
నంద్యాల: జిల్లాలో కూటమి నేతల అరాచకాలు ఆగడం లేదు. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వేధింపులు తాళలేక వైఎస్సార్‌సీపీ కార్యకర్త పుల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పని చేశాననే అక్కసుతో తనను టీడీపీ నాయకులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగాడు. పుల్లయ్య పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, రామలింగారెడ్డి ఇతర టీడీపీ నాయకులు తన అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియోలో పుల్లయ్య తెలిపారు.
టీడీపీ వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని.. తన చావుకు టీడీపీ నాయకులు కారణం అంటూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment