Press Academy chairman
-
ఏపీ మీడియా అకాడమీకి కొమ్మినేని రాజీనామా
విజయవాడ, సాక్షి: సీఆర్ ఏపీ మీడియా అకాడమీ(సీ రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ) చైర్మన్ పదవికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చారాయన. తనపై నమ్మకంతో మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమించి.. పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారాయన. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు.. 2022 నవంబర్ 10వ తేదీన ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ 13 నెలల 15 రోజులు కాలంలో వర్కింగ్ జర్నలిస్టుల కోసం పలుకార్యక్రమాలు చేయగలగడం సంతృప్తినిచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారాయన. అయితే.. ఈ నెల 16 వరకు సంక్రాంతి నేపథ్యంలో సెలవులు ఉండడంతో.. 17 వ తేదీ నుంచి తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఇక సీఆర్ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ హోదాలో అందించిన సేవల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రామీణ, పట్టణ జర్నలిస్టులు, జర్నలిజం పై అభిరుచి కలిగిన వ్యక్తుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో "జర్నలిజం లో డిప్లమో" కోర్సును నాగార్జున యూనివర్సిటీ సహకారంతో పూర్తి చేయడం తమకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయంగా చెప్పారాయన. అదేవిధంగా, డిప్లమో కోర్సు తో పాటుగా, ప్రతి శనివారం వర్కింగ్ జర్నలిస్టులకోసం సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాల పై ఆన్ లైన్ శిక్షణ తరగతులు నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగామని ఆయన పేర్కొన్నారు. అనంతపురం నుంచి ఉద్దానం (శ్రీకాకుళం జిల్లా) వరకు జరిపిన పర్యటనల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోజెక్టుల అభివృద్ధిని, ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం వంటి అభివృద్ధిని స్వయంగా పరిశీలించి ప్రజలకు మీడియా ద్వారా వివరించగలిగామని ఆయన తెలిపారు. ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియాను కూడా సమాచార చేరవేతలో భాగస్వామిని చేయగలిగామన్నారు. తమ పదవీ కాలంలో సహకరించిన మీడియా మిత్రులందరికీ, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆ ప్రకటనలో కొమ్మినేని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. -
అంత సీన్ లేదు.. అదంతా జాకీలు పెట్టి లేపే యవ్వారం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ను ఒక మహా నేతగా చూపించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా చాలా శ్రమిస్తున్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలని అనుకోవడం తప్పుకాదు. అందుకోసం కృషి చేయవచ్చు. అలాగే లోకేష్ కూడా వృద్ది చెందవచ్చు. కాని గత పదేళ్ల రాజకీయంలో ఆయన ఇంకా తండ్రిచాటు బిడ్డగా ఉన్నాడన్నది వాస్తవం. తెలిసి, తెలియక అనేక విషయాలలో తడబడుతున్నారన్నది నిజం. దీనినీ ఆక్షేపించనవసరం లేదు. కాని లేని బలాన్ని ఉన్నట్లుగా చూపించడం ద్వారా ఒక మహా నాయకుడు మీడియా ద్వారానే తయారైనట్లుగా చిత్రీంచడం వల్ల లోకేష్ కే నష్టం కలుగుతుంది. ✍️ముందుగా ఆయన చిత్తశుద్దితో విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. లేకుంటే కుండలమ్ముకునే వ్యక్తి కలగన్నట్లుగా ఉంటుంది. ఈ కథ లోకేష్ మాత్రమే అంతా తెలుసుకోవాలి. కుండలు తయారు చేసే ఒక వ్యక్తి తన కుండలను కాళ్ల దగ్గరపెట్టుకుని నిద్రించాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది.తన కుండలన్నీ అమ్ముడిపోయినట్లు, ఆ తర్వాత ఆ డబ్బుతో ఆయనేదో ఇంకేదో కొన్నట్లు, శ్రీమంతుడు అయిపోయినట్లు కలగన్నాడట.ఆ ఆనందంలో ఒక్కసారిగా కాళ్లు ఝాడిస్తే అక్కడ ఉన్న కుండలన్ని పగిలిపోయి అసలుకు మోసం వచ్చిందట. ఈ కధలో నీతి ఏమిటి? పగటి కలలు కంటే నష్టపోతారని చెప్పడమే. లోకేష్ అలా కలలు కుంటున్నాడో లేదో కాని, ఎల్లో మీడియాగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి ఆయనకు ఊదరగొడుతున్న తీరు ఆయనను కలలోకి తీసుకువెళుతున్నట్లుగా ఉంది. ✍️ఇందులో లోకేష్ కు,టీడీపీకి వచ్చే ప్రయోజనం కన్నా ఆ మీడియాకే ఎక్కువగా వ్యాపార పరంగా ప్రయోజనం దక్కుతుండవచ్చు.అది వేరే సంగతి.లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ ఎల్లో మీడియా భారీ ఎత్తున లోకేష్ ఇంటర్వ్యూలు ఇచ్చాయి. మొదటి పేజీలో, అలాగే లోపల మరో ఫుల్ పేజీ ఇందుకు కేటాయించాయంటే వారు ఎంతగా లోకేష్ కోసం పాటు పడుతున్నది తెలుస్తుంది. ఇంతకీ లోకేష్ కు టిడిపిలో పాత్ర ఏమిటి?ఇదే ప్రశ్న కూడా వేస్తే దానికి ఆయన తన తండ్రి చంద్రబాబు నిర్ణయించాలని చెప్పేశారు.పాత్రేమిటో తెలియకుండా అసలు పాదయాత్ర ఎందుకు చేసినట్లు?ఇన్నివేల హామీలు ఎలా ఇచ్చినట్లు?తాను ముఖ్యమంత్రి అయిపోయినట్లు, అన్ని విధాన నిర్ణయాలే తీసుకోబోతున్నట్లు ఎక్కువ సార్లు హామీలు ఇస్తున్నారే. ✍️ఏదోమొహమాటానికి ఎప్పుడైనా ఒకటి,అరాసారి మాత్రం చంద్రబాబు పేరు చెబుతున్నారు కాని, మొత్తం టిడిపి అంతా తన చేతిలోనే ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారే.అంటే అదంతా ఉత్తిత్తుదేనని అనుకోవాలా?ఎవరైనా ప్రజలు అడిగే సమస్యలను ఏదైనా ఒక పుస్తకంలో రాసుకుంటారు.వారికి ఇచ్చే హామీలను రాసుకుంటారు.కాని లోకేష్ మాత్రం రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకుని తాము అధికారంలోకి ఎవరెవరిని జైలులో పెట్టాలో రాసుకున్నారట.అంటే ఎవరు తమ పార్టీని వ్యతిరేకిస్తే వారందరి పేర్లు రాసి వారిని వేధిస్తారా?ఇందుకోసమేనా వారికి అధికారం ఇవ్వవలసింది?చంద్రబాబు ఊరుకున్నా ఈయన ఒప్పుకోడట.అందుకే కొందరు దీనిని ఎర్ర పుస్తకం కాదు..ఎర్రి పుస్తకం అని ఎద్దేవ చేస్తున్నారు.లోకేష్ కు జాకీలు పెట్టి లేపుతూ చేసిన ఈ ఇంటర్వ్యూ మొత్తం చదివితే ఇంతకీ ఈయన ఏమి చెప్పదలచుకుంది అర్ధం కాలేదు. ✍️ప్రజలకు టీడీపీ ఇచ్చిన గ్యారంటీలు ఎలా అమలు చేయగలుగుతారన్నదానిపై ఎల్లో మీడియా రిపోర్టర్లు అడగలేదు. ఈయన చెప్పలేదు. ఎందుకంటే మాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ కాబట్టి లోకేష్ చెప్పలేరనో, లేక అనవసరంగా ఆ గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కానివని బయటపడిపోతుందనో వీరు వాటికి సంభంధించిన ప్రశ్నల జోలికి వెళ్లినట్లు అనిపించలేదు. జగన్ ప్రభుత్వం ఏవేవో తప్పులు చేసిందని, పాలనను గాడిలో పెడతామని ఆయన చెబుతున్నారు. నిజంగానే చంద్రబాబు,లోకేష్‌ల పాలన బాగుంటే 2019లో ఎందుకు అంత ఘోరంగా ఓడిస్తారు? ఈ ప్రశ్నను అడగరనుకోండి. పోనీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న వివిద నిర్ణయాలు,అమలుచేసిన స్కీముల గురించి ఏమైనా చెప్పారా అని చూస్తే అదేమీ కనిపించలేదు. ✍️జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ స్కీముల వల్ల రాష్ట్రం నాశనం అయిందని టీడీపీ ప్రచారం చేస్తోంది కదా! అంతకుమించి ఐదు రెట్లు అధికంగా సంక్షేమానికి ఎలా ఖర్చు చేస్తామని టిడిపి నేతలు చెబుతున్నారో ఎల్లో మీడియా అడగలేదు. లోకేష్ జవాబు ఇవ్వలేదు. జగన్ తీసుకు వచ్చిన వలంటర్ల వ్యవస్థను ఉంచుతారా?తీసివేస్తారా?గ్రామ,వార్డు సచివాలయాలను కొనసాగిస్తారా?లేదా?రైతు భరోసా కేంద్రాలను ఎత్తివేస్తారా?గ్రామీణ క్లినిక్స్ ను నిలిపివేస్తారా?జగన్ ప్రభుత్వం మొదలుపెట్టింది కనుక ఓడరేవుల నిర్మాణం ఆపేస్తారా?ఫిషింగ్ హార్బర్స్ ను అనవసరం అని అంటారా? విశాఖలో కడుతున్న ఐటి టవర్ ను అక్కర్లేదంటారా?డేటా సెంటర్ కు అంత భూమి ఇవ్వబోమని చెబుతారా?రామాయ పట్నం పోర్టు వద్ద అరవైవేల కోట్ల రూపాయల పరిశ్రమ అక్కర్లేదని చెబుతారా?అసలు పాలన ఎక్కడ గాడి తప్పింది? ఏమి దారిలో పెడతారు?అసలు గాడి తప్పింది.. దారి తప్పింది టీడీపీ, ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు ,లోకేష్ లు అని వైసిపి నేతలు విమర్శిస్తుంటారు. ✍️ ఒక్క వాక్ చేయడం తప్ప, లోకేష్ సాధించింది ఏమి ఉందని వారు అంటుంటారు.ప్రత్యర్ధి పార్టీ కనుక వారు అలా అనవచ్చు. కాని టిడిపి క్యాడర్ కు అయినా ఈ యాత్ర విశ్వాసం కలిగించిందా? తన తండ్రి అవినీతి కేసులో చిక్కుకుని అరెస్టు అయి ఉంటే ఈయన పాదయాత్ర ఆపేసి ఢిల్లీ ఎందుకు వెళ్లిపోయారో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు?స్కిల్ స్కామ్ కేసులో ఎంతసేపు కక్ష అని ప్రచారం చేయడమే తప్ప, సిఐడి అడిగే నిర్దిష్ట ప్రశ్నలకు ఎందుకు బదులు ఇవ్వరు?ఈయన అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలు ఇస్తామని, పరిశ్రమలను తీసుకు వస్తామని చెబితే జనం కావమ్మ మొగుడు కాబోలు అన్నట్లు జనం నమ్మేస్తారనా వీరి అభిప్రాయం. ✍️ఎపికి ఆ ఐదేళ్లలో ఒక్క కియా తప్ప,మరో పరిశ్రమను వారు అప్పట్లో ఎందుకు తీసుకు రాలేకపోయారు? హైదరాబాద్ అంతా తామే అభివృద్ది చేసేశామని ప్రచారం చేసుకునే వీరు అక్కడ ఉన్న పెద్ద ఐటి పరిశ్రమలలో ఒక్కటైనా ఎపికి తమ టరమ్ లో ఎందుకు తేలకపోయారు?పాత మద్యం విధానాన్నీ తీసుకు వస్తామని లోకేష్ చేసిన ప్రకటనను చంద్రబాబు అంగీకరిస్తారా?అంటే దీని అర్ధం మళ్లీ భారీ ఎత్తున మద్యం షాపులు ఎక్కడబడితే వస్తాయని చెబుతున్నారా?వాటికి అనుబంధంగా బెల్ట్ షాపులుకూడా ఆరంభం అవుతాయని లోకేష్ ప్రకటిస్తున్నారా?ఇసుక విధానం కూడా మార్చుతారాట.అంటే తిరిగి టిడిపి నేతలకే ఇసుక రీచ్ లు ఇచ్చి ప్రజల నుంచి డబ్బు గుంజుకుంటారా?జగన్ ప్రభుత్వం వచ్చాక మొదట కొద్ది నెలలు ఇసుక విషయంలో కొద్దిగా ఇబ్బంది వచ్చినా, ఆ తర్వాత పుష్కలంగా ఇసుక లబిస్తోంది. ✍️ ఎపిలో ఎటు వెళ్లినా ఆయా చోట్ల ఇసుక మేటలు కనిపిస్తుంటాయి. అక్కడ నుంచి ప్రజల ఇళ్లవద్దకే ఇసుకను సరఫరా చేస్తున్న విధానాన్ని రద్దు చేస్తారా?ఐదేళ్లలో ప్రజలపై ఈ ప్రభుత్వం విపరీతమైన భారం మోపిందట. వాటన్నిటిని టిడిపి అధికారంలోకి వస్తే తీసేస్తారట.ఇవన్ని రొడ్డ కొట్టుడు మాటలు తప్ప ఇంకొకటి కాదు. తెలంగాణలో డబ్బుతో ఎన్నికలు గెలవడం సాధ్యం కాదని తేలిందట. అంటే బిఆర్ఎస్ డబ్బు ఖర్చు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేదని లోకేష్ సర్టిఫికెట్ ఇస్తున్నారా?నెలరోజుల్లోనే అభ్యర్ధుల ఎంపిక పూర్తి అవుతుందని చెబుతున్నారు? ఇంతకీ జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారో ఎందుకు చెప్పలేదు. ✍️ అసలు జనసేన పొత్తు గురించిన ప్రస్తావన ఎందుకు చేయలేదు. ఒకవేళ టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబా? పవన్ కళ్యాణా? లేక లోకేషా?ఒక పక్క తాను సీఎం సీటు కోసం పాదయాత్ర చేయలేదని చెబుతూనే అంతకంటే ఎక్కువగా హామీలు ఇవ్వడంలో ,ప్రకటనలు చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి?పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్ది అని ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? ఎల్లో మీడియా ఎందుకు అడగడం లేదు. అంటే దాని అర్ధం పవన్ ను కరివేపాకు మాదిరి వాడుకుని వదలివేయడం కాదా? ఇంత పెద్ద ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావనే తీసుకురాలేదంటే ఆయనపై వీరికి ఎంత చులకన భావం ఉందో అర్ధం కావడం లేదా? -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘ఏపీలో ఉన్నంత మీడియా స్వేచ్ఛ మరే రాష్ట్రంలోనూ లేదు’
సాక్షి, నంద్యాల జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత "మీడియా స్వేచ్ఛ" మారే రాష్ట్రంలోనూ లేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైలంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ రాష్ట్రంలోనే ముఖ్య మంత్రిని గంజాయి మొక్కతో పోల్చి దుర్మార్గంగా, ఇష్టారాజ్యంగా కథనాలు వ్రాయడం, ప్రచురించడం జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గం మీడియా ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నా వారినెవరూ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే, మన రాష్ట్రం లో పత్రికా స్వేచ్ఛ వాస్తవ రూపంలో వున్న విషయం అందరం గుర్తించగలమని కొమ్మినేని పేర్కొన్నారు. చదవండి: ‘రామోజీ’ రహస్యాలు.. మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తాయా? -
ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి స్వర్గస్తులయ్యారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రికల్లో ఉన్నత హోదాలో పని చేశారు. శ్రీనాథ్‌రెడ్డి చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో పదవ తరగతి వరకు చదివారు. అనంతరం తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ అభ్యసించారు. అనంతరం పాత్రికేయ రంగంలో అడుగు పెట్టారు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాథ్ రెడ్డి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. ప్రారంభంలో తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. అనంతరం కొన్ని ఆంగ్ల పత్రికల్లో చాలాకాలం పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేసిన శ్రీనాథ్ రెడ్డి.. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. జాప్ నివాళి.. అమరావతి, మార్చి 22: శ్రీనాథ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నివాళులు అర్పించింది. జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం డీ వీ ఎస్ ఆర్ పున్నం రాజు, ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా కడప, హైదరాబాద్‌లలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి మీడియాలో జర్నలిస్ట్ గా వుండి సేవలందించారని వారు కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక శ్రీనాథ్ రెడ్డి.. సి.వి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్‌గా సేవలందించి పాత్రికేయులకు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. -
అనారోగ్యంతో కన్నుమూసిన ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్
కడప సెవెన్‌రోడ్స్ : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్, సీనియర్ పాత్రికేయుడు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి మరణం అటు పత్రికా రంగానికి, ఇటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పలువురు పేర్కొన్నారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న శ్రీనాథ్‌రెడ్డి బుధవారం హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల్లో ఒకరు అమెరికా, మరొకరు బ్రిటన్‌లో ఉన్నారు. ఆయన తల్లి సావిత్రమ్మ కోవరంగుట్టపల్లె సర్పంచుగా పనిచేశారు. తండ్రి ద్వారకనాథరెడ్డి తాడిపత్రిలో కళాశాల నిర్వహిస్తున్నారు. మద్రాసు ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూలులో 10వ తరగతి అభ్యసించారు. తిరుపతిలోని ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకాం చదివారు. ధర్మవరానికి చెందిన మాజీమంత్రి నాగిరెడ్డి సోదరిని వివాహం చేసుకున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి, వేంపల్లె సతీష్‌రెడ్డి సమీప బంధువులే. విదేశాల్లో ఉన్న కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ జరపాలో నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. పత్రికారంగంలో.. శ్రీనాథ్‌రెడ్డి చాలాకాలంగా కడప ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బీబీసీ, హైదరాబాదులోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ విధులు నిర్వర్తించారు. కడపలో పనిచేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా సుమారు రెండున్నర శతాబ్దం పనిచేసి జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడారు. కడప రామాంజనేయపురంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత ఆయనదే. కడప ప్రెస్‌క్లబ్ ఆయన చొరవతోనే ఏర్పాటైంది. ఆనాటి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు శ్రీనాథ్‌రెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. ‘సీమ’ ఉద్యమంలో.. రాయలసీమ ఉద్యమంలో శ్రీనాథ్‌రెడ్డి ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆనాటి ఉద్యమ నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి, డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, డాక్టర్ ఎంవీ రమణారెడ్డి, సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో ఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పత్రికా రంగంలో కొనసాగుతూనే ప్రత్యక్షంగా ‘సీమ’ ఉద్యమంలో పాల్గొన్నారు. కడపలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం ఆయన హయాంలో నిత్యం రాయలసీమ ఉద్యమ కారులు, రాజకీయ నాయకులతో కిటకిటలాడుతూ ఉండేది. ఇప్పటి కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని రాయలసీమ ఉద్యమంలోకి ఆహ్వానించి రాయలసీమ యువ పోరాట సమితి ఏర్పాటు చేయించారు. ప్రెస్ అకాడమి చైర్మన్‌గా.. సుమారు 40 ఏళ్లకు పైబడి పాత్రికేయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనాథ్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు తగిన గౌరవం కల్పించారు. ఈ ఐదేళ్లలో రెండుసార్లు ప్రెస్ అకాడమి చైర్మన్‌గా కొనసాగిన ఘనత శ్రీనాథ్రెడ్డికే దక్కింది. పలువురి సంతాపం శ్రీనాథ్‌రెడ్డి మృతి పట్ల జిల్లాకు చెందిన పలువురు పా త్రికేయులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర సంతా పం వ్యక్తం చేశారు. రాయ లసీమ సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వంటి డిమాండ్లతో సాగిన ఉద్యమంలో ఆయన ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నారని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన మరణం పాత్రికేయ రంగానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీనియర్ జర్నలిస్టు పమిడికాల్వ మధుసూదన్ పేర్కొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన ప్రెస్‌అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన కొమ్మినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన.. సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కొమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. 'దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి పైకి వచ్చాను. నాపట్ల గౌరవంతో ప్రెస్ అకాడమీ ఛైర్మెన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. జగన్ రాజకీయాల్లో సీఎంగా, ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించారు. నాకు అప్పగించిన బాధ్యతలపట్ల చిత్తశుద్ధితో ప్రెస్ అకాడమీ అభివృద్ధికి కృషి చేస్తాను' అని కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. చదవండి: (ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. విగ్రహం మార్పుపై వైవీయూ వీసీ క్లారిటీ) -
ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొమ్మినేని
సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా గురవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాణిక్యవరప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతిలు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొమ్మినేని కొనసాగనున్నారు. -
ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. జర్నలిజంలో దిట్ట కొమ్మినేని కృష్ణా జిల్లా గన్నవరంలో పుట్టి పెరిగిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978లో జర్నలిజంలో ప్రవేశించారు. పాత్రికేయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు వివిధ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 1978లో ఈనాడు పత్రికలో చేరిన కొమ్మినేని శ్రీనివాసరావు.. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, న్యూఢిల్లీలో రిపోర్టింగ్ బాధ్యతలు నిర్వహించారు. 2002 ఆగస్టు నుంచి ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్‌గా పని చేశారు. 2007 జనవరి నుంచి NTVలో చీఫ్ ఎడిటర్‌గా, 2007 సెప్టెంబర్ నుంచి TV5లో ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత కొన్నాళ్లుగా సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రచనలో మేటి రాష్ట్రంలో రాజకీయం పేరిట కొన్నాళ్లు పొలిటికల్ కాలమ్ రాసిన కొమ్మినేని శ్రీనివాసరావు.. నిఖార్సయిన ఆర్టికల్స్ రాయడంలో దిట్ట. తాజాకలం పేరుతో చాలా కాలం పాటు రాజకీయ వ్యాసాలు రాశారు. పాత్రికేయ పర్యటనలు పాత్రికేయుడిగా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న కొమ్మినేని శ్రీనివాసరావు.. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన వెంట నెదర్లాండ్స్ వెళ్లి వచ్చారు. అలాగే అమెరికా, బ్రిటన్, చైనా, సింగపూర్ తదితర దేశాల్లో వేర్వేరు సందర్భాల్లో పర్యటించారు. విదేశీ పర్యటనలకు సంబంధించి ఆంధ్రా టు అమెరికా పుస్తకాన్ని రూపొందించారు. పరిశోధనే జీవితం తెలుగు రాజకీయాలపై కొమ్మినేని శ్రీనివాసరావు విస్తృతమైన పరిశోధన చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్‌పై కొమ్మినేని శ్రీనివాసరావు "ప్రాంతీయ ఉద్యమాలు-పదవీ రాజకీయాలు" పుస్తకాన్ని రాశారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత "తెలంగాణ ఆవిర్భావం- పాత్రధారులు, సూత్రధారులు" పుస్తకాన్ని రచించారు. కొమ్మినేని కలం "ప్రజా తీర్పు" పేరిట ఆయన రచించిన పుస్తకాలు ఎన్నో కీలకమైన అంశాలను తెరమీదికి తెచ్చాయి. విభజన అనంతరం "ఆంధ్రప్రదేశ్ ప్రజాతీర్పు", "తెలంగాణ ప్రజాతీర్పు" పేరుతో మరింత సమాచారాన్ని జోడించారు. 2002 నుంచి ప్రతీ ఎన్నికల తర్వాత వివిధ అంశాలతో పుస్తకాన్ని తెస్తున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. అలాగే 2019 ఎన్నికల తర్వాత "శాసన సభ్యులు - సామాజిక విశ్లేషణ" పుస్తకాన్ని రచించారు. తెలుగు రాజకీయాలపై కొమ్మినేనికి ఉన్నంత సాధికారిక పట్టు అద్భుతమైనది. నాలుగు దశాబ్దాల రాజకీయ నాయకులందరూ గుర్తు పట్టగలిగి పలకరించే అతికొద్ది మంది జర్నలిస్టుల్లో కొమ్మినేని ఒకరు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ముక్కుసూటిగా వ్యవహరించడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, నిజాయతీగా వ్యవహరించడం కొమ్మినేని శ్రీనివాసరావు అనుసరించిన విధానం. నిబద్దత గల పాత్రికేయుడిగా ఎన్నో గుర్తింపులు పొందిన కొమ్మినేని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ ఆకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. -
జర్నలిజంలో సర్టిఫికెట్ కోర్సు
సాక్షి, అమరావతి/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జర్నలిస్టులకు ఉపయుక్తంగా మూడు నెలల కాల పరిమితితో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. యూజీసీ నిబంధనలను అనుసరించి ప్రెస్ అకాడమీ సొంతంగా నాలుగు సబ్జెక్టులతో కోర్సు రూపొందించినట్టు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ఉత్తీర్ణులై కోర్సులో చేరే జర్నలిస్టులకు 50 శాతం ఫీజు రాయితీతో కేవలం రూ.1500 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంపై ఆసక్తి ఉన్న యువత కూడా పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందొచ్చన్నారు. అనంతరం కోర్సు బ్రోచర్‌ను విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం(నేటి) నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రెస్‌అకాడమీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచినట్టు శ్రీనాథ్ వివరించారు. విక్రమసింహపురి వర్సిటీ రిజిస్ట్రార్ విజయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించి, డిసెంబర్ మొదటి వారంలో తుది పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 91541 04393 నంబర్‌ను, pressacademycontact@gmail.comను సంప్రదించాలని సూచించారు. -
ప్రభుత్వ పథకాల కోసం సమగ్ర వెబ్సైట్: దేవిరెడ్డి
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ పథకాల కోసం సమగ్రమైన వెబ్సైట్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇది ప్రభుత్వానికి, జర్నలిస్టులకు వారధిలా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని.. ఆన్లైన్లో శిక్షణకు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. ‘‘జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించే బాధ్యత అకాడమీ చేపట్టింది. అకాడమీ పుస్తకాలు కూడా రాయించాం. వాటిని పీడీఎఫ్ రూపంలో అందుబాటులోకి తెచ్చాం. కొత్తగా జర్నలిజంలోకి ప్రవేశించిన వారికి యూనివర్సిటీలో కోర్సులు స్పాన్సర్ చేస్తున్నాం. దీనికోసం మూడు యూనివర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకున్నామన్నారు. కోర్సు చేసిన వారితో ఇంటర్నషిప్ కూడా చేయిస్తాం. అకాడమీ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాం. గ్రామీణ జీవనం, సమాజం, సమస్యలపై రాసిన కథనాలపై ఉత్తమ కథనాలకు అవార్డులు ఇస్తాం. సాంకేతిక అంశాలపై కూడా శిక్షణ తరగతులు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. బిజినెస్, స్పోర్ట్స్ అంశాలపై కూడా శిక్షణ ఇప్పిస్తాం. నైతిక విలువలు కలిగిన రచనలు చేసినప్పుడే సంపూర్ణ జర్నలిస్టులుగా నిలుస్తామని’’ దేవిరెడ్డి శ్రీనాథ్ పేర్కొన్నారు. చదవండి: సురక్షిత తాగునీటి సరఫరాలో ఏపీ భేష్ సీఎం జగన్‌పై తప్పుడు కథనాలా.. అర్నాబ్ జాగ్రత్త -
ప్రతి జర్నలిస్ట్ వెనుక ప్రెస్ అకాడెమీ ఉంటుంది..
సాక్షి, విజయవాడ: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో శిక్షణ ఇస్తాం. గ్రామీణ, డెస్క్ విలేకరులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. జర్నలిస్టులు ఎన్నో విధాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ సమయంలో కష్టపడి పని చేసినా ఫలితం లేదనే భావన ఉంది. ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నాం.. త్వరలో మంచి జరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారు. శిక్షణ కోసం అనేక ప్లాట్ ఫామ్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. అన్ని శాఖలను ఒక చోట చేర్చి సమాచారం అందించేలా చర్యలు చేపడుతున్నాం. కోవిడ్ సమయంలో మీటింగులు పెట్టే అవకాశం లేదు. అందుకే ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తొలుత విశాఖ నుంచి ప్రారంభిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా శిక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడెమీ కృషి చేస్తుంది. వారి శిక్షణ కోసం యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. జర్నలిస్టులందరూ ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. (తీపి కబురు: త్వరలో డీఎస్సీ) ఫేక్ న్యూస్ నిమిషాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతోంది. అటువంటి వార్తల పట్ల ఎలా అప్రమత్తత ఉండాలో కూడా శిక్షణలో భాగంగా ఉంటుంది. సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వెళ్లేలా కూడా బాధ్యత తీసుకుంటున్నాం. వర్కింగ్ జర్నలిస్టులు జర్నలిజంలో ఏదయినా కోర్స్ చేయాలి అనుకుంటే ప్రెస్ అకాడమీ సహకరిస్తుంది. ప్రతి జర్నలిస్ట్ వెనుక ప్రెస్ అకాడెమీ ఉంటుందని గుర్తుంచుకోండి' అని దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. -
జర్నలిస్టులు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పని చేస్తున్నారు
-
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొన్న దేవిరెడ్డి
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి జిల్లాలోని మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శనివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి కుటుంబసభ్యులు పుట్టలో పాలు పోసి తమ మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని కూడా దర్శించుకున్నారు. -
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
-
పొత్తూరి కన్నుమూత : సీఎం జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి.. పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. ప్రముఖ పత్రికల్లో విధులు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. పీవీ గురించి రాసిన ‘ఇయర్ ఆఫ్ పవర్’కు సహ రచయితగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. కాగా పొత్తూరి వెంకటేశ్వరావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువరానిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వర రావు.. తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శప్రాయులు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పని చేసిన ఆయన.. ఎందరో పాత్రికేయులను తీర్చిదిద్దారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: విజయసాయిరెడ్డి ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా... తెలుగు పత్రికా రంగానికి అయిదు దశాబ్దాల పాటు ఆయన అందించిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మా గురువు ఆయన.. పొత్తూరి వెంకటేశ్వర్ రావు మా గురువు. పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. భావప్రకటన స్వేచ్ఛ కోసం నిబద్ధతగా పని చేశారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా పత్రికలను నడపాలన్నారు. ప్రజలకు పత్రికలు సేవలందించాలని దృఢంగా కోరుకున్నారు. వృద్ధాప్యంలో కూడా అడవుల్లో నడిచి నక్సలైట్లతో చర్చలు జరిపారు - దేవుళపల్లి అమర్, సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పొత్తూరి మృతికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రప్రభ మాజీ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్ధనరెడ్డి మాట్లాడుతూ పొత్తూరి వెంకటేశ్వరరావు జర్నలిజానికి వెన్నెముక లాంటి వారన్నారు. ఆయన మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటన్నారు. తెలుగు జర్నలిజం పెద్దదిక్కును కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. -
ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కు కేబినెట్ హోదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైనదేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్ పాత్రికేయుడైన దేవిరెడ్డి శ్రీనాథ్‌ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబరు 8న ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదివారం జీఓ జారీ చేశారు. కాగా.. నవంబర్ 21న ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. చదవండి: ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీనాథ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహిత జర్నలిస్టు కూడా. ( దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ) -
జర్నలిస్టులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్) : జర్నలిస్టులు నిష్పాక్షికత, సత్యసంధత, నైతికత అనే మూడు విలువలు పాటించాలని, యధార్థంగా సమాజంలోని మంచి చెడులపై వార్తలు రాయాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణ అధ్యక్షతన ‘జర్నలిజం–సామాజిక బాధ్యత’ అనే అంశంపై శుక్రవారం ఒకరోజు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్లం నారాయణ హాజరై మాట్లాడారు. మీడియా రంగంలో రోజురోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటిని అనుగుణంగా జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులు అనుసరించాలన్నారు. సమాజంలో ఉన్న మంచి, చెడులపై జాగ్రత్తగా వ్యవహరిస్తూ వార్తలు రాయాలన్నారు. డిజిటల్ మీడియా ద్వారా అనర్థాలు పెరిగిపోతున్నాయని, జర్నలిజం అనేది కత్తిమీద సాములాంటిదన్నారు. ఉత్తమ జర్నలిస్టులుగా ఎదగాలంటే సత్యసంధత, నిష్పాక్షికత, నైతికత ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వార్తలు రాయాలని, రాసిన వార్తలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తు చేశారు. జర్నలిజం విద్యార్థులు ముందుగా భాష, పదజాలంపై పట్టుండాలని, దీని కోసం పత్రికలు, పుస్తకాలు చదివి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. మరో అతిథి, ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం వార్తపత్రికలతో పాటు ఫేస్బుక్, వాట్సాఫ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు సమాచారం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, కానీ సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలన్నీ సత్యాలు కావని గుర్తించాలని వాటిని నిర్ధారణ చేసుకోవాలన్నారు. మనకు వచ్చిన సమాచారం సహాయంతో జరిగిన సంఘటనతోపాటు జరగబోయే అంశాలపై విశ్లేషణ చేసి వార్తలు రాయాలన్నారు. సమాజంలోని ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే శక్తి పత్రికలకు, మీడియాకు ఉంటుందని, రాజకీయ, సామాజిక ఏ పత్రిక ఎంతబలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ పత్రికలను పాఠకులను ఆకర్షిస్తాయన్నారు. టెలివిజన్, సోషల్‌మీడియా జర్నలిజంలో నూతన మార్పులు వచ్చాయన్నారు. ఉన్నది ఉన్నట్లు రాయడం కాకుండా విశ్లేషించి వార్తలు రాయాలని, ఆలోచన శక్తిని పదునుపెడితే జర్నలిజం వృత్తిలో రాణిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం కరీంగనర్ జేసీ శ్యాంప్రసాద్‌లాల్, టీయూడబ్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, జర్నలిస్టులు ప్రకాశ్‌రావు, పీఎస్.రవీంద్ర, కవి అన్నవరం దేవేందర్ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. జర్నలిజం కోర్సు కోఆర్డినేటర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, ఎన్సీసీ అధికారి పర్లపల్లి రాజు, ఎన్ఎస్ఎస్ అధికారి బి.సురేష్‌కుమార్, అద్యాపకులు, విద్యార్థులు, వివిధ ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు. -
దూకుడు తగ్గించుకో..
ఏఎస్పీకి కలెక్టర్, ఎస్పీ క్లాస్ విశ్వజిత్ తీరుపై సీఎం కార్యాలయం ఆరా డీజీపీకి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఫిర్యాదు వరంగల్ : మేడారం జాతరలో వివాదాస్పద పోలీసు అధికారిగా ముద్రపడిన ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి తీరుపై సీఎం కార్యాలయం స్పందించింది. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో అత్యవసర వైద్యసేవ లందించేందుకు వెళ్తున్న 108 వాహనాన్ని నిలిపివేసి... డ్రైవర్, వైద్యుడు, సీనియర్ జర్నలిస్ట్‌ను దారుణంగా కొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. బుధవారం జరిగిన ఈ ఘటన, ఏఎస్పీ విశ్వజిత్ పనితీరుపై సమాచారం పంపించాలని ఎస్బీ అధికారులను ఆదేశిం చింది. మరోవైపు డీజీపీ కార్యాలయం కూడా ఈ సంఘట నపై జిల్లా అధికారులను వివర ణ అడిగినట్లు తెలిసింది. ములుగు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశ్వజిత్ పనితీరు కొంత ఇబ్బందిగానే ఉందని పోలీసు వర్గాలు సమాచారం రూపొందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న మేడారం జాతర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర మంత్రులు స్వయంగా మేడారంలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ములు గు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి అస్వస్థతతో ఉన్న మహిళను తీసుకెళ్తున్న 108 వాహనాన్ని నిలిపివేసి.. ఇద్దరు ఉద్యోగులను దారుణంగా కొట్టడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో తదుపరి చర్యల కోసం సమగ్ర సమాచా రం సేకరిస్తోంది. మరోవైపు బుధవారం జరిగిన ఘటనపై రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, జిల్లా కలెక్టర్ కరుణ విశ్వజిత్ కాంపాటిని మందలించినట్లు తెలిసింది. విధి నిర్వహణలో అంకితభావం కంటే స్వీయ నియంత్రణ ముఖ్యమని సూచించినట్లు సమాచారం. దూకుడు తగ్గించుకుని ప్రజలు మెచ్చేలా పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. తొలి నుంచి వివాదాస్పదమే.. ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి వైఖరి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందనే అభిప్రాయం ములుగు ప్రాంతంలో ఉంది. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఏఎస్పీ స్వయంగా తమ ను కొట్టారని మంగపేటకు చెందిన అధికార టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. భూమి విషయంలో తమను కొట్టిన ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని మంత్రి చందులాల్‌ను కోరారు. మేడారం ఘటన నేపథ్యంలో ఈ వివరాలను కూడా సేకరిస్తున్న ట్లు తెలిసింది. విశ్వజిత్ ఓసారి లక్నవ రం సరస్సుకు వెళ్లినప్పుడు బోటింగ్ ఆలస్యమైందనే కారణంతో స్థానిక పోలీ సులు బోటింగ్ నిర్వాహకులను ఒక రోజంతా పీఎస్‌లో పెట్టి కొట్టారని ఎస్ బీ అధికారులకు సమాచారం ఉంది. ఈ అన్ని అంశాలతో ఎస్బీ విశ్వజిత్‌పై నివేదిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. కాగా, వరంగల్‌లో సీనియర్ జర్నలిస్టు పాశం యా దగిరిపై ఏఎస్పీ విశ్వజిత్ దాడి చేసిన విషయమై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆయన డీజీపీని కలిశారు. -
చిన్న పత్రికలకు అండగా నిలుస్తాం
ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పత్రికలకు అండగా నిలుస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు అల్లం నారాయణ హామీ ఇచ్చారు. శనివారం ప్రెస్ అకాడమీలో జరిగిన తెలంగాణ చిన్న, మధ్య తరహా దినపత్రికల సమస్యల చర్చా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 13న చిన్నపత్రికల సమస్యలపై సీఎంతో చర్చలు జరిపే అవకాశం ఉంద ని, ఈలోపు పత్రికాసంఘాలన్నీ ఒకేగొడుకు కిందికి రావాలని అల్లం సూచించారు.