సాక్షి, విజయవాడ: ప్రభుత్వ పథకాల కోసం సమగ్రమైన వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇది ప్రభుత్వానికి, జర్నలిస్టులకు వారధిలా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని.. ఆన్‌లైన్‌లో శిక్షణకు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు.
‘‘జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించే బాధ్యత అకాడమీ చేపట్టింది. అకాడమీ పుస్తకాలు కూడా రాయించాం. వాటిని పీడీఎఫ్ రూపంలో అందుబాటులోకి తెచ్చాం. కొత్తగా జర్నలిజంలోకి ప్రవేశించిన వారికి యూనివర్సిటీలో కోర్సులు స్పాన్సర్ చేస్తున్నాం. దీనికోసం మూడు యూనివర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకున్నామన్నారు. కోర్సు చేసిన వారితో ఇంటర్నషిప్ కూడా చేయిస్తాం. అకాడమీ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాం. గ్రామీణ జీవనం, సమాజం, సమస్యలపై రాసిన కథనాలపై ఉత్తమ కథనాలకు అవార్డులు ఇస్తాం. సాంకేతిక అంశాలపై కూడా శిక్షణ తరగతులు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. బిజినెస్, స్పోర్ట్స్ అంశాలపై కూడా శిక్షణ ఇప్పిస్తాం. నైతిక విలువలు కలిగిన రచనలు చేసినప్పుడే సంపూర్ణ జర్నలిస్టులుగా నిలుస్తామని’’ దేవిరెడ్డి శ్రీనాథ్ పేర్కొన్నారు.
చదవండి:
సురక్షిత తాగునీటి సరఫరాలో ఏపీ భేష్
సీఎం జగన్‌పై తప్పుడు కథనాలా.. అర్నాబ్ జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment