March 20th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Assembly Elections 2024: Political Round Up March 20 Updates | Sakshi
Sakshi News home page

March 20th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌.. ఎప్పటికప్పటి సమాచారం

Published Wed, Mar 20 2024 6:31 AM | Last Updated on Wed, Mar 20 2024 9:52 PM

AP Assembly Elections 2024: Political Round Up March 20 Updates - Sakshi

AP Elections & Political March 20th Latest News Telugu

08:30 PM, మార్చి 20 2024

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

  • సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయుడుపేటకు చెందిన 300 కుటుంబాలు 
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య

08:00 PM, మార్చి 20 2024

తిరుపతి జిల్లా  పెళ్లకూరు మండలంలో టీడీపీకి బిగ్ షాక్ 

  • ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 కుటుంబాలు 
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి

7:27 PM, మార్చి 20 2024
విజయవాడ సెంట్రల్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు

  • రహస్య సమావేశం పెట్టుకున్న సెంట్రల్ టీడీపీ నేతలు
  • బోండా ఉమా వైఖరితో విసిగిపోయిన సెంట్రల్ టీడీపీ నేతలు
  • బోండా ఒంటెద్దు పోకడపై అసహనంలో టీడీపీ నేతలు
  • బోండాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయం 
  • బోండా ఉమాని మార్చకపోతే తామే పార్టీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో సెంట్రల్ టీడీపీ నేతలు

7:30 PM, మార్చి 20 2024
తూర్పుగోదావరి: నల్లజర్ల  టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

  • మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల భారీ నిరసన
  • మద్దిపాటి వద్దు  ఇంకెవరైనా ముద్దు అంటూ  ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో  ఆందోళన
  • ఏడాదిన్నర నుంచి టీడీపీలో కొనసాగుతున్న వర్గ పోరు
  • ఇన్‌ఛార్జ్‌ మద్దిపాటి వెంకటరాజుని వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్
  • మద్దిపాటికి టికెట్ కేటాయించిన  అధిష్టానం
  • మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో గెలవడంటున్న అసమ్మతి వర్గీయులు
  • అయినప్పటికీ అధిష్టానం మళ్లీ మద్దిపాటికే టికెట్‌ ఖరారు చేయడంపై భగ్గుమన్న వర్గ విబేధాలు

5:47 PM, మార్చి 20 2024
పిఠాపురంలో జనసేకు భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి మాకినీడి శేషుకుమారి

  • సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి
  • 2019ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన శేషుకుమారి
    జనసేనకి అసలు విధివిధానాలే లేవు: శేషకుమారి 
  • గత ఎన్నికలలో 28 వేల ఓట్లు నాకు వచ్చాయి 
  • పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు
  • పవన్ని జనం నమ్మే పరిస్థితి లేదు
  • పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు
  • జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి
  • జగన్‌తో అసలు పవన్‌ని ఎవరూ పోల్చుకోరు
  • జగన్ స్థాయి వేరు..
  • పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం.. ఆచరణలో శూన్యం

5:34 PM, మార్చి 20 2024
సీఎం జగన్‌ పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు: ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

  • 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా
  • 12 వేల ఉద్యమాలు చేశాం 
  • 2 వేల జీవోల సాధించాం
  • జగన్‌ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు
  • సీఎం జగన్‌కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారు
  • గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయి 
  • సీఎం జగన్‌ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారు
  • సీఎం జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి
  • ప్రజల అభివృద్ధే సీఎం జగన్‌ అభివృద్ధి
  • ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్‌ ఫోటోను పెట్టుకుంటున్నారు
  • నేను కర్నూలులో స్వయంగా చూశా 
  • సీఎం జగన్‌ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త
  • ఎలాంటి పోరాటం చేయకుండానే 
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ మేలు చేశారు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలి 
  • విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఓటేసి గెలిపించాలి

5:13 PM, మార్చి 20 2024
పవన్‌కి అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు: వైఎస్సార్‌సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత

  • డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారు
  • మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే  ఓట్లేయమని అడుగుతాం 
  • కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది
  • నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ
  • నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం 
  • పవన్‌ని కూడా నేను మా వైఎస్సార్‌సీపీకి రమ్మంటే బావుంటుందా?
  • జగన్ మీద జనానికి నమ్మకం ఉంది
  • ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి
  • అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు
  • పవన్‌కి అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు
  • జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు

4:51 PM, మార్చి 20 2024
వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరూ టీడీపీలో చేరడంలేదు: కేతిరెడ్డి పెద్దారెడ్డి 

  • జేసీ కుటుంబంపై తాడిపత్రిలో ఎవరైనా గెలుస్తారు
  • రోడ్డు పక్కన ఉన్నవారికి డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు
  • జేసీ ఫ్యామిలీ తాడిపత్రి ప్రతిష్టను దిగజారుస్తోంది
  • 2019 ఎన్నికల కంటే ఈసారి బలంగా ఉన్నాం
  • నిజమైన కార్యకర్తలు నా వెంటే ఉన్నారు : కేతిరెడ్డి పెద్దారెడ్డి

4:33 PM, మార్చి 20 2024
పశ్చిమగోదావరి: ఉండిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి శివరామరాజు ప్రచారం 

  • ఉండిలో ప్రచారం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు
  • అనుచరులతో, అభిమానులతో భారీ కార్ల ర్యాలీ
  • ఉండి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానంటున్న శివరామరాజు

4:01 PM, మార్చి 20 2024
టీడీపీ, జనసేనకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్

  • పరిధిలో లేని అంశంపై మాకు ఫిర్యాదు చేశారని స్పష్టం చేసిన సీఈవో
  • ప్రధానమంత్రి సభ ఫెయిల్యూర్‌పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన
  • ఎన్డీఏ సభ ఫెయిల్యూర్‌ని పోలీస్లపై నెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ, జనసేన
  • బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీస్ కారణమంటూ గగ్గోలు
  • పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడనికి ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన
  • సీఈఓ సమాధానంతో బట్టబయలైన టీడీపీ, జనసేన బండారం

డీజీపీ, ఎస్పీని టార్గెట్ చేస్తూ సీఈవోకి ఫిర్యాదు

  • ప్రధానమంత్రి భద్రత అంశం మా పరిధిలో లేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా
  • ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్ పీజీ పరిధిలో ఉంటాయి
  • ప్రధాని పర్యటన భద్రత అంతా హోం శాఖనే చూస్తుంది
  • ఎన్నికల కమిషన్ కి ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు
  • నాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు

03:26 PM, మార్చి 20 2024
గుంటూరు: ప్రత్తిపాడులో టీడీపీ శ్రేణుల రౌడీయిజం

  • ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బలసాని ఇంటిపై దాడి
  • టీడీపీ శ్రేణుల దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు
  • కారులో ఉండి దాడికి డైరెక్షన్‌ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు

03:20 PM, మార్చి 20 2024
పిఠాపురంలో జనసేనకు భారీ షాక్

  • ఆ పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి కాసేపట్లో వైఎస్సార్‌సీపీలో చేరిక
  • సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న శేషకుమారి
     

02:51 PM, మార్చి 20 2024
27 నుంచి ‘మేము సిద్ధం’ బస్సు యాత్ర.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

  • 27న వైఎస్సార్ జిల్లాలో ‘మేము సిద్దం’ బస్సుయాత్ర
  • 28న నంద్యాల జిల్లాలో కొనసాగనున్న సిద్దం బస్సుయాత్ర
  • అనంతరం కర్నూలు జిల్లాలో కొనసాగనున్న బస్సు యాత్ర
  • సిద్దం కావాలంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు పిలుపునిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర
  • వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్న బస్సు యాత్ర
  • ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యే, ఎంపీ, నియోజవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి
  • మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పెద్దిరెడ్డి
  • ఆ దిశగా అడుగులు పడుతున్నాయి
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందో  చంద్రబాబు సమాధానం చెప్పాలి
  • చంద్రబాబు ధోరణి అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు

01:27 PM, మార్చి 20 2024
పవన్ వ్యాఖ్యలు.. పిఠాపురం వర్మ కౌంటర్ 

  • పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకి మోయను
  • పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తాం
  • వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా
  • పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు

01:04 PM, మార్చి 20 2024
జనసేనలో జగడం

  • విశాఖ జనసేన కార్పొరేటర్‌ సాధిక్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • వంశీ యాదవ్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ మరో వర్గం మహిళా కార్యకర్తల నిరసన
  • మహిళలపై దాడికి దిగిన వంశీ వర్గీయులు
  • పరిస్థితి ఉద్రిక్తం

12:53 PM, మార్చి 20 2024
బాబు ఓ ఊసరవెల్లి: కేశినేని నాని

  • దేశంలోనే  అభివృద్ధి సంక్షేమంలో  రాష్ట్రం ముందుంది
  • రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారు
  • తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో దేవినేని అవినాష్ తన దైన ముద్ర వేసుకున్నారు
  • మంచి వాడిగా ముసుగు వేసుకున్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
  • మోదీ భజన చేసేందుకు టీడీపీ జనసేన నేతలు సిద్ధమయ్యారు
  • ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు
  • ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు 
  • పిఠాపురంలో ఓడిపోవటాని పవన్ సిద్ధమయ్యాడు
  • ఓటమి భయంతోనే పవన్  అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు
  • చంద్రబాబు ,పవన్కు ప్రజాగళం సభలో మోదీని శాలువా తో సత్కరించడం చేతకాలేదు
  • 2024 ఎన్నికల తరువాత టీడీపీ జనసేన పార్టీలు బీజేపీలో విలీనం అయిపోతాయి
  • లోకేష్ కనులన్నల్లోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోంది

 కేశినేని నాని వ్యాఖ్యలు


12:44 PM, మార్చి 20 2024
అణగారిన వర్గాలకు జగనన్న ప్రభుత్వం భరోసా: దేవినేని అవినాష్

  • జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమ అందుతుందని  ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
  • ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించిన ఘనత జగన్ ది 
  • తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
  • ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమ పథకాలు అందించాం
  • ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలి
  • సొంత అజెండా కోసమే బీజేపీతో టీడీపీ ,జనసేన పార్టీలు దోస్తీ కలిశాయి
  • మైనార్టీ లకు వ్యతిరేకంగా గా NRC ,CAA లను తీసుకువచ్చిన బీజేపీకి చంద్రబాబు మద్దతు పలికాడు
  • జగన్ లేకపోతే సంక్షేమ పథకాలకు ఆమడ దూరంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది 
  • అణగారిన వర్గాలకు జగన్ ప్రభుత్వం భరోసా కల్పించింది

దేవినేని అవినాష్ వ్యాఖ్యలు

12:34 PM, మార్చి 20 2024
అన్ని వర్గాలకు సీఎం జగన్ మేలు చేశారు: కిలారి రోశయ్య 

  • మంచి చేస్తేనే ఓటు వేయాలన్న ఏకైక  నేత జగన్
  • బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు వంద సీట్లు ఇచ్చారు
  • సీట్ల సర్దుబాటులో విపక్షాలు మునిగి తేలుతున్నాయి
  • ఎన్‌ఆర్‌ఐలకు స్ధానిక సమస్యలు తెలియవు

ఎన్నికల ప్రచారంలో కిలారి రోశయ్య వ్యాఖ్యలు

12:14 PM, మార్చి 20 2024
టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ 

  • ఇవాళ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం
  • ఎంపీ సీట్ల లో మార్పులు కావాలంటూ ఢిల్లీ హైకమాండ్ ని కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు
  • విజయనగరం పార్లమెంట్ స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని కోరుతున్న బీజేపీ 
  • పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా టీడీపీ ఆలోచనలు
  • ఏలూరు పార్లమెంట్ కు తెరపైకి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ 
  • ఇప్పటికే ఏలూరు స్థానాన్ని, ఆశిస్తున్న కంభంపాటి, డా. పవన్, భాష్యం రామకృష్ణ
  • అనంతపురంలో చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన జేసీ పవన్ కుమార్ రెడ్

12:11 PM, మార్చి 20 2024
పురుగుల మందు తాగిన టీడీపీ నేత

  • పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లో టికెట్ గొడవ
  • పార్టీకి కష్టపడి పనిచేసిన అరవింద బాబుకు టికెట్ కేటాయించాలంటూ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి ప్రెస్ మీట్
  • అరవింద్ బాబు టికెట్ ను లావు శ్రీకృష్ణదేవరాయలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం
  • అరవింద్ బాబు టికెట్ కేటాయించాలంటూ ప్రెస్ మీట్ లోనే పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నం పాల్పడిన పులిమి రామిరెడ్డి
  •  వెంటనే హాస్పిటల్ కి తరలింపు

11:49 AM, మార్చి 20 2024
బాబు ఓ రాజకీయ వికలాంగుడు: పెద్దిరెడ్డి

  • పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరు
  • చంద్రబాబు రాజకీయ వికలాంగుడు
  • జనసేన, బీజేపీలు ఊతకర్రల్లా వచ్చాయి
  •  ఈ పొత్తులను ముందుగా ఊహించిందే
  • బాబుది అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే సిద్ధాంతం
  • జుట్టు అందలేనది ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల కాళ్లు పట్టుకున్నారు
  • మూడు రాజధానులకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారు
  • కర్నూలు న్యాయరాజధాని తప్పక అవుతుంది
  • 28న నంద్యాల, 29న ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలు ఉంటాయి
     

11:33 AM, మార్చి 20 2024
సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు ముద్రగడ, వంగా గీత

  • తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి ముద్రగడ పద్మనాభం, వంగా గీత
  • నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్‌
  • ముద్రగడ, ద్వారంపూడికి పిఠాపురం బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం
  • వైఎస్సార్‌సీపీలో చేరనున్న పిఠాపురం జనసేన మాజీ ఇన్‌ఛార్జి మాకినీడు శేషు కుమారి
  • 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థినిగా పోటీ చేసిన శేషు కుమారి
  • జనసేన పరిణామాలపై గత కొంతకాలంగా ఆమె తీవ్ర అసంతృప్తి
  • కాసేపట్లో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్న శేషు కుమారి

11:33 AM, మార్చి 20 2024
పవన్‌ పోటీపై ద్వారంపూడి సెటైర్లు

  • పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయలంటే చంద్రబాబు టిక్‌ పెట్టాలి
  • ఎంపీగా చేయాలంటే అమిత్‌ షా టిక్‌ పెట్టాలి
  • ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్‌కు ఏమిటీ ఖర్మ?
  • తన సామాజిక వర్గం ఎక్కువగా ఉందనే పిఠాపురం వెళ్లారు
  • కానీ, పిఠాపురం ప్రజలు పవన్‌ను కచ్చితంగా ఓడిస్తారు

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలు

11:06 AM, మార్చి 20 2024
లోకేష్‌ కాన్వాయ్‌లో తనిఖీలు

  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు
  • ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఉండవల్లి కరకట్ట వద్ద తనిఖీలు 
  • సహకరించిన నారా లోకేష్‌
  • కాన్వాయ్‌లోని కార్లు అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు 

10:45 AM, మార్చి 20 2024
కొండబాబుపై పరువు నష్టం దావా వేస్తా: ద్వారంపూడి వార్నింగ్‌

  • మాజీ ఎమ్మెల్యే కొండబాబుకు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
  • ఓఎన్జీసీ నుండి రూ.1000 కోట్లు తీసుకున్నానని నిరూపించు:ద్వారంపూడి
  • నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను:ద్వారంపూడి
  • నిరూపించకపోతే వచ్చే ఎన్నికల నుంచి తప్పుకుంటావా? :ద్వారంపూడి
  • ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టదావా వేస్తా:ద్వారంపూడి
  • ఓఎన్జీసీ నష్టపరిహరం కోసం మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని కొండబాబు నీరుగారుస్తున్నాడు:ద్వారంపూడి
  • ఓఎన్జీసీ నష్టపరిహరం నూటికి నూరు శాతం అందాలని నా కోరిక:ద్వారంపూడి
  • రాజకీయాలకు అతీతంగా మత్స్యకారుల ఉద్యమానికి నా‌ మద్దతు:ద్వారంపూడి
  • మత్స్యకారుల ఉద్యమానికి ఓఎన్జీసీ అధికారులు దిగివచ్చారు:ద్వారంపూడి
  • నష్టపరిహరం పై కమీటీ వేసి నెలరోజుల్లో నివేదిక ఇస్తామన్నారు:ద్వారంపూడి

10:03 AM, మార్చి 20 2024
పవన్‌కు ఇదేం కొత్త కాదు: వెల్లంపల్లి 

  • పవన్ కల్యాణ్ కు ఓటమి కొత్త కాదు.
  • పిఠాపురంలో పవన్‌కు ఓట్లే పడవు
  • వంగా గీత మీద పవన్ గెలవడం అసాధ్యం
  • ఓటమి భయంతోనే భీమవరం గాజువాకను పవన్‌ వదిలేశారు
  • ఓడిపోవడం ఖాయం అయింది కాబట్టే పవన్‌ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు
  • పదేళ్లు పార్టీ నాయకుడుగా ఉండి బీజేపీ చెప్తే ఎంపీ, ఎమ్మెల్యే గాని పోటీ చేస్తానంట హాస్యాస్పదంగా ఉంది.
  • ఎన్నికల తర్వాత బీజేపీలోకి జనసేన పార్టీ పవన్ విలీనం చేస్తారు
  • శ్రీపాద వల్లభుడు మీద ప్రమాణం చేసి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడని పవన్‌ను చెప్పమనండి.
  • పిఠాపురంలో పవన్ కళ్యాణ్ , మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు ఓటమి కాయం.
  • 175/175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం

గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

09:44 AM, మార్చి 20 2024
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్

  • ప్రజా రాజ్యం తరఫున రాజకీయాల్లోకి వచ్చిన వంగా గీత.. జనసేనలోకి రావాలంటూ పవన్‌ వ్యాఖ్య
  • పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్సార్‌సీపీ నేత వంగా గీత
  • నేను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?: వంగా గీత
  • 2009 కంటే ముందే రాజకీయాల్లో ఉన్నా: వంగా గీత
  • చిరంజీవి గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు: వంగా గీత
  • పవన్ వి దింపుడు కల్లెం ఆశలు: వంగా గీత
  • పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు: వంగా గీత

కాకినాడలో పిఠాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత వ్యాఖ్యలు

09:02 AM, మార్చి 20 2024
కూటమి అభ్యర్థుల జాబితాపై ఎదురుచూపులు

  • అభ్యర్థుల ప్రకటనలో ముందున్న వైఎస్సార్‌సీపీ 
  • ఒక్క అనకాపల్లి ఎంపీ సీటు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ 
  • ఇప్పటివరకు 128 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, మరో 16 స్థానాలపై కసరత్తు
  • జనసేన లో ఐదు అసెంబ్లీ సీట్లకు రావాల్సిన క్లారిటీ 
  • బీజేపీ పోటీచేసే పది స్థానాలపై ఇంకారాని స్పష్టత 
  • ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించని ఏపీ బీజేపీ 

08:45 AM, మార్చి 20 2024
లిస్ట్‌పై బాబులో వణుకు

  • తేలని టీడీపీ ఎంపీ సీట్ల పంచాయతీ
  • ఇప్పటివరకు ఒక్క ఎంపీ అభ్యర్థి ని ప్రకటించని చంద్రబాబు
  • 3 రోజులుగా  జాబితా విడుదల అంటూ మీడియాకు లీకులు
  • బీజేపీ సీట్ల లెక్క  తేలక పెండింగ్ లో టీడీపీ లిస్ట్
  • వందల కోట్లు ఇచ్చిన వాళ్ళకే టీడీపీ ఎంపీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం
  • ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటన  తో టీడీపీ లో రచ్చ రచ్చ
  • ఎంపీ సీట్లు ప్రకటిస్తే మరింత రచ్చ అవుతుందని బాబు లో వణుకు

 ఇదీ చదవండి: ఢిల్లీ పెద్దలకు చేరిన బాబు కుట్ర

08:06 AM, మార్చి 20 2024

సీఎం జగన్‌ బ్రాండ్‌గా ఎన్నికల ప్రచారం

  • ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
  • సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • బస్సు యాత్ర ద్వారా కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధం చేస్తాం
  • ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్రవరకు విరామం లేకుండా బస్సు యాత్ర
  • నిత్యం వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. సాయంత్రం భారీ బహిరంగ సభ
  • 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభం.. తొలిరోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ
  • 28న నంద్యాల, 29న కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాల్లో యాత్ర
  • ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్ర
  • కార్యకర్తల్లో చైతన్యం నింపే కార్యక్రమమిది
  • మా బ్రాండ్‌ సీఎం జగనే
  • నోటిఫికేషన్‌ తరువాత సీఎం జగన్‌ మలివిడత ప్రచారం
  • 27వ తేదీ (తొలి రోజు యాత్ర): ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద యాత్రకు శ్రీకారం.
    సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభ.
  • 28వ తేదీ (రెండో రోజు) : ఉదయం నంద్యాల లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి. 
    సాయంత్రం నంద్యాలలో భారీ బహిరంగ సభ.
  • 29వ తేదీ (మూడో రోజు): కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. పలు రంగాల ప్రముఖులతో ముఖాముఖి.
    సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ.

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి

08:01 AM, మార్చి 20 2024
రెండుగా చీలిన తిరుపతి జనసేన

  • తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వద్దంటున్న కూటమి 
  • రెండు వర్గాలుగా చీలిపోయిన జనసేన
  • పొత్తు ధర్మం పాటించని టీడీపీ
  • తెరవెనుక చక్రం తిప్పుతున్న చంద్రబాబు
  • నేడు మరోసారి భేటీ కానున్న జనసేన అసమ్మతి వర్గం 
  • తిరుపతి నగరం 50 డివిజన్లలో   జనసేన అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తే ఊరుకునేది లేదంటున్న కిరణ్ రాయల్ వర్గం
  • నాన్ లోకల్ ఆరణి శ్రీనివాసులు కు సహకరించేది లేదంటున్న జనసేన
  • జనసేన తరఫు అయినా పోటీ చేస్తానంటున్న టీడీపీ సుగుణమ్మ

07:31 AM, మార్చి 20 2024
జనంలోకి సీఎం జగన్‌..  27 నుంచి బస్సు యాత్ర

  • వైఎస్సార్‌సీపీ భారీ ఎన్నికల ప్రచారం
  • మేమంతా సిద్ధం పేరుతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర
  • ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సుయాత్ర
  • ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్న సీఎం జగన్‌
  • పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో.. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్‌ అయ్యేలా కొనసాగనున్న యాత్ర
  • ప్రజల నుంచి సూచనలు,సలహాలు స్వీకరించనున్న సీఎం జగన్‌
  • ఉత్తరాంధ్రలో ముగియనున్న బస్సు యాత్ర
  • యాత్ర అనంతరం.. ప్రతీరోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు
  • ఎన్నికలకు ఎక్కువ రోజులు సమయం ఉండడంతో.. ఒకవైపు పాలన చూస్తూనే మరోవైపు ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్‌

07:28 AM, మార్చి 20 2024
అయోమయం పవన్‌

  • పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్‌పై తర్జన భర్జన 
  • నిన్న కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్‌ పేరును ప్రకటించిన పవన్‌
  • ఆ వెంటనే మరో గందరగోళమైన ప్రకటన
  • బీజేపీ పెద్దలు నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారు: పవన్‌
  • ఒకవేళ అమిత్ షా చెప్తే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా: పవన్ 
  • నేను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారు: పవన్
  • ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ ప్రకటన
  • ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళతానంటున్న పవన్
  • ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేక తలలు పట్టుకుంటున్న జనసేన వర్గాలు

07:15 AM, మార్చి 20 2024
హస్తినలోనే ఏపీ బీజేపీ నేతలు

  • ఏపీ బీజేపీలో ముదురుతున్న టిక్కెట్ల‌ లొల్లి
  • ఢిల్లీకి చేరిన  పంచాయితీ
  • టిక్కెట్ల కోసం ఢిల్లీలోనే తెలుగు బీజేపీ నేతల‌ పాగా
  • ఢిల్లీలోనే ఉండి సీఎం రమేష్, సుజనా చౌదరి తదితరుల తీవ్ర ప్రయత్నాలు
  • అనకాపల్లి సీటు కోసం రమేష్ ఒత్తిడి
  • ఏలూరు స్ధానం కోసం సుజనా చౌదరి ఢిల్లీ లాబీయింగ్
  • నరసాపురం ఎంపీ కోసం రఘురామకృష్ణంరాజు పైరవీలు
  • ఢిల్లీ పెద్దల చుట్టూ రఘురామ చక్కర్లు
  • రఘురామకృష్ణంరాజు చంద్రబాబు కోసం‌ పనిచేసే మనిషంటూ సీనియర్ల‌ ఫిర్యాదులు
  • సీనియర్ల ఫిర్యాదు నేపధ్యంలో రఘురామకృష్ణంరాజుకి అపాయింట్ మెంట్ సైతం ఇవ్వని బీజేపీ అధిష్టానం
  • అయినా నరసాపురం టిక్కెట్ నాదేనంటూ రఘురామకృష్ణంరాజు ప్రగల్బాలు
  • విశాఖ సీటుకోసం  జీవీఎల్‌ ఢిల్లీలోనే మకాం
  • నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ  సమావేశం జరిగే అవకాశం
  • ఏపీలోని ఆరు ఎంపీ స్ధానాలపై అభ్యర్దుల ఎంపిక ఉంటుందంటున్న బీజేపీ శ్రేణులు
  • ఒకటి, రెండు రోజులలోనే బీజేపీ ఎంపీ స్ధానాలు, అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం
  • అనకాపల్లి, అరకు, ఏలూరు లేదా నరసాపురం, రాజంపేట, హిందూపూర్ , తిరుపతి స్ధానాలు బీజేపీకి అంటూ టీడీపీ లీకులు
  • టీడీపీ లీకులపై గుర్రుగా ఉన్న బీజేపీ సీనియర్లు
  • గెలిచే స్ధానాలే తీసుకోవాలంటున్న బీజేపీ సీనియర్లు
  • చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకి మరోసారి పార్టీని బలి చేయద్దంటున్న సీనియర్లు

06:53 AM, మార్చి 20 2024
‘ఎవరైనా ఒకటే.. వెన్నుపోటే’

  • చంద్రబాబు తీరుపై నిమ్మల, బీకే వర్గాల గుర్రు
  • వాడుకుని వదిలేశారంటూ కేడర్‌ వద్ద ఆవేదన
  • కదిరిలో మైనార్టీకి సీటివ్వకుండా మోసం చేశారంటున్న చాంద్‌బాషా వర్గం
  • కళ్యాణదుర్గంలో బాబు సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి జ్వాలలు
  • అనంతపురం, గుంతకల్లు సీట్లపై అందుకే తాత్సారం

06:42 AM, మార్చి 20 2024
ఉండవల్లిలో టీడీపీ దౌర్జన్యం

  • తాడేపల్లి మండలం ఉండవల్లి లో తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం
  • తెలుగుదేశం బోర్డులు తొలగించేందుకు వచ్చిన సచివాలయం సిబ్బంది అడ్డుకున్న తెలుగుదేశం నాయకులు
  • ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేని బోర్డులు తొలగించాల్సిందేనన్న సచివాలయం సిబ్బంది
  • సచివాలయం సిబ్బందితో వాదనకు దిగిన తెలుగుదేశం నాయకులు
     

06:30 AM, మార్చి 20 2024
సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ

  • ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ వినూత్న పంథా
  • సోషల్‌ మీడియాలో వెరైటీ క్యాంపెయిన్‌
  • సామాన్యులే తన స్టార్‌ క్యాంపెయినర్లు అని ప్రకటించుకున్న సీఎం జగన్‌
  • తాము వైఎస్సార్‌సీపీ వైపు అని కరాఖండిగా చెప్పేస్తున్న జనం
  • తద్వారా.. ఐటీడీపీ, జనసేన సోషల్‌ ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వైనం


06:28 AM, మార్చి 20 2024
జనసేనతో ‘బాబు’ బంతాట

  • ఆ పార్టీకి కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకూ చంద్రబాబు అడ్డు
  • బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై రాని తుది స్పష్టత   
  • రెండు అసెంబ్లీ స్థానాలపై మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ
  • తనూ ప్రకటించక, జనసేననూ ప్రకటించనివ్వక బాబు రాజకీయం
  • చంద్రబాబు తీరుపై మూడు పార్టీల నేతలూ మండిపాటు

06:26 AM, మార్చి 20 2024
ఎన్నికల సంఘం సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

  • సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి
  • ఈనాడు పత్రిక, టీడీపీ సోషల్ మీడియా, నాగబాబు సోషల్ మీడియా పోస్టింగ్‌లపై ఫిర్యాదు
  • సీఎం జగన్‌పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు
  • ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని వినతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement