Top Stories
ప్రధాన వార్తలు

ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రంజాన్ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్ వాళ్లే రాశారు. రూల్‌బుక్ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఎన్నాళ్లీ ఆగడాలు!
సందేహం లేదు... న్యాయస్థానాలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆటలాడుతున్నారు. పరిధులు గుర్తెరిగి విధినిర్వహణ చేయాలని పదిరోజులనాడు చెప్పినా తమ వెనకటి గుణం మానుకోవటానికి ససేమిరా అంటున్నారు. అందుకే ఏపీ హైకోర్టు మంగళవారం మరోసారి చీవాట్లు పెట్టవలసి వచ్చింది. హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావనకొచ్చిన ప్రేమ్‌కుమార్ కేసు విచిత్రమైనది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడైన ప్రేమ్‌కుమార్ రహదారుల బాగుకు నిధుల కోసం ఊరూరా టోల్గేట్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా ఒక చిన్న రూపకాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దానిపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. తాము కట్టే పన్నుల్లో రోడ్ సెస్ వంటివి ఉండగా ఇలా ప్రత్యేకించి మళ్లీ వసూలు చేయడమేమిటన్న చర్చ మొదలైంది. అందుకే సర్కారువారికి కంటగింపైంది. ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టడమే ధ్యేయంగా తప్పుడు కేసు సృష్టించారు. ‘మనోభావాలు’ దెబ్బతిన్నాయని ఒక వ్యక్తి ద్వారా ఫిర్యాదు చేయించి కర్నూలునుంచి గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చి అర్ధరాత్రి అరెస్టుకు పూనుకున్నారు. ఇంగితం మరిచి ఆయన భార్య, కుమార్తెలపై దౌర్జన్యం కూడా చేశారు. ఇదొక్కటే కాదు... నిరుడు డిసెంబర్నుంచి ఇలాంటి కేసులెన్నో ఉన్నత న్యాయస్థానం దృష్టికి వస్తూనేవున్నాయి. ఆ పిటిషన్లపై విచారించిన న్యాయమూర్తులు హెచ్చరిస్తూనే వున్నారు. కానీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బహుశా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏలినవారే చూసుకుంటారన్న ధైర్యమేమో! హైకోర్టుతో చీవాట్లు తిన్న మరునాడే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో పోలీసుల తీరు ఈ సందేహాన్నే కలిగిస్తోంది. ఎంపీపీ ఎన్నికల్లో విప్ జారీ చేయటానికి అధికారులను కలవడానికెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యానికి దిగితే అడ్డుకోవాల్సిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపైనే తప్పుడు కేసు బనాయించి నిర్బంధంలోకి తీసుకున్నారు.నిద్రపోయేవారిని లేపవచ్చు... నిద్ర నటిస్తున్నవారిని తెలివిలోకి తీసుకురావటం సాధ్యమేనా? వీళ్లంతా కొత్తగా విధి నిర్వహణలో చేరినవారు కాదు. ‘జీ హుజూర్’ అంటే తప్ప జీతంరాళ్లు రాని వారు కాదు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులద్వారా వచ్చే ఆదాయంతో నెలనెలా జీతభత్యాలు పొందు తున్నవారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొందినవారు. కానీ పాలకులు మారేసరికి వీరిలో అపరిచితుడు బయటికొచ్చినట్టుంది. తప్పుడు వాగ్దానాలతో, ప్రత్యర్థులపై దుష్ప్రచారంతో, చడీ చప్పుడూ కాకుండా సాగించిన అక్రమాలతో అందలం ఎక్కిన పాలకులు ఎంతకాలం ఊరేగుతారు? వారిని నమ్ముకుని ఇష్టారాజ్యం చేయొచ్చనుకోవటం, తమకేమీ కాదనుకోవటం మంచిదికాదని అధికారులు గ్రహించాలి. ఈ పాలన కొడిగట్టి కొండెక్కాక తమ పరిస్థితేమిటన్న స్పృహ కలగాలి. అసలు దేశానికి రాజ్యాంగం ఉన్నదని, పౌరులకు దానిద్వారా హక్కులు సమకూరాయని, తమతో సహా అన్ని వ్యవస్థలూ వాటికి అనుగుణంగానే ప్రవర్తించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవని తెలుసుకోవాలి. ఈ దేశంలో న్యాయస్థానాలు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో సైతం నిర్భయంగా తీర్పులిచ్చిన ఉదంతాలున్నాయి. ఆ సంగతిని ప్రభుత్వమూ, పోలీసులూ కూడా తెలుసుకోవాలి.విధినిర్వహణ తీరుతెన్నులెలా వుండాలో తెలిపే మాన్యువల్ గురించి ధర్మాసనం పోలీసులకు గుర్తు చేయక తప్పలేదు. సాధారణ స్థాయి కానిస్టేబుల్ మొదలుకొని డీజీపీ వరకూ విధినిర్వహణ ఎలా వుండాలో, బాధ్యతలేమిటో తెలిపే మాన్యువల్ అది. ఎఫ్ఐఆర్ల నమోదు, దర్యాప్తు విధి విధా నాలూ, అధికారాల వినియోగంలో పాటించాల్సిన పద్ధతులు, పరిమితులు వగైరాలన్నీ అందులో నిర్దేశించివుంటాయి. పౌరులకుండే హక్కులేమిటో, విధినిర్వహణలో వాటిని పాటించాల్సిన అవసర మేమిటో మాన్యువల్ చెబుతుంది. హైకోర్టు భిన్న సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ మాన్యువల్‌ను పోలీసులు పట్టించుకోవటం మానేశారని అర్థమవుతుంది. కనీసం గుర్తు చేస్తున్నా దున్నపోతు మీద వానపడిన చందాన ప్రవర్తిస్తున్నారు. వర్రా రవీంద్రరెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, పప్పుల వెంకటరమణారెడ్డి, బొసా రమణ వగైరాల అరెస్టుల విషయంలో పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే పోలీసుల తీరు చూస్తే మాకు బీపీ పెరిగిపోతున్నదని ధర్మా సనం వ్యాఖ్యానించింది. అవసరాన్నిబట్టి కేసులు కాక, ఏదోవిధంగా కేసులు పెట్టాలి... ఎవరో ఒకర్ని అరెస్టు చేయాలని చూడటం సరికాదని హెచ్చరించింది. తమ ముందు దాఖలైన పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే మేజిస్ట్రేట్లు రిమాండ్ విధిస్తు న్నారని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం అనటం గమనించదగ్గది. ప్రేమ్‌కుమార్ కేసు సంగతే తీసుకుంటే ఆయన అక్రమార్జనకు పూనుకున్నాడంటూ రూ. 300 స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఇంత హాస్యాస్పదంగా పెట్టే కేసుల్ని మేజిస్ట్రేట్లే తమ స్థాయిలో అడ్డు కోవచ్చు. అది లేకపోవటంవల్ల ఉన్నత న్యాయస్థానంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవటంవల్ల బెయిల్ దరఖాస్తులు తమవద్దకు వెల్లువలా వచ్చిపడుతున్నాయని నిరుడు జూలైలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత సోమవారం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై కిందిస్థాయి కోర్టుల తీరును తప్పుబట్టింది. హైకోర్టు ధర్మాసనం తాజా వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకుంటే చిక్కులు తప్పవని తెలుసుకోవాలి. నిబంధనలు గుర్తెరిగి మసులుకోవాలి.

UPI Down: ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లకు షాక్.. యూపీఐ సేవల్లో అంతరాయం
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. చాలామంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు వెల్లడించారు. బుధవారం రాత్రి 7:50 గంటలకు 2,750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్‌పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి.యూపీఐ సేవలు డౌన్ అవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వినియోగదారులు లావాదేవీలు చేయడంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.Is UPI down? Anyone facing the issue? #Upidown— Sumit Mishra (@SumitLinkedIn) March 26, 2025UPI Down ⚠️Nationwise issue or it's only me ?— Crypto with Khan ( SFZ ) (@Cryptowithkhan) March 26, 2025Anyone facing UPI app issues or just me facing?? #phonepe #gpay #paytm— Anoop CSKian 💛 (@Anoopraj_7) March 26, 2025

డికాక్ వన్ మ్యాన్ షో.. రాజస్తాన్‌ను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం సాధించింది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్‌కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది.చెతులేత్తేసిన బ్యాటర్లు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్తాన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కాగా రాజస్తాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్‌ను తీసి మరి! వీడియో వైరల్

అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు
వివాహితుడైనప్పటికీ ఆమె అతన్ని గాఢంగా ఇష్టపడింది. శారీరక సుఖం కోసం అతనూ ఆమెను ఇష్టపడినట్లు నటించాడు. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. పైపెచ్చు వాళ్ల తిరుగుళ్లకు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. అలా నాలుగేళ్లు గిర్రుమన్నాయి. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి భరించలేకపోయాడు. ప్రేమ మత్తులో ఉండగానే ఆమెను అనంతలోకాలకు పంపించేశాడు. అప్సర-వెంకటసాయికృష్ణ జీవితాలు ఆ ఒక్కరాత్రిలో తలకిందులయ్యాయి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే.. అప్సర-సాయికృష్ణ.. ఏడాది కాలంలోనే వాళ్ల మధ్య బంధం బలపడింది!. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తల్లితో సహా వచ్చిన అప్సర.. సరూర్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. దైవభక్తి కారణంగా ఆలయాలకు క్రమం తప్పకుండా వెళ్తుండేది. అలా.. 2022లో సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి వెంకటసాయికృష్ణతో పరిచమైంది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. అలా స్నేహం బలపడింది. ఈలోపు.. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ వాళ్ల ప్రేమ వ్యక్తం చేసుకున్నారు. 👉అప్పటికే అప్సరకు వివాహమై భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరోవైపు సాయికృష్ణకు వివాహమైంది కూడా. కానీ, ఇద్దరూ చనువుగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. సాయి-అప్సరల స్నేహ బంధం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగడాన్ని భరించలేకపోయాడు. అలా చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని హెచ్చరించడంతో రగిలిపోయాడు. చివరకు.. .. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్ వేసుకున్నాడు. సరూర్ నగర్లో తాను పూజారిగా ఉన్న గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు.👉హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. జూన్ 3.. అప్సర పాలిట కాళరాత్రిఓ ఫిల్మ్‌మేకర్‌తో సినిమా అవకాశాల కోసం మాట్లాడదామని.. అందుకోసం కోయంబత్తూరు వెళ్దామని అప్సరను సాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. 2023 జూన్ 3న.. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు.ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలో డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు.అప్సరకు ఎంతో ఇష్టమైన గోశాలలో కొంతసేపు గడిపారు. అయితే గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు. ఫ్రంట్ సీటులో తన పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్న అప్సరను.. కారు సీటు కవర్‌ను ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.మృతదేహంపై కారు కవర్ కప్పి అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని.. కవర్లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఆపై దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు. అప్సర నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి ఆమె తల్లి కంగారుపడి సాయికృష్ణకు ఫోన్ చేసింది. ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తాను వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో సాయికృష్ణే హంతకుడని తేలింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో సాయికృష్ణ అమాయకుడని.. తప్పంతా అప్సరదేనని అతని తల్లిదండ్రులు, భార్య వాదించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన మృగానికి తగిన శిక్ష పడాలని అప్సర తల్లి డిమాండ్ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు విస్తృతంగా జరిగింది. విచారణలోనూ సాయికృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. అలా.. 2023 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సాయికృష్ణకు బుధవారం(మార్చి 26, 2025)న శిక్ష పడింది. జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకుగానూ అదనంగా మరో ఏడేళ్ల శిక్ష వేసింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?
అమెజాన్ ప్రైమ్‌లో ఓ సినిమా స్ట్రీమ్ అవుతోంది. దాదాపు 15 రోజుల క్రితం ఈ సినిమా ప్రైమ్‌లో రిలీజైనప్పటి నుంచిం తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ డిస్కషన్‌కు కేంద్ర బిందువైంది. కొందరు ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంది.. చాలా ఫ్యాక్చువల్‌గా ఉందని చెబుతుంటేం మరికొంతమంది ఈ సినిమాను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో టాప్-2గా ట్రెండ్ అవుతున్న హత్య సినిమా ఐదు భాషల్లో రిలీజైంది.👉అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న హత్య సినిమా ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా బిట్స్ షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఓ సీనియర్ పొలిటీషియన్ హత్య విచారణకు సంబంధించిన కథాంశంతోం సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పొలిటీషియన్‌ను ఎవరు హత్యచేశారనే విషయంపై ఓ పోలీస్ అధికారి చేసే విచారణ సినిమాలో ప్రధాన అంశం. సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని నిర్మాతలు.. డైరెక్టర్ డిస్క్లైమర్ వేసినా ఈ సినిమా ఇతివృత్థం ఏంటో చూసే వారికి ఈజీగా అర్థం అయిపోతుంది.👉మాజీ మంత్రి హత్య నేపథ్యంలో ఈ సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీమంత్రి హత్యకు దారితీసిన అంశాలను ఈ సినిమాలో చర్చించారనే డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసు విచారణ మొదలుం సాంకేతిక ఎవిడెన్సెస్ వరకు ప్రతీ అంశంపై చాలా నిశితంగా చర్చిస్తూ సినిమా స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరుం అందరిని ఆకట్టుకుంటోంది. మాజీమంత్రి హత్యకేసులో డిస్కషన్‌కు వచ్చిన చాలా టెక్నికల్ అంశాలను సైతం ఈ సినిమాలో సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించారనే ప్రశంసలు వస్తున్నాయి.👉ఒక సినిమా పూర్తి ఫిక్షన్ అయినపప్పటికీ ఆ సినిమా కథ ఏదో ఒక వాస్తవ ఘటన ఆధారంగా తీసుకున్నదే అయి ఉంటుంది. ఇప్పుడు హత్య సినిమా కూడా ఎంతో కొంత వాస్తవ ఘటనల ఆధారంగా తీసుకన్నారనే డిస్కషన్ ఉంది. హత్య సినిమాలో ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్యకు గురవుతాడు. ఈ కేసులో వాస్తవాలు వెలికితీయాలనే ఉద్దేశంతోం హత్యకు గురైన వ్యక్తి బంధువు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై నిస్పక్ష విచారణకు ఆదేశిస్తారు. తన బాబాయి హంతకులు ఎవరనేది బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సిన్సియర్‌గా యత్నిస్తారు.👉దీనిపై ఓ నిబద్ధత ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్‌కుం విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తెచ్చేందుకు ఆ మహిళా అధికారి అన్ని కోణాల్లో విచారణ చేపడుతుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఎన్నో కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. అయితే విచారణ చేసిన అధికారిని కొన్ని శక్తులు అడ్డుకునేందుకు యత్నిస్తాయి. కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కొంతమంది అధికారులు ఆమెకు ద్రోహం చేస్తారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఆమెను విచారణ నుంచి తప్పిస్తారు. మొత్తానికి వాస్తవాలు బయటకు రాకుండా ఆమెను అడ్డుకుంటారు.👉సినిమా ముందుకు కదులుతున్నకొద్దీ హత్యకు గురైన మాజీ మంత్రికి సంబంధించి చాలా కొత్త కొత్త విషయాలు రివీల్ అవుతాయి. ఈ సినిమాలో హత్య గురైన వ్యక్తికి ఉన్నటువంటి వివాహేతర సంబంధంపైం చాలా డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో హత్యకు గురైన మాజీమంత్రి ఆ మహిళతో పరిచయం అయిన తీరు ఆ పరిచయం ఏవిధంగా కుటుంబంలో చిచ్చుపెట్టిందో ఇందులో స్పష్టంగా వివరించారు. ఈ కేసు విచారణలో చనిపోయిన మాజీమంత్రికి ఉన్న వివాహేతర సంబంధం కీలకంగా మారిందనేది సినిమా చూస్తున్న వారందరికీ అర్ధం అవుతుంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం ఆయన కూతురు, అల్లుడితో పాటు బావమరిదికి నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.👉ఒకవేళ రెండో వివాహానికి అంగీకారం తెలిపితే ఆస్తిలోవాటా ఇవ్వాల్సి వస్తుందనే భయం.. హత్యకు గురైన మాజీమంత్రి కూతురు, అల్లుడిని వెంటాడుతుంది. ఓ సందర్భంలో మాజీమంత్రి బావమరిది.. ఆమె రెండో భార్య దగ్గరకు వెళ్లి ఆమెపై దాడి చేసిన దృశ్యం సినిమాలో టర్నింగ్ పాయింట్. ఈ విషయం తెలిసిం హత్యకు గురికావడానికి ముందు ఆ మాజీమంత్రి తన మొదటి భార్య బంధువులతో సహా కూతురు అల్లుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హత్యకు గురికావడానికి ముందు తన ముస్లిం భార్యకు ఆస్తిలో వాటాతో పాటు ఆమెతో కలిగిన కుమారుడికి కాన్వెంట్ అడ్మిషన్ ఇప్పించాలని మాజీమంత్రి కోరుకుంటాడు అనే సినిమాలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇదే హత్యకు కారణమైన ఉండొచ్చు అనే అనుమానాలు తరువాత విచారణలో ముందుకు వస్తాయి.👉ఈ సినిమాలో మాజీమంత్రి హత్యకు సంబంధించి రెండు కీలకమైన అంశాలను హైలైట్ చేశారు. ఒకటి హత్య జరిగిన సందర్భంగా హత్య చేసే సమయంలో దుండగులు మాజీమంత్రితో ఓ లేఖ రాయిస్తారు. సినిమాలో ఇది చాలా డ్రమటిక్ సీన్. లేఖలో తనను డ్రైవర్ తీవ్రంగా కొట్టాడంటూ రాయిస్తారు. అయితే ఉదయాన్నే మృతదేహం వద్ద ఈ లేఖను చూసిన పీఏ.. విషయం మాజీమంత్రి అల్లుడికి చెప్తాడు. ఈ విషయం బయట ఎవరికి చెప్పినాం ఇది హత్య అని అప్పుడే తెలిసే అవకాశం ఉండింది. కాని మాజీ మంత్రి అల్లుడు ఈ విషయం బయటకు రాకుండా మధ్యాహ్నం వరకు దాచిపెడతాడు. మొత్తం సినిమాలో ఇది చాలా కీలకమైన అంశం.👉ఎందుకు హత్యకు గురయిన మాజీ మంత్రి అల్లుడు ఇది హత్య అనే విషయం బయటకు రాకుండా అడ్డుకున్నాడనే సినిమా కథలో కీలకమైన అంశం. దీంతో మాజీమంత్రి మృతిపై రకరకాల పుకార్లు వస్తాయి. హత్య అని ముందే తెలిస్తే సాక్ష్యాలు భద్రపరిచే అవకాశం ఉన్నాం లేఖను ఎందుకు దాచిపెట్టారనే విషయం హత్య సినిమాలో కీలకం. ఇక పీఏను అబద్ధమపు సాక్ష్యం చెప్పమని మాజీమంత్రి కూతురు బలవంతపెడుతుంది. దీంతో తాను అబద్ధం చెప్పనని పీఏ తిరగబడతాడు. పీఏ అబద్ధం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందనిం హత్యకు గురైన మాజీ మంత్రి కూతురు నోరుజారడం షాకింగ్ విషయం. అసలు హత్య వెనకాల మాజీమంత్రి కుటుంబం ఉందా? అనే విషయం ముందు నుంచీ ప్రతీ ఒక్కరికీ అనుమానం కలిగిస్తుంది. పరిస్థితులు సాక్ష్యాధారాలు సైతం మాజీ మంత్రి కూతురు,అల్లుడి వైపే అనుమానాలు కలిగిస్తాయి. హత్య వల్ల లాభం ఎవరికి అనేది సినిమా చూసిన వారికి స్పష్టంగా అర్థమైపోతుంది.👉హత్యకు సంబంధించిన అబద్ధాలు ప్రచారం చేసి ఏవిధంగా రాజకీయ రంగు పులుమే ప్రయత్నం జరుగుతుందో హత్య సినిమా చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. తండ్రి హత్యను రాజకీయాల కోసం వాడుకున్న కూతురు కథ ఈ సినిమాలో కనిపిస్తుంది. రెండో వివాహం కుటుంబంలో చిచ్చురేపిం అది హత్య వరకు దారితీసిన ఘటనలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. నిజాలు బయటకు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు ఏవిధంగా ద్రోహం చేశారో కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఓ బలమైన వర్గం సొంత కూతురు కలిసి మాజీ మంత్రి హత్య కేసును ఏ విధంగా దారితప్పించారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటి రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు.. సొంతపార్టీ ఎమ్మెల్యేకి బీజేపీ షాక్!
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ (Basanagouda Patil Yatnal)పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చారు. ఇటీవలే, బెంగళూరులో బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. Karnataka BJP MLA Basangouda Patil Yatnal-"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session. I have complete information about her relationships and how the gold was brought in.She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025 కొన్ని వారాల క్రితం మాజీ సీఎం యడియూరప్పపై విమర్శలు చేశారు. ఆయన తన కుమారుడు బి.వై విజయేంద్రపై కాకుండా పార్టీపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాదు, బీ.వై.విజయేంద్ర కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతేడాది డిసెంబర్లో 32 జిల్లా అధ్యక్షులు యత్నాళ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ నాయకత్వం ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

భద్రాచలంలో విషాదం.. బిల్డింగ్ కూలి పలువురి మృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ఆరుగురు మృతిచెందారు. ఆరంతస్తుల భవనం కూప్పకూలింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి.. భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది.పట్టణంలోని రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఈ భవనాన్ని నాసిరకమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీవో రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని పలువురు చెబుతున్నారు.సామాజిక కార్యకర్తలపై ఇంటి యజమాని బెదిరింపులకు దిగారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని పలు భవన నిర్మాణాలు ఇలాగే నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని ఎవరు ఫిర్యాదు చేసిన సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని పలువురు అంటున్నారు.

నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్‌పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్‌గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్‌లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్‌లో పెట్టారు శారద. ఆ పోస్ట్‌పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్‌కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’
తొలిసారి పసిడి మెరుపులు
అటు అర్జెంటీనా ఇటు ఇరాన్
భారత గడ్డపై మళ్లీ మెస్సీ... ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం
డికాక్ ధమాకా
ప్రాణమైన వేదిక
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
ప్రజలంతా సూపర్‌సిక్స్ పథకాలు అడుగుతున్నారు కదా.. సూపర్‌సిక్స్ పథకాలను కూడా ఉపగ్రహాన్నే అడగమని చెబుదామా సార్!!
నలుపు అంటే శక్తి
ఎన్నాళ్లీ ఆగడాలు!
సత్తా ఉన్న విధానమే కానీ...
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
తొలిసారి పసిడి మెరుపులు
అటు అర్జెంటీనా ఇటు ఇరాన్
భారత గడ్డపై మళ్లీ మెస్సీ... ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం
డికాక్ ధమాకా
ప్రాణమైన వేదిక
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
ప్రజలంతా సూపర్‌సిక్స్ పథకాలు అడుగుతున్నారు కదా.. సూపర్‌సిక్స్ పథకాలను కూడా ఉపగ్రహాన్నే అడగమని చెబుదామా సార్!!
నలుపు అంటే శక్తి
ఎన్నాళ్లీ ఆగడాలు!
సత్తా ఉన్న విధానమే కానీ...
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
సినిమా

భార్యకు బర్త్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో.. నుదుటన బొట్టు పెట్టి!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే దిల్రుబాతో ప్రేక్షకులను అలరించారు. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించింది.అయితే మన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఇవాళ తన సతీమణి బర్త్ డే కావడంతో కిరణ్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్య నుదుటన బొట్టు పెడుతున్న ఫోటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మా.. అంటూ సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం కిరణ్ అబ్బవరం భార్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
కుటుంబ గొడవలతో ముంచు ఫ్యామిలీ పరువు రోడ్డునపడింది. విష్ణు (Vishnu Manchu)- మనోజ్ (Manoj Manchu)కు మధ్య సఖ్యత కుదరట్లేదు అనుకుంటే.. మనోజ్- మోహన్‌బాబు మధ్య కూడా గొడవలు జరగడం అభిమానులనే కాదు ఇండస్ట్రీని సైతం షాక్‌కు గురి చేసింది. ఇలా వీరింట్లో ఏదో ఒకరకంగా తగవులాడుతూనే ఉన్నారు. ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బందిపడుతున్నారంటోంది మంచు మోహన్‌బాబు పెద్ద కోడలు, విష్ణు సతీమణి విరానిక (Viranica Manchu). ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కుటుంబ కలహాలపై స్పందించింది. విరానిక మాట్లాడుతూ.. కుటుంబమన్నాక గొడవలు అవుతూనే ఉంటుంది. కేవలం మా ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి. కానీ చాలావరకు బయటకు రావు. దురదృష్టవశాత్తూ మా కుటుంబంలోని గొడవలు బయటకువచ్చాయి. దానికి మనమేం చేయలేం. నాకు నా పిల్లలు ముఖ్యం. వారికోసం ఏదైనా భరిస్తాను. ఒక స్పాంజిలా అన్నింటినీ ఓపికగా స్వీకరిస్తాను. పిల్లలకన్నా నాకెవరూ ముఖ్యం కాదు. కానీ జరుగుతున్న రచ్చ వల్ల నాకన్నా నా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. భయపడిపోతున్నారు. నాలుగో ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్అసలేం జరుగుతుంది? తాతయ్యకేమైనా అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. అందుకే పిల్లల్ని.. వివాదాలకు చాలా దూరంగా ఉంచుతాను. నేను ధైర్యంగా ఉంటేనే వారికి ఎంతోకొంత ధైర్యం చెప్పగలను అని విరానిక చెప్పుకొచ్చింది. అలాగే తను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారంది. మీకేం పని లేదా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారని బాధపడింది. విష్ణుకు, తనకు పిల్లలంటే ఇష్టమని.. అందుకే నలుగుర్ని కన్నామని విరానిక పేర్కొంది.చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత

ఏంజెల్లా శ్రీలీల.. ఎమోషనలైన మహాతల్లి
హీరో నానితో నటి దేత్తడి హారికనిహారిక, వితికా, అంబటి భార్గవి ఫ్రెండ్స్‌గా దొరకడం లక్కీ అంటూ మహాతల్లి ఎమోషనల్వార్నర్తో స్టెప్పులేసిన కేతికప్రేమలో పాటకు హీరో రోషన్‌తో డ్యాన్స్ చేసిన ప్రియాంక జైన్లవ్ టుడే హీరో ప్రదీప్‌తో ప్రేమలు హీరో మమిత బైజు కొత్త మూవీ View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

‘లూసిఫర్’ కథేంటి? ఎంపురాన్ అంటే అర్థం ఏంటో తెలుసా?
‘లూసిఫర్’.. 2019లో రిలీజైన ఈ మలయాళ మూవీ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.30 కోట్లతో తీస్తే, రూ.125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. హీరో మోహన్లాల్కి, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్‌కి కెరీర్లోనే బెస్ట్ చిత్రంగా ‘లూసిఫర్’ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan Movie) వస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(మార్చి 27)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో లూసిఫర్ కథేంటి? ఎంపురాన్ లో ఏం చెప్పబోతున్నారు? అసలు ఎంపురాన్ అంటే ఏంటి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.లూసిఫర్ కథేంటి?ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్ పీకేఆర్(సచిన్ ఖేడ్కర్) అకాల మరణంతో ఐయూఎఫ్ (ఇండియన్ యూనియన్ ఫ్రంట్) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు బిమల్ నాయుడు అలియాస్ బాబీ(వివేక్ ఒబెరాయ్) భావిస్తాడు. అందుకోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్ సన్నిహితుడు, పార్టీ కీలక నేత స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్‌లాల్) మాత్రం బాబీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు. దీంతో స్టీఫెన్ని హత్య చేయించేందుకు బాబీ కుట్ర చేస్తాడు. ఆ కుట్రను బాబీ ఎలా తిప్పి కొట్టాడు? బాబీ తీసుకురావాలనుకున్న డ్రగ్స్‌ను రాష్ట్రానికి రాకుండా ఎలా అడ్డుకున్నాడు? పీకేఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించింది? అసలు స్టీఫెన్ గతం ఏంటి? అన్నదే లూసీఫర్ కథ. స్టోరీ పరంగా చూస్తే ఇది రొటీన్ పొలిటికల్ డ్రామా. కానీ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఒక్కో సీన్‌ని తీర్చి దిద్దిన విధానం, మోహన్‌లాల్ సెటిల్డ్ యాక్టింగ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. వివేక్ ఒబెరాయ్, మోహన్ లాల్ పాత్రల మధ్య నువ్వా నేనా అన్నట్లు సన్నివేశాలు సాగుతాయి. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో స్టీఫెన్ నేపథ్యం చెబుతూ సినిమాను ముగించారు. ఇప్పుడదే ‘ఎల్2: ఎంపురాన్’పై ఆసక్తిని పెంచేసింది. అసలు ఎంపురాన్ అంటే ఏంటి?లూసిఫర్ అనే టైటిల్ వినగానే అసలు ఈ పేరు ఎందుకు పెట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలిసింది. క్రైస్తవంలో లూసిఫర్ అంటే దైవదూత అని అర్థం. భగవంతుని ఆజ్ఞను వ్యతిరేకించి కిందకు వచ్చి దుష్టుడిగా మారి, మానవాళి పాపాలు చేసేందుకు ప్రేరేపించేవాడినే లూసీఫర్ అంటారు. అందుకే ఈ సినిమాలో ‘దుర్మార్గులకు, మహాదుర్మార్గులకు జరిగే యుద్ధం’ అని హీరో పాత్రలో చెప్పించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన మూవీకి ‘ఎంపురాన్’ అని టైటిల్ పెట్టారు. దీని అర్థం ఏంటంటే.. ‘రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ’ అని అర్థం. హీరో పాత్రను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్‌ని పెట్టారు. దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

డికాక్ ధమాకా
ఐపీఎల్లో పరుగుల వరద పారిన రెండు వరుస మ్యాచ్‌ల తర్వాత ఆ జోరుకు కాస్త విరామం. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై సాగిన మ్యాచ్‌లో సీజన్లో తక్కువ స్కోరు నమోదు కాగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) పైచేయి సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ కట్టుదిట్టమైన స్పిన్‌తో ముందుగా రాజస్తాన్‌ను నైట్‌రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత డికాక్ దూకుడైన బ్యాటింగ్‌తో లక్ష్యఛేదనను సునాయాసం చేసేశాడు. 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్నందుకుంది. అన్ని రంగాల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్ తమ ‘హోం గ్రౌండ్’లో పేలవ ప్రదర్శనతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గువహాటి: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ ఐపీఎల్ సీజన్లో గెలుపు బోణీ చేసింది. గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన నైట్‌రైడర్స్ బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, యశస్వి జైస్వాల్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై వరుణ్, మొయిన్ అలీ 8 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బ కొట్టారు. వైభవ్ అరోరా, హర్షిత్ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. సునీల్ నరైన్ అనారోగ్యం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో మొయిన్ అలీకి కోల్‌కతా చోటు కల్పించగా, ఫారుఖీ స్థానంలో రాజస్తాన్ జట్టులోకి హసరంగ వచ్చాడు.సమష్టి వైఫల్యం... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆసాంతం ఒకే తరహాలో సాదాసీదాగా సాగింది. ఆశించిన స్థాయిలో దూకుడైన బ్యాటింగ్ లేకపోగా, ఒక్కటీ సరైన భాగస్వామ్యం రాలేదు. జైస్వాల్ ధాటిగానే మొదలు పెట్టినా... మరోవైపు సంజు సామ్సన్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేదు. ‘లోకల్ బాయ్’ పరాగ్ తన తొలి 7 బంతుల్లో 2 సిక్సర్లు బాది అభిమానులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఓవర్లోనూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన అతను...అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత హసరంగ (4)ను ముందుగా పంపిన ప్రయోగం ఫలితం ఇవ్వకపోగా, నితీశ్ రాణా (9 బంతుల్లో 8), శుభమ్ దూబే (12 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా విఫలమయ్యారు. 67/1తో మెరుగైన స్థితిలో కనిపించిన రాజస్తాన్ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 82/5కి చేరింది. దాంతో ‘ఇంపాక్ట్ సబ్’గా అదనపు బ్యాటర్‌ను శుభమ్ దూబే రూపంలో ఏడో స్థానంలో బరిలోకి దింపింది. అయితే ఒత్తిడిలో అతనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జురేల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రాణా వరుస ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే హర్షిత్ తన తర్వాతి ఓవర్లో జురేల్, ప్రమాదకర బ్యాటర్ హెట్‌మైర్ (8 బంతుల్లో 7; 1 ఫోర్)లను వెనక్కి పంపించాడు. చివర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16; 2 సిక్స్‌లు) కొట్టిన రెండు సిక్సర్లతో రాజస్తాన్ స్కోరు 150 పరుగులు దాటింది. డికాక్ మెరుపులు... ఛేదనలో డికాక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 40 పరుగులు కాగా, డికాక్ ఒక్కడే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు సాధించాడు. మరోవైపు కేకేఆర్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ (5) రనౌట్ కావడంతో జట్టు మొదటి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే (15 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినా, డికాక్ జోరుతో స్కోరు వేగంగా సాగిపోయింది. 35 బంతుల్లోనే డికాక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అతనికి గెలుపు దిశగా అంగ్కృష్ రఘువంశీ (17 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) సహకరించాడు. దూకుడు తగ్గించని డికాక్ శతకం దిశగా దూసుకుపోయాడు. చివరి 3 ఓవర్లలో నైట్‌రైడర్స్ విజయానికి 17 పరుగులు, డికాక్ సెంచరీకి 19 పరుగులు అవసరం కాగా, ఆర్చర్ ఓవర్లో డికాక్ ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాదినా... చివరకు 97 వద్దే అతను ఆగిపోవాల్సి వచ్చింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) హర్షిత్ రాణా (బి) అలీ 29; సామ్సన్ (బి) అరోరా 13; పరాగ్ (సి) డికాక్ (బి) వరుణ్ 25; నితీశ్ రాణా (బి) అలీ 8; హసరంగ (సి) రహానే (బి) వరుణ్ 4; జురేల్ (బి) హర్షిత్ రాణా 33; శుభమ్ (సి) రసెల్ (బి) అరోరా 9; హెట్‌మైర్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ రాణా 7; ఆర్చర్ (బి) జాన్సన్ 16; తీక్షణ (నాటౌట్) 1; తుషార్ దేశ్‌పాండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–69, 4–76, 5–82, 6–110, 7–131, 8–138, 9–149. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 4–0–42–1, వైభవ్ అరోరా 4–0–33–2, హర్షిత్ రాణా 4–0–36–2, మొయిన్ అలీ 4–0–23–2, వరుణ్ 4–0–17–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మొయిన్ అలీ (రనౌట్) 5; డికాక్ (నాటౌట్) 97; రహానే (సి) దేశ్‌పాండే (బి) హసరంగ 18; రఘువంశీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–41, 2–70. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 2.3–0–33–0, మహీశ్ తీక్షణ 4–0–32–0, రియాన్ పరాగ్ 4–0–25–0, సందీప్ శర్మ 2–0–11–0, హసరంగ 3–0–34–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ 1–0–7–0.ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నోవేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

డికాక్ వన్ మ్యాన్ షో.. రాజస్తాన్‌ను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం సాధించింది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్‌కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది.చెతులేత్తేసిన బ్యాటర్లు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్తాన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కాగా రాజస్తాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్‌ను తీసి మరి! వీడియో వైరల్

డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్‌ను తీసి మరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో రాజస్తాన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను డికాక్ పెవిలియన్‌కు పంపాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మూడో బంతిని పరాగ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని పరాగ్ డిఫెన్స్ ఆడాడు. ఈ క్రమంలో ఐదో బంతిని వరుణ్ చక్రవర్తి.. పరాగ్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని పరాగ్ మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని చాలా ఎత్తుగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ల వెనక ఉన్న డికాక్ తన కీపింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. బంతి గాల్లోకి లేచిన వెంటనే డికాక్ క్యాచ్ కాల్ ఇచ్చాడు. క్లియర్ వ్యూ కోసం హెల్మెట్‌ను తీసి మరి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు వచ్చి అభినంధించారు. దీంతో 25 పరుగులు చేసిన పరాగ్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. Spinners casting their magic 🪄First Varun Chakravarthy and then Moeen Ali 💜Updates ▶ https://t.co/lGpYvw7zTj#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/EfWc2iLVIx— IndianPremierLeague (@IPL) March 26, 2025

రీ ఎంట్రీ ఇవ్వనున్న అలిస్టర్ కుక్.. !
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ కుక్.. ఏడేళ్ల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇంగ్లండ్ తరపున కుక్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఛాంపియన్స్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ధ్రువీకరించాడు."అలిస్టర్ తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము అతడితో మరిన్ని కొత్త జ్ఞాపకాలను సృష్టించబోతున్నాము" అని మోర్గాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా కుక్ మాట్లాడుతూ.. "నా దేశం తరపున తిరిగి ఆడే అవకాశం చాలా ఆనందంగా ఉంది. ఇయోన్ మెర్గాన్, ఇతర ఇంగ్లీష్ క్రికెటర్లతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.2018లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన కుక్.. తన పేరును ఇంగ్లండ్ క్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆడిన చివరి ఇన్నింగ్స్‌లో కూడా కుక్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుక్ తన కెరీర్‌ను ముగించాడు. అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరఫున 161 టెస్టులు ఆడాడు. అందులో 33 సెంచరీలతో సహా 12,472 పరుగులు చేశాడు. కుక్ తన అద్భుతమైన క్రికెట్ కెరీర్లో.. అతను 92 వన్డేలు 4 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా కుక్ 2023 వరకు ఎసెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు.వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది. అయితే ఇండియా ఛాంపియన్స్ మేనేజ్మెంట్ కెప్టెన్‌గా యువీని ఎంపిక చేసినప్పటికి.. జట్టును ఇంకా ఖారారు చేయలేదు.గత సీజన్లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్చదవండి: IPL 2025: రాసిపెట్టుకోండి.. ఐపీఎల్లో 300 ప్లస్ రన్స్ కొట్టేది ఆజట్టే! ఎప్పుడంటే?
బిజినెస్

ఇదే జరిగితే.. ఆ బైకులు, మద్యం ధరలు తగ్గుతాయి
సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా.. భారత్ మీద ఆ ప్రభావాన్ని కొంత తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు, బోర్బన్ విస్కీ అండ్ కాలిఫోర్నియా వైన్స్ మీద దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాలు కొన్ని ఉత్పత్తులపై సుంకాలను మరింత తగ్గించి.. వాణిజ్య సంబంధాలను పెంచుకునే దిశగా చర్చలు జరుపుతున్నాయి.ప్రభుత్వం గతంలో హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలను 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. ఇప్పుడు దీనిని మరింత తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే.. ఈ ప్రీమియం బైకులోను దేశంలో సరసమైన బైకుల జాబితాలోకి చేరుతాయి.బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకాన్ని గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. రెండు దేశాల మధ్య సజావుగా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అధికారులు ఇప్పుడు మరి కొంత ట్యాక్స్ తగ్గించనున్నారు. ఈ వాణిజ్య చర్చలు మోటార్ సైకిళ్ళు, ఆల్కహాలిక్ పానీయాలకే పరిమితం కాలేదు. ఎందుకంటే ఇందులో ఔషధ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతుల విస్తరణలు కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా అధికారులు చర్చిస్తున్నారు.భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఔషధ రంగంలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని అమెరికా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే భారతదేశం అమెరికాకు తన ఎగుమతులకు అనుకూలమైన నిబంధనలను పొందాలని చూస్తోంది.

అమెజాన్ గోదాంపై బీఐఎస్ దాడులు: 2783 ఉత్పత్తులు సీజ్
బీఐఎస్ ధ్రువీకరించిన ఐఎస్ఐ మార్కు, రిజిస్ట్రేషన్ మార్కు లేని ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హైదరాబాద్ శాఖ అధికారులు అమెజాన్ గోదాములపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున బీఐఎస్ ధ్రువీకరణ పొందని గృహోపకరణాలు, సాంకేతిక ఉపకరణాలను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ ఆదేశాలతో బీఐఎస్ హైదరాబాద్ శాఖ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, డిప్యూటీ డైరెక్టర్ కెవిన్, ఎస్పీవో అభిసాయి ఇట్ట, జేఎస్ఏ శివాజీ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.హైదరాబాద్ పరిధిలోని ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంలో మంగళవారం బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.50 లక్షల పైగా విలువైన 2783 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించినట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఉండాల్సిన రిజిస్ట్రేషన్ మార్కు లేని ఉత్పత్తులను జప్తు చేసినట్లు వెల్లడించారు.వీటిలో 150 స్మార్ట్‌వాచ్‌లు, 15 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 30 సీసీటీవీ కెమెరాలు, 16 మిక్సర్లు, 10 ప్రెజర్ కుక్కర్లు, 1937 స్టెయిన్ లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, 326 వైర్లెస్ ఇయర్ బడ్స్, 170 మొబైల్ ఛార్జర్లు, 90 ఆట బొమ్మలు, ఇతర గృహోపకరణాలను జప్తు చేసి కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా తయారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా మొదటిసారి, ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా రెండోసారి, తదుపరి దీనికి పదిరెట్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది.ఇప్పటివరకు భారత ప్రభుత్వం 679 ఉత్పత్తులను తప్పనిసరి చేస్తూ పలు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు విడుదల చేసింది. వీటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్క వినియోగదారుడూ అవగాహన కలిగి ఉండాలని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వస్తువుల నాణ్యతా ప్రమాణాలను గుర్తించాలని, ఉల్లంఘనలను గుర్తిస్తే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 757.55 పాయింట్లు లేదా 0.97 శాతం నష్టంతో 77,259.64 వద్ద, నిఫ్టీ 204.10 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టంతో 23,464.55 వద్ద నిలిచాయి.టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, కాప్రి గ్లోబల్ క్యాపిటల్, జెనస్ పేపర్ & బోర్డ్, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్, SMS లైఫ్ సైన్సెస్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. NDL వెంచర్స్, సలాసర్ టెక్నో ఇంజనీరింగ్, BLB షేర్, లోటస్ ఐ కేర్ హాస్పిటల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

శామ్సంగ్ ఇండియాపై రూ.5,149 కోట్ల జరిమానా
దిగుమతి సంబంధిత పన్ను ఎగవేతపై భారత ప్రభుత్వం పన్నులు, జరిమానాల రూపంలో శామ్సంగ్కు 601 మిలియన్ డాలర్ల(రూ.5,149 కోట్లు) డిమాంట్ నోటీసులు జారీ చేసింది. కొన్నేళ్లుగా కీలక టెలికాం పరికరాలను తప్పుగా వర్గీకరిస్తూ ఈ కంపెనీ ఉద్దేశపూర్వకంగా భారీ సుంకాలను తప్పించుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.తప్పుడు వర్గీకరణ.. టారిఫ్ ఎగవేత2018-2021 మధ్య కాలంలో 4జీ మొబైల్ టవర్లలో ఉపయోగించే కీలక భాగాలైన ‘రిమోట్ రేడియో హెడ్స్’ (ఆర్ఆర్హెచ్)లను శామ్సంగ్ దిగుమతి చేసుకోవడంపై ఈ వివాదం కేంద్రీకృతమైంది. భారత్‌లో 10% నుంచి 20% దిగుమతి సుంకాలు చెల్లించకుండా ఉండటానికి కంపెనీ ఈ వస్తువులను తప్పుగా వర్గీకరించింది. ఫలితంగా దక్షిణ కొరియా, వియత్నాం నుంచి 784 మిలియన్ డాలర్ల(సుమారు రూ.6,717 కోట్లు) విలువైన దిగుమతులపై ఎటువంటి సుంకాలు చెల్లించలేదని భారత కస్టమ్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. 2021లో జరిగిన దర్యాప్తులో ముంబయి, గురుగ్రామ్‌లోని శామ్సంగ్ కార్యాలయాల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ విడిభాగాలను భారత మొబైల్ నెట్వర్క్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థకు విక్రయించారు.ఈ దిగుమతులపై సుంకాలు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను సమర్పించడం ద్వారా భారతీయ చట్టాలను కంపెనీ ఉల్లంఘించినట్లు కస్టమ్స్ కమిషనర్ సోనాల్ బజాజ్ తెలిపారు. సంస్థ లాభాలను పెంచడానికి శామ్సంగ్ అన్ని వ్యాపార నైతికత, పరిశ్రమ పద్ధతులను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఆర్ఆర్హెచ్ ట్రాన్సీవర్ కేటగిరీలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. అది దిగుమతి సుంకాలకు లోబడి ఉందని తెలిపింది. అయితే కంపెనీ మాత్రం దాన్ని వ్యతిరేకించింది. ఆర్ఆర్హెచ్ ట్రాన్సీవర్‌గా పనిచేయదని, అందువల్ల టారిఫ్ మినహాయింపులకు అర్హత లభిస్తుందని కంపెనీ వాదిస్తోంది.ఇదీ చదవండి: మెసేజ్ స్క్రోల్ చేస్తే జాబ్ పోయింది!ఈ సమస్య పరిష్కరించేందుకు గతంలో నలుగురు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. దాంతో కస్టమ్స్ అధికారులు శామ్సంగ్ వాదనను తోసిపుచ్చి పన్ను డిమాండ్‌ను విధించారు. ఇందులో భాగంగా భారత అధికారులు ఏడుగురు శామ్సంగ్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌లకు మొత్తం 81 మిలియన్ డాలర్లు (సుమారు రూ .694 కోట్లు) వ్యక్తిగత జరిమానా విధించారు.ఈ వ్యవహారంపై కంపెనీ స్పందిస్తూ ‘మా హక్కులను పూర్తిగా రక్షించడానికి చట్టపరమైన ఎంపికలపై దృష్టి సారిస్తున్నాం. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాం. కస్టమ్స్ వర్గీకరణల భిన్నమైన వివరణలకు సంబంధించిన అంశంగా ఈ సమస్యను పరిగణిస్తున్నాం’ అని పేర్కొంది.
ఫ్యామిలీ

లేడీ బౌన్సర్స్‌కు అడ్డే లేదు
స్త్రీలను కొన్ని ఉపాధుల్లోకి రానీకుండా అడ్డుకుంటారు. అడ్డుకునేవారిని అడ్డుకుంటాం అంటున్నారు ఈ లేడీ బౌన్సర్లు. కొచ్చి, పూణె, ఢిల్లీ, ముంబైలలో లేడీ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. సెలబ్రిటీలను గుంపు నుంచి అడ్డుకుని వీరు కాపాడుతారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ తెలిసిన స్త్రీలు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. రోజుకు రెండు వేల వరకూ ఫీజు. వివాహితలూ ఉన్నారు. వివరాలు...ఎనిమిది గంటలు డ్యూటీ. తీసుకెళ్లడం తీసుకురావడం ఏజెన్సీ పని. భోజనం ఉంటుంది. బయట ఊర్లయితే రూము కూడా ఇస్తారు. రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదన. చేయాల్సిన పని?⇒ క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం⇒ ఈవెంట్ సెక్యూరిటీ⇒ సెలబ్రిటీల రక్షణ⇒ సెలబ్రిటీలను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం⇒ సంపన్నుల వేడుకల్లో హంగామా కోసం ⇒ ప్రయివేటు సమస్యల్లో రక్షణఇటీవల ఒక సినీ నటుడి ఇంటి గొడవల్లో బౌన్సర్లనే మాట ఎక్కువగా వినిపించింది. పోలీసుల రక్షణ వీలుగాని చోట ప్రముఖులు బౌన్సర్ల సాయం తీసుకోవడం సాధారణం అయ్యింది. ఒకప్పుడు పబ్‌లలో తాగి గొడవ చేసే వారి కోసం మాత్రమే బౌన్సర్లు ఉండేవారు. ఇప్పుడు అన్ని సేవలకు వారిని ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీకి మాత్రమే కాదు దర్పం చూపించడానికి కూడా శ్రీమంతులు బౌన్సర్లను వాడుతున్నారు. ఉదాహరణకు కలవారి పెళ్లిళ్లలో వరుడు/వధువు కల్యాణ వేదికకు వచ్చేప్పుడు వరుసదీరిన బౌన్సర్లు చెరో పక్క నడుస్తూ బిల్డప్ ఇస్తున్నారు. చూసేవారికి ఇది గొప్పగా ఉంటుంది. వేడుకలకు, బిజినెస్ మీటింగ్స్‌కు వచ్చే అతిథుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు బౌన్సర్లను పంపుతున్నారు. కాలేజీ వేడుకలు, ప్రారంభోత్సవాలు, ఔట్‌డోర్ షూటింగ్‌లు... వీటన్నింటికీ బౌన్సర్లు కావాలి. ఎంతమంది బౌన్సర్లుంటే అంత గొప్ప అనే స్థితికి సెలబ్రిటీలు వెళ్లారు. దాంతో వీరి సేవలను సమకూర్చే ఏజెన్సీలు నగరాల్లో పెరిగాయి. మహిళా బౌన్సర్లు కూడా పెరిగారు.ఇబ్బందిగా మొదలయ్యి...‘మొదట ప్యాంటూ షర్టు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్లు కొత్తగా చూశారు. ఇరుగుపొరుగు వారు వింతగా చూశారు. కాని తరువాత అలవాటైపోయింది’ అంది పూణెకు చెందిన ఒక మహిళా బౌన్సర్. 2016లో దేశంలోనే మొదటిసారిగా మహిళా బౌన్సర్ల ఏజెన్సీ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కేరళలో ఈ రంగంలోకి వస్తున్నవారు పెరిగారు. ‘మేము ఎవరినో రక్షించడానికి వెళుతుంటే మా రక్షణ కోసం కొత్తల్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కాని స్త్రీలు ఈ రంగంలో సురక్షితంగా పని చేయొచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు’ అని మరో బౌన్సర్ అంది.రెండు విధాలా ఆదాయంకొచ్చిలో ‘షీల్డ్ బౌన్సర్స్ ఏజెన్సీ’కి చెందిన మహిళా బౌన్సర్లు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఈవెంట్స్‌లో మహిళా అతిథులకు, స్టేజ్ రక్షణకు, అతిథుల హోటల్ నుంచి ఈవెంట్ వద్దకు తీసుకు రావడానికి వీరి సేవలు ఉపయోగిస్తున్నారు. ‘సాధారణంగా ఈవెంట్స్ సాయంత్రాలు ఉంటాయి. బౌన్సర్ల పని అప్పటి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి వరకూ సాగుతుంది. కాబట్టి పగటి పూట చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ మధ్యాహ్నం తర్వాత ఈ పని చేస్తున్నవారూ ఉన్నారు. దాంతో రెండు విధాల ఆదాయం ఉంటోంది’ అని ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.స్పోర్ట్స్ తెలిసినవారుస్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉన్న మహిళలు, వ్యాయామం ద్వారా జిమ్ ద్వారా దేహాన్ని ఫిట్‌గా ఉంచుకున్నవారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు మహిళా బౌన్సర్లుగా రాణిస్తారు. వెంటనే వారికి పని దొరికే పరిస్థితి ఉంది. దేశంలోని నగరాల్లో వివాహితలు, పిల్లలున్న తల్లులు కూడా వృత్తిలో రాణిస్తున్నారు. ‘జనాన్ని అదుపు చేయడం, వారిని ఒప్పించి ఇప్పుడే దూరంగా జరపడం, ఆకతాయిలను కనిపెట్టడం, సెలబ్రిటీలతో వ్యహరించే పద్ధతి తెలియడం, చట్టపరిధిలో గొడవలను అదుపు చేయడం తెలిస్తే ఈ వృత్తి లాభదాయకం’ అంటున్నారు ఈ మహిళా బౌన్సర్లు.

క్యాంటీన్లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్ టైకూన్లా కోట్లు
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్‌నే బిజినెస్‌గా మల్చుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్‌తో చర్చించాడు. ఆరో సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్‌లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్‌వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజిత్తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్‌లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్‌తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్‌వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్‌ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్‌బుక్‌ను అప్డేట్కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్‌తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్‌వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్‌కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

పిల్లల పెంపకం తపస్సు లాంటిది : మంచి పాటలతో మానిసిక ఉత్తేజం
ముంబై సెంట్రల్: ‘పిల్లల పెంపకమనేది వినోదం కాదు..అదో తపస్సు.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన నేటికాలంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు భవిష్యత్తులో ఆదర్శవంతంగా ఎదగాలంటే ముందు తల్లిదండ్రులు తమ ప్రవర్తన మార్చుకోవాలి. పిల్లలు కాపీ కొట్టేది ముందుగా తల్లిదండ్రుల్నే..’అన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా’’ఇండ్ల విశాల్‌రెడ్డి. ఆదివారం ఆంధ్ర మహాసభలో ‘విజ్ఞానం–వినోదం’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పిల్లలు ఎల్రక్టానిక్ గాడ్జెట్స్‌కు అలవాటు పడకుండా చూడాలనీ, వారిలో సర్వాంగ వికాసానికి తల్లిదండ్రులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. పిల్లల్ని ఇతరులతో పోల్చడం, వారిపై కఠినమైన ఆంక్షలు విధించడం, తల్లిదండ్రుల అభిరుచుల్ని బలవంతంగా రుద్దడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం ఆగిపోతుందని హెచ్చరించారు. మంచి పాటలతో మానిసిక ఉత్తేజం: డా. ఇండ్ల రామసుబ్బారెడ్డికార్యక్రమంలో భాగంగా ‘మనసు పాటలపై మానసిక విశ్లేషణ’అనే అంశంపై సుప్రసిద్ధ మానసిక నిపుణులు డా’’ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించి, సభికుల్ని అలరించారు. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు మానసిక క్షోభకు గురవుతాడనీ, అలాంటి సమయంలో కుంగిపోకుండా, మోటివేషన్ కలిగించే మధురమైన పాటలు వింటే తాత్కాలికంగా మానసిక ఒత్తిడికి దూరమై నూతన ఉత్తేజాన్ని పొందుతాడని చెప్పారు. ఒక మానసిక వైద్యుడిగా ఇది తాను సాధికారికంగా చెప్పగలననీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన ‘ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, మనసు పలికే మౌన గీతం, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో, మనసు గతి ఇంతే, పాడుతా తీయగా చల్లగా, ఆట గదరా శివా, కలకానిది విలువైనది.’లాంటి పలు పాటల్ని ప్రదర్శిస్తూ, ఆ పాటలు ప్రభావం మనిషి జీవితంపై చూపలగల ప్రభావాన్ని గురించి ఉదాహరణలతో సహా వివరించారు. తెలుగువారి ప్రయోజనాలే ముఖ్యం: అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆంధ్ర మహాసభలో వినోదాత్మక కార్యక్రమాలతో పాటు ఆధ్యాతి్మక, మానసిక వికాస, సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామనీ, తెలుగువారి ప్ర యోజనాలే తమకు ముఖ్యమని అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరందరికీ ఆంధ్ర మహాసభ తరపున టీ, టిఫిన్లు ఏర్పాటుచేశారు. అనంతరం ఇరువురు వైద్యుల్ని మహాసభ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సభకు సాహి త్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్ స్వా గతం పలకగా, ధర్మకర్తల మండలి సభ్యుడు గాలి మురళీధర్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. గాలి మురళీధర్ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు సంగం ఏక్నాథ్, భోగ సహాదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, తాళ్ళ నరేశ్, సంయుక్త కార్యదర్శులు మచ్చ సుజాత, కటుకం గణేశ్, అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేష్, క్యాతం సువర్ణ, కూచన బాలకిషన్, చిలుక వినాయక్, అల్లం నాగేశ్వర్రావు, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్య దర్శి పిల్లమారపు పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్న్లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం.
ఫొటోలు
International

White House: ముందే లీక్.. మరీ ఇంత నిర్లక్ష్యమా?
వాషింగ్టన్: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరపాటున యెమెన్ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటన చేయకమునుపే కావడం ఇక్కడ గమనార్హం. అమెరికా రక్షణశాఖమంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు ఉన్న గ్రూప్‌లోకి ఓ యూఎస్ జర్నలిస్టుకు ప్రవేశం కల్పించారు. ఆ గ్రూప్‌లో అతనున్నాడనే విషయం కూడా హౌతీ రెబల్స్‌పై యుద్ధానికి సమాచారం పోస్ట్ చేశారు. ‘ద అట్లాంటిక్’ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ స్వయంగా ఈ విషయం తెలియజేశారు. మార్చి 15వ తేదీన యెమెన్‌పై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, అంతకంటే ముందే సిగ్నల్‌లోని గ్రూప్‌చాట్ ద్వారా తనకు నోటీసు అందిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల ముందే ఆయన్ని ఆ గ్రూప్‌లో యాడ్ చేశారట!. అయితే అవకాశం ఉన్నా.. ఆయన ఆ సమాచారాన్ని పబ్లిష్ చేయలేదు. జెఫ్రీ ప్రకటన తర్వాత విషయం ధృవీకరించుకున్న వైట్‌హౌజ్ అధికారులు నాలిక కర్చుకున్నారు. ఈ విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని సోమవారం వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఎలాంటి దాడులు జరపుతామనే ప్రణాళిక అందులో ప్రస్తావించలేదని పేర్కొన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ముమ్మాటికీ ఇది భద్రతా లోపమేనంటున్న డెమోక్రట్లు.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతీయ భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యపూరిత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. అమెరికా నౌకలు, విమానాలపై యెమెన్ హౌతీలు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. ట్రంప్ సర్కారు సైనిక చర్యను మొదలుపెట్టింది. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ముందుగానే ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో హౌతీలకు మద్ధతుగా ఉన్న ఇరాన్‌ను హెచ్చరించారాయన. మార్చి15-16 నుంచి మొదలైన దాడులు.. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయితే.. అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ధీటుగానే అమెరికా సైనిక చర్యకు స్పందిస్తున్నాయి.

తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తత
ఇస్తాంబుల్: అవినీతి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకుడు ఎక్రెమ్ ఇమామోగ్లు అరెస్టుతో తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయనకు మద్దతుగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఇమామోగ్లును అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్ సిటీ హాల్ వద్ద గుమిగూడిన జనం తుర్కియే జెండాలు ఎగరవేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వం నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును, రబ్బరు పెల్లెట్లను, పెప్పర్స్పేని ప్రయోగించింది. మొత్తంగా తుర్కియేలోని 81 ప్రావిన్సుల్లో కనీసం 55 ప్రావిన్సుల్లో, దేశంలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,133 మందికి పైగా అరెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనల్లో 123 మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. జర్నలిస్టుల అరెస్టు.. మరోవైపు సోమవారం పలువురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది రిపోర్టర్లు, ఫోటో జర్నలిస్టులను ప్రభుత్వం నిర్బంధించిందని జర్నలిస్టు యూనియన్ తెలిపింది. ఇది పత్రికా స్వేచ్ఛ, సత్యాన్ని తెలుసుకునే ప్రజల హక్కుపై దాడి చేయడమేనని, జర్నలిస్టులను మౌనంగా ఉంచి నిజాన్ని దాచలేరని పేర్కొంది. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే అరెస్టు : ఇమామోగ్లు అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా రాజకీయనాకులు, జర్నలిస్టులు వ్యాపారవేత్తలను మొత్తంగా 100 మందిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ) నేత ఇమామోగ్లు కూడా ఉన్నారు. ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, లంచాలు తీసుకోవడం, దోపిడీ, చట్టవిరుద్ధంగా వ్యక్తిగత డేటాను నమోదు చేయడం, టెండర్ రిగ్గింగ్ వంటి అభియోగాలపై అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిలివ్రీలోని జైలుకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఇమామోగ్లును మేయర్ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అవాంతరాలు.. ఇమామోగ్లును అరెస్టు చేసినా.. 2028 అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం ఆదివారం ఓటింగ్ జరిగింది. అధ్యక్ష అభ్యరి్థగా ఇమామోగ్లు ఒక్కరే పోటీ చేశారు. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో దాదాపు కోటిన్నర మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సీహెచ్‌పీ తెలిపింది. సుమారు పది లక్షలకు పైగా ఓట్లు తమ సభ్యుల నుంచి రాగా, మిగిలినవి ఇమామోగ్లుకు సంఘీభావంగా తమ సభ్యులు కానివారు వేసినవని సీహెచ్‌పీ వెల్లడించింది. ఈ అరెస్టు ఇమామోగ్లు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోలేదు. అభియోగాలు రుజువైతే మాత్రం అతను ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇదిలావుండగా, అవకతవకల కారణంగా ఇమామోగ్లు డిగ్రీని రద్దు చేస్తున్నట్లు ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అధ్యక్ష పదవిని నిర్వహించడానికి ఉన్నత విద్యను పూర్తి చేసి ఉండాలని తుర్కియే రాజ్యాంగం చెబుతోంది. ఇదే జరిగితే.. అధ్యక్ష పదవికి పోటీ చేయడం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అయితే ఇమామోగ్లు డిగ్రీ రద్దు నిర్ణయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో అప్పీల్ చేస్తామని ఇమామోగ్లు న్యాయవాదులు తెలిపారు.

కెనడా ఎన్నికల్లో అడ్వాంటేజ్ కార్నీ
కొన్నేళ్లుగా నానారకాలైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న కెనడాలో ఎన్నికల నగారా మోగింది. లిబరల్ పార్టీ సారథి, నూతన ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ‘ముందస్తు’ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ దాకా ఆగకుండా ఏప్రిల్ 28వ తేదీనే ప్రజా తీర్పు కోరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ముమ్మర ప్రచారంతో దూసుకెళ్తున్నారు. విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా విజయంపై ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని కార్నీ భావిస్తున్నారు. ఇందుకు గట్టి కారణాలూ లేకపోలేదు. నిజానికి జస్టిన్ ట్రూడో పదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా దేశాన్ని ఆయన తిరోగమన బాట పట్టించారని వారంతా ఆగ్రహించారు. దాంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కన్జర్వేటివ్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని అంతా భావించారు. కానీ మూడు నెలలుగా పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. ట్రూడోను ప్రధాని పదవి నుంచి తప్పించడంతో లిబరల్ పార్టీపై ప్రజల ఆగ్రహావేశాలు చల్లార్చినట్టు కన్పిస్తోంది. దానికితోడు కెనడాను అడుగడుగునా అవమానిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిపోయింది. తమ సమస్యల పరిష్కారం కంటే ట్రంప్‌కు గుణపాఠం చెప్పడమే ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమెరికా అధ్యక్షునితో ఢీ అంటే ఢీ అంటున్న కార్నీ తీరు వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు కార్నీ ప్రధాన ప్రత్యర్థి అయిన కన్జర్వేటివ్ నేత పొలియెవ్రాకు ట్రంప్ సమర్థకునిగా పేరుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగోసారి తమ గెలుపు లాంఛనమేనని లిబరల్ పార్టీ అంచనా వేసుకుంటోంది. కెనడాలో గత పదేళ్లలో జస్టిస్ ట్రూడో లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. మార్క్ కార్నీ 60 ఏళ్ల కార్నీ వృత్తిరీత్యా బ్యాంకర్. బ్యాంక్ ఆఫ్ కెనడాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు కూడా చీఫ్‌గా పని చేసిన ఘనత ఆయనది. అయితే రాజకీయాలకు మాత్రం పూర్తిగా కొత్త. కనీసం పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన చరిత్ర కూడా లేకున్నా కొద్ది రోజల క్రితమే అనూహ్యంగా ఏకంగా ప్రధాని అయిపోయారు. అలా ప్రధాని హోదాలో ఎన్నికల అరంగేట్రం చేస్తున్న నేతగా అరుదైన రికార్డు నెలకొల్పారు. ట్రూడో గద్దె దిగాక లిబరల్ పార్టీ సారథ్య ఎన్నికల్లో ఏకంగా 85 శాతం మంది కార్నీకే ఓటేయడం విశేషం. ఉత్తర కెనడా నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. ఈ కొద్ది రోజుల్లోనే వరుస నిర్ణయాలతో కార్నీ మంచి దూకుడు కనబరిచారు. ట్రంప్‌పై ఆయన కఠిన వైఖరి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను కార్నీ తూర్పారబట్టారు. కెనడా సార్వబౌమత్వాన్ని గుర్తించినప్పుడే ఆయనతో ఎలాంటి చర్చలైనా జరుపుతానని ప్రకటించారు. కెనడాపై ట్రంప్ సుంకాలకు దీటుగా అమెరికా మీద వెంటనే ప్రతీకార సుంకాలకు తెర తీసి ప్రజల మన్నన చూరగొన్నారు. నానా సమస్యలు ఎదుర్కొంటున్న దేశాన్ని ఈ ఆర్థిక నిపుణుడు గాడిలో పెడతారని వారు నమ్ముతున్నారు. నలుగురు అభ్యర్థుల్లో కార్నీయే మెరుగని ప్రజలు భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతుండటం విశేషం. ఆదివారం నాటి ఆయన ఎన్నికల ప్రచార సభకు విశేషాదరణ లభించింది. ‘‘ట్రంప్ రూపంలో కెనడా తన చరిత్రలోనే అతి పెద్ద ముప్పు ఎదుర్కొంటోంది. దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు నాకు భారీ మెజారిటీ ఇవ్వండి’’ అంటూ కార్నీ ఇచ్చిన పిలుపునకు జనం విపరీతంగా స్పందించారు. పియే పొలియెవ్రా 45 ఏళ్ల పొలియెవ్రా కన్జర్వేటివ్ పార్టీ సారథి. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన యువ నేత. 25 ఏళ్ల వయసులోనే హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కునిగా నిలిచారు. ట్రూడో విధానాలకు తీవ్ర వ్యతిరేకి. దేశ సమస్యలన్నింటికీ అవే కారణమని నిత్యం విమర్శిస్తుంటారు. ధరల పెరుగుదల నుంచి హౌసింగ్ సంక్షోభం దాకా నానా ఇక్కట్లతో సతమతమవుతున్న కెనడావాసులను దూకుడైన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ వచ్చారు. ఏడాదిన్నర క్రితం దాకా అన్ని సర్వేల్లోనూ హాట్ ఫేవరెట్‌గా నిలిచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పొలియెవ్రా ప్రధాని కావడం లాంఛనమేనని అంతా భావించిన పరిస్థితి! కానీ కార్నీ రాకతో పరిస్థితులు మారిపోయాయి. దీనికి తోడు ట్రంప్ సమర్థకుడన్న పేరు కూడా పొలియెవ్రాకు చేటు చేస్తోంది. దాంతో ఆయన కూడా ట్రంప్‌పై విమర్శలకు దిగుతుండటమే గాక ‘కెనడా ఫస్ట్’ నినాదం ఎత్తుకున్నారు. అయితే ఆదివారం నాటి ఆయన ఎన్నికల ప్రసంగానికి అంతంత స్పందనే లభించింది.జగ్మిత్ సింగ్ భారత సంతతికి చెందిన 46 ఏళ్ల జగ్మిత్ వామపక్ష న్యూ డెమొక్రటిక్ పార్టీ సారథి. కెనడాలో ఓ ప్రధాన పార్టీకి సారథ్యం వహిస్తున్న తొలి మైనారిటీ నేతగా రికార్డులకెక్కారు. ఎన్డీపీ 2021 నుంచి ట్రూడో ప్రభుత్వానికి మూడేళ్ల మద్దతిచ్చి దాని మనుగడకు కీలకంగా నిలిచింది. 2024లో మద్దతు ఉపసంహరించుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీపీ పెద్ద ప్రభావం చూపబోదని సర్వేలు పేర్కొన్నాయి. దానికి 9% మంది ఓటర్లు మద్దతిస్తున్నట్టు తేల్చాయి. పార్టీకి అధికారిక గుర్తింపును నిలుపుకోవడమే ఎన్డీపీకి సవాలుగా మారవచ్చంటున్నారు. బ్లాక్ క్యుబెక్ నేషనలిస్ట్ పార్టీ నుంచి ఫ్రానోయిస్ బ్లాంచెట్ బరిలో ఉన్నారు. క్యూఎన్పీ పోటీ ఫ్రెంచి ప్రాబల్య ప్రాంతాలకే పరిమితమైంది. జగ్మిత్, బ్లాంచెట్ పోటీ నామమాత్రమేనని భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్

‘ఉషా వాన్స్ రాక.. మమ్మల్ని రెచ్చగొట్టడమే!’
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ‘గ్రీన్లాండ్ పర్యటన’ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రెండ్రోజులు ఆమె పర్యటించాల్సి ఉండగా.. ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే గ్రీన్లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఉష పర్యటనను బహిష్కరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. విలువైన ఖనిజాలు ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశాన్ని హస్తగతం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలే ఇందుకు కారణం. అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్(Usha Vance) ఈ నెల 27 నుంచి 29వ తేదీదాకా గ్రీన్లాండ్లో పర్యటించాల్సి ఉంది. అవన్నాట కిముస్సర్సులో జరగబోయే డాగ్స్లెడ్ రేసుకు హాజరు కావడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎగేడే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా-గగ్రీన్లాండ్ మధ్య ఒకప్పటిలా మంచి సంబంధాలు లేవని.. అది ఈమధ్యే ముగిసిపోయిందని అన్నారాయన. అలాగే ఉషా వాన్స్ పర్యటన.. ముమ్మాటికీ గ్రీన్‌లాండ్‌ను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని అంటున్నారాయన. అంతేకాదు.. ఆమె వెంట జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్లతో కూడిన బృందాలు వస్తుండడంపైనా ఎగేడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. SLOTUS VISITING GREENLAND 🇬🇱 Hands up If USA should purchase Greenland. pic.twitter.com/fkduBBVOPB— Usha Vance News (@UshaVanceNews) March 23, 2025 గ్రీన్లాండ్(GreenLand).. అతిపెద్ద ద్వీపం. అర్కిటిక్-అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ.. యూరప్ దేశాలతోనే రాజకీయ, సంప్రదాయపరంగా కలిసి ఉంది. అయితే ఇది స్వతంత్ర దేశం కాదు. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ సరిహద్దులో అటానమస్‌గా ఉండిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవడంపై ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఇటు గ్రీన్లాండ్, అటు డెన్మార్క్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. రెండు నెలల కిందట ట్రంప్ పెద్ద కొడుకు గ్రీన్‌లాండ్‌ను సందర్శించారు.మార్చి 11వ తేదీన జరిగిన గ్రీన్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ ఘన విజయం సాధించారు. డెమోక్రట్స్ నేత జెన్స్ ఫ్రెడ్రిక్ నీల్సన్ సైతం ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా.. ఉషా వాన్స్ పర్యటన భద్రత కోసం అమెరికా నుంచి ప్రత్యేక బలగాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. మరోవైపు ఈ పర్యటనను వ్యతిరేకిస్తూనే.. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల దృష్ట్యా గ్రీన్లాండ్కు తమ పోలీసు బలగాలను డెన్మార్క్ పంపించింది.
National

మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్
నోయిడా: మద్యం ప్రియులకు శుభవార్త. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొక బాటిల్ ఉచితం(Buy one bottle, get another bottle free). పైగా ఫుల్ బాటిల్ కొంటే రూ. 200 డిస్కౌంట్. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మద్యంపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం నోయిడాలోని ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు అందిస్తున్నారు.एक बोतल शराब लीजिए, उसके साथ एक फ्री..उत्तर प्रदेश के शराब ठेके वालों को 31 मार्च की रात 12 बजे तक सारा स्टॉक खत्म करना है. वरना बची हुई दारू सरकारी खाते में जमा हो जाएगी और उसकी बिक्री नहीं हो पाएगी. इसलिए ठेके वाले ग्राहकों को खूब ऑफर दे रहे हैं. Video नोएडा का है.#Noida pic.twitter.com/lXZqadqzCd— NDTV India (@ndtvindia) March 25, 2025ఎన్డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్ దొరకగానే ఏదో జాక్‌పాట్ తగిలినట్లు ఆనందించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్ ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ. అయితే మద్యం కాంట్రాక్టర్లు(Liquor contractors) మరో ఐదు రోజుల గడువుకోరి, డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో తగ్గింపు ధరలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు

ఉదయం గర్ల్‌ఫ్రెండ్.. సాయంత్రం మరొకరు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రియురాలి మెడలో ఉదయం తాళికట్టిన అతడు.. పెద్దలు కుదిర్చిన యువతితో సాయంత్రం ఏడడుగులు నడిచాడు. మోసపోయినట్లు తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్ జిల్లా హర్పూర్ బుధాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నాలుగేళ్లుగా ఓ యువతితో సంబంధం నెరుపుతున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఒకసారి గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జన్మించిన బిడ్డను నర్సుకు అప్పగించాడు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటే తన కుటుంబం కూడా ఒప్పుకుంటుందని నమ్మబలికాడు.ఈ క్రమంలో ఒక రోజు ఉదయం రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి, తాళి కట్టాడు. అదే రోజు రాత్రి పెద్దలు కుదిర్చిన విధంగా సంప్రదాయబద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకుంది. అనంతరం, విషయం తెలిసి అక్కడికి వెళ్లిన బాధితురాలిని అతడి కుటుంబీకులు దూషించి, వెళ్లగొట్టారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు.

ద్రవ్యబిల్లుతో భారీ పన్ను ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు, 2025తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యబిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున బదులిస్తూ నిర్మల సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘ నూతన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లుతో పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం లభించనుంది. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో 13.14 శాతం వృద్ధి అంచనాలు రావడం సంతోషకరం. ఇది వ్యక్తిగత ఆదాయాల పెంపును ప్రతిబింబిస్తుంది. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణతో వస్తూత్పత్తి కర్మాగారాలకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాం.దేశీయ సరకులకు విలువ జోడింపు సాధ్యమవుతుంది. ఎగుమతులూ ఊపందుకుంటాయి. వాణిజ్యం పెరుగుతుంది. దీంతో సాధారణ ప్రజలకూ ప్రయోజనం చేకూరుతుంది’’ అని అన్నారు. 2025–26 ఆర్థికసంవత్సర బడ్జెట్లో వార్షిక ఆదాయపన్ను రిబేట్ పరిమితిని (కొత్త పన్ను విధానం) రూ. 7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం తెల్సిందే. ‘‘శాలరీ తరగతులకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను సైతం లెక్కలోకి తీసుకుంటే వాళ్లకు ఏటా రూ.12.75 లక్షల వరకు పన్ను రిబేట్ రూపంలో భారీ ఉపశమనం లభించనుంది.ఆదాయపన్ను రిబేట్‌ను పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లమేర తగ్గనుంది. ఏటా రూ.12 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారూ కొంతమేర ఉపశమనం పొందొచ్చు. ఇక ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న మధ్యతరగతి వాళ్లను సముచితంగా గౌరవించేందుకే ప్రభుత్వం ఐటీ రిబేట్‌ను ఏకంగా ఒకేసారి రూ.12 లక్షలకు పెంచింది’’ అని నిర్మల అన్నారు.రూ.13.6 లక్షల కోట్ల ఆదాయం‘‘2025–26 ఆర్థికంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.13.6 లక్షల కోట్లకు చేరుకునే వీలుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలు రూ.12.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆన్లైన్ ప్రకటనలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న 6 శాతం ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దుచేయాలనుకుంటున్నాం’’ అని నిర్మల చెప్పారు. దీని కారణంగా గూగుల్, మెటా, ‘ఎక్స్’ వంటి సంస్థలు లబ్ధిపొందే వీలుంది. ‘‘ పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే 7 శాతం కస్టమ్స్ సుంకాలను తొలగిస్తాం. 21 రకాల టారిఫ్ రేట్లు ఉండగా వాటిని ఎనిమిదికి తెచ్చాం. అందులో ‘సున్నా’ టారిఫ్ విభాగం కూడా ఉంది. ముడిసరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించిన కారణంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఇకపై భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకోనున్నాయి’’ అని మంత్రి అన్నారు.వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లు‘‘వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చిస్తాం. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఈ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలిస్తోంది. సెలక్ట్ కమిటీ అధ్యయనం తర్వాత తుది నివేదికను పార్లమెంట్ తదుపరి సెషన్ తొలి రోజునే సమర్పించాల్సి ఉంది. అందుకే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చిస్తాం’’ అని నిర్మల అన్నారు. సాధారణంగా జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల సమావేశాలుంటాయి.35 సవరణలతో ఆర్థిక బిల్లుకు లోక్‌సభలో ఆమోదంపన్ను అధికారులు సెర్చ్ కేసుల్లో బ్లాక్ అసెస్మెంట్ కోసం అసెసీ మొత్తం ఆదాయం కాకుండా కేవలం బయటకు వెల్లడించని ఆదాయాన్నే గుర్తించేందుకు వీలుగా ఆర్థిక బిల్లు, 2025లో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణలకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో 2024 సెప్టెంబర్ 1, ఆ తర్వాత కాలానికి ఇది వర్తించనుంది. సెర్చ్ కేసుల్లో మొత్తం ఆదాయం స్థానంలో వెల్లడించని ఆదాయం అన్న క్లాజును ప్రభుత్వం చేర్చింది. దీంతో సహా మొత్తం 35 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.50.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మోదీ సర్కార్ రూపొందించడం తెల్సిందే.

‘జమిలి’ జేపీసీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్ దిగువ సభ, రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గడువును లోక్‌సభ మంగళవారం పొడిగించింది. ఈ కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్‌సభ తన అంగీకారం తెలిపింది. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, జేపీసీ ఛైర్మన్ అయిన పీపీ చౌదరి ప్రతిపాదించిన సంబంధిత తీర్మానానికి లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసింది. వర్షాకాల సమావేశాల చివరివారంలో తొలి రోజు వరకు కాలపరిమితిని పొడిగించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది.అయితే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూప, స్వభావాలను మార్చేలా ఉందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో కేంద్రప్రభుత్వం ఆ బిల్లును పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇందుకోసం కొత్తగా 39 మంది ఎంపీలతో కమిటీని ఏర్పాటుచేయడం తెల్సిందే. లోక్‌సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులతో కమిటీ కొలువుతీరింది. అయితే రాజ్యసభ నుంచి కొత్త వ్యక్తి జేపీలో సభ్యునిగా ఉంటారని లోక్‌సభ ప్రధాన కార్యదర్శి మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జేపీసీలో ఒక ఖాళీ ఏర్పడింది. వాస్తవానికి ఈ కమిటీ కాలపరిమితి ఈ సెషన్ చివరి వారం తొలిరోజుతో ముగుస్తుంది. అంటే ఏప్రిల్ నాలుగోతేదీతో ముగియనుంది. అయినప్పటికీ ఈ బిల్లుకు సంబంధించిన పని ఇంకా పూర్తికాలేదని, అందుకే కాలపరిమితి పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా జేపీసీ కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

నిందితుడిపై అస్పష్టత!
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం కేసులో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మార్గంలోని 12 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెబుతున్న వివరాల్లో స్పష్టత లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యమవుతోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలికి పలువురు పాతనేరస్తుల ఫొటోలు చూపించారు. ఇందులో ఒక పాత నేరస్తుడి ఫొటోతో నిందితుడికి పోలికలు ఉన్నట్టు చెప్పింది. అదుపులో అనుమానితుడు: బాధితురాలు చెప్పిన పోలికలు ఉన్న అనుమానితుడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతనేరస్తుడు అయిన ఏడాది క్రితమే మహేశ్‌ను భార్య వదిలేయడంతో, మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసయ్యాడు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ముందుకు మహేశ్‌ను తీసుకెళ్లారు. నేరుగా అనుమానితుడిని చూశాక, నిందితుడు అతను కాదని ఆమె చెప్పినట్టు సమాచారం. అయినా, మహేశ్‌తోపాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అల్వాల్ స్టేషన్ నుంచి నిందితుడు: అన్ని స్టేషన్లలో పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు...నిందితుడు అల్వా ల్ రైల్వేస్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్టు «నిర్ధారించుకున్నారు. కానీ ఎక్కడ దిగిపోయాడన్న విషయంలో స్ప ష్టత రావడం లేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీతోపాటు పలు విభాగాలకు చెందిన సిటీ పోలీసులు నిందితుడిని గుర్తించడానికి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.మేడ్చల్–గుండ్లపోచంపల్లి వరకు ఉన్న అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన కొనసాగుతోంది. ఎంఎంటీఎస్లలో సీసీ కెమెరాలు లేకపోయినా, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

టెన్త్ తెలుగు పేపర్ లీకేజీలో 13 మంది పాత్ర
నకిరేకల్: పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 13 మంది పాత్ర ఉందని, అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. మంగళవారం డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో ఈ నెల 21న పదోతరగతి తెలుగు పరీ క్ష ప్రారంభమైన అరగంట తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూ డీఈఓకు చేరింది. వెంటనే ఆయన ఎంఈవో నాగయ్యకు ఫోన్ చేయగా, నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిలో 11 మందిని స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఆ రోజు(21న) ప్లాన్ ప్రకా రం ఏ–1 చిట్ల ఆకాశ్, ఏ–3 చిట్ల శివ, ఒక బాలుడు కలిసి గురుకుల పాఠశాల వద్దకు స్కూటీపై వెళ్లారు. గేట్ వద్ద అప్పటికే పోలీసులు ఉండటంతో లోప లకు వెళ్లడానికి వారికి వీలు కాలేదు. దీంతో ఆ ముగ్గురు వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ–11 రాహుల్ ఉన్నాడు. బాలుడు పరీక్ష కేంద్రం ఒకటో అంతస్తులోని రూమ్ నంబరు 8 వద్దకు చేరుకున్నా డు. ఆ గదిలో పరీక్ష రాస్తున్న తనకు పరిచయ మున్న విద్యార్థిని ఉండటంతో ప్రశ్నపత్రం చూపించమని సైగ చేయగా, అతని వెనకాల మరో ఇద్దరు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే రాహుల్‌తో ఉన్న పరిచయం మేరకు ఆ విద్యార్థిని వెంటనే ఆ బాలుడికి ప్రశ్నపత్రం చూపించింది. ఆ బాలుడు తన ఫోన్లో ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని కిందకు దిగాడు. ఆ బాలుడు తీసిన ఆ ఫొటో పేపర్‌ను మిగతా నిందితులు ఒకరి నుంచి ఒకరికి పంపుకున్నారు. ఆ పేపర్లో ఉన్న ప్రశ్నలకు.. ఏ–4 అయిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు గుడుగుంట్ల శంకర్ సమాధానాలు తయారు చేయగా, వాటిని రవిశంకర్ జెరాక్స్ షాప్‌లో జెరాక్స్ తీసుకున్నారు. నిందితులు సమాధాన పత్రాలను వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లగా, అక్కడ పోలీసులను చూసి దొరికి పోతామేమోనని వెళ్లిపోయారు. ఈ కేసుపై పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, పేపర్ లీకేజీ వ్యవహారాన్ని బయటపెట్టారని డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. బంధువుల పిల్లల కోసం... నకిరేకల్‌కు చెందిన చిట్ల ఆకాశ్, చిట్ల శివ, గుడుగుంట్ల శంకర్, బి.రవిశంకర్, బండి శ్రీనుతో పాటు ఓ బాలుడిని ఈ నెల 23న రిమాండ్‌కు పంపామని డీఎస్పీ చెప్పారు. పోగుల శ్రీరాములు, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పల్ల మనోహర్‌ను విచారిస్తున్నామన్నారు. రాహుల్‌తోపాటు మరోబాలుడు పరారీలో ఉన్నారని చెప్పారు. తమ బంధువుల పిల్లలు పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించాలని కొంతమంది ఆకతాయిలు ఇదంతా చేశారన్నారు.కూతురి పరీక్ష.. తల్లిదండ్రులే ఇన్విజిలేటర్లుకోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న కేంద్రంలోనే.. వారి కూతురు పరీక్ష రాయటం వివాదాస్పదంగా మారింది. తాము ఇన్విజిలేషన్ నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో సంతానం పరీక్ష రాయటం లేదని.. ఉపాధ్యాయులు పరీక్షలకు ముందే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.అలాంటి డిక్లరేషన్ ఇచ్చి కూడా.. తమ కూతురు పరీక్ష రాసే కేంద్రంలోనే ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ చేశారు. దీనిపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇది ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో.. ఉపాధ్యాయ దంపతులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం.

మరదలి చేయి పట్టుకున్న బావపై కేసు..!
హైదరాబాద్: మహిళను వేధిస్తున్న ఆమె బావపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ హరీష్ తెలిపిన మేరకు.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ (31) జీహెచ్ఎంసీలో ఉద్యోగం చేస్తోంది. 2020లో ఆమెకు వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భర్త, అత్తా మామలు, బావ సంజీవ్‌కుమార్ (39)కుటుంబంతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళను బావ సంజీవ్‌కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 22వ తేదీన బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా వచ్చి చేయి పట్టుకున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహకారంతో సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు సంజీవ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఖాకీచకుడు.. కాటేయజూస్తున్నాడు
ఒంగోలు టౌన్: భర్త మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతూ తనను పట్టించుకోవడం లేదని న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు నగరం కమ్మపాలేనికి చెందిన జి.హర్ష వర్థిని జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన నవీన్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే అక్కడి కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హర్షవర్థిని తన పిల్లలతో సహా బైఠాయించింది. టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుతోపాటు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా మొండికేయడంతో కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్‌ను కలిసి సమస్య తెలియజేయాలని సీఐ సూచించగా.. అక్కడకు వెళ్లినా పోలీసుల దగ్గరకే పంపిస్తారని, తనకు న్యాయం జరగదని పేర్కొనడం గమనార్హం. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చాలా సేపు బతిమాలడంతో ఎట్టకేలకు ఆమె ఆందోళన విరమించింది.