maladi vishnu
-
కౌంటింగ్ రోజున అల్లర్లకు టీడీపీ కుట్రలు: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, నవరత్నాల కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి కోరారు. అనంతరం మీడియాతో మల్లాది విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.కౌంటింగ్ రోజున అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజాతీర్పును మార్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని మల్లాది విష్ణు హెచ్చరించారు. సజ్జలపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్‌డ్రా చేసుకోవాలన్నారు. -
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. నాలుగు అంశాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో.. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం అభ్యర్థులే రోడ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతూ.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశం ఉంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాము. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించవలసిన రూల్స్‌ను 175 నియోజకవర్గాలలోనూ తూచా తప్పకుంగా పాటించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరాం’’ మల్లాది విష్ణు అన్నారు.‘‘టీడీపీ అధికారంలో ఉండగా చింతమనేని ప్రభాకర్ చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావు. చింతమనేని ప్రభుత్వ అధికారులపైనే దాడులకు తెగబడిన సందర్భాలు చూశాం. తాజాగా పోలింగ్ రోజు దెందులూరులో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతమనేని ప్రభాకర్ స్టేషన్ పైనే దాడి చేసి పోలీసులపైన దౌర్జన్యం చేశారు. తక్షణమే చింతమనేనిని అరెస్ట్ చేసి.. ఆయనపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి’’ మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.‘‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఆపార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైంది. నిమ్మాడ గ్రామంలో టీడీపీ అరాచకాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ బూత్ ఏజంట్ తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారు. ఘటనకు సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాం. గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ పార్టీనే. కానీ సిట్‌ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులపై ఫిర్యాదులు చేస్తూ గందరగోళపరుస్తున్నారు’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కోడ్ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు... సీఎస్, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నారాయణమూర్తి అన్నారు. అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదన్నారు. చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్: మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాను ప్యాకేజ్‌గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులేనని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. ‘‘అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం. చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్. డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం. పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి. చంద్రబాబు రాహుల్‌ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు. ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి. మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ‘‘వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు. మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా?. రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా?. రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు, టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు. కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది’’ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. -
కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల మతాలకతీతంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. సీఎం ఏ పథకం ప్రవేశపెట్టిన.. ఇలాంటి కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘సీఎం జగన్ పాలన దేవుడిచ్చిన వరం. అందుకే తొలిరోజు నుండి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న చంద్రబాబుకి దేవుడు తగిన బుద్ధి చెప్తారని’’ మంత్రి గుమ్మనూరు జయరామ్’’ అన్నారు.(చదవండి: విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే) ఆ చావులకు కారణం చంద్రబాబే: మోపిదేవి గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గడచిన 18 నెలల్లో ఎక్కడ కూడా ఒక ఆలయాన్ని కూల్చిన ఘటన లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ‘‘కూల్చే సంస్కృతి టీడీపీది. నిలబెట్టే సంస్కృతి వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. పుష్కరాలు లాంటి పవిత్రమైన కార్యక్రమాలను కూడా స్వార్థానికి వాడుకుని 29 మందికి చావుకు చంద్రబాబు కారణమయ్యారు. పుష్కరాల పేరుతో 43 పురాతన దేవాలయాలు కూల్చిన సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వానిదని’’ దుయ్యబట్టారు. (చదవండి: వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్) ఎంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టడం మానుకోవాలని మోపిదేవి హితవు పలికారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రామతీర్థం ఘటనకు కారణం ఎవరో త్వరలోనే తెలుస్తోందని, తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. టిడ్కో పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ: టీడీపీ నేతలు టిడ్కో పేరుతో 12,000 మంది దగ్గర డబ్బులు దోచుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సోమవారం ఆయన సత్యనారాయణ పురం 47వ డివిజన్లలో 50 మందికి టిడ్కో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందన్నారు. గత టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల పేరుతో ఫొటో స్టాట్ వేల రూపాయలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులకు డబ్బులు ఇచ్చామని, వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని మల్లాది విష్ణు వివరించారు. -
‘తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు.. కానీ’
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్రం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ల వయస్సున్న బాలుడు లాంటింది. తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు కానీ.. బాలుడ్ని చూసి ఇవ్వరు. ఆర్థికంగా చిన్న రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తే ఆశించిన ప్రయోజనాలు చేకూరవు. జీఎస్టీ, పోలవరం నిధులను కేంద్రం ఎగనామ పెట్టడం ఏపీ ప్రజలకు బాధాకరం. కరోనా కారణంగా మీ పాట్లు మీరు పడండి అని కేంద్రం ఉచిత సలహ ఇస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. ఏ ప్రయోజనాలను ఆశించి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారో.. ఆ ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని’’ సుభాస్ చంద్రబోస్ పేర్కొన్నారు. (చదవండి: గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల) ఆయన స్వార్థం కోసమే పనిచేశారు.. విజయవాడ: నవ నిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు స్వార్థం కోసం పనిచేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతుందన్నారు. ‘‘ఇతర రాష్ట్రాలు ఏపీలో అమలు చేస్తున్న పథకాలపై దృష్టి పెట్టాయి. పొట్టి శ్రీరాములు వంటి మహనీయుని త్యాగాలను నేటి తరాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందో, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమి చేస్తుందో రైతులకు బాగా తెలుసు. టీడీపీకి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. రైతులకు ఇవ్వాల్సిన నిధులు చంద్రబాబు ఎగ్గొట్టితే ఆ బాకీలు వైఎస్ జగన్ చెల్లించారు. ఐదేళ్లలో టీడీపీ రైతుల కోసం కేటాయించిన నిధులు 13000 కోట్లు.. ఏడాదికి రైతు భరోసా కింద సీఎం జగన్ కేటాయించిన నిధులు 13000 కోట్లు. పరిపాలనలో టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అమరావతి, పోలవరంలలో కూడా చంద్రబాబు అవినీతి వల్ల అభివృద్ధి ఆగిపోయింది. చంద్రబాబు, లోకేష్ లకు వైఎస్సార్సీపీ పాలన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని’’ సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. (చదవండి: ఏపీకి పూర్వ వైభవం: ఆళ్ల నాని) -
‘ఆయన పాపంతోనే రాష్ట్రం అప్పుల ఊబిలోకి’
సాక్షి, విజయవాడ: ఉగాది నాటికి పేదలకు 25 లక్షలు ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విజయవాడలో ‘ప్రధాన మంత్రి అవాస్ యోజన - వైఎస్సార్ అర్బన్ హౌసింగ్ పథకం’ క్రింద లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ధనుంజయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. 137 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు కావడం శుభపరిణామం అని పేర్కొన్నారు. చంద్రబాబు పాపంతో రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ఆయన పాలనలో 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీని నీరుగార్చరని మండిపడ్డారు. గ్రామ సచివాలయాల ద్వారా సీఎం వైఎస్ జగన్ పేదలకు పాలనను చేరువ చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేరాలన్న చిత్తశుద్ధితో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు అందేలా చూస్తామని వెల్లడించారు. అమరావతి అంటూ కలల రాజధానిని చంద్రబాబు చూపారన్నారు. రాష్ట్రంలో ఉన్న13 జిల్లాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. గతంలో దళారుల పాలన సాగింది.. ఉగాది నాటికి ఇల్లు లేని పేదలను ఇంటివారిని చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం లో ఇప్పటికే 27 వేల మంది ఇళ్లకు అర్హుల జాబితాలో వున్నారని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 3 వేల మందిని ఎంపిక చేసి అవకతవకలకు పాల్పడ్డారన్నారు. టీడీపీ నేతలు పేదల దగ్గర హడావుడి చేసి ఇళ్ల మంజూరు కోసం డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. గత పాలనంతా దళారుల పాలనలా సాగిందన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే విష్ణు అధికారులను కోరారు. -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ.. దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ..మహిళలను తోబుట్టువులుగా భావించి సీఎం జగన్ ‘దిశ’ చట్టం తెచ్చారని పేర్కొన్నారు. ఈ చట్టం మహిళలకు రక్షణ కవచంలా ఉంటుందన్నారు. దిశ చట్ట దేశానికే ఆదర్శమని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినశిక్షలు పడేలా ఈ చట్టం రూపొందించారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలను వేధించారన్నారు. మహిళల భదత్ర కోసం చట్టం తెచ్చిన సీఎం జగన్‌కు మహిళలు రుణపడి ఉంటారని దేవినేని ఆవినాష్ పేర్కొన్నారు. మహిళల సంబరాలు.. ‘దిశ’ చట్టంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆదివారం మహిళలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తమ బతుకులకు భరోసా కల్పించిన సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..మహిళల భద్రత,రక్షణకు సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. నేరానికి పాల్పడితే 21 రోజుల్లోనే శిక్ష అమలు చేస్తారని తెలిపారు. -
‘టీడీపీ పాలనలో ఆయన ఆచూకీ లేకుండా చేశారు’
సాక్షి, విజయవాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఊసే ఎత్త లేదని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సౌమరంగ చౌక్ లో శ్రీవాసవీ ఫౌండేషన్, వాసవీసేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన రోజున సైతం చంద్రబాబు దిక్కుమాలిన నవ నిర్మాణ దీక్షలు చేశారని మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు త్యాగం ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారని తెలిపారు. టీడీపీ పాలనలో పొట్టి శ్రీరాములు ఆచూకీ లేకుండా చేశారన్నారు. అవతరణ దినోత్సవం రోజున శ్రీరాములు మనవరాలును సీఎం జగన్ ఘనంగా సత్కరించారన్నారు. వైశ్య కార్పొరేషన్ అంశంపై నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాలవారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన పోరాటం అజరామరం.. సత్యనారాయణపురంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడని ప్రస్తుతించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం అజరామరం అని పేర్కొన్నారు. -
పతనావస్థలో టీడీపీ : మల్లాది విష్ణు
సాక్షి, విశాఖపట్నం: హైందవ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆదివారం చోడవరం మండలం వెంకన్న పాలెంలో జరిగిన బ్రాహ్మణ కార్తీక వన సమారాధనలో ఆయనతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని వర్గాలకు మేలు జరిగేవిధంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన మాట వినడం లేదు.. టీడీపీ నేతలు, కొన్ని పత్రికలు దిగజారి వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుల,మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తికాక ముందే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కొలేక చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మత పరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీలో సంక్షోభం ఏర్పడిందని.. చంద్రబాబుపై సొంత పార్టీ నాయకులే తిరగబడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరుకుందన్నారు. చంద్రబాబు దీక్ష చేస్తే 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాట వినడం లేదని ఎద్దేవా చేశారు. -
‘కృష్ణా, గోదావరి వద్ద లాంగ్ మార్చ్ చేయండి’
సాక్షి, విజయవాడ: వరదల కారణంగానే ఇసుక కొరత తలెత్తిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం ఈ ఇద్దరూ వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 70 రోజుల నుంచి వరదలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరిందన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి చూస్తే పవన్ కల్యాణ్‌కు పరిస్థితి తెలుస్తుందన్నారు. లాంగ్‌మార్చ్‌లు, యాత్రలు సముద్రం ఒడ్డున కాకుండా కృష్ణా, గోదావరి నదుల వద్ద చేయాలని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో కొల్లగొట్టిన ఇసుకంతా వరదల ద్వారా మళ్లీ నదుల్లోకి చేరిందన్నారు. ఐదేళ్లకు సరిపడా ఇసుక ఇప్పుడు నదుల్లో ఉందని మంత్రి తెలిపారు. వరద తగ్గగానే ఇసుక వారోత్సవాలు నిర్వహించి కొరతను తీరుస్తామన్నారు. చంద్రబాబు చేసిన ఇసుక దోపిడీని అరికట్టడానికే ఇసుక పాలసీ తీసుకువచ్చామని పేర్కొన్నారు. రెండు స్థానాల్లో ఓడినా బుద్ధి రాలేదు.. చంద్రబాబు సొంత కొడుకు గుంటూరులో నిరసన దీక్ష చేస్తే.. వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్ లాంగ్‌మార్చ్ చేస్తున్నారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. రాజకీయం చేయడానికే లాంగ్‌మార్చ్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ప్రజలు ఓడించారని.. అయినా ఆయనకు బుద్ధి రాలేదని అన్నారు. ఆయనను ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లంపల్లి పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే.. చంద్రబాబుకు అమ్ముడుపోయి.. పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్‌లు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇసుకదోపిడీకి పాల్పడితే ఏ రోజైనా లాంగ్‌మార్చ్‌లు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ లాంగ్ మార్చ్ చేపట్టారని విమర్శించారు. ఇసుక కొరత మానవ తప్పిదం అంటూ అవాస్తవాలు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోచుకున్న టీడీపీ నేతలతో కలిసి పవన్ లాంగ్ మార్చ్ చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రకృతి వనరుల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని రాజకీయ అవకాశంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విష్ణు తప్పుబట్టారు. -
త్యాగ ధనులను స్మరించుకుందాం
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో విజయవాడ బాపు మ్యూజియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెలలో ప్రారంభిస్తారని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మ్యూజియం ప్రజలకు అందుబాటులో రానుందని చెప్పారు. ఈ వేడుకల్లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేసి జాతికి ఇక్కడ నుంచే అందించారని పేర్కొన్నారు. దేశం గర్వించేలా తెలుగు జాతి కీర్తిని పింగళి వెంకయ్య దశదిశలా వ్యాపింప చేశారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన విక్టోరియా మ్యూజియం అభివృద్ధికి అన్ని విధాల సహకరించి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన త్యాగ ధనుల ప్రాణ త్యాగాలను అందరూ స్మరించుకునేలా ఈ వేడుకలు జరగాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని మంత్రి కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదు.. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నవంబర్ 1 అనగానే రాష్ట్ర ప్రజలకు పొట్టి శ్రీరాములు గుర్తుకు వస్తారని చెప్పారు. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. సమావేశాల పేరుతో విద్యార్థులను ఎండల్లో కూర్చోపెట్టారని.. నవ నిర్మాణ దీక్షల పేరుతో వేల కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. 1921 ఏప్రిల్ 1న విక్టోరియా మ్యూజియంలో జాతీయ జెండా రూపకల్పనకు చర్చలు జరిగాయని గుర్తు చేశారు. పింగళి వెంకయ్య ఈ మ్యూజియంలో తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీకి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మ్యూజియంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తామని మల్లాది విష్ణు వెల్లడించారు. -
చంద్రబాబు టీం గోబెల్స్ వారసులు
-
హోదాపై పోరు అంటూ బాబు నాటకాలాడుతున్నారు
-
బాబు ప్రభుత్వం విఫలమైంది
-
మిగిలింది ఇద్దరే...
కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల్లో ఇద్దరే మిగిలారు. కేంద్రమంత్రులు జైరామ్ రమేష్, జెడీ శీలం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి జిల్లా మంత్రితో పాటు పలువురు శాసనసభ్యులు గైర్హాజరయ్యారు. జిల్లా మంత్రి పార్థసారథి ఇప్పటికే తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధం కావడంతో ఆయన రాలేదు. తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి, పామర్రు ఎమ్మెల్యే డీవై దాసు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా గైర్హాజరయ్యారు. మిగిలిన నియోజకవర్గ ఇన్చార్జులు కూడా ఎవరూ ఆంధ్రరత్నభవన్ దరిదాపుల్లోకి రాలేదు. మంగళవారం విజయవాడ వచ్చిన జైరామ్ రమేష్‌కు రైల్వే స్టేషన్లో స్వాగతం పలికేందుకు కేవలం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ నేతలు అడపా నాగేంద్రం, మీసాల రాజేశ్వరరావు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత హోటల్‌కు వెల్లంపల్లి వచ్చి కలిశారు. సాయంత్రం ఆంధ్రరత్నభవన్లో జరిగిన సమావేశంలో కూడా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అంతా తానై వ్యవహరించగా, ఇద్దరు ఎమ్మెల్యేలు అంటీముట్టనట్లుగా ఉండిపోయారు. పలుమార్లు మైక్‌లో పిలిస్తేగాని వేదిక మీదకు వెళ్లలేదు. ఆ తర్వాత కూడా మాట్లాడమని చెప్పినా వారు మౌనంగానే ఉండిపోయారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పమంటారు... ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర మంత్రులను నిలదీశారు. కేంద్ర మంత్రి జెడీ శీలం మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు చిరు ఆగ్రహంతో ఉన్నారని, దీనికి కాంగ్రెస్ నేతలే కారణమంటూ మాట్లాడుతుండగా కార్యకర్తలు అడ్డు తగిలారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తర్వాత ప్రజల వద్దకు వెళ్లి ఏం చెప్పాలంటూ వారు నిలదీశారు. దీంతో అసలు దోషి చంద్రబాబు నాయుడేనని, ముందుగానే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారంటూ తన వాదనను సమర్థించుకున్నారు. డౌన్‌డౌన్ నినాదాలు జైరామ్ రమేష్ విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలో బీసీ విద్యార్థి సంఘం నగర ప్రధాన కార్యదర్శి కె.హరీష్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఆంధ్రరత్న భవన్ ముందు నిరసన తెలిపారు. జైరామ్ రమేష్ డౌన్‌డౌన్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హరీష్‌ను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లి అరెస్టు చేశారు. భద్రతావలయంలో ఆంధ్రరత్నభవన్ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ రాకతో ఆంధ్రరత్నభవన్ భద్రతావలయంలోకి వెళ్లింది. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన జైరామ్ రమేష్ ఎక్కడికెళ్లినా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన బస చేసిన డీవీ మనార్ హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తు నిర్వహించారు. ముగ్గురు ఏసీపీలతో వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఆంధ్రరత్నభవన్లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపించారు. జైరామ్ వ్యంగ్యాస్త్రాలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేష్ ప్రసంగం ఆద్యంతం తెలుగువారిపై వ్యంగ్యాస్త్రాలతో సాగింది. సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో స్పష్టత ఇస్తారని భావించిన కాంగ్రెస్ శ్రేణులను ఆయన నిరుత్సాహపరిచారు. తెలుగు వారికి ఒక భాష రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాజధానులు ఏర్పడతాయని, మిగిలిన రాష్ట్రాలకు ఆ పరిస్థితి ఉండదన్నారు. సీమాంధ్రులకు అవకాశం ఇస్తే చార్మినార్‌లో రెండు మినార్లు కోరతారంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. చివరికి అధిష్టానానికి వీర విధేయులుగా ఉన్న కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, పళ్లంరాజులపైనా తనదైన శైలిలో చమక్కులు విసిరారు. వారు ఉదయం లేచింది మొదలు హైదారాబాద్‌ను యూటీ చేయాలంటూ ‘ సుప్రభాతం, సహస్రనామ’ ప్రత్యేక మంత్రాలుగా జపించారని చెప్పారు. సీమాంధ్రకు కేంద్రం ఇచ్చే ప్యాకేజీల ఊసెత్తలేదు.