Journalists
-
వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?
ఇజ్రాయెల్ కంపెనీ పారాగాన్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన అత్యాధునిక స్పైవేర్ ద్వారా జర్నలిస్టులు, సివిల్ సొసైటీ సభ్యులతో సహా దాదాపు 100 మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు వాట్సప్ సైబర్ సెక్యూరిటీ ఆరోపించింది. అయితే, భారతీయ వినియోగదారులు ఈ ఉల్లంఘన బారిన పడలేదని హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ధ్రువీకరించింది. తన భారతీయ వినియోగదారులు ఈ దాడికి గురికాలేదని వాట్సాప్ స్పష్టం చేసింది.గ్రాఫైట్ అని పిలువబడే ఈ స్పైవేర్ ‘జీరో-క్లిక్’ పద్ధతిని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేశారని వాట్సప్ తెలిపింది. అంటే బాధితులు ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తులను టార్గెట్ చేసి హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ఈ స్పైవేర్‌ను అక్కడి ప్రభుత్వ క్లయింట్లు ఉపయోగిస్తున్నారని భావిస్తున్నప్పటికీ, దాడి వెనుక ఉన్న నిర్దిష్ట వ్యక్తులను వాట్సప్ గుర్తించలేకపోయింది.ముఖ్యంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)తో కంపెనీ గతంలో దాదాపు 2 మిలియన్ల డాలర్ల కాంట్రాక్టును దక్కించుకొని వార్తల్లో నిలిచింది. జాతీయ భద్రతా సమస్యల కారణంగా ఫెడరల్ ఏజెన్సీలు స్పైవేర్ వినియోగాన్ని పరిమితం చేసేలా, అప్పటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వెలువడిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు అనుగుణంగా ఉండేలా ఈ ఒప్పందాన్ని సమీక్షించారు. పారగాన్ సొల్యూషన్స్ యూఎస్‌లోని చాంటిల్లీ, వర్జీనియాలో కార్యాలయాలను కలిగి ఉంది. యూఎస్ ప్రభుత్వ సంస్థలతో సంస్థ ఒప్పందాలపై పరిశీలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాదారులచే స్పైవేర్‌ను విస్తృతంగా ఉపయోగించడంపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానాపారాగాన్ సొల్యూషన్స్‌పై వాట్సప్ చర్యలు చేపట్టింది. చట్టవిరుద్ధమైన నిఘా కోసం కంపెనీ స్పైవేర్‌ను ఉపయోగించడం నిలిపివేయాలని కోరుతూ.. ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని లేఖ రాసింది. వాట్సప్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో వినియోగదారులు ప్రైవేట్‌గా కమ్యూనికేట్ చేసే సామర్థ్యాన్ని రక్షించడానికి నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. స్పైవేర్ సంస్థలను కట్టడి చేస్తూ వారి చర్యలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. -
మీడియాపై నోరుపారేసుకున్న జయరాం
అనంతపురం, సాక్షి: జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంతకల్లు(Guntakal) టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమంటున్నాయి. తనపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ బహిరంగంగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. ‘‘జర్నలిస్టులను(Journalists) రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. తక్షణమే ఆయన మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలి’’ అని ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ చౌదరి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే ధర్నాకు దిగుతామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. ‘‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా. నాకు అన్నీ తెలుసు.. నేను ఏదైనా చేస్తా. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా వార్తలు రాస్తే ఖబడ్దార్.. తాట తీస్తా. నేను అన్నీ చేసి వచ్చినోడ్ని.. ఏం రాసుకుంటారో రాసుకోండి’’ అంటూ ఓ కార్యక్రమంలో జర్నలిస్టులపై గుమ్మనూరు హెచ్చరికలు జారీ చేశారు.జయరాం ఆగడాలు మితిమీరిపోతున్నాయ్!జర్నలిస్టులపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి స్పందించారు. ‘‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వాస్తవాలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా?. ఆయన ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసుల దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు అని అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. -
మీడియా పై దాడి సిగ్గు చేటు.. కూటమి నేతలపై జర్నలిస్టులు ఫైర్
-
మీడియాపై టీడీపీ మూకల దాడి
-
సాక్షి జర్నలిస్టులపై టీడీపీ గుండాల దాడి
-
మంచు మనోజ్ ను ప్రశ్నించిన రాచకొండ సీపీ
-
అక్షరానికి సంకెళ్లు నిలవగలవా?
నిజాలు చెప్పినందుకు కలాలకు సంకెళ్లు వేస్తామంటే, ఆ కలాలు వెన్ను చూపుతాయా? మరింత పదునెక్కి మును ముందుకు సాగుతూ అక్ష రాస్త్రాలని ‘నారాచాలు’గా సంధిస్తాయా? ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికల గొంతు నొక్కేయాలని యత్నించిన నియంతలు చరిత్రలో ఎలా మిగిలిపోయారో తెలియంది ఏముంది? భారత రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛకు ఇచ్చిన హక్కులేమిటో, కోర్టులు ఎన్నిసార్లు తమ తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయో తెలుసుకుంటే పత్రికల గొంతు నొక్కేయాలని ఎవరూ ప్రయ త్నించరు. ఒకవేళ అధికార గర్వంతో అలా చేసినా చివ రికి చరిత్రలో అప్రజాస్వామిక వాదులుగా వారే మిగిలి పోతారు. కేసులు మాత్రం కొట్టి వేయబడతాయి.పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని లక్నోకి చెందిన కేసులో సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపర మైన హక్కుల గురించి ఈ రాజకీయ నాయకులు స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేయరు. గడిచిన మే నెలలో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్æ అరెస్టుని సుప్రీంకోర్టు ఖండిస్తూ అతనిపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవనీ, వాటికి హేతుబద్ధత లేదనీ వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలపై విశ్లేషణ చేయకుండా అరెస్టు చేయటం సరికాదని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ‘మోహిత్ అండ్ శ్యామ్ చందక్’ కేసులో ఆదేశించింది. జర్నలిస్టు అభిజిత్ అర్జున్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ... అసలు ఈ అరెస్ట్‌కి ఎందుకు పాల్పడవలసి వచ్చిందో ఎంక్వయిరీ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం. డిప్యూటీ కమిషనర్ హోదా కలి గిన అధికారులతో విచారణ జరిపించి ఎనిమిది వారాల్లోగా ధర్మాసనానికి నివేదించాలని ఆదేశించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసుల్ని ఉదాహరించవచ్చు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రభుత్వాలు తమ కున్న తాత్కాలిక అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకు నచ్చని వార్తలు ప్రచురించే జర్నలిస్టులను, ప్రసారం చేసే జర్నలిస్టులనూ అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వ డంతో పోలీసులు తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించవలసి వస్తోంది. అయితే ఈ అక్రమ అరెస్టుల పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించడంతో భవిష్యత్తులో ఏ పోలీసులైతే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారో వాళ్ళు న్యాయస్థానం ముందు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అది అలా ఉంటే, తమ అధికారానికి ఎదురు లేదని వ్యవహరించే పాలకులు సైతం జర్నలిస్టుల మీద దాస్టీకానికి పూనుకుంటే... వారు సైతం అందుకు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఈ దేశంలో జర్నలిస్టులకు.... రాజకీయ నాయకులకు ఉన్న సౌఖ్యం, వసతులు, ఆర్థిక పరిపుష్టి లేకపోవచ్చు; కానీ వారిని మించిన బలమైన శక్తులు జర్నలిస్టులే అనే వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. నాయకుల అధికారం తాత్కాలికం. కానీ వృత్తి జర్నలిస్టులు ఒకసారి జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఒడిదు డుకులు ఎదురైనా, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా , ఎలాంటి కష్టాలకు గురి కావలసి వచ్చినా, ఎలాంటి నష్టాలకు ఎర కావాల్సి వచ్చినా ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకే తిక విప్లవం వచ్చిన తర్వాత... రాతపూర్వక, మౌఖిక, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా కోట్లాది మందికి సమాచార వ్యాప్తి సులభతరమైంది. ఫలితంగా పార దర్శకత లేని ప్రభుత్వాలకూ, నిజాయితీ లోపించిన వ్యక్తులకూ ఇబ్బందిగా మారింది. దాంతో మీడియాపై దాడికి చట్టాలను ఆయుధాలుగా మార్చుకున్నారు వీరు. అందులో ప్రధానమైనది ‘పరువునష్టం చట్టం.’ ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం కిందికి వస్తుంది. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం ఇది నేరం. ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం, టెక్ట్స్, ఇమేజ్, కార్టూన్లు, క్యారి కేచర్లు ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. దీని ఆసరాతో తమకు అనుకూ లంగా వార్తలు లేకపోతే, పరువునష్టం దావా వేయ డానికి తయారవుతారు.వీళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే... విమర్శ సదుద్దేశంతో చేసినా, విస్తృత ప్రజాప్రయోజ నాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కిందికి రాదు. మీడియాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బలంగా ఉన్నాయి. వీటిని ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ హరించలేవని కోర్టు తీర్పులు అనేకం వున్నాయి. తాత్కాలిక అధికార గర్వంతో మీడియా మీద వీరు పెట్టే కేసులు కొంత కాలానికి కొట్టి వేయబడతాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి పత్రికలు, మీడియాకు కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ స్వేచ్ఛ, ఒకరి అభిప్రాయాన్ని ప్రచారం చేసే లేదా ప్రచురించే హక్కు ఉన్నాయి.జైల్లో ఉన్న ఖైదీలను కూడా ఇంటర్వ్యూ చేసే హక్కు జర్నలిస్టులకు ఉంది. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో జైలులో ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి పత్రికలు ప్రయత్నించాయి. చారులతా జోషి (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు లేదా ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.ఇన్ని హక్కులు ఉన్న జర్నలిస్ట్‌లను కేవలం చిన్న ఉద్యోగస్తులు అనుకోవడం పొరపాటు. వాళ్లు ప్రజా స్వామ్య సౌధానికి వాచ్ డాగ్స్ అని గమనించాలి. ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించేవారు చట్టాలకు లోబడి నడుచుకోవాలే కాని మనకు ఎదురేముంది? అనుకుంటే ఇటు ప్రజా కోర్ట్, అటు జ్యూడిషియల్ కోర్టులు చూస్తూ ఊరుకోవు. ప్రపంచంలో హిట్లర్ లాంటి నియంతలు కూడా ‘నేను 1000 ఫిరంగులకి భయపడను కానీ ఒక కలానికి భయపడతాను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు జర్నలిస్టులు మృతి
బీరుట్/ఖాన్ యూనిస్: గాజాతోపాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని బీరుట్ కేంద్రంగా పనిచేసేత అరబ్ టీవీ అల్ మయాదీన్ కెమెరామ్యాన్ ఘస్సన్ నాజర్, టెక్నీషియన్ మహ్మద్ రిడా, హెజ్బొల్లా గ్రూపునకు చెందిన అల్ మనార్ టీవీ కెమెరామ్యాన్ విస్సమ్ కస్సిమ్‌గా గుర్తించారు. ఘటన సమయంలో ఆ భవనంలో ఏడు వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన 18 మంది జర్నలిస్టులు ఉన్నారని లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకరీ చెప్పారు. ఇజ్రాయెల్ చర్యను ప్రణాళిక ప్రకారం చేపట్టిన హత్యాకాండగా అభివర్ణించారు. కుప్ప కూలిన భవనం ప్రాంగణంలో ప్రెస్ అనే స్టిక్కర్‌తో ధ్వంసమైన వాహనాలున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. ఆ సమయంలో తామంతా విశ్రాంతి తీసుకుంటున్నామని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన అల్ జజీరా ఇంగ్లిష్ చానెల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. గాజాపై యుద్ధం మొదలయ్యాక 128 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఒకే కుటుంబంలోని 36 మంది మృతిగాజాలోని ఖాన్‌యూనిస్ నగరంపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 38 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. -
ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన అల్ జజీరా
గాజాలో ఆరుగురు అల్ జజీరా మీడియా సంస్థకు జర్నలిస్టులు పాలస్తీనా తీవ్రవాదులని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు చేసింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపులతో ఆరుగురు జర్నలిస్టులు అనుబంధంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలై స్పందించిన ఖతార్‌కు చెందిన అల్ జజీరా మీడియా నెట్వర్క్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చింది.‘‘ఇజ్రాయెల్ సైన్యం మా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తున్నాం. ఇజ్రాయెల్ మా జర్నలిస్టులపై కల్పిత సాక్ష్యాలను సృష్టించడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఈ కల్పిత ఆరోపణలతో ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న జర్నలిస్టుల గొతునొక్కేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది. తద్వారా యుద్ధంలో జరుగుతున్న కఠినమైన వాస్తవాలను ప్రపంచానికి తెలియకూడదలనే కుట్రకు ఇజ్రాయెల్ తెరలేపింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు, గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని ఎప్పటికప్పుడూ ప్రసారం చేస్తున్న ఏకైక అంతర్జాతీయ మీడియా నెట్వర్క్ అల్ జజీరానే’’ అని ఓ ప్రకటనలో తెలిపింది..‘‘గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద సంస్థలలోని సైనికులతో ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు కలిసిపోయారని నిర్ధారించే గూఢచార సమాచారం, టెర్రరిస్ట్ శిక్షణా కోర్సుల జాబితా, ఫోన్లతో సహా గుర్తించబడ్డాయి. ఖతార్ అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌లో పనిచేసే సిబ్బంది హమాస్ ఉగ్రవాదులతో కలిసిపోయారడానికి ఈ పత్రాలే రుజువు. అల్ జజీరా హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లు చాలా మంది జర్నలిస్టులు బహిర్గతం చేశారు. అల్ జజీరా జర్నలిస్టులు.. అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్ , తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయి.అదేవిధంగా అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్ ఇస్లామిక్ జిహాద్‌తో అనుబంధం కలిగి ఉన్నారు’’ అని బుధవారం ఇజ్రాయెల్ ‘ఎక్స్’లో పేర్కొంది. -
చంపేస్తా!.. జర్నలిస్టులకు టీడీపీ ఎమ్మెల్యే భార్య బెదిరింపులు
సాక్షి, తిరుపతి జిల్లా: ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ చంద్రగిరి జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ "చంద్రగిరి రాజకీయం" గ్రూప్‌ను డిలీట్ చేయాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సీఐ సుబ్బరామిరెడ్డికి పాత్రికేయులు ఫిర్యాదు చేశారు."చంద్రగిరి రాజకీయం" వాట్సాప్ గ్రూప్‌లో ఎమ్మెల్యే నానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఈ నెల 13న సుధారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్మిన్లుగా ఉన్న వారిని ఐదుగురు జర్నలిస్టులపై ఆమె కేసు పెట్టారు. మెసేజ్‌లు పెట్టిన వారిని వదిలివేసి, తమపై కేసులు పెట్టడం ఏంటీ? అంటూ బాధిత జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.ఇదీ చదవండి: తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక? -
సాక్షి ఎడిటర్ పై కేసు పిరికితనం..
-
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
ఆక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉంటుందని, ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడం కోసం అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్‌లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.పోచమ్మకుంట మోడల్ గ్రేవ్ యార్డ్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పార్కు స్థలాల ఆక్రమణ, రీజనల్ సైన్స్ సెంటర్ భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణలపై మంత్రి ఆరా తీశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతిపైనా కలెక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామని, స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలున్నా.. ఉపేక్షించవద్దని, నాలాలపై నిరుపేదలున్నట్లయితే వారికి సరైన చోట నివాస సదుపాయం కలి్పంచాలని సూచించారు.వరంగల్ ఎంజీఎంలో కొందరు వైద్యులు పేషెంట్లకు మందులివ్వకుండా ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండటం పట్ల మున్సిపల్ అధికారులపైనా మంత్రి సీరియస్ అయ్యారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం హామీ ఇచి్చందని, అర్హులైన జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పారు.వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో పార్కుస్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యా యని, ఇక్కడ కూడా వాడ్రా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. సమావేశంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం... పణం అక్షర సమరం
ప్రమాదపు అంచున పనిచేసిన, ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధవార్తలను రిపోర్ట్ చేసిన సాహసికులైన ఎంతోమంది జర్నలిస్ట్‌ల గురించి తెలుసుకుందిపాలస్తీనా అమ్మాయి ప్లెస్తియ. వారి గురించి విన్నప్పుడల్లా....‘ఎంత కష్టం. ఎంత సాహసం!’ అనుకునేది.ఆ కష్టం, సాహసం తన స్వీయానుభవంలోకి రావడానికి ఎంతోకాలం పట్టలేదు.జర్నలిజంలో పట్టా పుచ్చుకున్న తరువాత హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఆమెని ఆహ్వానించింది.హమాస్–ఇజ్రాయెల్ వార్‌ను రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్‌గా ప్రపంచానికి పరిచితం అయిన ప్లెస్తియ యుద్ధభూమిలో కత్తి అంచున నడక అంటే ఏమిటో తెలుసుకుంది. యుద్ధ బీభత్సాన్ని దగ్గరి నుంచి చూసింది. తాజాగా...‘అలాకాద్ అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్’లో మీడియా స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లెబనాన్‌కు వెళ్లింది. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ కాస్తా మళ్లీ విద్యార్థిగా మారింది.‘యుద్ధకాలంలో భావోద్వేగాలకు అవకాశం లేదు. ఏడ్వడానికి కూడా టైమ్ దొరకనంతగా ఉరుకులు పరుగులు. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధం ఆగి΄ోతుందని మనసులో చిన్న ఆశ. అంతలోనే మరో పెద్ద విషాదాన్ని రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. పూర్తిగా నష్ట΄ోయాం. ఇంతకంటే ఎక్కువగా నష్ట΄ోయేది ఏమిటి అనిపించేది కొన్నిసార్లు’ గతాన్ని గుర్తు చేసుకుంది ప్లెస్తియ.గాజాలో యుద్ధవార్తలు కవర్ చేస్తున్న రోజుల్లో ప్లెస్తియకు నిద్రపోవడానికి కూడా టైమ్ దొరికేది కాదు. తిండి సరిగా ఉండేది కాదు. పెట్రోల్ కొరత వల్ల మీడియా వాహనం ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు టీమ్‌తో సంబంధాలు తెగిపోయేవి. కరెంట్ కష్టాలు, ఫోన్ కష్టాలు సరే సరి.‘ఈ రోజు సరే, రేపు బతికి ఉంటానా అని ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని’ అంటూ గత రోజులను గుర్తు చేసుకుంది ప్లెస్తియ. వార్తలను కవర్ చేసేందుకు మొదట్లో మెడలో ఐడీ ట్యాగ్ వేసుకునేది. ప్రెస్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించేది. అయితే వీటివల్లే ఎక్కువ ప్రమాదం ఉందని గ్రహించి వాటికి దూరంగా ఉంది.‘ఈ రోజు ఏం కవర్ చేయాలి...అని ఎప్పుడూ ΄్లాన్ చేసుకోలేదు. కొన్నిసార్లు స్టోరీ కోసం వెదికేదాన్ని. మరికొన్ని సార్లు స్టోరీ నన్ను వెదుక్కుంటూ వచ్చేది’ అంటున్న ప్లెస్తియ రిపోర్టింగ్‌కు వెళుతున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చేవి. ఆ గండాల నుంచి అదృష్టశాత్తు బయటపడింది.గాజాలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తనకు ప్రజల నుంచి రకరకాల స్పందనలు ఎదురయ్యేవి. కొందరు ఆ΄్యాయంగా పలకరించి బ్రెడ్, టీ ఇచ్చేవారు. ‘ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు వెరవకుండా మీ జర్నలిస్ట్‌లు పనిచేస్తున్నారు. మీ వల్లే మా బాధలు ప్రపంచానికి తెలుస్తున్నాయి’ అని ప్రశంసించేవాళ్లు.కొందరు మాత్రం...‘నేను జర్నలిస్ట్’ అని పరిచయం చేసుకోగానే భయపడేవారు. ‘ఇప్పటికే ఎంతోమంది జర్నలిస్ట్‌లు చని΄ోయారు. మా గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి’ అనేవాళ్లు. ‘నిజానికి నేను వారి దగ్గరికి జర్నలిస్ట్‌గా కంటే సాటి మనిషిగా వెళ్లాను. వారి బాధలను పంచుకున్నాను. ధైర్యం చె΄్పాను’ అంటున్న ప్లెస్తియ ఆశావాది. యుద్ధం లేని రోజులు, గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్ర΄ోయే రోజులు వస్తాయని, మాయమైపోయిన నవ్వుల పువ్వులు మళ్లీ వికసిస్తాయని, ‘యుద్ధం గతం మాత్రమే. వర్తమానం కాదు’ అని బలంగా నమ్మే రోజులు వస్తాయనే ఆశిస్తోంది ప్లెస్తియ. ఇజ్రాయెల్ సైనిక దాడి గురించి రిపోర్టింగ్ చేస్తూ మరణించిన జర్నలిస్ట్ షిరీన్ అబూ స్మారక స్కాలర్షిప్ ΄÷ందిన ప్లెస్తియ లెబనాన్‌లో స్టూడెంట్‌గా మరో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ యువ జర్నలిస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. -
నిజమైన పాత్రికేయులకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నిజమైన పాత్రికేయులను అగౌరవపరిచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని.. వారికి అన్నివేళలా అండగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వ్యవస్థపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కేటాయించిన 38 ఎకరాల భూపత్రాలను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ‘ప్రజాప్రభుత్వంలో పాత్రికేయులు’ కార్యక్రమంలో సొసైటీకి సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జేఎన్జే సొసైటీలో సభ్యులు కాని ఇతర జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సిటీ నిర్మాణంలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలని కోరారు. మీడియా అకాడమీకి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. పాత్రికేయులకు స్వేచ్ఛ యాజమాన్యాల విధానాలు ఏ విధంగా ఉన్నా, పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను అర్థం చేసుకొని, వారికి సంక్షేమం అందించడంలో ముందుంటామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అనేక ఆంక్షలుండేవని, తమ ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, తమకు కష్టాన్ని తెచ్చేలా ఉండకూడదన్నారు. పత్రికా సమావేశాల్లో ఆ ట్యూబ్...ఈ ట్యూబ్ అంటూ నిజమైన పాత్రికేయులకన్నా వారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఏమన్నా అంటే పత్రికలపై దాడి అని అల్లరి చేస్తున్నారని, వారు ఏం అడుగుతారో.. ఏం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఎవరిని జర్నలిస్ట్‌గా చూడాలో పాత్రికేయులే చెప్పాలన్నారు. పాత్రికేయుల ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త విధానాలు రూపొందించాలని మీడియా అకాడమీని సీఎం ఆదేశించారు. కొంతమంది పాత్రికేయులు విలువల్లేకుండా రాజకీయ పార్టీల యజమానులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం నడుపుతున్న పత్రికల పోకడలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఉన్మాద ధోరణితో వెళుతున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యతను పాత్రికేయులే తీసుకోవాలని కోరారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల అప్పగింత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ విలేకరులకు కూడా స్థలాలు ఇవ్వాలన్నారు. అనంతరం మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం సీఎం రేవంత్‌రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జేఎన్జే నాయకులు కిరణ్‌కుమార్, రవికాంత్‌రెడ్డి, వంశీశ్రీనివాస్, రమణారావు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిందని తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హౌసింగ్ సొసైటీకి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సీఎం పాల్లొని లబ్దిదారులకు భూమి స్వాధీన పత్రాల అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘ జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు. వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవు. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు. అది మనకు మనమే పెంచుకోవాలి. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నా. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం. తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవు. మేం మీలో ఒకరమే.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నా. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
జర్నలిజం ముసుగులో రూ. 5 కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మీడియా ముసుగులో కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన టీవీ 5 మూర్తి, ఆయన బృందం బండారంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, ఆయన భార్య వీణాశ్రీవాణి సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు వారు ఇన్‌స్టా్రగామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టీవీ 5 మూర్తి అనుచరుడు జర్నలిస్టు అమర్, వీణాశ్రీవాణితో జరిగిన ఆడియో సంభాషణను కూడా జత చేశారు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే మీ స్తోమత ఎంత.? ఎంతిస్తారో.? చెప్పండంటూ అమర్ ఆమెను ప్రశ్నించడం స్పష్టంగా రికార్డు అయ్యింది. జ్యోతిషం చెప్పుకునే వేణుస్వామికి అంతమొత్తం ఇవ్వడం సాధ్యంకాదని, ఆయన భార్య వివరిస్తున్నా.. అమర్ వినిపించుకోకుండా రూ. 50 లక్షలు ఇస్తారా? లేక రూ. కోటి ఇస్తారా.. ఏదో ఒకటి చెబితే వారితో సమావేశం ఏర్పాటు చేస్తానంటూ బదులివ్వడం గమనార్హం. రూ. 5 కోట్లలో జర్నలిస్టు ప్రేమ, రాంబాబుతోపాటు మీడియా హెడ్స్‌కు, సంస్థ అధినేత బీఆర్.నాయుడుకు వాటాలు ఉంటాయని అమర్ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. మీడియా ముసుగులో తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వేణుగోస్వామి తన సతీమణితో కలిసి ఆరోపించారు. తాము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు: వేణుస్వామి ‘టీవీ5 జర్నలిస్ట్ మూర్తి ఒకప్పుడు మహాటివీలో పనిచేసేవారు. అప్పుడు నాపై దాడి చేసేందుకు ఆయన ప్రయతి్నంచాడు. నన్ను నాశనం చేయడానికి ఆ సమయంలోనే చాలా ప్రయత్నాలు చేశాడు. మూర్తి డిమాండ్ చేసిన డబ్బు నేను ఇవ్వలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఇప్పుడు డబ్బు కోసం మూర్తి, ఆయన టీమ్ నన్ను ఇబ్బంది పెడుతోంది. ఒక పథకం ప్రకారం టీవీ5లో నా గురించి డిబెట్లు ఏర్పాటు చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. ఎంతోమంది కష్టాలను తొలగించిన నాకు చివరకు ఆత్మహత్య చేసుకునే స్థితికి మూర్తి వల్ల వెళ్లాను. వారు పెడుతున్న టార్చర్ భరించలేకపోతున్నాను’అంటూ వేణుస్వామి ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆపై మూర్తి అనుచరుడు జర్నలిస్ట్ (అమర్) ఫోన్ కాల్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో వేణుస్వామి షేర్ చేశారు. అందులో వారు రూ. 5 కోట్లు డిమాండ్ చేయడం అంత ఇవ్వకపోతే.. ఎంత ఇస్తారో చెప్పండంటూ సంభాషణ ఉంది. ఇలా వచ్చే డబ్బును ఎవరెవరు..? పంచుకుంటారో కూడా చెప్పుకొచ్చారు. చానల్ అధినేత బీఆర్.నాయుడు నుంచి ఆ సంస్థలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారికి, జర్నలిస్టు ప్రేమ, రాంబాబుకు వెళతాయని అమర్ ఆ ఆడియోలో వెల్లడించారు. మమ్మల్ని వారు తప్పకుండా చంపేస్తారు: వీణా శ్రీవాణి వేణుస్వామి సతీమణి వీణాశ్రీవాణి కూడా టీవీ5 సంస్థతోపాటు జర్నలిస్ట్ మూర్తి గురించి మాట్లాడుతూ ‘మమ్మల్ని రూ.5 కోట్లు అడుగుతున్నారు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం. నా బంగారంతోపాటు, నా కూతురు బంగారం అమ్మినా ఐదు శాతం డబ్బు రాదు. ఇచ్చే వరకు మమ్మల్ని వదిలేలా లేరు. దీంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాం. కానీ, మేము అలా చేస్తే దానిని కూడా వారు తప్పుగా క్రియేట్ చేస్తారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్పచారాన్ని తట్టుకోలేక చనిపోయారని మళ్లీ వారే వార్తలు ఇస్తారు. ఈ వీడియో బయటకు వచ్చాక మాకు ఎలాగూ ప్రమాదం పొంచి ఉంటుంది. తప్పకుండా మమ్మల్ని వారు చంపేస్తారు. ఈలోపు వారు (టీవీ5 మూర్తి, టీమ్) ఎలాంటి వారో ఇలా ముందే ఈ ప్రపంచానికి తెలుపుతున్నాం. ఆడపిల్ల ప్రేమకు, రోజు నాకు మెసేజ్‌లు చేసే రాంబాబుకు వాటాలున్నాయంటే.. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏమైనా పెట్టుకోండి. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆడపిల్లను అనుకోండి లేదా కుటుంబం అనుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులు, బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేస్తాయా? చదువుకున్న వారు సపోర్ట్ చేస్తారా? పోలీసులు, లాయర్లు, సుమోటోగా తీసుకొని సపోర్ట్ చేస్తారా? జోతిష్యం చెప్పుకుంటే రూ.ఐదు కోట్లు డిమాండ్ చేస్తారా? బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే ..లేనివారిని ఎలా వేధిస్తున్నారు. మమ్మల్ని కాపాడుకుంటే..మరిన్ని వీడియోలు బయటపెడతాం. లేదంటే ఇదే ఆఖరి వీడియో. ఆత్మహత్య చేసుకుంటాం.’అని ఆ వీడియోలో స్పష్టం చేశారు. -
ఓయూలో జర్నలిస్టుల అక్రమ అరెస్టులా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం దారు ణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేశారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం?’అని నిలదీశారు. గాయపడిన జర్నలిస్టు శ్రీచరణ్‌ను కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు.సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేపీ డిమాండ్ డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు అక్కడకు వెళ్లిన జర్నలిస్టులపై కూడా పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ ఖండించింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని వర్సిటీలు పోలీసుల లాఠీదెబ్బలతో రక్త మొడినట్టే.. మళ్లీ పోలీసుల దమనకాండ కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఓ ప్రకటనలో మండిపడ్డారు. » ఓయూలో జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తూ టీయూడబ్ల్యూజే, టీడబ్ల్యూజేఎఫ్, సచివాలయ జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. » మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. » డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే పోలీసుల ద్వారా అణచివేయాలని చూడడం అప్రజాస్వామిక మని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ విమర్శించారు. పార్టీ నాయకులు రాకే‹Ùకుమార్, పల్లా ప్రవీణ్, కడారిస్వామి, పడాల సతీ‹Ùతో కలిసి బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. » బీఆర్ఎస్పీ నేతలపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసి, వారిని సరీ్వస్ నుంచి తొలగించా లని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
హిమాయత్‌నగర్(హైదరాబాద్): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మీడియాలో వస్తున్న మార్పులతో జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోనున్నదన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్‌గా ఉద్యోగ విరమణ చేసిన కె.రవికాంత్‌రెడ్డి, జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ రాష్ట్ర కార్యదర్శి వరకల యాదగిరి, కోశాధికారి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, రాజే‹Ù, సయ్యద్ గౌస్ మొయినుద్దీన్లను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఘనంగా సత్కరించింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్, కేఎన్, హరి, సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు, ఇతర సభ్యులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన అసోసియేషన్లే కాకుండా కుల సంఘాల పేరిట కూడా అసోసియేషన్లు ఏర్పడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీనివల్ల జర్నలిస్టుల మధ్య ఐక్యత కొరవడుతుందని చెప్పారు. అర్హులకు మాత్రమే అక్రిడేషన్లు అందాలన్నారు. రానున్న రోజుల్లో వీటిని స్ట్రీమ్‌లైన్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నగరానికి నాలుగు దిక్కులలో స్థలాలను గుర్తించి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, వై.నరేందర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల కోసం చంద్రబాబు.. జనం కోసం జగన్
సాక్షి, అమరావతి: ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తుంటే.. ప్రజల కోసం జగన్ అమలు చేయగల వాటినే మేనిఫెస్టోలో పెట్టారని, ఈ విషయంలో ఇద్దరిలో ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలకు బాగా తెలుసని పలువురు మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ఎన్ఆర్ఐలు, జర్నలిస్టులు స్పష్టం చేశారు. వీరంతా శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు రకరకాల హామీలతో ఓటర్లను అయోమయంలోకి తీసుకెళ్లడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేయడమే మనం ఇంతవరకు చూశామని, కానీ అన్ని హామీలను అమలు చేసి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సుపరిపాలన అంటే ఇదీ అని చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ విద్య, వైద్యం వంటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం, భరోసా అని అన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిపాలనతో బేరీజు వేసుకొంటే గత ఐదేళ్లలో వైఎస్ జగన్ పరిపాలన అద్భుతంగా ఉందని, రాష్ట్రం ఇప్పుడే సరైన దిశలో ఏపీ పయనిస్తోందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలని చెప్పారు. వైఎస్ జగన్‌కు ఎందుకు ఓటేయాలో చెప్పడానికి చాలా కారణాలున్నాయని, వేయొద్దని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేదని తెలిపారు. చంద్రబాబుకి ఓటేయమనడానికి ఒక్క కారణం కూడా లేదని చెప్పారు. అందువల్ల అందరం వైఎస్సార్సీపీకి ఓటేద్దామని పిలుపునిచ్చారు. ప్రత్యర్థులపై దాడులను ఈసీ అరికట్టి, ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు. దమ్మున్న నాయకుడు సీఎం జగన్ తన 63 ఏళ్ల జీవితంలో ఏ పార్టీకీ బహిరంగంగా మద్దతివ్వలేదని, కానీ.. ‘నేను మీకు మేలు చేసి ఉంటే, నా పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి‘ అని చెప్పగలిగే గుండె ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడైన సీఎం వైఎస్ జగన్ కోసం బయటకు వచ్చి మద్దతిస్తున్నానని సీనియర్ న్యాయవాది చోడిశెట్టి మన్మధరావు చెప్పారు. సీఎంను కలవడం కాదు.. ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను పంపిన నాయకుడు జగన్ అని తెలిపారు. జగన్‌ను ఏమీ చేయలేక బాబు జాతీయ పార్టీల దగ్గర్నుంచి చిన్న చిన్న పార్టీల వరకూ అందరితో కూటమి కట్టారన్నారు.భూహక్కు చట్టంపై అపోహలుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని న్యాయవాది సీడీ భగవాన్ చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజలకు ధారబోసి, వేలాది ఎకరాలను ప్రజలకు ఇచ్చిన సీఎం జగన్ ప్రజల భూములు లాక్కుంటారా అని ప్రశ్నిం చారు. అసలు జగన్ మాత్రమే ఈ చట్టాన్ని తెచ్చారని నిరూపించగలరా, లేదంటే చంద్రబాబు, పవన్ వారి పార్టీల అధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. 30 రకాల భూ రికార్డులన్నిటినీ క్రోడీకరించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్30 రకాల భూ రికార్డులన్నింటినీ క్రోడీకరించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని, దాని ప్రకారం పట్టాదారు పాసు బుక్ ఇస్తే ప్రభుత్వం ఆ భూమికి ఇన్సూ్యరెన్స్ కల్పిస్తుందని న్యాయవాది షేక్ సయ్యద్ బాబు వివరించారు. పైగా ఈ ప్రతిపాదన నీతి ఆయోగ్ చేసిందని, ఇదే చట్టాన్ని అమలు చేస్తున్న 90 దేశాల్లో భూ వివాదాలు లేవని తెలిపారు. ప్రజలు ఇది గమనించాలి ఇవి బైపోలార్ ఎలక్షన్లని, ఏ నాయకుడు తమకు అవసరమైనవన్నీ సమకూర్చారనేది ప్రజలంతా గమనించాలని ప్రవాసాంధ్రుల సంఘం అధ్యక్షుడు వెంకట్ మేడపాటి కోరారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో తమ బృందం బస్సులో ఊరూరా పర్యటించిందని, ప్రజలు వైఎస్ జగన్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని ఎన్ఆర్ఐ కార్తీక్ యల్లాప్రగడ తెలిపారు. విశ్వసనీయతకు, మోసానికి మధ్య ఎన్నికలు ఇవి విశ్వసనీయతకు, మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై జరుగుతున్నది కేవలం దుష్పచారమని, ప్రజలు, రైతులు ఆ విష ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. జగన్ పధకాల వల్ల రాష్ట్ర జీడీపీ పెరిగిందన్నారు. ఆర్టీసీకీ మేలు చేశారు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని పేదల్లో ప్రతి ఒక్కరికీ మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు, ఉద్యోగులకు కూడా మేలు చేశారని ఏపీఎస్ఆర్టీసీ మాజీ ఉన్నతాధికారి ఎ.కోటేశ్వరరావు చెప్పారు. 2019కి ముందు ఏటా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున దాదాపు రూ.6 వేల కోట్ల అప్పుల్లోకి ఆర్టీసీ వెళ్లిపోయిందని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఫలితంగా అప్పులు సగానికి తగ్గాయని వెల్లడించారు. కరోనా సమయంలో బాబు, పవన్ ఎక్కడున్నారు?కరోనా సంక్షోభ సమయంలో బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని సీనియర్ జర్నలిస్టు తిలక్ నిలదీశారు. ఆపత్కాలంలో వీరు రాష్ట్రంలో ఎందుకు కనపడలేదన్నారు. ప్రజలతో పాటు నిలబడి ఆప్రమాదాన్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని కాపాడింది సీఎం జగన్ అని చెప్పారు. బాబు కేవలం ఓట్ల కోసమే హామీలిస్తారని, సీఎం జగన్ మాత్రం ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం హామీలిస్తున్నారని వివరించారు. టీడీపీ గెలిస్తే ఈనాడు ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని, ఓడిపోతే రామోజీ ఆయన సంస్థలపై సీబీఐ విచారణ కోరాలని సవాలు విసిరారు. -
తప్పుడు ప్రచారాలపై పాత్రికేయ అస్త్రం
ఉద్దేశపూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడించడం ఉత్తమమైన పాత్రికేయ విలువలకు ప్రామాణికం అవుతుంది. అటువంటి ఒక ప్రామాణిక గ్రంథమే సీనియర్ జర్నలిస్టులు రాసిన ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్’! పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం లాంటి అసత్య ప్రచారాలు. వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశోధనాంశాలతో హాస్యాస్పద మైన అభియోగాలను రచయితలు బట్టబయలు చేశారు. 2014 తర్వాత ‘గో–సంబంధ దాడులు’ ఎంత పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఒకవేళ మీకు కూడా నాలాగే భారతీయ పాత్రికేయ వృత్తి వైఖరులపై నిరాశ మొదలై ఉంటే, కనుచూపు మేరలో భూమ్యాకాశాలు కలిచేచోట ఒక శుభవార్త ఉందని తెలుసుకుని మీరెంతగానో సంతోషిస్తారు. అది టీవీ న్యూస్ ఛానెల్ కోసమో లేదా వార్తాపత్రిక కోసమో జరిగిన పనైతే కాదు. నిజానికి అదొక పుస్తకం. ఆ పుస్తకం అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలను కలిగివుండి, ఖ్యాతిని కోల్పోతున్న వృత్తిపై విశ్వాసాన్ని పాదుగొల్పే ఒక గణనీయ పునరుద్ధరణ. ఈ రోజు నేను ఆ పుస్తకం వైపు మీ దృష్టిని మరల్చాలని అనుకుంటున్నాను. ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్’ అనే ఆ పుస్తకాన్ని ఇద్దరు మాజీ ఎన్డీ టీవీ జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్, మరియమ్ అలావీ; ‘స్క్రోల్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియా శర్మ కలిసి రాశారు. పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం, ఇంకా సోకాల్డ్... ‘పింక్ రివల్యూషన్’. ప్రతి కేసులోనూ మొదట ఈ పుస్తక రచయితలు ఉద్దేశ పూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడిస్తారు. ఆ తర్వాత వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశో ధనాంశాలతో హాస్యాస్పదమైన ఆ అభియోగాలను బట్టబయలు చేస్తారు. లేదా ఆ ఆరోపణల్లోని అవాస్తవాలను ధ్వంసం చేస్తారు. పుస్తకం గురించి నేను చెప్పవలసి ఉన్నదానిలో ఇంతకుమించి ఒక్కమాటైనా చెప్పకుండా నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. మీకై మీరు చదవవలసిన అవసరం ఉన్న పుస్తకం ఇది. తనని చదివించు కునేలా చేస్తుంది. మిమ్మల్ని ఒప్పించేలా చదివిస్తుంది. అయినా గానీ, మీ ఆకలిని నన్ను కాస్త రెచ్చగొట్టనివ్వండి. లవ్ జిహాద్‌పై ఈ పుస్తక రచయితలు విశ్వ హిందూ పరిషత్ అంతర్గత పత్రిక ప్రత్యేక సంచిక ప్రచురించిన జాబితాలోని కేసులను విశ్లేషించారు. ‘‘లవ్ జిహాద్‌పై అందుబాటులో ఉన్న ఏకైక సమగ్ర సాక్ష్యాధార సమాచారం అదొక్కటే’’. అయితే నిజానికది, ‘‘147 వార్తా కథనాల క్రమానుగత కూర్పు మాత్రమే’’. ఆ కూర్పులో మొదటి కేసు 2011 నవంబరు నాటిది, చివరి కేసు 2020 సెప్టెంబర్ లోనిది. వాటిల్లో డెబ్బై మూడు, అంటే సగానికి సగం కేసులు ‘వాస్తవాలకు నిలబడనివి’. ‘‘అవన్నీ లింకులు తెగినవి, చెప్పిందే చెప్పినవి, భారతదేశానికి సంబంధం లేనివి’’. తక్కిన డెబ్బై నాలుగు... ‘‘మోసం, అపహరణ, విడిచిపెట్టటం, అత్యా చారం, హత్య మొదలైన వాటితో సహా లింగ సంబంధ నేరాల విస్తృత సమాచారం. ‘‘అన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్నది ఒకటే. నిందితుడు ముస్లిం, బాధితురాలు హిందువు’’ అని రచయితలు పేర్కొన్నారు. లవ్ జిహాద్ లక్ష్యం హిందూ మహిళల్ని మాయచేసి, మభ్యపెట్టి మతం మార్చడమే అయితే ఈ ఉదాహరణలు కేసును బలహీన పరుస్తాయి. 2014 తర్వాత ‘‘గో–సంబంధ దాడులు’’ ఎంతలా విపరీతంగా పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ‘‘ఇంటర్నెట్లోని మీడియా ఆర్కైవ్స్‌ను ఉపయోగించి మేము రెండు కాలాల వ్యవధిలో... 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2023 మే వరకు... జరిగిన గో–సంబంధ దాడుల సంఖ్యను లెక్కించాం’’ అని పుస్తక రచయితలు వెల్లడించారు. నిజం ఏమిటో తెలిసిన కొద్దిమందికి ఆ లెక్కలు ఆశ్చర్యం కలిగించవు. తెలియని ఎక్కువమంది మాత్రం నమ్మలేనట్లు చూస్తారు. ‘‘2009–2014 మధ్య ఒకే ఒక గో–సంబంధ హింసాత్మక సంఘ టనను మేము కనుగొన్నాము.’’ ఆ కేసులో కూడా, ‘‘దాడి వీహెచ్‌పీ నేతృత్వంలో జరిగింది’’. అందుకు భిన్నంగా, ‘‘2014 నుంచి 2023 మే వరకు అలాంటి గో–సంబంధ దాడులు 136 వరకు జరిగినట్లు మా లెక్కల్లో తేలింది. ఆ దాడుల్లో 66 మంది మరణించారు. 284 మంది గాయపడ్డారు. హతులైన వాళ్లలో కనీసం 70 శాతం మంది ముస్లింలే’’ అని వారు వివరాలు పొందు పరిచారు. ద్వేషపూరిత ప్రసంగాల విస్తృతిపై ఈ రచయితలు బహిర్గతపరచిన వివరాలను కూడా మీకు చెబుతాను. ‘‘2009–2014 మధ్య కాంగ్రెస్ హయాంలో దాదాపుగా 25 వరకు అలాంటి ద్వేష ప్రసంగాలు మా లెక్కకు అందాయి. ఆ సంఖ్య బీజేపీ హయాంలో ప్రముఖ వ్యక్తులు చేసిన విద్వేష ప్రసంగాలతో కలిపి 460కి చేరు కుంది’’. అంటే తొమ్మిది రెట్ల దూకుడు! మీలో చాలామంది లవ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్ల వంటి అపోహల్ని నమ్మకపోవచ్చు. ముస్లింల బుజ్జగింపు జరుగుతోందంటే మాత్రం బహుశా మీలో ఎక్కువమంది నమ్మే అవకాశమైతే ఉంది. అప్పుడైతే మీరు ఆ అంశానికి సంబంధించిన అధ్యాయాన్ని ఈ పుస్తకంలో తప్పనిస రిగా చదవాలి. అందులో రచయితలు ఈ బుజ్జగింపు అభియోగాన్ని అక్షరాలా తుడిచిపెట్టేశారు. ఎంత ప్రభా వవంతంగా వారు ఆ పని చేశారన్నది కనిపెట్టే విష యాన్ని మీకే వదిలేస్తాను. కానీ వారిచ్చిన ముగింపు లలో ఒకదాని గురించి చిన్న ముక్క చెబుతాను. ‘‘హిందూ రైట్‌వింగ్ పొరబడింది. ముస్లింలు కాంగ్రెస్ బుజ్జగింపులకు దూరంగా ఎక్కడో అట్టడుగున ఉండిపోయారు. కాంగ్రెస్ దేనికైనా దోషిగా నిలబడిందీ అంటే... ఆ దోషం... అంత సుదీర్ఘంగా అధికారంలో ఉండి కూడా ముస్లింలను పైకి తేవటంలో విఫలం అవటమే’’ అని రచయితలు వ్యాఖ్యానించారు. చిన్నపాటి ధార్మిక ఉపన్యాసంతో నేనిది ముగిస్తాను. సత్యాన్ని చూడకూడదని అనుకునేవారు, అంధులుగానే ఉండిపోయేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ పుస్తకం చదవకండి. ఎందుకంటే అది వారి నిరాధారమైన భ్రమల్ని పటాపంచలు చేస్తుంది. కానీ నిజం ఏమిటో తెలుసుకోగోరే యథార్థవాదులకు ఇది చదవవలసిన పుస్తకం. వాస్తవాలను సరళంగా, పూత పూయని పదాలతో తేలిగ్గా జీర్ణమయ్యేలా మీకు ఈ పుస్తకం చెబుతుంది. అంతే తేలిగ్గా మీరు పుస్తకం లోపలి విషయాలను అంగీకరించ గలుగుతారని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి
రఫా: గాజా్రస్టిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం దక్షిణ గాజాపై జరిగిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. వీరిలో అల్–జజీరా సీనియర్ కరస్పాండెంట్ వాయిల్ దాహ్‌దౌ కుమారుడు హమ్జా దాహ్‌దౌ కూడా ఉన్నాడు. మరో జర్నలిస్టు కూడా మృతి చెందాడు. ఇజ్రాయెల్ దాడుల్లో వాయిల్ దాహ్‌దౌ కుటుంబంలో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మనవడు ఇప్పటికే చనిపోగా, ఆదివారం మరో కుమారుడు బలయ్యాడు. దాహ్‌దౌ సైతం గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ తన విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ వార్తలను ప్రపంచానికి అందిస్తున్నాడు. గాజాలో అసలేం జరుగుతోందో ప్రపంచం తెలుసుకోవాలని, అందుకోసం తన ప్రాణాలైనా ధారపోస్తానని వాయిల్ దాహ్‌దౌ చెప్పాడు. తన కుటుంబం మొత్తం బలైపోయినా తన సంకల్పం సడలిపోదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 22,800 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. -
బందీలకు ఇక విముక్తి!
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న దాదాపు 240 మంది బందీలకు త్వరలోనే విముక్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. బందీల్లో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులూ ఉన్నారు. వారందరినీ క్షేమంగా విడిపించడానికి ఇజ్రాయెల్, అమెరికా, ఖతార్ దేశాలు ప్రయత్నాలు వేగవంతం చేశాయి. ఆయా దేశాల ప్రతినిధులు హమాస్‌తో కొన్ని రోజులుగా జరుపుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బందీలను విడుదల చేయాలంటే ఇజ్రాయెల్ సైన్యం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలని, గాజాలోకి పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అనుమతించాలని, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఫైటర్లను విడుదల చేయాలని హమాస్ షరతు విధించింది. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించినట్లు సమాచారం. బందీలకు స్వేచ్ఛ ప్రసాదించే విషయంలో అతి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని హమాస్ సీనియర్ నాయకుడు ఇజ్జత్ రిష్క్ మంగళవారం వెల్లడించారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తే బందీలను వదిలిపెట్టడానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చామని ప్రవాసంలో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియేహ్ చెప్పారు. ఒప్పందం చివరి దశలో ఉందని ఖతార్ తెలియజేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే గాజా నుంచి బందీలు వారి స్వదేశాలకు చేరడం ఖాయమే. అయితే, హమాస్‌పై ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నోరువిప్పడం లేదు. హమాస్ చెరలో ఉన్న తమ ఆప్తులను విడిపించాలని బందీల కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నిత్యం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశం రాజకీయంగా తనకు చాలా నష్టం కలిగించే ప్రమాదం ఉండడంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నాలుగు మెట్లు కిందికి దిగొచ్చినట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది. హమాస్ షరతులేమిటి? గాజాపై ఐదు రోజులపాటు భూతల, వైమానిక దాడులను ఇజ్రాయెల్ నిలిపివేస్తే బందీల్లో 50 మంది మహిళలు, చిన్నారులను వదిలేస్తామని హమాస్ షరతు విధించినట్లు తెలిసింది. ఆ తర్వాత ముగ్గురు పాలస్తీనియన్ ఖైదీలకు చొప్పున బదులుగా ఒక్కో బందీని విడిచిపెడతామని చెబుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ జైళ్లలో 8 వేల మందికిపైగా పాలస్తీనా ఫైటర్లు శిక్ష అనుభవిస్తున్నారు. వారిని విడిపించుకోవడానికి బందీలను ఎరగా వాడుకోవాలని హమాస్ నిర్ణయించుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు మృతి లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లో మంగళవారం హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించింది. క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఫరా ఒమర్, రబీన్ మామరీ అనే ఇద్దరు జర్నలిస్టులు, మరో ఇద్దరు పౌరులు బలయ్యారు. మృతిచెందిన ఇద్దరు జర్నలిస్టులు లెబనాన్‌కు చెందిన అల్–మయాదీన్ టీవీ చానల్లో పనిచేస్తున్నారు. -
ఏపీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జీవో జారీ
సాక్షి, విజయవాడ: జర్నలిస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గత కేబినెట్ భేటీలో తీసుకున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయం మేరకు.. ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వుల్లో విషయాన్ని ప్రస్తావించింది. 60:40 శాతం చెల్లింపు పద్దతిలో ఇళ్ల స్థల కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. కనీసం 5 ఏళ్లు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ వర్తించనుంది. జిల్లా ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో జర్నలిస్టులకు సభ్యులుగా అవకాశం కల్పించనుంది కూడా. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్ లైన్లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను రూపొందించి.. 45 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
విశాఖలో జర్నలిస్టుల థ్యాంక్స్ గివింగ్ మీటింగ్
-
సీఎం జగన్‌ను కలిసిన జర్నలిస్టులు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మీ ప్రభుత్వం మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎంని కలిసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి.ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీవీఆర్ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. చదవండి: మనసున్న మారాజు సీఎం జగన్ -
ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయంపై జర్నలిస్టుల హర్షం
-
దీపావళికి ముందే వెలుగులు
సాక్షి, విశాఖపట్నం: తమ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్థం చేసుకుని ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించడం ద్వారా జర్నలిస్టుల కుటుంబాల్లో దీపావళికి ముందే వెలుగులు నింపారని విశాఖపట్నం జిల్లా జర్నలిస్టులు హర్షం వ్యక్తంచేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఆదివారం ఉదయం స్థానిక బీచ్ రోడ్డులో ‘సీఎం వైఎస్ జగన్‌కు విశాఖ జర్నలిస్టుల వందనం’ పేరుతో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. సీ హారియర్ మ్యూజియం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు కొనసాగిన ర్యాలీలో జర్నలిస్టులు థాంక్యూ సీఎం సార్.. అంటూ నినాదాలు చేశారు. బీచ్ రోడ్డులో ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు కేజీ రాఘవేంద్రారెడ్డి, జి.జనార్థన్, అధ్యక్షుడు బి.రవికాంత్, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆర్.రామచంద్రరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు నారాయణ, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు అశోక్, చందూయాదవ్, పీఎన్ మూర్తి, సాంబశివరావు, దుక్కా మురళీకృష్ణరెడ్డి, కోయిలాడ పరుశురాం, బందరు శివప్రసాద్, ఉప్పల భాస్కరరావు, ప్రసాద్, ఈశ్వర్, రవిచంద్రతోపాటు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ నిర్ణయంపై జర్నలిస్టుల హర్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపిన విషయం విదితమే. సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి ఆమోదం తెలపడం చరిత్రాత్మకమైన నిర్ణయమని పలు జర్నలిస్టు సంఘాలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఉమ్మడి ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ తనయుడుగా.. నేడు రాష్ట్రంలోని వేలాది మందికి మేలు చేసే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఇండియా) మాజీ జాతీయ కార్యదర్శి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మరో ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మీడియాలోని ఒక వర్గం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా మీడియా సంస్థల్లో పనిచేసే నిరుపేద పాత్రికేయుల చిరకాల స్వప్నాన్ని సీఎం నెరవేర్చబోతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ విశాల దృక్పథంతో అందజేయనున్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులు సది్వనియోగం చేసుకోవాలని సి.రాఘవాచారి ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. అమరావతి అక్రిడేటెడ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ బి.వి.రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ ఎం.విశ్వనాథ రెడ్డి, సెక్రటరీ పి. నాగశ్రీనివాసరావు విడుదల చేసి న ప్రకటనలో జర్నలిస్టుల ఆశలను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు మంత్రుల ధన్యవాదాలు.. రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలను కేటాయించాలనే సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమని పలువురు మంత్రులు ప్రశంసించారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, కే నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కేవీ ఉషశ్రీచరణ్, ఆదిమూలపు సురే‹Ù, డాక్టర్ సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, జోగి రమేష్ జర్నలిస్టుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం.. జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంపై ఏలూరు జిల్లా నూజివీడులోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద నూజివీడు ప్రెస్‌క్లబ్ అండ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కేడీసీసీబీ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. చదవండి: సంపూర్ణ సాధికారత -
సీఎం జగన్ నిర్ణయంపై హర్షం
సాక్షి, విజయవాడ: మీడియా ప్రతినిధులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపట్ల సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇస్తోన్న ఇళ్ల స్థలాలను సద్వినియోగంచేసుకోవాలని ఛైర్మన్ మీడియా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరబోతోంది ఆంధ్రప్రదేశ్‌లోని పాత్రికేయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్( ఇండియా ) మాజీ జాతీయ కార్యదర్శి , అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు వర్షం వ్యక్తం చేశారు పాత్రికేయుల్లో అత్యధికులు నిరుపేదలేనని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతులు తెలియజేస్తున్నామని తెలిపారు. మీడియాలోని ఒక వర్గం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా మీడియా సంస్థల్లో పని చేసే పాత్రికేయుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చబోతున్నారన్నారు. ఇది సీఎం జగన్ విశాల దృక్పథానికి నిదర్శనమన్నారు. గతంలో దివంగత నేత వైఎస్సార్ మాత్రమే పాత్రికేయులకు విలువైన ఇళ్ల స్థలాలు ఉచితంగా పంపిణీ చేశారని, ఫలితంగా వారి ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగయ్యాయని వారు గుర్తు చేశారు. సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లోని జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరబోతోందని వారు ఆనందం వ్యక్తం చేశారు. మీడియా మంచి కోరే సీఎం జగన్‌కు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు అందరికీ ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ లు అందరికీ ఈరోజు ఒక చారిత్రిక సందర్భం. ఉమ్మడి రాష్ట్రంలో చివరగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత మళ్ళీ జర్నలిస్టుల గృహ వసతి గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పాదయాత్ర సందర్భంగా చాలా చోట్ల జర్నలిస్టులు జగన్మోహన్రెడఇని కలిసి తమ సమస్యలను విన్నవించిన నేపథ్యంలో ఆయన తన పార్టీ ఎన్నికల ప్రణాళిక లో పొందుపరిచిన హామీని ఇవాళ నెరవేర్చారు. వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఇవాళ క్యాబినెట్లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌కు ఆయన క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి తరఫున కృతజ్ఞతలు’అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. -
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రమంత్రిమండలి శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నసచివాలయం పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. సంక్షేమ పథకాల షెడ్యూల్డ్... ► నవంబరు 7వ తేదీ..వైఎస్సార్ రైతు భరోసా. ►నవంబరు15.. భూపంపిణీ. ►నవంబరు 28.. విద్యాదీవెన. ►ఖరీప్ 2023–24 ధాన్యం సేకరణకు మార్క్‌ఫెడ్‌కు రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు ప్రభుత్వం తరపున అవసరమైన గ్యారంటీ అందించేందుకు కేబినెట్ ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్‌ఆధ్వర్యంలో ఖరీప్ ధాన్యం సేకరణ. ►రాష్ట్రంలో వివిధ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గత నెల 30వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్టు సమావేశం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. ►రెండు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్ఐపీబీ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►రహదారుల,భవనాలశాఖలో 467 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల, భవనాలశాఖ పరిధిలో గెస్ట్హోస్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోనున్న ఆర్ అండ్ బిశాఖ. ►తూర్పుగోదావరి జిల్లా నల్లజెర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఈ కార్యాలయంలో అవసరమైన ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి ఆమోదం. ►శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు (ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకే పల్లె)తో కలిపి రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. ►ఒక మోటారు వెహికల్ ఇన్స్ఫెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ ఇంజనీరు, ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ముగ్గురు హోంగార్డుల నియామకానికి కేబినెట్ ఆమోదం. జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్‌కు వివరాలు అందించిన అధికారులు. ►ఇప్పటివరకూ 11710 క్యాంపులు నిర్వహించామని వెల్లడి. ►60 లక్షల మంది శిబిరాల వద్దకు వచ్చారని వెల్లడి ►6.4 కోట్ల మందికి ఇంటివద్దే వైద్య ర్యాపిడ్ పరీక్షలు. ►8,72,212 మందికి కంటి పరీక్షలు చేశామన్న అధికారులు. ►5,22,547 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు. ►11327 మందికి కంటి చికిత్సలు చేయిస్తున్నామన్న అధికారులు. ►జగనన్న సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్న మంత్రులు. ►వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి వైద్య సహాయం లభిస్తుందన్న మంత్రులు. ►ఈ కార్యక్రమాన్ని అభినందించిన కేబినెట్. వైద్య పరీక్షల్లో గుర్తించిన వారికి చికిత్స విషయంలో సమగ్రమైన ఫాలో అప్ చేయాలి: సీఎం జగన్ ►గతంలో ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయించుకున్నవారు, శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని భావించిన వారు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు. ►ఈ కేటగిరీలకు చెందినవారిపై ప్రత్యుక శ్రద్ధ వహించాలి. ►తీవ్రమైన రోగాలతో బాధపడుతున్నవారిని గుర్తించిన వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►వారికి అవసరమైన తుదపరి చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందించాలి. ►ఆస్పత్రులకు వారు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి. ►మందులు కూడా సకాలంలో వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి. ►చికిత్సలు పూర్తయిన తర్వాతకూడా వారి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ►జగనన్న సురక్ష శిబిరాలు బాగా జరిగేలా చూడాలని మంత్రులను ఆదేశం. ►శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు మంచి చికిత్స అందేలా చూడాలి. ►వారు ట్రీట్మెంట్ ముగించుకుని తిరిగి ఇంటి వచ్చాక వారికి మందులు అందేలా, తదుపరి చికిత్స అందించేలా చూడాలి. ►ఎవ్వరికీ మందులు అందలేదన్న మాట వినపడకూడదు. ఈ మందులన్నీ ఉచితంగా అందిస్తున్నాం. ►రిఫరెల్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా లేదా ఆస్పత్రికి పంపించాలి ►ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలి. ►దీంతోపాటు గ్రామాల్లో గతంలో తీవ్ర రోగాల బారినపడ్డ పేషెంట్లకు కూడా అండగా నిలవాలి. ►వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాలి. అవసరమైన పక్షంలో డాక్టర్లకు రిఫరెల్ కూడా చేసే బాధ్యతలను నిర్వర్తించాలి: సీఎం జగన్. ►గతంలో ఆరోగ్య శ్రీకింద చికిత్సలు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరాతీయాలి. ►అవసరమనుకుంటే వారినికూడా రిఫరెల్కు పంపించాలి. వీరికీ చేయూత నివ్వాలి. ►ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమం. కచ్చితంగా దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ►అత్యంత ఖరీదైన మందులు కూడా ఉచితంగా అందించాలి. ►మంత్రులు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. జనవరి 1 నుంచి ప్రతినెలా నాలుగు క్యాంపులు ప్రతి మండలంలో నిర్వహిస్తారు: సీఎం జగన్ ►నలుగురు స్పెషలిస్టు డాక్టర్లు కూడా ఇందులో పాల్గొంటారు. ►ప్రతి వారంలో ఒక మండలంలో ఒక గ్రామ సచివాలయంలో క్యాంపు నిర్వహిస్తారు. ►అందులోకూడా పైన చెప్పిన విధంగా రోగులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ►ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఉధృతంగా ప్రచారం చేపట్టాలి. ►నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15వరకూ మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. ►దిశ యాప్‌ను ఏ రకంగా డౌన్లోడ్ చేశామో, ఆరోగ్య శ్రీ యాప్‌నుకూడా డౌన్లోడ్ చేస్తాం. ►యాప్ ద్వారా ఎంపానెల్ ఆస్పత్రులు ఎక్కడున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ►దీనివల్ల సులభంగా ఆరోగ్య శ్రీ చికిత్సలు అందించవచ్చు. ►గ్రామాల్లో ఎక్కడా కూడా పౌష్టికాహార లోపంతోకాని, రక్తహీనతతో బాధపడేవారు కాని ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ►వారికి సరైన ఆహారం, మందులు అందిస్తున్నాం. ►ఈ కార్యక్రమంపైనాకూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ►కంటి సమస్యలతో బాధపడేవారికి కూడా కంటి అద్దాలు ఇస్తున్నాం. మార్కాపురం మెడికల్ కాలేజీలో 21 పోస్టులతో నెఫ్రాలజీ డిపార్ట్మెంటు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పలాస తరహాలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీఆసుపత్రి, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకూ మంత్రిమండలి ఆమోదం. ►పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపాలకశాఖ భవన నిర్మాణానికి అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన, మెరుగైన విద్యను అందించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ నియమించాలన్న పాఠశాల విద్యాశాఖ నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►6,790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధనకోసం ఇంజినీరింగ్ కాలేజీల మ్యాపింగ్ . ►ట్యాబులు డిజిటల్ పరికరాలు, యాప్‌లు వినియోగంపై విద్యార్థులకు శిక్షణ దీని ఉద్దేశం. ►అలాగే ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో పెట్టే ఐఎఫ్‌పీ ప్యానెల్స్ వినియోగంపైనా వీరు శిక్షణ ఇస్తారు. ►ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దుతారు. ►పరికరాల వినియోగంపై టీచర్లనుంచి, విద్యార్థులనుంచి ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ►వినియోగం తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు ►సాంకేతికను వినియోగించుకుని విద్యార్థుల సమర్థతలో పెంచేలా చూస్తారు ►డేటా ప్రైవసీ, సెక్యూరిటీలపై తగిన చర్యలు తీసుకుంటారు. 50 ఎకరాల లోపు ఏపీఐఐసీ కేటాయించిన 285 భూకేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►భారీ ప్రాజెక్టులకు వివిధ రకాల రాయితీలను కల్పిస్తూ.. స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదలనకు కేబినెట్ ఆమోదం. ►ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ కాంప్లెక్స్ , డీజిల్ బస్ రిట్రో ఫిటింగ్, బ్యాటరీ ఫ్యాక్ అసెంబుల్డ్ చేసే పెప్పర్ మోషన్ సంస్ధ. ►ఇది రూ.4,640 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 8080 మందికి ఉపాధి అందించనుంది. ►దీంతో పాటు ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకూ కేబినెట్ ఆమోదం. పరిశ్రమలకు భూ కేటాయింపుల విధానంలో మార్పుకు కేబినెట్ ఆమోదం. ►పరిశ్రమలకు మరింత అనుకూలత కోసం నిర్ణయం. ►లీజు విధానం స్థానే సేల్ డీడ్ విధానంలో కేటాయింపు ►పరిశ్రమలకోసం మాత్రమే ఆభూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానం. ►పరిశ్రమలు పెట్టేవారికి ఆర్థిక సంస్థలనుంచి వెసులు బాటుకోసమే నిర్ణయం ►పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ రూపకల్పన. న్యూ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి ఆమోదముద్ర వేసిన రాష్ట్ర మంత్రిమండలి. ►అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గతంలో థర్మల్ పవర్ ప్రాజెక్టుకోసం 1200 ఎకరాలు ఇచ్చిన ఏపీఐఐసీ ►ఇందులో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►దీనికోసం సబ్ లీజింగ్‌కు అనుమతి ఇచ్చిన కేబినెట్. ►రూ. 95వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎన్టీపీసీ. ►గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుతో పాటు ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకై ఏపీఐఐసీ ప్రతిపాదనల మేరకు ఎన్టీపీసీ లిమిటెడ్‌కు అనుమతులు మంజారు చేస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి. ►తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్కేఆర్ గ్రూపు హోటల్ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►వైయస్సార్ జిల్లా గండికోటలోనూ, విశాఖపట్నంలో మేపెయిర్ గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూకేటాయింపులు. ►విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్– 1 అధికారిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►రెండు ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన సాకేత్ మైనేని. ►డేవిస్‌కప్ టీంలో 11 ఏళ్లపాటు కొనసాగిన సాకేత్. ►2016 నుంచి 2017 వరకూ ఇండియా నంబర్ 1గా ఉన్న సాకేత్ మైనేని. ► ఏపీ ఫెర్రోఅల్లాయిస్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్ డ్యూటీలలో మినహాయింపులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం. ►ఫెర్రో అల్లాయిస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి కొంత మినహాయింపు. ►స్టీల్ ఇండస్ట్రీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈ పరిశ్రమలకు తోడ్పాటు నిచ్చేందుకు నిర్ణయం. ►రూ.766 కోట్ల మేర భారాన్ని మోయనున్న ప్రభుత్వం ►దాదాపు 50 వేలమంది ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నందున నిర్ణయం తీసుకున్న కేబినెట్. ►902 మెగావాట్ల సామర్ధ్యమున్న సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు నంద్యాల, వైఎస్సార్ జిల్లాలలో 5,400 ఎకరాలు ►లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ఏడాదికి రూ.31వేలు ఎకరాకు చెల్లించనున్న కంపెనీ. ►రెండేళ్లకు 5శాతం చొప్పున పెంపు. ►కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు అనుమతిలిస్తూ కేబినెట్ ఆమోదం. ►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్. ►రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్. ►రాష్ట్రంలో 100 ఇన్స్ఫెక్టర్ ఆఫ్ పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ఇందులో 45 పోస్టులు అప్‌గ్రేడేషన్, 55 సూపర్ న్యూమరరీ పోస్టులు. ►ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో 22 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో భర్తీ ►సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదం. ►ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనభాసమతుల్యత అన్న అంశాలపై గణన. ►అణగారిన వర్గాలు మరింత అభ్యున్నతికి ఈ డేటా ఉపయోగపడుతుందన్న సీఎం. ►ఆర్థిక సామాజిక అభివృద్ధి కల్పించేందుకు దోహదపడుతుందన్న సీఎం. ►ప్రభుత్వ పథకాలు అందకుండా ఎవరైనా మిగిలిపోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుందని, తద్వారా వారు లబ్ధిపొందుతారన్న కేబినెట్. ►మరిన్ని పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, తారతమ్యాలు తగ్గించేందుకు, అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా వినియోగపడుతుందన్న సీఎం. ►కులగణన చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్గసభ్యులు. ►ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్న మాటను మరోసారి నిలబెట్టుకుంటూ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాప్ట్ ఆర్డర్ 2023కు ఆమోదం. ►జోనల్ వ్యవస్థలో మార్పులకు కేబినెట్ నిర్ణయం. ►డిస్ట్రిక్ కేడర్‌గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సమానస్థాయి, అంతకంటే దిగువ. ►జోనల్ కేడర్‌గా జూనియర్ అసిస్టెంట్ పైన ఉన్నవారు. ►మల్టీజోన్ పరిధిలో సెకండ్ లెవల్ గెజిటెడ్ సమానస్థాయి, డిప్యూటీ కలెక్టర్ సమానస్థాయి వారు. ►స్టేట్ లెవల్ కేడర్ అంతా మల్టీజోనల్ కిందకు (ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీలు, స్టేట్ లెవల్ ఇనిస్టిట్యూషన్స్, కేపిటల్ ఏరియాలో పోలిస్ కమిషనరేట్ మినహాయిస్తే) ►దీనివల్ల 95శాతం పోస్టులు ఆయా స్థానికులకే చెందుతాయి. ►స్థానిక వ్యక్తులకు కనీస విద్యార్హత స్థాయి 10నుంచి 7కు తగ్గింపు. ►ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను ఆరు జోన్లకు మారుస్తూ నిర్ణయం. ►వీటితోపాటు రెండు మల్టీ జోన్లు. ►ర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్సిటీ, స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఇప్పటికే వీటికోసం 50 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం. ►ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్‌బోర్డు, లోకాయుక్త తదితర సంస్థలకు ఉపయోగం. ►దేవాదాయశాఖలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు దేవాదాయశాఖ కమిషనర్ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఆయా దేవాలయాలు ఆర్జించే ఆదాయాలు ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయపరిమితిని పెంచిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►గతంలో డిప్యూటీ కమిషనర్ పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటే ఇప్పుడు దానిని రూ.7 నుంచి రూ.12 కోట్లకు పరిమితి పెంపు. ►జాయింట్ కమిషనర్ పరిధిలో గతంలో రూ.1 కోటి ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంపు. ►విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, యూజర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి. ►పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా.. ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, రాజమహేంద్రవరం జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించి ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ►కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధకు 4.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అసరమైన భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ►నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమిని రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. ►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపదకళాకారుడు దివంగత వంగపండు ప్రసాదరావు సతీమణి శ్రీమతి వంగపండు విజయలక్ష్మికి 1000 గజాల ఇంటిస్ధలం కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. -
జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టున్నారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు.. రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణన, ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించిన కేబినెట్ అందుకుఆమోద ముద్ర వేసింది. కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో జ.గనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు. చదవండి: ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే.. -
ఇక అత్యవసర సేవల ఉద్యోగులకూ పోస్టల్ బ్యాలెట్
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ రోజు ఎన్నికల వార్తల సేకరణలో ఉండే జర్నలిస్టులతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12 ఇతర అత్యవసర సేవల రంగాల ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ఈ సదుపాయం కల్పించబోతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 60(సీ) కింద కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర సేవల రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్వభావం రీత్యా ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి దూరంగా ఉండే ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి సైతం ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వీరికే సదుపాయం.. ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్విసు ఓటర్లు(సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయం ఉండేది. 40 శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్టు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజాగా జర్నలిస్టులతో పాటు ఎన్నికల విధులతో సంబంధం లేని అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు సైతం పోస్టల్ సదుపాయం కలి్పస్తున్నట్టు ప్రకటించింది. నవంబర్ 7లోగా దరఖాస్తు చేసుకోవాలి.. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కానుండగా, నాటి నుంచి 5 రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ..‘ఫారం–12డీ’దరఖాస్తులను స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 7 నాటికి దరఖాస్తులు రిటర్నింగ్ అధికారికి చేరితే ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు. జర్నలిస్టులతో పాటు ఆయా అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి సంబంధిత విభాగాలు నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. ఈ కింది జాబితాలోని అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించనున్నారు. ♦ ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ♦ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ♦ ఇండియన్ రైల్వే ♦ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ♦ దూర్దర్శన్ ♦ ఆల్ ఇండియా రేడియో ♦ విద్యుత్ శాఖ ♦ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ♦ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ♦ పౌర సరఫరాల శాఖ ♦ బీఎస్ఎన్ఎల్ ♦ పోలింగ్ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్ పొందిన మీడియా ప్రతినిధులు ♦ అగ్నిమాపక శాఖ -
క్రిసిల్ సంస్థ పేరుతోనూ పురందేశ్వరి తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై క్రిసిల్ సర్వే నివేదిక అంటూ శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చూపిన కాగితాలు అసలు ఆ సంస్థకు సంబంధించిన నివేదికే కాదని తేలింది. వాటిని చూపిస్తూ (ప్రతులు మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదు) ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తీరా చూస్తే.. ఆ కాగితాలు ఓ వ్యక్తి తన పరిశోధన కోసం క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ రిపోర్ట్)గా వెబ్సైట్లో రాసుకున్న అంశాలని సాక్ష్యాధారాలతో స్పష్టమైంది. ఆ కాగితాలను పురందేశ్వరి మీడియాకు చూపిస్తున్నప్పుడు తీసిన ఫొటోలోనూ అదొక ఆన్లైన్ వెబ్సైట్లో ఉంచిన గ్రౌండ్ రిపోర్టు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన గ్రౌండ్ రిపోర్టును ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చి(ఎన్సీఏఈఆర్)’ సంస్థకు పరిశీలనకు సమర్పించారు. ఎన్సీఏఈఆర్ ఆ రిపోర్టును తిరస్కరించింది. అంటే.. అందులో వివరాలు అవాస్తవాలు, విలువ లేనివి. ఆ వ్యక్తి గ్రౌండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలు కూడా 2020 మే నెల 7వ తేదీ నాటిది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయి అప్పటికి ఏడాది కూడా పూర్తవదు. దీనినే క్రిసిల్ నివేదిక అంటూ పురందేశ్వరి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకే స్కిల్ స్కాంపై సీఐడీ కేసు: పురందేశ్వరి ఎవరో విజిల్ బ్లోయర్ (అవినీతికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలిసిన అజ్ఞాత వ్యక్తి) ఫిర్యాదు మేరకే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ జరిపి చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేసుపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు. అరెస్టు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని బీజేపీ ఆనాడే చెప్పింది. అవినీతి జరిగిందా లేదా అన్నది కోర్టే తేల్చాలి’ అని అన్నారు. చంద్రబాబు ఆయన భద్రత, చికిత్స బాధ్యత ఎవరిదో వారినే అడగాలని అన్నారు. తనను అమిత్ షా పిలిచారని లోకేశ్ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఎవరు పిలిచారన్నది అప్రస్తుతం. లోకేశ్‌కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య స్థితి, కేసు, సెక్షన్లు, జడ్జిలు ఎవరో ఆరా తీశారు. బాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉంటే వారు ఎలా కలుస్తారు?’ అంటూ బదులిచ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరమన్న లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు. ఆరోపణలపై జగన్ సిబీఐ విచారణ కోరాలి రాష్ట్రంలో మద్యం తయారీ, నాణ్యత, అమ్మకాలు, ఇసుక, మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని, సీఎంజగన్ నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐతో విచారణ చేయించుకోవాలని పురందేశ్వరి సవాల్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 మద్యం తయారీ సంస్థలలో 12 చంద్రబాబు కాలంలోనే అనుమతులు పొందాయని, అయితే 2019 తర్వాత మద్యం తయారీదారుల్ని బెదిరించి వైఎస్సార్సీపీ నేతలు వాటిని లాక్కున్నారని ఆరోపించారు. -
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న న్యూస్‌క్లిక్ అధినేత
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్త తమ ఆన్లైన్ న్యూస్ పోర్టల్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నారు. చైనా అనుకూల ప్రచారం కోసం న్యూస్‌క్లిక్‌కు డబ్బు అందిందని ఆరోపణల నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధిత చట్టం (యుఎపిఎ) కింద నమోదైన కేసుకు సంబంధించి పుర్కాయస్తాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన తర్వాత పుర్కాయస్తను కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఏడు రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం.. ప్రతిరోజు ఒక గంట నిందితుడు తమ లాయర్లను కలుసుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. అయితే.. తమపై సోదాలు నిర్వహించే క్రమంలో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండానే పోలీసులు దౌర్జన్యం చేశారని నిందితుడు న్యాయస్థానానికి విన్నవించారు. కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. న్యూస్‌క్లిక్-అమెరికా-చైనా: ట్రయాంగిల్ స్టోరీ న్యూస్‌క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే న్యూస్‌క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్‌కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్‌క్లిక్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్ -
‘న్యూస్‌క్లిక్’లో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్‌పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతోపాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్–ఇన్–చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థా, హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్‌చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకేసమయంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తుండటంతో ఏచూరీ ఇంట్లోనూ పోలీసు తనిఖీలు కొనసాగాయి. దీంతో ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీస్‌కు పోలీసులు సీలువేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్‌బాగ్ వద్ద చెలరేగిన ఆందోళనలు, రైతుల ఉద్యమాలు తదితరాలపై జర్నలిస్టులను 25 అంశాలపై ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. న్యూస్‌క్లిక్‌కు నిధులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూస్‌క్లిక్ కార్యాలయాల్లో సోదాలు చేయడం తెల్సిందే. ఈ విషయంలో ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారంతోనే మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదుచేసి దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, హార్డ్ డిస్‌్కలు, ఫ్లాష్ డ్రైవ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ఆగస్ట్ 17న అత్యంత కఠిన ఉగ్రవ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక )చట్టంకింద నమోదైన కేసు ఆధారంగానే కొత్తను నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గత మూడేళ్లకాలంలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నగదులో కొంత మొత్తం పాత్రికేయులు గౌతమ్ నవ్లఖా, తీస్తా సీతల్వాడ్లకు చేరినట్లు ఆరోపిస్తోంది. విపక్షాల తీవ్ర విమర్శలు మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పారబట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాసహా పలు మీడియా సంఘాలు పోలీసు దాడులను ఖండించాయి. మోదీ సర్కార్‌ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి. -
చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ప్రముఖ మీడియా పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’కు సంబంధించిన జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 100 చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సీజ్.. ఈ దాడుల్లో జర్నలిస్టులు, ఉగ్యోగులకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అందించిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా తమంది జర్నలిస్టులను లోధీ రోడ్‌లోని స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు. భారీగా విదేశీ నిధులు ఇక న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. సీతారాం ఏచూరి నివాసంలోనూ సోదాలు.. న్యూస్‌క్లిక్‌కు సంబంధించి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారిక నివాసంలో కూడా ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. సీపీఎం ఉద్యోగి శ్రీనారాయణ్ ఇంటిపై తనిఖీలు చేపట్టింది. కాగా నారాయణ్ కొడుకు న్యూస్ క్లిక్‌లో పనిచేస్తున్నాడు. అయితే సీపీఎం అధికార నివాసాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరిట కేటాయించారు. తన నివాసంలో జరిగిన దాడులపై ఏచూరి స్పందించారు. చదవండి: 'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..' మీడియా నోరు నొక్కేందుకే..? పోలీసులు తన నివాసానికి వచ్చారని, అక్కడ తనతోపాటు నివసిస్తున్న సహచరుడి కుమారుడు న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. అతడిని విచారించేందుకు పోలీసులు వచ్చినట్లు చెప్పారు. అతని ల్యాప్‌టాప్, ఫోన్‌ను తీసుకున్నారని అయితే పోలీసులు ఏ కేసులో ఈ దర్యాప్తు చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ ఇది మీడియా నోరును నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నమైతే.. దీని వెనకున్న కారణాన్ని దేశమంతా తెలుసుకోవాలని అన్నారు. తప్పు చేస్తే దర్యాప్తు చేస్తారు: కేంద్రమంత్రి ఢిల్లీ పోలీసుల సోదాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. దీనిని సమర్థించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం విచారించే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. మరోవైపు న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేపట్టడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 24 మంది మృతి చైనా నుంచి నిధులు న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ఈ మీడియా సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది. ఈ క్రమంలో న్యూస్ క్లిక్ సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు అనుమానిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) కింద సదరు సంస్థపై ఆగస్టు 17న కేసు నమోదైంది. దీని ఆధారంగానే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కాగా , చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్‌వర్క్‌లో ఈ సంస్థ కూడా భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో పేర్కొంది. ఈ ఆరోపణలు న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధనలు, చర్యలకు మరింత ఊతమిచ్చాయి. -
నివేదిక ఇవ్వడం నేరం కాదు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) సభ్యులిచి్చన నివేదికలోని అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ నివేదికలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే అంశం ఏమీ కనిపించడం లేదని పేర్కొంది. ఒక తప్పుడు ప్రకటన రాజ్యాంగంలో 153ఏ ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుందని వివరించింది. దేశంలో ఎందరో జర్నలిస్టులు నిత్యం ఇలాంటి అసత్య ప్రకటనలు చేస్తుంటారు. వారందరిపైనా అభియోగాలు మోపుతారా అని పోలీసులను ప్రశ్నించింది. ఈ కేసులో ఈజీఐకి చెందిన నలుగురు సభ్యులకు పోలీసు అరెస్ట్ నుంచి ఇచి్చన రక్షణను మరో రెండు వారాలు పొడిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈజీఐ సభ్యులపై నమోదైన కేసును ఎందుకు కొట్టివేయరాదని మణిపూర్ పోలీసులను ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంటుందన్నారు. మణిపూర్ హింసపై నిజ నిర్థారణలో భాగంగా నలుగురు సభ్యుల ఈజీఐ అక్కడికి వెళ్లి సెప్టెంబర్ 2న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఘర్షణలను ప్రేరేపించేదిగా ఉందంటూ పోలీసులు ఈజీఐకి చెందిన నలుగురు స భ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
జర్నలిస్టు రచయిత
ప్రపంచంలోని గొప్ప రచయితల్లో కొంతమంది వృత్తిరీత్యా జర్నలిస్టులుగా పనిచేశారు. ఒక రచయిత జర్నలిస్టు అయితే తన రోజువారీ ‘స్టోరీ’లకు కథనబలాన్ని ఇవ్వగలడు. కానీ తమలోని రచయితనూ, జర్నలిస్టునూ వేరుగా ఉంచుకోవడానికే చాలామంది ప్రయత్నించారు. అనివార్యంగా ఆ రెండు పాత్రలూ కలిసిపోయే సందర్భాలు రావొచ్చు. అయితే, పూర్తి స్పృహతో తనలోని రచయితతో జర్నలిస్టును మేళవించినవాడు ట్రూమన్ కపోటి. ఆ మేళన ఫలితంగా నాన్–ఫిక్షన్ నవల ఉద్భవించింది. సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియను ‘పరిచయం’ చేసిన ట్రూమన్ కపోటి (30 సెప్టెంబర్ 1924 – 25 ఆగస్ట్ 1984) శతజయంతి సంవత్సరానికి ప్రారంభం ఇది. యూఎస్‌లోని లూసియానా రాష్ట్రంలో జన్మించిన ట్రూమన్ కపోటీ ఐదేళ్లప్పుడే బడికి నిఘంటువు మోసుకెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులోనే రచయిత అవుతాననుకున్నాడు. చాలామందికి జీవితం సగం ముగిసేదాకా తమకు ఏం కావాలో తెలీదు. కానీ తాను ఆ కోవలోకి చెందని ప్రత్యేక జీవినని కపోటికి తెలుసు. ‘ద న్యూయార్కర్’ సహా ఇతర పత్రికలకు పనిచేస్తూనే, కథలు రాశాడు. ఇరవైల్లోకి వచ్చేనాటికే ఆయన సెలబ్రిటీ. ‘ఆధునిక సాహిత్యపు ఆశాదీపం’ అని మెచ్చుకున్నాడు సోమర్సెట్ మామ్. ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ (1958) నవలికతో కపోటి పేరు మార్మోగిపోయింది. రోజూ కనబడే చంద్రుడు కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నాడు. 1959లో రష్యా చంద్రుడి మీద దిగింది. అదే ఏడాది అమెరికాలో పెరోల్లో ఉన్న ఇద్దరు నేరస్థులు కాన్సాస్‌లోని ఒక ధనిక రైతును దోచుకోవడానికి పథకం వేశారు. ఇంట్లోకి ప్రవేశించి, యజమాని, ఆయన భార్య, వాళ్ల ఇద్దరు కౌమార కూతుళ్లను బంధించారు. తీరా నగదు రూపంలో ఏమీ దొరకదు. కేవలం సాక్ష్యంగా మిగిలిపోతారని నలుగురినీ హత్య చేశారు. అది అమెరికాలో పెను సంచలనం సృష్టించిన నేరవార్తల్లో ఒకటి. దాని ఆధారంగా ఆరేళ్ల పరిశోధన అనంతరం ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ (1965) రాశాడు కపోటి. దీనికి వాడిన కథనాత్మక పాత్రికేయ టెక్నిక్‌ను ‘నాన్ఫిక్షన్ నవల’ అన్నాడు. జర్నలిజం, కథనం కలిసి కొత్త కళారూపానికి దారి తీయగలదని భావించాడు. సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు, వాస్తవ కథనం కోసం శ్రమ పడటం దేనికి అన్న వైఖరి కొందరు రచయితల్లో ఉంటుంది. సీరియస్ రచయితల కళాత్మక స్థాయికి జర్నలిజం తగనిది అన్న అభిప్రాయమూ ఉండకపోదు. ఇదంతా కాదన్నా, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వడగట్టి రచనలోకి తేవడం అంటే చాలా రకాలుగా సిద్ధపడాలి. ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ తన క్యారెక్టర్‌నే పెట్టి రాశాడని ఒకావిడ 8 లక్షల డాలర్లకు తెచ్చిన (విఫల) దావాను ఎదుర్కొన్న చేదు అనుభవం అప్పటికే కపోటికి ఉంది. పైగా, ఎంత నిజజీవిత కథనానికైనా ఊహాశక్తి లేకపోతే ప్రాణం పోయలేము. ‘లిటెరరీ ఫొటోగ్రాఫర్’లా సూక్ష్మాంశాలను మనసులోకి ఎక్కించుకోవాలి. ‘హ్యూమన్ టేప్ రికార్డర్’లా మారాలి. మరి విషయ సేకరణ ఎట్లా? తలుపులు తట్టడం సరే, వాళ్ల మనసులను మీటడం ఎలా? కపోటి ముందు ఆ ప్రాంతానికి వెళ్లి, అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలా మాట్లాడితే అసౌకర్యం కాబట్టి, టేప్ రికార్డర్లు ఉపయోగించలేదు. వెళ్లేముందు ఒక సాధన చేశాడు: స్నేహితుడు ఓ పుస్తకంలోని పేజీలను చదివి వినిపిస్తాడు. దాన్ని కపోటి విని, తిరిగి రాసేవాడు. ‘దాదాపు 95 శాతం కచ్చితత్వం’ సాధించాడు. ఇన్ని చేసినా వార్తా కథనాలకు కాలం చెల్లిపోయే ప్రమాదం ఎక్కువ. వాస్తవ ఘటన ఒక తార్కిక ముగింపునకు వస్తే తప్ప రచనను ముగించలేం. ఈ సందర్భంలో తార్కిక ముగింపు అంటే, నేరస్థుల ఉరిశిక్ష అమలు కావడమే. రచయిత ఆ క్షణం కోసం ఎదురుచూడాలి. ‘ఇది హింస,’ అంటాడు కపోటి. ఆఖరికి 6,000 పేజీల నోట్సుతో– హంతకులు, బాధితులు, గ్రామీణ సమాజపు మనుషులు– మూడు కోణాల్లో చిత్రించిన 340 పేజీల ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ తక్షణ బెస్ట్ సెల్లర్‌గా, కపోటి అత్యుత్తమ రచనగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాన్–ఫిక్షన్ నవల అనే ప్రక్రియను తాను పరిచయం చేయడం అనడం కంటే, అప్పటికే ఉన్నదాన్ని తాను అత్యున్నత స్థితికి తీసుకెళ్లానని మాత్రమే అనేవాడు కపోటి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, బంధువుల ఇంట్లో పెరిగాడు కపోటి. ఎప్పుడూ వ్యాకులతతో ఉండేవాడు. ఆయన ఒంటరితనంలో స్నేహపు సెలయేరు పొరుగున ఉండే హార్పర్ లీ. అనంతర కాలంలో ‘టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’ నవలా రచయిత్రి. అందులోని ‘డిల్’ పాత్రను ఆమె కపోటి నమూనాగా తీర్చిదిద్దారు. కపోటి రచన ‘అదర్ వాయిసెస్, అదర్ రూమ్స్’లో ఇడాబెల్ పాత్రకు లీ ప్రేరణగా నిలిచారు. వారి బాల్య స్నేహం చివరిదాకా కొనసాగింది. ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ క్షేత్రస్థాయి పరిశోధనలో లీ సహాయం చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు సాధించడంలో. హోమోసెక్సువల్ అని ప్రకటించుకున్న కపోటి, దాని తాలూకు తిరస్కరణను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తన జీవితాన్ని పునర్నిర్మించుకునే అవకాశమే ఉంటే, వ్యాకులత లేకుండా చూసుకుంటానన్నాడు. ‘ఒక కథను ఎంత సహజంగా చెప్పవచ్చో ఆ రూపాన్ని రచయిత కనుక్కున్నాడనేదానికి పరీక్ష ఏమిటంటే– ఆ కథ చదివాక, నువ్వు దాన్ని ఇంకోలా ఊహించగలుగుతున్నావా లేక అది నీ ఊహను నెమ్మదించేలా చేసి, అదే సంపూర్ణమూ, అంతిమమూ అనిపిస్తోందా? ఒక నారింజ ఫలాన్ని ప్రకృతి సరిగ్గా ఎలా చేసిందో అలా’ అన్నాడు కపోటి. సాహిత్య జీవితం గురించి సరేగానీ, అరవై ఏళ్లు నిండకుండానే కన్నుమూసిన కపోటి జీవితం సంపూర్ణ ఫలమేనా అంటే చెప్పడం కష్టం! -
నిజం చెబితే నేరమా?
విద్వేషాగ్నిని రెచ్చగొట్టి, విధ్వంసానికి పాల్పడి, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వారిపై కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి పాలకులకు వారాలు, నెలలు పడుతుంది. కానీ, నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా వాస్తవ స్థితిని బాహ్య ప్రపంచానికి వెల్లడించి, తప్పులను ఎత్తిచూపిన పత్రికా ప్రముఖులపై కేసులు పెట్టడమైతే మాత్రం తక్షణమే జరిగిపోతుంది. ఘనత వహించిన మన మణిపుర్ పాలకుల తీరు ఇది. కేసులు మీద పడ్డ జర్నలిస్టులు చివరకు దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే కానీ బుధవారం తాత్కాలిక రక్షణ, సాంత్వన లభించని పరిస్థితి. ఒక్కమాటలో తెచ్చిన సమాచారం వినకుండా, ఆ సమాచారం తెచ్చిన దూతను పాలకులు కొట్టడమంటే ఇదే! ఈశాన్య రాష్ట్రంలోని ఘర్షణలపై మీడియాలో వార్తల నివేదన ఎలా ఉందన్న అంశంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిజనిర్ధారణ సంఘం శనివారం వెలువరించిన నివేదిక ఇంత రచ్చకు దారి తీసింది. సదరు నివేదిక పక్షపాత వైఖరితో, తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ, ఓ సోషల్ మీడియా ఉద్యమకారుడు కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు పెట్టడంతో నిజనిర్ధారణ సంఘంలోని ముగ్గురు సభ్యుల పైన, అలాగే ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిపైన ఒకటికి రెండు ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలయ్యాయి. గత నాలుగు నెలల్లో మణిపూర్‌లో పరిస్థితిపైన నోరు విప్పి మాట్లాడడానికి తీరిక లేని ఆ రాష్ట్ర సీఎంకు ఈ విషయంపై మాత్రం విలేఖరులందరినీ కూర్చోబెట్టుకొని మనసులో మాట పంచుకొనే తీరిక, ఓపిక వచ్చాయి. ఎడిటర్స్ గిల్డ్‌ను తీవ్రస్వరంతో హెచ్చరించే సాహసమూ చేశారు. నిజానికి, మెజారిటీ వర్గమైన మైతేయ్‌లకూ, మైనారిటీలైన కుకీ–చిన్‌లకూ మధ్య ఘర్షణలో మణిపుర్ మీడియా ‘మెయితీల మీడియా’గా మారి పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తోందని క్షేత్రస్థాయిలో పర్యటించి ఎడిటర్స్ గిల్డ్ అందించిన నిజనిర్ధారణ సంఘం తన నివేదికలో పేర్కొంది. ఆ మేరకు భారత ఆర్మీకి చెందిన 3వ కోర్ దళం కేంద్రకార్యాలయం సహా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదు లొచ్చాయనీ గిల్డ్ తెలిపింది. ఇంటర్నెట్పై నిషేధంతో మణిపుర్ నుంచి వార్తల నివేదన కష్టమైందని అభిప్రాయపడింది. మీడియా ఫేక్‌న్యూస్ అందిస్తూ, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నట్టు కనీసం 10 సందర్భాల్లో తమ ఫ్యాక్ట్–చెకింగ్ బృందం తేల్చినట్టు వెల్లడించింది. మణిపూర్ సర్కార్ మాత్రం ఈ నివేదిక అవాస్తవమనీ, ప్రాయోజితమనీ, వండి వడ్డించినదనీ ఆరోపిస్తోంది. తగల బడుతున్న ఓ భవనాన్ని కుకీల గృహంగా పేర్కొన్నారనీ, నిజానికది ఓ అటవీ అధికారి ఆఫీసనీ, నివేదిక మొత్తం ‘కుకీ తీవ్రవాదుల’ ప్రాయోజితమనేది గిల్డ్‌పై దాఖలైన ఫిర్యాదు. ఫోటో ఎడిటింగ్‌లో ఆ పొరపాటు జరిగిందని గిల్డ్ విచారం వ్యక్తం చేసి, వివరణ ఇచ్చినా కేసులు ఆగలేదు. మరి, మే 3 నుంచి నాలుగు నెలల పైగా రాష్ట్రం తగలబడుతూ, కనీసం 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, వేలమంది నిరాశ్రయులైనా నిమ్మకు నీరెత్తిన నీరో చక్రవర్తిని తలపిస్తున్న పాల కులపై ఎన్ని కేసులు పెట్టాలి? విధి నిర్వహణలో, శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనా సరే నైతిక బాధ్యత వహించక కుర్చీ పట్టుకు వేళ్ళాడుతున్న సీఎంను ఏమనాలి? అందరినీ సమభావంతో చూడాల్సిన సదరు వ్యక్తే తాను ఒక వర్గానికి ప్రతినిధి అన్నట్టు నిర్లజ్జగా వ్యవహరించడాన్ని ఎలా సమర్థించాలి? ఇళ్ళు, స్కూళ్ళు, చర్చీలు తగలబడుతూ ఘర్షణలు రేగుతున్నా అంతా ప్రశాంతంగా ఉందనీ, సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నాయనీ అసత్యాలు చెబుతుంటే సిసలైన జర్నలిస్టులు ఏం చేయాలి? ఎప్పుడైనా, ఎక్కడైనా ఏకపక్షంగా వార్తలు రాస్తూ, వాస్తవాలను వక్రీకరించడం ఘోరం, నేరం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికారంగంలో అలాంటి పగుళ్ళు పెరిగితే, ప్రజాస్వామ్య సౌధం కుప్పకూలుతుంది. అస్సామ్ రైఫిల్స్‌పై నిరంతర దుష్ప్రచారం అందుకు చిరు ఉదాహరణ. ఘర్షణలకు సరిగ్గా రెండు నెలల ముందే కుకీ వేర్పాటువాద బృందాలతో కాల్పుల విరమణ ఒప్పందం లాంటి త్రైపాక్షిక ‘చర్యల సస్పెన్షన్’ ఒప్పందం నుంచి బీజేపీ రాష్ట్ర సర్కార్ ఎందుకు ఉపసంహరించుకుందన్నది దేవరహస్యం. ఇలాంటి వాస్తవాల్ని గిల్డ్ నివేదిక ఎత్తిచూపితే, కేసులు వేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? కానీ, ప్రజాస్వామ్యంలో ఆరు నెలలకు ఒకసారైనా అసెంబ్లీ సమావేశం కావాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘిస్తే తిప్పలొస్తాయని పాలకులు తంటాలు పడ్డారు. రాష్ట్రం తగలబడుతున్నా భేటీ కాని సభ గత నెలాఖరులో ఒక్కరోజే అదీ 11 నిమిషాలే సమావేశమైంది. ఎడిటర్స్ గిల్డ్ వెలువరించిన నివేదికలో అవాస్తవాలు ఉంటే ప్రభుత్వం ఆ మాటే స్పష్టం చేయవచ్చు. అసలు నిజాలేమిటో బహిరంగంగా వివరించి, ఎడిటర్ల బృందం తప్పని నిరూపించనూ వచ్చు. అంతేకానీ, క్షేత్రస్థాయి పర్యటనతో వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే ‘మరిన్ని ఘర్షణల్ని ప్రోత్సహిస్తున్నార’నడం సమర్థనీయం కాదు. మీడియా పనితీరుకు పరిమితం కాక, ఘర్షణలకు కారణాల్నీ గిల్డ్ పరిశీలించడమేమిటని ప్రశ్నించడమూ అర్థరహితం. పైపెచ్చు, అదే నేరమన్నట్టు క్రిమినల్ ఛార్జీలు నమోదు చేయడం ఏ రకంగానూ సరికాదు. ఈ వైఖరి అప్రజాస్వామికం, తర్కరహితమే కాదు, అక్షరాలా అధికార దుర్వినియోగం! మణిపుర్ సర్కార్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై కేసును ఉపసంహరించుకోవాలి. ముదిరిన జాతి విద్వేషాల్ని తగ్గించడమెలాగన్న దానిపై దృష్టి పెట్టాలి. ఆ అసలు సమస్యను వదిలేసి, కొసరు కథను పట్టుకొని వేళ్ళాడడం ప్రజలకూ, ప్రజాస్వామానికీ ఏ విధంగానూ మేలు చేయదు. కానీ, మన పాలకులు ఇవన్నీ చెవికెక్కించుకొనే స్థితిలో ఉన్నారా అన్నది బేతాళ ప్రశ్న. -
ఎక్స్ టేకోవర్: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?
గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలు కీలక మార్పులకు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అందరూ ఊహించినట్టుగా ఈ టేకోవర్ ఫెయిల్ కావచ్చు కానీ సాధ్యమైనంతవరకు సక్సెస్‌ను ప్రయత్నిస్తున్నామనడం చర్చకు దారి తీసింది. అలాగే ఎక్కువగా సంపాదించాలనుకునే జర్నలిస్టులకు ఎక్స్‌లో ఆఫర్ అంటూ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. ఎవరైతే స్వేచ్ఛగా ఆర్టికల్స్ రాయాలనుకుంటారో ఆ జర్నలిస్టులు డైరెక్ట్ ఎక్స్‌లో పబ్లిష్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది ఇప్పటికే ఇది 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ( అంతేకాదు ఆయా ఆర్టికల్ చదివే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.యూజర్లు చదివే ఆర్టికల్ ని బట్టి ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే మరింత చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఎక్స్‌లో షేర్ అయిన వార్తల ముఖ్యాంశాలను తొలగించాలని యోచిస్తున్నాడు.తద్వారా ట్వీట్ పరిణామాన్ని తగ్గించి, యూజర్ టైమ్‌లైన్‌లో మరిన్ని ట్వీట్లు సరిపోయేలా చేయడానికే ఈ ఎత్తుగడ అని తెలుస్తోంది. యూజర్ స్క్రీన్‌పై ట్వీట్ ఆక్రమించే నిలువు స్థలాన్నితగ్గించడమే ఈ మార్పు వెనుకకారణమని ఫార్చ్యూన్ నివేదించింది.దీనితో పాటు క్లిక్‌బైట్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని మస్క్ భావిస్తున్నాడట. If you’re a journalist who wants more freedom to write and a higher income, then publish directly on this platform! — Elon Musk (@elonmusk) August 21, 2023 ఎక్స్ (ట్విటర్) టేకోవర్ విఫలం కావచ్చు: మస్క్ ముఖ్యంగా గా బిలియన్ల డాలర్ల ట్విటర్ టేకోవర్ "విఫలం కావచ్చు" అని అంగీకరించడం మరో సంచలన వార్తగా మారింది. ట్విటర్ "బ్లాక్" ఫీచర్‌ను తొలగించే నిర్ణయంపై తాజా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్ననేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత నెలలో మార్క్ జుకర్‌బర్గ్ మెటా ప్రారంభించిన టెక్స్ట్-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌కు పోటీ వెబ్ వెర్షన్‌ను రూపొందించడానికి సిద్ధమైనప్పటికీ ఎక్స్ అనిశ్చిత భవిష్యత్తుపై మస్క్ ఇలా పేర్కొన్నాడు. "చాలామంది ఊహించినట్లుగా తాము విఫలం కావచ్చు, కానీ కనీసం ఒకరిగాఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తాము." అన్నాడు. అలాగే ఆదివారం నాటి పోస్ట్‌లో ."విచారకరమైన నిజం ఏమిటంటే, ప్రస్తుతం గొప్ప "సోషల్ నెట్‌వర్క్‌లు" లేవు అందుకే అలాంటి నొకదానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. The sad truth is that there are no great “social networks” right now. We may fail, as so many have predicted, but we will try our best to make there be at least one. — Elon Musk (@elonmusk) August 19, 2023 hey @elonmusk + @lindayaX … please rethink removing the block feature. as an anti-bullying activist (and target of harassment) i can assure you it’s a critical tool to keep people safe online. - that woman — Monica Lewinsky (she/her) (@MonicaLewinsky) August 19, 2023 కాగా ఇప్పటికే బ్లూటిక్ పేరుతో యూజర్లనుంచి చార్జ్ వసూలు చేస్తున్నారు. అలాగే ఇటివలి కాలంలో పరిచయం చేసిన యాడ్ రెవెన్యూ షేర్ ఫీచర్ కింద వెరిఫైడ్ యూజర్లు మానిటైజేషన్ రూల్స్ ప్రకారం డబ్బు సంపాదించుకునే అవకాశం అందుబాటులో ఉంది. తాజా నిర్ణయంతో స్వేచ్ఛగా రాయాలనుకునే జర్నలిస్టులకు డబ్బులు ఆర్జించే అవకాశాన్ని కల్పించడం విశేషం.అయితే దీనిపై పబ్లిషర్స్నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. రవీంద్ర భారతిలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సాక్షి ఫొటోగ్రాఫర్లు యాకయ్య(సూర్యాపేట), కే.శివకుమార్(యాదాద్రి భువనగిరి), వీ భాస్కరా చారి(మహబూబ్ నగర్), శ్రీకాంత్(సిరిసిల్ల), సతీష్(సిద్ధిపేట), రాజేశ్ రెడ్డి(హైదరాబాద్), శివప్రసాద్(సంగారెడ్డి), వేణు(జనగాం), ఎస్ఎస్ థాకూర్(హైదరాబాద్) అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు. యాకయ్య, సూర్యాపేట భాస్కరా చారి, మహబూబ్ నగర్ ఈ సంద్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అద్భుతమైన ఫోటో తీయడంలో డే తపన, చేసే కృషి గొప్పదని అన్నారు. ఒక్క ఫోటో ఒక చరిత్రను తిరగరాస్తుంది.. చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. ఉద్యమమైనా, సామాజిక విప్లవమైనా, చరిత్ర గతిని మార్చిన ఏ సంఘటనలో ఆయినా జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు. ఠాకూర్, హైదరాబాద్ నోముల రాజేశ్, హైదరాబాద్ సతీష్, సిద్ధిపేట్ శివ కుమార్, యాదాద్రి 'నాడు జాతీయోద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి విన్నాం. నేటి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కళ్ళ నిండా చూశాం. 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ప్రత్యక్షంగా, ఇంత ఉత్సాహంగా పాల్గొన్న దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటా. తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన ఎంతో మంది జర్నలిస్టులు నాడు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. జర్నలిస్టులందరితో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అలాంటి మీడియాను, జర్నలిస్టును, ఫోటో జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్నది.' అని హరీష్ రావు అన్నారు. శివ ప్రసాద్, సంగారెడ్డి శ్రీకాంత్, సిరిసిల్ల ఇదీ చదవండి: 86 స్థానాల్లో ‘కారు’ ఖరారు! -
వయోధిక పాత్రికేయులకు అత్యవసర నిధి ఏర్పాటు
పంజగుట్ట: వయోధిక పాత్రికేయుల అత్యవసర నిధి ఏర్పాటుకు తన వంతుగా రూ. లక్ష ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ ఆవిష్కరణ, ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వి.పాండురంగారావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు మధు వాకాటి వయోధిక పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు వయస్సు పెరుగుతున్నా రచనలు మానకూడదన్నారు. ఏ.బీ.కే లాంటి వారు ఇంకా రాస్తున్నారని ఇప్పటికీ వారి అక్షరాల్లో పదును తగ్గలేదని, ఆయన భావాలు మారలేదన్నారు. పాత్రికేయరంగంలో ఉన్న వారిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు వయోధిక అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధికి మొదటగా తానే రూ. లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ సమస్య కూడా తమ దృష్టికి తెచ్చారని 60 సంవత్సరాలు దాటిన పాత్రికేయునికి ఎలాంటి పత్రాలు లేకున్నా, గతంలో పనిచేసిన ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎవరికైనా లేకపోతే తనను సంప్రదిస్తే వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్త్ స్కీం ఎంతో అద్భుతమైనదని గతంలో అపోలో, యశోదా ఆసుపత్రుల్లోనూ కొనసాగేదని, కాని ప్రస్తుతం కేవలం నిమ్స్‌లో మాత్రమే నడుస్తుందన్నారు. వయోధిక పాత్రికేయులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆసుపత్రికి వెళితే తాను మాట్లాడి హెల్త్‌కార్డుల ద్వారా చికిత్స అందేలా చూస్తానన్నారు. నిమ్స్‌లోనూ వయోధిక పాత్రికేయులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్‌కు చెబుతానన్నారు. మీడియా అకాడమీలో యూనియన్ కార్యాలయాలకు గదులు ఇవ్వరని కానీ వయోధిక పాత్రికేయుల కార్యాలయం ఏర్పాటుకు గదిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేషవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ రూపకర్త ఎన్.శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవరులు, సెక్రటరీ లక్ష్మణ్‌రావు, జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు, రామమూర్తి, సభ్యులు ఎ.జీ.ప్రసాద్, జి.భగీరధ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయులకు త్వరలో ఇళ్ల స్థలాలు: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: పాత్రికేయులందరికీ వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అప్పగించామని తెలిపారు. ఢిల్లీ టీయూడబ్ల్యూజే–143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ అధ్యక్షతన శనివారం పాత్రికేయుల బృందం మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. హైదరాబాదు లోని పాత్రికేయులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులోనే ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని సైతం చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందుపరుస్తామన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. భేటీలో బీఆర్ఎస్ ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు. -
AP: త్వరలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం: కొమ్మినేని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని సీఆర్ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ల ముసుగులో కొత్త పెత్తందార్ల అవతారం ఎత్తినట్లు కనిపిస్తోందని, ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో కలిసి సదస్సులు పెట్టడం ద్వారా వారి అసలు ఎజెండాను బయటపెట్టుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం జరిగిందని, ఉదాహరణకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వంటివి ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే సమాచారశాఖ కమిషనర్‌ను సంప్రదించవచ్చని అన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా జగన్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని, తద్వారా జర్నలిస్టులకు శుభవార్త తెలపవచ్చని ఆశిస్తున్నానని కొమ్మినేని చెప్పారు. ఇప్పటికే 98.5 శాతం హామీలు నెరవేర్చడమే కాకుండా, 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం కొద్దివేల మంది జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వకుండా ఉండదని, కాని దీనికి సంబంధించి విధి, విధానాలపై ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు. నిజానికి ఇప్పటికే పలు చోట్ల ప్రభుత్వ స్కీములలో ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు కూడా ఉన్నారన్న సంగతి తన పర్యటనలలో తెలిసిందని ఆయన అన్నారు. ఇదే సమయంలో కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వం చేసే ఏ పనిపైన అయినా విషం చిమ్ముతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.జర్నలిస్టుల కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ దుష్టశక్తులే అడ్డంకిగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు జర్నలిజంలో కూడా పెత్తందారులుగా మారి తమ జులుం ప్రదర్శించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు అడ్డగోలుగా వార్తలు ఇస్తున్నా, ప్రభుత్వంపై నీచమైన స్థాయిలో అసత్యాలతో సంపాదకీయాలు రాస్తున్నా జర్నలిస్టు సంఘాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మీడియా యజమానులు జర్నలిజం విలువలకు పాతర వేస్తూ నగ్నంగా తిరుగుతుంటే ఈ యూనియన్ల నేతలు, జర్నలిస్టులలో పెత్తందారులుగా తయారైనవారు కనీసం నోరెత్తలేకపోతున్నారని కొమ్మినేని మండిపడ్డారు. తెలంగాణకు సంబంధించిన ఒక బూర్జువా విప్లవవీరుడు ఏపీకి వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని సుద్దులు చెబుతున్నారని, తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరు జర్నలిస్టులను అరెస్టు చేస్తే కనీసం ఖండించలేని ఈ విప్లవకారుడు ఏపీలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో సుప్రింకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా హౌసింగ్ సొసైటీకి అక్కడి ప్రభుత్వం తగు ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉందని, మరి దాని గురించి ఈయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని కొమ్మినేని అడిగారు. ఏపీలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉన్నాయి కనుకే కొన్ని పత్రికలు, టీవీలు, యథేచ్ఛగా నోటికి వచ్చిన దుష్టభాషతో వార్తా కథనాలు, సంపాదకీయాలు ఇవ్వగలుగుతున్నాయని, ప్రజల మనసులలో విషం నింపాలని చూస్తున్నాయన్న సంగతి గుర్తించాలని ఆయన అన్నారు. తమ మీడియా సంస్థలలో జీతాలు ఇవ్వకపోయినా, ఉద్యోగులను ఇష్టారీతిన తొలగించినా కనీసం నోరు విప్పని కొందరు జర్నలిస్టు నేతలు ప్రతిదానికి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మాత్రం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చివరికి తమ సంస్థ యాజమాన్యాలు చేయవలసిన పనులు కూడా ప్రభుత్వమే చేయాలని వీరు కోరుకోవడంలోనే పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. చిన్న పత్రికలకైనా, పెద్ద పత్రికలకైనా కొన్ని నిబంధనలు పెట్టకపోతే ప్రభుత్వ రాయితీలు ఎలా దుర్వినియోగం అవుతాయో అందరికి తెలుసునని అన్నారు. చదవండి: చంద్రబాబు.. సీఎం జగన్‌కు మరో ఆయుధం ఇచ్చినట్టేనా? కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టించడం ద్వారా ఈ సంఘాలు జర్నలిజం ముసుగులో టీడీపీ ఎజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు పాలనకు సర్టిఫికెట్ ఇచ్చిన ఆ బూర్జువా విప్లవకారుడు ఆ రోజుల్లో కొందరు జర్నలిస్టుల ఉద్యోగాలకు ఎసరు పెట్టినా ఖండించలేదని, కొన్ని టీవీ చానళ్లను చంద్రబాబు ప్రభుత్వం నిషేధించినా నోరెత్తలేదని, పైగా ఇప్పుడు అదే బాగుందని అంటున్నారని, ఇందులో ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని అంతా అర్ధం చేసుకోవాలని కొమ్మినేని అన్నారు. జర్నలిస్టు సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పడం తప్పుకాదని, అదే సమయంలో సంయమనంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.. అలాకాకుండా ఏవో కొన్ని రాజకీయ పక్షాల ప్రయోజనం కోసం జర్నలిస్టు సంఘాలు ప్రయత్నిస్తే అది జర్నలిజానికి మరింత మచ్చ తెస్తుందని కొమ్మినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
సుప్రీం కోర్ట్ తీర్పును వెంటనే అమలుపర్చాలిని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
జర్నలిస్టుల కోసం ప్రధాన నగరాల్లో ఉచిత హెల్త్ క్యాంప్‌లు
సాక్షి, అమరావతి/గుణదల(విజయవాడ తూర్పు): జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా ఇంజినీరింగ్ కాలే జీలో జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం సమాచార శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ప్రధాన నగరాల్లో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలో కూడా నిర్వహిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలిచే విషయలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ శిబిరాల ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.10 వేల విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో హరీంధిరప్రసాద్, సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఈ ఉచిత హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడాదిలో ఎన్నిసార్లు ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తినా.. ప్రతిసారి రూ.2 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు వీలుగా అతి తక్కువ ప్రీమియంతో జర్నలిస్టు హెల్త్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందుకోసం జర్నలిస్టులు రూ.1,250 చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ.1,250 చెల్లిస్తోందని చెప్పారు. అనూహ్య స్పందన.. జర్నలిస్టుల ఉచిత హెల్త్ క్యాంపునకు మొదటి రోజు అనూహ్య స్పందన లభించింది. ఆంధ్ర హాస్పిటల్, అమెరికన్ అంకాలజీ అండ్ ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఉషా కార్డియాక్ సెంటర్, క్యాపిటల్, కామినేని, సెంటినీ, పిన్నమనేని, హెచ్‌సీజీ క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్ అండ్ హార్ట్ కేర్ సెంటర్, సన్‌రైజ్, అను, స్వర ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వెయ్యి మందికి పైగా అక్రిడిటెడ్ జర్నలిస్టులు తమ కుటుంబ స భ్యులతో పాల్గొని వివిధ పరీక్షలు చేయించుకున్నా రు. ఈ క్యాంప్ ఆదివారం కూడా కొనసాగనుంది. -
ఐఫోన్లపై పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్: సంచలన రిపోర్ట్
న్యూఢిల్లీ: భద్రతకు పెట్టింది పేరైన ఐఫోన్లు పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్ గురయ్యాయట. ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టుల ఐఫోన్లను హ్యాకింగ్‌పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి సంచలనం రేపుతోంది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు చెందిన ఐఫోన్లు ఇజ్రాయెల్ ఆధారిత స్పైవేర్ మేకర్ పెగాసస్ తరహా స్పైవేర్ దాడికి గురైనట్టు మైక్రోసాఫ్ట్ అండ్ డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు వెల్లడించారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు క్వాడ్రీమ్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్టు గుర్తించింది. ప్రధానంగా యాపిల్ డివైస్‌లే లక్ష్యంగా ప్రత్యేకంగా ఐవోఎస్ వెర్షన్లు 14.4, 14.4.2 తోపాటు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లపై మాల్వేర్ DEV-0196 దాడిచేసిందని తెలిపింది. ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరప్ , మిడిల్ ఈస్ట్లలో కొత్త బాధితులను గుర్తించిన తర్వాత పెగాసస్ తరహా స్పైవేర్ దాడి భయం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాగే బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఘనా, ఇజ్రాయెల్, మెక్సికో, రొమేనియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉజ్బెకిస్తాన్‌లలో క్వాడ్రీమ్ సర్వర్లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) 'ENDOFDAYS' అని పిలిచే జీరో-క్లిక్ దాడిచేసినట్టు టొరంటో విశ్వవిద్యాలయం సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు ఏదైనా హానికరమైన, ఫిషింగ్ లింక్స్ పై క్లిక్ చేయకుండానే జరిగే దాడులను "జీరో-క్లిక్" అని పిలుస్తారు. ఈ స్పైవేర్ ఆపరేటర్ నుండి బాధితులకు అదృశ్య iCloud క్యాలెండర్ ఆహ్వానాలను ఉపయోగించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) కాగా పెగాసెస్ వివాదం నేపథ్యంలో యాపిల్ స్పైవేర్ డిటెక్టర్ టూల్ ‘ఇమేజింగ్’ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఐఫోన్లలో ‘పెగాసెస్ స్పైవేర్’ని కనిపెట్టవచ్చట.ఈ కొత్త టూల్ ఐఫోన్ బ్యాకప్, ఇతర ఫైల్స్‌ను చెక్ చేసి మాల్వేర్ ఏదైనా చొరబడిందా లేదా అని నిర్ధారిస్తుందంటూ అప్డేట్ చేసినసంగతి తెలిసిందే. -
అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులందరికీ మాస్టర్ హెల్త్ చెకప్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా జర్నలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం.. మాసాబ్ ట్యాంక్‌లోని సమాచార, పౌర సంబంధాల కార్యాలయంలో ప్రారంభించిన విషయం విదితమే. శ్రీరామ నవమి సందర్బంగా గురువారం సెలవు దినం కారణంగా ఈ హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహించలేదని, రేపు(శుక్రవారం) నుండి తిరిగి యథావిధిగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు (ఏప్రిల్ 3 వతేదీ ఆదివారం మినహా) నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. చదవండి: నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..! ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయని. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నట్టు అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
పటాన్చెరు టౌన్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని జీఎంఆర్ హాల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పదో ప్లీనరీ మహాసభలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. తమది తెలంగాణ వాదమని అన్నారు. కొన్ని పేపర్లకు పేరు ఉండదు.. ఊరు ఉండదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తాయని విమర్శించారు. ప్రధాని మోదీ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రెస్‌మీట్ పెట్టిందిలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ 300 మంది జర్నలిస్టులతో సమావేశం పెడతారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిందని, దమ్ముంటే మోదీ కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమంలో వారు చేసిన పోరాటాలు మరచిపోలేమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వార్తలను ఉన్నది ఉన్నట్లు రాయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్లీనరీలో ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు గమనించాలని కోరారు. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు బలం వచ్చిందని అన్నారు. -
జర్నలిస్టులపై బ్యాన్,ట్విటర్ స్పేసెస్‌కు బ్రేక్..బైడెన్‌పై సెటైర్లు
న్యూఢిల్లీ: ట్విటర్లో ఆడియో లైవ్ సర్వీస్ స్పేసెస్ పనిచేయక పోడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. గురువారం అర్థరాత్రి నుంచి స్పేసెస్ పనిచేయడం మానేసింది. దీంతో ట్విటర్ ద్వారా ఏమైంది స్పేసెస్‌కు అంటూ వాకబు చేయడం మొదలుపెట్టారు. దీంతో ట్విటర్ బాస్, ఎలాన్ మస్క్ స్పందించారు.లండన్‌లోని సోహోలో తన మొదటి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఇటీవల ఏదీ కూడా ఉచిత ఉత్పత్తులను అందించలేదు. Good fun while it lasted. Great knowing everyone on Twitter Spaces. Bear market feels. pic.twitter.com/APzBPyoa4T — Shash (@shashxg) December 16, 2022 కొంతమంది జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసిన తర్వాత ట్విటర్ స్పేసెస్ నిలిచిపోవడం చర్చకు దారి తీసింది. సస్పెండ్ అయిన పలువురు జర్నలిస్టులు ఇప్పటికీ అందులో పాల్గొనవచ్చనే అనుమానంతో మస్క్ అలా చేశారంటైటూ విమర్శలు చెలరేగాయి. దీంతో ట్వీపుల్ ట్వీట్లకు స్పందించిన ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ట్విటర్ ద్వారానే వివరణ ఇచ్చారు.ఇందులోని లెగసీ బగ్ (పాతబగ్)ను పరిష్కరిస్తున్నాం అని బహుశా రేపటికి పని చేస్తుందంటూ వివరణ ఇచ్చారు. #TwitterSpaces Will Be working Tomorrow ✌🏻 pic.twitter.com/nwqRdaFGai — Ayyappan (@Ayyappan_1504) December 16, 2022 Holy Shit. Elon Musk just popped into a Twitter Spaces chat with a bunch of journalists. He was called out by journalist Drew Harrell, who he banned, for lying about posting links to his private information, then leaves almost immediately after being pressed. Here is the exchange pic.twitter.com/wVA9Gb5MVJ — Bradley Eversley (@ForeverEversley) December 16, 2022 కాగా సీఎన్ఎన్ నెట్వర్క్, న్యూయార్క్ టైమ్స్ ,వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన డ్రూ హార్వెల్ , Mat Binder Mashable సహా పలువురు జర్నలిస్టుల ఖాతాలను ట్విటర్ గురువారం సస్పెండ్ చేసింది. తన ప్రైవేట్ జెట్ విషయాలను బహిర్గంతం చేసినందుకు ఏడు రోజుల సస్పెన్షన్‌లో పెట్టినట్టు మస్క్ ప్రకటించారు. డాక్సింగ్ నియమాలు అందరితోపాటు జర్నలిస్టులకు కూడా వర్తిస్తాయనీ తనను నిరంతరం విమర్శించడం తప్పు కాదు. కానీ తన రియల్ టైం వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేయడం ట్విటర్ నిబంధనలకు విరుద్ధమని, తన ఫ్యామిలీకి ఉనికికి ప్రమాదమని పేర్కొన్నారు. If anyone posted real-time locations & addresses of NYT reporters, FBI would be investigating, there’d be hearings on Capitol Hill & Biden would give speeches about end of democracy! — Elon Musk (@elonmusk) December 16, 2022 అంతేకాదు సదరు జర్నలిస్టుల రియల్ లొకేషన్, చిరునామా లాంటివి రివీల్ చేస్తే ఎఫ్‌బీఐ విచారణ చేస్తుంది.. ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ బైడెన్ స్పీచ్ లిస్తారు అంటూ అమెరికా అధ్యక్షుడి పైనే సెటైర్లు వేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పేట్బషీరాబాద్లో రూ.కోట్ల విలువైన భూమికి రెక్కలు
జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. ఇక్కడ గజం స్థలం విలువ లక్ష రూపాయల పైమాటే. ఇంకేముంది రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టడం.. నోటరీలు అడ్డుపెట్టుకుని విద్యుత్ మీటర్లు తెచ్చుకోవడం..రెవెన్యూ అధికారులు కూల్చివేతకు వస్తే ‘చేతులు తడిపి’ వెళ్లగొట్టడం షరా మామూలుగా మారింది. ఈ కోవలోనే సుమారు రూ.200 కోట్ల విలువ చేసే 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయ్యింది. కబ్జా వాస్తవమేనని నిర్ధారణకు వచ్చినప్పటికీ కోర్టు కేసులు ఉన్నాయంటూ వాటిని రెవెన్యూ యంత్రాంగం తొలగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2 ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో 57.38 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ గజం ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుంది. ఈ స్థలంపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కబ్జాదారులకు కలిసి వచ్చింది. రాత్రికి రాత్రి బేస్మెంట్లు, గదులు, షెడ్ల నిర్మాణం చేస్తూ కబ్జాకు తెర లేపారు. ఈ క్రమంలో సుమారు 8.06 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించగా తేలింది. అయితే వాటిని తొలగించాల్సిన అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి కబ్జాదారులు కోర్టుకు వెళ్లే విధంగా సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అక్కడ నిర్మాణం చేపట్టిన వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కూల్చివేతల జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దేవుడు వరమిచ్చినా... 2008 మార్చి 25వ తేదీన జీఓ నంబర్ 424 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో మొత్తం 38 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎన్నో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలం విషయంలో 2022 ఆగస్టు 25వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం.. సదరు స్థలాన్ని జర్నలిస్టులకు అప్పగించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మండల రెవెన్యూ అధికారులు అది తమ పరిధి కాదు అన్నట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలపై జర్నలిస్టు ప్రతినిధులు మండల రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు రూపంలో అందజేశారు. కాగా మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లారే తప్ప అక్రమ నిర్మాణాలను చూసి కూల్చివేయకుండా వదిలివేయడం గమనార్హం. ఐదెకరాల స్థలంపై ఆధిపత్యం... ప్రభుత్వ స్థలంపై ఓ వ్యక్తి మాజీ నక్సలైట్‌ని అంటూ కబ్జాకు దిగాడు. అప్పట్లో 60 గజాల్లో ఓ గది నిర్మించుకుని ఉంటూ వచ్చిన అతగాడు ఏకంగా 5 ఎకరాల స్థలం నాదే అంటూ.. ఇప్పుడు అధికారులకే సవాలు విసురుతున్నాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలం ప్రభుత్వానిది. గతంలో పలు పర్యాయాలు చుట్టూ కంచె వేస్తే రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇలా పలు పర్యాయాలు తొలగించినా.. తిరిగి అదే స్థలంలో కంచె ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తోంది. అంతేకాకుండా ఇక్కడ విద్యుత్ మీటర్లు చెట్లకు ఉంటాయి. ముందస్తుగా పథకం ప్రకారం పదులకొద్దీ మీటర్లను తీసుకుని గదులు నిర్మించే లోపు రెవెన్యూ అధికారులు గుర్తిస్తారని తీసుకున్న మీటర్లు చెట్లకు వేలాడుతుండటం విశేషం. ఈ విషయమై ఆర్ఐ రేణుకను సాక్షి వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. (క్లిక్: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది!) -
జర్నలిస్టుల త్యాగాలు గొప్పవి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న త్యాగాలు గొప్పవి అని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీ సీ కల్యాణ మండపంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ద్వితీయ మహాసభలు ఘనంగా జరిగాయి. అంతకుముందు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ ఎదుట ఏర్పాటు చేసిన జెండాను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ అకాడమీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.60 కోట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు క్రియాశీల పాత్రను పోషించారని గుర్తు చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ వీహెచ్, సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఏపీ డబ్ల్యూజేఎఫ్ అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి. ఆంజనేయులు, ఎన్‌ఎఫ్‌డబ్ల్యూజే నేత శాంతకుమారి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు వార్తలతో ఎక్కువ ముప్పు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు సమాచారం, కథనాలు ప్రధాన మీడియాలో ప్రచుర ణకు నోచుకోకుండా, ప్రసారం కాకుండా జర్నలిస్టులు జాగ్రత్తపడాలని యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ కోరారు. తప్పుడు స మాచారం, కథనాల వల్ల వచ్చే ముప్పును గుర్తించి ఆదిలోనే వాటిని పరిహరించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది పనిగట్టుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తుంటారని, జర్నలిస్టులు వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి జనసామాన్యానికి చేరకుండా నిలువ రిస్తున్నారని కొనియాడారు. మంగళవారం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ‘‘కౌంటెరింగ్ డిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ తెలుగు టీవీ జర్నలిస్ట్స్’’అన్న అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో లార్సెన్ మాట్లాడారు. అనంతరం జర్నలిస్టులకు సర్టిఫికె ట్లు అందించారు. ‘‘తప్పుడు సమాచారాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తులు తాము ఎన్నుకున్నవారి గురించి చాలా అంశాలు మాట్లాడుకుంటారు. వాదించుకుంటారు. వారిని బాధ్యులుగా చేస్తారు. తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంటే ఇదంతా సాధ్యం కాదు’’అని లార్సెన్ వివరించారు. ఉస్మాని యా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ మాట్లాడుతూ తప్పుడు సమాచారం విద్యావ్య వస్థలో సృష్టించిన సమస్యలను ఏకరవు పెట్టారు. జర్నలిజం విభాగం ప్రొఫెసర్, ఈ ప్రాజెక్టు సమన్వయకర్త స్టీఫెన్సన్ కోహీర్ మాట్లాడుతూ హైబ్రిడ్ పద్ధతిలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎనిమిది నెలల పాటు నిర్వహించామని తెలిపారు. తప్పుడు వార్తలను గుర్తించడం ఎలా? నిర్ధారించుకోవడం ఎలా? ఫ్యాక్ట్ చెక్కు ఉపయోగపడే టూల్స్, టెక్నిక్‌లు, సమాచారాన్ని సేకరించడం వంటి అంశాల్లో మెళకువలను నేర్పించామని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీలకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పంజాబ్ పాత్రికేయుల బృందం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు పంజాబ్‌కు చెందిన పాత్రికేయుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్నబాబు తెలిపారు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా గత నెల 31 న రాష్ట్రానికి వచ్చిన ఈ బృందం ఈ నెల 6వ తేదీ వరకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) జలంధర్ శాఖ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందం తొలుత విశాఖలోని పర్యాటక ప్రదేశాలను, డిండిని సందర్శించిందన్నారు. శనివారం విజయవాడ బెర్మ్ పార్కులో ఈ బృందానికి రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టుల గురించి వివరించినట్టు చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, కళలు, వారసత్వ సంపదను పంజాబ్‌లో ప్రచారం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, నిత్యం ప్రవహించే నదులు, సుందరమైన బ్యాక్ వాటర్స్, కొండలు, అడవులు, పురాతన దేవాలయాలు, బౌద్ధ క్షేత్రాలు వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు మన సంస్కృతి, వారసత్వాలను చాటిచెబుతాయన్నారు. పీఐబీ జలంధర్ నోడల్ అధికారి రాజేష్ బాలి మాట్లాడుతూ..ఏపీలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, అలవాట్లు మంచి విజ్ఞానాన్ని అందించాయని చెప్పారు. -
జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయ మిత్రులకు తమ వాగ్ధానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. I would like to extend my gratitude to the Hon’ble Supreme Court & CJI Garu for clearing the long-standing demand of Telangana journalist society on house site allotments This will help Telangana Govt deliver on our promise to our Journalist friends 👍 — KTR (@KTRTRS) August 25, 2022 -
జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు 12 ఏళ క్రితం ప్రభుత్వాన్ని స్థలాన్ని కేటాయించింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడటం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి?. రూ.8వేల నుంచి రూ.50వేల వరకు జీతం తీసుకునే 8వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. చదవండి: (జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్ ట్వీట్) వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి మేం అనుమతిస్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్ట్ చేయాలని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. చదవండి: (స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
ఈహెచ్ఎస్ పరిధిలోకి జర్నలిస్టులు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పరిధిలోకి జర్నలిస్టులు వస్తారని, ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూని యన్(ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్న లిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం అరణ్యభవన్‌లో మంత్రితో సమావేశమై హెల్త్‌కార్డుల సమస్యపై వినతిపత్రా న్ని అందించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్‌కార్డులు తిరస్కరణకు గురవుతుండటంతో జర్నలిస్టులు పడుతున్న కష్టాలను ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈహెచ్ఎస్ అమలుకు బడ్జెట్లో కేటా యించిన నిధులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పథకం అమలును పర్యవేక్షించడానికి మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రతినిధి బృందంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ ఉన్నారు. ఆపదలో ఉన్న జర్నలిస్టుకు అండగా నిలిచిన హరీశ్ ఆపదలో ఉన్న ఓ పాత్రికేయుడికి మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు పుండరీచారి సతీమణి వినోద నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. అయితే ఆశించినస్థాయిలో ఆమెకు చికిత్స జరగడంలేదనే విషయాన్ని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందిస్తూ వినోదకు ఏఎంసీలో బెడ్ కేటాయించి, మెరుగైన చికిత్స అందించాలని ఉస్మానియా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టు సంఘాల నేతలు కె.శ్రీనివాస్‌రెడ్డి, విరాహత్ అలీ తదితరులు -
జర్నలిస్టులకు అండగా నిలిచిన ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పని చేస్తున్న జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజే) ఢిల్లీ కమిటీ సభ్యులను న్యూఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించారు. అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ నేతృత్వంలో కమిటీ సభ్యులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి జర్నలిస్టులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన రైల్వే పాసుల వ్యవహారాన్ని జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రస్తావిస్తానని విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఆయన రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు సేవలందిస్తున్న జర్నలిస్టులకు అనేక సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైనందున కమిటీ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చమిచ్చి, శాలువా కప్పి సన్మానించారు. కరోనా ఆపత్కాలంలోనూ తమకు అండగా నిలిచిన విజయసాయిరెడ్డికి అందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజే రాష్ట్ర సహాయ కార్యదర్శి అవ్వారి భాస్కర్, ఉపాధ్యక్షురాలు స్వరూప పొట్లపల్లి, కార్యదర్శులు రాజు, జబ్బార్ నాయక్‌తో పాటు సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, ఆచార్య శరత్ చంద్ర, గోపీకృష్ణ, అశోక్‌రెడ్డి, నాగరాజు, ప్రభు, లింగారెడ్డి, కామరాజు, విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: 'పెద్ద చదువులకు పేదరికం అడ్డంకి కాకూడదు' -
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. అల్లం నారాయణ హామీ
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, త్వరలోనే స్థలాలను ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే జర్నలిస్ట్‌ల కోసం ఒక బ్రిడ్జి కోర్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. మూడోసారి అకాడమీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా బుధ వారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టులు అల్లం నారాయణను సన్మానించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
6 వేల మంది జర్నలిస్టులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9 జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణాతరగతులు నిర్వహించామని, వీటి ద్వారా 6 వేల మంది జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరచుకున్నారని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యానికి ఉపయోగపడే 12 పుస్తకాలు మీడియా అకాడమీ ప్రచురించి శిక్షణ తరగతుల్లో ఒక కిట్‌ను జర్నలిస్టులకు అందజేస్తుందని వెల్లడిం చారు. సీఎం కేసీఆర్ మీడియా అకాడమీకి రూ.100 కోట్ల నిధిని ప్రకటించి, ఇప్పటివరకు రూ.42 కోట్లు విడుదల చేశారని తెలిపారు. రూ.42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.16 కోట్లను జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు అకాడమీ అందజేసిందని వివరించారు. -
పెగాసెస్‌కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్’ కలకలం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్ రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆండ్రాయిడ్ స్పైవేర్ ‘హెర్మిట్’ను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులను ఆయా ప్రభుత్వాలు 'హెర్మిట్' ఎంటర్ప్రైజ్-గ్రేడ్ ఆండ్రాయిడ్ స్పైవేర్ ద్వారా టార్గెట్ చేసినట్టు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు వెల్లడించారు. సైబర్-సెక్యూరిటీ కంపెనీ లుక్అవుట్ థ్రెట్ ల్యాబ్ టీంఈ మాలావేర్ను గుర్తించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను అణిచి వేసిన నాలుగు నెలల తర్వాత ఏప్రిల్‌లో కజకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించినట్టు గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నామని ఈ బృందం పేర్కొంది. జాతీయ భద్రత ముసుగులో వ్యాపార వేత్తలు, మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులపై గూఢచర్యం చేయడానికి వారిపై నిఘాకు తరచుగా వాడు కుంటున్నారని పరిశోధకులు హెచ్చరించారు. హెర్మిట్ అనేది మాడ్యులర్ స్పైవేర్. ఆడియోను రికార్డ్, ఫోన్ కాల్ల డైవర్షన్ అలాగే కాల్ లాగ్‌లు, ఫ్రెండ్స్, ఫోటోలు, లొకేషపన్లను లాంటి వాటిని ఎస్ఎంఎస్ ద్వారా డేటాను చోరీ చేస్తుంది. ఈ మాలావేర్ టెలికమ్యూనికేషన్ కంపెనీ, స్మార్ట్‌ఫోన్ తయారీదారుల అప్లికేషన్లను కూడా ప్రభావితం చేశాయని లుకౌట్ బృందం తెలిపింది. 'హెర్మిట్' అని పేరు పెట్టిన ఈ స్పైవేర్‌ను ఇటాలియన్ స్పైవేర్ ఆర్సీఎస్ ల్యాబ్,టెలీ కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ కంపెనీTykelab Srl సహకారంతో అభివృద్ధి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామని పరిశోధకులు బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. అయితే హెర్మిట్ నిఘా ఇదే మొదటిసారి కాదు. 2019లో అవినీతి నిరోధక చర్యలో ఇటాలియన్ అధికారులు దీనిని ఉపయోగించారట.ఆర్సీఎస్ ల్యాబ్ మూడు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న ప్రసిద్ధ డెవలపర్. ఇది కూడా పెగాసస్ డెవలపర్ ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస్, ఫిన్ఫిషర్ని సృష్టించిన గామా గ్రూప్‌ల మాదిరిగానే అదే మార్కెట్లో పనిచేస్తుంది. అలాగే ఇది పాకిస్తాన్, చిలీ, మంగోలియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, తుర్క్మెనిస్తాన్లోని సైనిక, గూఢచార సంస్థలతో నిమగ్నమై ఉన్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. -
ఫిలిం జర్నలిస్టులకు ‘చిరు’ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ (ఫోటోలు)
-
జర్నలిస్టులకు నిర్మాతలు చేయూత ఇవ్వాలి : తలసాని
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జర్నలిస్టులే పెద్ద ఆస్తి. సినిమా జర్నలిస్టులకు చేయూత ఇచ్చేందుకు ప్రతి నిర్మాత కనీసం ఒక లక్ష రూపాయలు జర్నలిజం ఫండ్ కింద పెడితే బాగుంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్’(టీఎఫ్జేఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘టీఎఫ్జేఏ’ సభ్యులకు మెంబర్షిప్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అతిథుల చేతుల మీదుగా అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.ఐదు లక్షలు విరాళం ప్రకటించారు. నటుడు చిరంజీవి మాట్లాడుతూ... ‘నేను ‘ప్రాణం ఖరీదు’సినిమా చేస్తున్నప్పుడు నా గురించి ఓ ఆర్టికల్ రాస్తే బాగుండని కోరుకున్న. ఆ సమయంలో చెన్నైలోని ఓ జర్నలిస్ట్ నా గురించి రాసినప్పుడు చాలా ఆనందపడ్డా. ఆ జర్నలిస్టు (దివంగత పాత్రికేయుడు పసుపులేటి రామారావు)ను పిలిచి థ్యాంక్స్ చెప్పాను’అని గుర్తు చేసుకున్నారు. కరోనా వేళ పరిశ్రమలోని 24క్రాఫ్ట్స్‌కి ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) పెట్టినప్పుడు సినిమా జర్నలిస్టులను కూడా నిత్యావసర సరుకులు అందించామన్నారు. తాము చేసింది చాలా తక్కువని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ప్రెసిడెంట్: వి లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు 1. ఎం చంద్ర శేఖర్ 2. జి శ్రీనివాస్ కుమార్ జనరల్ సెక్రటరీ: వై జె రాంబాబు జాయింట్ సెక్రటరీలు 1. జి వి రమణ 2. వంశీ కాకా కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ కార్య నిర్వాహక కమిటీ 1. పి రఘు 2. వై రవిచంద్ర 3. జి జలపతి 4. కె ఫణి 5. కె సతీష్ 6. రెంటాల జయదేవ్ 7. వడ్డి ఓం ప్రకాష్ 8. సురేష్ కొండేటి -
యాదాద్రిలో జర్నలిస్టుల ఆందోళన
సాక్షి, యాదాద్రి: మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం ఉదయం యాదాద్రిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఈవో గీతారెడ్డి, జర్నలిస్టులను అరెస్ట్ చేయించగా.. అరెస్ట్‌లకు నిరసనగా యాదగిరి గుట్ట పీఎస్ వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు జర్నలిస్టులకు మద్దతు ప్రకటించాయి. -
దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్ల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమి, షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి.. శిక్షణకు హాజరైన దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని రాణించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, టీయూడబ్ల్యూజే (హెచ్143) ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్ పాల్గొన్నారు. -
నారీ యువ శక్తి గెలుస్తుంది
‘లే.. మేలుకో... లక్ష్యం చేరుకునే దాకా విశ్రమించకు’ అన్నారు స్వామి వివేకానంద. ‘వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అన్నాడాయన. మన దేశంలో 15–25 ఏళ్ల మధ్య యువత 20 కోట్లు. వీరిలో 10 కోట్ల మంది యువతులు. ఇంటర్ వయసు నుంచి ఉద్యోగ వయసు మీదుగా వివాహ వయసు వరకు అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు. వివక్షలు. ప్రతికూలతలు. కాని నారీ యువశక్తి వీటిని ఛేదించి ముందుకు సాగుతోంది. జనవరి 12– స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే ‘జాతీయ యువజన దినోత్సవం’ యువతులకు స్ఫూర్తినివ్వాలి. మార్గం చూపాలి. అంతరిక్షాన్ని చుంబించాలనుకున్న ఒక తెలుగు యువతి ఆ ఘనతను సాధించడం చూశాం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ వెళ్లి కాలేజీ బస్సెక్కడానికి పోకిరీల బెడదను ఎదుర్కొంటున్న యువతి నిస్సహాయతను కూడా చూస్తున్నాం. ఇద్దరూ యువతులే. ఒకరు సాధిస్తున్నారు. మరొకరు సాధించడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు బిందువుల మధ్యే భారతీయ టీనేజ్ అమ్మాయిలు, యువతులు తమ గమనాన్ని కొనసాగిస్తున్నారు. ‘కెరటం నాకు ఆదర్శం లేచినా పడినందుకు కాదు... పడినా లేచినందుకు’ అంటారు స్వామి వివేకానంద. గత మూడు నాలుగు దశాబ్దాలలో భారతీయ యువతులు పడినా లేచే ఈ సంకల్పాన్నే ప్రదర్శిస్తున్నారు. బాల్య వివాహాలను నిరాకరిస్తున్నారు. చదువు వైపు మొగ్గుతున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మధ్యతరగతి, ఆ పై తరగతుల్లో ఎక్కువగా ఉంటే దిగువ, పేద వర్గాలలో సంఘర్షణ కొనసాగించాల్సి వస్తోంది. దేశంలో ఇంకా చాలాచోట్ల సరైన టాయిలెట్లు లేని బడులు, సురక్షితం కాని రహదారులు, శానిటరీ నాప్కిన్లు అందుబాటులో లేని పరిస్థితులు ఆడపిల్లలను స్కూల్ విద్యకు దూరం చేస్తున్నాయి. కాలేజీ వయసులోకి రాగానే తల్లిదండ్రులు తమ అమ్మాయి ‘ఎటువంటి ప్రభావాలకు లోనవుతుందో’ అనే భయంతో పెళ్లి చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నేటి యువతులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసైనా సరే ముందు మేము నిలదొక్కుకోవాలి... తర్వాతే వివాహం వైపు రావాలి అని చాలాచోట్ల గట్టిగా గొంతు విప్పగలుగుతున్నారు. ‘నీ వెనుక ఏముంది... ముందు ఏముంది నీకనవసరం... నీలో ఏముంది అనేది ముఖ్యం’ అన్నారు వివేకానంద. ఇవాళ యంగ్ అడల్ట్స్లోగాని, యువతులలోగాని ఉండాల్సింది ఈ భావనే. ముందు తమను తాము తెలుసుకోవాలి. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. దానిని అందుకోవడానికి ప్రయత్నించాలి. కాని నేటి సమస్య ఏమిటంటే యువతులకు తాము ఏమిటో తెలిసినా తల్లిదండ్రుల ఆకాంక్షలకు తల వొంచాల్సి వస్తోంది. మరోవైపు వారి మీద అటెన్షన్, నిఘా, వేయి కళ్ల కాపలా... ఇవన్నీ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ‘అదొద్దు ఇది చెయ్’ అని అమ్మాయికి చెప్పినంత సులువుగా అబ్బాయికి చెప్పలేని పరిస్థితి నేటికీ ఉందన్నది వాస్తవం. దాంతో పాటు తల్లిదండ్రులు, చుట్టాలు, సమాజం ఆడపిల్లల విషయంలో వారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలన్న అంచనా వారిని బాధిస్తోంది. కాని వారికి ఇంట్లో, విద్యాలయాల్లో సరైన దిశ దొరికితే వారు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఇవాళ టెక్నికల్ విద్యలో, మెడిసిన్‌లో అమ్మాయిలు రాణిస్తున్నారు. ఎంచుకుని మరీ ర్యాంకులు సాధిస్తున్నారు. మరోవైపు మేనేజ్మెంట్ రంగాల్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యువతులు రాణిస్తున్నారు. కళారంగాలను ఎంచుకుంటున్నారు. సినిమా రంగ దర్శకత్వ శాఖలో గతంలో యువతులు కనిపించేవారు కాదు. ఇవాళ చాలామంది పని చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి చదవడానికి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి వారి దగ్గర పుష్కలంగా ప్రతిభ ఉంది. మనం చేయవలసిందల్లా వారు కనుగొన్న మార్గంలో వారిని వెళ్లనివ్వడమే. ‘జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు’ అన్నారు వివేకానంద. ‘ఆడపిల్ల... రిస్క్ ఎందుకు’ అనే మాట గతంలో ఉండేది. ఇవాళ కూడా ఉంది కాని ఎందరో యువతులు ఇవాళ పోలీస్, రక్షణ దళాలలో పని చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఎగరేస్తున్నారు. యుద్ధ ఓడలు నడుపుతున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగుతూ ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగాల్సి ఉంది. పర్వతారోహకులుగా, సోలో ట్రావెలర్సుగా, హెవీ వెహికిల్స్ డ్రైవర్లుగా, ప్రమాదకరమైన అసైన్మెంట్లు చేసే జర్నలిస్టులుగా ఇలా నేటి యువతులు అద్భుతాలు సాధిస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు మోగుతున్న చోట నిలబడి వారు రిపోర్టింగ్ చేసే సన్నివేశాలు స్ఫూర్తినిస్తున్నాయి. స్వామి వివేకానంద ఆశించిన యువత ఇదే. ఇలాంటి యువతకు సమాజం, కుటుంబం దన్నుగా నిలవడమే చేయాల్సింది. ‘మనం ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు’ అన్నారు వివేకానంద. స్త్రీ వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబ నిర్మాణం అవుతుంది. తద్వారా సమాజ నిర్మాణం అవుతుంది. ఆపై దేశ నిర్మాణం అవుతుంది. నేటి యువతులు కేవలం విద్య, ఉపాధి రంగాలలో రాణించడం కాకుండా ప్రపంచ పరిజ్ఞానం కలిగి, సామాజిక పరిణామాలు గమనిస్తూ, పాటించవలసిన విలువలను సాధన చేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలలో కూచునే శక్తి సామర్థ్యాలు పుణికి పుచ్చుకోవాలి. యువశక్తి దేశాన్ని నడిపించాలి. కాని నేటి సోషల్ మీడియా వారిని విపరీతంగా కాలహరణం చేయిస్తోంది. ‘హ్యాపెనింగ్’గా ఉండమని ఛోటోమోటా సరదాలకు ఆకర్షిస్తోంది. మిగిలినవారిని ఇమిటేట్ చేయమంటోంది. అలా ఉండాలేమోనని కొంతమంది యువతులు డిప్రెషన్లోకి వెళ్లాల్సి వస్తోంది. ‘మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు’ అన్నారు వివేకానంద. నేటి యువ మహిళా శక్తి ఈ మాటను తప్పక గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలి. మరిన్ని విజయాలు సాధించాలి. మొదటి అడుగులోనే... సక్సెస్ అయ్యాక సొసైటీ నుంచి పొగడ్తలు వస్తాయి. అదే, ముందే ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నేను, నా బిజినెస్ పార్టనర్ శ్రుతి బీటెక్‌లో స్నేహితులం. ఇద్దరం కలిసి ‘మాయాబజార్’ అని ఫొటోషూట్ స్టూడియోను ప్రారంభించాం. మేం ప్రారంభించినప్పుడు ఈ బిజినెస్‌లో పెద్దగా పోటీ లేదు. ఇప్పుడు మేం సక్సెస్ అయ్యాం. అందరూ వచ్చి అమ్మాయిలు ఇంత బాగా చేశారు. ఎంత కష్టపడ్డారు... అని అంటుంటారు. కానీ, దీని ప్రారంభంలో మేం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ఇద్దరి అమ్మానాన్నలు నమ్మారు. డబ్బుల విషయం ఒక్కటే కాదు. అమ్మాయిలు సొంతంగా ఏదైనా పని చేయాలనుకుంటే అందుకు చుట్టుపక్కల అంతా మంచి మద్దతు లభించాలి. మా టెక్నిషియన్స్, వర్కర్స్.. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ, మొదట్లో లేదు.‘వీళ్లు అమ్మాయిలు కదా ఏం చేస్తారు?’ అనే ఆలోచన ఉంది. మమ్మల్నే నేరుగా అనేవారు. డబ్బులు పెట్టినా సరే, దాదాపు పదిమందిని అడిగితే ఒకరు ముందుకు వచ్చేవారు. హార్డ్‌వర్క్ చేయడానికి అమ్మాయిలు ముందుకు వచ్చినప్పుడు సమాజం నుంచి ‘మీరు అమ్మాయిలు కదా! ఎందుకు మీకు కష్టం..’ అనే అభిప్రాయం వస్తుంది. మొదటి వ్యక్తి నుంచే సరైన రెస్పాన్స్ వస్తే.. అమ్మాయిలు సొంతంగా ఎదగడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. – అనూష, శ్రుతి ‘అమ్మాయి కదా’ అని... అమ్మాయిలు వర్కర్స్‌తో పనిచేయించాలన్నా, ఆర్డర్స్ తీసుకునేటప్పుడు, పేమెంట్ తిరిగి రాబట్టుకోవడానికి.. అన్ని విధాల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అమ్మాయి కదా, ఏం కాదులే! అని తేలికగా తీసుకుంటారు. సింగిల్‌గా ఎదగాలంటే అబ్బాయిలకు ఉన్నంత సపోర్ట్ ఈ సొసైటీలో అమ్మాయిలకు లేదు. అందుకే ప్రతిభ ఆధారంగానే నా పనితనాన్ని చూపుతాను. మార్కెట్‌ను బట్టి 3–4 ఛాయిస్‌లు వినియోగదారులకు ఇస్తాను. ఇంటీరియర్‌లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఏ వస్తువును ఎలా సర్దుకోవాలో అమ్మాయిలకే బాగా తెలుసు. ఆ విధంగా కూడా నా వర్క్‌ను చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో మా కుటుంబం నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్ ద్వారా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ‘నేను అమ్మాయిని’ కాదు, నా పనిని ఒక వృత్తిగా భావించండి అని చెప్పుకోవాల్సి రావడం బాధగా ఉంటుంది.ఈ విధానంలో మార్పు అవసరం. – కాత్యాయని, ఇంటీరియర్ డిజైనర్ -
లఖీంపూర్ ఖేరి ఘటన.. మిశ్రాపై వేటు తప్పదా?
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే తక్షణం ఢిల్లీ రావాలని ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు సంధించగా.. ఆయన సహనం కోల్పోయి మీడియాపై ఫైర్ అయ్యారు. చదవండి: Lakhimpur Violence: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ తనయుడు ఆశిష్ మిశ్రా గురించి అడిగిన జర్నలిస్టులపై కేంద్రమంత్రి దుర్భాషలాడారు. ‘మూర్ఖుడిలా ప్రశ్నలు అడగవద్దు. మీరు మానసికస్థితిని కోల్పోయారా?. ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు?. నిర్దోషిని నిందితుడిగా మార్చారు. మీకు సిగ్గు లేదా?. నీవు ఒక దొంగ’ అంటూ జర్నలిస్టుపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈనెల 15న ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 63 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిధులు సమకూర్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదేరోజు రూ.లక్ష చెక్కుల పంపిణీ చేస్తారని వెల్లడించారు. -
TSRTC: జర్నలిస్టులకు సజ్జనార్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పరిగెత్తించేందుకు కృషిచేస్తూనే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతేగాక ట్విట్టర్లోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్రయాణికులు, నెటిజన్ల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తూ.. పరిష్కార మార్గాలను చూపుతున్నారు. చదవండి: నూతన వధూవరులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సర్ప్రైజ్.. ఈ క్రమంలో తాజాగా జర్నలిస్టులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త అందించారు. జర్నలిస్ట్ బస్ పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు తెలంగాణ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే తమకు లభించాల్సిన తగ్గింపు (కన్సెషన్) పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో గుడ్‌న్యూస్ ఫర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ సూచనలు చేసిన ఇద్దరు నెటిజన్లకు ఆయన కృతజ్జతలు తెలియజేశారు. కాగా సజ్జనార్ నిర్ణయంపై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సజ్జనార్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేశారు. చదవండి: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్ Good NEWS for our NEWS friends! Now, #journalists with valid bus pass from #TSRTC can avail of concession online also while booking tickets through our #TSRTC website. Thank You @iAbhinayD & @NVNAGARJUNA for your suggestion Patronage #TSRTC & #IchooseTSRTC #fridaymorning@V6News pic.twitter.com/7FEyzzBN99 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 12, 2021 అయితే మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ కార్డుతో ఆర్టీసీ నుంచి బస్ పాస్ తీసుకుంటారు. ఈ పాస్ ఉన్నవారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే కన్సెషన్ పొందుతుంటారు. ఇప్పటి వరకు నేరుగా బస్ కండక్టర్ నుంచి మాత్రమే రాయితీ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఆన్లైన్లో ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే మాత్రం ఈ మినహాయింపులు వర్తించేవి కావు. ఈ క్రమంలో తాజాగా టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు జర్నలిస్టులు తమ కన్సెషన్ పొందవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో వెల్లడించారు. -
వారి నిర్బంధంలో న్యాయముందా?
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ముంబైలోని ఆర్థర్రోడ్ జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ అతడి విడుదలపై ఉత్తర్వు జారీ చేసినప్పటికీ ఆర్యన్ ఒకే ఒక్కరోజు అదనంగా గడపవలసివస్తే్తనే న్యాయస్థానం బాధపడిపోయింది. కానీ, ప్రజాకార్యకర్తలపై, జర్నలిస్టులపై నిరాధారమైన అరెస్టుల కారణంగా, వారు ఏళ్ల తరబడి నిర్బంధంలో మగ్గుతున్నారు. వారి తక్షణ విడుదలకు, రక్షణకు గౌరవ న్యాయస్థానం ఇప్పటిదాకా పూచీపడటం లేదు. ఇవి న్యాయస్థాన చరిత్రలో చెరగని మచ్చలుగా మిగిలిపోతున్నాయి. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతం తన పరువుకు సంబంధించిన అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది! అక్రమకేసులు, అక్రమ అరెస్టుల మూలంగా జైళ్ల లోపల, వెలుపల కూడా నిరవధికంగా మగ్గుతున్న ప్రజాకార్యకర్తలను, ఉద్యమకారులను, కవులను, జర్నలిస్టులను, కళాకారులను, అందరినీ విడుదల చేయించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించరాదు. ‘దురదృష్టవశాత్తు దక్షిణాసియా రాజ కీయ నాయకత్వానికి పరిణామాలను ముందుగానే పసిగట్టగల దార్శనికత గానీ, సమయానికి మేల్కొని అన్నిరకాల మత దురభిమా నాలకు వ్యతిరేకంగా నిలబడేట్టు చేయగల సత్తాగానీ లేకుండా పోయింది. రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంత పాలకులు మత దురభి మానాలనూ ప్రజల్లో పరస్పర విద్వేషాలనూ, అసహనాన్నీ కడు వేగంగా వ్యాపింపజేస్తున్నారు. దీని ఫలితంగా ఆయా సమాజాల్లో జరిగే కాసింత మంచి విషయం కూడా నిలువునా దగ్ధమవుతోంది. ఈ దుష్పరిణామం దక్షిణాసియాలో భాగమైన భారత ప్రజలు కోరుకుం టున్న సామాజిక, ఆర్థికాభివృద్ధి అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. దేశ విభజన జరిగిన 75 సంవత్సరాల తర్వాత కూడా భారత ప్రజల మధ్య సఖ్యత కొరవడటమే కాదు, విభిన్న మతాల మధ్య సహజీవ నానికి, సహిష్ణుతలకు సైతం నేడు పెను ప్రమాదం దాపురించిందని గమనించాలి.’’ – ప్రొ‘‘ సయద్ మునీర్ ఖస్రూ, చైర్మన్, ‘ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ, అడ్వొకసీ అండ్ గవర్నెన్స్’ న్యూఢిల్లీ, పలు దేశాల్లో విద్యాధిక సలహాదారు ప్రొఫెసర్ మునీర్ ఖస్రూ హెచ్చరిస్తున్న ప్రమాదానికి ప్రత్యక్ష సాక్ష్యంగా సుప్రసిద్ధ హేతువాది నరేంద్ర దాభోల్కర్ హత్య కని పిస్తుంది. ఈయన హత్య జరిగి ఎనిమిదేళ్లయింది, ప్రసిద్ధ సామాజిక సేవకురాలు, హేతువాద పత్రిక ‘లంకేశ్’ సంపాదకురాలైన గౌరీ లంకేశ్ హత్య జరిగి నాలుగేళ్లయింది. కానీ వీరిద్దరి హంతకుల ఆచూకీ గురించిన విచారణ తతంగం ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. ఇలాంటి అనేక అంశాల కారణంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తన పరువుకు సంబంధించిన అగ్నిపరీక్షను ప్రస్తుతం ఎదుర్కొన బోతోంది! దేశంలోని పలు జైళ్లలో దీర్ఘకాలంగా మగ్గుతున్న నిందితు లకు న్యాయస్థానాలు జారీచేస్తున్న బెయిల్ ఉత్తర్వులను కూడా సకా లంలో సంబంధిత అధికారులకు అందజేయడంలో జాప్యం జరుగు తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానిస్తూ, అండర్ ట్రయల్ ఖైదీల బెయిల్ విషయంలో జాప్యం అనేది మానవ స్వేచ్ఛను ఉల్లంఘించడంగా విమర్శించవలసి వచ్చింది. అంతేకాదు, నేటి సాంకేతికయుగంలో కూడా కోర్టుల ఆదేశాలను జారీ చేయడానికి అవలంబిస్తున్న విధా నాలను ఆయన తప్పు పట్టారు. పాతకాలంలో పాలకుల ఉత్తర్వులు జారీచేయడానికి ఎగిరి వచ్చే పావురాల కోసం అప్పట్లో ఎదురు చూసేవారు కదా! అయితే నేటికాలంలో కూడా మంజూరైన బెయిల్ కోసం ఇంకా నిందితులు ఆకాశంవైపు మోరలెత్తి ఎదురు చూడడం హాస్యాస్పదమని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించవలసి వచ్చింది! హేతువాద, ప్రజా ఉద్యమాల నాయకులైన దాభోల్కర్, గౌరీ లంకేశ్, ప్రొఫెసర్ కల్బుర్గి, గోవింద పన్సారేల దారుణ హత్యల ఉదంతం కానీ, ప్రజాఉద్యమాలకు అండగా నిలిచిన పలువురు పత్రికా విలేక రులపై జరిగిన హత్యా ఘటనలు కానీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ హత్యలకు కారకులను బహిర్గతం చేసి శిక్షించడంలో కూడా సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. ఇంతమంది ప్రజా కార్యకర్తలు, జర్నలిస్టులపై దారుణ హత్యలు నమోదై ఉండగా ఒక బాలీవుడ్ సూపర్‌స్టార్ కొడుకు ఆర్యన్, ఆర్థర్రోడ్ జైలునుంచి విడుదల కావడానికి కోర్టు ఉత్తర్వు జారీ ప్రక్రియలో ఆలస్యంతో ఒకే ఒక్కరోజు అదనంగా గడపవలసివస్తేనే న్యాయస్థానం బాధపడి పోయింది. అదే సమయంలో, ప్రజాకార్యకర్తలపై, జర్నలిస్టులపై నిరా ధారమైన అరెస్టులతో వారు సంవత్సరాల తరబడిగా నిర్బంధంలో మగ్గిపోతున్నారు, ఇలాంటివారి తక్షణ విడుదలకు రక్షణకు గౌరవ న్యాయస్థానం ఇప్పటిదాకా పూచీపడకపోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాలు న్యాయస్థాన చరిత్రలో చెరపరాని మచ్చగా మిగిలిపోతున్నాయి. ఇది ప్రజాతంత్రవాదులకు, న్యాయస్థానాల పట్ల ఇంకా గౌరవం మిగుల్చుకున్న ప్రజాస్వామ్యవాదులకు మనస్తాపం కల్గించే పరిణామం. ఈ అంశంపై దేశ ఉన్నత న్యాయస్థానం గుర్తించి తిరుగులేని నిర్ణయానికి రాగలదని ఆశిస్తున్నాం. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ, పౌరుల సమాచారహక్కు చట్టాలు లేక కాదు... ఉన్న చట్టాలను చాపచుట్టి నేలమాళిగల్లో భద్ర పరిచే ఏర్పాట్లకు కేంద్ర పాలకులు సిద్ధమయ్యారు. అందుకనే ఇప్పటిదాకా (11–10–2021) ఈ చట్టం అమలులోకి రాకుండా చేసినందున దాదాపుగా 2 లక్షల ఆర్టీఐ కేసులు పరిష్కారం కాకుండా నిలిచిపోవలసి వచ్చింది. ఈ వ్యవహారాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం గుర్తించి చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్టాన్ని అమలుపర్చవలసిన సమాచార కమిషన్లకు సిబ్బంది లేరన్న సాకు ఎంతవరకు నిజమో, అందుకు కారణాలేమిటో గౌరవ సుప్రీంకోర్టు మొహమాటం లేకుండా పరిశీలించాల్సి ఉంది! అంతేకాదు, దేశ పౌరుల సమాచార హక్కును నిరాకరిస్తే, అది పౌరుల ప్రాథమిక హక్కుల్ని నిరాకరించిన ట్లే. పైగా ‘జాతీయ భద్రత’ పేరు చాటున ‘పెగసస్’ లాంటి విదేశీ నిఘా సాఫ్ట్వేర్ కార్య కలాపాలను దేశంలో అనుమతించబోమని, ఇది దేశ భద్రతకు సంబం ధించిన సమస్య అనీ, అందువల్ల ప్రభుత్వ వాదనను విశ్వసించ బోమని సుప్రీంకోర్టుæ ధర్మాసనం స్పష్టం చేయవలసివచ్చింది! పైగా, ఈ విషయానికి సంబంధించినంతవరకూ, ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల సంతలో న్యాయస్థానం తలదూర్చబోదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. తన నిర్ణయానికి అనుగుణంగానే 1973 నాటి ‘కేశవానంద భారతి’ కేసులో జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా చెప్పిన తీర్పును చీఫ్ జస్టిస్ ఉటంకించాల్సి వచ్చింది. జస్టిస్ ఖన్నా ఆనాడు ‘న్యాయమూర్తుల ప్రాథమిక బాధ్యత భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్భయంగాను లేదా సానుకూలంగానూ గౌరవించడమే... అలా చేయడంలో వారు ఒక రాజకీయ సిద్ధాంతాన్నో లేదా ఏదో ఒక ఆర్థిక సిద్ధాంతాన్నో అనుసరించి తమ నిర్ణయాన్ని ప్రకటించరాద’ని అన్నారు. అయితే దేశ రాజకీయ, ఆర్థిక విధానాలపై ఒక అవగాహన, స్పష్టతలేని న్యాయమూర్తుల పట్ల, వారి తీర్పుల పట్ల జస్టిస్ కృష్ణయ్యర్ తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. అలాగే ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కూడా ‘పెగసస్’ నిఘా సాఫ్ట్‌వేర్‌ని రూపొం దించిన ఎస్ఓఎస్ భారత పాలకుల అనుమతితో ఇండియాలో సాగి స్తున్న గూఢచర్యం విషయంలో, భారత పౌరుల రాజ్యాంగ హక్కుల రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం హర్షించదగ్గ పరి ణామం. పాలకుల విధాన నిర్ణయాల వల్ల దేశ పౌరుల రాజ్యాంగ హక్కులకు కలుగుతున్న ప్రమాదం పట్ల న్యాయస్థానం మూగనోము పట్టజాలదని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ స్పష్టతకు అనుగుణంగానే, అక్రమకేసులు, అక్రమ అరెస్టుల మూలంగా జైళ్ల లోపల, వెలుపల కూడా నిరవధికంగా మగ్గుతున్న ప్రజాకార్యకర్తలను ఉద్యమకారులను, కవులను, జర్నలిస్టులను, కళాకారులను అందరినీ విడుదల చేయించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించరాదు. ఈ బాధ్యతను తప్పకుండా చేపట్టాలని చీఫ్ జస్టిస్‌కు ప్రజాపక్షంగా ఇదే మా విజ్ఞాపన! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
తాలిబన్ల అరాచకం: జర్నలిస్టులకు చిత్రహింసలు
కాబూల్: తాలిబన్లు రెచ్చిపోయారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చితకబదారు. రక్తమొచ్చేలా దాడి చేశారు. వారిని దాడి చేసి బంధించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గానిస్తాన్‌లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్-ఈ-చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు ఎత్తుకెళ్లిపోయారు. చదవండి: లోకేశ్‌కి ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ అనంతరం ఓ గదిలో బంధించి చితకబాదారు. వారి దుస్తులు విప్పేసి రక్తమొచ్చేలా తీవ్రంగా దాడి చేశారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు తఖి దర్యాబీ, నిమతుల్లా నక్తీ. జర్నలిస్టు వృత్తిని ఎగతాళి చేస్తూ దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తెలిపారు. తమ పాలనలో మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లదని తాలిబన్లు ప్రకటించారు. అయినా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిద్దరితో పాటు మరికొందరు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి అనంతరం విడిచి పెట్టారని చెప్పారు. దర్యాబీ, నక్దీ ఓ ఛానల్లో వీడియో ఎడిటర్లుగా పని చేస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్ లోకం ఖండిస్తోంది. Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl — Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021 -
త్వరలో అక్రిడేషన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: పేర్ని నాని
సాక్షి, పశ్చిమగోదావరి: త్వరలో అక్రిడేషన్ జర్నలిస్టులను ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిజమైన విలేకరులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కొత్త అక్రిడేషన్ పాలసీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. కొంతమంది పత్రికలు, చానళ్లు లేకపోయినా విలేకర్లగా చలామణి అవుతున్నారని, అటువంటి వారిని తొలగించేందుకు కొత్తగా జీఎస్టీ తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇవీ చదవండి: చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ మనబడి నాడు-నేడు: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా -
కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు
సాక్షి, అమరావతి: కరోనాతో చనిపోయిన జర్న లిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ చెప్పారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు చాలా మంది కరోనాతో చనిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశ వైరస్ విజృంభణలో ఎక్కువమంది జర్న లిస్టులు మృతిచెందారని తెలిపారు. వీరి కుటుం బాలకు శాశ్వత మేలు కల్పించడానికి ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే ఈ సాయం ఆ కుటుంబాలకు పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వలేదని భావించి శాశ్వత మేలు చేయాలని ఆలోచిస్తోందని చెప్పారు. జర్నలిస్టుల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలినుంచి సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు సంతకం చేసిన కొద్ది ఫైళ్లలో జర్నలిస్టుల హెల్త్‌స్కీమ్ ఫైలు ఒకటని గుర్తుచేశారు. ఐజేయూ అధ్యక్షుడు ఇటీవల మాట్లాడుతూ ఏపీలో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని, దీనిపై ప్రశ్నించాలంటూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించడం సమంజ సం కాదన్నారు. ఈ నెల 17న ఏపీయూడబ్ల్యూజే ఆ విర్భావ దినోత్సవాన్ని సా వధాన దినోత్సవంగా జరు పుకోవడానికి పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు. యాజమాన్యాలను ఎందుకు ప్రశ్నించరు? రూ.కోట్లు ఆర్జిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనాలివ్వని యాజమాన్యాల ను యూనియన్ నాయకులు ఎందుకు ప్రశ్నించరని అమర్ దుయ్యబట్టారు. ఏపీడబ్ల్యూ జర్నలిస్టుల సంక్షేమానికి అనేక రాయితీలు ఇస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం యూనియన్ నాయకులకు తగదన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టులపై దాడులు జరిగాయో ఆధారాలతో ని రూపించాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం జర్నలిస్టులను అన్ని విధా లుగా ఆదుకుందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానీని కలిసి జర్నలిస్టు యూనియన్ నాయకులు కృతజ్ఞత లు తెలిపారని, ప్రస్తుతం వారే ప్రభుత్వంపై బురద జల్లే చర్యలకు దిగుతుండటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు పరిశీలనలో ఉంది రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అక్రిడిటేషన్ మంజూరు చేస్తుందని చెప్పారు. అక్రిడిటేషన్లు ఇవ్వడంలో ఆలస్యమైందని విమర్శించే వారు దాని వెనుక వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అక్రిడిటేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కృషి చేస్తున్నారని తెలిపారు. చిన్న పత్రికలకు జీఎస్టీ మినహాయింపు, అక్రిడిటేషన్ కమిటీల్లో యూనియన్లకు ప్రాతినిథ్యం అంశాలు సమాచారశాఖ దృష్టిలో ఉన్నాయన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. సగర్వదినంగా జరుపుకోవాలి: యూనియన్ల నేతలు రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో తెలియజేస్తూ ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్ను శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల యూనియన్ నాయకులు శుక్రవారం ఓ ప్రకట నలో తెలిపారు. ఈ 17న ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని జర్నలిస్టులు సావధాన దినంగా కాకుండా సగర్వ దినంగా జరుపుకోవా లని పిలుపునిచ్చారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు కలి గించేదిశగా ప్రభుత్వం ఆలోచించడం హర్షణీయ మని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ఉన్నతమైన ఆలోచన విధానంతో ఉన్నారని, జర్నలిస్టులకు త్వరలోనే తీపి కబురు అందిస్తామని అమర్ హామీ ఇచ్చారని తెలిపారు. -
కోవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 కోట్లు
న్యూఢిల్లీ: కోవిడ్-19తో మృతి చెందిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5.05 కోట్లను సాయంగా మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూ ర్వకంగా సమాధానమిచ్చారు. కోవిడ్ బాధిత జర్నలిస్టుల కుటుంబాలను గుర్తించి, సాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా మన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖకు అందిన దరఖాస్తులకు జర్నలిస్ట్ సంక్షేమ పథకం(జేడబ్ల్యూఎస్) నిబంధనలకు లోబడి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. చదవండి: Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ -
జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యం
బోస్టన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగసస్ స్పైవేర్ ప్రధాన లక్ష్యం జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలేనని అంతర్జాతీయ మీడియా పరిశోధనలో తేలింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. స్పైవేర్‌తో సంపాదించిన 50వేలకు పైగా ఫోన్ నెంబర్ల జాబితా ఫొరిబిడెన్ స్టోరీస్ అనే ఎన్జీఓకు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు దొరికింది. ఈ జాబితాను ప్రముఖ మీడియా గ్రూపులు విశ్లేషించాయి. 50 దేశాల్లో వెయ్యికి పైగా కీలక వ్యక్తులు నెంబర్లను ఇందులో గుర్తించారు. వీరిలో 189 మంది జర్నలిస్టులు, 600మంది రాజకీయవేత్తలు, 65మంది వ్యాపారులు, 85మంది మానవహక్కుల కార్యకర్తల నెంబర్లు ఇందులో ఉన్నాయని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది. సీఎన్ఎన్, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ తదితర దిగ్గజ సంస్థల జర్నలిస్టుల నెంబర్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. ప్రముఖ జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు నాలుగు రోజుల ముందు ఆయనకు కాబోయే భార్య ఫోనులో ఈ స్పైవేర్ ఇన్‌స్టాలైందని అమ్నెస్టీ తెలిపింది. ఈ ఆరోపణలన్నింటినీ ఎన్ఎస్ఓ కొట్టిపారేసింది. తాము ఎప్పుడూ ఎలాంటి టార్గెట్ల జాబితాను ఉంచుకోవమని తెలిపింది. తమపై వచ్చిన కథనాలు నిరాధారాలని నిందించింది. అయితే ఈ వివరణలను విమర్శకులు తోసిపుచ్చుతున్నారు. కాగా, తమకు లభించిన జాబితాలో 15వేలకు పైగా నంబర్లు మెక్సికోకు చెందినవని మీడియా వర్గాలు తెలిపాయి. తర్వాత అధిక సంఖ్యలో మధ్యప్రాచ్యానికి చెందిన ఫోన్లున్నట్లు తెలిపాయి. నిఘా స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్ఓ గ్రూప్‌పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది ఇజ్రాయిల్ కోర్టులో దావా వేసింది. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది. ఆటంకవాదుల నివేదిక: షా పెగసస్ స్పైవేర్ అంశంపై కాంగ్రెస్, అంతర్జాతీయ సంస్థలపై హోంమంత్రి అమిత్‌షా ఎదురుదాడి చేశారు. ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారన్న నివేదికను భారత ప్రగతిని అడ్డుకునేందుకు కుట్రతో ఆటంకవాదులు రూపొందించిన అవాంతరాల నివేదికగా అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాల తరుణంలోనే ఎంపిక చేసినట్లు లీకేజీలు బయటకు రావడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి ఇలాంటి దాడులు ఊహించినవేనని షా విమర్శించారు. వారి పార్టీని వారు సరిదిద్దుకోలేని వారు పార్లమెంట్లో అభివృద్ధికర అంశాలను అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో ప్రజాసంక్షేమాన్ని వదిలి ఇలాంటి అసత్య నివేదికలతో సభా సమయం వృధా చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. జాబితాలో రాహుల్, ప్రశాంత్ నంబర్లు! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్ నంబర్లు పెగసస్ హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పెగసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికిపైగా భారతీయులున్నట్లు ‘ది వైర్’ వార్తా సంస్థ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగి, ఆమె చుట్టాల నంబర్లు ..ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్, వసుంధరరాజే పర్సనల్ సెక్రటరీ తదితరులున్నారు. భారత్‌పై బురద జల్లేందుకే...! పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న వార్తలను కేంద్రం ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొట్టిపారేశారు. పార్లమెంట్ సమావేశాలు ఆరంభమవుతున్నవేళ దేశ ప్రజాస్వామ్యానికి అపత్రిçష్ట అంటించేందుకే ఈ కథనాలను వండివారుస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎంతో పటిçష్టమైన వ్యవస్థలున్నాయని, అందువల్ల భారత్‌లో అక్రమ, అనైతిక నిఘా అసాధ్యమని చెప్పారు. ఈఅంశాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తడంతో మంత్రి లోక్‌సభలో ఈ వివరణ ఇచ్చారు. మీడియా జాబితాలో ఫోన్ నెంబరున్నంతమాత్రాన హ్యాకింగ్ జరిగినట్లు కాదని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు. పెగాసస్‌ను ప్రభుత్వం వాడుతున్నదీ లేనిదీ తెలపలేదు. అమిత్‌షా తొలగింపునకు కాంగ్రెస్ డిమాండ్ జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన పెగసస్ స్పైవేర్ అంశంలో హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ప్రధాని మోదీ పాత్రపై లోతైన విచారణ జరపాలని కోరింది. పెగసస్ అంశానికి షానే బాధ్యత వహించాలని, ఆయన్ను తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఇతర పార్టీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ విషయంపై న్యాయ లేదా పార్లమెంటరీ విచారణ కోరే అంశమై అన్ని పార్టీలతో కాంగ్రెస్ చర్చిస్తుందన్నారు. హోంమంత్రి పదవికి షా అనర్హుడని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. డిజిటల్ ఇండియా అని మోదీ చెబుతుంటారని, కానీ నిజానికి ఇది నిఘా ఇండియా అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. షాను వెంటనే ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. ఈ నిఘా వ్యవహారం మొత్తం మోదీ ప్రభుత్వ కన్నుసన్నులోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ, అమిత్‌షా స్పందించాలి పెగసస్‌తో ప్రముఖుల సమాచారం హ్యాక్ అయిందన్న వార్తలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించాలని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో ప్రభుత్వం, యంత్రాంగం బలహీనంగా ఉన్నాయని ఈ ఘటన చెబుతోందని సేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ప్రజలకు ప్రధాని, హోంమంత్రి ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఆయన కోరారు. -
Pegasus: ఏంటీ పెగాసస్.. భారీ డేటా హ్యాక్‌లో వాస్తవమెంత?
ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే స్పైవేర్ ‘పెగాసస్’ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా డేటా హ్యాక్ అయ్యేందుకు వీలుందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డేటా లీకేజీ కుంభకోణం ప్రకంపనలు మొదలయ్యాయా?. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మరికొందరు ప్రముఖుల్ని లక్క్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్.. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్పైవేర్ ద్వారా హ్యాకర్లు.. ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని ‘ది వైర్’ ఆదివారం ఓ కథనం ప్రచురించింది. తాజా కథనం ప్రకారం.. భారత్‌తో మరికొన్ని దేశాల ప్రముఖులను లక్క్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ టెస్ట్‌లు(డేటాబేస్‌లో ఉన్న పది నెంబర్లపై పరీక్షలు) దాదాపుగా హ్యాకింగ్ జరిగిందనేందుకు ఆస్కారం ఉందని తేల్చాయని వైర్ ప్రస్తావించింది. మన దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్ నెంబర్లు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, తాజా-మాజీ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఓ ప్రముఖుడు, ముగ్గురు కీలక ప్రతిపక్ష సభ్యులు, 40 మంది జర్నలిస్టుల నెంబర్లు, ఆరెస్సెస్ సభ్యులు, ఇతర ప్రముఖుల వివరాలు ఉన్నట్లు, రాబోయే రోజుల్లో వాళ్ల పేర్లను సైతం వెల్లడిస్తామని ది వైర్ పేర్కొంది. యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా మరింత తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Strong rumour that this evening IST, Washington Post & London Guardian are publishing a report exposing the hiring of an Israeli firm Pegasus, for tapping phones of Modi’s Cabinet Ministers, RSS leaders, SC judges, & journalists. If I get this confirmed I will publish the list. — Subramanian Swamy (@Swamy39) July 18, 2021 దావా వేస్తాం 2018-19 నడుమ ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని, అయితే అన్ని నెంబర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా,? లేదా? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉందని వైర్ పేర్కొంది. వైర్‌తో పాటు వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్లు సైతం ఈ వార్తలను ప్రచురించాయి. మరోవైపు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది. గతంలో కూడా.. పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్ యూజర్లనే ఇది టార్గెట్ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం టార్గెట్ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్వో గ్రూప్ మీద ఫేస్బుక్ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్ కథనాలు పలు ఇంటర్నేషనల్ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి. -
ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు
సాక్షి, అమరావతి: కరోనా బారినపడిన పాత్రికేయులకు సకాలంలో వైద్య సేవలందేలా నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా సోకిన పాత్రికేయులకు, వైద్య ఆరోగ్య యంత్రాంగానికి మధ్య అనుసంధానకర్తలుగా పనిచేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని, జిల్లా స్థాయిలో శాఖాధిపతులను నోడల్ అధికారులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా సమాచార, పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్ కుమార్ (మొబైల్ నం: 9121215223)ను నియమించామన్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచామన్నారు. నోడల్ అధికారులు సంబంధిత జిల్లాల్లో గుర్తించిన ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య సేవలు అందేలా చూస్తారన్నారు. పరీక్షల నిర్వహణ, కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవడం, వైద్య సేవలు వంటి విషయాల్లో వారు సహాయకారిగా ఉంటారన్నారు. పాత్రికేయులకు వ్యాక్సిన్ వేయించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నోడల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ బారినపడిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆసుపత్రులలో బెడ్లు కేటాయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన పాత్రికేయులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని జిల్లాల్లోని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులకు అందజేయాల్సిందిగా కమిషనర్ తెలియజేశారు. చదవండి: ఎవరి కోసం చేశారు?.. దేవినేని ఉమాపై సీఐడీ ప్రశ్నల వర్షం ఏపీ: కోవిడ్ చికిత్సకు మరింత ఇద్దాం.. -
రాకేశ్వర్ సింగ్ విడుదల.. 100కి.మీకు పైగా బైకుపై
సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి–కొత్తగూడెం: మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాను రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు. అతన్ని విడిపించేందుకు మధ్యవర్తులు, విలేకరులు దండకారణ్యంలోకి 100 కిలోమీటర్లకుపైగా బైకుపై ప్రయాణించాల్సి వచ్చింది. ఆద్యంతం సినీఫక్కీలో జరిగిన ఈ ప్రత్యేక చర్చల ప్రక్రియ ఎట్టకేలకు సఫలం కావడంతో ఆరురోజుల తర్వాత రాకేశ్వర్ సింగ్ చెరవీడాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మావోలకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మంగళవారం నాటికే సానుకూల సంకేతాలు పంపింది. కానీ అదే సమయంలో రాకేశ్వర్ క్షేమంపై ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అయితే కేంద్రం హామీలపై సంతృప్తి చెందిన నేపథ్యంలోనే మావోలు బుధవారం రాకేశ్వర్ సింగ్ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సందేశం మావోయిస్టులకు తెలియజేయడానికి నమ్మకస్తులు, తటస్థులైన ధర్మపాల్ షైనీ, తెల్లం బోరయ్యలను ఎంపిక చేసుకున్నాయి. జర్నలిస్టులకు ముందే సమాచారం: జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులు బుధవారమే మధ్యవర్తులతో పాటు ఏడుగురు విలేకరులకు అర్ధరాత్రి దాటాక ఫోన్ చేస్తామని చెప్పి ఉంచారు. అదే ప్రకారం గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇద్దరు మధ్యవర్తులను తీసుకుని బీజాపూర్ నుంచి బైకులపై బయ ల్దేరాలని జర్నలిస్టులకు సూచించారు. దీంతో మొత్తం 9 మంది అటవీమార్గాన దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్కౌంటర్ జరిగిన జొన్నగూడ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ.. వారి వెంట ఎవరూ ఫాలో కాలేదని మావోలు నిర్ధారించుకున్నారు. అక్కడి నుంచి లోపలికి మరో 15 కిలోమీటర్లు ఫోన్లో సూచనలు ఇస్తూ పిలిపించుకున్నారు. మొత్తానికి ఉదయం 9.30 గంటలకు దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రాకేశ్వర్‌ను బంధించిన చోటుకు వీరంతా చేరుకున్నారు. అక్కడ వారికి కోడి, టమాట కూరలు, చపాతీలతో భోజనం పెట్టారు. మధ్యవర్తులతో మావోయిస్టులు ఏకాంతంగా గంటసేపు మాట్లాడారు. జొన్నగూడకు 40 మంది మావోయిస్టులు మధ్యాహ్నం 12 దాటగానే మధ్యవర్తులు, జర్నలిస్టులు జొన్నగూడ వైపు బయల్దేరారు. రాకేశ్వర్ సింగ్‌తో పాటు 40 మంది మావోయిస్టులు వారిని అనుసరిస్తూ వచ్చారు. తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని జొన్నగూలో ఏర్పాటు చేసిన ప్రజాకోర్టులో అందరిముందు రాకేశ్వర్ తాళ్లు విప్పి బంధ విముక్తుణ్ణి చేసిన మావోయిస్టులు అతన్ని మధ్యవర్తులకు అప్పగించారు. మావోయిస్టులు తమను బాగా చూసుకున్నారని, ఎక్కడా బెదిరింపులకు పాల్పడటం కానీ, దురుసుగా ప్రవర్తించటం కానీ చేయలేదని చర్చల్లో పాల్గొన్న ముఖేశ్ చంద్రాకర్ ‘సాక్షి’కి వివరించారు. చదవండి: (రాకేశ్వర్‌సింగ్ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?) -
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌పై కేసు
లక్నో: జర్నలిస్టులపై దాడి చేశారన్న ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొరాదాబాద్ జిల్లా పఖ్వారా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఓ విలేకరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11వ తేదీన ఓ హోటల్లో అఖిలేశ్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు పలు ప్రశ్నలు సంధిం చారు. దీనిపై అఖిలేశ్ అసహనం వ్యక్తం చేశారు. అఖిలేశ్ ఉసిగొల్పడంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అనుచరులు విలేకరులపై దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు విలేకరులు గాయపడ్డారని బాధితుడొకరు పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.