YSRCP Workers
-
రెచ్చిపోయిన పచ్చ మూకలు.. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులతో దాడి
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నానాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే గ్రామంలోనక్కా మాణిక్యం, గడి దివాణం అనే మరో ఇద్దరిపైనా టీడీపీ నేతలు దాడికి దిగారు. కాకినాడ రూరల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నానాజీ చికిత్స పొందుతున్నారు.నిన్న(శుక్రవారం) జరిగిన వైఎస్సార్సీపీ పోరుబాటలో పాల్గొనేందుకు ప్రత్తిపాడు వెళ్తుండుగా రెండు చోట్ల దారి కాచి పచ్చమూక దాడులకు తెగబడ్డారు. దాడికి పాల్పడిన తొమ్మిది మందిపై అన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. మండపంలో పోలీస్ పహరామండలంలోని మండపం గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి నేతల దాడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. దాడుల కారణంగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. కూటమి నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేతలకు అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ముద్రగడ గిరి అన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ పర్వత రాజుబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఇదీ చదవండి: పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ పోరుబాటపై అక్రమ కేసులు -
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య
జగ్గయ్యపేట/జగ్గయ్యపేట అర్బన్: టీడీపీ నాయకుల బెదిరింపులను తాళలేక మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేటలోని నాగమయ్య బజారుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గుగ్గిళ్ల శ్రీను (31) సమీపంలోని స్టీల్ ప్లాంట్‌లోని మినరల్ వాటర్ ప్లాంట్‌లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం టీడీపీ నేత వీర్ల వెంకన్న ఇంటివద్ద విద్యుత్ స్తంభం అడ్డుగా ఉండటంతో దానిని తొలగించి.. శ్రీను ఇంటి ఎదుట అధికారులకు తెలియకుండా రాత్రికి రాత్రే కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశాడు.తన ఇంటిముందు స్తంభం ఎందుకు పెట్టారని, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని, విద్యుత్ తీగలు కిటికీలకు తగిలితే ప్రమాదం జరుగుతుందని శ్రీను ప్రశి్నంచాడు. దీంతో శ్రీను, అతడి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో శ్రీను ఆ సమస్యను విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అధికారుల నుంచి సమాధానం రాకపోగా.. వెంకన్నతో పాటు టీడీపీ నాయకులు షేక్ చాంద్సాహెబ్, మద్దం నరసింహారావు, నాగబాబు, సరస్వతి, రహంతుల్లా శ్రీను ఇంటికి వచ్చి మరోసారి బెదిరించి వెళ్లారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఈ నెల 11న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు పనిచేసే ప్లాంట్ వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) తదితరులు శ్రీను మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.టీడీపీ కౌన్సిలర్లు కావేటి కృష్ణ, గొట్టె నాగరాజు ప్రోద్బలంతోనే వీర్ల వెంకన్న, షేక్ చాంద్, మద్దం నరసింహారావు, నాగబాబు, షేక్ బబేబీ, బషీర్, రహీంతుల్లా, వీర్ల సరస్వతి కలిసి తన భర్తను మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని శ్రీను భార్య గోవిందమ్మ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని, నాకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గుగ్గిళ్ల శ్రీను కుటుంబ సభ్యులను ఆదివారం వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరామర్శించారు. -
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్
సాక్షి, పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వదిలేసి వెల్లటూరులో నాగరాజు కుటుంబం ఉంటుంది.కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. -
రేపల్లెలో శృతిమించిన టీడీపీ దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ వారి దౌర్జన్యం శృతిమించింది. కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారు. అధికారపక్షం కావడంతో పోలీసులు వారు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా రేపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజ్‌పాల్‌పై పోలీసులు గాంజా కేసు నమోదు చేశారు. ఇటీవల గంజాయితో పట్టుబడిన ముఠాలో రాజ్‌పాల్ లేకున్నా పోలీసులు కేసులో అతడి పేరు చేర్చారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వాస్తవానికి రాజ్‌పాల్ ఓట్ల› లెక్కింపు అనంతరం టీడీపీ నేతల బెదిరింపులతో ఊరువదలి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు రేపల్లెకు రాలేదు. అయినా పోలీసులు అతడిపై గాంజా కేసు నమోదు చేశారు. తప్పుడు కేసులు మానుకోవాలి అధికారం శాశ్వతం కాదని, టీడీపీ నేతలు ఇప్పటికైనా తెలుసుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు శృతిమించాయన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా మారకపోతే తాము రోడ్డెక్కి ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. రేపల్లెకు చెందిన తమ పార్టీ కార్యకర్త రాజ్‌పాల్ యాదవ్‌పై పోలీసులతో అధికారపార్టీ నేతలు గంజాయి కేసు పెట్టించడం దారుణమన్నారు. పోలింగ్ నాడు టీడీపీ నాయకుడితో రాజ్‌పాల్ గొడవ పడ్డారని, ఆ కక్షతోనే ఇప్పుడు అతడిపై గంజాయి కేసు పెట్టించారని చెప్పారు. ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ వారి దాడులు పెరగడంతో రాజ్‌పాల్, మరికొందరు ఊరు వదలి వెళ్లారని తెలిపారు. తరువాత ఇప్పటికీ రాజ్‌పాల్ రేపల్లె రాలేదని చెప్పారు. రాజ్‌పాల్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకోబోతే పరారయ్యాడని పోలీసులు కట్టుకథ అల్లి అతడిపై కేసు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారు దాడులు చేస్తారని ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్న రాజ్‌పాల్‌పై తప్పుడు కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు అధికారంలోకి రావడం, పోవడం సర్వసాధారణమన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. -
జీపుతో ఢీకొట్టి కిడ్నాప్..
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పట్టణ నడిబొడ్డున అందరూ చూస్తుండగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త చాకలి శ్రీనును జీపుతో ఢీకొట్టి.. ఆపై కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇంట్లో.. ఆమె సమక్షంలో తీవ్రంగా కొట్టి పట్టణ శివారులో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డికి లింగందిన్నెకు చెందిన చాకలి శ్రీను అనుచరుడు. శుక్రవారం ఆరోగ్యం సరిగాలేదని ఆళ్లగడ్డలోని మెడికల్ స్టోర్‌కు వచ్చి, మందులు తీసుకుని మరో యువకుడితో కలిసి బైక్‌పై లింగందిన్నెకు బయలుదేరాడు. వారిని వాహనంలో వెంబడిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బైక్‌ను ఢీకొట్టారు. దీంతో శ్రీను, మరో యువకుడు కిందపడ్డారు. వెంటనే కర్రలు, రాడ్లతో వాహనంలోంచి దిగిన టీడీపీ రౌడీ మూకలు శ్రీనును కొట్టుకుంటూ వాహనంలో వేసుకుని ఎమ్మెల్యే ఇంట్లోకి తీసుకెళ్లారు. మరో యువకుడు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించారని పోలీసులకు చెప్పినా ఫలితం లేదు. తుదకు శ్రీనును చంపొద్దని బతిమాలడంతో స్పృహ కోల్పోయేలా కొట్టి పొలాల్లో పడేశారు. ఆపై పోలీసులు 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 3 గంటలకు పైగా ఉత్కంఠ శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించిన విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించింది. టీవీ చానళ్లలో ప్రముఖంగా ప్రసారమైంది. అయినా పోలీసులు చలనం లేకుండాపోయింది. సుమారు 3 గంటలకు పైగా బాధితుడిని ఇంట్లో ఉంచి కొడుతున్నా.. అరుపులు బయటకు వినిపిస్తున్నా.. పోలీసులు మౌనం వహించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే.. విడిచి పెట్టాలని కోరుతున్నామని చెప్పారే తప్ప కనీసం ఆ ఇంటి వద్దకు కూడా వెళ్లక పోవడం విమర్శలకు తావిస్తోంది. విషయం వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. టీడీపీ శ్రేణులతో చర్చలు కొనసాగించినట్లు తెలుస్తోంది. కొట్టి పొలాల్లో పడేస్తామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ముందుగానే పోలీసులు 108 వాహనాన్ని సిద్ధం చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడికి ఆళ్లగడ్డలో ప్రథమ చికిత్స కూడా చేయించకుండా 50 కి.మీ దూరంలోని నంద్యాల వైద్యశాలకు తరలించడం గమనార్హం. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆర్థిక సాయం
తెనాలి/మచిలీపట్నం టౌన్/వీరవాసరం: టీడీపీ, జనసేన జరిపిన దాడుల్లో గాయపడిన ముగ్గురు కార్యకర్తలకు వైఎస్సార్సీపీ నాయకులు ఆర్థి క సాయం అందించి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నేతలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం కోలుకుంటున్న వైఎస్సార్సీపీ తెనాలి 16వ వార్డు ఇన్చార్జి కాళిదాసు సత్యనారాయణను శనివారం మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు పరామర్శించారు. ఆయనకు రూ.లక్ష ఆర్థి కసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మిద్దె బాబీ, అతని భార్యపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఇంట్లోని సామగ్రి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన బాబీ దంపతులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా టీడీపీ శ్రేణులు బెదిరించాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి వివరించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిన రూ.50 వేల చెక్కును పేర్ని కిట్టు, నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ.. బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ శీలం భారతి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జనసేన నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆ పార్టీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త లింగంపల్లి సాల్మన్‌రాజును ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాలదుర్గా నాగమల్లేశ్వరరావుబాబు, నాయకులు శనివారం పరామర్శించారు. బాధితుడు సాల్మన్‌రాజుకు రూ.50 వేల చెక్కును సాయంగా అందజేశారు. -
వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం సృష్టంగా కనిపించింది. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది మంది వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. హెలిప్యాడ్ వద్దకు వేలాది మంది దూసుకు రావడంతో వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగేందుకు కొద్ది సేపు సంశయించాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అయ్యేలా పర్యటన ఖరారైంది. నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి నేరుగా వాహనంలో జాతీయ రహదారి మీదగా నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి వచ్చేలా పర్యటన ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత హోదాలో వైఎస్ జగన్ పర్యటనకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపు 80 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ, అంతా హెలికాప్టర్ దిగే ప్రదేశం వద్దకే వేలాది మంది అభిమానులు దూసుకొచ్చి చుట్టు ముట్టేశారు.కనీసం రోప్ పార్టీ కూడా లేని పరిస్థితి. దీంతో తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో అభిమానులు తోపులాటల మధ్య వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగి, వాహనం వద్దకు చేరుకున్నారు. హైస్కూల్ ఆవరణలో అభిమానుల్ని కంట్రోల్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు కానీ, తగినంత పోలీస్ సిబ్బంది మాత్రం లేరు. దీంతో అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హెలిప్యాడ్ వద్దకు వచ్చేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చాలా మంది హెలిప్యాడ్ వద్ద జగన్‌ను కలవలేకపోయారు. ఇదీ చదవండి; పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరికవైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ అభిమానుల్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడంతో అభిమానుల ముసుగులో ఎవరైనా ఆయనకు ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది హెలికాప్టర్‌ను చుట్టేయడంతో జగన్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ సమయంలో అభిమానుల ముసుగులో టీడీపీ మూకలు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తున్న నేపథ్యంలో ఈ సందేహం వస్తోందని ఆ పార్టీ నేత ఒకరు అన్నారు. గతంలో విజయవాడలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌పై రాయితో హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. -
విజయవాడ: తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్
సాక్షి, విజయవాడ: కోర్టు సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు మద్దెల పవన్, మద్దెల రాజేష్‌లపై దాడి చేసిన 9 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వారిలో మొత్తం 14 మందిని పోలీసులు గుర్తించారు. 9 మందిని అరెస్ట్ చేసిన సూర్యారావు పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మిగిలిన ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.నిందితులు కొర్ర సత్యనారాయణ, అరసంకల అశోక్, చింతజల్లు రమేష్ బాబు, బాలబొమ్మ అయ్యప్ప, రాచూరు వెంకటేశ్వర్లు, రెడ్డిపల్లి కిరణ్ కుమార్, రెడ్డిపల్లి సతీష్ కుమార్, గుత్తి సత్యనారాయణ, ఇమ్మిడి శివకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కర్రలు, బీరు బాటిళ్లతో నిందితులు విచక్షణ రహితంగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ పార్టీలో యాక్టివ్‌గా పని చేసినందుకే దాడి జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం బాధితులు మద్దెల పవన్, రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వరాదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, రీజనల్ కో–ఆర్డినేటర్లతో మంగళవారం ఆయన తాడేపల్లి నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఈసీ అనుసరిస్తున్న తీరు, అధికార యంత్రాంగంపై అనుమానాలున్న నేపథ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ⇒ ప్రజల ఆదరాభిమానాలతో వైఎస్సార్సీపీ తిరిగి విజయం సాధించబోతోంది. కాబట్టి మరింత జాగరూకత అవసరం. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలుంటే వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను 31వ తేదీలోగా ఇవ్వాలి. పారీ్టకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలి. ⇒ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని కుయుక్తులు పన్నుతున్నందున నియమ నిబంధనలు కచి్చతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఏజెంట్లదే. పోస్టల్ బ్యాలెట్, ఇతర అంశాలపై ఈసీ గైడ్‌లైన్స్‌కు భిన్నంగా ఆదేశాలు ఇవ్వమని కూడా ఈసీపై ఒత్తిడి చేస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతాలలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ⇒ కౌంటింగ్ ఏజెంట్ల నియామకం రెండు రోజుల్లో పూర్తి చేయాలి. కౌంటింగ్ ప్రారంభ సమయంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. ఫైనల్ గా డిక్లరేషన్ తీసుకునే వరకు అప్రమత్తంగా ఉండాలి. ⇒ సీఎం జగన్ తిరిగి విజయం సాధించాలని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో ఏజెంట్లు కూడా ప్రతి టేబుల్ దగ్గరా అంత పట్టుదలగా ఉండాలి. ఈ నెల 29వ తేదీనాటికి కౌంటింగ్ ఏజెంట్ల ఫార్మాట్లో పేర్లు, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందించాలి. మన ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలో ముందుగా తెలుసుకోవాలి. ⇒ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చాలా అప్రమత్తత అవసరం. వీటివల్లే గతంలో గుంటూరులో వేలాది ఓట్లు మనపార్టీ నష్టపోవాల్సి వచి్చన విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.గురజాల మండలం కొత్త గణేషన్ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్‌పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను చావబాదిన పోలీసులు
కోనేరు సెంటర్: టీడీపీ నేత సమక్షంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదిన కృష్ణా జిల్లా బందరు రూరల్ పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. బందరు మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఓ గ్రామ దేవత సంబరంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్ఐ చాణక్య ఆస్పత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు. మరో ఏఎస్సై, కానిస్టేబుల్‌తో కలిసి సుల్తానగరంకు చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో ఎస్ఐ కుళ్లబొడిచారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది, కార్యకర్తల ముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఒకరికి చేయి విరిగిపోగా, మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త వీపంతా రక్తపుమరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు, తదితర నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకెవరిచ్చారంటూ పేర్ని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తమ కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్ఐతోపాటు బాధ్యులందరినీ విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ సుభానీ, సబ్ డివిజన్‌కు చెందిన సీఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్ని నానికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు. -
విశాఖ రాజధాని ప్రకటన.. సీఎం జగన్ ఫొటోకి పాలాభిషేకం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని(పాలన)గా విశాఖపట్నం పేరు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనను వైఎస్సార్సీపీ శ్రేణులు స్వాగతించాయి. అందుకు కృతజ్ఞతగా.. సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం హాజరయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందలనేది సీఎం జగన్ ఆలోచన. మరో రెండు నెలల్లో విశాఖ రాజధాని కాబోతోంది. సీఎం జగన్ కూడా వైజాగ్ వచ్చి నివాసం ఉంటారు అని మంత్రి పేర్కొన్నారు. త్వరలో విశాఖలో జరిగే సదస్సులు ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చబోతున్నాయన్న మంత్రి అమర్నాథ్.. మహిళ భద్రతలో విశాఖ టాప్ 10 నగరంలో ఉందంటే దానికి సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అక్రమాని విజయనిర్మల, కోలా గురువులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లీష్ విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను’ అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2023 -
ఏది నిజం?: పింఛన్లిచ్చే వారు గూఢచారులట?
ఆసుపత్రిలో ఉన్న ఓ అవ్వకు... 1వ తేదీన ఠంచనుగా అక్కడికే వెళ్లి పింఛను అందజేశాడు ఓ వలంటీరు. జోరుగా వర్షం కురిసి రోడ్ల నిండా నీరునిండిపోయింది. తెల్లవారుఝామునే... వర్షానికి తడుస్తూ ఆ నీట్లోనే వచ్చి ఓ తాతకుపింఛను అందించింది మరో వలంటీరు. మరి వీళ్లలో వైసీపీ వాళ్లెవరు? ఆ అవ్వ, తాత వైసీపీ నాయకులా? వాళ్లకు పింఛన్లివ్వటంవైఎస్సార్ సీపీకి సేవ చేయటమా? వాళ్లకు పింఛన్లందించిన వలంటీర్లు వైసీపీ వేగులా? ఇలా ఇవ్వటం గూఢచర్యమా?ఏ కొంచెం కూడా దురి్వనియోగానికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలను ఇలా జనానికి చేరవేస్తుండటం రాజకీయ కార్యకలాపమా? యావత్తు దేశాన్నీ కోవిడ్ మహమ్మారి చుట్టేసి... ఇళ్లలోంచి బయటకు రావటానికే జనం భయపడుతున్నపుడు... ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎవరెవరికి అనారోగ్య లక్షణాలున్నాయో ‘సర్వే’ పేరిట తెలుసుకోవటం వ్యక్తిగత గోప్యతకు భంగమా? ప్రతి ఇంటికీ మాసు్కలు, మందులతో పాటు పచారీ సామాన్లు కూడా అందించిన స్వచ్ఛంద సైన్యంపై ఎందుకింత కడుపుమంట? పథకాల దురి్వనియోగానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా నూరుశాతం అర్హులకు చేరవేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై ఎందుకీ విద్వేషం? వృద్ధులు కానీండి... అనారోగ్యంతో తల్లడిల్లుతున్నవారు కానీండి... ఆఖరికి వికలాంగులు కానీండి. ఎవ్వరైనా పడుతూ లేస్తూనైనా తాము చెప్పిన చోటుకు వస్తేనే పింఛను. అక్కడికొచ్చి గంటలకొద్దీ వేచిచూస్తే... ఆ రోజు అదృష్టం బాగుంటే పింఛను దొరుకుతుంది. లేదంటే మరోరోజు రావాల్సిందే. అది ఎండైనా.. వానైనా. ఇదీ.. ఘనత వహించిన నారా చంద్రబాబు నాయుడి హయాంలో పింఛన్ల తంతు. కానీ ‘ఈనాడు’ దృష్టిలో అదే స్వర్ణయుగం. ఇప్పుడు ఆ పింఛనుదార్లకు గౌరవమిస్తూ... వారి వద్దకే వెళ్లి అందజేస్తున్న వలంటీర్లు మాత్రం వైసీపీ వేగులట!!. అలా ఇవ్వటం రాజకీయ కార్యకలాపమట. అది పార్టీ సేవ అట!!. 52 ఏళ్లు నిండిన ‘ఈనాడు’ బుద్ధి ఎక్కడికిపోయింది? వయసు మీద పడటంతో రామోజీరావుకు, చంద్రబాబుకు ఆలోచనలన్నీ అరికాళ్ల నుంచే పుట్టుకొస్తున్నట్టున్నాయి. ఏళ్లు పెరుగుతున్న కొద్దీ ‘ఈనాడు’ కూడా వీళ్లమాదిరే తయారవుతోందా? అక్షరమక్షరంలోనూ ఇంతటి విషాన్ని నింపుకున్న పత్రికలో ఏ ఒక్క వార్తయినా నిజమని నమ్మగలమా? ఎంత చంద్రబాబుకు అమ్ముడుపోతే మాత్రం మరీ ఇంతకు దిగజారిపోతారా రామోజీ? కేరళలాంటి రాష్ట్రాలు సైతం ఈ స్వచ్ఛంద సైన్యాన్ని చూసి తమ రాష్ట్రంలో కూడా నియమించాలని యోచిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి తరఫున అంతర్జాతీయంగా బాలల విద్య కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్ కూడా రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అద్భుతమని ప్రశంసించింది. అంతేకాక రాష్ట్రంలో తమ కార్యక్రమాలను నిరుపేదలకు చేర్చడానికి ఈ వ్యవస్థతో కలిసి పనిచేసేలా ఒప్పందం కూడా చేసుకుంది. మరి ఇంత గొప్ప వ్యవస్థలో మీకు ఒక్క మంచి లక్షణం కూడా కనిపించలేదంటే మీ దుర్మార్గపు స్థాయిని అంచనా వేయడానికి ఏ కొలమానం సరిపోతుంది రామోజీరావు గారూ? ఇక హద్దులు లేవన్న రీతిలో నానాటికీ పతనమైపోతున్న మీ పాత్రికేయం ఇంకెన్నాళ్లు? ఇంతలా చంద్రబాబు మోహంలో పడిపోతే ఎలా? అసలు వలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో ఎందరి జీవితాలను నిలబెడుతోందో తెలుసా? ఎంత అద్భుతంగా పనిచేస్తోందో తెలుసా? అర్హులెవ్వరికైనా అన్యాయం జరిగిందా? ప్రజల బతుకులు బాగు చేయటానికి... జనం జీవితాలు మెరుగుపడటానికి ప్రభుత్వం రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలన్నిటి లక్ష్యం ఒక్కటే. ప్రజల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం. ప్రతి పథకానికీ ప్రభుత్వం కొన్ని అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తే... అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా వాటిని చేరవేస్తోంది వలంటీర్ల వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తోందో తెలియటానికి రామోజీరావుకు ఒక్కటే ప్రశ్న. తెలుగుదేశం పార్టీ వారన్న కారణంతోనో, వేరే కులానికి చెందిన వారన్న కారణంతోనో అర్హులైన ఏ ఒక్కరికైనా ఒక్క పథకమైనా అందకుండా పోయిందా? అలాంటి వాళ్లను చూపించగలరా? అదే కదా వలంటీర్ల వ్యవస్థకు గీటురాయి!. అదే కదా ప్రభుత్వ పనితీరుకు కొలమానం!. మరి చంద్రబాబు పాలననే తీసుకుందాం. ప్రభుత్వ పథకాలను జనానికి చేరవేయటానికి ఆయన నియమించుకున్నది జన్మభూమి కమిటీలను. అందులో ఉన్నదంతా తెలుగుదేశం పార్టీ వారే. వాళ్లను నియమించింది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన టీడీపీ ఇన్‌ఛార్జులు. నేరుగా నామినేట్ చేసేసేవాళ్లు. ఇక ఆ కమిటీలన్నీ తెలుగుదేశం వారి కోసమే పనిచేసేవి. అర్హత ప్రమాణాలన్నీ పేరుకే. ఏ పథకానికైనా అసలైన అర్హత తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండటమే. ఆ గ్రామంలో ఉండే వ్యవస్థంతా జన్మభూమి కమిటీల సూచనల మేరకు పనిచేస్తే... జన్మభూమి కమిటీలన్నీ చంద్రబాబు సూచనల మేరకు పనిచేసేవి. మరి ఇప్పుడో..? నియామకాలు చేస్తున్నది అధికారులే కదా? అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేర్చటమే ధ్యేయంగా 2,61,413 మంది వలంటీర్లను ప్రభుత్వమే నియమించింది. గౌరవ పారితోíÙకంతో స్వచ్ఛంద సేవ అందించే ఈ వలంటీర్ల నియామకంలో... రాజకీయ జోక్యానికి తావే లేదు. పార్టీలు లేవు... కులమతాల పట్టింపు లేదు. స్త్రీ,పురుష భేదాల్లేవు. నిరీ్ణత విద్యార్హతలున్నవారిని గ్రామాల్లో అయితే ఎంపీడీఓ ఛైర్మన్‌గా, తహసీల్దారు, విస్తరణ అధికారి సభ్యులుగా ఓ కమిటీ నియమిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ చైర్‌పర్సన్‌గా తహసీల్దారు, ప్రాజెక్టు అధికారి లేదా మెప్మా టౌన్ మిషన్ కో–ఆర్డినేటర్ సభ్యులుగా ఉన్న కమిటీ నియమిస్తోంది. ఈ కమిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయమే లేదు. పైపెచ్చు ఎప్పటికప్పుడు వచ్చే ఖాళీలను భర్తీ చేయటానికి స్థానికంగా ఉండే ఎంపీడీఓ లేదా కమిషనర్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి, రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం వాలంటీర్లను ఎంపిక చేస్తున్నారు. ఏ పార్టీ వారైనా ఉండొచ్చు... ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వలంటీర్లలో తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ, జనసేన అభిమానులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే నియమించే ముందు వారి వయసు, విద్యార్హతలు, సేవాభావమే ప్రామాణికంగా తీసుకున్నారు తప్ప వారి రాజకీయ నేపథ్యాన్ని చూడలేదు. అందుకే ప్రస్తుతం పనిచేస్తున్న 2.61 లక్షల వలంటీర్లలో 74 శాతం మంది 20–30 ఏళ్ల మధ్య ఉన్నవారే. ఇంకా చెప్పాలంటే... 96 శాతం మంది 35 ఏళ్ల లోపువారే. అందుకే అత్యంత వేగంగా తమ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నారు. పైపెచ్చు ఈ వలంటీర్లలో 55.12 శాతం మంది మహిళలే. గ్రామంలో గౌరవంతో పాటు కాస్త పారితోíÙకం... ఊరికి సేవ చేశామన్న తృప్తి ఉంటాయనే వీరంతా ఈ బాధ్యతల్లోకి వస్తున్నారు. మరి ఈ మహిళలకు సైతం పార్టీలు అంటగట్టి, వీళ్లందరినీ వైసీపీ వేగులుగా ముద్రవేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న ‘ఈనాడు’ను ఏం చేయాలి? దారుణమైన రాతలతో పచ్చి విషాన్ని కక్కుతున్న రామోజీరావును ఏం చేయాలి? ఎన్నెన్ని బాధ్యతలో... ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించటంలో వలంటీర్ల వ్యవస్థ ఎండావానలను లెక్క చేయక... చలికి భయపడక అహరి్నశలూ పనిచేస్తున్నదనేది కాదనలేని వాస్తవం. 2019 జూన్ నుంచి ఈ వ్యవస్థ ప్రతినెలా దాదాపు 62.5 లక్షల మందికి... రూ.1,600 కోట్ల చొప్పున పంపిణీ చేస్తోంది. కొత్త రైస్ కార్డులు మంజూరు చేయటంతో పాటు రైస్ కార్డులున్న వారందరికీ సేవలందిస్తోందీ వ్యవస్థ. ఇంకా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద కొత్త కార్డులు మంజూరు చేయటం... ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవటంపై అవగాహన కలి్పంచటం చేస్తోంది. ఇవే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్సార్ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్సార్ బీమా, సంపూర్ణ పోషణ, ఉచిత పంటల బీమా, లా నేస్తం, రైతులకు సున్నా వడ్డీ, ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, రజకులు.. టైలర్లు... నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, జీవ క్రాంతి, అమూల్ పాలవెల్లువ, కంటి వెలుగు, అమ్మ ఒడి... అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఒకసారి అందించే ఆరి్థక సాయం, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు, ఈబీసీ నేస్తం వంటి పదుల కొద్దీ పథకాల ఫలాలను అర్హులకు చేరుస్తున్నారు. ప్రభుత్వ విభాగాలకూ సహాయంగా... ఇవికాక వివిధ ప్రభుత్వ విభాగాలు సైతం వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాయి. సొంతిళ్లున్న వారిని ఆస్తిపన్ను చెల్లించమని అభ్యర్థిస్తున్న వలంటీర్లు... స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, మనం మన పరిశుభ్రత, ఫ్రైడే–డ్రైడే, చెత్త పన్ను వసూలు... ఇలాంటి అంశాలన్నిటా వినియోగదార్లకు అవగాహన కలి్పస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి విభాగానికి, పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి విభాగానికి సహకరిస్తున్నారు. - కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను విచారించడంలో వీఆర్వోలకు సహకరిస్తున్నారు. - వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్ డ్రైవ్‌లకు, ఫీవర్ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వలంటీర్లే ఆధారం. - వలంటీర్ల సాయం లేకుంటే ఆర్బీకే సిబ్బంది ఈ–క్రాప్ బుకింగ్‌కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు. - ప్రత్యేక వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు పూర్తి సహకారం వలంటీర్లదే. - ఇక తుపానులు, భారీ ప్రమాదాలు జరిగినపుడు చాలా మంది వలంటీర్లు స్వచ్ఛందంగా కదనరంగంలోని సైనికుల్లా సేవలందిస్తున్నారు. నిన్నగాక మొన్న వచి్చన కోనసీమ వరదల్లో వలంటీర్ల సాయాన్ని అక్కడి ఏ వ్యక్తినడిగినా చెప్పకమానడు. మరి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వలంటీర్లపై రామోజీరావు వైసీపీ ముద్ర ఎందుకు వేస్తున్నారు? ఏదో ఒకరకంగా వాళ్లను తమ విధులకు దూరం చేద్దామనా? ఈ రాష్ట్రంలో అర్హులకు పథకాలు అందకుండా చేసి... ప్రభుత్వానికి ఆ మకిలిని అంటిద్దామనా? ఇంతకన్నా ఘోరమైన కుట్రేదైనా ఉంటుందా రామోజీ? కోవిడ్ సమయంలో ప్రపంచమే జేజేలు కొట్టింది... 2020 తొలినాళ్లలో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసుపత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడినపుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలకు గాలికొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే... ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే... అది ఈ ప్రభుత్వం సృష్టించిన వలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారికి భయపడి జనం ఇళ్లలోంచి బయటకు రావటానికే భయపడుతున్న సమయంలో.. బయట తిరిగితే ప్రమాదమని తెలిసి కూడా వీరే సైన్యంగా పని చేశారు. ఇళ్లకు రోజువారీ సరుకులతో పాటు మందులు అందించటంతో పాటు 16 కోట్ల మాసు్కల్ని జనానికి అందజేశారు. పేదలకు ప్రత్యేక సాయంగా రూ.వెయ్యి చొప్పున అందించటంతో పాటు వ్యాక్సిన్లు త్వరగా అందేలా చూశారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలందించటంతో పాటు రికార్డు స్థాయిలో 46 సార్లు ఫీవర్ సర్వే చేశారు. అన్నిటికన్నా ప్రధానం... కోవిడ్ మృతుల భౌతికకాయాలను దహనం చేయటంలోనూ సాయపడ్డారు. అలాంటి సేవలకు యావత్తు దేశం జైకొట్టగా... రామోజీరావు మాత్రం రాజకీయాలు అంటగడుతూ చెలరేగిపోతుండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదనే చెప్పాలి. కులమతాలకు అతీతంగా... చంద్రబాబు మదిలోంచి పుట్టిన జన్మభూమి కమిటీలన్నీ కులం కంపు కొట్టేవని వేరే చెప్పక్కర్లేదు. ఏ గ్రామాల్లోనైనా అక్కడ పెత్తనం చెలాయించే వారే కమిటీల్లో ఉండేవారు. కానీ వలంటీర్ల వ్యవస్థలో ఒక కులం, మతం వాళ్లే కొనసాగడం లేదు. వాలంటీర్లుగా ఉన్న వారిలో 14 శాతం మంది మాత్రమే ఓసీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం. మరో 18 శాతం మంది ఇతరులున్నారు. అసలు 55 శాతం మంది మహిళలున్నప్పుడు ‘ఈనాడు’ రాసేసినట్లుగా వాళ్లు వేగులుగా పనిచేయటం సాధ్యమా? 68 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండగా వాళ్లంతా ఒక పార్టీకే పనిచేస్తున్నారనడంలో అర్థం ఉందా? ఈ సవాళ్లకు సిద్ధమా రామోజీ? - చేతిలో పత్రిక ఉంది కదా అని అడ్డగోలుగా ఆరోపణలు చేసే రామోజీరావు సూటిగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది... ఈ వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఎప్పుడైనా తనవి కాని కార్యక్రమాలకు వాడిందా?. - ఎందుకంటే ప్రభుత్వ పథకాలను స్థానికులకు అందించటం... వారికి ఆయా పథకాలపై అవగాహన కల్పించటమే వీరి విధి. ఇది తప్ప ఇతర కార్యక్రమాలకు వీరిని ఎన్నడైనా వాడారా? చెప్పండి రామోజీ?. - ఓ సర్వేలో రాజకీయ ఆసక్తిని అడిగారంటూ మీరు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టిన ఏ సర్వేలోనూ ఇప్పటిదాకా పౌరుల రాజకీయ ఆసక్తిని అడిగింది లేదు. - వలంటీర్లు ఎన్నడైనా ఏ రాజకీయ కార్యకలాపాల్లోనైనా పాల్గొన్నారా? అలా పాల్గొంటే వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారా? తెలిస్తే చెప్పండి రామోజీ? నిజానికి ఏ వలంటీరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై ‘స్పందన’ కార్యక్రమంలో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. వారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. - ఇప్పటిదాకా 24,704 ఫిర్యాదులు రాగా వాటిలో 24,643 పరిష్కారమయ్యాయి. ఆరోపణలు రుజువు కావటంతో ఇప్పటికే 20 మంది వలంటీర్లను తొలగించారు కూడా. ఇలాంటి వాస్తవాలు చెప్పటం కూడా అలవాటు చేసుకోండి రామోజీరావు గారూ!!. రామోజీ దుర్మార్గపు రాతలప్రకారం చూస్తే.. వాళ్లంతా ఒకే పార్టీకి పనిచేస్తుండాలి. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లపై ప్రత్యర్థి పారీ్టల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చి ఉండాలి కదా? కానీ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైన రెండున్నర సంవత్సరాల తర్వాత 2021 జనవరిలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం ఆరుగురు వలంటీర్లపై మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. మరి ఆ జిల్లాలో వేల సంఖ్యలో వలంటీర్లున్నారు కదా? రామోజీ చేసిన మరో దుర్మార్గపు ఆరోపణ ఏంటంటే వలంటీర్ల వల్ల ప్రభుత్వానికి వందల కోట్లు ఖర్చవుతోందని!!. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం 33 సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడున్నరేళ్లలో సుమారు రూ.3.60 లక్షల కోట్లు ప్రజలకు ఆరి్థకంగా సాయం చేసింది. పైసా అవినీతికి తావు లేకుండా ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు చేర్చటంలో వలంటీర్ల పాత్ర అత్యద్భుతం. ప్రతి పథకానికీ ఎంపిక చేసే ముందు లబ్థిదారుడి వద్దకు వెళ్లి బయోమెట్రిక్ తీసుకొని, అమలు చేశాక అతనికి అందిందని ధ్రువపరచుకునేందుకు మరో సారి బయోమెట్రిక్ తీసుకుంటారు. ఇలా చేయటం వల్ల అడ్డుకట్ట పడిన అవినీతితో పోలిస్తే వీరికి చెల్లించిన మొత్తం ఎక్కువని అనుకోగలమా? ఈమాత్రం జ్ఞానం కూడా ‘ఈనాడు’కు లేకపోతే ఎలా? -
రెచ్చిపోయిన జేసీ వర్గీయులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి జేసీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. కాగా, తాడిపత్రిలోని మూడో వార్డులో జేసీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇక, గాయపడిన కార్యకర్తలను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. -
విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం జగన్ దిశా నిర్దేశం
-
మండపేట నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి న్యూస్, అమరావతి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 19 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలని నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన పనులు, సంక్షేమ పథకాల వివరాలను గణాంకాలతో సహా వివరించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే… ►నియోజకవర్గంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు వస్తుంది. డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశాం, ఈ నియోజక వర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081కోట్లు ఇచ్చాం, 93,124కుటుంబాలకు మేలు చేశాం. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి పట్టాలు ఇచ్చాం. 47,123 మందికి బియ్యంకార్డులు మంజూరు చేశాం. ►ఈ స్థాయిలో ఇంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా చేశాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీకూడా, ఏ ఒక్కరికీ మిస్‌కాకుండా ఆయా కుటుంబాలకు మంచిచేశాం, బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి జమచేశాం. చేసిన మంచి ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ వివరిస్తూ, వారికి లేఖలు ఇస్తూ గడపగడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ►మన ప్రతినిధిగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తున్నారు. ఎక్కడైనా పొరపాటున అర్హత ఉండికూడా రాని పరిస్థితి ఉంటే… అటువంటి వాళ్లకీ మళ్లీ మంచిచేయాలన్నదే ఈ గడపగడపకూ కార్యక్రమం ఉద్దేశం.అందరికీ మంచి చేయాలన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ఇచ్చాం. ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు ఈ నిధులు కేటాయిస్తాం. ►ప్రతి సచివాలయంలో కనీసం రెండు రోజులు గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటల పాటు ఆ సచివాలయంలో తిరగాలని చెప్పాం. దీనివల్ల ప్రాధాన్యతగా చేపట్టాల్సిన పనులను గుర్తించగలుగుతాం. ►అన్నిరకాలుగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే, ఎన్నికలకు దాదాపుగా రెండేళ్లకు ముందే నాయకులను ఈ విధంగా తిప్పిన కార్యక్రమం గతంలో ఎన్నడూ లేదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి సాధకబాధకాలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. ►ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే, అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం మంచి విజయాలు సాధిస్తాం. ముఖ్యమంత్రిగా నేను డీబీటీ ఇవ్వడం అయితేనేమి, స్కూళ్లు బాగుచేయడం అయితేనేం, ఆస్పత్రులు బాగుచేయడం అయితేనేం, వ్యవసాయం బాగుండేలా చూడ్డం అయితేనేం.. ఇలా నేను చేయాల్సింది నేను చేయాలి. అదే సమయంలో మీరు చేయాల్సింది మీరు చేయాలి: ►నేను, మీరు కలిస్తేనే.. 175కి 175 సీట్లు సాధించగలుగుతాం, ఇదేమీ కష్టం కాదు, అసాధ్యం కానేకాదు. ప్రతినియోజకవర్గంలో గ్రామం ఒక యూనిట్, ఆ గ్రామంలో 87శాతం కుటుంబాలకు మేలు జరిగినప్పుడు, అందరి కంటికి కనిపించినట్టుగా గ్రామ, వార్డు సచివాలయాలు, ఇంగ్లిషు మీడియం, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు, వ్యవసాయం చేసే తీరు మారుతున్నప్పుడు.. ఆ గ్రామంలో మెజార్టీ రావడం ఎందుకు సాధ్యంకాదు. ►గ్రామంలో వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఎందుకు రాదు? నియోజకవర్గాల్లో వచ్చినప్పుడు 175కి 175 ఎందుకు రావు. కుప్పంలోనే కాదు అద్దంకిలో కూడా మొత్తం 5కి 5జడ్పీటీసీలు, ఎంపీపీలు ఐదింటికి ఐదు, ఇక మున్సిపాలిటీ, 103 గ్రామ పంచాయతీల్లో 87 సర్పంచి స్థానాలు గెలిచాం. ►దేవుడి దయతో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. 151 సీట్లు గతంలో వస్తే..ఇలాంటి మంచి పనులు జరిగినప్పుడు, ఇప్పుడు 175కి 175 సీట్ల సాధించగలుగుతాం. ఏమైనా సమస్యలు ఉంటే.. కుటుంబంగా వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు నడవాలి, అందరం ఒక్కటై కష్టపడదాం, 175కి 175 సీట్లు సాధిద్దాం. అద్దంకిలో మునుపెన్నడూలేని విజయాన్ని నమోదు చేద్దాం. ఇదీ చదవండి: CM YS Jagan: అంగన్వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు