AP Assembly Elections 2024
-
మదనపల్లి ఫైల్స్ దగ్ధంపై మండలిలో రగడ
సాక్షి, గుంటూరు: మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై శాసన మండలి ఇవాళ అట్టుడుకింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును మంత్రి అనగాని సత్యకుమార్ ప్రస్తావనవకు తేవడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రికార్డుల నుంచి పెద్దిరెడ్డి తొలగించాల్సిందేనని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు.మంగళవారం ఏడో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. శాసన మండలిలో.. మదనపల్లి ఘటన ప్రస్తావించిన మంత్రి అనగాని.. పెద్దిరెడ్డి పేరు లేవనెత్తారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించడంపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ‘‘కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు. మీకు చేతనైతే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోండి. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదు. రికార్డుల నుండి పెద్దిరెడ్డి పేరును తొలగించాలి’’ అని బొత్స అన్నారు. ఈ క్రమంలో పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలంటూ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు మంత్రి అనగానికి సూచించారు. -
ఫ్యాన్‌కే వేశాం.. కానీ?
విజయనగరం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికమంది ఫ్యాన్‌కు ఓటేస్తే.. కూటమి అభ్యర్థికి ఎలా పడ్డాయంటూ గ్రామాల్లోని రచ్చబండలపై చర్చ జోరుగా సాగుతోంది. కొన్ని గ్రామాల్లో శతశాతం వైఎస్సార్సీపీ అభిమానులు ఉన్న చోట కూడా సైకిల్ గుర్తుకు వందల్లో ఓట్లు రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా ఎలా సాధ్యమైందంటూ ఆయా గ్రామాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అందరమూ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తే.. కూటమి అభ్యర్థులకు మెజార్టీ ఎలా వచ్చిందంటూ నాయకులు, ప్రజలు ఓ చోటకు చేరి తర్కిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు ఓటువేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్ కేంద్రంలో ఏమైనా మతలబు జరిగిందా? లేదంటే ఈవీఎంలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహం వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా ఫలితాలు భిన్నంగా ఉన్నాయని, ఓటర్లు ఓ వైపు ఉంటే.. ఓట్లు మరోవైపు పడ్డాయని, దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తే నిజాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుమానాలు ఉన్నాయి ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి. నాతో పాటు మా ఊరిలో అత్యధిక మంది వైఎస్సార్ సీపీకి ఓటు వేశాం. ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయో అర్థం కావడం లేదు. ఫలితాల సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలి. – కునుకు వెంకటరావు, సర్పంచ్, గుంకలాం, విజయనగరం జిల్లా ఇది ఎలా సాధ్యం? మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశాం. జగన్మోహన్రెడ్డిని సీఎం చేద్దామనే దృఢ సంకల్పంతో మా పంచాయతీలో 70 శాతం మంది ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి మద్దతు తెలిపామని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మా పంచాయతీలో 3,686 ఓట్లు పోల్ కాగా, ఇందులో 2 వేలకు పైబడి ఓట్లు వైఎస్సార్ సీపీకే రావాల్సి ఉంది. కానీ ఫలితాలు చూసే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి కేవలం 1507 ఓట్లు, టీడీపీకీ 2,042 ఓట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థంకావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నక్క వర్షిణి,వైస్ ఎంపీపీ, బొద్దాం గ్రామం, రాజాం కుట్ర పూరితమే! మా గ్రామంలో నాలుగు పోలింగ్ బూతులున్నాయి. మొత్తం 3,417 ఓట్లు పోలయ్యాయి. చాలా ఓట్లు టీడీపీకి వెళ్లాయి. పోలింగ్ కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఓటర్ల నాడికి వ్యతిరేకంగా పోలింగ్ జరిగేలా సహకరించారనిపిస్తోంది. కేవలం కుట్ర పూరితమైన ఎన్నికల్లా ఉన్నాయి. ఇది చంద్రబాబు, స్థానిక బొబ్బిలి రాజులు చేసిన కుట్రనే అనిపిస్తోంది. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ఎన్నికలు జరుగలేదు. ఈసీ దృష్టి సారించాలి. – సీర తిరుపతినాయుడు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, అలజంగి, బొబ్బిలి మండలం జిల్లేడు వలస వైఎస్సార్సీపీది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జిల్లేడువలస గ్రామం మొత్తం ఓట్లు 363. గ్రామస్తులందరూ వైఎస్సార్సీపీ అభిమానులు. ఇక్కడ వైఎస్సార్సీపీకి 98 ఓట్లు, టీడీపీకి 167ఓట్లు వచ్చాయి. వీటిని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈవీఎంలపై అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై ఈసీ దృష్టిసారించాలి. – దండి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకుడు, జిల్లేడువలస ఆశ్చర్యం కలిగిస్తోంది ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2014లో గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి వైఎస్సార్సీపీకి 9వేల పైచిలుకు మెజార్టీ ఓట్లు, 2019లో 12వేల పైచిలుకు మెజార్టీ దక్కింది. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాభివృద్ధి పథకాలు ప్రతీ గడపను తాకాయి. ప్రజలంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన లబ్ధిని పొందారు. ప్రచారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎంతో సానుకూలతా చూపారు. గతానికి మించి మెజార్టీ వస్తుందని దృఢంగా నమ్మాం. కానీ, ఫలితాలు చూస్తే తారుమారయ్యాయి. తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనుమానాలకు తావుతీస్తోంది. – కె.దీనమయ్య, ఎంపీపీ, గుమ్మలక్ష్మీపురంఏదో జరిగింది..? సార్వత్రిక ఎన్నికల్లో నాతో పాటు మా గ్రామస్తుల్లో అధిక శాతం మంది ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నకు మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో మా గ్రామ పంచాయతీ నుంచి 990 ఓట్లు పోల్‌కాగా, ఇందులో 7 వందలకు పైగా ఓట్లు వైఎస్సార్సీపీకి రావాల్సి ఉంది. కానీ ఫలితాలు చూసేసరికి వైఎస్సార్ సీపీకి కేవలం 402 ఓట్లు, టీడీపీకి 588 ఓట్లు వచ్చాయి. ఇది అనుమానాన్ని కలిగించే అంశం. ఎలాగైనా జగనన్నను ఓడించాలని ఎక్కడో కూటమి నాయ కులు మోసం చేశారనిపిస్తోంది. పోలింగ్‌కేంద్రం, ఈవీఎంలలో ఏదో జరిగి ఉంటుంది. – మిత్తిరెడ్డి రమేష్, పోరలి గ్రామం, దత్తిరాజేరు మండలం, విజయనగరం జిల్లాఅన్ని ఓట్లు ఎలా? ఎన్నికల ఫలితాలు ప్రజలందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాయి. మాది పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామం. మా గ్రామం వైఎస్సార్సీపీకి కంచుకోటలా ఉండేది. మా గ్రామంలో 620 ఓట్లు పోలయ్యాయి. మేమంతా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఓట్లు వేశాం. వైఎస్సార్సీపీకి 247, టీడీపీకి 373 ఓట్లు పడ్డాయి. ఇంతలా వ్యత్యాసం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. గ్రామమంతా ఇదే చర్చ నడుస్తోంది. అత్యధికంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేశామంటున్నారు. టీడీపీకి 373 ఓట్లు రావడంపై చర్చనీయాంశంగా మారింది. – జక్కు ప్రవీణ్, సర్పంచ్, లక్ష్మీనారాయణపురంభిన్నమైన ఫలితాలుతాజాగా మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. నూరు శాతం వైఎస్సార్సీపీ మద్దతు ఉన్న గ్రామాల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సీఎం జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపినప్పటికీ ఫలితాలు చూస్తే అందుకు భిన్నంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఇక్కడ 2019 ఎన్నికల్లో 400కు పైగా మెజారిటీ వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్ బూత్ నంబర్ 160లో మొత్తం 578 ఓట్లకు 497 పోలయ్యాయి. అలాగే, బూత్ నంబర్ 161లో 548 ఓట్లకు 473 పోలయ్యాయి. దీంతో రామలింగాపురం గ్రామంలో మొత్తం 970 ఓట్లు పోలవ్వగా అందులో 400కు పైగా వైఎస్సార్ సీపీకి మెజారిటీ రావాల్సి ఉంది. కేవలం 76 ఓట్లు మాత్రమే మెజారిటీ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. – ఇప్పిలి అనంతం, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు, చీపురుపల్లి -
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం : పేర్ని కిట్టు
సాక్షి, కృష్ణాజిల్లా : ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ కృష్ణాజిల్లా వైస్సాఆర్సీపీ నేత పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటామన్న పేర్ని కృష్ణమూర్తి.. గెలుపు , ఓటములు సహజం కార్యకర్తలు అధైర్యపడొద్దు ..అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎవరు రెచ్చగొట్టినా...సంయమనంగా..ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ఫలితాల మాట్లాడిన పేర్నికృష్ణ మూర్తి మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లురవీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మంచి పరిపాలన కొనసాగించాలని కోరుతున్నా. పోర్టు పనులు వేగవంతం చేయాలి. మెడికల్ కాలేజీకి కావాల్సిన వసతులు కల్పించాలి. మీరు ఇచ్చిన ప్రతీ హామీని ప్రజలతో పాటు మేం కూడా బాగా గుర్తుంచుకుంటాం. ఏడాది తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను మళ్లీ గుర్తుచేస్తాం. ఎల్లప్పుడూ ప్రజలకు మేం అండగా ఉంటాం. మంచి చేస్తే మిమ్మల్ని అభినందిస్తాం’అని పేర్ని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. -
‘కాపుల కష్టాలను పట్టించుకోనివాళ్లు హీరోలు అయిపోయారు: జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి: కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా చేసుకునేందుకు అనువైన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ, పురుగుమందులు, గోడౌన్లు, యంత్ర పరికరాలు అన్నీ అందించాం. రూ. 25 కోట్లతో తొర్రిగడ్డ పంపిణీ స్కీం మోడరనైజ్ చేశాం. ప్రతి చిన్న ఫిర్యాదుకు స్పందించి జవాబుదారీ తనంతో పని చేశాం. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలు ఉంటే 80 వేల కుటుంబాలకు వద్దకు నేనే వెళ్ళాను. నా కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించాం. ఇవాల్టి పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుంది.... మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఈ దమ్ముందా?. గెలిచినా ఓడినా రియల్ హీరో జగన్ మాత్రమే. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. గత ప్రభుత్వంలో పది లక్షలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగని రాజానగరం మండల కేంద్రంలో రూ. 20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. .. ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకుడు అనేక మాటలు పడ్డారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారు’’ అని అన్నారు. -
AP: ఈవీఎంల మార్పిడి జరిగిందా?
పాలకొల్లు అర్బన్: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, బూటకపు ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్ చెప్పారు. వీటిని చీకట్లో జరిగిన ఎన్నికలుగా పరిగణించాలన్నారు. ఎన్నికల కమిషన్‌పై న్యాయసమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల కమిషన్ కుట్ర చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. తక్షణం ఎన్నికలను రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం యాళ్లవానిగరువులో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకుని ఈవీఎంలపై విచారణ చేపట్టాలని కోరారు. ఓటమి భయంతో కూటమి కట్టిన టీడీపీ అభ్యర్థులకు వేల మెజార్టీ రావడం, బీజేపీ పోటీచేసిన రెండుచోట్ల లక్షల్లో మెజార్టీ రావడం, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను విజయం సాధించడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందుతుందని ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో వారికి కలిసి వచ్చిన పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందన్నారు.ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని, ఇదే విషయాన్ని మెజార్టీ సర్వేసంస్థలు వెల్లడించాయని చెప్పారు. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలందరికీ మేలు చేశారన్నారు. లక్షలాదిమంది ఓటర్లున్న వైఎస్సార్సీపీకి కేవలం ప్రతిపక్ష హోదాకు తక్కువగా అసెంబ్లీ సీట్లు దక్కడం వెనుక భారీ కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ముందు నుంచి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. తనపై కేసు నమోదు చేసిందన్నారు. తాను ప్రచారంలో పాల్గొనలేదని ఆధారాలతో సహా వివరణ ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. -
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం
సాక్షి ప్రతినిధి, కడప/తిరుపతి సిటీ/పాడేరు/పార్వతీపురం టౌన్: వరుసగా మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికై వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. కడప పార్లమెంటరీ స్థానంలో ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 12,97,362 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ అవినాష్‌రెడ్డికి 5,97,101 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డికి 5,31,611 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు 1,35,731 ఓట్లు వచ్చాయి. అవినాష్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి భూపేష్రెడ్డిపై 65,490 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బద్వేలు, పులివెందుల నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భూపేష్ ఆధిక్యత సాధించారు.మాజీ సీఎం నల్లారిపై మిథున్‌రెడ్డి జయకేతనంరాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని మట్టి కరిపించారు. దాదాపు 76,071 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓటర్లు మిథున్‌రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్టు కనిపించింది. తొలిసారిగా మిథున్‌రెడ్డి 2014లో 1,74,062 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాటి బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిని ఆయన ఓడించారు. 2019లో మిథున్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజార్టీ సా«ధించారు. ముచ్చటగా మూడోసారి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై విజయబావుటా ఎగురవేశారు.తిరుపతి ఎంపీగా గురుమూర్తితిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మరోసారి విజయకేతనం ఎగురవేశారు. మద్దిల గురుమూర్తికి 6,32,228 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌కు 6,17,659 ఓట్లు పోలయ్యాయి. ఎంపీ మద్దిల గురుమూర్తి 14,569 మెజార్టీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.అరకు ఎంపీగా తనూజారాణిఅరకు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనూజారాణి విజయకేతనం ఎగురవేశారు. అరకు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు తనూజారాణి స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తనూజారాణికి 4,77,005 ఓట్లు రాగా, కొత్తపల్లి గీతకు 4,26,425 ఓట్లు లభించాయి. -
కూటమి హవాను తట్టుకుని...
