సాక్షి, నంద్యాల జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత "మీడియా స్వేచ్ఛ" మారే రాష్ట్రంలోనూ లేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైలంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ రాష్ట్రంలోనే ముఖ్య మంత్రిని గంజాయి మొక్కతో పోల్చి దుర్మార్గంగా, ఇష్టారాజ్యంగా కథనాలు వ్రాయడం, ప్రచురించడం జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గం మీడియా ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నా వారినెవరూ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే, మన రాష్ట్రం లో పత్రికా స్వేచ్ఛ వాస్తవ రూపంలో వున్న విషయం అందరం గుర్తించగలమని కొమ్మినేని పేర్కొన్నారు.
చదవండి: ‘రామోజీ’ రహస్యాలు.. మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తాయా?
Comments
Please login to add a commentAdd a comment