Nandyal District
-
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
లింగాపురం: నంద్యాల జిల్లా లింగాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళుతున్న సమయంలోవైఎస్సార్‌సీపీకి చెందిన సుధాకర్ రెడ్డి అనే కార్యకర్తను గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపారు. సుధాకర్ రెడ్డి పొలానికి వెళుతున్న సమయంలో మాటువేసి హత్య చేశారు కొంతమంది దుండగులు. ఈ హత్యకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.ఈ కేసులో కొంతమందిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యగావించబడ్డ సుధాకర్ రెడ్డికి ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ఒక ల్యాండ్ కు సంబంధించి సుధాకర్ రెడ్డితో కొంతమందికి వైరం ఉందని, దీని వెనుక వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికిందన్నారు. దాన్ని బట్టి నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనేవైఎస్సార్‌సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డిని అతిదారుణంగా హత్య చేశారనివైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
నంద్యాల జిల్లాలో కీచక టీచర్
సాక్షి, నంద్యాల జిల్లా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, నంద్యాల జిల్లాలో కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి కీచకుడి అవతారం ఎత్తాడు. ప్యాపిలి మండలం ఏనుగుమర్రి ఉన్నత పాఠశాలలో ఘటన జరిగింది.నీలిచిత్రాలు చూడమంటూ సోషల్ టీచర్ బొజ్జన్న ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్కు తెలిసే చేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ బొజ్జన్నపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
నంద్యాలలో డయేరియాతో ముగ్గురు మృతి
-
ఆత్మకూరులో డయేరియా కలకలం.. ముగ్గురి మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో డయేరియా కలకలం రేపుతోంది. కలుషిత నీరు తాగి ఆత్మకూరు పట్టణంలో మరో వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే ఆత్మకూరు నీలితొట్టి వీధిలో కలుషిత నీరు తాగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.శనివారం రామచంద్రనాయక్ అనే వ్యక్తి కలుషిత నీరు తాగడంతో వాంతులు, విరే చనాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి బంధువులు తరలించారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక అతడు చెందాడు. కలుషిత నీరు ఘటనలో ఇప్పటికి ముగ్గురు బలి కాగా, మరికొంతమంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఆళ్లగడ్డలో హైటెన్షన్.. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వెనుక ఉన్న మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ తిష్ట వేసింది. మోహన్‌రెడ్డి నివాసంలో సాయంత్రం కార్యకర్తల సమావేశానికి రావాలంటూ అఖిల ప్రియ పిలుపు నిచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే ఏవీ సుబ్బారెడ్డికి ,అఖిల ప్రియ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే మోహరించారు. సంఘటన స్థలంలో పరిస్థితిని డీఎస్పీ ప్రమోద్ పర్యవేక్షిస్తున్నారు. -
సెల్ఫీ వీడియో.. తన చావుకు టీడీపీ నేతలే కారణమంటూ..
నంద్యాల: జిల్లాలో కూటమి నేతల అరాచకాలు ఆగడం లేదు. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్త పుల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పని చేశాననే అక్కసుతో తనను టీడీపీ నాయకులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగాడు. పుల్లయ్య పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, రామలింగారెడ్డి ఇతర టీడీపీ నాయకులు తన అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియోలో పుల్లయ్య తెలిపారు.టీడీపీ వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని.. తన చావుకు టీడీపీ నాయకులు కారణం అంటూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
నంద్యాల జిల్లాలో మిర్చి రైతు కష్టాలు
-
కిడ్నాప్ చేశారని విద్యార్థుల డ్రామా
కర్నూలు జిల్లా: పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు ఒక డ్రామా ఆడారు. తమను కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు క్షేమంగా పాఠశాలకు చేరారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ తెలిపిన వివరాలు ఇవీ.. సి.బెళగల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన నవీన్.. 7వ తరగతి బీ సెక్షన్లో చదువుతున్నాడు. అలాగే కర్నూలులోని బుధవారపేటకు చెందిన సూర్యతేజ 6వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాడు. వీరిద్దరూ అక్కాచెల్లి అయిన లక్ష్మి, సరస్వతిల పిల్లలు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక జంపాపురానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిస్తే ఇబ్బంది పడతామని.. తమను ముఖానికి ముసుగులు వేసుకున్న కొంతమంది వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి కిడ్నాప్ చేశారనే విషయం మిత్రుడు నితిన్‌కు తెలిపి పాఠశాల బయటి నుంచి పొలాల్లో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నితిన్.. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు సూర్యపతాప్సింగ్, అయ్యన్న కు తెలిపారు. దీంతో వారు వెంటనే పోలీస్‌లకు సమాచారం అందజేశారు. సోషల్ మీడియాలో ఎస్ఐ సెల్ నంబర్‌తో గురుకుల పాఠశాల ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ అంటూ కథనం హల్చల్ చేసింది. దీంతో కోడుమూరు సీఐ తబ్రేజ్ పాఠశాలకు చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ రాణెమ్మ, ఇన్చార్జ్ తహసీల్దార్ పురుషోత్తం, సి.బెళగల్ సర్పంచ్ పాండురంగన్న, ఎంఈఓ – 2 ఆదామ్‌బాషా.. పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటపడిన విద్యార్థులు.. సి.బెళగల్ గురుకుల పాఠశాల విద్యార్థులు కిడ్నాప్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అయ్యింది. మిన్నెల అనే వ్యక్తికి ఎమ్మిగనూరులో విద్యార్థులు కంటపడ్డారు. ఈ విషయాన్ని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌కు ఫోన్లో వీడియో కాల్ ద్వారా తెలియజేశారు. ఎమ్మిగనూరులో వ్యక్తిగత పనిపై వెళ్లిన సి.బెళగల్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసులు గౌడ్‌కు విషయం తెలియడంతో ఆయన ఎమ్మిగనూరు పట్టణ పోలీస్‌లకు విద్యార్థులను అప్పగించారు. అనంతరం పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థులను పోలీస్‌లు విచారించారు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక తాము పారిపోయ్యామని తెలిపారు. దీనితో సీఐ, ఎస్ఐ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పాఠశాలలో ఇవీ లోపాలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు– నేడులో భాగంగా సి.బెళగల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 20 నూతన మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే 20 పాత మరుగుదొడ్లను మరమ్మతు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం మరో 32 కొత్త మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు.. పాఠశాల ప్రాంగణం దాటి బహిర్భూమికోసం సూదూరంగా వెళ్తున్నారు. మలవిసర్జనకు పాఠశాల బయటకు వచ్చి ఇలాంటి కథలకు చోటు చేసుకుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. -
వంట చేస్తుండగా పేలిన సిలిండర్
-
నంద్యాల చాపిరేవులో తీవ్ర విషాదం
నంద్యాల, సాక్షి: జిల్లా మండల పరిధిలోని చాపిరేవుల(Chapirevula)లో ఈ ఉదయం విషాదం నెలకొంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఆ ఇల్లు కుప్పకూలిపోగా.. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో పది మందికిపైగా గాయాలైనట్లు సమాచారం. చాపిరేవులలోని ఓ ఇంట్లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాద ధాటికి చుట్టుపక్కల నివాసాలు దెబ్బ తిన్నాయి. ఘటనా స్థలం నుంచి రెండు మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. వారిని వెంకటమ్మ(62), దినేష్(10)గా గుర్తించారు. మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ప్రమాద ధాటికి చుట్టుపక్కల నివాసాల్లోని పది మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. వీళ్లను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ స్టౌవ్ ఆన్‌లోనే ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. -
ఇహలోక అద్భుతం మహానంది
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన మహానంది ఒకటి. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే! ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారూ కొలువై ఉండటంతో ఇది శివకేశవుల నిలయంగానూ మారింది. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలోంచి స్వయంభువుగా వెలిశాడు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుడిని స్పృశిస్తూ వచ్చే జలం.. శైలధార, దివోదుని ధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థమనే ఐదు ధారలుగా ఇక్కడున్న రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతోంది.చిన్న గుండు సూది వేసినా పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుందా జలం. మహానందీశ్వరస్వామి ఆలయానికి వస్తే.. గర్భగుడి చాళుక్యుల కాలంనాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పాకళా వైభవాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మహానందీశ్వరస్వామే స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఓ నందికి రెండు తలలు ఉండటం మరో ప్రత్యేకత. వేసవిలో చల్లగా.. శీతకాలంలో వెచ్చగా.. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ నీటిలో తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరుబావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్రపరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ పీహెచ్ స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే పీహెచ్ స్థాయి 7.1 ఉండటం విశేషం. అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. శీతకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరులు పొగలు గక్కుతున్నట్లు కనిపిస్తాయి. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేలాది ఎకరాలకు సాగునీరుగా.. మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకూ ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు. కోనేరుల్లోంచి నీరు రెండు పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్లి తెలుగుగంగ కాలువలో కలుస్తోంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే రెండు అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది.ఓ అద్భుత దివ్యక్షేత్రంఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానమాచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో వర్ణించారు. ఇక్కడ స్నానమాచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు శాస్త్రీయంగానూ నిరూపితమైంది. – బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానంది దేవస్థానం వేద పండితులు -
బనగానపల్లె పీఎస్ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసులు
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్‌పై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయించారు. గత బుధవారం అబ్దుల్ ఫైజ్ ఇంటిపై మంత్రి బీసీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అబ్దుల్ ఫైజ్‌కు న్యాయం చేయాల్సిన పోలీసులు ఆయనపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు.ఈ నెల 15న అబ్దుల్‌ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా.. ఆ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను భయంభ్రాంతులకు గురి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్‌ఫైజ్ కథనం మేరకు.. పెద్ద కుమారుడు అబ్దుల్‌ఉబేద్ జోడే కావడంతో బుధవారం విద్యుత్ దీపాలంకరణతో ఇంటిని తీర్చిదిద్దారు. ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రోన్ కెమెరామెన్స్ చిత్రీకరిస్తున్నారు. అబ్దుల్‌ఫైజ్ ఇంటికి సమీపంలో ఉన్న మంత్రి ఇంటి వద్ద నుంచి కొందరు టీడీపీ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి.. డ్రోన్ కెమెరాను లాక్కొని కిందపడేసి పగులకొట్టారు.అలాగే ఇంట్లో ఉన్న మహిళలను కూడా భయంభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ప్రవీణ్‌కుమార్ వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన కూడా మంత్రి అనుచరులకు వత్తాసు పలికారు. డ్రోన్ కెమెరామెన్ల పై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
పెళ్లి ఇంట్లో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అనుచరుల వీరంగం
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణంలో వివాహ వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. బనగానపల్లె పట్టణ వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు.పెళ్లి ఇంటికి డ్రోన్ షూట్ చేస్తుండగా మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి ఇంటిని షూట్ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఓవర్‌యాక్షన్ చేశారు. డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. తెల్లవారితే వివాహం జరగాల్సిన ఇంట్లోవారిని భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారి టీడీపీ పార్టీకి వత్తాసు పలికారు.దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.ఇదీ చదవండి: స్కిల్ కేసులో సిట్ క్లోజ్.. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ -
ఆదివారం ఆ ఊళ్లో మాంసం ముట్టరు
పాణ్యం: ఆదివారం వచ్చిoదంటే చాలా మందికి మాంసాహారం లేనిదే ముద్ద దిగదు. కొందరికైతే గొంతులో మద్యం చుక్క పడాల్సిందే. కానీ నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు (S. Kotturu) గ్రామ ప్రజలు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఎంతో నియమనిష్టలతో ఉంటున్నారు. ఆదివారం (Sunday) ఆ గ్రామంలో ఎవ్వరూ మాంసాహారాన్ని తినరు.. మద్యం సేవించరు. గ్రామంలో ఎవరైనా మరణించినా.. ఆదివారం మాత్రం అంత్యక్రియలు నిర్వహించరు. ఆ మరుసటి రోజు గానీ, ఆ తర్వాత గానీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ గ్రామంలోని ఆలయ గర్భగుడికి పైకప్పు కూడా ఉండదు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఈ గ్రామానికి, ఆలయానికి ప్రతి ఆదివారం వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. తెల్లవారేసరికి ఆలయం.. సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన బీరం చెన్నారెడ్డి పొలం దున్నతుండగా.. నాగలికి (Nagali) ఏదో రాయి అడ్డుతగిలినట్లు శబ్దం వచ్చిoదట. వెంటనే అతను కంటి చూపు కోల్పోవడంతో చుట్టుపక్కల రైతులు నాగలిని వెలికి తీసి.. భూమిలో ఏముందో చూడగా పన్నెండు శిరస్సులతో నాగేంద్ర స్వామి విగ్రహం బయటపడిందంట. ఆ దారిన పోతున్న ఓ బ్రాహ్మణుడు అది సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహమని.. స్వామికి మూడు అభిషేకాలు చేస్తే రైతుకు చూపు వస్తుందని సూచించారట. దీంతో గ్రామస్తులు స్వామికి అభిషేకాలు చేయగా.. రైతుకు చూపు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆ తర్వాత గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించగా.. స్వామి కలలో కనిపించి ఆలయ నిర్మాణాన్ని రాత్రి చేపట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందు ముగించాలని ఆజ్ఞాపించారట. దాంతో రాత్రి ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టగా.. కోడి కూసే సమయానికి గర్భగుడి, దాని చుట్టూ గోడ మాత్రమే పూర్తయ్యిందంట. దీంతో ఇప్పటికీ స్వామి వారి గర్భాలయానికి పైకప్పు ఉండదు. కాలసర్పదోష పూజలకు ప్రసిద్ధి..శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఎంతో ప్రీతికరమైన రోజుగా గ్రామస్తులు, భక్తులు భావిస్తారు. దీంతో ప్రతి ఆదివారం వారంతా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ప్రస్తుతం గ్రామంలో 200 కుటుంబాలు.. 1,000 మందికి పైగా జనాభా నివసిస్తుండగా.. ఆదివారం మాంసాహారం అస్సలు ముట్టరు. మద్యం సేవించరు. గ్రామంలో ఎవరైనా మరణించినా అంత్యక్రియలు ఆదివారం నిర్వహించరు. అలాగే ప్రతి ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి.. స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం కాలసర్పదోష పూజలు జరుగుతాయి. చదవండి: ఆయుర్వేదంతో.. ఆరోగ్యమస్తు!ఈ పూజలు జరిపించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆలయం వద్ద బారులు తీరుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సంతానమూర్తిగా కొలుస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను గ్రామ ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. స్వామిని దర్శించుకున్న తర్వాతే.. దినచర్య మొదలు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో ఎస్.కొత్తూరు గ్రామస్తులంతా ఆ రోజు నియమనిష్టలతో ఉంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. గ్రామస్తులు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్వామి వారిని దర్శించుకొని దినచర్యలు ప్రారంభిస్తారు. ఆదివారంతో పాటు మంగళవారం ఆలయంలో కాలసర్పదోష పూజలు జరుగుతుంటాయి. వీటి కోసం అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. – కంపమల్ల పుల్లయ్యస్వామి, ఆలయ ప్రధాన అర్చకుడు -
ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
-
ముచ్చుమర్రి ఘటన ముమ్మాటికీ బాబు సర్కార్ వైఫల్యమే: వైఎస్సార్సీపీ
సాక్షి, నంద్యాల జిల్లా: ముచ్చుమర్రి బాలిక ఘటన కలిచివేసిందని.. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు పాప ఆచూకీ దొరక లేదని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఘటన కేసులో నిందితులకు బెయిల్ లభించడంపై ఆయన స్పందిస్తూ.. దిశ చట్టాన్ని అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేసేశారన్నారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు. బాలిక తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ ఎప్పడూ అండగా ఉంటుందన్నారు.బాబు, పవన్ ఎందుకు స్పందించడం లేదు: విరూపాక్షిముచ్చుమర్రి బాలిక ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మహిళలపై అరాచకాలు పెరిగాయని మండిపడ్డారు. ముచ్చుమర్రి బాలిక ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు’’ అంటూ విరుపాక్షి ప్రశ్నించారు.హోంమంత్రికి ఈ ఘటనలు కనబడవా?: ఇషాక్ బాషాముచ్చుమర్రి బాలిక లైంగికదాడి ఘటన చాలా బాధాకరమని.. నాలుగు నెలలు గడిచిన ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేదని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు బెయిల్ వచ్చింది. రాష్ట్ర హోంమంత్రికి ఈ ఘటనలు కనబడుతున్నాయా?. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి’’ అని ఇషాక్ బాషా చెప్పారు. -
ఆళ్లగడ్డలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం. ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో చెప్తే నేనెందుకు వెళ్తా.. ఏం జరిగినా తేల్చుకుంటానని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు.కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. మందిమార్బలంతో డెయిరీ ప్రాంగణంలోని చైర్మన్ గదిలోకి వెళ్లారు. డెయిరీలో ఏం జరుగుతుందో చెప్పాలని, ఇక్కడి అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అఖిలప్రియ రెచ్చిపోయారు. డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న నూతన శిలాఫలకాల ఏర్పాటుపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యకం చేశారు. తనతో ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలని అఖిల సూచించారు.‘నాతో మామగా మాట్లాడుతున్నావా... లేక చైర్మన్‌గా మాట్లాడుతున్నావా.. మామవైతే నీ సీట్లో కూర్చుంటే తప్పేముంది. మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. నాకు ఎందుకు ఫోన్ చేశావ్ అసలు.. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకో’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నంద్యాలకు వచ్చి రాజకీయాలు చేయడం ఏంటని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పరిధిలో రాజకీయాలు చేసుకోవాలని.. తమ పరిధిలోకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. -
మంత్రి నిమ్మల పర్యటనకు టీడీపీ నేతలు దూరం
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో ఇరిగేషన్ మంత్రి పర్యటనలో టీడీపీ నేతల వర్గ విభేదాలు బయటపడ్డాయి. మల్యాలలోని హంద్రీనీవా సృజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు జయసూర్య, కేఈ శ్యాంబాబు పరిశీలించారు.అయితే, మంత్రి రామానాయుడు పర్యటనకు టీడీపీ నాయకులు ఎంపీ బైరెడ్డి శబరి,టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ దూరంగా ఉండటం చర్చాంశనీయంగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే మంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.‘సాక్షి’పై మంత్రి నిమ్మల అక్కసుమరోవైపు, ‘సాక్షి’పై మంత్రి నిమ్మల అక్కసు వెళ్లగక్కారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చి వంద రోజులే అయ్యిందని, మమ్మల్ని ప్రశ్నించే అర్హత జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు చేశారో చెప్పే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.జగన్ తరఫున సాక్షి పత్రికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట వంద రోజుల పాలన పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ పత్రికపై తన అక్కసు వెళ్లగక్కారు. ‘సాక్షి’ పేపర్ చదవొద్దని చెప్పారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలను అమలుచేస్తామన్నారు. మహిళల నుంచి స్పందన నిల్.. రాష్ట్రంలో వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టామని.. సంక్షోభంలో కూడా సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నిమ్మల వివరించగా కార్యక్రమానికి హాజరైన మహిళల్లో ఒక్కరు కూడా హర్షధ్వానాలు తెలుపకపోవడం మంత్రితో పాటు టీడీపీ నాయకులను విస్మయానికి గురిచేసింది.అంతకుముందు మాట్లాడిన జనసేన నేత యు.ప్రేమ్‌కుమార్ మంత్రి గురించి గొప్పలు చెప్పే ప్రయత్నం చేసినా మహిళలు స్పందించలేదు. దీంతో ప్రేమ్‌కుమార్.. అమ్మా మీరు చప్పట్లు కొడితే మంత్రిగారిని అభినందించినట్లు అవుతుందని అనగా.. కొద్దిమంది మాత్రమే మొక్కుబడిగా స్పందించారు. -
నంద్యాల: దళిత కుటుంబంపై టీడీపీ నేతల దాడి
సాక్షి, నంద్యాల జిల్లా: అధికారం అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నంద్యాల మండలం బాబూజీ నగర్ గ్రామంలో దళిత కుటుంబంపై టీడీపీ నాయకులు దాడి చేశారు. వినాయక నిమజ్జన సమయంలో దళిత యువకుడు వరుణ్‌పై టీడీపీ నేతలు చెయ్యి చేసుకున్నారు. తమ కుమారుడిని ఎందుకు కొట్టారని అడిగేందుకు వెళ్లిన తల్లిదండ్రులను టీడీపీ నేతలు చితకబాదారు. పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా, చింతలాయిపల్లెలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. గ్రామానికి చెందిన వల్లెపు ప్రసాద్ కుటుంబీకులు వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారంతా టీడీపీలో కొనసాగుతుండగా ప్రసాద్ కుటుంబీకులు మాత్రం వైఎస్సార్సీపీ లో ఉంటున్నారు.పని నిమిత్తం బయటకు వచ్చిన ప్రసాద్ బస్టాండ్ పరిసరాల్లో ఉండగా టీడీపీకి చెందిన పది మందికి పైగా అక్కడికి చేరుకొని అతనిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పెద్దిరాజు, ప్రకాష్, సావిత్రి సంఘటన స్థలానికి చేరుకోవడంతో వారిపై దాడికి దిగారు. ఈ ఘటన లో నలుగురు గాయపడ్డారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: జగన్ పిఠాపురం పర్యటనలో భద్రతా లోపం -
అంతుచూస్తా.. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యం
సాక్షి, నంద్యాల జిల్లా: నందికొట్కూరు మునిసిపాలిటీలో స్థల వివాదంలో సీపీఎం నాయకులపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. రెచ్చిపోయిన బైరెడ్డి.. అంతుచూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ సీపీఎం నాయకులపై చిందులు తొక్కారు.20 ఏళ్లుగా ఈ స్థలంలోనే ఉన్నాం.. పన్నులు చెలిస్తున్నాం. న్యాయం చేయకపోగా మాపైనే దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి మేము పన్నులు కూడా చెల్లించామని.. తమకు న్యాయం చేయమంటే మున్సిపాలిటీ అధికారులు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన బాటపట్టారు. -
వైఎస్ జగన్ భద్రత గాలికి.. అడుగడుగునా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నంద్యాల జిల్లా సీతారామపురం పర్యటనలో పోలీసుల వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్‌కి జెడ్‌ప్లస్ భద్రత ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు.చాపిరేవుల టోల్ గేట్ దగ్గర ఏకంగా వైఎస్ జగన్ కారుపైకెక్కి పడుకున్నాడు ఓ యువకుడు. మరో ఘటనలో అయిలూరు మెట్ట చందమామ ఫంక్షన్ హాలు దగ్గర వైఎస్ జగన్‌తో కరచాలనం కోసం బుల్లెట్ ప్రూఫ్ కారుపైకి ఎక్కాడు మరో యువకుడు. సీతారామపురం వద్ద వైఎస్ జగన్ కారు దిగే సమయంలో కూడా తోపులాట జరిగింది.వైఎస్ జగన్‌కు తగిన భదత్ర కల్పించాలని హైకోర్టు పేరొన్న సంగతి తెలిసిందే. కాగా, వైఎస్ జగన్‌కి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైనదన్న వాస్తవాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదుట పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్‌కు కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది.ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలపగా.. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
Watch Live: నంద్యాలలో వైఎస్ జగన్
-
నేడు నంద్యాల జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
👉సీతారామపురంలో సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్👉టీడీపీ గూండాల దాడిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. హత్య జరిగిన తీరును వైఎస్ జగన్‌కు బాధిత కుటుంబం వివరించింది. హత్య జరిగిన సమయంలో పోలీసులు ఉన్నా కూడా టీడీపీ నేతలకు అడ్డు చెప్పలేదని సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ కామెంట్స్..రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.మారణహోమం సృష్టిస్తున్న పాలన చేస్తున్నారు.రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చేస్తున్నారు.ఉళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు.పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని చంపేశారు.సుబ్బారాయుడును అన్యాయం హత్య చేశారు.పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదు?.నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారు.ఎవరి ప్రోద్భలంతో పోలీసులు నిందితులకు సహకరించారు.హత్య చేసిన వాళ్లు ఎవరు?. చేయించిన వాళ్లు ఎవరు?.ప్రతీచోటా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది.హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలి.హత్య జరిగిన తర్వాత గ్రామానికి అడిషనల్ ఫోర్స్ ఎందుకు పంపలేదు?.హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు.ఇంత జరుగుతున్నా అదనపు బలగాలు ఎందుకు రాలేదు?.తుపాకులు, కత్తులు, రాడ్డు, కర్రలతో దాడులు చేస్తున్నారు.చంద్రబాబు, నారా లోకేష్ అండదండలతో ఎస్ఐ సమక్షంలో నరికేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టి చంపండి అంటూ చెబుతున్నారు.ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి.రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు లేదు.హామీలు అమలు చేయకుండా అరాచకం సృష్టిస్తున్నారు.ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారు.చంద్రబాబు అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు.ప్రతీ పిల్లవాడికి రూ.15వేలు ఇస్తానని చంద్రబాబు మోసం చేశాడు.డబ్బులు ఇస్తామన్నాడు ఏమైంది?.ఎన్నికలు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలను మోసం చేశాడు.తల్లివందనం అని చెప్పి చివరకు పంగనామం పెట్టాడు.పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశాడు.మన ప్రభుత్వమే అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే అందరికీ అమ్మఒడి, రైతుభరోసా అందేది.రైతులకు రూ.20 వేస్తామని మోసం చేశాడు. ఇక అంతకుముందు.. ఎస్ఐ ఉన్నా ఆపే ప్రయత్నం చేయలేదా? అంటూ ప్రత్యక్ష సాక్షిని వైఎస్ జగన్ అడిగారు. ఘటనా స్థలంలో సుబ్బారాయుడితో ఎవరెవరు ఉన్నారంటూ ఆయన ఆరా తీయగా, ముగ్గురు తప్పించుకున్నారని బాధితులు తెలిపారు. ‘‘సంక్షేమ పథకాల్లో కోత పెట్టడాన్ని సుబ్బారాయుడు ప్రశ్నించారు. ఆ కక్షను మనసులో పెట్టుకుని సుబ్బారాయుడిని హత్య చేశారు. సుబ్బారాయుడిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడాలి’’ అని బాధితులు డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ రాకతో జనసంద్రమైన సీతారామాపురంవైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలుకర్నూలు-నంద్యాల మార్గంలో హుసేనాపురం వద్ద వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు -
9న నంద్యాల జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో గత శనివారం అర్ధరాత్రి టీడీపీ మూకల చేతిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు, రెండు నెలలుగా కొనసాగుతున్న దారుణ పరిస్థితి, జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులను.. మరోసారి యావత్ దేశం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, నవాబ్‌పేటలో టీడీపీ మూకల చేతిలో గాయపడి, విజయవాడ సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించిన అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ ఈ విషయాలు వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ నేత హత్య ఘటన.. సీఐ, ఎస్ఐ సస్పెన్షన్
సాక్షి, నంద్యాల జిల్లా: సీతారామాపురంలో వైఎస్సార్సీపీ నేత సుబ్బారాయుడు హత్య ఘటనపై డీఐజీ సీరియస్ అయ్యారు. నంద్యాల రూరల్ సీఐ శివ కుమార్‌రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం ఉన్నప్పటికీ సీఐ, ఎస్ఐ నిర్లక్ష్యం వహించారని అభియోగం. పోలీసుల అలసత్వం వల్లే వైఎస్సార్సీపీ నేత హత్య జరిగిందని నిర్థారణ అయ్యింది. మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో శనివారం అర్ధరాత్రి 12.20 గంటలకు టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్సార్సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న(65) ఇంట్లోకి వెళ్లి బయటకు లాగి.. కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు.పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగా సుబ్బరాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదముందని మూడు గంటల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా, కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. -
రెడ్ బుక్ కాదు.. బ్లడ్ బుక్
-
పేట్రేగిపోతున్న పచ్చ మూకలు..
-
రౌడీషీటర్ వెంకటసాయి హత్య కేసులో నిందితుల అరెస్ట్
-
సీతారామపురం ఘటన.. విస్తుపోయే నిజాలు..
-
నంద్యాల జిల్లాలో YSRCP నేత దారుణహత్య
-
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద: 3 గేట్లు ఎత్తివేత
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. సందర్శకుల తాకిడితో జలాశయం కళకళలాడుతోంది. ఇన్‌ఫ్లో 4,60,040 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 1,41,560 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 198.3623 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి సోమవారం రాత్రి 7 గంటలకు 4,52,583 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 879.3 అడుగుల్లో 184.70 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 82వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. మరోవైపు.. శ్రీశైలం స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది. సాగర్‌లోకి సోమవారం సా.6 గంటలకు 54,772 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 512.6 అడుగుల్లో 136.13 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. పూర్తినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 176 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో ఆరేడు రోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశం ఉంటుంది. స్థిరంగా వరద ప్రవాహం..మహారాష్ట్ర, కర్ణాటకలలోని పశ్చిమ కనుమల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, ఉప నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి డ్యాంలోకి 3 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంలోకి 2.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.11 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.అలాగే, కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యాంలోకి 1.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.06 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటి మట్టం 311 మీటర్లు (సముద్ర మట్టానికి) కొనసాగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.ఇక సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.51 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,504 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇటు సుంకేశుల నుంచి.. అటు జూరాల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. -
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో కీలక పరిణామం
-
ముచ్చుమర్రి బాలిక కేసులో నిందితులు చెప్పిన నిజాలు
-
బాలిక ఆచూకీ ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రుల ఆవేదన
-
ఇంకా వీడని ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యం మిస్టరీ
-
ఇంకా మిస్టరీగానే నంద్యాల ముచ్చుమర్రి కేసు!
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఆరో రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి కనిపిచటం లేదు. ఒక్క బోటుతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక తల్లిదండ్రులను ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. వారం గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబం, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా? లేక పోలీసులు ఛేదిస్తారా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ లభించపోవటంతో ముచ్చుమర్రి ప్రజలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎదురు చూపులు చూస్తున్నారు. అభం శుభం తెలియని తొమిదేళ్ళ చిన్నారి అదృశ్యంపై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటన స్థలానికి చేరుకుని సీను రికస్టక్షన్ చేసినా కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు.చదవండి: రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు! -
యువకుడిపై చిరుత దాడి.. మహానందిలో కలకలం
నంద్యాల: నంద్యాల జిల్లాలోని మహానందిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. మంగళవారం మహానందిలోని ఈశ్వర్ నగర్ సమీపంలో ఓ యువకుడిపై చిరుత పులి దాడి చేసింది. దీంతో ఈశ్వర్ నగర్ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.గత నెల రోజుల నుండి మహానంది చుట్టే ఓ చిరుత సంచరిస్తోంది. ఇవాళ యువకుడిపై దాడి మహానందిలో కలకలం రేపుతోంది. ఇప్పటికైనా చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. -
నంద్యాల జిల్లాలో మరోసారి చిరుత కలకలం
-
నంద్యాల జిల్లాలో చిరుత పులుల కలకలం
-
నంద్యాల జిల్లాలో చిరుత భయం
-
చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలోని కొండల్లో చిరుత పిల్లలు సంచరిస్తున్నాయి. చిరుత పిల్ల రైతుల కంట పడింది. చనుగొండ్ల గ్రామానికి ఆనుకొని కొండ ప్రాంతం ఉండటంతో చిరుత పిల్లను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లి చిరుత ఎప్పుడు గ్రామంలోకి వస్తుందోనని భయభ్రాంతులు చెందుతున్నారు.గతంలో చిరుత వెంకటాపురం గ్రామ సమీప కొండ గుహల్లో నివాసాలు ఏర్పరచుకొని రాళ్ల మధ్యలో ఉంటూ అటుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కొండ ప్రాంతానికి అనుకొని ఇల్లు ఉండటం వలన గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. -
ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేసిన టీడీపీ నేత మోహన్ రెడ్డి
-
రాళ్ల దాడులు.. పిడిగుద్దులు.. తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం!
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. కోట్ల సూర్యప్రకాశ్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. చంద్రబాబు వచ్చి సర్ది చెప్పి పోయినా సొంత క్యాడర్ సహకరించలేదు.తాజాగా ప్యాపిలి మండలం పెద్దపూదెళ్లలో తెలుగు తమ్ముళ్లు దారుణంగా తన్నుకున్నారు. 'కోట్ల' ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాన్వాయ్ ఎవరెక్కాలనేదానిపై ఘర్షణ మొదలైంది.రాళ్లదాడులు, పిడిగుద్దులతో రెండు వర్గాలు విరుచుకుపడ్డాయి. సమన్వయం పాటించాలని కోట్ల సూర్యప్రకాశ్ కోరినా తెలుగు తమ్ముళ్లు లెక్కచేయలేదు. ‘కోట్ల’ చెప్పినా ఓ వర్గం మరింత రెచ్చిపోయి రాళ్లు రువ్వి దాడులకు దిగింది.ముందే ప్లాన్ చేసి టీడీపీలోని ఓ వర్గం దాడికి పురిగొల్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు డోన్ బహిరంగ సభలో పదే పదే సుబ్బారెడ్డి పేరు పలకడంపైనా ఓ వర్గం తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'కోట్ల' కన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంపై కోట్ల వర్గం కూడా అసంతృప్తితో ఉంది.టీడీపీకి వలసలుగా వెళ్లిన వారు కూడా ఎందుకొచ్చాం రా బాబూ అనుకునేలా కూటమిలో పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల బాహాబాహీతో తెలుగుదేశం బండారం బయటపడింది. -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా
పాములపాడు: నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి.. కాగా.. చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా.. చొక్కా, ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారుక్‌బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్‌దేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారుక్‌బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్ఐ అశోక్‌ను వివరణ కోరగా.. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
Ugadi 2024: కనులపండువగా శ్రీగిరి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు (ఫొటోలు)
-
Watch Live: నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో సీఎం జగన్ తో ముఖాముఖి
-
YSRCP నంద్యాల జిల్లా అభ్యర్థుల జాబితా ఇదే
నంద్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. బీకాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా.. సీఎం వెంటనే స్పందించారు. పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. హరిజన గోరంట్లకు అందజేశారు. బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని.. నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా.. వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ అబ్దుల్ వజీద్‌కు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. అలాగే అవుకు మండలం వేములపాడు గ్రామ నివాసితుడు బి.మనురాహుల్ తాను 6 సంవత్సరాల నుంచి వికలాంగత్వంతో బాధపడుతున్నానని వ్యాధి చికిత్సకు తగిన ఆర్థిక స్తోమత తమ వద్ద లేదని, సహాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. బనగానపల్లె పట్టణ వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్ తనకు 20 సంవత్సరాల వయసు ఉందని ఇంటర్ ఫెయిల్ అయ్యానని.. నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. డా.కె.శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు 2 లక్షల రూపాయల చెక్కును అబ్దుల్ హజీమ్‌కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటివరకు వారు సొంత నిధులతో ఖర్చుపెట్టిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభా వేదిక, హెలిపాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది అర్జీదారులకు ఆర్థిక సహాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తిస్థాయి రీయింబర్స్‌మెంట్‌కు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు సంబంధిత అర్జీదారులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన ఫొటోలు
-
Watch: బనగానపల్లెలో బాబు, పవన్‌లపై సీఎం జగన్ పంచులు
-
నేడు సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన
-
ముగిసిన సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు పర్యటన
Updates.. ముగిసిన సీఎం జగన్ నంద్యాల పర్యటన బటన్ నొక్కి వైఎస్సార్ ఈబీసీ నిధుల్ని జమ చేసిన సీఎం జగన్ మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేసిన సీఎం జగన్ పవన్, బాబులపై పంచులు.. సీఎం జగన్ ఫుల్ స్పీచ్ కోసం క్లిక్ చేయండి ముగిసిన సీఎం జగన్ ప్రసంగం ఇదే బనగానపల్లెలో ఇళ్లు స్థలాలు ఇస్తే.. ఇదే జనార్థన్‌రెడ్డి కోర్టుకు పోయారు ఇంటి స్థలాలు ఇస్తే సీఎం జగన్‌కు, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఇదంతా ప్రస్తుతం ఈ వ్యవహారంలో మన ప్రభుత్వం కోర్టుల్లో యుద్ధం చేయాల్సి వస్తోంది 3,200 కుటుంబాలకు త్వరలో శుభవార్త వింటామని కోరుకుంటున్నా మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు ఓటు బటన్ నొక్కేప్పుడు పొరపాటు జరిగితే.. పేదల భవిష్యత్తు మారాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే చేరాలన్నా.. అక్కచెల్లెమ్మల పిల్ల చదువులు గొప్పగా సాగాలన్నా.. రైతన్నల ముఖంలో ఆనందం చూడాలన్నా.. వ్యవసాయం ఒక పద్ధతిగా జరగాలన్నా.. బటన్‌నొక్కడం నేరుగా ఖాతాల్లో డబ్బు పడాలన్నా.. ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా.. కేవలం ఒక్క మీ బిడ్డ పాలనలో జరుగుతాయని మరిచిపోవద్దు పొరపాటు జరిగితే.. అన్నింటికి తెరపడుతుంది గ్రామాల్లో లంచాలు వివక్ష వస్తాయి పేదల బతుకులు, చదువులు కూడా ఆవిరైపోతాయి.. అంధకారం అయిపోతాయి.. అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుందని గుర్తు ఎరగమని సెలవు తీసుకుంటున్నా.. రామిరెడ్డి గెలిస్తే.. జగనన్న ప్రభుత్వం వస్తుంది ఒక జగనన్న సీఎంగా ముఖ్యమంత్రిగా ఉంటే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోండి ఇక్కడి టీడీపీ అభ్యర్థి ధనికుడు.. రామిరెడ్డికి అంతస్తోమత లేదు వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, ఓటు బటన్ నొక్కేటప్పుడు రామిరెడ్డి అన్నకు ఓటేయండి రామిరెడ్డికి ఓటేస్తే.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్‌ను సీఎం చేయాలంటే రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది చిన్నవిన్నపం చేసిన సీఎం జగన్ ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేశాం డబ్బు జమ కావడం కొంచెం ఆలస్యం కావొచ్చు వారం అటు ఇటుగా జరుగుతుంది ప్రతీ ఒక్కరికీ డబ్బులు చేరతాయి ఈ రెండువారాల పాటు ఓ ఈనాడు చదవొద్దు.. ఆంధ్రజ్యోతి చూడొద్దు.. టీవీ5 చూడొద్దు ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయి ఈ యుద్ధం చెడిపోయిన మీడియ వ్యవస్థతో కూడా మంచి జరిగినా కూడా కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో కూడా యుద్ధం చేస్తున్నాం దేవుడి దయతో.. ప్రజలకు మరింత మంచి చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా మాయల మాంత్రికులపై ‘ఓటు’ అనే దివ్యాస్త్రం ప్రయోగించండి 2014లో మోసపూరిత హామీలు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామంటారు రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి చంద్రబాబు 2014లో ఎగనామం పెట్టాడు 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారు ఇదే పవన్, దత్తపుత్రుడు బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా? చంద్రబాబు, దత్తపుత్రుడ్ని పేర్లు చెబితే.. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుంది పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తొస్తుంది చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి గుర్తుకు రాదు ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడు ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు ఒకరికి విశ్వసనీయత.. మరొకరికి విలువలు లేవు ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు.. మీ బిడ్డ మీదకు కాదు.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు సీఎం జగన్ ప్రసంగం.. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాని తేడా గమనించండి గతంలో ఏ పథకం ఉందో తెలియదు.. ఏ పథకం ఇస్తారో తెలియదు మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వేయలేదు లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదు అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నాం సీఎం జగన్ ప్రసంగం.. పేదరికానికి కులం ఉండదు పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు ఉండాలి వైఎస్సార్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు ఇది పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది వైఎస్సార్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింది 4, 19, 583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ. 629.37 కోట్లు జమ చేస్తున్నాం మొత్తంగా మూడు దఫాల్లో.. 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగింది రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమం పాల్గొని ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్ కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం విడుదల వైఎస్సార్ ఈబీసీ నేస్తంపై స్పెషల్ ఈవీ ప్రదర్శన మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేయనున్న సీఎం జగన్ వైఎస్సార్ ఈబీసీ పథకం.. కార్యక్రమం ప్రారంభం బనగానపల్లె వేదిక వద్దకు సీఎం జగన్ సభావేదిక వద్ద ఈబీసీ నేస్తం ఫొటో గ్యాలరీని ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల.. జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, స్థానిక నేతలు, అధికారులు బనగానపల్లె చేరుకున్న సీఎం జగన్ నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం నిధుల జమ కార్యక్రమం బటన్ నొక్కి నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతకు ముందు.. బహిరంగ సభలో లబ్ధిదారుల్ని ఉద్దేశించి ప్రసంగం లా వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి వీకేంద్రీకరణే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్దేశం హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోను హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నాం శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది కర్నూలులో ఎన్హెచ్ఆర్సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తాం నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కొరుతున్నా లా వర్సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించాం ఈ యూనివర్శిటితో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఎపి లీగల్ మొట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, లేబర్ కమిషన్ , వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవహక్కుల కమిషన్, ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నా కర్నూల్లో.. లా యూనివర్సిటీ పనులు ప్రారంభం జగన్నాథగట్టులో లా యూనివర్సిటీ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్ లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరణ కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం.. మరికాసేపట్లో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ కర్నూల్ చేరుకున్న సీఎం జగన్ ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు శివారుల్లొని జగన్నాథగట్టుకు ప్రత్యేక హెలీకాఫ్టర్ లో పయనం మరికాసేపట్లో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన.. భూమి పూజ ►కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్ లా యూనివర్సిటీ. అలాగే.. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పర్యటన సాగేది ఇలా.. ఈబీసీ నేస్తం పథకం నగదు జమ కార్యక్రమం ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రసంగం ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నగదు జమ చేస్తారు కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నాం 2.30గం ప్రాంతంలో.. ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు ఈ రెండు జిల్లాల పర్యటనలోనే.. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ ఆయన కాసేపు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. -
నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
నంద్యాల: ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు మృతి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాగా, వీరంతా హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వారు అని తెలుస్తోంది. ఇక, మృతుల్లో నవ దంపతులు ఉండటం కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్వాల్‌కు చెందిన బాలకిరణ్, కావ్యకు ఇటీవలే ఫిబ్రవరి 29 తేదీన వివాహం జరిగింది. మార్చి మూడో తేదీన షామీర్‌పేటలో రిసెప్షన్ జరిగింది. కాగా, వీరింతా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో మృతిచెందారు. -
బతికున్నోళ్లను చంపేసిన ‘పచ్చ’పత్రిక
డోన్ (నంద్యాల): సజీవంగా ఉన్న వారిని మృతి చెందారంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈనాడు పత్రిక అధిపతి రామోజీపై సంబంధిత వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డోన్ పట్టణంలోని చిగురమానుపేటకు చెందిన కొండవేగు శాంతిప్రియతో పాటు ఆమె భర్త పేర్లు ఓటరు జాబితాలో ఉండడాన్ని ఉదహరిస్తూ వీరు మృతి చెంది రెండు సంవత్సరాలు అయిందంటూ ఈనాడులో తప్పుడు కథనం ప్రచురించడంపై శాంతిప్రియ అవాక్కయ్యారు. ఎక్స్‌ఐవై 2122539 అనే ఓటరు కార్డుతో 17వ వార్డు 11వ సచివాలయంలో తాను నివశిస్తున్నానని.. అయితే పచ్చపత్రిక ఈనాడులో ‘ఆత్మకు ఓట్లు’ అనే శీర్షికన తన పేరును ప్రచురించడం దుర్మార్గమైన చర్య అని శాంతిప్రియ మండిపడ్డారు. ఇటీవలకొందరు వ్యక్తులు మృతి చెందారంటూ వారి ఫొటోలను ఈనాడులో ప్రచురించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు ముదిరింది. ఈ క్రమంలో అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అఖిలప్రియకు సీటు ఇస్తే సహకరించే ప్రసేక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే. మరోవైపు, అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం జరిగిన ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్ -
ఆళ్లగడ్డ: రా..రమ్మన్నా.. రాని జనం.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్
సాక్షి, నంద్యాల: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రా కదలిరా సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సుమారు లక్ష మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ నాయకులు గొప్పగా చెబుతూ వచ్చారు. కానీ, పదివేల మంది కూడా సభకు రాలేదు. నంద్యాల జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కడప, అనంతపురం నుంచి కూడా జనాలను తరలించినప్పటికీ అనుకున్న లక్ష్యం దరిదాపుల్లోకి చేరలేదు. నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించాలని ముందుగానే చెప్పినప్పటికీ జనాలను తరలించలేక నాయకులు చేతులెత్తేశారు. రూ.2 కోట్లు వృథా.. సభ కోసం సుమారు రూ.రెండు కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం. అయినా తెలుగుదేశం పార్టీ సభకు జనం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ పార్టీ నాయకులుండిపోయారు. సభపై జనాలకు ఆసక్తిలేకపోతే తాము మాత్రం ఏం చేయగలమని తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబం టార్గెట్‌గా విమర్శలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. తాను అధికారంలో ఉండి ఉంటే రాయలసీమను సస్యశ్యామలం చేసేవాడినని చెప్పడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. బిర్యానీ, మందు ఇచ్చి జనాలను తరలించినా చంద్రబాబు ఉపన్యాసం బోరు కొట్టడంతో చాలామంది సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ సభలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఇక ఆళ్లగడ్డ టికెట్ విషయంలోనూ భూమా అఖిలప్రియకు ఎలాంటి హామీ లభించకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు.. టీడీపీ–జనసేన కూటమి ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లాలో ఏర్పాటుచేసిన మొదటి సభకు జనసేన నుంచి ఏ ఒక్క నేతా హాజరుకాలేదు. అసహనానికి గురైన చంద్రబాబు సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలకు కూడా జనాలను తరలించలేకపోతే ఇక మీరెందుకంటూ నాయకులపై మండిపడినట్లు తెలిసింది. సభ ఆద్యంతం ఆయన ముఖంలో అసహనం కనిపించింది. మరోవైపు.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వచ్చిన అరకొర జనం కూడా వెనుదిరగడంతో ఏం చేయాలో తెలియక టీడీపీ నాయకులు తలలు పట్టుకున్నారు. సభకు వచ్చేందుకు స్థానిక కార్యకర్తలు ఆసక్తి కనబరచలేదు. ఆళ్లగడ్డ నుంచి కేవలం రెండు, మూడు వేల మందే వచ్చినట్లు ఆ పార్టీ నాయకులే మాట్లాడుకోవడం గమనార్హం. -
రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నంద్యాల/హైదరాబాద్: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లతో చేతులు కలిపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ సోదరి సహకారంతో కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి సురేందర్‌ని రాయదుర్గం పిలిపించిన సోదరి.. కిడ్నాపర్లకు అప్పగించింది. సురేందర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకున్న కిడ్నాపర్లు.. నల్లమల వైపు తీసుకెళ్లారు. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్‌కి పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్‌ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. సాప్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి నల్లమల అడవులకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో కారును కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఫారెస్ట్ సిబ్బంది ఆపి తనిఖీ చేయగా, కారు,బాధితుని వదిలేసి కిడ్నాపర్లు పారిపోయారు. ఒక కిడ్నాపర్‌ను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులకు పారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో సురేందర్‌ను క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాప్ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ స్పాట్‌కు సురేంద్‌ను తరలించిన పోలీసులు.. సోదరి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. సురేందర్ నుంచి ఆరు గంటల పాటు వివరాలు సేకరించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. భారీగా డబ్బులు వసూలు చేయడానికే కిడ్నాప్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది.. -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, నంద్యాల: సామాజిక సాధికారత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పేదల పక్షపాతి అయిన వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నవనందుల సాక్షిగా శనివారం నంద్యాల పట్టణంలో సామాజిక సాధికార చైతన్యం వెల్లివెరిసింది. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు భారీ ఎత్తున బడుగు, బలహీనవర్గాల ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. మైనారిటీల పక్షపాతి సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు మైనార్టీల ద్రోహి అని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. చంద్రబాబు మైనారిటీలపై దేశద్రోహం కేసులు పెడితే, సీఎం వైఎస్ జగన్ వచ్చాక ఆ కేసులను తొలగించారని గుర్తు చేశారు. అంతేకాకుండా మైనారిటీ వ్యక్తిని డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టి సీఎం జగన్ గౌరవించారని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి సామాజిక సాధికారిత నినాదంగానే ఉందని, ఒక్క సీఎం జగన్ మాత్రమే దీన్ని విధానంగా మార్చారని ప్రశంసించారు. మనల్ని చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తున్న జగన్ వెంటే మనమంతా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 14 ఏళ్లలో ఏం చేశావో చెప్పే ధైర్యముందా బాబూ? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు విస్మరిస్తే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన చరిత్ర సీఎం జగన్‌దని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. ఎస్సీలను తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుని చంద్రబాబు వదిలేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎస్సీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. ఆయన అమలు చేస్తున్న ప్రతి పథకం పేదవాడిని ఉన్నతస్థాయికి తీసుకెళ్తోందన్నారు. పేదల పక్షాన నిలుస్తున్న సీఎంకు మనమంతా అండగా నిలవాలని కోరారు. బడుగు, బలహీనవర్గాలంటే చంద్రబాబుకు చిన్నచూపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకు ఇప్పటికీ చిన్నచూపేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల నాయకులను సున్నాలతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీలను కరివేపాకులా వాడుకుని వదిలేస్తారన్నారు. తండ్రి అరెస్టయి జైలులో ఉంటే ఢిల్లీకి పారిపోయిన పిరికి పంద లోకేశ్.. సీఎంను పట్టుకుని సైకో అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పక్క పార్టీ నాయకుడిని సీఎంగా చూడాలనుకున్న వ్యక్తి ఈ దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ సభలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం పాతాళగంగలో నీటి కుక్కల సందడి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పాతాళ గంగలో నీటి కుక్కలు(Otters) సందడి చేశాయి. ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టుపై విన్యాసాలు చేస్తూ యాత్రికులకు కనిపించాయి. అవి నీటి నుండి బయటకు వచ్చి పుణ్య స్థానాలు చేస్తున్న భక్తులను ఆకర్షింస్తున్నాయి. భక్తులు అలా వాటిని చూస్తుండిపోయేలా కట్టిపడేస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నీటి కుక్కలు పాతాళగంగ ఒడ్డుకొచ్చాయి. మెట్ల మార్గంలో నీటి కుక్కలు(Otters)కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు. ఇది కూడా చదవండి: పోలవరంపై కేంద్రం పిటిషన్: ఏపీ హైకోర్టు నుంచి బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ -
అవుకు టన్నెల్ 2 అంటే?
మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుకు టన్నెల్ 2 ను ప్రారంభించారు మనం వార్తల్లో చదువుకున్నాం.. అసలు ఇదేంటి? ఇది ఎక్కడుంది? దీని వల్ల ఉపయోగం ఏంటి?కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ఉండిపోతుంది.. ఎక్కువగా ఉంటే ఆ వాటర్ ను మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండదు.. అది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ అక్కడి నుండి ప్రకాశం బ్యారేజీ తర్వాత సముద్రంలో కలిసిపోతుంది...శ్రీశైలం డ్యాం కెపాసిటీ మించి వరదలు వచ్చినప్పుడు అవి సముద్రం పాలు కాకోకుండా దానిని మనము కరువు జిల్లాలైన రాయలసీమకు మళ్ళి ఇస్తే ఎలా ఉంటుంది???? అనేదానికి రూపకల్పనే హంద్రీనీవా సుజల స్రవంతి మరియు గాలేరు నగరి ప్రాజెక్టులు..శ్రీశైలం బ్యాక్ వాటర్ కుడికెనాలు నుంచి ఈ ప్రాజెక్టులు మొదలవుతాయి. భానకచర్ల రెగులేటర్ ద్వారా వెలుగోడు, బ్రహ్మ సాగరం, సోమశిల,కండలేరు ఆ విధంగా చెన్నైకి వాటర్ వెళ్ళిపోతుంది.. దానిని తెలుగు గంగ ప్రాజెక్టు అని అంటారుపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కొంత తెలుగుగంగ కు, కేసీ కెనాల్ కు కొంత గోరుకల్లు రిజర్వాయర్‌కు వెళుతుంది.. అక్కడ నుంచి అవుకు రిజర్వాయర్‌కు వచ్చి, అవుకు రిజర్వాయర్ నుంచి మైలవరం రిజర్వాయరు అక్కడినుంచి గండికోట రిజర్వాయర్ కు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ధర్మవరం, నాగసముద్రం అలా అనంతపురం వైపుకు వెళ్తుంది.. గండికోట నుంచి కడప చిత్తూరు కు ఈ వాటర్ వామి కొండ, సర్వారాజసాగర్ అలా 9 రిజర్వాయర్ల ద్వారా ఈ నీరు వెళ్ళిపోతుంది...హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ గా అనంతపురం, కర్నూలు జిల్లాలకు వెళ్తే ఈ గాలేరు నగరి ప్రాజెక్టు నంద్యాల కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలకు నీటిని సరఫరా చేస్తుంది... 265,000 ఎకరాలకు (1,070 కిమీ2) సాగునీరు అందించడమే కాకుండా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని గాలేరు నగరి ప్రాజెక్టును నిర్మించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువలో ఈ అవుకు సొరంగం కీలకమైనదని, శ్రీశైలంలో వరదలు వచ్చిన 15 రోజుల్లో గాలేరు-నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్‌ను నింపేందుకు ఈ సొరంగం ఉపయోగపడుతుంది. శ్రీశైలం వరదల సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను మళ్లించాలన్నది లక్ష్యం.దీని వల్ల కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 640 గ్రామాల్లోని 20 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో నీటిపారుదల సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. అవుకు లో రెండు సొరంగాలు ఎందుకు??? మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. అవుకు లో మూడవ సొరంగం కూడా నిర్మాణం అవుతుంది!!! ముఖ్యమంత్రి జగన్ గారు రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఈ విధంగా కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు ఆ నీటిని సముద్రంలో కలవనీయకుండా ఒడిసి పట్టి మనం గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా అవుకు టన్నెల్స్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు నీటిని మల్లించి అక్కడ నుంచి మనం గండికోట రిజర్వాయర్‌కు మళ్ళీ ఇస్తాం.. ఇక్కడ నుండి గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా కడప చిత్తూరు నెల్లూరు అనంతపురం జిల్లాలకు తాగునీరు సాగునీరు లభ్యమవుతుంది... ఒకటే టన్నెల్ సొరంగం ఉంటే కేవలం 5000 క్యూసెక్కుల నీరు మాత్రమే మళ్ళించగలరు అదే మనము రెండు మూడు సొరంగాలు ద్వారా దాదాపు 20వేల క్యూసెక్కుల నీటిని మరలిస్తూ 30 దినాలలో 38 టీఎంసీల నీటిని మనం గండికోట రిజర్వాయర్ వైపు మళ్ళించవచ్చు.. అందుకనే రెండు టన్నెల్ లు కట్టారు.. మూడవ టన్నెలు కూడా రాబోతుంది... డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు -
నంద్యాల జిల్లా: అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
సీమ ప్రజలకు వరం అవుకు రెండో టన్నెల్ రెడీ
-
అవుకు రెండవ టన్నెల్ ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
-
నెరవేరిన రాయలసీమ-నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం
-
అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్‌ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్‌ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్‌సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. -
రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు. -
నేడు విశాఖ సౌత్, బనగానపల్లి, ఒంగోలులో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజికన్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బుధవారం విశాఖపట్నం జిల్లా విశాఖ సౌత్, నంద్యాల జిల్లా బనగానపల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పలు కార్యక్రమాలను పేదలకు వివరిస్తారు. విశాఖపట్నం: విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఫార్చున్ ఇన్ హోటల్లో వైఎస్సార్సీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు డైమండ్ పార్క్ నుంచి రైల్వే న్యూ కాలనీ, మనోహర థియేటర్, దుర్గాలమ్మ గుడి, జగదాంబ జంక్షన్ మీదుగా టౌన్ కొత్త రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 2:30 గంటలకు టౌన్ కొత్త రోడ్డులో జరగనున్న బహిరంగ సభలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు. ఒంగోలు: ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలు నోవాసిస్ హోటల్లో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కర్నూల్ రోడ్డు బైపాస్ నుండి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగనుంది. 4 గంటలకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో రీజనల్ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, తదితరులు హాజరుకానున్నారు. నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర సాగనుంది. బనగానపల్లె ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో ముస్లిం మైనారిటీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఒంటిగంటకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం కూరగాయల మార్కెట్ మీదుగా పెట్రోల్ బంకు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ, మంత్రులు నారాయణ స్వామి, అంజాద్ భాషా, మాజీ మంత్రి పార్థసారథి హాజరుకానున్నారు. -
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీకి షాక్
-
నంద్యాల జిల్లాలో భూమా కుటుంబానికి బలమైన వర్గం
-
కిం కర్తవ్యం?.. ఇప్పుడేం చేద్దాం..
సాక్షి, నంద్యాల జిల్లా: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపు(శుక్రవారం) నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ నుంచి నారా లోకేష్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ కానుంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ముందు నిలబడుతుందా?. లోకేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలున్నాయి.?. లోకేష్ పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడుతుందా?. ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా?. చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?. భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు?. ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా?. అనే దానిపై చర్చించనున్నట్లు తెలిసింది. లోకేష్ అరెస్ట్ అవుతారంటూ ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమేనా? సానుభూతి కోసమా?, బాలకృష్ణ పాత్ర ఏంటీ? పార్టీ మీటింగ్‌లు రెండు పెట్టి మళ్లీ కనిపించడం లేదేందుకు?. జైలు ముందు పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు తెర మీదికి రావడం లేదు?. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ ఏ సీట్లు ఇస్తారు?’’ అనేది హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: CBN: ఆర్థిక అరాచకం.. స్వయంకృతాపరాధం -
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
-
సీమ నీటి కష్టాలు నాకు తెలుసు: సీఎం జగన్
CM YS Jagan Kurnool And Nandyal Tour Updates 12:33PM డోన్ సభలో సీఎం జగన్ ప్రసంగం ►ఈరోజు ఒకవైపున పండుగ, మరోవైపున మీ అందరి ప్రేమాభిమానాల మధ్య మంచి కార్యక్రమం దేవుడి దయతో ఇక్కడ జరుపుకుంటున్నాం. ►మనందరి ప్రభుత్వం నీటి విలువ తెలిసిన ప్రభుత్వం. ►రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన అంతా కూడా శాశ్వతమైన మార్పు తీసుకొని రావాలని ►మంచి ఉద్దేశంతో అడుగులు వేయడం జరిగింది. ►అందులో భాగంగానే ఈరోజు కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగిస్తూ, మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. ►హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగునీరు, సాగు నీరు అందించే కార్యక్రమం. ►లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ 77 చెరువులు నింపే కార్యక్రమం. ►దాదాపు రోజుకు 160 క్యూసెక్కులు చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లు నింపేట్లుగా కార్యక్రమం మొదలవుతోంది. ►పక్కనే శ్రీశైలం ఉన్నా కూడా ఈ మెట్ట ప్రాంతాలకు పత్తికొండ, డోన్ మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందని దుస్థితి. ►డోన్‌లో అయితే ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లో లేని పరిస్థితి. ►ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. ►2019 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ►2018 నవంబర్ అంటే ఎన్నికలకు కేవలం నాలుగు ఐదు నెలల ముందు మాత్రం ఒక జీవో ఇస్తారు, టెంకాయ కొడతారు ప్రజల్ని మోసం చేసేందుకు అడుగులు పడతాయి. ►అటువంటి పరిస్థితి నుంచి భూమి కూడా అక్వైర్ చేయలేదు. ►కేవలం టెంకాయ కొట్టేందుకు మాత్రమే 8 ఎకరాలు కొనుగోలు చేశారు. ►అటువంటి దారుణమైన మోసాలు, పరిస్థితుల మధ్య మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడింది. ►రాయలసీమ బిడ్డగా, నీటి విలువ తెలిసిన బిడ్డగా ఈ ప్రాంతానికి తోడుగా నిలబడేందుకు అక్షరాలా 250 కోట్ల విలువ చేసే ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాం. ►ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసే రోజు వచ్చింది. ►అత్యంత కరువుతో కూడిన 8 మండలాలకు 10,130 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు తాగునీరు అందిస్తూ, 253 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ►ఈ ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ రెండు నియోజకవర్గాలకు చాలా మంచి జరుగుతుంది. ►ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది. ►వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ నీవా కాలువ నుంచి పైప్ లైన్ కనెక్టివిటీ పూర్తియింది. ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి. ►క్రిష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, దేవరకొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైప్‌లైన్ కనెక్టివిటీ పూర్తయి పైప్ లైన్ కనెక్టివిటీ కొనసాగుతోంది. ►ప్యాపిలి బ్రాంచ్ కింద ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైప్ లైన్ పూర్తయి, ట్రయల్ రన్ కొనసాగుతోంది. ►జొన్నగిరి బ్రాంచ్ కింద డోన్, తుగ్గలి మండలాల్లో మరో 7 చెరువులకు కూడా కనెక్టివిటీ పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నాం. ►ఈ ప్రాజెక్టులో కొత్తగా డోన్ నియోజకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ►మొత్తంగా 77 చెరువులకు సంబంధించిన ఈ ప్రాజెక్టు పనులన్నింటికీ 253 కోట్లతో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడం జరుగుతోంది. ►ఇదొక్కటే కాకుండా గాజులదిన్నె ప్రాజెక్టుకు, ఈ సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుకు, ఎమ్మిగనూరు నియోజకవర్గం కొనగండ్ల మండలం గాజుల ►దిన్నె వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినది. ►24,372 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ►వర్షాలు పడితేనే బతకాలి తప్ప దీనికి కూడా కృష్ణా జలాల అలకేషన్ లేదు. ►పత్తికొండ నియోజకవర్గంలో 27 గ్రామాలకు, క్రిష్ణగిరి మండలంలో మరో 55 ఆవాసాలకు డోన్ మున్సిపాలిటీకి, కొనగండ్లతోపాటు మరో 10 ►ఆవాసాలకు తాగునీరు అందిస్తోంది. ►కర్నూలు నగరానికి కూడా నీటి సరఫరా ఇక్కడి నుంచే జరిగే కార్యక్రమం జరుగుతోంది. ►గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచాం. ►హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి గ్రావిటీ ద్వారా ప్రాజెక్టుకు నీళ్లు కేటాయిస్తూ 57 కోట్లు ఖర్చు చేసి ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ►ఆలోచన చేయమని అడుగుతన్నా. నేను చెప్పే ఈ గాజులదిన్నె ప్రాజెక్టుగానీ, కృష్ణానది అలకేషన్ లేదని గానీ ఇంత ఉపయోగపడే ప్రాజెక్టుకు మంచి జరిగించాలనే ఆలోచన గతంలో ఎప్పుడూ జరగలేదు. ►ఈ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప వ్యవసాయం జరగదని తెలిసి కూడా ఏ రోజు కూడా చెరువులు నింపాలని ఆలోచన చేయలేదు. ►కేవలం ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు, టెంకాయలు గుర్తుకొస్తాయి, జీవో కాపీ గుర్తుకొస్తుంది. ►ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచన, తపన ఎప్పుడూ రాదు. ►నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో మీ కష్టాలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను, మీకు నేను ఉన్నాను అని చెప్పా. ►చెప్పిన మాట ప్రకారం నాలుగు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి మీ ముందు మీ బిడ్డ నిలబడుతున్నాడు. ఈరోజు నిజంగా రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే ఇంత దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్నాం. ►ఈరోజు హంద్రీనీవా నుంచి తూము పెట్టి 77 గ్రామాలకు లిఫ్ట్ చేసి నీళ్లు పంపించగలుగుతున్నాం. ►హంద్రీనీవా ప్రాజెక్టు కట్టింది ఎవరు అని అడుగుతున్నా. ►ఇదే పెద్దమనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పెద్దమనిషి హంద్రీనీవాకు ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు. ►ఆ తర్వాత దివంగత నేత ప్రియతమ నాయకుడు, నాన్నగారు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా కాలువ 6 వేల కోట్లతో నిర్మించారు. ►అందుకే ఈరోజు ఆ ప్రధాన కాలువ ద్వారా మనం తూములు పెట్టుకోగలుగుతున్నాం. నీళ్లతో చెరువులు నింపగలుగుతున్నాం. ►తేడా గమనించమని అడుగుతున్నా ►ప్రజల గురించి నిజంగా ఆలోచన చేశారంటే అప్పట్లో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారి హయాంలో జరిగింది. ►మళ్లీ ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మీ బిడ్డ ప్రభుత్వంలోనే మళ్లీ జరుగుతోంది. ►రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా తోడుగా నిలబడేందుకు ఆదుకొనేందుకు అప్పట్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కార్యక్రమాన్ని ►నాన్నగారు 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ►ఈరోజు వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ►పడితే ఒకేసారి కుంభవర్షం పడుతోంది. నీళ్లు స్టోర్ చేసుకోలేకపోతే ఆ తర్వాత వరదలు వచ్చే రోజులు తక్కువే. ►పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మీ బిడ్డ ప్రభుత్వంలో 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్తూ అడుగులు పడుతున్నాయి. ►800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ ను తీసుకొచ్చి 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడులో వేసే కార్యక్రమం జరుగుతోంది. ►గతంలో పాలకులను చూశాం పోతిరెడ్డిపాడులో నీళ్లు పడాలంటే శ్రీశైలం నిండితే గానీ నీళ్లు రాని పరిస్థితి. ►881 అడుగులు చేరితే తప్ప నీళ్లు రాని పరిస్థితి. ►అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ నిండి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల్లో మాత్రమే నీళ్లు తీసుకొనే పరిస్థితి ఉంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతామా? ►అటువంటి పరిస్థితుల్లో ఎవరూ ఆలోచన చేయలేదు. ►మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆలోచన చేశాం. ►800 అడుగుల్లోనే ఆ పక్కన తెలంగాణ తీసుకుంటోంది. వాళ్ల లిఫ్ట్ ప్రాజెక్టులన్నీ 800 అడుగుల్లోపే ఉన్నాయి. ►వాళ్లు రేప్పొద్దున పవర్ జెనరేట్ చేస్తున్నారు. మనకేమో 881 అడుగులు వస్తే తప్ప నీళ్లు అందని పరిస్థితి. ►దాన్ని మారుస్తూ రాయలసీమ ప్రజలకు తోడుగా ఉండేందుకు 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ►వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మన కళ్ల ఎదుటే కరువుతో ఉన్న ప్రకాశం జిల్లా కనిపిస్తోంది. ►వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే తప్ప దానికి నీళ్లు రావు. ►నాన్నగారి హయాంలో ఒక్కో టన్నెల్ 18 కిలోమీటర్లు. ►దాని తర్వాత అడుగులు ముందుకు వేయాలి అంటే ఇబ్బందికర పరిస్థితులు. ►తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ►కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు మళ్లీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మొదటి టన్నెల్ పూర్తి చేశాడు. ►రెండో టన్నెల్ రేపు నెల అక్టోబర్‌లో జాతికి అంకితం చేయబోతున్నాం. ►మీ బిడ్డ హయాంలోకి రాకముందు గతంలో చంద్రబాబు హయాంలో రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులను గమనించాలి. ►గండికోట 27 టీఎంసీల కెపాసిటీ, నీళ్లు పెట్టే పరిస్థితి కేవలం 12 టీఎంసీలు పెట్టలేని పరిస్థితి. ►చిత్రావతి 10 టీఎంసీల కెపాసిటీ, కేవలం మూడు నాలుగు టీఎంసీలు నీళ్లు పెట్టలేని పరిస్థితి. ►బ్రహ్మం సాగర్ 17 టీఎంసీల కెపాసిటీ, కానీ నీళ్లే అందని పరిస్థితి. ►మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్టులో కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచాం. ►ఆర్ఆర్ కు సంబంధించిన డబ్బులు ఇచ్చాం. ►ఈ రోజు ఈప్రాజెక్టులో పూర్తిగా నీటి నిల్వ చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా. ►గతానికి ఇప్పటికీ తేడాను గమనించమని అడుగుతున్నా. ►ఇవన్నీ ఒకవైపున చెబుతూ మరోవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆలోచన చేయాలి. ►మనం ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్లేటప్పుడు మనస్సాక్షిని అడగాలి. ►ఈ ప్రభుత్వంలో మనకు మంచి జరిగిందా? లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ►గతానికి ఇప్పటికి తేడా గమనించమని అడుగుతున్నా. ►గతంలో ఇదే రాష్ట్రమే, ఇదే బడ్జెట్, అప్పులు అప్పటి కన్నా గ్రోత్ రేటు తక్కువే. ►మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి. ►అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నాలుగు సంవత్సరా ల కాలంలో 2.35 లక్షల కోట్లు నేరుగా పంపించాం. ►గతంలో చంద్రబాబు హయాంలో ఇదే కార్యక్రమం ఎందుకు జరగలేదు ఆలోచన చేయాలి. ►మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేదు. ►చంద్రబాబు నమ్ముకున్నది ప్రజలకు మంచి చేయాలని కాదు ►ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి మీద ఆయన నమ్మకం. ►రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం. ►అలా పంచుకుంటే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ►ఈనాడు రాయదు, చూపించదు. ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం డంకా బజాయిస్తుంది. ►టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసినా బ్రహ్మాండగా చేశాడని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ►అప్పట్లో జరిగిందంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం. ►గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే, పైస్థాయిలో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరికితోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. ►కానీ మీ బిడ్డ హయాంలో ఈరోజు గమనించమని అడుగుతున్నా. ►ప్రతి గ్రామంలో పాలన మారింది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం వచ్చింది. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ వచ్చాడు. ►రాజకీయాలు, పార్టీలు, చూడటం లేదు. లంచాలు, వివక్ష లేదు. ►అర్హత ఉంటే చాలు మా పార్టీకి ఓటు వేశాడా లేదనేది చూడటం లేదు. ►గ్రామంలో సోషల్ ఆడిట్ లో లిస్టు పెడుతున్నారు. ►రాకపోతే మీరు అడగండి మీ జగనన్న ప్రభుత్వం ఇస్తుందని భరోసా కల్పిస్తున్న పాలన కనిపిస్తోంది. ►మీ ఊర్లో ఉండే స్కూళ్లను గమనించండి, గతానికి ఇప్పటికీ తేడా గమనించండి. ►స్కూళ్లన్నీ ఇంగ్లీష్ మీడియం అయ్యాయి, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. ►6వ తరగతి నుంచి ఐఎఫ్ పీ ప్యానెల్స్ పెడుతున్నారు. ►8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తున్నారు. ఈ మార్పులు నాడు-నేడుతో మారుతున్నాయి. ►స్కూళ్ల పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, హాస్పిటల్స్ పరంగా ఎప్పుడూ చూడని విధంగా గ్రామంలో విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. ►మారిపోయిన పీహెచ్ సీలు కనిపిస్తున్నాయి. ►సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కనిపిస్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్న పరిస్థితి. ►53 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ నింపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ►ఆరోగ్య సురక్షను లాంచ్ చేశాం. ప్రతి ఇంట్లో జల్లెడ పడుతున్నారు. ►ఏ సమస్య ఉన్నా టెస్టులు చేసి మందులు ఇచ్చి చేయి పట్టుకొని నడిపిస్తున్నాం. ►వ్యవసాయం తీసుకుంటే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. ఈ క్రాపింగ్ జరుగుతోంది. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికీ మంచి జరుగుతోంది. ►పంటల కొనుగోలులో ఇబ్బంది ఎదురైతే వెంటనే ఆర్బీకే స్థాయి నుంచే కొనుగోలు చేసేలా ఈరోజు పరిస్థితి కనిపిస్తోంది. ►ప్రతి అడుగులోనూ వ్యవసాయం, చదువులు, ఆరోగ్యం, గవర్నెన్స్, మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం, సామాజిక న్యాయం తీసుకున్నా మన ప్రభుత్వానికి సాటి ఎవ్వరూ లేని చెబుతున్నా. ►అందరితో నా విన్నపం ఒక్కటే అబద్ధాలు నమ్మకండి ►రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. ►మనకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ5, దత్తపుత్రుడు లేడు. ►నేను వీళ్లను నమ్ముకోలేదు. నేను నమ్మకున్నదల్లా మంచి చేయడం, ఆ మంచి మీ ఇళ్లలో జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ►ఉండాలని పిలుపునిస్తున్నా. ►దేవుడి దయ వల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 12:20PM డోన్ సభలో మంత్రి బుగ్గన ►జిల్లా ప్రజలకు ఇది పండుగ రోజు ►కరువు సీమలో సీఎం జగన్ చర్యలతో సాగు, తాగునీళ్లు ►గతంలో ఈ ప్రాంతం అనేక అవస్థలు పడింది ►77 చెరువులకు సీఎం జగన్ జలకళనుఅందించారు ►డోన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ►పలు ప్రాంతాల్లో అనేక కొత్త రోడ్లను వేయించారు. ►గత పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారు. ►గత ప్రభుత్వ కుంభకోణాలను అసెంబ్లీలో వివరిస్తాం ►చంద్రబాబు అరెస్టుపై కొంతమంది అవాస్తవాలు చెబుతున్నారు ►అవినీత కేసులో ప్రతిపక్ష నేత అరెస్టై జైలుకు వెళ్లారు 12:07PM ►డోన్ బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం జగన్ 11:10 AM ►హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరువులకు నీటి కేటాయింపు. ►కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా సీఎం జగన్ చర్యలు. ►రూ.224 కోట్లతో పంప్‌హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది. ►77 చెరువులకు లక్కసాగరం పంప్‌హౌస్ నీటిని అందించనుంది. దీంతో, నీటి కష్టాలు తీరునున్నాయి. 10:58AM ►లక్కసాగరం వద్ద పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ►డోన్, పత్తికొండ,ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు జలకళ ►హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు,సాగునీటి సరఫరా ►10,394 ఎకరాలకు సాగునీరందించే పథకం ప్రారంభం 10:21AM ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకున్నారు ►ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ సృజన, రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ►మరి కాసేపట్లో లక్కసాగరం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు వద్దకు సీఎం జగన్. ►అక్కడినుండి పంప్ హౌస్‌కు చేరుకుని రాయలసీమ వరప్రధాయనిగా వున్న 77 చెరువులకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ 7:50AM ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ►సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ►హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ►ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లా డోన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. -
మహిళా రైతును కాపాడిన దిశ యాప్
సాక్షి, నంద్యాల జిల్లా: దిశ యాప్‌తో తనకేమి ఉపయోగం ఉంటుందనుకున్న ఓ మహిళా రైతుకు అదే యాప్ రక్షణగా నిలబడింది. పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న ఆమెపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించగా, వెంటనే ఆ మహిళ దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రుద్రవరం మండలం పెద్ద కంబలూరుకు చెందిన మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేసి ప్రసాద్ నుంచి తప్పించుకుంది. స్థానికులు రావడంతో ప్రసాద్ అక్కడ నుండి పారిపోయాడు. బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించింది. చదవండి: పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్ బాధిత మహిళ వుండే లోకేషన్‌కు దిశ పోలీసులు కేవలం పది నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. సిరివెళ్ల వైపు పారిపోతున్న నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 354 ఏ, 354 బి, 506ల కింద రుద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ SOS కు కాల్ చేసిన పది నిముషాల వ్యవధిలో పోలీసులు వచ్చి సహాయం చేశారని బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం తన సెల్ ఫోన్లో గ్రామ సచివాలయ సిబ్బంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసి, ఎలా ఉపయోగించాలో వివరించినట్లు మహిళ తెలిపింది. ఆ సమయంలో దిశ యాప్ వలన తనకేమి ఉపయోగం ఉంటుందని సచివాలయ సిబ్బందితో వాదించిన విషయాన్ని మహిళ గుర్తు చేసింది. కానీ అదే దిశ యాప్ ఈ రోజు తనకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఊహించలేదని పేర్కొంది. ఆపదలో ఉన్న తనకు దిశ పోలీసులు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేనని చెప్పింది. మహిళల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తున్నట్లు దిశ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నంద్యాల జిల్లా డోన్ లో నూతన పురపాలక భవనాన్ని ప్రారంభించిన మంత్రులు
-
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి స్కెచ్, మరో మహిళతో ఫోన్ చేయించి
సాక్షి, నంద్యాల: హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వెంకటన్న (42)ను సొంత భార్యనే పొట్టన పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్ వెంకటన్నకు భార్య శ్యామల, కొడుకు శరత్చంద్ర(9) ఉన్నారు. భార్య ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తుండగా.. వెంకటన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 19న వెంకటన్న హత్యకు గురయ్యాడు. కాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్యనే నిందితురాలని తేలింది. బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో శ్యామలకు వివాహేతర సంబంధం ఉంది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంకటన్న వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు కుమార్‌స్వామి, అతని స్నేహితులు ఐదుగురితో కలిసి శ్యామల హత్యకు కుట్ర పన్నింది. ఈ మేరకు బేతంచెర్లకు చెందిన దేవమణి అనే మహిళను రంగంలోకి దింపారు. ఆమె ఫోన్లో వెంకటన్నను పరిచయం చేసుకుని వల పన్నింది. ఈనెల 19న ఫోన్ చేసి జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ గట్టు వద్దకు రావాలని చెప్పడంతో వెంకటన్న బైక్‌పై వెళ్లాడు. కాగా అప్పటికే అక్కడ మాటు వేసిన కుమారస్వామి, అతని స్నేహితులు నలుగురితో కలిసి వెంకటన్న గొంతుకు బైక్ తీగ బిగించి చంపేశారు. ఆ తర్వాత ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోదారు. కాగా పోలీసులు శ్యామల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టి ఛేదించినట్లు సీఐ తెలిపారు. హత్యకు పాల్పడిన శ్యామల, ఆమె ప్రియుడు కుమారస్వామి, అతని స్నేహితులు శ్రీనివాసులు, లక్ష్మన్న, హుసేన్ నాయుడు, రంగనాయకులు, దేవమణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. చదవండి: స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే భర్త... -
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. షాకిచ్చిన ఏవీ సుబ్బారెడ్డి!
సాక్షి, నంద్యాల: నంద్యాలలో రోడ్డున పడ్డ తెలుగుదేశం పరువును అర్జంటుగా కాపాడేందుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు రంగంలోకి దిగారు. లోకేష్ యువగళం పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలుగవద్దని, పార్టీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినొద్దంటూ కింది క్యాడర్ కు సందేశమిచ్చారు చంద్రబాబు. కొట్టుకున్నది చాలు, కేసులు వద్దు అంటూ రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు ఇదే జిల్లాలో పాదయాత్ర, మరో వైపు సొంత పార్టీలోనే కుమ్ములాటలు బాబుకు ఇరకాటంగా మారాయి. నిన్న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దాడులకు దిగిన భూమా అఖిలప్రియను, దెబ్బలు తిన్న ఏవీ సుబ్బారెడ్డిని రాజీపరిచేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అఖిలప్రియపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డిపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్టు టీడీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. కానీ, చంద్రబాబు ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ కేసు విషయంలో రాజీపడే ప్రస్తకే లేదని ఏవీ సుబ్బారెడ్డి ఫిక్స్ అయినట్టు ఆయన వర్గం చెబుతోంది. ఇదిలా ఉండగా.. తనపై దాడికి పాల్పడినట్టు ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా ఏవి సుబ్బారెడ్డినే తనపై దుర్భాష లాడి దాడికి యత్నించారని అఖిలప్రియ నేరుగా డిజిపి కి ఫిర్యాదు చేసింది. దాంతో పాటు ఏవి సుబ్బారెడ్డిపై నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది భూమా అఖిల ప్రియ. నిన్న జరిగిన ఘటనలో తమపై ముందుగా ఏవి సుబ్బారెడ్డి దాడి చేశారని, తమను తాము రక్షించుకునే క్రమంలో ఎదురుదాడి జరిగిందని తెలిపింది. మరోవైపు.. వీరిద్దరిని రాజీకి ఒప్పించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్సీ ఫరూఖ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన భూమా అఖిలప్రియను పాణ్యం నుంచి నంద్యాల తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నంద్యాల కోర్టులో జడ్జి ముందు అఖిలప్రియను హాజరు పరిచారు పోలీసులు. ఇది కూడా చదవండి: కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్ -
కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో తెలుగుదేశం పరువు బజారున పడింది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్‌కు తరలించారు. దాడి గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల పర్యటన సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగారాని, దీనిపై నిలదీస్తే ఏవీ సుబ్బారెడ్డి తనను దూషించారని అఖిలప్రియ ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డి పై దాడిచేశారని తెలిపారు. తన కోసం భర్త భార్గవ్ రామ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని అఖిలప్రియ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఖండించారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు. ఇదిలా ఉండగా, నంద్యాల ఘటనపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపట్టుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసలే అంతంత మాత్రంగా నడుస్తోన్న లోకేష్ పాదయాత్రకు కొత్తగా ఇవేమీ ఇబ్బందులంటూ చంద్రబాబు వాపోయినట్టు తెలిసింది. ఘటనపై పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. సీనియర్లతో త్రిసభ్య కమిటీ వేశారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. పాదయాత్ర పూర్తయ్యేవరకు పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చదవండి: లేఖను ఎందుకు దాచారు? -
టీడీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి
సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. లోకేస్ పాదయాత్రలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండిస్తున్నారు. -
నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా
-
విహార యాత్రలో విషాదం..
-
ఉత్తమ ఫలితాలు...అద్భుత ప్రతిభ...
-
‘ఏపీలో ఉన్నంత మీడియా స్వేచ్ఛ మరే రాష్ట్రంలోనూ లేదు’
సాక్షి, నంద్యాల జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత "మీడియా స్వేచ్ఛ" మారే రాష్ట్రంలోనూ లేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైలంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ రాష్ట్రంలోనే ముఖ్య మంత్రిని గంజాయి మొక్కతో పోల్చి దుర్మార్గంగా, ఇష్టారాజ్యంగా కథనాలు వ్రాయడం, ప్రచురించడం జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గం మీడియా ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నా వారినెవరూ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే, మన రాష్ట్రం లో పత్రికా స్వేచ్ఛ వాస్తవ రూపంలో వున్న విషయం అందరం గుర్తించగలమని కొమ్మినేని పేర్కొన్నారు. చదవండి: ‘రామోజీ’ రహస్యాలు.. మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తాయా? -
మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలం..
సాక్షి, నంద్యాల: మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలమైంది. బుధవారం రాత్రి తల్లిపులితో కలపడానికి పులి కూనలను అధికారులు ఫారెస్ట్‌కు తరలించారు. ఈ క్రమంలో తల్లి పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అయితే, తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు రాత్రంతా శ్రమించినా ఫలితం దక్కలేదు. రాత్రంతా వేచి చూసినా తల్లి పులి రాకపోవడంతో పులి కూనలను ఆత్మకూరు క్యాంప్‌కు తరలించారు. కాగా, రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాల్లో కూనలను ఉంచి, కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం వెతికారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరా, ప్లగ్ మార్క్ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు -
నంద్యాల: పులి కూనలపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి కూనల లభ్యమైన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన నాలుగు పులి కూనల్లో... రెండు పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ టీమ్ సిబ్బంది పులికూనలను ఆడవిలో వదిలిన కానీ, అక్కడి నుంచి అవి కదలడం లేదు పులికూనలకు పాలు తాగించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేసింది. నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా పులి కూనలు డీహైడ్రేషన్‌కు గురికావడంతో బైర్లుటి వైల్డ్ లైఫ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. పులి కూనల తల్లీ(పెద్దపులి) ఆచూకీ తెలుసుకునేందుకు ఇన్ఫ్రారెడ్(ట్రాప్) కెమెరాలను టైగర్ ట్రాకర్లు పరిశీలిస్తున్నారు. చదవండి: రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో -
మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
శ్రీశైలం టెంపుల్(నంద్యాల జిల్లా): శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్, కల్పనాదాస్ దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ, సత్యప్రభ దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి దంపతులు రత్నగర్భ స్వామిని దర్శించుకుకున్నారు. ఆ తర్వాత మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని, అనంతరం భ్రమరాంబాదేవి అమ్మ వారిని దర్శించుకున్నారు. వీరి వెంట పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శ్రీశైలం శాసన సభ్యుడు శిల్పాచక్రపాణి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర రిజి్రస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజి్రస్టార్ జనరల్ కె.సుజన, దేవదాయ శాఖ కమిషనర్ ఎం హరిజవహర్‌లాల్, కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
నంద్యాల జిల్లా పాణ్యంలో దారుణ హత్య
-
నంద్యాల జిల్లాలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పర్యటన
-
కరువు సీమను సస్యశ్యామలం చేస్తాం
డోన్(నంద్యాల జిల్లా): కరువు సీమను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినమైన ఆదివారం, సోమవారం రెండురోజుల పాటు మంత్రి బుగ్గన నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్ మండలాల పరిధిలోని 12 చెరువులను సందర్శించి హంద్రీనీవా కాల్వ నీటితో చెరువులను నింపే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రెడ్డి రాజశేఖర్, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు ఆధ్వర్యంలో చనుగొండ్ల గ్రామంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సందర్భంగా హంద్రీనీవా నీటితో డోన్, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని 68 చెరువులను నింపుతామని హామీ ఇచ్చారని, ఆ మేరకు మొదటి దశ కింద రూ.360 కోట్లతో వచ్చే జూన్ నాటికి సాగునీరు అందిస్తామన్నారు. క్రిష్ణగిరి మండలం పులిచెర్ల కొండపై డెలివరీ చాంబర్‌తో పాటు లక్కసాగరం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్.. అన్ని చెరువులకు నీటిని మళ్లింపు చేసే కార్యక్రమం పైపులైన్ పనులు 100 శాతం పూర్తయ్యాయన్నారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారు కాగానే చెరువులకు నీటిని మళ్లించే కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఆయన మండలంలోని దేవరబండ, చనుగొండ్ల, యాపదిన్నె, మల్లెంపల్లె, వెంకటాపురం, ఉడుములపాడు, జగదుర్తి, ఎల్లారెడ్డి చెరువుల వద్ద ఆయా గ్రామ ప్రజలతో కలిసి మంత్రి బుగ్గన నీటి మళ్లింపు కార్యక్రమానికి భూమిపూజ చేశారు. ఖరీఫ్ నాటికి 10వేల ఎకరాలకు సాగునీరు ప్యాపిలి: వచ్చే ఖరీఫ్ నాటికి డోన్ నియోజకవర్గంలో 10వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మెట్టుపల్లి, ఏనుగుమర్రి, ప్యాపిలి, పెద్దపొదిళ్ల చెరువులను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రైతులనుద్దేశించి మాట్లాడారు. వర్షాధారం మీద మాత్రమే ఆధారడిన డోన్ నియోజకర్గం రైతులకు చెరువులు నింపే కార్యక్రమం ఓ వరం అన్నారు. బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు తీసే అవకాశం లభిస్తుందన్నారు. -
శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్.. ఎన్నో ప్రత్యేకతలు
సాక్షి, అమరావతి: ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల అటవీ ప్రాంతం. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. అరుదైన వృక్షాలు.. వన్యప్రాణులు.. అన్నిటికీ మించి పులులు జీవించేందుకు నల్లమల అత్యంత అనుకూలమైంది. విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు. ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలతో అలరారుతున్న నల్లమలను చుట్టి రావాలంటే.. మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ.. అక్కడి జీవవైవిధ్యం అంతటినీ శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్లో చూడవచ్చు. నల్లమల ప్రత్యేకతలు, జీవజాలం, జంతుజాలం, పులులు, ఇతర వన్యప్రాణులు వంటి సమస్త సమాచారం అక్కడ ఉంటుంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ప్రాంతంలో జీవవైవిధ్య కార్యకలాపాల కోసం 2001లో స్వతంత్ర జీవవైవిధ్య పరిశోధన కేంద్రాన్ని శ్రీశైలంలో ప్రారంభించారు. దశాబ్ద కాలంలో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, వివిధ జాతుల జాబితాకు సంబంధించి అత్యుత్తమ పరిశోధనలు ఇక్కడ జరిగాయి. ఈ అటవీ ప్రాంతంలోని వెన్నెముక లేని, వెన్నెముక ఉన్న జీవుల నమూనాలను సేకరించి బయోడైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ ల్యాబోరేటరీలో భద్రపరిచారు. ఇదీ నల్లమల జీవవైవిధ్యం పులులు, ఎలుగుబంట్లు వంటి 80 రకాల పాలిచ్చే జంతువులు, 303 జాతుల పక్షులు, 80 రకాల పాకే ప్రాణులు, కప్పల వంటి 20 ఉభయ చరాలు, 55 రకాల చేపలు, 102 రకాల సీతాకోక చిలుకలు, 57 రకాల తూనీగలు, 47 జాతుల కీటకాలు ఇంకా అనేక రకాల కీటక జాతులను ఈ అటవీ ప్రాంతంలో గుర్తించిన పరిశోధనా కేంద్రం చెక్లిస్ట్ను తయారు చేసింది. నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం, రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యాలలో అన్ని రకాల జీవవైవిధ్య సర్వేలు నిర్వహించింది. నల్లమలలోని జంతు, పుష్ప సంపదపై డిజిటల్ ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. అక్కడి జంతుజాలం, వృక్షజాలం యొక్క జాతుల స్థాయిపై సమగ్ర తనిఖీ జాబితాను రూపొందించింది. మాంసాహార ప్రాణుల ఆహారపు అలవాట్లను అధ్యయనం నిర్వహిస్తోంది. శాకాహార ప్రాణుల వెంట్రుకల ద్వారా వాటి లక్షణాలను గుర్తిస్తోంది. ఇక్కడి గడ్డి జాతుల వైవిధ్యం, వృక్ష జాతులతో వాటిపై సంబంధాలపై అధ్యయనం చేసింది. పులుల గణన ఇక్కడే.. నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల గణన చేపట్టేది ఈ పరిశోధనా కేంద్రంలోనే. అటవీ ప్రాంతంలో పులులు తిరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ల నుంచి సేకరించిన లక్షలాది ఫొటోలను విశ్లేషించి ప్రతి సంవత్సరం పులులను ఇక్కడ లెక్కిస్తారు. పులుల సంఖ్య, వాటి తీరు, ఆడవా, మగవా, వాటి మధ్య తేడాలు వంటి అన్ని అంశాలను గుర్తిస్తారు. పులులపై ఉండే చారల ద్వారా ప్రతి పులి ఆనవాలును ఇక్కడ సేకరించి దాని కదలికలను గమనిస్తారు. చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి ఇతర జంతువులను కూడా ఈ ఫొటోల ద్వారా గుర్తించి లెక్కిస్తారు. అటవీ సిబ్బందికి శిక్షణ తరగతులు, ప్రజలకు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 8.6 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ పక్కన పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఎకోలాజికల్ నాలెడ్జ్ పార్కును అభివృద్ధి చేశారు. ఇందులోని 4.96 హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఆవిర్భావం నుండి ఆధునిక మనిషి జీవ పరిణామ క్రమాన్ని వివరించే థీమ్‌తో ఏర్పాటు చేసిన పార్కు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. -
మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు నిరసన
ఆళ్లగడ్డ(నంద్యాల): తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలంటూ టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి ముందు బంధువులంతా ఎకమై నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి ఉన్న కాలంలో బంధువుల వద్ద సుమారు రూ.8 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వారు చనిపోయిన తర్వాత అప్పులు చెల్లించాలని వారసురాలైన అఖిలప్రియను అడుగుతుంటే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గురువారం రాత్రి అందరూ కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. అప్పులు తిరిగి చెల్లించాలని గొడవపడ్డారు. మీకు ఎలాంటి బాకీ లేనని, తాను ఏమైనా రాసిచ్చిన పత్రాలు ఉంటే చూపాలని అఖిలప్రియ అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు మధ్యవర్తులు బంధువులను సముదాయించి బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం మరి కొందరు బంధువులు తోడై అందరూ కలిసి అఖిలప్రియ ఇంటి మీదకు వెళ్లడంతో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పట్టణ ఎస్ఐ వెంకటరెడ్డి అక్కడికి చేరుకొని అఖిలప్రియ బంధువులకు సర్దిచెప్పారు. అయినప్పటికీ, బాధితులు అఖిలప్రియ ఇంటి ఎదుట నిరసన కొనసాగించారు. -
ప్రియురాలు దక్కలేదని.. యువకుడు షాకింగ్ నిర్ణయం
దొర్నిపాడు(కర్నూలు జిల్లా): ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలపరిధిలోని చాకరాజువేముల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు.. చాకరాజువేముల గ్రామానికి చెందిన జకరయ్య, రత్మమ్మ దంపతులకు ఒక కుమార్తె, ప్రవీణ్‌కుమార్, ప్రసన్న కుమార్ అనే ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుమారులు ఉద్యోగం చేస్తున్నారు. ప్రసన్న కుమార్(24) అప్పుడప్పుడు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని పిన్ని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడ ఓ యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, లక్ష్మీదేవి యువకుడిని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్నకుమార్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో విషగుళికలు మింగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టం లేక యువతి తల్లిదండ్రులు తమ కుమారుడిని బెదిరించినట్లు ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మహేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: మూడేళ్ల క్రితం భర్త మృతి.. ఒంటరి మహిళపై అత్యాచారం ఆ తర్వాత.. -
ఐదు పైసలకే బిర్యానీ.. క్యూ కట్టిన జనం.. పోలీసుల లాఠీ చార్జ్
సాక్షి, బొమ్మలసత్రం: డిసెంబర్ 31 (2022 చివరి రోజు) సందర్భంగా నంద్యాల పట్టణంలోని క్లాసిక్ జైల్ రెస్టారెంట్ నిర్వాహకులు పాత 5 పైసల నాణెం ఇస్తే బిర్యానీ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. దీని కోసం 5 పైసల నాణేలు తీసుకొచ్చి వందల మంది స్థానిక పద్మావతి నగర్‌లోని రెస్టారెంట్ వద్ద గుమిగూడారు. ప్రజలు భారీగా తరలిరావటంతో రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. బిర్యానీ కోసం జనాల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జనాలను అక్కడి నుంచి పంపి రెస్టారెంట్‌కు పోలీసులు తాళం వేశారు. ఇందుకు కారణమైన రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. చదవండి: (రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్) -
Draupadi Murmu: 26న శ్రీశైలం రానున్న రాష్ట్రపతి
సాక్షి, నంద్యాల: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైలం రానున్నారు. ఆమె పర్యటన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిషాంతి, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, శ్రీశైలదేవస్థానం ఈఓ ఎస్ లవన్న పరిశీలించారు. సున్నిపెంటలోని హెలిప్యాడ్‌ను, సాక్షిగణపతి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శ్రీశైలం చేరుకుని రాష్ట్రపతి స్వామిఅమ్మవార్ల దర్శనార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రత విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. నందిసర్కిల్లోని సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ వద్ద కేంద్రప్రభుత్వ పథకాల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట విషయమై టూరిజం శాఖ అధికారులతో మాట్లాడారు. అలాగే శివాజీ స్ఫూర్తి కేంద్రం, వైద్యశాలను పరిశీలించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని అక్కడి సిబ్బందికి సూచించారు. రాష్ట్రపతి సందర్శించే స్వామిఅమ్మవార్ల ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేద్దాం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మనజీర్ జిలానీ శామూ న్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి సమావేశమయ్యారు. రాçష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లుకు సంబంధించి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల ని సూచించారు. హెలిప్యాడ్ వద్ద, ఆలయంలో కేంద్రప్రభుత్వం పథకాల ప్రారంభోత్సవ ప్రదేశాల వద్ద, శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, రాష్ట్రపతి పర్యటించే ప్రతి ప్రదేశం వద్ద కూడా ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య టీం, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే రోజు రాష్ట్రపతి పర్యటనపై రిహార్సల్స్ నిర్వహిద్దామన్నారు. సమావేశంలో డీఆర్ఓ పుల్లయ్య, డీఎస్పీ శృతి, ఆత్మకూరు ఆర్డీఓ దాస్, మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్‌రెడ్డి, జిల్లా వైద్య, అర్అండ్బీ, ట్రాన్స్‌కో, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటనకు భారీ బందోబస్తు శ్రీశైలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన నిమిత్తం భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు ఎస్పీలతో పాటు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్ పార్టీ, బాంబ్‌స్క్వాడ్ తదితర 1,800 మందికి పైగా పోలీస్‌సిబ్బందిని శ్రీశైలానికి డిప్యుటేషన్ విధుల్లో నియమించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. -
ట్రాన్స్‌జెండర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగింది?
డోన్ రూరల్(నంద్యాల జిల్లా): మండల పరిధిలోని తాటిమాన్ కొత్తూరు గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బాలవినోదన్ బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బంధువులు తెలిపిన వివరాలు.. బాలవినోదన్ కొంతకాలంగా డోన్ పట్టణంలోని వైఎస్ నగర్లో బంధువుల వద్ద ఉంటోంది. ఉదయం ఇంట్లోనే పురుగు మందు తాగింది. గమనించిన బంధువులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు కర్నూలుకు రెఫర్ చేశారు. -
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో దారుణం
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మలసత్రం సమీపంలో ఉన్న ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికుడు జమాల్‌బాషాను ఫ్యాక్టరీ యాజమాన్యం ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుడు జమాల్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన అతను కొన్నేళ్లుగా ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. కార్మికులకు యాజమాన్యం అక్కడే భోజనాలు పెడతారు. జమాల్‌బాషా తనకు పరిచయం ఉన్న బియ్యం వ్యాపారితో ఫ్యాక్టరీకి బియ్యం సరఫరా చేయిస్తున్నాడు. బియ్యం వ్యాపారి నుంచి జమాల్‌బాషా కమీషన్ తీసుకుంటున్నట్లు అనుమానించి ఫ్యాక్టరీ మేనేజర్ శేషిరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ మహేశ్వరరెడ్డిలు గత శుక్రవారం దాడి చేశారు. ఫ్యాక్టరీలోని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. విషయం తెలుసుకున్న భార్య పర్వీన్ ఫ్యాక్టరీ ఎండీ సుజల వద్దకు వెళ్లి తన భర్తను విడిచి పెట్టాలని కోరింది. రూ.15 లక్షలు చెల్లిస్తేనే విడిపిస్తామని చెప్పడంతో పర్వీన్ బంధువుల సహాయంతో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు జమాల్‌ను విడిపించి కారకులపై కేసు నమోదు చేయాలని నంద్యాల జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి జమాల్‌బాషాను విడిపించారు. బాధితుని ఫిర్యాదు మేరకు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు. చదవండి: (అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్) -
అసలే లవ్ మ్యారేజ్.. స్వేచ్ఛ ఎక్కువే.. ఇంకేముంది.. పెళ్లయిన మూణ్ణాళ్లకే పెటాకులు!
కర్నూలులోని ఓ కాలనీకి చెందిన నిరంజన్, స్వప్న (పేర్లు మార్చాం) హైదరాబాదులో చదువులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన రెండేళ్లకే అత్తింటి ఆచారాలు వధువుకు నచ్చలేదు. కొంతకాలం మౌనంతో భరించినా ఆ తర్వాత కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నారు. కర్నూలు పాతబస్తీకి చెందిన నరేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్య స్రవంతి(ఇద్దరి పేర్లు మార్చాం)కి ఫోన్ చేసిన ప్రతిసారి సెల్‌ఫోన్ బిజీ వస్తుండటంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచూ వారు వాదులాడుకునేవారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. నాలుగు గోడల మధ్య సర్దిచెప్పాల్సిన ఇరు కుటుంబాల పెద్దలు ఒక్కోసారి మరింత ఆజ్యం పోస్తున్నారు. చిలిపి తగాదాలను సైతం భూతద్దంలో చూస్తూ బంధాన్ని బలహీనం చేసుకుంటున్నారు. ఒక్కోసారి విడిపోయేందుకు కూడా జంకడం లేదు. కడదాకా కలిసి ఉంటామనే పెళ్లినాటి బాసలను అపహాస్యం చేస్తూ ఏడాది తిరక్కముందే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. సాక్షి, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో విడాకుల కోసం వచ్చే దంపతులు ఎక్కువయ్యారు. ఇక మూడేళ్ల కాలంలో చిన్నచిన్న మనస్ఫర్థలతో 2,986 మంది పోలీస్స్టేషన్లను ఆశ్రయించగా.. కలిసి ఉండటానికి ఇష్టపడని మరో 632 మంది కోర్టు మెట్లెక్కారు. వివిధ పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కరం. గొడవ పడే దంపతుల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. పెళ్లి అయిన యువతులు కొత్త కాపురంలోకి కాలు పెట్టగానే అప్పటివరకు ఊహించుకున్నవి గాలిమేడలనే అభిప్రాయానికి వస్తున్నారు. పుట్టిన రోజును మరచిపోవడం, పండక్కి పుట్టింటికి పంపడం లేదన్న చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది సమస్యను రాద్ధాంతం చేసుకునేంతవరకు వెళ్తోంది. ఒక్కోసారి వారు గుర్తించలేనంత స్థాయిలో అగ్నికి ఆజ్యం పోసేలా మూడో శత్రువు ప్రవేశిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగులో సఖ్యతగా ఉండే ఎవరో ఒకరు లేనిపోని అనుమానాలను పెంచుతున్నారు. వారు చెప్పేది నిజమా? కాదా? అని ఆలోచించకుండానే దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇలాంటి జంటలకు కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ మార్పు చెందకపోవడం వల్ల సంసారాల్లో కలతలు పెద్దవై విడాకుల వరకు వెళ్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారే అధికం పోలీస్స్టేషన్లకు ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకున్నవారే వస్తున్నారు. యుక్త వయస్సులో ఆకర్షణకు లోనై ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎదురై కలహాలు ప్రారంభమవుతున్నాయి. ముందే ప్రేమికులు కావడంతో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఈకారణంతో భార్యాభర్తలు పంతాలకు వెళ్తున్నారు. పోలీసులు ఏం చెబుతున్నారంటే.. కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులేమీ కనిపించవు. కానీ ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో అధిక శాతం పెళ్లయిన ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. విడాకులు కావాలని చెప్పే కారణాలు చాలా చిన్నవిగా ఉంటున్నట్లు కౌన్సెలింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యావంతులైన భార్యాభర్తలు కూడా ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పద్ధతిలో పంతాలకు పోతున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఏడాది, రెండేళ్లకే అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతూ విడాకుల దాకా వెళ్తున్నారు. విభేదాలకు కారణాలు.. ►మద్యం కారణంగా జరిగే గొడవలు – 33% ►వరకట్న వేధింపులు – 31% ►వివాహేతర సంబంధాలు/అనుమానాలు – 26% ►మగపిల్లలు పుట్టలేదని/సంతానం కలగలేదన్న కారణాలతో – 5% ►ఇతర కారణాలు – 5% చిన్న కారణాలకే మనస్పర్థలు పెంచుకుంటున్నారు చిన్న కారణాలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నా రు. ఇరు కుటుంబాల సభ్యుల తో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తూ చాలామందిలో మార్పు తీసుకొస్తున్నాం. అయినా కొందరు కోర్టు దాకా వెళ్తూ విడాకులు కోరుకుంటున్నారు. పలు సమస్యలతో దంప తుల మధ్య సఖ్యత తగ్గి విడాకుల దాకా వెళ్తున్నారు. – వెంకటరామయ్య, దిశ మహిళా పీఎస్ డీఎస్పీ కుటుంబ వ్యవస్థపై అవగాహన ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో యువ జంటలకు కుటుంబ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, సర్దుబాటు ధోరణి సన్నగిల్లడం వల్ల విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పెంపక లోపం, ఆర్థిక స్వేచ్ఛ, అహంకారం, అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ సక్రమంగా నిలబడాలంటే స్త్రీ పాత్ర ముఖ్యమైనది. – ఎ.అన్నపూర్ణారెడ్డి, అడ్వకేట్ -
సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం
సాక్షి, ఆళ్లగడ్డ: డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటే అవుననే అంటున్నారు శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులు. ఏళ్లతరబడిగా ఒకే తీరు పంటలు వేస్తూ దిగుబడులు రాక పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ఇప్పుడిప్పుడే ఇతర పంటలు, లాభదాయక సాగుపై దృష్టిసారిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అటవీ సమీప గ్రామాల రైతులు ఎక్కువగా శ్రీగంధం, ఎర్రచందనం, అగర్ ఉడ్, మల్బరీ వేప, మహాగని తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి రెండేళ్లు కష్టపడితే అవి పెరిగి పెద్దవై రూ.కోట్లలో ఆదాయం తెచ్చి పెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు అవసరం లేదు సిరి సంపదల గని శ్రీగంధం. అడవి సంపదలో రారాజు ఎర్రచందనం. ఇవి ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన ధర పలికే చెట్లుగా వెలుగొందుతున్నాయి. అయితే, ఇవి దట్టమైన అడవుల్లో మాత్రమే లభించే చెట్లు. వీటి చెక్కను ఎన్నో ఔషధాల్లో, కాస్మోటిక్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం వీటి వినియో గం పెరగడంతో అంతరించి పోతున్న అరుదైన జాతి సంపదను స్మగ్లర్ల బారి నుంచి సంరక్షించుకునేందుకు ప్రభుత్వం వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో శ్రీగంధం మినహా మిగతా మొక్కలను సో షల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి కొన్ని రకాలు ఉచితంగా మరి కొన్ని రకాల మొక్కలు నామమాత్రపు ధరకు రైతులకు అందజేస్తోంది. దీంతో జిల్లాలో పలువురు వీటిని సా గు చేస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లో అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అనుమతులు ఇస్తోంది. దీంతో జిల్లాలో ప్ర స్తుతం ఎర్రచందనం, శ్రీగంధం సుమారు 80 హెక్టార్లలో సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీగంధం చెట్టు రైతుకు ఆదాయం.. వాతావరణ పరిరక్షణ శ్రీగంధం, ఎర్రచందనం పెంపకం చాలా తేలిక. అటవీ సాగు మొక్కలైన టేకు, జామాయిల్, సుబాబుల్ మొక్కలు మాదిరే వీటిని పెంచవచ్చు. నీరు నిలవని మెట్టభూములు వీటి సాగుకు అనుకూలం. ఈ మొక్కలకు ఎటువంటి క్రిమి కీటకాలు ఆశించవు. రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి నాలుగైదు సార్లు నీటితడులు, ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. గంధం, చందనం సాగు రైతులకు ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. సాగు ఇలా.. ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 560 మొక్కలు నాటుకోవచ్చు. ఎర్రచందనం మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి ఉచితంగా అందజేస్తారు. శ్రీగంధం మొక్కలు ప్రైవేటు నర్సరీల్లో లభ్యమవుతాయి. మొక్కలు నాటిన మూడు, నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు, సాగు చేసుకోవచ్చు. సాగు వ్యయం ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతుందని అంచనా. పచ్చని బంగారం శ్రీగంధం ఎర్రచందనం తరువాత శ్రీగంధం కలపకు భారీ డిమాండ్ ఉంటుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే. శ్రీగంధం చెక్కను సెంట్లు, అగరబత్తీలు, సబ్బులు, అందమైన బొమ్మలు తయారీలో వినియోగిస్తారు. ఒక కిలో ధర రూ. 8 వేల నుంచి రూ. 16వేల వరకు ఉంటుంది. 12 నుంచి 15 ఏళ్లు తరువాత ఒక్కో చెట్టు నుంచి 15 నుంచి 20 కిలోల వరకూ పొందవచ్చు. దీంతో ఒక్కో చెట్టు నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం లభిస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని దొంగల బారిన పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది. పెరిగి పెద్దయితే ఎర్ర బంగారమే.. ఎర్రచందనం 15 సంవత్సరాల వయసు తరువాత ఈ చెట్లు గరిష్టంగా 20 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. వీటిని నరికితే ఎకరాకు 200 నుంచి 300 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏ – గ్రేడు దుంగలకు టన్ను రూ 60 లక్షలు, బి–గ్రేడు రూ. 40 లక్షలు, సీ–గ్రేడు రూ. 31 లక్షలు ధరలుగా నిర్ణయించారు. ఈ లెక్కన కనీసం సీ గ్రేడు రకానికి లెక్కేసినా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాగులో పాటించాల్సిన మెలకువలు ►నాటిన మొదటి సంవత్సరం మొక్కల బతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మొదటి రెండేళ్ల పాటు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మొక్కలు నేలలో స్థిరపడి బాగా పెరుగుతాయి ►వీటిని మెట్ట,గరప నేలల్లో సాగు చేయవచ్చు ►ఎకరాకు 560వరకు మొక్కలు నాటుకోవచ్చు ►మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి ►శ్రీ గంధం వేర్లకు సొంతంగా పోషకాలను గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. అందుబాటులో చెట్ల వేర్లతో శ్రీగంధం వేర్లు పెనవేసుకొని వాటి నుంచే తేమను పోషకాలను సంగ్రహిస్తాయి. ►నాటిన మూడేళ్ల వరకు శ్రీగంధానికి అందు బాటులో ఏదో ఒక మొక్క ఉండి తీరాల్సిందే. -
పోలీస్ స్టేషన్లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ పోలీస్టేషన్లో కానిస్టేబుల్ ఎద్దుల రామకృష్ణ (35) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాలు.. శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ 2011లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. సంజామల, ఆళ్లగడ్డ పోలీస్టేషన్‌ల్లో విధులు నిర్వహించి నంద్యాల త్రీటౌన్ పోలీస్టేషన్‌కు ఇటీవల బదిలీపై వచ్చాడు. విధులకు క్రమం తప్పకుండా హాజరవుతూ తోటి సిబ్బందితో సరదాగా ఉండేవాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యథావిధిగా విధులకు హాజరయ్యాడు. స్టేషన్ భవనంపై ఉన్న రెస్ట్ రూమ్‌కు వెళ్లి తన సెల్ ఫోన్‌కు ఉన్న లాక్ నంబర్ రాసి పెట్టి, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమణ, డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ నరసింహులు స్టేషన్‌కు చేరుకుని రామకృష్ణ ఫోన్‌ను తనిఖీ చేశారు. అందులో ఎటువంటి సమాచారం లేదని డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి ఏడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు(కవలలు) ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
మొదటి భార్య చనిపోయింది, ఇక నీతోనే ఉంటా..
సాక్షి, నంద్యాల(దొర్నిపాడు): డబ్బు కోసం ఓ ప్రబుద్ధుడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుని డబ్బు కోసం పీడించి పిప్పి చేశాడు. రెండో భార్య గమనించి ఆరా తీయగా అతగాడి బండారం బయటపడింది. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాలు .. చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబు బుర్రారెడ్డిపల్లె గ్రామానికి చెందిన నాగలక్ష్మిదేవిని నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా డబ్బు కోసం పీడించేవాడు. అతని ప్రవర్తనలో మార్పు గమనించిన భార్య.. ఆరా తీయగా అతనికి ఇంతకుముందే మార్కాపురం గ్రామానికి చెందిన మరో మహిళ లలితతో వివాహమైనట్లు తెలిసింది. ఇదే విషయమై నిలదీయగా మొదటి భార్య చనిపోయిందని, ఇక నీతోనే ఉంటానని నమ్మబలికాడు. ఏదో సాకులు చెబుతూ డబ్బు కోసం శారీరంగా, మానసికంగా వేధించేవాడు. ఆత్మహత్య చేసుకుంటే బీమా సొమ్ము వస్తుందని చావుకు ప్రేరేపించేవాడు. ఇదంతా తన తల్లి లక్ష్మిదేవికి తెలిసే చేస్తుండటంతో భరించలేక రెండో భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా మహేంద్రబాబు ఇటీవల కృష్ణా జిల్లా చల్లాపల్లి మండలం నక్కలగడ్డ గ్రామానికి చెందిన భవానీని నమ్మించి మూడో పెళ్లి చేసుకున్నట్లు బయటపడింది. మూడో భార్య తల్లి వద్ద లోన్ యాప్ ద్వారా రూ.5లక్షలు తీసుకొని మోసం చేశాడు. దీంతో గురువారం మహేంద్రబాబు, అతని తల్లి లక్ష్మిదేవిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..) -
అప్పు చెల్లించలేదని గృహ నిర్బంధం
కోవెలకుంట్ల: అప్పు తీర్చలేదని ఓ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేసిన ఘటన శనివారం నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జరిగింది. బొగ్గరపు చంద్రశేఖర్ స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట కిరాణాషాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన హోల్‌సేల్ వ్యాపారి రాధాకృష్ణ వద్ద కిరాణాషాపునకు సరుకులు అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలల కిందట చంద్రశేఖర్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు. తీసుకున్న సరుకులకు సంబంధించి రూ.60 వేలు చెల్లించకపోవడంతో వ్యాపారి గత కొన్ని రోజుల నుంచి మృతుడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నాడు. కుటుంబాన్ని పోషించే యజమాని మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు ఆ ఘటన నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో వ్యాపారి శనివారం వారి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులివ్వాలని వాగ్వాదానికి దిగాడు. మృతుడి భార్య గీతావాణి, అత్తమామలు సుబ్బరత్నమ్మ, రామసుబ్బయ్యను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. పోలీసులు వచ్చి వారిని విడిపించి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య సయోధ్య కుదుర్చి సమస్యను తీర్చారు. -
శ్రీశైలంలో పేలిన స్టీమ్ బాయిలర్
శ్రీశైలం టెంపుల్(నంద్యాల జిల్లా): శ్రీశైల దేవస్థానంలోని అన్నదాన భవనం వంటశాల వద్ద ఉన్న స్టీమ్ బాయిలర్ మంగళవారం పేలింది. దేవస్థానం పరిపాలన కార్యాలయానికి దగ్గరలో అన్నదాన భవనాన్ని నిర్మించి భక్తులకు అన్నప్రసాదాలు సిద్ధం చేసి అందిస్తున్నారు. భోజనాలు సిద్ధం చేసేందుకు రెండు స్టీమ్ బాయిలర్లను వాడతారు. చదవండి: జనసేనకు కుప్పం ఇన్చార్జి రాజీనామా కార్తీకమాసం కావడంతో రోజూ 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భోజనం, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. ఇందుకోసం సిబ్బంది వేకువజాము నుంచే వంటలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 గంటలకు వాటర్ ప్రెజర్ పెరిగి ఒక స్టీమ్ బాయిలర్ పేలింది. -
శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం
శ్రీశైలం టెంపుల్: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన అర్చకులు జె.వీరభద్రయ్యస్వామి మాటల్లోనే.. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడి సకల శుభాలు కలుగుతాయి. నాగహారతి: నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. త్రిశూలహారతి: త్రిశూలహారతిని దర్శించడం వలన అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి. నందిహారతి: నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండదు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. సింహహారతి: సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనోధైర్యం కలుగుతుంది. సూర్యహారతి: సూర్యహరతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది. చంద్రహారతి: చంద్రహారతిని దర్శించడం వలన మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభహారతి: కుంభహారతిని దర్శించడం వలన కొరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. నక్షత్రహారతి: నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కర్పూర హారతి: కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. (క్లిక్ చేయండి: హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం) -
విధితో గెలవలేక.. హిమపావని కన్నుమూత
సాక్షి, నంద్యాల(బొమ్మలసత్రం): పట్టణానికి చెందిన శ్రీనివాసులు కుమార్తె హిమపావని(10) విధితో పోరాడలేక గురువారం కన్నుమూసింది. హిమపావని ఐదు నెలల ముందు వరకు స్నేహితులతో కలిసి ఆడుతూ, పాడుతూ ఆనందంగా ఉండేది. అటువంటి సమయంలో పాఠశాలలో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పావనికి మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా చేదునిజం బయటపడింది. చిన్నారి మెదడులో రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. కొందరు దాతల సహకారంతో జూన్ నెలలో తమిళనాడులోని వేలూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నెల తర్వాత వైద్యులు తప్పని సరిగా పాపకు ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే అంత మొత్తం లేక మిన్నకుండిపోయారు. ఈనెల 17న ఆళ్లగడ్డకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినపుడు కలిసి పాప విషయాన్ని తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి పాప ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రూ.లక్ష చెక్కును అందించి శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న సిటీ న్యూరో సెంటర్లో ఈనెల 20న పావనిని చేర్పించారు. 26వ తేదీ వైద్యపరీక్షలు పూర్తి చేసి గురువారం ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆపరేషన్ పూర్తయిన గంట తర్వాత చిన్నారి హార్ట్‌బీట్ తగ్గిపోవడం గమనించిన వైద్యులు హుటాహుటీన అధునాతన పరికరాలతో వైద్యం అందించారు. అయినప్పటికీ పావని కోలుకోలేక కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పారవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పాప కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాప మృతదేహాన్ని పట్టణంలోని వారి ఇంటికి చేర్చారు. మృతదేహం వద్ద ఎమ్మెల్యే సతీమణి శిల్పా నాగినిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, చైర్పర్సన్ మాబున్నిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, వైఎస్సార్సీపీ నాయకులు వెంకటసుబ్బయ్య, అమృతరాజ్‌లు నివాళులు అర్పించారు. చిన్నారి అంత్యక్రియలకు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ఆర్థిక సహాయం అందించారు. -
నంద్యాల డివిజన్ అటవీ శాఖ స్థాయి పెంపు
కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు జిల్లా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో 1.90 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులతో వెలసిన నల్లమలో పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు, దుప్పులు, కర్తెలు, అడవి కుక్కలు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వాటిని అనుక్షణం కాపాడేందుకు అటవీ ప్రాంతం చుట్టూ పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆళ్లగడ్డ: బ్రిటీష్ కాలం నుంచి కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లుగా ఉండేవి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నంద్యాల జిల్లా అటవీ శాఖగా ప్రభుత్వం గుర్తించింది. ఇంతవరకు ఉన్న నంద్యాల డివిజన్ కార్యాలయాన్ని జిల్లా అటవీ కార్యాలయంగా మార్చారు. కర్నూలు డివిజన్ పరిధిలోని డోన్ అటవీ రేంజ్‌ను నంద్యాల జిల్లా పరిధిలో కలిపారు. కొత్తగా రెండు రేంజ్‌లు ఇప్పటి వరకు నంద్యాల పరిధిలో రుద్రవరం, చలిమ, నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు రేంజ్‌లు ఉండగా కర్నూలు డివిజన్ నుంచి డోన్ రేంజ్‌ను నంద్యాల జిల్లాలో చేర్చడంతో మొత్తం ఆరు రేంజ్‌లు అయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం పాణ్యం, బనగానపల్లె సెక్షన్లను అటవీ రేంజ్‌లుగా స్థాయి పెంచారు. దీంతో ఇప్పుడు జిల్లా పరిధిలో రేంజ్‌ల సంఖ్య 8 పెరిగింది. ఒకే పరిపాలన కిందకు టెరిటోరియల్, లాగింగ్ గతంలో టెరిటోరియల్ ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ డివిజన్లు విడివిడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటిని కలిపి ఒకటిగా చేశారు. దీంతో రుద్రవరం, గాజులపల్లె, పచ్చర్ల లాగింగ్ డివిజన్లు రద్దయ్యాయి. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్‌ను కూడా రద్దు చేశారు. వైల్డ్‌లైఫ్ విభాగాలు ప్రత్యేకం వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగా ఉంచారు. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, డివిజన్లను అలాగే ఉంచారు. వీటికి టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి. నల్లమలలో 73 పెద్ద పులులు దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 73 పెద్ద పులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2018లో 47, 2020లో 63 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతానికి 73కు పెరగడానికి అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణం. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో గడ్డి పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నల్లమల అటవీ 300 చిరుతలు, 400 ఎలుగుబంట్లు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. పెరిగిన సిబ్బంది నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో సిబ్బంది సంఖ్య పెరిగింది. జిల్లా పరిధిలో కొత్తగా 9 సెక్షన్లు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సెక్షన్ల సంఖ్య 25 పెరిగింది. 45 బేస్ క్యాంపులు ఉన్నాయి. 25 మంది సెక్షన్ అధికారులతో పాటు ఒక్కో బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున మొత్తం 225 మంది సిబ్బంది ఉన్నారు. పులులు, వన్యప్రాణుల సంఖ్య పెరగడంతో మరో 100 మందిని నియమించనున్నారు. పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఒకవైపు వన్యప్రాణులను, మరో వైపు విలువైన అటవీ సంపదను వేటగాళ్ల బారినుంచి కాపాడేందుకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. పెద్ద పులులు, చిరుతల సంరక్షణకు సుశిక్షితులైన సిబ్బందిని తయారు చేసేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం సబ్ డీఎఫ్ఓ, రేంజర్, డీఆర్వో, బీట్ అఫీసర్ తదితర స్థాయిలో ఉన్న సుమారు 50 మంది అధికారులకు, సిబ్బందికి షార్ట్ వెపన్లు అయిన ఫిస్టల్, రివాల్వర్లు అందించనున్నారు. త్వరలో వీరికి తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో గన్ షూటింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వీరిని పెద్దపులు, చిరుతలు సంచరించే బేస్‌క్యాంపుల్లో నియమించనున్నారు. పర్యవేక్షణ సులభం జిల్లా కేంద్రంలో నూతనంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఏర్పాటు కావడంతో పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ భూముల అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణ పెరుగుతుంది. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. – వినీత్‌కుమార్, జిల్లా అటవీ అధికారి అడవులతోనే సమృద్ధిగా వర్షాలు అడవులు విస్తారంగా పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా అడవులు విస్తారంగా పెరిగాయి. అందులో వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. – విశ్వనాథరెడ్డి, ఓబులంపల్లె అటవీ సంరక్షణ అందరి బాధ్యత అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్నిరకాల వృక్షాలు, వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. అడవులు అంతరించిపోకుండా ఉంటేనే పర్యావరణ సాధ్యమవుతుంది. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – బోరు రమణ, చాగలమర్రి -
వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోంది
-
సీఎం వైఎస్ జగన్ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారు
-
‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’
సాక్షి, నంద్యాల జిల్లా: రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఎరువులు కోసం గతంలో రోజుల తరబడి క్యూ ఉండేది. ఇప్పుడు విత్తనం నుంచి విక్రయం దాకా ఆర్బీకేలు అండగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారన్నారు. ఇంకా లబ్ధిదారులు ఏమన్నారంటే వారి మాటల్లోనే.. చదవండి: గజ దొంగల ముఠా మంచి చెప్పదు.. ఎల్లో మీడియాకు సీఎం జగన్ కౌంటర్ మీ వల్లే ఆయన బతికారు: భూక్యే క్రిష్ణానాయక్, గిరిజన రైతు జగనన్నా నేను నిరుపేద గిరిజన రైతును, నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మా నాన్న పొలం ఇచ్చాడు కానీ పంట పెట్టుబడికి డబ్బు ఇవ్వలేదు. జగనన్న వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో నేను వ్యవసాయం మొదలుపెట్టాను. సాగు చేస్తున్నాను. నాకు ఆర్బీకేల ద్వారా పొలంబడిలో అవగాహన కల్పించారు. నేను వరి వేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయాను. కానీ జగనన్న ప్రవేశపెట్టిన పంటల బీమా, ఈ కేవైసీ ద్వారా సీజన్ ముగిసేలోగా నాకు రూ. 40 వేలు వచ్చాయి. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని సకాలంలో కట్టడం వలన దానికి సున్నావడ్డీ కింద రూ.3 వేలు వచ్చాయి. గతంలో ఎన్నడూ పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మా నాన్నకు పింఛన్ వస్తుంది, మా అమ్మ, నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు జరిగాయి. మీ వల్లే ఆయన బతికారు. ఈ రోజు ఈ సభకు కూడా మిమ్మల్ని చూడాలని వచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్ట్ కెనాల్‌కు పిల్ల కాలువలు డాక్టర్ వైఎస్ఆర్ తవ్వించి ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు ఇచ్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించినందుకు మా గిరిజనుల తరపున మీకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. అమ్మ సంతోషపడింది: దూదేకుల గుర్రప్ప, రైతు జగనన్నా నమస్కారం, అన్నా నేను ఏడు ఎకరాల సాగు చేస్తున్నాను, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం అందింది. మూడేళ్ళ పాటు ఏటా రూ. 13,500 చొప్పున తీసుకున్నాను. మీరు వేశారు నా అకౌంట్లో వచ్చాయి. నాకు పంట నష్టం సాయం కూడా అందింది, దానికింద అక్షరాలా రూ. 30 వేలు సాయం అందింది, పంటల బీమా కూడా అందుతుంది. ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. పంటల బీమా చేయించుకోవాలి. నేను 20 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాం. గతంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ఈరోజు మన గ్రామంలో ఆర్బీకేలో మనకు అందుతున్నాయి. అన్నీ ఇక్కడే అందుతున్నాయి, జగనన్నా మేం గ్రూప్‌గా ఏర్పడి ట్రాక్టర్, కంకుల కటింగ్ మిషన్, ఇతర సామాగ్రి తీసుకున్నాం, మాకు సబ్సిడీ అందింది, మేం రైతులకు తక్కువ రేట్లకే వ్యవసాయ పనులకు పనిముట్లను ఇస్తున్నాం. మా అమ్మకు క్యాన్సర్ ఆపరేషన్ జరిగితే సీఎంఆర్ఎఫ్ కింద రూ. 60 వేలు వచ్చాయి. కొడుకుగా నా బాధ్యత జగన్ తీసుకున్నారని అమ్మ సంతోషపడింది. మా కుటుంబ సభ్యుడివి అన్నా, ఇన్పుట్ సబ్సిడీ కూడా అందింది. మన జగనన్నను మనం 175 కి 175 సీట్లతో గెలిపించాలి. మన రైతులు, మన అక్కచెల్లెల్లు మనం గెలిపించుకోవాలి, ధన్యవాదాలు. -
బాబు, కరువు రెండూ కవల పిల్లలు: సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ఆళ్లగడ్డ నుంచి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని, ప్రతి అంశంలో అండగా ఉంటున్నామన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంటానికి అండగా ఉంటున్నాం. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది. రూ.13,500 సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు’’ అని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే మేలో రూ.7,500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4వేలు ఇస్తున్నాం. మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ. 25,971 కోట్ల మేర లబ్ధి కలిగింది. మొత్తం 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకు రూ.51 వేలు అందించాం. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం. మూడున్నరేళ్లలో కేవలం రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఒక మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు హయాంలో ఏటా కరువే. బాబు, కరువు రెండూ కవల పిల్లల అన్నట్లు పాలన సాగింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘అక్టోబర్ 12 వరకు సాధారణం కంటే 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. గతంలో సగటున 1.54 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే.. ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 167. 24 లక్షల టన్నులకు చేరింది. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు’’ అని సీఎం అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే ఊరూరా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్న సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా జిల్లాలో ఒక సచివాలయం ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆదివారం నుంచి మరో ఏడు సచివాలయాల్లో అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో సుదూర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందవచ్చు. ఆళ్లగడ్డ: ఇది వరకు ఏ రకమైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సుదూర ప్రాంతాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలి. ఇందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చాలి. దీనికితోడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దళారుల దోపిడీ. వీటన్నింటికీ చెక్ పెట్టి స్థానికంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సచివాలయాలు ప్రస్తుతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే రెండు నుంచి మూడు రోజులు వాటి చుట్టూ తిరగాలి. అయినా, సకాలంలో పని పూర్తవుతుందో లేదో తెలియదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెంతనే ఉన్న సచివాలయాల్లో సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో కొన్నింటిని ఎంపిక చేశారు. అందులో జిల్లాలో నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి దాదాపు 8 నెలల పాటు విజయవంతంగా సేవలు అందించారు. తాజాగా రెండో విడతలో జిల్లాలో 7 గ్రామ సచివాలయాలను ఎంపిక చేశారు. వీటిలో నూతనంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్నారు. ఇలా విడతల వారీగా మరో ఏడాదిలోపు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. భూ రీసర్వేతో కబ్జాలకు చెక్ ఎప్పుడో బ్రిటీష్ పరిపాలనలో చేసిన సర్వేనే ఇప్పటికీ ఆధారం. దీంతో భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు గందరగోళంగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో భూవివాదాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సర్వేనంబర్లలో సబ్ డివిజన్లకు ప్రభుత్వం స్వస్తి పలుకుతుంది. ఉదాహరణకు 1, 1ఏ, 1బి, 1బి/ఏ లాంటి సబ్‌డివిజన్ సర్వే నంబర్లు ఇక నుంచి ఉండవు. సర్వేనంబర్ 1, 2 ఇలా ఒకే నంబర్‌తో ఉంటాయి. ఇప్పటి వరకు సబ్ డివిజన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న భూ రీ సర్వేలో ఊరు, సచివాలయ పరిధి, మండలం కనబరుస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంటుంది. అలాగే ఒకరి భూమిని మరొకరు కబ్జా చేసే పరిస్థితి ఉండదు. అందించే రిజిస్ట్రేషన్ సేవలు ఇవే.. జిల్లాలో ఎంపిక చేసిన సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే అన్ని రకాల సేవలు అందుతాయి. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్ స్లిప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలి ముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, విక్రయ దస్తావేజు, సెటిల్ మెంట్ దస్తావేజు, దాన విక్రయం, తనఖా, చెల్లు రసీదు, భాగ పరిష్కారం రిజిస్ట్రేషన్ రద్దు, మ్యానువల్ ఈసీ, ఆన్లైన్ ఈసీ, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు అందిస్తారు. (క్లిక్ చేయండి: 'నన్నారి'కి నల్లమల బ్రాండ్!) సిద్ధంగా ఉన్నాం సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు నాతో పాటు 13 మంది కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఆరు నెలలుగా శిరివెళ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలను మా సచివాలయం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – రాజ్‌కుమార్, పీఎస్ గోవిందపల్లె సచివాలయం –2, శిరివెళ్ల మండలం సేవలు మరింత సులభతరం ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు సబ్ రిజిస్ట్రార్లు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి క్యూలో ఉండి పనులు చేయించుకోవాలంటే కొంచం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వారి గ్రామాల్లోనే సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. – నాయబ్ అబ్దుల్‌సత్తార్, ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు -
నంద్యాల జిల్లా : రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
అందుకే సాధ్యమైంది.. వరుసగా మూడోసారి నంబర్‌వన్: సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. కొలిమిగుండ్లలో బుధవారం.. రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభలో సీఎం ప్రసంగిస్తూ రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని అన్నారు. ‘‘కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగావకాశాలు రావాలి. రానున్న 4 ఏళ్లలో 20వేల ఉద్యోగాలు వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ వరుసగా 3వ సారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమైంది. మాది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ సారి పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు లీజు చెల్లిస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా ఉండాలి. గ్రోత్ రేటులో దేశంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది.రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. చదవండి: రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్ -
రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్
Live Updates: పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూత: సీఎం జగన్ పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని సీఎం అన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు.. మంత్రి అమర్నాథ్ ►రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు తీసుకెళుతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పరిశ్రమలకు ఎంతో పోత్సాహం ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ తీసుకున్న చర్యలతోనే పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ►నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. కొలిమిగుండ్ల(నంద్యాల జిల్లా): జిల్లా పారిశ్రామిక పథంలో పయనిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పలు కంపెనీలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో జయజ్యోతి, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండగా తాజాగా కల్వటాల వద్ద రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్ పరిశ్రమను నెలకొల్పింది. ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ ను ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ముడి ఖనిజపు నిల్వలు కొలిమిగుండ్ల మండలంలో అపారంగా ఉన్నాయి. రవాణా సౌకర్యం, నీటి వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు వెనుకబడిన ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. సిద్ధమైన రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో రామ్‌కో సిమెంట్ పరిశ్రమను నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కొలిమిగుండ్ల, నాయినపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుంచి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని సేకరించారు. 2018 డిసెంబర్ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం విధానాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా అడుగులు వేయడంతో రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల అనుమతులు చకచకా లభించాయి. తర్వాత నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో కరోనా ఎఫెక్ట్‌తో పనులకు కొంత కాలం బ్రేక్ పడినా ఆ తర్వాత యుద్ధప్రాతిపదికన చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం సైతం పూర్తి సహకారం అందించింది. పరిశ్రమకు ప్రధానంగా నీటి వనరులు అవసరం. ఎక్కువ లోతులో బోర్లు వేసి భారీ మోటార్ల సాయంతో నీటిని పంపింగ్ చేస్తే సమీప గ్రామాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో అవుకు రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీళ్లను పైపులైన్ ద్వారా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి భారీ బడ్జెట్‌తో ఏర్పాటు చేసిన రామ్‌కో పరిశ్రమలో ఏడాదికి 2.0 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయనున్నారు. 30 మెగా వాట్ల థర్మల్ ప్లాంట్‌ను కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసుకుంది. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలిచ్చింది. త్వరలోనే మరో 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ పరిశ్రమ ద్వారా పరోక్షంగా మరి కొంత మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే ఫ్యాక్టరీ ఏర్పాటుతో కొలిమిగుండ్లలో ఇళ్ల స్థలా లతో పాటు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సీఎస్ఆర్ కింద అభివృద్ధి పనులు కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద పరిశ్రమల పరిధిలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. 2019 నుంచి 2022 వరకు సీఎస్ఆర్ కింద రూ.8.5 కోట్లు ఖర్చు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. -
YSR Pelli Kanuka: పేదింటికి పెళ్లి కానుక.. పూర్తి వివరాలిలా..
సాక్షి, నంద్యాల(అర్బన్): పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండు కార్యాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని అర్థం. పేదలు తమ ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు అప్పులు చేసి వాటిని తీర్చలేక సతమతమవుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి పెళ్లి సమయంలో అండగా నిలబడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ పెళ్లికానుక (వైఎస్సార్ కల్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా) పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు, వివాహం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువుకి రక్షణ కల్పిస్తుంది. ఈ మేరకు సర్కారు వైఎస్సార్ పెళ్లి కానుకను రూపకల్పన చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైఎస్సార్ కల్యాణమస్తు, మైనార్టీలకు షాదీ తోఫా పేరుతో శ్రీకారం చుట్టిన ఈ పథకాలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయనుంది. ఇప్పటికే ఆయా పథకాలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలతో ప్రభుత్వం జీఓ.47ను జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఆర్థిక సాయం రెండింతలు పెంచడంతో పాటు ఎక్కువ మందికి ప్రయోజనం అందేలా పథకాలు ఉండటంతో జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు ఇలా.. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా పథకానికి సంబంధించి అర్హత నిబంధనలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి గ్రామ/వార్డు సచివాయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తారు. వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి ఆర్థికసాయం అందుతుంది. వధువు, వరుడు పదవ తరగతి పూర్తిచేసి ఉండాలి. అలాగే వధువు, వరుడు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు లోపు ఉండాలి. మూడు ఎకరాలకు మించి మాగాణి, 10 ఎకరాలకు మించి మెట్టభూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉండవచ్చు. సర్కారు అందించే పెళ్లి కానుక ఇలా.. ►ఎస్సీ, ఎస్టీల వివాహాలకు రూ.లక్ష ►ఎస్టీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు ►బీసీలకు రూ.50 వేలు ►కులాంతర వివాహాలకు రూ.75వేలు ►మైనార్టీలకు రూ.లక్ష ►దివ్యాంగులకు రూ.1.50 లక్షలు ►భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు ఆడ పిల్లల తల్లిదండ్రులకు సీఎం అండ వైఎస్సార్ పెళ్లి కానుక ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అండగా నిలబడుతున్నారు. సొంత అన్నలా పేద కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం ముందుకు రావడం హర్షణీయం. గతంలో టీడీపీ దుల్హన్ పథకం కింద కేవలం రూ.50వేలు ఇచ్చేది. అది కూడా కొందరికే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాయం మొత్తాన్ని రూ.లక్షకు పెంచడం హర్షణీయం. తెలుగుదేశం నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప పేదలను ఆదుకున్న పాపాన పోలేదు. – ఇసాక్‌బాషా, ఎమ్మెల్సీ, నంద్యాల పేదలకు ఆర్థిక ఊరట వైఎస్సార్ పెళ్లికానుక వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. ఈ పథకం ద్వారా అందజేసే నగదును రెండింతలు చేయడం వల్ల నిరుపేద కుటుంబాలకు ఊరట కలుగుతుంది. కొంత వరకు అప్పులు చేసే బాధ తప్పుతుంది. గతంలో ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెళ్లి కానుక పథకాన్ని రూపొందించడం అభినందనీయం. –మేస చంద్రశేఖర్, కౌన్సిలర్ దేవనగర్, నంద్యాల అర్హులందరికీ పెళ్లి కానుక ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం దరఖాస్తులు పరిశీలించి అర్హులందరికీ వైఎస్సార్ పెళ్లి కానుక అందేలా చూస్తాం. ప్రతి ఒక్కరు అవసరమైన రికార్డులతో పెళ్లికి పదిరోజులు ముందుగానే దరఖాస్తు చేసుకొని పథకం ప్రయోజనాన్ని పొందాలి. ఇప్పటికే కులాల వారీగా ఎవరికి ఎంత మొత్తం ఇవ్వనుందో ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. –రవిచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్, నంద్యాల -
28న కొలిమిగుండ్లలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, కొలిమిగుండ్ల (నంద్యాల జిల్లా): కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ నెల 28న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో హెలిప్యాడ్‌ను కంపెనీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి నుంచి సీఎం నేరుగా ఫ్యాక్టరీలోకి చేరుకొని స్విచ్ ఆన్‌చేసి పరిశ్రమను ప్రారంభిస్తారు. సీఎం వైఎస్ జగన్ కొలిమిగుండ్ల మండలంలో తొలిసారిగా అడుగుపెట్టనుండడం గమనార్హం. పరిశ్రమ నుంచి ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయనున్నారు. చదవండి: (ఆ విషయంపై కేటీఆర్, మహారాష్ట్ర సీఎం కేంద్రాన్ని ప్రశ్నించారు: సీఎం జగన్) -
రైల్వే ట్రాక్‌పై ఇంజినీరింగ్ విద్యార్థి.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..
శిరివెళ్ల(నంద్యాల జిల్లా): మండల పరిధిలోని గోవిందపల్లె గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఎం.ఫణేశ్వరరెడ్డి(23) రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నంద్యాల రైల్వే ఎస్ఐ జలీల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమారుడు ఫణేశ్వరరెడ్డి నంద్యాల ఆర్జీఎం కాలేజీలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. రెండు ఏడాదిలో కొన్ని సబెక్టులు ఫెయిల్ అయ్యాడు. చదవండి: కొడుకును చూసి షాక్ తిన్న తండ్రి.. సినిమా స్టోరీని తలపించింది.. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై నంద్యాలకు బయల్దేరాడు. సాయంత్రం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. బైక్ నంబర్ ఆధారంగా అక్కడి రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని నంద్యాలకు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్య ప్రవర్తనపై అనుమానం.. భర్త ఎంతపని చేశాడంటే?
మహానంది(నంద్యాల జిల్లా): భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైన ఘటన గాజులపల్లె గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సత్యవోలు గ్రామానికి చెందిన కాశీరావు, గిద్దలూరు మండలం జయరామాపురం గ్రామానికి చెందిన నాగం రమాదేవి(37)లకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. చదవండి: ఫైనాన్స్ వ్యాపారి బ్లాక్మెయిల్.. మహిళ న్యూడ్ వీడియో వెబ్సైట్లో పెట్టి.. 18 ఏళ్ల క్రితం మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి వచ్చి కాశీరావు ట్రాక్టర్ డ్రైవర్‌గా, రమాదేవి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో సాయంత్రం గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
తొణికిసలాడుతున్న జలాశయాలు
నంద్యాల: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా శ్రీశైలం ప్రాజెక్టు జూలై నెలలోనే నిండింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.70అడుగులు నీటిమట్టం ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 191.6512టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 50,927 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సగటున 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలడంతో వివిధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. రైతులు ఆలస్యం చేయకుండా ఖరీఫ్ పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. నంద్యాల జిల్లాలోని గోరుకల్లు, అవుకు, వెలుగోడు రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి లింకు ఛానల్ ద్వారా వెలుగోడు రిజర్వాయర్‌కు 14వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. వెలుగోడు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.418 టీఎంసీలు నీరు రిజర్వాయర్‌లోకి చేరింది. ఎస్సార్బీసీ చరిత్రలోనే ఇప్పటి వరకు జూలై నెలలో కాల్వలకు నీటిని విడుదల చేయలేదు. అయితే గోరుకల్లు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 10 టీఎంసీలు . ప్రస్తుతం 5 టీఎంసీలు పైగా నీరు నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చాక, గేట్లు ఎత్తిన తర్వాతనే ఎస్సార్బీసీ కాల్వలకు నీరు వదిలేవారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తకముందే రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో జూలై మొదటి వారంలోనే కాల్వలకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బానకచర్ల నుంచి గోరుకల్లు రిజర్వాయర్‌కు 9వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అవుకు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.184 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.184టీఎంసీల నీరు నిల్వ ఉంది. అవుకు రిజర్వాయర్ కింద అధికారికంగా, అనధికారికంగా 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లోకి వరద నీరు భారీగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీ కెనాల్, కుందూకు సమృద్ధిగా నీరు.. సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువకు నీరు వదులుతున్నారు. దీంతో కేసీ కెనాల్, కుందూనదిలో పుష్కలంగా సాగునీరు ప్రవహిస్తోంది. అధికారులు కేసీ కెనాల్ కు వారం క్రితం 14వేల క్యూసెక్కులు నీరు వదలగా ప్రస్తుతం 800 క్యూసెక్కులు నీరు వదులుతున్నారు. కుందూనదిలో ప్రస్తుతం 1250 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. (క్లిక్: ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు) సాగునీటికి ఇబ్బంది ఉండదు ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ పంటలకు సంవృద్ధిగా నీరు అందజేస్తాం. గత మూడు సంవత్సరాలుగా రైతులకు సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు జూలై నెలలోనే భారీగా వరద నీరు రావడంతో దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్లను నీటితో నింపుతున్నాం. ఖరీఫ్ పంటలు వేసే రైతులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పంటలు వేసుకోవాలి. ఈ ఏడాది సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – శేఖర్‌రెడ్డి, జలవనరుల శాఖ ఎస్ఈ, నంద్యాల -
ఆ ఊరిలో పాలు అమ్మరు!
తాగునీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఈ కాలంలో అక్కడ ఉచితంగా పాలు పోస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వస్తే తీసుకోరు. పాలు అమ్మరు. గర్భిణులు, బాలింతలున్న ఇళ్లకు వారే అడిగి మరీ పంపిస్తారు. ఇలా చేసేది ఒకరో ఇద్దరో కాదు. ఆ ఊరంతా ఇదే సంప్రదాయం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పిన్నాపురం గ్రామం ప్రత్యేకత ఇదీ.. కర్నూలు: నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని పిన్నాపురం ఓ మారుమూల గ్రామం. 421 ఇళ్లు 1800 జనాభా కలిగిన ఈ ఊరిలో 344 బర్రెలు, 815 ఆవులు, 2444 మేకలు ఉన్నాయి. ఇక్కడ తాతల కాలం నుంచి పశు పోషణ సంప్రదాయంగా వస్తోంది. గ్రామ జనాభాలో దాదాపు 80 శాతం మంది పాడిపెంపకందారులే. సమీపంలోని కొండ ప్రాంతాల్లో వాటిని పెంచుకుంటూ తమకున్న కొద్దిపాటి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో ఎవ్వరూ పాలు విక్రయించరు. పశుపోషకులు తమ కుటుంబ అవసరాలకు పోనూ మిగిలిన వాటిని గ్రామస్తులకు ఉచితంగా ఇస్తారు. ముఖ్యంగా గర్భి ణులు, బాలింతలు ఉన్న ఇళ్లకు వారే స్వయంగా పాలు పంపిస్తుంటారు. ఎవరైనా వారి ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే సమీపంలోని పట్టణం నుంచి పాల ప్యాకెట్లు కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. ఇక్కడి గ్రామ ప్రజలు పొద్దున్నే గ్లాసుడు కాఫీ లేదా టీ తాగడంతో దిన చర్య మొదలు పెడతారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ వాడుతారు. ఇందుకు అవసరమైన పాలు గ్రామంలోనే ఉచితంగా లభిస్తుండటం విశేషం. అవసరాల్లో ఒకరికొకరు సహాయపడాలన్నదే ఈ సంప్రదాయం ప్రధాన ఉద్దేశమని గ్రామస్తులు తెలిపారు. ఉచితంగా పాలు పోస్తే మంచిదని.. మా గ్రామంలో పాలు ఉచితంగా పోసే ఆచారం మా తాతల కాలం నుంచి ఉంది. అలా మా పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. చాలా కుటుంబాల్లో ఇంటి అవసరాలకు మించే పాలు ఉంటాయి. గ్రామంలో పాడిలేని వారు ఎవరైనా ఉన్నారని తెలిస్తే వారు అడగకుండానే పాలు పంపిస్తాం. దీని వల్ల మాకు మంచి జరుగుతుందని నమ్మకం. –మిద్దె నాగమ్మ, పిన్నాపురం పెద్దల నుంచి వస్తున్న ఆచారం మా పెద్దలు మాకు పాలను ఉచితంగా ఇచ్చే పద్ధతిని నేర్పారు. అందుకే పాడి ఉన్నంత వరకు పాలు, మజ్జిగ చుట్టు పక్కల వారి అవసరాలకు ఉచితంగానే పోస్తుంటాం. నెయ్యి మాత్రం పాణ్యం వెళ్లి అమ్ముకుంటాం. అది కూడా పండగ వచ్చే ముందు ఏడాదికి ఒకసారి మాత్రమే. –గని ఈశ్వరమ్మ, పిన్నాపురం ఒకరికొకరం సహాయపడతాం మాకు రెండు బర్రెలు ఉన్నాయి. ఇప్పటికీ చుట్టుపక్కల వారికి అడిగి పాలు పోస్తాం. అదే బాలింతలు, గర్భిణులుంటే వారి ఇళ్లకు వెళ్లి ఇస్తాం. ఎందుకంటే వారికి పాల అవసరం ఎక్కువగా ఉంటుంది. మాకు అవసరమైనప్పుడు కూడా గ్రామంలోని వారు ఇలాగే పంపిస్తారు. – మీదివేముల రామకృష్ణ, పిన్నాపురం -
అయ్యో.. గోమాతలారా..
వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి వంద ఆవులు గల్లంతయ్యాయి. మేతకు వెళ్తున్న ఆవుల మందను అడవి పందులు బెదిరించడంతో రిజర్వాయర్‌లోకి దూకాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు, మత్స్యకారులు రిజర్వాయర్‌లో చిక్కుకున్న 350 గోమాతలను రక్షించగా, మరో 100 ఆవుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన శంకర్, సుంకన్న, కురుమన్న, బాలలింగం, వెంకటరమణతో పాటు మరో ఐదుగురికి చెందిన వెయ్యి ఆవులు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని డీఎల్బీ రెగ్యులేటర్ వద్ద గట్టు వెంట శుక్రవారం ఉదయం మేతకు వెళ్లాయి. అదే సమయంలో ఎదురుపడిన అడవి పందుల గుంపు ఆవుల మందను బెదిరించాయి. దీంతో భయపడిన ఆవులు (దాదాపు 450) వెలుగోడు జలాశయంలోకి పరుగులు తీశాయి. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దిక్కు తోచని స్థితిలో ఆవుల కాపరులు బిగ్గరగా కేకలు వేయడంతో రిజర్వాయర్ వద్ద ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై పుట్టీల సాయంతో నీటిలో ఉన్న 350 ఆవులను రక్షించారు. గల్లంతయిన ఆవుల కోసం గాలిస్తున్నారు. ఆవులను రక్షించటానికి గ్రామస్తులు జాలరులను రంగంలోకి దింపారు. మర బుట్టలతో జాలరులు ఆవుల కోసం శుక్రవారం సాయంత్రం వరకు గాలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జగన్మోహన్, తహసీల్దార్ మహమ్మద్ రఫీ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీను, ఆర్ఐ రామాంజనేయులు, వీఆర్వోలు చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వంద ఆవుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
గాల్లో తేలుతున్నట్లు.. నీటిపై నడయాడుతున్నట్లు..
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ పర్యాటకసిగలో మరో కలికితురాయి చేరనుంది. పర్యాటక ప్రియులకు గాల్లో తేలుతున్నట్లు..నీటిలో నడయాడుతున్నట్లనిపించేలా.. అద్భుత అనుభూతిని కలిగించే ‘గాజు వంతెన’ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎంతో ఎత్తైన ప్రదేశంలో నిర్మించే ఈ గాజువంతెనపై నడుసూ్త..కింద నీటి ప్రవాహాన్ని చూస్తూ ప్రకృతి అందాలను వీక్షించడం అంటే ఆ మజానే వేరు. చదవండి: అయ్యో.. మొబైల్ పోయిందా? ఇలా చేయండి నంద్యాల జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై ఈ గాజు వంతెన నిర్మితం కానుంది. రూ.703.68 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కేఏ జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై గాజు వంతెనను నిర్మించనున్నారు. 800 మీటర్ల పొడవుతో నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలి రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంగమేశ్వరం వద్ద రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైళ్లు వెళ్లేందుకు మరో మార్గం నిర్మిస్తారు. పర్యాటకులు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేక కారిడార్‌తో కూడిన గాజు వంతెన నిర్మిస్తారు. స్తంభాలు లేని వంతెన ఏపీలోని సంగమేశ్వరం, తెలంగాణలోని మల్లేశ్వరం తీర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్లను నిర్మిస్తారు. తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్లు ఉంటాయి. రెండు పైలాన్ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 90 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్ మీడియన్ భాగంలో గాజు ప్యానల్ కారిడార్ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్‌వేస్ ఉంటాయి. ఆ చివర, ఈ చివర గాజు ప్యానల్స్ ఉంటాయి. వీటి నుంచి దిగువన కృష్ణానది సోయగాలను చూడవచ్చు. గాజువంతెనపై నడుస్తూ నదిలో నడుస్తున్న అనుభూతినీ పొందవచ్చు. -
అరటి ధరహాసం.. హెక్టారుకు రూ.15లక్షల ఆదాయం
రోజు రోజుకూ అరటి ధరలు పెరుగుతున్నాయి. సాగు తక్కువగా ఉండటంతో ఉత్పత్తి తగ్గి అరటిధరలు రెట్టింపు అయ్యాయి. రెండు నెలల కిందట టన్ను రూ.5 వేల నుంచి రూ.8 వేలు ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.20 వేలకు చేరింది. యాపిల్ పండ్ల ధరలతో అరటి పోటీ పడుతోంది. పెరిగిన ధరలతో అరటి రైతుల ఆనందపడుతున్నారు. ఆళ్లగడ్డ: ఈ ఏడాది అరటి సాగు చేసిన రైతులకు లాభాల పంట పండుతోంది. కాస్త ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ నికరంగా ఆదాయం తెచ్చిపెడుతుండటంతో రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. నంద్యాల జిల్లా పరిధిలో ఈసారి సుమారు 10 వేల ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా మహానంది, ప్యాపిలి, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం తదితర మండలాల్లోని రైతులు అధికంగా అరటి తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. లాభాల వైపు అడుగులు రెండేళ్ల నుంచి ధర అంతంత మాత్రమే ఉన్న అరటి గెలల ధరలు ఇటీవల ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు నెలల వరకు టన్ను రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలికింది. ఒక్కో సమయంలో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాక తోటలోనే వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా జూన్ నుంచి ధరలు పెరగడం మొదలు కాగా ప్రస్తుతం ధరలు మరింత పెరిగి టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల పైగానే ధర పలుకుతోంది. అరటి తోట ప్రస్తుతం జీ9 రకం అరటికి మంచి గిరాకీ ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు కృష్ణా, ఉభయ గోదావరి తదితర ప్రాంతాల్లో అరటి దిగుబడులు లేకపోవడంతో ప్రస్తుతం రాయలసీమ అరటి గెలలకు మంచి డిమాండ్ వచ్చింది. కేరళ, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధర ఊహించిన దానికంటే ఎక్కువగా పలుకుతుండటంతో నిన్నటి మొన్నటి వరకూ ధరలేక నష్టపోయిన రైతులు పెరిగిన ధరను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 10 వేల ఎకరాల్లో సాగు నంద్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. ఎకరాకు 1,200 మొక్కలు (టిష్యూ కల్చర్) చొప్పున రూ.60 వేలు ఖర్చు చేసి నాటుతున్నారు. సాగు ఖర్చులు, మందులకు అంతా కలిపి ఎకరాకు మరో రూ..40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. కౌలు రైతుకు అయితే మరో రూ.30 వేలు అదనంగా అవుతుంది. 1,200 మొక్కల్లో కనీసం 900 నుంచి 1,000 చెట్లు గెలలు తెగినా సరాసరి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధర ఉంటే ఖర్చులు పోను ఎకరాకు రూ.4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. రెండో పంటకు ఖర్చు తక్కువ అరటి తోట సాగుకు తొలిసారి మాత్రమే ఖర్చు అధికంగా ఉంటుంది. రెండో ఏడాది ఎక్కువగా ఉండదు. కాండం నుంచి వచ్చిన ఐదారు పిలకల్లో మంచి పిలకను ఎంచుకుని మిగతావి తీసి వేస్తే సరిపోతుంది. దీంతో విత్తనం ఖర్చు సుమారు ఎకరాకు రూ.60 వేల వరకు తగ్గుతుంది. సేద్యాల ఖర్చు ఉండదు. ఎరువులు కూడా పెద్దగా అవసరముండక పోవడంతో రైతన్నలకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. రైతులకు చేయూత ఇలా.. ఏరియా, వాతావరణ పరిస్థితులను బట్టి ఆ ప్రాంతంలో సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగుల మందుల యాజమాన్యం (ఐపీఎం) ప్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. తోట బడుల ద్వారా రైతులకు సాగులో మెలకువలపై శిక్షణ ఇస్తున్నారు. సాగుచేసే ప్రతి రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ) ఇస్తారు. -
ద్రౌపది దాహం తీర్చుకున్న కొలను.. ఎక్కడో తెలుసా?
శ్రీశైలం(నంద్యాల జిల్లా): దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ప్రాంతమే భీముని కొలను. సెలయేర్ల సవ్వడులతో, పక్షుల కిలకిలరావాలతో రెండు కొండలు చీలినట్లు ఉండి ఆ మధ్యలో గంభీరంగా రాతిపొరల నడుమ భీమునికొలను కనువిందు చేస్తోంది. ఎంతో ఆహ్లాదకరంగా సాగే భీమునికొలను సందర్శనం మంచి అనుభూతిని ఇస్తుంది. చదవండి: ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ? స్థల పురాణం ఇదీ.. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట. ఆ పరిసరాలు చూసివచ్చిన భీముడు .. ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. దాంతో లోమశ మహర్షి ఒక శిలను చూపించి దానిని పగులగొట్టమని చెప్పాడు. తన గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగానే నీటి ధారలు కిందికి దూకాయని, ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుందని, భీముడి కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి ’భీముని కొలను’ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆహ్లాదకర ప్రదేశం పూర్వపు రోజుల్లో కాలినడకన వచ్చే భక్తులు ఈ భీమునికొలను మీదుగానే శ్రీశైలాన్ని చేరేవారు. శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో ఈ భీమునికొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. భీముని కొలను లోయప్రాంతం ప్రకృతి అందాలతో అలరారుతూ చూపరుల మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటుంది. కైలాసద్వారం నుంచి దాదాపు 2వేల అడుగుల లోతులో ఉండే ఈ భీమునికొలను లోయ చుట్టూ సుమారు 650 అడుగుల పైగా ఎత్తులో దట్టమైన కొండలు వ్యాపించి ఉన్నాయి. లోయకు ఇరువైపులా రంపంతో కోసినట్లుగా ఏర్పడి నునుపైన శిలలు ముచ్చటగా ఉంటాయి. లోయ పైతట్టు ప్రాంతంలోని కొండ ల్లోంచి ఉబికి వచ్చే సహజ జలధారలు లోయలో బండరాళ్లపై ప్రవహిస్తూ, పెద్దకోనేరులాగా కని్పంచే భీమునికొలను చేరి పొంగిపొర్లుతుంటాయి. ఈ నీరు మండు వేసవిలో కూడా నిరంతరం ప్రవహిస్తుండడం విశేషం. ఇలా చేరుకోవచ్చు..: భీముని కొలను వెళ్లేందుకు శ్రీశైలం నుంచి సుమారు 4 కి.మీ దూరంలో ఉన్న హఠకేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపున అడవి దారిలో 2 కి.మీ. ప్రయాణించి కైలాసద్వారం వెళ్లాలి. హఠకేశ్వరం నుంచి కైలాస ద్వారం వరకు మట్టిరోడ్డు ఉంది. కారు, జీపు, చిన్న వాహనాల్లో ఇక్కడికి సులభంగా వెళ్లవచ్చు. కైలాసద్వారం నుంచి సుమారు 850 మెట్లు దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీమునికొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. -
సంతోషంగా వధూవరులు డ్యాన్స్.. పెళ్లయిన కొద్దిసేపటికే విషాదం..
సాక్షి, నంద్యాల జిల్లా: బోయరేవులో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 24 గంటల్లో పెళ్లికుమారుడు దుర్మరణం చెందడం కలకలం రేపింది. బోయరేవుకు చెందిన శివకుమార్‌తో జూపాడు బంగ్లా మండలం భాస్కరపురానికి చెందిన మౌనిక అనే యువతితో పెద్దలు పెళ్లికి నిశ్చయించారు. పెద్దల సమక్షంలో నిన్న(శుక్రవారం) ఘనంగాపెళ్లి జరిగింది. సాయంత్రం బరాత్‌లో వధూవరులిద్దరూ సంతోషంగా నృత్యాలు కూడా చేశారు. అర్ధరాత్రి ఇంటి నుంచి రోడ్డు మీదకు వెళ్లిన వరుడు శివకుమార్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ.. -
జోడెద్దుల ఊయ్యాల.. హాయిగా నిద్రపోవాల!
సాక్షి, బేతంచెర్ల: కాడెద్దుల పట్టెడలకు చీరతో ఊయల. అందులో ఆదమరిచి నిద్రపోతున్న ఓ చిన్నారి.. ఓ రైతు కుటుంబం తమ బిడ్డను ఈ విధంగా నిద్రకేసి ఎంచక్కా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఎద్దులు అడుగు తీసి అడుగేసినప్పుడల్లా ఊయల ఊగుతుండగా.. జోలపాటలా వస్తున్న ఎద్దుల మెడలోని గంటల సవ్వడికి ఆ చిన్నారి హాయిగా నిద్రపోతోంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలోని ఓ రైతు జంట తమ బిడ్డను ఈ విధంగా నిద్రపుచ్చుతున్న సన్నివేశం సాక్షి కెమెరాకు చిక్కింది. (క్లిక్: అర్ధసత్యాల ఆంధ్రజ్యోతి) -
ఓవర్ టేక్ చేయబోయి..
చిట్వేలి: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన కారు.. బ్రిడ్జిని ఢీకొనడంతో అందులోని తండ్రి, కుమారుడు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరావు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం.రాచపల్లి గ్రామానికి చెందిన పాండురాజు సుబ్బరామరాజు(64)కు ఆరోగ్యం బాగో లేకపోవడంతో రెండో కుమారుడు కుమార్రాజు (35), మూడో కుమారుడు హరికృష్ణరాజు (30) సోదరుడి కుమారుడు వాసు కృష్ణంరాజు (36) కలిసి కారులో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. తమ్మరాజుపల్లె అడ్డువాగు వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న మరో వాహనాన్ని అధిగమించే క్రమంలో వీరి కారు బ్రిడ్జిని ఢీకొంది. ప్రమాదంలో సుబ్బరామరాజు, పి.కుమార్రాజు అక్కడికక్కడే మృతి చెందగా హరిక్రిష్ణమరాజు, వాసుక్రిష్ణమరాజు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు గ్యాస్ కట్టర్‌తో డోర్‌ను కట్ చేసి కుమార్రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ విషాద ఘటనతో రాచపల్లి గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. డ్రైవర్ పి.వాసుకృష్ణమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఉచ్చులు కావు.. ఉరితాళ్లు
ఆత్మకూరురూరల్: నల్లమల అటవీ పరిధిలో జరిగిన పైమూడు ఘటనలు పులులు ఉచ్చులకు బలవుతున్నట్లు తేటతెల్లమవుతోంది. అడవిలో పెద్దపులి, చిరుత పులి మరణించినప్పుడు వృద్ధాప్యంతో, ప్రమాదవశాత్తూ, రెండు పులుల పోరాటంలో గాయపడి మృత్యువాత పడినట్లు అటవీ అధికారులు తరచూ చెబుతూ ఆ అంకాన్ని ముగిస్తుంటారు. అయితే పులుల అసహజ మరణాల వెనుక వేటగాళ్ల ఉచ్చులు ఉన్నట్లు అటవీ సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వన్యప్రాణుల మాంసానికి డిమాండ్ ఉండడంతో ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లె, రుద్రవరం, మహానంది మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో కొందరు వన్యప్రాణులను వేటాడం వృత్తిగా మార్చుకున్నారు. తనిఖీల్లో తరచూ వన్యప్రాణి మాంసం లభిస్తున్న కేసుల సంఖ్యనే ఇందుకు బలం చేకూర్చుతోంది. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) మన నల్లమలలో ఏర్పడి పులుల సంరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. సుమారు 110 పెద్దపులులకు (తెలంగాణా– ఆంధ్రప్రదేశ్) నెలవై శ్రీశైలం – శేషాచలం పులుల కారిడార్‌కు ఎన్ఎస్టీఆర్ పురుడు పోసింది. కాగా ఇటీవలి కొన్ని పరిణామాలను చూస్తే అటవీ శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగేళ్లలో ఆరు పులులు అసాధారణ స్థితిలో మరణించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా పెద్ద పులి ఉద్ధృతంగా ప్రవహించే కృష్ణానదిని అవలీలగా దాటేస్తుంది. అలాంటిది తెలుగు గంగలో పడి మృతి చెందినట్లు అటవీ అధికారులు ప్రకటించడం అనుమానాలకు దారి తీస్తుంది. వేటగాళ్లను కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జింకల కోసం ఉచ్చులు.. పులులకు చిక్కులు.. నల్లమల అటవీ సమీప గ్రామాల్లో కొందరు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించడమే ఒక వ్యాపారంగా మలుచుకుని జీవిస్తుంటారు. ముఖ్యంగా కొత్తపల్లె, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, రుద్రవరం మండలంలో కొందరు నేరచరిత్ర ఉన్న వ్యక్తులు నిరంతరం ఇదే పనిలో ఉంటున్నారు. అతికొద్ది మంది తుపాకులతో వేట సాగిస్తే చాలా మంది ఉచ్చులతో వేటాడుతున్నారు. వీరు వేస్తున్న ఉచ్చులే పులుల ఉనికికే ప్రమాదంగా మారాయి. ఉచ్చులతో వేటకు వేసవికాలం అనుకూలం. సహజనీటి వనరులు తరిగిపోయి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఉండే నీటి దొరువుల వద్ద వేటగాళ్లు పొదల్లో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. నీటి కోసం వచ్చే జింకలు ఈ ఉచ్చుల్లో చిక్కుకుని మరణిస్తుంటాయి. అలాగే జింకలు తమకు అవసరమైన సోడియం లవణ లభ్యత కోసం అడవుల్లో ఉండే జేడె (ఉప్పు నేలలు)లను ఆశ్రయిస్తాయి. వెన్నెల రాత్రులలో జేడెల వద్దకు భూమి పొరలను నాకేందుకు గుంపులు గుంపులుగా చేరుకుంటాయి. ఆ ప్రాంతాల్లో కూడా వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తారు. ఇలా జింకల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులలో పెద్దపులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు చిక్కుకుని బలవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రుద్రవరం అటవీ ప్రాంతంలోని గండ్లేరు రిజర్యాయరులో పులి కళేబరం బయటపడింది. తెలుగుంగ కాల్వలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు మొదట అధికారులు ధ్రువీకరించారు. అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా పచ్చర్ల సమీపంలో ఉచ్చులో పడి మృతి చెందినట్లు తేలింది. ఈ ఘటనలో కింది స్థాయి అటవీ సిబ్బందిపై వేటు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. 2018 మార్చి 28న శ్రీశైలం రేంజ్‌లోని పెచ్చెర్వు సమీపంలో నరమామిడి చెరువు వద్ద పెద్దపులి మరణించింది. గుర్తించిన అటవీ సిబ్బంది అర్ధరాత్రి అక్కడే పోస్టుమార్టం చేసి కళేబరాన్ని దహనం చేశారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో మృత్యువాత పడినట్లు ప్రకటించారు. అయితే అధికారుల హడావుడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెద్ద పులి ఉచ్చుకు బలైనా అధికారులు దాచి కళేబరాన్ని దహనం చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. 2016లో జీబీఎం, నాగలూటి రేంజ్‌లలో కనిపించిన (ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో) టీ 21, టీ 32, టీ40 (పులి శరీరంపై ఉన్న చారల ఆధారంగా వాటికి ఓ సంఖ్య కేటాయిస్తారు) జాడ ఇంత వరకు లేదు. దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఐనముక్కలలో ఓ ఇంట్లో మూడు పులి చర్మాలు లభించాయి. వాటిని సున్నిపెంటకు చెందిన ఓ వ్యక్తి దాచినట్లు తేలగా.. ఈ కేసులో ఆత్మకూరు మండలం సిద్ధేశ్వరానికి చెందిన వేటగాడిని అరెస్ట్ చేశారు. అటవీ చట్టాలు కఠినంగా అమలు చేయాలి వన్యప్రాణి వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. పులి మనుగడకు ముప్పుగా మారిన ఉచ్చుల వేట పూర్తిగా నిర్మూలించాలి. తరచూ పట్టుబడే వన్యప్రాణి వేటగాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలి. – యన్నం హనుమంతరెడ్డి, న్యాయవాది, వన్యప్రాణి ప్రేమికులు పర్యవేక్షణ కరువై.. ∙ రెగ్యులర్ అటవీ ఉద్యోగులు పగలు బేస్ క్యాంపులకు వెళుతున్నప్పటికీ రాత్రిళ్లు ఉండటం లేదన్న విమర్శలున్నాయి. నిరంతరం ఉచ్చుల నివారణ కోసం పెట్రోలింగ్ చేయాల్సిన చోట తూతూమంత్రంగా సాగుతోంది. ∙ టైగర్ హబ్‌గా భావించే బైర్లూటి, నాగలూటి, వెలుగోడు అటవీ క్షేత్రాధికారులు ఎనిమిదేళ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారు. దీంతో పర్యవేక్షణాధికారులకు కిందిస్థాయి సిబ్బందికి సమన్వయం లేకపోవడంతో పులి సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ∙ బ్రిటీష్ కాలం నాటి సరిహద్దులతో ఎంతో పెద్దదైన విస్తీర్ణంతో ఉన్న అటవీ క్షేత్రాలు (రేంజ్‌లు) ఇంతవరకు పునర్విభజనకు నోచుకోక పోవడంతో సిబ్బంది కొరత ఏర్పడి పులుల సంరక్షణకు పెద్ద అవరోధంగా మారింది. రుద్రకోడు రేంజ్ ప్రతిపాదన కొన్నేళ్లుగా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. నిరంతరం నిఘా ఉచ్చుల బారి నుంచి పులు లు, ఇతర జంతువులను రక్షించేందుకు ప్రతిరోజు ప్ర త్యేక డ్రైవ్ చేపడుతున్నాం. అనుమానిత ప్రదేశాల్లో అటవీ సిబ్బంది నిశితంగా పరిశీలించి వేటగాళ్లు ఉంచిన ఉచ్చులను తొలగిస్తున్నారు. అటవీ సమీప ప్రాంతాల్లో తిరిగే అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాం. – దత్తాత్రేయ, ఎఫ్ఆర్వో, వెలుగోడు రేంజ్ -
World Food Safety Day: సంపాదనే ముఖ్యం.. అందుకోసం ఏమైనా కల్తీ చేస్తారు
డబ్బు సంపాదనే వారికి ముఖ్యం. అందుకోసం ఆహారంలో ఏమైనా కల్తీ చేస్తారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఏ మాత్రం చలించరు. కస్టమర్లను మళ్లీ మళ్లీ రప్పించుకోవడమే లక్ష్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ప్రమాదకర రంగులు, పదార్థాలను కలిపేందుకే తెగబడుతున్నారు. అధికారులకు సైతం ఈ విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేడు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలుజిల్లాలో చిన్నా పెద్దా హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, చాట్, నూడల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 9 వేలకు పైగా ఉంటాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 1500 దాకా హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి 2006 చట్టం మేరకు లైసెన్స్ తీసుకుని, ఆ శాఖ నిబంధనల ప్రకారం ఆహారం తయారు చేయాలి. ఈ శాఖలోని అధికారులు ఏడాదికి 350 శ్యాంపిల్స్ సేకరించాల్సి ఉన్నా నామమాత్రంగా పనిచేస్తున్నారు. నెలకు ఐదు నుంచి ఆరు శ్యాంపిల్స్ తీసి చేతులు దులుపుకుంటున్నారు. గత మూడు నెలలుగా జిల్లాల పునర్విభజన పేరుతో ఒక్క శ్యాంపిల్ కూడా తీయలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారని, కోర్టు డ్యూటీల ఉన్నాయని పేర్కొంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేకరించి ప్రయోగశాలకు పంపిన శ్యాంపిల్స్ రెండు, మూడు నెలలకు గానీ నివేదికలు రావడం లేదు. దీంతో ఏ ఒక్కరిపైనా వీరు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు హోటల్, రెస్టారెంట్, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు నూటికి పాతిక శాతానికి మించి ఉండటం లేదు. ఉత్పత్తి కేంద్రాలైతే ఏడాదికి రూ.3వేలు, విక్రయ కేంద్రాలు రూ.2వేలు, తోపుడు బండ్లు రూ.100లు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉన్నా ఆ పనిచేయడం లేదు. కొన్ని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా రంగులు, టేస్టీ సాల్ట్ వాడకం జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అనుమతిలేని రంగులను, టేస్టీసాల్ట్ (అజినోమోటో)ను వాడుతున్నారు. వాస్తవంగా ఆహార పదార్థాల్లో వాడే రంగు(బుష్‌పౌడర్)ను ఒక కిలోకు 0.001మి.గ్రా వాడాలి. పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న దురుద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా కలుపుతున్నారు. దీంతో పాటు మెటాలిక్ ఎల్లోను సైతం వాడుతున్నారు. వీటిని తిన్న వారికి క్యాన్సర్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు లేరు. చదవండి: (Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు) అలాగే ప్రమాదకర అజినోమోటో(టేస్టీసాల్ట్)ను రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిని తిన్న వారు క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు, సెక్స్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల అధికారులు కృష్ణానగర్, పార్కురోడ్డు, సెంట్రల్ప్లాజా సమీపాల్లోని పలు దుకాణాలు, హోటల్లలో దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వ్యాపారుల్లో మార్పు రాలేదు. హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు ఇవీ నిబంధనలు ►వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథారిటీఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు. నేరం రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారు. ►ఆహార పదార్థాలను తనిఖీ చేసేటప్పుడు నాలు గు భాగాలుగా విభజిస్తారు. అన్ సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్, మిస్లీడింగ్ విభాగాల కింద అధికారులు శ్యాంపిల్స్ సేకరిస్తారు. ►వ్యాపార ప్రకటనల్లో సూచించినట్లుగా ఆహారంలో ప్రమాణాలు లేకపోతే దానిని మిస్లీడింగ్ గా పరిగణిస్తారు. ►ఆహార పదార్థాల రంగు కోసం ప్రకృతి సిద్ధమైన రంగులు వాడాలి. రసాయనాలు కలిపిన రంగులు వాడకూడదు. ►ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్ సాల్ట్స్ వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. ►అలాగే అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. వంటగదిలో డ్రైనేజీ వసతి బాగుండాలి. అనుమతులు తప్పనిసరి తినుబండారాల వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ సి.క్యాంపులోని తమ కార్యాలయంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టప్రకారం అనుమతి ఉన్న రంగులు, పదార్థాలనే ఆహార పదార్థాల్లో వాడాలి. రుచి కోసం చాలా మంది టేస్టీసాల్ట్ వాడుతున్నారని ఫిర్యాదులున్నాయి. ఇది చట్టరీత్యానేరం. ఇకపై జిల్లా లో ముమ్మర దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాము. –శేఖర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఉమ్మడి కర్నూలు జిల్లా కలర్స్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆహార పదార్థాల్లో రంగు, రుచి కోసం వాడే కలర్స్(బుష్‌పౌడర్ ) వల్ల పాంక్రియాస్, లివర్, పిత్తాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కొన్నిచోట్ల టేస్టీ సాల్ట్‌లో పందిమాసంతో తయారు చేసిన పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో పాటు అజినోమోటో సాల్ట్‌ను వాడటంతో జీర్ణాశయ, సంతానలేమి, సెక్స్ సమస్యలు వస్తాయి. కాబట్టి బయటి ఆహార పదార్థాల వినియోగంలో ప్రజలు తగు జాగ్రత్త వహించాలి. –డాక్టర్ పి. అబ్దుల్ సమద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు -
నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా..
బేతంచెర్ల(నంద్యాల జిల్లా): ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఆస్తి తన పేరు మీద రాయకపోతే విడాకులంటూ భయపెట్టడం ఆమె నైజం. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లి కూతురు మోసాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి: పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి.. బేతంచెర్ల ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన వై. మేరీ జేసింత అలియాస్ (మేరమ్మ) కుమార్తె శిరీషకు మొదట అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన పాణ్యం మల్లికార్జున రెడ్డితో వివాహమైంది. ఆస్తి తన పేరు మీద రాయకపోవడంతో కాపురం చేయకుండా వచ్చేసింది. అతనితో విడాకులు తీసుకోకుండానే మండల కేంద్రం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డిని శిరీష రెండో వివాహం చేసుకుంది. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అతనితో విడాకులు తీసుకోకుండా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి శివరామిరెడ్డి కుమారుడు యు. మహేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన వివాహం చేసుకుంది. వివాహం కంటే ముందుగా తన కుమార్తె పేరు మీద రూ. 5 లక్షల డిపాజిట్ చేయాలనే తల్లి మేరీ జేసింత సూచన మేరకు శిరీష పేరు మీద ఫిబ్రవరి 1న డిపాజిట్ చేశారు. కానీ పెళ్లి అయిన రెండు నెలలకే తన కుమార్తె పేరు మీద ఆస్తి రాసి ఇవ్వాలని, లేకపోతే సంసారానికి పంపనని తల్లి నిబంధన పెట్టడమే కాకుండా ఇబ్బందులకు గురిచేసింది. అనుమానం వచ్చిన మహేశ్వర్ రెడ్డి.. శిరీష గురించి విచారించగా అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీ. శ్రీనివాసులు తెలిపారు. కాగా ముగ్గురిని మోసం చేసిన శిరీష ప్రస్తుతం నాల్గో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. -
వరించిన అదృష్టం...రైతు మోములో వెల్లివిరిసిన సంతోషం
వ్యవసాయంలో లాభాలు పొందాలంటే కష్టజీవి శ్రమకు తోడు అదృష్టం ఉండాలి. రెండో కారు వరి పంట రైతుకు కలసొచ్చింది. ఎన్నో ఆశలతో రబీలో రైతు వరి సాగు చేయగా వరుణుడు కరుణించగా.. పుడమి తల్లి దీవించింది. చీడపీడల బారిన పడకుండా పంటను రక్షించుకుంటూ.. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. నూర్పిళ్లు పూర్తయి ధాన్యాన్ని ఇంటికి చేర్చుతున్నాడు. ఈ క్రమంలో మద్దతు ధర ఊరిస్తుండటంతో రైతు మోములో సంతోషం వెల్లివిరిస్తోంది. కోవెలకుంట్ల: ఖరీఫ్ సీజన్లో తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలు, చీడపీడలు, వాతావరణం అనుకూలించకపోవడంతో వరి రైతులు నష్టాలు చవిచూశారు. ఆ నష్టాన్ని రబీసీజన్‌లో పూడ్చుకోవాలని భావించిన అన్నదాతకు రెండు కారు పంట కలిసోచ్చింది. పంట చేతికంది దిగుబడులు ఆశాజనకంగా మారటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో ఎండ కారు పంటగా 48 వేల ఎకరాల్లో 555, ఎంటీయూ 1010, ఆర్ఎన్ఆర్ 15,048 రకాలకు చెందిన వరి సాగు చేయాల్సి ఉండగా బోర్లు, బావులు, చెరువులు, కేసీకెనాల్, కుందూనది, పాలేరు, రిజర్వాయర్ల పరిధిలో 50,791 ఎకరాల్లో సాగైంది. ఇందులో బండిఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,609 ఎకరాలు, పాణ్యంలో 6,674, రుద్రవరం 6,202, మహానందిలో 5,358, ఆళ్లగడ్డలో 4,949, నంద్యాలలో 3,105, శిరివెళ్లలో 2,788, గడివేముల మండలంలో 2,078 ఎకరాల్లో సాగు చేశారు. 120 రోజుల పంటకాలం కలిగిన వరిలో ఇప్పటి వరకు 95 శాతం మేర కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులన్నీ పూర్తి కానున్నాయి. పెరిగిన పెట్టుబడులు జిల్లాలోని ఆయా మండలాల్లో రబీ వరిసాగులో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయి. రసాయన ఎరువులు, నారు, క్రిమి సంహారక మందులు, కూలీలు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20వేలు వరకు వెచ్చించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక తేమ శాతం కారణంగా వరిని కాండం తొలుచు పురుగు ఆశించి నష్టం చేకూర్చింది. పురుగు బారి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. రెండు దఫాలు అదనంగా క్రిమి సంహారక మందు పిచికారీ చేసి పురుగు బారి నుంచి పంటను రక్షించుకున్నారు. పురుగు కారణంగా ఎకరాకు రూ. 2వేల నుంచి రూ. 3వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పురుగు తీవ్రత లేకుంటే మరో ఐదు బస్తాల దిగుడులు వచ్చేవని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడులు వచ్చాయి. ఖరీఫ్ సీజన్‌తో పోల్చుకుంటే రబీలో దిగుబడులు ఆశాజనకంగా మారటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆశలు రేకెత్తిస్తున్న మద్దతు ధర వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతోపాటు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పండిన కర్నూలు, నంద్యాల సోనా రకం వడ్లు బస్తా రూ. 1,850 వరకు ధర పలికాయి. రబీలో పండిన ఎండకారు వడ్లు బస్తా మార్కెట్లో రూ. 1,200 నుంచి రూ. 1,300 వరకు ఉంది. ఈ ధరకు ధాన్యం విక్రయిస్తే పెట్టుడులు పోనూ ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం చేకూరనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుతో ఖరీఫ్ సీజన్లో నష్టపోయినా రబీలో వాతావరణం అనుకూలంగా మారి దిగుబడులు ఆశాజనకంగా లభించి గిట్టుబాటు ధర ఉండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు 40 బస్తాల దిగుబడి ఈ ఏడాది ఎండకారు పంటగా సాగు చేసిన వరి రైతులకు అనుకూలంగా మారింది. ఖరీఫ్‌లో అధిక వర్షాలతో కాస్త దిగబడులు తగ్గాయి. రబీ సీజన్లో సంజామల మండలంలోని ఆయా గ్రామాల్లో 683 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడులు వచ్చాయి. –సుధాకర్‌రెడ్డి, ఏఓ, సంజామల మండలం 1.8 ఎకరాల్లో సాగు చేశా నాకున్న 1.8 ఎకరాల్లో ఈ ఏడాది రబీ సీజన్లో 555 రకానికి చెందిన వరి సాగుచేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడికి సంబంధించి ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాను. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాను. – నాగభూషణం, రైతు, గిద్దలూరు, సంజామల మండలం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నాకున్న రెండు ఎకరాల్లో ఎండకారు వరి సాగు చేశాను. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపింది. అదే తరహాలోనే ఇప్పుడు కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి. –వెంకటపతి రెడ్డి రైతు, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం (చదవండి: -
మటన్ , చికెన్ అంటే భలేభలే! వారంలో 2, 3 రోజులు ఉండాల్సిందే!
ఒకప్పుడు బంధువులు వచ్చినప్పుడో.. ఏదైనా వేడుక జరిగినప్పుడో.. పండుగల సందర్భంలోనో మాంసాహారాన్ని వినియోగించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో నాన్‌వెజ్‌ను ఇష్టంగా తింటున్నారు. ఎలాంటి సందర్భాలు లేకున్నా వారంలో రెండు మూడు రోజులు ‘ముక్క’తో ఎంచక్కా లాగించేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే ‘నీసు’ లేనిదే ముద్ద దిగనివారు కూడా ఉన్నారు. కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో మాంస వినియోగం ఏడాదికేడాదికి పెరుగుతోంది. చికెన్, మటన్, చేపలపైనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా రూ.217 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనికి అదనంగా బీఫ్, పోర్క్, గుడ్లు, కంజులు తదితర వాటిపై ప్రతి నెలా మరో రూ.20 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 46 లక్షలకుపైగా జనాభా ఉంది. ఒక సర్వే ప్రకారం జనాభాలో 85 శాతం మంది మాంసం ప్రియులు ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే వీరి ఇళ్లలో నాన్‌వెజ్ ఘుమఘుమలు ముక్కుపుటాలను అదరగొడుతుంటాయి. కొన్ని కుటుంబాలు వారంలో మూడు నాలుగు రోజులు మాంసాహారాన్ని ఆరగిస్తుండటం విశేషం. పోషకాహారం కోసం కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత జిల్లాలో మాంసాహార వినియోగం గణనీయంగా పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ ఏమీ చేయలేదని డాక్టర్లు సూచించారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏదో ఒక మాంసం తీసుకోవాలని చెప్పారు. వైరస్ తగ్గుముఖం పట్టినా ప్రజలు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండలేకపోతున్నారు. 2020తో పోలిస్తే 10 నుంచి 15 శాతం మాంసం అమ్మకాలు పెరిగాయి. సామాన్య ప్రజలకు చికెన్ ధరలు అందుబాటులో ఉన్నాయి. దీంతో మాంసాహారుల్లో 50 శాతం మంది చికెన్‌తో సరిపుచ్చుకుంటున్నారు. ప్రతి నెలా 5,440 టన్నుల వినియోగం మాంసాహారుల్లో 50 శాతం మంది చికెన్, 30 శాతం మంది మటన్, 20 శాతం మంది చేపలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా కోడిమాంసం 2,400 టన్నులు, మటన్ 1,440 టన్నులు, చేపలు 1,600 టన్నుల ప్రకారం మొత్తంగా 5,440 టన్నుల అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.217 కోట్లు ఉంటోంది. అంటే ఏడాదికి 65,280 టన్నుల నాన్‌వెజ్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఏడాదికి మాంసాహారానికే రూ.2,604 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నాణ్యత తప్పనిసరి వినియోగదారులు మాంసం ఏదైనా నాణ్యతను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. పశువైద్యులు ధ్రువీకరించిన తర్వాతనే పొట్టేళ్లను మాంసానికి వినియోగించాల్సి ఉంది. నాణ్యమైన మాంసం విక్రయించే విధంగా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రికార్డు స్థాయిలో ఉత్పత్తి జిల్లాలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2021–22లో లక్ష్యం 1,03,201 టన్నులు ఉండగా రికార్డు స్థాయిలో 1,09,711 టన్నులు ఉత్పత్తి అయ్యింది. జిల్లాలో ప్రతి నెలా 5,000 నుంచి 6,000 టన్నుల ప్రకారం ఏడాదికి 66 వేల టన్నుల మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చికెన్, మాంసం, చేపలు, గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. – డాక్టర్ రామచంద్రయ్య,జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి, కర్నూలు ఇష్టంగా తింటాం మాకు మాంసాహారమంటే ఎంతో ఇష్టం. మాంసం, చికెన్, చేపలు వినియోగిస్తాం. వారంలో రెండు, మూడు రోజులు తీసుకుంటాం. కరోనా మొదలైనప్పటి నుంచి వీటి వినియోగాన్ని పెంచాం. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రధానంగా మాంసాహారంపై దృష్టి పెట్టాం. – ఎం రాజేష్, చౌట్కూరు గ్రామం, మిడుతూరు మండలం వినియోగం పెరిగింది మేం కొన్నేళ్లుగా చికెన్ సెంటరు నిర్వహిస్తున్నాం. 2020 నుంచి చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. కరోనా కంటే ముందుతో పోలిస్తే 10 శాతంపైగా అమ్మకాలు పెరిగాయి. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు 500 కిలోల వరకు అమ్మకాలు ఉంటాయి. ఆదివారం 1000 కిలోల వరకు ఉంటాయి. వారం రోజుల్లో వినియోగదారులకు, హోటళ్లకు మేం 3500 కిలోల చికెన్ విక్రయిస్తున్నాం. మార్కెట్లో కొన్ని నెలలుగా బ్రాయిలర్ కోళ్ల కొరత ఉంది. ఇందు వల్ల కిలో చికెన్ రూ.300 ప్రకారం విక్రయిస్తున్నాం. వారానికి గుడ్లు 5000 వరకు విక్రయిస్తున్నాం. – నాగశేషులు, ప్రకాశ్‌నగర్, కర్నూలు అమ్మకాలు ఊపందుకున్నాయి కర్నూలులోని మద్దూరునగర్‌లో మాది చిన్న షాపు. ప్రతి రోజు పొట్టేలు మాంసం అమ్ముతాం. కరోనా తర్వాత విక్రయాలు ఊపందుకున్నాయి. సోమవారం నుంచి ఆదివారం వరకు సగటున 150 కిలోల మాంసం అమ్మతున్నాం. పొట్టేళ్ల ధరలు పెరగడంతో కిలో మాంసం రూ.750 ప్రకారం విక్రయిస్తున్నాం. – షాకీర్, మద్దూర్‌నగర్, కర్నూలు -
రూ.15వేల కోట్లతో అభివృద్ధి
కర్నూలు(అర్బన్): నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వచ్చే రెండేళ్లలో రూ.15వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే గురుతర బాధ్యత జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలపై ఎంతైనా ఉందన్నారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి బుగ్గనతో పాటు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, పాణ్యం, బనగానపల్లె, పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, సుధాకర్ కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పీ కోటేశ్వరరావు, మనజీర్ జిలానీ శామూన్, కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి హాజరయ్యారు. గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణం, నాడు – నేడు (ఫేజ్ –2 విద్య), వైద్య ఆరోగ్య శాఖపై ఉమ్మడి జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా రూ.1,500 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. అలాగే ఆరోగ్య కేంద్ర భవనాలను ఆధునీకరించి మెరుగైన వైద్య విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కోవిడ్ –19 పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య భరోసా ఇచ్చిందన్నారు. అనేక వ్యాధులను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావడంతో పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్యం లభిస్తోందన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి పథకాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు సూచించారు. సీఎఫ్ఎంఎస్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, అప్లోడ్ కాని బిల్లులకు సంబంధించిన నివేదికలను అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ దిల్షాద్ నాయక్, వీరశైవ లింగాయతీ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు డీ మురళీధర్‌రెడ్డి, కేఈ సుభాషి ణి, రాధా ప్రియదర్శిని, డీ పులికొండనాయక్, గిరిజోన్, సుధాకర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, సుంకన్న, ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. రెవెన్యూలో ఇష్టారాజ్యం మద్దికెర, తుగ్గలి మండలాల్లో రెవెన్యూ అధికా రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు కార్యాలయాల్లో ఉండకపోవడంతో రైతులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా వారు హాజరు కావడం లేదు. కలెక్టర్, ఆర్డీఓ సమావేశాలకు వెళ్లామంటూ సాకులు చెబుతున్నారు. విద్యుత్, హౌసింగ్ శాఖలకు సంబంధించి తగినంత సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. – పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గడువు ఇవ్వాలి జిల్లాలోని సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ స్కీములకు సంబంధించి విద్యుత్ బిల్లుల చెల్లింపునకు విద్యుత్ శాఖ అధికారులు కొంత గడువు ఇవ్వాలి. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పవర్ కట్ చేయకుండా వెసులుబాటు కల్పించాలి. రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో పైప్‌లను మారుస్తాం. జగనన్న కాలనీల్లో అప్రోచ్ రోడ్లకు పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇంటి పట్టాలను మంజూరు చేస్తారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల వేగం పెంచేందుకు జెడ్పీటీసీ సభ్యులు చొరవ చూపాలి. – జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అర్హులకు ఇళ్లు మంజూరు చేయండి టీడీపీ హయాంలో అనేక మంది బినామీలకు గృహాలు మంజూరు చేశారు. అప్పట్లో జరిగిన తప్పిదాలతో నేడు అనేక మంది అర్హులకు గృహాలు మంజూరు కావడం లేదు. పక్కా గృహం మంజూరుకు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఆన్లైన్లో వారి ఖాతాలో ఒక రూపాయి జమ అయినట్లు చూపిస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదు. ఇప్పటికైనా రెండు జిల్లాల్లో ఒక్క రూపాయి జమ అయిన వారి జాబితాలను ఒక సారి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయండి. – పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి -
మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం.. 22 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్
సాక్షి, నంద్యాల జిల్లా: కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తెలుగు పరీక్ష రోజే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన 22 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. వీరిలో చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, కస్టోడియన్, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఉన్నారు. ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయడంతో ఇద్దరు సీఆర్పీలు, పది మంది ఉపాధ్యాయులు, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లు మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరంతా సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల ప్రకారం 48 గంటల పాటు రిమాండ్‌లో ఉంటే సస్పెండ్‌కు గురవుతారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో చీఫ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన సుధాకర్ గుప్త(పెట్నికోట), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, కస్టోడియన్ రాఘవయ్య (తిమ్మనాయినపేట), ఉపాధ్యాయులు నీలకంఠేశ్వరరెడ్డి (గొర్విమానుపల్లె), నాగరాజు (అబ్దులాపురం), మధుసూదన్‌రావు (చింతలాయిపల్లె), వెంకటేశ్వర్లు (అంకిరెడ్డిపల్లె), చిన్నదస్తగిరి (అంకిరెడ్డిపల్లె), వనజాక్షి (కనకాద్రిపల్లె), లక్ష్మీదుర్గ(రామకృష్ణ స్కూల్ తుమ్మలపెంట), ఆర్యభట్ట (అబ్దుల్లాపురం), పోతులూరు (గొర్విమానుపల్లె), రంగనాయకులు (క్రాఫ్ట్ టీచర్ అంకిరెడ్డిపల్లె), ఇన్విజిలేటర్లు హరినారాయణ (తుమ్మలపెంట), శివప్రసాద్ (అంకిరెడ్డిపల్లె), వీరేష్(తుమ్మలపెంట), శ్రీనివాసరెడ్డి (మదనంతపురం), మదన్మోహన్(తుమ్మలపెంట), విమల్‌తేజ (అంకిరెడ్డిపల్లె), రవీంద్రగుప్త (అంకిరెడ్డిపల్లె యుటీసీఎల్), రాజశేఖరరెడ్డి (అంకిరెడ్డిపల్లె), వెంకటసుబ్బారెడ్డి (తుమ్మలపెంట యుటీసీఎల్) ఉన్నారు. ఇద్దరు సీఆర్పీలు (ఔట్సోర్సింగ్) రాజేష్, మద్దిలేటిల సర్వీస్ రెన్యువల్ చేయక పోవడంతో వారిద్దరినీ విధుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్ -
నాడు అధ్వానం.. నేడు సరికొత్త రూపం
కర్నూలు(అర్బన్): రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విరివిగా నిధులను విడుదల చేస్తూ రహదారుల రూపు రేఖలు మారుస్తోంది. దీంతో పల్లెల నుంచి పట్టణాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల ప్రయాణ కష్టాలు తొలగి పల్లె ప్రాంతాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. గుంతలు పడి, కంకర తేలి నడవడానికి వీలు లేని రోడ్లు సైతం నేడు పూర్తిగా మారిపోయాయి. ఆయా రహదారుల్లో వాహనాల వేగం ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాల రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం తీసుకుంది. మండలాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను అభివృద్ధి చేయడం, జిల్లా రహదారులను మరమ్మతు చేయడం.. తదితర బాధ్యతలు ఆర్అండ్బీ ఇంజినీర్లు చూసుకుంటున్నారు. ఇరు జిల్లాల్లో 100 పనులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.107.61 కోట్ల రుణం ఇవ్వగా 494.500 కిలోమీటర్ల జిల్లా రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. వీటిలో మొత్తం 70 పనులకు గాను 14 పూర్తయ్యాయి. పురోగతిలో 17 పనులు ఉండగా, మిగిలిన వాటిలో 37 ప్రారంభం కావాల్సి ఉంది. రెండు పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర రహదారులకు కాలానుగుణంగా మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి రూ.78.49 కోట్లతో 209.270 కిలోమీటర్ల మేర 30 పనులను చేపట్టారు. ఇప్పటికే రూ. 23.69 కోట్లతో 68.930 కిలోమీటర్ల మేర 14 పనులను పూర్తి చేశారు. మిగిలిన వాటిలో 8 పనులు పురోగతిలో ఉండగా, మరో 8 పనులను త్వరలో ప్రారంభించనున్నారు. రెండు లేన్ల రోడ్లు.. న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు రుణంతో రెండు జిల్లాల్లో రూ.314.31 కోట్ల వ్యయంతో మొత్తం 147.18 కిలోమీటర్ల మేర మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రోడ్లను నిర్మించనున్నారు. ఈ పనులకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘డబుల్’ ఆనందం కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట నుంచి సంజామల మండలం రెడ్డిపల్లె వరకు రోడ్డు అధ్వానంగా ఉండేది. గుంతలు పడి రాకపోకలు సాఫీగా సాగేవి కావు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వాహనదారుల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని మొత్తం 19 కిలోమీటర్ల మేర రూ.19.50 కోట్లతో డబుల్ రోడ్డుగా మార్చింది. సరికొత్త రూపును దిద్దుకున్న ఈ రోడ్డుపై ప్రస్తుతం వాహనాలు రయ్..రయ్ అని దూసుకుపోతున్నాయి. రాకపోకలు సురక్షితం పాణ్యం మండలం కొణిదేడు నుంచి మద్దూరు వరకు సింగిల్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేది. వైద్యం నిమిత్తం మద్దూరు ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు తప్పేవి కావు. ప్రజల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 కోట్లు ఖర్చు చేసి దీనిని డబుల్ రోడ్డుగా మార్చింది. వారం క్రితమే పనులు పూర్తయ్యాయి. మొత్తం 11 కిలోమీటర్ల రహదారిపై రాకపోకలు మెరుగుపడ్డాయి. ప్రయాణ కష్టాలు తీరాయి. వివిధ గ్రామాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. తొలగిన ‘దారి’ద్య్రం గోనెగండ్ల మండలం పెద్ద మరివీడు నుంచి పెద్ద నేలటూరుకు వెళ్లాలంటే మట్టి రోడ్డే దిక్కయ్యేది. రాళ్లు తేలి నడవడానికి సైతం ఇబ్బందిగా ఉండేది. సుమారు 10 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని చూపేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని రూ. 2.48 కోట్లతో బీటీ రోడ్డుగా మార్చింది. దీంతో రైతులు సులువుగా ఎమ్మిగనూరుకు పంట ఉత్పత్తులు తరలిస్తున్నారు. గూడూరుకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. సాఫీగా ప్రయాణం మండలకేంద్రమైన కౌతాళం నుంచి ఉరుకుంద వరకు 6 కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రోడ్డుపై నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనార్థం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గతుకుల రోడ్డుపై అవస్థలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. పక్షం రోజుల క్రితం పనులు పూర్తవడంతో ఈ రహదారిపై భక్తుల ఇక్కట్లు తొలగిపోయాయి. ఐదు గ్రామాలకు ఎంతో ఉపయోగం కరివేముల నుంచి ఐరన్‌బండ బీ సెంటర్ వరకు రూ.1.20 కోట్లతో 5 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. దీంతో ఐదు గ్రామాలకు ఎంతో మేలు జరిగింది. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లం. గుంతలు పడి కంకర తేలడంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్డు బాగుపడింది. – నరసింహయ్య, గుమ్మరాళ్ల, దేవనకొండ మండలం ఇబ్బందులు లేవు గతంలో కడ్డీల వంక నుంచి రామదుర్గం క్రాస్ రోడ్డు వరకు ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు పడేవాళ్లం. గతంలో ఈ రోడ్డును బాగు చేయాలని విన్నవించినా, ఫలితం కనిపించ లేదు. ప్రస్తుత ప్రభుత్వం రూ.70 లక్షలతో 1.50 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించింది. నెల రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. రామదుర్గం గ్రామానికి, పొలాలకు వెళ్లేందుకు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. – రాఘవయ్య, నగరడోణ, చిప్పగిరి మండలం నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి బ్యాంకు రుణంతో చేపట్టిన అన్ని పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. రెండు జిల్లాల్లో ఇప్పటికే రూ.44.32 కోట్లతో 28 పనులు పూర్తయ్యాయి. అలాగే ఫేజ్–1 కింద ఎన్డీబీ రుణంతో చేపట్టనున్న 12 పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎన్డీబీ ఫేజ్–2 కింద 77.57 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. – శ్రీధర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ -
నాడు కూలీ.. నేడు వ్యాపారి.. నవరత్నాలతో ఆర్థిక స్వావలంబన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు శ్రీమంతులయ్యారు. కుటుంబాలను చక్కదిద్దుకున్నారు. సమాజంలో గౌరవంగాబతుకుతున్నారు. చిరు వ్యాపారాలు చేస్తూ కొందరు, చేతి వృత్తుల్లో రాణిస్తూ మరికొందరు, పశు పోషణలో పట్టు సాధిస్తూ ఇంకొందరు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. కర్నూలు(అర్బన్): మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నవరత్నాల్లో భాగంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులను జమచేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ జీవనోపాధులను మెరుగుపరచుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు రోజుకు 100 రూపాయల కూలికి వెళ్లిన అనేక మంది మహిళలు నేడు చిరు వ్యాపారులయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, ఆర్థిక సహకారంతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారు. పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి ‘చేయూత’ వైఎస్సార్ చేయూత పథకంతో 45 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళల జీవితాలు మెరుగుపడ్డాయి. అర్హులైన వారి ఖాతాలో ఏటా ప్రభుత్వం రూ. 18,750 జమ చేస్తోంది. అంతేకాకుండా బ్యాంకుల ద్వారా రుణం కూడా ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత కింద ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1,98,480 మందికి రూ. 372.15 కోట్లు, 2021–22 మొదటి విడతలో 1,91,783 మందికి రూ.359.59 కోట్లు, 2021–22 రెండవ విడతలో 21,674 మందికి రూ.40.64 కోట్లను ప్రభుత్వం అందజేసింది. చేయూత పథకం కింద బ్యాంకుల ద్వారా అందిన రుణంతో 3,251 మంది మహిళలు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం 2,727 కిరాణా దుకాణాలకు 12.10 కోట్ల రుణాలు మంజూరు చేసింది. లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూత జీవన క్రాంతి పథకంలో భాగంగా 16,004 యూనిట్ల పాడి పశువులు, గొర్రెలు, మేకలను ఇప్పించారు. చేతి వృత్తులకు ‘చేదోడు’ బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు, వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా రూ. 96.47 కోట్లను ఇప్పటి వరకు విడుదల చేసింది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని మొత్తం 47,550 మంది రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు జగనన్న చేదోడు ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేల ప్రకారం మొత్తం రూ.47.55 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కాపు, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు కాపు నేస్తంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.15 వేల ప్రకారం రూ.18,28,50,000 విడుదల చేశారు. అగ్రవర్ణ పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈబీసీ నేస్తం పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.30,64,50,000 విడుదల చేశారు. ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈ నేపథ్యంలో సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించిన విధంగానే నవరత్నాల్లో భాగంగా జగనన్న వసతి, విద్యా దీవెన పేరుతో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 2019– 20 నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు రూ.559.49.46,813 జమ చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన అనేక మంది పేదింటి బిడ్డలు నేడు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు, ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు ఉన్నత విద్యకు మార్గం సుగమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విద్యా, వసతి దీవెన కార్యక్రమాలతో నాలాంటి ఎంతో మంది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలు కలుగుతోంది. భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నన్ను చదివిస్తున్నారు. డిగ్రీ రెండో సంవత్సరంలో రూ.21,505, మూడో సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.13,835 విద్యా, వసతి దీవెన ద్వారా విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న అధిక ప్రాధాన్యత వల్ల నాలాంటి ఎంతో మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు జరుగుతోంది. – లక్ష్మీప్రవల్లిక, డిగ్రీ ఫైనలియర్, సాధన డిగ్రీ కళాశాల, నంద్యాల పెరిగిన జీవనాధారం గొర్రెలను కాస్తున్న ఈమె పేరు కరణం పార్వతి. పత్తికొండ మండలం జూటూరు గ్రామానికి చెందిన ఈమె సంజువాణి పొదుపు గ్రూప్ సభ్యురాలు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా గ్రూపులోని సభ్యులు గొర్రెలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పల్లెల్లోని తమ లాంటి పేద మహిళలు ఒకరిపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారని పార్వతి తెలిపారు. తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే మరోవైపు గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. నాడు కూలీ.. నేడు వ్యాపారి చీరలు అమ్ముతున్న ఈమె పేరు ఫక్కుర్బీ. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామవాసి. గతంలో కూలి పనులకు వెళ్లేవారు. భర్త ఆటో నడిపేవారు. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. సున్నా వడ్డీ పథకం ద్వారా ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.లక్ష రుణం తీసుకొని ఈమె గ్రామంలోనే రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. రోజుకు రూ.4 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. రూ.500 వరకు ఆదాయం వస్తున్నట్లు ఈమె తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా తన కూతురికి ఒకసారి రూ.15 వేలు, మరో సారి రూ.14 వేలు వచ్చినట్లు ఆమె చెప్పారు. అల్లికలకు చేయూత గంప అల్లుతున్న ఈమె పేరు పి.చంద్రమ్మ. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ వాసి. ఈమెకు వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం రూ.18,750లను అందించింది. ఈమె కులానికి చెందిన మరికొంత మందితో కలిసి ఒక ఈత చెట్ల వంకను లీజ్‌కు తీసుకున్నారు. ఆ వంకలో నుంచి ఈత ఆకు కోసుకువచ్చి గంపలు, చీపుర్లు తయారు చేస్తున్నారు. వీటిని గుత్తి, పత్తికొండ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకుంటూ వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చేయూత పథకం తమలాంటి పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని చంద్రమ్మ తెలిపారు. ఈ వార్త కూడా చదవండి: ఆరుగురితో విద్యుత్ ‘కోర్ కమిటీ’ -
గండం ఉందని గల్లంతు నాటకం
కొలిమిగుండ్ల(కర్నూలు): భర్త, కుమార్తెకు ప్రాణ గండం ఉందని, దాని నుంచి వారు బయట పడేందుకు ఓ మహిళ తాను గల్లంతైనట్లు నాటకం ఆడింది. మూడు రోజుల పాటు అనంతపురంలో ఉండి ఆదివారం తాపీగా ఇంటికి చేరుకుంది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెకు చెందిన రసూల్‌బీతో పాటు కూతురు, బంధువులు, ఇంటి పొరుగున ఉన్న మహిళలు మొత్తం పది మంది కలిసి శుక్రవారం ఆటోలో బయలుదేరి ముందుగా తుమ్మలపెంట పొలిమేర సమీపంలో ఉన్న సుంకులమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి గొర్విమానుపల్లె సమీపంలోని లొక్కిగుండం వద్దకు చేరుకున్నారు. రామేశ్వరస్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో గుండంలో నీటిలో దిగారు. రసూల్‌బీ గుండంలో గల్లంతయిందని కూతురుతో పాటు శివమ్మ, తోటి మహిళలంతా ఘంటా పథంగా చెప్పారు. అక్కడే ఉన్న పూజారితో పాటు అంకిరెడ్డిపల్లె, గొర్విమానుపల్లె గ్రామాల నుంచి భారీగా అక్కడికి చేరుకొని ఆచూకీ కోసం నీళ్లలోకి దిగి వెతకటం ప్రారంభించారు. రాత్రంతా అక్కడే ఉండి ప్రయత్నం చేసినా కుదరలేదు. శనివారం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ సహకారంతో జనరేటర్ ఏర్పాటు చేసి మోటార్ల సాయంతో రాత్రి తొమ్మిది గంటల వరకు నీటిని బయటకు పంపింగ్ చేశారు. కేవలం మూడు అడుగుల నీళ్లు ఉండటంతో యువకులు నీళ్లలో దిగి గుండం అంతా జల్లెడ పట్టినా ఆనవాళ్లు దొరకలేదు. చివరకు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయత్నం చేశారు. తాపీగా బస్సు దిగి ఇంట్లోకి.. గుండంలో మూడు రోజుల నుంచి గ్రామస్తులు, బంధువులు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఉత్కంఠ సమయంలో మధ్యాహ్నం తాపీగా బస్సు దిగి రసూల్‌బీ ఇంట్లోకి వెళ్లడంతో హైడ్రామా ముగిసింది. గ్రామస్తులు భారీగా ఆగ్రహావేశాలతో ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈలోగా పోలీసులు గ్రామానికి చేరుకొని రసూల్‌బీలో పాటు తాడిపత్రిలో ఉన్న ఆమె అక్క, బావలు శివమ్మ, కార్తీక్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. భర్త, కూతురుకు ప్రాణగండం ఉందని చెప్పారని, మూడు రోజుల పాటు కనిపించ కుండా పోతే గండం తప్పి పోతుందనే ఉద్దేశంతోనే ఈ నాటకం ఆడినట్లు ఆమె పోలీసులకు చెప్పారు. అనంతపురంలో ఉండి ఆమె ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేది. చివరకు భయపడి ఇంటికి చేరుకుంది. విచారణ కోసం అందరినీ కోవెలకుంట్ల సర్కిల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. -
YSRCP: 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త టీమ్ రెడీ
అనుభవానికి అగ్రతాంబూలం ఇచ్చారు. సీనియార్టీకి ప్రాధాన్యత పెంచారు. సమన్వయ పరచడంలో, విజయ సాధనలో తిరుగులేని వ్యూహకర్తలను జిల్లాల రథసారథులుగా నియమించారు. వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేస్తూ సరికొత్త టీమ్‌ను సిద్ధం చేశారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2024 ఎన్నికల్లో పార్టీ మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): పాలనా పరంగా నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాల పునర్విభజన అనంతరం పార్టీ నూతన అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రీజినల్ కో– ఆర్డినేటర్లు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీకి మరింత బలం కర్నూలు, నంద్యాల జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనను రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియమించడం పార్టీకి మరింత బలం చేకూర్చనుంది. గతంలో కూడా ఉమ్మడి జిల్లా బాధ్యతలు నిర్వహించి, అందరినీ సమన్వయం చేస్తూ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ గెలుపొందేలా సజ్జల రామకృష్ణారెడ్డి కృషి చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగిండంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీకి ప్రాధాన్యం జిల్లా అధ్యక్షుల నియామకంలో వైఎస్సార్సీపీ సీనియార్టీకి ప్రాధాన్యత ఇచ్చింది. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మంత్రాలయం ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత వై. బాలనాగిరెడ్డిని నియమించింది. ఈయన మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిగా ఉంటూ వచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నారు. వరుసగా 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది, విశేష ప్రజాదరణ పొందారు. సీనియర్ నేత అయిన బాలనాగిరెడ్డికి జిల్లాలో మంచి పేరుంది. అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఈయన కర్నూలు జిల్లా అధ్యక్షుడు కావడంతో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం కానుంది. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నేత, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. ఈయన పాణ్యం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నిత్యం అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజాభిమానాన్ని పొందారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో ఈయనకు విశేష అనుభవం ఉంది. ఇది వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. పరుగులు పెట్టనున్న ప్రగతి కర్నూలు జిల్లాపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు. ఈయన డోన్ నుంచి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్థికశాఖ మంత్రిగా సమర్థవంతగా బాధ్యతలను నిర్వర్తించి రెండోసారి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గంలో స్థానం సాధించారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ఆరోపణలను తనౖదైన శైలిలో తిప్పుకొడుతూ, పార్టీ కేడర్‌కు అండగా నిలుస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి కావడంతో జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షేక్ ఆంజాద్ బాషాను నంద్యాల జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉండి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉప ముఖ్యమంత్రిగా, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ఈయన ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా... ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా కొత్తగా నియమితులైన ఇన్చార్జ్ మంత్రులు పనిచేయనున్నారు. అలాగే పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ముందుకు వెళ్లనున్నారు. రెండు జిల్లాలకు సుపరిచితులైన వీరు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండడంతో పాటు వారిని మరింత సమన్వయపరుస్తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీకి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పూర్తి స్థాయి బలం ఉంది. 2014లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన టీడీపీ, 2019లో అన్ని స్థానాల్లో ఓటమి పాలై పూర్తిగా చతికిల పడింది. 2019 ఎన్నికల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, కొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొంది జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకుంది. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో అత్యధిక శాతం కైవసం చేసుకొని నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఈ నేపథ్యంలో ఎంతో వ్యూహంతో ముందుకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరంలో జిల్లాల పునర్విభజన, మంత్రివర్గ విస్తరణతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. తాజాగా రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, జిల్లా అధ్యక్షుల నియామకంతో పార్టీ కేడర్‌లో నూతన జోష్ ఏర్పడిందని చెప్పవచ్చు. -
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కల్వర్టును స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మృతులను కడప జిల్లా మైదుకూరుకు చెందిన వారిగా గుర్తించారు. బేతంచెర్ల మద్దిలేటయ్య స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..! -
భర్తతో కలిసి సొంత చెల్లెలిని హత్య చేసిన అక్క..
ఆత్మకూరు(నంద్యాల జిల్లా): కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన తిరుమలేశ్వరి (26)అనే చెంచుగిరిజన మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ఆస్తి కలిసి వస్తుందని ఆమెను సొంత అక్కనే భర్తతో కలిసి హత్య చేశారు. విచారణలో ఈ విషయం వెలుగుచూడటంతో ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జనార్ధన్‌కు జానకమ్మ, తిరుమలేశ్వరి అనే ఇద్దరు భార్యలు. వీరిద్దరు సొంత అక్కాచెల్లెల్లు. తిరుమలేశ్వరికి పిల్లలు కాలేదు. అయితే, ఈమెను అడ్డుతొలగించుకుంటే ఆస్తి కలిసి వస్తుందని భావించిన అక్క, బావ గత నెల మార్చి 25న భోజనంలో కుక్కల మందు కలిపి పెట్టారు. చదవండి: భర్తతో విడాకులు.. 40 ఏళ్ల వ్యక్తిని నమ్మి పంజాబ్‌కు వెళితే... దానిని భుజించిన తిరుమలేశ్వరి చనిపోవడంతో గుట్టుగా టీవీఎస్ ఎక్సెల్ బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లి నల్లమల అటవీ పరిధిలోని రోళ్లపెంట వద్ద పారవేశారు. కొద్ది రోజుల క్రితం హతురాలి తల్లి తాటికొండ లక్ష్మీదేవి తన కుమార్తె కనిపించడం లేదని ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు భర్త జనార్దన్, సోదరి జానకమ్మపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించి నిందితులను రిమాండ్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు. -
హోంగార్డు హత్య.. మద్యం మత్తులో యువకుల దాష్టీకం
సాక్షి, బొమ్మలసత్రం (నంద్యాల): నంద్యాల పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి నలుగురు యువకులు మద్యం మత్తులో హోంగార్డును చంపేశారు. త్రీటౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఎంఎస్ నగర్‌కు చెందిన చిన్నబాబు ఆదివారం రాత్రి మద్యం సేవించేందుకు స్నేహితులు నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన బాలిరెడ్డి, మహమ్మద్‌గౌస్, మహమ్మద్ రఫితో కలిసి స్థానిక రైల్వేస్టేషన్ వద్ద మద్యం కొనుగోలు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ ప్రాంతంలోకి వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడే మద్యం సేవించి ఆ తర్వాత కేకలు వేస్తూ బైక్‌లపై బయటకు వస్తుండటంతో హోంగార్డు కుమ్మరి రాజశేఖర్(44) అడ్డుకున్నాడు. మద్యం సేవించి కేకలు వేయడం మంచిది కాదని వారించాడు. కాగా మద్యం మత్తులో ఉన్న యువకులు రాజశేఖర్‌పై దాడికి పాల్పడి పక్కకు తోయడంతో ఇనుప గేటు కు తల బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో హోంగార్డు రామసుబ్బయ్య గమనించి అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ రఘువీరారెడ్డి మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. చదవండి: (భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..) -
విద్యతోనే వెలుగులు: సీఎం జగన్
మీ బిడ్డల చదువులకు నాదీ భరోసా చదువుకోవాలనే ఆరాటం ఉన్నా పేదరికంతో ఆగిపోయిన పిల్లలను నా పాదయాత్రలో చూశా. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైన తల్లిదండ్రులను చూశా. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ ఏ ఒక్క బిడ్డ కూడా పేదరికంతో చదువుకు దూరం కాకూడదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. మన బతుకులు, తలరాతలను మార్చే శక్తి చదువులకే ఉంది. మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ధైర్యంగా చదివించండి. వారి చదువులకు మేనమామగా నాదీ భరోసా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, కర్నూలు: విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ఒక్క ఏడాదిలోనే 8.64 పెరిగిందని, గత సర్కారు హయాంతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరికలు ఏకంగా ఏడు లక్షలకుపైగా పెరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. నంద్యాలలో జ్యోతి ప్రజ్వలనం చేసి వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు, ఇంగ్లిషు మీడియంతో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మారాయని, ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్లు ఇస్తున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానాలు, పథకాలు, విద్యా వ్యవస్థపై నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడతలో భాగంగా రూ.1,024 కోట్లను శుక్రవారం నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నంద్యాలను జిల్లాగా చేసినందుకు శిల్పామోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఫీజులకు తోడుగా వసతి దీవెన.. ప్రతీ పార్లమెంట్‌ను జిల్లాగా చేస్తానని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తానని ఇదే నంద్యాల వేదికగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మీ ముందుకు వచ్చా. చదువు అనే ఆస్తిని పిల్లలకు ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకు రాలేవు. అందుకే విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేశాం. గత సర్కారు హయాంలో అరకొరగా ఫీజుల విదిలింపులతో ఎంతో మంది చదువులకు గండం ఏర్పడింది. అక్కచెల్లెమ్మలకు జగనన్న వసతి దీవెన చెక్కును అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తూ ఆదుకుంటున్నాం. భోజన, వసతి ఖర్చులు కూడా రూ.వేలల్లోనే ఉంటున్నాయి. వీటికి కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని భావించాం. దివంగత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా మరోరెండు అడుగులు ముందుకేసి ఫీజుల పథకానికి మార్పులు చేయడంతో పాటు జగనన్న వసతి దీవెన అనే మరో గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. మీ అన్న తోడుంటాడని మాటిస్తున్నా.. నంద్యాల గడ్డ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది పిల్లల చదువుల కోసం 9,61,140 మంది తల్లుల ఖాతాల్లోకి 2021–22 జగనన్న వసతి దీవెన పథకం రెండో విడతగా రూ.1,024 కోట్లు జమ చేస్తున్నాం. పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలను భోజనం, వసతి కోసం రెండు విడతల్లో ఇస్తామని చెప్పాం. ఆ ప్రకారం రెండోదఫా డబ్బులు జమ చేస్తున్నాం. కుటుంబంలో ఒకరికే పరిమితం చేసే రోజులు పోయాయి. మీ కుటుంబంలో అందరినీ చదివించండి. మీ అన్న జగన్ మీకు తోడుగా ఉంటాడని ప్రతీ తల్లికి మాట ఇస్తున్నా. జవాబుదారీతనం పెంచేందుకు జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజురీయింబర్స్‌మెంట్ డబ్బులను తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. వీటిని తల్లులు కాలేజీలకు చెల్లిస్తున్నారు. దీంతో వారు సదుపాయాలపై కాలేజీలను ప్రశ్నించవచ్చు. యాజమాన్యాలలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెస్తే కాలేజీలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. మూడేళ్లలో సమూల మార్పులు విద్యారంగంలో మూడేళ్లలో సమూల మార్పులు చేశాం. పేద కుటుంబంలో ప్రతీ బిడ్డ మంచి చదువులు చదవాలనే తాపత్రయంతో నాడు–నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. మంచి చదువు మాత్రమే సరిపోదు.. మంచి ఆహారం కూడా అందాలి. పిల్లలు ఏం తీసుకుంటే బాగుంటారు? ఎలాంటి నాణ్యమైన భోజనం అందించాలి? అని బహుశా గతంలో ఏ ముఖ్యమంత్రీ ఆలోచించి ఉండరు. గతంలో పాఠశాలల్లో ఫర్నిచర్, బ్లాక్ బోర్డులకూ కొరతే. వంట గదుల్లో అంతా అపరిశుభ్రత. ఆహ్లాదంగా కనిపించేలా గోడలకు రంగులు లేవు. ఎప్పుడు కూలిపోతాయో తెలియని గదుల్లో బోధించాల్సిన దుస్థితి. నాడు–నేడు ద్వారా ఈ దురవస్థను తొలగిస్తున్నాం. సర్కారు స్కూళ్లకు మంచి రోజులు.. పిల్లలకు ఇంగ్లీషు మీడియంతో ఇబ్బంది లేకుండా మిర్రర్ ఇమేజ్‌తో ద్విభాషా పాఠ్య పుస్తకాలను తెచ్చాం. పక్కపక్కనే ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పాఠాలను ముద్రించాం. నెమ్మదిగా ఇంగ్లీషు మీడియం వైపు నడిపించేలా ఇవి ఉపయోగపడతాయి. రానున్న 10 నుంచి 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానాన్ని మార్చుతున్నాం. పాఠశాలల నుంచి మొదలైన ఈ మార్పు ద్వారా కాలేజీల వైపు కూడా అడుగులు వేస్తున్నాం. మెడికల్ కాలేజీలు.. స్కిల్ వర్సిటీలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు 16 కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. అందులో ఒకటి ఇదే నంద్యాలలో మీ కళ్లెదుటే ఏర్పాటు కానుంది. ఇక యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కొత్తగా నైపుణ్య విశ్వ విద్యాలయాలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులను కాలేజీలకు, స్కిల్‌డెవలప్‌మెంట్‌కు అనుసంధానించాం. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను తెచ్చికాలేజీల్లో ఇంటర్న్‌షిప్ కచ్చితంగా అమలు చేస్తున్నాం. మరిన్ని ప్రత్యేక కోర్సులు కూడా తీసుకొస్తున్నాం. 67 ఒకేషనల్, 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు తీసుకొచ్చాం. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సు కూడా ప్రవేశపెట్టాం. ఎక్కడా లేనివిధంగా అమ్మఒడి బిడ్డలకు మంచి చదువు చెప్పించాలని ప్రతీ తల్లి ఆరాట పడుతుంది. పిల్లలను బడులకు పంపిస్తే చాలు 12 తరగతి వరకూ జగనన్న అమ్మ ఒడి ద్వారా అటెండెన్స్‌ను జతపరిచి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తున్నాం. 84 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా పేద బిడ్డలకు మేలు చేసే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది? అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచేందుకు అమ్మఒడితోపాటు చాలా అడుగులు వేశాం. హర్షధ్వానాల మధ్య సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న విద్యార్థులు, అక్కచెల్లెమ్మలు వైఎస్సార్ ఆసరా, చేయూతతో పాటు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. సున్నా వడ్డీ రుణాలిస్తున్నాం. ఆర్థిక సాధికారత కోసం రిలయన్స్, హిందుస్తాన్ లీవర్, అమూల్‌తోపాటు మల్టీ నేషనల్ కంపెనీలు, దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. బ్యాంకులు రుణాలిచ్చేలా తోడ్పాటు అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటే పిల్లలంతా బాగుంటారనే విశ్వాసంతో మూడేళ్లుగా మహిళా సాధికార ప్రభుత్వం అని చెప్పుకునేలా అడుగులు వేశాం. సంపూర్ణ పోషణ.. గోరుముద్ద పిల్లల చదువులపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో శారీరక, మానసిక ఎదుగుదల కోసం కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. తల్లితో పాటు గర్భస్థ శిశువులకు మంచి ఆహారం అందాలనే లక్ష్యంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని తెచ్చాం. గత సర్కారు ఇందుకోసం కనీసం రూ.600 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ తర్వాత స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం ‘వైఎస్సార్ గోరుముద్ద’ ప్రవేశపెట్టాం. దీనికి గత సర్కారు ఏటా రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రూ.1,900 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఎక్కడ 500 కోట్లు?.. ఎక్కడ 1900 కోట్లు? ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెనకు రూ.పది వేల కోట్లు 2017–18, 2018–19కి సంబంధించి గత సర్కారు రూ.1,778 కోట్ల ఫీజు బకాయిలను ఎగ్గొడితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించింది. జగనన్న విద్యాదీవెన కింద త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజులు ఇస్తున్నాం. టీడీపీ సర్కారు బకాయి పడ్డ రూ.1,778 కోట్లతో కలిపి రూ.6,969 కోట్లను జగనన్న విద్యాదీవెన ద్వారా చెల్లించాం. వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. కేవలం ఈ రెండు పథకాలకే 34 నెలల్లో మన ప్రభుత్వం రూ.10,298 కోట్లు ఖర్చు చేసింది. అక్కచెల్లెమ్మలు, వారి పిల్లల కోసం మేనమామగా చేస్తున్న ఖర్చు ఇది అని సంతోషంగా తెలియజేస్తున్నా. జాతీయ సగటుకు మించి జీఈఆర్ పెరుగుదల వివిధ పథకాల ద్వారా చదువుకునేలా ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యార్థుల డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. ఇంటర్ తర్వాత కాలేజీల్లో 18 – 23 ఏళ్ల వయసు విద్యార్థుల చేరికలకు సంబంధించి జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) గత సర్కారు హయాంలో 2018–19 నాటికి 32.4 ఉంటే 2019–20లో ఒక్క ఏడాదిలోనే మనం తెచ్చిన మార్పులతో 35.2కి పెరిగింది. ఏడాదిలోనే జీఈఆర్ ఏకంగా 8.64 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే జాతీయ స్థాయిలో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.64 శాతం పెరిగింది. మహారాష్ట్ర, పశ్చిమ బంగ, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఐదు శాతం కంటే తక్కువే పెరుగుదల నమోదైంది. –1.6 శాతంతో తెలంగాణలో నెగెటివ్ వృద్ధి నమోదైంది. మన రాష్ట్రంలో విద్యార్థినులకు సంబంధించి జీఈఆర్ 11.03 శాతానికి పెరిగింది. అదే జాతీయ స్థాయిలో కేవలం 2.02 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. విద్యారంగంలో మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. గత సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 37 లక్షల మంది కాగా ఇప్పుడు 44.30 లక్షలకు పెరిగారు. అంటే 7.18 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మంచి మార్పు ఏముంటుంది? మన ఖర్మ కొద్దీ.. ఇవాళ ఇన్ని మంచి మార్పులు జరుగుతుంటే చంద్రబాబుకు, ఆయన పార్టీకి, దత్తపుత్రుడికి, ఎల్లో మీడియాకు కనిపించవు. ఎన్ని మంచి పనులు చేస్తున్నా రోజుకో కట్టుకథ, వక్రీకరణతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. రాష్ట్రంలోచేస్తున్నవి సరిపోవని ఏకంగా పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ బురద జల్లి పరువు తీస్తున్న గొప్ప చరిత్ర వీరిది! ఎక్కడైనా ప్రతిపక్షాలుంటాయి. అన్ని పక్షాలు కలసి పార్లమెంట్లో రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా మాట్లాడాలి. మన ఖర్మ ఏమిటంటే.. దౌర్భాగ్యమైన ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు, దౌర్భాగ్య ఎల్లో మీడియా ఉన్నాయి. కదిలించలేవు.. బెదిరించలేవు ఈ సమస్యలు, కష్టాలు ఎన్ని ఉన్నా.. ఒకటే చెబుతున్నా. ఇవేవీ నన్ను కదిలించలేవు.. బెదిరించలేవు. వీరందరికీ ఒకటే చెబుతున్నా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చా. మీ దీవెనలు ఉన్నంత వరకూ వారు నా వెంట్రుక కూడా పీకలేరు. దేవుడి దయ, మీ చల్లని దీవెనలు ఇలాగే ఉండాలని, ఇంకా మంచి చేసేలా దీవించాలని మనసారా కోరుతున్నా. నంద్యాలకు రింగు రోడ్డు, మిర్చి యార్డు ‘‘నంద్యాలలో మంచి అభివృద్ధి జరుగుతోందని, మరింత సహకారం కావాలని నా మిత్రుడు, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అడుగుతున్నారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు నంద్యాలలో రెండు హైవేలను కలిపేలా 12 కిలోమీటర్ల రింగ్ రోడ్డు మంజూరు చేస్తున్నా. ఆటోనగర్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. మిర్చి రైతులు గుంటూరు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే విక్రయించేలా మిర్చి మార్కెట్ ఏర్పాటు చేస్తాం. వైఎస్సార్ నగర్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దుతాం’’ నవరత్నాలన్నీ మా ఇంట్లోనే.. వసతి దీవెన కింద జగనన్న ఏటా అందిస్తున్న రూ.20 వేలు నాలాంటి మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మా నాన్న అర్చకుడిగా పని చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. ప్రతినెలా 1వ తేదీన పాలవారి కంటే ముందుగా వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు. జగనన్న పథకాల వల్ల నేను చదువుకుంటున్నానని ఈ సభ సాక్షిగా చెబుతున్నా. బాగా చదివి న్యాయవాదినై ప్రజలకు సేవ చేస్తా. – కరణం బృహతి మానస, డిగ్రీ విద్యార్థిని మా చదువులు.. మీ చలవే మాది మధ్యతరగతి కుటుంబం. జగనన్న వసతి దీవెనవల్ల చదువుకుని మా కాలేజీలో సీనియర్లు 70 శాతం మంది మంచి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. నా సోదరుడి బీటెక్ చదువంతా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే పూర్తయింది. మా కుటుంబం ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందింది. వైఎస్ జగనన్న ముందుచూపుతో ఇలాంటి పథకాలను ప్రారంభించి చక్కగా అమలు చేస్తున్నారు. – సౌమ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, నంద్యాల -
Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల
బనగానపల్లె (నంద్యాల జిల్లా): రేనాటి ప్రాంత వాసుల కల నెరవేరుతోంది. త్వరలోనే విద్యుత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. నంద్యాల, ఎర్రగుంట్ల మధ్య 126 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ పనులను గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. రూ.250 కోట్లతో ఈ పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసి, దక్షిణ మధ్య రైల్వేకు అప్పగించారు. గత నెల 29వ తేదీన రైల్వే సేఫ్టీ అధికారి అభయకుమార్ రాయ్ ఆధ్వర్యంలో ట్రైల్ రన్ నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజన్ ఇంజినీర్ సంజీవకుమార్ బృందం కూడా శుక్రవారం రెండోసారి ట్రైల్ రన్ నిర్వహించింది. అతి త్వరలో విద్యుత్ రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి నంద్యాల, ఎర్రగుంట్ల విద్యుత్ రైల్వే లైన్ పూర్తికావడంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ లైన్లో గూడ్స్ సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉంది. దీంతో రేనాటి గడ్డ పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. రేనాటి గడ్డలో పలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గనుల నుంచి నాపరాతిని, ఫ్యాక్టరీల నుంచి పాలిష్ రాళ్లను ఇతర ప్రాంతాలను ఎగుమతి చేస్తున్నారు. గూడ్స్ సర్వీసులు పెరిగితే ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందనున్నాయి. పలువురికి ఉపాధి లభించనుంది. పెరగనున్న రైలు సర్వీసులు కరోనాతో ప్రస్తుతం ఈ మార్గంలో డెమో రైలు సేవలు రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ధర్మవరం–విజయవాడ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ మాత్రమే నడుస్తోంది. విద్యుత్ లైన్ పూర్తికావడంతో డెమో రైల్‌తో పాటు మరిన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2016లో రైల్వేలైన్ ప్రారంభ సమయంలో నంద్యాల నుంచి తిరుపతికి ఎక్స్‌ప్రెస్ సర్వీస్ నడుపుతామని అధికారులు ఇచ్చిన హామీ ఇంత వరకు నేరవేరలేదు. హామీ నెరవేర్చాలని ఎంపీలు అవినాష్‌రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సర్వీస్‌ను నడిపేందుకు రైల్వే అధికారులు తప్పక చర్యలు తీసుకునే అకాశం ఉంది. త్వరలోనే విద్యుత్ రైళ్ల రాకపోకలు నంద్యాల, ఎర్రగుంట్ల రైలు మార్గం గుండా గూడ్స్ సర్వీస్‌లు విద్యుత్ సౌకర్యంతోనే నడుస్తున్నాయి. అనుకు న్న సమయానికన్నా ముందే విద్యుత్ లైన్ పనులు పూర్తయ్యాయి. అతి త్వరలో ఈ మార్గం ద్వారా విద్యుత్ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. రైళ్ల సర్వీసులు కూడా పెరిగే అవకాశం ఉంది. – సంజీవకుమార్, సీనియర్ డివిజనల్ ఇంజినీర్, దక్షిణ మధ్య రైల్వే