తిరుపతి ఉపఎన్నిక: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆయనే | YSRCP Announces Their Candidate For Tirupati LS Byelection | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉపఎన్నిక: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆయనే

Published Tue, Mar 16 2021 7:14 PM | Last Updated on Tue, Mar 16 2021 7:47 PM

YSRCP Announces Their Candidate For Tirupati LS Byelection - Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్‌ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా వైఎస్సార్‌ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చి 23న నోటిషికేషన్‌ విడుదల, ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు వెల్లడించనున్నట్లు మంగళవారం తెలిపింది. తిరుపతితో పాటు తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు కూడా నేడే షెడ్యూల్‌ విడుదలైంది.

చదవండి: తిరుపతి ఉప ఎన్నికలో 3 లక్షల మెజార్టీ సాధిస్తాం

తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement