టీడీపీపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | Ysrcp Complaint To Ec Against Tdp | Sakshi
Sakshi News home page

టీడీపీపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published Sun, May 19 2024 9:06 PM | Last Updated on Sun, May 19 2024 9:07 PM

Ysrcp Complaint To Ec Against Tdp

సాక్షి, విజయవాడ: టీడీపీపై ఈసీకి వైఎస్సార్‌సీపీ బృందం ఫిర్యాదు చేసింది. నాలుగు అంశాలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో.. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం అభ్యర్థులే రోడ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతూ.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశం ఉంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాము. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించవలసిన రూల్స్‌ను 175 నియోజకవర్గాలలోనూ తూచా తప్పకుంగా పాటించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరాం’’ మల్లాది విష్ణు అన్నారు.

‘‘టీడీపీ అధికారంలో ఉండగా చింతమనేని ప్రభాకర్ చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావు. చింతమనేని ప్రభుత్వ అధికారులపైనే దాడులకు తెగబడిన సందర్భాలు చూశాం. తాజాగా పోలింగ్ రోజు దెందులూరులో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతమనేని ప్రభాకర్ స్టేషన్ పైనే దాడి చేసి పోలీసులపైన దౌర్జన్యం చేశారు. తక్షణమే చింతమనేనిని అరెస్ట్ చేసి.. ఆయనపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి’’ మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు.

‘‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఆపార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైంది. నిమ్మాడ గ్రామంలో టీడీపీ అరాచకాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ బూత్ ఏజంట్ తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారు. ఘటనకు సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాం. గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ పార్టీనే. కానీ సిట్‌ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఫిర్యాదులు చేస్తూ గందరగోళపరుస్తున్నారు’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement