Pulivarthi Nani
-
చంపేస్తా!.. జర్నలిస్టులకు టీడీపీ ఎమ్మెల్యే భార్య బెదిరింపులు
సాక్షి, తిరుపతి జిల్లా: ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ చంద్రగిరి జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ "చంద్రగిరి రాజకీయం" గ్రూప్‌ను డిలీట్ చేయాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సీఐ సుబ్బరామిరెడ్డికి పాత్రికేయులు ఫిర్యాదు చేశారు."చంద్రగిరి రాజకీయం" వాట్సాప్ గ్రూప్‌లో ఎమ్మెల్యే నానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఈ నెల 13న సుధారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్మిన్లుగా ఉన్న వారిని ఐదుగురు జర్నలిస్టులపై ఆమె కేసు పెట్టారు. మెసేజ్‌లు పెట్టిన వారిని వదిలివేసి, తమపై కేసులు పెట్టడం ఏంటీ? అంటూ బాధిత జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.ఇదీ చదవండి: తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక? -
పులివర్తి నానిపై మోహిత్ రెడ్డి ఫైర్
-
టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది- మోహిత్ రెడ్డి
-
విచారణ పేరుతో వేధింపులు.. న్యాయ పోరాటం చేస్తా: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మోహిత్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. పులివర్తి నానిపై ఎక్కడా దాడి జరగలేదు. ఘటన జరిగిన 52 రోజుల తర్వాత ఏ-37గా నా పేరును చేర్చారు. ఈ ఘటన జరిగిన రోజు నా ఎదురుగానే జయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు. సెల్‌ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్లకూడదు అంటే నేను తీసుకెళ్లలేదు. నా ఫోన్‌ను నా పీఏకు ఇచ్చి నేను లోపలికి వెళ్లాను. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు. సీఆర్‌పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. మా నాన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. మా నాన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతాం. మేము బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతాం. టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారు. మీరు చేసే అన్ని దందాలను ప్రజలకు వివరిస్తాం. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మోహిత్ రెడ్డిపై 52 రోజులు తర్వాత తప్పుడు కేసు పెట్టారు. మేము నిత్యం ప్రజల్లో ఉండే వాళ్లం. నా పోరాటం ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటున్నాడు మోహిత్ రెడ్డి. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మెజిస్ట్రేట్ ముందు మీరు హాజరుపరచాలి. జడ్జి ముందు హాజరు పరిచే ధైర్యం లేదు. మీరు పెట్టిన తప్పుడు కేసులు చూసి వాళ్లకు ఖచ్చితంగా చివాట్లు పెడతారు.ఒక సెన్సేషనల్ కోసమే అదుపులోకి తీసుకున్నారు. 41 కింద నోటీసు ఇచ్చేందుకు తీసుకు వచ్చారు. మోహిత్ రెడ్డిపై ఏ రకంగా లుక్ అవుట్ నోటీస్ ఇస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే జడ్జి ముందు ప్రవేశ పెట్టండి. ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చి వదిలి పెట్టారు. తిరుపతి నగరం మొత్తం దిగ్బంధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరింపు ఎందుకు?. 41 నోటీసులు ఇవ్వడానికా ఇంత రాద్దంతం చేస్తారా?. ఓటు వేసిన ప్రజల్ని వదిలేట్టే ప్రసక్తే లేదు. ప్రజలపై ఉన్న కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చూపిస్తున్నారు. పులివర్తి నానిపై దాడి జరగలేదు అని స్విమ్స్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. 37 మంది దాడి చేస్తే నానిపై ఒక్కగాయం కూడా కాలేదు. ఈ దాడిలో ఉన్నాడని ఎలా కేసు పెడతారు. కావాలనే కక్ష్య పూరితంగా కేసులో ఇరికించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
నాని గాయాలన్నీ ‘కట్టు’ కథలే
తిరుపతి రూరల్ (తిరుపతి జిల్లా) : చేతులకు కట్లు, కాళ్లకు బ్యాండేజీలు, మూతికి మాస్్కతో తాను తీవ్రంగా గాయపడ్డానని పులివర్తి నాని చేసిన హడావుడి అంతా ఒట్టి నాటకమని తేలిపోయింది. నాని తల, శరీరం, చేయి, కాలు.. ఇతరత్రా ఆయన శరీరంలో ఎక్కడా చిన్న దెబ్బ కూడా లేదని తేటతెల్లమైంది. స్విమ్స్ వేదికగా ఆయన సాగించిన హంగామా అంతా ఉత్తుత్తి నటనేనని అదే స్విమ్స్‌లో ఆయనకు తీసిన ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్.. తదితర వైద్య పరీక్షలు స్పష్టం చేస్తున్నాయి. నాని ‘కట్టు’ కథలతో 37 మంది జైలు పాలయ్యారు. పలువురు ఉద్యోగులు బదిలీకి గురయ్యారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. పోలింగ్ అనంతరం మే 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వద్ద గొడవ జరిగింది. టీడీపీ అభ్యర్థి అయిన నాని ఆ తర్వాత రెండు గంటలపాటు వర్సిటీ పరిసరాల్లోనే హుషారుగా తిరిగారు. అనుచరులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా ధర్నాలో నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. అనంతరం గొడవ సద్దుమణిగాక ఇంటికి వెళ్లిపోయారు. ఇంట్లో కాసేపు సేద తీరాక ఒక వ్యూహం రూపొందించుకుని హుటాహుటిన స్విమ్స్‌కు బయలుదేరారు. అక్కడ వాహనం నుంచి దిగగానే.. నడవ లేనట్లు.. శరీరం అంతా నొప్పులున్నట్లు అక్కడి వైద్యులకు చెప్పారు. వారు ఆయన తలకు, శరీరానికి, చేతికి, భుజాలకు, పొట్టకు, కాలికి.. ఇలా అన్ని రకాల వైద్య పరీక్షలు, ఎక్స్‌రేలు, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ సైతం చేశారు. ఆ గొడవలో తాను తీవ్రంగా గాయపడినట్టు పబ్లిసిటి ఇచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత నానిపై దాడి జరిగిందని, ఆయనకు ఏమో అయిపోయిందని ఎన్నికల కమిషన్ అనేక మంది పోలీసులు, ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అమాయకులైన 37 మందిపై పోలీసులు కేసులు పెట్టి, జైలుపాలు చేశారు. వారు ఇప్పటికీ జైలులో మగ్గుతున్నారు. ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు వెల్లడి పులివర్తి నాని స్విమ్స్‌లో చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఇటీవల వెలుగు చూశాయి. నాని తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఎక్కడా ఎలాంటి గాయాలు లేవని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్.. ఇతరత్రా వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో నాని స్వార్థంతో ఆడిన నాటకం వల్ల ఇబ్బంది పడిన వారంతా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య నివేదికలను ముఖ్యమంత్రికి, హైకోర్టు, గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి పంపించేందుకు సిద్ధం అవుతున్నారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వారు అనవసరంగా నెలల తరబడి జైలులో మగ్గుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సస్పెండ్ అయి జీతాలు రాక, ఎన్నికల కమిషన్ చేసిన సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియక పలువురు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. నాని నాటకం బట్టబయలు రాజకీయ స్వార్థంతోనే నాని గాయపడినట్లు నాటకాలు ఆడారు. గాయం కాని ఘటనలో అమాయకులు 37 మందిపై కేసులు నమోదు చేయించి వేధించారు. దాడి చేయడానికి 37 మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా బయటకు వస్తారా? సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా? ప్రజలు, ప్రభుత్వం, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించాలి. నాని అద్భుత నటనతో ఉద్యోగులు, పోలీసులను బలిపశువులు చేశాడు. 37 మందిని జైలుకు పంపించాడు. ఆ కుటుంబాల శాపం ఆయనకు తగిలి తీరుతుంది. దేవుడు, ప్రకృతి చాలా గొప్పవి. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి -
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామా బట్టబయలు
సాక్షి, తిరుపతి: ఎన్నికల సమయంలో ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామాలను స్వీమ్స్ డాక్టర్లు బట్టబయలు చేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పద్మావతి మహిళా వర్శిటీ వద్ద పోలింగ్ అనంతరం మే 14వ తేదీన జరిగిన ఘటనలో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని స్విమ్స్ వైద్య నివేదికలు తేల్చి చెప్పాయి.స్విమ్స్ ఆసుపత్రిలో నాని తల, శరీరం, చేయి, కాలికి తీసిన ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్.. ఇలా ఆరు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఒక్కదానిలోనూ ఆయన గాయపడినట్లు వెల్లడికాలేదు. వైద్య నివేదికలు అన్ని కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తేల్చాయి. రాజకీయ లబ్ధి కోసం పులివర్తి నాని నాటకాలు ఆడినట్లు తేటతెల్లమైంది.మే 14వ తేది మధ్యాహ్నం 3గంటల తర్వాత సంఘటన జరిగితే దాదాపు రెండు గంటలకు పైగా వర్శిటీ పరిసరాల్లోనే నాని హుషారుగా నడుస్తూ కనిపించిన పులివర్తి నాని వీడియో దృశ్యాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ర్యాలీ, ధర్నాలో పాల్గొన్న నాని.. చక్కగా నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. నడుస్తూ వెళ్లిన పులివర్తి నాని.. తర్వాత వీల్ చైర్లో ప్రత్యక్షమై నటన ప్రదర్శించారు. ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి.తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఇలా అన్ని పరీక్షలను విడుదల చేశారు. ఎక్స్‌రేలు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్. వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య నివేదికలు వెల్లడించాయి. నాని స్వార్థంతో చేసిన నాటకం వల్ల అనేక మంది అమాయకులు జైలులోనూ, వారి కుటుంబసభ్యులు ఇంటి వద్ద రోదిస్తున్నారు. ఎలాంటి గాయాలు లేని వ్యక్తి పెట్టిన కేసులో 37 మంది జైలు పాలయ్యారు. నెలల తరబడి జైలులో ఉంచారు. -
కిలారు రాజేష్ పేరుతో ఎమ్మెల్యే నాని దందాలు
తిరుపతి రూరల్ : చంద్రబాబు, లోకేశ్‌కి దగ్గరి వ్యక్తి అయిన కిలారు రాజేష్ పేరుతో తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. నాని చర్యలతో అధికారులు, వ్యాపారులంతా భయాందోళనలకు గురవుతున్నారని, ఇలా భయానక వాతావరణం సృష్టించడం చంద్రగిరికి మంచి సంస్కృతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన శనివారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాడ్‌ఫాదర్ లాంటి కిలారు రాజేష్ తన చెప్పుచేతల్లో ఉన్నాడని, ఎంత చెబితే అంత చేస్తాడంటూ నాని అధికారులు, వ్యాపారులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఆయన, రాజేష్ ఉన్న ఫొటోలు, వీడియోలను చూపుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారన్నారు. మామూళ్లు ఇవ్వలేదని ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కిషోర్‌కు చెందిన రైస్ మిల్లును మూయించాడని, వైఎస్సార్సీపీ సర్పంచ్‌కు చెందిన రూ.7 కోట్ల విలువైన రెండెకరాల భూమిని కాజేసేందుకు ప్రయతి్నంచారని తెలిపారు. అంతేకాకుండా తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో రూ.250 కోట్ల విలువైన దేవదాయ శాఖకు చెందిన 10 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పారు. చిత్తూరు నుంచి వంద మంది రౌడీలను తీసుకువచ్చి ఎండోమెంట్ అధికారులను బట్టలు విప్పించి, గదిలో బంధించి, మోకాళ్లపై నిలబెట్టి మరీ దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిరి్మంచారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఎండోమెంట్ డిప్యూటీ కలెక్టర్ రమే‹Ùనాయుడు జిల్లా కలెక్టర్‌కు, ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారన్నారు.రోజూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇంటికి పిలిపించుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. గట్టిగా ప్రశి్నంచిన వారిపై చిత్తూరు నుంచి రప్పించిన రౌడీ మూకలకు ముసుగులు వేయించి కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. నాని దందాలు, ఆక్రమణలపైనా విచారణ చేయించాలని అన్నారు. -
చంద్రగిరి రాజకీయం.. సై అంటే సై..
-
ఎమ్మెల్యే పులివర్తి నానికి చెవిరెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు.. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నేత, కార్యకర్తను కూడా వేధింపులకు గురిచేయలేదన్నారు.‘‘2014-19 వరకు టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశాం. నాపై ఎన్నో కేసులు నమోదు చేసినా పోరాడా.. గతంలో మా పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నా... నేనెప్పుడు పార్టీ కోసమే పనిచేశానని తెలిపారు. ‘‘నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించాను. టీడీపీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా?. ‘టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య నాపై 88 కేసులు పెట్టారు. 7నెలలు జైల్లో పెట్టారు’’ అంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘2019 నుంచి 2024 వరకు మీ క్వారీలు ఏనాడైనా అపారా?. మీ 12 లారీలు ఏ రోజైన ఆపారా..?. కరెంట్ చార్జీలు బకాయిలు ఉన్నా.. మీ పాలిషింగ్ యూనిట్ నడిచిందా లేదా?. పచ్చటి పల్లెల్లో విద్వేషాలు రెచ్చ గొడుతున్నావు.. మీకుటుంబం పైనా నేను ఆరోపణలు చేయడం నా సంస్కృతి కాదు. కిలారు రాజేష్ పేరుతో దందాలు చేయలేదా?, అధికారులను బెదిరించ లేదా?. కిరోసిన్, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించలేదా? నేను ఓడిపోతే 4వ తేదీన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా?. చంద్రగిరి నియోజకవర్గం రాయలచెరువు రోడ్డు నెలరోజులకే వేశానంటే ప్రజలు ఎలా నమ్ముతారు?’’ అని చెవిరెడ్డి ప్రశ్నించారు‘‘ప్రజలు అధికారం మీకు ఇచ్చారు.. ప్రశ్నించడం మాకు ఇచ్చారు. మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నా, ఏరోజూ వెనక్కు తగ్గం.. నా కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టారు, నా కొడుకు ఏరోజు కేసులకు భయపడే వ్యక్తి కాదు. తుడా పరిధిలో అవినీతిపై మీరు విచారణ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా తుమ్మలగుంటలో 133 అడుగుల ఎత్తులో నిర్మాణం చేశాం. జాతీయ జెండా కూడా ఎగర నీయకుండా అడ్డుకున్నది నువ్వు కాదా?. తుడా అధికారులను బెదిరించలేదా?’’ అంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీశారు. -
పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే
-
‘పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే’
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందేనని అన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 50 రోజుల కాలంలో 34 మంది వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ముసుగులు వేసుకుని వచ్చి అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పులివర్తి నానిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కానీ, ఇప్పుడు ఆయన తన క్వారీని మూసివేసినట్టు చెబుతున్నాడు. సీఎం చంద్రబాబు దగ్గర నన్ను విలన్‌గా చూపించి పులివర్తి పదవులు పొందాలని చూస్తున్నాడు. నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాలిజపులివర్తి నాని నటన కారణంగా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు సస్పెండ్ అయ్యారు. ఆయన ఇన్ని డ్రామాలు చేస్తుంటే పోలీసుల సంఘం ఏం చేస్తోంది. సస్పెండ్ అయిన అధికారులు జీతాలు లేక రోడ్లపైకి వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతే నా శవం చూస్తారని, ఇంటింటికీ వెళ్లి నాని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు. దేనికైనా పోరాటం చేసే వ్యక్తిని నేను. నాకు పోరాటాలు కొత్త కాదు. నా ఓపికను బలహీనతగా అనుకోవద్దు. ఇంకా ఎన్ని గొడవలు చేస్తారో చేయ్యండి. చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయం, ధర్మం కోసం పనిచేయండి. అన్యాయంగా అధర్మంగా పని చేయడానికి వచ్చే అధికారులను వదిలిపెట్టను. ఇకపై పూర్తి సమయం కేడర్‌తోనే ఉంటాను’ అని చెప్పారు. -
అధికార మదం.. ఆర్యవైశ్యులపై ప్రతాపం డబ్బులివ్వలేదని మూసేశారు
తిరుపతి రూరల్: టీడీపీ కూటమి నేతల దృష్టి ఆర్యవైశ్యుల వ్యాపారాలపై పడింది. కష్టనష్టాలకోర్చి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయాని్నవ్వడమే కాకుండా, పది మందికి ఉపాధి చూపిస్తున్న ఆర్యవైశ్యులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే అధికారులతో వ్యాపారాలను సీజ్ చేయిస్తున్నారు. వ్యాపారులతో పాటు వందలాది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా పలువురు వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.తాజాగా చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్‌కు చెందిన ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించారు. గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మిల్లులో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి ఎంతో మంది రైతులు ధాన్యాన్ని ఈ మిల్లులో బియ్యం చేసుకుని వెళుతుంటారు. ఇటు కార్మికులకు, అటు అన్నదాతలకు బాసటగా నిలిచిన ఈ రైస్ మిల్లుపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కన్ను పడింది.తన బంధువులు, తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేతలు అమిలినేని మధు, చెరుకూరి మధు, శ్రీధర్ నాయుడును రైస్ మిల్లు యజమాని కిషోర్ వద్దకు పంపినట్లు సమాచారం. వారు ముగ్గురూ కిషోర్ దగ్గరకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులను రంగంలోకి దించి, అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్ మిల్లుకు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సీజ్ చేయించినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.దీంతో రైసు మిల్లు మూతపడింది. 200 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిల్లు యజమాని కిషోర్ రెండుసార్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దకు వెళ్లి వేడుకోగా, ఆయన తీవ్రంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తాను లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడినని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా నిన్ను వ్యాపారం చేయనీయను అంటూ కిషోర్‌ను భయపెట్టినట్లు సమాచారం. దీంతో కిషోర్ కంట నీరు పెట్టుకొని బయటకు వచ్చినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి.వ్యాపారుల ఆగ్రహంవ్యాపారుల్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఆర్యవైశ్యుల సంక్షేమ సంఘం నాయకుడు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, తిరుపతి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన కిషోర్‌నే వేధించి, ఆయన మిల్లును మూసివేయించడంపై వ్యాపారవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు వ్యాపారులంతా సంఘటితమవుతున్నారు.తమ నేత కిషోర్‌కు న్యాయం జరిగేంత వరకు బాసటగా నిలుస్తామని చెబుతున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తే ఎంత మంది జీవితాలు రోడ్డున పడతాయన్నది ఆలోచించని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన బంధువుల తీరును ప్రజలకు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకై వారు నిర్ణయించినట్లు సమాచారం.అధికారుల అత్యుత్సాహంఅధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన బంధువుల ఒత్తిడితో ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించడంలో అధికారులు అత్యుత్సాహం చూపించారు. సాధారణంగా ఏ వ్యాపార సంస్థనైనా సీజ్ చేయాల్సి వస్తే ముందుగా నోటీసు ఇచ్చి, మూడు నెలలు సమయం ఇవ్వాలి. నోటీసుకు యజమాని నుంచి వచ్చే సమాధానంతో పాటు మరికొన్ని నియమాలు పాటించాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండానే విద్యుత్తు సరఫరా నిలిపివేసి, మిల్లును సీజ్ చేసేశారు. అందులో పనిచేసే కార్మికుల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలి్సన కనీస బాధ్యతను కూడా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. -
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజచంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు. -
Pulivarthi Nani: ఈ ప్రశ్నలకు బదులేది?
టీడీపీ మూకల విధ్వంసాలపై కుట్రకోణం దాగి ఉందా..? పక్కా ప్లాన్‌తోనే అల్లర్లకు తెగబడ్డారా..? ఓటమి భయంతోనే దాడులకు పాల్పడ్డారా..? పథకం ప్రకారమే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పచ్చముఠా చెలరేగిపోయిందా..? మహిళా వర్సిటీ వద్ద పులివర్తి నాని కావాలనే రెచ్చిపోయారా..? 144 సెక్షన్ అమలులో ఉన్నా వైఎస్సార్సీపీ శ్రేణులను కవ్వించేందుకే మారణాయుధాలు చేతపట్టిన గ్యాంగ్‌తో అక్కడకు వచ్చారా..? ఎలాంటి గాయం కాకపోయినా కేవలం సానుభూతి కోసమే నాటకాలాడారా..? ధర్నాలో కూర్చున్నప్పుడు నిక్షేపంగా కనిపించిన నాని.. అంతలోనే ఎందుకు అస్వస్థతకు గురయ్యారు..? సిట్ అధికారులను తప్పుదోవ పటించేందుకే వంటి నిండా కట్టుకట్టించుకున్నారా..? నాటి ఘటనకు సంబంధించిన ఆడియో.. వీడియోలను పరిశీలిస్తే అవుననే అర్థమవుతోంది. పోలింగ్ రోజు.. మరుసటి రోజు దాడుల వెనుక కక్షపూరిత పథకం దాగి ఉందని స్పష్టమవుతోంది.సాక్షి తిరుపతి : శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన విధ్వంస కాండలో టీడీపీ నేతలు, పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ రోజు నుంచి మరుసటి రోజు వరకు జరిగిన దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందని విచారణ అధికారులు సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియోలు, వీడియోలు పరిశీలిస్తే మొత్తం ఘటనలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, అనుచరులు, గన్‌మన్, మరో నలుగురు పోలీసుల పాత్ర ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజక వర్గంలోనే ఈ విధ్వంసాలు చోటు చేసుకోవటం వెనుక టీడీపీ నేతలు, కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు సిట్ అధికారులు తన నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. పోలింగ్ రోజున రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాలువ, చంద్రగిరి మండలం కాశిపెంట్ల, చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పరిధిలోని కందులవారిపల్లె, పాకాల మండలం ఆదినపల్లె పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడులకు తెగబడిన విషయం విధితమే. అదే రోజు రాత్రి రామిరెడ్డిపల్లెలో సర్పంచ్ ఇంటిని పచ్చగూండాలు తగులబెట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డి కారుకి నిప్పుపెట్టారు. మరో కారుని ధ్వంసం చేశారు. అంతటితో ఆగని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, అనుచరులు ఈవీఎంలను భద్రపరచిన మహిళా యూనివర్సిటీ వద్ద మరింతగా రెచ్చపోయారు. ఈ విధ్వంసం అంతా పక్క ప్లాన్ అనడానికి వెలుగులోకి వచ్చిన వీడియోలు, ఆడియోలే నిలువెత్తు సాక్ష్యం.అందుకే కెమెరాలు అమర్చుకున్నారా?దాడులన్నీ ముందస్తు ప్రణాళికలో భాగమేనని తెలుస్తోంది. కొటాలలో జరిగిన ఘర్షణలకు ముందే పులివర్తి నాని, అనుచరుల వాహనాలకు కెమెరాల అమర్చుకొని విధ్వంసాలకు తెగబడినట్లు సమాచారం. దాడుల తర్వాత రోడ్డుపై పడి ఉన్న బీరు బాటిళ్లు, రాళ్లు, రాడ్లు తీసేసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే.. పులివర్తి నాని గన్‌మన్ కల్పించుకుని ‘వాటిని తాకొద్దు. అవి ఎవిడెన్స్’ అంటున్నాడే తప్ప వీఐపీ ఎక్కడున్నాడో అతని వద్దకెళ్దామనే ఆలోచన కూడా చేయలేదని తెలుస్తోంది. గన్మన్కి ఎవిడెన్స్‌తో పనేంటి? పోలీసులు చూసుకుంటారు కదా? ఇదిలా ఉంటే.. వీఐపీ మీద దాడి జరుగుతుందని తెలిసిన వెంటనే స్థానిక డీఎస్పీ లేదా సీఐకి సమాచారం ఇవ్వాలి. ఇది చెయ్యకుండా.. సాక్ష్యాలు అంటూ వాటి కోసం కెమెరాలు ఏర్పాటు చేసుకుని, వస్తువులను తాకొద్దని మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి? దాడి జరిగిందన్నారు, ఆ తర్వాత ధర్నాకు కూర్చున్నారు. ఆ సమయంలో చేతులు, కాళ్లు బాగానే ఉన్నాయి. సుమారు రెండు గంటల తర్వాత గాయాలైనట్టు ఆస్పత్రిలో చేర్చారు. చేతికి, కాలికి కట్లు కట్టుకున్నారు బాగానే ఉంది. రెండు రోజులకే గాయాలు నయమైపోయాయా? సాక్షి పత్రికలో ఫొటోలతో ప్రచురించాక.. మళ్లీ చేతికి, కాలికి కట్లు కనిపించాయి. ఆ కట్లతోనే సిట్ అధికారులకు వినతి పత్రం ఎలా ఇచ్చారు నాని అన్నయ్య గారూ? విధ్వంసాల వెనుక ఎవరి హస్తం ఉందో నిగ్గుతేల్చి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.దాడికి ప్రతి దాడి ఏ చట్టం చెప్పింది?మహిళా యూనివర్సిటీ వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ నాయకులు దాడులు చేశారని ప్రధాన ఆరోపణ. ఆ దాడిలో తన చేయి, కాలికి తీవ్ర గాయం అయినట్లు ఆస్పత్రిలో చేరి కట్లు కట్టుకుని నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అయితే నానిపై దాడి జరగలేదు.. ఆయన చేయి, కాలికి ఎలాంటి గాయాలు కాలేదు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఇదంతా పులివర్తి నాని, కొందరు పోలీసులు పథకం ప్రకారం చేసిన అరాచకమని ఆడియో, వీడియో రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నా అంత మంది రాడ్లు, బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లతో అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పులివర్తి నాని ప్రయాణిస్తున్న కారు మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నట్లుండి ఆగింది. కారు వెనుక గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కారుపై దాడి చేసే సమయంలో పులివర్తి నానిని గన్‌మన్ సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లమని డ్రైవర్‌కి ఆదేశాలు ఇవ్వాలి. వీఐపీని కాపాడుతూ.. తనను తాను కాపాడుకోవాల్సిన బాధ్యత గన్‌మన్ తక్షణ కర్తవ్యం. అలా కాకుండా వాహనాన్ని ఎందుకు ఆపారు? దాడి జరిగే సమయంలో గన్‌మన్ ఎందుకు కారు ఎందుకు దిగాల్సి వచ్చింది? అపాయాన్ని పసిగట్టిన గన్‌మన్ వెంటనే పులివర్తి నానిని అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి. అయితే అక్కడ కారు ఆపి ఎందుకు ప్రతిదాడికి దిగాల్సి వచ్చింది? ముందు గన్‌మన్, తర్వాత పులివర్తి నాని కారు దిగి పరుగెత్తడం వీడియోల్లో కనిపించింది. దాడి జరిగే సమయంలో అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లేందుకు ఎటువంటి ఆటంకాలు లేవు. నాని కారు దిగి అటువైపు వెళ్లిన కొద్ది సేపటికే తుపాకీ కాల్పుల మోత వినిపించింది. ఈ క్రమంలోనే తుపాకీతో పులివర్తి నాని కాల్చారు అనటానికి ఆడియో రికార్డు ఒకటి బయటపడింది. నాని అనుచరుడా? గన్‌మన్ ? ఇద్దరిలో ఒకరు వేరొకరికి ఫోన్‌చేసి ‘ఇక్కడ గొడవ జరుగుతోంది. అన్న ఫైర్ చేశాడు. వెంటనే అందరూ రండి’ అని పిలుపు నివ్వడం ఆడియోలో వినిపించింది. తుపాకీ ఫైర్ అయిన సమయంలో గన్‌మన్ వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. పులివర్తి నాని తుపాకీ పేల్చలేదు అనుకుంటే.. వేలికి గాయమైన గన్‌మన్ ఎలా ట్రిగర్ నొక్కి గాల్లోకి కాల్పులు జరుపుతారు? వైఎసా్‌స్‌ర్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టి అటాక్ చేయించుకునే విధంగా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
కాల్చిందినాని అన్నే!
‘అన్న(పులివర్తి నాని) ఫైర్ కూడా ఆన్‌చేశారు.. త్వరగా రండి’ అంటూ తన అనుచరుడు అన్న మాటలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారాయి. గత మంగళవారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీ వద్ద టీడీపీ అల్లరి మూకలు వీరంగం సృష్టించాయి. వైఎస్సార్సీపీ నేతల కార్లు, వాహనాలు ధ్వంసం చేశాయి. స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఆ వీడియోలు, ఆడియోలు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో మహిళా యూనివర్సిటీ వద్ద నానిపై దాడి జరగలేదని, ఆయనకు అసలు గాయాలు కూడా అవ్వలేదని తేటతెల్లమవుతోంది. కేవలం కారుపైన మాత్రమే దాడి జరిగినట్లు వీడియో బయటపడింది. పులివర్తి నానికి కాలు, చేయి విరిగినట్లు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆస్పత్రి వర్గాలు వెల్లడించడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికలు ఈనెల 13న అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంని చేసుకునేందుకు ఓటర్లు నిశ్చయించారు. ఇందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. దీన్ని జీరి్ణంచుకోలేని కూటమి నేతలు ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు విధ్వంసాలకు తెగబడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామచంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ, చంద్రగిరి మండలంలోని కాసిపెంట్ల, రామిరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌కు అడ్డుగా ఉన్న ఏజెంట్లు, స్థానిక నాయకులపై దాడిచేశారు. అంతటితో ఆగకుండా బ్రాహ్మణకాలువ దళితవాడ, రామిరెడ్డిపల్లెలో కొట్టాల చంద్రశేఖరరెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వాహనాన్ని తగులుబెట్టారు. మరో కారుని ధ్వంసం చేశారు. పులివర్తి నాని హై డ్రామాటీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై అసలు దాడే జరగలేదని, అతనికి గాయాలే అవ్వలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారులో ఉన్న పులివర్తి నాని వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పులివర్తి నాని కారు దిగి పరుగెత్తుకెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ తరువాత కాసేపటికి గన్‌మన్ వద్ద ఉన్న తుపాకీ తీసుకున్న పులివర్తి నాని గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే గన్‌మన్ ఈ కాల్పులతోనే గాయపడ్డారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులివర్తి నానినే గన్ ఫైర్చేశారు.. అన్నదానికి తన అనుచరుడు టీడీపీ నాయకుడికి ఫోన్‌చేసి మాట్లాడుతున్న ఆడియో ఒకటి బయటపడింది. గన్ ఫైర్చేసిన అనంతరం పులివర్తి నాని సుమారు 2 గంటల పాటు స్ట్రాంగ్ పరిసరాల్లో కలియదిరిగారు. ఆ తరువాత తనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడిచేశారని, ఆ దాడి కారణంగా స్ఫృహతప్పి పడిపోయినట్లు నటించారు. ఆపై ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి తాను గాయపడినట్లు సరి్టఫికెట్ ఇవ్వమని డిమాండ్ చేశారు. ఆ వైద్యుడు స్విమ్స్‌కు వెళ్లమని సూచించారు. తన మందీ మార్బలంతో కార్లలో స్విమ్స్‌కు చేరుకున్నారు. అక్కడ వైద్యులను నయానో భయానో బెదిరించి కాలు, చేయి ఫ్రాక్చర్ అయినట్లు కట్టుకట్టించుకుని మరుసటి రోజు వరకు స్విమ్స్‌లోనే చికిత్స పొందుతున్నట్లు తన ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకున్నారు. పులివర్తి నానికి ఎటువంటి గాయాలు కాలేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాలను సిట్ వెలుగులోకి తీసుకొచ్చి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నాని అరాచకాలు👉 ఎన్నిక అనంతరం టీడీపీ అభ్యర్థి నాని కూచువారిపల్లెకు చెందిన చంద్రగిరి ఏఎంసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి తల్లిని పక్కకు తోసేసి, ఆ ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంట్లోని వస్తువులు కాలి బూడిదయ్యే వరకూ నాని, నాని అనుచరులు అక్కడే ఉన్నారు.👉 కూచువారిపల్లిలో ఓ బాలుడిని స్వర్ణముఖి నది వద్దకు తీసుకెళ్లి అతనిపై యూరినేషన్ చేసి అమానవీయంగా చితకబాదారు.👉 కూచువారిపల్లెలో రామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డిని రక్షించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చుట్టుముట్టారు. ఆయన రెండు కార్లను పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.👉 మోహిత్‌రెడ్డి అంగరక్షకుడుగా ఉన్న ఈశ్వర్‌రెడ్డిని ఓ ఇంట్లో కట్టేసి కొట్టారు. మోహిత్ రెడ్డితోపాటు ఉన్న వేణురెడ్డిని బలవంతంగా కొటాల గ్రామం వద్దకు తీసుకెళ్లి చెప్పులతో కొట్టారు. వళ్లంతా వాతలు పడేలా చితకబాదారు.👉 కూచువారిపల్లి రోడ్డుపై నిలబడి ఉన్న బాలుడు కవలికరెడ్డి మర్మాంగాలపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తన్ని గాయపరిచారు.👉 తిరుపతి రూరల్ పరిధిలోని రామానుజంపల్లి పోలింగ్ కేంద్రం సమీపంలో నిలబడి ఉన్న ఉపేందర్‌రెడ్డి, మాధవరెడ్డి, ప్రదీప్‌రెడ్డిపై దాడికి తెగబడ్డారు.👉 తిరుచానూరు ఎంపీటీసీ నరేష్రెడ్డిపై పులివర్తి నానీతోపాటు చిత్తూరు నుంచి వచ్చిన రౌడీలు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు.👉 పులివర్తి నానితో వచ్చిన రౌడీలు తిరుపతి రూరల్ మండలం, కుంట్రపాకం గ్రామ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి కొడుకు అవినాష్‌రెడ్డిని ఒళ్లంతా బ్లేడ్లతో కోశారు.👉 పాకాల మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నంగా నరేష్ రెడ్డి కొడుకు లవంత్రెడ్డి రెండు చేతుల వేళ్లు రక్తం కారేలా కోసేశారు. బీటెక్ చదువుతున్న ఇతను ప్రస్తుతం పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి.👉 చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తిచేసుకుని తిరుపతి నుంచి ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.👉 అగరాల గ్రామంపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు.👉 ‘తమ ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తాం. రోడ్లపై కూడా తిరగనివ్వం’ అంటూ పులివర్తి నాని, అతని అనుచరులు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను నిత్యం ఫోన్లు చేసి భయపెట్టడం రివాజుగా మారుతోంది.👉 పులివర్తి నాని భార్య సుధా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దాడులకు పిలుపునిచ్చారు.👉 దీనిపై సిట్ బృందం విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
టీడీపీ నాయకులకు చేదు అనుభవం.. ప్రజల సమాధానాలతో షాక్!
సాక్షి, తిరుపతి మంగళం: ఏం తల్లీ.. జగన్ ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలకు అన్యాయం చేస్తోంది కదా..? అని టీడీపీ నేత పులివర్తి నాని స్థానిక తిరుమలనగర్‌లో మహిళలను ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే మాకు అన్యాయం జరిగిందంటూ స్థానికురాలు ప్రేమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా తిరుమల నుంచి కిందకు దింపేసి బతుకు లేకుండా చేశాడని, ఏళ్ల తరబడి తిరుమలలో ఉద్యోగం చేస్తున్న తన భర్త ఉద్యోగం కూడా తీసేశాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెంచారు.. గ్యాస్ ధర పెంచారు కదా తల్లీ.. అని కస్తూరమ్మను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అవును సార్.. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వం కదా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ ఆమె ఎదురు ప్రశ్న వేయడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. మంగళంలోని తిరుమలనగర్ పంచాయతీలో గురువారం టీడీపీ నాయకులు నిర్వహించిన ఇదేమి ఖర్మ.. కార్యక్రమంలో స్థానికులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. వారి సమాధానాలకు విస్తుబోయారు. చంద్రబాబు పాలనలోనే తమ పరిస్థితి ఇదేమి ఖర్మ.. అన్నట్టుగా ఉందన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ షాకింగ్ కామెంట్స్) -
టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు
సాక్షి, తిరుపతి : చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు అయింది. పాకాల మండలంలోని పులివర్తివారిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బావమరిది కేశవులు రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పులివర్తి నానిపై పాకాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కాగా గతంలోనూ పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి... గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుతగిలారు. ఆయనకు అండగా నిలిచిన దళితులపై దాడులకు తెగబడ్డారు. అవ్వా తాతలనీ లాగిపడేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా చిందులేశారు. బతుకు తెరువు కోసం కొనుగోలు చేసిన ఆటోనూ ధ్వంసం చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే మీ అంతుచూస్తామంటూ దళితులను గదమాయించారు. ఓటర్లను గృహనిర్బంధం చేస్తూ అలజడి సృష్టించారు. రీ పోలింగ్ సరళి పరిశీలించిన సీఈవో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో ఆదివారం కేంద్ర ఎన్నికల పరిశీలకుడు వినోద్ జుక్షి భేటీ అయ్యారు. ద్వివేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రీపోలింగ్ సరళిని వివరించారు. అలాగే ఈ నెల 23న కౌంటింగ్ ఏర్పాట్లుపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. -
చంద్రగిరి: ‘నాని’గిరి
సీఎం సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయారు. మరోసారి గ్రామంలోకి రానివ్వకుండా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డికి అడ్డుతగిలారు. ఆయనకు అండగా నిలిచిన దళితులపై దాడులకు తెగబడ్డారు. అవ్వాతాతలనీ లాగిపడేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా చిందులేశారు. బతుకు తెరువు కోసం కొనుగోలు చేసిన ఆటోనూ ధ్వంసం చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే మీ అంతుచూస్తామంటూ దళితులను గదమాయించారు. ఓటర్లను గృహనిర్బంధం చేస్తూ అలజడి సృష్టించారు. చంద్రగిరిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ పరిణామాలు విస్మయానికి గురిచేశాయి. రీపోలింగ్ జరిగే పల్లెల్లో రణరంగం తలపించింది. సాక్షి, తిరుపతి/తిరుపతి రూరల్: సీఎం సొంత నియోజకవర్గం చంద్రగిరి పరిధిలోని వెంకట్రామాపురం, ఎన్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, పాకాల మండలం పులివర్తివారిపల్లెలో ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నియోజక వర్గంలోనే ఈ పరిస్థితి రావటంతో పరువుపోగొట్టుకున్న టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నారు. రెండు రోజులుగా పచ్చమూకలు దళితులు, సామాన్యులపై యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ఏళ్ల తరబడి అందుకోలేకపోయిన దళితులు, మొదటిసారిగా ఓటింగ్‌కు ధైర్యంగా ముందుకు వస్తుండటంపై తట్టుకోలేకపోతున్నారు. దీంతో స్థానికులు ఎవ్వరూ బయటకు రాకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. దళితులు, గిరిజనులను భయపెట్టి వారిని ఓటు హక్కుకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. రీ–పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. దళితవాడలోకి వెళ్లి మరీ.. దాడులు రామచంద్రాపురం మండలం ఎన్ఆర్ కమ్మపల్లిలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన హనుమంతునాయుడు, రధీస్, జనార్దన్ చౌదరి, నాగరాజు, మోహన్‌నాయుడు, మధు, సుబ్రమణ్యం నాయుడు, పద్మనాభ నాయుడు, మునిరత్నం నాయుడు, దామోధర్ నాయుడు, నారాయణస్వామి, హరీష్‌నాయుడు, రాజేశ్వరి, లక్ష్మీ, సాయి, జ్యోతి, హేమంత్‌నాయుడు మరికొందరు కలిసి కర్రలు, రాడ్లు, కారంతో దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను కాదని 19న జరిగే ఓటింగ్‌కు వెళ్లవద్దని టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని, వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే చంపేస్తామని బెదిరించినట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా ఓటు మమ్మల్ని వేయనీయకుండా అడ్డుకోవటం వల్లే రీ–పోలింగ్ వచ్చిందని, మా ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటాం’ అని చెప్పిన వెంటనే టీడీపీ శ్రేణులు కర్రలు, రాడ్లు, కారం పొడితో మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని వాపోయారు. జీవనోపాధి కోసం అప్పు చేసి కొనుగోలు చేసుకున్న ఆటోను సైతం ధ్వంసం చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో దళితవాడకు చెందిన నలుగురికి గాయాలు అయ్యాయి. మిమ్మల్ని చంపేస్తే ఎవరు వచ్చి కాపాడుతారో చూస్తామంటూ హెచ్చరికలు చేసినట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దళితులపై దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్లు రేణిగుంట సీఐ శ్రీనివాసులు తెలిపారు. అధికారులపై వేటు పడే అవకాశం.. గత నెల 11న పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అదికారులపై వేటు వేసే అకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు సెక్టోరియల్ అధికారులు, ఐదుగురు పోలింగ్ అధికారులు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఇతర సిబ్బందిపైనా కఠిన చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. వెంకట్రామాపురంలో ప్రచారాన్ని అడ్డుకునే యత్నం రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలను టీడీపీ వర్గాలు అడ్డుకునే యత్నం చేశాయి. ‘మా ఊరులో మీ ప్రచారం వద్దు.. ఊరు నుంచి వెళ్లిపోండి’ అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణలు దీటుగా సమాధానం ఇవ్వడం.. ప్రచారాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేయటంతో టీడీపీ నాయకులు వెనక్కితగ్గారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. పాకాల మండలం పులివర్తివారిపల్లిలో వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పను సైతం టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ‘మా ఊరులోకి దళితుడు కాలుపెట్టొద్దు’ అంటూ కొందరు హెచ్చరించారు. అదేవిధంగా ఆయన్ని కారు దిగకుండా చేసేందుకు కారుపై పిడిగుద్దులు గుద్దారు. అయితే రెడ్డెప్ప సైతం వారికి దీటుగా సమాధానం ఇచ్చారు. ప్రచారం చేస్తాను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’ అంటూ గ్రామంలోకి వెళ్లారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితలు నెలకొన్నాయి. పోలీసులు జోక్యంతో టీడీపీ వర్గాలు వెనుదిరిగాయి. అండగా ఉంటా.. ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోండి దాడిలో గాయపడిన ఎన్ఆర్ కమ్మపల్లి దళితవాడకు చెందిన దళితులను శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పరామర్శించి టీడీపీ దాడులను ఖండించారు. అండగా ఉంటామని, ధైర్యంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
నాపై తొమ్మిది కేసులున్నాయి, నిన్నేస్తే పదో కేసు అవుతుంది
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఆఫీసర్స్ లైన్ వద్ద శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు గొడవపడడం స్థానికంగా కలకలం రేపింది. ఇందులో ఒకతను ‘నేను నాని అనుచరుడిని రా.. నాపై తొమ్మిది కేసులున్నాయి, నిన్ను నరికేస్తే పదో కేసు అవుతుంది’’ అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తిని కత్తితో నరికాడు. తలకు తీవ్ర గాయమైన వ్యక్తిని రోడ్డుపైనే కొడుతూ, కత్తితో నరకడానికి ప్రయత్నించగా మరికొందరు అడ్డుపడ్డారు. చివరకు సమాచారం అందుకున్న బ్లూకాట్ పోలీసులు ఇద్దరినీ అడ్డుతీసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ఎదుటే నాని అనుచరుడిని అంటూ చెప్పుకున్న వ్యక్తి మళ్లీ దాడికి ప్రయత్నించాడు. కాగా కత్తితో నరికిన వ్యక్తి జానకారపల్లెకు చెందినవాడిగా, గాయపడ్డ వ్యక్తి సీఎంటీ రోడ్డుకు చెందిన యువకుడిగా తెలిసింది. గాయపడ్డ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
చంద్రబాబు ఉండేది గుంటూరు.. నోటరీ కృష్ణా జిల్లా
టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను చూస్తే అంతా ఆశ్చర్యపోతారు.ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జిల్లాలోని మరో ముగ్గురు అఫిడవిట్లలో తప్పులు బయటపడ్డాయి. చంద్రబాబు తను నివాసం ఉంటున్న చిరునామా గుంటూరు జిల్లా ఉండవల్లి అయితే.. కృష్ణా జిల్లాఅడ్వకేట్తో నోటరీ తయారుచేయించి తప్పులో కాలేశారు. అయినా సీఎం చంద్రబాబు నామినేషన్‌ని ఆమోదించారు. చంద్రగిరి, తిరుపతి, గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో అనేక నిజాలను దాచి పెట్టారు. వారి ముగ్గురి నామినేషన్లు ఆమోదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీరు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు సహా నలుగురు టీడీపీ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో వాస్తవాలు దాచిపెట్టారు. దీంతో వారి నామినేషన్లను ఆమోదించిన అధికారులు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. కుప్పం టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తాను నివాసం ఉంటున్న ఇంటి చిరునామా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి. అయితే ఆయన నోటరీని మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది సీతారామ్ చేత తయారుచేయించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని చంద్రగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. ఈయన సమర్పించిన అఫిడవిట్లో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ దాచిపెట్టారు. పాకాల మండలం ఆదెనపల్లిలో ఖాతా నంబర్ 283తో 32 సర్వే నంబర్లలో సుమారు 10 ఎకరాల వరకు భూమి ఉంది. అయితే నోటరీలో చూపించింది కేవలం 8 సర్వే నంబర్లలో ఉన్న భూమి మాత్రమే చూపించారు. పులివర్తి నాని భార్య కె.గానసుధ పేరున 1.30 ఎకరాలు ఉన్నట్లు చూపించా రు. వాస్తవంగా ఆమె పేరునయాదమర్రి మండలం కుక్కలపల్లిలో సర్వే నంబర్ 510/4ఏలో మొత్తం 3.32 ఎకరాల భూమి ఉంది. ఆస్తుల వివరాలను దాచిపెట్టిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పేరున రెండు పాన్ కార్డులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపిం చారు. నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి రెండు పాన్ కార్డులు ఉండకూడదు. ఆస్తులు కూడా నాని పేరున చూపించారు. సుగుణమ్మ.. ఇదేందమ్మా...! తిరుపతి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ సమర్పించిన అఫిడవిట్లో వాస్తవాలు దాచిపెట్టారు. అఫిడవిట్‌లోని 12వ పేజీలో ఉండాల్సిన మూడు కాలమ్స్ మాయమయ్యాయి. హెచ్యుఎఫ్, వారసులు 1, 2, 3 గడులు (కాలమ్స్) పూర్తి చేయాలి. అయితే సుగుణమ్మ సమర్పించిన అఫిడవిట్లో అవి కనిపించలేదు. 14వ పేజీలో వివరాలు మాత్రం చూపించారు. హోటల్, కారు, ఎయిర్ కండిషనర్, ఫర్నీచర్స్, మోటార్ వాహనం, ఇతరత్రా చూపించారు. అయితే అవి ఎవరికి చెందినవి అనే వివరాలు పొందుపరచలేదు. ఏడవ గడిలో 6, 7, 8లో ఆస్తులను చూపించారు. అవి ఎవరి అని స్పష్టం చెయ్యలేదు. ఇంకా 550 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపిం చారు. అవి కూడా ఎవరివి అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే.. తిరుచానూరు వద్ద సర్వే నంబర్ 255/1బి, 256/1లో 87 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని 2006లో రూ.9,84,905 కొనుగోలు చేసినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ కేవలం రూ.1,04,400గా చూపించారు. అదే విధంగా సర్వే నంబర్ 254/3లో 35 సెంట్ల భూమిని 2007లో రూ.5, 04, 565 కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ కేవలం రూ.45,500 మాత్రమేనట. సర్వే నంబర్ 256/1లో 21 సెంట్ల స్థలాన్ని 2008లో రూ.6,86,820కి కొనుగోలు చేశారు. ప్రస్తుతం దాని విలువ రూ.25,200గా చూపించారు. సర్వే నంబర్ 251/10ఏలో 3.75 సెంట్ల స్థలాన్ని 2009లో రూ.1,74,640కి కొనుగోలు చేస్తే.. అదే స్థలం ప్రస్తుతం రూ.4,875గా చూపించారు. వాస్తవంగా ఇక్కడ సెంటు స్థలం సుమారు రూ.25 లక్షలు పలుకుతోంది. సెంటు భూమి లేదు..వ్యవసాయం ద్వారా ఆదాయమట గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి గుమ్మడి హరికృష్ణ తనకు వ్యవసాయ భూములు లేవని చూపించారు. అయితే వ్యవసాయం ద్వారా రూ.5,88,650 ఆదాయం చూపించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ప్లాట్ నంబర్ 153. సర్వే నంబర్ 239/3, 3ఏని చూపించారు. అందులో విస్తీర్ణం, విలువ చూపలేదు. ఇంకా హరికృష్ణ తండ్రి 2014లో ఒక ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ ప్లాటు విలువ అప్పట్లో రూ.9 లక్షలు. ప్రస్తుతం ఆ ప్లాటు మార్కెట్ విలువ చూపలేదు. హరికృష్ణ భార్య భార్గవి టీటీడీ కేంద్ర ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె ఇన్‌కంట్యాక్స్ ఏమీ లేదని చూపించారు. వింజం లక్ష్మిరెడ్డి పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు చూపించారు. ఆ నివాసం అద్దెదా? సొంతమా? అనే వివరాలను పొందుపరచలేదు. అఫిడవిట్లో కారు ఉందన్నారు. ఆ వాహనాన్ని ఫైనాన్స్‌లో తీసుకున్నారా? నేరుగా డబ్బులిచ్చి కొనుగోలు చేశారా? అనే వివరాలు లేవు. ఇదిలా ఉంటే ‘నో డ్యూస్’ సర్టిఫికెట్స్ ఎక్కడా చూపలేదు. ఈ నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అనేక తప్పులు ఉన్నా రిటర్నింగ్ అధికారులు ఆమోదించడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబునాయుడు అఫిడవిట్ -
నంబర్ ప్లేట్ లేకపోయినా..
చిత్తూరు, తిరుపతి మంగళం: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాత్రం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచార రథాలకు వాహన నంబర్ సహా అధికారుల నుంచి అనుమతులు పొందాలి. తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి పంచాయతీ మంగళంలో గురువారం పులివర్తి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా నంబర్ ప్లేట్ లేని వాహనంతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఏపీ03వీజెడ్టీఆర్ 9527 ఇసుజు వాహనానికి రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పాస్ ఉన్నప్పటికీ నంబర్ ప్లేట్ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో లెక్కలేనన్ని వాహనాలను అనుమతులు లేకుండా ప్రచారం కోసం వినియోగిస్తున్నారని అంతర్గత సమాచారం. -
టీడీపీ- కాంగ్రెస్ ప్రచారం; అలా చెప్తాం అంతే!
సాక్షి, చిత్తూరు : వెన్నుపోటు రాజకీయాలే కాదు పొత్తులు పెట్టుకోకుండా గెలిచిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదనే విషయం బహిరంగ రహస్యమే. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తే ఫలితం ఉంటుంది అనే విషయంపై ఆయనకు ఒక లెక్క ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కొన్ని ‘భేదాభిప్రాయాలు’ రావడంతో.. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. ఏపీలో మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరుపార్టీల మధ్య లోపాయికారి పొత్తు కొనసాగుతున్న విషయం బహిర్గతమవుతోంది. ఇందుకు చంద్రగిరి మండలంలో జరిగిన ప్రచార కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది. అలా చెప్తాం అంతే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తపేటలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుటుంబ సభ్యులతో పాటుగా.. కాంగ్రెస్ చిత్తూరు ఎంపీ అభ్యర్థి రంగప్ప.. చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి వాసులు కలసి ప్రచారం నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విధంగా కాంగ్రెస్, టీడీపీ నేతలు కలసి ప్రచారం నిర్వహించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు మార్కు ‘పాలిట్రిక్స్’ తెలిసిన వాళ్లు మాత్రం ఇది మాకేం కొత్తకాదుగా అని సరిపెట్టుకుంటున్నారు. ఇక జనాదరణతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక.. చంద్రబాబు ఇప్పటికే పవన్ కల్యాణ్, కేఏ పాల్ వంటి వారితో ‘ముసుగు రాజకీయాల’ కు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.(చదవండి : పులివర్తి నాని బంధుగణం దౌర్జన్యకాండ) -
టీడీపీ నాయకుల బరితెగింపు
చిత్తూరు, చంద్రగిరి: నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ఓటర్లను భయపెట్టైనా ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. దీనికి యువకులను మద్యం మత్తులోకి దింపి పావులుగా వాడుకుంటున్నారు. ఆదివారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సన్నిహితుడు, తిరుచానూరు మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీధర్ రెడ్డి అనుచరులు పదిమంది యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసి, గాయపరిచారు. బాధితుల కథనం మేరకు... వైఎస్సార్సీపీకి చెందిన సతీష్, కృష్ణ, శివలతో పాటు మరో ఏడుగులు యువకులు తిరుచానూరు మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి పొలం వద్ద ఉన్నారు. అదే సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తన పొలంలో టీడీపీకి చెందిన కొంతమంది యువకులకు విందు ఏర్పాటు చేశారు. ఫూటుగా మద్యం సేవించిన యువకులను శ్రీధర్‌రెడ్డి రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ యువకులపైకి పంపారు. మద్యం మత్తులో ఉన్న యువకులు వైఎస్సార్ సీపీ యువకులపై దాడికి తెగబడ్డారు. పరుగులు తీసినా శ్రీధర్ రెడ్డి అనుచరులు మాత్రం వారిని వెంబడించి, దాడులు చేశారు. ఈ దాడుల్లో యోగిమల్లవరానికి చెందిన సతీష్, చంద్రశేఖర్‌కాలనీకి చెందిన కృష్ణకు తలలు పగిలాయి. యోగిమల్లవరానికి చెందిన శివమణి ఎడమ చేతిని విరిచేశారు. మరో ఏడుగులు యువకులకు స్వల్ప గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు అక్కడకు చేరుకునే లోపు శ్రీధర్ రెడ్డి అనుచరులు పరారయ్యారు. బాధితులను రుయా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందజేస్తున్నారు. నాని అండతోనే.. చిత్తూరు రౌడీయిజాన్ని చంద్రగిరికి తీసుకొచ్చి న నాని అండతో శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుల దాడులకు తెగబడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ దామినేడు ఇంది రమ్మ కాలనీకి చెందిన పలువురు యువకులపై శ్రీధర్‌రెడ్డి అనుచరులు దాడులు చేశారని, ప్రజాభిమానంతో ఓట్లు సంపాదించుకోవాలే తప్ప, ఇలా రౌడీయిజం చేసి కాదని తిరుచానూరు వాసులు మండిపడుతున్నారు. పులివర్తి నానికి ఓటుతో బుద్ది చెబుతామని వారు ఉద్ఘాటిస్తున్నారు. -
నాని బంధుగణం దౌర్జన్యకాండ
చిత్తూరు, పాకాల : తమ గ్రామంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎవరూ ప్రచారం చేయరాదంటూ అడ్డుకున్న సంఘటన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని స్వగ్రామమైన పులివర్తివారిపల్లెలో చోటుచేసుకుంది. సాక్షాత్తు పులివర్తి నాని వదిన సునీతమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులను గ్రామంలోకి రాకుండా నాని బంధువులు , అనుచరులు అడ్డుకున్నారు. దౌర్జన్యానికి తెగబడ్డారు. ఈ ఘటనను సెల్ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేసిన వారి సెల్ఫోన్లను పగులగొట్టారు. వివరాలు.. పులివర్తివారిపల్లిలో ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్యే వదిన సునీతమ్మ, మహిళలను దూషిస్తూ, దూసుకొస్తున్న నాని అనుచరులు అయితే శుక్రవారం పులివర్తివారిపల్లెకు వైఎస్సార్సీపీ తరఫున నాని వదిన సునీతమ్మ, వైఎస్సార్సీపీ నాయకురాళ్లతో వెళ్లారు. వారి రాకను గమనించిన నాని బంధువులు, అనుచరులు వారిని గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. ప్రచారం అంటూ గ్రామంలోకి వస్తే తిరిగి వెళ్లరని హెచ్చరించారు. వారిని పరుష పదజాలంతో దూషించారు. ఈ దృశ్యాలను కొందరు సెల్ఫోన్లలో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే సెల్ఫోన్లను కూడా ధ్వంసం చేశారు. మహిళలపై దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని సునీతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్ములగుంటలో ప్రచారం చేస్తున్న నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి (ఫైల్) వాస్తవానికి నాలుగురోజుల క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వగ్రామమైన తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధ ప్రచారం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేసినా అది వారి హక్కుగా భావించి గ్రామస్తులుగానీ, వైఎస్సార్ సీపీ నాయకులుగానీ ఆక్షేపించలేదు. అక్కడ అంత మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే, పులివర్తివారిపల్లెలో మాత్రం నాని బంధుగణం రెచ్చిపోయి, దౌర్జన్యం చేయడం విమర్శలకు తావిచ్చింది. అలాగే, తాటిమాకులపల్లెలో నాని అనుచరులు మద్యం మత్తులో వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకున్నారు. సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. -
లోకేష్‌కు తెలిసే కుట్ర!
సాక్షి, తిరుపతి రూరల్: మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కోసమే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు తాము రెక్కీ నిర్వహించినట్లు నిందితులు మీడియా ఎదుట అంగీకరించడం తీవ్ర కలకలం రేపుతోంది. నారా లోకేష్‌కు తెలియకుండా సొంతంగా ఏ చిన్న నిర్ణయం కూడా తీసుకోలేని నాని ఇంత పెద్ద కుట్రను ఆయనకు తెలిసే చేసి ఉంటారని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగా రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి చిత్తూరు నుంచి నేరచరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులను డ్రైవర్ల ముసుగులో ఎమ్మెల్యే చెవిరెడ్డి వద్దకు పంపించారు. నెల రోజులుగా వారు ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబ సభ్యుల కదలికలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పులివర్తి నానికి చేరవేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరా తీయడంతో దిగ్భ్రాంతి కలిగేలా సుపారీ విషయం వెలుగులోకి వచ్చింది. మొదటి దశలో ఇళ్లు, ఆఫీసు వద్ద నిఘా పెట్టాలని, ఎమ్మెల్యేను ఎవరెవరు కలుస్తున్నారు? ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు, ఎక్కడికి, ఏ దారిలో వెళ్తారు? మళ్లీ ఎప్పుడు వస్తారు? అనే సమాచారాన్ని నిందితులు సేకరించారు. తర్వాత దశలో సమయాన్ని బట్టి తాము చెప్పినట్లు నడుచుకోవాలని చిత్తూరుకు చెందిన నాని అనుచరులు ఆదేశించినట్లు చిత్తూరు పండ్రంపల్లికి చెందిన నిందితులు నాగభూషణం, సిసింద్రీలు మీడియా ఎదుట వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి తుమ్మలగుంటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి తనపై నిందితులు నిర్వహించిన రెక్కీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు కొలువైన తిరుపతిలో రెక్కీలు, హత్యలు, అబ్జర్వేషన్లు లాంటి సంస్కృతి ఇప్పటిదాకా లేదన్నారు. నేరచరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులకు డ్రైవర్ల ముసుగులో రూ.30 లక్షలు ఇచ్చి తనపై, తన కుటుంబంపై రెక్కీ నిర్వహించటం దారుణమన్నారు. రాజకీయల్లో స్నేహపూర్వక పోటీ ఉండాలే తప్ప విద్వేషాలు, వ్యక్తిగత కక్షతో వ్యవహరించటం బాధాకరమన్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, తనపై రెక్కీ నిర్వహించి పట్టుపడిన నిందితులు నాగభూషణం, సిసింద్రీలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అర్భన్ ఎస్పీకి అప్పగించారు. నిందితులను విచారణ నిమిత్తం ఎంఆర్ పల్లి పోలీసులకు అప్పగించారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెవిరెడ్డి వినతిపత్రం అందించారు. తనకు రక్షణ కల్పించాలని నాలుగు నెలల క్రితమే సీమ రేంజ్ డీఐజీ శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వినతిపత్రం అందించినా ఇప్పటివరకు స్పందన లేదు. పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆందోళన నిందితులను పోలీసులకు అప్పగించినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడంతో ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం రాత్రి ధర్నాకు దిగారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాలని కోరుతూ రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. నిందితులపై కేసు నమోదు చేయకపోవడం పట్ల పోలీసు అధికారులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు.