Adilabad District Latest News
-
ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలు
ఆదిలాబాద్: ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సేవలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే కీచైన్స్ పంపిణీ చేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణికులకు శనివారం క్యూఆర్ కోడ్ కీచైన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ అందిస్తున్న సేవలు, సమగ్ర సమాచారాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ పోశెట్టి, రిజర్వేషన్ ఇన్చార్జి హుస్సేన్, దేవిదాస్, పాల్గొన్నారు. -
నిధులు సరే.. పనులెప్పుడో?
● టెండర్లు పూర్తయినా షురూ కాని ‘అమృత్–2’ ● ఎస్టీపీల స్థల సేకరణలో తీవ్ర జాప్యం ● జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాల తీరిది కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ము రుగునీటి సమస్య పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాల ని నిర్ణయించింది. ఇందుకోసం అమృత్–2 పథకం కింద రూ.225 కోట్ల నిధులు మంజూరు చేసింది. సంబంధించిన టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిఎనిమిది నెలలవుతుంది. అయినా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మురుగునీటిని శుద్ధి చేసే (ఎస్టీపీ) నిర్మాణాలకు అవసరమైన స్థలాల సేకరణ సమస్యగా మారింది. ఫలితంగా నిధులు ఉండి కూడా పనుల ప్రారంభంలో జాప్యమవుతోంది. భూసేకరణే ప్రధాన సమస్య.. జిల్లా కేంద్రంలో అయిదు చోట్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లను నిర్మించాలని నిర్ణయించారు. చిల్కూరిలక్ష్మినగర్లో 24 ఎంఎల్డీల సామర్థ్యంతో ఆరు ఎకరాల్లో, ఖానాపూర్ చెరువులోనే ఎకరం విస్తీర్ణంలో 4 ఎంఎల్డీల సామర్థ్యం, కేఆర్కే కాలనీలో 1.5 ఎంఎల్డీల సామర్థ్యంలో 1.5 ఎకరం స్థలంలో, ఇందిరమ్మ కాలనీ, బంగారుగూడ కాలనీల్లో ఒక్కో ఎంఎల్డీ సామర్థ్యంతో కూడిన ఎకరం విస్తీర్ణంలో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. ఖానాపూర్ చెరువులో నిర్మించనుండగా దీనికి ఎలాంటి స్థల సమస్య లేదు. మిగతా నాలుగు చోట్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించినప్పటికీ భూ సేకరణ కొలిక్కి రావడం లేదు. దీంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాల అవసరం లేకుండా.. భవిష్యత్తులో ఇళ్లలో సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాల అవసరం లేకుండా ఈ పథకాన్ని రూపొందించారు. చిల్కూరిలక్ష్మినగర్లో నిర్మించే ఎస్టీపీకి పట్టణంలోని దుర్గానగర్ కాలనీలోని వాగు పక్క నుంచి దస్నాపూర్, టీచర్స్‌కాలనీ, న్యూ హౌసింగ్‌బోర్డు, సుభాష్‌నగర్ మీదుగా వెళుతున్న వాగు ఇరు పక్కల ప్రధాన పైపులైన్ లేదా భారీ డ్రెయినేజీ నిర్మించనున్నారు. టైలర్స్ కాలనీ వద్ద రెండు లైన్లను ఒకే లైన్‌గా మార్చి నేరుగా చిల్కూరిలక్ష్మీనగర్లో నిర్మించే ఎస్టీపీ కేంద్రం వరకు పైపులైన్ వేయనున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న కాలనీలన్నింటి మురుగు పంజాబ్‌చౌక్ నుంచి మహాలక్ష్మివాడవైపు వెళ్తుండటంతో ఈ మార్గాన్ని ఆ ఎస్టీపీకి అనుసంధానించనున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు, రవీంద్రనగర్, శాంతినగర్ వంటి కాలనీల నుంచి వచ్చే మురుగు ఖానాపూర్ చెరువులో నిర్మించే ఎస్టీపీకి మళ్లించనున్నారు. కేఆర్కే, ఇందిరమ్మకాలనీ, బంగారుగూడలోనూ చుట్టుపక్కల కాలనీలను కలిపి పైపులైన్ వేస్తారు. ఇలా అయిదు ఎస్టీపీలు వాటి కోసం నిర్మించే 14 కిలోమీటర్ల మేర ఉండనున్న పైపులైన్ నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రతిపాదనలు పంపించాం ఎస్టీపీల నిర్మాణాలకు సంబంధించి నాలుగు చోట్ల స్థలాలను గుర్తించాం. వాటికి భూ సేకరణ చేయాల్సి ఉంది. రెవెన్యూ శాఖ ద్వారా భూములను సేకరించేందుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. భూ సేకరణ ప్రక్రియ ఎప్పుడు పూర్తయితై అప్పుడే పనులు ప్రారంభిస్తాం. – ఎం.గంగాధర్, పబ్లిక్ హెల్త్ ఈఈ -
భూభారతి పైలట్ మండలంగా భోరజ్
● రేపటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు ● కలెక్టర్ రాజర్షి షా కై లాస్‌నగర్: భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలోని భోరజ్ మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోరజ్ మండలంలో 28 గ్రామాల్లో ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వహణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదస్సుల్లో భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రామానికి వెళ్లే ముందు రోజు గ్రామస్తులకు తెలిసేలా టామ్ టామ్ వేయించాలన్నారు. సంబంధిత అఽధికారులు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జూన్ 2 వరకు పైలెట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో పొజిషన్లో ఉన్నవారు, పట్టాలు ఉండి పొజిషన్లో లేని వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హైకోర్టు అనుమతులు రాగానే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని, ఈమేరకు అవసరమైన కార్యాచరణ పూర్తిచేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, తహసీల్దార్లు, సర్వేల్యాండ్ రికార్‌ుడ్స ఏడీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చే యాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి దేవేందర్ కోరారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్, వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ సీవీ ఎన్ రాజును శనివారం కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికులు ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో యూనియన్ నాయకులు అశోక్, ఉషన్న, నరేందర్ తదితరులున్నారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి●
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కె. ప్రభాకరరావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. రాజీమార్గం ద్వారా కేసులు పరి ష్కరించేందుకు లోక్ అదాలత్ ఎంతో తోడ్ప డుతుందన్నారు. రాజీపడదగ్గ కేసులన్నింటి నీ ఇందులో పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకో వాలని సూచించారు. ఇందులో డీఎల్ఎస్ఏ ఇన్చార్జి సెక్రటరీ సీహెచ్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నూతన కార్యవర్గం
కైలాస్‌నగర్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా నూ తన కార్యవర్గాన్ని స్థానిక టీఎన్జీవోస్ భవన్లో శని వారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎస్. అశోక్, సెక్రటరీ జనరల్‌గా కే.శివకుమార్, అడిషన ల్ సెక్రటరీ జనరల్‌గా కే. కృష్ణ కుమార్, కోచైర్మన్లుగా కె.కిష్టన్న, మూగ శ్రీనివాస్, సొగల సుదర్శన్, ఎం.శ్రీనివాస్, కే.లక్ష్మారెడ్డి, బి.ప్రవీణ్‌కుమార్, వైస్ చైర్మన్లుగా ఆర్.శివకుమార్, నవీన్‌యాదవ్, కాంబ్లీ విజయ్ కుమార్, డిప్యుటీ సెక్రటరీ జనరల్‌గా నవీన్‌కుమార్, రాథోడ్రామారావు, కాంబ్లీ విజయ్ కుమా ర్, సెక్రటరీలుగా సప్దార్అలీ, జాయింట్ సెక్రటరీ గా తిరుమల్‌రెడ్డి, కృష్ణ,సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. -
మైనర్లకు బైకులివ్వొద్దు
● నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కేసు ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్: మైనర్లకు బైక్‌లు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. బైక్‌లు నడుపుతూ పట్టుబడ్డ మైనర్ల తల్లిదండ్రులకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. పద్దెనిమిదేళ్లలోపు వారికి బైక్లిస్తే వాహన యజమానితో పాటు తల్లిదండ్రులు కేసుల పాలవుతారన్నారు. ఒకవేళ మైనర్ ప్రమాదానికి కారణమైతే ఇన్సూరెన్స్ సైతం రాకుండా పోతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రిపూట, రోడ్లపై అనవసరంగా తిరగకుండా గమనించాలన్నారు. ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 295 మంది మైనర్లు బైక్‌లు నడుపుతూ పట్టుబడగా ఆ వాహనాలను సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు సీహెచ్ కరుణాకర్, ప్రణయ్‌కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి మురళి, బి శ్రీపాల్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రతీ శనివారం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించే పరేడ్, యోగా కార్యక్రమాలను ఈ వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరేడ్ నిర్వహణ ద్వారా సత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. ఆయుధాల వినియోగం, ట్రాఫిక్ సిబ్బందికి సిగ్నల్స్‌పై శిక్షణనిచ్చారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్‌కుమార్, సీహెచ్ కరుణాకర్, కే.ఫణిధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టి.మురళి, బి.శ్రీపాల్, ఎన్.చంద్రశేఖర్, మావల ఎస్సై వి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
జనగణనతోపాటు కులగణన
ఆదిలాబాద్: దేశంలో జనగణనతో పాటు కులగణన సైతం ఎంతో ముఖ్యమైనదని ఆదిలా బాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కులగణ నపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా కుల గ ణన జరుగుతుందన్నారు. ఈ దిశగా కేంద్ర ప్ర భుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మా నంద్, పట్టణ అధ్యక్షుడు వేద వ్యాస్, రవి, రవి రెడ్డి, భూమేశ్, రాకేశ్, సుభాష్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’ పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఈనెల 4న నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించా రు. ఆయా కేంద్రాలను ఎస్పీతో కలిసి తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 4న మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, సాంఘిక సంక్షేమ గు రుకుల బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ ఆర్ట్స్అండ్ కామర్స్ డిగ్రీ కళా శాల, బంగారుగూడ మోడల్ స్కూల్, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్లో రెండు కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షకు 1,659 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు కేంద్రంలోనికి అనుమతించనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో తాగునీరు, వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, కేంద్రీయ విద్యాలయం కోఆర్డినేటర్ అశోక్, వాగ్మారే, ఎంఈవోలు ఉన్నారు. కలెక్టర్ రాజర్షిషా -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. 400 మంది సిబ్బంది వారి కుటుంబీకులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో డీఎస్పీలు పో తారం శ్రీనివాస్, ఎల్.జీవన్‌రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, నవీన్‌కుమార్, కార్తీక్, పోలీస్ అసో సియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసమే షీటీంలు మహళల భద్రత కోసం షీటీం నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో షీటీంలకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో విస్తృతంగా షీటీం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గతనెలలో 110 గ్రా మాలను ఆయా బృందాలు సందర్శించాయని పేర్కొన్నారు. నాలుగు ఎఫ్ఐఆర్, 10 పీటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆపత్కాల సమయంలో షీటీం కోసం 8712659953 నంబర్‌పై సంప్రదించాలని సూచించారు. వీడీసీల అక్రమాలపై ఉక్కుపాదం.. వీడీసీల అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఎస్పీ అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, అక్రమ దందాలు, వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. వీడీసీ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పే ర్కొన్నారు. చట్టం చేయాల్సిన పనిని పలుచోట్ల వీడీసీలు తమ చేతిలోకి తీసుకొని పోలీసు, న్యా యస్థానాన్ని ఆశ్రయించకుండా చూస్తున్నారని, వారు చెప్పింది వినకపోతే కొందరు గ్రామాల నుంచి వెలివేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బేల, జైనథ్, బోథ్, ఇచ్చోడ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. -
● అనుమతి లేకుండా వాటర్ ప్లాంట్లు ● నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ● క్యాన్లలో అపరిశుభ్ర నీరే సరఫరా ● చోద్యం చూస్తున్న అధికారులు
ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ ఆదిలాబాద్‌లోని విద్యానగర్ లోనిది. ఈ యజమాని మరో చోట నుంచి వాహనంలో నీటిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నాడు. ప్యూరిఫైడ్ చేయకుండానే ప్రజలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 20 లీటర్ల క్యాన్‌కు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నాడు.ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ప్యూరిఫైడ్ వాటర్ పేరిట ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వేసవి కా వడంతో నీటి దందా జోరందుకుంది. అయితే వీటికి అనుమతులు ఉండవు.. ప్రమాణాలు పాటించరు.. నిర్వహణ సైతం ఇష్టారీతిన కొనసాగుతోంది. రక్షిత నీటిని తాగాలనే ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్యూరిఫైడ్ పేరిట ఏటా లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు కొందరు. ప్రజలకు క్యా న్లలో కలుషిత నీటిని అందిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం గమనార్హం. నీటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే... జిల్లాలో సుమారు 700 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కదానికి కూడా అనుమతి లేదు. ఐఎస్ఐ నిబంధనలు సైతం పాటించడం లేదు. ఏడాదికోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఎక్కడా అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇళ్లు, దుకాణాలు, పాత గదుల్లోనే ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు సైతం ఎక్కడా నిర్వహించడం లేదు. ఏటా వేసవిలో ప్యూరిఫైడ్ నీటికి గిరాకీ ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు అనుమతి లేకుండా ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. గతంలో పట్టణాలకు పరిమితం కాగా ప్రస్తుతం గ్రామాలకు సైతం విస్తరించాయి. క్యాన్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీటి శుద్ధికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉన్న ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్లాంట్లలో క్యాన్లు శుద్ధి చేయకుండానే సాధారణ నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. కాలం చెల్లిన క్యాన్లు ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని ఓ వాటర్ ప్లాంట్ నిర్వహణ తీరిలా.. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ ఆదిలాబాద్‌లోని కొత్త కుమ్మర్వాడ సమీపంలోనిది. ఇక్కడి నుంచి రోజుకు వందలాది క్యాన్లు సరఫరా అవుతున్నాయి. అయితే రోజుకు 4వేల లీటర్ల నీటిని బోరు నుంచి తోడితే ఇందులో 25 శాతం మాత్రమే ప్యూరిఫైడ్ అవుతుంది. మిగతా 75 శాతం వృథా అవుతుంది. ఇలా నీటి వృథాతో కాలనీలోని ఇళ్లలో ఉన్న బోర్లకి నీరు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో గల్లీకి ఒకట్రెండు చొప్పున ఇలా ప్లాంట్లు అక్రమంగా వెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ఇవి.. వాటర్ ప్లాంట్‌కు మున్సిపల్/గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి. పరిశ్రమల శాఖ నుంచి పార్టు–1 లైసెన్సు పొందాలి. నిర్వహణకు బీఎస్ఐ అనుమతి ఉండాలి. ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. ప్లాంట్‌లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రి సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. పీహెచ్ స్థాయి 7 కంటే తగ్గకుండా చూడాలి. తగ్గితే ఆ నీరు తాగిన వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ప్లాంట్‌లో ప్రయోగశాలతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. నీటిని సరఫరా చేసే క్యాన్ అపరిశుభ్రంగా ఉండకూడదు. ప్రతిరోజు పొటాషియం పర్మాంగనేట్‌తో క్లీనింగ్ చేయాలి. అలాగే ప్రతి క్యాన్‌పై శుద్ధి చేసిన తేది, బ్యాచ్ నంబర్ ఉండాలి. శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన పెద్ద ట్యాంకులో నింపి ఓజోనైజేషన్ చేయాలి. అయితే జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క ప్లాంట్‌లో కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు.అనుమతి లేని ప్లాంట్లపై చర్యలు జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను తనిఖీ చేస్తాం. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించని వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ -
● జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు ● ఇచ్చోడలో 30మీటర్ల లోతులోకి.. ● పలుచోట్ల పనిచేయని బోర్లు ● ఇబ్బందులు పడుతున్న జనం ● జూన్ వర్షాలపైనే ఆశలు
ఇది నార్నూర్ మండలంలోని బలాన్పూర్ గ్రామంలోని చెరువు. నెల రోజుల క్రితమే ఎండిపోయింది. ఇటీవల పూడికతీత పనులు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఎండల తీవ్రత కారణంగా చాలా చెరువులు ఏప్రిల్‌లోనే ఎండిపోయిన పరిస్థితులు కనిపించాయి.ఇది సిరికొండ మండల కేంద్రంలోని చిక్మాన్ ప్రాజెక్ట్. ఈ ఏడాది ఎండల తీవ్రత కారణంగా ఇది పూర్తిగా ఎండిపోయింది. 2004లో నిర్మించిన ఈ చెరువు ఇప్పటివరకు ఎప్పుడు ఎండిపోలేదు. తొలిసారిగా ఎండిపోవడంతో దీని కింద ఉన్న 2వేల ఎకరాల ఆయకట్టుకు యాసంగిలో నీళ్లు అందని పరిస్థితి. ●సాక్షి,ఆదిలాబాద్: ఇచ్చోడలోని విద్యానగర్, సుభా ష్‌నగర్, టీచర్స్ కాలనీల్లో నీటి ఇక్కట్లు నెలకొన్నా యి. పలు ఇళ్లలో బోర్లలో నుంచి నీరు సరిగా రావ డం లేదు. దీంతోస్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లు కనీసం 15నిమిషాలకు మించి నడవడం లేదని పేర్కొంటున్నారు. గత్యంతరం లేక పలువురు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. మరికొందరు ద్విచక్రవాహనాలపై సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ మండలంలో జనవరిలో 8.10 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, ఫిబ్రవరికి ఏకంగా 28.85 మీటర్ల లోతులోకి పడిపోయాయి.తాజాగా 30మీటర్ల లోతుకంటే అధి కంగా నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. 30 మీటర్ల లోతునకు.. జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు మరింత ప డిపోతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత పెరగడంతో కఠిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇచ్చోడలో భూగర్భ జలాల పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏకంగా 30 మీటర్ల లోతునకు పడిపోయాయి. ఇక్కడ ఇళ్లలో బోర్లు పావుగంట మించి నడవని పరిస్థితి. దీంతో స్థానికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలో 10 మీటర్ల లోతులోకి చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రస్తు తం కొంత పర్వాలేదనుకున్నా ఈనెల చివరిలో మ రింత లోతులోకి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీంతో నీటి సమస్య తీవ్రమవుతుందా అనే పట్టణ వాసుల్లో కనిపిస్తుంది. ఇదీ పరిస్థితి.. గతేడాది మే నెలలో జిల్లాలో భూగర్భలాలు 10.59 మీటర్లకు పడిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకే ఆ పరిస్థితి కనిపించింది. ప్రస్తుత మే నెలలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. నెర్రెలు బారి దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల పూడిక తీత పనులు చేపడుతున్నారు. గతేడాది వర్షాకాలం ముగిసిన తర్వాత జిల్లాలో నవంబర్ నెలలో 5.14 మీటర్ల లోతులోనే జలాల లభ్యత కనిపించింది. ఈ నేపథ్యంలో జూన్ వర్షాలపైనే జిల్లావాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో సగటున భూగర్భ జలాల పరిస్థితి (భూఉపరితలం నుంచి లోతులోకి.. మీటర్లలో) జనవరి : 7.06 ఫిబ్రవరి : 8.54 మార్చి : 8.68 ఏప్రిల్ : 8.82 ఏప్రిల్ నెలలో వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి (మీటర్లలో) ఇచ్చోడ : 30.05 గాదిగూడ : 18.35 గుడిహత్నూర్ : 14.50 భోరజ్ : 14.10 ఇంద్రవెల్లి : 13.10 యాపల్‌గూడ : 10.50 ఆదిలాబాద్ : 10.50 వర్షాలు పడితేనే రీచార్జ్ సమయానికి వర్షాలు కురువని పక్షంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బోర్లు ఎండిపోతున్నాయి. మళ్లీ మంచి వర్షాలు పడినప్పుడే రీచార్జ్ అవుతాయి. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలి. – శ్రీవల్లి, భూగర్భజల అధికారి, ఆదిలాబాద్ -
వేసవి శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజన విద్యార్థులు వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లో గల క్రీడామైదానంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఇటీవల స్కోచ్ అవార్డు అందుకున్న పీవోను అధికారులు, పీడీలు, క్రీడా పాఠశాల సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, గిరిజన క్రీడాధికారి పార్థసారధి తదితరులున్నారు. ● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా -
ఆర్టీసీలో ఐఎన్టీయూసీ జెండా ఎగరేయాలి
ఆదిలాబాద్: రానున్న ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ జెండా ఎగురవేయాలని యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సయ్యద్ మహమూద్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జక్కుల మల్లేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులు కాకుండా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు యూనియన్ ముఖ్య పదవుల్లో ఉండాలని సూచించారు. యూనియన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానించి ఈనెల 7నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మెకు మద్దతు తెలుపవద్దని తీర్మానించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం యూనియన్ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు దేవిదాస్చారి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్, ఆర్టీసీ ఐఎన్టీయూసీ నాయకులు సురేందర్, భాస్కర్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
20న సార్వత్రిక సమ్మె
ఆదిలాబాద్‌టౌన్: ఈనెల 20న చేపట్టనున్న సా ర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రిమ్స్ కృష్ణ ఏజెన్సీ సూపర్వైజర్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడ్లుగా తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని అ న్నారు. దేశ వ్యాప్త సమ్మెలో శానిటేషన్ సిబ్బంది, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ గార్డులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో సంఘం నాయకులు చందు, రమేశ్, సంగీత, పద్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
నరేందర్‌కు శ్రమశక్తి అవార్డు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–5 గనిలో విధులు నిర్వర్తిస్తున్న రాంశెట్టి నరేందర్‌ను మేడే సందర్భంగా ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రబారతిలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్ చేతులమీదుగా అవార్డుతోపాటు ప్రశంసపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ శ్రమశక్తి అవార్డు ప్రదానం చేసినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్నారు. తనకు సహకరించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రెటరీ జనరల్ జనక్‌ప్రసాద్, నాయకులు కాంపెల్లి సమ్మయ్య తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
దగ్ధమైన జొన్నపంట పరిశీలన
బజార్హత్నూర్: మండలంలోని దేగామ గ్రామానికి చెందిన 11 మంది రైతులకు సంబంధించిన పదెకరాల్లో ప్రమాదవశాత్తు దగ్ధమైన జొన్న పంటను తహసీల్దార్ శ్యాంసుందర్ గురువారం పరిశీలించారు. జొన్న పంటతోపాటు రెండు టార్పాలిన్, 40 స్పింక్లర్లు, 85 పైప్‌లు, 27 స్పింక్లర్ నౌజల్స్, 1 సోలార్ ఫెన్సింగ్ పలక, బ్యాటరీ కాలిబూడిదైందని తెలిపారు. మొత్తం నష్టం విలువ రూ.8.83 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశామని, రిపోర్టు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తహసీల్దార్ వెంట ఎంఆర్ఐ నూర్సింగ్, బాధిత రైతులు కొడారి నరేశ్, సట్ల రమేశ్, లక్ష్మి, రాజేందర్, శ్రీకాంత్, మహేశ్, ప్రవీణ్ ఉన్నారు. -
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్: వేసవి సెలవుల్లో ఉచిత ంగా అందిస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం యాపల్‌గూడ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధా కంప్యూటర్ ల్యాబ్ (ఏఐ) వేస వి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమ ంలో భా గంగా విద్యార్థులకు తరగతిని బట్టి కంప్యూటర్, డ్యాన్స్, డ్రాయింగ్, ఇండోర్ గేమ్స్, పాటలు, తదితర శిక్షణ ఇవ్వనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుజాత్‌ఖాన్, శ్రీకాంత్‌గౌడ్, ప్రధానోపాధ్యాయుడు తూరాటి గంగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్‌కార్డులకు గ్రీన్ సిగ్నల్
● మార్పులు, చేర్పులకు అవకాశం ● ప్రారంభమైన క్షేత్రస్థాయి విచారణ ● నిరుపేదల నిరీక్షణకు ఎట్టకేలకు తెర కై లాస్‌నగర్: కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. అర్హులందరికీ కార్డులు అందించాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం ఉన్న కా ర్డుల్లోనూ మార్పులు, చేర్పులకు సై తం అవకాశం కల్పించింది. ఇందుకో సం ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. అందుకు అనుగుణంగా రంగంలోకి దిగి న రెవెన్యూ యంత్రాంగం ము న్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల గుర్తింపునకు శ్రీకారం చుట్టింది. దరఖాస్తుదారుల కుటుంబసభ్యుల వివరాలతో పాటు, వారి సమగ్ర సమాచారం సేకరిస్తూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే వారికి కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశముంది. కాగా పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లోని 1,652 మందిని రేషన్‌కార్డుల్లో చేర్చారు. వారి కోసం 10 క్వింటాళ్ల బియ్యం కేటాయించారు. వీరంతా ఈనెలా కోటాలో బియ్యం పొందనున్నారు. జిల్లాలో 51,903 దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ కోసం ప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 51,903 దరఖాస్తులు రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందులో ప్రజాపాలన కార్యక్రమంలో 47,075, మీసేవ కేంద్రాల ద్వారా 4,860 దరఖాస్తులు వచ్చాయి. కొత్త కార్డులు జారీ చేయకపోవడంతో పాటు ఉన్న వాటిలోనూ కొత్తగా సభ్యుల పేర్లను చేర్చకపోవడం, వివరాల మార్పులకు సైతం అవకాశం ఇవ్వకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన మహిళలు, పుట్టిన పిల్లల పేర్లు కార్డుల్లో నమోదుకు నోచుకోలేదు. ఇలాంటి వారికి కూడా అవకాశం కల్పించడంతో వాటికి కూడా పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు 22,963, కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం 19,562 దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయి విచారణ షురూ... ప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా రేషన్‌కార్డుల కోసం అందిన దరఖాస్తుల్లో అర్హుల గుర్తింపునకు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన కార్డుల జారీ, మార్పులు, చేర్పులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం దానిపై దృష్టి సారించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి విచారణ చేపడుతున్నారు. అర్హులను గుర్తించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. సాగునీటి వసతి కలిగిన భూమి అయితే 3 ఎకరాలు, సాగునీటి వసతి లేనటువంటి అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, ఆధార్, మొబైల్ నంబర్, భూమి విస్తీర్ణం, కారు, బైక్ ఉన్నాయా? తదితర వివరాలతో పాటు వారి ఆస్తుల వివరాలను పరిశీలిస్తూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక కుటుంబానికి అయిదెకరాల భూమి ఉండి యాప్‌లో తక్కువ నమోదైతే పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా తిరిగి నమోదు చేస్తున్నారు. ఇలాంటి వివరాల ఆధారంగా అనర్హులను ఏరివేస్తున్నారు. సర్వేలో సాంకేతిక సమస్యలు సర్వేకు వెళ్లిన రెవెన్యూ ఉద్యోగులకు అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన సమయంలో ఆధార్‌కార్డు నంబర్‌కు బదులుగా ఇతరత్రా నంబర్లను నమోదు చేశారు. దీంతో యాప్‌లో ఆధార్‌కార్డును నమోదు చేస్తే అది నమోదు కావడం లేదు. కొంతమంది పాత కార్డుల్లో తమ పేర్లను తొలగించుకోకుండానే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేశారు. ఇలాంటి వారి వివరాలు సైతం యాప్‌లో అప్లోడ్ కావడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ సమస్య తలెత్తడంతో యాప్‌లో వివరాల నమోదుకు ఇబ్బందిగా మారుతున్నట్లు తెలుస్తోంది.జిల్లాలో కొత్తకార్డులకోసం అందిన దరఖాస్తుల వివరాలుప్రజాపాలనలో అందిన దరఖాస్తులు 47,075 అధికారులు పరిశీలించినవి 8,824 అర్హులుగా గుర్తించినవి 8,460 అనర్హులుగా తేలినవారు 311 మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులు 4,860 అధికారులు పరిశీలించినవి 76 పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 4,784సరైన సమాచారమివ్వాలి కొత్త రేషన్ కార్డుల జారీకోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చే రెవెన్యూ సిబ్బందికి దరఖాస్తుదారులు వాస్తవంతో కూడిన సమాచారం అందించాలి. తప్పుడు సమాచారమిస్తే కార్డులు ఇవ్వకపోగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనర్హులు స్వచ్ఛందంగా వారి కార్డులను అధికారులకు సరెండర్ చేయాలి. – ఎండీ వాజీద్ అలీ, డీసీఎస్వో, ఆదిలాబాద్ -
● రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు.. ● రూ.68 కోట్లతో అభివృద్ధి పనులు ● ఈనెల 5న ఆసిఫాబాద్‌కు రానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ● అక్కడి నుంచే వర్చువల్‌గా శంకుస్థాపన ● గుడిహత్నూర్, సీతాగోంది వద్ద కిలోమీటర్ మేర అండర్ పాస్‌లు ● మావల వద్ద సర్వీస్
సాక్షి,ఆదిలాబాద్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే దారిలో ఎన్‌హెచ్ 44పై మధ్యలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ జాతీయ రహదారి సుమారు 80 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ రహదారిపై సరైన వెహికిల్ అండర్‌పాస్ లు, సర్వీస్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణ కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా పరిధిలో వివిధ పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. గుడిహత్నూర్, సీతాగోంది వద్ద అండర్‌పాస్‌లు.. గుడిహత్నూర్ వద్ద కిలోమీటర్ మేర అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. సీతాగోంది వద్ద కూడా కిలోమీటర్ మేర ఆరువరుసల అండర్‌పాస్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ హైవే వెంబడి పలుచోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత వెహికిల్ అండర్‌పాస్ నిర్మించనున్నారు. ప్రధానంగా సరైన వెహికిల్ అండర్‌పాస్‌లు లేకపోవడంతో హైవేను ఒకపక్క నుంచి మరో పక్కకు దాటే విషయంలో గ్రామాల వద్ద పలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోంది. అంతేకాకుండా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయితే జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ రహదారి 44పై పెరుగుతున్న ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నద్ధమైంది. జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న హైవేకు సంబంధించి రూ.68 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈనెల 5న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్న కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చేతుల మీదుగా అక్కడ ప్రారంభోత్సవాలు జరగనుండగా జిల్లా పనులకు సంబంధించి శంకుస్థాపన వారి చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి జరగనుంది.మావల వద్ద సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్.. మావల వద్ద సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పనులను ఇటీవలే మొదలుపెట్టారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హైవే నుంచి కిందికి దిగి గ్రామానికి వెళ్లే సందర్భంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వీస్ రోడ్ నిర్మాణంతో ఇక్కడ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.ఈ సంవత్సరంలోగా పూర్తి.. ఈ పనులను ఈ సంవత్సరంలోగా పూర్తి చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పలు రహదారుల ప్రారంభోత్సవాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించేందుకు కేంద్ర మంత్రులు ఈనెల 5న ఆసిఫాబాద్ రానున్నారు. ఆదిలాబాద్‌కు సంబంధించిన పనులను అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. – శ్రీనివాస్, పీడీ, ఎన్హెచ్ఏఐ, కామారెడ్డి అంచనా వ్యయాలు ఇలా.. వర్క్ అంచనా వ్యయం గుడిహత్నూర్ (అండర్‌పాస్) : రూ.24 కోట్లు సీతాగోంది (అండర్‌పాస్) : రూ.26 కోట్లు మావల (సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్) : రూ.18 కోట్లు -
టీజీహెచ్వో రాష్ట్ర అధ్యక్షునిగా సందీప్‌కుమార్
ఉట్నూర్‌రూరల్: తెలంగాణ రాష్ట్ర ఉద్యా న అధికారుల సంఘం (టీజీహెచ్వో) రాష్ట్ర అధ్యక్షునిగా ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన అధికారి సందీప్‌కుమార్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గెజిటెడ్ భవన్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శి సత్యనారాయణ, ఎన్నికల అధికారి శ్రీరాంరెడ్డి, సహాయ ఎన్నికల అధికారి శ్రీనిశ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో తనను ఉద్యాన అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు సందీప్‌కుమార్ తెలిపారు. ఉద్యాన అధికారుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా తనవంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉద్యాన అధికారుల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. -
బస్సును ఢీకొన్న ట్యాంకర్
● కోకస్‌మాన్నూర్ వద్ద ఘటన ● ఒకరు మృతి ● 22 మందికి గాయాలు ఇచ్చోడ: బస్సును ట్యాంకర్ ఢీకొన్న ఘటన మండలంలోని కోకస్‌మాన్నూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 22 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ వైపు నుంచి ఆదిలాబాద్ వైపు ఆర్టీసీ బస్సు వస్తుంది. పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుకాల నుంచి వస్తున్న ట్యాంకర్ వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు డివైడర్ పైకి ఎక్కింది. ట్యాంకర్ రోడ్డు పక్క ఆటో, టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీకొని పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న జైనథ్ మండలం మండగడకు చెందిన భీమక్క(56) తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది, అటోలో 5గురు, టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై ఇద్దరు మొత్తం 22 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనలో నాలుగు పశువులు అక్కడిక్కడే మృతిచెందాయి. ప్రమాదానికి కారణమైన పశువుల యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
గిరిజన గురుకులాల్లో 99 శాతం ఉత్తీర్ణత
ఉట్నూర్‌రూరల్: పది ఫలితాల్లో గిరిజన గురుకులాలు 99 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. గత విద్యాసంవత్సరం 96.33 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి మూడు శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 గిరిజన బాల, బాలికల గురుకులాల్లో బాలికలు 591 మంది, బాలురు 253 మంది ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని అమలు చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది కృషి ఉందంటూ పీవో, ఆదిలాబాద్ ఆర్సీవో అగస్టిన్ అభినందించారు. ‘పరిహారం అందేలా చూస్తాం’నెన్నెల: వడగళ్ల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరి హారం అందేలా చూస్తామని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి గుండ్లసోమారం, బొప్పారం, చిత్తాపూర్, ఆవుడం, గంగారాం, మైలారం, గొల్లపల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రై తులతో మాట్లాడారు. గుండ్లసోమారంలో ఇళ్లు కూ లిపోయిన బాధితులకు పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. భీమిని ఏడీ ఏ సురేఖ మాట్లాడుతూ మండలంలో సుమా రు 150 ఎకరాల్లో వరి, ఐదు ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక పరి శీలనలో తేలిందని అన్నారు. సుమారు 300 ఎకరాల్లో వందమంది రైతులకు సంబంధించిన మామిడి కాయలు నేలరాలినట్లు గుర్తించామని ఉద్యానవన అధికారి అరుణ్ తెలి పారు. తహసీల్దార్ మహేంద్రనాథ్, ఏఓ సృజన, ఏఈఓలు రాంచందర్, శైని, మాజీ జెడ్పీటీసీ సింగతి శ్యామలరాంచందర్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో పశువుల దొంగలు!మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో రోడ్లపై పడుకుని ఉన్న పశువులను ఎత్తుకెళ్లిన దొంగలు పో లీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. జన్మభూమినగర్ ప్రాంతంలోఓ పశువును కొ ందరు ఎత్తుకెళ్లి ఆటోలో తరలిస్తుండగా పోలీ సులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఆటోడ్రైవర్‌తోపాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
కలెక్టరేట్ ఎదుట తుడుందెబ్బ ధర్నా
కైలాస్‌నగర్: ఆదివాసీలపై జరుగుతున్న మారణహోమం, దమనకాండను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల పేరిట వేలాది మంది ఆదివాసీలను హతమార్చడం శోచనీయమన్నారు. ఆదివాసీ మహిళలపై అత్యాచారం, హత్యలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. అనంతరం అధికారులెవరూ రాకపోవడంతో కలెక్టరేట్ మెయిన్ గేట్‌కు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు వెట్టి మనోజ్, గోడం రేణుక, ఉయిక ఇందిర, ఆత్రం గణపతి, కుడ్మెత జంగు, దుర్వ జుగాదిరావు, తదితరులు పాల్గొన్నారు. -
● ఎస్సీ వసతిగృహాల్లో నియామకం ● కాళేశ్వరం జోన్లో 19మంది రిపోర్టు
మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతిగృహా సంక్షేమాధికారులుగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి బుధవారం రాత్రి నియామక పత్రాలు అందజేశారు. గత ఏడాది జూన్ 24నుంచి 29వరకు కంప్యూటర్ ఆధారిత(సీఆర్‌బీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించగా సెప్టెంబర్ 20న ఫలితాలు విడుదలయ్యాయి. కాళేశ్వరం జోన్ పరిధిలో 24మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసిన పంపగా.. ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రాలేదు. దీంతో 19మందికి నియామక పత్రాలు అందజేయగా.. గురువారం కేటాయించిన వసతిగృహాల్లో రిపోర్టు చేశారు. వీరిలో 12మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు 8, పెద్దపల్లికి 5, ఆసిఫాబాద్‌కు 4, ములుగుకు 1, జయశంకర్ భూపాలపల్లికి 1 అభ్యర్థిని ఎస్సీ వసతిగృహా సంక్షేమ అధికారులుగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల ఆప్షన్ల మేరకు పోస్టింగ్‌లు కేటాయించారు. నియామకపత్రాలు అందజేస్తున్న ఎస్సీ డీడీ రవీందర్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూవో రవీందర్‌గౌడ్ కాళేశ్వరం జోన్లో ఇలా.. మంచిర్యాల జిల్లాలో.. అభ్యర్థి పేరు కేటాయించిన పోస్టింగ్ యాసం శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్‌హాస్టల్, కోటపల్లి చీపెల్లి శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, మందమర్రి చండి రజనీకాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, తాండూర్ చిందికింది ప్రశాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, దండేపల్లి అల్గూనూరి భార్గవ్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చెన్నూర్ డి.శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చింతగూడ టి.రాజు ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్, బెల్లంపల్లి సద్గుణ, కూడెల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్, లక్సెట్టిపేట ఆసిఫాబాద్ జిల్లా.. రాహుల్‌కుమార్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, ఆసిఫాబాద్ జలంపల్లి ప్రేమ్‌కుమార్ కాలేజీ బాయ్స్ హాస్టల్, కాగజ్‌నగర్ ఈశ్వరి ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్, ఆసిఫాబాద్ రత్నం కవిత ఎస్సీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ కాగజ్‌నగర్ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో.. తోట శైలజ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్‌సీ(గర్ల్స్), పెద్దపల్లి ఇసంపల్లి రమ్య ఎస్సీ గర్ల్స్ హాస్టల్, మంథని ప్రశాంత్ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్‌సీ బాయ్స్ హాస్టల్, మంథని డి.తిరుపతి ఎస్సీడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్, మంథని సాధుల రమేష్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, మంథని ఎ.స్వాతి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రేగోండ డి.మమత ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఏటూరునాగారం -
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్‌గౌడ్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు బార్ అసోసియేషన్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని, కానీ అవి బార్ కౌన్సెలింగ్‌కు రాలేదన్నారు. న్యాయవాదులకు ఆరోగ్యపరంగా ప్రైవేట్ చికిత్సలు చేయించుకోవడానికి రూ.10లక్షల వరకు నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, ప్రధాన కార్యదర్శి డీఎస్పీ శర్మ, బార్ అసోసియేషన్ సభ్యులు చందుసింగ్, రమణయ్య, అఖిలేశ్, ముజాహి ద్, తదితరులు పాల్గొన్నారు. -
పత్తి విత్తనాల కొరత లేకుండా చూడాలి
కై లాస్‌నగర్: రానున్న వానాకాలం సీజన్లో పత్తి విత్తనాల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాల ని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి విత్తనాల లభ్యతపై కంపెనీ లు, డిస్ట్రిబ్యూటర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈఏడాది జిల్లాలో 4లక్షల 40వేల ఎకరాల్లో పత్తి పండించవచ్చని అంచనా ఉందని, ఇందుకు 11 లక్ష ల విత్తన ప్యాకెట్లు అవసరం కాగా వివిధ కంపెనీలు 21లక్షల 61వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంచా యన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు విత్తన డీలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నకిలీ విత్తనాలు అరికట్టేలా చూడాలన్నారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గ్రామాల వారీగా షెడ్యూల్ రూపొందించి విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
పాఠశాలల్లో మరమ్మతు పూర్తిచేయాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష ఉట్నూర్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సెలవులు ముగియకముందే మరమ్మతు పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల డీఈలు, ఏఈలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, ఏజెన్సీ గ్రామాల్లో చేపడుతున్న మరమ్మతులు ఎంతవరకు పూర్తి చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గేట్లను, ఆర్వో ప్లాంట్ల మరమ్మతు చేయించాలని సూచించారు. భోజనశాలల భవనాల షెడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలన్నారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని, అంగన్వాడీ మోడల్ స్కూల్, మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంక్, డార్మంటరీ గదుల మరమ్మతు పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో గదుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఈఈ తానాజీ, డీఈ శివప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు. -
సీపీఆర్‌ఎంఎస్‌లో గందరగోళం
శ్రీరాంపూర్: సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు సంస్థ కాంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీం(సీపీఆర్ఎంఎస్) సదుపాయం కల్పించింది. ఈ స్కీం కింద హెల్త్‌కార్డులు పొందిన కార్మికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తమకు కార్డులో ఎంత మొత్తం ఖర్చయిందో, ఇంకా ఎంత మిగిలి ఉందో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు ఈ స్కీం కింద చేరాలంటే రూ.60 వేలు ముందుగా చెల్లించాలి. గతంలో ఈ మొత్తం రూ.40 వేలుగా మాత్రమే ఉండేది. ఈ మొత్తాన్ని సర్వీసులో ఉండగానే రికవరీ చేస్తారు. ఈ స్కీం రాక ముందు రిటైర్డ్ అయిన వారు తర్వాత డబ్బులు చెల్లిస్తే వారికి కూడా కార్డులు అందించారు. ఈ కార్డు కింద రిటైర్డ్ కార్మికునికి, ఆయన భార్యకు కలిపి రూ.8 లక్షల వైద్యం చేయించుకోవచ్చు. ఈ మొత్తం ఖర్చయితే ఇక అంతే. మళ్లీ రూ.60 వేలు చెల్లిస్తామన్నా కూడా కార్డు ఇవ్వరు. వన్‌టైం కిందే కార్డు ఇస్తారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆసుపత్రులు, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులతో కంపెనీ ఈ కార్డుతో చికిత్స అందించేలా అనుసంధానం చేసుకుంది. ఆ ఆసుపత్రులకు కార్డు పట్టుకుని రిటైర్డ్ కార్మికుడు వెళ్తే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. భార్యాభర్తలిద్దరికి కలిపి రూ.8 లక్షల విలువ గల చికిత్స పొందవచ్చు. బ్యాలెన్స్ వివరాలు లేవు.. రిటైర్డ్ కార్మికుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ముందుగా అతను అక్కడ కార్డు చూపించి అడ్మిట్ అవుతారు. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడానికి ముందు సదరు ఆసుపత్రి యాజమాన్యం కంపెనీ సీఎంఓకు వైద్య ఖర్చుల బిల్లులను ఎస్టిమేట్ చేసి పంపుతారు. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఐతే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సదరు రిటైర్డ్ ఉద్యోగికి తన కార్డులో ఎంత మొత్తం ట్రీట్మెంట్ కింద కట్ అయిందో తెలియడం లేదు. కంపెనీ వారు చెప్పడం లేదు. ఆసుపత్రి వారు చెప్పే అంచనే తప్ప, డిశ్చార్చి అయిన తర్వాత తన వైద్యానికి ఆసుపత్రుల్లో కార్డు నుంచి ఎంత మొత్తం కట్ అయిందో తెలియక వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ కార్యాలయం వద్దకు వెళ్లి అడిగిన కూడా వివరాలు ఇవ్వడం లేదు. మళ్లీ ఏదైనా జబ్బు పడ్డప్పుడు దానికి సరిపడా డబ్బులు కార్డులో ఉన్నాయా లేవో అని గందరగోళపడుతున్నారు. ఖర్చు, మిగులు ఎంతో తెలియదు లెక్క చెప్పాలంటున్న రిటైర్డ్ కార్మికులు ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు ఎస్ఎంఎస్ అలర్ట్ పెట్టాలి రిటైర్డ్ కార్మికుడు ఆసుపత్రిలో డిశార్చి అయిన వెంటనే అతని సెల్‌ఫోన్‌కు ఎంత మొత్తం కార్డు నుంచి వైద్యానికి కట్ అయిందో వారి ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా యజమాన్యం ఏర్పాటు చేయాలి. కనీసం జీఎం కార్యాలయానికి వెళ్లి అడిగిన అక్కడ వివరాలు చెప్పేలా ఏర్పాటు చేయాలి. ఇవేవి లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. – నాతాడి శ్రీధర్‌రెడ్డి, బీఎంఎస్ ఎస్సార్పీ బ్రాంచి ఉపాధ్యక్షుడు -
‘సీఐటీయూ పోరాటాలతోనే వేసవి సెలవులు’
ఆదిలాబాద్: సీఐటీయూ ఐక్య పోరాటాల ఫలితంగానే అంగన్వాడీ కేంద్రాలకు మేలో వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన రాజీలేని ఆందోళనలతోనే మంత్రి సీతక్క సెలవులు ప్రకటించారన్నారు. అయితే కొంతమంది అధికారులు మాత్రం అ ధికారికంగా సర్క్యులర్ రాలేదని అనడం సరి కాదన్నారు. ఇదే స్ఫూర్తితో సమస్యల పరిష్కా రం కోసం, హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేశ్, నాయకులు మల్లి కాంబ, మధునిక, కవిత, ప్రియాంక, మనీషా, పద్మ, జయశ్రీ, శకుంతల, లక్ష్మి, పాల్గొన్నారు. జూన్ 3 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలుఆదిలాబాద్టౌన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 16 వరకు పాఠశాలల్లో ఫీజు చెల్లించాలని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. -
అధికార లాంఛనాలతో సీఆర్పీఎస్ జవాన్ అంత్యక్రియలు
● హాజరైన సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లుభీమారం: గుండెపోటుతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రామళ్ల సాగర్‌కు అధికార లాంఛనాలతో గురువారం భీమారంలో అంత్యక్రియలు నిర్వహించారు. భీమారం మండలకేంద్రానికి చెందిన సాగర్ సీఆర్పీఎఫ్ జవాన్‌గా శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం ఆయన మంచిర్యాలలోని ఫంక్షన్‌కు వెళ్లగా గుండెపోటుతో మృతిచెందాడు. హకీంపేట్‌లోని సీఆర్పీ ఎఫ్ అసిస్టెంట్ కమాడెంట్ రాకేశ్ దేహార్య, జవాన్లు అంత్యక్రియలకు హాజరై తల్లిదండ్రులు గట్టయ్య, కళ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో అధికారులు పాల్గొని పాడె మోశారు. శ్మశానవాటికలో మృతదేహానికి జాతీయజెండా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి నివాళులర్పించారు. అంత్యక్రియలకు గ్రామస్తులు తరలివెళ్లారు. -
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
కై లాస్‌నగర్: ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా చేపట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బల్దియా వార్డు ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారికే ఇళ్లు దక్కేలా చూడాలన్నారు. అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. లబ్ధి దారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలు జరి గినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్ డీఈ కార్తీక్ పాల్గొన్నారు. -
పంప్‌హౌజ్ వద్ద ప్రత్యేక పూజలు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణానికి 6 ఎంఎల్డీల నీటిని సరఫరా చేసే లాండసాంగ్వి పంప్‌హౌజ్ ఇటీవల పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. అయితే కలెక్టర్ చొరవతో రూ.40 లక్షల వ్యయంతో పూడికతీత, ఇన్‌టెక్‌వెల్ మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో భూగర్భజలాలు ఆశించిన దానికంటే అధికంగానే ఉబికి వచ్చాయి. వర్షాకాలంలాగే పూర్తిస్థాయిలో పట్టణానికి నీటి సరఫరా చేసే అవకాశం లభించింది. దీంతో గురువారం మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రావణ్ కుమార్, ఎంఈ పేరి రాజు పంప్‌హౌజ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సంప్రదాయబద్ధంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. అనంతరం పట్టణానికి నీటిని సరఫరా చేసే మోటార్లను ప్రారంభించారు. దేవుని ఆశీస్సులతో పట్టణానికి నీటి సమస్య తప్పిందని వారు అభిప్రాయపడ్డారు. వేసవిలోనూ 6 ఎంఎల్డీల నీరు పట్టణంలోని 19 వార్డులకు సరఫరా అవుతుందని వారు పేర్కొన్నారు. -
జిల్లాలో గంజాయిని కనుమరుగు చేస్తాం
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్:జిల్లాలో గంజాయిని కనుమరుగు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం గంజాయి కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లాలో మార్చి 10 నుంచి ఇప్పటి వరకు 34 కేసులు నమోదు చేశామని, 12 కిలోల డ్రై గంజాయి, 181 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని 56 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. వాటి విలువ రూ.23,21,550 ఉంటుందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపడుతోందని, గంజాయి వ్యాపారులను, పండించే వారిని, వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందే సౌకర్యాలను నిలిపివేసేలా కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. తప్పు చేసిన ప్రతిఒక్కరిని శిక్షిస్తామని, ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. గంజాయి సాగు చేసిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
ఇసుక రాయల్టీ తీసుకున్న వీడీసీ సభ్యులపై కేసు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): ఇసుక రాయల్టీ తీసుకున్న పెండల్వాడ, సాంగ్వి వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. గురువారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గతనెల 13న భోరజ్ మండలం పెండల్వాడ గ్రామ శివారులో పెన్‌గంగా నది నుంచి ఇసుక తీసుకోవడానికి ట్రాక్టర్ డ్రైవర్ వచ్చాడు. వీడీసీ సభ్యులు భూమారెడ్డి, అతని సోదరుడు రామ్రెడ్డితోపాటు మరికొంత మంది సభ్యులు అతని వద్ద రూ.500 రాయల్టీ అక్రమంగా తీసుకున్నారు. దీంతోపాటు ఆయనతో దుర్భాషలాడి బెదిరించారు. సాంగ్వి గ్రామంలో ఇసుక తరలింపులో వసూళ్లకు పాల్పడుతున్న అశోక్, మరికొందరిపై ట్రాక్టర్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో జైనథ్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
ఇంటర్నేషనల్ కరాటే సెమినార్లో ప్రతిభ
బెల్లంపల్లి: కేరళ రాష్ట్రంలో గతనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ ఇంటర్నేషనల్ సిటోరియా కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా టెక్నికల్ సెమినార్లో మాస్టర్లు ప్రతిభకనబర్చారు. పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పాల్గొనగా, రాష్ట్రం నుంచి ఏడుగురు మాస్టర్లు హాజరయ్యారు. టెక్నికల్ సెమినార్లో నైపుణ్యత కనబర్చిన మాస్టర్లకు జపాన్‌కు చెంనని కేఎస్కేఎస్ఐ ఫౌండర్ గ్రౌండ్ మాస్టర్ సోకే కేఎన్యూమ భూని ప్రతిభ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సర్టిఫికెట్లు అందుకున్న వారిలో రమేశ్‌కుమార్, విజ్జగిరి రవి, సారిక రాజు, మారపాక దేవయ్య, ఎస్.సురేశ్, సోలంకి అశోక్, నారాయణ శెట్టి శ్రీనివాస్ ఉన్నారు. వీరిని పలువురు అభినందించారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
తానూరు: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బోల్సా గ్రామానికి చెందిన అక్కం రమేశ్ గతకొన్నేళ్లుగా మద్యానికి బానిసై పని చేయకుండా తిరుగుతున్నాడు. భర్త తాగుడు మానడం లేదని కుమారుడు, కుమార్తెతో కలిసి భార్య స్వరూప పుట్టిల్లు అయిన ముధోల్‌కు వెళ్లింది. రెండునెలల క్రితం రమేశ్ ముధోల్‌కు వెళ్లి భార్యతో ఉంటున్నాడు. భార్య కాపురానికి రావాలని అడిగితే రాకపోవడంతో ఒక్కడే రెండురోజుల క్రితం బోల్సా గ్రామానికి వెళ్లాడు. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మిబాయి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎస్సై తెలిపారు. -
ఉమెన్స్ హ్యాండ్‌బాల్ విజేత ఉమ్మడి ఆదిలాబాద్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మూడు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి 54వ సీనియర్ మహిళల తెలంగాణ హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది. బుధవారం ఫైనల్మ్యాచ్లో ఈ జట్లు తలపడగా ఆదిలాబాద్ జట్టు 13, రంగారెడ్డి జిల్లా జట్టు 11 గోల్స్ వేసింది. మూడో స్థానంలో వరంగల్, నాలుగో స్థానంలో ఖమ్మం జట్లు నిలిచాయని, గెలిచిన జట్లకు నిర్వాహకులు షీల్డ్‌లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జట్టు కోసం 20 మందిని ఎంపిక చేసి వరంగల్‌లో కోచింగ్ ఇస్తామన్నారు. గుజరాత్‌లోని బూజ్లో ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ ఉమ్మడి 10 రాష్టాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పవన్‌కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కాంపెల్లి సమ్మయ్య, కోశాధికారి రమేశ్‌రెడ్డి, గ్రౌండ్ ఇన్చార్జి నస్పూరి తిరుపతి పాల్గొన్నారు. ● రన్నరప్‌గా రంగారెడ్డి జట్టు -
భూభారతితో సమస్యలు పరిష్కారం●
ఆదిలాబాద్‌టౌన్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి నారాయణ స్వా మి ఆలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. చట్టం విధివిధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రత్యేక కౌంటర్ల ద్వారా రైతుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగనుందన్నా రు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, జైనథ్ పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. బేల: భూభారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, ఎమ్మెల్యే శంకర్, ఆర్డీవో వినోద్‌కుమార్, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ విలా స్, మండల ప్రత్యేకాధికారి మనోహర్‌రావు, తహసీల్దార్ రఘునాథ్‌రావు, డీటీవామన్రావు, ఎంపీడీవో మహేందర్‌కుమార్, ఏవో సాయితేజరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘ఎర్లీబర్డ్’ గడువుకై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ముందస్తు ఆస్తి పన్ను వసూలు కోసం ప్రభుత్వం అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం గడువు బుధవారంతో ముగిసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులను ముందస్తుగా చెల్లించిన వారికి ఈ స్కీం కింద ప్రభుత్వం ఐదు శాతం రాయితీ కల్పించింది. పన్ను చెల్లింపునకు చివరి రోజు కావడంతో బల్దియా యంత్రాంగం, బిల్ కలెక్టర్లు మండుటెండ సై తం లెక్క చేయకుండా తమకు కేటాయించిన కాలనీల్లో విస్తృతంగా తిరిగారు. ఇంటింటికి వెళ్లి పన్ను చెల్లించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. అయితే ఈనెల వ్యవధిలో ఎంత పన్ను వ సూలైంది ఇంకా లెక్కతేలలేదు. గతేడాదితో పో ల్చితే అధికంగా ఉంటుందా.. వెనకబడ్డారా అనేది గురువారం వెల్లడయ్యే అవకాశముంది. -
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీర్ణత ● గతేడాదితో పోల్చితే 4.47 శాతం పెరుగుదల ● రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానం ● 65 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం పాస్
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ విద్యార్థులుఆదిలాబాద్టౌన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 97.40 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది జిల్లా 17వ స్థానంలో నిలవగా, ఈసారి 8 స్థా నాలు మెరుగుపర్చుకొని రాష్ట్రస్థాయిలో 9వ స్థా నానికి ఎగబాకింది. సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సెస్సీ ఫలి తాలను బుధవారం విడుదల చేశారు. జిల్లాలో బా లుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ప్రభుత్వ యాజమా న్య పాఠశాలలు ఈ సారి మంచి ఫలితా లు సాధించాయి. 65 పాఠశాలల్లో వంద శాతం ఉ త్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాలు గ్రేడింగ్‌లో కాకుండా మార్కుల రూపంలో విడుదలయ్యాయి. మెరుగైన ఫలితాలు.. జిల్లాలో మొత్తం 10,028 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 9,767 మంది ఉత్తీర్ణత సాధించారు. 97.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 5,049 మంది హాజరు కాగా, 4,890 మంది ఉత్తీర్ణులయ్యారు. 96.85 శాతం ఉతీర్ణత నమోదైంది. బాలికలు 4,979 మంది హాజరు కాగా, 4877 మంది పాస్ అయ్యారు. 97.95 ఉత్తీర్ణత శా తం నమోదైంది. ఉత్తీర్ణత శాతం పరంగా మెరుగుపడగా, రాష్ట్రస్థాయిలో టాప్–10లో నిలిచారు. ఆ శ్రమ పాఠశాలల్లో 98.73 శాతం, బీసీ వెల్ఫేర్‌లో 99.69, ప్రభుత్వ యాజమాన్యంలో 87.70, కేజీబీ వీల్లో 97.64, మోడల్ స్కూళ్లలో 99.82, ప్రైవేట్ పాఠశాలల్లో 98.76, మినీ రెసిడెన్షియల్లో 97.12, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 100 శాతం, ట్రైబ ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 99.76, జెడ్పీ యాజమాన్యంలో 96.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 3నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజుల గడువు ఉంది. రీకౌంటింగ్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, వాటిని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 16 వరకు గడువు ఉందని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో 65 పాఠశాలల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్ బంగారుగూడ, పొచ్చర, ప్రభుత్వ పాఠశాల ఖానాపూర్, తాటిగూడ, హిందీ హైస్కూల్, కేజీబీవీ ఆదిలాబాద్‌రూరల్, స్పోర్ట్స్ స్కూల్, మోడల్‌స్కూల్ బజార్హత్నూర్, దహెగావ్, పిప్పిరి, కేజీబీవీ బేల, సిర్సన్న, సాంగిడి, కొగ్దూర్, కరంజి, పిప్పల్‌కోటి, భీంపూర్, ప్రభుత్వ పాఠశాల బోథ్, మోడల్ స్కూల్ బోథ్, ధన్నూర్(బి), కౌఠ(బి), మర్లపల్లి, పొచ్చర, కన్గుట్ట, బోరిగామ, కేజీబీవీ ఇచ్చోడ, కోకస్మన్నూర్, కేజీబీవీ గాదిగూడ, ప్రభుత్వ పాఠశాల గుడిహత్నూర్, కేజీబీవీ తోషం, కొల్హారి, మన్నూర్, కేజీబీవీ ఇంద్రవెల్లి, ముత్నూర్, మోడల్‌స్కూల్ జైనథ్, దీపాయిగూడ, గిమ్మ, కౌట, పెండల్వాడ, అడ, పిప్పర్వాడ, బాలాపూర్, కూర, సరస్వతినగర్, వాగాపూర్, కేజీబీవీ నార్నూర్, మోడల్‌స్కూల్ నార్నూర్, జెడ్పీఎస్ఎస్ నార్నూర్, తడిహత్నూర్, భీంపూర్, నేరడిగొండ, వాంకిడి, తేజాపూర్, కేజీబీవీ తలమడుగు, బరంపూర్, కుచులాపూర్, తలమడుగు, కజ్జర్ల, లింగి, పల్లి(బి), ఘోట్కురి, కప్పర్ల, తాంసి, పొన్నారి పాఠశాలలు ఇందులో ఉన్నాయి. మంచి ఫలితాలు సాధించాం పదో తరగతిలో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. గతేడాదితో పోల్చితే ఈ సారి దాదాపు ఐదు శాతం ఉత్తీర్ణత పెరిగింది. కలెక్టర్ రాజర్షిషా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. కరదీపికలను అందజేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. 97.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో సబ్జెక్టుల వారీగా.. జిల్లాలో సబ్జెక్టుల వారీగా ఫలితాలను చూస్తే.. తెలుగులో 99.02 శాతం, సెకండ్ లాంగ్వేజ్‌లో 99.75 శాతం, ఇంగ్లీష్‌లో 99.35 శాతం, గణితంలో 98.87 శాతం, సామాన్య శాస్త్రంలో 98.58 శాతం, సాంఘిక శాస్త్రంలో 99.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కలెక్టర్ ప్రశంసఆదిలాబాద్టౌన్: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడంపై కలెక్టర్ రాజర్షిషా హర్షం వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులను ప్రశంసించారు. డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీసీఈబీ సెక్రెటరి కందుల గజేందర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూ చించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభా కాంక్షలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలని, సప్లిమెంటరీ పరీక్షల్లో వారు కూడా ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు.సర్కారు విద్యార్థుల సత్తా..పదో తరగతి ఫలితాల్లో ఈ సారి జిల్లా విద్యార్థులు అత్యుత్తమంగా రాణించారు. గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు సాధించడంతో డీఈవో శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. బంగారిగూడ మోడల్ స్కూల్‌కు చెందిన చిల్కూరి రమ 578 మార్కులు సాధించగా.. సట్లవార్ హర్ష్ 575, హర్షవర్ధన్ 569, కేజీబీవీలో నేరడిగొండకు చెందిన విద్యార్థిని హార్థిక 564, తలమడుగు కేజీబీవీ విద్యార్థిని శైలజ 563, ఆదిలాబాద్‌రూరల్ కేజీబీవీలో వైశాలి 557, సంస్కృతి 556, మయూరి 550, గాదిగూడ కేజీబీవీకి చెందిన విద్యార్థిని లత 552, భోరజ్ మండలం పిప్పర్వాడ జెడ్పీ పాఠశాలకు చెందిన వగాడే అమృత 560 మార్కులు సాధించారు. -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఇంద్రవెల్లి: వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా ఉపాధి పొందుతున్న హమాలీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉట్నూ ర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. ఇంద్రవెల్లి, నార్నూర్ మార్కెట్ యార్డులకు హమాలీల ఎంపిక ప్రక్రియను స్థానిక మా ర్కెట్ యార్డులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ హమాలీ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీవో బి మోహన్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మారుతి డొంగ్రె, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈవో ధరంసింగ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్ వద్ద కూర్చున్న సాగర్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్‌ను అభినందించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 96 శాతం ఫలితాలు సాధించినట్లు ఏసీఎంవో జగన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 108 పాఠశాలలు, అందులో 65 పాఠశాలలు వంద శాతం వచ్చాయని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ఐటీడీఏ పీవో సారథ్యంలో చేపట్టిన మిషన్ లక్ష్యం ఎంతో మేలు చేసిందన్నారు. వచ్చే ఏడాదిలో పదిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఐటీడీఏ పీవో పేర్కొన్నారు. -
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలుకెరమెరి(ఆసిఫాబాద్): ఆనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. జూన్ 8న మృగశిరకార్తె ప్రవేశించనుండడంతో ఆదివాసీలు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన జంగుబాయికి పుణ్యక్షేత్రంలో విత్తన పూజకు శ్రీకారం చుట్టారు. అక్కడి గుహలోకి వెళ్లి దీపం వద్ద పూజలు చేస్తారు. రావుడ్, పోచమ్మ, మైసమ్మకు విత్తనాలు చూపించి మొక్కి అమ్మవార్లకు నైవేద్యం చూపిస్తారు. విత్తన పూజల అనంతరం తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దీన్ని గోండి భాషలో ‘మొహతుక్’అంటారు. అదేవిధంగా గిరి గ్రామాల్లో ఏటా జరిగే విత్తన పూజల ముందుగా జంగుబాయి అమ్మవారికి విత్తనాలు చూపెట్టాక పొలాల్లో నాటడంతో అధిక దిగుబడి వస్తాయని భక్తుల నమ్మకం. నేడు దీపోత్సవం జంగుబాయి సన్నిధిలో గురువారం దీపోత్సవం, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. వివిధ గ్రామాలకు చెందిన మోళంలు తరలివచ్చి పూజలు చేస్తాయి. దుక్కిలతో దున్ని విత్తనాలు వేసేందుకు తమ పొలాలను రైతులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలోనే ఆదివాసీలు అధికంగా ఉన్నారు. దేవతలకు విత్తనాలు చూపిస్తారు మే మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకిపేన్, అమ్మోరు, పోచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అదే రోజు రాత్రి 2.5 కిలోల జొన్నలతో గట్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ కార్యక్రమంతా మృగశిర మాసానికి కొద్ది రోజుల ముందుగా నిర్వహిస్తారు. విత్తన పూజలు(మొహతుక్) విత్తన పూజ చేయాలన్న రోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడుతారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసి పేడతో అలుకు చల్లుతారు. పొలానికి వెళ్లాక జొన్నతో గట్కా తయారు చేసి కులదైవంతోపాటు నేల తల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామ పటేల్ ఇంటి ఎదుట మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. తర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్, మే మాసంలో విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో అన్ని విత్తనాలను కలిపి భీమల్ దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడ్తారు. ఆరోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో ఆ విత్తనాలను తమ పొలాల్లో చల్లుతారని పలువురు చెబుతున్నారు. దేవతలకు చూపించాకే.. పొలాల్లో విత్తనాలు నాటే కొన్నిరోజుల ముందు కుల దేవతలకు వాటిని చూపిస్తాం. ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను వండి ఆరగిస్తాం. నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – సలాం శ్యాంరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆచారాలు పాటిస్తున్నాం ఆదివాసీలు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైన విత్తన(మొహతుక్) పూజలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. పూజలు చేయందే విత్తనాలు నాటం.– పుర్క బాపూరావు, జంగు బాయి ఉత్సవ కమిటీ, ప్రచార కార్యదర్శి -
తాత్విక ధోరణితో సమున్నత జీవితం
● ’జీవితమే ఒకపుస్తకం’ గ్రంథ పరిచయ కార్యక్రమంలో సాహితీవేత్తలు ● జిడ్డు కృష్ణమూర్తి ఆంగ్ల పుస్తకాన్ని అనువదించిన జిల్లా కవి నిర్మల్‌ఖిల్లా: తాత్విక ధోరణి ద్వారానే సమున్నత జీవితం సిద్ధిస్తుందని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కావేరి ఫౌండేషన్ గ్రంథాలయంలో మంగళవారం రాత్రి ‘జీవితమే ఒక పుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనువాదకర్త కె.మచ్చేందర్..ప్రపంచ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల సమాహార గ్రంథం ‘ది బుక్ ఆఫ్ లైఫ్’అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాటు కష్టపడి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, సాహితీవేత్తలు టి.సంపత్ కుమార్, నరసయ్య, రవీంద్రబాబు, తుమ్మల దేవరావు, కృష్ణంరాజు, మునిమడుగుల రాజారావు, ఆకుల సుదర్శన్, అంబటి నారాయణ, అనిత, నాగరంజని, నూకల విజయ్‌కుమార్, దీపక్, పోలీస్ భీమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మన పాత కలెక్టరే.. కొత్త సీఎస్
‘నన్ను ప్రేమతో, ఆప్యాయతతో స్వాగతించినందుకు కృతజ్ఞతలు.. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి.. ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లా ఇది.. అప్పటి రాజకీయ నాయకులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నారు..’ ఈ మాటలన్నది కొత్త సీఎస్ కె.రామకృష్ణారావు. ఏప్రిల్ 18న భూభారతి అవగాహన సదస్సు కోసం రాష్ట్ర మంత్రులు జిల్లాలోని భోరజ్ మండలం పూసాయి గ్రామానికి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో రామకృష్ణారావు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా వేదిక పైనుంచి ఆయన జిల్లాతో అనుబంధాన్ని పంచుకున్నారిలా. – సాక్షి,ఆదిలాబాద్కొత్త సీఎస్‌గా నియమితులైన కె.రామకృష్ణారావుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన 2000 సంవత్సరం జూలై 7 నుంచి 2002 అక్టోబర్ 25 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్లకు పైగా జిల్లాలో విధులు నిర్వహించిన ఆయన ఈ ప్రాంతవాసులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉండగా, ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యే వారు. దీంతోనే ఆయన ఇక్కడినుంచి వెళ్లిపోయి ఏళ్లు దాటినా ప్రజలు ఇప్పటివరకు గుర్తుంచుకున్నారంటే ఆ అనుబంధమే కారణం. అభివృద్ధికి తోడ్పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు ఆయన తోడ్పాటునందించారు. ప్రధానంగా అప్పట్లో జిల్లా కేంద్రానికి తొలిసారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసింది రామకృష్ణారావు హయాంలోనే. అప్పట్లో జిల్లా మీదుగా విస్తరించి ఉన్న జాతీయ రహదారి నం.7 ఒక వరుస రహదారిగా ఉండేది. ఆ సమయంలో నిర్మల్ జిల్లా వద్ద వేకువజామున ఓ భారీ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కేంద్రం నుంచి సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుల సహాయార్థం ఆయన తీసుకున్న చొరవ ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటారు. అలాగే జిల్లాలో వరదలు పోటెత్తిన సమయంలో కారు వెళ్లలేని గ్రామాల్లో ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్లి వరద బాధితుల సహాయార్థం చర్యలు తీసుకున్నారు. ఈవిధంగా రామకృష్ణారావు జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఆయన కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాతో రామకృష్ణారావుకు అనుబంధం 23 ఏళ్ల క్రితం ఇక్కడే విధులు ఇటీవల ‘భూ భారతి’ సదస్సుకు హాజరు -
మహనీయుడు బసవేశ్వరుడు
ఆదిలాబాద్‌రూరల్: సమసమాజ స్థాపనకు కృషి చేసిన బసవేశ్వరుడు మహనీయుడని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో ని బసవేశ్వర చౌక్‌లో బసవేశ్వరుడి జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆయన బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలో కుల, వర్ణ వివక్షణను రూపుమాపడం కోసం బసవేశ్వరుడు చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, జంగమ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దత్తు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం
బజార్హత్నూర్: మండలంలోని దేగామ గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు దాదాపు 10 ఎకరాల జొన్న పంట దగ్ధమైంది. ఎంఆర్ఐ నూర్సింగ్ కథనం ప్రకారం.. గ్రామంలో మధ్యాహ్నం కొత్తకొండ లక్ష్మీ పంటచేనులో జొన్నపంటకు మంటలు అంటుకున్నాయి. కొన్ని క్షణాల్లో చుట్టుపక్కల చేలకు మంటలు విస్తరించి దాదాపు 10 ఎకరాల జొన్న పంటతోపాటు 100 పైపులు, స్పింక్లర్లు కాలి బూడిదయ్యాయి. ఘటన స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్రావు, ఆడె గజేందర్, జల్కే పాండురంగ్, నారాయణ పరిశీలించారు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తాంసిలో రెండెకరాలు.. తాంసి: మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం నిప్పంటుకుని రెండెకరాల్లో జొన్న పంట దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి..సోమ గంగారెడ్డి పంటచేను పక్కన ట్రాన్స్ఫార్మర్ వద్ద చెలరేగిన నిప్పురవ్వలతో మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో రెండెకరాల్లో జొన్న పంట దగ్ధమైంది. స్థానికులు నీళ్లను చల్లి మంటలార్పివేశారు. అగ్ని ప్రమాదంలో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన మరో రైతు సతీశ్ చేనులో అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెంది పదికి పైగా స్పింక్లర్ల పైపులు దగ్ధమయ్యాయి. -
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలో సిరికొండ మండలం రాంపూర్‌కు బైక్‌లు, ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
ఎల్ఆర్ఎస్ గడువు మళ్లీ పొడిగింపు
● ఈ నెల 3వరకు అవకాశం ● ఈ సారైనా స్పందించేనా? కై లాస్‌నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 25శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపు గడువు బుధవారంతో ముగియగా దాన్ని మే 3వరకు పొడిగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి టి కే. శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే నెల గడువు పొడిగించగా జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికా రుల మధ్య సమన్వయం కొరవడడం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎల్ఆర్ఎస్ కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం చాలా మంది ముందుకు రాలేదు. సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రుసుం రూపేణ రూ.7.60 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని దరఖాస్తులకు ఫీజు చెల్లించారనే వివరాలు పంచాయతీ అధికారుల వద్ద అందుబాటులో లేకపోవడం చూస్తుంటే ఈ ప్రక్రియపై వారు ఎంత చిత్తశుద్ధి కనబరుస్తున్నారనేది స్పష్టమవుతోంది. దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఆదిలాబాద్ మున్సిపల్‌తో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. కాగా మరో మూడు రోజులు అవకాశం కల్పించడంతో దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
‘ఇందిరమ్మ’కు ఉచిత ఇసుక
● ప్రభుత్వ అవసరాలకు సైతం.. ● పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో పది రీచ్‌ల గుర్తింపు ● తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ బేల మండలం కాంగర్పూర్లో ఇసుక నిల్వలు కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వపరంగా చేపట్టే నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందించా లని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పెన్‌గంగలో ఇసుక లభ్యతపై ఇటీవల సంయుక్త పరిశీలన చే పట్టిన మైనింగ్, ఇరిగేషన్, గ్రౌండ్‌వాటర్, రెవెన్యూ శాఖల అధికారులు జైనథ్, భీంపూర్, తాంసి, బేల మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లోని పది ఇసుక రీచ్‌లను గుర్తించారు. వాల్టా చట్టం అనుసరించి ఇసుక వెలికితీయాలని నిర్ణయించారు. తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రీచ్‌లు ఇవే.. ఉచితంగా ఇసుక అందించేందు కోసం పెన్‌గంగలో మొత్తం పది ఇసుక రీచ్‌లను ఎంపిక చేశారు. భీంపూర్ మండలం అంతర్గాంలో ఇసుక మందం 1.5 మీటర్లుగా గుర్తించిన అధికారులు గుబిడి, వడూర్, తాంసి–కే గ్రామాల్లో, అలాగే జైనథ్ మండలంలోని సాంగ్వి–కే, ఆనంద్‌పూర్, భోరజ్ మండలంలో డో ల్లరా, పెండల్వాడలో 0.5 మీటర్లుగా, బేల మండలంలో మణియర్పూర్, సాంగిడి గ్రామాల్లో 1.5 మీ టర్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో ను ంచి ఇసుకను ఉచితంగా సరఫరా చేయనున్నారు. సరఫరా ప్రక్రియ ఇలా... ఆయా మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఉచిత ఇసుక సరఫరా చేపట్టనున్నారు. ఇసుక అవసరము న్న ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రభుత్వ భవనాల ని ర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు ముందుగా సంబంధి త తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలి. వారికి ప్రా ధాన్యత క్రమంలో తహసీల్దార్లు వే బిల్లులు జారీ చే స్తారు. వాటిఆధారంగా నిర్దేశించిన సమయాల్లో ఇ సుకను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆయా వా హనాల డ్రైవర్లకు లైసెన్స్‌తో పాటు వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇసుకను ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది తహసీల్దార్లకు తప్పనిసరిగా సమాచారమందించాలి. ఎక్కడ డంప్ చేశారనేది వారు స్వయంగా పరిశీలిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా డంప్చేసినా, నిర్దేశిత పనులకు కాకుండా ఇతర వాటికి తరలించినా చట్టప్రకారం ఆ డంప్‌ల ను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలుంటాయని ఆర్డీవో వినోద్‌కుమార్ తెలిపారు. ఇసుక అవసరమున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆయన సూచించారు. -
ఆనాటి చరిత్ర కాలగర్భంలోకి..
కడెం:మండలంలోని బెల్లాల్ సమీపంలో గోదావరి, కడెం నది కలిసే ప్రాంతంలో 1200 ఏళ్ల క్రితం నాటి మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర కాలగర్భంలోకి కలిసిపోతుంది. ఆలయ గర్భంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయని వందల ఏళ్ల క్రితం ఆలయాన్ని, దేవతమూర్తుల విగ్రహాలను నాడు కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో స్తంభాలు పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పెద్దలు చెబుతున్నా రు. పురాతన ఆలయాన్ని పరిరక్షించకపోవడంతో అనాటి చరిత్రాక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. విగ్రహాల తలభాగాలు లేకుండా పోగా, రాతిస్తంభాలు గోదావరి ఒడ్డున కుప్పలుగా ఉన్నా యి. ప్రస్తుతం పురాతన ఆలయం ఉన్నచోట గ్రా మానికి చెందిన వారు నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. 1200 ఏళ్ల క్రితం నాటి చరిత్రని, శివ సాహిత్యం పొందడానికి ఆత్మహుతి చేసుకున్న వీరగల్లు విగ్రహంగా భావిస్తున్నట్లు తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ హరగోపాల్, రాజ్‌కుమార్ తెలిపారు. -
ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు పురస్కారం
ఆదిలాబాద్‌టౌన్: ఉత్తమ సేవలందించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని అబ్కారీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్‌రెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతి అందజేశారు. బహుమతి అందుకున్న వారిలో సీఐలు గంగారెడ్డి, అక్బర్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుళ్లు ఇంతియాజ్, రవికుమార్, అశ్వక్, సాయిప్రసాద్, కానిస్టేబుళ్లు సిద్ధేశ్వర్, అరవింద్, సందీప్ జమీర్, ఈశ్వర్, సతీష్, మేరి, విజయశ్రీ ఉన్నారు. బృందాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ హిమశ్రీ అభినందించారు. -
వడ్డీ వ్యాపారులకు చెక్‌పడేనా?
ఆదిలాబాద్‌లో ఓ ముఖ్య నేతకు సంబంధించిన బంధువు గ్రా మంలో వ్యవసాయ చేస్తుంటాడు. జిల్లా కేంద్రంలోని ఓ విత్తన దుకాణ యజమాని నుంచి రూ.15 లక్షల విలువైన విత్తనాలు, పురుగుల మందులను గతంలో అరువుపై తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఆ వ్యాపారి అసలు సొమ్ముపై వడ్డీ, చక్రవడ్డీ రూపేనా మొదట రూ.25లక్షల వరకు పెంచేశాడు. ఆ తర్వాత దాన్ని రూ.కోటి 25 లక్షల వరకు తీసుకెళ్లాడు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సమయంలో ఆ వ్యాపారి ఇదే అదునుగా అతడిపై డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ఆయన తన భూమిలో నుంచి రెండెకరాలు వ్యాపారి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. అప్పట్లో రూ.కోటి విలువ చేసే ఎకరం చేను ప్రస్తుతం రూ.కోటిన్నరకు పైగా ఉంది. వడ్డీ వ్యాపారుల అక్రమ దందాకు ఈ ఘటన ఓ నిదర్శనం. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇటీవల కొన్ని బయటపడగా చాలా వరకు వెలుగులోకి రావాల్సి ఉంది. – సాక్షి,ఆదిలాబాద్జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఇటీవల వడ్డీ వ్యాపారుల నివాసాల్లో పోలీసు శాఖ ఆకస్మిక దాడులు చేసింది. తొలిరోజే ఏకంగా 31 కేసులు నమోదు చేసింది. ప్రామిసరీ నో ట్లు, సేల్డీడ్లు, బ్యాంక్ చెక్కులను భారీగా స్వాధీ నం చేసుకున్నారు. ఈ క్రమంలో జైనథ్ పోలీసుస్టేషన్లో ఈనెల 27న ఓ వడ్డీ వ్యాపారిపై నమోదైన రెండు కేసులు సంచలనం కలిగించాయి. రూ.3లక్షలు అప్పు ఇచ్చి దానికి 25 శాతం వడ్డీ తీసుకోవడం, ఆ రైతుకు సంబంధించి 1.36 ఎకరాల భూమిని తన తమ్ముడి పేరిట రాయించుకోవడం వంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు డబ్బులు కట్టినా తిరిగి భూమి ఇవ్వాలని అడిగితే నిరాకరించిన నేపథ్యంలో అతను పోలీసులను ఆశ్రయించడంతో ఆ వడ్డీ వ్యాపారిపై కేసు నమోదైంది. అతడి వద్ద ఏకంగా 32 సేల్డీడ్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. ఇలా అప్పులు ఇవ్వడం, అలా ఆస్తులు తమ పేరిట చేసుకోవడం, మొత్తంగా వడ్డీ వ్యా పారం పేరిట అమాయకుల నడ్డీ విరుస్తున్న సంఘటనలు కోకొల్లాలుగా జిల్లాలో ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హద్దేలేని సంపాదన.. ఆదిలాబాద్‌లో ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారికి హద్దేలేని సంపాదన ఉందని జనం చెప్పుకుంటున్నారు. ఆస్తులపత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అధిక వడ్డీ వసూలు చేయడం ద్వారా అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి నష్టపోయిన దాఖ లాలు ఆదిలాబాద్‌లో ఇప్పటివరకు లేదు. అదే సందర్భంలో ఇలా వడ్డీకి రుణం తీసుకున్న వ్యక్తులు దాన్ని కట్టలేని పరిస్థితిలో సర్వం కోల్పోతున్నారనే నేపథ్యమే ఆందోళన కలిగిస్తుంది. మరో వైపు వ్యాపారులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. పూర్తిగా చెక్ పెట్టాలనే అభిప్రాయం.. ఆదిలాబాద్‌లో వడ్డీవ్యాపారులపై దాడులు, కేసు ల నమోదు నేపథ్యంలో సామాన్య జనం నుంచి హర్షం వ్యక్తమవుతుంది. మామూలు వడ్డీ వసూలు చేసేవారు కాకుండా అధిక వడ్డీ, ఆస్తులు కై వ సం చేసుకునే విధంగా వ్యవహరించే వడ్డీ వ్యాపారుల భరతం పట్టాలని కోరుతున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ విషయంలో పూర్తిస్థాయిలో చెక్ పెట్టేవరకు ఆపరేషన్ కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా బాస్ కొరడా ఝళిపిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితులను జలగల్లా పీల్చుతున్న వైనం బయటపడ్డవి కొన్నే.. వెలుగులోకి రావాల్సినవి ఎన్నో అక్రమదందాపై ఫోకస్ పెంచిన ఎస్పీ చట్ట ప్రకారం చర్యలు మనీలెండర్స్ చట్టం ప్రకారం వడ్డీ వ్యాపా రం చేసేవారు తప్పనిసరిగా తహసీల్దార్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. జిల్లాలో అనధికారికంగానే పలువురు ఈ వడ్డీ వ్యాపా రం నిర్వహిస్తున్నారు. తాజాగా నెలకు 15శాతం పైబడి వడ్డీ వసూలు చేస్తున్న ఓ వ్యాపారి వ్యవహారం నా దృష్టికి వచ్చింది. పలువురు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
● మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగితే లక్ష్యసాధన సులువే ● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా మనోగతం
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కల.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫ లమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశా. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలి తాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందానిచ్చింది.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకా లను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా. ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించారు. – కై లాస్నగర్సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్దరూ బిజినెస్ చేస్తుంటారు. అన్న దక్ష్. గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు. సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది.. ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వర కు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నత నం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూ ల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరి క్యూలమ్లో పాల్గొంటూ ప్రతిభ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానామిక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు.. ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకున్నా. ప్రణాళి కాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లా ను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతో పాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలాబాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. రెండు సార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలి చా రు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహంతోనే విజయం సాధించాను. సాక్షి: జిల్లాలో మీరు ఏడాది పాటు ఉండనున్నారు.. ఏయే అంశాలపై దృష్టి సారిస్తారు.. ట్రెయినీ కలెక్టర్: కలెక్టర్ సూచనలు, సలహాలు తీసుకుంటూ క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాను. శిక్షణ అనంతరం ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అట్టడుగుస్థాయికి అందించేలా నావంతు కృషి చేస్తాను. సాక్షి: సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు. -
పార్టీ పటిష్టతకు పాటుపడాలి
ఇచ్చోడ: పార్టీ పటిష్టత కోసం నాయకులు, కా ర్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పీసీసీ జిల్లా పరిశీలకులు తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం ఆయనను స్థానిక నాయకులు శాలువాతో సన్మానించారు. ఇందులో పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం నారాయణ రె డ్డి, నాయకులు ముస్తాఫా, భీంరెడ్డి, మహబూ బ్, ఆసీఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మే డే ఘనంగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా అసంఘటిత కార్మికులు మే డేను ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మే డే పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మున్సిపల్, రిమ్స్, సివిల్సప్లై, అంగన్వాడీ, ఆశ, ఆటో, బీడీ, బ్యాంకింగ్ తదితర సంఘటిత, అసంఘటిత కార్మికులంతా మే డే ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్మికులు పో రాడి సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లుగా తీసుకొచ్చిందని తెలిపారు. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచిందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాజు, గంగయ్య, రమేశ్, చందు, ముజీబ్, శంకర్, సురేశ్, ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ‘స్పోర్ట్స్’విద్యార్థులుఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో జనవరిలో నిర్వహించిన నేషనల్ కేడెట్స్ జూడో చాంపియన్‌షిప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాప్–16లో నిలిచిన నలుగురు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల్లో ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన ఈ నలుగురు క్రీడాకారులే ఉండడం విశేషం. జాతీయస్థాయికి ఎంపికై న వారిలో కొంపెల్లి అక్షయ, రమావత్ తరుణ్, మోతం హర్షవర్ధన్, లావూరి సతీష్ ఉన్నారు. మొదటి ముగ్గురు ఇటీవలే క్రీడా పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలు రాయగా, సతీష్ జిల్లా కేంద్రంలోని విద్యార్థి కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. మే 4నుంచి 8వరకు పాట్నా వేదికగా నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు జూడో కోచ్ రాజు తెలిపారు. -
గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఇచ్చోడ: గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చోడ మండలం చిన్న సల్యాద గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న పలువురిని సోమవారం రాత్రి గుర్తించి 180 మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. చహకటి సోనేరావు పొలంలో 17 మొక్కలు, దుర్వాడ లవకుశ్ పొలంలో 86, ఆర్క జంగుబాపు పొలంలో 31, దుర్వ అరుణ్ పొలంలో 46 మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.18 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. గంజాయి సరఫరా, విక్రయాలను గుర్తించేందుకోసం జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాచారం తెలిసిన వారు 8712659973 నంబర్లో సంప్రదించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా, విక్రయించినా వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాలు తగ్గించాలి
● డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో మెడికల్ ఆఫీసర్లు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు సంకల్ప్ కార్యక్రమంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఇందులో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృ మరణాలు నివారించేందుకు గర్భం దాల్చిన వెంటనే పీడీ వ్యాక్సిన్ వేయాలని తెలిపారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. శిశు సంరక్షణలో భాగంగా పుట్టిన గంటలోపు పసికందుకు తల్లిపాలు పట్టించాలని సూచించారు. అలాగే వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీని వాస్, సంకల్ప్ కార్యక్రమ నోడల్ అధికారి తన్నిజై, వైద్యాధికారులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం తనిఖీ చేశారు. పోలీసు, సఖీ, ఎన్జీవో, రిమ్స్ ప్రతినిధులతో ఏర్పాటైన బృందాలతో ఆస్పత్రుల్లో వసతులు, వైద్యం వివరాలు, లింగనిర్ధారణ, ఫైర్‌సేఫ్టీ, రిజిస్ట్రేషన్ తది తర వాటిని పరిశీలించారు. నక్షత్ర ఆస్పత్రిలో ఏఎన్సీ చెకప్ చేయడం లేదని తెలుసుకున్న డీఎంహెచ్‌వో ఫ్రోమ్ సీజ్ చేసి కస్టడీలో పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రిజిస్టర్ అయిన ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులు, వారి సహాయకులకు కనిపించేలా ఆస్పత్రిలో ధరల పట్టికలు ప్రదర్శించాలన్నారు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఫైర్‌సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట యశోద, సరస్వతి, వైద్య సిబ్బంది ఉన్నారు. -
బార్ల ఎంపికకు లక్కీ డ్రా
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలో గతంలో రెన్యూవల్ కాకుండా మూతపడ్డ మూడు బార్ల స్థానంలో కొత్తవాటి ఏర్పాటు కోసం జిల్లా ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. 61 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. వాటి కేటాయింపు కోసం మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా డ్రా తీసి ఎంపిక చేశారు. నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన జే.విక్రమ్‌నాయక్, ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్‌కు చెందిన జైస్వాల్ శుభం, పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఎ.కళ్యాణిలను అదృష్టం వరించింది. ఎంపికైన వారికి కలెక్టర్ చేతుల మీదుగా కేటాయింపు ఉత్తర్వులు అందజేశారు. ఇందులో డీపీఈవో వై.హిమశ్రీ, సీఐలు విజేందర్, అక్బర్ హుస్సేన్, గంగారెడ్డి, ఎస్సై అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● ముగ్గురికి కేటాయింపు పత్రాలు అందజేత -
దేశవ్యాప్త బంద్ జయప్రదం చేయండి
ఆదిలాబాద్‌టౌన్: మే 20న తలపెట్టిన దేశ వ్యాప్త బంద్ జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మూ డో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే 44 కార్మి క చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మి కులను బానిసలుగా మార్చే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. వీటిని నిరసిస్తూ చేపట్టనున్న దేశవ్యాప్త గ్రామీణ హడ్తాల్, బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌నాయక్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, ఆయా సంఘాల నాయకులు స్వామి, చిన్నన్న, విష్ణు, నగేశ్, నవీన్, ఆశన్న, గంగారాం, నాగారావు తదితరులు పాల్గొన్నారు. -
అస్మదీయులకే అందలం!
● క్రీడాశిక్షకుల ఎంపికలో ఇష్టారాజ్యం ● నచ్చినవారికి ‘వేసవి’ కేంద్రాల కేటాయింపు ● శిబిరాల్లో పారదర్శక శిక్షణపై నీలినీడలు ఆదిలాబాద్: చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏటా వేసవి సెలవుల్లో నెల పాటు ఉచిత శిక్షణ శిబి రాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈసారి సైతం వాటి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 10 శిబిరాలకు అనుమతి ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో క్రీడా శిక్షకుల ఎంపికలో సంబంధిత అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారనే చర్చ సాగుతోంది. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి నచ్చిన వారికి కేటా యించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మౌఖికంగానే శిక్షకుల ఎంపిక.. నిబంధనల ప్రకారం ఈ శిబిరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రకటనలు జారీ చేయాలి. అయితే ఇవేమీ లేకుండానే తమకు నచ్చిన వారికి కేంద్రాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అర్హులైన తాము నష్టపోయామని పలువురు శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది శిబిరాలకు మాత్రమే అనుమతి రాగా, ఇష్టారీతిన ఎంపిక చేయడంతో శిక్షణ కేంద్రాల సంఖ్య ఏకంగా 34 దాటింది. జిల్లాలోని ప్రతీ మండలానికి ఓ కేంద్రం ఏర్పాటు చేసినా 21 మండలాలకు ఒక్కో శిక్షణ కేంద్రం ఏర్పాటు అవ్వాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఒకే ఆటకు పలు ప్రాంతాల్లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. ఒక్క ఆదిలాబాద్ రూరల్ మండలంలోనే ఏడు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు సిరికొండ, తాంసి, గాదిగూడ, భోరజ్, భీంపూర్, సాత్నాల మండలాలకు కేంద్రాలు లేవు. అన్ని ఆటలకు, మండలాలకు ప్రాధాన్యమిస్తే వివిధ క్రీడాంశాల్లో చిన్నారులకు మెరుగైన శిక్షణ అందేది. శిక్షకుల ఎంపిక కోసం స్పష్టమైన ప్రకటన విడుదల చేసి ఉంటే ఉత్సాహవంతులైన శిక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉండేదని పలువురు చర్చించుకుంటున్నారు. నిర్వహణపై ఆందోళన.. శిక్షకుల ఎంపికలో తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించడం విషయంలో శ్రద్ధ చూపిన అధికారులు శిక్షణ సమయంలో ఏ మేరకు పర్యవేక్షిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో శిక్షణ కేంద్రాలు హడావుడిగా జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభించి తర్వాతి రోజుల్లో వాటిని నడపకుండా పలువురు శిక్షకులు నిర్లక్ష్యం వహించడంపై ‘సాక్షి’లో సైతం కథనాలు ప్రచురితమయ్యాయి. ఫలితంగా ఎంతో మంది చిన్నారులు వేసవి శిక్షణకు దూరమయ్యారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, క్రీడా సంఘాల బాధ్యులు, శిక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముందుకు వస్తే ఎంపిక చేస్తాం.. శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యే ముందు ఎవరైనా శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తే నిబంధనలకు అనుగుణంగా పరిగణలోనికి తీసుకుంటాం. ఈనెల 31వరకు దరఖాస్తులు అందించవచ్చు. శిక్షకుల ఎంపిక విషయంలో వ్యాయా మ ఉపాధ్యాయుల సంఘం, క్రీడా శిక్షకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో ఒకే కోచ్‌కు రెండు కేంద్రాలు.. జిల్లా కేంద్రంలో ఓకే క్రీడకు సంబంధించి, రెండు వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ఒకే శిక్షకుని కి కేటాయించడం ఎంపికలో అధికారుల పక్షపా త ధోరణిని స్పష్టం చేస్తుంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో శిక్షకుడు ఏ విధంగా శిక్షణ ఇ వ్వడం సాధ్యమవుతుందో అధికారులకే తెలియా లి. శిక్షకునికి రూ.4వేల గౌరవ వేతనం అందజేస్తారు. అయితే ఎంపికలో పారదర్శకతకు పాతరేయడం అనుమానాలకు తావిస్తోంది. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
● కలెక్టర్ రాజర్షి షా ● యాపల్‌గూడ, తాంసిలో అవగాహన సదస్సులు ఆదిలాబాద్‌రూరల్: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన చట్టంపై ప్రతీ రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. దహిగూడ పంప్‌హౌస్ పరిశీలన అనంతరం మండలంలోని దహిగూడ పంప్‌హౌస్‌ను కలెక్టర్ పరిశీలించారు. నీటి సరఫరా తీరుపై ఆరా తీశారు. తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినో ద్ కుమార్, తహసీల్దార్ గోవింద్ నాయక్, ఎంపీడీవో నాగేశ్వర్, మిషన్ భగీరథ ఏఈ ఆదిత్య తది తరులు పాల్గొన్నారు. తాంసి: మండల కేంద్రంలోని రామేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహంచిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. నూతన చట్టంతో పెండింగ్ భూసమస్యలు పరిష్కారం కానున్నట్లు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడు తూ.. భూభారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ భో జారెడ్డి, ట్రెయినీ కలెక్టర్ సలోని, ప్రత్యేకాధికారి వెంకటరమణ, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఏవో రవీందర్,మాజీ జెడ్పీటీసీలు గణే శ్‌రెడ్డి,రాజు,మాజీఎంపీపీ శ్రీధర్‌రెడ్డి,రైతులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన సేవల కోసమే గ్రీవెన్స్
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకే ప్రజా ఫిర్యాదుల నిర్వహణ (గ్రీవెన్స్) చేపడుటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు ప్రశంస మాదకద్రవ్యాల నిర్మూలన, విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ గామ శ్రీని వాస్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రశంసా పత్రం అందజేశారు. -
నిరంతర సాధనతోనే కళల్లో ప్రావీణ్యం
ఆదిలాబాద్: నిరంతర సాధనతోనే కళల్లో ప్రావీణ్యం సాధ్యమని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో భాగంగా బాల కేంద్రంలో అందజేస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఇటీవల జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన పలు వురు బాలకేంద్రం చిన్నారులను సన్మానించా రు. ఇందులో బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి, తల్లిదండ్రుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ విధేయులకు పదవులు
కైలాస్‌నగర్: కాంగ్రెస్‌కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, పార్టీకి విధేయులుగా ఉన్న వారందరికి త్వరలోనే నామినేటెడ్ పదవులతో సముచితస్థానం కల్పిస్తామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, పీసీసీ పరిశీలకులు తాహెర్‌బిన్ హందాన్, చిట్ల సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్ లో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వారు అతిథులుగా హాజరయ్యా రు. తొలుత పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడారు. పార్టీ పరంగా జిల్లాకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎంతో మంది జాతీయ నాయకులుగా ఎదిగారని గుర్తు చేశారు. జిల్లాలో పార్టీని బూత్‌స్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మే 3నుంచి 10వరకు ఆయా మండలాల అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. ఒక్కో పదవికి మూడు పేర్లను పరిగణలోకి తీసుకుని నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక చేస్తామన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసే ప్రతీ కార్యకర్తకు పదవులు వెతుక్కుంటూ వస్తాయని భరోసానిచ్చారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా మే 30లోపు డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీఎమ్మెల్యే రాథోడ్ బా పూరావు, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గణేష్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీధర్, చంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పీసీసీ జిల్లా పరిశీలకులు తాహెర్‌బిన్ హందాన్, సత్యనారాయణ -
● నెక్కర్ వస్త్రం వచ్చింది.. షర్ట్ బట్ట రాకపాయే ● ఏటా ఆలస్యమవుతున్న వైనం ● ఈ సారి కూడా అనుమానమే.. ● బడి పునఃప్రారంభం నాటికి అందిస్తామంటున్న అధికారులు
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం కుట్టించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. అయితే పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒక జత పంపిణీ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఆలస్యం కాగా ఈసారి ముందస్తుగానే నెక్కర్‌కు సంబంధించిన వస్త్రం వచ్చినప్పటికీ, షర్ట్ వస్త్రం ఇంకా రాలేదు. ఈ జాప్యం కుట్టుపై ప్రభావం పడనుంది. ఏటా బడులు తెరిచే నాటికి విద్యార్థులకు యూనిఫాం అందజేస్తామని అధికారులు చెబుతున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అయితే తొలిరోజునే యూనిఫాం అందిస్తే విద్యార్థులు చిరిగిన డ్రెస్సులతో కాకుండా కొత్త బట్టలతో హుషారుగా బడిబాట పట్టే అవకాశం ఉంటుంది. 66,282 మంది విద్యార్థులకు.. జిల్లాలో యూనిఫాం అందించే ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 66,282 మంది చదువుతున్నారు. ఇందులో బాలురు 31,780 మంది ఉండగా, బాలికలు 34,502 మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాం ఉచితంగా అందజేస్తుంది. గతంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో కుట్టించి అందించేవారు. గతేడాది నుంచి స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టిం చి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ కుట్టుకు సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం డీఆర్డీఏకు అప్పగించింది. వారు స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి పాఠశాలలకు అందజేయనున్నారు. గతేడాది మండలానికి సంబంధించి వస్త్రం రాగా, ఈసారి ఆయా పాఠశాలలకు సంబంధించి వస్త్రం వచ్చింది. దీంతో కొంత ఇబ్బందులు తప్పనున్నాయి. బట్ట సరిపోక గతేడాది టైలర్లు ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఆ సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. కుట్టుడు షురూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యా శాఖ అధికారులు యూనిఫాం కుట్టించడంపై దృష్టి సారించారు. ప్రతి మండలానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీడీవో, ఎంఈవో, ఏపీఎంలు ఉన్నారు. యూనిఫాం కుట్టడం ఎక్కడివరకు వచ్చిందనే వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులతో కలిసి పర్యవేక్షిస్తారు. సకాలంలో పాఠశాలలకు అందేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది నెక్కర్‌కు సంబంధించిన వస్త్రం వచ్చినప్పటికీ షర్ట్‌కు సంబంధించిన బట్ట రాకపోవడంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది టైలర్లకు మేలో వస్త్రం ఇవ్వగా, వారు ఒక జత జూలై, ఆగస్టు మాసాల్లో విద్యార్థులకు అందించారు. రెండో జత అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఆ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. పెరిగిన కుట్టు కూలి.. జిల్లాలో.. యూనిఫాం అందించే పాఠశాలలు: 1,145 కుట్టాల్సిన యూనిఫాం జతలు : 1,32,564 స్వయం సహాయక సంఘాలు : 10,756 ఆయా సంఘాల్లోని సభ్యులు : 1,16,885బడులు తెరిచేనాటికి అందిస్తాం.. పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజు వి ద్యార్థులకు ఒక జత యూనిఫాం అందించేలా చర్యలు చేపడుతున్నాం. ప్యాంట్, లహంగాలకు సంబంధించిన వస్త్రం 31 శాతం వచ్చింది. జిల్లాకు మొత్తం బట్ట 2,71,420 మీటర్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 84,022 మీటర్లు వచ్చింది. ఈ వస్త్రాన్ని స్వయం సహాయక సంఘాల ద్వారా టైలర్లకు అందించాం. త్వరలోనే షర్ట్ బట్ట కూడా రానుంది. – సుజాత్ ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి యూనిఫాంకు సంబంధించి ప్రభుత్వం కుట్టు కూలి పెంచింది. ఇదివరకు ఒక జతకు రూ.50 ఉండగా, ప్రస్తుతం రూ.75 చెల్లించనుంది. ఇదిలా ఉండగా 1 నుంచి 5వ తరగతి బాలురకు నెక్కర్, షర్ట్, 6 నుంచి 12వ తరగతి వారికి షర్ట్, ప్యాంట్, అలాగే 1 నుంచి 3వ తరగతి చదివే బాలికలకు స్కర్ట్, 4,5 తరగతుల వారికి షర్ట్, లహంగా, 6 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు పంజాబీ డ్రెస్సు ఇవ్వనున్నారు. -
● విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రచారం షురూ ● ఉపాధ్యాయులకు టార్గెట్లు ● ఇంటింటికీ తిరుగుతున్న టీచర్లు ● తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్లు
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తల్లిదండ్రులను మభ్యపెడుతూ తమ బడిలో చేర్పించేందుకు ప్రయత్నాలు షురూచేశాయి. ఈనెల 24నుంచి వేసవి సెలవులు మొదలయ్యాయి. అప్పటినుంచే ప్రైవేట్ యా జమాన్యాలు ఎన్నికల ప్రచారం తలపించేలా తమ ఉపాధ్యాయులను ఇంటింటికి తిప్పుతున్నారు. కరపత్రాలు పంచుతూ ఇప్పుడు అడ్మిషన్ చేయిస్తే రా యితీ ఇస్తామని చెబుతున్నారు. కొన్ని యాజమాన్యాలు ఫ్రీ అడ్మిషన్ అంటూ బుట్టలో వేసుకుంటున్నారు. ఈ మేరకు టీచర్లకు టార్గెట్లు ఇచ్చారు. ప్రతీ ఉపాధ్యాయుడు కనీసం 10 నుంచి 20 మందిని చేర్పించాలని ఆదేశించారు. లేకుంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించడంతో వారు నానాతంటాలు పడుతున్నారు. ఉదయం 7గంటలకే విద్యార్థుల ఇళ్ల ముందు వాలుతున్నారు. తమ పాఠశాలలో బోధన బాగుంటుంది.. మంచి ఫలితాలు సాధి స్తున్నామంటూ తల్లిదండ్రులకు ఎర వేస్తున్నారు. అయితే ప్రభుత్వం బడిబాట నిర్వహించే సరికే పిల్ల లు ప్రైవేట్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని పలు వురు చర్చించుకుంటున్నారు. వ్యాపారంగా మలుచుకొని.. జిల్లాలో ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలలు మండలాని కి ఒకటో.. రెండో ఉండేవి. ప్రస్తుతం ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మలిచారు. కనీస సౌకర్యాలు లేకపోయినా అధిక ఫీ జులతో తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేస్తున్నారు. ఎల్కేజీ మొదలు.. పదోతరగతి వరకు డొనేషన్లు, ఫీజు లు, పుస్తకాలు, నోట్‌బుక్స్, ప్రాజెక్టులు, బస్సు ఫీజు లు వంటి తదితర ఖర్చులతో మోతమోగిస్తున్నారు. విద్యార్థులను ర్యాంకుల పేరుతో బట్టీ పట్టించి..తరగతికో రేటు కట్టి చదువును అమ్మకపు సరుకుగా చే స్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు సైతం దృష్టి సారించడం లేదు. డీఈవో పరిధిలో 700 వరకు ప్రభుత్వ యా జమాన్య పాఠశాలలు ఉండగా, దాదాపు 200 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు ల నియంత్రణ తమ పరిధిలో లేదంటూ విద్యాశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. నిబంధనలకు తూట్లు.. ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1 అమలు కావడం లేదు. తల్లిదండ్రులతో కూడిన గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. నిబంధనల ప్రకారం పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు లేవు. ఇరుకు గదుల్లో, చుట్టూ వాహనం తిరిగే స్థలం లేని భవనాల్లో స్కూళ్లను ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారిచే విద్యాబోధన చేయించాల్సి ఉండగా, విద్యార్హత లేనివారితో చదువులు కొనసాగిస్తున్నారు. ఫీజుల వివరాలు బోర్డుపై ప్రదర్శించాల్సి ఉండగా, ఏ పాఠశాలలో కూడా అలా జరగడం లేదు. చాలా ప్రైవేట్ పాఠశాలలు ఇలా నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్కారు బడుల్లో చేర్పించాలి సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన అందుతుంది. అర్హత గల ఉపాధ్యాయులతో పా టు వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నభోజనం, ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. – శ్రీనివాస్ రెడ్డి, డీఈవో ప్రచారం షురూ.. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల ప్రచారం ఊపందుకుంది. ఎండలు దంచికొడుతున్నా ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. తమ పాఠశాలలో చేర్పిస్తే ఫీజులో రాయితీ కల్పిస్తాం.. బస్సు సౌకర్యం వంటి తదితర మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. అందులో చేరాక ఫీజులు పూర్తిస్థాయిలో ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి 5వేల మంది విద్యార్థులు ప్రైవేట్‌లో చేరారు. -
ఆదివాసీలపై దమనకాండను ఆపాలి
ఆదిలాబాద్‌రూరల్: అమాయక ఆదివాసీలపై ప్రభుత్వాలు చేపడుతున్న దమనకాండను వెంటనే నిలిపివేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి కుమురంభీంచౌక్ వరకు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీ అమాయకులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి శాంతి చర్చలు జరిపించాలన్నారు. ఇందులో వివిధ సంఘాల నాయకులు గోడం గణేశ్, సాజిద్‌ఖాన్, మల్లేశ్, శంకర్, సచిన్, తదితరులు పాల్గొన్నారు. -
అధిక వడ్డీ వసూలు చేస్తే కఠిన చర్యలు
● డీఎస్పీ జీవన్‌రెడ్డి ● జైనథ్‌లో వడ్డీ వ్యాపారిపై కేసు ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అమాయక ప్రజ లు, రైతుల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తూ వారి భూములను వడ్డీ పేరుతో రాయించుకుంటున్న ఓ వడ్డీ వ్యాపారిపై జైనథ్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జైనథ్ స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జైనథ్ మండలం కేదార్‌పూర్ గ్రామానికి చెందిన బోయర్ రమేశ్ 2011లో 25 శాతం వడ్డీతో రూ.3 లక్షలు ఇచ్చి తన 1.36 ఎకరాల భూమిని తన తమ్ముడు గజాణన్ పేరిట రా యించుకున్నాడని జైనథ్ రైతు గోస్కుల నర్సయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. 2013లో బాధితుడు రూ.2 లక్షలు, 2017 సంవత్సరంలో రూ.2 లక్షలు చెల్లించాడు. తిరిగి తన భూమిని తనకు ఇచ్చేయాలని చెప్పినా నిరాకరించడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే అతడి ఇంటి వద్ద తనిఖీ చేయగా సంతకం చేసిన రెండు ఖాళీ బ్యాంకు చెక్కులు, 32 సేల్ డీడ్లు, రెండు ధరణి సేల్డీడ్లు, 31 ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు రూ.కోటి 55 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
వాతావరణం
మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది నార్నూర్ మండలంలోని పొలాల్లో గల బోర్వెల్ వద్ద ఉపాధి హామీ నిధులతో చేపట్టిన బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్. వర్షపునీటిని సంరక్షించి బోర్‌వెల్‌లో నీటిమట్టం పెరిగేందుకు దోహదపడేలా నిర్మిస్తున్నారిలా. -
బ్లడ్ బ్యాంక్ సద్వినియోగం చేసుకోవాలి
నార్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను సద్విని యోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ అన్నారు. ఆస్పత్రిని ఆదివారం ఆయ న సందర్శించారు. గాదిగూడ మండలం ఝరి పీహెచ్సీ పరిధిలోని మాలేపూర్ సబ్సెంటర్కు చెందిన అంజలికి రక్తం అవసరం కాగా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ నుంచి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలో గిరిజనులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు నార్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యాధికారి రాంబాబు తదితరులున్నారు. -
● గతేడాది లక్ష్యంతో పోల్చితే ఈ సారి 28లక్షలు తగ్గింపు ● కూలీలకు తీవ్ర నష్టం ● కొత్త జాబ్ కార్డులకు పెరిగిన డిమాండ్
కై లాస్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆధారపడ్డ కూలీలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2025–26 సంవత్సరానికి గాను చేపట్టా ల్సిన పనిదినాల్లో భారీగా కోత విధించింది. గతేడాది లక్ష్యానికి మించి పనులు జరగడంతో కూ లీలకు వేసవిలో ఉపాధి లభించింది. జిల్లావ్యాప్తంగా 5,378 కుటుంబాలు వంద రోజుల పాటు పని చేశాయి. అయితే ఈ ఏడాది రాష్టవ్యాప్తంగా ఉపాధి పనిదినాలను తగ్గించగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలోనూ భారీగా గండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో చేసిన పనుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అ మలు చేస్తుండటంతో జాబ్‌కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పనిదినాలు తగ్గడంతో కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. గతేడాది లక్ష్యానికి మించి.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 52.35 లక్షల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం కేటా యించింది. గ్రామీణ ప్రాంత కూలీలు ఈ అవకా శాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. కూలీల సంఖ్య పెరుగడంతో జిల్లావ్యాప్తంగా 54.84లక్షల పనిదినాలు జరిగాయి. దీంతో 104.75శాతం నమోదైంది. లక్ష్యానికి మించి పనులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక బృందాలను పంపించి పనుల ప్రగతిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో పనులకు కూలీలు వాస్తవంగా హాజరవుతున్నారా లేక బోగస్ హాజరు నమోదు చేస్తున్నారా అనే దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కొన్ని పనులు కేంద్ర నిబంధనల ప్రకారం జరగకపోవడంతో పనిదినా లను భారీగా తగ్గించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఏడాదికి కేవలం 23.81లక్షల పని దినాలు మాత్రమే నిర్దేశించింది. గతేడాదితో పో ల్చితే 28లక్షల పనిదినాలను తగ్గించింది. దీంతో ఉపాధి హామీ పనులపై ఆధారపడ్డ కూలీలు కేంద్ర నిర్ణయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నార్థకంగా ‘ఉపాధి’ ఈ ఏడాదికి 23.81 లక్షల పనిదినాలను లక్ష్యంగా కేటాయించగా అందులో ఇప్పటికే 11.21 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. వ్యవసాయ పనులు జరగకపోవడంతో మే నెలంతా ఉపాధి పనులు ముమ్మరంగా సాగనున్నాయి. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురిసే జూన్ వరకు కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యే అవకాశముంది. వ్యవసాయ పనులు ప్రారంభమైతేనే కూలీల సంఖ్య తగ్గే అవకాశముంటుంది. అయితే ఈ రెండు నెలల్లోనే జిల్లాకు కేటాయించిన పనుల లక్ష్యం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం పూర్తయితే మిగతా సమయాల్లో ఉపాధి పనులను చేపట్టి కూలీలకు పనులు కల్పిస్తారా లేక నిలిపివేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి జాబ్ కార్డుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూలీలకు రూ.12వేల ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే జాబ్ కార్డు కలిగి ఉండి పనులకు హాజరుకానుటువంటి వారు కూడా పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పనిదినాల లక్ష్యం పెంచాల్సిన అవసరముందనే అభిప్రాయం కూలీల నుంచి వ్యక్తమవుతోంది. ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలు జిల్లాలోని ఉపాధి పనుల వివరాలు.. గ్రామీణ మండలాలు : 20 పంచాయతీలు : 473 జాబ్‌కార్డుల సంఖ్య : 1.74లక్షలు నమోదు చేసుకున్న కూలీలు: 3.47లక్షలు యాక్టివ్ జాబ్‌కార్డులు : 1.09 లక్షలు పనులకు హాజరయ్యే కూలీలు : 2.04 లక్షలు లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం గతేడాదితో పోల్చితే కేంద్ర ప్రభుత్వం ఈ సారి పనిదినాలను తగ్గించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిదినాలను తగ్గించగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో కోత పడింది. అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతీ కూలీకి ప్రస్తుతం పనులు కల్పించేలా శ్రద్ధ వహిస్తున్నాం. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం. అప్పటికీ కూలీల నుంచి పనుల కోసం డిమాండ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
భూభారతిపై అవగాహన అవసరం
ఇచ్చోడ: భూభారతి చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగా హన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. మండల కేంద్రంలోని షార్ప్గార్డెన్లో ఆదివా రం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూభారతి చట్టంతో భూసమ స్యలకు సత్వర పరిష్కారం లభించనుందని అన్నా రు. అనంతరం పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించగా పరిష్కార దిశగా ఆయన సూచనలు చేశారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదే వి, ఆర్డీవో వినోద్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో.. సిరికొండ: మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్న భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. -
బొట్టు బొట్టు ఒడిసి పట్టేలా..
8లోu కైలాస్‌నగర్: మండుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు ప్రమాదఘంటికలను మోగిస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో 18 నుంచి 20 మీటర్ల లోతు వరకు నీటిమట్టం పడిపోయింది. ప్రస్తుతం 150 నుంచి 300 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తే కానీ నీరు పడని పరిస్థితి. మరి కొన్నిచోట్ల అంతకు మించి వేయాల్సిన దుస్థితి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో భూగర్భజలాల సంరక్షణపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ దృష్టి సారించింది. వర్షపునీటిని ఒడిసిపట్టి సంరక్షించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ నిధులతో బోర్వెల్ రీచార్జి స్ట్ర క్చర్స్ (భూగర్భ జల పెంపు నిర్మాణాలు), రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్(పైకప్పు నీటి సంరక్షణ నిర్మాణాలు), ఫాం పాండ్స్(నీటికుంటలు), కమ్యూనిటీ ఫోక్ఫిట్స్ (సామాజిక ఇంకుడుగుంతలు) నిర్మించేందుకు సంకల్పించింది. 2025– 26 సంవత్సరానికి గాను ఆయా నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటిని సద్వినియోగం చేసుకుని లక్ష్యం మేరకు నిర్మాణాలు చేపట్టినట్లేతే భూగర్భజలాలను సంరక్షించిన వారమవుతామనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్.. వర్షపునీటితో పాటు ఇతర భూమిపై ఉన్న నీటిని సంరక్షించేలా ఇప్పటికే ఉన్న బోర్‌వెల్స్ వద్ద నీటి ని లోనికి మళ్లించడం ద్వారా భూగర్భజలాల ను తిరిగి నింపేందుకు ఇవి తోడ్పడుతాయి. ఈ ఏడా ది జిల్లా వ్యాప్తంగా 240 స్ట్రక్చర్స్ నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 85 మంజూరు చేశా రు. ఒక్కో స్ట్రక్చర్స్‌ను రూ.25వేలతో నిర్మించుకునే అవకాశముంది. ఇప్పటి వరకు ఆరు నిర్మాణాలను గ్రౌండింగ్ చేశారు. ఫాంపాండ్స్ పంటచేలల్లో నీటిని నిల్వ చేసేందుకు చిన్నపాటి కుంటలను నిర్మిస్తారు. వీటినే ఫాంపాండ్స్ అని పిలుస్తారు. వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చే సుకోవడం ద్వారా వేసవిలో పంటలకు నీరందించేందుకు తోడ్పడుతుంది. జిల్లావ్యాప్తంగా 392 నిర్మించాలని నిర్ణయించిన అధికారులు 332 మంజూరు చేశారు. అందులో 94 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కోదానికి రూ.2.50లక్షల ఉపాధి నిధులు వెచ్చిస్తారు. కమ్యూనిటీ సోక్పీట్స్.. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని చేతిపంపుల వద్ద వీటిని నిర్మించనున్నారు. జిల్లాలో కమ్యూనిటీ సోక్పిట్స్ నిర్మాణలక్ష్యం 183 కాగా 45 మంజూరు చేశారు. ఒక్కో దాన్ని రూ.12వేల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఏడు గ్రౌండింగ్ చేశారు. మిగతా వాటిని ఈ ఆర్థికసంవత్సరంలో పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు. వీటి నిర్మించడం ద్వారా వర్షపునీటితో పాటు చేతిపంపుల నుంచి వచ్చే వృథానీటిని తిరిగి భూమిలోకి ఇంకేలా చేస్తాయి. రూప్‌టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వర్షాకాలంలో భవనాలపై పడే నీటిని నిల్వచేసేందుకు ఈ స్ట్రక్చర్స్ తోడ్పడనున్నాయి. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 31చోట్ల నిర్మించాలని నిర్ణయించగా ఇందులో 8 మంజూరు చేశారు. ఒక్కోదాన్ని రూ.25వేలతో నిర్మిస్తారు. ఇప్పటి వరకు ఒకటి పూర్తి చేశారు. ఆయా కార్యాలయాలపైపడిన వర్షపునీరు వృథాగా పోకుండా భూ మిలోకి ఇంకించేలా ఈ స్ట్రక్చర్ నిర్మించనున్నారు. భూగర్భజలాల పెంపుపై ఫోకస్ నీటి కుంటలు, ఇంకుడుగుంతలు మంజూరు ఉపాధి హామీ నిధులతో నిర్మాణాలు సద్వినియోగం చేసుకుంటే జల సంరక్షణకు దోహదం భూగర్భ్బజలాల పెంపునకు చర్యలు జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పలుచోట్ల బోరుబావులు, చేదబావులు ఎండిపోయాయి. నీటిని సంరక్షించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేలా భూగర్భజలాలను పెంపొందించేలా ఉపాధి నిధులతో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈమేరకు లక్ష్యాలను నిర్ణయించాం. వందశాతం సాధించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
కేఆర్కే కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధి లోని కేఆర్కే కాలనీలో శనివారం రాత్రి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పాల్గొని మాట్లాడారు. యువ త గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 107 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఒక మినీ ట్రాలీని స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు బెల్టు షాపులు గుర్తించడంతో పాటు 146 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన 20 వాహనాలను స్వాధీ నం చేసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు ఫణిదర్, సునీల్‌కుమార్, సీహెచ్ కరుణాకర్, సాయినాథ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, వెంకటి, ఎస్సైలు, ఏఎస్సైలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది సుమారు 250 మంది తదితరులు పాల్గొన్నారు. -
‘ఎర్లీబర్డ్’కు స్పందన అంతంతే!
● ముందుకు రాని పట్టణవాసులు ● మిగిలింది మూడు రోజులే ● ముందస్తుగా చెల్లిస్తే 5శాతం రాయితీ కైలాస్‌నగర్: మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకా యిలు పేరుకుపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి పాత బకాయిలు లేనటువంటి వారిని అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 30 వరకు పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించింది. మరో మూడు రోజుల్లో గడువు ముగియనుంది. అయితే పట్టణ వాసుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటి వరకు కేవలం నాలుగు శాతం మాత్రమే పన్ను వసూలు కావడం గమనార్హం. అరకొర స్పందనే ... ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులున్నాయి. ఎర్లీబర్డ్ పథకం అమల్లో భాగంగా నిర్దేశించిన పన్ను వసూళ్ల కోసం బల్దియా అధికారులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు ఉద్యోగులను నియమించారు. బకాయిలు లేని వారి వివరాలతో కూడిన జాబితాతో పాటు పీవోఎస్ యంత్రాలను వారికి అందజేశారు. దీంతో వారు ఉదయం, సాయంత్రం వేళల్లో కేటాయించిన వార్డుల్లో విస్తృతంగా తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. ఏటా ఆస్తి పన్నులో ప్రభుత్వం వడ్డీ మాఫీ అమలు చేస్తూ వస్తోంది. పాత బకాయిలు కలిగిన వారికి వడ్డీపై 95శాతం రాయితీ కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బల్దియాకు అవసరమైన నిధులు సేకరించాలనే ఉద్దేశంతో ఎర్లీబర్డ్ స్కీం అమలు చేసి ఈ నెల 30 వరకు పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 2023–24లో ఇదే స్కీంలో రూ.1.83 కోట్లు వసూలు చేశారు. అలాగే 2024–25లో రూ.2.13 కోట్లను వసూలు చేశారు. తాజాగా గడిచిన 26 రోజుల వ్యవధిలో 3,993 మంది రూ.1.40 కోట్ల పన్నులను చెల్లించారు. మరో మూడు రోజులే గడువు ఉండటంతో గతేడాది లక్ష్యాన్ని అధిగమిస్తారా లేక వెనుకబడుతారా అనేది చూడాల్సిందే. ప్రచారం కొరవడడంతోనే ముందస్తుగా పన్ను చెల్లింపునకు పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఐదు శాతం రాయితీ సద్వినియోగం చేసుకునేలా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బల్దియా యంత్రాంగం ఆ దిశగా క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వ్యాపారులు పన్ను చెల్లింపునకు ముందుకొచ్చేలా గతేడాది పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లతో ప్రత్యేక ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే వార్డుల్లోని ప్రజలకు విషయం తెలియజేసేలా మైక్‌తో కూడిన ఆటో ద్వారా ప్రచారం కల్పించారు. ఈ యేడాది కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి మమ అనిపించారు. దీంతో ప్రజలకు అవగాహన కొరవడింది. ప్రత్యేక బృందాలు వెళితే తప్ప విష యం తెలియని పరిస్థితి. ఈ క్రమంలో బల్దియా ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో.. అసెస్మెంట్లు : 49,503వాటి ఆస్తి పన్ను డిమాండ్ : రూ.33.46 కోట్లు ఆస్తి పన్ను చెల్లించిన అసెస్మెంట్లు : 3,993 ఇప్పటి వరకు వసూలైంది : రూ.1.40 కోట్లు సద్వినియోగం చేసుకోవాలి పన్నులు ముందస్తుగా వసూలు చేసేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. ఈ నెల 30వరకు పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తున్నాం. పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – స్వామి, బల్దియా రెవెన్యూ అధికారి -
నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం
ఆదిలాబాద్‌రూరల్:వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కన్స్‌స్ట్రక్షన్ సీఈ, జిల్లా ఇన్చార్జి ఎస్ఈ జేఆర్ చౌహాన్ అన్నారు. మావల మండలంలో ఏర్పాటు చేసిన వాక్యూం కరెంట్ బ్రేకర్ (వీసీబీ)ను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో భాగంగా వీసీబీ ఏర్పాటు చేశామన్నా రు. కార్యక్రమంలో డీఈలు హరికృష్ణ, ప్రభాకర్, ఈదన్న, ఏడీఈ లక్ష్మణ్, ఏఈ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాయిచైతన్యకు సన్మానం
కై లాస్‌నగర్: ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో ఐఏఎస్‌కు ఎంపికై న ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య జాదవ్‌ను కలెక్టర్ రాజర్షి షా శనివారం సన్మానించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను ఆయ న మర్యాద పూర్వకంగా కలిశారు. జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు.జిల్లా కీర్తిని చాటిన సాయిచైతన్య ఆదిలాబాద్‌టౌన్: సాయిచైతన్య జిల్లా కీర్తిని జా తీయ స్థాయిలో చాటారని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కా ర్యాలయంలో ఆయనను శనివారం శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. యువ త సాయిచైతన్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. -
‘భూ భారతి’పై విస్తృత చర్చ అవసరం
● కలెక్టర్ రాజర్షి షా కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై విస్తృత చర్చ జరగాలని, తద్వారా చట్టంపై అవగాహన కలిగి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూగార్డెన్లో శని వారం నిర్వహించిన ఆదిలాబాద్ అర్బన్ మండల భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి సదస్సును ప్రారంభించారు. చట్టం విధి విధానాల పై అధికారులు రైతులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి చట్టంలో లేని అనే క నిబంధనలను 1971 రెవెన్యూ చట్టంలోని మంచి అంశాలను తీసుకుని రైతులకు లబ్ధి చేకూర్చేలా భూబారతి చట్టాన్ని రూపొందించారన్నారు. ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం తె చ్చిన ధరణితో అనేక అవస్థలు పడ్డ రైతులకు భూ భారతితో మేలు చేకూరనుందని వెల్లడించారు. అనంతరం రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించా రు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ విజయ్‌కాంత్, ఆర్ఐ యజువేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేరడిగొండ: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుందని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. మండల కేంద్రంలోని సూర్య గార్డెన్లో శని వారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ని ర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ ఎంఏ కలీం, డీటీ మ హేశ్, ఆర్ఐ నాగోరావ్, ఎంపీడీఓ రాజ్వీర్, కుమా రి పీఏసీఎస్ చైర్మన్ రమేశ్ రైతులు పాల్గొన్నారు. మావలలో.. ఆదిలాబాద్‌రూరల్: మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి ఆర్వోఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో శంకర్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు సన్మానం కై లాస్‌నగర్: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు, అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.శివరాం ప్రసాద్ సన్మానించారు. శనివారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శాలువాతో సత్కరించారు. ఇంటర్ ప్రతిభావంతులకు సన్మానంకైలాస్నగర్: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియె ట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులను కలెక్టర్ రాజర్షి షా శనివారం సన్మానించారు. తంతోలి గ్రామానికి చెందిన ఏ.అంజలి బైపీసీ సెకండియర్‌లో 955 మార్కులు సాధించగా, పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన డి.స్నేహ ఎంపీపీ ఫస్టియర్‌లో 467 మార్కులతో టాపర్‌గా నిలిచింది. కలెక్టర్ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. జేఈఈ, ఎంసెట్ కోచింగ్‌కు అవసరమైన ఆర్థికచేయూత అందిస్తామని భరో సా ఇచ్చారు. ఇందులో డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సూరజ్ తదితరులున్నారు. -
‘ఉపాధి’ సమస్యలు పరిష్కరించాలి
కై లాస్‌నగర్: ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాల ని, ప్రభుత్వం నిర్ణయించిన కూలీ రూ.307లో కోత పెట్టకుండా పూర్తిగా చెల్లించాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.స్వామి, కె.ఆశన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ
ఆదిలాబాద్: పరిసరాల పరిశుభ్రతతోనే దోమ ల నియంత్రణ సాధ్యమవుతుందని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్య సిబ్బందికి శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కీటక జనిత వ్యాధుల నివారణపై ముద్రించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాది ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదన్నారు. దీనికి వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, పల్లె దవఖానాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
● జిల్లాకు ఈ సారి భారీగా పత్తి విత్తనాలు ● సరిపడా సరఫరాకు కంపెనీలు సిద్ధం ● కొరత ఉండదంటున్న వ్యవసాయశాఖ ● డిమాండ్ వైరెటీల ధర కూడా తగ్గే అవకాశం
పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు (ఫైల్) గతేడాది వానాకాలం సాగుకు ముందు పత్తి విత్తనాల కొనుగోలు పరంగా జిల్లాలో ఎదురైన పరిస్థితులు విదితమే. డిమాండ్ రకం సీడ్స్ కోసం రైతులు విత్తన దుకాణాల ఎదుట బారులు తీరడం మనం చూశాం. డిమాండ్ రకాలు ఒకటి రెండు మాత్రమే ఇచ్చి మిగతావి మామూలు రకాలు అంటగట్టారని అప్పుడు రైతుల నుంచివిమర్శలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, అప్పటి ఎస్పీ గౌస్ ఆలం స్వయంగా రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ సారి ఆ పరిస్థితి ఉండదని వ్యవసాయ శాఖ చెబుతోంది. జిల్లాకు సరిపడాకు మించి విత్తనాలు రానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. – సాక్షి, ఆదిలాబాద్ అడిగిన దానికంటే ఎక్కువ.. సాధారణంగానే వానాకాలం సీజన్‌కు ముందు పత్తి విత్తనాల కంపెనీలకు సంబంధించి ఇక్కడి ప్రతినిధులతో జిల్లా అధికారులు సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లతోనూ సమావేశమవుతారు. మండలం వారీగా డీలర్లతో చర్చిస్తారు. ఈ విధంగా ముందుగానే సీడ్స్ సరఫరాకు సంబంధించిన యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో పత్తి ఎంత సాగవుతుంది.. మార్కెట్లో విత్తన ప్యాకెట్లు అందుకు తగ్గట్లుగా కంపెనీలు సరఫరా చేయగలుగుతాయా లేదా అనే విషయంలోనే ఈ ముందస్తు ప్రణాళిక. జిల్లాలో ఈ సమావేశాలన్నీ వ్యవసాయశాఖ ఇటీవల పూర్తి చేసింది. అందులో విత్తన కంపెనీల ప్రతినిధులు తమ సప్లై ప్లాన్‌ను అధికారులకు తెలియజేశారు. కమిట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ సారి అడిగినదానికంటే ఎక్కువ కూడా సరఫరా చేసేందుకు సిద్ధమని వారు తెలియజేశారు. దీంతో వ్యవసాయశాఖలో ఈ సారి సీడ్ వర్రీ కనిపించడం లేదు. ఎందుకంటే .. ఈ సారి పత్తి విత్తనాల ఉత్పత్తి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల నుంచి విత్తనాల ప్యాకెట్లు జిల్లాకు వస్తాయి. ఎక్కడైతే సీడ్ ఉత్పత్తి జరుగుతుందో అక్కడ గడిచిన సీజన్లో అకాల వర్షాలు లేకపోవడంతో విత్తన ఉత్పత్తి అధికంగా వచ్చిందని చెబుతున్నారు. అంతే కాకుండా నాణ్య మైన విత్తనం కూడా అందుబాటులో ఉందని పే ర్కొంటున్నారు. దీంతోనే డిమాండ్ రకాలు కూడా పుష్కలంగా అందుబాటులో ఉంటాయని అధికారులు భరోసా ఇస్తున్నారు. పత్తి పండించే రైతులు విత్తనాల విషయంలో ఆందోళన పడవద్దని, నకిలీ విత్తనాల వైపు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ధర పెరిగినా.. పత్తి విత్తనాలకు సంబంధించి ప్రైవేట్ మార్కెట్లోనే ప్యాకెట్లను విక్రయిస్తుంటారు. దీంతోనే ఏటా సీజన్ వచ్చిందంటే కంపెనీల ప్రతినిధులతో అధికారులు సమావేశమవుతారు. సరఫరాలో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటారు. కాగా పత్తి విత్తన ప్యాకెట్ 450 గ్రాములు ఉంటుంది. ఎకరానికి రెండు ప్యాకెట్లు అవసరం పడుతాయి. అయితే మెజార్టీ రైతులు డిమాండ్ వైరెటీ రకాలకే మొగ్గు చూపుతారు. ఆ కంపెనీ ప్యాకెట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వ్యాపారులు అవి తక్కువగా ఇచ్చి ఇతర వైరెటీలను వారికి అంటగడతారు. ఈ విషయంలోనే ఏటా రాద్దంతం అవుతోంది. అయితే ఈ ఏడాది పత్తి విత్తన ప్యాకెట్ ధరను కేంద్రం పెంచింది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.37 పెరిగింది. అయితే ఈ సారి సీడ్ ప్రొడక్షన్ అధికంగా ఉండటంతో విత్తన కంపెనీల మధ్య పోటీ పెరగనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్యార్పీ కన్నా తక్కువకే అమ్మినా ఆశ్చర్య పొనక్కర్లేదని పేర్కొంటున్నారు. జిల్లాలో పత్తి సాగు, విత్తనాల వివరాలు.. సాగు విస్తీర్ణం అంచనా : 4.50 లక్షల ఎకరాలు గతేడాది సాగైన విస్తీర్ణం : 4.37 లక్షల ఎకరాలు విత్తన ప్యాకెట్ల డిమాండ్ : 11 లక్షలు గతేడాది సప్లై చేసింది : 15 లక్షలు (మొదట్లో సీడ్ నష్టంతో రైతులు మళ్లీ కొనుగోలు చేశారు) ఈ సారి ఆయా కంపెనీలు సరఫరా చేస్తామని చెప్పిన విత్తన ప్యాకెట్లు : 20 లక్షల వరకు.. విత్తన సరఫరా ప్రణాళిక సిద్ధం.. పత్తి విత్తనాలకు సంబంధించి ఈ సారి కంపెనీలు డిమాండ్ కంటే అధికంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వారితో సమావేశాలు పూర్తి చేశాం. ఈ ఏడాది అడిగినదానికంటే ఎక్కువే సప్లై చేస్తామని వారు చెప్పారు. ఈ సారి పత్తి విత్తనాల కొరత ఉండదు. రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేయనవసరం లేదు. అధికారిక విత్తన దుకాణాల్లోనే సరిపడా అందుబాటులో ఉంటాయి. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
న్యాయవాదుల నిరసన ర్యాలీ
కై లాస్‌నగర్: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ న్యాయవాదులు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసేలా కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి డీఎస్పీ శర్మ, ఉపాధ్యక్షుడు చందూసింగ్, ముజాయిద్ హుస్సేన్, అఖిలేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులా... కాదా
● ‘యువ వికాసం’ దరఖాస్తుల పరిశీలన షురూ ● క్షేత్రస్థాయిలోకి కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు ● మే 2 వరకు గడువు కై లాస్‌నగర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు రూ.4లక్షల వరకు ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌తో పాటు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల ద్వారా ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరించింది. ఈ నెల 14వ తేదీతో గడువు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 34,109 అప్లికేషన్లు అందాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2న సబ్సిడీ రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మండలాల వారీగా రుణ మంజూరు యూనిట్ల టార్గెట్లను ఖరారు చేయడంతో పాటు అర్హుల గుర్తింపునకు క్షేత్రస్థాయిలో సర్వేకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలోకి కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు రంగంలోకి దిగారు. తమకు అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. దరఖాస్తుదారులు ప్రభుత్వమందించే సాయానికి అర్హులా.. కాదా, వారు గ్రామంలోనే ఉంటున్నారా, దరఖాస్తు చేసుకున్న యూనిట్ మంజూరుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, వనరులు వారి వద్ద ఉన్నాయా అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అర్హులని నిర్ధారించుకున్న వారి వివరాలను ఆయా శాఖల అధికారులతో పాటు సంబంధిత బ్యాంకు మేనేజర్లకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తున్నారు. అర్హుల గుర్తింపునకు సంబంధించి మే 2వరకు గడువుగా నిర్ణయించారు. ఈ క్రమంలో పరిశీలన ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కాగా రెండు, మూడు రోజుల్లో వేగవంతమయ్యే అవకాశముంది. దరఖాస్తుల వెల్లువ.. స్వరాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తర్వాత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు యూనిట్ల ఆధారంగా సబ్సిడీ సాయం అందించాలని భావిస్తోంది. అ యితే జిల్లా వ్యాప్తంగా 34వేలకు పైగా దరఖాస్తులు అందాయి. అత్యధికంగా బీసీలు 18,009 మంది దరఖాస్తు చేసుకోగా ఈబీసీలు 610, ఎస్సీలు 9,643 , మైనార్టీల్లో ముస్లింలు 5,791, క్రిస్టియన్లు 56 చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. ఇలా మండలాల వారీగా అందిన దరఖాస్తుల ఆధారంగా రుణ టార్గెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఆ లక్ష్యాల వివరాలతో పాటు లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మండలాల వారీ గా ఎంపీడీవోలకు అందజేశారు. వారు తమ పరి ధిలోని యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయా శాఖలకు అందించాల్సి ఉంటుందని అధి కారులు తెలిపారు. ఈ ప్రక్రియ మే నెలాఖరు నా టికి పూర్తికానుందని వెల్లడించారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం రాజీవ్ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు సర్వే ప్రారంభించారు. మండలాల వారీగా రుణ యూనిట్ల లక్ష్యాలను కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖరారు చేశాం. మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపించాల్సి ఉంటుంది. జిల్లా కమిటీ పరిశీలన అనంతరం లబ్ధిదారుల తుది ఎంపిక ఉంటుంది. – కే రాజలింగు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి -
‘భూభారతి’తో సమస్యలకు పరిష్కారం
నార్నూర్: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరి ష్కారం లభించనుందని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. గాదిగూడ మండలంలోని రైతు వేదిక భవనంలో, నార్నూర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భూభారతి చట్టంతో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఆధార్‌లాగే ప్రతీ భూ కమతానికి భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నార్నూర్ మండలవాసుల సహకారంతోనే నీతి ఆయోగ్ బ్లాక్‌లో భాగంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం మండలంలోని బలాన్పూర్ చెరువులో చేపడుతున్న పూడికతీత పనులను కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్‌కు సన్మానం నార్నూర్ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు మండల పేరును జాతీయ స్థాయిలో నిలిపిన కలెక్టర్‌ను మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉట్నూ ర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మండల ప్రత్యేకాధికారి గంగారాం, తహసీల్దార్ జాడి రాజలింగు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం లబ్ధ్దిదారుడి ఇంట్లో కలెక్టర్ భోజనంఅనంతరం కలెక్టర్ నార్నూర్ మండలకేంద్రంలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన రేషన్ లబ్ధిదారు జిల్లెపల్లి సుకుమార్ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. కలెక్టర్ రాజర్షి షా నార్నూర్, గాదిగూడలో నూతన చట్టంపై అవగాహన సదస్సులు -
రైతు కుటుంబాలను ఆదుకోవాలి
● బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ కై లాస్‌నగర్: రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని, బాధిత కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపన కోసం చేపట్టిన లక్ష కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా శుక్రవారం సాత్నాల మండలంలోని పార్డి–బి గ్రామంలో పర్యటించారు. విద్యుత్ షాక్‌తో మరణించిన రైతులు ఉగ్గే హనుమంతు, బొనిగల రాజు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్, ఉపాధ్యక్షురాలు సుష్మ, కార్యదర్శి గంగన్న, నాయకులు నవీన్, సాయి, రాంచందర్, శ్రీవాణి, దివ్యవాణి, సంతోష్ తదితరులున్నారు. -
ప్రతీ కూలీకి ఉపాధి కల్పించాలి
తలమడుగు: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన ప్రతీ కూలీకి ఉపాధి పనులు కల్పించాలని డీఆర్డీఏ ఏపీడీ రవీందర్ రాథోడ్ అన్నారు. మండలంలోని కప్పరిదేవి, ఝరి, డోర్లీ, గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వేసవి నేపథ్యంలో పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బంది లేకుండా నీడ, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. అనంతరం ఝరి గ్రామ సమీపంలో చేపడుతున్న చెక్ డ్యాం పనులను పరిశీలించారు. ఆయన వెంట ఈజీ ఎస్ ఏపీవో మేఘమాల, ఈసీ ప్రవీణ్‌రావ్, టెక్నికల్ అధికారి మల్లేశ్, ఉపాధి సిబ్బంది స్వామి తదితరులు ఉన్నారు. -
‘భారత్‌సమ్మిట్’లో ఎమ్మెల్యే బొజ్జు
ఉట్నూర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌తో తెలంగాణకు మేలు చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొని మాట్లాడారు. అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలపై నెహ్రూ అలీనోద్యమానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరామర్శ మండలంలోని దంతన్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సనావుల్లాఖాన్ హైదరా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనను పరామర్శించారు. -
పిల్లల కథల పుస్తకం ఆవిష్కరణ
కై లాస్‌నగర్: పిల్లలతో కథలు రాయించడంతో పాటు స్వయంగా కథల పుస్తకం రాయడం అ భినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోరెడ్డి అశోక్ రాసిన ‘స్ఫూర్తి పిల్లల కథలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులోని కథలు పిల్ల ల్లో నైతిక పరివర్తనకు, వ్యక్తిగత మార్పునకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డీఈవో ఏ.శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, సంక్షేమ అధికారి మిల్కా, సెక్టోరియల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి
● డీఎస్పీకి సీపీఐ నాయకుల వినతికై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన చౌక్‌లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ కోరారు. శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, ఎస్ఈ కార్యాలయ డీఈ లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ చౌక్, ఆర్టీసీ బస్టాండ్ ఎదుట, వినాయక చౌక్, నేతాజీ చౌక్, పంజాబీ చౌక్, తిరుమల పెట్రోల్ పంపు వద్ద గల బీటీ రోడ్లను విస్తరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణా లు కోల్పోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ మొయిజ్, ఏఐటీయూసీ నాయకులు కాంతారావు, ఆనంద్, రాజేశ్వర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ మామిడి పండ్లతో ఆరోగ్యం
ఉట్నూర్‌రూరల్: ఎలాంటి రసాయన ఎరువులు వా డకుండా సహజంగా పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఆదివాసీ ఆర్గానిక్ మామిడిపండ్ల స్టోర్‌ను ప్రారంభించారు. పీవో మాట్లాడుతూ పండ్లను మాగపెట్టడానికి రసాయనిక మందులు వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సేంద్రియ మామిడిపండ్లు తాజాగా, రుచిగా ఉంటాయన్నారు. వీటిని తన సొంతఖర్చులతో కొనుగోలు చేసి మంత్రులు, తోటి శాసన సభ్యులకు పంపించి వాటి ప్రాముఖ్యతను వారందరికీ తెలియస్తానన్నారు. -
లింగాపూర్‌లో దొంగతనం
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుగిల్ల బుచ్చన్న కొడుకు దుబాయ్ వెళ్లగా కోడలు సరిత అత్తమామలతో కలి సి ఉంటుంది. బుధవారం సరిత తల్లిగారింటికి వెళ్లగా బుచ్చన్న గదికి తాళం వేసి పక్క గదిలో నిద్రించాడు. తె ల ్లవారుజాము చూసేసరికి గది తాళం, బీరువా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో గదిని పరిశీలించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
వాంకిడి: బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఒక మహిళ మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బంబార గ్రామానికి చెందిన నాగుల విలాస్, నాగుల ఉమా (48) దంపతులు బుధవారం కాగజ్‌నగర్ మండలం నవేగాంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో సాయంత్రం జాతీయ రహదారిపై బంబార గ్రామ సమీపంలోని యూటర్న్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్రవాహనం వీరి వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చుని ఉన్న ఉమా రోడ్డు డివైడర్‌పై పడగా తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో మహా రాష్ట్రలోని చంద్రపూర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో నాగుల విలాస్‌కు గాయాలయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డేంజర్ బెల్స్
● ఉమ్మడి జిల్లాలో నిప్పుల కుంపటి ● రికార్డుస్థాయిలో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు జిల్లా కేంద్రంలో తలపై చున్నీలు వేసుకుని కాలినడకన వెళ్తున్న యువతులుజాగ్రత్తలు పాటించాలి ఎండ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి. ఎండలో పనిచేసే వారు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లవద్దు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. కొబ్బరి బోండాలు, పండ్లరసాలతో పాటు అధిక మొత్తంలో నీళ్లు తాగాలి. వడదెబ్బకు గురైతే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజురోజుకు పగటి ఉ ష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నిప్పుల కుంపటి తలపిస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల, తాంసి, నిర్మల్ జిల్లా ముధోల్‌లో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా భీమిని, ఆదిలాబాద్ జిల్లా మావలలో 45.1 డిగ్రీలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరిలో 45 డిగ్రీలు నమోదయ్యాయి. రెండుమూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండ తీవ్రతకు జనాలు తల్లడిల్లిపోతున్నారు. పంట పొలాలకు వెళ్లి పనులు చేసుకునే కూలీలు, రైతులు, ఉపాధిహామీ కూలీలు, చిరు వ్యాపారులు ఎండ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 గంటలు దాటినా ఎండ వేడిమితో సతమతం అవుతున్నారు. జనాలు ఇంటినుంచి బయటకు వెళ్లకుండా కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. మూగజీవులకు నీళ్లు దొరకక అల్లాడుతున్నాయి. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రానున్న మే నెలలో దీని తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత పెరిగిపోవడంతో జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. -
‘అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి’
కై లాస్‌నగర్: ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదవుతున్నాయని, చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేలో సెలవులు ప్రకటిస్తామన్న మంత్రి సీతక్క హామీని నిలబెట్టుకోవాలన్నారు. తక్షణమే సర్క్యూలర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నన్న, సహాయ కార్యదర్శి నవీన్ కుమార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు రత్నమాల, ముక్త, ప్రమీల, సుభద్ర, అనసూయ, నజీమా, లక్ష్మి, భాగ్యశ్రీ పాల్గొన్నారు. -
‘భూభారతి’తో భూసమస్యల పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషాబజార్హత్నూర్: భూభారతి చట్టంతో భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూముల విషయంలో ఉన్న అభద్రతా భావానికి తావు లేకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ ధరణి చట్టం ప్రారంభించినప్పుడు ఆన్లైన్లో నా పట్టాభూమి మాయమైందని, మళ్లీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి నెలల సమయం పట్టిందన్నారు. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు సామస్యులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందన్నారు. భూభారతిలో అలా జరగకుండా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి ధరణి చట్టం తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకువస్తే వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ధరణి స్థానంలో భూభారతి పేరు మాత్రమే మార్చారని, వాటి విధి విధానాలు మాత్రం రైతులకు మేలు చేయడానికేనన్నారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, బజార్హత్నూర్ మండలానికి సబ్ మార్కెట్‌యార్డు మంజూరు చేయాలని రైతులు కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న యాదవ్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’ గుడిహత్నూర్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మన్నూరు ఎస్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సునీత, తహసీల్దార్ కవితా రెడ్డి, మన్నూరు సహకార సంఘ చైర్మన్ ప్రకాశ్కరాడ్, డీటీ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సామూహిక వివాహ వేడుకలు
● ఏకమైన నాలుగు జంటలుఇంద్రవెల్లి: మండలంలోని అంజీ గ్రామపంచాయతీ పరిధి మామిడిగూడలో గురువారం ఆంద్ సమాజ్ ఆధ్వర్యంలో పరమాహంస సద్గురు పూలాజీబాబా సంస్థాన్ వద్ద సామూహిక వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో అదే గ్రామానికి చెందిన నాలుగు జంటలు ఏకమయ్యాయి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, పట్నాపూర్ శ్రీ సద్గురు పరమాహంస పూలాజీబాబా ధ్యాన్ మందిర్ వ్యవస్థాపకుడు కేశవ్ ఇంగ్లేతో పాటు ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐటీడీఏ పీవీటీసీ ఏపీవో మెస్రం మనోహర్, ఆదివాసీ పెద్దలు డాకురే రాందాస్, కరాడే మారుతి, మెస్రం శేఖర్‌బాబు తదితరులు ఉన్నారు. -
రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే పీడీయాక్ట్
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గురువారం ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో రౌడీషీట్లు నమోదైన వారితో రౌడీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీయిజం చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తూ అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తామన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీషీట్లు తొలగిస్తామన్నారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం లాంటివి మానుకోవాలని సూచించారు. నేరాలు లేని సమాజాన్ని తయారు చేయడానికి జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్‌రావు, డి.సాయినాథ్, కె.ఫణింధర్, తదితరులు పాల్గొన్నారు. పదోన్నతితో మరింత బాధ్యత ఆదిలాబాద్‌టౌన్: పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన పది మంది కానిస్టేబుళ్లకు గురువారం పోలీసు కార్యాలయంలో చి హ్నాలను అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొ త్తం 28 మందికి పదోన్నతి లభించడం, అందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి పది మంది ఉండటం సంతోషంగా ఉందన్నారు. పదోన్నతి పొందిన వారిలో నిర్మల్ జిల్లాకు జి.సుభాష్, ఇ.సుదర్శన్, ఏ.ప్రకాశ్‌రెడ్డి, ఎం.వీరప్రకాశ్రెడ్డి, బి.గంగారెడ్డి, జగిత్యాల జిల్లాకు శివాజీ, రమణ, వెంకటి, లక్ష్మణ్‌రావు, వెంకటరమణను కేటాయించినట్లు తెలిపారు. -
● అమాయకుల అవసరాలు సొమ్ము చేసుకుంటున్నవైనం.. ● అధిక వడ్డీకి రుణాలు.. చెల్లించకుంటే ఆస్తుల వశం.. ● కొరడా ఝుళిపించిన ఎస్పీ ● జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు ● 31 కేసులు నమోదు ● ప్రామిసరీ నోట్లు, బాండ్లు, బ్యాంక్ చెక్కులు, స్టాంప్ పేపర్స్ స్వాధీనం
సాక్షి,ఆదిలాబాద్:జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించిపోయాయి. అవసరానికి రుణాలు తీ సుకునే వారి నుంచి అధిక మొత్తంలో మిత్తి వసూలు చేస్తూ అమాయక ప్రజల నడ్డి విరుస్తున్నారు. డ బ్బులు చెల్లించని వారి నుంచి ఇల్లు, పొలాలు, వి లువైన ఆస్తులు బలవంతంగా హస్తగతం చేసుకుంటున్నారని బాధితుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి సమస్య పలు చోట్ల వెలుగులోకి రావడంతో గతం నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలోనూ ఈ ఆగడాల నేపథ్యంలో తొలిసారి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బుధవారం ఏకకాలంలో పోలీసులు పలుచోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసు శాఖ నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు. కోట్ల రూపాయల వరకు.. అవసరానికి రుణాలు తీసుకునే వారి నుంచి వడ్డీ వ్యాపారులు అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు అప్పులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులు అంతకుమించి విలువైన ఇల్లు, పొలాలకు సంబంధించిన పత్రాలను తమ దగ్గర ఉంచుకుని జనా లకు రుణాలు ఇస్తున్నారనే ప్రచారం ముందు నుంచీ ఉంది. ప్రాపర్టీ సేల్ డీడ్, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్చెక్కుల ద్వారా రుణం ఇచ్చే సమయంలోనే వడ్డీ వ్యాపారి తనకు అనువైన రీతిలో మలుచుకోవడం ద్వారా రుణగ్రహీత అవకాశాన్ని అనువుగా మార్చుకుంటున్నారన్న విమర్శలు కోకొల్లాలు. ఆ తర్వాత ఆ వ్యక్తి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ ఆస్తులను పూర్తిగా తమవశం చేసుకోవడం వంటివి ఇప్పటికే ఎన్నో జరిగాయనే అపవాదు ఉంది. జిల్లాలో ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారికి హద్దేలేని సంపాదన వచ్చిపడుతుందని పలువురు చెప్పుకుంటున్నారు. వడ్డీకి రుణం తీసుకున్న వ్యక్తులు దాన్ని కట్టలేని పరిస్థితుల్లో సర్వం కోల్పోతున్న నేపథ్యాలు కూడా లేకపోలేదు. కాగా కొంతమంది పేరుకు ఇత ర బిజినెస్‌లు నిర్వహిస్తున్నట్లు మార్కెట్లో చెలామ ణి అవుతున్నప్పటికీ ప్రధానంగా వడ్డీ వ్యాపారమే వృత్తిగా కొనసాగుతుందనే విమర్శలు లేకపోలేదు. 31 కేసులు నమోదు.. జిల్లా వ్యాప్తంగా బుధవారం 30 బృందాలతో పోలీ సులు వడ్డీ వ్యాపారుల నివాస స్థలాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణం, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్, గుడిహత్నూర్, బేల, నార్నూర్ మండలాల్లో దాడులు ని ర్వహించి 31 కేసులు నమోదు చేశారు. ప్రామిసరి నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, స్థలాల డాక్యుమె ంట్లు స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 3(5)(బి)తెలంగాణ ఏరియా మనిరెండర్స్ యాక్ట్ 1349 కింద కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. అదేవిధంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలు తెలియజేస్తుంది. చర్యలు తప్పవు అవసరాలకు రుణాలు తీసుకున్న అమాయక ప్రజలను మోసం చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇచ్చోడలో 10, బోథ్‌లో 6, మావలలో 3, ఆదిలాబాద్ పట్టణంలో 6, ఉట్నూర్‌లో 2, ఆదిలాబాద్‌రూరల్, బేల, నార్నూర్, గుడిహత్నూర్‌లలో ఒక్కో కేసు నమోదు చేశాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ, ఆదిలాబాద్ -
ఆత్మహత్యకు యత్నించిన యువతి..
ఖానాపూర్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లి దండ్రులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. ప్రోబేషనరీ ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న(18) గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా కొన్ని రోజులు వేచి ఉండాలని తెలిపారు. మనస్తాపానికి గురైన స్వప్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందిందని ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి దేవురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
వడదెబ్బతో యువకుడు మృతి
నిర్మల్‌టౌన్: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బ్రహ్మపూరి కాలనీకి చెందిన మహ్మద్ బేగ్ కుమారుడు సోఫిబేగ్ (25) గత రెండు రోజుల క్రితం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. ఈక్రమంలో గురువారం ఇంట్లో మృతి చెందాడు. కాగా సోఫిబేగ్ మూడు నెలల క్రితం దుబాయ్ నుంచి నిర్మల్‌కు వచ్చాడు. మేకల కాపరి..ముధోల్: మండలంలోని మచ్కల్ గ్రామానికి చెందిన షెల్కే లింగురాం(58) అనే మేకల కాపరి వడదెబ్బతో మృతి చెందాడు. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగురాం మేకలు కాస్తూ జీవనం సాగించేవాడు. రోజు మాదిరిగానే బుధవారం గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద పెద్ద కుమారుడు గంగాధర్‌తో కలిసి మేకలను మేపుతున్నాడు. ఈక్రమంలో మిట్ట మ ధ్యాహ్నం ఒక్కసారిగా లింగురాం కుప్పకూలి పోయాడు. గంగాధర్ చెట్టు నీడకు తీసుకెళ్లేందు కు ప్రయత్నించగా లింగురాం స్పందించలేదు. వెంటనే గ్రామంలోకి వెళ్లి కుటుంబసభ్యుల కు, గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చే సరికి లింగురాం మృతి చెంది ఉన్నాడు. లింగురాంకు భార్య లక్ష్మి, కుమారులు గంగాధర్, శ్రావణ్, కుమార్తె పూజ ఉన్నారు. బెల్లం, పటిక పట్టివేతతాండూర్: జాతీయ రహదారి మీదుగా అక్రమంగా నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా గురువారం ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోలేటికి చెందిన దుర్గం రాజ్‌కుమార్, దాగం సంజు, అజ్మీరా చందు అనే వ్యక్తులు బెల్లం, పటిక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఐబీ తాండూర్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎకై ్సజ్ అధికారులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు. -
ఊపిరాడక 20 మేకలు మృతి
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): భోరజ్ మండలం సిర్సన్న గ్రామంలో గురువారం 20 మేకలు ఊపిరాడక మృతిచెందాయి. గ్రామంలోని ఆత్రం యాదవ్, గెడాం వికాస్‌లు తమ మేకలను మేపడానికి గ్రామంలోని వైకుంఠధా మం ప్రాంతానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సి ఉండగా, వాటిని వైకుంఠధామంలోని స్నానాల గదిలో ఉంచి తలుపులు వేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్లి చూసేసరికి ఊపిరాడక 20 మేకలు మృతిచెందాయి. రేకులు ఉండటం, తలుపులు వేసి ఉండడంతో ఎండ తీవ్ర త తట్టుకోలేక, ఊపిరాడక మృతిచెందాయని తె లుస్తోంది. వీటి విలువ దాదాపు రూ.2లక్ష ల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరి హా రం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జొన్న పంట దగ్ధంఆదిలాబాద్టౌన్(జైనథ్): సాత్నాల మండలంలోని మేడిగూడకు చెందిన కళ్లెం రాంరెడ్డి అనే రైతుకు చెందిన రెండెకరాల జొన్న పంట దగ్ధమైంది. గురువారం చేనుకు ఆనుకొని ఉన్న పక్క చేను రైతు గట్లపై ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు జొన్న పంటకు నిప్పంటుకుంది. దీంతో పంట పూర్తిగా కాలిబూడిదైంది. పంట చేనులో ఉన్న 50 పైపులు కూడా మంటలో కాలిపోయినట్లు రైతు వాపోయాడు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో గదిని పరిశీ లించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎ త్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నా రు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు. విద్యుత్‌షాక్‌కు గురైన వ్యక్తి మృతినర్సాపూర్(జి): డొంగుర్గాం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతిచెందాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధనే విజయ్(51) ఈనెల 11న జంగిపల్లి చిన్నయ్య వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ఫార్మర్ దగ్గర మోటార్ పైపులను చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బుధవారం డిశ్చార్జి చేయగా డొంగుర్గాం గ్రామానికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విజయ్ తమ్ముడు వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎల్సీకి సాంకేతికత!
● విద్యుత్ ప్రమాదాల నివారణకు యాప్ ● ఇక ఆన్లైన్లో విద్యుత్ లైన్ క్లియరెన్స్ ● అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్పీడీసీఎల్ ● యాప్‌పై అధికారులు, ఉద్యోగులకు శిక్షణ పూర్తిమంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యుత్ విని యోగదారులకు మరింతగా మెరుగైన, నాణ్య మైన సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభిస్తోంది. ఇందులో భాగంగా విద్యుల్ లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్‌కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాలతో పాటు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎల్సీ (విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ)తీసుకోవడానికి ఎన్పీడీసీఎల్ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకున్న ఉద్యోగికి, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు మాత్రమే తెలి సేది. కానీ యాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో ఎల్సీపై అందరి పర్యవేక్షణ కొనసాగుతుంది. అమలు ఇలా.. ఎల్సీ తీసుకోవాలనుకునే లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఏఈకి విన్నవించుకుంటే ఏఈ పరిశీలించి ఫీడర్లో ఎల్సీ ఇవ్వడానికి వీలు ఉందా లేదా అని పరిశీలించి అనుమతి ఇస్తారు. ఏఈ అనుమతి మేరకు లైన్మెన్, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా యాప్‌లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ పనులు బాధ్యతగా జరుగుతాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా యాప్ తగు సూచనలు ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్‌లు పెట్టుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా వంటి జాగ్రత్తలు యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడరింగ్ ఉందా..? ఈ ఫీడర్‌కు వేరే ఫీడర్‌తో అనుసంధానం ఉందా..? వంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా..? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవచ్చా..? అని సంయమనం చేసుకుని సిబ్బంది పనులు పూర్తి చేస్తారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పని కాగానే సంబంధిత లైన్మెన్ యాప్‌లో ఆ సమాచారాన్ని పొందుపరచి విద్యు త్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.అనవసర ఎల్సీలకు చెక్ విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంతో పాటు భద్రతా ప్రమాణాలు పెంచడానికి ఎన్పీడీసీఎల్ ఎల్సీ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. యాప్‌తో ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది. ఏ లైన్‌పై పనులు జరుగుతున్నాయో కూడా సులభంగా తెలుస్తోంది. మొత్తంగా అనవసర ఎల్సీలు తగ్గుతాయి. యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాలు, మానవ తప్పిదాలు, విద్యుత్ ప్రమాదాల నివారించవచ్చు. – గంగాధర్, ఎస్ఈ, మంచిర్యాల -
ఫోన్‌కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
● భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య ● సోదరుడికి ఫోన్ చేయడమే శాపమైందా..? ● విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యుల ఆందోళన ● అదనపు కలెక్టర్, పోలీసుల జోక్యంతో విరమణమంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మిప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్‌వాచ్‌మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మిప్రసన్న మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది.. ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మిప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్‌కు వాచ్మెన్ మహేశ్ సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్‌కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్‌పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మిప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
ఆదివాసీ వంటలకు డిమాండ్
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ● ఉట్నూర్‌లో ఇప్పపువ్వు పండుగ కార్యక్రమంఉట్నూర్రూరల్: ఆదివాసీ సాంప్రదాయ వంటలకు ఎంతో డిమాండ్ ఉందని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో 8వ ఇప్పపువ్వు పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్లు పాల్గొన్నారు. మహిళలు ఇప్పపువ్వులతో తయారు చేసిన వంటకాలు ప్రదర్శించారు. ఆదివాసీ మహిళలు ఆదివాసీ పద్దతులు, సాంప్రదాయ వంటకాలపై అధికారులకు వివరించి తినిపించారు. అధికారులు మాట్లాడుతూ ఇప్పపువ్వు లడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్నారు. ఈ లడ్డూలు ఉట్నూర్ ఎక్స్‌రోడ్డులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 12 మంది గిరిజన మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వుల లడ్డూలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, దుర్గు పటేల్, సహకార మిత్ర సంస్థ మేనేజర్ విఠల్, పేసా కోఆర్డినేటర్ వసంత్‌రావు, రాయి సెంటర్ల్ల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘తార’ సేవలు భేష్
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● ఘనంగా పోలీసు జాగిలం అంత్యక్రియలుఆదిలాబాద్టౌన్: పోలీసు శాఖకు జాగిలం తార అందించిన సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 2013 బ్యాచ్‌లో పోలీసు వ్యవస్థలోకి వచ్చిన తార జిల్లాలో పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పోలీసు జాగిలం తార మృతిచెందడంతో గురువారం పోలీసు కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పాల్గొని తారకు శాలువా, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వీఐపీలు జిల్లాపర్యటనకు వచ్చిన సందర్భంగా భద్రత విషయంలో తనిఖీలు నిర్వహించడంలో తార సేవలు ఎంతగానో దోహద పడ్డాయని గుర్తు చేశారు. పోలీసు జాగిలాలకు సకల సదుపాయాలు కల్పించాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతీ జాగిలానికి కూలర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, మురళి, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది రమేశ్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి నుంచి వస్తూ తిరిగిరాని లోకాలకు..
జన్నారం: బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఫిజియో థెరఫిస్టును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఎస్సై రాజవర్దన్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్‌కు చెందిన ఉరిమెత జంగుబాబు (30) జన్నారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజియో థెరఫిస్టుగా పని చేస్తున్నాడు. గురువారం బంధువుల పెళ్లికి కలమడుగుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో కొమ్ముగూడెం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరిపడ్డాడు. జంగుబాబు అక్కడికక్కడే మృతి చెందగా స్కూటిపై ఉన్న ఇందన్పల్లి గ్రామానికి చెందిన వంశీ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడకు చేరుకు ని వంశీని జన్నారం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేట్టిపేటకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
నిర్మల్‌లోనే నాణ్యమైన విద్య
● ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డినిర్మల్టౌన్: హైదరాబాద్ విద్యాసంస్థలకు దీటుగా నిర్మల్‌లోనే ఆల్ఫోర్స్ విద్యాసంస్థ నాణ్యమైన విద్య అందిస్తుందని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గురువారం జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆల్ఫోర్స్లో విద్యతో పాటు విలువలను అందిస్తామన్నారు. టాపర్స్ వీరే.. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్స్‌గా నర్వాడే కృష్ణవేణి 468/470, జోషి ప్రసూన శ్రీ 468/470, పడిగెల కీర్తిశ్రీ కి 468/470, బాలుర విభాగంలో బోనాల శ్రీ చరణ్ 467/470, వడకపూర్ అఖిల్ 467/470, కార్తికేయన్ 467/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో సామ ఫిర్దోస్ 438/440, జోహా మహావీష్ 438/440, నబిలా తహరీమ్ 438/440 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ విభాగాలలో కవల్ ప్రీత్‌కౌర్ 995/100, సుమయ కణం 994/100, జాదవ్ నవ్యశ్రీ 993/1000 మార్కులు సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచారు. కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర
● సీఎస్ఐ చర్చి ఆవరణలో మహోత్సవం ● పెద్ద ఎత్తున తరలిరానున్న క్రైస్తవులు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తిలక్సెట్టిపేట: ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరను సీఎస్ఐ చర్చి ఆవరణలో ఈ నెల 25, 26న నిర్వహించనున్నారు. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1920లో నిర్మాణం.. ఏటా ఏప్రిల్ 25, 26వ తేదీల్లో సీఎస్ఐ చర్చిలో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్దచర్చిగా పేరొందిన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి జిల్లాలోని చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. లక్సెట్టిపేట పట్టణ సమీపంలో సుమారు 100 ఎకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సీఎస్ఐ చర్చిని ఆంగ్లేయులు నిర్మించారు. 1920లో ఇక్కడికి వచ్చిన ఇంగ్లాండ్ దేశస్తుడు రెవ సీజీ అర్లి దొర నిర్మాణం ప్రారంభించాడు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, దగ్గరలోని గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్టల నుంచి రాళ్లు తెప్పించాడు. సమీప బొట్లకుంటలోని నీటిని నిర్మాణానికి ఉపయోగించారు. మహారాష్ట్ర శిల్పకళాకారులు ఆకర్షణీయంగా నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. నిర్మాణం పనులు సాగుతుండగా వేసవి కాలంలో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై అర్లి దొర తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1935లో రివ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణాన్ని పరిశీలించి పూర్తి చేయించాడు. అనంతరం ఇక్కడకు మిషనరీగా వచ్చిన రెవ ఫాస్పూట్ చర్చిని సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి ప్రారంభించాడు. ఘనంగా ఏర్పాట్లు.. జాతర ఏర్పాట్లను సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు ఫాధర్ డేవిడ్‌పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటిస్తూ సాయంత్రం ఊత్కూరు చౌరస్తా నుంచి భాజాభజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీగా చర్చి వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు పాడుతారు. 26న ఉదయం నుంచి చర్చిలో ప్రత్యేక కీర్తనలు పాడుతూ పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు. -
వాతావరణం
మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత ప్రభావం అధికంగా ఉంటుంది. 11లోu తాంసి మండలం లింగుగూడలో గల ఓ బెల్టు షాపులో ఈనెల 16న మహారాష్ట్ర నుంచి దేశీదారు తీసుకొచ్చి విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. 280 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.ఆదిలాబాద్‌రూరల్ మండలం భీంసరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల 500 దేశీదారు బాటిళ్లు తీసుకొస్తుండగా పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ● ఆదిలాబాద్ పట్టణంలోని వన్‌టౌన్ పరిధిలో బెల్టుషాపు నిర్వహిస్తున్న ఇద్దరిపై స్థానిక పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. అలాగే టూటౌన్ పరిధిలో వడ్డెర కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న బెల్టుషాపులపై దాడులు జరిపి పలువురిపై కేసులు నమోదు చేశారు. -
నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ రూంను బుధవారం ప్రారంభించారు. ఏ ఎస్సై ముకుందరావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి దొంగతనాలు, ఈవ్‌టీజింగ్, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణ సాయంగా పోలీసులు అందుబా టులో ఉంటారన్నారు. క్షణాల వ్యవధిలో స్పందించేలా ఉదయం నుంచి రాత్రి వరకు ఏఎస్సైతో పాటు హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలా బాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ సీఐలు సునిల్ కుమార్, కరుణాకర్‌రావు, ప్రణయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. వయోవృద్ధులకు పూర్తి సహకారం జిల్లా పోలీసు యంత్రాంగం వయోవృద్ధులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. తెలంగాణరాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం వన్‌టౌన్ ఎదుట ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ఆర్డీవో వినోద్ కుమార్, సంఘం సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ బస్టాండ్ వద్ద సబ్ కంట్రోల్ రూం ప్రారంభం -
రాయితీ సద్వినియోగం చేసుకోండి
కై లాస్‌నగర్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించేవారికి 5శాతం రాయితీ కల్పించినట్లు ము న్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఎర్లీబర్డ్ పథకం అమలు తీరుపై రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేటాయించిన వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీలైనంత మేర పన్ను వసూలు చేసేలా శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 30 వరకు గడువు ఉందని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో ఆర్వో స్వామి, ఆర్ఐలు వెంకటేశ్, హన్మంతు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషా ఇంద్రవెల్లి: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజ ర్షిషా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అ న్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన చట్టంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. ఆధార్‌కార్డు మాదిరిగా రైతులకు భూధార్ కార్డు పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. జూన్ 2 నుంచి పోర్టల్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. అనంతరం కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా డిప్యూటీ తహశీల్దార్ రమేశ్ ఆధ్వర్యంలో భూ భారతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, ఏపీసీఎస్ చైర్మన్ మారుతి డొంగ్రె, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్,ఎంపీడీవో జీవన్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలుగట్టెపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గ్రామంలో అడుగంటిన బావి, చేతిపంపుతో పాటు ఇటీవల తవ్విన బావిని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అలాగే మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో భూభారతిపై అ వగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా,ఎమ్మెల్యే బొజ్జు హాజరయ్యారు. పలువురు రైతు లు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ఇందులో తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు సన్మానంకై లాస్‌నగర్: నార్నూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఇటీవల జాతీయ పురస్కారం అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రీ కలెక్టర్‌ను సత్కరించారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఇందులో సమితి ప్రతినిధులు మాధవ్, సూర్యకాంత్, రవీందర్, నర్సింలు, వేణు, సంజీవ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
● ఎస్‌హెచ్‌జీల ద్వారా అందించేందుకు కసరత్తు ● ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై అధికారుల దృష్టి
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలన్నీ ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలువురు మొదలు పెట్టగా.. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో షురూ చేయలేదు. అలాంటి వారిని గుర్తించి త్వరగా ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు ఆర్థికసాయం అందించేలా యోచిస్తున్నారు. ఈ మేరకు హౌసింగ్, డీఆర్డీఏ అధి కారులు, ఎంపీడీవోలతో మంగళవారం గూ గుల్ మీట్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తదనుగుణంగా ఆయా శాఖల అధికారులు కసరత్తు ప్రారంభించారు. భారీగా మెటీరియల్ ధరలు.. పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒకటి చొప్పున 17 గ్రామాలను ఎంపికచేసి అర్హులైన వారి కి మంజూరు చేసింది. ఇందులో కొంత మంది ని ర్మాణాలు ప్రారంభించారు. హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్కవుట్ ప్రకారం పనులు చేపడుతున్నారు. కొంతమంది బెస్మెంట్ సైతం పూర్తి చేశారు. చాలా వరకు మాత్రం నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలు భారీగా ఉండటంతో పాటు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పనులు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. పాత ఇళ్లను తొలగించి పునాదులు తీసుకుంటే ప్రభుత్వమిచ్చే డబ్బులు ఆలస్యమైతే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ సాయం మంజూరు చేసినట్లైతే పనులు ముమ్మరమై నిర్మాణాలు త్వరగా పూర్తయ్యే అవకాశముంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం జమ చేసిన డబ్బులను తిరిగి ఎస్‌హెచ్‌జీలకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టని వారిలో హర్షం వ్యక్తమవుతోంది. నాలుగు విడతల్లో ఆర్థిక సాయం ఇందిరమ్మ లబ్ధిదారులకు నాలుగు విడతల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన రూ.5లక్షల ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదట పునాదులు పూర్తయితే రూ.లక్ష, పిల్లర్లు వేసిన తర్వాత 1.25లక్షలు, స్లాబ్ తర్వాత రూ.1.75లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష చొప్పున జమ చేయనున్నారు. ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా మరో రూ. లక్ష రుణం అందించనున్నారు. అయితే లబ్ధిదారు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండటంతో పాటు వారు ఉన్న సంఘం రుణానికి అర్హత కలిగి ఉన్నట్లేతేనే అందజేయనున్నారు.తాంసి మండలం హస్నాపూర్‌లో పూర్తయిన బేస్మెంట్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు: పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాలు: 17 మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య : 2,148 మార్కవుట్ ఇచ్చినవి: 1,022 బేస్మెంట్ వరకు పూర్తయినవి : 118 ఇంకా ప్రారంభించనివి : 1,126వివరాలు సేకరిస్తున్నాం ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థికస్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ సైతం సూచనలు చేశా రు. తదనుగుణంగా వారి వివరాలుఅందించాలని జెడ్పీ సీఈవోకు సూచించాం. వారిచ్చే వివరాల ప్రకారం లబ్ధిదారులు ఎస్‌హెచ్‌జీల్లో ఉన్నారా.. ఆ సంఘానికి రుణం పొందే అర్హత ఉందా.. అనే వివరాలు పరిశీలించి రుణసాయం అందించేలా చర్యలు చేపడుతాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
‘బెల్టు’ తీయరేమి?
● జిల్లాలో జోరుగా బెల్టుషాపుల నిర్వహణ ● ‘మహా’ సరిహద్దులో యథేచ్ఛగా దేశీదారు విక్రయాలు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న ఎకై ్సజ్ శాఖ ఆదిలాబాద్‌టౌన్: బెల్టు షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతుండడంతో కూలీనాలి చేసేవారు వాటికి అలవాటుపడి విలు వైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ము ఖ్యంగా యువత మద్యం మత్తులో తూగుతున్నా రు. దీంతో గొడవలకు దారి తీస్తున్నాయి. ఇటీవల పలువురు హత్యలు, దాడులకు పాల్పడిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామునే బెల్టుషాపులు తెరుచుకుంటున్నాయి. అర్ధరాత్రి వరకు కొనసాగుతుండడంతో మద్యం బాబులు నిత్యం కిక్కులోనే ఉంటున్నారు. కొంద రు కిరాణ షాపులు, హోటళ్లు, పాన్‌షాపులు, ఇళ్లలో వీటిని నిర్వహిస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు నామమాత్ర తనిఖీలకే పరిమితమవుతుండడంతో వీరి వ్యాపారం మూడు బాటిళ్లు.. ఆరు బీర్లు అన్న చందంగా సాగుతుందనేవిమర్శలున్నాయి. పుట్టపుగొడుగుల్లా బెల్టుషాపులు.. జిల్లాలో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గల్లీకొకటి చొప్పున దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో వీడీసీల ద్వారా వేలం నిర్వహించి అనధికారికంగా విక్రయాలు చేపడుతున్నారు. బాటిల్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఏరులైపారుతున్న దేశీదారు.. మహారాష్ట్ర సరిహద్దున గల గ్రామాల్లో వెలిసిన బె ల్టుషాపుల్లో దేశీదారు ఏరులై పారుతోంది. ఇటీవ ల ఎకై ్సజ్, పోలీసు అధికారులు వీటిపై దాడులు చేసి వందల సంఖ్యలో బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జైనథ్, బేల,భీంపూర్ తదితర మండలాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో దేశీదారు బాటిల్ ధర రూ.80 ఉండగా, ఇక్కడ రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహనాలు, కాలినడకన వీటిని రవాణా చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న వారు మాత్రమే మద్యం విక్రయించాలి. అయితే జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చాలాచోట్ల బెల్టుషాపులు ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తున్నారు. తక్కువ ధరకు లభించే మద్యంతో పాటు కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఆయా రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉండడంతో సంబంధిత శాఖ అధికారులు సైతం ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి 10 తర్వాత ఎవరైనా మద్యం విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇటీవల దాబా హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. అలాగే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
● విజయం సాధించే దాకా ఆపలే.. ● నిష్కామకర్మను ఫాలో అయ్యా.. ● ఆరో ప్రయత్నంలో లక్ష్యం సాధించా ● ట్రైబల్, రూరల్ డెవలప్మెంట్కు కృషి ● ‘సివిల్స్’ 68వ ర్యాంకర్ సాయిచైతన్య జాదవ్ మనోగతం
సాక్షి,ఆదిలాబాద్: ‘ఈ ఆనంద క్షణాలను మరువలే ను.. పట్టుదల వీడకుండా చేసిన ప్రయత్నమే నన్ను విజయతీరాలకు చేర్చింది.. యూపీఎస్సీ అంటేనే తీవ్రమైన పోటీ. ఆరేళ్లుగా సాగిన నా ప్రి పరేషన్ మొత్తం ఈ సారి అత్యుత్తమ ర్యాంక్ రావడానికి దోహదపడింది..’ అని అన్నారు ఆది లాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయిచైతన్య జాదవ్. మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 68వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. ఈ నే పథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఆయనను ‘సాక్షి’ బుధవారం ఫోన్ ద్వారా ‘ఇంటర్వ్యూ’ చేసింది. ఈ సందర్భంగా ఆయన తన సక్సెస్‌కు దారితీసిన అంశాలను ఇలా వివరించారు. సాక్షి: మీ కుటుంబ నేపథ్యం.. సాయిచైతన్య: మాది తలమడుగు మండలం పల్సి (బి) గ్రామం. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. నాన్న గోవింద్‌రావ్ హెడ్‌కానిస్టేబుల్. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో పనిచేస్తున్నారు. అమ్మ కవిత ఉట్నూర్ ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయురా లు. సోదరి శృతికి వివాహమైంది. హైదరాబాద్‌లో డాక్టర్. 20ఏళ్ల క్రితం మా కుటుంబం పల్సి( బి) నుంచి వచ్చి ఉట్నూర్‌లో స్థిరపడ్డాం. సాక్షి: మీ విద్య ఎక్కడెక్కడ సాగింది.. జాదవ్: ఉట్నూర్‌లోనే ప్రాథమిక విద్య పూర్తయింది. ఆ తర్వాత కాగజ్‌నగర్ నవోదయ పాఠశాలలో పదో తరగతి వరకు చదివా. ఇంటర్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశా. ఆ తర్వాత తమిళనాడులోని తిరుచ్చి ఐఐటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. సాక్షి: ఐఏఎస్ లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నారు.. జాదవ్: అమ్మ నాన్నకు ముందు నుంచి మమ్మల్ని మంచి హోదాలో చూడాలనే కోరిక ఉండేది. దాన్ని నేను పైకి తీసుకెళ్లాను. పెద్ద పోస్టు సాధించాలని ముందు నుంచి అనుకున్నాను. ఆ లక్ష్యంలో మా ఫాదర్, మదర్ సపోర్టు ఉంది. సాక్షి: ర్యాంక్ వచ్చేందుకు దోహదపడిన అంశాలు.. జాదవ్: బీటెక్ పూర్తయిన వెంటనే 2019లో మొదటిసారి తమిళనాడులోనే సివిల్ సర్వీసెస్ రాశాను. అప్పుడు ప్రిలిమ్స్‌లోనే తప్పాను. తర్వాత 2020 లో రెండోసారి రాయగా, మెయిన్స్‌లో పోయింది. మూడు, నాలుగోప్రయత్నంలో 2021, 2022 ఇంటర్వ్యూలో చేజారింది. 2023లో 131వ ర్యాంక్ సాధించాను. ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించారు. ఆ శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత సెలవు పెట్టి మళ్లీ ప్రి పేర్ అయ్యాను. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ ర్యాంక్ సాధించాను. సాక్షి: మీ శిక్షణ అనుభవాలను చెప్పండి జాదవ్: ఆరో సారికి నేను 68వ ర్యాంక్ సాధించా ను. గత ఐదుసార్లు రాసింది నాకెంతో ఉపయోగపడింది. నా ప్రిపేరేషన్ క్రమంలో ఎంతో మంది మిత్రులు దొరికారు. ఐదుగురం మిత్రులం కలిసి హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నివాసం ఉంటూ ప్రి పరేషన్ కొనసాగించాను. ఐదేళ్లుగా వివిధ అకా డమిల్లోనూ శిక్షణ తీసుకున్నాం. ఈ ఫలితాల్లో నాతోపాటు మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిత్రులు మంచి ర్యాంక్ సాధించారు. సాక్షి: ఐఏఎస్‌గా మీ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి..? జాదవ్: నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చూశాను.. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అలాంటి వాతావరణంలోనే నేను పెరిగాను.. చుట్టుపక్కలా ఎవరినైనా చూస్తే పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే వారే ఉండేవారు. గవర్నమెంట్ వైపు ఏదైనా పథకం కోసం చూసేవారు. అయితే ఆ స్కీమ్ వారి వరకు రీచ్ అవుతుందా.. లేదో.. ఆ స్కీమ్‌ను అలాంటి వారికే అందించేందుకు బ్యూరోకసి తోడ్పడుతుందని నా భావన. ఐఏఎస్‌గా ప్రభుత్వ పథకాలను పేదల దరికి చేర్చడం, ట్రైబల్, రూరల్ డెవలప్మెంట్ నా ముఖ్య ఉద్దేశాలుగా ఉండబోతున్నాయి.సాక్షి: సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యేవారికి, ర్యాంక్ రానివారికి మీరిచ్చే సూచన జాదవ్: సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యేవారు, ర్యాంక్ రానివారు తమ ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఐదేళ్లుగా నా పరిస్థితిని ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ర్యాంక్ రానివారిలో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు నా ఫ్రెండ్స్ ఎవరైతే ర్యాంక్ సాధించారో.. వాళ్లను చూసి నేను మదిలో అనుకునేవా డిని.. నేను ఎప్పుడు లక్ష్యం చేరుకుంటానని.. అందుకే నేను చెప్పేదేమిటంటే అటెంప్ట్ ఉంటే ప్రయత్నం కొనసాగించాలి.. నిన్నటి వరకు నేను ర్యాంక్ సాధిస్తానని కూడా అనుకోలేదు. మంగళవారం రిజల్ట్ వచ్చేవరకు వస్తదో.. రాదో అనే బెంగ వెంటాడింది. చివరికి ఆన్లైన్లో నా నంబర్ సెర్చ్ చేసేంత ధైర్యం కూడా నాకు తొలుత కలగలేదు. ఎలాగోలా సెర్చ్ చేస్తూ పైనుంచి చూస్తూ వచ్చాను. సెకండ్ పేజీలో కనిపించింది. అయితే సివిల్ సర్వీస్‌కు ప్రిపరేషన్లో నాది ఒకటే ఫిలాసఫి సాగింది.. నిష్కామకర్మను ఫాలో అయ్యాను. దాని అర్థం ఏమిటంటే.. ప్రయత్నిస్తూనే ఉండాలి. అటెంప్ట్స్ అయిపోయిన వారికి కూడా మన దేశంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఫారెన్ సర్వీసెస్‌పై దృష్టి సారించాలి. గ్రూప్–1 కూడా ఎంపిక చేసుకోవచ్చు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర తి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో బి సేఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూ చించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, వన్‌టౌన్, ట్రాఫిక్ సీఐలు సునిల్ కుమార్, ప్రణయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, అమూల్ ఓజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్‌లో సంస్థ ద్వారా హెల్మెట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎస్పీ చేతుల మీదు గా 30 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. వాహనాల నిర్వహణ తప్పనిసరి వాహనాల నిర్వహణ క్రమం తప్పకుండా చేపట్టా లని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్‌లోని సమావేశ మందిరంలో పోలీసు వాహ న అధికారులు, డ్రైవర్లకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్టేషన్లలో డ్రైవర్లు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలన్నారు. సమావేశంలో రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, ఎంటీఓ మురళి తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్‌లో సందీప్ సత్తా
● రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ ఆదిలాబాద్‌టౌన్: గమ్యం చేరే వరకు లక్ష్యాన్ని వీడ డం లేదు.. సివిల్స్‌లో తొలి ప్రయత్నంలో సాధించిన ర్యాంక్‌తో సంతోషపడకుండా మరో ప్రయత్నం చేశాడు.. తాజాగా మరింత మెరుగైన ర్యాంక్ సాధించాడు.. అయినా విశ్రమించేది లేదని మరో ప్రయత్నానికి సిద్ధమవుతాన ని చెబుతున్నాడు జిల్లా కేంద్రానికి చెందిన సందీప్. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన ఆద వెంకటేశ్– వాణి దంపతులు పట్ట ణంలోని రవీంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరి కుమారుడు సందీప్ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయిలో 667వ ర్యాంక్ సాధించాడు. ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. అయితే మొదటి ప్రయత్నంలో 830 వ ర్యాంక్ సాధించగా, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎస్)లో ఉద్యోగంలో చేరా డు. సెలవులో ఉండి పుస్తకాలతో కుస్తీ పట్టాడు. ఈసారి గతం కంటే మెరుగైన ర్యాంక్ సాధించాడు. అయితే ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఇతడు. సందీప్ 5వ త రగతి వరకు ఆదిలాబాద్ పట్ట ణంలోని లిటిల్ఫ్లవర్లో అ భ్యసించగా, 6నుంచి 10వతరగతి వరకు కాగజ్‌నగర్ నవోదయాలో చదివాడు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తిచేశాడు. జేఈఈ మెయిన్స్‌లో 550వ ర్యాంక్ సాధించాడు. బిహార్‌లోని ధన్బా ద్ ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. సందీప్ సివిల్స్‌లో ర్యాంక్ సాధించడంపై కుటుంబీకులు, బంధువులు అభినందనలు తెలిపారు. -
సీజీఆర్‌ఎఫ్‌తో విద్యుత్ సమస్యల పరిష్కారం
తాంసి: విద్యుత్ వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే సీజీ ఆర్ఎఫ్ (విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక) అని చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల వినియోగదారులతో భీంపూర్ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి చైర్మ న్‌తో పాటు సభ్యులు హాజరయ్యారు. ఎని మిది ఫిర్యాదులు రాగా వాటిపై సంబంధిత ఏఈలను వివరణ కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, వేదికకు జిల్లా అధి కారులు గైర్హాజరు కావడంపై అసహనం వ్య క్తం చేశారు. కార్యక్రమంలో సభ్యులు రామకృష్ణ, కిషన్, రాజా గౌడ్, డీఈ హరికృష్ణ, ఏ డీఏ శ్రావణ్‌కుమార్, ఏఈలు తిరుపతిరెడ్డి, మనోజ్, శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో రైతులకు మేలు
● కలెక్టర్ రాజర్షి షాబోథ్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో భూ భారతి చట్టంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు సంబంధించి అనేక సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. అనంతరం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోథ్ తహసీల్దార్ సుభాష్ చందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూ తన చట్టంపై అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆర్డీవో వినోద్‌కుమార్, బోథ్ మండల స్పె షల్ ఆఫీసర్ వాజీద్ పాల్గొన్నారు. సొనాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు రైతులు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులు పక్కాగా నమోదు చేయాలికై లాస్‌నగర్: భూభారతి గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ రాజ ర్షి షా అన్నారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, తాగునీటి సరఫరాపై సంబంధిత అధికా రులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించా రు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న భూ భారతి అవగాహన సదస్సుల్లో రైతులు, రైతు అసోసియేష న్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. అంతకు ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ భారతి, హౌసింగ్‌శాఖ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీ వో వినోద్‌కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో 27వ స్థానం ● ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానం ● సత్తా చాటిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్మీడియెట్ ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాలు పడిపోగా, ద్వితీయ సంవత్సరం కొంత మెరుగైంది. ఫస్టియర్‌లో జిల్లా రాష్ట్రస్థాయిలో 27వ స్థానంలో నిలువగా, సెకండియర్‌లో 12వ స్థానం దక్కింది. మొత్తంగా ఈ సారి బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు. ఫస్టియర్.. 9నుంచి 27వ స్థానానికి డౌన్ ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాలు గతంతో పోల్చితే దారుణంగా పడిపోయాయి. గతేడాది రా ష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలవగా,ఈసారి ఏకంగా 27వ స్థానానికి దిగజారింది. ● జనరల్ కోర్సులో 8,093 మంది పరీక్షకు హాజరు కాగా, 4,295మంది హాజరయ్యారు. 53.07 ఉత్తీ ర్ణత శాతం నమోదైంది. గతేడాదితో పోల్చితే ఈసారి 8.43 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇందులో బాలురు 4,033 మంది పరీక్షకు హాజరు కాగా, 1,658 ఉత్తీర్ణత సాధించారు. 41.11 ఉత్తీర్ణత శా తం నమోదైంది. బాలికలు 4,060 మంది పరీక్ష కు హాజరు కాగా, 2637 మంది పాస్ అయ్యారు. 64.95 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ● ఒకేషనల్ కోర్సులో 1013 మంది పరీక్షకు హాజ రుకాగా, 672 మంది ఉత్తీర్ణత సాధించారు. 66.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బా లురు 421 మంది పరీక్షకు హాజరు కాగా, 252 మంది పాసయ్యారు. 59.86 శాతం ఉత్తీర్ణత న మోదైంది. బాలికలు 592 మంది పరీక్షకు హాజ రు కాగా, 420 మంది ఉత్తీర్ణులయ్యారు. 70.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రస్థాయిలో ఒకేషనల్ కోర్సులో జిల్లాకు 3వ స్థానం దక్కింది. ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ఇలా.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతంతో పోల్చితే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించారు. ● ద్వితీయ సంవత్సరంలో తలమడుగు జూనియ ర్ కళాశాల విద్యార్థులు 87.88 శాతం ఉత్తీర్ణులై ప్రథమ స్థానంలో నిలిచారు. బేలలో 85 శాతం, తాంసిలో 80 శాతం, గుడిహత్నూర్‌లో 75.17 శాతం, ఇంద్రవెల్లి 71.68 శాతం, బజార్హత్నూర్లో 70.65, ఇచ్చోడలో 69.16, బోథ్‌లో 67.09 శాతం, నేరడిగొండ 64.93, ఆదిలాబాద్ ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాల 61.64 శాతం, నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 61.33, ఉట్నూర్ జూనియర్ కళాశాలలో 56.56 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 44.96 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. ● ప్రథమ సంవత్సరం ఫలితాల పరంగా చూస్తే తలమడుగు 81.08 శాతం, తాంసి78.32శాతం, గుడిహత్నూర్ 75.61శాతం, చివరి వరుసలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 30.65 శాతం, ఉట్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 22.52, అత్యల్పంగా ఇంద్రవెల్లి జూనియర్ కళా శాల విద్యార్థులు 18.97శాతం ఉత్తీర్ణులయ్యారు. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ కుమా ర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈనెల 23 నుంచి 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కోసం ప్రతీ పేపర్‌కు రూ.600 ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు. రీకౌంటింగ్కోసం పేపర్‌కు రూ.100 చొప్పు న చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చోడ/తలమడుగు/ఇంద్రవెల్లి:ఇచ్చోడ ప్రభు త్వ గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థిని కావేరి బైపీసీలో 964 మార్కులు సాధించగా, స్నేహ ఎంపీసీలో 961 మార్కులు సాధించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని గుల్లె సాక్షి బైపీసీలో 960 మార్కులు సాధించగా, కేజీబీవీ విద్యార్థిని ప్రియాంక ఎంపీహెచ్ డబ్ల్యూ సెకండియర్‌లో 928 మార్కులతో ప్రతి భ కనబ రిచింది. గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో 90 శాతం, సెకండియర్‌లో వందశా తం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సెకండియర్‌లో వందశాతం ఉత్తీర్ణ త సాధించినట్లు ప్రిన్సిపాల్ నారాయణ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని సాయిలింగి కేజీబీ వీలో సెకండియర్‌లో వందశాతం ఉత్తీ ర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ అర్చన తెలిపారు. ఇంద్రవెల్లి గురుకుల కళాశాలలో బైపీసీలో కే రంభ 977 మార్కులు, జే పాయల్ 962, రాజ్యలక్ష్మి 960, ఎంపీసీలో అన్నపూర్ణ 963 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి స్నేహ 467/470 మార్కులు సాధించింది. అలాగే పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడి యం చదువుతున్న జోహ సదఫ్ బైపీసీలో 988 మార్కులు సాధించింది. ఇంగ్లీష్ మీడి యం బైపీసీ విద్యార్థి మసీర అస్రమ్ 977 మార్కులు, ఉర్దూ మీడియం ఎంపీసీలో మది హ మస్రత్ 934 మార్కులు, హెచ్ఈసీ ఉర్దూ మీడియంలో మహెక్ 933 మార్కులు సాధించారు. వీరిని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సూర్యకుమార్‌లు విద్యార్థులను అభినందించారు. సెకండియర్‌లో పెరిగిన ఉత్తీర్ణత ఈ ఏడాది ఇంటర్ సెకండియర్‌లో మెరుగైన ఫలి తాలు సాధించాం. గతంతో పోల్చి తే 13 శాతం ఉత్తీర్ణత పెరిగింది. కలెక్టర్ రాజర్షిషా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. కరదీపికలు తయారు చేయించి అందించారు. ఈ మేరకు మంచి ఫలితాలను సాధించగలిగాం. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – జాదవ్ గణేశ్‌కుమార్, డీఐఈవోసెకండియర్లో ఒక స్థానం మెరుగు.. ద్వితీయ సంవత్సరంలో గతేడాదితో పోల్చితే ఈసారి ఒక స్థానం మెరుగుపడింది. రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థులు 12వ స్థానంలో నిలిచారు. జనరల్ కోర్సులో మొత్తం 7,978 మంది పరీ క్షకు హాజరు కాగా 5,550 మంది ఉత్తీర్ణులయ్యారు. 69.57 శాతం నమోదైంది. ఇందులో బాలురు 3,880 మంది పరీక్షకు హాజరు కాగా, 2376 మంది పాసయ్యారు. 61.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 4098 మంది పరీక్షలు రాయగా, 3174 మంది పాస్ అయ్యారు.77.45శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 13.15 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఒకేషనల్ కోర్సులో 912 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 741 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.25 నమోదైంది. బాలురు 360 మందికి గాను 273 మంది పాస్ అయ్యారు. 75.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 552 మందికి గాను 468 మంది పాస్ అయ్యారు. 84.78 ఉత్తీర్ణత శా తం నమోదైంది. గతేడాది రాష్ట్రస్థాయిలో 11వ స్థానంలో నిలవగా, ఈసారి 6 స్థానాలను మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): రైతులు పండించి న పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబడిని విక్రయించాలని సూచించారు. ఇందులో మార్కె ట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, పీఏసీఎస్ చై ర్మన్ గోవర్ధన్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు. బేల:మండలకేంద్రంలోనిసబ్మార్కెట్యా ర్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లను ఎంపీనగేశ్, ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఇందులో మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీ ణ్ రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ విలాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చి..
లక్ష్మణచాంద: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అంతలోనే బాలింత ప్రాణాలు కో ల్పోయిన విషాదకర ఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, చుట్టుపక్కల వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాపట్ల ఆశన్న–లలిత దంపతుల చిన్న కుమారుడు అరుణ్‌కు మూడేళ్ల క్రితం ఖానాపూర్‌కు చెందిన హేమశ్రీతో వివాహమైంది. ఏడాదిన్నర క్రితం హేమశ్రీ మొదటి సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం నిర్మల్‌లోని ఓ ఆస్పత్రిలో రెండో సంతానంగా మరో మగబిడ్డను ప్రసవించింది. అంతలోనే హేమశ్రీకి గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిందని వైద్యులు కుటుంబీకులకు పిడుగులాంటి వార్త చెప్పారు. దీంతో హేమశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హేమశ్రీ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మల్లాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే ఆ తల్లి కన్నుమూయగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోధించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
‘అంబేడ్కర్ విధానాలను కాలరాసిన కాంగ్రెస్’
ఆదిలాబాద్: అంబేడ్కర్ విధానాలను అధికారంలో ఉన్న 60 ఏళ్లపాటు కాంగ్రెస్ కాలరాసిందని ఎంపీ గోడం నగేశ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ ఆరోపించారు. అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా సదస్సు నిర్వహించా రు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకూ అంబేడ్కర్ చే సిన సేవలను ప్రజలకు వివరించాలని పిలుపుని చ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి పెద్దపీట వేసింది బీజేపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు అస్తక్ సుభాష్, పాయల్ శరత్ తదితరులున్నారు. నివాళులర్పిస్తున్న ఎంపీ నగేశ్, మహేందర్ -
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యలు త్వరగా ప రిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధి కారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పీవోకు అ ర్జీలు అందించారు. సమస్యలు పరిష్కరించాలని కో రారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రజా వాణికి పింఛన్, డబుల్ బెడ్రూం, స్వయం ఉపాధి పథకాల కోసం, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన 65 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీ టిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..
● ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన సీపీ ● నిందితులకు శిక్ష పడటమే లక్ష్యం ● పకడ్బందీగా సాక్ష్యాధారాల సేకరణ ● ఏడాదిలో 135 మందికి జైలు శిక్ష ● ఈ ఏడాది శిక్షలు పెంచేలా చర్యలు మంచిర్యాలక్రైం: ఒక్కసారి నేరం చేసినవారు మరో సారి నేరాలకు పాల్పడకుండా వారికి సరైన శిక్ష పడేలా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఎఫ్ఐఆర్ న మోదు నుంచి నిందితుడికి శిక్ష పడేదాకా అన్ని జా గ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కాగా సాక్ష్యాలు సేకరించి శిక్షల శాతాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే ప లుసార్లు కమిషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్, లైసన్ ఆఫీసర్లతో సీపీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 2024లో రామగుండం కమిషనరేట్ పరిధిలో 80 కే సుల్లో 135 మంది నిందితులకు శిక్ష పడేలా చేశారు. పెద్దపల్లి జిల్లాలో రెండు కేసుల్లో ముగ్గురికి యావజ్జీవ కారాగారం, మరో రెండు కేసుల్లో ఆరుగురికి పదేళ్ల జైలు, మంచిర్యాల జిల్లాలో మూడు కేసుల్లో ముగ్గురికి ఐదేళ్లు శిక్ష పడేందుకు కృషి చేశారు. శిక్షలు పడిన ఘటనలు కొన్ని.. ● 2016 సెప్టెంబర్ 17న మంచిర్యాల ఠాణా పరిధిలోని ఘడ్పూర్ పంచాయతీ పరిధి బాబానగర్‌కు చెందిన సండ్ర లక్ష్మణ్, అనిల్, అశోక్‌ను అదే గ్రామానికి చెందిన మనుబోతుల శ్రీనివాస్ గొడ్డలి, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అప్పటి ఎస్సై వేణుగోపాల్‌రావు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి ఎదుట పీపీ మదన్మోహన్రావు కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. దీంతో శ్రీనివాస్‌కు ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ 2024 మే 8న తీర్పునిచ్చారు. ● 2022లో మంచిర్యాల జిల్లా కన్నెపెల్లి ఠాణా పరిధి సుర్జాపూర్‌కు చెందిన దాసరి శ్రీనివాస్, రాజన్న బైక్‌పై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన పూదరి చంద్రశేఖర్ తన ట్రాక్టర్‌తో బైక్ ఎక్కించి గొడ్డలితో నరికి చంపుతానని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న అప్పటి ఎస్సై గంగారాం కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కాగా అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి చంద్రశేఖర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ● 2017 అక్టోబర్ 21న జిల్లాలోని లక్సెట్టిపేట ఠాణా పరిధి ఇందిరానగర్‌లో ఇంటి ప్రహరీ విషయంలో మామిడి మల్లయ్య, దుంపల బంగారమ్మకు గొడవ జరిగింది. బంగారమ్మ, ఆమె కుమారులు సురేశ్, నరేశ్ మల్లయ్య కుమారులు చంద్రమౌళి, రాజగోపాల్, కృష్ణంరాజుపై తల్వార్లతో దాడి చేయగా చంద్రమౌళి మృతి చెందాడు. రాజగోపాల్, కృష్ణంరాజును గాయపరిచారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. బంగారమ్మ, నరేశ్, సురేశ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అప్పటి న్యాయమూర్తి డీ వెంకటేశ్ 2022 జనవరి 8న తీర్పునిచ్చారు. నేరస్తులు తప్పించుకోలేరు నేరం చేసిన వారు చట్టం చేతి నుంచి తప్పించుకోలేరు. సీసీ ఫుటేజీ, వేలిముద్రలు, సెల్‌ఫోన్ కాల్‌డేటా, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. పంచనామా సమయంలో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేసి కోర్టుకు అందజేస్తున్నాం. నేర దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులిస్తూ ప్రోత్సహిస్తున్నాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
మత్స్య సంపద యోజనను వినియోగించుకోవాలి
ఖానాపూర్: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజ న పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాబార్డు డీడీఎం వీరభద్రుడు సూచించారు. సోమవారం మండలంలోని మస్కాపూర్ పంచాయతీ పరిధిలోగల గంగాయిపే ట్ గ్రామంలో మత్స్య గాంధీ మల్టీస్టేట్ ఫిషర్ మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెజ్ అండ్ నాన్‌వెజ్ పచ్చళ్ల తయారీ కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. కేంద్రప్రభుత్వం మత్స్య సంపద యోజన పథకం ద్వారా సబ్సిడీ రు ణాలు ఇస్తోందని తెలిపారు. మత్స్య రంగాన్ని సంఘటితం చేయడంతో పాటు సూక్ష్మ, చిన్న తరహా ప రిశ్రమలకు సహాయపడేలా ఆర్థికసాయం అందించేందుకు ఈ పథకం అందుబాటులో ఉందని తెలి పారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో మహిళలు చేసిన పచ్చళ్లను పరిశీలించారు. ఇక్కడ తయారు చే సిన చేపల పచ్చళ్లను ఒప్పందం ఉన్న దేశవ్యాప్త కంపెనీలకు సరఫరా చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇండియా మార్టు, సహకార సంఘాలతో పాటు పలు కంపెనీలతో ఒప్పందా లున్నాయని తెలిపారు. రోజుకు 50కేజీల చేపలతో రూ.30వేల విలువైన పచ్చళ్లు తయారు చేసి విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. డీసీవో పాపయ్య, సొసైటీ గౌరవాధ్యక్షుడు దామెర రాజయ్య, చైర్మన్ పుల్లబోయిన భీమన్న, నిర్మల్ జిల్లా ఇన్చార్జి విజ య, నిర్వాహకులు రాములు, నరేశ్, నర్సయ్య, లా వణ్య, లలిత, పూజ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకుల శ్రీనివాస్, మండలాధ్యక్షుడు ఉపేందర్, నాయకులు గిరి, భూమన్న, స్వామి తదితరులున్నారు. -
నస్పూర్‌లోని ఓ ఇంట్లో చోరీ
నస్పూర్: పట్టణ పరిధిలోని ఓ ఇంటిలో చోరీ జరి గినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ హిల్స్‌లో నివాసముండే భూపెల్లి లావణ్య ఈ నెల 18వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ స భ్యులతో కలిసి గోదావరిఖనికి పెళ్లికి వెళ్లింది. ఈనె ల 21న తిరిగి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూసి 14 తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఇల్లు, పరిసరాలు పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందా లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
చికిత్స పొందుతూ మృతి
బోథ్: మండలంలోని నక్కలవాడ గ్రామానికి చెంది న నైతం భూమన్న (35) ఈ నెల 17న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎ స్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూమన్న ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న మద్యం తాగి ఇంట్లో భార్య లక్ష్మితో గొ డవ పడ్డాడు. దీంతో లక్ష్మి మందలించగా క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు బోథ్‌లోని సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రి మ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, మూడేళ్ల కుమారుడున్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన మునుగంటి చంద్రశేఖర్ (51) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ ఈ నెల 20న పురోహితం ముగించుకుని ఎల్లారం గ్రామ స్టేజీ మీదుగా బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌కు బలమైన గాయాలు కాగా స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కూతురు జాహ్నవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రక్తహీనతతో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి గుడిహత్నూర్: మండలంలోని తోషం గ్రామానికి చెందిన విద్యార్థిని బోరేకర్ సౌజన్య (15) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌజన్య నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొద్ది నెలలుగా రక్త హీనతతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలు కావడంతో ప్రిన్సిపాల్ రజిత ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రాకపోవడంతో రాత్రి 10.30 గంటలకు సిబ్బంది సౌజన్యను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే.. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే సౌజన్య మృతి చెందిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి, యు వజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ ఆ రోపించారు. సౌజన్య కుటుంబీకులను ఆయన పరా మర్శించారు. సౌజన్యను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతోనే మృతి చెందిందని పేర్కొన్నారు. సౌజన్య తండ్రి గతంలోనే మరణించగా తల్లి అనిత కూలీ పనులకు వెళ్లి ముగ్గురు పిల్లలను పోషిస్తోందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందించాలని, కేజీబీవీ సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె
బాసర: యుటాక్ స్టేట్ అసోసియేషన్ పిలుపుమేరకు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. 17 ఏళ్లుగా పని చేస్తున్న తమ ను రెగ్యులరైజ్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం మా ట్లాడారు. బాసర ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అధ్యాపకులతో ప్రారంభమైందని, విశ్వవిద్యాలయ పు రోగతికి తమవంతు కృషి చేస్తున్నామని తెలిపా రు. కాంట్రాక్ట్ వ్యవస్థకు ముగింపు పలికి విశ్వవి ద్యాలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, డాక్టర్ విజ య్‌కుమార్, మందా సతీశ్‌కుమార్, డాక్టర్ రాములు, శ్రీధర్, తిలక్రెడ్డి, భానుప్రియ, రమాదేవి, ప్రశాంతి, రజితారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. 13వ రోజుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల దీక్ష ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చే పట్టిన నిరవధిక నిరసన దీక్ష సోమవారం 13వ రోజుకు చేరింది. తమకు అదనపు బాధ్యతలు వ ద్దని, రెగ్యులర్ చేయాలని, తమ సేవలు గుర్తించాలని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రటి ఎండలో గొడుగులు పట్టుకుని విశ్వవిద్యాలయం ఆ వరణలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉ పేంద్ర, కృష్ణప్రసాద్, ఖలీల్, డాక్టర్ కుమార్ రా గుల, డాక్టర్ విఠల్, ప్రకాశ్, డాక్టర్ రోషన్, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ పావని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
‘పేదల ఆరోగ్యంపై వివక్ష ఎందుకు’
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): పేదల ఆరోగ్యంపై ఈ ప్ర భుత్వాలకు వివక్ష ఎందుకని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా ఎనిమిదో రో జు సోమవారం జైనథ్ మండల కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనమని చెబుతూనే దొడ్డు బియ్యం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. కోడి గుడ్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇదేనా విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనమని ప్ర శ్నించారు. మరుగుదొడ్ల నిర్మాణం నాణ్యతగా లేద ని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. మందులు ఉన్నాయా.. లేవా.. అనే విషయాలను రోగుల ద్వారా తెలుసుకున్నారు. మా భూమి రథయాత్ర ద్వారా విద్య, వై ద్యం, ఉపాధి రంగాలన్నింటినీ పరిశీలించి వాటి మెరుగుదల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాడుతామని వివరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్, ఇతర నాయకులున్నారు. -
● కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
‘బీఏఎస్’ బిల్లులు చెల్లించండి●కై లాస్‌నగర్: తమ పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఆ తల్లిదండ్రులంతా సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ప్రజావాణి సమావేశ మందిరం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీల కోసం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకం ద్వారా తమ పిల్లలు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తి ఉచితంగా ప్రభుత్వమే ఆ పాఠశాల ద్వారా విద్యనందజేస్తోందన్నారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం ఆ పాఠశాలకు బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. ఫలితంగా యాజమాన్యం డబ్బుల కోసం తమను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. -
● ఎస్పీ అఖిల్ మహాజన్
నిజాయతీగా విధులు నిర్వర్తించాలి ఆదిలాబాద్‌టౌన్: పోలీసులు క్రమశిక్షణతో పా టు నిజాయతీగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు సాయుధ కార్యాలయాన్ని సోమవారం పరిశీలించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలున్నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. సమయపాలన పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం హెడ్‌క్వార్టర్‌లో ఉన్న మోటర్ వెహికిల్ అధికారి, హోంగార్డు కార్యాలయాలను పరిశీలించారు. వారికి కేటాయిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, శ్రీపాల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ అన్నారు. పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నలుమూలల నుంచి 12 మంది ఫిర్యాదుదారులు రాగా, వారి సమస్యలను ఓ పిగ్గా విని పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. కొనసాగుతున్న ‘ఓపెన్’ పరీక్షలుఆదిలాబాద్టౌన్: ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు ఉదయం పదో తరగతిలో 518 మందికి గాను 476 మంది హాజరు కాగా, 42 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షకు 395 మందికి గాను 347 మంది హాజరు కాగా, 48 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ పరీక్షకు పదో తరగతిలో 217 మందికి గాను 197 మంది హాజరు కాగా, 20 మంది గైర్హాజరైనట్లు ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
ఆరోగ్యవంత సమాజానికి కృషి●
● ఎంపీ గోడం నగేశ్ ● సూపర్ స్పెషాలిటీలో గ్యాస్ట్రోలజీ సేవలు ప్రారంభం ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గ్యాస్ట్రోలజీ సేవలను ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి సోమవారం ప్రా రంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల ఆరోగ్యంపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్ప త్రి నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ట్రామా కేర్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలా గే ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకోసం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, సత్యనారాయణ,ఆర్ఎంఓ చంపత్రావు పాల్గొన్నారు. -
మళ్లీ పుంజుకున్న వైనం..
తెలంగాణ బాపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఉద్యమించిన ప్రాంతీయ పార్టీ బీ(టీ)ఆర్ఎస్. సమైక్య రాష్ట్రంలో ప్రజలు ఎన్నో అవమానాలు, అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీని అప్పట్లో జనం ఉద్యమ పార్టీగా ఆదరించారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే పరిస్థితిలో రెండు జాతీయ పార్టీలు తలొగ్గి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. దీంతోనే తెలంగాణ బాపుగా కేసీఆర్‌ను ప్రజలు కీర్తిస్తున్నారు. – జోగు రామన్న, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రజతోత్సవం తర్వాత భారీ మార్పులు.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభ తర్వాత రాష్ట్రంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ను రిజెక్ట్ చేస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఆదరణ లేదు. త్వరలో పార్టీలో పునర్ నిర్మాణ ప్రక్రియ చోటుచేసుకోనుంది. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో రజతోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గం నుంచి కనీసంగా 7వేల మంది వరకు మేము అంచనా వేస్తుండగా, స్వచ్ఛందంగా పలువురు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. – అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే సాక్షి, ఆదిలాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 27న వరంగల్‌లో భారీ మహాసభకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ కేడర్ సన్నద్ధమవుతోంది. 25 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో రాష్ట్రంలో మాదిరే జిల్లాలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ పటిష్టంగా రూపొందింది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం చోటు చేసుకుంది. పలువురు నేతలు పార్టీని వీడినా పునాది లాంటి కార్యకర్తలు వెన్నంటే ఉన్నారన్న అభిప్రాయం నాయకత్వంలో ధీమా నింపుతోంది. పార్టీ రజతోత్సవం తర్వాత మరింత ఉత్సాహం చోటు చేసుకోనుందని, రానున్న రోజుల్లో కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ శ్రేణులు నర్మగర్భంతో పేర్కొంటున్నారు. మొదటి ఎన్నికలతోనే ప్రభంజనం.. బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీ 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి రాష్ట్రంలో పోటీ చేసింది. తెలంగాణలో 26 సీట్లలో గెలుపొందింది. ఉమ్మడి జిల్లాలో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముథోల్ నుంచి నారాయణరావు పటేల్, బోథ్ నుంచి సోయం బాపూరావు, ఖానాపూర్ నుంచి అజ్మీరా గోవింద్ నాయక్ గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాడు ఆదిలాబాద్ ఎంపీ జనరల్ స్థానంగా ఉండగా, అప్పట్లో గులాబీ పార్టీ నుంచి టి.మధుసూదన్‌రెడ్డి గెలుపొందారు. ఈ విధంగా ఆ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్‌తోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను కై వసం చేసుకుంది. అప్పట్లోనే అసమ్మతి వర్గం.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధినేత కేసీఆర్ నాడు పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులందరినీ రాజీనామా చేయాలని కోరారు. అయితే అప్పట్లో ఎంపీ మధుసూదన్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే గోవింద్‌నాయక్ కేసీఆర్‌కు మద్దతుగా రాజీనామా చేయగా, బోథ్ నుంచి గెలుపొందిన సోయం బాపూరావు, ముథోల్ నుంచి గెలుపొందిన నారాయణరావు పటేల్ అసమ్మతి వర్గంగా నిలిచారు. దీంతో మొదటి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ఇటు జిల్లాలోనూ అసమ్మతి వర్గం కారణంగా పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేసిన మధుసూదన్‌రెడ్డి, ఖానాపూర్‌లో తిరిగి పోటీ చేసిన గోవింద్ నాయక్ ఇద్దరూ ఓటమి చెందారు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి కొంత డీలా పడింది. ఇక వెనుదిరిగి చూడని వైనం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, బీఆర్ఎస్కు ప్రజల్లో ఆ దరణ పెరగడంతో ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలంతా బీఆర్ఎస్లోకి వలస వచ్చారు. దీంతో పార్టీ బ లంగా తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దూసుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీని సైతం కై వసం చేసుకుంది. మున్సిపాలిటీల్లోనూ పాగా వేసింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఏకంగా ఏడు స్థానాల్లో గె లుపొందింది. నిర్మల్, సిర్పూర్లో ఐకేరెడ్డి, కోనప్పలు బీఎస్పీ నుంచి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో ముథోల్ నుంచి ఏకై క స్థా నం గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూ డా ఆ తర్వాత కాలంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నా రు. ఈ విధంగా పూర్తిగా ఉమ్మడి జిల్లా గులాబీమయంగా తయారైంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉ మ్మడి జిల్లాలో ఏకంగా తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా, ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఆత్రం సక్కు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కూడా గులాబీ పార్టీలో చేరడంతో పదికి పది స్థానాలు బీఆర్ఎస్ హస్తగతం అయ్యాయి. ఈ విధంగా ఉద్యమకాలంలో ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ మొదట్లో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ప్రత్యేక రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించింది. కలిసిరాని కాలం.. అయితే 2023 ఎన్నికలు బీఆర్ఎస్కు కలిసి రాలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ఒక విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కేవలం బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి గెలుపొందారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ పరంగా 2004లో మధుసూదన్ రెడ్డి, 2014లో గోడం నగేష్ గులాబీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచారు. ఇక పెద్దపల్లి నుంచి 2014లో బాల్క సుమన్, 2019లో వెంకటేశ్ నేత ఎంపీలుగా మారారు. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా వల్లకొండ శోభారాణి సత్యనారాయణ గౌడ్, ఆ తర్వాత రాథోడ్ జనార్దన్ వ్యవహరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగు జెడ్పీలు ఏర్పడగా, ఈ నాలుగింటిలోనూ బీఆర్ఎస్ పాగా వేసింది. అయితే గత ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురుకావడం, ఈ క్రమంలో పార్టీని పలువురు నేతలు వీడినా కార్యకర్తలు మాత్రం వెన్నంటి ఉన్నారనే ధీమా గులాబీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో వికసిస్తూ.. ముళ్లను సైతం ముద్దాడుతూ తొలి ఎన్నికల నుంచే సత్తా చాటిన ఉద్యమ పార్టీ ‘తెలంగాణ’ ఏర్పాటు తర్వాత రెండుసార్లు ప్రభంజనం మొన్నటి ఎన్నికల్లో మాత్రం ప్రతికూలం కేడర్‌పైనే కీలక నేతల ధీమా రజతోత్సవ వేళ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం ఆసక్తికరం 2009 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు చెన్నూర్ నుంచి నల్లాల ఓదెలు, మంచిర్యాల నుంచి గడ్డం అరవింద్‌రెడ్డి, సిర్పూర్ నుంచి కావేటి సమ్మయ్య గెలుపొందారు. దీంతో పార్టీ మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సబ్బండ వర్గాలు కలిసి రావడంతో బీఆర్ఎస్కు కలిసి వచ్చింది. అప్పట్లో కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, తిరిగి ఉప ఎన్నికల్లో ఆ మూడు స్థానాల నుంచి గెలుపొందింది. ఈ విధంగా పార్టీ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. రాజకీయ సుస్థిరత సాధించింది. 2009 ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న మధ్యలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ప్రజల అభీష్టం మేరకు ఆ పార్టీకి రాజీనామా చేసి 2012లో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు పెరగగా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా మారింది. -
ఎండింది.. మళ్లీ నిండింది!
● ఫలించిన భగీరథ యత్నం ● పూడికతీతకు బల్దియా శ్రీకారం ● ఉబికి వస్తున్న ‘లాండసాంగ్వి’ ● ‘ఇంటెక్’లో పెరిగిన సామర్థ్యం ● పట్టణానికి తప్పిన నీటి ఎద్దడి ముప్పు కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణానికి నీటిని సరఫరా చేసే లాండసాంగ్వి పంప్‌హౌస్ వద్ద బల్దియా అధికారులు చేపట్టిన భగీరథ యత్నం ఫలించింది. అక్కడ నీటి నిల్వ పెంచేందుకు మూడు రోజులుగా చేపట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి. పూడిక తొలగించడం, కాల్వలను తవ్వడంతో పట్టణానికి నీటి సరఫరా చేసే ఇంటెక్‌వెల్స్ వద్ద భూగర్భజలం ఉబికి వస్తోంది. దీంతో ఈ వేసవిలో పట్టణానికి నీటి ఎద్దడి ముప్పు తప్పింది. ఈనెల 30నుంచి పంప్‌హౌస్ ద్వారా పట్టణంలోని పలు వార్డులకు యథావిధిగా నీటి సరఫరా చేపట్టనున్నారు. 19 వార్డులకు ఇక్కడి నుంచే.. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 19 వార్డులకు ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని లాండసాంగ్వి వాగు వద్ద గల పంప్‌హౌస్ నుంచే నీటి సరఫరా జరుగుతోంది. నాలుగు దశాబ్దాల నుంచి ప్రజల కు ఇక్కడి నుంచే నీటిని అందిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడులేని విధంగా లాండసాంగ్వి వా గు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పట్టణానికి నీ టి సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మే మొదటి వారం వరకు ‘భగీరథ’ నీరు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో పట్టణంలో ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో బల్దియా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశాల మేరకు పట్టణానికి నీటిని అందించే దిశగా చర్యలకు ఉపక్రమించారు. పంప్‌హౌస్ వద్ద గల రెండు పురాతన ఇంటెక్‌వెల్స్‌లో భారీగా పూడిక పేరుకుపోయింది. ఏళ్ల తరబడి వాటిని శుభ్రం చేయకపోవడంతో పైపులకు నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన బల్దియా అధికారులు వాటిలో పూడికతీతకు నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని కడపకు చెందిన పలువురు నిపుణులను రప్పించి వారం పాటు ఇంటెక్‌వెల్స్‌ను పూర్తిగా తెరిచి అందులోని పూడిక, ఇసుక మేటలను తొలగింపజేశారు. యంత్రాంగం ప్రత్యేక దృష్టి పట్టణానికి నీటిని అందించే కీలక వనరు కావడంతో దీనిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. వేసవి నీటి ఎద్దడి కార్యాచరణలో భాగంగా రూ.40లక్షలను కలెక్టర్ మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా లాండసాంగ్వి వాగులోని ఇంటెక్‌వెల్స్ వద్ద బల్దియా అధికారులు భూగర్భజలాలు పెంపొందించే చర్యలు చేపట్టారు. రెండు బావులకు ఇరువైపులా 15 అడుగుల లోతు, 132 మీటర్ల వెడల్పుతో భారీ కెనాల్స్ తవ్వారు. ఈ ప్రయత్నం ఫలించింది. భూగర్భ జలాలు ఉబికివచ్చి వర్షాకాలంలో ఎలాగైతే వాగులో నీరు నిల్వ ఉంటుందో అదే స్థాయిలోకి చేరాయి. నాలుగు రోజులుగా ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈనెల 29 వరకు ఈ పనులను చేపట్టనున్నారు. పెరిగిన నీటి సామర్థ్యం ఆధారంగా లాండసాంగ్వి పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లు 24గంటల పాటు పనిచేసినా నీరు అడుగంటదని బల్దియా ఇంజినీర్ పేరి రాజు తెలిపారు. దీంతో పట్టణంలోని 19 వార్డులకు పంప్‌హౌస్ ద్వారా యథావిధిగా నీటి సరఫరాను ఈనెల 30 నుంచి ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం పెరిగిన భూగర్భ జలాల ప్రకారం జూలై వరకు పట్టణానికి తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. బల్దియా అధికారులు చేపట్టిన చర్యలతో పట్టణంలోని సగం వార్డులకు నీటి సమస్య దూరమైంది. దీంతో ఆయా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికావద్దని డీఈవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం పరీక్ష పర్వ్ కార్యక్రమం నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొనే ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలపై రిమ్స్ మానసిక వైద్య నిపుణులు ఓంప్రకాశ్, శ్రీకాంత్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యారని విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని సూచించారు. ఎంతో మంది మేధావులు పరీక్షల్లో తప్పి ఆ తర్వాత పాసై ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఇందులో ప్రేరణాత్మక వక్త పురుషోత్తంరెడ్డి, బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు, సమీరుల్లా ఖాన్, ఎంఈవో సోమయ్య, సెక్టోరియల్ అధికారి సుజాత్‌ఖాన్, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
పాలనలో రాజర్షి మార్క్
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి షా తన మార్కు చూపుతున్నారు. అడవులు, ఆది వాసీ జిల్లాగా ముద్రపడ్డ ఆదిలాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ను క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా కృషి చేస్తున్నారు. వాటి అమలు తీరుపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలతో పరిస్థితులను అవగతం చేసుకుంటూ లోటు పాట్లను సరిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు అక్రమార్కులకు తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలోనే రెండు జాతీయ స్థాయి అవార్డులు, ఒక రాష్ట్రస్థాయి పురస్కారం వరించడం తన మార్క్ పాలనకు అద్దం పడుతోంది. సోమవారం ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా నీతి ఆయోగ్ అవార్డు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజర్షి షా పాలనాదక్షతపై ప్రత్యేక కథనం. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంపై రాష్ట్రస్థాయి పురస్కారం.. ● పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఈసీ చేపట్టిన బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన రాజ ర్షి షా గతేడాది మార్చి 6న ఆదిలాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. స్వల్ప వ్యవధిలోనే జిల్లా పరిస్థితులను అవగతం చేసుకున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఎంపీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధం చేసినందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నారు. అలాగే రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ‘ఆరోగ్య పాఠశాల– కళాశాల’ అమలుతో వరించిన ‘స్కోచ్’ ● సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రభు త్వ బడులను తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆయా పాఠశాలల్లోని స్థితిగతులు, విద్యార్థుల అలవాట్లను గమనించిన కలెక్టర్ వాటిని మా ర్చాలని సంకల్పించారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని గతేడాది నవంబర్ 14న ‘ఆరోగ్య పాఠశాల– కళాశాల ’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, చదువులో రాణించేందుకు అనుసరించాల్సిన కార్యక్రమాలపై వారంలో ఏడు రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్దేశించారు. ప్రతీ పా ఠశాలకు గైడ్ టీచర్‌తో పాటు స్టూడెంట్ చాంపియన్లను ఎంపిక చేశారు. కార్యక్రమ అమలుపై ప్రతీ వారం సమీక్ష నిర్వహించారు. ప్రగతిపై ఆరా తీస్తూ లోటుపాట్లను సవరించారు. స్వల్ప వ్యవధిలోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమం సఫలీకృతం చేసి స్కోచ్ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. నీతి ఆయోగ్ పురస్కారానికి ఎంపిక ● నీతి ఆయోగ్ అమలు చేస్తున్న బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రాం– 2024కు గాను ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారాని కి కలెక్టర్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 426 ఆస్పిరేషనల్ బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా జిల్లాలోని నార్నూర్ టాప్– 5లో నిలువడం కలెక్టర్ పాలనాదక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆ బ్లాక్‌లో ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. ఆ సంస్థ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ నార్నూర్ మండలం పలు రంగాల్లో ప్రగతిని సాధించింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరైన పోషకాహారం అందించి గర్భిణులు, చిన్నారులు, బాలింతల ఆరో గ్యం మెరుగుపరడంతో పాటు ప్రాథమిక శిశు సంరక్షణ, విద్యా ఫలితాలు, డిజిటల్ పరిజ్ఞా నం, ఆర్థిక చేకూర్పు, గిరిజన విద్యార్థుల సంక్షేమం, సహజ వ్యవసాయం, చెక్ డ్యాంల ని ర్మాణం, స్వయంసహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించడం, మోడల్ సీఎస్సీ సెంటర్ ద్వారా ప్రజల జీవనోపాధిలో పురోగతి సాధించింది. వాటిపై పలు విడతల్లో మదింపు చేసిన నీతి ఆయోగ్ అధికారులు ఐదు ప్రధాన అంశాల్లో సాధించిన సమగ్ర అభివృద్ధికి గాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సివిల్ సర్వీసెస్ డే పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. ఏడాదిలోనే రెండు జాతీయ అవార్డులు గవర్నర్ చేతుల మీదుగా మరో పురస్కారం రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు నేడు ప్రధాని చేతుల మీదుగా నీతి ఆయోగ్ అవార్డు అందరి సహకారంతోనే.. కేంద్రం నిర్దేశించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను నార్నూర్ బ్లాక్‌లో పకడ్బందీగా అమలు చేశాం. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నీతి ఆయోగ్ అవార్డు రావడం జిల్లాకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపునిస్తోంది. మంత్రి సీతక్కతో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలందరి సహకారంతోనే ఈ అవార్డు లభించింది. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు జిల్లా అభివృద్ధికి మరింత తోడ్పడనుంది. – రాజర్షి షా, కలెక్టర్ -
క్రీడా శిక్షణకు వేళాయే
జిల్లావ్యాప్తంగా క్రీడా శిబిరాల వివరాలు.. ఆదిలాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏటా వేసవిలో ప్ర త్యేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. విద్యార్థులు ఆయా క్రీడాంశల్లో ఆసక్తి పెంపొందించడంతో పాటు వారు రాణించేలా నెల రోజుల పాటు ప్రత్యే క శిక్షణ అందజేస్తోంది. అర్హత కలిగిన శిక్షకుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించి ఎంపిక చేసింది. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో శిక్షణ అందించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శిక్షకులకు సామగ్రి సైతం అందజేశారు. 34 శిక్షణ కేంద్రాల్లో.. ఈ ఏడాది జిల్లాలోని 34 కేంద్రాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 25మంది , పట్టణ ప్రాంతాల్లో 9మంది శిక్షకులు విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు. మే1నుంచి 31వరకు బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్ క్రీడలతో పాటు హాకీ, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి అవుట్ డోర్ క్రీడల్లో సైతం శిక్షణ కల్పించనున్నారు. ఇప్పటికే శిక్షకులకు క్రీడా సామగ్రి సైతం అందించారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందది. సుమారు 1000 మంది వరకు బాలలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అర్హులు ఎవరంటే.. శిబిరాల్లో 14 ఏళ్లలోపు బాల, బాలికలకు మాత్రమే శిక్షణ అందజేస్తారు. ఈ మేరకు అర్హులు ఈనెల 27వరకు https:// forms. gle/ xAtXkCvSJgzdpidS7 ఆన్లైన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి ఎంపిక చేసుకున్న క్రీడాంశంలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తారు. విధి, విధానాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 10 శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొంతమంది స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. శిక్షకుడికి రూ.4వేల గౌరవ వేతనంతోపాటు క్రీడా సామగ్రి కొనుగోలు నిమిత్తం మొత్తం రూ.50వేలు మంజూరు చేసింది. మే 1నుంచి వేసవి శిబిరాలు పలు క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ శిక్షకులకు ఇప్పటికే సామగ్రి పంపిణీ జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు ఈనెల 27వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్గ్రామీణ ప్రాంతాల్లో.. క్రీడాంశం శిబిరం ఇన్చార్జి క్యాంప్ స్థలం సెల్ నంబర్ అథ్లెటిక్స్ రాకేశ్ బెల్లూరి 97049 44283 అథ్లెటిక్స్ జి.సునంద్ ఉట్నూర్ 99894 03069 అథ్లెటిక్స్ పి.రాజేశ్ చాందా(టి) 94921 36510 ఆర్చరీ మారుతి/రవీందర్ చించుఘాట్ 94914 68654 హాకీ శేఖర్ ఉట్నూర్ 80089 71963 హాకీ జె.రవీందర్ భరంపూర్ 96669 07755 హాకీ షేక్ షబ్బీర్ మర్లపల్లి 81211 75659 వాలీబాల్ దయాకర్ కేస్లాపూర్ 93811 59116 వాలీబాల్ పిసారాం నందిగావ్ 81215 35200 వాలీబాల్ మహేందర్ నార్నూర్ 91829 45202 వాలీబాల్ జైతు గుంజాల –– వాలీబాల్ శ్రీనివాస్ మాన్కపూర్ 72076 91916 వాలీబాల్ అఖిలేష్ చాందా(టి) 96660 01285 వాలీబాల్ రామిరెడ్డి ఖాప్రి 79816 71724 వాలీబాల్ సందీప్ దుర్గానగర్ 97015 87819 వాలీబాల్ ఎన్.స్వామి భీంసరి 98487 36476 వాలీబాల్ కాంతారావు పొచ్చర 94935 34163 ఖోఖో పొచ్చన్న ఖోడద్ 97019 65056 ఖోఖో శివకృష్ణ ఉట్నూర్ 89788 10993 క్రికెట్ ఎ.మహేందర్ నార్నూర్ 91829 45202 సాఫ్ట్‌బాల్ జి.గంగాధర్ నేరడిగొండ 90005 65142 బేస్‌బాల్ పవన్ అంకోలి –– హ్యాండ్‌బాల్ వివేక్ గుడిహత్నూర్ 93984 34886 బ్యాడ్మింటన్ కె.మహేశ్ దుర్గానగర్ –– కబడ్డీ ఎం.విఠల్ రెడ్డి మావల 70131 70041 పట్టణ ప్రాంతాల్లో.. బాక్సింగ్ సాయికుమార్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 81065 56176 జూడో ఎన్.రాజు డీఎస్ఏ, ఆదిలాబాద్ 77803 69672 అథ్లెటిక్స్ రమేశ్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 91774 78427 హ్యాండ్‌బాల్ సింధు మహాలక్ష్మివాడ 63008 07110 హ్యాండ్‌బాల్ హరిచరణ్ తిర్పెల్లి 63008 07110 హాకీ శ్రీనివాస్ కేఐసీ, స్టేడియం 94941 48474 తైక్వాండో వీరేష్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 70122 81284 బ్యాడ్మింటన్ కబీర్దాస్ ఆదిలాబాద్ 94907 40567 రెజ్లింగ్ శ్రీధర్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 86864 26300నెలపాటు ఉచిత శిక్షణ.. 14 ఏళ్ల లోపు బాల, బాలికలకు నెల రోజులపాటు వివిధ క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ అందించనున్నాం. ఈ మేరకు శిక్షకులను ఎంపిక చేసి క్రీడా సామగ్రిని సైతం అందజేశాం. శిక్షకుల వేతనం, క్రీడా సామగ్రి కొనుగోలుకు సంబంధించి మొత్తం రూ. 50వేల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందాయి. ఈ శిక్షణను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో -
మాట నిలుపుకున్న సీఎం..
గతంలో అమరవీరులకు నివాళులర్పించాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి. కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనైనా పరిస్థితి మారుతుందేమోనని ఆశించాం. కానీ పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. పీసీసీ హోదాలో ఇంద్రవెల్లిలో పర్యటించిన రేవంత్‌రెడ్డి సీఎం కాగానే ఇంద్రవెల్లి స్మృతి వనానికి ఇచ్చిన మాట ప్రకారం రూ.కోటి కేటాయించారు. 15 మంది అమరవీరుల కుటుంబీకులను గుర్తించి వారిలో కొంత మందికి సాయం అందించాం. ఇంకా ఉన్నారని తెలుస్తోంది. వారిని సైతం అధికారికంగా గుర్తించి సాయం అందించేలా చూస్తాం. – వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే -
‘ఓపెన్’ పరీక్షలు ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉట్నూర్‌లో టెన్త్, ఇంటర్ కేంద్రాలు ఒక్కోటి చొప్పున, అలాగే జిల్లా కేంద్రంలో టెన్త్ రెండు, ఇంటర్ ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. ఉదయం నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 355 మందికి గాను 328 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 380 మందికి గాను 52 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 13 మందికి గాను నలుగురు హాజరు కాగా, తొమ్మిది మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు ఇద్దరికి గాను ఇద్దరు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషన్ వేణుగోపాల్‌రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్, ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ
ఆదిలాబాద్‌టౌన్: అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులను ఆదివారం సన్మానించారు. శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాదాల నివారణపై వారం పాటు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ రాజేశ్వర్, ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ జగత్‌రామ్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్ విద్యార్థుల ప్రతిభ
నిర్మల్‌రూరల్: జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయులు పోతుల్వార్ సురేష్–స్వప్న దంపతుల కుమారుడు సృజన్ కుమార్ జేఈఈ మెయిన్‌లో 99.96 శాతం పర్సంటైల్‌తో ఆలిండియాలో 683 కామన్ ర్యాంక్, ఓబీసీ విభాగంలో 105 ర్యాంక్ సాధించాడు. జిల్లా కేంద్రానికి చెందిన అటోలి సంజీవ్ కుమార్, చింతప్రభ దంపతుల కుమారుడైన రుతిక్ కుమార్ 99.89 శాతం పర్సంటైల్ సాధించి ఓబీసీ కోటాలో 301 ర్యాంకును కై వసం చేసుకున్నాడు. స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నహిద్ పాష కుమారుడు సయ్యద్ రియాజ్ 99.88 శాతం పర్సంటైల్ సాధించాడు. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ట్రినిటీ సత్తా
కరీంనగర్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 138వ ర్యాంకు, ఎ.హేమంత్ 162, డి.సాయిచరణ్కుమార్ 313, ఎస్.పరమేశ్వరరెడ్డి 344, ఎ.ఫనీందర్ 409, ఆర్.సాయికిశోర్ 587, వి.అదీప్ 751, డి.మహేశ్ 974, ఆర్.మనోజ్ 1,262, బి.సిద్ధిక 1,551 ర్యాంకు సాధించారు. కేవలం కరీంనగర్ బ్రాంచ్ నుంచి 1,000 లోపు 8 ర్యాంకులతో పాటు పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83 శాతం మంది ఉత్తమ ర్యాంకులతో జేఈఈ–అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడారు. నిర్దిష్ట ప్రణాళిక, ఉన్నతమైన బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. రాబోయే అడ్వాన్డ్స్ పరీక్షల్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించి పేరొందిన ఐఐటీ సంస్థల్లో తమ విద్యార్థులు సీట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ బ్రాంచ్‌ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
శ్రీచైతన్య విద్యాసంస్థల విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
21 నుంచి సమ్మెలోకి ఆర్జీయూకేటీ అధ్యాపకులు
బాసర: రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తర్వాతే నోటిపికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. శనివారం సమ్మె నోటీస్‌ను ఏవో రణధీర్‌కు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీ స్థాపించినప్పటి నుంచి దాదాపుగా 17 ఏళ్లుగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డాక్టర్ ఎన్. విజయ్ కుమార్, మంద సతీశ్ కుమార్, శ్రీధర్, తిలక్రెడ్డి, డాక్టర్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
● ఇద్దరికి తీవ్రగాయాలు తానూరు/భైంసాటౌన్: తానూరు మండలంలోని భోసి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాంద గ్రామానికి చెందిన చందు (50), హన్మంతు, బాబన్న(సుదర్శన్) భైంసా వైపు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భోసి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చందు తలపై నుంచి వాహనం వెళ్లడంతో తలభాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. హన్మంతు, బాబన్నకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. హన్మంతు పరిస్థితి విషమంగా ఉండడంతో నాందేడ్‌కు తరలించగా, బాబన్న భైంసా ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు లక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రామ్‌చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్‌చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సైకిల్‌యాత్ర నేరడిగొండ: బెంగళూరుకు చెందిన కొట్రెస్ సోలార్ ద్వారా నడిచే సైకిల్‌పై కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు యాత్ర చేపట్టాడు. శనివారం నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్‌ప్లాజ్ వద్ద అతను హైవే పెట్రోలింగ్ పోలీసులకు కనిపించగా పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని, వెంట ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలని సూచించారు. -
కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు
● 54 మందికి అందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రాలు నిర్మల్‌ఖిల్లా: జిల్లాకు చెందిన 54 మంది చిన్నారులు కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. స్వరూపిణి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో శిక్షకురాలు నవ్య వినయ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన చిన్నారులు 2023 డిసెంబర్ 24న జీఎంసీ బాలయోగి స్టేడియంలో భారత్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచారు. పరిశీలకుల బృందం ఎంపిక చేసిన మీదట 18 నెలల అనంతరం ధ్రువీకరణ పత్రాలు, మెడల్స్ పంపించినట్లు శిక్షకురాలు నవ్య తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్పీ ఉపేందర్ రెడ్డి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ముత్యంరెడ్డి చిన్నారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు అల్లాడి సురేష్, మహిళా హక్కుల కమిషన్ చైర్పర్సన్ అనిషా, చెనిగారపు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాల అభివృద్ధి
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కనేరడిగొండ: ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డితో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలోనే రోప్‌వే నిర్మిస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం రిసార్ట్ పనులను ప్రారంభించామని, జూన్ నాటికి రిసార్టు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణం దెబ్బతినకుండా కుంటాల జలపాతాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేలా చూస్తామన్నారు. నిజాం కాలంలోనే కుంటాల జలపాతం వద్ద అప్పటి అధికారులు ఇక్కడ సేద తీరినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటాల జలపాతానికి, పర్యాటక రంగానికి చేసిందేమి లేదన్నారు. మంత్రి వెంట కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, నాయకులు తుల అరుణ్ కుమార్, ఆత్రం సుగుణ, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్‌రావు, తిత్రే నారాయణసింగ్, జాదవ్ కపిల్, ఆడే సతీశ్, బద్దం పోతారెడ్డి, నాయిడి రవి, తదితరులు ఉన్నారు.