
సాక్షి, తిరుపతి జిల్లా: ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ చంద్రగిరి జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ "చంద్రగిరి రాజకీయం" గ్రూప్‌ను డిలీట్ చేయాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సీఐ సుబ్బరామిరెడ్డికి పాత్రికేయులు ఫిర్యాదు చేశారు.
"చంద్రగిరి రాజకీయం" వాట్సాప్ గ్రూప్‌లో ఎమ్మెల్యే నానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఈ నెల 13న సుధారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్మిన్‌లుగా ఉన్న వారిని ఐదుగురు జర్నలిస్టులపై ఆమె కేసు పెట్టారు. మెసేజ్‌లు పెట్టిన వారిని వదిలివేసి, తమపై కేసులు పెట్టడం ఏంటీ? అంటూ బాధిత జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక?
Comments
Please login to add a commentAdd a comment