గుంటూరు, సాక్షి: దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నాం వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.
‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దని చెప్పాం’’ అని సజ్జల మీడియాకు వివరించారు.
సజ్జల ఇంకా మాట్లాడుతూ..
జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల అన్నారు.
కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది
పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాం
ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పాం.
10:30 గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం.
- పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా?
- ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలను తామే ఉల్లంఘించటమేంటి?
- దేశం అంతా ఒక రూల్, ఏపిలో ఒక రూల్ ఎంటి?
- పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు తీసుకు రావడం ఎంటి?
- ఏపీలో ఒక్క చోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై ప్రత్యేక వెసులు బాటు ఇవ్వడం ఏంటి.?
- ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు.
- వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదు
- ఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు.
- నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు.
- చంద్రబాబుకు ఉన్న స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయట పెట్టుకున్నారు.
- బీజేపీ జాతీయ వ్యూహాలను ఎపిలో అమలు చేయాలని చూస్తోంది
- వైసిపి బలమైన పార్టీ ఎవర్నీ రెచ్చగొట్టల్సిన అవసరం లేదు.
- ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతా యుతంగా ఉన్నాం.
- సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు.
- హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.
- చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యింది.
- 21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వస్తుంది?
- నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు.
- పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
- నార్తులో బీజేపీ పోతుంది.
- అందుకే సౌత్‌లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది..
- సౌత్ లో సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నారు.
- మేము జనంతో ఉన్నాం జనం మాతో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం.
- ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా.?
- చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment