సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్ బ్యాలెట్ మిస్సింగ్ అవ్వడం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ద్వారా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. దీని దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీన ముగిసింది.
అయితే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు 15 మంది కార్యాలయాలకు వెళ్లగా మీ దరఖాస్తులు అందలేదని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. తాము ఇదివరకే దరఖాస్తు చేసుకున్నా ఎందుకు అందలేదని అధికారులను ప్రశ్నించగా, వారినుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమని చెప్పే అధికారులు ఇలా తాము చేసుకున్న దరఖాస్తులను ఇంత నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. ఎన్ని గల్లంతయ్యాయనే సమాచారం కోసం కలెక్టరేట్ పర్యవేక్షకురాలు జాడి స్వాతిని సంప్రదించగా.. ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ మిస్ అవ్వలేదని పేర్కొన్నారు. అయితే ఇంకా దరఖాస్తులు అందాల్సి ఉందని, అవి పూర్తిస్థాయిలో వస్తే తప్పా ఎన్ని వచ్చా యి.. ఎన్ని రాలేదనే సమాచారం చెబుతామని పేర్కొనడం గమనార్హం.
ఇవి చదవండి: ‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అందరు మూడు తోవల పోతున్నరు!
Comments
Please login to add a commentAdd a comment