AP Elections Results 2024
-
గెలుపు ఓటములు సహజం అంత మాత్రాన..
-
వయసుతో పాటు పోరాడే సత్తా నాకుంది: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి, ప్రతీ గడపకు మనం చేసిన మంచి ఏమిటో తెలుసు. ఈరోజుకీ వైఎస్ జగన్ అంటే అబద్దాలు చెప్పడు.. మోసం చేయడు అని వారికి తెలుసు. వైఎస్సార్సీపీ అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు. ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకుంటారు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘‘ఎన్నికల్లో మనకు 40 శాతం ఓట్లు పోల్ అయ్యాయని మనం మర్చిపోకూడదు. 2019లో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు తగ్గాయి. ఈ పది శాతం ప్రజలు చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారు. ప్రతీ కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసు. విశ్వసనీయతకు మన చిరునామా. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష. మనం అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు... ఈరోజుకీ జగన్ అబద్ధాలు చెప్పడు. జగన్ మోసం చేయడు అని వారికి తెలుసు. చంద్రబాబుకన్నా.. ఎక్కువ హామీలు ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించొచ్చు కూడా. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండడం అవసరమా? అనుకునేవాళ్లు కూడా ఉండొచ్చు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదనే జగన్ ఎప్పుడూ చెప్తాడు. 2014లో కూడా ఇదే చెప్పాను. 2019లో అది నిజం అయ్యింది. ప్రజలు మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రజలు అదే చేస్తారు. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికీ పోలేదు.జగన్‌కు వయసు, వయసుతోపాటు సత్తువ కూడా ఉంది. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ, ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైఎస్సార్సీపీకి, జగన్‌కు ఎవ్వరూ సాటిరారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరఫున పోరాటాలు కూడా చేస్తాం. మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే కాబట్టి, అసెంబ్లీలో మనం చేసేది తక్కువే. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకుపోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం..జగన్ ఓడిపోయాడు.. చనిపోలేదు అని ఒకరు అంటారు. చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటారు. ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్నాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయి... కులం, మతం, ప్రాంతం చూడకుండా.. ఏ పార్టీకి ఓటు వేశారని చూడకుండా.. జగన్ డోర్‌డెలివరీ చేశారు. ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదని మనుషులపై దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. వారి ఆస్తులను దాడులు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి. మనం ఎప్పుడూ కూడా ఇలాంటివి చూడలేదు. మన ప్రభుత్వంలో మేనిఫెస్టో అన్నది ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే పాలన అయితే, ఇప్పుడు రెడ్ బుక్స్ అని హోర్డింగులు పెడుతున్నారు. అందులో ఏ అధికారిపై కక్ష సాధించాలి. ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిపై కక్షసాధించాలి.. అని రాసుకుంటున్నారు. కొడతాం, చంపుతాం అంటున్నారు... మొట్టమొదటి సారిగా కేంద్రంలో 272 స్థానాలు కావాల్సి ఉండగా, బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది.మరోవైపు చంద్రబాబుకు 16 స్థానాలు ఉన్నాయి. మోదీ పక్కన ఉండి చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్టుగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగకపోవడం, అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి. అలాంటి చంద్రబాబు రాష్ట్రానికి, యువతకు ఏం సమాధానం చెప్తాడు... అదే జగన్ ఉండి ఉంటే.. ఈపాటికే విద్యాదీవెనకు బటన్ నొక్కే వాళ్లం. వసతి దీవెన బటన్ నొక్కేవాళ్లం.. ఇవి పెండింగులో ఉన్నాయి. రైతు భరోసా పెండింగ్, అమ్మ ఒడి పెండింగ్. చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్‌లో ఉంది. వైఎస్సార్సీపీ పాలన లేకపోవడంతో వీరికి ఏమీ రావడం లేదు. వీటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఏపీలో ఉన్నారు. దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. రూ. 1500లు ప్రతీ ఒక్కరికీ ఇస్తానని చెప్పాడు. ఇందులో పెన్షన్లు తీసుకునేవాళ్లని పక్కనిపెట్టినా సరే.. మిగిలిన 1.8 కోట్లమంది ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సహాయంకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అమ్మ ఒడిగా కింద వచ్చే డబ్బులు కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఏవీ కూడా అడుగులు ముందుకుపడని పరిస్థితి. కాలం గడుస్తున్నకొద్దీ.. హనీమూన్ పీరియడ్ ముగిస్తుంది.ఓడిపోయామన్న భావనను మనసులోనుంచి తీసేయండి. మనం ఓడిపోలేదు.. అన్న విషయాన్ని గుర్తించండి. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు. ప్రతీ ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతీ ఇంటికీ కూడా మనం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకి గౌరవంగా వెళ్లగలుగుతాం. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ట అభిమానం వ్యక్తమవుతుంది. మళ్లీ మనం రికార్డు మెజార్టీలో గెలుస్తాం. మోసపోతున్నవారికి మనం అండగా నిలవాలి. మనకార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి. ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారు. వీళ్లందరికీ కూడా భరోసా ఇవ్వాలి... మీ నియోజకవర్గంలో కార్యకర్తలకు తోడుగా ఉండండి. వారిని పరామర్శించండి. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ ఇస్తే సహాయాన్ని మీరు స్వయంగా అందించండి. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుసుకుంటాను. నష్టపోయిన ప్రతీ కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాను. మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కేండిడేట్ మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవచ్చు. కార్యకర్తలు కష్టాల్లోనూ మనతోనూ ఉన్నారు. జెండాలు మోసి కష్టాలు పడ్డారు. వారికి తోడుగా నిలవాలి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వండి. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి మాట్లాడండి... నాలుగేళ్లవరకూ కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. చట్టం దీన్ని నిరోధిస్తుంది. ఈ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే.. చేయలేరు. కోర్టులు దీనికి ఒప్పుకోవు. అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీకూడా మనవాళ్లకు మనం చెప్పాలి. వారికి తోడుగా ఉన్నామనే ధీమా ఇవ్వాలి. అప్పుడు వారికి కూడా ధైర్యం వస్తుంది. సోషల్ మీడియా కార్యకర్తలను, మన కోసం నిలబడ్డ వాలంటీర్లను వీరందర్నీ కూడా కాపాడుకోవాలి. మన పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి ఒక్కరినీ మనం కాపాడుకోవాలి... మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం పక్కకు తప్పుకుంటే వారంతా నష్టపోతారు. లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు, వందల మంది పోటీచేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు. మనల్ని నమ్ముకున్న ప్రజలు, నాయకులు అంతా కూడా నష్టపోతారు.మనలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ధైర్యంగా మనం అడుగులు ముందుకు వేయాల్సిందే. ప్రతీ అభిమానికీ, కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శకుని పాచికలు అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెలే. శ్రీకృష్ణుడు తోడు ఉన్నా.. పాండవులు ఓడిపోతారు. ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయి. మనం తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ప్రతీ ఒక్కరూ ఒక అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు. ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అవన్నీ నా దృష్టికి తీసుకువస్తున్నారు... ఈ ఎన్నికల్లో మీరంతా గట్టి పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా జరగాయన్నది ఇవ్వాళ్టికీ ఆశ్చర్యకరం. మనం తలెత్తుకునే విధంగా పాలన చేశాం. మేనిఫెస్టోలో 99శాతం హామీలను అమలు చేశాం. అమలుచేసిన మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లాం. వారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రతీ గడపకూ తిరిగాం. రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఇంత సీరియస్‌గా ఎవ్వరూ ఎప్పుడూ తీసుకోలేదు. ఎన్నికల్లో మాటలు చెప్పి.. ఆతర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు మనం చూశాం. సీఎం కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకూ కూడా మేనిఫెస్టోలు పెట్టుకుని ఆ దిశగా పనులు చేశాం.ప్రతీ డిపార్ట్మెంట్లో కూడా మేనిఫెస్టో పెట్టి అదే అజెండాగా పాలన చేశాం. మొట్టమొదటి రోజునుంచీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాం. తలెత్తుకుని సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. కానీ, ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. క్యాలెండర్ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమచేశాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. మనం అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు కేవలం రూ.వేయి, దాన్ని రూ.3వేలకు పెంచాం. అప్పట్లో 39 లక్షలు మాత్రమే పెన్షనర్లు.. దాన్ని 66 పెన్షన్లకు పెంచాం. ఎవ్వరినీ కూడా పక్కనపెట్టలేదు. ఇంటివద్దకే వెళ్లి వారి చేతికే అందించాం. మరి ఆ 66 లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు.. వారి ఆప్యాయత, ప్రేమలు ఏమయ్యాయి?.54 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి అందించాం. 53 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ఇచ్చాం. ఇవి ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. కోటిమందికి పైగా అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ ఇచ్చాం. 79 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు ఆసరా కార్యాక్రమం ఇచ్చాం27 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం30 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్యా, వసతిదీవెన వారి తల్లులకు ఇచ్చాం31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాంఇలా చాలామందికి చాలా రకాలుగా సహాయపడ్డాం.మరి వారిప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు.కోవిడ్ సమస్యలున్నా సాకులు చూపలేదు, మంచే చేశాం.ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి అడుగులు పడ్డాయి.క్వాలిటీ చదువులకోసం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం.ఎప్పుడూ ఇలాంటి మార్పులు జరగలేదువైద్య రంగంలో కూడా సమూల మార్పులు తీసుకువచ్చాం25 లక్షల వరకూ ఆరోగ్య శ్రీ ఉచితమని చెప్పాంఆరోగ్య ఆసరా నుంచి విలేజ్ క్లినిక్ ద్వారా ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాం54 వేలమంది వైద్య సిబ్బందిని నియమించాంవ్యవసాయంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాంఆర్బీకేల ద్వారా పేదలకు తోడుగా ఉన్నాంవిద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాంగ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకు వచ్చాంలంచాలు, వివక్షలేని పాలనను అందించాంఇంటివద్దకే పాలన అన్న దానికి అర్థం తీసుకు వచ్చాంమహిళా సాధికారితకు ఏం చేయొచ్చో అన్నీ చేశాం15వేల మంది సర్వేయర్లను పెట్టి.. ల్యాండ్ సంస్కరణలు తీసుకువచ్చాంభూ రికార్డులన్నీ కూడా స్వచ్చీకరణకు చర్యలు తీసుకున్నాంవివాదాల్లేకుండా అడుగులు ముందుకేశాంల్యాండ్ టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారెంట్ ఇచ్చే చర్యలు తీసుకున్నాంటైటిల్కు ఇన్సూరెన్స్ కల్పించాంగతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.దిశ యాప్ ద్వారా మహిళల భద్రత దిశగా గట్టి చర్యలు తీసుకున్నాం.గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మార్పులు జరగలేదు.ఇన్ని చేశాక వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం అని వ్యాఖ్యలు చేశారు. -
ఓటమిపై నాగార్జున రెడ్డి రియాక్షన్
-
ఎన్నికల ఫలితాలపై కొరముట్ల శ్రీనివాసులు రియాక్షన్
-
ఓటమిపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఇచ్చిన హామీలను కూటమి అమలు చేయాలి
-
ఎన్నికల ఫలితాలపై జగ్గిరెడ్డి రియాక్షన్
-
ఓటమిపై కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
-
ఓటమికి కారణాలు తెలుసుకుంటాం.. దాడులు చేయడం సరికాదు
-
రాష్ట్రవ్యాప్తంగా ఆగుతున్న YSRCP అభిమానుల గుండెలు
-
ఎవరు అధైర్య పడవద్దు
-
ఎన్నికల ఫలితాలపై పిల్లి సూర్యప్రకాష్ రియాక్షన్
-
ఎన్నికల ఫలితాలపై పిల్లి సుభాష్ చంద్రబోస్ షాకింగ్ రియాక్షన్
-
కుప్పంలో ఓటమిపై MLC భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
వెల్డన్ గురు..
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి విజయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలన్నీ కూటమి అభ్యర్థులకే అనుకూలంగా వస్తుండడంతో తిరుపతి పార్లమెంట్ కూడా బీజేపీ అభ్యర్థే గెలుస్తారని ధీమాగా అనుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి చేసిన కృషిని, ఆయన మంచితనంపై అసత్యాలు, అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఓటర్లు మద్దెల గురుమూర్తికే పట్టం కట్టారు. ఊహించని విధంగా తిరుపతి ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కూటమి నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలవ్వగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గొప్ప గెలుపు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘క్రాస్’ చేయాలని చూసి బోల్తా పడిన కూటమి.. తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి అనుకూలంగా భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టం అవుతోంది. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఎంపీ కావడంతో నియోజకవర్గానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనతో పని చేశారనేది గురుమూర్తికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కూటమి ఎంపీ అభ్యర్థి చేసిన దు్రష్పచారాలు ఫలించలేదు. క్రాస్ ఓటింగ్ చేయించి గట్టెక్కాలని భావించారు. కానీ గురుమూర్తి మంచితనం, కృషి ముందు కూటమి కుట్రలు ఏవీ పనిచేయలేదు. అదెలా అంటారా? తిరుపతి లోక్‌సభ పరిధిలోని తిరుపతిలో 60,255 ఓట్లు, శ్రీకాళహస్తిలో 41,979, సూళ్లూరుపేటలో 28,362, వెంకటగిరిలో 15,454, గూడూరులో 19,915, సర్వేపల్లిలో 15,994 ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఈ మెజారిటీలను చూస్తే కూటమి అభ్యర్థే ఘనవిజయం సాధించాలి. కానీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వచ్చేసరికి ఓటర్లు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపారు. సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతో పాటు కూటమి అభిమానులు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యరి్థని గెలిపించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులంతా గెలిచి, ఎంపీ అభ్యర్థి ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. తిరుపతి జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి గత మూడేళ్లుగా అనేక ప్రయత్నాలు చేశారు. కంపెనీల చుట్టూ తిరుగుతూ వారిని జిల్లావ్యాప్తంగా తిప్పి కంపెనీలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన వసతులు అన్ని తామే సమకూర్చగలమని విన్నవించారు. తద్వారా ప్రజల్లో గురుమూర్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నిస్వార్థంగా ప్రజలకు ఎంతో కొంతమేలు చేయాలనే తత్వం, ఆ కష్టానికి ప్రజల ఆశీర్వాదం మళ్లీ లభించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు చాలామంది ఓడిపోయినా గురుమూర్తి గెలిచారంటే అది ఆయన కష్టాలకు తగిన ఫలితమే అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎంపీగా గురుమూర్తి అధికారాన్ని పదిమందికి సాయం చేయడంతో పాటు కార్యకర్తలకు, ఓటర్లకు దగ్గర కావడమే ఆయనకు విజయానికి కారణమని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కలిసొచ్చిన అంశాలు ఇవే.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2021 ఉప ఎన్నికల్లో గురుమూర్తి తొలిసారి రాజకీయ ప్రవేశం చేసి తిరుపతి ఎంపీగా 6,2 6,108 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యరి్థ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2,71,592 లక్షల మెజారీ్టతో గెలుపొందారు. 👉 ఎంపీగా గత మూడేళ్ల కాలంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సహకారంతో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. 👉 గత మూడేళ్లలో ఎంపీగా గురుమూర్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 👉 తిరుపతి పరిధిలో కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, పులికాట్ సరస్సు పరిధిలోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలు సడలించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సహకారంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వందలాది గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య పరిష్కారానికి అధికారిక ప్రక్రియ ప్రారంభింపజేశారు. 👉 అలాగే 16 వేల కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఆరోగ్య సంరక్షణకు వెల్నెస్ సెంటర్ తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 👉 వేలాదిమంది యువతకు ఇంజినీరింగ్ నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వ నైలెట్ సంస్థ తిరుపతికి మంజూరు చేయించారు. 👉 స్విమ్స్, డీఆర్డీఓ అనుబంధ సంస్థ డేబెల్‌తో తక్కువ ఖరీదుకే రోగులకు మెడికల్ ఇంప్లాంట్స్ తయారు చేసే ప్రాజెక్టు తీసుకొచ్చారు. 👉 రైల్వే ప్రాజెక్టుల పురోగతిలో తనదైన ముద్ర వేశారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.350 కోట్లతో ప్రాజెక్టు పనుల వేగం పెంచారు. 👉 తిరుపతి ప్రజలకు నరకంగా ఉన్న రాయలచెరువు రైల్వే గేటును తొలగించి అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయించారు. 👉 ఏర్పేడు, వెంకటగిరి రైల్వే ఫ్లైఓవర్లు మంజూరు చేయించారు. 👉 తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 లక్షలు నిధులు ఇచ్చారు. 👉 యూనివర్సిటీ రోడ్డులో ఉన్న రైల్వే డీఐకాన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 👉 వెంకటగిరి కేంద్రీయ విద్యాలయాలన్ని ఇంటరీ్మడియెట్ స్థాయికి పెంచి విద్యార్థులు అక్కడే చదువుకునేలా చర్యలు చేపట్టారు. -
ఒక్క ఒక్కడు
జిల్లా రాజకీయాలను శాసిస్తూ పెద్దాయనగా పేరొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు ఆయన మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ కంచుకోటగా పేరొందిన పుంగనూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజేతగా నిలిచారు. అంతకుముందు రెండు సార్లు పీలేరు నుంచి గెలుపొందారు. తండ్రీ తనయులైన వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాల్లో పలు శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి టీడీపీ సునామీలోనూ తట్టుకుని జిల్లాలో విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా పేరుపొందారు.చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఉత్కంఠగా సాగింది. మొదటి రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు గెలుపు ఎవరికీ తేలని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మెజారిటీ పెరుగుతూ వచ్చేసరికి చివరి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు గంటకు పైగా ఆపేశారు. ఓటమి ఖాయం అనుకున్న కూటమి అభ్యర్థి ఆర్ఓకు ఆధారం లేని ఫిర్యాదులు చేశారు. ఎలాగైనా రీ కౌంటింగ్ చేయించాలని పట్టుబట్టారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో రీ కౌంటింగ్ చేయడం కుదరదని అధికారులు తేలి్చచెప్పేశారు. దీంతో పుంగనూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ముగించి విజేతను ప్రకటించారు. సంజీవరెడ్డి పరిచయమే 1977లో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన రామచంద్రారెడ్డి ఒక సారి నీలం సంజీవరెడ్డిని కలుసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో 1978లో జనతా పార్టీ పీలేరు అభ్యరి్థగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తరువాత కాంగ్రెస్ పారీ్టలో చేరిన పెద్దిరెడ్డి 1989లో మొదటి సారిగా పీలేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 24,636 ఓట్ల మెజారిటీతో చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. 1994లో పీలేరు అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఆ తరువాత 2009, 2014, 2019లో పుంగనూరు ఎమ్మెల్యేగా వరుస విజయాలతో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తాజా ఎన్నికల్లో 6095 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పెద్దాయనకు మంచిపేరే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, ప్రజలతో మమేకం అవుతూ రాష్ట్రంలోనూ, ముఖ్యంగా రాయలసీమలో తిరుగులేని నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ రాజకీయాల్లో చంద్రబాబుకు సమఉజ్జీగా నిలిచారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబుతో తలపడుతూనే వస్తున్నారు. పల్లెలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పెద్దాయన తలుపు తడితే చాలు కష్టం తీరిపోతుందని నమ్మేంతగా ప్రజాదరణను చూరగొన్నారు. అందుకే కూటమి నేతలంతా గెలుపొందినా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలం ముందు చంద్రబాబు ఎత్తులు, పైఎత్తులు చిత్తయ్యాయి.పుంగనూరు నుంచి నాలుగోసారి రాజకీయాల్లో డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న పెద్దాయన వరుసగా నాలుగో సారి పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుంగనూరు రికార్డును బద్దలు కొట్టారు. రైతు కుటుంబం నుంచి రాజకీయ చదరంగంలో ఆయన రారాజుగా ఎదిగారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న పుంగనూరుకు 2004లో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2014, 2019, 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున బరిలో దిగి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా, 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.పెద్దిరెడ్డికి 1,00,793 ఓట్లు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గం మొత్తం 2,09,674 ఓట్లు పోల్ అవ్వగా ఈవీఎంలో 2,06,911 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో 2,763 ఓట్లు ఎన్నికల్లో పోలయ్యాయి. ఇందులోనే నోటాకు 2,904 మంది ఓట్లు వేశారు. ఆఖరి రౌండ్ ముగిసే సరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,00,793 ఓట్లు, ప్రత్యరి్థకి 94,698 ఓట్లు నమోదయ్యాయి. దీంతో 6,095 మెజారిటీ రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ఆర్ఓ ప్రకటించారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీకి చెందిన చల్లా రామచంద్రారెడ్డికి 94,698, భారత చైతన్య యువజన పారీ్టకి చెందిన బోడె రామచంద్ర యాదవ్‌కు 4559, కాంగ్రెస్‌కు చెందిన మురళిమోహన్ యాదవ్‌కు 3571, బహుజన్ సమాజ్ పారీ్టకి చెందిన సురే‹Ùకు 687, సోషల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అన్వర్ బాషా కు 1906, ఇండెపెండెంట్లుగా పోటీ చేసిన నాగేశ్వరరావుకు 242, రామయ్యకు 314 ఓట్లు నమోదయ్యాయి. -
మంత్రి పదవులపై మొదలైన చర్చ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 80 రోజుల ప్రహసనం పూర్తయ్యి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడంతా ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కొలువు దీరడమే మిగిలి ఉంది. దీంతో అందరి దృష్టి జిల్లాలో ఎవరెవరికీ మంత్రి యోగం దక్కుతుందో అన్నదానిపైనే పడింది. కొత్తగా ఏర్పాటవుతున్న చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ కోసం ఎవరికి వారే ఆశలు పెట్టుకుంటున్నారు. వారిలో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్లే చర్చకు వస్తున్నాయి. ఇక, ఎన్డీఏ భాగస్వామ్యం కావడం వల్ల కేంద్ర క్యాబినెట్లో కూడా టీడీపీలో కొందరికీ మంత్రి పదవులు దక్కుతాయి. ఆ అవకాశం హ్యాట్రిక్ విక్టరీ సాధించిన కింజరాపు రామ్మోహన్నాయుడికి వస్తుందన్న ఆశలు భారీగానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చింది. మే 13న పోలింగ్ జరిగింది. ఈ నెల 4వ తేదీన లెక్కింపు పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో కూట మి విజయబావుటా ఎగురవేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం, దాని విధి వి«ధానాల మేరకు పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడందరి దృష్టి మంత్రులెవరు అవుతారన్న దానిపైనే పడింది. జిల్లాలో హ్యాట్రిక్ విక్టరీతో ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు, వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా బెందాళం అశోక్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి ఉన్నారు. కాళింగ కోటాలో కూనకు దక్కే అవకాశం జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ రాజకీయం రసవత్తరం కానుంది. కీలకమైన వెలమ సామాజిక వర్గానికివ్వాలా? కాళింగ సామాజిక వర్గానికా? అన్న చిక్కుముడి తప్పక ఉంటుంది. వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తే అచ్చెన్నాయుడికే దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. కాళింగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే రెండు సార్లు గెలిచి, గతంలో పార్టీ విప్‌గా పనిచేసి, ఇటీవల ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కూన రవికుమార్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మూడు సార్లు గెలిచారని పరిగణనలోకి తీసుకుంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై ఆలోచన చేసే అవకాశం ఉంది. కానీ, టీడీపీ రాజకీయాలు శాసిస్తున్న వారిగా చూస్తే కూన రవికుమార్‌కే అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్త సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం సామాజిక వర్గ చిచ్చు రేగక తప్పదు. వెలమ సామాజిక వర్గానికిస్తే కాళింగులకు అనాయ్యం చేశారని, కాళింగులకు ఇస్తే వెలమలకు ముఖ్యంగా సీనియరైన కింజరాపు అచ్చెన్నాయుడికి మొండి చేయి చూపారని, అన్యాయం చేశారని ఆ సామాజిక వర్గం అనుకోక తప్పదు. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులిస్తేనే ఆ రెండు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు అవుతుంది. లేదంటే ఒకరికి మంత్రి పదవి, మరొకరికి గతంలో మాదిరిగా విప్ ఇచ్చి సర్దుబాటైనా చేసి చేతులు దులుపుకోవచ్చు. ఈ సమయంలో అటు కాపుల నుంచి, ఇటు గౌతు ఫ్యామిలీ నుంచి గాని మంత్రి పదవి ఆశించే అవకాశం ఉండదు. జిల్లాలో ఎక్కువగా కాపులున్నప్పటికీ ఇతర జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు. ఇక, గౌతు ఫ్యామిలీని తీసుకుంటే తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేగా శిరీషకు నచ్చ చెప్పి సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. ’అచ్చెన్నకే పెద్దపీట.. సామాజిక వర్గాల వారీగా చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికి, కాళింగ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అదే స్థాయిలో జిల్లాలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక, సీనియర్ల కోటాలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి సారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె శిరీషను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన తొలుత వెలమ సామాజిక వర్గాన్నే తీసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కింజరాపు అచ్చెన్నాయుడిది. గతంలో మంత్రిగా పనిచేయగా, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక, రెండో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికైన బగ్గు రమణమూర్తికి మంత్రి పదవి ఇచ్చేంత ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్‌కు అదే గొప్ప పదవిగా భావించాలే తప్ప మంత్రి పదవి ఆశించేంత పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఈ లెక్కన చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడికే పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. అధిష్టానం వైఖరిలో మార్పు ఉంటే తప్ప ఆయనకు దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంపీ రామ్మోహన్ తెరపైకి వస్తే...ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావడం, ఆ పార్టీ నుంచి గెలిచిన హ్యాట్రిక్ ఎంపీగా కింజరాపు రామ్మోహన్నాయుడు నిలవడం, చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో కేంద్ర కేబినెట్లో చోటు కలి్పస్తారేమోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. దివంగత కింజరాపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన రామ్మోహన్నాయుడు వరుసగా విజయం సాధించడమే కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే అప్పుడు జిల్లా సమీకరణాలపై ప్రభావం చూపుతుంది. ఇటు రాష్ట్రమంత్రిగా బాబాయ్ అచ్చెన్నాయుడికి, అటు కేంద్రమంత్రిగా అబ్బాయ్ రామ్మోహన్నాయుడికి చోటు కల్పిస్తే ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ అగ్రతాంబూలం ఇస్తారా? అన్న సామాజిక వివాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికే ఇవ్వాలనుకుంటే రాష్ట్ర కేబినెట్లో అచ్చెన్నాయుడికి ఇవ్వాలి. కాదనుకుంటే కేంద్ర కేబినెట్లో రామ్మోహన్‌కు చోటు కలి్పంచాలి. ఈ సమయంలో బాబాయ్, అబ్బాయ్లో ఒకరికి మొండి చేయి తప్పదు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఏమవుతుందో, ఎవరికి యోగం దక్కుతుందో చూడాలి. -
ఓటమిపై జక్కంపూడి రాజా రియాక్షన్
-
వైఎస్ఆర్ సీపీ ఓటమిపై రవీంద్రారెడ్డి రియాక్షన్
-
ఓటమిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్షన్
-
KSR Live Show: అసలేం జరింగింది ?...వైఎస్ఆర్ సీపీ ఓటమికి కారణం ?
-
ఓటమిపై మేకపాటి విక్రమ్ రెడ్డి రియాక్షన్
-
Big Question: వైఎస్ జగన్ భావోద్వేగ స్పీచ్.. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ
-
ఏకైక మహిళా ఎమ్మెల్యే ..
అరసవల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వారసురాలు, ఆయన మనవరాలు గౌతు శిరీష తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. 2014లో తొలిసారి ఆమె టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పలాస నుంచి ఎన్నికల బరిలో దిగినప్పటికీ గెలుపు సాధ్యం కాలే దు. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆమె మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై గెలుపొందారు. 1952 నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయ చరిత్రలో ఈమె 16వ మహిళా ఎమ్మెల్యే కా గా...సంఖ్యా పరంగా 23వ మహిళా ఎమ్మెల్యేగా రికార్డులోకి ఎక్కారు. 1962లో తొలిసారి బ్రాహ్మణతర్ల నుంచి ఎమ్మెల్యేగా బెండి లక్ష్మీనారాయణమ్మ గెలుపొందగా, ఆ తర్వాత 1972లో నరసన్నపేట నుంచి బగ్గు సరోజినమ్మ, పాతపట్నం నుంచి చుక్క పగడాలమ్మ, ఉణుకూరు నుంచి పాలవలస రుక్మిణిలు గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ ఆవిర్భావం 1983లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా కావలి ప్రతిభాభారతి గెలిచారు. 1983, 1988, 1989, 1994, 1999లలో కూడా ఆమె ఎచ్చెర్ల ఎమ్మెల్యేగానే గెలుపొందారు. రాష్ట్ర అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్ కూడా ఎన్నికయ్యారు. అలాగే 1985లో టెక్కలి నుంచి వరద సరోజ, 1989లో టెక్కలి నుంచి దువ్వాడ నాగావళి, అలాగే 1989, 1999లలో పాలకొండ నుంచి పీజే అమృతకుమారి, 1996లో ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగానూ గెలుపొందారు.అనంతరం 2004లో కొత్తూరు ఎమ్మెల్యేగా మినతి గొమాంగో, 2004, 2009లలో ఆమదాలవలస ఎమ్మెల్యేగా బొడ్డేపల్లి సత్యవతి, 2009లో టెక్కలి ఎమ్మెల్యేగా కొర్ల భారతి, 2014లో, 2019లోనూ పాలకొండ ఎమ్మెల్యేగా విశ్వాసరాయి కళావతి, 2014లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గుండ లక్ష్మీదేవి, 2014లో పాతపట్నం ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జిల్లా నుంచి గెలుపొందిన ఏకై క మహిళా ఎమ్మెల్యేగా గౌతు శిరీష రికార్డులకెక్కారు. -
ఓటమిపై పామర్రు ఎమ్మెల్యే రియాక్షన్
-
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కోట్ల మందికి సంక్షేమం అందించినా.. గతంలో జరగనంత మంచి చేసినా.. అన్ని వర్గాల మంచి కోసం ప్రతీ అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపై మంగళవారం సాయంత్రం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. యాభై మూడు లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే ఫించన్ పంపిచే వ్యవస్థను తీసుకొచ్చాం. చాలీచాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఫలితాల్ని ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు’’ అని వైఎస్ జగన్ అన్నారు.సామాజిక న్యాయం చేసి ప్రపంచానికి చూపించాం. మేనిఫెస్టోను పవిత్రంగా భావించాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అమలు చేశాం. ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. మరి ఇంత చేసినా ఆ ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. చేయగలిగిన మంచి చేశాం. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ, పేదవాడికి తోడుగా.. అండగా ఎప్పుడూ నిలబడతాం’’ అని వైఎస్ జగన్ గద్గద స్వరంతో చెప్పారు.పెద్ద పెద్ద నేతల కూటమి ఇది. బీజేపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. గొప్ప విజయానికి కూటమి నేతలకు అభినందనలు. నా తోడుగా నిలబడిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తకి, స్టార్ క్యాంపెయినర్ నా అక్కచెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఏం చేసినా, ఎంత చేసినా ఇంక 40 శాతం ఓటు బ్యాంకుని తగ్గించలేకపోయారు. కిందపడినా గుండె ధైర్యంతో పైకి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం పోరాటాలు చేయడం నాకు కొత్త కాదు. ఎవరూ అనుభవించని రాజకీయ కష్టాలు అనుభవించా. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా దేనికైనా సిద్ధం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
పులివెందులలో సీఎం జగన్ గెలుపు
వైఎస్సార్, సాక్షి: అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతున్నాయి. వైఎస్సార్సీపీ తరఫున పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం జగన్ విజయం సాధించారు. -
ఏపీలో కొనసాగుతున్న కౌంటింగ్ (ఫొటోలు)
-
ElectionsResults ఫీవర్.. ట్రెండింగ్‌లో AP హవా
ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్ చేస్తే కౌంటింగ్ అప్డేట్, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్ సైతం ఎన్నికల రిజల్ట్స్ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఆయా పార్టీలు, పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో.. ఆయా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. అయితే 542 లోక్‌సభ స్థానాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కువ హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో నడుస్తుండడం గమనార్హం.ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బిగ్ విక్టరీ, వైఎస్ జగన్ అగెయిన్, ఏపీ ఎన్నికల ఫలితాలు, పిఠాపురంలో పవన్ భవితవ్యం ఏంటి?, ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?, కూటమికి వచ్చే సీట్లు ఎన్ని? టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈసారైనా గెలుస్తారా?.. ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.ఎన్డీయే-ఇండియా కూటమి గెలుపోటములు, ఒడిషా ఫలితం, దేశవ్యాప్తంగా పాతిక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. కేవలం ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ ఆ ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది. -
కట్టుదిట్టంగా ఏపీ కౌంటింగ్ డే (ఫొటోలు)
-
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
AP Election 2024 Counting And Results Updates03:43 PM, June 4th, 2024పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపుఅధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది02:43 PM, June 4th, 2024పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్02:41 PM, June 4th, 2024అన్నమయ్య జిల్లా:రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్రెడ్డిశ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 5989502:40 PM, June 4th, 2024కడప పార్లమెంట్వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజ.63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్వైఎస్ అవినాష్ రెడ్డి: 500912టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694వైఎస్ షర్మిలా రెడ్డి: 11871202:40 PM, June 4th, 2024ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిరాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డివైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 8128602:26 PM, June 4th, 2024పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజచిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి6623 ఓట్ల లీడింగ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ 01:50 PM, June 4th, 2024ముందంజలో అవినాష్‌రెడ్డి కడప: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ముందంజ01:05 PM, June 4th, 2024రాజంపేటలో వైఎస్సార్సీపీ ముందంజరాజంపేటలో వైఎస్సార్సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజకదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్సీపీ లీడ్12:21 PM, June 4th, 2024పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్పుంగనూరు: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్యవేడులో వైఎస్సార్సీపీ ఆధిక్యంవైఎస్సార్సీపీ-23497బీజేపీ-16,60311:15 AM, June 4th, 2024పాలకొండలో వైఎస్సార్సీ ముందంజగుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధిక్యతగుంతకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డినరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం10:54 AM, June 4th, 2024దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికివైఎస్సార్సీపీ-22965టీడీపీ-20921పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5110టీడీపీ-12309టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5478టీడీపీ-6263ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)వైఎస్సార్సీపీ-13805టీడీపీ -1786410:31 AM, June 4th, 2024తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తిగూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మూడో రౌండ్లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంవైఎస్సార్సీపీ-12,687బీజేపీ-11091నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం9:52 AM, June 4th, 2024వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ9:24 AM, June 4th, 2024అనపర్తి, తిరువూరులో వైఎస్సార్సీపీ లీడ్హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యంపుట్టపర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంసర్వేపల్లిలో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధిక్యందర్శిలో వైఎస్సార్సీపీ ముందంజఅరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్9:20 AM, June 4th, 2024పాలకొల్లులో టీడీపీ ముందంజఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యంభీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యంతణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యంతాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం9:15 AM, June 4th, 2024విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలుసర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లుమరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం9:13 AM, June 4th, 2024పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజతిరువూరులో వైఎస్సార్సీపీ ముందంజఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యం9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యంఅవినాష్రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లుపోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్‌లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలుపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్ సెంటర్లో పినిపే విశ్వరూప్అమలాపురంలో కౌంటింగ్ సెంటర్‌కి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్‌కు ఏఆర్ఓ,ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్‌లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్‌వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులుకౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది. -
బిగ్ డే.. కౌంటింగ్‌కు వైఎస్ఆర్సీపీ ‘సిద్ధం’
సాధారణ ఎన్నికల ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టీడీపీతో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేసింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ప్రావీణ్యం సాధించిన టీడీపీ ఎటువంటి అక్రమాలకైనా తెగిస్తుందని హెచ్చరించారు. విజయం పట్ల ఎంత ధీమాగా ఉన్నా ప్రత్యర్థుల విషయంలో అజాగ్రత్తగా ఉండరాదనే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కౌంటింగ్‌కు సిద్ధం అవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అధికార వైఎస్ఆర్సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గడచిన ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమకు మరోసారి అధికారాన్ని అందిస్తాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌లకు సునామీలా ఉవ్వెత్తున వచ్చిన మహిళలే ఇందుకు నిదర్శనమంటున్నారు.రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్ళలో ఏపీలో జరిగినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదని వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తోంది. అందుకే ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం కనిపిస్తోందని చెబుతున్నారు.రాష్ట్రంలో నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 81.86 శాతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది గత ఎన్నికల కంటే 2 శాతం ఎక్కువ. సహజంగా పోలింగ్ భారీగా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వెల్లువలా వచ్చారని భావించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో అనేక అనుభవాలు చూసినా..తాజా ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూసినా..ఇది ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందాయి. ప్రతి కుటుంబం లక్షలాది రూపాయల లబ్ధి పొందింది. వారంతా వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి రావాలనే కోరుకున్నారు. పైగా పేదలకు సంక్షేమం ఇచ్చే విషయంలో, గడచిన మూడు నెలల్లో పెన్షన్ విషయంలో వృద్ధులను చంద్రబాబు టీమ్ పెట్టిన కష్టాలు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఎన్నికల్లో తమ ఓటమి ఖాయం అని ఖరారు చేసుకున్న పచ్చ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవస్థను మేనేజ్ చేయవచ్చనే దురాలోచనతోనే నానా తిప్పలు పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగానే ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికల్లో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున కూడా అక్రమాలకు తెగబడతారనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా అసలైన ఫలితాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ శ్రేణులకు సూచించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
వైఎస్ఆర్సీపీదే గెలుపు: స్వామి పరిపూర్ణానంద
సాక్షి,సత్యసాయిజిల్లా: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు.వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందన్నారు. నిబద్ధత గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు. -
AP: ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ ప్రారంభం
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం చేసినట్లు ఇప్పటికే సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ , ఉదయం 8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల ఓట్లు పోల్ ఫెసిలిటేషన్ సెంటర్ లలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్‌లుు పోల్ 26,721 సర్వీస్ ఓట్లు భీమిలి, పాణ్యంలో గరిష్టంగా 26 రౌండ్ల కౌంటింగ్కొవ్వూరు, నరసాపురంలో 13 రౌండ్లు మాత్రమే కౌంటింగ్అయిదు గంటల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలురాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులోక్ సభ ఓట్ల లెక్కింపునకు 2,443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటులోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 443 టేబుళ్లు ఏర్పాటుఅసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లుఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల కు అనుమతిమూడంచెల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుఈవీఎంల వద్ద కేంద్ర పారా మిలటరీ బలగాల మోహరింపురెండో దశలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులుకౌంటింగ్ కేంద్రం బయట లా అండ్ ఆర్డర్ పోలీసులుతుది ఫలితం రాత్రి 10 గంటల తర్వాత వెలువడే అవకాశంగెలుపొందిన వారు ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదు -
చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు: సజ్జల
గుంటూరు, సాక్షి: దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నాం వైఎస్సార్సీపీ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దని చెప్పాం’’ అని సజ్జల మీడియాకు వివరించారు.సజ్జల ఇంకా మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల అన్నారు.కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోందిపార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాంఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పాం.10:30 గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం.పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా?ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలను తామే ఉల్లంఘించటమేంటి?దేశం అంతా ఒక రూల్, ఏపిలో ఒక రూల్ ఎంటి?పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు తీసుకు రావడం ఎంటి?ఏపీలో ఒక్క చోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై ప్రత్యేక వెసులు బాటు ఇవ్వడం ఏంటి.?ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు.వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదుఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు.నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు.చంద్రబాబుకు ఉన్న స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయట పెట్టుకున్నారు.బీజేపీ జాతీయ వ్యూహాలను ఎపిలో అమలు చేయాలని చూస్తోందివైసిపి బలమైన పార్టీ ఎవర్నీ రెచ్చగొట్టల్సిన అవసరం లేదు.ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతా యుతంగా ఉన్నాం.సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు.హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యింది.21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వస్తుంది?నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు.పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.నార్తులో బీజేపీ పోతుంది.అందుకే సౌత్‌లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది..సౌత్ లో సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నారు.మేము జనంతో ఉన్నాం జనం మాతో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం.ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా.?చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు. -
టీడీపీ నేతల కోసం డ్యూటీనా?
ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లకు టీడీపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారా..? అనుకూల ఫలితాలు రాకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర చేస్తున్నారా..? అందులో భాగంగానే తమకు చెంచాగిరీ చేసే ఖాకీలకు బందోబస్తు విధులు కేటాయించేలా పథకం రచించారా..? కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతోందో క్షణ క్షణం తమకు సమాచారం అందించేలా ప్రణాళిక రూపొందించారా..? పచ్చమూకను పురిగొల్పేందుకు కన్నింగ్ ఖాకీల సహకారం తీసుకోనున్నారా..? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. కౌంటింగ్ నాడు గొడవలు చేసేందుకు టీడీపీ నాయకులు ఏకంగా కొందరు వివాదాస్పద పోలీసులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.ప్లాన్–1కౌంటింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా కొందరు పోలీసులు వ్యవహరించేవిధంగా ప్రణాళిక రచించినట్టు సమాచారం. ఓట్ల లెక్కింపులో కావాలనే కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కౌంట్లోకి వేసే ప్రయత్నం చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ ఏజెంట్లు గ్రహించి అభ్యంతరం వ్యక్తం చేసేలోపే అందుకోసమే అక్కడ ఎదురు చూస్తున్న పోలీసులు, కౌంటింగ్ అధికారులు కొందరు సంబంధిత ఏజెంట్లను, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను వెలుపలకు పంపేందుకు కుట్రపన్నుతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్లాన్–2ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపేందుకు వీలుకాని పక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూటమి అభ్యర్థులకు అనుకూలంగా వేసేందుకు కొందరు పోలీసులు, అధికారులు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్టు సమాచారం. ఎన్నికల కమిషన్ నిబంధనలు, వాస్తవ నిబంధనలను భేరీజు వేసుకుని ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయనున్న నేపథ్యంలో కౌంటింగ్ చివరి నిమిషంలో కూటమి అభ్యర్థుల విజయానికి అవసరమైన ఓట్లను వారి ఖాతాల్లో వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అధికారులు కొందరు కూటమి అభ్యర్థుల ఆమ్యామ్యాలకు లొంగి వారికి అనుకూలంగా మెజారిటీకి అవసరమైన కొన్ని ఓట్లను వారికి కలిపేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.సాక్షి, టాస్‌్కఫోర్స్ : మరో 24 గంటల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంకానుంది. జిల్లా యంత్రాంగం ఇందు కోసం పక్కాగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. అయితే ఈనెల 4వ తేదీ ఓట్ల లెక్కింపు రోజున ఖాకీ దుస్తులు వేసుకున్న కొందరు అధికారులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా అరాచకం సృష్టించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. అనుకున్న ఫలితాలు రాకుంటే ఓట్ల లెక్కింపు కేంద్రంలో గలాటాలు చేయడానికి సహకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు కౌంటింగ్ సెంటర్లో జరిగే పరిణామాలను పచ్చ పార్టీ నేతలకు చేరవేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఓట్ల లెక్కింపు కేంద్ర వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికే పచ్చ పార్టీ నాయకులు ఏకంగా కొందరు ఖాకీలను ఎంపిక చేసుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించకుంటే తీవ్ర పరిణామాలకు కొందరు ఖాకీలే మూలకేంద్రంగా మారనున్నారనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ గొడవల్లో ప్రమేయం పోలింగ్ రోజు, తదనంతరం జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, పరిణామాలు తెలియనివి కావు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నాయకులే లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులు చేసి, కొందరిని మట్టుబెట్టాలని భారీ ప్రణాళికలు వేశారు. నడిరోడ్డుపైనే రౌడీయిజం చెలాయించి తిరుపతి వాసులను భయభ్రాంతులకు గురిచేశారు. తీరా ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించడంతో భయపడిన పచ్చ పార్టీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మొత్తం వివాదంలో కొందరు పోలీసు అధికారుల ప్రత్యక్ష ప్రమేయం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నా ఇప్పటికీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు టీడీపీ నేతలను వైఎస్సార్సీపీ నాయకులపైకి ఉసిగొలిపి దాడులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది కొందరు పోలీసు అధికారులేనని బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టి, కవి్వంపు చర్యలకు పాల్పడి.. ఆపై దాడులు చేసేలా పథకం వేసినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేతల స్వీయ రక్షణలో జరిగిన చిన్నపాటి గొడవను భూతద్దంలో చూపించి, ప్రజలను భయకంపితులు చేయాలని కొందరు పోలీసులే పక్కా ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఈ కుట్రలో పలువురు సీఐలు, ఎస్ఐల నుంచి కింది స్థాయి కానిస్టేబుళ్ల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కాగా స్కెచ్! ఎన్నికల వేళ గొడవలు చేసేందుకు తిరుపతి నగరానికి చెందిన ఓ మొబైల్ దుకాణం యజమాని.. కొందరు పోలీసు అధికారులు కలిసి జట్టుగా ప్రణాళిక రూపొందించినట్లు వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టి, ఎవరూ చూడకుండా దాడులు చేయాలని ఆ మొబైల్ దుకాణంలో స్కెచ్ వేసినట్లు వెల్లడిస్తున్నారు.. ఇందు కోసం పలువురు సీఐలు, ఎస్‌లకు వాట్సాప్ కాల్స్ చేసి వాళ్ల సహాయం కూడా తీసుకున్నారని చెబుతున్నారు. పోలింగ్ జరిగిన రోజున, తర్వాత ఈ కుట్రలో భాగస్వాములైన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు మొబైల్ దుకాణం యజమానితో టచ్‌లో ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. వీళ్ల సూచనలతోనే కేవలం టీడీపీ నాయకులపై జరిగిన దాడులను ఎల్రక్టానిక్ పరికరాలతో రికార్డు చేసేలా ఓ పన్నాగం పన్నినట్లు తెలిసింది. పైగా వైఎస్సార్సీపీ నాయకుల వద్ద అంగరక్షకులుగా ఎవరెవరు ఉన్నారు..? షిప్టులో ఎవరు మారుతున్నారు..? లాంటి వివరాలు సేకరించి కూటమి నేతలకు ఉప్పందించినట్లు సమాచారం. కచ్చితంగా అధికారంలోకి వస్తామని, వచ్చిన వెంటనే తమకు అండగా నిలిచిన అధికారులను అందలం ఎక్కిస్తామని కూటమి నేతలు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.పొంచి ఉన్న ముప్పు! ఈ మొత్తం గొడవల్లో ప్రధానంగా కొందరు పోలీసు అధికారుల పేర్లు వినిపిస్తోంది. తిరుపతి క్రైమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, స్పెషల్ బ్రాంచ్ వెస్ట్ పరిధిలో పనిచేస్తున్న ఓ అధికారి, స్పెషల్ బ్రాంచ్ అలిపిరి పరిధిలో పనిచేస్తున్న ఓ ఉన్నతోద్యోగి, తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కీలక అధికారి, ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లోని చిన్నస్థాయి సిబ్బంది. వెస్ట్ స్టేషన్ ఉన్నతాధికారి, అలిపిరి స్టేషన్లో పనిచేసి సస్పెండ్ అయిన ఓ ఉన్నతోద్యోగి. ఈస్ట్ పోలీస్ స్టేషన్ చిరుద్యోగి, తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ నుంచి వీఆర్ కెళ్లిన ఓ ఉన్నతాధికారికి కూటమి అభ్యర్థులతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు సాక్ష్యాలను సైతం సేకరించారు. వీరికి కౌంటింగ్ కేంద్రంలో విధులు వేస్తే.. ఎంతకైనా తెగిస్తారని వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ముందస్తుగా పొంచి ఉన్న ముప్పును పసిగట్టాలని అభ్యరి్థస్తున్నారు. కన్నింగ్ ఖాకీలకు కౌంటింగ్ విధులు కేటాయించొద్దంటూ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. -
ఏపీ జడ్జిమెంట్ డే.. కూటమిలో గుబులు
సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్సీపీ.. లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైగా మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన.. తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు YSRCP కీలక నేతలు.ఎలక్షన్ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్‌లో పలు చోట్ల రిగ్గింగ్ జరగడం, ఈసీ.. పోలీసులు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ తరఫున ఏజెంట్లగా నియమించినవారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏంచేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: లెక్క ఏదైనా.. 'ఫ్యాన్' పక్కాఇంకోవైపు.. వైఎస్సార్సీపీకే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు.సామాన్య వర్గాల్లో ఉత్కంఠేబరిలో నిలిచివారు, అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు.. సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు తమదే అయినా.. ఓటర్ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి ఈసారి లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్‌కు ఇరువైపులా రెండు కి.మీ. రెడ్ జోన్‌గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్ ఎన్‌లైజర్‌తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు.కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి. కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలు లేదు.మరోవైపు.. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడానికి వీల్లేదు. అలాగే.. పోలింగ్ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్నిచోట్ల అనుమతుల్లేవని పోలీసులుస్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?.. రేపు ఉదయం 6గం. నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీ సాక్షిలో.. -
ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన
కృష్ణా, సాక్షి: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. 👉ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండిఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబసమేతంగా ఆయన పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. -
జగన్.. సీబీఎన్.. పవన్.. ఆ ఉత్కంఠ తప్పదా?
ఆంధ్రప్రదేశ్‌కి జూన్ 4వ తేదీ అంత్యంత కీలకం. ప్రజా తీర్పు వెలువడే రోజు అది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించింది. కౌంటింగ్ ప్రక్రియ సరళి ఎలా ఉండనుందో ఒక స్పష్టత కూడా ఇచ్చింది. అయితే ప్రధాన పార్టీల గెలుపొటముల మీదే కాదు.. మూడు ప్రధాన పార్టీల అధినేతలకు ఎలాంటి ఫలితాలు దక్కనున్నాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కౌంటింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్‌బ్యాలెట్ కౌంటింగ్ ముగిశాకే.. ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. ఒక్కొక్క రౌండ్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ఈవీఎం కౌంటింగ్ పూర్తయ్యాక.. ఓటర్ స్లిప్(మొరాయించిన ఈవీఎంలలోని స్లిప్‌లను) ఆఖరిగా లెక్కిస్తారు. ఆ తర్వాతే ఫలితాన్ని ప్రకటిస్తారు. మరి ఫస్ట్ ఫలితం ఎక్కడి నుంచి రానుందంటే.. 175 స్థానాలకు పోటీ పడ్డ అభ్యర్థుల్లో కొందరి భవితవ్యం కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే తెలిసిపోతుంది. కానీ, కొన్ని చోట్ల మాత్రం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే.. ఏపీ ఎన్నికల తొలి ఫలితం గోదావరి జిల్లాల నుంచే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంగానీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంగానీ తొలి ఫలితం అందించనుంది. కారణం ఆ రెండు చోట్ల కేవలం 13 రౌండ్లలోనే ఫలితం వచ్చేస్తుంది కాబట్టి. ఈ రెండు సెగ్మెంట్లలో నరసాపురంలో 1,43,825 ఓట్లు, కొవ్వూరులో 1,58,176 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాబట్టి.. మధ్యాహ్నాం లోపే ఈ రెండు నియోజకవర్గ తుది ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లోని ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలు కూడా ఇంచుమించుగా త్వరగానే ఫలితాలు వచ్చేయొచ్చు. ఈ రెండు నియోజకవర్గాలలో 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆచంటలో 1,49,048 ఓట్లు, పాలకొల్లులో 1,60,489 ఓట్లు పోలయ్యాయి.👉ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం కోసం సాయంత్రం దాకా ఆగాల్సిందే. ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాబట్టి, టైం పడుతుంది. పులివెందులలో ఈ ఎన్నికలకుగానూ 1,86,833 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 91,484 మంది ఓట్లు వేస్తే 95,339 మంది మహిళలు ఓట్లు వేసారు. గత రెండు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైఎస్ జగన్‌ను పులివెందుల ప్రజలు గెలిపించారు. 2014లో 75,243 వేల మెజారిటీ, 2019లో 90,110 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 👉టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గ ఫలితం మరోలా రాబోతోందా? అనే చర్చ ఏపీ రాజకీయ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది. అయితే కుప్పంలో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది. ఇక్కడ 2,02,920 ఓట్ల పోలవ్వడంతో సాయంత్రంలోపు ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. కుప్పంలో చంద్రబాబు వరుసగా ఏడుసార్లు గెలుపొందారు. కుప్పాన్ని తన ఇలాకాగా ప్రకటించుకున్న ఆయన.. 2014 ఎన్నికల్లో 47 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. 20189 ఎన్నికల నాటికి ఆ మెజారిటీ 30వేలకు పడిపోయింది. 👉పిఠాపురంలో 2,04,811 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ ఫలితాలు దాదాపుగా మద్యాహ్నం 2 గంటల తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో ఈ స్థానం గురించి ప్రత్యేక చర్చ నడుస్తోంది. గోదావరి జిల్లాల నుంచే మరికొన్ని నియోజకవర్గాల ఫలితాలు త్వరగా వెల్లడి కానున్నాయి. పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఫలితాలు కూడా త్వరగానే వెలువడే ఛాన్స్ ఉంది. ఈ నాలుగు చోట్ల 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక పోలవరం మినహా మిగిలిన 15 నియోజకవర్గాలు కూడా 20 రౌండ్ల లోపు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తంగా.. గోదావరి జిల్లాల తుది ఫలితాలపై మధ్యాహ్నానికి స్పష్టత రానుంది. 👉కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం ఫలితాలు కూడా త్వరగానే రాబోతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో కూడా 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 👉అయితే.. అన్నింటికంటే చిట్టచివరగా అల్లూరి జిల్లా రంపచోడవరం , తిరుపతి చంద్రగిరి ఫలితాలు రాబోతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో దాదాపు 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో పూర్తి స్ధాయి ఫలితాలు రావడానికి రాత్రి సమయం పట్టే అవకాశం ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో 2,08,025 ఓట్లు పోలవ్వగా...చంద్రగిరి నియోజకవర్గంలో 2,51,788 ఓట్లు పోలయ్యాయి. అలాగే నంద్యాల/కర్నూలు పాణ్యం, విశాఖ భీమిలి నియోజకవర్గాలలో కూడా ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశాలే ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో కూడా 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలో 2,75,747 ఓట్లు పోలయ్యాయి. పాణ్యం నియోజకవర్గంలో 2,46,935 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు నియోజకవర్గాలలో లెక్కించాల్సిన ఓట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో ఫలితాలు చిట్టచివరినే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.👉.. మొత్తంగా 175 నియోజకవర్గాలకు గాను అత్యధికంగా 111 నియోజకవర్గాలలో 20 కంటే తక్కువ రౌండ్ల లోనే లెక్కింపు చేయబోతున్నారు. ఆ కౌంటింగ్ మధ్యాహ్నాం 2గం. లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా, ఆయా జిల్లాల కలెక్టర్లని ఆదేశించారు. 👉మరో 60 నియోజకవర్గాలలో 21 నుంచి 24 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగబోతొంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోపు ప్రకటించొచ్చు. 👉ముందుగా ఫలితాలను సువిధ యాప్ లో అప్ లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి, 21-ఈ ను అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారులు పంపించాల్సి ఉంటుంది. -
జూన్ 4 జడ్జిమెంట్ డే: తొలి, చివరి ఫలితాలపై క్లారిటీ ఇదిగో
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా.. ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం పట్టనుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాతే ఈవీఎంల లెక్కింపు ప్రారంభంకానుంది. 11 గంటల కల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలుండగా.. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై ఓ అంచనాకి వచ్చేయొచ్చు. తొలి ఫలితం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక అల్లూరి జిల్లా రంపచొడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు మాత్రం ఆలస్యంగా వెలువడనున్నాయి. ఈ రెండు చోట్లా 29 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరపనున్నారు. మరోవైపు.. భీమిలి(విశాఖ), పాణ్యం(నంద్యాల) ఫలితాల కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు(మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్ చీటీలు) పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. -
ఈసీ డబుల్ గేమ్!
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఎన్నికల సంఘం డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు గురువారం తెలిపింది. ఈ మెమోలపై వైఎస్సార్సీపీ కోర్టుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులే రాజకీయ దుమారం రేపాయి.ఏపీ సీఈవో ఇచ్చిన మెమో సారాంశం..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలి. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు!. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.వైఎస్సార్సీపీ అభ్యంతరాలు ఏంటంటే..పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా ఈనెల 25న ఓ మెమో, 27న మరో మెమో జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ వాటిల్లో పేర్కొన్నారాయన. అయితే ఈ మెమో పై వైఎఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది కూడా.డబుల్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘంఈలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ ఇవాళ స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికలసంఘానికి ఏం చెప్పిందంటే.. ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారు. అయితే ఈ లోపు కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈసీ డబుల్ గేమ్‌తో.. జూన్ 4వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎలా జగరనుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే వైఎస్సార్సీపీ పిటిషన్‌పై కోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. కోర్టు గనుక తీర్పు ఇస్తే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.‘‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం’’:::ఏపీ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీని సైతం కలిసినా..అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ అంటోంది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా ఉండేలా నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో మీనా జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఏపీ సీఈవోకు అనుకూలంగా సీఈసీ వ్యవహరిస్తూనే.. మరోవైపు ఆ వివాదాస్పద జీవో వెనక్కి తీసుకోవడం గమనార్హం.