సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం చేసినట్లు ఇప్పటికే సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది
రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ , ఉదయం 8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల ఓట్లు పోల్
ఫెసిలిటేషన్ సెంటర్ లలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్‌లుు పోల్
26,721 సర్వీస్ ఓట్లు
భీమిలి, పాణ్యంలో గరిష్టంగా 26 రౌండ్ల కౌంటింగ్
కొవ్వూరు, నరసాపురంలో 13 రౌండ్లు మాత్రమే కౌంటింగ్
అయిదు గంటల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
రాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
లోక్ సభ ఓట్ల లెక్కింపునకు 2,443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు
లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 443 టేబుళ్లు ఏర్పాటు
అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు
ఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల కు అనుమతి
మూడంచెల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు
ఈవీఎంల వద్ద కేంద్ర పారా మిలటరీ బలగాల మోహరింపు
రెండో దశలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు
కౌంటింగ్ కేంద్రం బయట లా అండ్ ఆర్డర్ పోలీసులు
తుది ఫలితం రాత్రి 10 గంటల తర్వాత వెలువడే అవకాశం
గెలుపొందిన వారు ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదు
Comments
Please login to add a commentAdd a comment