
బ్లడ్ బ్యాంక్ సద్వినియోగం చేసుకోవాలి
నార్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను సద్విని యోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ అన్నారు. ఆస్పత్రిని ఆదివారం ఆయ న సందర్శించారు. గాదిగూడ మండలం ఝరి పీహెచ్‌సీ పరిధిలోని మాలేపూర్ సబ్‌సెంటర్‌కు చెందిన అంజలికి రక్తం అవసరం కాగా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ నుంచి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలో గిరిజనులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు నార్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యాధికారి రాంబాబు తదితరులున్నారు.