పుంగనూరు/పాడేరు/పార్వతీపురం టౌన్: చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. పెద్దిరెడ్డికి 99,774 ఓట్లు రాగా.. 6,619 ఓట్ల మెజార్టీ లభించింది. టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 93,155 ఓట్లు లభించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు 19,338 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 68,170 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 48,832 ఓట్లు వచ్చాయి.అరకు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మత్స్యలింగంకు 65,658 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుకు 33,781 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోశన్నపై 18,567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంపై 7,016 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.నాలుగోసారి బాలనాగిరెడ్డి విజయబావుటా కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి నాలుగోసారి విజయబావుటా ఎగురవేశారు. బాలనాగిరెడ్డి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్.రాఘవేంద్రరెడ్డి 74,857 ఓట్లు దక్కించుకున్నారు. బాలనాగిరెడ్డికి 12,805 ఓట్ల మెజార్టీ లభించింది. ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి బూసినె విరుపాక్షి విజయం సాధించారు.టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, రీకౌంటింగ్ చేయాలని టీడీపీ ఏజెంట్లు పట్టుబట్టారు. ప్రతీ రౌండ్లోనూ ఏజెంట్లు సంతకాలు చేశాకే.. ఆ తర్వాతి రౌండు లెక్కించారు. దీంతో ఎన్నికల అధికారి సృజన రీకౌంటింగ్‌ను తిరస్కరించారు. తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి టీడీపీ నుంచి అభ్యర్థి జయచంద్రారెడ్డిపై 10,103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. -
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి సీఎం పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం సమీపంలో సభ ఏర్పాటుచేసి ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత ప్రమాణస్వీకారం, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.తన ప్రమాణస్వీకారానికి మోదీ, బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ముఖ్యులను చంద్రబాబు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాబు ప్రమాణస్వీకారోత్సవం సమయంలోనే జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్యనేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. మలివిడతలో మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబును నియమించేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.ఈ మేరకు చంద్రబాబుతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాలు లీకులిచ్చాయి. బాబు ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడం, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏలో ఆ పార్టీ కీలకంగా మారింది. దీంతో బాబును కన్వీనర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌చేసి అభినందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు మంగళవారం జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. -
వైఎస్ జగన్ ఘన విజయం
కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు ఎదురే లేదని వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు రుజువు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 1,77,580 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో జగన్‌కు 1,16,315 (65.50 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవిపై 61,687 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 54,628 ఓట్లు వచ్చాయి.కాంగ్రెస్ అభ్యర్థి ధృవకుమార్రెడ్డికి 10,083 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 23 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండులోనూ వైఎస్ జగన్ తన ఆధిక్యతను చాటుకోవడం విశేషం. పులివెందుల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో వైఎస్సార్ కుటుంబం ఎంతో కృషి చేసింది. అందుకే పులివెందులలో వైఎస్సార్ కుటుంబానికి ప్రజలు 1978 నుంచి పట్టం కడుతూనే ఉన్నారు. -
ఓడినా.. గెలిచినా మీతోనే జగన్
సాక్షి, అమరావతి: ఏం జరిగిందో.. ఎలా జరిగిందో కూటమి గెలిచింది. వైఎస్సార్సీపీ అత్యల్ప స్థానాలనే దక్కించుకుంది. అయితేనేం ఆ పార్టీ క్యాడర్లో ఇసుమంత ఆత్మస్థైర్యం కూడా సడలలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానం కించిత్తయినా తగ్గలేదు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కోటి ఆశలతో రేయింబవళ్లు శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే అర్థమైపోయింది. అయినా ఏ మాత్రం సంయమనం కోల్పోలేదు.గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చి టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలతో కవ్వింపు చర్యలకు పాల్పడినా చలించలేదు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, అధినేత జగన్ ఆదేశం కోసం సాయంత్రం వరకూ ఎదురుచూశారు. సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడాక వారిలో కొండంత ధైర్యం వచ్చింది. ‘ఓడినా.. గెలిచినా ప్రాణం ఉన్నంతవరకూ మా ప్రయాణం నీతోనే జగనన్న’ అంటూ ముక్తకంఠంలో వారు చేసిన నినాదం సోషల్ మీడియాలో మిన్నంటింది. వాట్సప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్ గ్రూపుల్లో జగన్‌కు అనుకూలంగా పోస్టులు వెల్లువెత్తాయి.ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా జగన్, వైఎస్సార్సీపీకి అభిమానులు మద్దతు ప్రకటించారు. తమకు పదవులతో పనిలేదని, కడవరకూ మీ వెంటే మేమంతా ఉంటామని కామెంట్లు పెట్టారు. కొందరు ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేశారు. మరికొందరు పార్టీ సంస్థాగత నిర్మాణంలో లోటుపాట్లపై సూచనలు, సలహాలు ఇచ్చారు. సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన మాటలకు కన్నీళ్లు ఆగడం లేదంటూ ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల గుండెల్లో జగన్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఈ చర్యలతో స్పష్టమైంది. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వారంతా అండగా నిలవడాన్ని బట్టి సీఎం జగన్ జనం మనసులను గెలుచుకున్నారని రుజువైంది. -
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కోట్ల మందికి సంక్షేమం అందించినా.. గతంలో జరగనంత మంచి చేసినా.. అన్ని వర్గాల మంచి కోసం ప్రతీ అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపై మంగళవారం సాయంత్రం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. యాభై మూడు లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే ఫించన్ పంపిచే వ్యవస్థను తీసుకొచ్చాం. చాలీచాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఫలితాల్ని ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు’’ అని వైఎస్ జగన్ అన్నారు.సామాజిక న్యాయం చేసి ప్రపంచానికి చూపించాం. మేనిఫెస్టోను పవిత్రంగా భావించాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అమలు చేశాం. ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. మరి ఇంత చేసినా ఆ ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. చేయగలిగిన మంచి చేశాం. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ, పేదవాడికి తోడుగా.. అండగా ఎప్పుడూ నిలబడతాం’’ అని వైఎస్ జగన్ గద్గద స్వరంతో చెప్పారు.పెద్ద పెద్ద నేతల కూటమి ఇది. బీజేపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. గొప్ప విజయానికి కూటమి నేతలకు అభినందనలు. నా తోడుగా నిలబడిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తకి, స్టార్ క్యాంపెయినర్ నా అక్కచెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఏం చేసినా, ఎంత చేసినా ఇంక 40 శాతం ఓటు బ్యాంకుని తగ్గించలేకపోయారు. కిందపడినా గుండె ధైర్యంతో పైకి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం పోరాటాలు చేయడం నాకు కొత్త కాదు. ఎవరూ అనుభవించని రాజకీయ కష్టాలు అనుభవించా. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా దేనికైనా సిద్ధం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
పులివెందులలో సీఎం జగన్ గెలుపు
వైఎస్సార్, సాక్షి: అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతున్నాయి. వైఎస్సార్సీపీ తరఫున పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం జగన్ విజయం సాధించారు. -
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
AP Election 2024 Counting And Results Updates03:43 PM, June 4th, 2024పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపుఅధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది02:43 PM, June 4th, 2024పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్02:41 PM, June 4th, 2024అన్నమయ్య జిల్లా:రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్రెడ్డిశ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 5989502:40 PM, June 4th, 2024కడప పార్లమెంట్వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజ.63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్వైఎస్ అవినాష్ రెడ్డి: 500912టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694వైఎస్ షర్మిలా రెడ్డి: 11871202:40 PM, June 4th, 2024ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిరాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డివైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 8128602:26 PM, June 4th, 2024పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజచిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి6623 ఓట్ల లీడింగ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ 01:50 PM, June 4th, 2024ముందంజలో అవినాష్‌రెడ్డి కడప: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ముందంజ01:05 PM, June 4th, 2024రాజంపేటలో వైఎస్సార్సీపీ ముందంజరాజంపేటలో వైఎస్సార్సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజకదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్సీపీ లీడ్12:21 PM, June 4th, 2024పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్పుంగనూరు: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్యవేడులో వైఎస్సార్సీపీ ఆధిక్యంవైఎస్సార్సీపీ-23497బీజేపీ-16,60311:15 AM, June 4th, 2024పాలకొండలో వైఎస్సార్సీ ముందంజగుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధిక్యతగుంతకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డినరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం10:54 AM, June 4th, 2024దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికివైఎస్సార్సీపీ-22965టీడీపీ-20921పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5110టీడీపీ-12309టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5478టీడీపీ-6263ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)వైఎస్సార్సీపీ-13805టీడీపీ -1786410:31 AM, June 4th, 2024తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తిగూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మూడో రౌండ్లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంవైఎస్సార్సీపీ-12,687బీజేపీ-11091నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం9:52 AM, June 4th, 2024వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ9:24 AM, June 4th, 2024అనపర్తి, తిరువూరులో వైఎస్సార్సీపీ లీడ్హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యంపుట్టపర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంసర్వేపల్లిలో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధిక్యందర్శిలో వైఎస్సార్సీపీ ముందంజఅరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్9:20 AM, June 4th, 2024పాలకొల్లులో టీడీపీ ముందంజఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యంభీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యంతణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యంతాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం9:15 AM, June 4th, 2024విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలుసర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లుమరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం9:13 AM, June 4th, 2024పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజతిరువూరులో వైఎస్సార్సీపీ ముందంజఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యం9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యంఅవినాష్రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లుపోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్‌లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలుపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్ సెంటర్లో పినిపే విశ్వరూప్అమలాపురంలో కౌంటింగ్ సెంటర్‌కి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్‌కు ఏఆర్ఓ,ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్‌లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్‌వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులుకౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది. -
రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసులను, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్..ఇదిలా ఉంటే.. సి–విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు మీనా తెలిపారు. -
21 రోజుల నిరీక్షణ.. ఉత్కంఠకు నేడే తెర
సాక్షి, అమరావతి: ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి. గత నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురంరాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఈవీఎంల ద్వారా 3.33 కోట్ల మంది, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 5.15 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు అ్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రికార్డు స్థాయలో 81.8 శాతం ఓటింగ్ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చేటు చేసుకోవడంతో, ఓట్ల లెక్కింపు సందర్భంగా అటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 111 అసెంబ్లీ స్థానాల్లో 5 – 6 గంటల్లోనే పూర్తి కానుంది. 61 నియోజకవర్గాల్లో 6 – 8 గంటలు, మూడు నియోజకవర్గాల్లో 9 – 10 గంటల సమయం పట్టనుంది. పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానుండగా, 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది. అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం అయిదు గంటలలోపే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం ఫలితాలు.. ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఒంటరిగా సిద్ధంవైఎస్సార్సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా పోటీలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరుతో ముందస్తుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై సిగపట్లు పడుతూ ప్రచారంలో వెనుకబడ్డారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, భారతీయ జనతాపార్టీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ.. జనసేన రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టగా, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బీజేపీ, జనసేనల్లోకి పంపి అభ్యర్థులుగా నిలబెట్టింది.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు..ఎన్నికల సరళిని, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపులో ఒక రౌండు పూర్తి కాగానే ఆ ఫలితాలను కౌంటింగ్ సెంటర్ వద్ద మైక్‌లో వెల్లడించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కనపడే విధంగా డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రౌండు ఫలితాలను సువిధా యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. నియోజకవర్గ ఫలితాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://results.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు ‘ఓటర్స్ హెల్ప్¬లైన్’ అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. 25,209 మంది సిబ్బంది : ముఖేష్ కుమార్ మీనారాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారన్నారు. పార్లమెంటు స్థానాలకు తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించి, 8.30 తర్వాత ఈవీంఎల లెక్కింపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లో డిక్లరేషన్ ఫారంపై రిటర్నింగ్ అధికారి నియమించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుందని, దీనిపై ఇక ఎటువంటి అభ్యంతరాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఈసారి అత్యధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడంతో 25 చోట్ల నాలుగు రౌండ్లు కూడా లెక్కింపు జరగనుందన్నారు. ప్రతి 500 ఓట్లు ఒక రౌండ్‌గా లెక్కిస్తామని, ఇది సుదీర్ఘ పక్రియ కావడంతో ఒకొక్క రౌండ్ పూర్తి కావడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు. అదే ఈవీఎంల లెక్కింపులో ప్రతి రౌండు సగటున 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. లెక్కింపు ప్రారంభమైన అయిదు గంటల్లోనే మెజార్టీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 పోలీసు సిబ్బందితో పాటు 67 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా పెట్టామని, లోపల ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. ఏజెంట్లు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, దురుసుగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధన 54 కింద కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్ కోరితే దానికి గల స్పష్టమైన కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఆ కారణాలతో ఆర్వో ఏకిభవిస్తేనే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారని చెప్పారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరని స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత అభ్యర్థి గెలిచినట్లు ఫారం 20 ఇవ్వడానికి కనీసం గంట– గంటన్నర పడుతుందని, అప్పటి వరకు అభ్యర్థి వేచి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు. -
ఫ్యాను గాలి వీచింది
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతా ఫ్యాను గాలి ఉధృతంగా వీచిందని, ఓటర్లలో అధిక శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ప్రముఖ సెఫాలజిస్టులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో అత్యధిక శాసన సభ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తేల్చి చెప్పారు. ‘సాక్షి’ టీవీ సోమవారం రాత్రి నిర్వహించిన చర్చలో ప్రముఖ సెఫాలజిస్టులు ‘ఆరా’ మస్తాన్, ‘ఆత్మసాక్షి’ మూర్తి, ‘రేస్’ కిషోర్, ‘ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్’ ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటుతో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తోందని వారంతా స్పష్టం చేశారు.సీఎం జగన్ పాజిటివ్ ప్రచారానికి ప్రజలు సానుకూలంగా స్పందించారుగత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 142కు పైగా శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాం. అదే ఫలితాలు వచ్చాయి. 18 రాష్ట్రాల్లో మేం నిర్వహించిన సర్వేలు నిజమయ్యాయి. సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే నినాదాలతో టీడీపీ నెగెటివ్ ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ చేసుకుంది.టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ప్రజలు అవకాశవాద పొత్తుగా భావించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడంలో టీడీపీ కూటమి విఫలమైంది. ఐదేళ్లు సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు మంచి చేసిన సీఎం వైఎస్ జగన్.. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తానంటూ చేసిన పాజిటివ్ ప్రచారం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. నేను సర్వేలో చెప్పిన 126 స్థానాలకంటే అధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. – ‘ఆత్మసాక్షి’ మూర్తివైఎస్సార్సీపీకి 120 సీట్లకంటే ఎక్కువే వస్తాయి..సంక్షేమం అభివృద్ధి పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచికి కృతజ్ఞ్ఞతలు చెబుతూ ప్రజలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేసినట్లు మా సర్వేలో వెల్లడైంది. టీడీపీ కూటమి మొదటి నుంచి నెగెటివ్ ప్రచారానికే పరిమితమైంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూడా టీడీపీ కూటమి విఫలమైంది. ఇది కూటమిని తీవ్రంగా దెబ్బతీసింది. సానుకూల ఓటుతో వైఎస్సార్సీపీ 120 స్థానాల కంటే అధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం. – రేస్ కిశోర్గ్రామీణ, పట్టణ ప్రాంతాలూ వైఎస్సార్సీపీ వైపేముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి ఆధునికీకరించి, ఇంగ్లిష్ మీడియంలో పిల్లలకు చదువులు చెప్పడం అగ్రవర్ణాలనూ ఆకట్టుకుంది.సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సీఎం జగన్ లబ్ధి చేస్తుంటే.. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చుతున్నారంటూ టీడీపీ, ఇతర విపక్షాలు విమర్శించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రజలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. వైఎస్సార్సీపీ 120 స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. – ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇంద్ర నీల్నేను చెప్పిన 104 స్థానాల కంటే వైఎస్సార్సీపీకి అధికంగా వస్తాయిగత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంది. ఈసారి కూడా అంతే స్థాయి ఓట్లతో మళ్లీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి రాబోతోందన్నది మా సర్వేలో వెల్లడైంది. సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించడం గ్రామీణ ప్రాంతాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. వారిపై పెను ప్రభావం చూపింది. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు 56 శాతం వైఎస్సార్సీపీకి మద్దతుగా ఓట్లు వేశారు.టీడీపీ కూటమితో పోల్చితే వైఎస్సార్సీపీకి మహిళలు 13 నుంచి 14 శాతం అధికంగా ఓట్లు వేశారు. మహిళల ఓటింగ్ శాతం పెరగడం వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. వృద్ధాప్య పెన్షన్‌ను నాలుగు దశల్లో రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచి ఇవ్వడం, ఇంటి వద్దకే రేషన్ అందించడం ద్వారా వృద్ధులకు సీఎం జగన్ జీవనభద్రత కల్పించారు. ఇది వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. ఎన్నికల్లో సీఎం జగన్ తాను చేసింది చెప్పి, అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో చెబుతూ పాజిటివ్ ప్రచారం చేస్తే.. చంద్రబాబు నెగెటివ్ ప్రచారాన్ని చేశారు.ఇది టీడీపీ కూటమికి ప్రతిబంధకంగా మారింది. సీఎం జగన్ అమలు చేసిన సామాజిక న్యాయం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారింది. నేను చెప్పిన 104 స్థానాలకంటే అత్యధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌ను సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిన సంస్థకు రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల అది శాస్త్రీయంగా చేయలేదు. దాని గురించి ఇంతకన్నా చెప్పను. – ‘ఆరా’ మస్తాన్ -
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి. ⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి. ⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్‌పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి. ⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్‌లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్‌తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. ⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్‌తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్‌ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్‌కి ఉంది. ⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్లో అభ్యర్థి ఉండాలి. -
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర
సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్‌ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని.. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీకి వీర విధేయుడు.. 2007 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ దామోదర్ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్ కేడర్ ఎస్పీ అయినప్పటికీ దామోదర్‌ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు, ఎస్పీగా ఉన్న దామోదర్ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్ రికార్డ్.అలాంటి అధికారికి కంట్రోల్ రూమ్ బాధ్యతలా?ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ దామోదర్‌కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఈసీకి నోడల్ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.అదే రీతిలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్‌కు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
ఏపీలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సీఈవో ఎంకే మీనా
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.కాగా, సీఈవో ముఖేష్ కుమార్ మీనా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఏపీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది’ అని చెప్పారు. -
ఎగ్జిట్‌పోల్స్‌ను పట్టించుకోవద్దు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పారు.కాగా, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.ఇక, ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు. మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. -
ఏపీ జడ్జిమెంట్ డే.. కూటమిలో గుబులు
సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్సీపీ.. లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైగా మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన.. తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు YSRCP కీలక నేతలు.ఎలక్షన్ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్‌లో పలు చోట్ల రిగ్గింగ్ జరగడం, ఈసీ.. పోలీసులు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ తరఫున ఏజెంట్లగా నియమించినవారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏంచేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: లెక్క ఏదైనా.. 'ఫ్యాన్' పక్కాఇంకోవైపు.. వైఎస్సార్సీపీకే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు.సామాన్య వర్గాల్లో ఉత్కంఠేబరిలో నిలిచివారు, అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు.. సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు తమదే అయినా.. ఓటర్ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి ఈసారి లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్‌కు ఇరువైపులా రెండు కి.మీ. రెడ్ జోన్‌గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్ ఎన్‌లైజర్‌తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు.కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి. కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలు లేదు.మరోవైపు.. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడానికి వీల్లేదు. అలాగే.. పోలింగ్ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్నిచోట్ల అనుమతుల్లేవని పోలీసులుస్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?.. రేపు ఉదయం 6గం. నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీ సాక్షిలో.. -
AP Election Update: కౌంటింగ్‌కు కొనసాగుతున్న కౌంట్‌డౌన్
AP Elections Counting Count Down4:37 PM, 3rd June, 2024విజయవాడఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిమొత్తం 16 నియోజకవర్గాలకి నాలుగు కౌంటింగ్ కేంద్రాలుకైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఏలూరు లో కౌంటింగ్ సెంటర్మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, మవిలీపట్నం నియోజకవర్గాలకి మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్విజయవాడ పార్లమెంట్ తో పాటు విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకి ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో కౌంటింగ్విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలకి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్ధులు, అసెంబ్లీకి 79 మంది అభ్యర్ధులువిజయవాడ పార్లమెంట్ పరిధిలో 17, అసెంబ్లీకి 96 మంది అభ్యర్ధులుఎన్టీఆర్ జిల్లాలో 79.5 %, కృష్ణా జిల్లాలో 84.45% పోలింగ్విజయవాడ పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న 13,52,964 ఓటర్లుమచిలీపట్నం పార్లమెంట్ లో ఓటుహక్కు వినియోగించుకున్న 12,93,948 ఓటర్లుమచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిప్రతీ రౌండ్‌కి 14 టేబుళ్లు ఏర్పాటుప్రతీ రౌండ్ ఫలితానికి 25 నిమిషాల సమయంసాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడికి అవకాశంఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం మచిలీపట్నం...ఇక్కడ 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు, పెనమలూరులలో చివరి ఫలితాలు..ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు2:19 PM, 3rd June, 2024కర్నూలు: కర్నూలు జిల్లా వ్యాప్తంగా భద్రత ఏర్పాటు చేశాం: కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్సెంట్రల్, లోకల్ పోలీసుల ద్వారా నాలుగు అంచుల భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ హల్లో కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లు వివిధ రూపాల్లో కౌంటింగ్ పాస్స్ లు కల్పించాముకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో 1000 మంది పోలీసులను ఏర్పాటు చేశాము, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది188 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పికెట్స్ ఏర్పాటు చేశాము.ఫలితాలు వచ్చిన తరువాత కూడా భద్రత ఏర్పాట్లను చేశాం, ఫలితాలు వచ్చిన తరువాత ర్యాలీలు, సంబరాలు జరుపుకోవడం నిషేధంఎన్నికల తనిఖీలల్లో భాగంగా 11 కోట్లు రూపాయాల విలువ చేసే 80 లక్షల నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువులను పట్టుకున్నాము7 వేలు దాకా కర్నూలు జిల్లా వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేశాంకౌంటింగ్ సంబంధించిన 4 అంచెల భద్రత ఏర్పాటు చేశాం 2:15 PM, 3rd June, 2024ఏపీలో ఈసీ కొత్త నిబంధన ఎందుకు?: సజ్జలదేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధనదేశంలో ఎక్కడాలేని నిబంధనలు ఏపీలో మాత్రమే పెట్టారు.అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు.ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతాకం ఉంటే చాలనే నిబంధన పెట్టారు.కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.చంద్రబాబుకు బీజేపీతో పొత్తు లేకుంటే కరెక్ట్ ఎగ్జిట్‌పోల్స్ వచ్చేవి. 1:50 PM, 3rd June, 2024గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ హరీష్ గుప్తా వార్నింగ్‌అమరావతి..డీజీపీ కార్యాలయం ప్రకటనకౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ఫోకస్రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాడీజీపీ హరీష్ గుప్తా కామెంట్స్..గీత దాటితే తాట తీస్తాం.సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారువ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారుఅలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవుIT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం.PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు..పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో వారిపై కూడా విచారణ చేస్తాం.రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం.గ్రూప్ అడ్మిన్లు అలెర్ట్‌గా ఉండాలి.సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది. 1:30 PM, 3rd June, 2024కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సీఈవో మీనాఅమరావతి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్..రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారుఅన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయిముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది8.30కి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందిపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఈవీఎంల కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుందిపార్లమెంట్ సెగ్మెంట్ల ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకే ప్రారంభంకౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది 1:00 PM, 3rd June, 2024విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి కామెంట్స్..కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతం జరిగింది. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగాయి.ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది.విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు .144 సెక్షన్ అమలులో ఉంది.రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలి.50 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.133 గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసాం.70 కేసులు నమోదు చేశాం.40 కేసుల్లో చార్జ్ షీట్స్ కూడా వేశాం.కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు.స్పెషల్ ఫోర్స్ ని రంగంలోకి దింపాం.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా పోలీసులను మోహరించాం.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. 12:45 PM, 3rd June, 2024ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వైవీ సుబ్బారెడ్డివిశాఖ..వైస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు.మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు.వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. 11:59 AM, 3rd June, 2024పిన్నెల్లిపై కొనసాగుతున్న కుట్రలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలుకౌంటింగ్ రోజు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని, పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశంపిన్నెల్లిని ఇరకాటం పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పచ్చ బ్యాచ్‌ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌అనుకూల పోలీసులతో పిన్నెల్లిపై మూడు అక్రమ కేసులుకోర్టు ఆదేశాలతో ఆ కేసుల్లోనూ ఊరట పొందిన పిన్నెల్లితాజాగా తమ నేతలతో సుప్రీంలో కేసులు వేయించిన టీడీపీటీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా ఆదేశాలుఈ నెల 6న ఈ కేసు పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సూచించిన సుప్రీం 11:30 AM, 3rd June, 2024పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అప్రమత్తత అవసరం: వైవీ సుబ్బారెడ్డివిశాఖ:వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేసిన వైవీ సుబ్బారెడ్డి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన. 10:40 AM, 3rd June, 2024వైఎస్సార్సీపీదే విజయం: అబ్బయ్య చౌదరిఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్‌ఎగ్జిట్‌పోల్స్ సర్వేలన్నీ వైఎస్సార్సీపీదే విజయమని తేల్చేశాయి. సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. జూన్ 4న సాయంత్రానికి జగనన్న 2.O సిద్ధం!ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైయస్ఆర్సీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయి-ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/8osnnXHvSf— YSR Congress Party (@YSRCParty) June 3, 2024 10:15 AM, 3rd June, 2024YSRCP పిటిషన్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణవిచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంజాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసురేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ9:43 AM, 3rd June, 2024విజయవాడలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంవిజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దంసాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లుఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటుఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198 టేబుళ్లు ఏర్పాటు17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటురెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలుపోస్టల్ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశంఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనాఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదుసీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ8:30 AM, 3rd June, 2024నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్ బ్యాలెట్ కేసు..ఢిల్లీ:నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఅధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీనేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదిఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ 8:15 AM, 3rd June, 2024నేడు ఈసీ మీడియా సమావేశం..ఢిల్లీ:నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంరేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం 8:00 AM, 3rd June, 2024కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ..ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభంమరో 24 గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఈసీసమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్‌మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్‌ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్ ఫోకస్‌ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్‌కుమార్ మీనా ప్రెస్‌మీట్‌నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఅనంతపురం:ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలుఅనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులుకౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు144 సెక్షన్, 30 యాక్ట్ అమలుఆరు వేల మంది బైండోవర్400 మందిపై రౌడీషీట్లురేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలుతిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..తిరుపతితిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులురేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారుఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత144 సెక్షన్ అమలులో ఉంది,2 కంపెనీలు సీఐఎస్ఎఫ్ బలగాలు జిల్లాకు కేటాయింపుకౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదుఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు ఏజెంట్లే కీలకంఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం ఉండాలి ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించే దాకా హాల్ విడిచి వెళ్లకూడదు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్ మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా కామెంట్స్..ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండిఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కాఅసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణదేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్ భాస్కర్ గ్రూప్‌ల ఎగ్జిట్ పోల్స్‌దీ అదే మాట50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న దైనిక్ భాస్కర్(డీబీ)రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్‌లో 24 పోల్స్ వైఎస్సార్సీపీ వైపేబీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్ఎన్ న్యూస్–18 ఎగ్జిట్ పోల్స్‌దీ అదే దారి2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైఎస్సార్సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థగుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులుతాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్ మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలుబీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడిరాజధాని, స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలుకానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరుబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవుహైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులువాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్‌సీపీతమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలుఇవన్నీ వైఎస్సార్సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలుసెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్ -
నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్ ఎడిటర్ రాజీదీప్ సర్దేశాయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు రాజ్‌దీప్ సర్దేశాయ్ చురకలంటించారు.స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్ రాహుల్ కన్వల్ స్పందిస్తూ.. కేజ్రివాల్ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్‌ల్లో.. హేమంత్ సోరేన్ అరెస్టు వల్ల జార్ఖండ్‌లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్ పోల్స్‌లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్‌గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ 2021లో పశ్చిమ్ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. -
లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కా
సాక్షి, అమరావతి: పేదలకు, పెత్తందారులకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం ఖాయమని... ఏ లెక్కన చూసుకున్నా మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం పక్కా అని అధిక శాతం జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇవన్నీ స్పష్టం చేశాయి. దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 14 లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంటుందని.. ఎన్డీఏ కూటమి 48 శాతం ఓట్లతో 11 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా తరహాలోనే దేశ వ్యాప్తంగా విస్తృత యంత్రాంగం ఉన్న దైనిక్ భాస్కర్ గ్రూప్... రాష్ట్రంలో 15–17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. ఎన్డీఏ కూటమి 8–9 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని తన ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేల్చిచెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 వంటి మీడియా సంస్థలు, సెఫాలజిస్టులు, ఆరా వంటి ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థలు నిర్వహించిన 32 ఎగ్జిట్ పోల్స్‌లో 24 ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమయింది. బీజేపీ భజన చేసే జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ తద్భిన్నం.. బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, జీన్యూస్.. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న నెట్‌వర్క్‌లోని సీఎన్ఎన్ న్యూస్–18 వంటి రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తేల్చడం గమనార్హం. రాజధాని అంశంతోపాటు స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజల్లో సానుభూతి వచి్చందని.. అదే ఎన్డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందని ఆ సంస్థలు విశ్లేషించాయి. కానీ వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇటు వైఎస్సార్‌సీపీగానీ అటు ఎన్డీఏగానీ రాజధాని అంశాన్ని ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఇక స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా చిన్నపాటి బంద్‌లు గానీ, ర్యాలీలు గానీ, నిరసనలు గానీ జరగనేలేదు. తప్పు చేశాడు కనక అరెస్టయ్యాడనే రీతిలో జనం స్పందించారు. దీంతో హైదరాబాద్‌లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూపన్లు ఇచ్చి మరీ ‘ఐటీ ఉద్యోగుల’ పేరిట స్థానికంగా ఒక ఈవెంట్‌లా నిరసన కార్యక్రమం చేశారు. అలాంటిది ఈ రెండు అంశాలూ ప్రభావం చూపిస్తున్నాయని, అందుకే కూటమి గెలుస్తోందని ఈ జాతీయ ఛానెళ్లు చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్లూ తప్పవుతుందని రాష్ట్ర వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోని ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేదెలా? విచిత్రమేంటంటే ‘ఇండియా టుడే– మై యాక్సిస్’ సంస్థ శనివారంనాడు దేశవ్యాప్త ఎగ్జిట్‌పోల్స్‌ను వెలువరించింది. దీన్లో బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని చేర్చటమే లక్ష్యంగా ఒకో రాష్ట్రంలో స్వీప్ అంటూ ముందుకు వెళ్లిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. పైపెచ్చు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి 2 నుంచి 4 లోక్‌సభ స్థానాలు వస్తాయని మాత్రమే చెప్పిన ఇండియా టుడే సంస్థ... ఆ సందర్భంగా వైఎస్సార్ సీపీ గుర్తును కూడా ఆప్ గుర్తయిన చీపురుగా చూపించింది. విశేషమేంటంటే దీన్నే తెలుగుదేశం పార్టీ తన ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసుకుంది. మరి పార్టీ గుర్తు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేదెలా? ఇక కొన్ని రాష్ట్రాల విషయంలోనైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అక్కడ వాస్తవంగా ఉన్న మొత్తం స్థానాలకన్నా ఎక్కువ స్థానాలు ఎన్డీఏ గెలుస్తుందని చూపించటాన్ని ఇప్పటికే ట్విటర్లో పలువురు ట్రోల్ చేస్తున్నారు కూడా. ఇదే ఇండియాటుడే– మై యాక్సిస్ సంస్థ 2021లో బెంగాల్లో చేసిన ఎగ్జిట్‌పోల్స్, 2023లో ఛత్తీస్గడ్, రాజస్థాన్‌లలో చేసిన ఎగ్జిట్‌పోల్స్ పూర్తిగా రివర్సయ్యాయనేది ఇక్కడ గమనార్హం. నిజానికి ఈ సర్వేను ప్రసారం చేస్తున్నపుడు ‘ఇండియాటుడే’ ఛానెల్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సర్వే ఫలితాలతో విభేదించారు కూడా. తాను ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పర్యటించానని, సర్వేలో చెప్పినట్లుగా పరిస్థితులు అక్కడ లేవని పేర్కొన్నారు. గ్రామీణ, మహిళా ఓటర్లు పూర్తిగా వైఎస్సార్ సీపీవైపే ఉన్నారని, అది తన పర్యటనలో కనిపించిందని సర్దేశాయ్ చెప్పగా... చంద్రబాబు నాయుడి అరెస్టు పట్ల జనంలో సానుభూతి పెల్లుబుకిందని, అదే కూటమి విజయానికి కారణమవుతోందని ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించిన ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు. తాజాగా బీజేపీ కూటమికి దేశంలో అత్యంత భారీగా స్థానాలు వస్తాయని పేర్కొన్న జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో చిత్రవిచిత్రమైన తప్పులు కనిపించాయి. ఇండియాటుడే గ్రూప్‌లోని ఆజ్ తక్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో తమిళనాడులో కాంగ్రెస్ 9 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ 13–15 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చడంతో చర్చలో పాల్గొన్న వారే విస్తుపోయారు. రాజస్థాన్‌లో ఉన్నదే 25 లోక్‌సభ స్థానాలైతే.. ఆ రాష్ట్రంలో 33 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో టుడేస్ చాణక్య వెల్లడించడం గమనార్హం. జార్ఖండ్‌లో సీపీఐ (ఎంఎల్) ఒక స్థానంలో పోటీ చేస్తే.. రెండు నుంచి మూడు స్థానాల్లో ఆపార్టీ విజయం సాధిస్తుందని ఆజ్‌తక్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. హర్యానాలో ఉన్నదే 10 లోక్‌సభ స్థానాలైతే 16–19 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని జీన్యూస్ ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చడం విస్మయకరమే. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నవే నాలుగు లోక్‌సభ స్థానాలైతే.. అక్కడ ఎన్డీఏ 6–8 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీన్యూస్ తేల్చింది. విశేషమేంటంటే ఈ సంస్థలన్నీ రాష్ట్రంలో కూటమికే మెజారిటీ లోక్‌సభ స్థానాలు దక్కుతున్నాయని చెప్పాయి. లోతుగా పరిశీలించినట్లయితే ఈ జాతీయ మీడియా సంస్థలకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి యంత్రాంగమూ లేదు. వీటిలో చాలావరకూ ప్రజల అభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుని.. వాటినే ఎగ్జిట్ పోల్స్‌గా వెల్లడించాయి. గ్రామీణ ఓటర్లు, మహిళలు, వైఎస్సార్ సీపీకి ఎప్పుడూ అండగా ఉండే బలహీనవర్గాలు ఇలాంటి సర్వేల్లో పాల్గొనే అవకాశం తక్కువ. దీన్ని బట్టి చూస్తే.. ఈ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్... జూన్ 4న పూర్తి స్థాయిలో తిరగబడతాయని స్పష్టంగానే చెప్పొచ్చు. వైఎస్సార్సీపీ ఓడిపోయే అవకాశమే లేదు..రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలను తెస్తూ... గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ... ఐదేళ్లుగా కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలను జనం పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ‘సిద్ధం’ సభలతో రుజువయింది. అర్హతే ప్రమాణికంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో 60 శాతానికి పైగా వైఎస్సార్సీపీకి దన్నుగా నిలుస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు.. మహిళల్లో వైఎస్సార్సీపీకి అత్యంత ఆదరణ ఉందని.. ఇదే ఆపార్టీ విజయానికి బాటలు వేస్తుందని ఇవే జాతీయ మీడియా సంస్థలు గతంలో విశ్లేషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓట్లు పోల్ కావడం.. మహిళలు ఎన్డీఏ కూటమి కంటే వైఎస్సార్సీపీకి 12 శాతం అధికంగా వేశారని.. ఇది ఆపార్టీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని ఆరా మస్తాన్, చాణక్య పార్ధదాస్‌లు కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే తాము ఓడిపోయే అవకాశమే లేదని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కౌంటింగ్ నాడు అక్రమాలకు తెగబడటానికే! రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వస్తుండటంతో పలువురు సెఫాలజిస్టులను చంద్రబాబు నాయుడు, లోకేశ్ బెదిరించినట్లు వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సర్వే సంస్థ లోకేశ్ బెదిరింపులను తట్టుకోలేక... ఫలితాలను అట్నుంచి ఇటు మార్చి కూటమి గెలుస్తున్నట్లుగా ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ రెండ్రోజుల్లో తేలే ఫలితాల కోసం చినబాబు– చంద్రబాబు ఎందుకు ఇంతలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశాన్ని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. తామే గెలుస్తున్నామనే భ్రమలు కల్పించటం ద్వారా వైఎస్సార్ సీపీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపి... కౌంటింగ్ రోజున అవసరమైతే వారిని ప్రలోభపెట్టో, బెదిరించో తమ పబ్బం గడుపుకోవాలనేది తండ్రీ కొడుకుల ఆలోచనగా చెబుతున్నారు. ఈసీ ఎలాగూ తమకే సహకరిస్తుంది కనక ఎలాంటి దారుణాలకైనా వెనకాడకూడదన్నది వీళ్ల ఆలోచనగా చెబుతున్నారు. అయితే పురిట్లోనే సంధికొట్టినట్లు చాలామంది సెఫాలజిస్టులు వీరి బెదిరింపులకు లొంగకుండా వైఎస్సార్సీపీ గెలుస్తున్నదని చెప్పటం ‘బాబు’లిద్దరికీ మింగుడుపడటం లేదు.