AP Election 2024 Counting And Results Updates
03:43 PM, June 4th, 2024
పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు
- 61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపు
- అధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది
02:43 PM, June 4th, 2024
పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్
02:41 PM, June 4th, 2024
అన్నమయ్య జిల్లా:
- రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్‌రెడ్డి
- శ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824
- మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 59895
02:40 PM, June 4th, 2024
కడప పార్లమెంట్
వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజ.
- 63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్
- వైఎస్ అవినాష్ రెడ్డి: 500912
- టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694
- వైఎస్ షర్మిలా రెడ్డి: 118712
02:40 PM, June 4th, 2024
ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
- రాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
- వైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664
- టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 81286
02:26 PM, June 4th, 2024
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ
- చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి
- 6623 ఓట్ల లీడింగ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ
01:50 PM, June 4th, 2024
ముందంజలో అవినాష్‌రెడ్డి
కడప: ముందంజలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి
16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ముందంజ
01:05 PM, June 4th, 2024
రాజంపేటలో వైఎస్సార్‌సీపీ ముందంజ
- రాజంపేటలో వైఎస్సార్‌సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజ
కదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్‌సీపీ లీడ్
12:21 PM, June 4th, 2024
పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్
- పుంగనూరు: ముందంజలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- సత్యవేడులో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
- వైఎస్సార్‌సీపీ-23497
- బీజేపీ-16,603
11:15 AM, June 4th, 2024
పాలకొండలో వైఎస్సార్‌సీ ముందంజ
- గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ ఆధిక్యత
- గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత
- మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డి
- నరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం
10:54 AM, June 4th, 2024
దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికి
- వైఎస్సార్‌సీపీ-22965
- టీడీపీ-20921
పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)
వైఎస్సార్‌సీపీ-5110
టీడీపీ-12309
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)
వైఎస్సార్‌సీపీ-5478
టీడీపీ-6263
ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)
వైఎస్సార్‌సీపీ-13805
టీడీపీ -17864
10:31 AM, June 4th, 2024
తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తి
- గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మూడో రౌండ్‌లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యం
- వైఎస్సార్‌సీపీ-12,687
- బీజేపీ-11091
- నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం
9:52 AM, June 4th, 2024
వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజ
- కడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ
9:24 AM, June 4th, 2024
అనపర్తి, తిరువూరులో వైఎస్సార్‌సీపీ లీడ్
- హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
- పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి ముందంజ
- కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యం
- తిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
- సర్వేపల్లిలో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధిక్యం
- దర్శిలో వైఎస్సార్‌సీపీ ముందంజ
- అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లీడ్
9:20 AM, June 4th, 2024
పాలకొల్లులో టీడీపీ ముందంజ
- ఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం
- ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యం
- భీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యం
- తణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యం
- తాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం
- నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం
9:15 AM, June 4th, 2024
విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350
ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలు
సర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లు
మరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం
9:13 AM, June 4th, 2024
పులివెందులలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందంజ
- తిరువూరులో వైఎస్సార్‌సీపీ ముందంజ
- ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యం
9:01 AM, June 4th, 2024
ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌రెడ్డి ముందంజ
- కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యం
- నంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్
8:53 AM, June 4th, 2024
కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యం
అవినాష్‌రెడ్డి 4362(ఆధిక్యం)
భూపేష్ వెనుకంజ 2,088
షర్మిల-1101
8:51 AM, June 4th, 2024
చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యం
- గజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యం
- తిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
- చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
8:36 AM, June 4th, 2024
కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్‌లో ఎక్కువ చెల్లని ఓట్లు
పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్
మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది
8:27 AM, June 4th, 2024
తూర్పు గోదావరి
- రాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ
- రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్
- 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం
8:25 AM, June 4th, 2024
నంద్యాల
- నంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
- పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్
8:22 AM, June 4th, 2024
పశ్చిమగోదావరి
- జిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.
- నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు
8:15 AM, June 4th, 2024
పల్నాడు
- నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్
- 108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు
8:09 AM, June 4th, 2024
అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా
8:09 AM, June 4th, 2024
ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియ
- స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపు
- తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
- ఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు
8:05 AM, June 4th, 2024
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
- అభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్‌లు
- పోస్టల్‌ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు
7:59 AM, June 4th, 2024
అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తున్న అధికారులు
కాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
పోస్టల్‌ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు
ఎప్పడూ లేనంత హై అలర్ట్‌లో పార్టీల అభ్యర్థులు
ఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు
7:43 AM, June 4th, 2024
అమలాపురం కౌంటింగ్ సెంటర్‌లో పినిపే విశ్వరూప్
అమలాపురంలో కౌంటింగ్ సెంటర్‌కి వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్
బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి
7:43 AM, June 4th, 2024
చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పం
కుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు
ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులు
కుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం
7:34 AM, June 4th, 2024
కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ
- ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
- పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశం
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు
7:22 AM, June 4th, 2024
ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్
- చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లు
- పలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లు
- కుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లు
- పూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లు
- జీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లు
- నగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లు
- పుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లు
- సత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లు
- శ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లు
- తిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లు
- చంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లు
- పీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లు
- తంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లు
- మదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు
7:22 AM, June 4th, 2024
కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు
- రామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 917
- 10 టేబుళ్లు 24 రౌండ్లు
- ముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163,
- 14 టేబుళ్లు, 19 రౌండ్లు
- అమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,
- 12 టేబుళ్లు, 20 రౌండ్లు
- రాజోలు మొత్తం ఓటర్లు 1,56,400
- 14 టేబుళ్లు, 15 రౌండ్లు
- పి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749
- 12 టేబుళ్లు, 18 రౌండ్లు
- కొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945
- 10 టేబుళ్లు-26 రౌండ్లు
- మండపేట మొత్తం ఓటర్లు 1,91,959
- 10 టేబుళ్లు-22 రౌండ్లు
6:55 AM, June 4th, 2024
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ
- కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది
- తేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యం
- ఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..
- లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..
- 23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..
- 18 నుంచి 21 రౌండ్‌లో వెలువడనున్న ఫలితాలు
- మొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం
- 1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగం
- కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత
- కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..
6:47 AM, June 4th, 2024
కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం
- మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపు
- మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,935
- 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948
- మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,579
- 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,728
- 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
- 8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం
- పార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు
- ఒక్కో టేబుల్‌కు ఏఆర్ఓ,ఒక సూపర్‌వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకం
- మచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లు
- పెడన అసెంబ్లీ - 16 రౌండ్లు
- గుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లు
అవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లు - గన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లు
- మొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశం
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు
- పామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్
- పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్
- గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్
- గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్
- మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్
- మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యే
- అభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగా
- గన్నవరం అసెంబ్లీ - 12 మంది
- గుడివాడ అసెంబ్లీ - 12 మంది
- పెడన అసెంబ్లీ - 10 మంది
- మచిలీపట్నం అసెంబ్లీ - 14 మంది
- అవనిగడ్డ అసెంబ్లీ - 12 మంది
- పామర్రు అసెంబ్లీ - 8 మంది
- పెనమలూరు అసెంబ్లీ - 11 మంది
6:26 AM, June 4th, 2024
తొలి ఫలితం ఏదంటే..
- ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభం
- పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల టైం
- ఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయం
- ఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్‌లు
- కొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితం
- భీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం
- 13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం
- 27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టత
- లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో
6:25 AM, June 4th, 2024
ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్‌వో
ఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్‌వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.
రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.
6:20 AM, June 4th, 2024
1,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
- రెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయం
- రాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్
- కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు.
- మొదటి అంచెలో కేంద్ర బలగాలు,
- రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులు
- కౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది.
- రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు
- వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.
- కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు .
- ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలు
- సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు
6:15 AM, June 4th, 2024
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024
6:05 AM, June 4th, 2024
మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత
నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది.
సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥
ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻
సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024
నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment