palabhishekam
-
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫొటోకు పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్: బడంగ్పేట్, అల్మాస్ గూడలో హైడ్రా చర్యలు చేపట్టింది. వెంకటేశ్వర కాలనీలో కబ్జాదారులకు హైడ్రా చెక్ పెట్టింది. పిల్లల ఆట పరికరాలు తొలగించి పార్కు స్థలం కబ్జా చేసిన కొందరు వ్యక్తులు.. కంటెనర్ల కోసం షెడ్లు వేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు పరిశీలించారు. జేసీబీలతో కంటైనర్ల షెడ్లను హైడ్రా తొలగించి.. పార్కు స్థలాన్ని కాలనీ వాసులకు హైడ్రా అధికారులు అప్పగించారు.పార్కు ఆక్రమణ కాకుండా కాపాడారంటూ స్థానికులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. బాలాపూర్ పరిధిలోని అల్మాస్ గూడ వెంకటేశ్వరకాలనీ వాసులు..ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేశారు."బడంగ్ పెట్ మునిసిపాలిటీలో కబ్జాకు గురైన పార్కును కాపాడినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వెంకటేశ్వర కాలనీలో పాలాభిషేకం చేసిన స్థానికులు" #HYDRAA pic.twitter.com/zFtiLa14IK— The Politician (@ThePolitician__) December 3, 2024VIDEO CREDITS: THE POLITICIANకాగా, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై దృష్టి పెట్టామన్న రంగనాథ్.. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం.. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం’’ అని రంగనాథ్ హెచ్చరించారు. -
సీఎం జగన్ చిత్రపటానికి ముస్లింలు పాలాభిషేకం
-
మాకు కష్టం వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆదుకున్నారు
మహారాణిపేట: మత్స్యకారులకు కష్టం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆదుకున్నారని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డెడ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ చెప్పారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జానకీరామ్ ఆధ్వర్యాన శనివారం విశాఖలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి మత్స్యకారులు, బోటు యజమానులు క్షీరాభిషేకం చేశారు. జానకీరామ్ మాట్లాడుతూ మత్స్యకారులంటే సీఎం జగన్‌కు ఎనలేని అభిమానమని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అతి తక్కువ సమయంలోనే బాధిత మత్స్యకారులకు రూ.7.11 కోట్లు పరిహారం చెల్లించి సీఎం తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అసోసియేషన్ నాయకులు మైలపల్లి లక్ష్మణరావు, మైలపల్లి నరసింహులు, జి.దానయ్య, దూడ పోలయ్య, గనగళ్ల పోతయ్య, మున్నం బాలాజీ, యాగ శ్రీనివాసరావు, ఎస్.రాము, బోటు యాజమానులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదవండి: పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం! -
అంతులేని అభిమానం..సీఎం జగన్ కి పాలాభిషేకం
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఇన్ని లీటర్ల పాలా!
-
సీఎం జగన్‌కు ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు
NRI News: యూఏఈలోని ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్లు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే విధంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకుగానూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్లు. శనివారం సాయంత్రం బుర్ దుబాయ్‌లోని వెస్ట్ జోన్ సూపర్ మార్కెట్ దగ్గర పార్క్‌లో ఈ కృతజ్ఞతా సభ జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఫొటోకు పాలాభిషేకం చేసి.. అనంతరం వాళ్లు ప్రసంగించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు వాళ్లు. ఈ కృతజ్ఞత సభకు యూఏఈ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సీఎం జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం, అన్ని వర్గాలకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు, సమ న్యాయము చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఏఈ ప్రవాసాంధ్ర దళిత సంఘాల నాయకులు తరపట్ల మోహన్, పాలపర్తి నీలిమ, కాగిత కుమార్, గోసంగి లక్ష్మి, కొల్లే రవి కుమార్, నక్క ఎలిజిబెత్, ఓగురి శ్రీనివాస్,ఈద శరత్ బాబు,మారుమూడి సుధ, నాగమణి, సాగర్,అనిల్ మోక, మురళి నల్లి,రామరాజు గొడి,తాడి రమేష్, సునీల్ ఖన్నా,నక్క శ్రీనుకుమార్, పండు, తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ రాజధాని ప్రకటన.. సీఎం జగన్ ఫొటోకి పాలాభిషేకం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని(పాలన)గా విశాఖపట్నం పేరు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనను వైఎస్సార్సీపీ శ్రేణులు స్వాగతించాయి. అందుకు కృతజ్ఞతగా.. సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం హాజరయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందలనేది సీఎం జగన్ ఆలోచన. మరో రెండు నెలల్లో విశాఖ రాజధాని కాబోతోంది. సీఎం జగన్ కూడా వైజాగ్ వచ్చి నివాసం ఉంటారు అని మంత్రి పేర్కొన్నారు. త్వరలో విశాఖలో జరిగే సదస్సులు ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చబోతున్నాయన్న మంత్రి అమర్నాథ్.. మహిళ భద్రతలో విశాఖ టాప్ 10 నగరంలో ఉందంటే దానికి సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అక్రమాని విజయనిర్మల, కోలా గురువులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. -
నాలుగు దశాబ్దాల కల సాకారం.. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివసించే వేలాది కుటుంబాల ముంపు కష్టాలు తొలగిపోయాయి. నాలుగు దశాబ్దాల చిరకాల కల సాకారమైది. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్ల వ్యయ అంచనాతో చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఆ ప్రాంత వాసులు వేలాది మంది శనివారం సంబరాలు జరుపుకున్నారు. కనకదుర్గ వారధి దిగువ శంకుస్థాపన ఫలకం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆకాశంలోకి బెలూన్లు ఎగురవేసి, కేక్ కోశారు. ముఖ్యఅతిథి వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి అవినాష్ మాట్లాడుతూ వరద ముంపు వాసుల కష్టాలు స్వయంగా చూసిన సీఎం వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి గొప్ప మనస్సు చాటుకున్నారన్నారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలా హామీలిచ్చి గాలికొదిలేయకుండా ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసి, పనులను గడువు కంటే ఆరు నెలల ముందే పూర్తి చేశారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో రామలింగేశ్వరనగర్, భూపేష్గుప్తానగర్ ప్రజల కష్టాలు తొలగిపోయాయన్నారు. (చదవండి: ఏం తమాషాగా ఉందా.. పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్ బాబు..) నాడు టీడీపీ.. నిధుల స్వాహా! నాటి టీడీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిటైనింగ్ వాల్ పేరుతో నిధులు స్వాహా చేసి, బినామీలతో నాసిరకం రిటైనింగ్ వాల్ నిర్మించారని ఆరోపించారు. దీంతో వరద ముంపు ఎక్కువైందన్నారు. వందలాది ఇళ్లను తొలగించేలా వారు ప్రణాళికలు సిద్ధం చేశారని అవినాష్ ఆరోపించారు. కానీ సీఎం జగన్ కేవలం నిర్మాణ ప్రాంతంలోని ఇళ్లను మాత్రమే తొలగించి, వారికి అన్ని సౌకర్యాలతో మరోచోట ఉచితంగా ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. రిటైనింగ్ వాల్ పనులు పూర్తికావడంతో సందడి చేస్తున్న స్థానికులు కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్లు తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వీఎంసీలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి , టి. కొండారెడ్డి, మెరకనపల్లి మాధురి, రెహానా నాహీద్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం, పార్టీ నాయకుడు దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు’.. అనురాగ్ ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి) -
సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్ అధ్యాపకులు
కడప(వైఎస్సార్ జిల్లా): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే బోధన సిబ్బందికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి పేస్కేల్–2016 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వటంపై పాలిటెక్నిక్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప పాలిటెక్నిక్ కళాశాలలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. పాలిటెక్నిక్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఈ పేస్కేల్ ద్వారా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్, 2 ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన సుమారు 2,500 మంది లెక్చరర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి యడవల్లి దళిత రైతుల క్షీరాభిషేకం
సాక్షి, చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ రైతులు 120 మంది సాగుచేసుకుంటున్న 223 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు అప్పగించాలని గురువారం మంత్రిమండలి నిర్ణయించింది. దీంతో రైతులు ఎమ్మెల్యే విడదల రజనిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చిత్రపటానికి అభిషేకం చేశారు. ఒక్కో రైతుకు రూ.25 లక్షల వంతున మొత్తం రూ.30 కోట్లు పరిహారంగా అందుతుందని ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వం భూములను ఉచితంగా లాక్కోవాలని చూసిందని, ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని రైతులు పేర్కొన్నారు. -
సీఎం జగన్ చేసిన మేలు ఎప్పటికీ మరువలేం: అగ్రిగోల్డ్ బాధితులు
-
గుంటూరులో సీఎం జగన్‌కు పాలభిషేకం
సాక్షి, గుంటూరు: 56 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం పాలకమండలి సభ్యులను నియమించినందకు ఆ కుల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు గుంటూరు నగరం పాలెంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్చార్జి మంత్రి రంగనాథ రాజు పాలాభిషేకం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, విడుదల రజిని ,ఉండవల్లి శ్రీదేవి, అన్నాబత్తుని శివ కుమార్, మద్దాల గిరిధర్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ‘బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలకమండలి నియమించడం గొప్ప శుభపరిణామం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీలు రాజకీయంగా ,ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ ఎన్నికల ముందే ప్రణాళికను సిద్ధం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి బీసీ వర్గాలకు మేలు చేశారు కాబట్టే సీఎం జగన్ గెలుపులో బీసీలు భాగస్వాములయ్యారు. సీఎం జగన్ క్యాబినెట్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 60 శాతం పైగానే ఉన్నారు’ అని అన్నారు. అదేవిధంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లా కాకుండా బ్యాక్ బోన్ కాస్ట్‌గా నిలబెట్టారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేశారు. సీఎం జగన్ దేశానికే ఆదర్శం. గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడికుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరుకు 4 కార్పొరేషన్ చైర్మన్లు రావడం ఆనందకరం. కార్పొరేషన్ ఏర్పాటుతో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవచ్చు’ అని అన్నారు. ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ, ‘ సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో జ్యోతిరావు పూలే కనిపించారు. దేశ రాజకీయాల్లో సీఎం జగన్‌కు ముందు ఆ తరువాత అన్న కోణంలో రాజకీయాలు నడుస్తున్నాయి. బీసీ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధ రాజు మాట్లాడుతూ, ‘ దేశంలో ఎక్కడా లేని లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఎవరికి తెలియని కులాలను కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం ఆనందంగా ఉంది. కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ కులాల్లోని సమస్యను పరిష్కరించవచ్చు’ అని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో బీసీలు.. బ్యాక్ బోన్ క్లాస్ -
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై దళిత నేతల హర్షం
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి వైఎస్సార్సీపీ దళిత నేతలు పాలాభిషేకం చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘చంద్రబాబు ఊరు చివర అంబేద్కర్ విగ్రహం పెడతానని మోసం చేశారు. సీఎం జగన్ నగర నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ మాట ఇచ్చారంటే అంబేద్కర్ విగ్రహం కట్టించి తీరుతారు. కోర్టుల్లో కేసులు వేయించి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును అడ్డుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారని’’ వైఎస్సార్సీపీ దళిత నేతలు కనకరావు మాదిగ, మధుసూదన్‌రావు, అమ్మాజీ, పద్మజ మండిపడ్డారు. (వైఎస్సార్‌కు ఘన నివాళి) -
‘సీఎం జగన్‌కి రుణపడి ఉంటాం’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏపీఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసింది. నూతన సంవత్సరం మొదటి రోజు (జనవరి 1) నుంచి ఇది అమల్లోకి వచ్చేలా మంగళవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బుధవారం విజయవాడలో ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. కార్మికులంగా హర్షం వ్యక్తం చేశారు. కేట్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం జగన్‌కి కార్మికులు జేజేలు పలికారు. దశాబ్దాల కల సాకారం చేసి కార్మికుల బతుకులకు భరోసా కల్పించిన సీఎం జగన్ కలకాలం వర్ధిల్లాలని కార్మికులు నినాదాలు చేశారు. వేలాది కుటుంబాల్లో వెలగులు నింపిన సీఎం జగన్‌కి ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. జనవరి ఒకటో తేదీని కార్మికులు ‘ఆర్టీసీ పండుగ’గా అభివర్ణించించారు. ఈ సంబరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, బొప్పనభవకుమార్ పాల్గొని.. ఆర్టీసీ కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన మాటమీద నిలబడ్డ మడమతిప్పని నేత సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నుంచే ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణయగం మొదలైందని అవినాష్ తెలిపారు. బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. ఏడాది గడవక ముందే ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ సొంతమని కొనియాడారు. -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ.. దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ..మహిళలను తోబుట్టువులుగా భావించి సీఎం జగన్ ‘దిశ’ చట్టం తెచ్చారని పేర్కొన్నారు. ఈ చట్టం మహిళలకు రక్షణ కవచంలా ఉంటుందన్నారు. దిశ చట్ట దేశానికే ఆదర్శమని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినశిక్షలు పడేలా ఈ చట్టం రూపొందించారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలను వేధించారన్నారు. మహిళల భదత్ర కోసం చట్టం తెచ్చిన సీఎం జగన్‌కు మహిళలు రుణపడి ఉంటారని దేవినేని ఆవినాష్ పేర్కొన్నారు. మహిళల సంబరాలు.. ‘దిశ’ చట్టంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆదివారం మహిళలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తమ బతుకులకు భరోసా కల్పించిన సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..మహిళల భద్రత,రక్షణకు సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. నేరానికి పాల్పడితే 21 రోజుల్లోనే శిక్ష అమలు చేస్తారని తెలిపారు. -
రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటనపై హర్షం
సాక్షి, గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): సెలూన్ షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సహాయం ప్రకటించడంపై నాయీ బ్రాహ్మణ నంద యువసేన హర్షం ప్రకటించింది. ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ ఆధ్వర్యంలో మంగళవారం నాయీబ్రాహ్మణ యువకులు కంట్రోల్‌రూం వద్ద వైఎస్సార్ పార్క్‌కు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పాలాభిషేకం కార్యక్రమానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు నిర్వాహకులను అడ్డుకున్నారు. దీంతో నాయీ బ్రాహ్మణ యువసేన కార్యకర్తలు గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ ఆవరణలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటం పెట్టుకుని ఆర్థిక సహాయం ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఇంచార్జీ సీఐ సూర్యనారాయణ పోలీసు స్టేషన్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఏ కార్యక్రమానికైనా మందస్తు అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు. అనంతరం గుణదల గంగిరెద్దులదిబ్బలోని నాయిబ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో కృష్ణా జిల్లా నందయువసేన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయిబ్రాహ్మణ సెలూన్ షాపులకు సంవత్సరానికి రూ.10,000 ఫిబ్రవరి లోపు అందించాలని నిర్ణయించినందుకు, 100 రోజుల పాలన జనరంజకంగా పూర్తి చేసినందుకు పాలాభిషేకం నిర్వహించారు. యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాగరాజు నంద, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ నంద, దేవాలయాల కల్యాణకట్టల జేఎసీ అధ్యక్షుడు రామదాసు, వాయిద్యకళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష్యులు యలమందరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు పవన్ నంద, జిల్లా కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
క్షీరాభిషేకానికి సిద్ధమైన సుబ్రహ్మణ్యేశ్వరుడు
విజయనగరం టౌన్ : విజయనగరం పూల్‌బాగ్‌లోని వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శుక్రవారానికి మూడేళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామివారికి శుక్రవారం వేకువ జామునుంచే పాలాభిషేకం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అరవై అడుగుల ఎత్తుగల స్వామివారి విగ్రహానికి మోటార్ల ద్వారా స్వామివారి శిరస్సు పైకి పాలు, అభిషేక జలం వెళ్లేలా విగ్రహం నిర్మాణ సమయంలోనే పూర్తి ఏర్పాట్లు చేశారు. దేశంలోనే ఈ విగ్రహం అత్యంత ఎత్తయింది కావడం విశేషం. మలేషియాలోని కౌలాలంపూర్‌లో 140 అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది. దర్శించి తరించండి సర్వరోగాలను పటాపంచలు చేసే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించి తరించండి. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. –కర్రి వెంకటరమణ సిద్దాంతి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త -
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
శామీర్‌పేట్: కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు మహారాష్ర్టతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందంతో పాటు జిల్లాల పునర్విభజనకు కృషి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మండలంలోని టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం శామీర్‌పేట్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి శామీర్‌పేట్ సర్పంచి బత్తుల కిశోర్‌యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మహారాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చరిత్రలో ఓ మైలు రాయి అన్నారు. ప్రాజెక్టుల ఒప్పందం ద్వారా మల్లన్నసాగర్ ద్వారా మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేట్ పెద్ద చెరువుకు నీళ్లు వస్తాయన్నారు. దీంతో రైతుల పంట పొలాలకు నీరు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ ఉప సర్పంచ్ కంటం క్రిష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు డి.బి. వెంకటేశ్, ఆనంద్‌గౌడ్, నాయకులు విష్ణు, గన్నారెడ్డి, మైసయ్య, నారాయణ, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, వెంకటేశ్, రాములు, రమేశ్, అంజనేయులు సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిరసనలు
విజయవాడ: దళితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంలో 13 జిల్లాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, పోరుమామిళ్లలో ఎమ్మెల్యే జైరాములు, కడపలో ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలముడుగులో వైఎస్సార్ సీపీ నేత సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఆముదాలవలసలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విజయనగరం: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర నేతృత్వంలో సాలూరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. విశాఖపట్టణం: నక్కపల్లి, ఎల్ఐసీ సర్కిల్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు రామకృష్ణ, గురువులు, జాన్‌వెస్లీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద వైఎస్సార్ సీపీ నేత మళ్లా విజయ్ ప్రసాద్ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టారు. తూర్పుగోదావరి: ఏలేశ్వరంలో ఎమ్మెల్యే సుబ్బారాయుడు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజమండ్రిలో ఆకుల వీర్రాజు నేతృత్వంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమగోదావరి: మార్టేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. కృష్ణాజిల్లా: కైకలూరులో వైఎస్సార్ సీపీ నేత డీఎన్ఆర్ నేతృత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ సీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం: వైఎస్సార్ సీపీ నేత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరు: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కర్నూలు: కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు.