అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఎంపీ గురుమూర్తి విజయం
వైఎస్సార్‌సీపీ గెలుపును జీరి్ణంచుకోలేకపోతున్న కూటమి నేతలు
ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థికి మెజారిటీ
తలకిందలైన కూటమి అంచనాలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి విజయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలన్నీ కూటమి అభ్యర్థులకే అనుకూలంగా వస్తుండడంతో తిరుపతి పార్లమెంట్ కూడా బీజేపీ అభ్యర్థే గెలుస్తారని ధీమాగా అనుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి చేసిన కృషిని, ఆయన మంచితనంపై అసత్యాలు, అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఓటర్లు మద్దెల గురుమూర్తికే పట్టం కట్టారు.
ఊహించని విధంగా తిరుపతి ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కూటమి నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలవ్వగా వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గొప్ప గెలుపు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘క్రాస్’ చేయాలని చూసి బోల్తా పడిన కూటమి..
తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి అనుకూలంగా భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టం అవుతోంది. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఎంపీ కావడంతో నియోజకవర్గానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనతో పని చేశారనేది గురుమూర్తికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కూటమి ఎంపీ అభ్యర్థి చేసిన దు్రష్పచారాలు ఫలించలేదు. క్రాస్ ఓటింగ్ చేయించి గట్టెక్కాలని భావించారు. కానీ గురుమూర్తి మంచితనం, కృషి ముందు కూటమి కుట్రలు ఏవీ పనిచేయలేదు.
అదెలా అంటారా?
తిరుపతి లోక్‌సభ పరిధిలోని తిరుపతిలో 60,255 ఓట్లు, శ్రీకాళహస్తిలో 41,979, సూళ్లూరుపేటలో 28,362, వెంకటగిరిలో 15,454, గూడూరులో 19,915, సర్వేపల్లిలో 15,994 ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఈ మెజారిటీలను చూస్తే కూటమి అభ్యర్థే ఘనవిజయం సాధించాలి. కానీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వచ్చేసరికి ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గుచూపారు. సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతో పాటు కూటమి అభిమానులు తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యరి్థని గెలిపించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులంతా గెలిచి, ఎంపీ అభ్యర్థి ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు.
తిరుపతి జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి గత మూడేళ్లుగా అనేక ప్రయత్నాలు చేశారు. కంపెనీల చుట్టూ తిరుగుతూ వారిని జిల్లావ్యాప్తంగా తిప్పి కంపెనీలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన వసతులు అన్ని తామే సమకూర్చగలమని విన్నవించారు. తద్వారా ప్రజల్లో గురుమూర్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నిస్వార్థంగా ప్రజలకు ఎంతో కొంతమేలు చేయాలనే తత్వం, ఆ కష్టానికి ప్రజల ఆశీర్వాదం మళ్లీ లభించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు చాలామంది ఓడిపోయినా గురుమూర్తి గెలిచారంటే అది ఆయన కష్టాలకు తగిన ఫలితమే అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎంపీగా గురుమూర్తి అధికారాన్ని పదిమందికి సాయం చేయడంతో పాటు కార్యకర్తలకు, ఓటర్లకు దగ్గర కావడమే ఆయనకు విజయానికి కారణమని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కలిసొచ్చిన అంశాలు ఇవే..
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2021 ఉప ఎన్నికల్లో గురుమూర్తి తొలిసారి రాజకీయ ప్రవేశం చేసి తిరుపతి ఎంపీగా 6,2 6,108 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యరి్థ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2,71,592 లక్షల మెజారీ్టతో గెలుపొందారు.
👉 ఎంపీగా గత మూడేళ్ల కాలంలో స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సహకారంతో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి విశేష కృషి చేశారు.
👉 గత మూడేళ్లలో ఎంపీగా గురుమూర్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
👉 తిరుపతి పరిధిలో కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, పులికాట్ సరస్సు పరిధిలోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలు సడలించాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సహకారంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వందలాది గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య పరిష్కారానికి అధికారిక ప్రక్రియ ప్రారంభింపజేశారు.
👉 అలాగే 16 వేల కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఆరోగ్య సంరక్షణకు వెల్‌నెస్ సెంటర్ తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు.
👉 వేలాదిమంది యువతకు ఇంజినీరింగ్ నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వ నైలెట్ సంస్థ తిరుపతికి మంజూరు చేయించారు.
👉 స్విమ్స్, డీఆర్డీఓ అనుబంధ సంస్థ డేబెల్‌తో తక్కువ ఖరీదుకే రోగులకు మెడికల్ ఇంప్లాంట్స్ తయారు చేసే ప్రాజెక్టు తీసుకొచ్చారు.
👉 రైల్వే ప్రాజెక్టుల పురోగతిలో తనదైన ముద్ర వేశారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.350 కోట్లతో ప్రాజెక్టు పనుల వేగం పెంచారు.
👉 తిరుపతి ప్రజలకు నరకంగా ఉన్న రాయలచెరువు రైల్వే గేటును తొలగించి అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయించారు.
👉 ఏర్పేడు, వెంకటగిరి రైల్వే ఫ్లైఓవర్లు మంజూరు చేయించారు.
👉 తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 లక్షలు నిధులు ఇచ్చారు.
👉 యూనివర్సిటీ రోడ్డులో ఉన్న రైల్వే డీఐకాన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు.
👉 వెంకటగిరి కేంద్రీయ విద్యాలయాలన్ని ఇంటరీ్మడియెట్ స్థాయికి పెంచి విద్యార్థులు అక్కడే చదువుకునేలా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment