postal ballot
-
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెటే ముద్దు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్, ఇటలీ, కజకస్థాన్, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్ చేశాయి. బ్యాలెట్ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్ లేదంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్ డిజిట్‌లోపు మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్ బ్యాలెట్ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు. -
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
-
కూటమితో కుమ్మక్కు!
కూటమి నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారా.. కౌంటింగ్‌కు తమకు అనుకూలమైన అధికారులను వేయించుకున్నారా..? నేడు జరగనున్న ఓట్ల లెక్కింపులో అక్రమాలు.. దౌర్జాన్యాలకు స్కెచ్ వేశారా..? అంటే జిల్లా వాసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థులు పైచేయి సాధించేందుకు కొందరు అధికారులు అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. సాక్షి టాస్‌్కఫోర్స్: కౌంటింగ్‌లో అక్రమాలు.. దౌర్జనాలకు కూటమి అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి నేతలు కొందరు అధికారుల సహకారంతో రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు స్వతంత్ర అభ్యర్థులు అడ్డొస్తారని వారికి ఏజెంట్లను కుదించడమే ఇందుకు నిదర్శనం. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, చిత్తూరు ఎస్వీ సెట్లో నేడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కూటమికి ఓటమి తప్పదని భావించిన అభ్యర్థులు టీడీపీ సానుభూతిపరులైన అధికారుల ద్వారా మరికొందరు అధికారులను రకరకాల ప్రలోభాలతో లోబరుచుకున్నారు. వారందరికీ కౌంటింగ్ కేంద్రంలో డ్యూటీలు వేయించుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారి సహకారంతో కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలు, దౌర్జన్యాలకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తారుమారు చేసి.. కూటమికి అనుకూలంగా మార్చే కుట్ర అడ్డదారుల్లోనైనా గెలుపొందాలని కూటమి నేతలు అన్ని మార్గాలను ఎంచుకున్నారు. ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి ఏజెంట్లు రచ్చచేసి వైఎస్సార్సీపీ ఏజెంట్ల దృష్టి మరల్చేందుకు పథకం వేసినట్లు తెలిసింది. ఈవీఎంలోని మొత్తం ఓట్ల లెక్కింపు విషయంలో తమకు అనుకూలంగా లెక్కలను తారుమారు చేసేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. మొత్తంగా నేటి కౌంటింగ్ సమయంలో అడ్డదారులన్నింటినీ ఉపయోగించుకుని పైచేయి సాధించేందుకు కూటమి నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలు, దౌర్జనాలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఓటర్లు కోరుతున్నారు. వీలైనన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లక్ష్యంగా.. అధికారులంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేసిన కూటమి నేతలు.. నేడు జరగనున్న కౌంటింగ్‌లో దాన్ని అవకాశంగా వినియోగించుకోవాలని కుయుక్తులు పన్నుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఈసీ ఆదేశాలను బూచీగా చూపి వీలైనన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూటమి అభ్యర్థికి అనుకూలంగా మలచుకునేందుకు పథకం వేసినట్టు సమాచారం. అందుకు అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లను రెచ్చగొట్టి బయటకు పంపేందుకు స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల విషయంలోనూ ముందే అడ్డుకట్ట వేశారు. టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం అభ్యర్థి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలి్పంచారు. స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వచ్చే సరికి కేవలం 5, 6 మంది ఏజెంట్లను మాత్రమే నియమించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అభ్యర్థే కదా? అన్నీ టేబుల్స్ వద్ద ఏజెంటు ఉండకపోతే ఎలా? అని ప్రశి్నస్తున్నారు. అయినా వారికి ఎన్నికల అధికారి ససేమిరా అన్నట్లు స్వతంత్ర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలగం కోసం కొత్త ఎత్తుగడ కౌంటింగ్ కేంద్రలో అక్రమాలు, దౌర్జన్యాలకు బలగం ఉండేలా కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ ఏజెంట్ ఫామ్స్‌ని కొనుగోలు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా ఆ పార్టీ తరుఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ అభ్యరి్థకి టేబుల్‌కి ఒకరు చొప్పున ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం ఉంది. పేరుకు మాత్రమే పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తమ ఏజెంట్ ఫామ్స్‌ని కూటమి అభ్యర్థులకు విక్రయించి సొమ్ముచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ఏజెంట్ ఫామ్స్‌తో కూటమి నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో కూటమి నేతలకు బలం ఎక్కువ ఉండడంతో అక్రమాలు, దౌర్జన్యాలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బలగంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వీలైనన్ని కూటమి అభ్యర్థి లెక్కలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఏ చిన్న పొరబాటు ఉన్నా.. కూటమి అభ్యర్థి అకౌంట్లో వేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. -
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి. ⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి. ⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్‌పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి. ⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్‌లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్‌తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. ⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్‌తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్‌ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్‌కి ఉంది. ⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్లో అభ్యర్థి ఉండాలి. -
ఏపీలో అమ్ముడుపోయిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ లో కొత్త రూల్స్
-
చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు: సజ్జల
గుంటూరు, సాక్షి: దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నాం వైఎస్సార్సీపీ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దని చెప్పాం’’ అని సజ్జల మీడియాకు వివరించారు.సజ్జల ఇంకా మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల అన్నారు.కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోందిపార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాంఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పాం.10:30 గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం.పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా?ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలను తామే ఉల్లంఘించటమేంటి?దేశం అంతా ఒక రూల్, ఏపిలో ఒక రూల్ ఎంటి?పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు తీసుకు రావడం ఎంటి?ఏపీలో ఒక్క చోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై ప్రత్యేక వెసులు బాటు ఇవ్వడం ఏంటి.?ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు.వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదుఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు.నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు.చంద్రబాబుకు ఉన్న స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయట పెట్టుకున్నారు.బీజేపీ జాతీయ వ్యూహాలను ఎపిలో అమలు చేయాలని చూస్తోందివైసిపి బలమైన పార్టీ ఎవర్నీ రెచ్చగొట్టల్సిన అవసరం లేదు.ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతా యుతంగా ఉన్నాం.సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు.హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యింది.21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వస్తుంది?నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు.పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.నార్తులో బీజేపీ పోతుంది.అందుకే సౌత్‌లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది..సౌత్ లో సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నారు.మేము జనంతో ఉన్నాం జనం మాతో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం.ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా.?చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు. -
పోస్టల్ బ్యాలెట్లపై YSRCP న్యాయపోరాటం
-
పోస్టల్ బ్యాలెట్లపై వైఎస్సార్సీపీ పిటిషన్.. తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ, సాక్షి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి దిగింది. అయితే వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఇచ్చిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిటిషన్ వేశారు. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలన్న ఏపీ సీఈవో మెమోను.. తదనంతరం ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసింది వైఎస్సార్సీపీ. రేపే కౌంటింగ్ కావడంతో.. నేడు త్వరగా విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది, సుప్రీం ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అలాగే.. దేశం అంతటా ఎన్నికల సంఘం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని వాదించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, ఈ తరుణంలో తాము ఈసీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.హైకోర్టులో..ఇక వైఎస్సార్సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పోస్టల్‌బ్యాలెట్ ఈసీ మెమోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో ఏపీ సీఈవో నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర ఎన్నికల సంఘం, మెమోలో కొంత పార్ట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతూ డబుల్ గేమ్ ఆడింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ బలమైన వాదనలే వినిపించింది. రాత్రికి రాత్రే మెమో తేవాల్సిన అవసరం ఏముందని, దేశంలో ఎక్కడా లేని రూల్‌ను ఏపీలో తీసుకురావడంలో ఆంతర్యమేంటని వాదించింది. కానీ, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. దీంతో వైఎస్సార్సీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం అనివార్యమైంది. -
YSRCP న్యాయ పోరాటం
-
పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంలో వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, ఢిల్లీ: పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసింది. అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైఎస్సార్సీపీ సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలన్న వైఎస్సార్సీపీ.. పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.కాగా, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారమ్‌పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా, సీల్ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అభ్యంతరాలుంటే వాటిని ప్రస్తావించేందుకు ప్రత్యామ్నాయ వేదికలున్నాయని పేర్కొంది.ఆ ప్రత్యామ్నాయ మార్గాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికలు పూర్తయిన తరువాత ఎన్నికల పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసుకోవాలని వైఎస్సార్ సీపీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్ చేస్తూ ఈపీలు దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైఎస్సార్సీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చిందని, ఇది అన్యాయమన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. -
పోస్టల్ బ్యాలెట్లపై భద్రం
సాక్షి, అమరావతి: పెద్ద ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పోలింగ్ శాతం పెరగడం, పోస్టల్ బ్యాలెట్లు 4.97 లక్షలకు పైగా పోల్ అయిన నేపథ్యంలో జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపుల్లో అత్యంత కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో నిబంధనలు మార్చినందున లెక్కింపు విషయంలో ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా ఒక ఏజెంట్ పర్యవేక్షించాలని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు, లెక్కింపు విధానంపై ఏజెంట్లు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.చెల్లనివిగా ఎప్పుడు పరిగణిస్తారంటే?» బ్యాలెట్ పేపరుపై ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు.» బ్యాలెట్ పేపరు చిరిగినా, గుర్తు పట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదా ఏదైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు.» నకిలీ బ్యాలెట్ పేపర్లను తిరస్కరిస్తారు.» ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్వో పక్కన పెడతారు.» ప్రతీ దశలో చెల్లని ఓట్లను ఆర్వో విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి» ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు.» తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్వో, అబ్జర్వర్లు ఒకొక్కటే పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. డిక్లరేషన్ 13 ఏ అత్యంత కీలకం» ఓటరు తన ఓటును కవర్ ‘ఏ’లో పొందుపరచి దానికి డిక్లరేషన్ 13 ఏ జత చేసి ఈ రెండింటినీ కవర్ ‘బీ’లో ఉంచి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు.» బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ బీ తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ ‘ఏ’ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.» కవర్ బీ తెరవగానే అందులో ఫారం 13 సీలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ (ఫారం 13 బీ) ఉండే కవర్ ఏ, ఓటరు ఇచ్చిన డిక్లరేషన్ 13 ఏ ఫారం ఉండాలి» ఈ రెండూ విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి.» ఆ తర్వాత 13 ఏ డిక్లరేషన్ సరిగా ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి.» ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటరు సంతకంతోపాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ ఉందో లేదో పరిశీలించాలి.» ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, సీల్ లేకపోయినా ఆ ఓటును తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.» అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే ఏజెంట్లు తమ అభ్యంతరాన్ని ఆర్వోకు తెలియచేయాలి.» ఆర్వో తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరి పోల్చి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు.» ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం మొదలవుతుంది.» తొలుత కవర్ ఏ ఓపెన్ చేసి అందులోని ఫారం 13 బీ బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేస్తారు.» 13 ఏపై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్, 13 బీ మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోలాలి.» ఈ రెండు నెంబర్లలో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి.» ఏజెంట్లు తమ ఫిర్యాదులు ప్రతీది లిఖిత పూర్వకంగా ఇవ్వాలిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇలా» జూన్ 4 ఓట్ల లెక్కింపు తొలుత పోస్టల్ బ్యాలెట్లతోనే మొదలవుతుంది. ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లు ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. కౌటింగ్ కేంద్రంలో మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఒకవైపు ఏడు మరో వైపు ఏడు చొప్పున అమర్చి చుట్టూ కంచె వేస్తారు. ఈ రెండు వరుసల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుల్ ఉంటుంది. ఆర్వో పర్యవేక్షణలోనే మొత్తం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. » పోస్టల్ బ్యాలెట్లలో రెండు రకాలుంటాయి. మిలటరీలో సేవలందించే వారు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులు, పోలింగ్ రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులు సాధారణ విధానంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ఓట్ల లెక్కింపు ఒకే రకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసిన వారి క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకుంటారు. » పోస్టల్ బ్యాలెట్లో రెండు రకాల కవర్లు ఏ, బీతో పాటు మూడు రకాల ఫారమ్స్ 13 ఏ, 13 బీ, 13 సీ ఉంటాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు వినియోగించుకున్నారా? లేదా? అనేది పరిశీలించి లెక్కింపు అర్హతను నిర్థారిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇదే అత్యంత ప్రధానమైనది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందా? లేదా? ఎలాంటి సందర్భాల్లో ఏజెంట్లు అభ్యంతరం చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.. -
ఎల్లుండే ‘లోక్‌సభ’ కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10వేల మంది సిబ్బందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 4న జరిగే లోక్‌సభ ఓట్ల లెక్కింపుతోపాటు 2న జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు, 5న జరిగే ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశామని.. ఇందులో 50 శాతం సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారని చెప్పారు. ర్యాండమైజేషన్ పద్దతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. మూడంచెల భద్రత మధ్య ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఒక కౌంటింగ్ కేంద్రం ఉంటుందని.. ఒక కేంద్రంలో 24 టేబుల్స్ ఉంటాయని వికాస్‌రాజ్ తెలిపారు. అయితే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 28 టేబుల్స్ అవసరమవడంతో.. రెండు హాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. ఇప్పటివరకు 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని.. ఇంకా ఈటీపీబీఎస్ (ఎ ల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం)లు వస్తున్నాయని, కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలలోపు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ లెక్కన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యపై కౌంటింగ్ రోజే స్పష్టత వస్తుందన్నారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 24 రౌండ్లు పడుతుందని.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్ రసీదులను లెక్కిస్తామని తెలిపారు. 2,414 మంది సూక్ష్మ పరిశీలకులులోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లను) నియమించినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఒక్కో టేబుల్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. లెక్కింపు కోసం ఒక టేబుల్‌కు ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వా ల్సి ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత మధ్య తరలిస్తామని.. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు. ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. ఒకవేళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలకుల అను మతి తర్వాత ఫలితాలు వెల్లడిస్తారని.. కౌంటింగ్ హాల్లో, మీడియా సెంటర్ వద్ద ప్రకటిస్తామని, వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తా మని తెలిపారు. ఆదివారం జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దుప్పలపల్లిలోని తెలంగాణ వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాం ఆవరణలో జరుగుతుందని వికాస్‌రాజ్ వెల్లడించారు. -
పోస్టల్ బ్యాలెట్ పై నేడు కీలక తీర్పు
-
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
-
Big Question: పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ కుట్రలు
-
ఇది ఈసీ వివక్షే
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచింది. దానిని పరిశీలించిన ఆయన హౌస్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ విజయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.దేశ వ్యాప్తంగా కాకుండా ఏపీలో మాత్రమే అమలు చేస్తారా?వైఎస్సార్సీపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షాపూరితమని సింఘ్వీ తెలిపారు. ఈ ఉత్తర్వులు చాలా కొత్తగా ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులను దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు దేశం మొత్తానికి వర్తిస్తాయని, కానీ విస్మయకరంగా తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తింప చేస్తోందని వివరించారు. ఇంత కన్నా అన్యాయం ఏమీ ఉండదన్నారు. తాజా ఉత్తర్వులు ఎన్నికల కమిషన్ స్వీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. లేఖలు, సర్కులర్లు, మెమోల ద్వారా చట్టబద్ధ నిబంధనలను మార్చలేరన్నారు. అది పార్లమెంట్ పని అని తెలిపారు. పార్లమెంట్లో ఎలాంటి సవరణ చేయకుండా తాజా ఉత్తర్వులు తీసుకురావడానికి వీల్లేదని, అందువల్ల అవి ఎంత మాత్రం చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎందుకిలా?రాష్ట్రంలో 5.39 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇవి సరిపోతాయని సింఘ్వీ అన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్స్ 27ఎఫ్, 54ఏ, 13 ఏ లకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు అమల్లోకి తెచ్చిందన్నారు. అటెస్టేటింగ్ అధికారి పేరు, హోదా వివరాలు లేకుండా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఎవరో ధృవీకరించారో తెలియదని, దీని వల్ల అక్రమాలకు ఆస్కారం ఉంటుందన్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై ఎవరైనా సంతకం చేయవచ్చన్నారు. తప్పుడు, నకిలీ ఓట్లను కూడా ఆమోదించేందుకు తాజా ఉత్తర్వులు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే, ఇప్పుడు కౌంటింగ్‌కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ తాజా ఉత్తర్వుల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదంగా ఉందని తెలిపారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఇలాంటి ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షికతకు అర్థం లేకుండా చేస్తోందన్నారు. ఏకపక్షంగా జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం ఉంటేనే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదని, అందువల్ల తమ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని వివరించారు.పరిధి దాటి వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంసీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘామే చెబుతోందని, అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో మాత్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో తమ ఆందోళనను గానీ, తామిచ్చిన వినతి పత్రాన్ని గానీ ఎన్నికల సంఘం కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హడావుడిగా తాజా ఉత్తర్వులిచ్చిందన్నారు. అతి కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరగబోతుండగా, ఇప్పటికిప్పుడు ఈ ఉత్తర్వులను తీసుకు రావాల్సిన అవసరం ఏముందో ఎన్నికల సంఘం చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యల్లో నిజాయితీ ఉండి ఉంటే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఉండేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికల పిటిషన్లు వేయాలంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని, ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన పరిధి దాటి వ్యవహరించిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, బ్యాలెట్ ఫాంపై పేరు, హోదా వివరాలు, సీలు లేకుంటే ఆ ఓటును తిరస్కరించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వీరారెడ్డి తెలిపారు.తాజా ఉత్తర్వులు ఆ ఉద్యోగులకే వర్తింపుకేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకే తమ తాజా ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద అటెస్టేటింగ్ అధికారిని సంబంధిత రిటర్నింగ్ అధికారే నియమిస్తారని.. అందువల్ల డిక్లరేషన్ ఫాంపై ఆ అధికారి సంతకం ఉంటే చాలని చెప్పారు. పేరు, హోదా వివరాలు, సీలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మొత్తం నిబంధనలకు అనుగుణంగా వీడియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను సవాలు చేయడానికి వీల్లేదని, ఒకవేళ పిటిషన్లు దాఖలు చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ పరోక్షంగా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని, అందువల్ల వారు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల వ్యవహారంలో ఈపీ దాఖలు చేసుకోవాలన్న వాదన సరైందేనని, అయితే పిటిషనర్ తన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలు పూర్తిగా వేరని వ్యాఖ్యానించింది. ఇదేమీ వ్యక్తిగత కేసు కాదని స్పష్టం చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల నిర్వహణ నిబంధనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు సబబేనన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయాన్ని వెలువరిస్తామంది. -
ఏపీ: ఈసీఐ అకస్మాత్తు నిర్ణయం ఎందుకు?
గుంటూరు, సాక్షి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘాల తీరుపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తోంది. ఏపీ సీఈవో, సీఈసీ ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌పై వాదనలు శుక్రవారం పూర్తి కాగా, జడ్జి తీర్పును రేపటికి(జూన్ 1 శనివారం) రిజర్వ్ చేశారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ.. పోస్టల్ బ్యాలెట్ ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు. అయితే ఈ మెమో పై వైఎఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను గురువారం ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. శుక్రవారం ఇరువైపులా వాదనలు జరిగాయి. వాదనలు ముగియడంతో శనివారం సాయంత్రం తీర్పు వెల్లడిస్తామని ఏపీ హైకోర్టు ఇరువర్గాలకు తెలిపింది.వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు.. ఏపీలో 5.39 లక్షల పోస్టల్ ఓట్లు ఉన్నాయిపోస్టల్ బ్యాలెట్‌పై సంతకం చేసి.. స్టాంప వేశాక అధికారి పేరు రాస్తేనే అది చెల్లుబాటు అవుతుందికానీ, పోస్టల్ బ్యాలెట్‌పై కేవలం అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. ఈసీఐ సర్క్యులర్ జారీ చేయడం సరికాదు రూల్ 27 ప్రకారం పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టింగ్ అధికారి పేరు, సంతకం ఉండాలిసదరు పోస్టల్ ఓటర్ తనకు తెలుసు అని, అటెస్టెడ్ అధికారి సర్టిఫై చేయాలిరూల్ 54ఏ ప్రకారం.. డిక్లరేషన్‌పై సంతకం, స్టాంప్ లేకుంటే అధికారి ఆ పోస్టల్ బ్యాలెట్‌ను తిరస్కరించాలి ఈసీఐ ఇచ్చిన సర్క్యులర్ నిబంధనలను తుంగలో తొక్కిందిదీనిపై పోస్టల్ ఓట్లు చెల్లుబాటుపై సందేహాలు లేవనెత్తుతోందిఇన్ని లక్షల పోస్టల్ ఓట్లు ఉన్నప్పుడు కేవలం సంతకం ఉంటే.. ఆ సంతకం సరైనదా? కాదా? అని ఎవరు నిర్ధారిస్తారు? అన్ని రాష్ట్రాల్లో నిబంధనలకు అనుకూలంగా లేకుంటే.. పోస్టల్ ఓట్లు చెల్లుబాటు కావు. కానీ, ఏపీలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి! అటెస్టేషన్ లేకుండా వచ్చిన పోస్టల్ ఓట్లను సైతం లెక్కపెట్టాలని ఈసీఐ అకస్మాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకుంది?రాత్రికి రాత్రి సర్క్యులర్ తీసుకొచ్చి.. అటెస్టెడ్ అధికారి పేరు, అడ్రస్, హోదా అవసరం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందిఏపీ సీఈవోను వెనుకేసుకొచ్చిన ఈసీపోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ స్పందించింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. తద్వారా ఏపీ సీఈవో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించినట్లయ్యింది. అయితే దేశం మొత్తం ఒకలా ఉంటే.. ఏపీ వరకు రూల్స్ మార్చేందుకు ఈసీ అనుమతులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కేంద్ర ఎన్నికల సంఘం డబుల్ గేమ్ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారు. :::ఏపీ సీఈవోతో కేంద్ర ఎన్నికల సంఘం ‘‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం’’:::పోస్టల్ బ్యాలెట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం వివరణఒకవైపు ఏపీ సీఈవో తీసుకున్న నిర్ణయం సరైందేనని చెబుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయన రూల్స్ పక్కన పెట్టారన్న సంగతిని మాత్రం పక్కనపెడుతోంది. అలాగే.. మెమోలో కొంత భాగం మాత్రమే వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి డబుల్ గేమ్ ఆడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. -
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై అనుమానాలు
-
CEO జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన CEC
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం ప్రారంభించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని అప్పిరెడ్డి తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.దీంతో న్యాయమూర్తులు జస్టిస్ సత్తిరెడ్డి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్‌ల ధర్మాసనం లంచ్ మోషన్ రూపంలో గురువారం అత్యవసర విచారణకు అంగీకరించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, హోదా వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అడిగిందే తడవుగా, సీఈవో ఆ మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టీడీపీకి అనుకూలంగా వాటిని సడలించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా వివరాలు చేతితో రాయకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలంటూ ఈ నెల 25, 27వ తేదీల్లో మెమోలు జారీ చేశారు. ఈ నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. కూటమి తప్ప, అన్నీ రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయంపై అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారుతుందని భయపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఏపీలో అమలు సీఈవో ఇచ్చిన సడలింపుల అమలును నిలిపేసి, కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా, నిజమైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రతివాదులుగా చేర్చింది. మధ్యాహ్నం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. దాదాపు రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి.సీఈవో తన పరిధి దాటి మరీ మెమోలు జారీ చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. సీఈవో మెమోల వల్ల వచ్చే నష్టం గురించి ధర్మాసనానికి వివరించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, డిజిగ్నేషన్ వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయని, ఇందుకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంటే, దానిని తిరస్కరించవచ్చని తెలిపారు.అయితే ఇప్పుడు సీఈవో ఆ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేయడం లేదన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియలో నిష్పాక్షికత కోసమే ఈ వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. నిబంధనలకు తూట్లు పొడిచే అధికారం సీఈవోకు లేదన్నారు. కొన్ని రాజకీయ పారీ్టలకు మేలు చేసేందుకే సీఈవో ఈ మెమో జారీ చేశారని తెలిపారు.పేరు, హోదా, సీలు లేకపోయినా ఆమోదించాలి 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో సీఈవో తమ అభిప్రాయాన్ని కోరారని తెలిపారు. అధికారుల సంతకం విషయంలో ఏదైనా సందేహం ఉన్నా, వెరిఫికేషన్ అవసరం అయినా, ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలు, పేర్లు, హోదాల వివరాలను తీసుకోవాలంటూ ఈ నెల 25వ తేదీన జారీ చేసిన మెమోలోని రెండో పేరాను ఉపసంహరించుకుంటున్నట్లు అవినాష్ చెప్పారు.ఈ రెండో పేరాకు అనుగుణంగా 27న జారీ చేసిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఆయన కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలంటూ తాజాగా (30వ తేదీన) ఆదేశాలు జారీ చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.ఈ సమయంలో వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ, 25న ఇచ్చిన మెమోలోని పేరా 2, 27న ఇచ్చిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన విషయాన్ని రికార్డ్ చేయాలని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి, అవినాష్ చెప్పిన విషయాలను రికార్డ్ చేసింది. అవినాష్ జోక్యం చేసుకుంటూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇది రెగ్యులర్ కేసు కాదని గుర్తు చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఈవో గుప్పెట్లో చట్టం
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశి్నంచారు.13 ఏ, 13 బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని, దానికి గెజిటెడ్ ఆఫీసర్ సరి్టఫికెట్ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచి్చందని ప్రశి్నంచారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. -
కుట్రపూరితం! పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్‌తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.