సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయాలి
రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్
సింగరేణి పరిరక్షణకు బస్సుయాత్ర ప్రారంభం
జెండా ఊపి బస్సుయాత్రను ప్రారంభిస్తున్న వీరభద్రం, నాయకులు
ఆదిలాబాద్: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించి ఢిల్లీలో ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. సోమవారం సింగరేణి పరిరక్షణ కోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను బెల్లంపల్లి లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వీరభద్రం మాట్లాడారు. సింగరేణి సంస్థలో 51శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం, 49శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూనే చాపకింద నీరులాగా బొగ్గు సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు అంత్యత సన్నిహితుడైన అదానికి దేశంలోని కోలిండియా, సింగరేణి సంస్థల్లోని బొగ్గు బ్లాక్‌లను అప్పగించడానికి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని అన్నా రు. శ్రావణ్‌పల్లి బొగ్గు బ్లాక్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వేలం పాట నిర్వహిస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పాల్గొనడం వెనుక మర్మమేంటో స మాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్ర భుత్వాల చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు, ఇతర వర్గాల శ్రేణులు పో రాటంలో కలిసి రావాలని కోరారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రామయ్య, భూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబు, పైళ్ల ఆశయ్య, సీఐటీయూ సింగరేణి విభాగం డెప్యూటీ కార్యదర్శి నాగరాజ్‌గోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ప్రకాష్, నాయకులు రాజన్న, శ్రీనివాస్, రమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యంగా ఉద్యమించాలి..
రామకృష్ణాపూర్: ప్రైవేటీకరణ బారి నుంచి సింగరే ణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని రాజకీయ ప క్షాలు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య అన్నారు. బస్సుయాత్ర సోమవారం సాయంత్రం ఆర్‌కేపీకి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిరక్షణకు చేపట్టిన బస్సుయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భూపాల్, ఆశన్న, శంకర్, రవి, వెంకట స్వామి, శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణికే కేటాయించాలి..
మందమర్రిరూరల్: రాష్ట్రంలోని నూతన బొగ్గు గనులను సింగరేణికి కేటాయించి సంస్థను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సోమవారం బస్సుయాత్ర మందమర్రికి చేరుకోగా.. ఏరియాలోని కేకే–5గనిపై ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉందని తెలిపారు. అనంతరం మార్కెట్, పలు వీధుల గుండా బస్సుయాత్ర సాగింది.
ఇవి చదవండి: ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment