swamy paripurnananda
-
వైఎస్ఆర్సీపీదే గెలుపు: స్వామి పరిపూర్ణానంద
సాక్షి,సత్యసాయిజిల్లా: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు.వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందన్నారు. నిబద్ధత గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు. -
బీజేపీని గెలిపిస్తే సిర్పూర్‌కు సిరి!
సాక్షి, కాగజ్‌నగర్ : సిర్పూర్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందని, నిలదీస్తే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉదయం శిశుమందిర్ పాఠశాల ఆవరణ గ్రౌండ్లో హెలిక్యాప్టర్‌లో దిగిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాజీవ్‌గాంధీ చౌక్‌కు చేరుకొని క్రీడామైదానానికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ 2014లో సిర్పూర్ నియోజకవర్గానికి దరిద్రం పట్టుకుందని, దాని నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఆరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పత్రికలు నిజాలు రాసే స్వేచ్ఛ కూడా లేదని విమర్శించారు. ఇక నుంచి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కాషాయం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓటుకు రూ.5వేలతో కొనుక్కుంటామని ధీమాతో ఉన్నారని, డబ్బులు తీసుకొని విద్యావంతుడు, వైద్యుడు అయిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇప్పటికీ కుటుంబ పాలన కొనసాగుతుందని, టీఆర్ఎస్, మహాకూటమి కాంగ్రెస్‌ను ఓడించాలని కోరారు. బీజేపీని గెలిపిస్తే సిర్పూర్‌కు సిరి వస్తుందన్నారు. గంతంలో గుంతలు తవ్వి ప్రజా ధనాన్ని కాంగ్రెస్ దోచుకుంటే, ప్రస్తుతం ప్రాజెక్టును తుమ్డిహెట్టి నుంచి కమిషన్ల కోసం కాళేశ్వరానికి తరలించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, జిల్లాలోని బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అమూల్యమైన ఓటువేసి గెలిపిస్తే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు, ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం అభ్యర్థి ఆత్మరాం మాట్లాడుతూ మన సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఇతరుల సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సతీష్, మురళి, అంజనేయులు, కొంగ సత్యనారాయణ, విశాల్, శరత్‌శర్మ, తిరుపతి, జిలకర పోచం, నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు... -
‘యావత్ హిందూ సమాజంపై దాడి’
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానందను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆరునెలల వరకు నగరంలోకి ప్రవేశించకూడదని నగర పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు బుధవారం ట్వీటర్లో స్పందించారు. నిజాం మత రాజకీయాలకు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన నిదర్శనమని ధ్వజమెత్తారు. పరిపూర్ణానంద బహిష్కరణ మానవహక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. ఇది యూవత్ హిందూ సమాజంపై దాడి అని, ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పెద్దపీఠ వేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఎమ్ఐఎమ్ నేతలను బహిష్కరించాలి పరిపూర్ణానంద నగర బహిష్కరణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. కోట్లాది ప్రజలు ఆరాధించే శ్రీరాముడిని నిందించిన వారిపై చర్యలేవని, ఈ ప్రభుత్వం ఎవరి చేతిలో నడుస్తోందని ప్రశ్నించారు. ఆయన నగర బహిష్కరణ ప్రభుత్వ కుట్రని అన్నారు. హిందూ దేవుళ్లను తూలనాడిన ఎమ్ఐఎమ్ నేతలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వామిజీని బహిష్కరణ చేయడమంటే హిందూవులను బహిష్కరణ చేయడమే అని మండిపడ్డారు. పరిపూర్ణానందపై చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆయపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీజేపీ ధర్నా పరిపర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో బీజేపీ ధర్నా చేపట్టింది. స్వామిపై వేసిన బహిష్కరణను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు -
హిందూ ఆలయాలపైనే పెత్తనమెందుకు ?
సాక్షి, కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తున్నారని, మజీదులు, చర్చిల జోలికి వారు ఎందుకు పోవడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రభుత్వాలను ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌జిల్లా కొల్లాపూర్‌లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడారు. హిందువుల గుడులు రాజకీయాలకు వేదికలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చిలు, మజీదులపై లేని పెత్తనం హిందూ దేవాలయాలపైనే ఎందుకన్నారు. ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని, పాలకవర్గాల వైఖరి కారణంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మా దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ లెటర్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. బంగారు తెలంగాణ సాధించాలంటే 80 ఏళ్లు దాటిన వారికి సాధ్యం కాదని, యువతే దానికి కారకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మాది అని భావించి స్వార్థం లేకుండా ముందుకు సాగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహానా మేధావులు భారతీయ సంస్కతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారినుంచి మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీఎస్ రెడ్కో ఎండీ.సుధాకర్‌రావు, సురభి రాజు బాలాదిత్య లక్ష్మారావులు కూడా ప్రసంగించారు. -
భారత సైనికుల పాత్ర అభినందనీయం
కాకినాడ రూరల్: పాకిస్థాన్ అనుసరిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడంలో అద్భుత ప్రతిభను కనబరచిన భారత సైని కుల పాత్ర అభినందనీయమని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద సరస్వతి స్వామి అన్నారు. ఆయన శుక్రవారం రమణయ్యపేటలోని శ్రీపీఠంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత సైనికుల సంక్షేమం కోసం దసరా ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తామన్నారు. నాలుగు నెలలపాటు తాను అమెరికాలో పర్యటించినట్టు ఆయన తెలిపారు. అమెరికన్లు భారత్‌లో పండుతున్న పసుపుతో చేసిన మాత్రలు వాడి వారి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారన్నారు. అయితే మన దేశంలో అమెరికా ప్రవేశపెడుతున్న బర్గర్లు, పిజ్జాలు వంటివి తిని, వారి మందులను వాడి ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారన్నారు. శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కోటికుంకుమార్చన నిర్వహిస్తున్నామన్నారు. శ్రీపీఠం ఆధ్వర్యంలో ఏడు ఎకరాల్లో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేసి దేశవాళీ ఆవులను పెంచుతామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకు ఒక ఆవు, దూడను అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దేశంలో 32 రకాల జాతులకు చెందిన ఆవులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 13కి పడిపోయిందన్నారు. ఆవు జాతులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.