
సాక్షి,సత్యసాయిజిల్లా: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు.
వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరబోతోందన్నారు.
నిబద్ధత గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్‌సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్‌జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు.