రూపాయల స్టాంప్‌ పేపర్‌పై సంతకం పెడుతున్నా.. దమ్ముంటే నా సవాల్‌ 
  • స్వీకరించండి

01:00PM, జనవరి 13, 2024
చంద్రబాబుకి కుప్పానికి ఏమైనా సంబంధం ఉందా?" నారాయణస్వామి

  • చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం ఎందుకు వెళ్లాడు
  • లోకేష్‌ మంగళగిరిలో పుట్టాడా, పెరిగాడా?
  • బాలకృష్ణ హిందూపురం ఎందుకు వెళ్లాడు?
  • ఎస్సీల సీట్లను చంద్రబాబు మార్చలేదా?:
  • పీతల సుజాత, అనిత, జవహర్‌ సీట్లు ఎందుకు మార్చాడు?
  • చంద్రబాబుకి దళితులంటే తీవ్రమైన వివక్ష
  • దళితుల సీట్లు మారుస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం​
  • దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్

12:20PM, జనవరి 13, 2024

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓవరాక్షన్‌

  • పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద రెండో విడత టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓవరాక్షన్‌
  • ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తుండగా ఓవరాక్షన్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 
  • సభాధ్యక్షుడుని నేనే అంటూ వాగ్వాదానికి దిగిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
  • తాను మాట్లాడిన తర్వాతే పట్టాలు పంపిణీ చేయాలంటూ ఓవరాక్షన్ చేసిన నిమ్మల
  • మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్లో దుర్భాషలాడిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
  • నువ్వు చేతకాని వాడివంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే నిమ్మల
  • వీడియో తీస్తున్న సాక్షి విలేఖరి పై సైతం దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే
  • లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు
  • పబ్లిసిటీ స్టంట్ కోసం సభా వేదిక ముందు నేలపై కూర్చుని  హడావిడి చేసిన  ఎమ్మెల్యే రామానాయుడు.
  • ఇరు పార్టీ నాయకులు పోటాపోటీ నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత
  • ఇరు వర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు

12:11 PM, జనవరి 13, 2024
విశాఖ: అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు

  • పురుషోత్తం పురంలో 19 లక్షల రూపాయలతో సామాజిక భవనం నిర్మాణం
  • భవనాన్ని ప్రారంభించకుండా కత్తిరి దొంగలించిన టీడీపీ నాయకులు
  • టీడీపీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రామస్తులు
  • గ్రామస్తులు నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనుదిరిగిన టీడీపీనాయకులు

11:45 AM, జనవరి 13, 2024
విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు: ఎమ్మెల్సీ ఇజ్రాయేల్‌

  • ప్రజల్లో చంద్రబాబు పూర్తిగా నమ్మకం కోల్పోయారు
  • ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు
  • చంద్రబాబు, లోకేశ్‌ కులాలు, కుటుంబా­ల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారారు
  • టీడీపీని గెలిపించండి చౌకగా మద్యం అందిస్తానని’ సిగ్గు, ఎగ్గులేకుండా చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారు
  • దేశంలోనే బాబు లాంటి నీచమైన నాయకుడిని చూడం
  • కులాల పేరెత్తి మాట్లాడటం, ఇంత నీచానికి దిగజారడం అవసరమా? బాబు
  •  ధైర్యముంటే సీఎంగా బాబు ఏం చేశారో చెప్పాలి
  • సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలి, అంతేకానీ దిగజారి మాట్లాడటం ఎంత వరకూ సమంజసం?
  • బాబు తన సభల్లో  2014 ఎన్నికల మేనిఫెస్టో తీసుకుని ప్రజలకు చూపిస్తూ వీటిలో నేను చెప్పినవి అన్నీ చేశానని ప్రజలకు చదవి వినిపించాలి
  • అప్పుడు ఆయన క్రెడిబిలిటీ, నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది.
  • వైనాట్‌ 175 అనేదే మా టార్గెట్‌
  • మా నాయకుడి ధైర్యమే మా ధైర్యం
  • 2024 ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదే

11:06 AM, జనవరి 13, 2024
ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులుకు నిరసన సెగ

  • గుంటూరు జిల్లా: రామాంజనేయులను నిలదీసిన చౌడవరం సీఆర్ కాలనీ వాసులు
  • గత ఎన్నికలప్పుడు వచ్చి ఎందుకు రాలేదని ప్రశ్నించిన ప్రజలు
  • రామాంజనేయులు ముందు సమస్యలను ఏకరవు పెట్టిన జనం
  • సమస్యలు చెప్పిన వారి పై చిర్రుబుర్రులాడిన రామాంజనేయులు

11:00 AM, జనవరి 13, 2024
25 నుంచి వైఎస్సార్‌సీపీ కేడర్‌ సమావేశాలు

  • సంక్రాంతి తర్వాత ఎన్నికల క్షేత్రంలోకి వైఎస్సార్‌సీపీ
  • పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేడర్‌ సమావేశం
  • ఐదు లేదా ఆరు జిల్లాలతో ఒక రీజన్‌గా ఏర్పాటు
  • మొత్తం ఐదు రీజన్లవారీగా.. ఐదు ప్రాంతాల్లో కేడర్‌ సమావేశాలు
  • తొలి సమావేశం జనవరి 25వ తేదీన విశాఖ భీమిలిలో 
  • ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్‌

10:53 AM, జనవరి 13, 2024
ఆయనకు టికెట్‌ ఇస్తే సహకరించం

  • తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం టీడీపీ ఇన్‌చార్జి మద్దిపాటిపై అసమ్మతి స్వరం
  • ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 500 కార్లలో మంగళగిరికి ర్యాలీగా పార్టీ శ్రేణులు
  • పార్టీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన 
  • చంద్రబాబు, లోకేశ్‌ లేకపోవడంతో మరింత ఆగ్రహించిన తమ్ముళ్లు
  • రెబల్‌ అభ్యర్థిని రంగంలో దింపుతామంటూ అల్టిమేటం 

10:34 AM, జనవరి 13, 2024
బండారు బెండు వంచారు

  • జనసేన పొత్తుతో పెందుర్తి టికెట్‌ కట్‌ 
  • మాడుగులకు వెళ్లాలంటూ అధినేత ఆదేశం 
  • పెందుర్తి కావాలంటూ బండారు సత్యనారాయణ మూర్తి పట్టు 
  • కష్టమేనంటున్న సొంత పార్టీ నేతలు 
  • రోజాపై వ్యాఖ్యల తర్వాత మరింతగా దిగజారిన పరిస్థితి 
  • బండారు రాజకీయ చాప్టర్‌ క్లోజ్‌ అంటున్న సన్నిహితులు 

09:50AM, జనవరి 13, 2024
అమలాపురంలో టీడీపీ నేతలకు ఝలక్ ఇచ్చిన అంగన్వాడీలు

  • ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పొమ్మన్న  అంగన్వాడీలు
  • తమను గుర్రాలతో తొక్కించి, తమపై దాష్టీకం ప్రదర్శించిన చంద్రబాబు మద్దతు తమకు అవసరం లేదని తెగేసి చెప్పిన అంగన్వాడీలు
  • అంగన్వాడీల రియాక్షన్కు నివ్వెర పోయిన టీడీపీ నాయకులు
  • ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ తప్పించుకునే ప్రయత్నం టీడీపీ నేతలు
  • అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు... మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మీద చెప్పేసిన అంగన్వాడీలు
  • బిక్క మొహంతో వెనుదిరిగిన తెలుగు తమ్ముళ్లు

09:49 AM, జనవరి 13, 2024
‘భ్రమరావతి’ అని  తేలిపోయింది!

  • అమరావతి కాదు.. భ్రమరావతి
  • టీడీపీ నుంచి వచ్చిన కేశినేని నాని వంటి సీనియర్‌ నాయకులే చెబుతుండటంతో బయటపడిన బాబు బండారం
  • బహుజన పరి­రక్షణ సమితి నాయకులు ధ్వజం
  • భూములిచ్చిన రైతులను నిలువునా ముంచినందునే చంద్రబాబు 29 గ్రామాల్లో ఘోరంగా ఓడిపోయారు
  • బాబు రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టి అమరావతి పేరిట దొంగ ఉద్యమం నడిపిస్తున్నారు
  • నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు
  • ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదల ఖాతాలకే సంక్షేమ నగదు వచ్చి చేరుతుంది
  • ఇది కేవలం జగనన్న  పారదర్శక పాలనకు నిదర్శనం
     

08:51AM, జనవరి 13, 2024
చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి అయ్యన్న ఆగ్రహం..

  • మూడు నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్న ఇవ్వని చంద్రబాబు..
  • పార్టీలో అడుగడుగున అవమానిస్తున్నారని అయ్యన్న ఆవేదన.
  • చంద్రబాబు సమావేశాలకు సైతం దూరంగా అయ్యన్న..
  • పార్టీ కార్యాలయంలో జరిగిన బీసీ, పంచాయతీరాజ్ సమావేశాలకు గైర్హాజరు.
  • చంద్రబాబు తుని బహిరంగ సభకు సైతం మొహం చాటేసిన అయ్యన్న..
  • పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని తనకు ముందుగా ఇవ్వలేదని మండిపాటు.
  • దాడి వీరభద్రరావు చేరిక  సమాచారం అయ్యన్నకు ఇవ్వని చంద్రబాబు..
  • బీసీలకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం.

08:32 AM, జనవరి 13, 2024
టీడీపీ ‘ఓటర్ల’ అక్రమాలపై రుజువులతో సహా ఫిర్యాదు

  • విచారించి చర్యలు తీసుకుంటామన్న భారత ఎన్నికల కమిషన్‌ 
  • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వెల్లడి 
  • 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఓటర్ల జాబితాను ఏ విధంగా తారుమారు చేశారనే వాటిపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
  •  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌

07:51 AM, జనవరి 13, 2024
3 కేసుల్లో నేడు సీఐడీ ఎదుట బాబు హాజరు 

  • మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన చంద్రబాబు
  • ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్ద­కు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్న బాబు
  • బాబు హయాంలో జరిగిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు
  • ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు
  • ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది.
  • ఉ. 11 గంటలకు మద్యం కేసు­లో గుంటూరు సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు
  • ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యా­హ్నం 3.30 గంటలకు
  • ఐఆర్‌ఆర్‌ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్న బాబు

07:38 AM, జనవరి 13, 2024
తెలుగుదేశంలో గందరగోళం

  • పోటీకి అభ్యర్థులు కరువు
  • పొత్తుల వల్ల ముందుకెళ్లలేని దుస్థితి
  • క్షేత్రస్థాయిలో నిరాశ, నిస్పృహ
  • వైఎస్సార్‌సీపీ దూకుడుతో వెన్నులో వణుకు
  • బలహీనతను కప్పిపుచ్చేందుకు తొలి దశగా 25 మందితో జాబితా విడుదలకు కసరత్తు!

07:30 AM, జనవరి 13, 2024
పచ్చ ‘సేన’

  • టీడీపీ నేతలకు జనసేన ముసుగు 
  • పొత్తులో కేటాయించే అరకొర సీట్లకూ చంద్రబాబు ఎసరు
  • పవన్‌కళ్యాణ్‌ను కలిసిన టీడీపీ నేతలు వేదవ్యాస్, మాగంటి బాబు, జలీల్‌ఖాన్‌
  • బాబు సూచన మేరకే జనసేన గూటికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ
  • ఆది నుంచి ఉన్న జనసేన నాయకుల్లో ఆందోళన 

07:28 AM, జనవరి 13, 2024
‘స్కిల్డ్‌’ క్రిమినల్‌ చంద్రబాబు

  • కమీషన్లు పోనూ షెల్‌ కంపెనీల ద్వారా బాబు నివాసానికి రూ.241 కోట్లు
  • హవాలా అక్రమాలను నిర్థారించిన ఈడీ, కాగ్‌ 
  • ఏ–1 చంద్రబాబు పాత్రను  ఆధారాలతో సహా రుజువు చేసిన సీఐడీ 
  • ఖైదీగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో 52 రోజులు బాబు
  •  నేడు సీఐడీ ఎదుట చంద్రబాబు హాజరు

07:07 AM, జనవరి 13, 2024
చంద్రబాబు, లోకేశ్‌ దొంగలు 

  • కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారు 
  • గత ఎన్నికల ముందు మేమే రూ.150 కోట్లు ఇచ్చాం 
  • ప్రతి సోమవారం సమీక్ష చేసింది లంచాల కోసమే 
  • టీడీపీ 75 శాతం పూర్తి చేసిందనేది పచ్చి అబద్ధం 
  • ఆ పార్టీ ప్రజల కోసం కాదు... కుటుంబం కోసమే 
  • అదసలు పార్టీ నే కాదు... ఓ వ్యాపార సంస్థ 
  • లోకేశ్‌ రాయలసీమలో ఎందుకు పోటీ చెయ్యడు? 
  • అక్కడ పోటీ చేసేంత దమ్ము, ధైర్యం లేవా? 
  • ‘కియా’ తెచ్చానంటాడు... అనంతలో గెలవలేదేం?
  • ఈ పార్టీ లో ఉండలేను... రాజీనామా చేస్తున్నా.. మాజీ ఎంపీ రాయపాటి తనయుడు, ‘ట్రాన్స్‌ట్రాయ్‌’ యజమాని రంగారావు స్పష్టీకరణ
  • చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టిన గుంటూరు నేత   
     

07:01 AM, జనవరి 13, 2024
అద్దె బ్యాచ్‌ దిగింది !

  • మౌత్‌ పబ్లిసిటీ కోసం రంగంలోకి టీడీపీ ఎల్లో కిరాయి మూకలు
  • ముఖ్యమంత్రి జగన్‌పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం
  • స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల పనితీరు బాగా లేదు.. టికెట్‌ రాదంటూ అసత్య ప్రచారం
  • ఎల్లో మీడియా పత్రికల్లోని వార్తలను చదువుతూ స్థానికుల్ని నమ్మించే యత్నం
  • ఓడిపోతామనే ‘చీప్‌ ట్రిక్స్‌’కు పాల్పడుతున్న పచ్చ బ్యాచ్‌ 
  • అద్దె బ్యాచ్‌ ప్రచారంపై మండిపడుతున్న స్థానికులు

06:59 AM, జనవరి 13, 2024
యావజ్జీవం’ తప్పదు!

  • ఏ లెక్కన చూసినా శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు
  • చుట్టుముట్టిన స్కిల్, ఫైబర్‌నెట్, అసైన్డ్‌ భూములు, ఐఆర్‌ఆర్, లిక్కర్, ఇసుక స్కాంలు
  • అన్ని కుంభకోణాల ప్రధాన కుట్రదారు, లబ్ధిదారు ఆయనే
  • సెక్షన్‌ 409 కింద ఒక్కో కేసులో యావజ్జీవ ఖైదుకు అవకాశం
  • అవినీతి నిరోధక చట్టం కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు
  • బాబు అవినీతికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని కోర్టు చెప్పలేదు
  • అయినా ముందస్తు బెయిల్‌ను వక్రీకరిస్తున్న ఎల్లో మీడియా
  • నాడు అధికార దుర్వినియోగం.. యథేచ్ఛగా ప్రజాధనం దోపిడీ
  • సీఐడీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం
  • డాక్యుమెంటరీ ఆధారాలు.. కీలక సాక్షుల వాంగ్మూలాలు

బాబుపై నమోదైన ఐపీసీ సెక్షన్లు ఇవే..

  • 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) 409 సెక్షన్‌ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.
  • 13 (2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది
     

06:51 AM, జనవరి 13, 2024
చంద్రబాబుకు బ్యాడ్‌ టైం

  • టీడీపీని వరుసగా వీడుతున్న సీనియర్లు
  • కేశినేని నాని బాటలోనే మరికొందరు 
  • తాజాగా రాయపాటి తనయుడు రంగారావు రాజీనామా
  • షాక్‌ నుంచి కోలుకోకముందే.. మరో రాజీనామా
  •  టీడీపీకి లింగమనేని శివరామ ప్రసాద్‌ రాజీనామా
  • టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగమనేని శివరామ ప్రసాద్‌
  • ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా ప్రకటించిన లింగమనేని
  • ఈయన ద్వారానే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు వేయించిన చంద్రబాబు
     

06:45 AM, జనవరి 13, 2024
మేనిఫెస్టోపై కిం.. కర్తవ్యం?

  • ఉమ్మడి మేనిఫెస్టోపై ఎడతెగని చర్చలు
  • ఏం చేద్దాం? ఏమని చెబుతాం? టీడీపీ-జనసేన కసరత్తులు
  • రెండు పార్టీల్లో భిన్న సిద్ధాంతాలు
  • హామీల కంటే ముందే రెండు పార్టీల్లో సీట్ల చిచ్చు
  • బోలెడు విభేదాల మధ్య మేనిఫెస్టో చర్చలు
  • జనసేన మేనిఫెస్టో కమిటీతో నాదెండ్ల మనోహర్‌ సమావేశం 
  • ప్రతి చేతికి పని - ప్రతి చేనుకి నీరు అనే నినాదం ఉండాలంటున్న జనసేన
  • ఈ నినాదం అంత వర్క్‌అవుట్‌ కాదంటున్న టీడీపీ
  • యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై మేనిఫెస్టోలో ఫోకస్ పెడదామంటున్న టీడీపీ
  • 2014-19 మధ్య ఏం చేయలేదంటున్న జనసేన
  • వ్యవసాయానికి అండ, పేదల సంక్షేమంపై చర్చ
  • మహిళా భద్రత, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చ
  • ఎలాంటి అంశాలు పెట్టాలన్న దానిపై కుదరని ఏకాభిప్రాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement