సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని(పాలన)గా విశాఖపట్నం పేరు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను వైఎస్సార్సీపీ శ్రేణులు స్వాగతించాయి. అందుకు కృతజ్ఞతగా.. సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం హాజరయ్యారు.
ఇచ్చిన మాట ప్రకారం విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందలనేది సీఎం జగన్ ఆలోచన. మరో రెండు నెలల్లో విశాఖ రాజధాని కాబోతోంది. సీఎం జగన్ కూడా వైజాగ్ వచ్చి నివాసం ఉంటారు అని మంత్రి పేర్కొన్నారు.
త్వరలో విశాఖలో జరిగే సదస్సులు ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చబోతున్నాయన్న మంత్రి అమర్నాథ్.. మహిళ భద్రతలో విశాఖ టాప్ 10 నగరంలో ఉందంటే దానికి సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అక్రమాని విజయనిర్మల, కోలా గురువులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment