టీడీపీ నేతల కోసం డ్యూటీనా? | Chittoor Police Over Action Supported TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు మద్దతుగా కౌంటింగ్‌ డ్యూటీనా?

Published Mon, Jun 3 2024 11:33 AM | Last Updated on Mon, Jun 3 2024 3:08 PM

Chittoor Police Over Action Supported TDP Leaders

నిత్యం కూటమి అభ్యర్థులతో టచ్‌లో ఉన్న కొందరు ‘పచ్చ’ పోలీసులు 

ఓట్ల లెక్కింపు కేంద్రంలో వీరి వల్లే గొడవలకు ఆస్కారం? 

ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకే కౌంటింగ్‌ డ్యూటీ?

ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లకు టీడీపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారా..? అనుకూల ఫలితాలు రాకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర చేస్తున్నారా..? అందులో భాగంగానే తమకు చెంచాగిరీ చేసే ఖాకీలకు బందోబస్తు విధులు కేటాయించేలా పథకం రచించారా..? కౌంటింగ్‌ కేంద్రంలో ఏం జరుగుతోందో క్షణ క్షణం తమకు సమాచారం అందించేలా ప్రణాళిక రూపొందించారా..? పచ్చమూకను పురిగొల్పేందుకు కన్నింగ్‌ ఖాకీల సహకారం తీసుకోనున్నారా..? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. కౌంటింగ్‌ నాడు గొడవలు చేసేందుకు టీడీపీ నాయకులు ఏకంగా కొందరు వివాదాస్పద పోలీసులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్లాన్‌–1
కౌంటింగ్‌ కేంద్రంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా కొందరు పోలీసులు వ్యవహరించేవిధంగా ప్రణాళిక రచించినట్టు సమాచారం.   

 ఓట్ల లెక్కింపులో కావాలనే కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కౌంట్‌లోకి వేసే ప్రయత్నం చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.  

ఆ విషయాన్ని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు గ్రహించి అభ్యంతరం వ్యక్తం చేసేలోపే అందుకోసమే అక్కడ ఎదురు చూస్తున్న పోలీసులు, కౌంటింగ్‌ అధికారులు కొందరు సంబంధిత ఏజెంట్లను, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను వెలుపలకు పంపేందుకు కుట్రపన్నుతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  

ప్లాన్‌–2
ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపేందుకు వీలుకాని పక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కూటమి అభ్యర్థులకు అనుకూలంగా వేసేందుకు కొందరు పోలీసులు, అధికారులు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్టు సమాచారం.  

ఎన్నికల కమిషన్‌ నిబంధనలు, వాస్తవ నిబంధనలను భేరీజు వేసుకుని ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయనున్న నేపథ్యంలో కౌంటింగ్‌ చివరి నిమిషంలో కూటమి అభ్యర్థుల విజయానికి అవసరమైన ఓట్లను వారి ఖాతాల్లో వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.  

 అధికారులు కొందరు కూటమి అభ్యర్థుల ఆమ్యామ్యాలకు లొంగి వారికి అనుకూలంగా మెజారిటీకి అవసరమైన కొన్ని ఓట్లను వారికి కలిపేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

సాక్షి, టాస్‌్కఫోర్స్‌ : మరో 24 గంటల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభంకానుంది. జిల్లా యంత్రాంగం ఇందు కోసం పక్కాగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. అయితే ఈనెల 4వ తేదీ ఓట్ల లెక్కింపు రోజున ఖాకీ దుస్తులు వేసుకున్న కొందరు అధికారులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా అరాచకం సృష్టించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. అనుకున్న ఫలితాలు రాకుంటే ఓట్ల లెక్కింపు కేంద్రంలో గలాటాలు చేయడానికి సహకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు కౌంటింగ్‌ సెంటర్‌లో జరిగే పరిణామాలను పచ్చ పార్టీ నేతలకు చేరవేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఓట్ల లెక్కింపు కేంద్ర వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికే పచ్చ పార్టీ నాయకులు ఏకంగా కొందరు ఖాకీలను ఎంపిక చేసుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించకుంటే తీవ్ర పరిణామాలకు కొందరు ఖాకీలే మూలకేంద్రంగా మారనున్నారనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

ఆ గొడవల్లో ప్రమేయం 
పోలింగ్‌ రోజు, తదనంతరం జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, పరిణామాలు తెలియనివి కావు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులే లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులు చేసి, కొందరిని మట్టుబెట్టాలని భారీ ప్రణాళికలు వేశారు. నడిరోడ్డుపైనే రౌడీయిజం చెలాయించి తిరుపతి వాసులను భయభ్రాంతులకు గురిచేశారు. తీరా ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించడంతో భయపడిన పచ్చ పార్టీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మొత్తం వివాదంలో కొందరు పోలీసు అధికారుల ప్రత్యక్ష ప్రమేయం ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నా ఇప్పటికీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

అసలు టీడీపీ నేతలను వైఎస్సార్‌సీపీ నాయకులపైకి ఉసిగొలిపి దాడులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది కొందరు పోలీసు అధికారులేనని బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టి, కవి్వంపు చర్యలకు పాల్పడి.. ఆపై దాడులు చేసేలా పథకం వేసినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నేతల స్వీయ రక్షణలో జరిగిన చిన్నపాటి గొడవను భూతద్దంలో చూపించి, ప్రజలను భయకంపితులు చేయాలని కొందరు పోలీసులే పక్కా ప్లాన్‌ వేసినట్లు తెలిసింది. ఈ కుట్రలో పలువురు సీఐలు, ఎస్‌ఐల నుంచి కింది స్థాయి కానిస్టేబుళ్ల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

పక్కాగా స్కెచ్‌!  
ఎన్నికల వేళ గొడవలు చేసేందుకు తిరుపతి నగరానికి చెందిన ఓ మొబైల్‌ దుకాణం యజమాని.. కొందరు పోలీసు అధికారులు కలిసి జట్టుగా ప్రణాళిక రూపొందించినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టి, ఎవరూ చూడకుండా దాడులు చేయాలని ఆ మొబైల్‌ దుకాణంలో స్కెచ్‌ వేసినట్లు వెల్లడిస్తున్నారు.. ఇందు కోసం పలువురు సీఐలు, ఎస్‌లకు వాట్సాప్‌ కాల్స్‌ చేసి వాళ్ల సహాయం కూడా తీసుకున్నారని చెబుతున్నారు. పోలింగ్‌ జరిగిన రోజున, తర్వాత ఈ కుట్రలో భాగస్వాములైన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు మొబైల్‌ దుకాణం యజమానితో టచ్‌లో ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. 

వీళ్ల సూచనలతోనే కేవలం టీడీపీ నాయకులపై జరిగిన దాడులను ఎల్రక్టానిక్‌ పరికరాలతో రికార్డు చేసేలా ఓ పన్నాగం పన్నినట్లు తెలిసింది. పైగా వైఎస్సార్‌సీపీ నాయకుల వద్ద అంగరక్షకులుగా ఎవరెవరు ఉన్నారు..? షిప్టులో ఎవరు మారుతున్నారు..? లాంటి వివరాలు సేకరించి కూటమి నేతలకు ఉప్పందించినట్లు సమాచారం. కచ్చితంగా అధికారంలోకి వస్తామని, వచ్చిన వెంటనే తమకు అండగా నిలిచిన అధికారులను అందలం ఎక్కిస్తామని కూటమి నేతలు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పొంచి ఉన్న ముప్పు! 
ఈ మొత్తం గొడవల్లో ప్రధానంగా కొందరు పోలీసు అధికారుల పేర్లు వినిపిస్తోంది. తిరుపతి క్రైమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, స్పెషల్‌ బ్రాంచ్‌ వెస్ట్‌ పరిధిలో పనిచేస్తున్న ఓ అధికారి, స్పెషల్‌ బ్రాంచ్‌ అలిపిరి పరిధిలో పనిచేస్తున్న ఓ ఉన్నతోద్యోగి, తిరుపతి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కీలక అధికారి, ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లోని చిన్నస్థాయి సిబ్బంది.  వెస్ట్‌ స్టేషన్‌ ఉన్నతాధికారి, అలిపిరి స్టేషన్‌లో పనిచేసి సస్పెండ్‌ అయిన ఓ ఉన్నతోద్యోగి. ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ చిరుద్యోగి, తిరుపతి అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ నుంచి వీఆర్‌ కెళ్లిన ఓ ఉన్నతాధికారికి కూటమి అభ్యర్థులతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు సాక్ష్యాలను సైతం సేకరించారు. వీరికి కౌంటింగ్‌ కేంద్రంలో విధులు వేస్తే.. ఎంతకైనా తెగిస్తారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ముందస్తుగా పొంచి ఉన్న ముప్పును పసిగట్టాలని అభ్యరి్థస్తున్నారు. కన్నింగ్‌ ఖాకీలకు కౌంటింగ్‌ విధులు కేటాయించొద్దంటూ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement