కాల్చిందినాని అన్నే! | - | Sakshi
Sakshi News home page

కాల్చిందినాని అన్నే!

Published Sun, May 19 2024 9:20 AM | Last Updated on Sun, May 19 2024 1:02 PM

-

తన అనుచరుడి ఆడియో లీక్‌ 

గన్‌మన్‌ తుపాకీ లాక్కుని గాల్లోకి   ఫైర్‌ చేసిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి    పులివర్తి నాని 

కార్యకర్తలను రెచ్చగొట్టి..    పోలీసులపైకి ఉసిగొల్పి.. 

రోడ్డుపై బైఠాయించొద్దని ప్రాధేయపడిన సీఐ 

 సీఐని చుట్టుముట్టి మూకుమ్మడి దాడి  

గొడవచేసి.. కాల్పులు జరిపి..   ఆపై గాయాలైనట్టు నాని నాటకం 

గాయాలేవీ లేకుండానే కట్లు    కట్టించుకున్నట్లు చెబుతున్న   ఆస్పత్రి వర్గాలు  

‘అన్న(పులివర్తి నాని) ఫైర్‌ కూడా ఆన్‌చేశారు.. త్వరగా రండి’ అంటూ తన అనుచరుడు అన్న మాటలు ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాఫిక్‌గా మారాయి. గత మంగళవారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీ వద్ద టీడీపీ అల్లరి మూకలు వీరంగం సృష్టించాయి. వైఎస్సార్‌సీపీ నేతల కార్లు, వాహనాలు ధ్వంసం చేశాయి. స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఆ వీడియోలు, ఆడియోలు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో మహిళా యూనివర్సిటీ వద్ద నానిపై దాడి జరగలేదని, ఆయనకు అసలు గాయాలు కూడా అవ్వలేదని తేటతెల్లమవుతోంది. కేవలం కారుపైన మాత్రమే దాడి జరిగినట్లు వీడియో బయటపడింది. పులివర్తి నానికి కాలు, చేయి విరిగినట్లు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆస్పత్రి వర్గాలు వెల్లడించడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.    

సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికలు ఈనెల 13న అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంని చేసుకునేందుకు ఓటర్లు నిశ్చయించారు. ఇందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టారు. దీన్ని జీరి్ణంచుకోలేని కూటమి నేతలు ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు విధ్వంసాలకు తెగబడ్డారు. 

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామచంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ, చంద్రగిరి మండలంలోని కాసిపెంట్ల, రామిరెడ్డిపల్లె పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌కు అడ్డుగా ఉన్న ఏజెంట్లు, స్థానిక నాయకులపై దాడిచేశారు. అంతటితో ఆగకుండా బ్రాహ్మణకాలువ దళితవాడ, రామిరెడ్డిపల్లెలో కొట్టాల చంద్రశేఖరరెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వాహనాన్ని తగులుబెట్టారు. మరో కారుని ధ్వంసం చేశారు.   

పులివర్తి నాని హై డ్రామా
టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై అసలు దాడే జరగలేదని, అతనికి గాయాలే అవ్వలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారులో ఉన్న పులివర్తి నాని వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పులివర్తి నాని కారు దిగి పరుగెత్తుకెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ తరువాత కాసేపటికి గన్‌మన్‌ వద్ద ఉన్న తుపాకీ తీసుకున్న పులివర్తి నాని గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే గన్‌మన్‌ ఈ కాల్పులతోనే గాయపడ్డారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులివర్తి నానినే గన్‌ ఫైర్‌చేశారు.. అన్నదానికి తన అనుచరుడు టీడీపీ నాయకుడికి ఫోన్‌చేసి మాట్లాడుతున్న ఆడియో ఒకటి బయటపడింది. గన్‌ ఫైర్‌చేసిన అనంతరం పులివర్తి నాని సుమారు 2 గంటల పాటు స్ట్రాంగ్‌ పరిసరాల్లో కలియదిరిగారు. 

ఆ తరువాత తనపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడిచేశారని, ఆ దాడి కారణంగా స్ఫృహతప్పి పడిపోయినట్లు నటించారు. ఆపై ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి తాను గాయపడినట్లు సరి్టఫికెట్‌ ఇవ్వమని డిమాండ్‌ చేశారు. ఆ వైద్యుడు స్విమ్స్‌కు వెళ్లమని సూచించారు. తన మందీ మార్బలంతో కార్లలో స్విమ్స్‌కు చేరుకున్నారు. అక్కడ వైద్యులను నయానో భయానో బెదిరించి కాలు, చేయి ఫ్రాక్చర్‌ అయినట్లు కట్టుకట్టించుకుని మరుసటి రోజు వరకు స్విమ్స్‌లోనే చికిత్స పొందుతున్నట్లు తన ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకున్నారు. పులివర్తి నానికి ఎటువంటి గాయాలు కాలేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాలను సిట్‌ వెలుగులోకి తీసుకొచ్చి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 నాని అరాచకాలు
👉 ఎన్నిక అనంతరం టీడీపీ అభ్యర్థి నాని కూచువారిపల్లెకు చెందిన చంద్రగిరి ఏఎంసీ చైర్మన్‌ చంద్రశేఖర్రెడ్డి తల్లిని పక్కకు తోసేసి, ఆ ఇంటిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఇంట్లోని వస్తువులు కాలి బూడిదయ్యే వరకూ నాని, నాని అనుచరులు అక్కడే ఉన్నారు.

👉 కూచువారిపల్లిలో ఓ బాలుడిని స్వర్ణముఖి నది వద్దకు తీసుకెళ్లి అతనిపై యూరినేషన్‌ చేసి అమానవీయంగా చితకబాదారు.

👉 కూచువారిపల్లెలో రామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డిని రక్షించడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిని చుట్టుముట్టారు. ఆయన రెండు కార్లను పెట్రోల్‌ పోసి తగలబెట్టేశారు.

👉 మోహిత్‌రెడ్డి అంగరక్షకుడుగా ఉన్న ఈశ్వర్‌రెడ్డిని ఓ ఇంట్లో కట్టేసి కొట్టారు. మోహిత్‌ రెడ్డితోపాటు ఉన్న వేణురెడ్డిని బలవంతంగా కొటాల గ్రామం వద్దకు తీసుకెళ్లి చెప్పులతో కొట్టారు. వళ్లంతా వాతలు పడేలా చితకబాదారు.

👉 కూచువారిపల్లి రోడ్డుపై నిలబడి ఉన్న బాలుడు కవలికరెడ్డి మర్మాంగాలపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తన్ని గాయపరిచారు.

👉 తిరుపతి రూరల్‌ పరిధిలోని రామానుజంపల్లి పోలింగ్‌ కేంద్రం సమీపంలో నిలబడి ఉన్న ఉపేందర్‌రెడ్డి, మాధవరెడ్డి, ప్రదీప్‌రెడ్డిపై దాడికి తెగబడ్డారు.

👉 తిరుచానూరు ఎంపీటీసీ నరేష్‌రెడ్డిపై పులివర్తి నానీతోపాటు చిత్తూరు నుంచి వచ్చిన రౌడీలు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు.

👉 పులివర్తి నానితో వచ్చిన రౌడీలు తిరుపతి రూరల్‌ మండలం, కుంట్రపాకం గ్రామ మాజీ సర్పంచ్‌ బుచ్చిరెడ్డి కొడుకు అవినాష్‌రెడ్డిని ఒళ్లంతా బ్లేడ్లతో కోశారు.

👉 పాకాల మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ నంగా నరేష్‌ రెడ్డి కొడుకు లవంత్‌రెడ్డి రెండు చేతుల వేళ్లు రక్తం కారేలా కోసేశారు. బీటెక్‌ చదువుతున్న ఇతను ప్రస్తుతం పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి.

👉 చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమం పూర్తిచేసుకుని తిరుపతి నుంచి ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

👉 అగరాల గ్రామంపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు.

👉 ‘తమ ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తాం. రోడ్లపై కూడా తిరగనివ్వం’ అంటూ పులివర్తి నాని, అతని అనుచరులు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను నిత్యం ఫోన్లు చేసి భయపెట్టడం రివాజుగా మారుతోంది.

👉 పులివర్తి నాని భార్య సుధా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దాడులకు పిలుపునిచ్చారు.

👉 దీనిపై సిట్‌ బృందం విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement