సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ.. దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ..మహిళలను తోబుట్టువులుగా భావించి సీఎం జగన్ ‘దిశ’ చట్టం తెచ్చారని పేర్కొన్నారు. ఈ చట్టం మహిళలకు రక్షణ కవచంలా ఉంటుందన్నారు. దిశ చట్ట దేశానికే ఆదర్శమని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినశిక్షలు పడేలా ఈ చట్టం రూపొందించారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలను వేధించారన్నారు. మహిళల భదత్ర కోసం చట్టం తెచ్చిన సీఎం జగన్‌కు మహిళలు రుణపడి ఉంటారని దేవినేని ఆవినాష్ పేర్కొన్నారు.
మహిళల సంబరాలు..
‘దిశ’ చట్టంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆదివారం మహిళలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తమ బతుకులకు భరోసా కల్పించిన సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..మహిళల భద్రత,రక్షణకు సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. నేరానికి పాల్పడితే 21 రోజుల్లోనే శిక్ష అమలు చేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment